న్యూఢిల్లీ: 2026 మిస్ యూనివర్స్ కిరీటాన్ని ప్యూర్టోరికోకు చెందిన జెన్నిఫర్ బారెటో సొంతం చేసుకున్నారు. ఈ పోటీల్లో ప్రపంచవ్యాప్తంగా 130కిపైగా దేశాలకు చెందిన అందాల భామలు పాల్గొన్నారు. చివరి రౌండ్‌లో డొమినికన్ రిపబ్లిక్‌కు చెందిన మెలిస్సా నూనెజ్ తొలి రన్నరప్‌గా, వెనిజులాకు చెందిన క్లారా వేగాస్ గోయెట్జ్ రెండో రన్నరప్‌గా నిలిచారు. గత ఏడాది విజేత మెక్సికోకు చెందిన ఫాతిమా బోష్ తాజాగా జెన్నిఫర్‌కు కిరీటాన్ని అలంకరించారు.


