బీజింగ్: అంతరిక్ష పరిశోధనల్లో చైనా మరో చరిత్రాత్మక ముందడుగు వేసింది. తొలిసారిగా ఓ విదేశీ వ్యోమగామికి తన మానవసహిత అంతరిక్ష కార్యక్రమంలో అవకాశం కల్పించింది. పాకిస్థాన్‌కు చెందిన మహమ్మద్ జీషన్ అలీతో పాటు ముగ్గురు వ్యోమగాములను తీసుకుని షెన్‌జౌ-24 అంతరిక్ష నౌకను బుధవారం విజయవంతంగా ప్రయోగించింది. వాయవ్య చైనాలోని జియుక్వాన్ ప్రయోగ కేంద్రం నుంచి లాంగ్ మార్చ్-2ఎఫ్ రాకెట్ ద్వారా ఈ ప్రయోగం చేపట్టారు.
ఈ మిషన్‌లో టాంగ్ హోంగ్బో కమాండర్‌గా, వూ యీ ఫ్లైట్ ఇంజినీర్‌గా వ్యవహరిస్తున్నారు. పాకిస్థాన్‌కు చెందిన జీషన్ అలీ చైనా అంతరిక్ష కార్యక్రమంలో పాల్గొంటున్న తొలి విదేశీ వ్యోమగామిగా గుర్తింపు పొందనున్నారు. సుమారు మూడు గంటల్లో టియాంగాంగ్ అంతరిక్ష కేంద్రంతో నౌక అనుసంధానం కానుంది. అలీ అక్కడ దాదాపు వారం రోజులపాటు ఉండి అనంతరం షెన్‌జౌ-23 నౌకలో భూమికి తిరిగి వస్తారు. సాధారణంగా చైనా వ్యోమగాములు ఈ కేంద్రంలో ఆరు నెలలపాటు ఉంటారు.
2022లో కార్యకలాపాలు ప్రారంభించిన టియాంగాంగ్ ప్రస్తుతం చైనా నిర్వహిస్తున్న సొంత అంతరిక్ష కేంద్రం. ఈ మిషన్‌లో భాగంగా 90కి పైగా శాస్త్రీయ ప్రయోగాలు, సాంకేతిక పరీక్షలు నిర్వహించనున్నారు. అంతరిక్ష జీవశాస్త్రం, వైద్యం, భౌతికశాస్త్రం, పదార్థ విజ్ఞానం తదితర రంగాల్లో పరిశోధనలు చేపట్టనున్నారు. సిబ్బంది మార్పిడి, కేంద్ర నిర్వహణ కూడా ఈ ప్రయోగంలో భాగంగా ఉన్నాయి.
ఇదీ చదవండి: దలైలామాకు ప్రత్యేక బంగ్లా.. కేంద్రం కీలక నిర్ణయం!


