కోహ్లి రికార్డు బద్దలుకొట్టిన పాక్ కెప్టెన్‌ | Babar Azam Breaks Virat Kohli-Massive Record-ILT20-Debut Match | Sakshi
Sakshi News home page

కోహ్లి రికార్డు బద్దలుకొట్టిన పాక్ కెప్టెన్‌

Nov 24 2026 12:32 PM | Updated on Nov 24 2026 12:36 PM

Babar Azam Breaks Virat Kohli-Massive Record-ILT20-Debut Match

Photo Credit: Twitter

పాకిస్తాన్ టెస్టు కెప్టెన్ బాబ‌ర్ ఆజం మరో అరుదైన ఫీట్‌ సాధించాడు. ఇంట‌ర్నేష‌న‌ల్ లీగ్ టీ20 (ఐఎల్‌టీ20) టోర్నీలో డెస‌ర్ట్ వైప‌ర్స్ త‌ర‌ఫున డెబ్యూ మ్యాచ్ ఆడిన బాబ‌ర్ ఆజం, త‌న తొలి మ్యాచ్‌లోనే అర్థ‌శ‌త‌కంతో మెరిశాడు. తద్వారా టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి రికార్డును బ‌ద్ద‌లుకొట్టాడు.

ఫ‌లితంగా షార్జా వారియ‌ర్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో డెస‌ర్ట్ వైప‌ర్స్ ఆరు వికెట్ల తేడాతో సునాయాస విజ‌యాన్ని అందుకుంది. మ్యాచ్‌లో 51 బంతుల్లో 86 ప‌రుగులు చేసిన బాబ‌ర్ ఆజం టీ20 క్రికెట్‌లో అత్య‌ధిక‌సార్లు 80 ప్ల‌స్ స్కోర్లు సాధించిన క్రికెట‌ర్ల జాబితాలో కోహ్లిని అధిగ‌మించాడు. బాబ‌ర్ ఆజంకు ఇది 31వ 80 ప్ల‌స్ స్కోరు. కాగా, కోహ్లి టీ20 క్రికెట్‌లో 30 సార్లు 80 ప్ల‌స్ స్కోరు సాధించాడు. 

ఓవ‌రాల్ జాబితాలో క్రిస్ గేల్ 48 సార్లు 80 ప్ల‌స్ స్కోర్లు సాధించి తొలి స్థానంలో నిలవ‌గా, జోస్ బ‌ట్ల‌ర్, జేమ్స్ విన్స్ , డేవిడ్ వార్న‌ర్‌ల‌తో క‌లిసి బాబ‌ర్ ఆజం 31 సార్లు 80 ప్ల‌స్ స్కోర్లు సాధించి సంయుక్తంగా రెండో స్థానంలో కొన‌సాగుతున్నాడు. ఇక కోహ్లి మూడో స్థానంలో ఉన్నాడు. దీంతో పాటు బాబ‌ర్ ఆజం మ‌రో రికార్డు కూడా త‌న ఖాతాలో వేసుకున్నాడు. 

ఐఎల్‌టీ20 టోర్నీలో డెసర్ట్ వైప‌ర్స్ త‌ర‌ఫున రెండో అత్య‌ధిక వ్య‌క్తిగ‌త స్కోరు సాధించిన బ్యాట‌ర్‌గా నిలిచాడు. 2025 సీజ‌న్‌లో ముంబై ఎమిరేట్స్‌తో మ్యాచ్‌లో అమెరికా బ్యాట‌ర్ ఆండ్రీ గౌస్ (58 బంతుల్లో 120 నాటౌట్‌) తొలి స్థానంలో ఉన్నాడు. ఇక ఐఎల్‌టీ20 టోర్నీలో డెస‌ర్ట్ వైప‌ర్స్ త‌ర‌ఫున సెంచ‌రీ సాధించిన ఏకైక ప్లేయ‌ర్‌గా ఆండ్రీ గౌస్ ఉన్నాడు. ఐఎల్‌టీ20 టోర్నీలో ఒక ఇన్నింగ్స్‌లో 80 ప్ల‌స్ స్కోరు సాధించిన 21వ బ్యాట‌ర్‌గా బాబ‌ర్ ఆజం నిలిచాడు.

T20ల్లో అత్యధిక 80+ స్కోర్లు
48 - క్రిస్ గేల్
31* - బాబర్ అజామ్
31 - జోస్ బట్లర్
31 - జేమ్స్ విన్స్
31 - డేవిడ్ వార్నర్
30 - విరాట్ కోహ్లి

మ్యాచ్‌ విషయానికొస్తే, తొలుత బ్యాటింగ్‌ చేసిన షార్జా వారియర్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 166 పరుగులకు ఆలౌటైంది. పాల్ వాల్టర్ (43 బంతుల్లో 75) అర్థసెంచరీతో రాణించగా, జేమ్స్ విన్స్ (23) పర్వాలేదనిపించాడు. డెసర్ట్ వైపర్స్ బౌలింగ్‌లో కెప్టెన్ షాదాబ్ ఖాన్, ఖుజైమా తన్వీర్ చెరో 3 వికెట్లు తీయగా, టామ్ కర్రన్ రెండు వికెట్లు పడగొట్టాడు. 

అనంతరం డెసర్ట్ వైపర్స్ 17.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 167 పరుగులు చేసి గెలుపొందింది. బాబర్ ఆజం (51 బంతుల్లో 86, 13 ఫోర్లు, 2 సిక్సర్లు), జో క్లార్క్ (35) రాణించారు. ఆడమ్ మిల్నే రెండు వికెట్లు పడగొట్టాడు.

ఇదీ చదవండి: యూఏఈతో మ్యాచ్‌.. మూడు మార్పులతో బరిలో దిగిన భారత్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement