హర్షిత్ రాణా సహా భారత ప్లేయర్లపై పాక్‌ ఆటగాళ్ల ఫిర్యాదు..! | Pakistan Lodges Complaint vs Harshit Rana And Other India A Stars says Report | Sakshi
Sakshi News home page

హర్షిత్ రాణా సహా భారత ప్లేయర్లపై పాక్‌ ఆటగాళ్ల ఫిర్యాదు..!

Nov 24 2026 2:26 PM | Updated on Nov 24 2026 2:26 PM

Pakistan Lodges Complaint vs Harshit Rana And Other India A Stars says Report

source: X

ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ టోర్నీలో భాగంగా నవంబర్ 22న జరిగిన భారత్-పాకిస్తాన్-ఎ జట్ల మ్యాచ్‌ వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. ఆ మ్యాచ్‌లో భారత ఆటగాళ్ల ప్రవర్తనపై పాక్‌ ఆటగాళ్లు రిఫరీకి ఫిర్యాదు చేసినట్లు ఓ కథనం వెలువడింది.

పాక్‌ ప్లేయర్లు ప్రధానంగా హర్షిత్‌ రాణా పేరును తమ ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలుస్తోంది. దీనిపై రిఫరీ ఏం చర్యలు తీసుకుంటాడో తెలియాల్సి ఉంది.

కాగా, భారత్‌-పాక్‌ మ్యాచ్‌లో ఇరు జట్ల ఆటగాళ్ల మధ్య పలుమార్లు వాగ్వాదం చోటుచేసుకుంది. తొలుత హర్షిత్ రాణా పాక్‌ ఓపెనర్లు షమైల్ హుస్సేన్, మాజ్ సదాఖత్‌లతో వాగ్వాదానికి దిగాడు. రోహైల్ నజీర్, హసన్ నవాజ్, మహమ్మద్ ఇమ్రాన్ రంధవాలతోనూ అతడికి మాటల యుద్ధం జరిగింది. ఆయుష్ బదోనీ బౌలింగ్‌లో షమైల్ హుస్సేన్ క్యాచ్‌ ఔట్‌గా వెనుదిరిగిన తర్వాత హర్షిత్ రాణా దూకుడుగా వీడ్కోలు పలికాడు. ఈ క్రమంలో అతడు చేసిన సంజ్ఞలు వివాదాస్పదమయ్యాయి.

రాణా డకౌట్.. పాక్ ఆటగాళ్ల ఎదురుదాడి
అనంతరం హర్షిత్ రాణా బ్యాటింగ్‌కు దిగినప్పుడు పాక్‌ ఆటగాళ్లు ఎదురుదాడికి దిగారు. మహమ్మద్ ఇమ్రాన్ బౌలింగ్‌లో రాణా డకౌట్‌ కాగా.. వారు అతడి చుట్టూ చేరి దూకుడుగా వీడ్కోలు పలికారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో అంపైర్లు జోక్యం చేసుకొని ఇరు పక్షాలకు సర్ది చెప్పారు. తీవ్ర ఉద్రిక్తతల నడుమ సాగిన ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్‌ విజయం సాధించింది. 

ఇదీ చదవండి: కోహ్లి రికార్డు బద్దలుకొట్టిన పాక్ కెప్టెన్‌


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement