సోషల్‌ మీడియాలో పరిచయం… లాడ్జికి పిలిచి..! | Karnataka Woman Arrested In Belagavi For Targeting The Wealthy And Friend Still At Large | Sakshi
Sakshi News home page

సోషల్‌ మీడియాలో పరిచయం… లాడ్జికి పిలిచి..!

Mar 11 2026 8:48 AM | Updated on Mar 11 2026 10:10 AM

Honey Trap Case

కర్ణాటక : శ్రీమంతులను గురి పెట్టి పరిచయం చేసుకొని తీయని మాటలతో వల వేసి దోచేస్తున్న కిలాడీ బాగోతమిది. బాగలకోట జిల్లా మహాలింగపురకు చెందిన దీప అవటగి (35)ని బెళగావి పోలీసులు అరెస్ట్‌ చేయగా, ఆమె స్నేహితుడు శివానంద మఠపతి పరారీలో ఉన్నాడు. శివానంద బెళగావి జిల్లా హుక్కేరివాసి, దీపకు శ్రీమంతుల వివరాలను అందించేవాడు. ఆమె ఫేస్‌బుక్, ఇన్‌స్టాలో అలాంటివారిని పరిచయం చేసుకొని బుట్టలో వేసుకొనేది. 

అశ్లీల చాటింగ్‌ చేసి, బెళగావిలో లాడ్జికి పిలిచేది. ఇలా ఓ బాధితుడు లాడ్జికి రాగానే స్నానాల గదిలోకి పంపించి, తాళం వేసుకొని బట్టలు, నగదు, మొబైల్, కారు తాళం తీసుకుని పరారైంది. పైగా డబ్బు కోసం బ్లాక్‌మెయిల్‌ చేసేదని పోలీసుల విచారణలో బయట పడింది. కాల్‌ రికార్డింగులు, సీసీ కెమెరాల చిత్రాల ఆధారంగా నిందితురాలిని  బెళగావిలోని తిళకవాడి పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.  

Advertisement
 
Advertisement
Advertisement