హెల్త్ మీద ఫోకస్ చై... పనులు హాయిగా చేసుకోవచ్చు.
పాజిటివిటీ మీద ఫోకస్ చై... లైఫ్‌లో బోలెడంత పాజిటివిటీ ఉంటుంది.
మానసిక ఆరోగ్యం బాగుండాలా... మంచి ఆలోచనలపై ఫోకస్ చై...
ఫిజికల్లీ హెల్తీగా ఉండాలా... హెల్తీ లైఫ్ స్టైల్ పై ఫోకస్ చై... నెగెటివిటీ మీద ఫోకస్ వెళుతోందా... స్విచ్ఛాఫ్ చై...
లైఫ్‌లో దూసుకెళ్లాలా... ఎనర్జీ స్విచ్చాన్ చై... యంగ్ స్టార్ నాగ చైతన్య ఇలానే అంటున్నారు.
హెల్తీగా, కూల్‌గా, ఎనర్జిటిక్‌గా ముందుకెళ్లిపోతే లైఫ్ చాలా లైట్‌గా, హ్యాపీగా ఉంటుంది అన్నారు నాగ చైతన్య. నవంబర్ 23 ‘చై’ (నాగచైతన్యని సన్నిహితులు, అభిమానులు అలానే పిలుస్తారు) పుట్టినరోజు... ఇంకో రెండు వారాల్లో పెళ్లి రోజు... ఎంతో ఇష్టపడి చేసిన ‘వృషకర్మ’ సినిమా రిలీజ్ దగ్గర్లో ఉంది... ఫుల్ బిజీగా ఉన్న ఈ హీరో ‘సాక్షి’ ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వూ పై ఫోకస్ పెట్టారు... ఆ విశేషాలు.
ముందుగా బర్త్ డేని ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారో చెబుతారా?
నాగచైతన్య: ఈసారి సెలబ్రేషన్స్ పెద్దగా ఉండవు. అదే ఇంతకు ముందు అయితే వన్ వీక్... టెన్ డేస్ ప్లాన్ చేసేవాణ్ణి. ఫ్రెండ్స్, ఫ్యామిలీతో ట్రిప్ వెళ్లేవాణ్ణి. ఈసారి ‘వృషకర్మ’ ప్రమోషన్స్‌తో బిజీగా ఉంటాను. డిసెంబరులో రిలీజ్ కాబట్టి నా షెడ్యూల్ అంతా ఈ సినిమా చుట్టూనే తిరుగుతుంది. ఇప్పుడు కూడా
(శనివారం సాయంత్రం) ఈ సినిమా ఎడిటింగ్ రూమ్ నుంచి ఈ ఇంటర్వ్యూ ఇవ్వడానికి వచ్చాను.
మీ నాన్నగారు, మీరు... ఇలా మీ ఫ్యామిలీలో ఉన్న ఏజ్‌కన్నా తక్కువగా కనిపిస్తుంటారు... మీ ఫ్యామిలీకి అదొక బ్లెస్సింగ్ ఏమో...
(నవ్వేస్తూ) డెఫినెట్లీ బ్లెస్సింగ్. మా తాతగారి నుంచి వచ్చిన జీన్స్ అవి. ఆ జీన్స్ నుంచి వచ్చిన మంచి హెల్త్, ఎనర్జీ... ఇవన్నీ మాకో అడ్వాంటేజ్ అయితే మా హార్డ్ వర్క్ కూడా చాలా ఉంటుంది. లైఫ్ స్టైల్ పరంగా కేర్ తీసుకుంటాం. హెల్తీ ఫుడ్ తినడం, హెల్తీగా ఆలోచించడం, హెల్తీ వర్కవుట్స్... వీటిపై ఫోకస్ చేస్తాం. ఫిజికల్ ఎనర్జీపై ఫోకస్ పెట్టినట్లే మెంటల్ ఎనర్జీపై కూడా ఫోకస్ పెడతాం.
ఎప్పటికప్పుడు కొత్త డైట్ ఏమైనా ఫాలో అవుతుంటారా?
ఏదైనా క్యారెక్టర్ కోసం బాడీ ట్రాన్స్‌ఫార్మ్ అంటే... డైట్ మార్చాల్సిందే. మజిల్ పెంచాలంటే డైట్ ఎక్కువ తీసుకోవాలి, తగ్గించాలంటే డైట్ కట్ చేయాలి. అలాగని ఎక్కువ కట్ చేయకూడదు... ఎందుకంటే ఆ మజిల్ టోన్ ఉండాలి. ఎక్కువ డైట్ కట్ చేసేస్తే సన్నగా కనిపిస్తాం. బాడీ ఫ్లెక్సిబిలిటీకి యోగా, జిమ్ చేస్తాను. జిమ్, యోగా నా రొటీన్ లైఫ్ స్టైల్‌లో హ్యాబిట్ అయిపోయాయి. మన లైఫ్ స్టైల్ బాగుంటే ఫిజికల్లీ హెల్తీగా ఉంటాం. పాజిటివ్‌గా ఆలోచిస్తే చుట్టూ పాజిటివిటీ ఉంటుంది.
సినిమాలతో బిజీగా ఉంటూ రెస్టారెంట్ కూడా నడుపుతున్నారు... మీకు ఫుడ్ బిజినెస్ అంటే ఇష్టమా?
సినిమా షూటింగ్స్‌తో ఫిజికల్‌గా అలసిపోతానేమో కానీ మెంటల్లీ నాకు సినిమా మంచి ఎనర్జీ ఇస్తుంది. మనకు బోలెడంత ఎనర్జీ ఉన్నప్పుడు ఎన్ని వీలు పడితే అన్ని చేసేయడమే (నవ్వుతూ). బేసిక్‌గా ఫుడ్ అంటే నాకు ఇష్టం. ఇంట్రస్ట్ ఉంది కాబట్టి రెస్టారెంట్ బిజినెస్‌లోకి అడుగుపెట్టాను. కిచెన్‌లో ఉన్నప్పుడు ఆ పరిసరాలు ఛాలెంజింగ్‌గా ఉంటాయి. కిచెన్ వేడి, అరుపులు, కేకలు... చాలా కన్‌ఫ్యూజ్డ్‌గా ఉంటుంది. కానీ ఆన్‌పేపర్‌లో ఉన్న డిష్‌ని వండటం చూస్తున్నప్పుడు, ఆ తర్వాత ఆ డిష్‌ని ప్లేట్‌లో చూçస్తున్నప్పుడు క్రియేటివ్ హై వస్తుంది. ఆ డిష్‌ని టేస్ట్ చేసేటప్పుడు ఆ ఫ్లేవర్స్ అన్నీ నోట్లోకి వెళ్లగానే ఆ ఎంజాయ్‌మెంట్, ఆ ఫీలే వేరు. కిచెన్ అట్మాస్ఫియర్ అంతా చూడటానికి కష్టంగా ఉంటుంది కానీ, వండుతున్న ప్రాసెస్ చూస్తుంటే మెంటల్లీ రిలాక్సింగ్‌గా ఉంటుంది.
సిటీ దాటి వెళ్లినప్పుడు మీరు రకరకాల ఫుడ్స్ ట్రై చేస్తుంటారా? మీకు ఏ దేశం వంటలంటే ఇష్టం?
అన్ని వంటకాలూ తినాలనుకుంటాను. అయితే నాకు ఇంట్లో వండే మన సౌత్ ఇండియన్... అందులోనూ తెలుగు వంటలు బాగా ఇష్టం. కానీ ఫుడ్ మీద ΄్యాషన్ ఉంది కాబట్టి... ఎక్కడికెళ్లినా అక్కడి వంటకాల్లో వెరైటీగా ఉన్నవి ట్రై చేస్తాను. మనం రకరకాల సినిమాలు చూడాలనుకుంటాం కదా... అలా రకరకాల ఫుడ్స్ ట్రై చేయటం నాకు బాగా ఇంట్రెస్ట్ (నవ్వేస్తూ)...
మీరు ప్లాన్ చేసుకునే ట్రిప్స్ ఫుడ్ రిలేటెడ్‌గా ఉంటాయా?
అలాగే ప్లాన్ చేస్తాను. ఆ ప్లేస్‌లో మనం ఎప్పుడూ ఫుడ్ తినలేదు కదా... అక్కడికి వెళదాం అనుకుంటాను. అక్కడి ఫుడ్స్ డిస్కవర్ చేయటం, లోకల్ కల్చర్ గురించి తెలుసుకోవడం ఇంట్రస్ట్.
సరే... బర్త్ డే సెలబ్రేషన్స్ అంటే ‘వృషకర్మ’ రిలీజ్ హడావిలో ఉన్నానన్నారు. మరి... పెళ్లి రోజు (డిసెంబరు 4) సెలబ్రేషన్స్ సంగతి...
మా సెకండ్ యానివర్శరీ అదే రోజు. ఆ రోజే సినిమా రిలీజ్ అనుకుంటున్నాం. అన్నీ కుదిరితే మన హైదరాబాద్ థియేటర్స్‌లోనే ఏదో థియేటర్లో కనిపిస్తాను (నవ్వుతూ). మామూలుగా అయితే అవుట్ సైడ్ సిటీ వెళ్తాం.
సో... ఇప్పుడు శోభితగారితో లైఫ్ ఎలా ఉంది... ‘వృషకర్మ’ చూపించారా?
వెరీ బ్యూటిఫుల్. లైఫ్ ఈజ్ ఫెంటాస్టిక్. ఇట్స్ బీన్ ఏ బ్యూటిఫుల్ జర్నీ, వెరీ పాజిటివ్. ఇంకా సినిమాలో ఒక్క ఫ్రేమ్ కూడా తను చూడలేదు. నెక్ట్స్ వీక్ చూపిస్తాను.
ఈ మధ్య అమలగారు ఒక ఇంటర్వ్యూలో ‘మా ఇద్దరి కోడళ్లు శోభిత, జైనాబ్ (అఖిల్ భార్య) చాలా కలిసిపోతారు’ అన్నట్లు చెప్పారు..
ఎస్... అఫ్‌కోర్స్. ఇల్లు నిండుగా ఉంటేనే ఒక కళ ఉంటుంది. అమలగారు అన్నట్టు ‘ఇట్స్ వెరీ నైస్’. మొన్న రీసెంట్‌గా నాన్న బర్త్‌డేకి అందరం కలిసి ఒక ట్రిప్‌కి వెళ్లాం. ఇట్ ఫెల్ట్ వెరీ గుడ్. నాన్న కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. సో... ఇంట్లో డెఫినెట్లీ వైబ్రేషన్ మారింది.
‘వృషకర్మ’లో మీది ట్రెజర్ హంటర్ క్యారెక్టర్ కదా... మీరు గోల్డెన్ స్పూన్ అయినప్పటికీ ఎప్పుడైనా ‘ట్రెజర్’ దొరికితే బాగుంటుందనుకున్నారా?
స్కూల్ టైమ్‌లో మా అమ్మ పాకెట్ మనీ విషయంలో కొంచెం స్ట్రిక్ట్‌గా ఉండేవారు. నెలకి ఇంత అంటే ఇంతే... ఆ పైన అడగడానికి లేదు. చాలా మామూలుగా పెంచారు. అందుకు ఎప్పటికీ ‘థ్యాంక్‌ఫుల్’గా ఉండాలనిపిస్తుంటుంది. ఆ పెంపకం వల్లే వేల్యూస్ తెలిశాయి. ఇక ట్రెజర్ దొరికితే బాగుంటుందని ఎప్పుడూ అనిపించలేదు కానీ అప్పట్లో గేర్ సైకిల్ ట్రెండ్ నడుస్తోంది. అది కావాలనిపించేది. అలాగే లెవన్త్, ట్వల్త్ స్టాండర్డ్స్‌లో ఒక బైక్ దొరికితే బాగుంటుందనిపించింది. ఒక్కో ఫేజ్‌లో ఆ ఏజ్‌కి తగ్గవి కావాలనిపించేవి (నవ్వుతూ).
హీరోగా 25వ సినిమా ‘మైల్‌స్టోన్’ టచ్ చేయనున్నారు. ఆ మూవీకి ‘వృషకర్మ’ మంచి లీడ్ అవుతుందా?
‘వృషకర్మ’ మీద నేను ఎక్కువ కాన్ఫిడెంట్‌గా ఉన్నాను. ఈ సినిమా కథ, ఆ కథను చూపించి విధానం, వీఎఫ్‌ఎక్స్... అన్నీ నా గత చిత్రాలకంటే ఎక్కువ. ఈ సినిమా తర్వాత మళ్లీ ఈ స్టాండర్డ్‌కి మీట్ అవ్వాలంటే అది నాకో చాలెంజ్ అవుతుంది. ఈప్రొడక్ట్ మీద అంత కాన్ఫిడెంట్‌గా ఉన్నాను. 25వ సినిమా మైల్‌స్టోన్‌కి ఇది పర్ఫెక్ట్ లీడ్ అప్ అని నమ్ముతున్నాను. ఇది పూర్తిగా డైరెక్టర్ విజన్ మూవీ. మాకెలాంటి రిఫరెన్స్ ఉండవు. ఫ్యాంటసీ, మైథాలజీ బ్యాక్‌డ్రాప్ కాబట్టి ఆ విజువల్స్ అన్నీ ఓన్లీ డైరెక్టర్ మైండ్‌లో ఉంటాయి. ఈ కథను కార్తీక్ చెప్పినప్పుడు స్క్రీన్ మీద ఎలా ఉంటుందో ఒక లెవెల్ వరకే ఊహించగలిగాను. ఆన్ స్క్రీన్‌కి తను నెక్ట్స్ లెవెల్‌కి తీసుకెళ్ళిపోయాడు. నేను కార్తీక్‌ని కలవక ముందే తను చేసిన ‘విరూపాక్ష’ సినిమా చూసి, ఇంప్రెస్ అయ్యాను.
24 క్రాఫ్ట్స్‌లో ప్రతి క్రాఫ్ట్ మీద తనకి మంచి కమాండ్ ఉందనిపించింది. ఇలాంటి మేకర్‌తో సినిమా చేస్తే ఆర్టిస్ట్‌గా ఇంకో అడుగు ముందుకు వేయొచ్చనిపించింది.
ఇప్పటివరకు మీరు చేసిన పాత్రలు మహా అయితే హెయిర్ స్టైల్, స్లాంగ్‌లో మార్పులు డిమాండ్ చేశాయి. కానీ ‘వృషకర్మ’ ఫిజికల్‌గా డిమాండ్ చేసినట్లపిస్తోంది...
అవును... ఈ సినిమాలో నా క్యారెక్టర్ పేరు అర్జున్. తను ట్రెజర్ హంటర్. నిధి అన్వేషణ అంటే చాలా చాలెంజెస్ ఉంటాయి. గుహల లోపలికి వెళ్లడం, కొండలు ఎక్కడం వంటివి చేయాలి కాబట్టి అందుకు తగ్గట్టుగా ఫిజికల్‌గా మారాల్సి వచ్చింది. అథ్లెటిక్ ౖకైండ్ మస్కులారిటీ కావాలని కార్తీక్ అడిగాడు. దానికి తగ్గట్టు డైట్ తీసుకున్నాను. మార్షల్ ఆర్ట్స్ కూడా నేర్చుకున్నాను. ఫిజికల్‌గా మాత్రమే కాదు... యాక్టింగ్ వైజ్‌గానూ కొత్తగా చేసే స్కోప్ దొరికింది. హాలీవుడ్ సినిమాల్లోని క్యారెక్టరైజేషన్‌లా ఉంటుంది. హెయిర్ స్టైల్ నుంచి బాడీ మేకోవర్ వరకూ అంతా కొత్తగా ట్రై చేశాను.
మార్షల్ ఆర్ట్స్ అంటున్నారంటే... రిస్కీ ఫైట్స్ ఉన్నాయా?
ఈ సినిమాలో విలన్ (స్పర్శ్)కి ఒక శక్తి ఉంటుంది. ఆ శక్తిని ఢీ కొనాలంటే రిస్కీ ఫైట్స్ చేయాలి. అందుకోసం మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నాను. క్లైమాక్స్‌లో ఎవరూ ఊహించని స్టంట్స్ ఉంటాయి. ‘లార్జర్ దేన్ లైఫ్’ అంటారు కదా.. అలాంటి సీక్వెన్స్... చాలా రిహార్సల్స్ చేశాం.
ఇలా ఫిజికల్లీ, మెంటల్లీ కష్టపెట్టే క్యారెక్టర్స్ వరుసగా చేస్తున్నారు కాబట్టి రిలీఫ్ కోసం సింపుల్ లవ్‌స్టోరీ మూవీ చేయాలని లేదా?
నిజానికి బ్యూటిఫుల్ లవ్‌స్టోరీస్‌ని మిస్సవుతున్నాను... చేయాలనిపిస్తోంది. కానీ ‘వృషకర్మ’ లాంటి సినిమాలను ఆన్ స్క్రీన్ చూస్తున్నప్పుడు ఆ హైయే వేరేగా ఉంటుంది. ఈ కథ విన్నప్పుడు ఇదొక బంగారం లాంటి చాన్స్ అనే ఫీలింగ్ కలిగింది. సినిమా చూసిన తర్వాత హీరో, హీరోయిన్, విలన్... అన్నీ పక్కన పెట్టి ఆడియన్స్ ఫస్ట్ కథ గురించే మాట్లాడతారు.
2023 నుంచి ఏడాదికి ఒక్క సినిమాలో కనిపిస్తున్నారు... సినిమాల సంఖ్య పెరగాలేమో...
ఆ ఫీలింగ్ నాకూ ఉంది. ‘తండేల్’ ఒక సవాల్. ఎక్కువగా సము ద్రంలో షూట్ చేశాం. ఆ సినిమా మేకింగ్, నా క్యారెక్టర్ కోసం చాలా ఎఫర్ట్ పెట్టాం. ఆ వెంటనే ‘వృషకర్మ’ ఇంకా పెద్ద సవాల్. ఈ సినిమా మొదలుపెట్టాక ప్రతిదీ నేర్చుకుంటూ చేశాం. పైగా నా మార్కెట్, కార్తీక్ మార్కెట్‌ని దృష్టిలో పెట్టుకుని అంత బడ్జెట్‌లోనే చేయాలి. చాలా జాగ్రత్తగా చేశాం. షూటింగ్ చేస్తున్నప్పుడు ఎక్కడైనా కరెక్ట్‌గా లేదనిపిస్తే... డ్రాయింగ్ బోర్డ్‌కి వెళ్లి స్కూల్ పిల్లల్లా నేర్చుకొని, మళ్లీ షూటింగ్‌కి వెళ్లేవాళ్లం. దానివల్ల కొంచెం టైమ్ పట్టింది. ‘తండేల్, వృషకర్మ’లాంటి సినిమాలకు ఎక్కువ టైమ్ తీసుకోక తప్పలేదు. బట్... ఒక యాక్టర్‌గా నాలో చాలా ఎనర్జీ ఉంది. సంవత్సరానికి రెండు సినిమాలు చేయొచ్చని నాకు తెలుసు. కానీ మంచి కథలు సపోర్ట్ చేయాలి... కథలు దొరికితే వై నాట్... చేసేస్తాను.
నాగచైతన్య అంటే కూల్ పర్సన్... కానీ ఇప్పుడు సెలబ్రిటీల గురించి హాట్ హాట్‌గా నెగెటివిటీ ప్రచారం అవుతోంది.. మీపై వచ్చే ట్రోల్స్æని ఎలా హ్యాండిల్ చేస్తారు?
పెద్దగా కష్టపడక్కర్లేదు. ఆ యాప్ నుంచి బయటకు వచ్చేయడమే. మరీ డిస్ట్రబ్ అయిపోతే ఫోన్ స్విచ్చాఫ్ చేసేయడమే. మనం ఫోన్ చూస్తున్నప్పుడు మనకు కనిపించిన వాటిలో ఏదైనా కరెక్ట్ కాదనిపించిందనుకోండి.... జస్ట్ యాప్ పైన ఉన్న క్లోజ్ బటన్ నొక్కితే చాలు... క్లోజ్ అయిపోతుంది... అంతే. ట్రోలింగ్ అనేది ఫ్యాషన్‌లా అయిపోయింది. ఒక టైమ్‌లో కొంచెం సీరియస్‌గా తీసుకున్న రోజులు ఉన్నాయి. ‘ఇలా ఎందుకు అంటున్నారు’ అనిపించేది. కానీ, ఇప్పుడు ట్రోలింగ్ అనేది జస్ట్ ఒక ఫ్యాషన్. పైగా ఇవాళ ఉన్న టాపిక్ రేపటికి మర్చిపోతున్నారు... ఈ ప్లేస్‌లో రేపు ఇంకోటి... అన్నీ అంత ఫాస్ట్ అయిపోయాయి.
– డి.జి. భవాని


