birthday
-
బర్త్ డే బ్యూటీ.. ట్రెండింగ్ హీరోయిన్ని గుర్తుపట్టారా?
సాధారణంగా సినిమాలు హిట్ అయితే హీరోయిన్లకు క్రేజ్ వస్తుంది. కొన్నిసార్లు ఫలితంతో సంబంధం లేకుండా ఫ్లాప్స్ అందుకున్నా సరే కొందరు బ్యూటీస్ బాగానే గుర్తింపు తెచ్చుకుంటారు. అలాంటి వాళ్ల ఈమె ఒకరు. మరో రెండు నెలల్లో ఈ భామ హీరోయిన్గా చేసిన మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. మరి ఈమె ఎవరో గుర్తుపట్టారా? చెప్పేయమంటారా?(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 10 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్)పైన మీసకట్టుతో తలపై కిరీటంతో కనిపిస్తున్న ఈ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే. ముంబైకి చెందిన ఈమె.. రవితేజ 'మిస్టర్ బచ్చన్'తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. తొలి మూవీనే ఘోరమైన డిజాస్టర్. అయినా సరే 'కింగ్డమ్', 'కాంత' లాంటి పాన్ ఇండియా మూవీస్‌లో అవకాశాలు అందుకుంది. కానీ ఇవి కూడా బాక్సాఫీస్ దగ్గర ఫెయిలయ్యాయి. గతేడాది చివరలో వచ్చిన 'ఆంధ్ర కింగ్ తాలుకా' కూడా ఫ్లాప్ అయింది.ప్రస్తుతం భాగ్యశ్రీ చేస్తున్న తెలుగు సినిమా 'లెనిన్' మాత్రమే. అక్కినేని అఖిల్ హీరోగా నటించిన ఈ చితం.. జూన్ 26న థియేటర్లలోక రానుంది. ఇది హిట్ కావడం అఖిల్‌కి ఎంత ముఖ్యమో భాగ్యశ్రీకి కూడా అంతే కీలకం. ఎందుకంటే ఇది సక్సెస్ అయితే తెలుగులో మరికొన్ని అవకాశాలు వస్తాయి. లేదంటే పరిస్థితి కష్టమైపోవచ్చు. ఇకపోతే శివకార్తికేయన్ హీరోగా నటిస్తున్న 'సెయాన్' మూవీతో భాగ్యశ్రీ, తమిళంలోకి కూడా ఎంట్రీ ఇస్తోంది. ఈమె పుట్టినరోజు సందర్భంగా తాజాగా పోస్టర్ రిలీజ్ చేసి ఈ విషయాన్ని ప్రకటించారు.(ఇదీ చదవండి: మృణాల్ ఠాకుర్‌కి ఊహించని అవకాశం?) -
'వాట్ ఏ గిఫ్ట్'.. త్రిషకు రాధికా, ఛార్మి బర్త్ డే విషెస్..!
తమిళనాడులో విజయ్ గెలుపు తర్వాత ఆమెపైనే అందరి దృష్టి పడింది. ఎన్నికల ముందు నుంచే ఆమెపై రూమర్స్ వస్తూనే ఉన్నాయి. విజయ్‌తో రిలేషన్లో ఉన్నారంటూ సోషల్ మీడియా కోడై కూసింది. అయినా తాను ఎక్కడా స్పందించకుండా సైలెంట్‌గానే ఉండిపోయింది. తాజాగా ఎన్నికల్లో విజయ్ విజయంతో అందరు త్రిష పేరునే జపిస్తున్నారు. ఫలితాల రోజే త్రిష బర్త్ డే కావడం మరింత ఆసక్తికరంగా మారింది. ఈ విజయం త్రిషకు విజయ్ ఇచ్చిన బర్త్ డే గిఫ్ట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.సీనియర్ నటి రాధికా శరత్ కుమార్ సైతం విజయ్- త్రిష రిలేషన్ కన్ఫామ్ చేసింది. త్రిషకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ.. వాట్ ఏ గిఫ్ట్ అంటూ రాసుకొచ్చింది. టాలీవుడ్ హీరోయిన్ ఛార్మి సైతం త్రిషకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పింది. దర్శకుడు పూరి జగన్నాధ్, త్రిషతో దిగిన ఫోటోను షేర్ చేసింది. మీ ప్రత్యేకమైన రోజున ప్రత్యేక వేడుక.. మీరు మా అదృష్ట దేవత.. ఈ పుట్టినరోజు చరిత్ర పుస్తకాల్లో చిరస్థాయిగా నిలిచిపోతుంది. నా చిన్నారికి పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ ఛార్మి పోస్ట్ చేసింది. టాలీవుడ్ నటి లక్ష్మీ మంచు కూడా త్రిషకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది. డబుల్ సెలబ్రేషన్ అంటూ పోస్ట్ చేసింది.కాగా.. త్రిష తన పుట్టినరోజు ఉదయాన్ని తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆ తర్వాత నేరుగా ఆమె చెన్నైలోని విజయ్ నివాసానికి వెళ్లారు. టీవీకే విజయం సాధించడంతో విజయ్ను ప్రత్యేకంగా కలిశారు. దీంతో విజయ్-త్రిష రిలేషన్‌పై అభిమానులకు ఫుల్ క్లారిటీ వచ్చేసింది. ఇప్పటికే విజయ్ సతీమణి విడాకుల పిటిషన్ దాఖలు చేసింది. ఈ కేసు చెంగల్పట్టు ఫ్యామిలీ కోర్టులో జూన్ 15న విచారణకు రానుంది. కాగా.. తమిళనాడులోని 234 అసెంబ్లీ స్థానాల్లో విజయ్ స్థాపించిన టీవీకే 108 స్థానాలను గెలిచింది. -
43 ఏళ్ల 'యంగ్' హీరోయిన్ త్రిష బర్త్ డే స్పెషల్ (ఫొటోలు)
-
మల్లెపూల దండలతో సురేఖవాణి బర్త్ డే వేడుక.. ఢిఫరెంట్ లుక్‌లో కనిపించిన నటి (ఫోటోలు)
-
నటి సురేఖవాణి బర్త్ డే.. కూతురు సుప్రీత స్పెషల్ పోస్ట్
టాలీవుడ్ నటి సురేఖవాణి బర్త్ డేను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంది. ఆమె కూతురు సుప్రీత మదర్ బర్త్ డే వేడుకలు నిర్వహించింది. 'హ్యాపీ బర్త్ డే మమ్మీ.. నాకు అన్నీ నువ్వే.. నిన్ను చాలా ప్రేమిస్తున్నా'.. అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు సురేఖవాణికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతున్నారు. కాగా.. టాలీవుడ్ నటి సురేఖ వాణి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో నటిగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం సినిమాల్లో పెద్దగా కనిపించకపోయినా.. సోషల్ మీడియాలో అభిమానులతో మాత్రం టచ్‌లోనే ఉంటోంది. తన కూతురు సుప్రీతతో కలిసి ఎక్కడికెళ్లినా ఫోటోలను షేర్ చేస్తోంది. View this post on Instagram A post shared by Bandaru Sheshayani Supritha (@_supritha_9) -
సమంత బర్త్ డే స్పెషల్.. ఫుల్ యాక్షన్ వీడియో రిలీజ్
ఇవాళ హీరోయిన్ సమంత పుట్టిన రోజు కావడంతో స్పెషల్ వీడియో రిలీజైంది. సామ్‌కు బర్త్ డే విషెస్ చెబుతూ ప్రశంసలు కురిపించారు మా ఇంటి బంగారం టీమ్. ఈ ప్రత్యేకమైన రోజున రిలీజ్ చేసిన వీడియో సామ్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ చిత్రంలో సామ్ ఫైట్ సీన్స్ అద్భుతంగా ఉండనున్నట్లు వీడియో చూస్తే తెలుస్తోంది.ఈ సందర్భంగా సామ్ నటనపై ప్రశంసలు కురిపించారు. సమంత స్టంట్స్ అదరగొట్టేశారని హాలీవుడ్ యాక్షన్ కొరియోగ్రాఫర్ లీ కొనియాడారు. సమంతను బీస్ట్ అంటూ ఆకాశానికెత్తారు. ఎలాంటి సీన్స్‌లోనైనా అద్భుతంగా చేయగలదని డైరెక్టర్ నందిని రెడ్డి ప్రశంసించారు. సామ్ అద్భుతమైన ప్రతిభ కలిగిన నటి అని డీవోపీ ఓంప్రకాశ్ అన్నారు. ఆమె యాక్షన్ సీన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని తెలిపారు. సామ్ భర్త, డైరెక్టర్ రాజ్ నిడిమోరు సైతం సమంత నటన ఆడియన్స్‌కు కనెక్ట్ అవుతుందన్నారు. అభిమానులకు విపరీతంగా నచ్చుతుందని తెలిపారు. కాగా.. సమంత తన సొంతం బ్యానర్లో నిర్మిస్తోన్న ఈ చిత్రం మే 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
పోలీసులకు పుట్టినరోజు, వివాహ వార్షికోత్సవానికి సెలవులు
సాక్షి, హైదరాబాద్: నిత్యం ఒత్తిడితో కూడిన ఉద్యోగంలో ఉండే పోలీసులకు ఊరటనిచ్చేలా తెలంగాణ పోలీస్‌శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. సిబ్బంది వ్యక్తిగత జీవితం, ఉద్యో గం మధ్య సమ తుల్యత పెంపొందించాలనే లక్ష్యంతో వారి పుట్టిన రోజు, వివాహ వార్షి కోత్సవాల సందర్భంగా సెల వులు మంజూరు చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు డీజీపీ బి.శివధర్‌రెడ్డి ఒక సర్క్యులర్‌ను విడుదల చేశారు. అందులో పేర్కొన్న ప్రకారం..పోలీస్ శాఖలో పనిచేసే సిబ్బంది అందరికీ వారి పుట్టినరోజు, వివాహ వార్షికోత్సవం రోజున కుటుంబ సభ్యులతో గడిపే అవకాశం కల్పించ డమే ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు.అయితే ఇందుకు కొన్ని షరతులు ఉన్నట్టుగా సర్క్యు లర్‌లో తెలి పారు. ఈ సెలవులను హక్కుగా పరిగణించరాదు. అత్యవసర పరిస్థి తులు మినహా సాధ్యమైనంత వరకు మంజూరు చేయాలని యూనిట్ అధికారు లకు సూచించారు. సర్వీస్ రికార్డు ప్రకారం సరైన ధ్రువీక రణ ఉండాలి. అదేవిధంగా సెలవు కోరు తున్న సిబ్బంది ముందస్తు లిఖితపూర్వక అభ్యర్థన అవసరం. అత్యవసర పరిస్థితుల్లో సెలవు నిరాకరించే అధికారం అధికారులకు ఉంటుంది. కాగా, ఈ నిర్ణయం ద్వారా పోలీసు సిబ్బందిలో మనోధైర్యం పెంపొందడమే కాకుండా కుటుంబ బంధాలు బలపడతాయని అధికారులు భావిస్తున్నారు. -
తెలంగాణ పోలీసులకు శుభవార్త
సాక్షి,హైదరాబాద్: తెలంగాణ పోలీసులకు శుభవార్త. పోలీసుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఇకపై ప్రతి పోలీసు ఉద్యోగికి వారి పుట్టినరోజు, వివాహ వార్షికోత్సవం రోజున ప్రత్యేక సెలవు మంజూరు చేయాలని డీజీపీ బి. శివధర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.పోలీసులు విధుల్లో తీవ్ర ఒత్తిడిలో పనిచేస్తూ వ్యక్తిగత జీవితానికి సమయం కేటాయించలేకపోతున్నారని గుర్తించిన డీజీపీ, వారి మానసిక ఉల్లాసం, కుటుంబ బంధాలు బలోపేతం చేయాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. కుటుంబ సభ్యులతో ముఖ్యమైన సందర్భాలను ఆనందంగా గడిపే అవకాశాన్ని కల్పించడమే లక్ష్యమన్నారు.అత్యవసర పరిస్థితులు మినహా అన్ని యూనిట్ అధికారులు సంబంధిత సిబ్బందికి సెలవులు మంజూరు చేయాలని ఆదేశించారు. సరైన ఆధారాలు, ముందస్తు దరఖాస్తు ఆధారంగా ఈ సెలవులు మంజూరు చేయనున్నట్లు స్పష్టం చేశారు. డీజీపీ తీసుకున్న ఈ నిర్ణయంపై పోలీసు సిబ్బందిలో ఆనందం వ్యక్తమవుతోంది. తెలంగాణ పోలీసు శాఖలో ఇది మరో సంక్షేమ చర్యగా నిలిచే అవకాశం ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. -
అమ్మ ఆశీర్వాదంతో...
ముంబై: భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ శుక్రవారం తన 53వ పుట్టిన రోజును ఘనంగా జరుపుకున్నాడు. సచిన్ ఇంటి వద్ద పెద్ద ఎత్తున అభిమానుల సందడి కనిపించింది. వారి మధ్య అతను బర్త్‌డే కేక్‌ను కట్ చేశాడు. అంతకుముందు ఈ రోజు గొప్పగా మొదలైందంటూ తన తల్లి రజని, భార్య అంజలి, పెంపుడు కుక్కతో కలిసి ఉన్న ఫోటోతో సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ‘ఆయి (అమ్మ), అంజలి, నన్ను ఇబ్బంది పెట్టేవాడితో రోజు అద్భుతంగా మొదలైంది. ఇంతకంటే ఇంకేం కావాలి’ అని సచిన్ వ్యాఖ్యను జోడించాడు. సచిన్‌కు అతని మాజీ సహచరులు హర్భజన్ సింగ్, యువరాజ్ సింగ్ తదితరులు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. 24 ఏళ్ల సుదీర్ఘ కెరీర్లో సచిన్ 200 టెస్టుల్లో 15,921 పరుగులు...463 వన్డేల్లో 18,426 పరుగులు సాధించాడు. రెండు ఫార్మాట్లలో అత్యధిక పరుగుల రికార్డు అతని పేరిటే ఉంది. టెస్టుల్లో అత్యధిక సెంచరీలు (51) చేసిన ఆటగాడైన సచిన్ ఖాతాలో 49 వన్డే శతకాలు ఉన్నాయి. -
తండ్రికి శ్రీముఖి బర్త్ డే విషెస్ (ఫొటోలు)
-
క్రికెట్ గాడ్ సచిన్ టెండుల్కర్ బర్త్‌డే.. ఈ ఫొటోలు చూశారా?
-
వైరుధ్యం వైవిధ్యాల విలక్షణ గాయని జానకి
నదులెన్నో ఉంటాయి... నదులలో గంగానది ప్రత్యేకతే వేరు... కారణం ఆ నది అనేక స్థలాలను స్పృశిస్తూ వాటిని క్షేత్రాలుగా మార్చటమే కాకుండా తన పేరును కూడా మార్చుకుంటుంది... అలాగే నేపథ్య గాయనీమణులెందరో ఉన్నా ఎస్. జానకి ప్రత్యేకతే వేరు. ఎందరో సంగీత దర్శకుల పాటలకు తన గాత్రంతో న్యాయం చేసి, వారి పేరు నిలబెట్టారు జానకమ్మ.గళంలో మాధుర్యం, స్థాయితో పాటు అనుకరణ కళ జానకమ్మ ప్రత్యేకత. తన గాత్రం ద్వారా ఆమె ఆరేళ్ల పాప మొదలు అరవై ఏళ్ల అమ్మమ్మ వరకు ఆయా పాత్రలను ఆవిష్కరించారు. అటు శాస్త్రీయ సంగీతాన్ని, ఇటు జానపద సంగీతాన్ని అలవోకగా ఆలపించారు. నవరసాలను పలికించే అద్వితీయ స్వరం కలిగిన అపర గాన సరస్వతి. భక్తి, రక్తి, ముక్తి, శక్తి... ఇలా ఏ పాటకైనా న్యాయం చేసే ఏకైక గాయని. ఏ శ్రుతిలోనైనా పాడగలిగే విలక్షణ ప్రతిభామణి... ఇంత వైరుధ్యం, వైవిధ్యం కలిగి ఉండటం అరుదాతి అరుదు. ముఖ్యంగా చెప్పాలంటే స్వరానుకరణలో ఆమెకు ఆమే సాటి... ఆమెకు లేరు పోటీ.నీ లీల పాడెద దేవా...: జానకమ్మ టాలెంట్ తొలిసారి ‘మురిపించే మువ్వలు’ (1962) చిత్రం ద్వారా బయటపడింది. ఈ సంగీత నృత్య చిత్రానికి ఎస్.ఎం. సుబ్బయ్య నాయుడు సంగీతం అందించారు. సన్నివేశం ప్రకారం ఇది నాద స్వరంతో పోటీ పడుతూ సాగే శాస్త్రీయ సంగీతంలో పాడాల్సిన పాట. ఈ పాట బాణీని విన్న తర్వాత లీల తాను అంత హై పిచ్‌లో పాడలేనని చెప్పి జానకమ్మ పేరును సూచించారు. ఆ విధంగా జానకి తొలుత తమిళంలో ‘సింగార వేలనే దేవా’ అని పాడి తెలుగులో ఆరుద్ర రాసిన ‘నీ లీల పాడెదా దేవా...’ పాటను అవలీలగా పాడారు. ఇందులో ఆమె నాద స్వరంతో పోటీగా స్వర కల్పన చేయడం న భూతో న భవి ష్యతి. ప్రఖ్యాత సంగీత విద్వాంసుడు కారుకురిచ్చి అరుణాచలం నాద స్వరం వాయించగా, జానకి నాద స్వరం శ్రుతిలోనే ఆలపించడం విశేషం. కారణం నాద స్వరం ‘హై పిచ్’లో ఉంటుంది. ఇలా నాద స్వరంతో పోటీ పడుతూ ‘సన్నాయి అప్పన్న’ (1980) చిత్రంలోనూ జీకే వెంకటేశ్ సంగీతంలో ‘కదిలించు నీ కలికి హృదయం’ పాటను మన హృదయాలు కరిగించేలా పాడారు జానకమ్మ. ఈ పాటకు ప్రముఖ సంగీత విద్వాంసుడు బిస్మిల్లా ఖాన్ హిందుస్థానీ సంగీతంలో ప్రముఖ వాద్యమైన షెహనాయ్ను వాయించడం విశేషం. షెహనాయ్, నాద స్వరాలతో పాటు వేణువుతో పోటీపడుతూ ‘సప్త పది’ (1981)లో ‘నెమలికి నేర్పిన నడకలివే’ పాటను అదే శ్రుతిలో పాడి అలరించారు జానకమ్మ. సిరిమల్లె పువ్వల్లె నవ్వు...: మామూలుగా సాహిత్యం లేకుండా కేవలం లయ బద్ధంగా నవ్వుతూ పాటను రక్తికట్టించడం ఆషామాషీ కాదు. కానీ జానకమ్మ ‘జ్యోతి’ (1976) చిత్రంలో తాళం ప్రకారం నవ్వి అందరినీ నివ్వెరపరచారు. చక్రవర్తి సంగీతంలో బాలుతో కలిసి పాడిన ‘సిరిమల్లె పువ్వల్లె నవ్వు... చిన్నారి పాపల్లే నవ్వు...’ పాటలో ఆమె ఆద్యంతం నవ్వుతో తన భావాలను వ్యక్తీకరించడం విశేషం. ఇందులో బాలు స్వరాలు పాడితే జానకమ్మ దానికి అవే స్వరాలను నవ్వుతో పలికించడం విశేషం.చలికి వణికినట్లుగా...: ‘శంకరాభరణం’ చిత్రంలో శంకరశాస్త్రి తన పదేళ్ళ కూతురు శారదను తెల్లవారు ఝామునే ఒక నదీ తీరంలో కంఠం లోతు వరకు కూచోబెట్టి సంగీత పాఠాలు బోధిస్తుంటాడు. ఈ సన్నివేశంలో జానకమ్మ బాలిక స్వరానికి తగ్గట్టు మాత్రమే కాకుండా అపస్వరం లేకుండా శ్రుతిలో పాడటం విశేషం. అలాగే ఒక చోట వేగంగా ఆలపించే స్వరాలను కూడా శిష్యురాలిలా తడబడుతూ పాడటం విశేషం. ఇదే చిత్రంలో పెళ్లి చూపుల సందర్భంలో శారద హిందోళ రాగంలో ‘సామజ వర గమనా’ అనే త్యాగరాజ కీర్తన పాడుతూ, అబ్బాయిని చూస్తూ ప్రేమ పారవశ్యంలో ఏకాగ్రత కోల్పోయి నిషిద్ధ స్వరాలైన రిషభ స్వరాన్ని స్పృశిస్తుంది. దాంతో శంకర శాస్త్రి... శుద్ద హిందోళం రాగంలో రిషభం ఎలా వచ్చింది? అని ఆగ్రహిస్తాడు. ఈ పాట శాస్త్రీయంగా మొదలై, మధ్యలో చరణాలలో నాయికా నాయకుల ప్రణయంతో విహరించి, పాట చివర ఆలాపనలో అన్య స్వర ప్రయోగంతో తప్పు పాడి, సంబంధమే కాదనుకొనే ప్రళయానికి దారి తీస్తుంది. బాలుర గొంతులను అనుకరిస్తూ...: ‘సప్తపది’లో ‘గోవుల్లు తెల్లన... గోధూళి తెల్లన... గోపయ్య నల్లన?’ అనే వర్ణ వివక్షతను ప్రశ్నిస్తూ రాసిన గీతాన్ని బాలుతో కలిసి రెండు గొంతులతో వైవిధ్యంగా పాడారు జానకమ్మ. ఈ రెండు గొంతులలో ఒకటి పదేళ్ల బాలుడైతే, మరోటి మూడేళ్ల వయసుగల బాబు కావడం విశేషం. మూడేళ్ల బాబు పాడినప్పుడు ఆ గొంతులో స్వరాలు కుదురుకోవు కాబట్టి శ్రుతిలో కాకుండా మామూలుగా పాడారు. కాస్త పరిణతి చెందాక శ్రుతి, లయ మాధుర్యం ఉంటాయి. ఈ వైవిధ్యాన్ని జానకమ్మ ఎంతో ప్రతిభతో చూపించారు. గోదావరి గల గలలలా...: 1964లో ‘పూజాఫలం’ సినిమాలో ఘనం శీనయ్య రాసిన ‘పదం’ ను కురంజి రాగంలో ఎస్. రాజేశ్వరరావు స్వరపరచగా జానకమ్మ సశాస్త్రీయంగా పాడారు. ఈ పదంలో ‘శీలమింతైన విడువ జాలను రా’ అన్న పంక్తిలో జానకమ్మ గాత్ర గమకాలు గోదావరి గల గలలను మించి జాలువారాయి. రాజ ఓ రాజ...: ‘చిలక జోస్యం’ (1983 ) సినిమాలో కేవీ మహదేవన్ సంగీతంలో బాలు, జానకి పాడిన ‘రాజ ఓ రాజ ఓ బాలరాజా..’ నవ్వుల వానలో ముంచెత్తించింది. ఈ పాటలో అల్లు రామలింగయ్య, రమాప్రభ అభినయించారు. వీటూరి రాసిన ఈ పాటలో ‘లైలాను నేను మజ్నూవు నీవు... మన ప్రేమ నగరు మాయా బజారు, యమగోల’ అని సాహిత్యమంతా అక్కినేని, ఎన్.టి.ఆర్ నటించిన చిత్రాల పేర్లతో రూపొందించింది కావడం విశేషం. పాటలో... ‘నీ కులుకులు, నీ తళుకులు, గిలి గిలి’ అన్నపుడు జానకమ్మ మత్తుగా నవ్విన తీరు పాటకు బోనస్. ‘శివ’ (1989) సినిమా కోసం ఇళయరాజా స్వరపరచిన ‘సరసాలు చాలు శ్రీవారు’ పాటలో జానకమ్మ ఎక్స్ప్రెషన్స్ శృంగార రస తరంగాలలో ఓలలాడించే విధంగా ఉన్నాయి.హమ్మింగ్లో అభివ్యక్తులు: కొన్ని పాటల్లో ఒక్కోసారి నాయకుడు మాత్రమే పాటను ఆలపిస్తుంటాడు... నాయిక హమ్మింగ్ చేస్తుంది. తెలుగు సినిమాలలో జానకమ్మే ఈ హమ్మింగ్లను పాడటం విశేషం. అంతేకాదు... ఆ... ఊ... ఆహా... ఓహో అని మాత్రమే అంటూ భావాన్ని వ్యక్తం చేసిన ఘనత ఆమెది. ‘సిరి సంపదలు’ (1964) చిత్రంలో ఘంటసాలతో పాడిన ‘ఈ పగలు రేయిగా పండు వెన్నెలగ మారినదేమి చెలీ..’ అని ప్రశ్నిస్తే, హీరో వెంటనే ‘వింత కాదు, నా చెంత నా ప్రియురాలు ఉండటమే సుమీ’ అని జవాబు చెప్పి సమర్థించుకొంటాడు. ఈ పాటలో ప్రశ్నకు... జవాబుకు సైతం జానకమ్మ ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ వర్ణనాతీతం. ఆలాపనలో ఆకర్షణలు...: ‘రావణుడే రాముడైతే’ (1978) చిత్రంలో జీకే వెంకటేశ్ సంగీతంలో ‘రవివర్మకే అందని ఒకే ఒక అందానివో’ పాట జానకమ్మ ఆలాపనతో మొదలవుతుంది. పాట తాలూకు ప్రతి చరణాంతంలో ఆమె తారా స్థాయిలో (సా..ని ని పా..ప ని రీ) చేసిన ఆలాపన రవి వర్మ చిత్రాన్ని స్వరచిత్రం చేస్తుంది. ‘ఆకలి రాజ్యం’ (1980)లో ‘తన్న నన్న నాన తన్న నన్న’ అని ట్యూన్ మాత్రమే ఇస్తూ హీరో పాట సాహిత్యాన్ని రాయించే గీతంలో పాట ఆద్యంతం నాయిక భావాలకు తగ్గట్టుగా నాయ కుడు సాహిత్యాన్ని ఎలా అందిస్తాడోనని ఆసక్తి కలుగుతుంది. పడుచు పిల్ల... ముసలి అవ్వల గాత్రానుకరణ...: ‘శ్రీవారికి ప్రేమ లేఖ’ (1984) కోసం రమేశ్ నాయుడు స్వరపరచిన పాటలో నాయిక ప్రేమలేఖ రాస్తూ ‘తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు’ అంటూ సాగే పాటలో ఊర్పులు, నిట్టూర్పులను జానకమ్మ పలికించిన తీరు మాటలకందనిది. ‘శ్రీవారి శోభనం’ (1985) చిత్రంలో వేటూరి రాసిన ‘అలక పానుపు ఎక్కనేల చిలిపి గోరింక’ పాటను రమేశ్ నాయుడు సంగీతంలో అటు పడుచు పిల్ల వలె ఇటు ముసలి అవ్వ వలె గొంతు మారుస్తు పాడటం జానకమ్మకే చెల్లింది.వీణలో లీనమైన గానం: ‘ఓ వీణ చెలి నా ప్రియ సఖి’ (చంద్రహాస 1965) వంటి వీణ పాటలు జానకమ్మ గాత్ర వైవిధ్యానికి మెచ్చు తునకలు. హనుమంత రావు స్వరపరచిన ఈ గీతంలో జానకమ్మ వీణతో పోటీ పడి పాడారు. ఇక నవరసభరితమైన గీతాలలో.. ‘ఇల్లు ఇల్లాలు’ (1972) చిత్రంలో కేవీ మహదేవన్ సంగీతంలో ‘వినరా సూరమ్మ కూతురు మగడా...’ అంటూ జానకమ్మ, రాజబాబు పాడిన హాస్య గీతం ఆల్ టైం హిట్ అయింది. అప్పలాచార్య రాసిన ఈ పాట బుర్ర కథలాగా మొదలవుతుంది.ఎదలో లయ ఎగసే...: ‘నీరాజనం’ (1988)లో ఓపీ నయ్యర్ సంగీతంలో సినారె రాసిన ప్రణయ గీతం ‘నిను చూడక నేనుండలేను’లో బాలు గాత్రానికి దీటుగా జానకమ్మ ఆలాపనలు స్వరామృత గుళికలే. ‘అన్వేషణ’ (1985) చిత్రంలో వేటూరి రాసిన ‘ఎదలో లయ ఎగసే లయ’ పాట పాడిన తీరు గురించి రాయడానికి పదాలు లేవు. ఈ సన్నివేశానికి గాను ఇళయరాజా స్వరకల్పనలో జానకమ్మ పాడిన తీరు అలరిస్తుంది. ఇలా జానకమ్మ గురించి ఎంతైనా చెప్పుకోవచ్చు... ఆమె ఓ ప్రవహించే జీవనది ... ఆ నదిలో నుంచి ఎంతైనా స్వీకరించవచ్చు... అనుభూతికి ఆకాశమే హద్దు.– డాక్టర్ వి.వి. రామారావు(రచయిత, గాయకుడు, వ్యాఖ్యాత) -
హీరోయిన్ ఈషా రెబ్బా బర్త్ డే మూమెంట్స్ (ఫొటోలు)
-
సిద్ధార్థ్ బర్త్‌డే.. స్పెషల్ ఫోటోలు షేర్ చేసిన అదితి రావు హైదరి (ఫొటోలు)
-
రూ.కోట్లు కాజేశాడు.. జల్సా చేస్తున్నాడు!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) సృష్టికర్త, వివాదాస్పద వ్యాపారవేత్త లలిత్ మోడీ మరోసారి వార్తల్లో నిలిచారు. విలాసవంతమైన జీవనశైలికి పెట్టింది పేరుగా నిలిచే మోడీ, తన కుమారుడికి ఇచ్చే ఖరీదైన బహుమతుల గురించి సంచలన విషయాలను పంచుకున్నారు. ఇటీవల మాజీ క్రికెటర్ మైఖేల్ వాఘన్‌తో జరిగిన ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితం, తన కుమారుడి వద్ద ఉన్న అరుదైన కార్ల సేకరణ గురించి ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.ప్రతి పుట్టినరోజుకూ ఒక ఫెరారీ!తన చిన్నతనంలో తండ్రి తనకు కారు కొనివ్వలేదన్న వెలితిని గుర్తు చేసుకుంటూ తన కుమారుడికి అలాంటి పరిస్థితి రాకూడదనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు మోడీ తెలిపారు. ‘నేను ఎదుగుతున్న క్రమంలో మా నాన్న నాకు ఫెరారీ కొనివ్వడానికి ఎప్పుడూ నిరాకరించేవారు. అది చాలా వేగంగా వెళ్తుందని, ప్రమాదకరమని ఆయన భావించేవారు. కానీ నాకు ఫెరారీ అంటే ప్రాణం. నా 40వ పుట్టినరోజున మా బంధువు నాకు మొదటి కారును బహుమతిగా ఇచ్చారు. అప్పుడే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. నా కుమారుడికి 21 ఏళ్లు నిండినప్పటి నుంచి ప్రతి పుట్టినరోజుకూ ఒక ఫెరారీ కారును బహుమతిగా ఇస్తున్నాను’ అన్నారు.ప్రస్తుతం మోడీ కుమారుడి వయస్సు 32 ఏళ్లు. అంటే, గత 11 ఏళ్లుగా వరుసగా ఆయనకు ఫెరారీ కార్లు అందుతూనే ఉన్నాయి. ఫలితంగా, ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యుత్తమ, ఎక్కువ ఫెరారీ కార్ల సేకరణ కలిగిన వ్యక్తుల్లో ఒకరిగా ఆయన నిలిచారు.లండన్‌లో తలదాచుకుంటున్న మోడీఒకవైపు కొడుకు కోసం కోట్లు కుమ్మరిస్తూ వార్తల్లో నిలుస్తున్న లలిత్ మోడీ, మరోవైపు భారత చట్టాల నుంచి తప్పించుకుని లండన్‌లో తలదాచుకుంటున్నారు. వివిధ అంచనాల ప్రకారం మోడీ నికర ఆస్తి విలువ 500 మిలియన్ డాలర్ల నుంచి 600 మిలియన్ డాలర్ల (సుమారు రూ.4,000 - రూ.5,000 కోట్లు) వరకు ఉంటుందని సమాచారం. అయితే విదేశాల్లో ఉన్న పెట్టుబడుల కారణంగా దీనిపై కచ్చితమైన అధికారిక లెక్కలు లేవు.ఐపీఎల్ ఛైర్మన్‌గా ఉన్న సమయంలో ఆర్థిక అవకతవకలకు, నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారనే ఆరోపణలతో 2013లో బీసీసీఐ ఆయనపై జీవితకాల నిషేధం విధించింది. 2010 నుంచి లండన్‌లో నివసిస్తున్న మోడీ తనపై ఉన్న ఆరోపణలన్నీ రాజకీయ ప్రేరేపితమని కొట్టిపారేస్తున్నారు. మనీలాండరింగ్ కేసుల్లో ఆయనను భారత్ రప్పించేందుకు దర్యాప్తు సంస్థలు ప్రయత్నిస్తూనే ఉన్నాయి. కోట్ల రూపాయల ప్రజాధనాన్ని కాజేశారనే ఆరోపణలు ఒకవైపు, విదేశీ గడ్డపై విలాసవంతమైన జీవితం, ఖరీదైన కార్ల వేలంపాటలు మరోవైపు.. లలిత్ మోడీ వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది. భారత చట్టాలకు చిక్కకుండా ఆయన సాగిస్తున్న ఈ రాయల్ జీవితంపై సామాన్యుల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.ఇదీ చదవండి: అంతర్జాలంలో సగానికి పైగా ఏఐ రాతలే! -
చియాన్ విక్రమ్ కొత్త సినిమా.. టీజర్ రిలీజ్
కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ మరో మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. తంగలాన్ తర్వాత మరో యాక్షన్ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా ఆయన కెరీర్లో 63వ చిత్రంగా నిలవనుంది. ఈ సినిమాకు ఆనంద్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. సత్యజ్యోతి ఫిలింస్, టీజీ త్యాగరాజన్ సమర్పణలో సెంధిల్ త్యాగరాజన్, అర్జున్ త్యాగరాజన్ నిర్మిస్తున్నారు.తాజాగా ఈ మూవీకి సంబంధించి క్రేజీ అప్డేట్ ఇచ్చారు. ఇవాళ చియాన్ విక్రమ్ బర్త్ డే కావడంతో ఫస్ట్ లుక్‌తో పాటు టీజర్ రిలీజ్ చేశారు. ఫస్ట్ ఫ్లేమ్ పేరుతో ఈ మూవీ టీజర్ విడుదల చేశారు. ఇందులో విక్రమ్ లుక్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. టీజర్ చూస్తుంటే ఫుల్ మాస్ యాక్షన్ మూవీగా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు సంతోశ్ నారాయణన్ సంగీతమందిస్తున్నారు. What starts as a FLAME ends in a BLAZE 🔥 #Chiyaan63 FIRST FLAME out now ▶️ https://t.co/2FnD5WetinWishing the one and only #ChiyaanVikram a very happy birthday!#CookingStartsNow #Chiyaan63FirstFlame@SathyaJyothi @chiyaan @anandshank @Music_Santhosh @RDRajasekar @arjun1on… pic.twitter.com/w6UTCR34tP— Sathya Jyothi Films (@SathyaJyothi) April 17, 2026 -
ప్రియుడికి బర్త్ డే గిఫ్ట్ ఇచ్చేందుకు..
హైదరాబాద్: ప్రియుడికి బర్త్‌డే గిఫ్ట్ ఇచ్చేందుకు చోరీ బాట పట్టింది ఓ ప్రియురాలు. సీసీ ఫుటేజీకి చిక్కి అరెస్టయింది. ఈ ఘటన జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. ఖమ్మం జిల్లాకు చెందిన యువతి (26) బీటెక్ చదివింది. నగరానికి వచ్చి ఓ ప్రైవేటు సంస్థలో పని చేస్తూ హాస్టల్లో ఉంటోంది. ఇదే జిల్లాకు చెందిన ప్రైవేటు ఉద్యోగి కొత్త మురళీధర్‌గౌడ్ (29)తో కొంతకాలంగా ప్రేమలో ఉంది. మూడు రోజుల క్రితం ప్రియుడి బర్త్‌డేకు ఖరీదైన గిఫ్ట్ ఇచ్చేందుకు మురళీధర్ గౌడ్ కారులో జూబ్లీహిల్స్ రోడ్డునెంబర్–36లోని రమేష్ వాచ్ కంపెనీకి వచి్చంది. మురళీధర్‌ను కారులోనే కూర్చోమని షోరూంలోకి వెళ్లింది. వాచీలను చూపించాలని సేల్స్‌మన్‌ను అటూ ఇటూ తిప్పుతూ అప్పటికే అక్కడ ఉంచిన ఒక్కొక్కటి రూ.లక్ష ఖరీదు చేసే రెండు టిస్సాట్ వాచీలను చాకచాక్యంగా బ్యాగ్‌లో వేసుకుంది. వాచీలు నచ్చలేదంటూ బయటకు వెళ్లిపోయింది. కొద్దిసేపటి తర్వాత సేల్స్‌మన్ గమనించగా అక్కడ రెండు వాచీలు కనిపించలేదు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు సీసీ ఫుటేజీలను పరిశీలించగా యువతి రెండు వాచీలను హ్యాండ్‌బ్యాగ్‌లో వేసుకున్నట్లు కనిపించింది. కారు నంబర్ ఆధారంగా పోలీసులు ఖమ్మంలో యువతిని అరెస్టు చేశారు. యువతి దొంగతనంతో ప్రియుడిపైనా కేసు నమోదైంది. ఇద్దరినీ అరెస్టు చేశారు. -
రిక్షా డ్రైవర్ కొడుకు, అమెరికాలో టెకీ, అంతలోనే విషాదం
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 26 ఏళ్ల సాఫ్ట్వేర్ నిపుణుడి అకాలమరణం దిగ్భ్రాంతికి గురిచేసింది. అమెరికాలో స్నేహితులతో కలిసి తన పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్న సమయంలో ఈ విషాదం చోటు చేసుకోవడంతో అతని కుటుంబంలోతీవ్ర విషాదం నెలకొంది. అతని స్వగ్రామం విజయనగరం జిల్లా, బొబ్బిలి మండలం, పిరిడిలో విషాద ఛాయలు అలుముకున్నాయి.ఏపికి చెందిన సింగిరెడ్డి సాయి శ్రీ హరి కృష్ణ, మిస్సోరీలోని Sullivan సమీపంలో ఉన్న Meramec State Park వద్ద తన స్నేహితులతో కలిసి బర్త్‌డే వేడుకలు జరుపుకునేందుకు వెళ్లాడు. ఈ సందర్భంగా స్నేహితులతో కలిసి ఒక రిసార్ట్‌లో బస చేశారు. ఆ తర్వాత హరి కృష్ణ ఈత కొట్టేందుకు Meramec నదిలోకి దిగాడు. అయితే నీటి అడుగున కలుపు మొక్కల్లో చిక్కుకున్న అతను పైకి రాలేక మృత్యవాతపడ్డాడు.టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్ట్ ప్రకారం నీటి అడుగున ఉన్న కలుపు మొక్కల్లో చిక్కుకుపోవడంతో అవి అతన్ని నీటిలోకి లాగేశాయని అధికారులు తెలిపారు. అతను బయటపడేందుకు తీవ్రంగా పోరాడినా ఫలితం లేకపోయింది. అనంతరం Sullivan అగ్నిమాపక శాఖ సిబ్బంది అతని మృతదేహాన్ని వెలికితీశారని Missouri రాష్ట్ర రహదారి గస్తీ దళం (State Highway Patrol) తెలిపింది.విజయనగరంలోని ఒక ప్రైవేట్ కళాశాల నుండి BTech పూర్తి చేసిన తర్వాత, హరి కృష్ణ 2023లో అమెరికాకు వెళ్ళాడు. అక్కడ ఇంజనీరింగ్‌లో మాస్టర్స్ డిగ్రీ పూర్తిచేసి కొన్ని నెలల క్రితమే, St Louis నగరంలోని 'Elessent Clean Technologies' సంస్థలో ఉద్యోగంలో చేరాడు. ముగ్గురు తోబుట్టువులలో అందరికంటే చిన్నవాడైన హరి కృష్ణకు, తల్లిదండ్రులు , వివాహమైన ఇద్దరు అక్కలు ఉన్నారు. తండ్రి శ్రీనివాసరావు ఆటో-రిక్షా డ్రైవర్‌గా పనిచేస్తుండగా, తల్లి రమాదేవి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పనిచేస్తున్నారు. ఆదుకుంటాడనుకున్న కుమారుడు అర్థాంతరంగా కన్నమూయడంతో అతని తల్లిదండ్రుల దుఃఖానికి అంతులేకుండా పోయింది. అతని మృతదేహాన్ని ఇండియాకు రప్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. -
'చిన్ననాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నా'.. రష్మిక ట్వీట్ వైరల్
ఈ ఏడాది పెళ్లి బంధంలోకి అడుగుపెట్టిన ముద్దు గుమ్మ రష్మిక మందన్నా. కొన్నేళ్లుగా విజయ్ దేవరకొండతో సీక్రెట్ రిలేషన్లో కన్నడ బ్యూటీ ఎట్టకేలకు పెళ్లాడింది. ఉదయ్‌పూర్‌లో వీరిద్దరి వెడ్డింగ్ గ్రాండ్‌గా జరిగింది. ఇటీవలే తన పెళ్లి తర్వాత తొలి బర్త్ డేను సెలబ్రేట్ చేసుకుంది. విజయ్‌తో పెళ్లి తర్వాత చేసుకున్న తొలి పుట్టినరోజు కావడంతో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. తాజాగా తన పుట్టినరోజు వేడుకకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.ఈ ఏడాది 30వ పుట్టినరోజు ఇంతకుముందు కంటే భిన్నంగా చేసుకున్నానంటూ ట్విటర్లో రాసుకొచ్చింది రష్మిక. చాలా రోజుల తర్వాత ఇంటికెళ్లానని.. అంతే కాకుండా చిన్నప్పటి నుంచి వెళ్తున్నా గుడికి కూడా వెళ్లానని ఆనందం వ్యక్తం చేసింది. సమయం లేకపోవడం వల్ల నా స్కూల్‌ను బయటి నుంచే చూశా.. అలా కాసేపు నా చిన్ననాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నానని చెప్పింది. ఈ రోజు నాకు ఎప్పటికీ తోడుగా ఉండబోయే వారి మధ్య కేక్ కట్ చేశానని సంతోషాన్ని పంచుకుంది. నేను పుట్టినప్పటి నుంచి ఈ రోజు వరకు నన్ను ఆశీర్వదిస్తున్న వారిని.. నా పెళ్లికి రాలేకపోయిన నా కుటుంబ సభ్యులను చిన్న డిన్నర్ పార్టీలో కలిశానని తెలిపింది. ఈ రోజు వరకు నా ప్రతి విషయంలో భాగమైన నా స్కూల్ ఫ్రెండ్స్.. కుటుంబంలా మారిన నా స్నేహితుల వరకు నా లైఫ్‌లో ప్రతీదీ ఒక మంచి కోసమే జరుగుతుందని నేను భావిస్తున్నానంటూ రష్మిక ట్వీట్ చేసింది. నా జీవితంలో ప్రతిదీ సార్థకమైనట్లు అనిపిస్తుందని రాసుకొచ్చింది. My 30th birthday was kinda different this time. ❤️Went back home after a while. Went to the temple I’ve grown up going to.. ❤️Went to my school and saw it from outside (because of time constraints 🐒🙈) and revisited childhood for a quick bit.. ❤️Cut the cake amongst the… pic.twitter.com/5ZGxuBpUAD— Rashmika Mandanna (@iamRashmika) April 9, 2026 -
కేవలం సినిమా మాత్రమే కాదు.. అంతకు మించి: రాకాపై అట్లీ ట్వీట్
ఐకాన్ స్టార్ అభిమానులకు ఈ రోజు పండగే. బన్నీ బర్త్ డే సందర్భంగా అదిరిపోయే సర్ప్రైజ్ ఇచ్చారు డైరెక్టర్ అట్లీ. ఎక్కడా లీక్ కాకుండా అల్లు అర్జున్- అట్లీ కాంబోలో వస్తోన్న మూవీ టైటిల్ రివీల్ చేశారు. బన్నీ పుట్టినరోజున మూవీ టైటిల్ ప్రకటించారు. అంతేకాకుండా ఫస్ట్ లుక్ పోస్టర్ ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. తొలిసారి వీరిద్దరి కాంబినేషన్లో వస్తోన్న మూవీకి రాకా అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ ఫిక్స్ చేశారు.ఈ సందర్భంగా డైరెక్టర్ అట్లీ.. హీరో అల్లు అర్జున్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. హ్యాపీ బర్త్ డే అల్లు అర్జున్ సార్ అంటూ ట్విటర్లో రాసుకొచ్చారు. రాకా కేవలం సినిమా మాత్రమే కాదన్నారు. కొన్నేళ్లుగా నా వెంట మోసుకొస్తున్న భాగమన్నారు. 18 ఏళ్లుగా ఒకే ఒక్క ఆలోచనతో ఉన్నా.. అది ఎప్పటికీ మసకబారకుండా చూసుకున్నానని అట్లీ ట్వీట్ చేశారు. అది నన్ను పరీక్షించడమే కాకుండా తీర్చిదిద్దేలా చేసిందన్నారు. ప్రతి సందర్భంలోనూ నాకు తోడుగా నిలిచిందని రాసుకొచ్చారు. నిజం చెప్పాలంటే... ఇది కేవలం ఆరంభం మాత్రమేనని అట్లీ పోస్ట్ చేశారు. #Raaka isn’t just a film… it’s a part of me I’ve carried for years. For 18 years, I held on to one idea, never letting it fade.It tested me, shaped me, and stayed with me through everything. And honestly… this is just the beginning#HappyBirthdayAlluArjun sir@alluarjun… pic.twitter.com/UuKdpJRChs— atlee (@Atlee_dir) April 8, 2026 -
బర్త్‌డే స్పెషల్.. బన్నీ అరుదైన రికార్డులివే! (ఫోటోలు)
-
స్టైలిష్ స్టార్ టూ ఐకాన్ స్టార్.. ఆ పేరు ఎలా వచ్చిందంటే?
మెగా కుటుంబం నుంచి వచ్చి తనదైన స్టైల్లో టాలీవుడ్లో ప్రత్యేక ఇమేజ్ తెచ్చుకున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. ఆ స్టైలిష్ స్టార్ ఇప్పుడు ఏకంగా ఐకాన్ స్టార్ అయ్యాడు. తన మొదటి సినిమా ‘గంగోత్రి’ నుంచి పుష్ప-2 వరకూ బన్నీ చేసిన ప్రతి సినిమాలో కొత్త రకమైన వైవిధ్యం ఉంటుంది. మాస్, క్లాస్‌తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఇలా అందరిని మెప్పిస్తూ స్టార్ హీరోగా ఎదిగాడు. ప్రతి సినిమాలో తనకంటూ ప్రత్యేక స్టైల్ ఫాలో అవుతూ స్టైలిష్ స్టార్‌గా పేరు తెచ్చుకున్నారు. టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్ సెట్ చేసిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు (ఏప్రిల్ 8) నేడే. ఈ సందర్భంగా బన్నీ సినీ కెరీర్‌పై ఓ లుక్కేద్దాం.చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఎంట్రీ..టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన విజేత(1985) సినిమాలో బాలనటుడిగా నటించి మెప్పించిన బన్నీ.. ఆ తర్వాత 1986లో వచ్చిన స్వాతిముత్యం సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా కనిపించారు. ఆ తర్వాత ఏకంగా 15 ఏళ్ల గ్యాప్ ఇచ్చి 2001లో వచ్చిన చిరంజీవి ‘డాడీ’ సినిమాలో అతిథి పాత్రలో ఆకట్టుకున్నారు. ఆ సినిమాలో డ్యాన్స్ మాస్టర్ చిరంజీవి స్టూడెంట్‌గా తనదైన స్టైల్లో స్టెప్పులతో అదరగొట్టాడు.హీరోగా గంగోత్రి.. మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు వేడుకల్లో ఓ సారి అల్లు అర్జున్ కూడా పాల్గొన్నాడు. చాలా మంది డ్యాన్స్ చేస్తుంటే బన్నీ కూడా స్టెప్పులతో అదరగొట్టేశారు. అదే టైమ్‌లో ఈ వేడుకలకు అతిథిగా వచ్చిన దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు చూపులు బన్నీపై పడ్డాయి. ఆయన వెంటనే బన్నీ తల్లి(నిర్మల)దగ్గరకు వెళ్లి ‘మీవాడు పెద్దయ్యాక.. నేనే హీరోగా చిత్రపరిశ్రమకు పరిచయం చేస్తానని చెప్పారు. అంతేకాదు అప్పుడు వంద రూపాయల నోటుని అడ్వాన్స్‌గా ఇచ్చి.. ఆ తర్వాత కొద్ది రోజులకు ‘గంగోత్రి’తో బన్నీని హీరోగా పరిచయం చేశారు రాఘవేంద్రరావు. ఆ వంద రూపాయల నోటు ఇప్పటికీ అల్లు అర్జున్ దగ్గరే ఉందట.రెండో సినిమాకే నంది అవార్డు..ఆ తర్వాత క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ 'ఆర్య'(2004) సినిమాలో లవర్ బాయ్‌గా నటించి హీరోగా తనదైన ముద్ర వేశాడు. ఈ సినిమాలో అల్లు అర్జున్ నటనకు నంది అవార్డు లభించింది. ఇక మూడో చిత్రం ‘బన్నీ’తో హ్యాట్రిక్ హిట్ కొట్టాడు. ఈ సినిమా తర్వాతే అల్లు అర్జున్‌ని అంతా బన్నీ అని పిలవడం మొదలు పెట్టారు.బన్నీ వల్లే టాలీవుడ్‌కు సిక్స్ పాక్..టాలీవుడ్‌కి సిక్స్ ప్యాక్ బాడీని పరిచయం చేసింది కూడా అల్లు అర్జునే. దేశ ముదురు చిత్రంలో అల్లు అర్జున్ తొలిసారిగా సిక్స్‌ప్యాక్‌తో కనిపించాడు. సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. ఈ మూవీలో హన్సిక హీరోయిన్గా నటించింది. 'గంగోత్రి'లో అమాయకుడిగా కనిపించే బన్నీ 'దేశముదురు'లో మాత్రం సన్యాసిని సైతం ప్రేమలో పడేసే తెలివైనోడిగా అలరించాడు. బన్నీ తర్వాతే రామ్ చరణ్, ఎన్టీఆర్, ప్రభాస్, నాగార్జున, నితిన్ చాలామంది టాలీవుడ్ హీరోలు సిక్స్ ప్యాక్‌లో కనిపించారు.ఐకాన్ స్టార్‌గా అల్లు అర్జున్..మొదట్లో అందరు అల్లు అర్జున్‌ని స్టైలిష్ స్టార్ అని పిలిచేవారు. ఆ తర్వాత క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ బన్నీకి మరో బిరుదు ఇచ్చాడు. ఆయన దర్శకత్వంలో వచ్చిన 'పుష్ప'తో ఐకాన్ స్టార్‌గా అయిపోయారు. వీరిద్దరి కాంబోలో వచ్చిన పుష్ప, పుష్ప-2 చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ హిట్స్‌గా నిలిచాయి. ప్రస్తుతం అల్లు అర్జున్ కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీతో మూవీ చేస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ భామ దీపికా పదుకొణె హీరోయిన్గా కనిపించనుంది. -
' నా చావుకు మరో ఏడాది దగ్గరయ్యా'.. ఆర్జీవీ ఆసక్తికర పోస్ట్
టాలీవుడ్ డైరెక్టర్ రాం గోపాల్ వర్మ స్టైలే వేరు. తనకంటూ ప్రత్యేక బ్రాండ్ క్రియేట్ చేసుకున్న కొద్దిమంది డైరెక్టర్లలో ఆర్జీవీ ఒకరు. ఆయన ఏం మాట్లాడినా సరే అందులో ఓ ప్రత్యేకమైన శైలి ఉంటుంది. రోటీన్‌కు భిన్నంగా తన పంచ్‌లతో ఆకట్టుకుంటారు. అలా టాలీవుడ్లో విలక్షణ దర్శకుడిగా రాం గోపాల్ వర్మ అభిమానుల గుండెల్లో స్థానం దక్కించుకున్నారు.ఇవాళ ఆర్జీవీ మరో వసంతంలోకి అడుగుపెట్టారు. ఏప్రిల్ 7న రాం గోపాల్ వర్మ బర్త్ డే కావడంతో తనదైన స్టైల్లో మరో ట్వీట్ చేశారు. ఈ రోజు నేను నా చావుకు మరో ఏడాది దగ్గరయ్యానంటూ సెటైరికల్ పోస్ట్ చేశారు. అందువల్ల మీకు సంతోషం కలిగించే మరే ఇతర కారణాల కోసమైతే తప్ప.. ఈ రోజును వేడుకలా జరుపుకోవద్దు! ధన్యవాదాలు.. అంటూ రాసుకొచ్చారు. ఇది చూసిన కొందరు అభిమానులు ఆర్జీవీకి జన్మదిన శుభాకాంక్షలు చెబుతున్నారు. Today i reached 1 more year closer to my death and so let’s not celebrate unless for whatever reasons that makes you happy ! Thanks 💐💐💐 pic.twitter.com/mkKLW9G32t— Ram Gopal Varma (@RGVzoomin) April 7, 2026 -
దేవరకొండతో పెళ్లి తర్వాత తొలి బర్త్ డే.. సెలబ్రేషన్స్ చూశారా?
టాలీవుడ్ హీరోయిన్ రష్మిక మందన్నా తన పుట్టినరోజును గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంది. విజయ్ దేవరకొండతో పెళ్లి తర్వాత మొదటి పుట్టిన రోజును మరింత స్పెషల్‌గా జరుపుకుంది. ఇరువురి కుటుంబ సభ్యుల సమక్షంలో తన బర్త్ డే రోజు మరింత ఆనందంగా గడిపింది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఏప్రిల్ 5న రష్మిక పుట్టిన రోజు సందర్భంగా పలు చిత్రాల మేకర్స్ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. విజయ్‌తో పెళ్లి తర్వాత జరిగిన పుట్టినరోజు కావడంతో మరింత ప్రత్యేకతను సొంతం చేసుకుంది. ప్రస్తుతం రష్మిక- విజయ్ దేవరకొండ జంటగా రణబాలి చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ మూవీకి రాహుల్ సంకృత్యన్ దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, రవిశంకర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇటీవలే రాయలసీమలో కీలక సన్నివేశాల్ని తెరకెక్కించారు. రష్మిక పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ స్పెషల్ వీడియోను రిలీజ్ చేశారు. జయమ్మ పాత్రలో రష్మిక వీడియోలో అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ చిత్రాన్ని 1854 నుంచి 1878 మధ్యకాలంలో జరిగిన యథార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిస్తున్నారు. రష్మిక బర్త్ డే రోజు మైసా టీమ్ సైతం ప్రత్యేక పోస్టర్ రిలీజ్ చేసింది. Surrounded by love & powered by happiness!🫶#RashmikaMandanna celebrates her birthday the sweetest way!❤️#VijayDeverakonda #VIROSH #TeluguFilmNagar pic.twitter.com/MA5BseCsce— Telugu FilmNagar (@telugufilmnagar) April 6, 2026 -
బర్త్‌డే స్పెషల్.. రష్మిక చిన్నప్పటి క్యూట్ ఫోటోలు
-
రష్మిక బర్త్ డే.. మైసా టీమ్ స్పెషల్ పోస్టర్
నేషనల్ క్రష్ రష్మికా మందన్నా లీడ్ రోల్లో వస్తోన్న లేడీ ఓరియంటెడ్ మూవీ మైసా. ఈ మూవీని పాన్ ఇండియా రేంజ్లో రవీంద్ర పూలే దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన గ్లింప్స్‌లో రష్మిక లుక్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ మూవీని అన్ ఫార్ములా ఫిల్మ్స్ బ్యానర్లో భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.తాజాగా ఇవాళ రష్మిక బర్త్ డే కావడంతో మేకర్స్ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. రష్మిక జన్మదిన శుభాకాంక్షలు చెబుతూ పోస్టర్‌ను పంచుకున్నారు. పూర్తిగా బ్లాక్ అండ్ వైట్ కలర్లో రిలీజ్ చేసిన పోస్టర్ చూస్తుంటే ఫుల్ మాస్ యాక్షన్ మోడ్‌లో రష్మిక కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఈ ఫిమేల్ సెంట్రిక్ యాక్షన్ ఎంటర్టైనర్లో ఇప్పటివరకూ చేయని సరికొత్త పాత్రలో రష్మిక కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని 2026లోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. అంతేకాకుండా రష్మిక- విజయ్ దేవరకొండ జంటగా వస్తోన్న రణబలిలోనూ నటిస్తున్నారు.She ruled with charm…She conquered with grace…Now she’s coming with pure RAGE🔥Team #Mysaa wishes the ever-stunning @iamRashmika a blazing Happy Birthday ❤️🔥Get ready for her most explosive performance yet In cinemas 2026.💥#HappyBirthdayRashmika pic.twitter.com/0XXdcpBhPf— MYSAA (@MysaaTheFilm) April 5, 2026 -
హ్యాపీ బర్త్ డే చిన్ని బాబు.. అల్లు అర్జున్ స్పెషల్ విషెస్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన కుమారుడికి బర్త్ డే విషెస్ తెలిపారు. ఇవాళ అల్లు అయాన్ పుట్టినరోజు కావడంతో ప్రత్యేక ఫోటోను షేర్ చేశారు. ఇలాంటి పుట్టినరోజులు మరిన్ని జరుపుకోవాలని కోరుకుంటున్నట్లు ట్వీట్ చేశారు. హ్యాపీ బర్త్ డే మై చిన్ని బాబు అంటూ తనయుడిపై తన ప్రేమను చాటుకున్నారు. ఇది చూసిన బన్నీ ఫ్యాన్స్ అల్లు అయాన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతున్నారు.ఇక బన్నీ సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీతో జతకట్టారు. వీరిద్దరి కాంబోలో వస్తోన్న తొలి సినిమా కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో బాలీవుడ్ భామ దీపికా పదుకొణె హీరోయిన్గా కనిపించనుంది. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ మలయాళ డైరెక్టర్ బసిల్ జోసెఫ్ డైరెక్షన్లో పని చేయనున్నారని టాక్ వినిపిస్తోంది. అయితే దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటనైతే రాలేదు.Many happy returns of the day to the love of my life. Happy Birthday, my chinni babu. #HBDAlluAyaan #AyaanisaVibe pic.twitter.com/czUM77roIv— Allu Arjun (@alluarjun) April 3, 2026 -
భార్యతో కలిసి హీరో నితిన్ బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)
-
రామ్ చరణ్ బర్త్ డే స్పెషల్.. ఇంట్లోనే ప్రత్యేక హోమం
మెగా హీరో రామ్ చరణ్ బర్త్ డే వేడుకను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. మెగా ఫ్యాన్స్ సంతోషంతో అభిమాన హీరో జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని అభిమానులు తమ హీరోకు సోషల్ మీడియా వేదికగా విషెస్ చెబుతున్నారు. తన కుమారుడి బర్త్ డేను పురస్కరించుకుని మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. నిన్ను చూస్తుంటే ఒక తండ్రిగా గర్వంగా ఉందని ట్వీట్ చేశారు.చెర్రీ బర్త్ డేను మెగా కుటుంబం ఓ పండుగలా నిర్వహిస్తున్నారు. తాజాగా ఇవాళ రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఇంట్లోనే ప్రత్యేకంగా హోమం నిర్వహించారు. అనంతరం తల్లిదండ్రులు కాళ్లకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు గ్లోబల్ స్టార్. శ్రీరామనవమి రోజే రామ్ చరణ్ బర్త్ డే రావడంతో మెగా కుటుంబంలో ఆనందం మరింత రెట్టింపైంది. రామ్ చరణ్ హోమం నిర్వహించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఇక సినిమాల విషయానికొస్తే రామ్ చరణ్ ప్రస్తుతం పెద్ది మూవీలో నటిస్తున్నారు. ఈ సినిమాకు బుచ్చిబాబు సనా దర్శకత్వం వహించారు. ఇవాళ చెర్రీ బర్త్ డే సందర్భంగా పెద్ది గ్లింప్స్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ మూవీలో పహిల్వాన్‌గా రామ్ చరణ్ సరికొత్త లుక్‌లో కనిపించారు. ఈ రోజు రిలీజైన గ్లింప్స్ మెగా అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. కాగా.. ఈ సినిమా ఏప్రిల్ 30న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. On the auspicious occasion of #SriRamaNavami and Mega Powerstar #RamCharan’s birthday, Megastar #Chiranjeevi performed a special homam at his residence, seeking divine blessings. ✨ pic.twitter.com/6G0baHvhXo— Filmy Focus (@FilmyFocus) March 27, 2026 -
మెగాస్టార్ గొప్పమనసు.. రామ్ చరణ్ తరఫున బర్త్ డే గిఫ్ట్
మెగా తనయుడు రామ్ చరణ్ బర్త్ డే వేళ మెగాస్టార్ తన గొప్ప మనసును చాటుకున్నారు. కుమారుడి పుట్టినరోజును ఎప్పటికీ గుర్తుండిపోయేలా చేసుకున్నారు. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం అందించిన ప్రతిష్టాత్మక ఎన్టీఆర్ జాతీయ బహుమతి పురస్కారం రూ.10 లక్షల నగదు మొత్తాన్ని స్వచ్ఛంద సంస్థలకు విరాళమిచ్చారు. దీంతో మెగా ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. పలువురు అనాథ వృద్ధులకు ఆశ్రయం కల్పిస్తున్న సర్వ్ ఫౌండేషన్, అంధుల కోసం పని చేస్తున్న దేవనార్ ఫౌండేషన్, చిన్నారులను సంరక్షిస్తున్న వాల్మీకి, నయశ్రీ ఫౌండేషన్లతోపాటు బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రికి కూడా మెగాస్టార్ విరాళంగా ఇచ్చారు. ఇటీవల ఓ సినిమా షూటింగ్లో రామ్ చరణ్‌ను కలిసిన వృద్ధులను మెగాస్టార్ తన బ్లడ్ బ్యాంక్‌కు ఆహ్వానించారు. వారందరికీ బర్త్ డే గిఫ్ట్‌గా కొత్త దుస్తులు పంపిణీ చేశారు. అనంతరం తానే స్వయంగా వారందరికీ భోజనాలు పెట్టించారు. -
రామ్ చరణ్ బర్త్‌డే స్పెషల్ (ఫొటోలు)
-
పెద్ది బర్త్ డే స్పెషల్.. ఇప్పుడు చేతిలో ఉండేది బ్యాట్ కాదు....!
రామ్ చరణ్- బుచ్చిబాబు కాంబోలో వస్తోన్న మోస్ట్ అవైటేడ్ మూవీ పెద్ది. రూరల్ స్పోర్ట్స్ డ్రామాగా వస్తోన్న ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఒక్క రోజు ముందే రామ్ చరణ్ ఎడమ కన్నుకు చిన్న గాయం కావడంతో కాస్తా గ్యాప్ ఇచ్చారు. మార్చి 27న రామ్ చరణ్ బర్త్ డే అప్డేట్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారుతాజాగా పెద్ది మూవీ టీమ్ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. రేపు ఉదయం 9 గంటల 45 నిమిషాలకు అప్డేట్ రానుందని ప్రకటించారు. ఇక ఒక్క రోజు మాత్రమే మిగిలి ఉంది..ఇప్పటిదాకా బ్యాట్ పట్టుకుని అతన్ని చూశారు కదా.. ఇప్పుడు గదతో విరుచుకుపడబోతున్నాడు.. రేపు (మార్చి 27) ఉదయం 9:45 గంటలకు అతను రణరంగంలోకి అడుగుపెట్టబోతున్నాడు అంటూ గదతో ఉన్న ఫోటోను షేర్ చేసింది. చెర్రీ పుట్టినరోజు కానుకగా పెద్ది టీజర్ రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. కాగా.. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. ONE DAY TO GO 🔥You've seen him hold the bat, now unleashing him with a mace ❤🔥He enters the arena tomorrow (March 27th) at 9.45 AM 💥#PEDDI WORLDWIDE RELEASE ON 30th APRIL, 2026Mega Power Star @AlwaysRamCharan @NimmaShivanna #JanhviKapoor @BuchiBabuSana @arrahman… pic.twitter.com/EvpXHy0LX5— BuchiBabuSana (@BuchiBabuSana) March 26, 2026 -
మల్లన్న సేవలో హీరో శ్రీకాంత్ దంపతులు
టాలీవుడ్ హీరో శ్రీకాంత్ దంపతులు శ్రీశైల మల్లన్నను దర్శించుకున్నారు. ఇవాళ తన పుట్టినరోజు సందర్భంగా స్వామి అమ్మవార్లను తన భార్య, నటి ఊహతో కలిసి మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీశైలం వెళ్లిన శ్రీకాంత్ దంపతులకు ఆలయ మహాద్వారం వద్ద అధికారులు స్వాగతం పలికారు.అనంతరం మల్లిఖార్జున, భ్రమరాంబ అమ్మవార్లను హీరో శ్రీకాంత్ దంపతులు దర్శించుకున్నారు. ఆలయ పూజారులు వీరికి వేద ఆశీర్వచనాలు అందించారు. దీనికి సంబధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక సినిమాల విషయానికొస్తే శ్రీకాంత్ ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ హీరోగా వస్తోన్న సంబరాల ఏటిగట్టు చిత్రంలో నటిస్తున్నారు. ఇవాళ శ్రీకాంత్ బర్త్ సందర్భంగా ప్రత్యేక పోస్టర్‌ను మేకర్స్ రివీల్ చేశారు. Birthday boy #Srikanth in a brand new avatar as BRITISHUUU from #SambaralaYetiGattu 🎉🔥Stylish, fresh & intriguing look—setting the vibe already! 👀✨#SYG #SaiDharamTej #Tollywood #NewLook #BirthdaySpecial @actorsrikanth pic.twitter.com/ePycsIAR6A— Rajesh Kumar Reddy E V (@rajeshreddyega) March 23, 2026 -
సెంచరీ చేసిన సరస్వతమ్మ… ఇంకా నాటౌట్!
అన్నమయ్య జిల్లా: అన్నమయ్య జిల్లా కలికిరి మండలం టి.సండ్రావారిపల్లి గ్రామం తొగటపల్లిలో గోరంట్ల సరస్వతమ్మ తన వారసులతో కలిపి 100వ పుట్టిన రోజు వేడుకను ఆదివారం జరుపుకొంది. జన్మదిన వేడుకకు సరస్వతమ్మ కుమారులు, వారి పిల్లలు, మనుమళ్లు, మనుమరాళ్లు ఇలా నాలుగు తరాల వారు హాజరుకావడం విశేషం. నాలుగు తరాల కుటుంబ సభ్యుల నడుమ పుట్టిన రోజు నిర్వహించుకోవడం అరుదైన ఘటనగా స్థానికులు చర్చించుకున్నారు. గోరంట్ల సరస్వతమ్మ కుమారులు గోరంట్ల గోపీనాథరెడ్డి, లోకనాథరెడ్డి, ప్రేమనాథరెడ్డి, కుమార్తె పండితమ్మ వారి పిల్లలతో కలిసి సరస్వతమ్మను సన్మానించి తమ ఉన్నతికి ఆమె చేసిన కృషిని గుర్తుచేసుకున్నారు. సరస్వతమ్మ 100వ పుట్టిన రోజు వేడుకతో గ్రామంలో పండుగ సందడి కనిపించింది. -
'నూరేళ్లు కాదు.. 130 ఏళ్లు'.. సుమకు రాజీవ్ బర్త్ డే విషెస్
టాలీవుడ్ స్టార్ యాంకర్ సుమ కనకాలకు ఆమె భర్త ప్రత్యేకంగా విషెస్ తెలిపారు. ఇవాళ సుమ బర్త్ డే కావడంతో సోషల్ మీడియా వేదికగా తన ప్రేమను వ్యక్తం చేశారు. తెలుగులో వేద మంత్రాన్ని రాస్తూ తన సతీమణికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. నిండూ నూరేళ్లు… కాదు కాదు.. ఒక 120–130 ఏళ్లు మీ మనవలు, మనవరాళ్లతో హ్యాపీగా ఉండాలని దీవిస్తున్నానంటూ భార్యపై తన ప్రేమను చాటుకున్నారు రాజీవ్ కనకాల. ఇది చూసిన అభిమానులు సైతం సుమకు జన్మదిన శుభాకాంక్షలు చెబుతున్నారు. కాగా.. రాజీవ్ కనకాల, సుమ 1999లో ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఓ కుమారుడు, కూతురు ఉన్నారు. ఇప్పటికే వీరిద్దరి కుమారుడు రోషన్ టాలీవుడ్లో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. అయితే వారి పరిచయం సీరియల్స్‌తోనే మొదలైంది. అలా ప్రేమలో పడిన ఈ జోడి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకుంది. గతంలో ఓ సినిమా ఈవెంట్లో రాఘవేంద్రరావు మాట్లాడుతూ వారి పెళ్లి గురించి సరదా వ్యాఖ్యలు చేశారు. సుమ - రాజీవ్ కలిసి నటించిన సూపర్ హిట్ సీరియల్ 'శాంతి నివాసం' సీరియల్‌తోనే వారి మధ్య ప్రేమ చిగురిందని అన్నారు.శుభజన్మదినం తుభ్యంశుభజన్మదినం తుభ్యంశుభజన్మదినే తవ హేసకలం సఫలం భూయాత్సకలం చ శుభం భూయాత్నిండూ నూరేళ్లు… కాదు కాదు, ఒక 120–130 ఏళ్లు మీ మనవలు, మనవరాళ్లతో హ్యాపీగా ఉండాలని దీవిస్తున్నాను ✨Happy Birthday @ItsSumaKanakala ❤️ pic.twitter.com/nxYUpFVVKb— Raajeev kanakala (@RajeevCo) March 22, 2026 -
ఐకాన్ స్టార్ బర్త్ డే స్పెషల్.. థియేటర్లు దద్దరిల్లాల్సిందే..!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన సూపర్ హిట్ మూవీ రేసు గుర్రం. సురేందర్ రెడ్డి డైరెక్షన్లో ఈ చిత్రం మాస్ ఆడియన్స్‌ను ఓ రేంజ్లో ఆకట్టుకుంది. ఈ మూవీతో రవి కిషన్ టాలీవుడ్లో ఫేమస్ అయిపోయారు. విలన్‌గా సెన్సేషన్ క్రియేట్ చేశారు. ఈ చిత్రంలో బ్రహ్మనందం రోల్ ఎప్పటికీ గుర్తుంటుంది. చివరి 30 నిమిషాల్లో బ్రహ్మనందం అదరగొట్టేశారు. ఈ మాస్ యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్ మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తోంది.ఈ ఏడాది ఏప్రిల్ 8న రేసుగుర్రం 4కె వర్షన్లో థియేటర్లో రీ రిలీజ్ చేస్తున్నారు. అల్లు అర్జున్ బర్త్ డే కానుకగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. మరోసారి మద్దాలి శివారెడ్డి విలనిజం, బ్రహ్మనందం ఫుల్ యాక్షన్ మోడ్ చూడాలంటే థియేటర్లకు వెళ్లాల్సిందే. ఇవాళ ఉగాది సందర్భంగా ఈ విషయాన్ని ప్రకటించారు. ఈ చిత్రానికి సంబంధించిన ఓ వీడియోను రిలీజ్ చేశారు. Wishing everyone a very Happy Ugadi 🥭#RaceGurram4K is all set to hit theatres on April 8, 2026 mark the date in your calendars !!Get ready to witness the madness of this iconic character once again and experience the frenzy on the big screen 🔥@alluarjun @shrutihaasan… pic.twitter.com/kSQDq2c512— Race Gurram 4K (@RGTheFilm) March 19, 2026 -
వైవిధ్యమైన పాత్రల్లో...
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో నటుడిగా 50 ఏళ్ల ప్రయాణం పూర్తి చేసుకున్నారు మంచు మోహన్‌బాబు. నేడు (మార్చి 19) ఆయన పుట్టినరోజు. ‘స్వర్గం నరకం’ (1975) చిత్రంతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యారాయన. ఆ తర్వాత విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, హీరోగా గొప్ప పాత్రలు ΄ోషించారు. నిర్మాతగానూ తిరుగులేని విజయాలను అందుకున్నారు. ఒక నటుడు నిర్మాతగా మారి 75 చిత్రాలు నిర్మించడం విశేషం. 600లకు పైగా చిత్రాల్లో నటించిన ఆయన ఇప్పటికీ నటుడిగా బిజీగా ఉన్నారు. వైవిధ్యమైన పాత్రలతో నేటి తరాన్ని కూడా మెప్పించబోతున్నారు. ప్రస్తుతం నాని హీరోగా నటిస్తున్న ‘ది ΄్యారడైజ్’, ఘట్టమనేని జయకృష్ణ హీరోగా నటిస్తున్న ‘శ్రీనివాసమంగాపురం’ వంటి చిత్రాల్లో వైవిధ్యమైన పాత్రలను ΄ోషిస్తున్నారు మోహన్‌బాబు. -
తమ్ముడి బర్త్ డే.. అన్న విజయ్ దేవరకొండ స్పెషల్ విషెస్
ఆనంద్ దేవరకొండ, బేబీ ఫేమ్ వైష్ణవి చైతన్య జంటగా నటిస్తోన్న తాజా చిత్రం ఎపిక్. ఈ మూవీకి ఆదిత్య హాసన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇవాళ ఆనంద్ బర్త్ డే కావడంతో చిత్ర బృందం ప్రత్యేకంగా విషెస్ తెలిపింది. ఈ మూవీలోని ఓ వీడియోను షేర్ చేస్తూ జన్మదిన శుభాకాంక్షలు చెప్పారు. అంతేకాకుండా అమృతం సీరియల్ టైటిల్ సాంగ్‌తో చేసిన వీడియో ఆనంద్ ఫ్యాన్స్‌ను తెగ ఆకట్టుకుంటోంది. ఈ ప్రత్యేక వీడియోను అన్న విజయ్ దేవరకొండ ట్విటర్లో షేర్ చేశారు. హ్యాపీ బర్త్ డే మై ఫేవరేట్ బాయ్ అంటూ తమ్ముడిపై బర్త్ డే విషెస్ చెప్పాడు. అంతకుముందే రష్మిక సైతం డ్యాన్స్ చేస్తూ ఆనంద్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది. Happy Birthday to my fav boy ❤️May this year be EPICCCC for all of you 🤗😘#EPIC ~ First Semester#AnandDeverakonda #AdityaHasan @vamsi84 @HeshamAWMusic @Iamvaishnavi04 pic.twitter.com/kY9OfDRDhn— Vijay Deverakonda (@TheDeverakonda) March 15, 2026 -
ఆనంద్ దేవరకొండ బర్త్ డే.. వదినమ్మ రష్మిక స్పెషల్ విషెస్
ఇటీవలే టాలీవుడ్ జంట రష్మిక- విజయ్ దేవరకొండ వివాహాబంధంలోకి అడుగుపెట్టారు. ఉదయ్‌పూర్ వేదికగా జరిగిన గ్రాండ్ వెడ్డింగ్‌లో ఈ లవ్ బర్డ్స్ ఒక్కటయ్యారు. ఇరువురి సంప్రదాయ పద్ధతుల్లో వీరిద్దరి పెళ్లి వేడుక గ్రాండ్‌గా జరిగింది. ఈ పెళ్లిలో అత్యంత సన్నిహితులు, బంధుమిత్రులు మాత్రమే సందడి చేశారు.తాజాగా ఇవాళ విజయ్ తమ్ముడు ఆనంద్ దేవరకొండ బర్త్ డే కావడంతో వదినమ్మ రష్మిక స్పెషల్ విషెస్ తెలిపింది. మరిది ఆనంద్ దేవరకొండతో కలిసి డ్యాన్స్ చేసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. విజయ్ దేవరకొండతో పెళ్లి తర్వాత ఆనంద్ జరుపుకుంటోన్న తొలి పుట్టనరోజు కావడం మరో విశేషం. A sweet and joyful birthday wish from #RashmikaMandanna to #AnandDeverakonda!🥳🫶#TFNReels #TeluguFilmNagar pic.twitter.com/AOXFsiogYv— Telugu FilmNagar (@telugufilmnagar) March 15, 2026 -
నాన్న నాకిచ్చే అతిపెద్ద గిఫ్ట్ అదే: సుస్మిత కొణిదెల
మెగా డాటర్ సుస్మిక కొణిదెల నిర్మాతగా కూడా రాణిస్తోంది. ఈ ఏడాది మనశంకర వరప్రసాద్‌గారు మూవీతో బ్లాక్‌బస్టర్‌ను సొంతం చేసుకుంది. ఈ మూవీతో నాన్నకు సూపర్ హిట్ అందించిన కూతురిగా ఘనత సాధించింది. గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్ అనే బ్యానర్లో పలు చిత్రాలు నిర్మిస్తున్నారు. ఇవాళ సుస్మిత బర్త్ డే కావడంతో మెగాస్టార్ చిరంజీవితో పాటు మెగా ఫ్యాన్స్ ఆమెకు జన్మదిన శుభాకాంక్షలు చెబుతున్నారు.ఈ ఆదివారం మహిళ దినోత్సవం సందర్భంగా ఈ ఇంటర్వ్యూకు హాజరైన సుస్మిత పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. మా ఇంట్లో మహిళలకు ప్రత్యేకమైన రోజు అవసరం లేదని.. ఎప్పుడూ గౌరవం, ప్రోత్సాహం ఎల్లప్పుడు లభిస్తూనే ఉంటాయని తెలిపింది. ప్రతి బర్త్ డేకు నాన్న చిరంజీవి, రామ్ చరణ్ తనకు గిఫ్ట్స్ ఇస్తారని వెల్లడించింది. కానీ ఆ బహుమతుల కంటే తనపై వారు పెట్టుకున్న నమ్మకమే అతిపెద్ద గిఫ్ట్ అని పేర్కొంది. తాను ఏ పని అయినా చేయగలననే విశ్వాసం వారికి ఉందని సుస్మిత సంతోషం వ్యక్తం చేసింది. తనకు కుటుంబం మద్దతు కలిగి ఉండడం నా జీవితంలో గొప్ప బహుమతి అన్నారు. -
'ఈ రోజు నిన్ను చూస్తుంటే చాలా గర్వంగా ఉంది' మెగాస్టార్ ఎమోషనల్ పోస్ట్
మెగాస్టార్ చిరంజీవి తన కూతురికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. పెద్ద కుమార్తె సుస్మిత కొణిదెల బర్త్ డే సందర్భంగా చిరు విష్ చేశారు. ఒకప్పుడు నా వేలు పట్టుకుని నా పక్కన నడిచిన చిన్న అమ్మాయి.. నేడు ఒక బలమైన, బాధ్యయుతమైన మహిళగా ఎదిగిందని సంతోషం వ్యక్తం చేశారు. నా సినిమాలు చూడటం.. ఇప్పుడు సినిమా నిర్మించడం.. నాకు చిరస్మరణీయమైన బ్లాక్‌బస్టర్‌ను అందించడం అత్యంత ప్రత్యేకమైన క్షణాలలో ఒకటని ఆనందం వ్యక్తం చేశారు. తండ్రిగా నన్ను గర్వపడేలా చేశావని సుస్మితను కొనియాడారు.మెగాస్టార్ తన ట్వీట్ రాస్తూ..' నా ప్రియమైన సుస్మితకు పుట్టినరోజు శుభాకాంక్షలు. ఒకప్పుడు నా వేలు పట్టుకుని నా పక్కన నడిచిన చిన్న అమ్మాయి నుంచి.. నేడు మీరు బలమైన, అందమైన బాధ్యతాయుతమైన మహిళగా ఎదిగావ్. ఒక తండ్రిగా నాకు అత్యంత ప్రత్యేకమైన క్షణాలలో ఇది ఒకటి. మీరు నా సినిమాలు చూడటం.. ఇప్పుడు ఏకంగా సినిమా నిర్మించడం, నాకు చిరస్మరణీయమైన బ్లాక్‌బస్టర్‌ను అందించడం.. నిజంగా నన్ను గర్వపడేలా చేసింది. మీరు చేసే ప్రతి పనిలో మీకు మంచి ఆరోగ్యం, ఆనందం, అంతులేని విజయం కలగాలని కోరుకుంటున్నా. ఎప్పటికీ ఇలా ప్రకాశిస్తూ ఉండు నా ప్రియమైన హనీ పాపా. నీకు ఎల్లప్పుడూ నా ప్రేమ, ఆశీస్సులు ఉంటాయి' అని పోస్ట్ చేశారు. కాగా..ఈ ఏడాది సంక్రాంతికి రిలీజైన మనశంకర వరప్రసాద్‌గారు చిత్రానికి సుస్మిత నిర్మాతగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. 'Happy Birthday my precious @sushkonidela ❤️From the little girl who once held my finger and walked beside me, to the strong, graceful and responsible woman you are today.One of the most special moments for me as a father was seeing you watching my films, now producing a film,… pic.twitter.com/Z8FwhsXUrQ— Chiranjeevi Konidela (@KChiruTweets) March 10, 2026 -
గ్రాండ్‌గా హీరోయిన్ శ్రద్ధాదాస్ బర్త్ డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
జాన్వీ కపూర్ బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)
-
ప్రియుడితో యానిమల్ బ్యూటీ త్రిప్తి డిమ్రీ బర్త్ డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
నాని స్టైల్లోనే అతడికి బర్త్‌డే విషెస్ చెప్పిన అక్క (ఫొటోలు)
-
నరేశ్‌కు ఎంతో ప్రత్యేకమైన రోజు.. ఎందుకంటే? (ఫోటోలు)
-
గ్రాండ్‌గా నిర్మాత కోన వెంకట్ బర్త్ డే వేడుకల్లో సినీతారల సందడి (ఫొటోలు)
-
'రామ్ చరణ్‌కు అది చాలా ఇష్టం.. వద్దన్నా వినేవాడు కాదు': సురేఖ
మెగాస్టార్ చిరంజీవి సతీమణి సురేఖ బర్త్ డే కావడంతో చిరు స్పెషల్ విషెస్ తెలిపారు. ప్రతి మగాడి విజయం వెనక ఒక స్త్రీ ఉంటుందంటారు.. అలాగే తన విజయం వెనక కూడా భార్య సురేఖ ఉందన్నారు మెగాస్టార్. ఈ సందర్భంగా భార్యపై ప్రేమతో ఓ ఎమోషనల్ పోస్ట్ చేశారు. 1980 ఫిబ్రవరి 20న సురేఖతో నా పెళ్లి జరిగిందని.. అప్పటినుంచి తనే నాకు ప్రధాన బలంగా మారందని చిరంజీవి ట్విటర్ వేదికగా పంచుకున్నారు. సురేఖ బర్త్ డే విషయం తెలుసుకున్న అభిమానులు పెద్దఎత్తున జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.అయితే గతంలో ఓ ఇంటర్వ్యూకు హాజరైన సురేఖ..తన కుమారుడు రామ్ చరణ్ గురించి ఆసక్తికర విషయాన్ని పంచుకుంది. రామ్ చరణ్ చిన్నప్పుడు చాలా సైలెంట్‌గా ఉండేవాడని తెలిపింది. అస్సలు అల్లరి చేసేవాడు కాదని.. టీనేజ్ వచ్చాక కొంచెం అల్లరి చేసేవాడని వెల్లడించింది. చరణ్‌కు కిల్లీ అంటే చాలా ఇష్టమని తెలిపింది. కిల్లీ చిన్నపిల్లలు వేసుకోవద్దని చెబితే.. పక్కకు వెళ్లి సందులో నిలబడి సైలెంట్‌గా అక్కడే నిల్చుని తినేవాడని సురేఖ ఆసక్తికర విషయాన్ని పంచుకుంది.ఇక సినిమాల విషయానికొస్తే రామ్ చరణ్ ప్రస్తుతం పెద్ది చిత్రంలో నటిస్తున్నారు. ఈ రూరల్ స్పోర్ట్స్ డ్రామాకు బుచ్చిబాబు సనా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీలో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్గా కనిపించనుంది. Wishing you a Very Happy Birthday Surekha Amma Garu ❤️❤️@AlwaysRamCharan https://t.co/e7nZ2cjUqf pic.twitter.com/cCdfuUUY73— Team Charanism (@TeamCharanism) February 18, 2026 -
హ్యాపీ బర్త్ డే కేరళ కుట్టీ.. అనుపమ పరమేశ్వరన్ స్పెషల్ (ఫొటోలు)
-
పెద్ది నటుడి బర్త్ డే గిఫ్ట్.. బుచ్చిబాబు ట్వీట్
రామ్ చరణ్- బుచ్చిబాబు కాంబోలో వస్తోన్న రూరల్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా పెద్ది. ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ ఏడాది మార్చి 27న రిలీజ్ కావాల్సిన ఈ సినిమా.. ఏప్రిల్ 30కి వాయిదా పడింది. ఈ చిత్రంలో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్గా కనిపించనుంది.పెద్ది మూవీ డైరెక్టర్ బుచ్చిబాబు బర్త్ డే సందర్భంగా రామ్ చరణ్ విషెస్ తెలిపారు. దర్శకుడితో షూట్లో ఉన్న ఫోటోను షేర్ చేశారు. తాజాగా పెద్ది మూవీ నటుడు శివరాజ్‌కుమార్ డైరెక్టర్ బుచ్చికి బర్త్ డే గిఫ్ట్ ఇచ్చారు. ఈ విషయాన్ని స్వయంగా బుచ్చిబాబు వెల్లడించారు. ట్విటర్ వేదికగా శివరాజ్‌కుమార్‌తో ఉన్న ఫోటోను పంచుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లవ్లీ గిఫ్ట్ అంటూ బుచ్చిబాబు ట్వీట్ చేశారు.Thank you so much for the lovely gift @NimmaShivanna Sir ❤️❤️🤗🤗It truly means a lot Sirrr. Love U Sirrr❤️❤️ pic.twitter.com/0YnhB48okh— BuchiBabuSana (@BuchiBabuSana) February 17, 2026 -
ఐశ్వర్య అర్జున్‌కు బ్రహ్మనందం బర్త్ డే గిఫ్ట్.. అదేంటంటే?
హీరో అర్జున్ సర్జా కుమార్తె ఐశ్వర్య, నిరంజన్ ప్రధాన పాత్రల్లో వస్తోన్న మూవీ సీతా పయనం. ఈ మూవీకి అర్జున్ సర్జానే దర్శకత్వం వహించారు. ఇందులో అర్జున్ మేనల్లుడు ధ్రువ సర్జా కెమియో రోల్లో కనిపించనున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా ఫిబ్రవరి 14న థియేటర్లలో సందడి చేయనుంది.ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు మేకర్స్. ఈ కార్యక్రమానికి టాలీవుడ్ కమెడియన్ బ్రహ్మనందం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ ఈవెంట్లో అర్జున్ సర్జా కూతురు ఐశ్వర్యకు బ్రహ్మనందం సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చారు. ఫిబ్రవరి 10న ఐశ్వర్య బర్త్ డే కావడంతో తానే స్వయంగా గీసిన శ్రీరాముడు, హనుమాన్ పెయింటింగ్ కానుకగా అందజేశారు. ఐశ్వర్య తన కూతురు లాంటిదని బ్రహ్మనందం అన్నారు.కాగా.. సీతా పయనం మూవీని శ్రీ రామ్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై రూపొందించారు. కాగా.. ఈ చిత్రంలో సత్యరాజ్, ప్రకాశ్‌రాజ్, కోవై సరళ, అర్జున్ మేనల్లుడు ధ్రువ సర్జా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. #Brahmanandam garu presented his hand drawn picture of Hanuman & Sri Rama To #AishwaryaArjun#SeethaPayanam pic.twitter.com/5ThsSWFfni— cinee worldd (@Cinee_Worldd) February 10, 2026 -
ఈయనే నా కెప్టెన్: శేఖర్ కమ్ముల కూతురు (ఫోటోలు)
-
ప్రతి జన్మకూ నువ్వే కావాలి: శ్రీలీల (ఫోటోలు)
-
ఆ ముగ్గురి వల్లే ఈ రోజు ఇక్కడ ఉన్నా: బ్రహ్మనందం
టాలీవుడ్ హాస్యనటుడు బ్రహ్మనందం తన 70వ పుట్టినరోజును సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు టాలీవుడ్ సినీ ప్రముఖులు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. తనదైన కామెడీతో సినీ ప్రియులను దశాబ్దాలుగా అలరించిన బ్రహ్మనందం 42 ఏళ్లుగా వెండితెరపై అలరిస్తున్నారు. తాజాగా తన 70వ బర్త్ డే వేడుకలో తన సినీ ప్రయాణం గురించి మాట్లాడారు.ఇన్నేళ్లుగా తాను నటుడిగా కొనసాగుతున్నానంటే అదంతా ప్రేక్షకులు నా పట్ల చూపించిన ప్రేమాభిమానాలే కారణమని అన్నారు. నా సుదీర్ఘమైన సినీ ప్రయాణంలో ఎన్నో ఇబ్బందులు, ఒడుదొడుకులు ఎదుర్కొన్నానని తెలిపారు. ఇవాళ ఈ స్థితిలో ఉన్నందుకు తెలుగు కళామతల్లికి శిరస్సు వంచి పాదాభినందనాలు చేస్తున్నానన్నారు. ఇన్ని సినిమాలు నిర్మించిన నిర్మాతలు, దర్శకులు గొప్పతనం వల్లే ఇది సాధ్యమైందన్నారు. నాకు ఇంత గొప్ప అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికీ రుణపడి ఉంటానని బ్రహ్మనందం తెలిపారు.నేను ఈ ఫిల్మ్ ఇండస్ట్రీకి రావడానికి కీర్తిశేషులు జంధ్యాల గారు, చిరంజీవి, రామానాయుడే కారణమని బ్రహ్మనందం అన్నారు. నాలో టాలెంట్‌ను గుర్తించి చంటబ్బాయి సినిమాలో నన్ను చిరంజీవి పరిచయం చేశారు. ఆ తర్వాత జంధ్యాల నాకు ఆహా నా పెళ్లంట మూవీలో అవకాశమిచ్చారని తెలిపారు. ఇన్ని వందల సినిమాలు చేయడంలో నా గొప్పతనం ఏమీ లేదన్నారు. మీ అందరి ఆదరణ, ప్రేమ వల్లే ఈ బ్రహ్మనందం ఇక్కడ ఉన్నారని అన్నారు. -
అక్కా.. నిన్ను ఇప్పటికైనా అర్థం చేసుకున్నా: చెల్లి ఎమోషనల్ పోస్ట్
టాలీవుడ్ హీరో వరుణ్ సందేశ్ సతీమణి వితికా శేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. 'పడ్డానండి ప్రేమలో మరి' అనే చిత్రంలో మొదలైన వీరిద్దరి జర్నీ పెళ్లి పీటలవరకు తీసుకెళ్లింది. ఈ సినిమాతోనే ప్రేమలో పడిన ఈ జంట కుటుంబాల అంగీకారంతో వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత వీళ్లిద్దరూ కలిసి బిగ్బాగ్ 3వ సీజన్లో పాల్గొని మరింత గుర్తింపు తెచ్చుకున్నారు.అయితే గతేడాది వరుణ్ సందేశ్ బర్త్ డే కానుకగా ఏకంగా సొంతింటినే గిఫ్ట్‌గా ఇచ్చింది వితికా శేరు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఫోటోలు, వీడియోలను షేర్ చేసింది. అంతేకాకుండా 2025 నవంబర్‌లో తన చెల్లి సీమంతం వేడుకను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంది. తన చెల్లి సీమంతాన్ని తానే దగ్గరుండి మరీ నడిపించింది. అక్కగా అన్నీ తానై చెల్లి క్రితిక శేరు సీమంతాన్ని జీవితాంతం గుర్తుండిపోయేలా చేసింది.తాజాగా ఇవాళ తన అక్క వితికా శేరు బర్త్ డే కావడంతో చెల్లి క్రితిక శేరు విషెస్ తెలిపింది. తన కోసం అక్క చేసిన క్షణాలను గుర్తు చేసుకుంది. తన వెంట ఉంటూ అండగా నిలిచిన అక్కకు మనస్ఫూర్తిగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపింది. చాలా కాలంగా నేను నిన్ను నిజంగా అర్థం చేసుకోలేదంటూ ఎమోషనల్ పోస్ట్ చేసింది. నువ్వు ఎప్పుడు బిజీగా ఉన్నా.. బాధ్యతలను మోస్తూ.. మన కుటుంబాన్ని చూసుకోవడానికి నీ కెరీర్‌ను నిర్మించుకుంటూనే ఉన్నావంటూ రాసుకొచ్చింది. నా చిన్నప్పుడు ఇతరుల్లో ఉన్నంత అనుబంధం మనలో లేదని నాకు అనిపించింది.. కారణాలు తెలియకుండానే నిన్ను చాలాసార్లు ప్రశ్నించానంటూ భావోద్వేగానికి గురైంది క్రితిక శేరు.క్రితిక శేరు తన ఇన్‌స్టాలో రాస్తూ..' నా పెళ్లి తర్వాత.. ముఖ్యంగా ఈ గర్భధారణ సమయంలో ప్రతిదీ మారిపోయింది. దూరం వల్ల నీ ప్రేమ నాకు చాలా స్పష్టంగా కనిపించింది. నువ్వు చిన్న చిన్న విషయాలను గమనించావు. నన్ను భావోద్వేగంగా.. మానసికంగా ఆదుకున్నావు. ఈ ప్రయాణాన్ని నాకు చాలా సులభతరం చేసి మరింత అందంగా మార్చావ్. నేను ఇంతకు ముందు ఎప్పుడూ చూడని విధంగా నా కోసం నువ్వు నిలబడ్డావ్. చివరికీ ఈరోజు నేను నిన్ను అర్థం చేసుకున్నా అక్కా. నీ ప్రేమ నాపై ఎల్లప్పుడూ బలంగా ఉంది. నువ్వు నా కోసం చేసిన ప్రతి చిన్న పనికి ధన్యవాదాలు. ఈ రోజు నా బలం, నా మద్దతు.. నాకు అతిపెద్ద ఆశీర్వాదం నువ్వే అక్కా. నీకు మనస్ఫూర్తిగా పుట్టినరోజు శుభాకాంక్షలు' అంటూ పోస్ట్ చేసింది. ఇది తెలుసుకున్న అభిమానులు వితికా శేరుకు జన్మదిన శుభాకాంక్షలు చెబుతున్నారు. View this post on Instagram A post shared by Krithika Sheru (@krithikasheru) -
వితికా షేరు బర్త్ డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
బర్త్‌డే, మ్యారేజ్‌డే నాడు పోలీసులకు ప్రత్యేక సెలవు
పోలీసు సిబ్బందికి విధులు నిరంతరాయంగా ఉండేవే. వాళ్లకు సెలవులు, విశ్రాంతి, వీకాఫ్‌లు అనే వాటిపై చర్చ కూడా నిరంతరం జరిగేదే. ప్రభుత్వాలు ఈ విషయంలో సానుకూలంగా స్పందించిన దాఖలాలు అరుదనే చెప్పాలి. అయితే.. ఇక్కడ ఓ రాష్ట్రంలో పోలీసులకు ఇక నుంచి ప్రత్యేక సెలవులు ఇవ్వాలని నిర్ణయించింది. ఆ వివరాల్లోకి వెళ్తే.. పోలీసులకు వాళ్ల, వాళ్ల కుటుంబ సభ్యుల పుట్టినరోజు, వివాహ వార్షికోత్సవం తదితర రోజుల్లో సెలవు తీసుకోవచ్చని కర్ణాటక ప్రభుత్వం ఆదేశించింది. నిరంతరం విధుల్లో ఉంటూ కుటుంబ కార్యక్రమాల్లో పాల్గొనలేకపోతున్నారని ఈ వెసులుబాటు ఇచ్చింది. దీనివల్ల వారిపై పనిభారం, మానసిక ఒత్తిడి తగ్గుతుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ కార్యక్రమాల కోసం పోలీసు సిబ్బంది సెలవు కోరితే తప్పకుండా మంజూరు చేయాలని డీజీపీ డాక్టర్ సలీం గురువారం ఉత్తర్వులు ఇచ్చారు.ఇతర రాష్ట్రాల్లో ఇలాంటి ప్రత్యేక లీవ్ పాలసీ ఇప్పటివరకు అధికారికంగా ప్రకటించబడిన ఉదాహరణలు లేవు. కాబట్టి.. పుట్టినరోజులు, వివాహ వార్షికోత్సవాల రోజున పోలీస్ సిబ్బందికి ప్రత్యేకంగా సెలవు ఇవ్వడం(కాజ్యువల్ లీవ్) అనే విధానం కర్ణాటకలోనే మొదటిసారి అమలులోకి వచ్చింది.పోలీస్ సేవ చాలా కఠినమైనది, కుటుంబానికి సమయం కేటాయించడం కష్టమవుతోంది. పుట్టినరోజులు, వివాహ వార్షికోత్సవాలు వంటి వ్యక్తిగత సందర్భాల్లో సెలవు ఇవ్వడం ద్వారా సిబ్బంది భావోద్వేగపరంగా రీఛార్జ్ అవ్వగలరు. కుటుంబంతో కొంత సమయం గడపగలరు. ఇది మానసిక ఒత్తిడి తగ్గించడంలో, ఉత్సాహాన్ని పెంచడంలో, ఉద్యోగ సంతృప్తి, ఉత్పాదకతను మెరుగుపరచడంలో సహాయపడుతుందని ఆ సర్క్యులర్‌లో పేర్కొన్నారు.రాష్ట్రంలోని అన్ని యూనిట్ హెడ్లు ఈ ఆదేశాన్ని అమలు చేసి, సిబ్బంది కోరినప్పుడు సెలవు ఇవ్వాలని కర్ణాటక డీజీపీ ఆదేశించారు. ఈ చర్యను మానవీయమైన నిర్ణయంగా వర్ణిస్తూ.. పోలీస్ సిబ్బంది చేసిన త్యాగాలను గుర్తించడం, విశ్వాసాన్ని పెంపొందించడం, శాఖ పట్ల నిబద్ధతను బలపరచడం లక్ష్యంగా ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. -
హీరోయిన్ శ్రుతిహాసన్ బర్త్ డే స్పెషల్ (ఫొటోలు)
-
'ఇరుముడి' సెట్లో రవితేజ బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)
-
టాలీవుడ్ నటుడు వీకే నరేశ్ బర్త్ డే పార్టీలో సెలబ్రిటీల సందడి (ఫోటోలు)
-
వీకే నరేశ్ బర్త్ డే సెలబ్రేషన్స్.. స్పెషల్ అట్రాక్షన్‌గా పవిత్రా లోకేశ్.. వీడియో వైరల్
టాలీవుడ్ నటుడు వీకే నరేశ్ ఇటీవలే నారీ నారీ నడుమ మురారి సినిమాతో ప్రేక్షకులను అలరించాడు. సంక్రాంతికి రిలీజైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమా తర్వాత శుభకృత నామ సంవత్సరం అనే కన్నడ చిత్రంలో నటిస్తున్నారు వీకే నరేశ్. వరుస చిత్రాలతో ఫుల్ బిజీ అయిపోయారు.అయితే ఇటీవలే తన 54న పుట్టిన రోజును గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్నారు వీకే నరేశ్. ఈ బర్త్ డే వేడుకల్లో టాలీవుడ్ సినీ ప్రముఖులు కూడా పాల్గొన్నారు. హీరో శర్వానంద్, రవిబాబు, నారా రోహిత్, జయసుధ లాంటి పలువురు సినీతారలు హాజరయ్యారు. ఈ వేడుకలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియో చూస్తుంటే ఫుల్ గ్రాండ్‌గా బర్త్ డే వేడుక జరిగినట్లు తెలుస్తోంది.స్పెషల్ అట్రాక్షన్‌గా పవిత్రా లోకేశ్..అయితే ఈ బర్త్ డే వేడుకల్లో నటి పవిత్రా లోకేశ్ స్పెషల్ అట్రాక్షన్‌గా కనిపించింది. వేదికపైనే నరేశ్‌తో పాటు ఈ వేడుకల్లో పాల్గొన్నారామె. ఈ సందర్భంగా వీరిద్దరిని గజమాలతో సత్కరించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. Grand 54th birthday celebrations of @ItsActorNaresh garu pic.twitter.com/nlwSwEx4Gs— H A N U (@HanuNews) January 22, 2026 -
సుకుమార్ కుమార్తె బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)
-
కన్నడ బ్యూటీ విమలా రామన్ బర్త్‌డే.. క్రేజీ ఫోటోలు చూశారా?
-
తల్లిదండ్రుల దశదిన కర్మ రోజే కూతురు జన్మదినం
పెద్దపల్లి జిల్లా: లింగాపూర్ గ్రామానికి చెందిన కందుల తిరుపతి–స్రవంతి దంపతుల మధ్య వచ్చిన స్వల్ప ఘర్షణతో క్షణికావేశంలో దంపతులిద్దరూ ఆత్మహత్యకు పాల్పడారు. వారి దాంపత్య జీవితానికి గుర్తుగా 15ఏళ్ల ఏకైక కూతురు శివాణి ఉంది. ఈక్రమంలో బుధవారం తల్లిదండ్రుల దశదినకర్మ రోజే కూతురు శివాణి జన్మదినం కావడంతో బంధువులు, గ్రామస్తుల ప్రోత్సాహంతో బాధ నుంచి మరల్చేందుకు తల్లిదండ్రుల చిత్రపటం ఎదుట కేక్ కట్ చేయించారు. కాగా ఉద్విగ్న క్షణాలతో కన్నీటిని ఆపుకుంటూ బాధను అదిమి పట్టి అతికష్టంగా ముఖంపై చిరునవ్వును చిందినట్లుగా శివాణి కేక్ కట్ చేసిన తర్వాత పక్కకు వచ్చి ఒక్కసారిగా కన్నీంటిపర్యంతమైంది. బాలిక రోధనను చూసిన బంధువులు, గ్రామస్తులు మరోసారి కంటతడిపెట్టారు. గ్రామస్తులంతా చిన్నారికి అండగా నిలుస్తూ భరోసా కల్పించారు. -
నలుగురు ప్రాణాలు తీసిన బర్త్‌డే పార్టీ
ఊదయ్‌పూర్ అతివేగంగా కారు నడిపి నిర్లక్షంగా వ్యవహరించినందుకు యువకులు భారీ మూల్యం చెల్లించుకున్నారు. ఆయువకుడు 140 కిలోమీటర్ల వేగంతో సిగరెట్ చేతిలో పట్టుకొని కారు నడిపాడు. దీంతో ఎదురుగా వస్తున్న కారును ఢీకొనడంతో నలుగురు యువకులు అక్కడికక్కడే మృతిచెందారు. ఈ ఘటనవివరాలు వీడియోలో రికార్డయ్యాయి.డ్రైవింగ్ చేసేటప్పుడు నిర్లక్షంగా వ్యవహరించకూడదని ఎన్నిసార్లు చెప్పినా యువత పెడచెవిన పెడుతున్నారు. వాహనాన్ని నడిపేటప్పుడు మనం చేసే తప్పిందం ఖరీదు నిండుప్రాణాలే అన్న సంగతి యువత మర్చిపోతున్నారు. అహ్మదాబాద్‌లో తన స్నేహితుడి పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడానికి స్నేహితులు కలిశారు. అనంతరం టీకోసం మిత్రులంతా కారులో బయిలుదేరారు. ఆసమయంలో కారు నడుపుతున్న వ్యక్తి చేతిలో సిగరెట్ పట్టుకొని 140 కిలోమీటర్ల వేగంతో కారు నడిపారు.ఆసమయంలో ఎదురుగా కారు రావడంతో వాహనాన్ని కంట్రోల్ చేయలేక ఢీకొట్టారు. ఈప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతిచెందగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన అనంతరం కారులోని వ్యక్తులు సహయం కోసం అర్తనాథాలు చేసినట్లు తెలుస్తోంది. సోషల్ మీడియాలో ఈ ప్రమాద ఘటన జరిగిన వీడియోలో ప్రస్తుతం సోషల్ మీడియాలో సర్క్యూలేట్ అవుతోంది.स्कूटी गिरवी रखी। किराए पर कार ली। स्पीड 130 से ऊपर, नतीजा; 4 दोस्तों की मौतदोस्त का जन्मदिन मना रहे थे। उदयपुर में पुराने अहमदाबाद बाइपास पर 2 कारों की भिड़ंत हो गई। कार सवार 6 दोस्त 10 मिनट तक जान बचाने की गुहार लगाते रहे। जब तक लोग पहुंचे तब तक 4 दोस्तों की मौत हो चुकी थी। pic.twitter.com/wM5C5MyvwI— Arvind Sharma (@sarviind) January 19, 2026 -
నటుడు నరేష్ బర్త్‌డే స్పెషల్.. పవిత్రతో అనుబంధం (ఫోటోలు)
-
హీరోయిన్ సంఘవి కూతురి బర్త్‌డే సెలబ్రేషన్స్ (ఫోటోలు)
-
కూతురి బర్త్‌డేకి... తల్లి సర్ప్రైజ్
బర్త్‌డే అంటే వయసుతో నిమిత్తం లేకుండా అందరమూ చిన్నపిల్లలైపోతాం. చిన్న వయసులో బర్త్‌డే అంటే ఎదుగుతున్నామన్న సంతోషం అటు తల్లిదండ్రుల్లోనూ, ఇటు పిల్లల్లోనూ ఉండటం సహజం. ఒక సంవత్సరం వయసు పెరుగుతోందన్న బెంగ లేకుండా పెద్దలు కూడా ఈ పుట్టిన రోజును జరుపుకోవడం విశేషం. అంత స్పెషల్ పుట్టిన రోజు. ఈ వేడుకల్లో ఇష్టమైన బట్టలు, ప్రదేశాలు, కోరికలు ఇలా చిట్టా చాలానే ఉంటాయి. కానీ మనకిష్టమైన వాళ్లు, మనకిష్టమైన వంటకాలను అదీ ఇంట్లో వండితే బాగా గుర్తుండిపోతాయి. దీన్నేకంటెంట్ క్రియేటర్ బర్త్‌డేని ఆమె తల్లి ఫుడీగా నిర్వహించింది. అదేంటో చూద్దాం.కంటెంట్ క్రియేటర్ సారా సరోష్ 27వ పుట్టినరోజును ఆమె కుటుంబంగా వినూత్నంగా జరుపుకుంది. ఆమె 27 ఏళ్లను గుర్తు చేసుకుంటూ ఆమె తల్లి ఒకటీ రెండు కాదు, ఏకంగా 27 రకాల వంటకాలను తయారు చేసింది. దీనికి సంబంధించిన వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్‌గా మారింది. ఈ క్లిప్ పుట్టినరోజు అమ్మాయి తన ఇంట్లోకి ప్రవేశించడంతో ప్రారంభమవుతుంది, ఈ రూమ్ అంతా అద్భుతమైన అలంకరణలతోపాటు, టేబుల్‌పై అమర్చిన పదార్థాలు చూసి ఆశ్చర్యపోవడం బర్త్‌డే గార్ల్ వంతైంది.అలాగే కుటుంబ సభ్యులందరూ రకరకాల ఆహార పదార్థాలు టేబుల్‌పై అమర్చడానికి ముందు వాటిని తయారు చేయడం, చివరి నిమిషంలో కొన్ని వంటకాలను, తల్లి తయారు చేస్తున్న దృశ్యాలను వీడియోలో చూడొచ్చు. వావ్.. 27 ఏళ్లకు 27 వంటకాలు, నా బర్త్‌డేకి బెస్ట్ గిఫ్ట్ థ్యాంక్యూ అమ్మా...ఎప్పటికీ నువ్వే మా అమ్మ అంటూ సారా తన సంతోషాన్ని వెలిబుచ్చింది. View this post on Instagram A post shared by Sylvia D'costa (@maa.madeit) ఈ విందులో వివిధ రకాల ఫ్రైడ్ చికెన్ ముక్కలు, వింగ్స్, చిన్న సమోసాలు, పినా కోలాడా,రస్నా గ్లాసులు ఉన్నాయి. సలాడ్లు, పాస్తాలు, ఇతర డిషెస్ ఉన్నాయి. టేబుల్ మధ్యలో ఫ్రాస్టింగ్‌తో కూడిన గుండ్రని చాక్లెట్ కేక్ ఉంది, దాని పక్కనే ప్రాన్ సుషీ, ప్రాన్ ఫ్రై, దహీ కే కబాబ్, స్టఫ్డ్ పొటాటోస్, తందూరి ప్రాన్స్ , చికెన్ షెజ్వాన్ వంటి వంటకాలు ఉన్నాయి.ఇదీ చదవండి: 26..26 : ప్రేమకు కొత్త అర్థం చెప్పిన ప్రియుడు, వైరల్ వీడియోదీనిపై నెటిజన్లు కూడా తమ ఆనందాన్ని ప్రకటించారు. ఇంత అద్భుతమైన తల్లిదండ్రులున్నందుకు నువ్వు చాలా అదృష్టవంతు రాలివి అంటూ సారాను దీవించారు. తల్లి ప్రేమ అంటే ఇలానే ఉంటుంది. ఈ వంటకాల గురించి తెలుసుకోవాలని ఉంది అని ఒకరు, ఇది ఏఐ పిక్లా ఉంది అని మరొకరు చమత్కరించారు. ఇదీ చదవండి: గడ్డకట్టిన సరస్సులో : గుండెలు పగిలే విషాదం వీడియో వైరల్ -
గర్ల్‌ఫ్రెండ్ కోసం 26 కిలోమీటర్ల పరుగు.. ట్విస్ట్ ఏంటంటే!
-
భార్య బర్త్‌డే సెలబ్రేట్ చేసిన నితిన్ (ఫోటోలు)
-
Yash Birthday : యశ్ అసలు పేరేంటో తెలుసా? (ఫోటోలు)
-
గోవాలో బీచ్ ఒడ్డున హీరోయిన్ రాశీ బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)
-
కత్రినా కైఫ్ చెల్లిని ఎప్పుడైనా చూశారా? (ఫొటోలు)
-
దిలీప్ కుమార్.. ఏఆర్ రెహమాన్‌గా ఎలా మారాడు?
తెలుగులో గతంలో చాలా సినిమాలు చేసినప్పటికీ రీసెంట్ టైంలో 'చికిరి' పాటతో మరింత గుర్తింపు తెచ్చుకున్నాడు సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్. మద్రాసులో పుట్టి పెరిగిన ఇతడు.. దక్షిణాదితో పాటు హిందీలోనూ గత మూడు దశాబ్దాలుగా సంగీతమందిస్తూనే ఉన్నాడు. అయితే రెహమాన్ అసలు పేరు ఇది కాదని మీలో ఎంతమందికి తెలుసు? అవును స్వతహాగా హిందూ అయిన ఇతడు ఇస్లాం మతంలోకి మారాడు. పేరు మార్చుకున్నాడు. ఇంతకీ ఇదంతా ఎప్పుడు ఎలా జరిగింది? అనేది ఇప్పుడు చూద్దాం.(ఇదీ చదవండి: 'జన నాయగణ్' సినిమాపై రాజకీయ కుట్ర?)చెన్నైలో 1967 జనవరి 6న ఆర్కే శేఖర్, కస్తూరి దంపతులకు దిలీప్ పుట్టాడు. ఇతడికి ఓ అక్క, ఇద్దరు చెల్లెళ్లు. శేఖర్ సంగీత దర్శకుడు. దిలీప్‌కి తొమ్మిదేళ్ల వయసున్నప్పుడు తండ్రి శేఖర్ చనిపోయారు. దీంతో కుటుంబాన్ని పోషించేందుకు తండ్రి పరికరాలని అద్దెకిస్తూ వీళ్లు జీవనం సాగించారు. రెండేళ్లు గడిచేసరికల్లా అంటే 11వ యేటా దిలీప్.. కుటుంబ భారాన్ని మోసేందుకు సిద్దమయ్యాడు. పలువురు సంగీత దర్శకుల దగ్గర కీబోర్డ్, పియానో లాంటివి వాయించడం మొదలుపెట్టాడు. దిలీప్ తల్లికి ఆధ్యాత్మికత ఎక్కువ. ఇంట్లో హిందూ దేవతలతో పాటు ఇస్లాం, క్రైస్తవ మతానికి సంబంధించిన ఫొటోలు కూడా ఉండేవి. తల్లి కస్తూరితో కలిసి నెల్లూరి తడ దగ్గరలోని సూఫీ ప్రవక్త కరీముల్లా షా ఖాద్రీ బోధనలు వినేందుకు దిలీప్ వెళ్లేవాడు. ఈ క్రమంలో ఖాద్రీ బోధనలకు వీరు కుటుంబం ఆకర్షితులయ్యారు.తమ కుటుంబానికి అంతా మంచి జరగాలని, కష్టాలు తొలగిపోవాలని కోరుకుంటూ దిలీప్ కుటుంబమంతా 1989లో ఇస్లాం మతాన్ని సీక్వరించారు. ఇది జరగడానికి కొన్నాళ్ల ముందు దిలీప్ చెల్లి పెళ్లి జరిగింది. ఆ సమయంలో ఓ జ్యోతిష్కుడిని కలిసిన ఇతడు.. తనకు దిలీప్ అనే పేరు నచ్చలేదని, ఏదైనా ముస్లిం పేరు సూచించాలని అడగ్గా.. అబ్దుల్ రహీమ్, అబ్దుల్ రెహమాన్ అనే పేర్లు సూచించారు. వీటి వల్ల అంతా మంచి జరుగుతుందని సదరు జ్యోతిష్కుడు సూచించారు. వీటిలో రెహమాన్ అనే పేరు నచ్చేసరికి దిలీప్ కాస్త రెహమాన్ అయ్యాడు. తల్లి కస్తూరి.. కొడుకు మార్చుకున్న పేరుకి ముందు 'అల్లా రఖా' అని జోడించింది. దీంతో దిలీప్ కాస్త ఏఆర్ రెహమాన్ అయ్యాడు.తర్వాత కాలంలో అంచెలంచెలుగా ఎదుగుతూ ఏఆర్ రెహమాన్.. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. అలానే తల్లి కస్తూరి కూడా తన పేరుని కరీమాగా మార్చుకుంది. సినిమాలతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ.. కడప పెద్ద దర్గా, కసుమూరు దర్గా, నెల్లూరు దర్గాని రెహమాన్ సందర్శిస్తుంటారు. తెలుగులో ఈయన.. నిప్పురవ్వ, సూపర్ పోలీస్, గ్యాంగ్ మాస్టర్, నీ మనసు నాకు తెలుసు, నాని, ఏ మాయ చేశావె, కొమరం పులి, సాహసం శ్వాసగా సాగిపో సినిమాలు చేశారు. దాదాపు పదేళ్ల తర్వాత 'పెద్ది'తో టాలీవుడ్ ప్రేక్షకుల ముందుకొస్తున్నారు.(ఇదీ చదవండి: ఆ సినిమాలో చిన్మయి పాట కట్.. తేల్చేసిన దర్శకుడు) -
దీపికా పదుకోణె బర్త్‌డే స్పెషల్.. వైరల్ ఫోటోలు ఇవే
-
దుబాయ్‌లో గ్రాండ్‌గా తల్లి బర్త్‌డే : వివాదాల బ్యూటీ వీడియో వైరల్
నటి,వివాదాలతో వార్తల్లో నిలిచే బ్యూటీ క్వీన్ ఊర్వశి రౌతేలా తన తల్లి మీరా రౌతేలా పుట్టిన రోజును ఘనంగా నిర్వహించింది. ప్రపంచంలోనే అతి పెద్ద హెటల్, 24 క్యారెట్ల బంగారు కిరీటం, గోల్డ్ కేక్ లాంటి విశేషాలతో గుర్తుండిపోయేలా వేడుక చేసింది. దీనికి సంబంధించిన వీడియో,ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది.ప్రపంచంలోని ఎత్తైనహోటల్లో 24 క్యారెట్ల బంగారు కిరీట కేక్‌తో అమ్మ పుట్టినరోజు వేడుక.. మేం అందరం నిన్ను ప్రేమిస్తున్నాం. వరల్డ్ టాలెస్ట్ హోటల్,ప్యూర్ రాయల్ గోల్డ్ క్రౌన్ కేక్,ప్యూర్ లవ్’’అంటూ ఊర్వశి పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. దీంతో తల్లికి పుట్టినరోజు శుభాకాంక్షలతోపాటు, ఊర్వశిపై ప్రశంసలు వెల్లువెత్తాయి.ఇదీ చదవండి: ఐదు నెలల చిన్నారి ఉసురు తీసిన ‘పాలు’విలాసవంతమైన వేడుకలో మూడు లేయర్ల బంగారు రంగు కేక్ ఒక ఆకర్షణ అయితే, 24 క్యారెట్ల బంగారంతో చేసిన కిరిటాన్ని ఊర్వశి తన తల్లి తలపై ఉంచడం మరో ఎట్రాక్షన్‌గా నిలిచింది. అందంగా ముస్తాబైన మీరా నవ్వుతూ, తన కుమార్తె స్వచ్ఛమైన ఆప్యాయత అనురాగాలను మురిసిపోయింది. కాగా ప్రతీ ఏడాది తల్లి బర్త్‌డే ఘనంగా నిర్వహించడం ఊర్వశికి అలవాటు. ఊర్వశి కలాజికల్ హారర్ చిత్రం కసూర్ 2 , వెల్కమ్ టు ది జంగిల్లలో నటించనుంది. గ్లెన్ బారెట్టో దర్శకత్వంలో ఆమె అఫ్తాబ్ శివదాసాని, జాస్సీ గిల్‌తో కలిసి నటిస్తోంది. View this post on Instagram A post shared by Urvashi Rautela (@urvashirautela) ఇదీ చదవండి: ఐఐటీ హైదరాబాద్ విద్యార్థికి ఏకంగా రూ. 2.5 కోట్ల ఆఫర్, రికార్డ్ -
అన్షులా కపూర్ బర్త్ డే పార్టీ.. జాన్వీ కపూర్ మిస్సింగ్ (ఫొటోలు)
-
చరణ్-ధోనీ-సల్మాన్ ఒకేచోట... ఫొటో వైరల్
మెగా హీరో రామ్ చరణ్.. టీమిండియా స్టార్ క్రికెటర్ ధోనీ, బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్‌తో కనిపించాడు. వీళ్లకు తోడుగా 'యానిమల్' ఫేమ్ బాబీ డియోల్ కూడా సందడి చేశాడు. వీళ్లంతా కలిసి చిల్ అవుతున్న ఓ ఫొటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇంతకీ వీళ్లు ఎక్కడ ఎప్పుడు కలిశారు?(ఇదీ చదవండి: ఫ్రీగా సినిమాలు చేశా.. అడిగితే ఒక్కరు సపోర్ట్ చేయట్లేదు: సుదీప్)బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్.. 60వ పుట్టినరోజు వేడుకలు శనివారం జరిగాయి. పన్వేల్‌లోని తన ఫామ్‌హౌస్‌లో ఈ సెలబ్రేషన్స్ జరగ్గా.. సల్మాన్ కుటుంబ సభ్యులతో పాటు పలువురు సెలబ్రిటీలు కూడా ఇందులో సందడి చేశారు. టాలీవుడ్ నుంచి రామ్ చరణ్ కనిపించాడు. క్రికెటర్ ధోనీ, నటుడు బాబీ డియోల్ కూడా వీళ్లతో పాటు కనిపించారు.మెగా ఫ్యామిలీతో సల్మాన్ ఖాన్‌కి మంచి అనుబంధం ఉంది. కొన్నేళ్ల క్రితం చిరంజీవి 'గాడ్ ఫాదర్'లో సల్మాన్ అతిథి పాత్రలో కనిపించాడు. సల్మాన్ మూవీ 'కిసీ కా బాయ్ కిసీ కా జాన్'లో చరణ్ అతిథి పాత్ర పోషించాడు. ఇప్పుడు కూడా ఆ అనుబంధం దృష్ట్యా సల్మాన్ బర్త్ డే పార్టీలో చరణ్ సందడి చేశాడు. ఆ ఫొటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.(ఇదీ చదవండి: సైలెంట్‌గా ఓటీటీల్లోకి వచ్చేసిన తెలుగు సినిమాలు) -
బేబీ బంప్‌తో హీరోయిన్ బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)
-
హ్యాపీ బర్త్ డే మై హార్ట్‌బీట్.. భర్తకు జెనీలియా విషెస్ (ఫొటోలు)
-
లావణ్య బర్త్ డే.. భర్త వరుణ్ తేజ్ లవ్లీ పోస్ట్ (ఫొటోలు)
-
సతీమణి బర్త్ డే.. మెగా హీరో స్పెషల్ విషెస్!
మెగా హీరో వరుణ్ తేజ్ తన సతీమణికి స్పెషల్ విషెస్ చెప్పారు. ఇవాళ తన భార్య, హీరోయిన్ లావణ్య త్రిపాఠి పుట్టిన రోజు కావడంతో సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలిపారు. హ్యాపీ బర్త్ డే బేబీ.. అంటూ తన ప్రేమను చాటుకున్నారు. ఈ సందర్భంగా తన భార్యతో ఉన్న క్యూట్ మూమెంట్స్ ఫోటోలను షేర్ చేశారు. ఇవీ చూసిన అభిమానులు లావణ్య త్రిపాఠికి జన్మదిన శుభాకాంక్షలు చెబుతున్నారు. ఈ పోస్ట్ చూసిన రామ్ చరణ్ భార్య ఉపాసన కొణిదెల బర్త్ డే విషెస్ తెలిపింది. కాగా.. నాగబాబు కుమారుడిగా వరుణ్ తేజ్ ఇండస్ట్రీలోకి వచ్చాడు. 'ముకుంద' సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు. ఫిదా, కంచె, తొలిప్రేమ, ఎఫ్ 2 తదితర చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే మిస్టర్, అంతరిక్షం చిత్రాల్లో తనతో పాటు కలిసి నటించిన లావణ్య త్రిపాఠితో దాదాపు ఏడేళ్ల పాటు రిలేషన్లో ఉన్నాడు. 2023లో వీళ్లిద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఈ జంటకు ఈ ఏడాది సెప్టెంబర్‌లో కుమారుడు జన్మించారు. వరుణ్-లావణ్య దంపతులు తమ వారసుడికి హనుమంతుడి పేర్లలో ఒకటైన వాయుపుత్రని స్పూర్తిగా తీసుకుని 'వాయువ్ తేజ్' అని నామకరణం చేశారు. కాగా.. మట్కా మూవీ తర్వాత.. ప్రస్తుతం వరుణ్ తేజ్ ఓ హారర్ కామెడీ చిత్రంలో నటిస్తున్నారు. View this post on Instagram A post shared by Varun Tej Konidela (@varunkonidela7) -
టాలీవుడ్ హీరోయిన్ సమీరా రెడ్డి బర్త్ డే స్పెషల్(గ్యాలరీ)
-
రజనీకాంత్ బర్త్ డే.. వింటేజ్ జ్ఞాపకాలు షేర్ చేసిన సుమలత (ఫొటోలు)
-
రజినీకాంత్ బర్త్ డే.. ప్రముఖ నిర్మాణ సంస్థ స్పెషల్ వీడియో!
తమిళ సూపర్ స్టార్, తలైవా రజినీకాంత్ ఇవాళ 75వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ ఏడాది కూలీ మూవీతో అభిమానులను మెప్పించారు. ప్రస్తుతం రజినీ జైలర్-2 మూవీలో నటిస్తున్నారు. ఇవాళ ఆయన పుట్టినరోజు కావడంతో బ్లాక్ బస్టర్ మూవీ నరసింహాను రీ రిలీజ్ చేస్తున్నారు. తలైవాకు కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్ ప్రముఖులు బర్త్ డే విషెస్ చెబుతూ పోస్టులు పెడుతున్నారు.తాజాగా రజినీకి ప్రముఖ నిర్మాణ సంస్థ సురేశ్ ప్రొడక్షన్స్ బర్త్ డే విషెస్ చెబుతూ వీడియోను రిలీజ్ చేసింది. రజనీ సినిమాల్లోని డైలాగులతో మ్యాష్అప్ వీడియోను రూపొందించి పుట్టినరోజు శుభాకంక్షలు తెలిపింది. ఒక రేంజ్ తర్వాత మాటలు ఉండవు.. అర్థమైందా రాజా.. డైలాగ్స్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకునేలా ఉన్నాయి. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఆ వీడియో చూసి ఎంజాయ్ చేయండి.సూపర్‌హిట్ సినిమాకు సీక్వెల్..రజినీకాంత్, సౌందర్య, రమ్యకృష్ణ ప్రధాన పాత్రలో వచ్చిన నరసింహ బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. 1999లో విడుదలైన ఈ సినిమా తలైవా కెరీర్లోనే ఓ మైలురాయిగా నిలిచింది. ఈ చిత్రంలో రమ్యకృష్ణ నీలాంబరి పాత్రలో అదరగొట్టేసింది. ఈ మూవీ రిలీజై ఇప్పటికి 26 ఏళ్లు అవుతున్నా సోషల్ మీడియా రీల్స్‌లో ట్రెండింగ్‌లో ఉంది. మరోసారి రమ్యకృష్ణ, రజినీకాంత్ అభిమానులను అలరించనుంది. వీరిద్దరు ప్రస్తుతం జైలర్ 2లో నటిస్తున్నారు.కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో వచ్చిన నరసింహకు సీక్వెల్ తప్పకుండా ఉంటుందని రజినీకాంత్ ఇటీవలే ప్రకటించారు. ఈ మూవీకి నీలాంబరి అనే టైటిల్ అని ఖరారు చేసినట్లు వెల్లడించారు. ప్రస్తుతం ఈ మూవీ కథపై చర్చలు జరుగుతున్నట్లు నరసింహ రీ రిలీజ్ ప్రచారంలో భాగంగా రజినీకాంత్ తెలిపారు. -
హీరోయిన్ నభా నటేశ్ బర్త్ డే స్పెషల్ (ఫొటోలు)
-
టాలీవుడ్ హీరోయిన్స్ రీ ఎంట్రీ.. ఆమెకు మాత్రమే కలిసొచ్చింది..!
సినీ ఇండస్ట్రీలో హీరోయిన్గా ఎంట్రీ ఇవ్వడం సులభమే. కానీ ఆ స్టార్డమ్ ఎప్పటికీ నిలబెట్టుకోవడం అందరికీ సాధ్యం కాకపోవచ్చు. హీరోయిన్గా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఎంతో మంది హీరోయిన్స్.. ఆ తర్వాత కొన్ని సినిమాలు చేసి కనుమరుగయ్యారు. ఒకప్పుడు వరుస చిత్రాలు చేసిన వారు.. పూర్తిగా ఇండస్ట్రీ నుంచి దూరమైపోయారు. అయినప్పటికీ సినిమాపై ఉన్న ఇష్టంతో చాలామంది సీనియర్ హీరోయిన్స్ రీ ఎంట్రీ ఇచ్చేందుకు శతవిధాలా ప్రయత్నించారు. వారిలో ఈ ఏడాది దాదాపు ఐదుగురు టాలీవుడ్ హీరోయిన్స్ తమ అదృష్టాన్ని మరోసారి పరీక్షించుకున్నారు. అయితే ఈ సారి హీరోయిన్గా కాదు.. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చారు. అలా 2025లో మరోసారి టాలీవుడ్ తలుపు తట్టిన భామలు ఎవరు? వారితో ఎంతమంది సక్సెస్ అయ్యారో ఈ స్టోరీలో తెలుసుకుందాం.హీరోయిన్ లయ..అప్పట్లో టాలీవుడ్ హీరో శివాజీతో వరుసగా సినిమాలు చేసింది లయ. కొన్ని చిత్రాలు చేసిన ఆమె అమెరికా చెక్కేసింది. సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ యూఎస్‌లోనే సెటిలైంది. కానీ ఈ ఏడాది నితిన్ మూవీ తమ్ముడుతో మరోసారి తెలుగు తెరపై మెరిసింది. అయితే ఈ చిత్రం లయకు పెద్దగా వర్కవుట్ కాలేదు.మన్ముధుడు అన్షు..నాగార్జున హీరోగా వచ్చిన మన్మధుడు చిత్రంలో తన అందంతో కట్టిపడేసి హీరోయిన్ అన్షు. ఆ తర్వాత ప్రభాస్ సరసన రాఘవేంద్ర సినిమాలో నటించి తనకంటూ గుర్తింపు తెచ్చుకుంది. కానీ కొన్నాళ్లకే సినిమాలకు గుడ్‌బై చెప్పిన ముద్దుగుమ్మ.. చాలా ఏళ్ల విరామం తర్వాత ఇటీవల సందీప్ కిషన్ హీరోగా వచ్చిన మజాకా మూవీతో తెలుగు తెరపై మెరిసింది. ఈ కామెడీ ఎంటర్టైనర్ బాక్సాఫీస్ వద్ద అభిమానులను మెప్పించలేకపోయింది. దీంతో మన్మధుడు బ్యూటీ అన్షుకు రీ ఎంట్రీ అంతగా కలిసి రాలేదు.బొమ్మరిల్లు జెనీలియా..బొమ్మరిల్లు మూవీతో ఆడియన్స్‌ను తనవైపు తిప్పుకున్న బ్యూటీ జెనీలియా. ఆ మూవీ తర్వాత తెలుగులో పలు చిత్రాల్లో నటించింది. అయితే పెళ్లి తర్వాత ఇండస్ట్రీకి దూరమైన జెనీలియా.. ఈ ఏడాది జూనియర్ మూవీతో సిల్వర్ స్క్రీన్‌పై మెరిసింది. ఈ చిత్రంలో కీలక పాత్రలో కనిపించిన జెనీలియాకు అంతగా కలిసి రాలేదు. తన గ్లామర్, నటనతో ఆకట్టుకున్నప్పటికీ సక్సెస్ మాత్రం అందుకోలేకపోయింది.కామ్నా జెఠ్మలానీ..2005లో ప్రేమికులు సినిమా ద్వారా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది కామ్నా జెఠ్మలానీ. ఆ తర్వాత తన మూడో చిత్రం రణంతో బాగా పాపులర్ అయింది. అల్లరి నరేష్‌తో బెండు అప్పారావు, కత్తి కాంతారావు వంటి సినిమాల్లో మెప్పించింది. అంతేకాకుండా కింగ్, సైనికుడు వంటి సినిమాల్లో కనిపించింది. 2013లో చివరిగా శ్రీ జగద్గురు ఆది శంకర మూవీలో మాత్రమే నటించింది.అయితే దాదాపు 12 ఏళ్ల తర్వాత మళ్లీ తెలుగు వెండితెరపైకి కామ్నా జెఠ్మలానీ రీ ఎంట్రీ ఇచ్చింది. కిరణ్ అబ్బవరం హీరోగా వచ్చిన కె-ర్యాంప్ మూవీలో మెరిసింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. దీంతో రీ ఎంట్రీలో సూపర్ హిట్‌ను సొంతం చేసుకుంది. అయితే డిసెంబర్ 10న జన్మించిన కామ్నా జెఠ్మలానీ.. 2014లో పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమైంది. ఈ ఏడాదిలో ఐదుగురు హీరోయిన్స్ తెలుగు ఇండస్ట్రీలో రీ ఎంట్రీ ఇవ్వగా.. కేవలం కామ్నా జెఠ్మాలానీనే సక్సెస్ వరించింది. ఇవాళ ఆమె బర్త్ డే సందర్భంగా ఒక్కసారి గుర్తు చేసుకుందాం.నువ్వు నేను ఫేమ్ అనిత..నువ్వు-నేను చిత్రం ద్వారా ఫేమ్ తెచ్చుకున్న అనితా చాలా ఏళ్ల తర్వాత వెండితెరపై రీ ఎంట్రీ ఇచ్చింది. సుహాస్ హీరోగా వచ్చిన ఓ భామ అయ్యో రామాలో కనిపించింది. అయితే ఈ మూవీ అనితకు పెద్దగా కలిసి రాలేదు. దీంతో గట్టిగా రీ ఎంట్రీ ఇద్దామనుకున్న అనితకు నిరాశే ఎదురైంది. సీనియర్ హీరోయిన్ల రీ ఎంట్రీలో హిట్ కొట్టకపోయినప్పటికీ అభిమానుల ఆదరణ దక్కించుకున్నారు.అంతేకాకుండా టాలీవుడ్లో ఒకప్పుడు స్టార్ హీరోయిన్స్‌గా గుర్తింపు పొందిన చాలా మంది ఇటీవల రీ ఎంట్రీ ఇచ్చారు. భూమిక, రంభ, మీనా, విజయశాంతి, సంగీత, మీరా జాస్మిన్, సదా లాంటి సీనియర్ హీరోయిన్లు మరోసారి వెండితెరపై మెరిశారు. వీరిలో కొంతమంది మెప్పించారు. మరికొందరేమో ఇండస్ట్రీలో గట్టి పోటీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. -
ఫేట్ మార్చిన ఒక్క సినిమా.. రుక్మిణి వసంత్ బర్త్ డే (ఫొటోలు)
-
అమ్మ పుట్టినరోజుని పెళ్లిలా సెలబ్రేట్ చేశాడు..!
అమ్మ అంటేనే ఓ భావోద్వేగం. సృష్టికి ప్రతిరూపం, ప్రతక్ష దైవం అమ్మే..అలాంటి అమ్మ జన్మదినోత్సవాన్ని ఏ పిల్లలైన చక్కగా సెలబ్రేట్ చేయాలనుకుంటారు. మహా అయితే కేక్ కటింగ్ లేదా ఆమెకు నచ్చిన ప్రదేశానికి తీసుకెళ్లి సెలబ్రేట్ చేయడమో చేస్తాం. కానీ ఈ ఎంటర్ప్రెన్యూర్ వాళ్ల అమ్మ బర్త్‌డేని ఏ రేంజ్లో సెలబ్రేట్ చేశాడంటే..అది పెళ్లా లేక మరేదైనా..అని ఫీల్ వస్తుంది.ఆ రేంజ్లో అదిరిపోయేలా సెలబ్రేట్ చేశాడు ఆ కుమారుడు. ఆ వేడుకకు వచ్చిన వారంతా గొప్ప కొడుకు అంటూ మెచ్చుకున్నారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఆ కుమారుడే ఆకాశ్ మెహాతా. తన 60 ఏళ్ల తల్లి చేతనా మెహతా పుట్టిరోజుని ఎంత ఘనంగా సెలబ్రేట్ చేశాడంటే..ఏదో పెళ్లి వేడుక అనుకునేలా గ్రాండ్‌గా సెలబ్రేట్ చేశాడు. ఆ వీడియో క్లిప్‌లో నాలుగు భాగాల గ్రాండ్ వేడుకలు కనిపిస్తాయి. ఇందులో భక్తి, సంగీతం, ఎడారి సఫారీ, తదితర పలు విలాసవంతమైన పార్టీలతో సన్నిహితులు, బంధువర్గం ఆశ్చర్యపోయేలా జరిపాడు. అందరూ ఇది పుట్టినరోజు వేడుకలా లేదు, ఏదో పెళ్లికి వచ్చినట్లుగా ఉంది మాకు అంటూ ఆకాశ్ మెహాతాను మెచ్చుకున్నారు. అంతేగాదు అందరికీ నీలాంటి కొడుకు ఉంటే ఎంత బాగుండును అని ప్రశంసించారు కూడా. అందుకు సంబంధించని వీడియోని ఆకాశ్ మెహతా షేర్ చేసతూ పోస్టులో ఇలా రాశారు. "నా ప్రాణ స్నేహితురాలికి 60వ పుట్టినరోజు శుభాకాంక్షలు. మాటలకు మించి నిన్ను ప్రేమిస్తున్నా అంటూ హార్ట్ ఎమోజీలను జోడించారు". ఇక నెటిజన్లు సైతం ఆ వీడియోని చూసి..అందమైన అమ్మకు పుట్టినరోజు శుభాకాంక్షంలు. బర్త్‌డేని ఓ గొప్ప వేడుకలా చేశారంటూ ఆకాశ్‌పై పొగడ్తల వర్షం కురిపించారు. View this post on Instagram A post shared by Akash Mehta (@mehta_a) (చదవండి: సుందర దృశ్యాలకు నెలవు..! మంచు కొండల్లో మరువలేని ప్రయాణం..) -
హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ బర్త్‌డే స్సెషల్ (ఫోటోలు)
-
ప్రభాస్ ది రాజా సాబ్.. అత్తారింటికి దారేది నటుడి స్పెషల్ పోస్టర్..!
రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న చిత్రం " ది రాజా సాబ్". ఈ రొమాంటిక్ హారర్ కామెడీ చిత్రానికి మారుతి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన టీజర్, సాంగ్స్‌కు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ సినిమా థియేటర్లలో సందడి చేయనుంది.ఈ చిత్రంలో అత్తారింటికి దారేది నటుడు బోమన్ ఇరానీ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇవాళ ఆయన బర్త్ డే కావడంతో మేకర్స్ ప్రత్యేక పోస్టర్ రిలీజ్ చేశారు. ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ మూవీ టీమ్ స్పెషల్ పోస్టర్ పంచుకున్నారు. ఈ సినిమాలో సైకియాట్రిస్ట్, హిప్నాటిస్ట్, పారానార్మల్ ఇన్వెస్టిగేటర్‌గా బొమన్ ఇరానీ ప్రేక్షకులను ఆకట్టుకోనున్నారు. కాగా.. ఇందులో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్లో టీజీ విశ్వప్రసాద్,కృతి ప్రసాద్ నిర్మించారు. ఈ మూవీ జనవరి 9న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సినిమాకు తమన్ సంగీతమందిస్తోన్న సంగతి తెలిసిందే. -
బెస్ట్ అమ్మ ఇన్ ది వరల్డ్.. నయనతారకు క్యూట్ విషెస్
లేడీ సూపర్ స్టార్ నయనతార ఇటీవలే తన పుట్టినరోజును సెలబ్రేట్ చేసుకుంది. నవంబర్ 18న 42వ వసంతంలోకి అడుగుపెట్టింది ముద్దుగుమ్మ. ఈ సందర్భంగా ఆమెకు పలువురు సినీతారలు విషెస్ తెలిపారు. ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉన్న నయన్.. తాజాగా సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ వైరల్‌గా మారింది.ఈ ఏడాది తన పుట్టినరోజున తన పిల్లలు ప్రత్యేకంగా విష్ చేసినట్లు పోస్ట్ చేసింది. తన కవలలు ఉయిర్, ఉలగం రాసిన క్యూట్ కొటేషన్‌ను ఇన్‌స్టాలో షేర్ చేసింది. హ్యాపీ బర్త్‌డే టూ బెస్ట్ అమ్మ ఇన్ ది వరల్డ్ అంటూ చిట్టి చేతులతో రాసిన పేపర్‌ను నయన్ సోషల్ మీడియాలో పంచుకుంది. ఇది కాస్తా వైరల్ కావడంతో క్యూట్ అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by N A Y A N T H A R A (@nayanthara) -
అమెరికా: మరోసారి కాల్పులు.. నలుగురి మృతి
స్టాక్టన్: కాలిఫోర్నియాలోని స్టాక్టన్లో శనివారం రాత్రి జరిగిన ఓ బాలుడి పుట్టినరోజు వేడుక విషాదంగా మారింది. ఓ విందు హాల్లో జరిగిన ఈ వేడుకలో దుండగులు జరిపిన కాల్పుల్లో నలుగురు మృతిచెందగా, 19 మందికి గాయాలయ్యాయి. బాధితులను చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రులకు తరలించారు. ఈ ఘటనపై శాన్ జోక్విన్ కౌంటీ షెరీఫ్ కార్యాలయం దర్యాప్తు ప్రారంభించింది. నిందితులు పరారీలో ఉన్నారని తెలియవచ్చింది.ఈ ఘటనపై శాన్ జోక్విన్ కౌంటీ షెరీఫ్ కార్యాలయం ‘ఎక్స్’లో వివరాలు అందించింది. లూసిల్ అవెన్యూలోని 1900 బ్లాక్‌లో కాల్పులు జరిగినట్లు తెలిపారు. ఈ ఘటన దరిమిలా డిప్యూటీలు మరిన్ని వివరాలను సేకరించే పనిలో ఉన్నారని పేర్కొన్నారు. ప్రారంభ నివేదికల్లో కాల్పులు డైరీ క్వీన్ రెస్టారెంట్ సమీపంలో జరిగాయని తెలిపారు. ఈ ఘటనపై స్టాక్టన్ వైస్ మేయర్ జాసన్ లీ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. పిల్లల పుట్టినరోజు పార్టీ జరుపుకునే ప్రదేశం.. ప్రజలు తమ ప్రాణాల కోసం భయపడే ప్రాంతంగా మారడం విచారకరమన్నారు. ఘటనా స్థలంలో ఏమి జరిగిందో తెలుసుకునేందుకుప్రజా భద్రతా అధికారులతో సంప్రదిస్తున్నానని వైస్ మేయర్ తెలిపారు. బాధిత కుటుంబాలను ఆదుకుంటామన్నారు. ఈ లక్షిత దాడిలో పాల్గొన్న అనుమానితుడి గురించి అధికారులు ఇప్పటివరకు ఎలాంటి నిర్దిష్ట వివరాలను విడుదల చేయలేదు. అయితే దర్యాప్తు చురుకుగా కొనసాగుతోంది. గాయపడిన బాధితుల పరిస్థితిపై తాజా సమాచారం తెలియాల్సి ఉంది. స్థానికులు పంచుకున్న వీడియోలు, కథనాల ప్రకారం, పిల్లల పుట్టినరోజు వేడుకలో ఒక్కసారిగా కాల్పుల శబ్దాలు వినిపించాయి. దీంతో వేడుకల్లో పాల్గొన్నవారు తీవ్ర భయాందోళనతో పరుగులు తీశారు. ఈ ఘటన జరిగిన డైరీ క్వీన్ రెస్టారెంట్ సమీపంలోని ప్రాంతాన్ని పోలీసులు చుట్టుముట్టారు. కాగా రెండు రోజుల క్రితంఅమెరికాలోని వాషింగ్టన్ డీసీలో వైట్ హౌస్‌కు కొద్ది దూరంలో ఇద్దరు నేషనల్ గార్డ్ సైనికులపై కాల్పులకు జరిగాయి. వీరిని వెస్ట్ వర్జీనియా నేషనల్ గార్డ్ సభ్యులుగా గుర్తించారు. వీరి పరిస్థితి విషమంగా ఉందని ఎఫ్‌బీఐ డైరెక్టర్ కాష్ పటేల్, వాషింగ్టన్ మేయర్ మురియెల్ బౌసర్ తెలిపారు. ఈ కాల్పుల ఘటనకు సంబంధించి ఒక అనుమానితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.పోలీసుల కస్టడీలో ఉన్న అనుమానితుడికి కూడా ఈ ఘటనలో గాయాలయ్యాయి. అయితే అవి ప్రాణాపాయం కాని గాయాలని చట్ట అమలు అధికారులు తెలిపారు. అనుమానితుడి ఉద్దేశ్యం ఏమిటి? అతను గార్డ్ సభ్యులనే లక్ష్యంగా చేసుకున్నాడా? అనే విషయాలపై దర్యాప్తు అధికారులు దృష్టి సారించారు. ఈ ఘటన గురించి గవర్నర్ పాట్రిక్ మోరిస్సే స్పందిస్తూ ‘దర్యాప్తు కొనసాగుతున్నందున మేము సమాఖ్య అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నాం’ అని అన్నారు. 🚨🇺🇸 BREAKING: CALIFORNIA MASS SHOOTING WAS AT A CHILD’S BIRTHDAY PARTYJason Lee, who grew up in Stockton and now serves as Vice Mayor, poured his heart out:“Tonight, my heart is heavy… I am devastated and angry to learn about the mass shooting at a child’s birthday party.… https://t.co/Bmb0Ef0nYJ pic.twitter.com/Rh2jSbNAnl— Mario Nawfal (@MarioNawfal) November 30, 2025ఇది కూడా చదవండి: National Herald Case: ‘గాంధీ’లకు బిగుస్తున్న ఉచ్చు -
70 ఏళ్ల స్నేహం, సరిగ్గా ఆయన పుట్టినరోజు నాడే మాయం
ముంబై: 70 ఏళ్ల అపురూపమైన స్నేహం వారిది. ఇద్దరూ లెజెండ్స్. లెజెండరీ స్క్రీన్ రైటర్ సలీం ఖాన్ (నవంబర్ 24)న 90 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. మరికొన్ని మరో లెజెండ్రీ నటుడు ధర్మేంద్ర (డిసెంబర్ 8) కూడా 90 ఏళ్లు నిండుతాయనగా జరుపుకునే వారు. కానీ అన్నీ మనం అనుకున్నట్టే జరగవు కదా. ఇటీవల తీవ్ర అనారోగ్యం నుంచి కోలుకుని ఇంటికి చేరిన ప్రముఖ బాలీవుడ్ ధర్మేంద్ర ఇక సెలవంటూ ఈ లోకాన్ని వీడారు. అదీ తన ప్రాణ స్నేహితుడు సలీం ఖాన్ బర్త్‌డే రోజు కావడం మరింత విషాదాన్ని కలిగించింది. తనకు షోలే, సీతా ఔర్ గీతా చిత్రాలతో లాంటి సూపర్‌హిట్స్ అందించిన రచయిత సలీం ఖాన్ 90వ పుట్టినరోజున, 89 ఏళ్ల వయసులో మరణించడం యాదృచ్చికమే అయినా బాధాకరమైందని పలువురు బాలీవుడ్ ప్రముఖులు ధర్మేంద్రకు అంజలి ఘటించారు.అపూర్వ స్నేహితుల పరిచయం1935వ సంవత్సరంలో వీరిద్దరూ రోజుల తేడాతో జన్మించారు. బ్లాక్‌బస్టర్ మూవీ సీతా ఔర్ గీత చిత్రంతో 1972లో సలీం ఖాన్ ,ధర్మేంద్ర తొలిసారి కలిశారు. నిజానికి సలీం-జావేద్ ఇద్దరూ దిగ్గజ రైటర్స్‌గా చలామణి అయ్యారు. ధర్మేంద్ర హీరోగా, నటి హేమ మాలిని టైటిల్ డబుల్ రోల్లో వచ్చిన చిత్రం సీతా ఔర్ గీత భారీ హిట్ అందించింది. ఆ తరువాత ధర్మేంద్ర, సలీం ఖాన్, జావేద్ అక్తర్‌తో కలిసి మరో మూడు చిత్రాలలో పనిచేశారు. వాటిల్లో ఈ ఏడాది ప్రారంభంలో 50 ఏళ్లు పూర్తి చేసుకున్న ఐకానిక్ ‘షోలే’ కూడా ఉంది. మల్టీస్టారర్ యాదోం కి బారాత్ (1973),చాచా భటిజా (1977) ఉన్నాయి. రమేష్ సిప్పీ దర్శకత్వంలో వచ్చిన షోలే కేవలం ధరేంద్ర కరియర్లోనేకాదు, హిందీ సినిమా చరిత్రలోనే మైలురాయిగా నిలిచింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. కేవలం నాలుగు సినిమాలకే రచయితగా, నటుడిగా కలిసి పనిచేసినప్పటికీ, వార స్నేహసంబంధం కాలక్రమేణా వ్యక్తిగతంగా వికసించింది. చదవండి: పెళ్లయ్యి ఏడాది కాలేదు, డెంటిస్ట్ అత్మహత్య : మంత్రి సన్నిహితుడు అరెస్ట్ఫిట్నెస్లో ఆయనే స్ఫూర్తి1998లో సలీం ఖాన్ చిన్న కుమారుడు సోహైల్ ఖాన్ దర్శకత్వంలో, సల్మాన్ ఖాన్, కాజోల్ జంటగా నటించిన చిత్రం ప్యార్ కియా తో డర్నా క్యాలో ధర్మేంద్ర తండ్రి పాత్ర పోషించారు. ఈసందర్బంగా సలీంఖాన్ గురించి ధరేంద్రతో తన ఫ్రెండ్షిప్గురించి మాట్లాడారు. తమ అనుబంధం 1958-1959 నాటిదనీ, తమ స్నేహం చాలా గొప్పది, తనకు అన్నయ్య లాంటివాడు అని సలీం ఖాన్ గుర్తు చేసుకున్నారు. ఇటీవల ఖతార్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో, బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్ ధర్మేంద్ర పట్ల తన ప్రేమ గురించి మాట్లాడాడు. 90లలో ఆయన ఫిట్నెస్ తనకు స్ఫూర్తి అనీ, ఆయన తన తండ్రిలాంటి వారు అని పేర్కొన్న సంగతి తెలిసిందే. (ముంబై-వారణాశి చిన్నారి ఆరోహి : సెలబ్రిటీలనుంచి నెటిజన్లు దాకా కళ్లు చెమర్చే కథ) -
దుబాయిలో అర్హ బర్త్ డే సెలబ్రేషన్.. ఫొటోలు వైరల్
ఈ మధ్యే అల్లు అర్జున్ ఫ్యామిలీ దుబాయి ట్రిప్ వేశారు. తన కూతురు అర్హ పుట్టినరోజు వేడుకల్ని అక్కడే సెలబ్రేట్ చేసుకున్నారు. అప్పుడు ఫొటోలేం బయటకు రాలేదు. ఇప్పుడు బన్నీ భార్య స్నేహ తన సోషల్ మీడియాలో ఆయా ఫొటోలని షేర్ చేశారు. తన బేబీ గర్ల్‌కి తొమ్మిదేళ్లు నిండాయని చెబుతూ దుబాయి ట్రిప్ ఫొటోలని పోస్ట్ చేసింది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 15 సినిమాలు.. ఆ మూడు డోంట్ మిస్)అయితే బన్నీ ఫ్యామిలీ దుబాయిలోనే ఈ బర్త్ డేని సెలబ్రేట్ చేసుకోవడానికి కారణముంది. అల్లు అర్జున్ ప్రస్తుతం తమిళ దర్శకుడు అట్లీ తీస్తున్న ఓ సినిమాలో హీరోగా చేస్తున్నాడు. చాన్నాళ్ల క్రితమే షూటింగ్ మొదలుపెట్టారు. పలు షెడ్యూళ్లు కూడా పూర్తయ్యాయి. ఇప్పుడు దుబాయిలో కొత్త షెడ్యూల్ పెట్టుకున్నారు. ఈ క్రమంలోనే తన కుటుంబంతో పాటు బన్నీ.. దుబాయి వెళ్లాడు. స్నేహతో పాటు పిల్లలు అయాన్, అర్హ తిరిగి హైదరాబాద్ వచ్చేశారు. బన్నీ మాత్రం అక్కడే ఉండిపోయాడు.అల్లు అర్జున్-అట్లీ సినిమాలో దీపికా పదుకొణె హీరోయిన్. సాయి అభ్యంకర్ సంగీతమందిస్తున్నాడు. రీసెంట్గా వచ్చిన 'డ్యూడ్'కి సంగీతమందించింది ఇతడే. ఇకపోతే ఈ మూవీ 2027లో రిలీజయ్యే అవకాశముందని అంటున్నారు. 'పుష్ప'తో పాన్ ఇండియా లెవల్లో అలరించిన బన్నీ.. ఈసారి పాన్ వరల్డ్ టార్గెట్‌గా పెట్టుకున్నాడని అంటున్నారు. మరి ఇందులో నిజమేంటనేది తెలియాలంటే మరికొన్నేళ్లు ఆగాల్సిందే.(ఇదీ చదవండి: అమెజాన్ ఓటీటీపై ఘోరంగా ట్రోలింగ్.. ఏంటి విషయం?) View this post on Instagram A post shared by Allu Sneha Reddy (@allusnehareddy) -
హరిహర వీరమల్లు బ్యూటీ బర్త్ డే.. భర్త సర్ప్రైజ్ గిఫ్ట్!
బాలీవుడ్ భామ, హరిహర వీరమల్లు నటి నర్గీస్ ఫక్రీ (Nargis Fakhri) ఖరీదైన బహుమతిని అందుకుంది. ఆమె గతనెలలో 46వ పుట్టినరోజును జరుపుకుంది. ఈ ముద్దుగుమ్మ బర్త్ డేను పురస్కరించుకుని ఆమె భర్త టోనీ బీగ్ లగ్జరీ కారును గిఫ్ట్‌గా ఇచ్చాడు. ఈ రోల్స్ రాయిస్ కారు విలువ దాదాపు రూ.10 కోట్లకు పైగానే ఉంది. ఈ విషయాన్ని దాదాపు నెల రోజుల తర్వాత పంచుకుంది బాలీవుడ్ బ్యూటీ. సోషల్ మీడియాలో ఫోటోలు షేర్ చేసింది.ఈ బాలీవుడ్ భామ పలు హిందీ చిత్రాల్లో నటించింది. హిందీలో హౌస్‌ఫుల్-5, హౌస్‌ఫుల్-3, మేయిన్ తేరా హీరో, రాక్‌స్టార్ చిత్రాల్లో నటించింది. ఈ ఏడాది తెలుగులో పవన్ కల్యాణ్ హీరోగా వచ్చిన హరిహర వీరమల్లు మూవీలో కనిపించింది ముద్దుగుమ్మ. తాజాగా మస్తీ-4 మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చింది భామ. ఈ సినిమా ఈ రోజు నుంచే థియేటర్లలో సందడి చేస్తోంది.సినిమాలతో బిజీగా ఉండగానే టోనీని ఫిబ్రవరి 2025లో వివాహం చేసుకుంది. ఆమె భర్త టోనీ అమెరికాకు చెందిన వ్యాపారవేత్త కాగా.. కాలిఫోర్నియాలోని బెవర్లీ హిల్స్ హోటల్స్‌లో వీరిద్దరు వివాహం చేసుకున్నారు. ఈ వేడుకలో సన్నిహితులు, కుటుంబ సభ్యులు, స్నేహితులు మాత్రమే హాజరయ్యారు. పెళ్లికి ముందు మూడేళ్ల పాటు డేటింగ్లో ఉన్నారు. View this post on Instagram A post shared by Nargis Fkhri (@nargisfakhri) -
అల్లు అర్హ బర్త్ డే.. ఐకాన్ స్టార్ స్పెషల్ పోస్ట్ వైరల్!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన ముద్దుల కూతురి అల్లు అర్హకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఇవాళ అర్హ పుట్టినరోజు కావడంతో స్పెషల్ విషెస్ చెప్పారు. హ్యాపీ బర్త్ డే టూ మై లిటిల్ ప్రిన్సెస్ అంటూ ఫోటోను షేర్ చేశారు. ఇది చూసిన అభిమానులు కూడా అర్హకు జన్మదిన శుభాకాంక్షలు చెబుతూ కామెంట్స్ పెడుతున్నారు.ఇక అల్లు అర్జున్ సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీతో జతకట్టారు. పుష్ప -2 లాంటి బ్లాక్‌బస్టర్ తర్వాత అల్లు అర్జున్ హీరోగా వస్తోన్న మూవీ కావడంతో భారీ అంచనాలు పెట్టుకున్నారు ఫ్యాన్స్. ఈ మూవీని భారీ బడ్జెట్‌తో సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ ముంబయిలో జరుగుతోందని తెలిసింది. కాగా సూపర్ హీరో కాన్సెప్ట్‌తో ఈ సినిమా రూపొందుతోందని.. భారీగా గ్రాఫిక్స్ వర్క్ చేయాల్సి ఉంటుందని, ఈ కారణాల వల్ల ఈ సినిమా విడుదల 2027లో ఉండొచ్చనే ఊహాగానాలు తెరపైకి వచ్చాయి.మరోవైపు ఈ సినిమా చిత్రీకరణ అనుకున్న సమయానికన్నా ముందుగానే పూర్తయ్యే అవకాశం ఉందని.. ప్రీ ప్రోడక్షన్ వర్క్స్‌ను అట్లీ పక్కాగా ప్లాన్ చేయడమే ఇందుకు కారణమనే టాక్ వినిపిస్తోంది. అంతేకాదు... ప్రచారంలో ఉన్నట్లు ఈ చిత్రం 2027లో కాకుండా ఒక ఏడాది ముందే తెరపైకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. Happy birthday to my little princess #AlluArha 💖 pic.twitter.com/pRnMDIOlTe— Allu Arjun (@alluarjun) November 21, 2025 Wishing our sweetest and adorable little princess #AlluArha a very Happy Birthday! 🤩May this year bring you endless happiness and beautiful memories. ❤️#HBDAlluArha #HappyBirthdayAlluArha pic.twitter.com/ZSWgFi8Tl7— Geetha Arts (@GeethaArts) November 21, 2025 -
సిస్టర్ శిల్పా శిరోద్కర్ బర్త్‌డే.. చెల్లిపై నమ్రతా ప్రశంసలు (ఫోటోలు)
-
నయనతార బర్త్ డే.. గిఫ్ట్‌గా ఖరీదైన రోల్స్ రాయిస్
40 ఏళ్లు దాటినా సరే హీరోయిన్ నయనతార.. ఇప్పటికీ వరస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంది. ప్రస్తుతం ఈమె చేతిలో చిరంజీవి 'మన శివశంకరవరప్రసాద్', బాలకృష్ణ కొత్త సినిమా, యష్ 'టాక్సిక్'తో పాటు తమిళ, మలయాళ చిత్రాలు చెరో రెండు ఉన్నాయి. అసలు విషయానికొస్తే ఈసారి నయన్ తన పుట్టినరోజుని సింపుల్‌గా ఫ్యామిలీతో కలిసి సెలబ్రేట్ చేసుకుంది. భర్త విఘ్నేశ్ నుంచి గిఫ్ట్ మాత్రం చాలా ఖరీదైనది వచ్చింది.గతంలో పలు రిలేషన్షిప్స్లో ఉన్న నయన్.. తర్వాత కాలంలో తమిళ దర్శకుడు విఘ్నేశ్ శివన్‌ని ప్రేమించింది. 2022లో వీళ్లు పెళ్లి చేసుకున్నారు. తర్వాత ఏడాది నుంచి ప్రతిసారి నయన్ పుట్టినరోజుకి విఘ్నేశ్ ఖరీదైన కార్లని బహుమతిగా ఇస్తూనే ఉన్నాడు.2023లో రూ.3 కోట్లు ఖరీదు చేసే మెర్సిడెజ్ మేబాచ్, 2024 అంటే గతేడాది రూ.5 కోట్లు విలువ చేసే మెర్సిడెజ్ బెంజ్ మేబాచ్ జీఎల్ఎస్ 600 కారుని విఘ్నేశ్ బహుమతిగా నయనతారకు ఇచ్చాడు. ఇప్పుడు ఏకంగా రూ.10 కోట్ల ఖరీదైన రోల్స్ రాయిస్ బ్లాక్ బ్యాడ్జ్ స్పెక్ట్ర్ కారుని బహుమతిగా ఇచ్చాడు. ఆ ఫొటోలని విఘ్నేశ్ తన ఇన్ స్టాలో పోస్ట్ చేశాడు. ఇప్పుడీ ఫొటోలు వైరల్ అవుతున్నాయి. View this post on Instagram A post shared by Vignesh Shivan (@wikkiofficial) -
40 ఏళ్లు దాటినా ఫుల్ ఫామ్‌లో.. నయనతార బర్త్ డే స్పెషల్ (ఫొటోలు)
-
పెట్ బర్త్ డే.. హీరోయిన్ త్రిష హంగామా (ఫొటోలు)
-
నువ్వే నా నంబర్ వన్ లవ్.. యాంకర్ రష్మీ పోస్ట్ (ఫొటోలు)
-
భర్త బర్త్ డే.. సుమ క్యూట్ పోస్ట్ (ఫొటోలు)
-
సువర్ణ గళ దేవత
నేనెప్పుడూ ప్రసిద్ధి చెందాలని కోరుకోలేదు. పాటలు పాడి శ్రోతల్ని సంతోషపెట్టాలని మాత్రమే అనుకున్నాను. అభిరు చికి కట్టుబడి, నిజాయతీగా కష్టపడి పని చేస్తే మన ప్రతిభకు ఆశీర్వచనాలు లభిస్తాయి. నిరంతర సాధన, అభ్యాసం అనేవి కళాకారునికి శ్వాస వంటివి. – పి.సుశీల (90), నేపథ్య గాయని దక్షిణ భారత ప్లేబ్యాక్ రంగంలో అగ్రగామి గాయకురాలు పి. సుశీల. 12 భాషల్లో వేలాది పాటలు పాడిన ఆమెను ‘గాన సరస్వతి’ అనడం అతిశయోక్తి కాదు. ఆంధ్రప్రదేశ్‌లోని విజయ నగరంలో 1935 నవంబర్ 13న ప్రసిద్ధ క్రిమినల్ న్యాయవాది,సంగీత ప్రియుడు పులపాక ముకుంద రావు – శేషావతారం దంప తుల ఐదవ సంతానంగా ఆమె జన్మించారు.సుశీల కర్ణాటక సంగీతంలో అత్యుత్తమ వయొలిన్ విద్వాంసులైన ‘సంగీత కళానిధి’ ద్వారం వెంకటస్వామి నాయుడు, ఆయన కుమారుడు ద్వారం భావనరాయణల వద్ద ఆరు సంవత్సరాలు కఠిన శిక్షణ పొంది, గాత్ర సంగీతంలో డిప్లొమా సాధించారు. మొదట్లో వివాహ వేడుకలలో శాస్త్రీయ సంగీతం ఆలపించేవారు. సినిమా పాటలు పాడటానికి చెన్నై చేరే ముందు కొన్ని ఆలయ కచేరీలు ఇచ్చేవారని కొద్దిమందికి మాత్రమే తెలుసు. సుశీల స్వరం మూడో స్థాయిని కూడా స్పష్టంగా దాటుతుందని అందరికీ తెలుసు. ప్రముఖ వీణా విద్వాన్ ‘వీణ గాయత్రి’... సుశీల స్వరాన్ని ఒక గాత్ర వీణగా వ్యాఖ్యానించారు. ఆమె గొంతులో సూక్ష్మ గమకాలు సైతం అత్యంత స్పష్టతతో వినవచ్చు. ఈ గుణం సుశీలను శాస్త్రీయ గాయకులు కూడా భయపడే, గౌరవించే గాయనిగా చేసింది. ఆమె 1970లో ‘ఉయర్న్ద మనిదన్’ (1969) చిత్రానికి ఉత్తమ మహిళా ప్లేబ్యాక్ గాయనిగా జాతీయ చలనచిత్ర అవార్డును గెలుచు కున్నారు. ఆ తర్వాత ఆమె తెలుగు, తమిళ చిత్రాలకు మరో నాలుగు జాతీయ అవార్డులను గెలుచుకున్నారు. ఆ కాలంలోని ప్రముఖ గాయకులైన ఘంటసాల వేంకటేశ్వర రావుతో తెలుగులో, టి.ఎం. సౌందరరాజన్, పి.బి. శ్రీనివాస్‌లతో తమిళం, కన్నడ భాషలలో; తరువాత ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యంతో తమిళం, తెలుగు, కన్నడ భాషలలో; కె.జె. ఏసుదాస్‌తో మలయాళంలో ఆమె యుగళగీతాలు పాడి దక్షిణాదిలో అగ్రగామి గాయనిగా నిలిచారు. 1991లో తమిళనాడు అత్యున్నత కళా పుర స్కారం ‘కలైమామణి’, 2004లో తెలుగు సినిమా రంగంలో ఆమె జీవితకాల కృషికి ‘రఘుపతి వెంకయ్య అవార్డు’, 2008లో 73 ఏళ్ళ వయసులో ‘పద్మభూషణ్’ పురస్కారం వంటివి వరించాయి. ఆమె సమకాలీనులైన ఎస్.జానకి, ఎల్.ఆర్. ఈశ్వరి, బి. వసంత; ఆమె జూనియర్లు కె.ఎస్. చిత్ర, ఎస్.పి. శైలజ వంటివారందరూ ఆమె స్వర నాణ్యత, స్వాభావిక శ్రావ్యతను ఎంతో గౌరవించారు. ఆమె 1962 నుండి 1990ల చివరి వరకు 17,695 పాటలను రికార్డ్ చేయడం... పాట పట్ల ఆమె నిబద్ధతకు నిదర్శనం. గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రకారం 12 భారతీయ భాషలలో సోలోలు, డ్యూయెట్లు, కోరస్, నేపథ్య పాటలు ఆమె ఖాతాలో ఉన్నాయి. ఆమె అభిమానులు చాలా మంది ఆమెకు ’భారతరత్న’ పురస్కారం ఆమె 90వ పుట్టిన రోజు కానుకగా వస్తే బాగుండు అనుకుంటున్నారు. అందుకు ఆమె ముమ్మాటికీ అర్హురాలు.– డా.ఎం.ఎస్. నీలోత్పల్ అసిస్టెంట్ ప్రొఫెసర్, వేలూరు ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, తమిళనాడు(నేడు గాన సరస్వతి పి. సుశీల 90వ జన్మదినం) -
బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ బర్త్ డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
కొత్త బట్టలు వేసుకుందువు లెయ్యి రా!
నంద్యాల జిల్లా: పుట్టిన రోజంటూ కొత్త దుస్తులు కొనిచ్చుకుంటివి, వేసుకుందువు లెయ్యి రా అంటూ ఓ తండ్రి విలపించిన తీరు పలువురిని కంట తడి పెట్టించింది. తల్లి మృతిని జీరి్ణంచుకోలేక, ఆరోగ్యం కుదుట పడక జీవితంపై విరక్తితో పుట్టిన రోజు నాడే ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండల పరిధిలోని అంకిరెడ్డి పల్లెలో మంగళవారం చోటుచేసుకుంది. గ్రాస్తులు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన దాసరి శ్రీనివాసులు కుమారుడు కార్తీక్(23) పదో తరగతి తర్వాత అగ్రికల్చర్ చదువుతూ మధ్యలో మానేశాడు. 2016లో తల్లి అరుణకుమారి అనివార్య కారణాలతో ఆత్మహత్య చేసుకోవడంతో కార్తీక్ అప్పటి నుంచి ముభావంగా ఉండేవాడు. దీనికి తోడు ఇటీవల బ్రీతింగ్ సమస్యతో బాధ పడుతున్నాడు. మంగళవారం బర్త్‌డే ఉండటంతో సోమవారం కార్తీక్‌ను తండ్రి తాడిపత్రికి తీసుకెళ్లి వైద్యం చేయించడంతోపాటు కొత్త దుస్తులు కొనిచ్చాడు. తనకు నంద్యాలలో పని ఉండటంతో వెళ్లిపోగా కార్తీక్ పట్టణంలోని పెద్దనాన్న కుమారుడి ఇంటికి వెళ్లాడు. రాత్రి వరకు అక్కడే సరదాగా గడిపాడు. మంగళవారం బర్త్‌డే కూడా ఇక్కడే చేద్దామని పెద్దనాన్న కుటుంబ సభ్యులు చెప్పినా వినకుండా నానమ్మ ఒక్కతే ఇందని గ్రామానికి చేరుకున్నాడు. ఉదయం టిఫిన్ చేసి మేడ పైకి వెళ్లాడు. మధ్యాహ్నం అయినా భోజనానికి రాకపోవడంతో నానమ్మ నారాయణమ్మ వెళ్లి చూడగా ఉరికి వేలాడుతూ కనిపించాడు. స్థానికుల సాయంతో ఉరి నుంచి తప్పించగా అప్పటికే మృతిచెందాడు. విషయం తెలుసుకున్న తండ్రి గ్రామానికి చేరుకుని కొత్త దుస్తులు వేసుకుందువు లెయ్యి రా అంటూ విలపించిన తీరు పలువురిని కంట తడి పెట్టించింది. పోలీసులు గ్రామానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. ‘నా చావుకు ఎవరూ కారణం కాదు’ అంటూ రాసిన సూసైడ్ నోట్‌ను స్వాదీనం చేసుకున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
నా హ్యాపీ బర్త్‌డే.. ప్రేయసికి పృథ్వీ షా థాంక్స్ (ఫొటోలు)
-
అద్వానీ @ 98.. శుభాకాంక్షల వెల్లువ
న్యూఢిల్లీ: బీజేపీ సీనియర్ నేత, మాజీ ఉప ప్రధాని ఎల్‌కె అద్వానీ ఈరోజు (శనివారం) తన 98వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ నేపధ్యంలో ఆయన పలువురు రాజకీయ నేతలు, ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు అందుకుంటున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’లో అద్వానీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ‘అత్యున్నత దృష్టి, తెలివితేటలతో ఆశీర్వాదం పొందిన రాజనీతిజ్ఞుడు’ అని ఆయనను అభివర్ణించారు. Greetings to Shri LK Advani Ji on his birthday. A statesman blessed with towering vision and intellect, Advani Ji’s life has been dedicated to strengthening India’s progress. He has always embodied the spirit of selfless duty and steadfast principles. His contributions have left…— Narendra Modi (@narendramodi) November 8, 2025కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. అద్వానీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఆయన లక్షలాది పార్టీ కార్యకర్తలకు స్ఫూర్తిదాయకులని అభివర్ణించారు. ఆయన పార్టీని గ్రామాల నుండి నగరాల వరకు బలోపేతం చేశారని,హోంమంత్రిగా భారతదేశ భద్రతను బలోపేతం చేశారని అమిత్ షా కొనియాడారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా మాట్లాడుతూ.. లాల్ కృష్ణ అద్వానీ తన జీవితాన్ని సమగ్రత, దేశభక్తికి అంకితం చేశారన్నారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్.. అద్వానీని బీజేపీ కుటుంబానికి మార్గదర్శక శక్తిగా ప్రశంసించారు.రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అద్వానీకి పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ.. ఆయన జీవితం సమగ్రత, దృఢ నిశ్చయం, నిస్వార్థ సేవకు నిజమైన ప్రతిబింబం అని అన్నారు. 1980లో జనతా పార్టీ రద్దు తర్వాత, అద్వానీ మరో నేత అటల్ బిహారీ వాజ్‌పేయితో కలిసి బీజేపీని స్థాపించారు. 2002 నుండి 2004 వరకు అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రభుత్వంలో అద్వానీ భారత ఉప ప్రధానిగా పనిచేశారు. 1990లో రామ జన్మభూమి ఉద్యమం సందర్భంగా రథయాత్రకు అద్వానీ నాయకత్వం వహించారు.ఇది కూడా చదవండి: 9న ‘బీఎస్ఎఫ్’ సాహస యాత్ర -
Kamal Haasan: బార్బర్ షాపులో పనిచేసి.. విశ్వనటుడిగా ఎదిగి.. (ఫోటోలు)
-
బాలీవుడ్ ముద్దుగుమ్మ ఖుషీ కపూర్ బర్త్ డే సెలబ్రేషన్స్.. ఫోటోలు
-
సతీమణి బర్త్ డే.. కేఎల్ రాహుల్ స్పెషల్ విషెస్!
బాలీవుడ్ బ్యూటీ అతియా శెట్టికి ఆమె భర్త, టీమిండియా క్రికెటర్ ప్రత్యేక విషెస్ తెలిపారు. ఇవాళ అతియా శెట్టి పుట్టినరోజు కావడంతో సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ఆమెతో ఉన్న ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేశారు. కాగా.. ఇవాళ అతియా తన 33వ పుట్టినరోజు జరుపుకుంటోంది.కేఎల్ రాహుల్ తన పోస్ట్‌లో రాస్తూ.. "నా ప్రాణ స్నేహితురాలు, సతీమణి, ప్రేమికురాలు, స్ట్రెస్ బాల్, గూఫ్బాల్కు పుట్టినరోజు శుభాకాంక్షలు. గడిచిన ప్రతి సంవత్సరం నిన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నా' అంటూ సతీమణిపై ప్రేమ కురిపించారు. దీనికి లవ్ యూ అంటూ అతియా శెట్టి రిప్లై కూడా ఇచ్చింది. కూతురు బర్త్ డే సందర్భంగా సునీల్ శెట్టి బర్త్ డే విషెస్ చెబుతూ నెట్టింట పోస్ట్ చేశారు. అతియాతో కలిసి ఉన్న ఫోటోను షేర్ చేశారు. అతియా బ్రదర్ అహన్ శెట్టి కూడా సిస్టర్‌కు ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. నా ప్రాణ స్నేహితుడిగా ఉన్న వ్యక్తికి పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ పోస్ట్ చేశాడు.కాగా.. అతియా శెట్టి కొంతకాలంగా సినిమా పరిశ్రమకు దూరంగా ఉంటోంది. 2023 జనవరి 23న క్రికెటర్ కేఎల్ రాహుల్‌ను పెళ్లాడింది. ముంబయి సమీపంలోని ఖండాలా ఉన్న సునీల్ శెట్టి ఫామ్‌హౌస్‌లో వీరిద్దరి వివాహం జరిగింది. ఆ తర్వాత ఈ జంటకు ఈ ఏడాది మార్చిలో తమ మొదటి బిడ్డకు ఎవారా అనే కుమార్తెకు స్వాగతం పలికారు. మరోవైపు అతియా 2015లో హీరోయిన్గా ఇండస్ట్రీలో రంగ ప్రవేశం చేసింది. ఆ తరువాత ముబారకన్, మోతీచూర్ చక్నాచూర్ వంటి చిత్రాలలో నటించింది. View this post on Instagram A post shared by KL Rahul👑 (@klrahul) -
54 ఏళ్ల బ్యాచిలర్ హీరోయిన్.. పుట్టినరోజు స్పెషల్ (ఫొటోలు)
-
బాలీవుడ్ బాద్షా లేటేస్ట్ యాక్షన్ మూవీ.. పవర్ఫుల్ గ్లింప్స్ రిలీజ్
డంకీ తర్వాత బాలీవుడ్ బాద్షా షారూక్ ఖాన్(Shah Rukh Khan) నటిస్తోన్న మూవీ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తన నెక్ట్స్ మూవీని సిద్ధార్థ్ ఆనంద్ డైరెక్షన్లో చేస్తున్నారు. ఈ సినిమా అప్డేట్స్ కోసం ఎప్పుడెప్పుడా వెయిట్ చేస్తున్నారు. తాజాగా ఇవాళ షారూక్ బర్త్ డే కావడంతో ఈ మూవీకి సంబంధించి బిగ్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్.షారూక్ ఖాన్ పుట్టినరోజు సందర్భంగా మూవీ టైటిల్‌ను రివీల్ చేశారు. అందరూ ఊహించినట్లుగానే కింగ్(King Movie) అనే టైటిల్ ఖరారు చేశారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ గ్లింప్స్ కూడా రిలీజ్ చేశారు. ఈ ఫుల్ యాక్షన్ మూవీ గ్లింప్స్ షారూక్ అభిమానులను తెగ ఆకట్టుకుంటోంది. ఈ మూవీ వచ్చే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా.. షారూక్ ఖాన్- సిద్ధార్థ్ కాంబోలో వచ్చిన పఠాన్ సూపర్‌హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. Sau deshon mein badnaam, Duniya ne diya sirf ek hi naam - #KING#KingTitleReveal It’s Showtime!In Cinemas 2026. pic.twitter.com/l3FLrUH1S0— Shah Rukh Khan (@iamsrk) November 2, 2025 -
హ్యాపీ బర్త్ డే మై లవ్.. ప్రియురాలితో హృతిక్ రోషన్ (ఫొటోలు)
-
భర్త పుట్టినరోజు.. వింటేజ్ ఫొటోలతో సమీరా రెడ్డి (ఫొటోలు)
-
నీతా అంబానీ : దాతగా, వ్యాపారవేత్తగా ఆమెకు ఆమే సాటి!
రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు, చైర్పర్సన్ నీతా అంబానీ 62 పుట్టిన రోజు (Happy Birthday to Nita Ambani ) జరుపుకుంటున్నారు. దాతగా వ్యాపారవేత్తగా, ఫ్యాషన్ ఐకాన్‌గా నీతా అంబానీ పేరు పెద్దగా పరిచయం అవసరం లేని పేరు. రిలయన్స్ చైర్మన్ ముఖేష్ అంబానీ భార్యగా మాత్రమేకాదు, వ్యాపారవేత్తగా, దాతగా తన ప్రత్యేకతను చాటుకుంటున్న మహిళ. రిలయన్స్ ఫౌండేషన్ ద్వారా విద్య, ఆరోగ్యం, గ్రామీణాభివృద్ధి, క్రీడలు, సాంస్కృతిక విభాగం, విపత్తు నిర్వహణ లాంటి అనేక అంశాల్లో నీతా అంబానీ తనదైన శైలిలో సేవలందించి లక్షలాదిమందికి దగ్గరయ్యారు. Warmest birthday wishes to our Founder and Chairperson, Mrs. Nita Mukesh Ambani. pic.twitter.com/mK2hdQQ8eU— Nita Mukesh Ambani Cultural Centre (@nmacc_india) November 1, 2025 అంతేకాదు ఐపీఎల్ జట్టు ముంబై ఇండియన్స్ సహ యజమానిగా జట్టు విజయవంతంగా నడిపించిన ఘనత ఆమె సొంతం. నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సొసైటీ ద్వారా, కళలకు, దేశీయ వస్త్రాలకు ఎంతో ప్రచారం కల్పిస్తున్నారు. అలాగే ఒలింపిక్ కమిటీ సభ్యురాలిగా కూడా ఎంపికైన తొలి భారతీయురాలు. ఇటీవల పారిస్‌లో జరిగిన ఒలింపిక్స్‌లో ‘ఇండియా హాల్’ ఏర్పాటుతో ప్రపంచ స్థాయిలో భారతీయ సంస్కృతిని ప్రచారం చేశారు. భారతీయ హస్తకళలను నీతా అంబానీ ‘స్వదేశీ బ్రాండ్’ పేరుతో ప్రోత్సహించారు. నీతా అంబానీ 62వ పుట్టిన రోజు (నవంబరు 1)అనేక మంది ప్రముఖులు, పలువురు సెలబ్రిటీలు ఆమెకు శుభాకాంక్షలు అందించారు. అలాగే రిలయన్స్ ఫౌండేషన్, ఎన్ఎంఏసీసీ కూడా నీతా అంబానీ ప్రత్యేకంగా బర్త్‌డే విషెస్ అందించాయి. -
హీరోయిన్ ప్రియా వారియర్ బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)
-
నా ప్రేమ ఈ రోజే పుట్టింది! లవ్ లేడీకి లవ్లీ గ్రీటింగ్స్ (ఫొటోలు)
-
హీరో నాని 13 ఏళ్ల బంధం.. లవ్లీ ఫొటోలు
-
బిగ్‌బాస్ ఆదిరెడ్డి కూతురి బర్త్ డే సెలబ్రేషన్స్... (ఫోటోలు)
-
నా బిడ్డ పుట్టి పదేళ్లు.. యాంకర్ రవి ఎమోషనల్ (ఫోటోలు)
-
హీరోయిన్ అమలాపాల్ బర్త్ డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
ఐటమ్ బ్యూటీ మలైకా 50వ బర్త్ డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
ఆశ్చర్యం.. ఐటమ్ బ్యూటీ ఇంత మోసం చేసిందా?
సామాన్యులైనా సెలబ్రిటీలు అయినా సరే మనుషులే. కాబట్టి అబద్ధాలు చెప్పడం, మోసం చేయడం లాంటివి చేస్తుంటారు. ఈసారి బాలీవుడ్ ఐటమ్ బ్యూటీ మలైకా అరోరా.. అలాంటి ఓ పొరపాటు చేసి దొరికిపోయింది. దీంతో సోషల్ మీడియాలో పెద్ద చర్చ నడుస్తోంది. ఇంతకీ అసలేమైంది? ఏంటి విషయం?ఐటమ్ సాంగ్స్‌తో గుర్తింపు తెచ్చుకున్న మలైకా అరోరాకు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్నారు. ఎందుకంటే 'గబ్బర్ సింగ్' చిత్రంలో కెవ్వు కేక పాటలో డ్యాన్స్ చేసి ఇక్కడ కూడా క్రేజ్ సంపాదించుకుంది. చాన్నాళ్ల పాటు సినిమాలకు బ్రేక్ ఇచ్చిన మలైకా.. ఈ మధ్యనే మళ్లీ సాంగ్స్ చేస్తోంది. రీసెంట్గా థియేటర్లలో రిలీజైన 'థామా'లోనూ ఓ క్రేజీ సాంగ్ చేసింది. సరే ఇదంతా పక్కనబెడితే తాజాగా 50వ పుట్టినరోజు వేడుకల్ని గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంది.(ఇదీ చదవండి: సైలెంట్‌గా ఓటీటీల్లోకి వచ్చిన తెలుగు సినిమాలు) సినిమా సెలబ్రిటీ.. బర్త్ డే సెలబ్రేట్ చేసుకోవడం, సెలబ్రిటీలు సందడి చేయడం సాధారణమే. అయితే మలైకా తన 50వ పుట్టినరోజు అని చెప్పింది. కానీ నెటిజన్లు మాత్రం ఆమె అబద్ధం చెబుతోందని అంటున్నారు. ఎందుకంటే గతంలో 2019లో 46వ బర్త్ డేని జరుపుకొంది. అంటే ఇప్పుడు 52వ ఏడాదిలోకి వస్తుంది. కానీ విచిత్రంగా కేక్‌పైన 50 అని నంబర్ కనిపించింది. వికిపీడియా లేని టైంలో ఇలాంటివి ఏమైనా చేశారంటే సరేలే అనుకోవచ్చు. ఇంత టెక్నాలజీ ఉన్న ఈ కాలంలోనూ ఇలాంటి రెండేళ్ల వయసు తగ్గించుకోవడం ఏంటోనని నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు.మలైకా విషయానికొస్తే.. సల్మాన్ ఖాన్ సోదరుడు అర్భాజ్ ఖాన్ని 1998లో పెళ్లి చేసుకుంది. కానీ 2017లో విడాకులు ఇచ్చేసింది. వీళ్లకు అర్హాన్ ఖాన్ అనే కొడుకు కూడా ఉన్నారు. అర్భాజ్కి విడాకులు ఇచ్చేసిన తర్వాత మలైకా.. బాలీవుడ్ హీరో అర్జున్ కపూర్‌తో కొన్నాళ్లు డేటింగ్ చేసింది. ప్రస్తుతానికి సింగిల్‌గానే ఉంటోంది.(ఇదీ చదవండి: రెండోసారి తల్లి కాబోతున్న 'జయం' చైల్డ్ ఆర్టిస్ట్) -
రెబల్ స్టార్ బర్త్ డే.. 20 ఏళ్ల నాటి సినిమాను గుర్తు చేసుకున్న ఛార్మి!
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బర్త్ డే కావడంతో ఫ్యాన్స్ సెలబ్రేషన్స్‌లో మునిగిపోయారు. ఇక డార్లింగ్ కొత్త సినిమాల అప్డేట్స్ సైతం అభిమానులకు డబుల్ డోస్ ఇచ్చాయి. ఇవాళ ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా హనురాఘవపూడితో చేస్తోన్న సినిమాకు సంబంధించి పోస్టర్‌ను రిలీజ్ చేశారు. అందరూ ఉహించినట్లుగానే ఈ మూవీకి ఫౌజీ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా రానుంది. మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో ఈ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నారు.రెబల్ స్టార్ ప్రభాస్‌కు పలువురు టాలీవుడ్ సినీతారలు జన్మదిన శుభాకాంక్షలు చెప్పారు. సోషల్ మీడియాలో ప్రభాస్‌తో ఉన్న ఫోటోలను పంచుకున్నారు. తాజాగా హీరోయిన్ ఛార్మి సైతం డార్లింగ్‌కు పుట్టినరోజు విషెస్ తెలిపింది. ఈ సందర్భంగా దాదాపు 20 ఏళ్ల తర్వాత ప్రభాస్‌తో నటించిన పౌర్ణమి రీ రిలీజ్ కావడం సంతోషంగా ఉందని ట్వీట్ చేసింది.(ఇది చదవండి: ప్రభాస్, హను రాఘవపూడి కొత్త సినిమా టైటిల్ ప్రకటన)ఈ సినిమాలో ప్రతి సీన్ ఇప్పటికీ గుర్తుందని రాసుకొచ్చింది. పౌర్ణమి మూవీతో నాకున్న ఉత్తమ జ్ఞాపకాలలో ఒకటని ట్విటర్లో పోస్ట్ చేసింది. ఈ సినిమాతో మొదలైన ప్రభుదేవా, త్రిషతో స్నేహం ఇప్పటికీ కొనసాగుతోందని వెల్లడించింది. మా అభిమాన రెబెల్‌స్టార్ ప్రభాస్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ ఛార్మి విష్ చేసింది. కాగా..2006లో ప్రభుదేవా దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో ఛార్మి, త్రిష హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాకు దేవీశ్రీ ప్రసాద్ సంగీతమందించారు. After 20years,#Pournami a film which is very very close to all of us is re-releasing today on our darling #Prabhas’s birthday. I still remember each and every moment so strong and so beautiful, one of my best memories i have with pournami and even after 20years,… pic.twitter.com/kbGKXmhlmI— Charmme Kaur (@Charmmeofficial) October 23, 2025 -
ప్రభాస్ బర్త్ డే.. ఫ్యాన్స్ కోసం స్పిరిట్ దిమ్మతిరిగే అప్డేట్
-
హీరోయిన్ లయ బర్త్‌డే సెలబ్రేషన్స్ (ఫోటోలు)
-
డిఫరెంట్‌గా బర్త్‌డే సెలబ్రేట్ చేసుకున్న టాలీవుడ్ బ్యూటీ (ఫోటోలు)
-
కొత్త లోకా నటి బర్త్ డే.. తనకు తానే బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
బర్త్ డే వచ్చిందంటే చాలు.. సెలబ్రిటీల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పార్టీలు, ఖరీదైన బహుమతులు సర్వ సాధారణం. తాజాగా అలాగే ఓ ప్రముఖ నటి తన పుట్టినరోజును గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంది. మలయాళ ఇండస్ట్రీకి చెందిన ముద్దుగుమ్మ అహానా కృష్ణ తన బర్త్‌డేను స్పెషల్‌గా మార్చేసుకుంది. 30 ఏట అడుగుపెడుతున్న వేళ ఖరీదైన బహుమతిని తనకు తానే ఇచ్చుకుంది. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ క్రమంలో తన తల్లిదండ్రులపై ప్రశంసలు కురిపించింది.తన బర్త్ డే కానుకగా ఖరీదైన బీఎండబ్ల్యూ కారును కొనుగోలు చేసింది. దీని విలువ దాదాపు రూ.93 లక్షలుగా ఉన్నట్లు తెలుస్తోంది. 20 ఏళ్ల వయస్సు నుంచి 30లోకి అడుగుపెట్టినందుకు కొంచెం బాధగా ఉందని రాసుకొచ్చింది. నాకు ఫుల్ సపోర్ట్‌గా నిలిచిన తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలిపింది. ఎందుకంటే నాకు నచ్చినట్లుగా జీవించే హక్కు కల్పించినందుకు ధన్యవాదాలు అంటూ పోస్ట్ చేసింది. నేను సాధించిన ప్రతిదానికీ మీరే కారణమంటూ పేరేంట్స్‌ను కొనియాడింది. నా కలలును నిజం చేసినందుకు మీకెప్పటికీ రుణపడి ఉంటానని అహానా కృష్ట ఫోటోలను షేర్ చేసింది.కాగా.. నటుడు కృష్ణ కుమార్ కుమార్తె అయినా అహాన కృష్ణ 2014లో సినిమాల్లో అడుగుపెట్టింది. జాన్ స్టీవ్ లోపెజ్ మూవీతో తెరంగేట్రం చేసింది. ఆ తర్వాత లూకా, అడి వంటి చిత్రాల్లో నటించింది. ఆమె చివరిసారిగా ఈ ఏడాది నాన్సీ రాణిలో కనిపించింది. కల్యాణి ప్రియదర్శన్ నటించిన లోకా: చాప్టర్ 1 - చంద్ర(కొత్త లోకా) చిత్రంలో అతిథి పాత్రలో మెరిసింది. View this post on Instagram A post shared by Ahaana Krishna (@ahaana_krishna) -
దత్తత కూతురి బర్త్ డే సెలబ్రేషన్లో సన్నీ లియోన్ (ఫొటోలు)
-
సారా టెండుల్కర్ బర్త్ డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
ప్రభాస్ 'ఫౌజీ' హీరోయిన్ ఇమాన్వి బర్త్ డే స్పెషల్ (ఫొటోలు)
-
ఫారిన్లో అల్లు స్నేహా బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)
-
హీరోయిన్ పూజా హెగ్డే బర్త్ డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
హీరో నితిన్ కొడుకు బర్త్ డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
బర్త్ డే నైట్ మేమిద్దరం మాత్రమే.. అల్లు స్నేహా పోస్ట్ వైరల్
'పుష్ప 2' సినిమాతో ఇతర దేశాల్లోనూ క్రేజ్ తెచ్చుకున్న అల్లు అర్జున్.. ప్రస్తుతం దర్శకుడు అట్లీతో ఓ భారీ బడ్జెట్ మూవీ చేస్తున్నాడు. గత కొన్నాళ్లుగా ముంబైలో షూటింగ్ జరుగుతోంది. అయితే కొన్నిరోజుల క్రితం బ్రేక్ తీసుకున్న బన్నీ.. భార్య స్నేహాతో కలిసి ఫారిన్ ట్రిప్ వేశాడు. అక్కడ స్నేహా పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్నారు. ఆ ఫొటోల్ని ఇప్పుడు ఈమె తన ఇన్ స్టాలో పోస్ట్ చేసింది.(ఇదీ చదవండి: బిగ్‌బాస్ 9లో అందరూ ఓవర్ యాక్షన్.. నేనేంటో చూపిస్తా: మాధురి) సెప్టెంబరు 29న స్నేహా పుట్టినరోజు. ఈ క్రమంలోనే ఈమె తన భర్త అల్లు అర్జున్‌తో కలిసి ఆమ్స్టర్ డామ్ దేశానికి వెళ్లిపోయింది. అక్కడే బర్త్ డేని గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారు. తాజాగా ఆ దేశంలో తిరుగుతున్న కొన్ని ఫొటోలని స్నేహా పోస్ట్ చేసింది. ఇప్పుడు పుట్టినరోజుని బన్నీ, తాను మాత్రమే సెలబ్రేట్ చేసుకున్నామని చెప్పి కొన్ని ఫొటోలని షేర్ చేసింది. ఇవి ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.(ఇదీ చదవండి: ఓటీటీల్లోకి వచ్చిన 37 సినిమాలు.. ఈ వీకెండ్ పండగే) -
కమెడియన్ కూతురి 'హాఫ్ ఇయర్' బర్త్ డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
రాక్‌స్టార్ పుట్టిన రోజు : ఫ్యాన్స్ ‘జల్సా’, మమత స్పెషల్ విషెస్
బాలీవుడ్ సీనియర్ నటుడు, బిగ్ బీ అమితాబ్ బచ్చన్ శనివారం (అక్టోబర్ 11) 83వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. అద్భుతమైన నటనతో ప్రపంచ వ్యాప్తంగా అనేక మంది అభిమానులను సంపాదించుకున్నారు. కేవలం సినిమాలు మాత్రమే కాదు, టీవీ షోలు ముఖ్యంగా కౌన్ బనేగా కరోడ్‌పతి షో ద్వారా మరింత ప్రజాదరణ సంపాదించుకున్న సెలబ్రిటీ అమితాబ్ బచ్చన్. ఎన్నో విలక్షణమైన పాత్రలు గంభీరమైన స్వరం, అనన్య సామాన్యమైన నటన, అంతకుమించిన వ్యక్తిత్వం ఆయనను లెజెండ్రీగా నిలబెట్టాయి. అందుకే ఆయన పుట్టిన రోజు సందర్భంగా ముంబైలోని ఆయన నివాసం ముందు ఫ్యాన్స్చేసిన సందడి అంతా ఇంతా కాదు.అమితాబ్ బచ్చన్ అభిమానులు ఆయన పుట్టినరోజు సందర్భంగా తమ అభిమాన నటుడిని చూసేందుకు అభిమానులు తరలి వచ్చారు. మ ముంబై లోని బిగ్ బీ బంగ్లా 'జల్సా' వెలుపల గుమిగూడారు. అంతేకాదు ఆయన పోషించిన ప్రముఖ పాత్రల వేషధారణలో, పాటలు పాడుతూ, నృత్యం చేస్తూ ఉత్సాహంగా కనిపించారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. మరోవైపు బిగ్ బీ పుట్టిన రోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు వెల్లువ కురిసింది. పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు బర్త్‌డే విషెస్ అందించారు.#WATCH | Mumbai, Maharashtra | Fans of the Veteran Actor Amitabh Bachchan gather outside his bungalow, 'Jalsa', to catch a glimpse of their favourite movie star on the occassion of his birthday. His fans dressed up as famous characters played by the actor, and sang songs and… pic.twitter.com/MfE34Y5RWl— ANI (@ANI) October 10, 2025 బిగ్ బీతో కలిసి నటించిన హీరో ప్రభాస్, కాజోల్, అజయ్ దేవ్గన్, శత్రుఘ్న సిన్హా,సునీల్ శెట్టి అ లాంటి సినీప్రముఖులతో పాటు, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా అమితాబ్‌కు విషెస్ చెప్పడం విశేషం. "లెజెండరీ అమితాబ్ బచ్చన్ జీకి పుట్టినరోజు శుభాకాంక్షలు! మీరు ఎపుడూ ఆరోగ్యంగా ఆనందంగా ఉంటూ మా అందరికీ స్ఫూర్తిని ప్రసాదించాలన్నారు. అలాగే 1984లో తామిద్దరం ఎంపీలు అనే విషయానఇన గుర్తు చేసుకున్నారు. -
సర్వస్వం నువ్వే.. నా జీవితంలో ఆదర్శం నువ్వే.. మంచు మనోజ్ స్పెషల్ విషెస్
టాలీవుడ్ నటి మంచు లక్ష్మికి తమ్ముడు, హీరో మంచు మనోజ్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. జీవితంలో నువ్వే నాకు ఎల్లప్పుడు ఆదర్శం అంటూ తన ప్రేమను చాటుకున్నారు. ఒక తల్లిగా, నటుడిగా, నిర్మాతగా నువ్వు జీవిస్తున్న విధానం అద్భుతం అంటూ కొనియాడారు. నువ్వు అడుగుపెట్టే ప్రతి ఇంటికి వెలుగునిచ్చి.. నీ దయ, బలంతో ఎన్నో జీవితాలను మార్చేశావ్ అంటూ ప్రశంసలు కురిపించాడు.ఎల్లప్పుడూ నువ్వు ఇలాగే ఉండి.. నువ్వు వెళ్లే ప్రతిచోటా నీ వెలుగును ప్రకాశింపజేస్తూ ఉండాలని కోరుకుంటున్నా అంటూ మంచు మనోజ్ ఎమోషనలయ్యారు. నువ్వు అంటే నాకు చాలా ఇష్టం అక్కా ప్రేమను వ్యక్తం చేశారు. ఈ ట్వీట్ వైరల్ కావడంతో అభిమానులు సైతం మంచు లక్ష్మీకి జన్మదిన శుభాకాంక్షలు చెబుతున్నారు.ఇక మంచు మనోజ్ సినిమాల విషయానికొస్తే ఈ ఏడాది భైరవం, మిరాయ్ చిత్రాలతో అలరించాడు. ఇటీవలే విడుదలైన మిరాయ్ బాక్సాఫీస్ వద్ద సూపర్‌హిట్‌గా నిలిచింది. తేజ సజ్జా ప్రధాన పాత్రలో వచ్చిన ఈ సినిమా అద్భుతమైన కలెక్షన్స్ సాధించింది.Wishing my sister and my everything, @LakshmiManchu akka, a very happy birthday ❤️You’ve always been my biggest inspiration, akka. The way you handle life as a mother, actor, producer, and a person with such a big heart is just incredible.You light up every room you walk into… pic.twitter.com/aKNF6Qme5n— Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) October 8, 2025 -
#HBDLakshmiManchu : మంచు లక్ష్మీ పుట్టినరోజు స్పెషల్ (ఫొటోలు)
-
రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు ప్రధాని మోదీ ఫోన్.. ఎందుకంటే?
ఢిల్లీ: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్లో మాట్లాడారు. పుతిన్‌కు 73వ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. భారత్-రష్యా మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు కట్టుబడి ఉన్నట్లు మోదీ మరోసారి పునరుద్ఘాటించారు. భారత్-రష్యా వార్షిక శిఖరాగ్ర సమావేశానికి పుతిన్‌ను స్వాగతించడానికి ఎదురు చూస్తున్నట్లు ప్రధాని మోదీ చెప్పారు. ఈ సందర్భంగా ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించి తాజా పరిణామాలను మోదీకి పుతిన్ వివరించారు. ఈ సమస్యకు శాంతియుత పరిష్కారం కావాలన్న భారత స్థిరమైన వైఖరిని మోదీ గుర్తు చేశారు.పుతిన్ ఈ ఏడాది డిసెంబర్ ఐదారు తేదీలలో భారత్‌కు వచ్చి.. ప్రధాని నరేంద్ర మోదీని కలుసుకునే అవకాశం ఉందని సమాచారం. రష్యా చమురు కొనుగోలుపై అమెరికా న్యూఢిల్లీపై శిక్షాత్మక సుంకాలను విధించిన దరిమిలా ఇరు దేశాల మధ్య సంబంధాలు బలపడుతున్న తరుణంలో పుతిన్, ప్రధాని మోదీల భేటీ కీలకంగా మారనుంది. రష్యా అధ్యక్షుడు ఇటీవల చైనాలో జరిగిన షాంఘై సహకార సంస్థ (ఎస్సీఓ) శిఖరాగ్ర సమావేశంలో ప్రధాని మోదీని కలుసుకున్న సంగతి తెలిసిందే.మరోవైపు, భారత్‌తో వాణిజ్య బంధాన్ని మరింత బలోపేతం చేసుకోవడానికి కట్టుబడి ఉన్నట్లు అధినేత పుతిన్ ఇటీవల స్పష్టమైన సంకేతాలిచ్చారు. భారత్ నుంచి వ్యవసాయ ఉత్పత్తులు, ఔషధాల దిగుమతులను భారీగా పెంచుకోవాలని, ఇందుకోసం ప్రత్యేక విధానం రూపొందించాలని రష్యా అధికార యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేశారు. రష్యా నుంచి భారత ప్రభుత్వం భారీగా ముడిచమురు కొనుగోలు చేస్తున్న సంగతి తెలిసిందే.ఇరుదేశాల మధ్య వాణిజ్య లోటు తగ్గిపోయి, వాణిజ్యంలో సమతూకం ఏర్పడేలా చర్యలు తీసుకోవడానికి పుతిన్ సిద్ధమయ్యారు. అందులో భాగంగానే భారత్ నుంచి దిగుమతులు పెంచాలని నిర్ణయించారు. గురువారం(అక్టోబర్ 2) వాల్డాయ్ ప్లీనరీలో పుతిన్ ప్రసంగించారు. ఈ ఏడాది డిసెంబర్లో ఇండియాలో పర్యటించబోతున్నానని, ఇందుకోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని చెప్పారు. తనకు మంచి మిత్రుడు, విశ్వసనీయ భాగస్వామి నరేంద్ర మోదీతో సమావేశం కాబోతున్నానని వెల్లడించారు.ప్రధాని మోదీపై పుతిన్ ప్రశంసల వర్షం కురిపించారు. ఆయన సమతూకం కలిగిన, తెలివైన నాయకుడు అని కొనియాడారు. భారతదేశ ప్రయోజనాల కోసం మోదీ నిరంతరం శ్రమిస్తుంటారని వ్యాఖ్యానించారు. మోదీ నేతృత్వంలో జాతీయవాద ప్రభుత్వం చక్కగా పనిచేస్తోందన్నారు. మోదీతో సమావేశమైనప్పుడు తాను ఎంతో సౌకర్యవంతంగా ఉన్నట్లు భావిస్తానని పేర్కొన్నారు. ఉక్రెయిన్‌కు సహకరించడం మానుకోవాలని అమెరికాను పుతిన్ హెచ్చరించారు. ఉక్రెయిన్‌కు దీర్ఘశ్రేణి క్షిపణులు సరఫరా చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని తేల్చిచెప్పారు. -
రాయలసీమ బిడ్డగా ఎంతోమందికి స్ఫూర్తి: సతీమణిపై మంచు మనోజ్ ప్రశంసలు
టాలీవుడ్ హీరో మంచు మనజ్ ఇటీవలే మిరాయ్ మూవీతో సూపర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ చిత్రంలో విలన్‌గా అభిమానులను అలరించారు. హనుమాన్ హీరో తేజ సజ్జా లీడ్ రోల్లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ప్రస్తుతం ఈ మూవీ థియేటర్లలో సందడి చేస్తోంది. ఈ ఏడాది గట్టిగా కమ్ బ్యాక్ ఇచ్చాడు మంచు మనోజ్. భైరవం తర్వాత మిరాయ్ మూవీతో ఆకట్టుకున్నారు.ఇదిలా ఉంచితే మంచు మనోజ్ 2023లో వివాహబంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డకు చెందిన భూమా మౌనికను పెళ్లాడారు. తాజాగా అక్టోబర్ 4న తన సతీమణి మౌనిక పుట్టినరోజు సందర్భంగా విషెస్ తెలిపారు మంచు మనోజ్. ఈ సందర్భంగా తన భార్యపై ప్రశంసలు కురిపించారు. అంతేకాకుండా తనతో కేక్ కట్ చేయించి సెలబ్రేట్ చేసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు.మంచు మనోజ్ తన ట్వీట్లో రాస్తూ..' ప్రియమైన భూమా మౌనిక.. ఆది పరాశక్తి అంటే నువ్వే. నువ్వు నా జీవితంలోకి అడుగుపెట్టిన రోజు నుంచి పూర్తిగా మారిపోయింది. టెన్షన్లో ఉన్నప్పుడు నీ మౌనం, కష్టాల్లో కూడా నీ దయ, ప్రజల పట్ల, నిన్ను బాధపెట్టే వారి పట్ల కూడా నీ అచంచలమైన కరుణ మాయాజాలాన్ని నేను చూశాను. ఆ బలం, స్వచ్ఛత నన్ను విస్మయంతో తల వంచేలా చేస్తాయి ఎప్పటికీ. నా భార్యగా ప్రేమను పంచావు. ధైరవ్, దేవసేన.. లిటిల్ జోయాకు తల్లిగా.. నువ్వు వారి ప్రతి అడుగును నడిపించే వెలుగుగా మారావ్. మా ఇంటిని నవ్వులతో నింపేశావ్. నమస్తే వరల్డ్ సీఈవో, వ్యవస్థాపకురాలిగా ఏమి సాధించగలదో నువ్వు చూపించావు. రాయలసీమ బిడ్డగా.. ప్రజలకు నీ నిరంతర సేవ నిన్ను నాయకురాలిగా మాత్రమే కాకుండా లెక్కలేనన్ని జీవితాలకు ప్రేరణగా నిలుస్తుందని' కొనియాడారు.నీ జీవితంలో నువ్వు ఎప్పుడూ దురాశ పడలేదు.. ఎప్పుడూ నీ కష్టాన్ని నమ్ముకున్నావు.. నీ ఆత్మగౌరవం నన్ను నేను మరింత గౌరవించుకునేలా చేసిందని మంచు మనోజ్ ట్వీట్ చేశారు. నీ వల్లే నేను ఈ రోజు మెరుగైన వ్యక్తిగా మారాను.. నాపై అలాగే రాబోయే మన అందమైన ప్రయాణంపై నమ్మకం ఉంచినందుకు ధన్యవాదాలు అంటూ పోస్ట్ చేశారు. నీ సింప్లిసిటీ నన్ను ఆశ్చర్యపరుస్తూనే ఉంది.. నీ ధైర్యం నాకు స్ఫూర్తినిస్తూనే ఉందంటూ మనోజ్ రాసుకొచ్చాడు. నా జీవితాన్నే మార్చేసిన నా ప్రేమ, నా భాగస్వామి, నా బలం, నా శక్తికి పుట్టినరోజు శుభాకాంక్షలు.. నీ వల్లే ఈ ప్రపంచం, పిల్లలు నా లైఫ్‌లో దక్కిన అదృష్టమని సంతోషం వ్యక్తం చేశారు. Dear @BhumaMounika thalli, You are the very meaning of Adhi Parashakti. From the day you entered my life, I have seen the magic of your silence in chaos, your grace even in hardship, and your unshakable compassion for people, even those who hurt you. That strength and purity… pic.twitter.com/LgjNwgCENv— Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) October 4, 2025 -
మహాత్మునికి, శాస్త్రిజీకి ప్రధాని మోదీ నివాళులు
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ గురువారం ఢిల్లీలోని రాజ్ ఘాట్ వద్ద మహాత్మా గాంధీకి నివాళులు అర్పించారు. గాంధీ జయంతి సందర్భంగా జాతిపిత ఆదర్శాలు మానవ చరిత్ర గమనాన్ని మార్చాయని ప్రధాని పేర్కొన్నారు. Gandhi Jayanti is about paying homage to the extraordinary life of beloved Bapu, whose ideals transformed the course of human history. He demonstrated how courage and simplicity could become instruments of great change. He believed in the power of service and compassion as… pic.twitter.com/LjvtFauWIr— Narendra Modi (@narendramodi) October 2, 2025సోషల్ మీడియా ‘ఎక్స్’ పోస్టులో ఆయన.. ధైర్యం, సరళత అనేవి మనిషి మార్పునకు సాధనాలుగా ఎలా మారుతాయనేది గాంధీ చూపారని పేర్కొన్నారు. ప్రజలకు సాధికారత కల్పించడానికి సేవ, కరుణ ముఖ్యమైన సాధనాలని అన్నారు. వీక్షిత భారత్‌ను నిర్మించాలనే మా ఆశయంలో మేము ఆయన మార్గాన్ని అనుసరిస్తూనే ఉంటామని ప్రధాని మోదీ పేర్కొన్నారు.#WATCH | Delhi: Prime Minister Narendra Modi pays tribute to former PM Lal Bahadur Shastri at Vijay Ghat on his birth anniversary.(Source: DD) pic.twitter.com/OnrZU1aAdY— ANI (@ANI) October 2, 2025మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా విజయ్ ఘాట్‌లో ప్రధాని మోదీ ఆయనకు నివాళులర్పించారు. సమగ్రత, వినయం, దృఢ సంకల్పాల బలంతో భారతదేశాన్ని బలోపేతం చేసిన అసాధారణ రాజనీతిజ్ఞుడిగా ఆయనను ప్రధాని మోదీ ప్రశంసించారు. ఆయన ఆదర్శప్రాయమైన నాయకత్వం, మహోన్నత వ్యక్తిత్వం, ఆయన ఇచ్చిన ‘జై జవాన్ జై కిసాన్’ నినాదం ప్రజల్లో దేశభక్తిని రగిలించాయన్నారు. స్వావలంబన కలిగిన భారతదేశాన్ని నిర్మించే ప్రయత్నంలో ఆయన మనల్ని ప్రేరేపిస్తూనే ఉంటారని ప్రధాని మోదీ పేర్కొన్నారు. -
సతీమణికి అల్లు అర్జున్ స్పెషల్ విషెస్.. పోస్ట్ వైరల్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన సతీమణికి స్పెషల్ విషెస్ చెప్పారు. ఇవాళ ఆమె బర్త్ డే కావడంతో సోషల్ మీడియా వేదికగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. హ్యాపీ బర్త్ డే క్యూటీ అంటూ తనతో ఉన్న ఫోటోలు పంచుకున్నారు. ఈ ట్వీట్ వైరల్ కావడంతో అభిమానులు సైతం స్నేహ రెడ్డికి విషెస్ చెబుతున్నారు.ఇక సినిమాల బన్నీ సినిమాల విషయానికొస్తే కోలీవుడ్ స్టార్ డైరెక్టర్‌తో జతకట్టారు. వీరిద్దరి కాంబోలో రానున్న చిత్రం కావడంతో అభిమానులు భారీగా ఆశలు పెట్టుకున్నారు. ఈ సినిమా అంతర్జాతీయ స్థాయిలో తెరకెక్కబోతుంది. ప్రస్తుతం AA22XA6 అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కిస్తున్నారు. అత్యంత భారీ బడ్జెట్‌తో సన్‌పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా కోసం కొత్త టెక్నాలజీలను ఉపయోగిస్తున్నామని దర్శకుడు ఇప్పటికే వెల్లడించారు. ఈ ప్రాజెక్ట్‌ను కేవలం ఇండియాకే పరిమితం కాకుండా హాలీవుడ్ రేంజ్‌కు తీసుకెళ్లనున్నారు. Happy Birthday Cutie 🖤#AlluSnehaReddy pic.twitter.com/yNlsg72J0x— Allu Arjun (@alluarjun) September 29, 2025 -
గూగుల్‌కి అసలు అర్థమేంటో తెలుసా?
ఇవాళ గూగుల్ ఓపెన్ చేశారా?.. దాని ఫాంట్ వేరే రకంగా కనిస్తోందా?.. అదేదో అప్డేట్ అనుకుని కంగారుపడేరు. ఇవాళ గూగుల్ 27వ పుట్టినరోజు. అందుకే డూడుల్ అలా దానికి విషెష్ తెలిపిందంతే. అయితే గూగుల్ ప్రారంభమైంది సెప్టెంబర్ 4వ తేదీన. అలాంటప్పుడు ఇవాళ బర్త్‌డే జరుపడానికి ఓ ప్రత్యేక కారణం ఉందని మీకు తెలుసా?.. అసలు గూగుల్ అంటే మీనింగ్ ఏంటో తెలుసా??..గూగుల్‌ను లారీ పేజ్(Larry Page), సెర్గీ బ్రిన్(Sergey Brin) ప్రారంభించారు. 1998లో సెప్టెంబర్ 4న అధికారిక కంపెనీ గుర్తింపు దక్కించుకుంది. అయితే.. 2003 నుంచి గూగుల్ బర్త్‌డే మారిపోయింది. 2003లో సెప్టెంబర్ 8న, 2004లో సెప్టెంబర్ 7న, 2005లో సెప్టెంబర్ 26 నిర్వహించుకుంది. అయితే 2006 నుంచి సెప్టెంబర్ 27ను క్రమం తప్పకుండా తన పుట్టినరోజుగా మార్చేసుకుంది. ఇందుకు కారణం లేకపోలేదు!.సెప్టెంబర్ 27, 2006లో గూగుల్ అరుదైన మైలురాయి దాటింది. అత్యధిక వెబ్‌పేజీలను ఇండెక్స్ చేసిన ఘనత గూగుల్ సొంతం చేసుకుంది. అంటే.. ఒక నిర్దిష్ట సమయంలో తన సెర్చ్ ఇంజిన్ ద్వారా అప్పటిదాకా ఎవరూ సాధించని ఫీట్ సాధించింది. అలా.. ఆ అరుదైన ఘనత సాధించిన సందర్భాన్ని బర్త్‌డేగా మార్చుకుంది. అప్పటి నుంచి మార్కెటింగ్ స్ట్రాటజీలో భాగంగానే తన పుట్టినరోజున డూడుల్స్, ప్రమోషన్స్, తన ఉత్పత్తులపై డిస్కౌంట్లను ప్రకటిస్తుంటుంది. ఇంతకీ గూగుల్ అర్థమేంటంటే.. Google అనే పదానికి అర్థం ఏ డిక్షనరీలోనూ కనిపించదు. అసలు ఆ పదానికి ఓ అర్థమంటూ లేదు కూడా. వాస్తవానికి.. గూగుల్ వ్యవస్థాపకులు లారీ పేజ్ మరియు సెర్గీ బ్రిన్ 1997లో తాము రూపొందించిన ఇంటర్నెట్ సెర్చ్ ఇంజిన్‌కు గూగోల్(Googol) అనే పేరు పెట్టాలనుకున్నారు. గూగోల్ అంటే.. 1 పక్కన 100 సున్నాలు ఉండే సంఖ్య. అపారమైన సమాచారాన్ని అందిస్తుంది అనే అర్థం వచ్చేలా ఆ పదం అనుకున్నారు. అయితే.. స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో వీళ్లద్దరి సహచరి విద్యార్థి సీన్ అండర్సన్.. Googol.com అనే డొమెయిన్‌కు బదులు Google.com అని టైప్ చేశాడు. అయితే లారీ పేజ్ ఆ పేరు నచ్చి.. అప్పటికప్పుడు ఆ డొమెయిన్‌ను ఫిక్స్ చేశారు. అలా ఆ తప్పిదమే చివరికి ఇప్పుడు ప్రపంచమంతా వెతుక్కునే ప్రముఖ బ్రాండ్‌గా మారింది.ఇది తెలుసా?.. గూగుల్ ప్రధాన కార్యాలయం గూగుల్ఫ్లెక్స్(Googleplex) అమెరికా కాలిఫోర్నియా స్టేట్ మౌంటెన్ వ్యూలో ఉంది. ఈ హెడ్ ఆఫీస్‌లో స్టాన్(Stan) అనే డైనోసార్ బొమ్మ ఉంటుంది. గూగుల్ అనేది ఎంత పెద్ద సెర్చ్ ఇంజిన్ అయినా సరే.. డైనోసార్లా అంతం అయిపోకుండా, కొత్త ఆలోచనలో ముందుకు పోవాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేశారట. అంతేకాదు.. 2010లో తమ ఆవరణలో ఉన్న గడ్డిని కత్తిరించేందుకు మెషీన్లు, పరికరాల సాయంతో కాకుండా అద్దెకు గొర్రెలను తెచ్చి ఇకోఫ్రెండ్లీ ఐడియాతో ప్రపంచ దృష్టిని ఆకర్షించింది కూడా. ఇంకో ఆసక్తికరమైన ముచ్చట ఏంటంటే.. గూగుల్‌కు నెట్ ఆగిపోతే వచ్చే డైనోసార్ గేమ్ తెలుసు కదా. 2014లో ఈ ఆఫ్‌లైన్ గేమ్(T-Rex Runner-Chrome Dino) ముఖ్య ఉద్దేశం ఏంటంటే.. ఇంటర్నెట్ లేకపోతే మనం డైనోసార్ యుగంలో ఉన్నాం అనే ఫన్‌తో యూజర్ల దృష్టి మరలకుండా ఉండేందుకే ఈ గేమ్‌ను క్రియేట్ చేశారట!. -
యాంకర్ రవి బర్త్ డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
'మీ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా'.. ఐకాన్ స్టార్ స్పెషల్ విషెస్
కోలీవుడ్ డైరెక్టర్ అట్లీకి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) శుభాకాంక్షలు తెలిపారు. ఇవాళ ఆయన పుట్టినరోజు కావడంతో సోషల్ మీడియా వేదికగా విషెస్ తెలిపారు. ఈ మేరకు అల్లు అర్జున్ ట్వీట్ చేశారు. ఇలాగే మీరు మరిన్ని పుట్టిన రోజులు జరుపుకోవాలని ఆకాంక్షించారు.అల్లు అర్జున్ తన ట్వీట్లో రాస్తూ..' మై డియరెస్ట్ డైరెక్టర్ అట్లీకి పుట్టినరోజు శుభాకాంక్షలు. మీపై మా ప్రేమ ఎల్లప్పుడు ఉండాలి. ఈ ప్రత్యేక రోజున మీకు ఆనందం, ప్రేమ, శ్రేయస్సు కలగాలని కోరుకుంటున్నా. మీరు దర్శకత్వంలో రానున్న సినిమాటిక్ మ్యాజిక్‌ను అందరూ ఆస్వాదించే వరకు వేచి ఉండలేకపోతున్నా' అంటూ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఐకాన్ స్టార్ చేసిన ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది.కాగా.. తొలిసారి అట్లీ- అల్లు అర్జున్ కాంబోలో వస్తోన్న సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీకి వర్కింగ్ టైటిల్ ఏఏ22 పేరును ఖరారు చేశారు. ఇటీవలే ఈ చిత్రం ముంబైలో షూటింగ్ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. ఈ మూవీని అత్యంత భారీ బడ్జెట్‌తో సన్‌పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా కోసం సరికొత్త టెక్నాలజీలను ఉపయోగిస్తున్నామని దర్శకుడు అట్లీ ఇప్పటికే వెల్లడించారు. ఈ ప్రాజెక్ట్‌ను హాలీవుడ్ రేంజ్లో తెరకెక్కిస్తున్నారు.Happy Birthday to my dearest director @Atlee_dir garu. May abundance shower upon you. Wishing you all the joy, love, and prosperity. Can’t wait for everyone to experience the cinematic magic you’re creating 🖤 pic.twitter.com/Sb7S8Bfpmp— Allu Arjun (@alluarjun) September 21, 2025 -
కొడుకు బర్త్ డే.. వింటేజ్ స్టైల్లో సీరియల్ జంట (ఫొటోలు)
-
ప్రధాని నరేంద్ర మోదీ బర్త్‌డే.. కీరవాణి స్పెషల్ సాంగ్
ప్రధాని నరేంద్ర మోదీ బర్త్ డే సందర్భంగా స్పెషల్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. పలు భాషల్లో రూపొందించిన ఈ పాటకు తెలుగులో టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి సంగీతమందించారు. మోదీ పుట్టిన రోజున విడుదలైన ప్రత్యేక గీతం అందరినీ ఆకట్టుకుంటోంది.నమో నమో ఆర్త బాంధవుడా.. అంటూ సాగే ఈ పాటను ఎం ఎం కీరవాణి, షగున్ సోధి, ఐరా ఉడిపి ఆలపించారు. మోదీ జీ @75 పేరుతో ఈ పాటను టీ సిరీస్ మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ సాంగ్‌లో మోదీ హయాంలో తీసుకొచ్చిన సంస్కరణలు, మార్పులను ప్రస్తావించారు. ఇంకెందుకు ఆలస్యం ఈ స్పెషల్ సాంగ్‌ను చూసేయండి.On the 75th birthday of Shri Narendra Modi Ji, we celebrate his spirit of service and vision for New India with “Modi Ji@75”. 🙏🇮🇳https://t.co/CGQ4AJtH9l#HappyBirthdayModiji @narendramodi@mmkeeravaani #ShagunSodhi #AiraaUdupi #Nadaan #Tseries pic.twitter.com/XimgRvVpR1— T-Series (@TSeries) September 17, 2025 -
అణు బెదిరింపులకు భయపడం: ప్రధాని మోదీ
ధార్: ‘ఇది నవ్య భారతదేశం.. ఎవరి అణు బెదిరింపులకు భయపడదు.. తిరిగి ఎదురు దాడి చేస్తుంది’ అని ప్రధాని నరేంద్ర మోదీ తన పుట్టినరోజు సందర్భంగా మధ్యప్రదేశ్‌లోని ధార్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పరోక్షంగా పాకిస్తాన్‌ను ఉద్దేశిస్తూ హెచ్చరించారు.తన 75వ జన్మదినం సందర్భంగా ప్రధాని మోదీ మధ్యప్రదేశ్‌కు ‘రిటర్న్ గిఫ్ట్’ను అందజేశారు. ధార్‌లోని మెగా టెక్స్టైల్ పార్క్‌ను ప్రధాని మోదీ ప్రారంభించారు. ఈ పార్క్ మూడు లక్షల మందికి ఉపాధి అందించనుంది. అలిగే లక్షలాది మంది రైతులకు ప్రయోజనం చేకూర్చనుంది. ప్రధాని నరేంద్ర మోదీ తన 75వ పుట్టినరోజు సందర్భంగా ధార్‌లో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ధార్ చేరుకున్న ప్రధాని మోదీని ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్‌తోపాటు పలువురు సీనియర్ నాయకులు స్వాగతించారు. కేంద్ర సహాయ మంత్రి సావిత్రి ఠాకూర్ ప్రధాని మోదీని సాంప్రదాయ తలపాగా, శాలువా లతో సత్కరించారు. ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్ ఆయనకు జ్ఞాపికను అందజేశారు. प्रधानमंत्री श्री @narendramodi मध्य प्रदेश के धार में 'स्वस्थ नारी सशक्त परिवार' और 'आठवें राष्ट्रीय पोषण माह' अभियान का शुभारंभ कर रहे हैं। #SevaParv https://t.co/CFjDWloZLB— BJP (@BJP4India) September 17, 2025ఈ సందర్భంగా ప్రధాని మోదీ తన ప్రసంగంలో ఇటీవలి పహల్గామ్ ఉగ్రవాద దాడిని ప్రస్తావించారు. అమరవీరులైన సైనికులకు నివాళులర్పించారు. భారత సైనికుల ధైర్యం, పరాక్రమాలను ప్రశంసించారు. ఇది నవ్య భారతదేశం.. ఎవరి అణు బెదిరింపులకు భయపడదు.. తిరిగి ఎదురు దాడి చేస్తుందని పాక్‌ను ఉద్దేశించి ప్రధాని మోదీ హెచ్చరించారు. మధ్యప్రదేశ్ ప్రజల శక్తి, కృషి సహకారాన్ని కూడా ప్రధాని మోదీ ప్రశంసించారు. ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్ మాట్లాడుతూ మోదీ నాయకత్వం భారతదేశాన్ని మార్చివేసిందని, పీఎం మిత్రా పార్క్ ద్వారా నిమార్ మాల్వా ప్రాంతంలో ఒక ప్రధాన మార్కెట్ ఏర్పడబోతున్నదని దీనికి ఈరోజు పునాది రాయి పడిందని అన్నారు.


