పాక్ సిరీస్‌పై మన దేశంలో గుస్స | Indian Ban Letter Pak OTT Series Netflix | Sakshi
Sakshi News home page

Pak OTT Series: పాక్ సిరీస్ స్ట్రీమింగ్.. ప్రధాని మోదీకి లేఖ

Nov 25 2026 5:24 AM | Updated on Nov 25 2026 5:26 AM

Indian Ban Letter Pak OTT Series Netflix

ఓటీటీలో ఇ‍ప్పుడు అన్ని దేశాలకు సంబంధించిన కంటెంట్ స్ట్రీమింగ్ అవుతోంది. అయితే నెట్‌ఫ్లిక్స్‌లోకి వచ్చే నెల 04 నుంచి తొలిసారిగా ఓ పాకిస్థానీ సిరీస్ అందుబాటులోకి రానుంది. అయితే దీనిని మన దేశంలో స్ట్రీమింగ్ కాకుండా నిషేధించాలని ఆల్ ఇండియన్ సినీ వర్కర్స్ అసోసియేషన్, ప్రధాని మోదీకి లేఖ రాసింది. ఫవాద్‌ ఖాన్‌, మహిరా ఖాన్‌, హనియా ఆమిర్‌, సమన్‌ అన్సారీ ఈ వెబ్‌సిరీస్‌లో కీలక పాత్రలు చేశారు.

(ఇదీ చదవండి: ఆవేశపడిపోయిన తరుణ్ భాస్కర్.. ఎందుకింత కోపం? ఎవరిపైన?)

పుల్వామా దాడి తర్వాత పాకిస్థాన్‌ నటీనటులు, కంటెంట్‌కు సంబంధించి భారత ప్రభుత్వం ఆంక్షలు విధించింది. ఈ మేరకు గతేడాది సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ ప్రకటన విడుదల చేసింది. పాకిస్థాన్‌కు సంబంధించిన కంటెంట్‌ భారత్‌లో స్ట్రీమింగ్‌ కాకుండా నిలిపివేయాలని అన్ని ఓటీటీ వేదికలను ఆదేశించింది. ఇప్పుడు ఈ సిరీస్‌ను స్ట్రీమింగ్‌కు తీసుకొస్తున్నట్లు ప్రకటన రావడంతో ఏఐసీడబ్ల్యూఏ స్పందించింది.

ఇది భారత దేశ స్ఫూర్తి, జాతీయ సమగ్రతకు విఘాతం కలిగించినట్లేనని  అభిప్రాయపడింది. అన్ని ఓటీటీ వేదికలు మే 8, 2025న సమాచార, ప్రసారశాఖ చేసిన ప్రకటనకు కట్టుబడి ఉండేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేసింది. ఇలాంటివి మరోసారి పునారవృతం కాకుండా శాశ్వతమైన నిబంధనలను తీసుకురావాలని కోరింది.

(ఇదీ చదవండి: నన్ను కూడా విజయ్‌లా సీఎం చేస్తారా?)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement