చెన్నై:తమిళనాడు చిన్నమ్మ శశికళ ఇటీవలే ఆ రాష్ట్రంలో పార్టీ పెట్టిన సంగతి తెలిసిందే. తాజాగా ఆమె తన పార్టీ గుర్తును ప్రకటించారు..'ఆల్ ఇండియా పురుచ్చి తలైవార్ మక్కల్ మునేత్ర కళగం' పార్టీ పేరుగా తెలిపారు. కొబ్బరిచెట్టు తన పార్టీ చిహ్నంగా పేర్కొంది. ఈ మేరకు తన అభిమానుల సమక్షంగా ఈ ప్రకటన చేశారు. కాగా ఇదివరకే తమిళనాడులో జరిగిన సభలో పార్టీ జెండా ఆవిష్కరించిన శశికళ తాజాగా పార్టీ పేరు గుర్తు ప్రకటించింది.
శశికళ పార్టీ జెండాను తెలుపు, నలుపు, ఎరుపు రంగులతో పార్టీ జెండాను రూపొందించారు. దివంగత నేతలు జయలలిత, అన్నాదురై, ఎంజీఆర్ గుర్తులతో జెండా ఉంది. అయితే పార్టీ పేరు మాత్రం త్వరలోనే ప్రకటిస్తానని చెప్పిన చిన్నమ్మ తాజాగా ఆ ప్రకటన చేసింది.. తమిళనాడులో త్వరలో జరిగే ఎన్నికల్లో తన సత్తా ఏంటో చూపిస్తానని పార్టీ ఆవిర్భావ సభలో పేర్కొంది.
కాగా శశికళ, జయలలితకు అత్యంత సన్నిహితురాలు ఆమె మరణానంతరం ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శిక్ష అనుభవించి, తదనంతరం ఏఐఏడీఎంకే నుంచి బహిష్కరణకు గురైన శశికళ, గత కొంతకాలంటా చెన్నై వేదికగా తన మద్దతుదారులతో వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. పార్టీ నుంచి బహిష్కృతురాలైనప్పటికీ, రాజకీయాల్లో మళ్లీ క్రియాశీలక పాత్ర పోషించాలనే పట్టుదలతో ఆమె ఉన్నారనే మాట వినిపిస్తోంది.
ఈ క్రమంలోనే ఆమె అనుచరులు సైతం ‘చిన్నమ్మ’ తీసుకునే ఏ నిర్ణయానికైనా తాము కట్టుబడి ఉంటామని బహిరంగంగా ప్రకటిస్తున్నారు. దీంతో తమిళనాట పొలిటికల్ హీట్ మరింత ముదిరింది. తమిళనాడులో ఇది వరకే ఫిలిం స్టార్ విజయ్ పొలిటికల్ పార్టీ పెట్టి జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇప్పుడు శశికళ ఎంట్రీతో ఆ రాష్ట్రంలో పొలిటికల్ హీట్ మరింత పెరిగింది. కాగా ఈ ఏడాది తమిళనాడులో ఎన్నికలు జరగనున్నాయి.


