కలకాలం కలిసి ఉందామనిబాస చేశాడు.తల్లిదండ్రులను కూడా మరిపించి సుమారు 10 నెలల క్రితం ప్రేమించి పెళ్లి చేసు కున్నాడు. కన్న ఊరు వదిలి బెంగళూరులో మకాం పెట్టాడు. అంతలోనే తనను పట్టించుకోవడంలేదనీ, ఎక్కువ సమయం రీల్స్‌చేయడంతోనే గడుపుతోందంటూ అసహనం పెంచుకుని భార్యను మట్టు బెట్టాడు.
పోలీసుల వివరాల ప్రకారం, బిహార్‌కు చెందిన 24 ఏళ్ల ధీరజ్ కుమార్, రీమా కుమారి ప్రేమించాడు. 10 నెలల క్రితం వీరు వివాహం చేసుకున్నారు. రీమా కుటుంబ సభ్యులకు చెప్పకుండా వీరిద్దరూ బెంగళూరు వచ్చి కుంబళగోడు (Kumbalgodu) పట్టణంలో నివాసం ఉంటున్నారు.అయితే భార్య రీమాను గొంతు నులిమి హత్య చేసి స్వగ్రామమైన బిహార్‌కు పారిపోయాడు. చివరకు పోలీసులు ధీరజ్ కుమార్‌ను అరెస్ట్ చేశారు. పోలీసుల విచారణలో నిందితుడు కీలక విషయాలను వెల్లడించాడు.
బెంగళూరు వచ్చాక రీమాకు తనపై ఆసక్తి తగ్గిందని, రోజంతా సోషల్ మీడియాలో 'రీల్స్' (Reels) చేస్తూ గడిపేదని ధీరజ్ పోలీసులకు తెలిపారు. సఅలు తనతో శారీరక సంబంధానికి నిరాకరించడంతో పాటు, కేవలం తన కోసమే వంట చేసుకుని, అతనికి వడ్డించేది కాదని పేర్కొన్నాడు. తిరిగి బీహార్ వెళ్దామని పట్టుబట్టడంతో వీరి మధ్య రోజూ గొడవలు జరిగేవి. ఈక్రమంలో జూలై 25న ధీరజ్ ఇంటికి వచ్చేసరికి అతనికి ఆహారం సిద్ధం చేయలేదు. దీనిపై ఇద్దరి మధ్య తీవ్రస్థాయిలో గొడవ జరిగింది. ధీరజ్ ఆమెను పడుకోమని చెప్పగా, రీమా నిరాకరించి కలప కర్రతో అతనిపై దాడి చేసింది. దీంతో ఆగ్రహానికి గురైన ధీరజ్, ఆమె చున్నీతోనే (Dupatta) ఉరివేసి చంపేశాడు. హత్య అనంతరం ఆమె ముఖానికి ప్లాస్టిక్ కవర్ చుట్టి, మృతదేహాన్ని బెడ్ షీట్‌లో చుట్టేసి, గదికి తాళం వేసి బీహార్‌కు పారిపోయాడు.
ఇదీ చదవండి : ఢిల్లీ అమ్మాయి, జాంబియా సుప్రీంకోర్టు తొలి మహిళా జడ్జ్‌గా ఘనత
ఆమె మృతదేహం కుళ్లి ఆ గది నుంచి తీవ్ర దుర్గంధం రావడంతో, ఇంటి యజమాని పోలీసులకు సమాచారం అందించారు. జూలై 29న పోలీసులు వచ్చి చూడగా కుళ్ళిపోయిన స్థితిలో రీమా మృతదేహం లభ్యమైంది. హత్య, సాక్ష్యాల నాశనం కింద కేసు నమోదు చేసి, విచారణ చేపట్టి నిందితుడిని కుంబళగోడు పోలీసులు బిహార్‌లో అరెస్టు చేశారు. విచారణలో నిందితుడు నేరాన్నిఅంగీకరించాడని, సీసీటీవీ ఫుటేజ్ వైజ్ఞానిక ఆధారాలను కూడా సేకరించామని పోలీసులు తెలిపారు.
ఇదీ చదవండి : అర్ధరాత్రి దాకా క్యాబ్ డ్రైవింగ్, రూ. 20 లక్షల నష్టం, ఇపుడు రూ. కోట్ల కంపెనీ


