కన్నతల్లిని భుజాన మోస్తూ.. శివభక్తుడి సాహసం..   | Man Carries Mother And Ganga Water In Kanwar Yatra | Sakshi
Sakshi News home page

ఓ భుజం మీద కన్నతల్లి.. మరో భుజం మీద పవిత్ర గంగ.. 

Jul 5 2023 4:22 PM | Updated on Jul 5 2023 4:26 PM

Man Carries Mother And Ganga Water In Kanwar Yatra  - Sakshi

హరిద్వార్: శ్రావణ మాసం ప్రారంభంలో జరిగే కన్వర్ యాత్రలో ఓ శివ భక్తుడు భుజం మీద కావడితో ఒక ఉట్టెలో తన తల్లిని కూర్చోబెట్టి మరో ఉట్టెలో మూడు బిందెల పవిత్ర గంగాజలాన్ని కాలినడకన మోసుకుంటూ హరిద్వార్ నుండి బయలుదేరాడు.    

కన్వర్ యాత్రలో భాగంగా ప్రతి ఏటా శ్రావణమాసం ఆరంభంలో దేశవ్యాప్తంగా శివభక్తులు హరిద్వార్ నుండి పవిత్ర గంగా జలాన్ని భుజాన మోసుకుంటూ మైళ్లకు మైళ్ళు కాలినడకన తమతో పాటు తమ ఊళ్లలోని శివాలయానికి తీసుకుని వెళ్ళి ఈశ్వరుడికి అభిషేకం చేయడం ఏళ్లుగా వస్తోన్న ఆచారం. ఉత్తరాఖండ్ లోని గోముఖ, గంగోత్రి నుండి బీహార్ లోని సుల్తాన్ గంజ్ నుండి గంగానది నీళ్లను తీసుకెళుతూ ఉంటారు శివభక్తులు.   

ఈ క్రమంలోనే ఓ శివభక్తుడు తన తల్లి శ్రేయస్సు కోసం ఒక కావడిని భుజాన తగిలించుకుని రెండు ఉట్టెల్లో ఒకదాంట్లో తన కన్నతల్లిని మరో దాంట్లో మూడు బిందెల గంగా జలాన్ని మోసుకుంటూ కన్వర్ యాత్రలో పాల్గొని తల్లిపై తనకున్న ప్రేమను చాటుకున్నాడు. ఈ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్ గా మారింది. 

ఇది కూడా చదవండి: ఢిల్లీలో కుంగిన రోడ్డు.. మూడు నెలల్లో మూడోసారి 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement