తాడేపల్లి: ‘అభిమాని కాలర్ ఎగరేసేలా పార్టీ ఉంటుందని’ వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి అన్నారు. గురువారం (మార్చి 12) వైఎస్సార్‌సీపీ ఆవిర్భవించి 15 ఏళ్లు పూర్తి చేసుకుని 16వ వసంతంలోకి అడుగు పెట్టింది. ఈ సందర్భంగా తాడేపల్లి పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.
ఈ వేడుకల్లో వైఎస్ జగన్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.


