బిగ్‌బాస్ 11వ వారం చివరి దశకు చేరుకుంది. ఇక వీకెండ్ ఎపిసోడ్‌లో నాగార్జున ఎంట్రీ ఉండనే ఉంటుంది. ఈ వారం డిక్టేటర్ వీక్ కావడంతో నాగ్ సైతం అదే స్టైల్లో వచ్చి రాగానే కుర్చీలో కూర్చుని.. చేతిలో కర్ర పట్టుకుని డిక్టేటర్‌లా కనిపించారు. ఈ వీక్‌లో హౌస్‌లో ఇద్దరు డిక్టేటర్లు ముకేశ్, త్రిగుణ్ ఎలా వ్యవహరించారో నిర్ణయించాలంటూ ఇద్దరి టీమ్ సభ్యులకు నాగ్ సూచించారు. వందకు ఎన్ని మార్కులు వేస్తారని నాగ్ ప్రశ్నించారు.
ముకేశ్ టీమ్‌లో సభ్యులంతా ముందుగా తమ నిర్ణయాన్ని వెల్లడించారు. డిక్టేటర్‌గా ముకేశ్ ఫెయిలయ్యాడని తేల్చేశారు. వర్షిణి మాత్రమే ముకేశ్‌ను 90 మార్కులు వేసింది. మిగిలిన టీమ్ సభ్యులు 30, 50 మార్కులతోనే సరిపెట్టారు. దీంతో డిక్టేటర్ నువ్వు సరిగా వ్యవహరించలేదని నాగార్జున క్లాస్ పీకారు. తర్వాత త్రిగుణ్ టీమ్ సభ్యులు అతన్ని ఆకాశానికెత్తేశారు. నలుగురు కలిసి త్రిగుణ్‌కు 90 మార్కులు ఇచ్చారు. డిక్టేటర్‌గా తమకు ఎక్కడా ఇబ్బంది కలగలేదని త్రిగుణ్‌ను ప్రశంసించారు. ఒక్క నోటి దురుసు తప్ప అంతా ఓకే అని టీమ్ సభ్యులు త్రిగుణ్‌ను పొగిడారు.
ఇక వీకెండ్ వచ్చిందంటే చాలు ఎలిమినేషన్ ఉండనే ఉంటుంది. ఈ వారంలో కెప్టెన్‌గా ఉన్న నరేశ్ మినహా అందరూ నామినేట్ అయ్యారు. అయితే ఈ వారం ఓటింగ్ ప్రక్రియ ఆసక్తికరంగా సాగింది. ఈ వీక్‌లో ఓటింగ్‌లో త్రిగుణ్, ముఖేష్, దేబ్జానీ, అమన్, వర్షిణీలు ముందు ఉన్నారు. తక్కువ ఓటింగ్ సాధించిన వారిలో రాంప్రసాద్, వంశీ, సుధీర్, రామకృష్ణ, నీతూ మాస్టర్, శివ ఉన్నారు. అలా చివరికీ ఈ వీక్‌లో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్‌గా అడుగుపెట్టిన నీతూ ఎలిమినేట్ అయ్యారు. శనివారమే ఒకరు ఎలిమినేట్ కావడంతో.. ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉందని తెలుస్తోంది. ఈ రోజు కూడా మరో కంటెస్టెంట్ హౌస్ నుంచి బయటకు వచ్చే ఛాన్స్ ఉంది.


