హైదరాబాద్ : మార్కెట్, బస్‌స్టాండ్, రైల్వే స్టేషన్.. ఇలా పలు ప్రాంతాల్లో చోరీకి గురైన రూ.3 కోట్లకుపైగా విలువైన మొత్తం 1,016 మొబైల్స్‌ను సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు రికవరీ చేశారు.
వాటిని బాధితులకు అప్పగించారు. శంషాబాద్‌లో 265, శేరిలింగంపల్లి 255, కుత్బుల్లాపూర్ 181, కూకట్‌పల్లి 160, రాజేంద్రనగర్ పరిధిలో 155 ఫోన్లను పట్టుకున్నారు.
సైబరాబాద్ కమిషనరేట్‌లో మంగళవారం జరిగిన కార్యక్రమంలో కమిషనర్ డాక్టర్ ఎం.రమేష్ మాట్లాడుతూ సెల్‌ఫోన్ చోరీకి గురైన వెంటనే బాధితులు సెంట్రల్ ఎక్విప్‌మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ పోర్టల్‌లో నమోదు చేయాలని, దీంతో ట్రాకింగ్ చేసి రికవరీ చేయడం సులువవుతుందని తెలిపారు.
ఫోన్ పోయిన వెంటనే సిమ్ కార్డ్‌ను బ్లాక్ చేయాలని, బ్యాంక్ ఖాతాలను నిలిపివేయాలని, లేకపోతే సైబర్ మోసాలకు గురయ్యే ప్రమాదం ఉందని పేర్కొన్నారు.


