సాక్షి, హైదరాబాద్: పగలంతా సాధారణ వాతావరణమే. సాయంత్రానికి పరిస్థితి ఒక్కసారిగా మారిపోతోంది. ఉద్యోగులు, వాహనదారులు ఇళ్లకు తిరుగుపయనమయ్యే ‘పీక్ అవర్’లో వరుణుడు కుంభవృష్టి కురిపిస్తున్నాడు. ఎప్పటి మాదిరిగానే శుక్రవారం సాయంత్రం 5 గంటలకు నగరంలో భారీ వర్షం దంచి కొట్టింది.
రాజేంద్రనగర్‌పై వరుణుడు ఉగ్రరూపం దాల్చాడు. ఆకాశానికి తూట్లు పడినట్లుగా దాదాపు అర్ధగంట పాటు ఏకధాటిగా కుండపోత కురిసింది. లోతట్టు ప్రాంతాలు, రహదారులు చెరువులను తలపించాయి. రహదారులపై మోకాళ్ల లోతు నీరు చేరడంతో రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. గంటల తరబడి ట్రాఫిక్‌లో చిక్కుకున్న వాహనదారులు ఇళ్లకు వెళ్లే క్రమంలో తీవ్ర అవస్థలు ఎదుర్కొన్నారు.


