సమంతకు రామ్ చరణ్ స్పెషల్ విషెస్ | Ram Charan Special Wishes To Actress Samantha | Sakshi
Sakshi News home page

Ram Charan: సమంతకు రామ్ చరణ్ స్పెషల్ విషెస్

Nov 22 2026 7:52 AM | Updated on Nov 22 2026 7:53 AM

Ram Charan Special Wishes To Actress Samantha

మెగా హీరో రామ్ చరణ్.. హీరోయిన్ సమంతకు అభినందనలు తెలిపారు. మీ ఇంట చిన్నారి రావడం సంతోషంగా ఉందన్నారు. మీ ఇద్దరితో పాటు మీ చిన్నారి కూడా జీవితాంతం సంతోషంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నట్లు చెర్రీ ట్వీట్ చేశారు.  ఈ సందర్భంగా మెగా హీరో రామ్ చరణ్.. రాజ్ నిడిమోరు, సమంతకు ప్రత్యేకంగా విషెస్ తెలిపారు. కాగా.. సమంత, రామ్ చరణ్ జంటగా రంగస్థలం మూవీలో నటించారు. ఈ సినిమాకు సుకుమార్ దర్శకత్వం వహించారు.

ఇక సమంత విషయానికొస్తే గతేడాది ఆమె డైరెక్టర్ రాజ్ నిడిమోరును పెళ్లాడింది. ఈ ఏడాది జూన్‌లో ప్రెగ్నెన్సీ ప్రకటించిన సామ్.. ఈనెల 19న మగబిడ్డకు జన్మనిచ్చింది. తన కుమారుడికి దేవ్ నిడిమోరు అని నామకరణం కూడా చేసింది. ఈ ఏడాది మా ఇంటి బంగారం చిత్రంలో నటించిన సమంత.. సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకుంది. ప్రెగ్నెన్సీ తర్వాత సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. మరోవైపు రామ్ చరణ్.. సుకుమార్ డైరెక్షన్‌లో మరోసారి నటిస్తున్నారు. వీరిద్దరి కాంబోలో వస్తోన్న మూవీని ఆర్సీ17 అనే వర్కింగ్‌ టైటిల్‌తో తెరకెక్కిస్తున్నారు.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement