భారత్‌కు చెందిన రేణు ధరియాల్ Renu Dhariyal ప్రపంచంలోనే అత్యంత పొడవైన జుట్టు ఉన్న మహిళగా కొత్త గిన్నిస్ వరల్డ్ రికార్డు సృష్టించారు. ఉత్తరాఖండ్‌లోని హల్ద్వానీలో ఏప్రిల్ నెలలో ఈ రికార్డును అధికారికంగా ధృవీకరించారు.ఇంతకీ నల్లగా, ఒత్తుగా నిగనిగలతో మెరిసిపోతున్న ఆమె జుట్టు పొడవు ఎంతో తెలుసా? పదండి ఆవివరాలేంటో చూద్దాం.
యూట్యూబర్, కంటెంట్ క్రియేటర్ అయిన రేణు ధరియాల్ నల్లని జుట్టు పొడవు 271.50 సెంటీమీటర్లు అంటే 8 అడుగుల 10 అంగుళాలు. ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన వ్యక్తి రాబర్ట్ వాడ్లో ఎత్తు (272 సెం.మీ) కంటే స్వల్పంగా మాత్రమే తక్కువ. గతంలో ఉక్రెయిన్‌కు చెందిన అలియా నాసిరోవా పేరిట ఉన్న 257.33 సెం.మీ (8 అడుగుల 5.3 అంగుళాలు) రికార్డును రేణు బద్దలు కొట్టారు. రేణు, 2015 నుంచి తన జుట్టును ఒక్కసారి కూడా కత్తిరించకుండా చాలా జాగ్రత్తగా పెంచుతున్నారు.
Renu Dhariyal (India) has the longest hair in the world! 🩷
She has claimed the record for longest hair on a living person (female).
Her stunning raven tresses measure an unbelievable 271.50 cm (8 ft 10 in) long. pic.twitter.com/N8FeWdUGP0— Guinness World Records (@GWR) August 7, 2026
10 ఏళ్ల శ్రమ
భారతీయ సంస్కృతిలో పొడవైన జుట్టును అత్యంత సౌందర్యానికి, సంప్రదాయానికి ప్రతీకగా భావిస్తారని, అదే తనకు ప్రేరణనిచ్చిందని ఆమె తెలిపారు. నేలపై పడకుండి, చిక్కులు పడి ఊడిపోకుండా ఉండటానికి ఆమె పెద్ద జడగా వేసుకుంటారు. ఇంత పొడవైన జుట్టును నిర్వహించడం చాలా ఓర్పుతో కూడుకున్న పని అని, జుట్టును శుభ్రం చేయడానికి చిక్కులు తీయడానికి గంటల సమయం పడుతుందని రేణు వెల్లడించారు.
Indian woman Renu Dhariyal sets #Guinness World Record for having the longest hair, measuring almost 9 feet long….
pic.twitter.com/xlhSN72UYX— Shalini Rao (@ShaliniRaoSays) August 8, 2026
ఇదీ చదవండి : అర్ధరాత్రి దాకా క్యాబ్ డ్రైవింగ్, రూ. 20 లక్షల నష్టం, ఇపుడు రూ. కోట్ల కంపెనీ
రసాయనాలు ఉన్న ప్రొడక్ట్స్ వాడకుండా, ఇంట్లోనే తయారుచేసుకునే సహజసిద్ధమైన నూనెలు, షాంపూలను ఉపయోగిస్తానని, జుట్టును శుభ్రం చేయడానికి, చిక్కులు తీయడానికి ఎంతో సమయం, ఓర్పు అవసరమని ఆమె చెప్పారు. భారతీయ సంస్కృతిలో పొడవైన జుట్టు అందానికి, సంప్రదాయానికి ప్రతీక అని, పట్టుదల, క్రమశిక్షణతో ఏదైనా సాధించవచ్చనే సందేశాన్ని ప్రపంచానికి ఇవ్వడమే తన లక్ష్యమని రేణు ప్రకటించారు.
ఇదీ చదవండి: సీనియర్ అడ్వకేట్ ఇంట్లో భారీ చోరీ : షాకింగ్ ట్విస్ట్ ఏంటంటే?


