గాల్లో దూసుకెళ్లే ఫ్లయింగ్ వెహికల్.. దిమ్మతిరిగే ఆవిష్కరణ! | Uttarakhand Youth Builds HAPIDA SKYNeX: India’s First Electric Flying Vehicle | Sakshi
Sakshi News home page

గాల్లో దూసుకెళ్లే ఫ్లయింగ్ వెహికల్.. దిమ్మతిరిగే ఆవిష్కరణ!

Aug 8 2026 12:05 PM | Updated on Aug 8 2026 12:06 PM

Uttarakhand Youth Develops Indias First Electric Flying Vehicle HAPIDA SKYNeX

అల్మోడా: ఉత్తరాఖండ్‌లోని అల్మోడా జిల్లాకు చెందిన యువ ఆవిష్కర్త రవి తామ్తా భారత్‌లో తొలిసారిగా విద్యుత్‌ సాయంతో నడిచే వ్యక్తిగత ఎగిరే వాహనాన్ని (ఫ్లయింగ్ వెహికల్) విజయవంతంగా రూపొందించారు. కాఫ్లిఖాన్ గ్రామానికి చెందిన రవి తామ్తా తన 'హపిడా స్కై ప్రైవేట్ లిమిటెడ్' స్టార్టప్ ద్వారా అభివృద్ధి చేసిన 'HAPIDA SKYNeX' ప్రోటోటైప్ మొదటి పరీక్షా విమాన ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేసింది. ఏళ్ల తరబడి సాగిన పరిశోధనల ఫలితంగా ఈ టెక్నాలజీ సాకారమైంది.

సందాయ విమానాల మాదిరిగా విమాన ఇంధనం లేదా ఇథనాల్ ఆధారిత ప్రొపల్షన్‌పై ఆధారపడకుండా ఈ ‘స్కైనెక్స్‌’ విద్యుత్ శక్తితో పనిచేస్తుంది. ఎలాంటి కర్బన ఉద్గారాలు విడుదల చేయని పర్యావరణ హితమైన ఈ వాహనం, దేశీయంగా ఆధునిక రవాణా వ్యవస్థల రూపకల్పనలో యువ పారిశ్రామికవేత్తల సత్తాను చాటిచెప్పింది. ఈ ఘనత సాధించిన రవి తామ్తాను ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్ మోహన్ నాయుడు కింజరాపు అభినందించారు.
 

ఉత్తరాఖండ్ భౌగోళిక పరిస్థితుల దృష్ట్యా, ఈ తరహా విమానాలు కొండ ప్రాంతాల్లో రవాణా కష్టాలను తొలగించడంలో కీలక పాత్ర పోషిస్తాయని నిపుణులు భావిస్తున్నారు. భవిష్యత్తులో రోడ్డు మార్గాలు లేని మారుమూల గ్రామాలకు కనెక్టివిటీ పెంచడానికి, కొండచరియలు విరిగిపడినప్పుడు లేదా వరదలు వచ్చినప్పుడు అత్యవసర సహాయక చర్యలకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ ఆవిష్కరణ పర్వత ప్రాంతాల్లో పర్యాటకాన్ని కూడా మరింత ప్రోత్సహించగలదని అంచనా వేస్తున్నారు. వాణిజ్యపరంగా అందుబాటులోకి రావడానికి ముందు దీనికి మరిన్ని పరీక్షలు, నియంత్రణ అనుమతులు అవసరమైనప్పటికీ, ఈ ప్రయోగం దేశంలోని అధునాతన వైమానిక రవాణా రంగానికి ఒక మైలురాయిగా నిలిచింది.

ఇది కూడా చదవండి: బావిలో ఎగసిపడుతున్న అలలు.. వణికిపోతున్న జనం!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement