వంటగ్యాస్‌ కొరతపై కేంద్రం కీలక ప్రకటన | Petroleum Ministry Gives Clarity On LPG Or Cooking Gas Shortage In India, Warns Against Panic Booking And Black Market Deals | Sakshi
Sakshi News home page

వంటగ్యాస్‌ కొరతపై కేంద్రం కీలక ప్రకటన

Mar 13 2026 4:23 PM | Updated on Mar 13 2026 6:18 PM

No Gas Crisis In India: Petroleum Ministry

ఢిల్లీ: వంటగ్యాస్‌ కొరతపై కేంద్రం కీలక ప్రకటన చేసింది. భారత్‌లో గ్యాస్ సంక్షోభం లేదని పెట్రోలియం శాఖ స్పష్టం చేసింది. ప్యానిక్‌ బుకింగ్స్‌ వద్దని పెట్రోలియం శాఖ సంయుక్త కార్యదర్శి సుజాతా శర్మ కోరారు. అవసరం లేకున్నా ఆందోళనతో గ్యాస్‌ బుక్‌ చేయొద్దన్నారు. బ్లాక్‌ మార్కెట్‌పై చర్యలు తీసుకుంటున్నామన్న పెట్రోలియం శాఖ.. గ్యాస్‌ అందుబాటులో ఉందని.. ఆందోళన అక్కర్లేదని పేర్కొంది. దేశంలో పెట్రోల్‌ కొరత కూడా లేదని.. 30 శాతం ఎల్పీజీ ఉత్పత్తి పెంచినట్లు కేంద్రం వెల్లడించింది. ఎల్‌పీజీ బదులు ప్రజలు పీఎన్‌జీ తీసుకోవాలని.. ఎప్పటిలాగానే ఆన్‌లైన్‌లో బుకింగ్‌ చేసుకోవాలని  కేంద్రం సూచించింది.

ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్‌ మధ్య జరుగుతున్న యుద్ధం కారణంగా పెట్రోల్‌, గ్యాస్‌ కొరత ఏర్పడుతుందని ఆందోళన చెందుతున్న ప్రజలు.. భారీగా పెట్రోల్‌ బంక్‌లు, గ్యాస్‌ గోడౌన్‌ల వద్ద క్యూ కడుతున్నారు. మరోవైపు, వాణిజ్య సిలిండర్ల కొరతతో అనేక హోటల్స్‌లలో నుంచి మెనూ మార్చేశారు. కొన్ని డిష్‌లకు తాత్కాలికంగా మంగళం పాడేశారు. ఇక పలు టీ దుకాణాలు మూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడి ఉంది. పలు హోటళ్లు కట్టెలు, పొట్టుతో కూడిన పొయ్యిలపై దృష్టి పెట్టాయి. దీంతో కట్టెలు, పొట్టుకు సైతం డిమాండ్‌ పెరిగింది.

గ్యాస్ కొరతపై కేంద్రం కీలక ప్రకటన

 


 

Advertisement
 
Advertisement
Advertisement