లిఫ్ట్‌ అడిగిన మహిళపై సామూహిక అత్యాచారం | Mahbubnagar Woman Shocking Incident While Taking A Lift On Moto, Check Out More Details Inside | Sakshi
Sakshi News home page

లిఫ్ట్‌ అడిగిన మహిళపై సామూహిక అత్యాచారం

Mar 11 2026 9:58 AM | Updated on Mar 11 2026 10:16 AM

woman incident In Mahabubnagar District

మహబూబ్ నగర్ జిల్లా: మోటార్‌బైక్‌పై లిఫ్ట్‌ అడిగిన మహిళపై ఇద్దరు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడిన ఘటన జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలో చోటు చేసుకుంది. బాదేపల్లి శివారులోని ఓ కాలనీకి చెందిన వివాహిత మహిళ(35) పట్టణంలో పనులు ముగించుకుని తన ఇంటికి వెళ్లేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో తనకు తెలిసిన ఓ వ్యక్తి మరో వ్యక్తితో కలిసి మోటార్‌బైక్‌పై వెళ్తుండగా ఆమె గమనించి లిఫ్ట్‌ అడిగింది.

 దీంతో మోటార్‌ బైక్‌పై ఉన్న ఇద్దరూ ఆమెను ఎక్కించుకుని వెళ్లారు. అయితే మార్గమధ్యలో ఉన్న నిర్జన ప్రదేశానికి వెళ్లిన వెంటనే         చీకట్లోకి బైక్‌ను మళ్లించి ఆమెను భయబ్రాంతులకు గురిచేసి ఒకరి తర్వాత ఒకరు అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం బాధిత మహిళ స్థానిక పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని జరిగిన విషయాన్ని పోలీసులకు వివరించి ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని   దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. బాధిత మహిళ చెప్పిన సమాచారం  ఆధారంగా పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.   

Advertisement
 
Advertisement
Advertisement