న్యూఢిల్లీ: ఢిల్లీ ఎన్‌సీఆర్ ప్రాంతాన్ని భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. శుక్రవారం కురిసిన కుండపోత వర్షాలకు రాజధానిలో జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. అనేక ప్రాంతాల్లో రోడ్లు జలమయం కాగా, వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. 2011 తర్వాత ఆగస్టు తొలి వారంలో ఢిల్లీలో అత్యధికంగా వర్షపాతం నమోదు కావడం ఇదే మొదటిసారి. ఈ నెల మొదటి ఏడు రోజుల్లో నగరంలో ఏకంగా 127 సెం.మీ వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. నైరుతి ఉత్తరప్రదేశ్ మీదుగా ఏర్పడిన ఆవర్తనం, పశ్చిమ ద్రోణి ప్రభావం వల్లే ఈ భారీ వర్షాలు కురిశాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) స్పష్టం చేసింది.
#WATCH | Heavy rain batters Delhi; Commuters face challenge as they wade through waterlogged roads in Sainik Farms area pic.twitter.com/6DnGGb3iUo
— ANI (@ANI) August 7, 2026
శనివారం నుంచి వర్షాల తీవ్రత కొంత తగ్గే అవకాశం ఉన్నప్పటికీ, ఆగస్టు 10 వరకు ఈ వాతావరణం కొనసాగుతుందని ఐఎండీ హెచ్చరించింది. ఢిల్లీతో పాటు దేశంలోని మరో 14 రాష్ట్రాల్లోనూ వాతావరణ శాఖ వర్షాల హెచ్చరికలు జారీ చేసింది. హర్యానాలోని గురుగ్రామ్‌లో రెడ్ అలర్ట్ నేపథ్యంలో ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలంటూ సూచించారు. అలాగే హిమాచల్ ప్రదేశ్‌లో ఆరెంజ్ అలర్ట్ ప్రకటించగా, కేరళలోని కాసర్‌కోడ్, కన్నూర్, వాయనాడ్, కోజికోడ్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ అయింది. రాజస్థాన్, ఉత్తరాఖండ్, పంజాబ్, ఒడిశా, కర్ణాటక రాష్ట్రాల్లోనూ రానున్న రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.
ఇది కూడా చదవండి: ఇక మటన్ ముక్కలు కాదు.. ఆకులు!


