నాలుగేళ్లకే బాలనటుడిగా వెండతెరపై అడుగుపెట్టారు కమల్ హాసన్.
కానీ టీనేజ్‌లో ఇంట్లో నుంచి గెంటేస్తే బార్బర్ షాపులో పని చేశారు. కట్ చేస్తే భారతీయ సినీరంగంలో తనకంటూ ఓ చోటు సంపాదించుకున్నారు.
కథానాయకుడిగా, ప్రతినాయకుడిగా మెప్పించి ఉన్నత శిఖరానికి చేరారు. ఇంతింతై వటుడింతై అన్న చందంగా విశ్వనటుడిగా ఎదిగారు.
తెలుగు, తమిళ, మలయాళం, హిందీ, కన్నడ, బెంగాలీ భాషల్లో అనేక సినిమాలు చేశారు.
ఇప్పటివరకు ఐదు జాతీయ అవార్డులు అందుకున్నారు.
సినీ ఇండస్ట్రీలో ఆయన చేసిన సేవలకుగానూ భారత ప్రభుత్వం ఆయన్ని పద్మ శ్రీ, పద్మభూషణ్‌తో సత్కరించింది.
నేడు (నవంబర్ 7న) ఆయన 71వ పుట్టినరోజు. ఈ సందర్భంగా కమల్ హాసన్ ప్రత్యేక ఫోటోలను చూసేయండి..


