breaking news
Kanwar Yatra
-
‘కన్వర్’ల నిర్వాకం: ఘాట్లలో వేలకొద్దీ మూత్రం బాటిళ్లు, విడిచిన దుస్తులు..
హరిద్వార్: కన్వర్ యాత్ర ముగిసిన తర్వాత హరిద్వార్‌లో భారీ వ్యర్థాల సమస్య తలెత్తింది. ఈ ఏడాది సుమారు 4.8 కోట్ల మంది కన్వర్ యాత్రికులు హరిద్వార్‌ను సందర్శించి, గంగాజలాన్ని సేకరించారు. యాత్ర ముగిసిన అనంతరం, గంగా తీరాలు, మేళా మైదానాల్లో సుమారు 7,000 మెట్రిక్ టన్నుల చెత్త పేరుకుపోయింది.హర్ కీ పౌరీ సహా అనేక ఘాట్ల వద్ద పారిశుధ్య పరిస్థితులు అత్యంత దారుణంగా తయారయ్యాయి. మహిళల కోసం ఏర్పాటు చేసిన డ్రెస్సింగ్ రూముల్లో మూత్రంతో నిండిన సీసాలు, పాత బట్టలు, చెప్పులు, వ్యర్థాల కుప్పలు దర్శనమిచ్చాయి. యాత్రికులు వదిలి వెళ్లిన కన్వర్ పరికరాలు, ఇతర చెత్త వల్ల స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న దృశ్యాలు ఈ అపరిశుభ్రతను కళ్లకు కడుతున్నాయి.ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు మున్సిపల్ కార్పొరేషన్, జిల్లా యంత్రాంగం ఆగస్టు 18 వరకు ప్రత్యేక పారిశుధ్య డ్రైవ్‌ను చేపట్టినట్లు మున్సిపల్ కమిషనర్ నందన్ కుమార్ తెలిపారు. ఈ శుభ్రత పనుల కోసం సుమారు 1,000 మంది ప్రత్యేక పారిశుధ్య కార్మికులను నియమించారు. వ్యర్థాలను తరలించేందుకు 80కి పైగా వాహనాలను సిద్ధం చేశారు.ముందుపెన్నడూ లేని విధంగా, ఈసారి డ్రోన్ కెమెరాల సాయంతో చెత్త పేరుకుపోయిన ప్రాంతాలను గుర్తించి, వెంటనే క్లీనింగ్ సిబ్బందిని పంపే ఏర్పాట్లు చేశారు. అంతేకాకుండా వ్యర్థాలు నిండిన వెంటనే హెచ్చరికలు పంపే ‘సోలార్ సెన్సార్’ డస్ట్బిన్లను ప్రయోగాత్మకంగా అమర్చారు. స్థానిక స్వచ్ఛంద సంస్థలు క్షేత్రస్థాయిలో పారిశుధ్య పనులను పర్యవేక్షిస్తూ, ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. పవిత్రమైన గంగా తీరాలను తిరిగి పరిశుభ్రంగా మార్చేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. -
కన్వర్ యాత్రలో దారుణం, బాటిళ్ల కొద్దీ మూత్రం, 7 వేల టన్నుల చెత్త
పవిత్ర కన్వార్ యాత్ర ముగిసిన తర్వాత ఉత్తరాఖండ్‌లోని పవిత్ర పుణ్యక్షేత్రాల్లో భారీగా చెత్త పేరుకుపోవడంపై తీవ్ర ఆందోళన నెలకొంది. వార్షిక కన్వర్ యాత్ర తర్వాత దేవభూమిగా పిలువబడేహరిద్వార్లో పేరుకుపోయిన చెత్తను, భారీగా పేరుకుపోయిన వ్యర్థాలను తొలగించడం పెద్దగా భారంగా మారింది. అంతేకాదు పవిత్ర గంగోత్రి పర్యావరణానికి ముప్పు అనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ వ్యవహారంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.శ్రావణ మాసంలో సుమారు 5 కోట్ల మంది భక్తులు గంగాజలం కోసం ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌ను సందర్శించారు. యాత్ర ముగిశాక ఘాట్లు, రోడ్లు, పార్కింగ్ స్థలాల్లో విసిరేసిన బట్టలు, ప్లాస్టిక్ సీసాలు, కావడి నిర్మాణాలు టన్నుల కొద్దీ దర్శనమిస్తుండటంతోపాటు, అత్యంత పవిత్రమైన హరి కీ పౌరీ ఘాట్‌తో పాటు మారు దుస్తుల గదులలో యూరిన్ నింపిన ప్లాస్టిక్ సీసాలను వదిలివెళ్లడం కలకల రేపింది. పారిశుధ్య కార్మికులు మాస్కులు, గ్లౌజులు కూడా లేకుండా పారలతో ఆ వ్యర్థాలను ఎత్తివేయాల్సి వచ్చింది.ఇదీ చదవండి: రూ. 50 లక్షలు, 15 ఏళ్ల కష్టం, కెనడాలో మాస్టర్స్ : చివరకు మిగిలింది!7,000 టన్నుల చెత్తహరిద్వార్ మున్సిపల్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం డంపింగ్ యార్డులకు ఇప్పటి వరకు కనీసం 7,000 టన్నుల చెత్తను తొలగించారు. పారిశుధ్య సిబ్బంది రాత్రంతా శ్రమించి ఘాట్లను శుభ్రం చేస్తున్నారు. అలాగే ప్లాస్టిక్ రహిత ప్రాంతంగా ప్రకటించిన గంగోత్రిని కూడా దాదాపు 57,000 మంది భక్తులు సందర్శించి టన్నుల కొద్దీ ప్లాస్టిక్ వ్యర్థాలను వదిలేశారు. ఇది సున్నితమైన హిమాలయ పర్యావరణ వ్యవస్థకు, అటవీ జీవులకు తీవ్ర ముప్పుగా మారింది. అటవీ శాఖ ప్రత్యేక డ్రైవ్ చేపట్టి 57 సంచుల చెత్తను సేకరించింది.Right after the Kanwar Yatra ended, sanitation workers cleaning Har Ki Pauri (Haridwar) found multiple water bottles filled with URINE hidden in the changing rooms. Workers accuse Kanwariyas of leaving this mess behind.How can anyone do this at a holy place? pic.twitter.com/gRKxnk68Ux— Himalayan Hindu (@himalayanhindu) August 12, 2026 > సుదూర ప్రాంతాల నుండి నడుచుకుంటూ గంగాజలం కోసం వచ్చే భక్తులే, అదే గంగానదిని, పరిసరాలను ఈ స్థాయిలో కలుషితం చేయడంపై స్థానికులు తీవ్ర ఆవేదన, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
‘సిలిండర్ల’తో కన్వర్ యాత్ర.. 80 ఏళ్ల వృద్ధుడి సాహసం!
ముజఫ్ఫర్ నగర్: ఆరోగ్యం సహకరించకపోయినా, వైద్యులు ఎంత వారించినా శివునిపై ఉన్న అచంచల భక్తితో ఓ 80 ఏళ్ల వృద్ధుడు సాహసోపేత యాత్ర పూర్తి చేశారు. ఉత్తరాఖండ్‌లోని జ్వాలాపూర్కు చెందిన పశురామ్ శర్మ శ్వాసకోస సంబంధిత అనారోగ్యంతో బాధపడుతున్నారు. అయినా ఆయన ఆక్సిజన్ సిలిండర్ల సహాయంతో ఈ ఏడాది కూడా కన్వర్ యాత్ర చేయాలని నిశ్చయించుకున్నారు.డాక్టర్లు ఇంట్లోనే ఉండాలని సలహా ఇచ్చినా లెక్కచేయకుండా, తన స్కూటీ వెనుక రెండు ఆక్సిజన్ సిలిండర్లు పెట్టుకుని సుమారు 93 కిలోమీటర్ల ప్రయాణం సాగించారు. జ్వాలాపూర్ నుంచి బయలుదేరి, ఉత్తరప్రదేశ్‌లోని ముజఫ్ఫర్ నగర్‌లోని శివ చౌక్ చేరుకున్నారు. మార్గమధ్యంలో శ్వాస ఇబ్బంది తలెత్తినప్పుడల్లా సిలిండర్ సాయంతో ఆక్సిజన్ తీసుకుంటూ ముందుకు సాగారు.ముజఫ్ఫర్ నగర్‌లోని శివ చౌక్‌లో ఆశుతోషుడికి జలాభిషేకం చేసి, తన కన్వర్ యాత్రను విజయవంతంగా ముగించారు. అంతకుముందు ఆయన బాగ్‌పత్‌లోని పురా మహాదేవ్ ఆలయం వరకు వెళ్లాలని భావించారు. అయితే ఆ ప్రాంతం ఎత్తైన ప్రదేశంలో ఉండటం, అక్కడకు ఆక్సిజన్ సిలిండర్లు మోసుకెళ్లడం కష్టమని భావించి తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. ముజఫ్ఫర్ నగర్లోనే శివుణ్ణి దర్శించుకున్నారు. ఇప్పటివరకు ఆయన 13 సార్లు కన్వర్ యాత్ర పూర్తి చేశారు. వయసు, అనారోగ్యం మొదలైనవి తన భక్తికి అడ్డంకి కాలేదని, జీవితంలో ఏ కష్టమొచ్చినా శివుడే తనకు ధైర్యమని పరశురామ్ పేర్కొన్నారు. వృద్ధుడి సంకల్పాన్ని చూసి స్థానికులు, భక్తులు ఆయనను అభినందిస్తున్నారు.ఇది కూడా చదవండి: బొద్దింకల్లో ‘బ్లింకిట్’ స్టాక్.. లైసెన్స్ రద్దు! -
ఒక బైక్‌కు 500 హారన్లు.. ఇదేందయ్యా ఇదీ!
హరిద్వార్: హరిద్వార్‌లో జరుగుతున్న కన్వర్ యాత్రకు సంబంధించి ఓ విచిత్రమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ఫరీదాబాద్‌కు చెందిన ఒక వ్యక్తి తన మోటార్‌సైకిల్‌కు ఏకంగా 500 హారన్లను అమర్చుకుని హరిద్వార్‌కు చేరుకున్నాడు. అయితే నిబంధనలకు విరుద్ధంగా భారీ మార్పులు చేసిన ఈ వినూత్న బైక్ పోలీసుల దృష్టిలో పడటంతో వారు దానిని సీజ్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాలలో వైరల్‌గా మారింది. Kanwar Yatra: Police in Haridwar are strictly seizing modified bikes used by Kanwariyas arriving to collect Ganga water. This year, Haridwar Police are taking strict action against unruly Kanwariyas. pic.twitter.com/uxGrrQHA8R— Insight News India (@InsightNIndia) August 7, 2026కన్వర్ యాత్ర సమయంలో గంగాజలం సేకరించేందుకు లక్షలాది మంది భక్తులు హరిద్వార్‌కు వస్తుంటారు. ఈ క్రమంలో కొందరు తమ వాహనాలను వినూత్న రీతిలో అలంకరించుకుంటారు. అయితే, ఫరీదాబాద్‌కు చెందిన అమన్ అనే వ్యక్తి తన బైక్ చుట్టూ సుమారు 500 హారన్లను బిగించి ప్రయాణించాడు. శంకరాచార్య చౌక్ వద్ద పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీసుల కంట ఈ బైక్ పడింది. వాహనంలో చేసిన ఈ భారీ మార్పులు నిబంధనలకు విరుద్ధంగా ఉండటంతో పోలీసులు వెంటనే స్పందించారు.కన్ఖల్ పోలీస్ స్టేషన్ ఎస్ఎస్ఐ అనుజ్ కుమార్ మాట్లాడుతూ, ఆగస్టు 7న శంకరాచార్య చౌక్ వద్ద ఈ మోటార్‌సైకిల్‌ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నిబంధనలను ఉల్లంఘించినందుకు బైక్‌ను సీజ్ చేసి, చలానా విధించినట్లు ఆయన వెల్లడించారు. ఈ భారీ హారన్ల బైక్‌ను పోలీస్ స్టేషన్‌కు తరలిస్తున్న దృశ్యాలు నెట్టింట విస్తృతంగా ప్రచారం అయ్యాయి. యాత్ర సమయంలో భక్తులు నిబంధనలు పాటించాలని, అల్లర్లు సృష్టించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.ఇది కూడా చదవండి: గర్భస్థ పిండం నోటిలో మరో పిండం.. షాక్‌లో వైద్యులు! -
హరిద్వార్-ఢిల్లీ మార్గంలో కన్వర్ యాత్రికుల కోలాహలం!
హరిద్వార్: ఉత్తరాఖండ్‌లోని పవిత్ర పుణ్యక్షేత్రమైన హరిద్వార్‌లో కన్వర్ యాత్ర సందర్భంగా భక్తిప్రపత్తులు పొంగిపొర్లుతున్నాయి. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, హర్యానా, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్ తదితర రాష్ట్రాల నుంచి లక్షలాది మంది భక్తులు కన్వర్లతో హరిద్వార్‌కు పోటెత్తారు. లక్సర్ రోడ్డు నుంచి పవిత్ర నగరంలోకి యాత్రికుల ప్రవాహం కొనసాగుతోంది.హరిద్వార్ నుంచి లక్సర్ వరకు సుమారు 30 కిలోమీటర్ల మేర రహదారికి ఇరువైపులా కేవలం కన్వర్ వాహనాలే దర్శనమిస్తున్నాయి. గంగా నదికి ఆనుకుని ఉన్న రహదారి వెంబడి ఈ దృశ్యం చూస్తుంటే హరిద్వార్ నుంచి ఢిల్లీ వరకు సమాంతరంగా ఒక భక్తివిశ్వాస ప్రవాహం సాగుతున్నట్లు కనిపిస్తోంది.హర్ కి పౌరీ గంగా ఘాట్లు, మార్కెట్లు భక్తులతో కిక్కిరిసిపోయాయి. భక్తుల రద్దీతో బైరాగీ క్యాంప్ సహా ప్రధాన పార్కింగ్ స్థలాలు నిండిపోతున్నాయి. ట్రాఫిక్, భద్రత, పార్కింగ్ ఏర్పాట్లను పరిశీలించేందుకు జిల్లా మేజిస్ట్రేట్ మయూర్ దీక్షిత్, ఎస్పీ నవనీత్ సింగ్ మేళా ప్రాంతంలో విస్తృతంగా పర్యటిస్తూ అధికారులకు మార్గదర్శకాలు జారీ చేస్తున్నారు.ఇది కూడా చదవండి: చైనాలో ‘డాల్ఫిన్’ బీభత్సం.. 1,300 విమానాలు రద్దు! -
వారణాసి వీధుల్లో మోగనున్న శివస్తోత్రం
వారణాసి: హిందూ ఆధ్యాత్మిక క్షేత్రం కాశీ వీధులు ఇకపై శివస్తోత్రంతో ప్రతిధ్వనించనున్నాయి. శ్రావణ మాసం సందర్భంగా ప్రధానమంత్రి నియోజకవర్గమైన వారణాసిలోని 55 ప్రధాన కూడళ్లలో ప్రతిరోజూ ఉదయం 5.30 – 6.30 మధ్యకాలంలో మైకుల ద్వారా శివస్తోత్రం (Shiv Stotram) వినిపించాలని వారణాసి మున్సిపల్ కార్పొరేషన్ నిర్ణయించింది. స్థానిక స్మార్ట్ సిటీ ఆడిటోరియంలో మేయర్ అశోక్ కుమార్ తివారీ అధ్యక్షతన జరిగిన ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.శ్రావణ మాసంలో కాశీ విశ్వనాథ ఆలయానికి దేశం నలుమూలల నుంచి లక్షలాది భక్తులు, కన్వర్ యాత్ర చేసేవారు వస్తారు. ఈ సమావేశాల్లోనే వర్షాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కూడా కమిటీ సమీక్షించింది. మున్సిపల్ యంత్రాంగం హై అలర్ట్‌లో ఉండాలని ఆదేశించింది. కన్వర్ యాత్రికుల రాకపోకలు సజావుగా సాగేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని, విశ్రాంతి కేంద్రాలు అభివృద్ధి చేసి, నిర్వహించాలని కమిటీ అధికారులను ఆదేశించింది. చదవండి: ఎస్సీ, ఎస్టీలకు క్రీమీలేయర్ వర్తించదు -
బుర్ఖాలో కన్వర్ యాత్ర.. సంభల్‌లో మళ్లీ ఉద్రిక్తత!
ఉత్తరప్రదేశ్‌లోని సంభల్ జిల్లాలో మరో మతానికి చెందిన యువకుడిని పెళ్లి చేసుకున్న ఓ మహిళ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ముస్లిం మతానికి చెందిన తమన్నా మాలిక్ హిందూ యువకుడు అమన్ త్యాగిని ప్రేమించి వివాహం చేసుకున్నారు. గతంలో మహాశివరాత్రి సందర్భంగా ఆమె బుర్ఖా ధరించి కన్వర్ యాత్ర నిర్వహించడం వివాదానికి దారితీసింది. ఇప్పుడు మరోసారి ఆమె కన్వర్‌యాత్ర చేపట్టడంతో శాంతిభద్రతల పరిరక్షణ కోసం యంత్రాంగం అప్రమత్తమైంది.సంభల్‌కు చెందిన తమన్నా మాలిక్, అమన్ త్యాగి సుమారు నాలుగేళ్ల క్రితం తమ మతాల సరిహద్దులను చెరిపివేసి వివాహం చేసుకున్నారు. తమ వివాహం సజావుగా సాగితే శివాలయంలో భర్తతో కలిసి జలాభిషేకం చేస్తానని తమన్నా మొక్కుకున్నారు. ఈ దంపతులకు ఆర్యన్, దక్ష అనే ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు. పెళ్లి తర్వాత కొంతకాలం వేరే ప్రాంతంలో నివసించిన ఈ కుటుంబం, ఏడాది క్రితమే సంభల్‌కు తిరిగి వచ్చింది.గతంలోనూ చెలరేగిన వివాదంగత మహాశివరాత్రి సమయంలో తమన్నా మాలిక్ బుర్ఖా ధరించి హరిద్వార్ నుంచి గంగాజలం తెచ్చి శివునికి జలాభిషేకం చేశారు. ఈ ఘటన ఆ ప్రాంతంలో తీవ్ర దుమారానికి దారితీసింది. పలువురు ముస్లిం నేతలు, మతగురువులు ఆమె చర్యను తీవ్రంగా తప్పుబట్టారు. అయితే, తాను నిత్యం బుర్ఖా ధరిస్తానని, ఇందులో ఎవరికి అభ్యంతరం ఉండాల్సిన అవసరం లేదని తమన్నా అప్పట్లో స్పష్టం చేశారు.రూ.20 వేల పూచీకత్తుతో నోటీసులుఈసారి సావన్ మాసంలో మళ్లీ కన్వర్‌యాత్ర చేపట్టాలని తమన్నా నిర్ణయించుకోవడంతో స్థానిక యంత్రాంగంలో టెన్షన్ మొదలైంది. రెండు వర్గాల మధ్య ఉద్రిక్తతలు తలెత్తకుండా ఉండేందుకు, అస్మోలి పోలీస్ స్టేషన్ నివేదిక ఆధారంగా సంభల్ ఎన్డీఎం వికాస్ చంద్ర కోర్టు ద్వారా చర్యలు చేపట్టారు. తమన్నా మాలిక్, అమన్ త్యాగిలకు శాంతిభద్రతల నోటీసులు జారీ చేసి, రూ.20 వేల చొప్పున పూచీకత్తుతో నోటీసులు జారీ చేశారు.కోర్టుకు వెళ్లని తమన్నా... భర్త అమన్ త్యాగి కౌంటర్భద్రతా కారణాల దృష్ట్యా తమన్నా మాలిక్‌ను కోర్టుకు తీసుకురాలేనని ఆమె భర్త అమన్ త్యాగి తెలిపారు. అయితే, నోటీసులు అందిన వెంటనే తాను కోర్టులో హాజరై బెయిల్ పొందానని ఆయన స్పష్టం చేశారు. రాజ్యాంగం ప్రతి పౌరుడికి నచ్చిన దుస్తులు ధరించే హక్కు కల్పించిందని, కాబట్టి తమన్నా బుర్ఖా వేసుకున్నా లేదా కాషాయ వస్త్రాలు ధరించినా కన్వర్ యాత్ర ఆపేది లేదని ఆయన తేల్చిచెప్పారు.మరో మహిళకు మద్దతుగా యాత్రగజియాబాద్కు చెందిన షబీనా బానో/అనీషా బానో అనే మహిళ కన్వర్ యాత్ర చేపట్టాలని నిర్ణయించుకున్నారని, ఆమెకు మద్దతుగానే తమ తమన్నా కూడా యాత్రకు సిద్ధమయ్యారని అమన్ త్యాగి వివరించారు. ఎవరైనా మహిళల హక్కులను కాలరాసే అధికారం ఎవరికీ లేదని, తాము ఎలాంటి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గేది లేదని తేల్చిచెప్పారు.ఈ వివాదంపై సంభల్ ఎస్డీఎం వికాస్ చంద్ర స్పందిస్తూ, గతంలో శాంతిభద్రతలకు విఘాతం కలగడంతో పోలీసుల నివేదిక మేరకే ఈ చర్యలు చేపట్టామని తెలిపారు. ఏ వ్యక్తి వేషధారణపై కూడా ఎలాంటి నిషేధం లేదని, ఎవరికి నచ్చిన పద్ధతిలో వారు కన్వర్ తీసుకురావచ్చని స్పష్టం చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు యంత్రాంగం ఈ దంపతులపై నిఘా ఉంచింది. -
కన్వర్ యాత్రలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరికి తీవ్ర గాయాలు
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో శ్రావణ మాస కన్వర్ యాత్ర అత్యంత పటిష్ట భద్రతా ఏర్పాట్ల మధ్య కొనసాగుతున్న వేళ, ఆదివారం ఉదయం ప్రమాదం చోటుచేసుకుంది. ఢిల్లీ-డెహ్రాడూన్ ఎక్స్‌ప్రెస్‌వేపై బఢౌత్ కోత్వాలీ పరిధిలోని హిల్వాడీ గ్రామం సమీపంలో కన్వర్ యాత్రికులను ఓ ఫార్చ్యూనర్ కారు వేగంగా వచ్చి ఢీకొంది. ఈ ప్రమాదంలో ఇద్దరు శివ భక్తులు తీవ్రంగా గాయపడ్డారు. నజఫ్‌గఢ్‌కు చెందిన ఏడుగురు సభ్యుల బృందం ఢిల్లీ-డెహ్రాడూన్ హైవే మీదుగా కాలిడకన హరిద్వార్‌కు వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. గాయపడిన వారిని వెంటనే మెరుగైన వైద్యం కోసం మరో ఆస్పత్రికి తరలించారు.యాత్రలో ఇతర ముఖ్యాంశాలు..ఉద్రిక్తత - ఆందోళన మరోవైపు మంగళౌర్ కోత్వాలీ ప్రాంతంలో కారు కన్వర్‌ను ఢీకొన్న ఘటనలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఆగ్రహించిన కొందరు యాత్రికులు కారు డ్రైవర్‌పై దాడి చేసి, వాహనాన్ని ధ్వంసం చేశారు. పోలీసులు వెంటనే రంగప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చి, కేసు నమోదు చేశారు.భద్రత కోసం ఏటీఎస్ రంగప్రవేశం యాత్ర భద్రతను మరింత కట్టుదిట్టం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఏటీఎస్)ను రంగంలోకి దించింది. లక్నోలోని డీజీపీ ప్రధాన కార్యాలయం నుంచి హైటెక్ డ్రోన్ల ద్వారా ప్రతి కదలికను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.ప్రత్యేక నిఘా, ట్రాఫిక్ మళ్లింపులు ఆగస్టు 3న ఉత్తరాదిన మొదటి శ్రావణ సోమవారాన్ని పురస్కరించుకుని దేవాలయాల వద్ద ఏర్పడే భారీ రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆగ్రాలో పోలీసుల గస్తీని ముమ్మరం చేశారు. కాసగంజ్ ప్రాంతంలో ఎస్పీ స్వయంగా రూట్లను పరిశీలించి, భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. యాత్ర మార్గాల్లో నాన్‌వెజ్ దుకాణాలకు నోటీసులు జారీ చేయగా, బండా జిల్లాలో భారీ వాహనాల రాకపోకలపై ట్రాఫిక్ మళ్లింపులు అమలవుతున్నాయి. హరిద్వార్ నుంచి గంగాజలం తీసుకువచ్చే, వెళ్లే భక్తులతో ప్రస్తుతం రోడ్లు కిటకిటలాడుతున్నాయి. పోలీసు యంత్రాంగం ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పకడ్బందీ చర్యలు చేపట్టింది. -
Jharkhand: ఘోర రోడ్డు ప్రమాదం.. 18 మంది దుర్మరణం
దేవఘర్: జార్ఖండ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. భక్తులను తీసుకెళ్తున్న బస్సు.. గ్యాస్ సిలిండర్లతో నిండిన ట్రక్కును ఢీకొనడంతో 18 మంది మృతి చెందారు. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు. దేవఘర్ జిల్లాలో మంగళవారం ఉదయం ఈ ప్రమాదం చోటుచేసుకుంది.మోహన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జమునియా అటవీ ప్రాంతానికి సమీపంలో తెల్లవారుజామున 4:30 గంటల సమయంలో భక్తులతో వెళ్తున్న బస్సు గ్యాస్ సిలిండర్ల లోడుతో ఉన్న వాహనాన్ని ఢీకొన్నదని పోలీసులు తెలిపారు. బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే సోషల్ మీడియా ప్లాట్ఫారం ‘ఎక్స్’లో ఈ ఘటనపై స్పందిస్తూ తన నియోజకవర్గమైన దేవఘర్లో కన్వర్ యాత్ర సందర్భంగా రోడ్డు ప్రమాదం చోటుచేసుకున్నదని, బస్సు - ట్రక్కు ఢీకొన్న ఘటనలో 18 మంది భక్తులు ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. BJP MP Nishikant Dubey (@nishikant_dubey) posts, " लोकसभा के देवघर में श्रावण मास में कांवर यात्रा के दौरान बस और ट्रक के दुर्घटनाग्रस्त होने के कारण 18 श्रद्धालुओं की मौत हो गई है । बाबा बैद्यनाथ जी उनके परिजनों को दुख सहने की शक्ति प्रदान करें" pic.twitter.com/o6axGqRi85— Press Trust of India (@PTI_News) July 29, 2025ఈ ప్రమాదంలో గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నందున, మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉందని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్న ఒక అధికారి తెలిపారు. ఈ ఘటన దరిమిలా జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. గాయపడిన వారిని చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రులకు తరలించింది. -
బాలుడిపై లైంగిక దాడి.. 24 కత్తిపోట్లు
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఘోరం జరిగింది. ప్రత్యర్థి గ్యాంగ్‌కు సమాచారమిచ్చాడనే కక్షతో 14 ఏళ్ల బాలుడిని అత్యంత కిరాతకంగా చంపేశారు. ఈ దారుణంలో పాలుపంచుకున్న 13 మందిలో అత్యధికులు మైనర్లే కావడం గమనార్హం. అంతా కలిసి బాలుడిపై లైంగిక దాడికి పాల్పడి, హింసించి ప్రాణాలు తీశారు. అతడి శరీరంపై మొత్తం 24 కత్తిపోట్లున్నాయి. మర్మాయవాలను తీవ్రంగా గాయపరిచారు. జూన్ 29–30వ తేదీల్లో ఈ ఘటన చోటుచేసుకోగా బాలుడి మృతదేహం జూలై ఒకటో తేదీన ఢిల్లీలో మునాక్ కాలువ ఒడ్డును నగ్నంగా పడి ఉండగా గుర్తించారు. మొత్తం పది మంది ఈ ఘోరానికి పాల్పడినట్లు తేల్చిన పోలీసులు 19 ఏళ్ల కృష్ణ అలియాస్ భోలాను ప్రధాన నిందితుడిగా గుర్తించి, అదుపులోకి తీసుకున్నారు. వీరిలో కావడ్ యాత్రికులుగా వేషం వేసుకున్న ముగ్గురిని యూపీలోని మీరట్‌లో కన్వర్ క్యాంపులో ఉండగా గుర్తించారు. ఈ నెల 18న పోలీసులు సైతం కన్వరియాలుగా వేషం వేసుకుని వెళ్లి వారిని మోనుతోపాటు ఇద్దరు మైనర్లను పట్టుకున్నారు. ప్రధాన నిందితుడైన భోలాపై గతేడాది ప్రత్యర్థి బధ్వార్ సోదరులు మోను, సోనులు దాడి చేశారు. అక్రమ మద్యం విక్రయాలు, చోరీల ఆరోపణలపై పోలీసులు మోకా చట్టం కింద మోను, సోనులను జైలులో పెట్టారు. ఈ సోదరులకు తనను గురించిన సమాచారం అందిస్తున్నట్లు అనుమానం పెంచుకున్న భోలా.. ఆ బాలుడిని చంపేందుకు కుట్ర పన్నాడు. జూన్ 29వ తేదీ రాత్రి బాలుడిని వీర్ చౌక్ వద్ద ఉండగా పట్టుకుని తీవ్రంగా కొట్టారు. అనంతరం బలవంతంగా బైక్‌పై ఎక్కించుకుని మునాక్ కాల్వ వద్దకు తీసుకెళ్లారు. లైంగిక దాడికి పాల్పడటంతోపాటు వెంట తెచ్చుకున్న కత్తితో ఒకరి తర్వాత ఒకరు అతడిని పొడిచి, వదిలేసి పరారయ్యారు. గుర్తు తెలియని మృతదేహం పడి ఉందని సమాచారం అందడంతో పోలీసులు వెళ్లి పరిశీలించారు. ఒంటిపై ఎలాంటి ఆచ్ఛాదన లేదు. మెడకు కేవలం స్కార్ఫ్ మాత్రం కట్టి ఉంది. ఆధారాల ప్రకారం దర్యాప్తు చేపట్టి భోలాను పట్టుకున్నారు. మిగతా వారి కోసం గాలింపు కొనసాగిస్తున్నారు. నిందితుల్లో అత్యధికులు మైనర్లే అయినప్పటికీ అత్యంత తీవ్రమైన నేరమైనందున మేజర్లుగా 16ఏళ్లు దాటిన వారిగా గుర్తించి, తీవ్ర శిక్షలు వేయాలని కోర్టును కోరుతామని డీసీపీ హరేశ్వర్ స్వామి తెలిపారు. నిందితులపై హత్య, సాక్ష్యాధారాల తారుమారుతోపాటు పోక్సో కేసు కూడా నమోదు చేశామన్నారు. -
కన్జ్యూమర్ ఈజ్ కింగ్.. క్యూఆర్ కోడ్ వివాదంపై సుప్రీం
సాక్షి,న్యూఢిల్లీ: కన్వర్ యాత్రికులు వెళ్లే మార్గాల్లోని తినుబండారాల షాపులు, ఇతర దుకాణదారులు తమ పేర్లు బోర్డులపై ప్రదర్శించాలంటూ ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ ప్రభుత్వాలు జారీ చేసిన ఆదేశాల్ని రద్దు చేయాలంటూ జారీ చేసిన పిటిషన్లను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయంపై తాము జోక్యం చేసుకోబోమని స్పష్టం చేసింది. కన్వార్ యాత్ర కొనసాగుతున్న రూట్లలో షాపులు,దుకాణాల వివరాల్ని వెల్లడిస్తూ ప్రదర్శించే క్యూఆర్ కోడ్ వివాదంపై పిటిషనర్లు (అపూర్వానంద్ జా, మహువా మోయిత్రా తదితరులు) సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ విధానం మతపరమైన వివక్ష, అసమానత్వానికి దారి తీస్తోందని పిటిషన్లలో పేర్కొన్నారు. అయితే, ఈ పిటిషన్లపై మంగళవారం సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. జస్టిస్ ఎంఎం సుందరేష్, జస్టిస్ ఎన్కే సింగ్‌లు క్యూఆర్కోడ్లను తొలగించాలనంటూ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టేందుకు తిరస్కరించారు. ఈ సందర్భంగా క్యూర్‌కోడ్ వివాదంపై సుప్రీంకోర్టు ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది.కన్జ్యూమర్ ఈజ్ కింగ్. వినియోగదారుడి ఏహోటల్లో ఏ వంటల్ని తయారు చేస్తున్నారు. గతంలో ఇదే హోటల్లో నాన్ వెజ్‌ను వడ్డించారా? అన్న విషయాలు తెలుసుకునే హక్కు ఉంది. అదే సమయంలో అయితే సదరు హోటల్ యజమానుల, ఉద్యోగుల వ్యక్తిగత వివరాలను బహిరంగంగా ప్రదర్శించాల్సిన అవసరం లేదని కోర్టు స్పష్టం చేసింది. హోటల్ యాజమానులకు రిజిస్ట్రేషన్ తప్పని సరి చేసింది -
కలియుగ సుమతీ..150 కిలోమీటర్లు భర్తను వీపుపై మోసుకెళ్లి..!
త్రేతాయుగంలో సతీ సుమతీ అనే మహా పతివ్రత గురించి వినే ఉంటారు. సుమతీ భర్త కౌశికుడు. కౌశికుడు ఎంత కోపిష్టివాడో.. అతని భార్య సుమతీ అంత శాంతమూర్తి. కౌశికుడు కుష్టురోగంతో బాధపడుతున్నప్పటికీ, సుమతీ అతనిని విడవకుండా సేవ చేస్తుంది. ఒకానొక సందర్భంలో.. ఆమె భర్తను భుజాలపై ఎక్కించుకుని వేశ్య ఇంటికి తీసుకెళ్తుండగా.. మాండవ్య ముని శాపం వల్ల సూర్యోదయానికి ముందే అతని శరీరం వెయ్యి ముక్కలుగా మారుతుందని తెలుసుకుంటుంది. అప్పుడు సుమతీ తన పతివ్రత్య శక్తితో సూర్యోదయాన్ని ఆపివేస్తుంది. తద్వారా భర్త ప్రాణాలు కాపాడుతుంది. చివరికి దేవతలు ఆమెను అభ్యర్థించి, కౌశికుడిని ఆరోగ్యవంతుడిగా చేస్తారు. ఆ సతీ సుమతీది త్రేతాయుగం అయితే మనం చెప్పుకోబోయే ఈ సతీ సుమతిది కలియుగం.ఆమె భర్త దుర్మార్గుడు కాదు. కానీ కుష్ఠురోగంతో బాధపడుతున్న అతనిని చూసి, నేటి సుమతీ చేస్తున్న సేవలు, చూపిస్తున్న నిబద్ధత అంతా ఇంతా కాదు. ప్రస్తుతం భర్తను వీపుమీద మోసుకుంటూ వెళ్తున్న ఫొటోల్ని చూస్తున్న నెటిజన్లు.. ఈ కాలంలో ఇలాంటి భార్యలు ఉన్నారా? అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తుండగా..ఆ మహాసాధ్వి గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారుఘజియాబాద్లోని మోడీనగర్‌లోని బఖర్వా నివాసితులు ఆశా, సచిన్ దంపతులు. శ్రావణ మాసంలో ఉత్తర భారతదేశంలో ఎక్కువగా కన్వర్ యాత్రను చేస్తుంటారు. ఇది శ్రావణ మాసంలో (జూలై-ఆగస్టు) జరుగుతుంది. ఈ సమయాన్ని శివుని ఆరాధనకు అత్యంత విశిష్టమైన కాలంగా భావిస్తారు. శివ భక్తుల తీర్థయాత్రనే కన్వర్ యాత్ర అంటారు. ఈ యాత్రలో భాగంగా భక్తులు హరిద్వార్, గంగోత్రి, రిషికేష్ వంటి ప్రాంతాల నుంచి గంగాజలాన్ని కావడిలో (కన్వర్) నింపుకుని తమ ప్రాంతాల్లోని శివాలయాలకు కాలినడకన తీసుకెళ్తారు. ఈ గంగాజలంతో శివలింగానికి అభిషేకం చేస్తారు. ఇక్కడ కన్వర్ అనేది వెదురు కర్ర, దానికి రెండు వైపులా నీటి కుండలు వేలాడేలా కట్టి భుజాలపై మోస్తారు కాబట్టి దీన్ని కన్వర్ యాత్ర అంటారు. ఇక్కడ ఆశా భర్త సచిన్ గత 13 ఏళ్లుగా కాలినడకనఈ యాత్ర చేస్తున్నాడు. అయితే గతేడాది వెన్నుకి గాయం కావడంతో పక్షవాతానికి గురయ్యాడు. దాంతో ఈ ఏడాది ఆ యాత్ర చేసే అవకాశం లేకుండాపోయింది. అయితే అతడి భార్య..అతడి నియమానికి ఆటంకం కలగకుండా అతడిని వీపుపై మోసుకుంటూ కన్వర్‌యాత్ర చేయ తలపెట్టింది. కూడా ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు. ఆశా ఏకంగా 150 కిలోమీటర్లు భర్తను వీపుపై మోసుకుంటూ కాలినడకన యాత్ర పూర్తిచేసింది. ఆమె అపారమైన భక్తి, భర్తపై ఉన్న అచంచలమైన ప్రేమ చుట్టూ ఉన్న యాత్రికులను కూడా మంత్రముగ్దుల్ని చేశాయి. నిజంగా ఆ మహాతల్లి సాహసం స్ఫూర్తిని కలిగించడమే గాక ఎందరినో కదలిచింది. అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు కూడా స్వర్గంలో ముడివేసిన గొప్ప బంధం అంటే ఈ జంట కాబోలు అంటూ ఆ మహాతల్లి ఆశపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.(చదవండి: 58 ఏళ్ల నాటి తాతగారి బెంజ్‌కారు..! ఇప్పటికీ..) -
కన్వర్ యాత్రకు అవే నిబంధనలు.. మళ్లీ వివాదం తలెత్తేనా?
మీరట్: ఉత్తరాదిన జూలై 11న ప్రారంభమయ్యే వార్షిక కన్వర్ యాత్ర నేపధ్యంలో యూపీలోని మీరట్ జిల్లా యంత్రాంగం పలు నిబంధనలను విధించింది. కన్వర్ యాత్రామార్గంలోని అన్ని ఫుడ్ కోర్టులు తాము విక్రయించబోయే ఆహార పదార్థాల జాబితా, వాటి ధరలతో సహా ఇతర కీలక సమాచారాన్ని బహిరంగంగా ప్రదర్శించాలని మీరట్ జిల్లా యంత్రాంగం ఆదేశించింది. గత ఏడాది ఇటువంటి నిబంధనల నేపధ్యంలోనే ప్రభుత్వానికి వ్యాపారులకు మధ్య వివాదం తలెత్తింది. మీరట్ డివిజనల్ కమిషనర్ హృషికేష్ భాస్కర్ యశోద్ మీడియాతో మాట్లాడుతూ కన్వర్ యాత్రామార్గంలోని అన్ని ఆహారశాలల వెలుపల ఆహార పదార్థాల ధరల జాబితాను ప్రదర్శించేలా జిల్లా యంత్రాంగం చర్యలు చేపడుతోందన్నారు. దీని వలన భక్తుల నుంచి అధిక ఛార్జీలు తీసుకునేందుకు అవకాశం ఉండదు. అలాగే తమకు కావలసిన ఆహారాన్ని ఎంచుకునే అవకాశం ఉంటుందన్నారు. అలాగే ఆహారశాలల యజమానులు తమ పేరు, రిజిస్ట్రేషన్ నంబర్, ఆహార భద్రత రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్లను బహిరంగంగా ప్రదర్శించాలని ఆదేశించారు. ఈ వివరాలతో కూడిన క్యూఆర్ కోడ్‌ను వినియోగదారులకు అందుబాటులో ఉంచాలని హృషికేష్ భాస్కర్ యశోద్ తెలిపారు. ఆహార భద్రతా చట్టం, 2006లోని సెక్షన్ 55 ప్రకారం నిబంధనలకు అనుగుణంగా లేని వ్యాపారాలపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే రెండు లక్షల రూపాయల వరకు జరిమానా విధించే అవకాశం ఉందని తెలిపారు. #WATCH | Meerut, UP | Commissioner Meerut Division, Dr Hrishikesh Bhaskar Yashod says, "The district administration is ensuring that a list of food items and their prices is displayed outside all the food joints along the Kanwar yatra route. The food safety department will ensure… pic.twitter.com/9wrpzdS7rp— ANI (@ANI) July 2, 2025కన్వర్ యాత్రను శివ భక్తులు చేపడుతుంటారు. శ్రావణ మాసంలో గంగా నది నుండి పవిత్ర జలాన్ని తీసుకువచ్చి. శివునికి అభిషేకం చేస్తుంటారు. ఈ యాత్రకు లక్షలాది మంది భక్తులు తరలివస్తుంటారు. కాగా 2024లో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కన్వర్ యాత్ర మార్గంలోని హోటళ్లు, రెస్టారెంట్లు, ఆహార బండ్లు నిర్వహించేవారు తమ పేర్లను ప్రదర్శించాలని ఆదేశించింది. అయితే ఇది వివాదాస్పందంగా మారి, సుప్రీం కోర్టుకు చేరింది. దీంతో సుప్రీంకోర్టు యూపీ ప్రభుత్వ చర్యను నిలిపివేసింది. ఆహారశాలల యజమానులు తాము అందించే ఆహార పదార్థాలను సూచిస్తే సరిపోతుందని, యజమానుల పేర్లు, వారి గుర్తింపులను ప్రదర్శించాలంటూ ఒత్తిడి చేయవద్దని పేర్కొంది.ఇది కూడా చదవండి: అమర్నాథ్ యాత్ర ప్రారంభం.. అంతటా ‘హర్ హర్ మహదేవ్’ నినాదాలు -
కన్వర్ యాత్రకు ఉగ్రవాద ముప్పు.. ఏటీఎస్ బలగాల మోహరింపు
ఉత్తరప్రదేశ్‌లో జరుగుతున్న కన్వర్ యాత్రకు ఉగ్రవాద ముప్పు పొంచివుందంటూ నిఘా వర్గాలకు సమాచారం అందిన నేపధ్యంలో యాత్ర భద్రత కోసం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. దీని పర్యవేక్షణ బాధ్యతను యాంటీ టెర్రరిస్ట్ స్క్యాడ్(ఏటీఎస్)కు అప్పగించారు. ఈ నేపధ్యంలో ఏటీఎస్ బృందం భద్రతా ఏర్పాట్లను పరిశీలించింది.ఉగ్రవాదుల దాడి యత్నానికి సంబంధించిన ఇన్పుట్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలకు అందినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ నేపధ్యంలో యూపీలోని ముజఫ్ఫర్‌నగర్ జిల్లాకు ఏటీఎస్ కమాండోల బృందం తరలివచ్చింది. వీరికి ఎస్ఎస్పీ అభిషేక్ సింగ్ విధులకు సంబంధించిన ఆదేశాలు జారీ చేశారు. ఈ బృందాన్ని శివచౌక్, మీనాక్షి చౌక్, హాస్పిటల్ తిరహా తదితర ముఖ్యమైన ప్రాంతాల్లో మోహరించినట్లు అధికారులు తెలిపారు. దీంతోపాటు యాంటీ శాబోటేజ్ టీం, బీడీడీఎస్ (బాంబ్ డిటెక్షన్ అండ్ డిస్పోజల్ స్క్వాడ్) కూడా జిల్లాలోని పలు ప్రాంతాల్లో నిరంతరం తనిఖీలు చేస్తున్నాయి. -
అందుకే అలాంటి నిర్ణయం.. కన్వర్ యాత్ర ఆదేశాలపై యూపీ ప్రభుత్వ వివరణ
న్యూఢిల్లీ: కావడి యాత్ర మార్గంలో తినుబండారాలు విక్రయించేవారు తమ యజమానుల పేర్లను తప్పనిసరిగా హోటల్స్ నేమ్ ప్లేట్లపై ప్రదర్శించాలన్న ఉత్తర్వులను ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం సమర్థించుకుంది. తీర్థయాత్ర శాంతియుతంగా, క్రమబద్ధంగా సాగేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపింది. ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై స్పందించాలని సుప్రీం కోర్టు కోరగా.. ఈమేరకు కోర్టుకు తాజాగా యూపీ ప్రభుత్వం తమ వివరణను తెలియజేసింది. ‘‘హోటల్స్, తినుబండారాల పేర్ల విషయంలో అనుమానాలు ఉన్నాయని యాత్రికులు ఫిర్యాదు చేశారు. వారి ఆందోళనలను పరిష్కరించేందుకే ఉత్తర్వులు జారీ చేయాల్సి వచ్చింది. అందుకు అనుగుణంగా పోలీసులు చర్యలు తీసుకున్నారు’’ అని వివరించింది. ఇదిలా ఉంటే.. ఉత్తరప్రదేశ్ (యూపీ) శివభక్తుల కన్వర్ యాత్ర నేమ్ ప్లేట్ల వివాదం పిటిషన్లపై ఇవాళ (జులై 26) సుప్రీం కోర్టులో విచారణ జరగనుంది. -
Supreme Court: ఆహార బోర్డులు ప్రదర్శిస్తే చాలు
న్యూఢిల్లీ/భోపాల్: ఉత్తరాదిన వివాదం రేపుతున్న కావడి యాత్ర వివాదానికి తెర దించే దిశగా సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చింది. భక్తులు వెళ్లే మార్గాల్లో దుకాణాలు, హోటళ్ల ముందు యజమానులు, సిబ్బంది పేర్లతో బోర్డులు ప్రదర్శించాలన్న యూపీ, ఉత్తరాఖండ్ ప్రభుత్వల ఆదేశాలపై స్టే విధిస్తూ సోమవారం మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. బదులుగా లభించేది శాకాహారమో, మాంసాహారమో తెలిపే బోర్డులు ప్రదర్శిస్తే సరిపోతుందని స్పష్టంచేసింది. శ్రావణమాసంలో గంగాజలాన్ని కావడిలో సేకరించి భక్తులు తిరిగి తమ సొంతూరిలోని శివాలయాల్లో జలాభిషేకం చేస్తారు. పుణ్యజలాలను తీసుకెళ్లే భక్తులకు శాకాహారం అందించే హోటళ్ల వివరాలు తెలియాలంటూ ఆయా రాష్ట్రాలు ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు విచారించింది. తాను కేరళ హైకోర్టు న్యాయమూర్తిగా ముస్లింలు నడిపే శాకాహార భోజనంలోనే తినేవాడినని జస్టిస్ ఎస్వీఎన్ భట్టి ఈ సందర్భంగా చెప్పారు. యూపీ, ఉత్తరాఖండ్ ప్రభుత్వాల తరఫున ఎవరూ హాజరు కాకపోవడంతో విచారణను శుక్రవారానికి ధర్మాసనం వాయిదా వేసింది. -
కారుపై కన్వర్ యాత్రికుల దాడి
లక్నో: కన్వర్ యాత్రికులు హరిద్వార్-ఢిల్లీ జాతీయ రహదారి మీద ఓ కారుపై దాడి చేశారు. తమ వెంట తీసుకెళుతున్న పవిత్ర గంగాజలాలున్న కావడిని ఢీకొట్టినందుకే కారుపై యాత్రికులు దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు.గంగాజలాలను కారు తాకడం వల్ల అవి అపవిత్రమయ్యాయని యాత్రికులు ఆరోపించినట్లు చెప్పారు. కన్వర్ యాత్రికులు కావడిలో తీసుకెళ్లే గంగా జలాలను పవిత్రంగా భావిస్తారు. ఈ నీటిని తీసుకువెళ్లి వారు శివున్ని పూజిస్తారు. కన్వర్ యాత్ర సోమవారం(జులై 22) ప్రారంభమైంది. ఈ యాత్ర ఆగస్టులో ముగుస్తుంది. మరోవైపు కన్వర్ యాత్ర మార్గంలో తిను బండారాలు అమ్మే హోటళ్ల ఓనర్లు తమ పేర్లు ప్రదర్శించాలని యూపీ, మధ్యప్రదేశ్ ప్రభుత్వాలిచ్చిన ఉత్తర్వులపై సుప్రీంకోర్టు సోమవారం స్టే విధించింది. -
సుప్రీంకోర్టులో యోగి ప్రభుత్వానికి షాక్
-
కన్వర్ యాత్ర నేమ్‌ప్లేట్ వ్యవహారం.. కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు
లక్నో: కన్వర్ యాత్ర మార్గంలో ఉన్న దుకాణాల యజమానులు తమ పేర్లు కనిపించేలా బోర్డులు పెట్టకోవాలని ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయటం రాజకీయంగా దుమారం రేపుతోంది. సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలను ప్రతిపక్షాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. తాజాగా కేంద్ర మంత్రి, ఎన్డీయే మిత్రపక్షం రాష్ట్రీయా లోక్‌దళ్ (ఆర్ఎల్డీ) చీఫ్ నేత జయంత్ చౌదరీ ఈ వ్యవహారంపై స్పందించారు. యూపీ ప్రభుత్వం తీసుకున్న ఆలోచించకుండా తీసుకున్న నిర్ణయంలా అనిపిస్తోందని అన్నారు. బీజేపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఎన్డీయే మిత్రపక్షం నేత, కేంద్రమంత్రి ఇలా వ్యాఖ్యానించటం ఆసక్తికరంగా మారింది.‘‘ కన్వర్ యాత్ర మార్గంలో దుకాణాదుల పేర్లబోర్డులు స్పష్టంగా కనిపించేలా పెట్టుకోవాలని ఆదేశాలు ఇవ్వటం సరికాదు. ఇది పూర్తిగా ఆలోచించి, సహేతుకంగా తీసుకున్న నిర్ణయం కాదు. ఏ నిర్ణయమైనా సమజ శ్రేయస్సు, సామరస్య భావానికి హాని కలిగించదు. కన్వర్ యాత్ర చేపట్టేవారు.. వారికి సేవచేవారు అందరూ ఒక్కటే. ఇటువంటి సాంప్రదాయం ఎప్పటినుంచో కొనసాగుతూ వస్తోంది. కన్వర్ యాత్ర చేపట్టినవారికి సేవ చేసేవారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. సేవ చేసేవారిని మతం,కులం ఆధారంగా ఎవరూ గుర్తించరు. ప్రభుత్వం ఈ ఆదేశాలు వెనక్కి తీసుకోవటం లేదా వాటి అమలుపై తప్పనిసరి చేయటంపై ఇంకా స్పష్టమైన నిర్ణయం తీసుకోవడానికి ఇంకా సమయం ఉంది’’ అని అన్నారు.శనివారం యూపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని బీజేపీ మిత్రపక్షనేత, కేంద్రమంత్రి జితన్ రామ్ మాంఝీ సమర్థించారు. ఇతర పార్టీల అభిప్రాయల గురించి తాను ఎటువంటి వ్యాఖ్యలు చేయలేను. కానీ, యూపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో తప్పు లేదని పేర్కొన్నారు. -
ఉజ్జయిని: షాపులపై ఓనరు పేరు తప్పనిసరి
భోపాల్: కన్వర్ యాత్ర దారిలో ఉన్న షాపుల ఓనర్లు తమ పేరు స్పష్టంగా కనిపించేలా నేమ్ ప్లేట్లు పెట్టుకోవాలని ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ ప్రభుత్వాలు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చాయి. ఇదే దారిలో తాజాగా మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. తాజాగా ఉజ్జయినిలో హోటళ్లు, తోపుడుబండ్లపై విక్రయాలు జరిపేవారు వాటిపై తమ పేర్లను తప్పనిసరిగా ప్రదర్శించాలని ఆదేశించింది. క్యూఆర్‌కోడ్, ఫోన్ నంబర్‌ను కూడా నేమ్‌ప్లేట్‌లో ఉంచాలని పేర్కొంది. ఈ ఆదేశాలు పాటించని వారికి రూ.2,000 నుంచి రూ.5000 వేల వరకు ఫైన్ వేస్తామని, వారి హోటళ్లను తొలగిస్తామని హెచ్చరించింది. యాత్రికుల భద్రత దృష్ట్యా మాత్రమే ఈ నిర్ణయం తీసుకున్నామని ఉజ్జయిని మేయర్ ముఖేష్ తత్వాల్ తెలిపారు. ముస్లింలు తమ లక్ష్యం కాదని క్లారిటీ ఇచ్చారు.నేమ్‌ప్లేట్ల వ్యవహరాన్ని విపక్షాలు మాత్రం దీనిని తీవ్రంగా తప్పుపడుతున్నాయి. కాగా కన్వర్ యాత్ర సోమవారం (జులై 22) నుంచి ప్రారంభం కానుంది. ఈ యాత్రలో భాగంగా శ్రావణ మాసంలో 15 రోజుల పాటు శివ భక్తులు గంగా నదీజలాలను సేకరిస్తుంటారు. -
కన్వర్ యాత్ర మార్గంలో హోటళ్లకు నేమ్‌బోర్డులు ఉండాల్సిందే..
లక్నో: కన్వర్ యాత్ర మార్గంలో అన్ని హోటళ్లు తమ యజమానుల పేర్లను తప్పక ప్రదర్శించాలని ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆదేశించారు.. ప్రతి హోటళ్లు.. అది రెస్టారెంట్ అయినా, రోడ్‌సైడ్ దాబా అయినా, లేదా ఫుడ్ కార్ట్ అయినా యజమాని పేరును ప్రదర్శించాల్సిందేనని పేర్కొన్నారు. యాత్రికుల విశ్వాసాలను గౌరవించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని సీఎంఓ వెల్లడించింది.ఇదిలా ఉండగా ఇటీవల ముజఫర్‌నగర్ పోలీసులు ఇలాంటి ఆదేశాలు ఇచ్చారు. కన్వర్ యాత్ర మార్గాల్లోని హోటళ్లకు యజమానుల పేర్లు, మొబైల్ నెంబర్, క్యూ ఆర్ కోడ్‌ను.. బోర్డుపై ఉంచాలని ఆదేశించారు. అయితే ఈ ఆదేశాలు వివాదస్పదంగా మారాయి. వీటిపై ప్రతిపక్ష ఎస్పీ, కాంగ్రెస్, బీఎస్పీ పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. భారత సంస్కృతిపై ఇదొక దాడి అని కాంగ్రెస్ విరుచుకుపడింది. ఈ ఉత్తర్వు పూర్తి వివక్షపూరితమని ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ విమర్శించారు. యూపీలో ముస్లింలను ద్వితీయ శ్రేణి పౌరులుగా చేయడమే దీని ఉద్దేశమని ఆరోపించారు. సామాజిక నేరంలాంటి ఈ ఉత్తర్వుపై కోర్టులు సుమోటోగా తీసుకొని విచారణ జరపాలని సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ డిమాండ్ చేశారు.అయితే విపక్షాలు తప్పుబడుతున్నప్పటికీ యూపీ ప్రభుత్వం వెనక్కి తగ్గలేదు. కన్వర్ యాత్రకు వెళ్తున్నవారు ఫక్తు శాకాహారం ఎక్కడ లభ్యమవుతుందో తెలుసుకునేందుకే ఈ నిబంధన విధించినట్లు చెబుతోంది. హిందూ పేర్లతో ముస్లింలు మాంసాహారాన్ని యాత్రికులకు విక్రయిస్తున్నారని మంత్రి కపిల్ దేవ్ అగర్వాల్ ఆరోపించారు. వైష్ణో ధాబా భండార్, శాకుంభరీ దేవి భోజనాలయ, శుద్ధ్ భోజనాలయ వంటి పేర్లను రాసి మాంసాహారాన్ని విక్రయిస్తున్నారని పేర్కొన్నారు.కాగా జులై 22 నుంచి కన్వర్ యాత్ర ప్రారంభం కానుంది. ఈ యాత్రలో భాగంగా ఏటా శ్రావణ మాసంలో 15 రోజుల పాటు శివ భక్తులు గంగా నదీజలాలను సేకరిస్తుంటారు. -
హర హర ‘మా’హా దేవా!
హరిద్వార్‌లో ఒక యువ భక్తుడు ఒక భుజాన తల్లిని, మరోభుజాన గంగానది జలం ఉన్న బిందెలను మోసుకువెళుతున్న వీడియో వైరల్ అయింది. కన్వర్ యాత్రలో భాగంగా భక్తులు గంగాజలాన్ని మోసుకు వస్తారు. దేశంలోని జ్యోతిర్లింగాలకు ఈ పవిత్రమైన నీటితో జలాభిషేకం చేస్తారు. పదకొండు సెకండ్ల ఈ వీడియో క్లిప్‌ను చూస్తూ కొందరు పురాణాలలోని శ్రవణకుమారుడిని గుర్తు తెచ్చుకున్నారు. ‘ఈ కాలంలో ఇలాంటి దృశ్యం చూడడం అపురూపంగా ఉంది’ ‘కడుపులో నవ మాసాలు మోసిన తల్లిని భుజాన మోయడం అదృష్టం’... ఇలా రకరకాలుగా స్పందించారు నెటిజనులు. -
కన్నతల్లిని భుజాన మోస్తూ.. శివభక్తుడి సాహసం..
హరిద్వార్: శ్రావణ మాసం ప్రారంభంలో జరిగే కన్వర్ యాత్రలో ఓ శివ భక్తుడు భుజం మీద కావడితో ఒక ఉట్టెలో తన తల్లిని కూర్చోబెట్టి మరో ఉట్టెలో మూడు బిందెల పవిత్ర గంగాజలాన్ని కాలినడకన మోసుకుంటూ హరిద్వార్ నుండి బయలుదేరాడు. కన్వర్ యాత్రలో భాగంగా ప్రతి ఏటా శ్రావణమాసం ఆరంభంలో దేశవ్యాప్తంగా శివభక్తులు హరిద్వార్ నుండి పవిత్ర గంగా జలాన్ని భుజాన మోసుకుంటూ మైళ్లకు మైళ్ళు కాలినడకన తమతో పాటు తమ ఊళ్లలోని శివాలయానికి తీసుకుని వెళ్ళి ఈశ్వరుడికి అభిషేకం చేయడం ఏళ్లుగా వస్తోన్న ఆచారం. ఉత్తరాఖండ్ లోని గోముఖ, గంగోత్రి నుండి బీహార్ లోని సుల్తాన్ గంజ్ నుండి గంగానది నీళ్లను తీసుకెళుతూ ఉంటారు శివభక్తులు. ఈ క్రమంలోనే ఓ శివభక్తుడు తన తల్లి శ్రేయస్సు కోసం ఒక కావడిని భుజాన తగిలించుకుని రెండు ఉట్టెల్లో ఒకదాంట్లో తన కన్నతల్లిని మరో దాంట్లో మూడు బిందెల గంగా జలాన్ని మోసుకుంటూ కన్వర్ యాత్రలో పాల్గొని తల్లిపై తనకున్న ప్రేమను చాటుకున్నాడు. ఈ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్ గా మారింది. Kanwar Yatra 2023: A youth carries his mother on one shoulder and water of the river Ganga on the other shoulder in Haridwar pic.twitter.com/83vuUxVT83 — ANI UP/Uttarakhand (@ANINewsUP) July 4, 2023 ఇది కూడా చదవండి: ఢిల్లీలో కుంగిన రోడ్డు.. మూడు నెలల్లో మూడోసారి -
యోగి సర్కార్ తీరు సరికాదు: ఒవైసీ
లక్నో: ఉత్తర ప్రదేశ్ సర్కార్‌పై ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అసంతృప్తి వెల్లగక్కారు. కన్వర్ యాత్ర సందర్భంగా.. కన్వరియాల మీద పూలు జల్లడం కోసం ప్రభుత్వ నిధుల్ని వెచ్చించడాన్ని, భక్తులకు పోలీసుల కాళ్లు నొక్కి, పూలతో స్వాగతం పలుకుతూ సేవలు చేయడానికి అధికారుల్ని సర్కార్ నియమించడాన్ని ఒవైసీ తప్పుబట్టారు. ఒకవైపు యూపీ ప్రభుత్వం కన్వర్ యాత్ర కోసం పూలు జల్లేందుకు అధికారుల్ని నియమిస్తోంది. ఎక్కడ చూసిన అవే కథనాలు కనిపిస్తున్నాయి. సంతోషం. అదే సమయంలో ముస్లింల ఇళ్లను కూల్చడానికి బుల్డోజర్లను అదే అధికారులతో పంపిస్తోంది. ముస్లింలు తమ మీద పూలు చల్లమని కోరుకోవడం లేదు.. కనీసం బుల్డోజర్లను తమవైపు పంపించొద్దని కోరుకుంటున్నారు. कांवड़ियों के जज़्बात इतने मुतज़लज़ल हैं कि वे किसी मुसलमान पुलिस अहलकार का नाम भी बर्दाश्त नहीं कर सकते। यह भेद-भाव क्यों? यकसानियत नहीं होनी चाहिए? एक से नफ़रत और दूसरों से मोहब्बत क्यों? एक मज़हब के लिए ट्रैफिक डाइवर्ट और दूसरे के लिए बुलडोज़र क्यों? 3/n pic.twitter.com/DPZwC02iNF — Asaduddin Owaisi (@asadowaisi) July 26, 2022 బహిరంగ ప్రాంతాల్లో కొన్ని నిమిషాలపాటు ముస్లింలు నమాజ్ చేస్తే.. నానా రభస చేస్తున్నారు. అదొక రచ్చ అవుతోంది. పోలీస్ కేసులు, బుల్లెట్లు, ఘర్షణలకు కారణం అవుతోంది. ఎన్ఎస్ఏ, యూఏపీఏ, మూకదాడులు-హత్యలు ఇవన్నీ ముస్లింలకేనా? అని ప్రశ్నించారు ఒవైసీ. లూలూ మాల్ వ్యవహారం తర్వాత యూపీలో చాలా చోట్ల బహిరంగ ప్రదేశాల్లో నమాజ్‌లు చేసేవాళ్లను అరెస్ట్ చేస్తున్నట్లు కథనాలు వెలువడుతున్నాయి. ఈ తరుణంలోనే ఎంపీ ఒవైసీ ఇలా అసహనం వ్యక్తం చేశారు. కన్వరియాల మనోభావాలు చాలా బలంగా ఉంటాయి. వారు ముస్లిం పోలీసు అధికారి పేరును కూడా సహించలేరు. ఎందుకు ఈ భేదం? ఒకరిని ద్వేషించి మరొకరిని ఎందుకు ప్రేమించాలి? ఒక మతం కోసం ట్రాఫిక్‌ను మళ్లించి, మరో మతానికి బుల్డోజర్లను ఎందుకు మళ్లించారు అంటూ ట్విటర్లో పోస్టులు చేశారు ఒవైసీ. ఇదీ చదవండి: కేసీఆర్‌ను ఓడించకపోతే నా జీవితానికి సార్థకత లేదు -
కన్వర్ యాత్ర భక్తులకు కలెక్టర్, పోలీసుల సేవలు.. కాళ్లు నొక్కి..
ఈ ఏడాది కన్వర్ యాత్ర ఘనంగా ప్రారంభమైంది. అయితే, శ్రావణ మాసంలో శివ భక్తులు (కన్వరిలు) భక్తి శ్రద్ధలతో గంగా నది ఒడ్డుకు వెళ్లి ప్రవిత గంగా జలాలను తమ ఇళ్లలో, దేవాలయాల్లోకి నీటిని తీసుకుని వెళ్తారు. ఈ క్రమంలో గంగా నది నీటి కోసం ఉత్తరాఖండ్, యూపీ, హరిద్వార్, రిషికేశ్, గౌముఖ్, తదితర ప్రాంతాలకు కాలినడకన బయలుదేరుతారు. ఇదిలా ఉండగా.. కన్వర్ యాత్రికుల కోసం ప్రభుత్వాలు తగు చర్యలు తీసుకుంటున్నాయి. భక్తులు కాలినడకన వస్తుండటంతో తీవ్రంగా అలిసిపోతున్నారు. ఈ క్రమంలో పోలీసులు, ప్రజలు వారికి సాయం అందిస్తున్నారు. తాజాగా యూపీలో కొందరు పోలీసు అధికారులు వారికి తమ వంతు సాయం అందించారు. యూపీలోని అమ్రోహాలో ఎస్ఐ రాజేంద్ర పుందిర్.. కన్వరిల కాళ్లకు పేయిన్ రిలీఫ్ స్ప్రే కొట్టి.. మసాజ్ చేశారు. హపూర్ క్యాంపులో సైతం సీఐ సోమ్‌వీర్ సింగ్.. కన్వరియాల కాళ్లు నొక్కారు. దీంతో కన్వరియాలకు కొంత ఉపశమనం కలిగింది. అంతకు ముందు.. అమ్రోహ కలెక్టర్, ఎస్పీ.. ఓ భక్తురాలి కాళ్లు కడిగారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. Haridwar: Helicopter showers flower petals on thousands of Kanwariyas at Har Ki Pauri I Watch pic.twitter.com/sn0ZiJ6qgA — Hindustan Times (@htTweets) July 24, 2022 ఇక, హరిద్వార్ కన్వర్ యాత్రికులపై ప్రభుత్వం.. హెలికాప్టర్ల సాయంతో పూల వర్షం కురిపించింది. కొన్ని చోట్ల మతాలకు అతీతంగా ముస్లింలు కూడా కన్వరియాలకు పూలు చల్లుతూ స్వాగతం పలికారు. కాగా, జూలై 14న ప్రారంభమైన కన్వర్ యాత్ర.. జూలై 26తో ముగియనుంది. Visuals from Amroha, UP. A sub-inspector Rajendra Pundir seen applying ointment on the leg of Kanwariyas resting in a makeshift camp. pic.twitter.com/YaFkd6lCoQ — Piyush Rai (@Benarasiyaa) July 24, 2022 मुजफ्फरनगर : कमिश्नर और DIG ने कावड़ियों पर की पुष्पवर्षा ◆मौसम की खराबी के चलते पुष्पवर्षा के लिए नहीं आ सका Helicopter pic.twitter.com/TTxRn6M308 — News24 (@news24tvchannel) July 24, 2022 Amroha Collector And SP Washed Feet Of Kanwariyas Returning From Haridwar ANN https://t.co/gsdrMAtFzh — TIMES18 (@TIMES18News) July 24, 2022 -
మీరు రద్దు చేస్తారా? మేము చేయాలా?
న్యూఢిల్లీ : కరోనా మూడో వేవ్ ముప్పు పొంచి ఉందన్న హెచ్చరికల నేపథ్యంలో ఈ నెల 25 నుంచి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తలపెట్టిన కావడ్ యాత్రపై పునరాలోచించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇందుకోసం సోమవారం వరకు గడువు ఇచ్చింది. ప్రజల ఆరోగ్యం, ప్రాణాల కంటే మతపరమైన కార్యక్రమాలు ముఖ్యం కాదని జస్టిస్ ఆర్ఎఫ్ నారిమన్, జస్టిస్ బిఆర్ గవాయ్‌ల ధర్మాసనం స్పష్టం చేసింది. ‘‘మనందరం భారత పౌరులం. ఆర్టికల్ 21 జీవించే హక్కు అందరికీ వర్తిస్తుంది. యూపీ సర్కార్ ఇలాంటి యాత్రలని 100శాతం నిర్వహించకూడదు’’అని వ్యాఖ్యానించింది. ప్రజల ఆరోగ్యం, ప్రాణాల కంటే మనోభావాలు ఎక్కువ కాదని స్పష్టం చేసింది. ‘‘మీకు మరో అవకాశం ఇస్తున్నాం. యాత్రని ఆపేస్తారా, లేదంటే ఆపేయాలనే మేమే ఆదేశాలివ్వాలా?’’అని సూటిగా ప్రశ్నించింది. శ్రావణమాసంలో శివభక్తులు ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్ నుంచి గంగా జలాలను తమ ఊళ్లకి తీసుకువచ్చి శివుడికి అభిషేకం చేసే ఈ కావడ్ యాత్రకు కోట్లాదిగా భక్తులు హాజరవుతారు. కరోనా నేపథ్యంలో ఉత్తరాఖండ్ దీనిని రద్దు చేసినా, యూపీ సర్కార్ ఆంక్షల మధ్య అనుమతులిచ్చింది. దీంతో దీనిని సూమోటోగా స్వీకరించిన సుప్రీంకోర్టు కేంద్రం, యూపీ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. -
ముక్తేశ్వర ఘాట్‌లో మద్యపానం
-
ముక్తేశ్వర ఘాట్‌లో మద్యపానం : వీడియో వైరల్
లక్నో: గంగానది ఒడ్డున దేవాలయ పరిసరాల్లో కొందరు యాత్రికులు అర్థనగ్నంగా మద్యం సేవిస్తున్న వీడియో వైరలవుతోంది. వీరు కన్వర్ యాత్రికులుగా భావిస్తున్నారు. వివరాల్లోకెళితే.. గంగా నది ప్రవహిస్తున్న ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాల్లో నదీముఖంగా ఉన్న శివాలయాలను దర్శించడానికి ఈ రోజుల్లో యాత్రికులు దేశం నలుమూలల నుంచి వస్తారు. దీనినే కన్వర్ యాత్ర అంటారు. ఈ నేపథ్యంలో కొందరు యాత్రికులు యూపీలోని హాపూర్‌లో గల ముక్తేశ్వర్ ఘాట్‌లో మద్యం సేవిస్తున్న వీడియో బయటపడింది. హిందువులు పవిత్రంగా భావించే ఇలాంటి ప్రదేశాల్లో మద్యం సేవించడం నిషిద్ధం. అంతేకాక నేరంగా పరిగణిస్తారు. ఈ విషయంపై హాపూర్ ఎసిపి సర్వేశ్ మిశ్రా ఎఎన్ఐతో మాట్లాడుతూ.. ప్రజలు పవిత్రంగా భావించే ప్రదేశాల్లో ఇలా చేయడం చట్టరీత్యా నేరం. వీడియోలో ఉన్న వ్యక్తులను ఇప్పటికే గుర్తించాం. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. -
కన్వార్ యాత్రలో బంగారం బాబా
-
నడిచొచ్చే బంగారం ఈ బాబా
లక్నో: సుధీర్ మక్కర్ అంటే పెద్దగా తెలియకపోవచ్చు.. కానీ ‘గోల్డెన్ బాబా’ అనగానే టక్కున గుర్తుకు వస్తాడు. గత కొన్నేళ్లుగా కన్వార్ యాత్రలో ఈ గోల్డెన్ బాబా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. ఈ సందర్భంగా న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐ గోల్డెన్ బాబాతో ప్రత్యేకంగా ముచ్చటించింది. ఈ సందర్భంగా బాబా మాట్లాడుతూ.. ‘ఇది నా 26వ కన్వార్ యాత్ర. గత ఏడాదితో 25 కన్వార్ యాత్రలు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా గత ఏడాది మేం సిల్వర్ జూబ్లీ వేడుకలు కూడా జరుపుకున్నాం. ఈ ఏడాది జూలై 21న కన్వార్ యాత్ర ఢిల్లీ నుంచి ప్రారంభించాం. అయితే తొలుత ఈ ఏడాది కన్వార్ యాత్రకు దూరంగా ఉందామనుకున్నాను. కానీ నా అనుచరులు, అభిమానులు ఒత్తిడి చేయడంతో సరేనని ఒప్పుకున్నాను. పరమ శివుని అనుగ్రహంతో ఈ ఏడాది కూడా విజయవంతంగా కన్వార్ యాత్ర పూర్తి చేసుకున్నాను’ అని తెలిపారు. ‘ఇక నా ఒంటి మీద ఉన్న బంగారం నాకు ప్రత్యేక గుర్తింపు ఇస్తుందనడంలో సందేహం లేదు. బంగారం ధరించడం అంటే నాకు చాలా ఇష్టం. తొలుత 2-3గ్రాముల బంగారం ధరించేవాడిని. రాను రాను దాని బరువు పెంచుతూ పోయాను. ఈ ఏడాది 16కిలోల బంగారం ధరించి వచ్చాను. గతేడాదితో పోలిస్తే.. ఈ సారి 4కిలోల బంగారం తక్కువ ధరించాను. అయితే ఈ బంగారం అంతా నేను సొంతంగా సంపాదించుకున్నదే. ఎవరి దగ్గరి నుంచి విరాళాలు, డబ్బు స్వీకరించి కొన్న బంగారం కాదు’ అన్నారు. ఈ బాబా ధరించే ఆభరణాల్లో గొలుసులు, దేవతల లాకెట్లు, ఉంగరాలు, బ్రాస్లెట్లు ఉంటాయి. ప్రతి ఏడాది 250-300మంది అనుచరులతో బాబా కన్వార్ యాత్రలో పాల్గొంటారు. వారందరికి అవసరమైన ఆహారం, నీరు, అత్యవసర మందులతో పాటు సొంత అంబులెన్స్‌ను కూడా ఆయనే సమకూర్చుకుంటారు. -
అంతటి కోపం కన్వారీలకు ఎందుకు?
సాక్షి, న్యూఢిల్లీ : స్వరం మారుతోంది. వారి తీరు మారుతోంది. ఒకప్పుడు సాధుశీలురైన కన్వారీలు (శివభక్తులు) ఆధ్యాత్మిక చింతనతో ముఖాలపై చిద్విలాసం చెదరకుండా, పరిసరాలను అంతగా పట్టించుకోకుండా తమ మానాన తాము వెళ్లేవారు. ఇప్పుడు వారిలో ఎంతో మార్పు కనిపిస్తోంది. ఆధ్యాత్మిక చింతనేమోగానీ ముఖాన చిటపటలు కనిపిస్తున్నాయి. వారిలో అసహనం పెరిగిపోతోంది. తమ బాటకు అడ్డొచ్చిన వారిపై చేయి చేసుకుంటున్నారు, చితక బాదుతున్నారు. బుధవారం పశ్చిమ ఢిల్లీలోని మోతీనగర్‌లో కారు నడుపుతున్న ఓ మహిళను అడ్డగించి ఆమె భర్తపై చేయి చేసుకున్నారు. కారును ధ్వంసం చేశారు. ఓ సైక్లిస్టును చితక బాదారు. ఆ మరునాడు ఉత్తరప్రదేశ్‌లోని బులంద్ షహర్లో ఓ అత్యవసర పోలీసు వాహనాన్నే ధ్వంసం చేశారు. పోలీసులను తరిమికొట్టారు. దీనికంతటికి కారణం తాము ఓ యాత్రగా వెళుతున్నప్పుడు తమను గౌరవించి సాదరంగా దారివ్వలేదనే కోపం, ఆక్రోశం కావచ్చు. ఢిల్లీలో తాము రోడ్డు దాటుతుంటే కారును వేగంగా నడిపిందన్న కారణంగా, తమ యాత్రికుల మధ్యకు సైక్లిస్టు వచ్చారన్న కారణంగా, ఉత్తరప్రదేశ్‌లో తమను అతిక్రమించి ముందుకు దూసుకెళుతుందన్న కారణంగా కన్వారీలు ఈ దాడులకు దిగారు. కొన్ని చోట్ల వారు మామూలు కర్రలతో కనిపించగా, కొన్ని చోట్ల క్రికెట్ బ్యాట్లతోని, సుత్తెలతోని దౌర్జన్యానికి దిగుతూ వీడియోల్లో కనిపించారు. యూపీలో పోలీసు వ్యాన్‌పై దాడి చేయడానికి ముందు ఆ రాష్ట్ర అడిషనల్ డీజీపీ ప్రశాంత్ కుమార్ ప్రత్యేక హెలికాప్టర్ మీది నుంచి కన్వారీలపై సాదర స్వాగతంలా పూరెమ్మలు కురిపించారు. అలా చేసినా, పోలీసుల వ్యాన్‌పైనే కన్వారీలు ఎందుకు దాడి చేశారని ప్రశ్నించగా, రెండు గ్రూపుల మధ్య గొడవ జరిగితే సర్ది చెప్పడానికి వెళ్లినప్పుడు దాడి జరిగిందంటూ సమర్థించుకునేందుకు ప్రయత్నించారు. నేడు హిందువులకు ప్రమాదం పొంచి ఉందంటూ అసందర్భంగా మాట్లాడారు. గత నాలుగు సంవత్సరాల నుంచే కన్వారీలు ఇలా దౌర్జన్యానికి దిగుతున్నారని మీడియా వార్తలు తెలియజేస్తున్నాయి. నిందితులపై కేసులు దాఖలైన దాఖలాలు లేవు. ఢిల్లీలో మాత్రం బుధవారం కేసు నమోదు చేసి ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత అతన్ని విడుదల చేసినట్లు తెల్సింది. ఇంతకు కన్వారీలు ఎవరు? కావడి కుండలను మోయడం వల్ల వారికి ఆ పేరు వచ్చింది. శివభక్తులైన వీరు ప్రతి శ్రావణ మాసంలో (తెలుగు క్యాలెండర్ ప్రకారం ఐదవ నెల, ఇంగ్లీషు క్యాలెండర్ ప్రకారం జూలై–ఆగస్టు) ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్, గోముఖ్, గంగోత్రి పుణ్యక్షేత్రాలను, బీహార్‌లోని సుల్తాన్ గంజ్‌ని సందర్శించి అక్కడ గంగా జలాలను తీసుకొని తమ ఊర్లకు వచ్చి ఊరిలోని శివలింగానికి అభిషేకం చేస్తారు. గంగా జలాల కోసం వారు ఇంటి నుంచి ఇరువైపుల కుండలు కలిగిన కావడిని తీసుకొని చెప్పులు లేకుండా నగ్న పాదాలతో వెళతారు. 1980లో ఈ యాత్ర పూర్తిగా సాధువులు, సన్యాసులకే పరిమితం అయింది. వారు నిష్టంగా తమ ఊరి నుంచి గంగా జలం వరకు, అక్కడి నుంచి మళ్లీ ఊరి వరకు కాలి నడకన కావడి కుండలను మోసుకొచ్చేవారు. ద్విచక్ర వాహనాలపై జాతీయ జెండాలతో కన్వారీలు కాలక్రమంలో కాషాయ వస్త్రాలు ధరించిన యువకులు కూడా ఈ యాత్రలో పాల్గొనడం మొదలయింది. వారిలో కొందరు సాధారణ దుస్తులు వేసుకొని కూడా యాత్రలో పాల్గొంటున్నారు. మరి కొందరు వాహనాలపై కూడా వెళుతున్నారు, వస్తున్నారు. ఈ నాలుగేళ్ల కాలంలో యాత్రలో యువకులు పాల్గొనడం ఎక్కువైంది. ఇప్పుడు ఇంకొందరు తమ వాహనాలకు జాతీయ జెండాలను కట్టుకొని ‘భారత మాతా జిందాబాద్’ అని నినాదాలిస్తూ వెళుతున్నారు. 1980లో ఏటా దాదాపు ఓ లక్ష మంది సాధువులు ఈ యాత్రలో పొల్గొంటే గతేడాది 14 లక్షల మంది యాత్రలో పాల్గొన్నారని అధికారిక లెక్కలే తెలియజేస్తున్నాయి. వారిలో ఎక్కువగా యువకులే ఉన్నారు. వారి కోపానికి కారణాలేమిటీ? యాత్రలో యువకులు పాల్గొనడం, వారిలో సహజ సిద్ధంగానే కోపోద్రేకాలు ఎక్కువ ఉండడం ఓ కారణమైతే, పెళ్లాం, పిల్లలను వదిలేసి రావడం, మహిళా భక్తులకు ప్రమేయం లేని యాత్ర అవడం వల్ల కూడా వారిలో ఒకలాంటి విసుగు ఎక్కువ అవుతుందని మానసిక విశ్లేషకులు చెబుతున్నారు. తాము ఇంతటి భక్తులమైనప్పటికీ తమను గౌరవించి దారి ఇవ్వాల్సిన ప్రజలు పట్టించుకోవడం లేదన్న అహంభావం కూడా కారణమేనని పేరు బహిర్గతం చేయడానికి ఇష్టపడని ఢిల్లీ యూనివర్శిటీ ప్రొఫెసర్ ఒకరు వ్యాఖ్యానించారు. నిజమైన భక్తి లేకుండా భక్తిని ప్రదర్శించుకోవడానికి మాత్రమే కొంత మంది యువకులు యాత్రలో పాల్గొంటుండం వల్ల, ఆరెస్సెస్ శక్తులు ప్రవేశించడం వల్లనే దౌర్జన్య సంఘటనలు చోటు చేసుకుంటున్నాయని మార్క్సిస్టు విశ్లేషకులు చెబుతున్నారు. ఢిల్లీ, ఉత్తరాఖండ్, హర్యానా, రాజస్థాన్, పంజాబ్, బీహార్, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల నుంచి మాత్రమే కన్వారీలు ఈ యాత్రలు నిర్వహిస్తున్నారు.


