పెళ్లి వేడుకలో అపశృతి : ఒక్కసారిగా కూలిన పైకప్పు | A bizarre moment roof collapses in wedding guests shocks in Himachal village | Sakshi
Sakshi News home page

పెళ్లి వేడుకలో అపశృతి : ఒక్కసారిగా కూలిన పైకప్పు

Dec 9 2025 5:28 PM | Updated on Dec 9 2025 5:40 PM

A bizarre moment roof collapses in wedding guests shocks in Himachal village

హిమాచల్ ప్రదేశ్‌లోని చంబా జిల్లాలోని ఒక గ్రామంలో  వివాహ వేడుకలో జరిగిన అనూహ్య ఘటన దిగ్భ్రాంతికి గురి చేసింది. అంతా పెళ్లి సంబరాల్లో ఉండగా ఇంటి పైకప్పు అకస్మాత్తుగా కూలిపోయింది. దాదాపు 20 మంది గాయపడ్డారు కానీ అదృష్టవశాత్తూ పెద్దగా ప్రాణనష్టం జరగలేదు. ఇప్పుడు ఈ సంఘటనకు సంబంధించిన డ్రోన్ ఫుటేజ్ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

వివాహానికి సంబంధించి, హిమాచల్‌ ప్రదేశ్‌లోని చంబా జిల్లాలో జరుపుకునే  సాంప్రదాయ వేడుకల్లో భాగంగా సాంస్కృతిక జాతర కార్యక్రమం జరుగుతోంది. ఇంటిపైకప్పున చేరి, కింద మరికొందరు ఈ  వేడుకను  చూస్తున్నారు.  అతిథుల జానపద నృత్యాలు, పాటలతో అక్కడి వాతావరణ అంతా సందడి సందడిగా ఉంది. ఇంతలో పక్కనే  ఉన్న ఇంటి పైకప్పు ఒకటి అక్కడ గుమిగూడిన వారిపై ఉన్నట్టుండి కూలిపోయింది.  దీంతో అక్కడున్న వారంతా తీవ్ర కూలిపోవడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. 

చదవండి: Indigo Crisis చేతకాని మంత్రీ తప్పుకో.. నెటిజన్లు ఫైర్‌

 మరికొందరు వారిని రక్షించడానికి ముందుకు వచ్చారు. ఈ ప్రమాదంలో దాదాపు 40 మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు. బాధితులను వెంటనే చికిత్స కోసం టీసా ఆసుపత్రికి తరలించారు.  మరికొందరు తీవ్ర గాయాలపాలైనట్టు తెలుస్తోంది. సంబంధించిన వీడియో ఆన్‌లైన్‌లో వైరల్ అయింది. ఈ ఘటన ఎలా జరిగింది అనేదానిపై అధికారులు ఆరాతీస్తున్నారు.

ఇదీ చదవండి: రూ. 1500కోట్ల స్కాం : నటుడు సోనూ సూద్‌, రెజ్లర్ గ్రేట్ ఖలీకి సిట్‌ నోటీసులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement