వారణాసి వీధుల్లో మోగనున్న శివస్తోత్రం | Varanasi to play Shiv Stotram at 55 crossings every morning in month of Shravan | Sakshi
Sakshi News home page

కాశీ వీధుల్లో మోగనున్న శివస్తోత్రం

Aug 7 2026 2:42 PM | Updated on Aug 7 2026 2:43 PM

Varanasi to play Shiv Stotram at 55 crossings every morning in month of Shravan

వారణాసి: హిందూ ఆధ్యాత్మిక క్షేత్రం కాశీ వీధులు ఇకపై శివస్తోత్రంతో ప్రతిధ్వనించనున్నాయి. శ్రావణ మాసం సందర్భంగా ప్రధానమంత్రి నియోజకవర్గమైన వారణాసిలోని 55 ప్రధాన కూడళ్లలో ప్రతిరోజూ ఉదయం 5.30 – 6.30 మధ్యకాలంలో మైకుల ద్వారా శివస్తోత్రం (Shiv Stotram) వినిపించాలని వారణాసి మున్సిపల్‌ కార్పొరేషన్‌ నిర్ణయించింది. స్థానిక స్మార్ట్‌ సిటీ ఆడిటోరియంలో మేయర్‌ అశోక్‌ కుమార్‌ తివారీ అధ్యక్షతన జరిగిన ఎగ్జిక్యూటివ్‌ కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

శ్రావణ మాసంలో కాశీ విశ్వనాథ ఆలయానికి దేశం నలుమూలల నుంచి లక్షలాది భక్తులు, కన్వర్‌ యాత్ర చేసేవారు వస్తారు. ఈ సమావేశాల్లోనే వర్షాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కూడా కమిటీ సమీక్షించింది. మున్సిపల్‌ యంత్రాంగం హై అలర్ట్‌లో ఉండాలని ఆదేశించింది. కన్వర్‌ యాత్రికుల రాకపోకలు సజావుగా సాగేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని, విశ్రాంతి కేంద్రాలు అభివృద్ధి చేసి, నిర్వహించాలని కమిటీ అధికారులను ఆదేశించింది. 

చ‌ద‌వండి: ఎస్సీ, ఎస్టీలకు క్రీమీలేయర్‌ వర్తించదు 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement