breaking news
phone
-
మీ ఫోన్లోనే AI పరీక్ష పెడుతోంది!.. ఎలాగో తెలుసా?
పరీక్ష అంటే ఒకప్పుడు.. ఉపాధ్యాయులు ప్రశ్నలు అడిగేవారు విద్యార్థులు సమాధానాలు రాసేవారు. పాఠశాలలు, కళాశాలలు, ప్రశ్నాపత్రాలు, మార్కులు ఆ తర్వాత ఆన్లైన్ ఎగ్జామ్స్ ఇలా పరీక్షల రూపం కాలానుగుణంగా మారుతూ వచ్చింది. కానీ ఇప్పుడు మరో కొత్త పరీక్ష మొదలైంది. ఎలాంటి ప్రశ్నాపత్రం లేదు.. ఇన్విజిలేటర్ కనిపించడు.. అయినా ప్రతిరోజూ మనం ఓ పరీక్ష రాస్తూనే ఉన్నాం. అదీ మన చేతిలోని స్మార్ట్‌ఫోన్‌తోనే!స్మార్ట్‌ఫోన్ ఇప్పుడు కేవలం సమాచారం తెలుసుకునే సాధనం మాత్రమే కాదు.. మన అలవాట్లు, ఆసక్తులు, అభిరుచులను బయటపెట్టే అద్దంగా మారింది. మనం ఏ వీడియో చూస్తున్నాం? ఏ వార్తపై ఆగుతున్నాం? ఏ ఫొటోను ఇష్టపడుతున్నాం? ఏ అంశాన్ని పదే పదే వెతుకుతున్నాం? ఇవన్నీ మనకు తెలియకుండానే ఓ డిజిటల్ రికార్డుగా మారుతున్నాయి. ఈ పరీక్ష నిర్వహిస్తోంది కృత్రిమ మేధస్సు (AI). సమాధానాలు రాసేది కలం కాదు.. మన వేళ్లు. మనం చేసే ప్రతి క్లిక్, ప్రతి స్క్రోల్, ప్రతి సెర్చ్, ఒక వీడియోను చూసే సమయం, ఒక వార్తపై స్పందించే తీరు.. ఇవన్నీ AIకి మన వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకునే సంకేతాలుగా మారుతున్నాయి. వినియోగదారుల ప్రవర్తనా సరళిని విశ్లేషించే ఈ సాంకేతికత ఆధారంగానే మనకు కనిపించే కంటెంట్, ప్రకటనలు, సిఫార్సులు మారుతున్నాయి.కనిపించని ప్రశ్నాపత్రం ఇదే..ఉదయం నిద్ర లేచిన వెంటనే చాలామంది చేసే మొదటి పని ఫోన్ చూడటం. యూట్యూబ్‌లో వీడియోలు చూడటం, సోషల్ మీడియాలో పోస్టులు పరిశీలించడం, గూగుల్‌లో సమాచారం వెతకడం.. ఇవన్నీ సాధారణ అలవాట్లుగానే అనిపిస్తాయి. కానీ AI దృష్టిలో ఇవన్నీ కీలకమైన డేటా. మీరు ఏ వీడియో దగ్గర ఎక్కువసేపు ఆగారు?. ఏ వార్తను వెంటనే ఓపెన్ చేశారు?. ఏ అంశాన్ని పదే పదే వెతికారు?. ఏ పోస్టును షేర్ చేశారు?. ఎలాంటి ప్రాంప్ట్‌లతో ఇమేజ్‌లు జనరేట్ చేస్తున్నారు?.. ఇలాంటి చర్యలను కలిపి AI మీ ఆసక్తులు, అభిరుచులు, ఆలోచనా విధానంపై ఓ అంచనాను రూపొందిస్తుంది.మీకు నచ్చే ప్రపంచాన్నే చూపిస్తుంది..ఉదాహరణకు మీరు వరుసగా ఫుడ్ వీడియోలు చూస్తున్నారు అనుకోండి.. మీ ఫీడ్‌లో ఆ కంటెంట్ ఎక్కువగా కనిపిస్తుంది. అలాగే అంతర్జాతీయ రాజకీయాలకు సంబంధించిన వీడియోలు చూస్తే.. ట్రంప్, చైనా, రష్యా, ఇరాన్ వంటి అంశాలకు సంబంధించిన కంటెంట్ ఎక్కువగా కనిపించవచ్చు. అలాగే మీరు సినిమాలు, క్రీడలు, టెక్నాలజీ లేదంటే పెట్టుబడులకు సంబంధించిన విషయాలు ఎక్కువగా చూస్తే.. అదే తరహా సమాచారం మీ ముందుకు వస్తుంది. అంటే ఏఐ అనేది మీకు ప్రపంచాన్ని మొత్తం చూపించదు. మీరు దానితో ఎలా ప్రవర్తిస్తే.. ఆ ఆసక్తితో కూడిన ప్రపంచాన్ని మీ ముందు నిర్మిస్తోంది.జస్ట్ మూడే సెకన్లుడిజిటల్ ప్లాట్‌ఫార్మ్‌లలో వినియోగదారుడి దృష్టి చాలా విలువైనది. ఒక వీడియో లేదంటే పోస్టు వద్ద వినియోగదారు ఎంతసేపు ఆగుతున్నాడు? ఎక్కడ స్క్రోల్ ఆపుతున్నాడు? అనే అంశాలు కూడా అల్గారిథమ్‌లకు సంకేతాలుగా మారతాయి. ఒక వీడియోను వెంటనే స్కిప్ చేస్తే ఆసక్తి లేదని భావించే అవకాశం ఉంటుంది. అదే వీడియోను పూర్తిగా చూస్తే.. ఆ అంశం వినియోగదారుడికి నచ్చిందనే అంచనాకు రావచ్చు. డేటా ఆధారంగానే భవిష్యత్తులో కనిపించే కంటెంట్, ప్రకటనలు, సజెషన్స్ మారుతుంటాయి.భావోద్వేగాలనూ చదువుతున్న ఏఐ..మనిషి నిర్ణయాల్లో భావోద్వేగాల పాత్ర చాలా ఎక్కువ. దీనిని కూడా ఏఐ గుర్తిస్తోంది. ఉదాహరణకు ఒక వార్తకు రెండు శీర్షికలు ఉన్నాయనుకుందాం. ‘‘దేశాన్ని కుదిపేసిన సంచలన నిర్ణయం!’’. ‘‘ప్రభుత్వం కొత్త విధానాన్ని ప్రకటించింది’’ ఇలా. ఇందులో మొదటి టైటిల్‌కు ఎక్కువ క్లిక్స్ వస్తే.. సంచలన పదాలు ప్రజల దృష్టిని ఎక్కువగా ఆకర్షిస్తున్నాయని ఏఐ నేర్చుకుంటుంది.అందుకే సోషల్ మీడియాలో చాలా సందర్భాల్లో భావోద్వేగాలను రెచ్చగొట్టే శీర్షికలు, చిత్రాలు ఎక్కువగా కనిపిస్తుంటాయి.ఏఐ కూడా మన నుంచే నేర్చుకుంటోంది!చాలామంది ఏఐ మనల్ని మాత్రమే నిశితంగా విశ్లేషిస్తుందని భావిస్తారు. కానీ వాస్తవానికి మన స్పందనల నుంచే ఏఐ చాలా నేర్చుకుంటుంది. తనను తాను మెరుగుపరుచుకుంటుంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వందల కోట్ల మందిలో.. ఎలాంటి కంటెంట్‌కు ప్రజలు స్పందిస్తున్నారు?. ఏ అంశాలపై ఎక్కువ సమయం గడుపుతున్నారు?. ఏ విషయాలు వారిని ఆకర్షిస్తున్నాయి?. ఇలాంటి సమాచారంతో ఏఐ మరింత ఖచ్చితమైన సిఫార్సులు అందించే ప్రయత్నం చేస్తోంది.మార్కులు కనిపించవు.. ప్రభావం మాత్రమే!ఈ ఏఐ పరీక్షలో మనకు మార్కులు గట్రా పడవు. ఎలాంటి ఫలితాల పట్టా రాదు. కానీ దాని ప్రభావం మన జీవితాల్లో స్పష్టంగా కనిపిస్తుంది. యూట్యూబ్ సూచించే వీడియోలు మారతాయి. ఇన్స్టాగ్రామ్ రీల్స్ మారతాయి. గూగుల్ మన తర్వాతి ప్రశ్నను ఊహించే ప్రయత్నం చేస్తుంది. ఆన్లైన్ షాపింగ్‌లో కనిపించే ప్రకటనలు కూడా మన ఆసక్తులకు అనుగుణంగా మారతాయి(ఇది ఎప్పటి నుంచో సోషల్ మీడియాలోనూ నడుస్తున్న తంతే!). మన మాటల కంటే మన ప్రవర్తనే AIకి ఎక్కువ సమాచారం ఇస్తోంది.సౌకర్యమా?.. సవాలా?భవిష్యత్తులో విద్య, వైద్యం, ఉద్యోగాలు, వినోదం వంటి రంగాల్లో ఏఐ వ్యక్తిగత అవసరాలకు అనుగుణంగా మరింత మెరుగైన సేవలు అందించే అవకాశం ఉంది. మనకు అవసరమైన సమాచారాన్ని ముందుగానే అందించడం, పనులను సులభతరం చేయడం, నిర్ణయాల్లో సహకరించడం వంటి ఎన్నో ప్రయోజనాలు ఏఐ ద్వారా అందుబాటులోకి రానున్నాయి. అయితే ఇదే సమయంలో మరో వైపు కూడా ఉంది. మన ప్రతి ఆన్లైన్ కదలిక, ప్రతి ఆసక్తి, ప్రతి అభిరుచి డేటాగా మారుతున్న వేళ.. వ్యక్తిగత గోప్యత, డేటా భద్రత, తప్పుడు సమాచారాన్ని గుర్తించే సామర్థ్యం మరింత కీలకంగా మారనున్నాయి. సౌకర్యం కోసం ఏఐపై ఆధారపడుతున్న కొద్దీ దాని వినియోగంపై అప్రమత్తత కూడా అంతే అవసరం. ఒకప్పుడు మనిషి యంత్రాలను పరీక్షించాడు. ఇప్పుడు ఏఐ యుగంలో యంత్రం నిశ్శబ్దంగా మనిషిని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తోంది. ఇది కేవలం సాంకేతిక పరిణామం కాదు.. మనిషి, యంత్రం మధ్య కొత్త సంబంధానికి నాంది. అందుకే ఏఐ మనకు సౌకర్యమా?.. లేక కొత్త సవాలా?.. అన్నది నిర్ణయించేది చివరకు మనమే.::వెబ్‌డెస్క్ ప్రత్యేకంఇదీ చదవండి: ఇరాన్ నాటకాన్ని బయటపెట్టిన ట్రంప్ -
పొద్దున లేవగానే ఫోన్.. రాత్రి పడుకునే వరకు స్క్రోలింగ్!
సాక్షి, హైదరాబాద్ : అలారం ఆపగానే చేతి వేళ్లు ఫోన్ వైపే వెళ్తున్నాయా? ‘ఒక్క నిమిషం’ అంటూ మెసేజ్‌లు, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ చెక్ చేస్తూ అరగంట గడిచిపోతోందా? రాత్రి పడుకునే ముందు చివరిసారి ఫోన్ చూడాలనుకుని రీల్స్ చూస్తూ గంటలు గడుపుతున్నారా? ఇది ఇప్పుడు చాలామందిలో కనిపిస్తున్న డిజిటల్ అలవాటు. ఉదయం లేవగానే స్క్రీన్‌తో రోజును ప్రారంభించడం, రోజంతా నోటిఫికేషన్లు చెక్ చేయడం, రాత్రి నిద్రకు ముందు రీల్స్ చూడటం.. ఇలా చాలామందిలో స్క్రీన్ వినియోగం పెరిగిపోతోంది. దీని ప్రభావం నిద్ర, ఏకాగ్రత, మానసిక స్థితిపై పడే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. పొద్దున ఫోన్ ఎందుకు వద్దు? నిద్ర నుంచి మేల్కొన్న వెంటనే ఫోన్లో వచ్చే మెసేజ్‌లు, ఈమెయిల్స్, వార్తలు, సోషల్ మీడియా పోస్టులు మన దృష్టిని ఒక్కసారిగా అనేక అంశాల వైపు మళ్లిస్తాయి. ముఖ్యంగా ప్రతికూల వార్తలు లేదా పని సంబంధిత సందేశాలు కనిపిస్తే.. రోజును ప్రశాంతంగా ప్రారంభించడానికి బదులుగా ఒత్తిడితో ప్రారంభించే అవకాశం ఉంటుంది. ‘ఒక్కసారి చూస్తాను’ అంటూ ఫోన్ చేతిలోకి తీసుకుంటే.. రీల్స్, షార్ట్స్, సోషల్ మీడియా పోస్టులు వరుసగా కనిపిస్తూనే ఉంటాయి. ఒక కంటెంట్ తర్వాత మరో కంటెంట్ చూడాలనే ఆసక్తి పెరుగుతుంది. ఫలితంగా ఉదయం చేయాల్సిన పనులు ఆలస్యం కావచ్చు. రోజులో ముఖ్యమైన పనులపై దృష్టి పెట్టడానికి పట్టే సమయం కూడా పెరగొచ్చు. ఉదయం ఫోన్‌కు దూరంగా ఉండాలంటే.. మొదటి 30 నిమిషాలు: నిద్ర లేవగానే ఫోన్ చూడకుండా రోజును ప్రారంభించే ప్రయత్నం చేయండి. అలారం కోసం: సాధ్యమైతే ఫోన్‌కు బదులుగా సాధారణ అలారం గడియారం ఉపయోగించండి. దీంతో ఉదయం అలారం ఆపడానికి ఫోన్ చేతిలోకి తీసుకోవాల్సిన అవసరం ఉండదు. నోటిఫికేషన్లకు బ్రేక్: అవసరం లేని యాప్‌ల నోటిఫికేషన్లు ఆఫ్ చేయండి. ప్రతి అలర్ట్‌కు వెంటనే స్పందించాల్సిన అవసరం లేకుండా చేసుకోండి. స్క్రీన్కు సమయ పరిమితి: రీల్స్, షార్ట్స్, సోషల్ మీడియా కోసం రోజువారీ సమయ పరిమితి పెట్టుకోండి. ఉదయపు ప్రత్యామ్నాయం: లేవగానే నీరు తాగడం, కొద్దిసేపు నడవడం, స్ట్రెచింగ్ చేయడం, పుస్తకంచదవడం వంటి అలవాట్లను పెంచుకోండి. సూర్యకాంతి: ఉదయం కొంతసేపు సహజ కాంతిలో గడిపితే రోజును చురుగ్గా ప్రారంభించవచ్చు. రోజు ప్లాన్: ఫోన్ నోటిఫికేషన్లను అనుసరించకుండా.. ఆ రోజు చేయాల్సిన ముఖ్యమైన పనులను ముందుగానే డైరీలో రాసుకోవడం మంచిది. డోపమైన్ అంటే?ఫోన్ చూడగానే మన మెదడులో డోపమైన్ అనే రసాయనం విడుదలై ఆనందానికి బానిస అయిపోతున్నామనే ప్రచారం ఉంది. డోపమైన్ అనేది మెదడులోని నాడీకణాల మధ్య సమాచార ప్రసారంలో కీలక పాత్ర పోషించే న్యూరోట్రాన్స్మీటర్. కొన్ని రకాల అలవాట్ల రూపకల్పనలో ఇది భాగస్వామి. మనకు ఆసక్తికరంగా అనిపించే లేదా రివార్డ్ లభించే అనుభవాలు మళ్లీ చేయాలనే ప్రేరణలో డోపమైన్ వ్యవస్థ పనిచేస్తుంది. అందుకే సోషల్ మీడియా లైక్‌లు, కొత్త నోటిఫికేషన్లు, షార్ట్ వీడియోలు వంటి తక్షణ రివార్డులు పదేపదే అందుబాటులో ఉంటే.. వాటిని మళ్లీ మళ్లీ చూడాలనే అలవాటు బలపడవచ్చు. » షార్ట్ వీడియో యాప్స్‌లో ఒక వీడియో పూర్తికాగానే మరో వీడియో సిద్ధంగా ఉంటుంది. మనం వెతకాల్సిన అవసరం కూడా ఉండదు. కొత్తదనం, ఆసక్తికరమైన కంటెంట్ వరుసగా అందడం వల్ల మరికొంతసేపు చూడాలనే కోరిక కలగవచ్చు. ఇలా ఐదు నిమిషాల కోసం మొదలైన స్క్రోలింగ్ అరగంటకు.. ఆ తర్వాత గంటకు చేరుతుంది. రోజువారీ పనులు, చదువు, వ్యాయామం, కుటుంబంతో గడిపే సమయం తగ్గిపోవచ్చు. » ముఖ్యంగా ఇది నిద్రకు పెద్ద సమస్యగా మారుతుంది. నిద్ర సమయం తగ్గితే మరుసటి రోజు అలసట, ఏకాగ్రత లోపం, చిరాకు వంటి సమస్యలు కనిపించవచ్చు. » సోషల్ మీడియాలో ఇతరుల విజయాలు, ప్రయాణాలు, జీవనశైలిని పదేపదే చూడటం వల్ల కొందరు తమ జీవితాన్ని వారితో పోల్చుకోవచ్చు. దీనివల్ల అసంతృప్తి లేదా తమపై తక్కువ అభిప్రాయం ఏర్పడే అవకాశం ఉంటుంది. నిద్రకు ముందు ఫోన్‌కు గుడ్‌బై » రాత్రి పడుకునే ముందు ఫోన్ చూస్తూ ఉండటం వల్ల నిద్ర సమయం తగ్గకుండా జాగ్రత్త పడాలి. » ముఖ్యంగా రీల్స్, షార్ట్స్ వంటి నిరంతరం కొత్తకంటెంట్ అందించే యాప్‌ల వినియోగాన్ని నిద్రకు ముందు తగ్గించడం మంచిది. » రాత్రి ఫోన్‌ను మంచం పక్కన కాకుండా కొంత దూరంలో ఉంచండి. చేతికి అందే దూరంలో ఉంటే తెలియకుండానే తీసుకునే అవకాశం ఎక్కువ. » అవసరమైతే ‘డు నాట్ డిస్టర్బ్’ మోడ్ ఉపయోగించడం ద్వారా రాత్రి అంతరాయాలను తగ్గించుకోవచ్చు. అలవాట్లు డిటాక్స్ డోపమైన్‌ను డిటాక్స్ చేయడం కంటే మన అలవాట్లను డిటాక్స్ చేసుకోవడం ముఖ్యం. ఫోన్‌ను పూర్తిగా వదిలేయాల్సిన అవసరం లేదు. అది మన జీవితాన్ని సులభతరం చేసే సాధనం. కానీ ఉదయం లేవగానే మొదటి పని ఫోన్ చూడటం, ప్రతి కొన్ని నిమిషాలకోసారి నోటిఫికేషన్లు చెక్ చేయడం, రాత్రి నిద్రను త్యాగం చేసి రీల్స్ చూడటం మాత్రం అలవాటుగా మారకూడదు. టెక్నాలజీని మన అవసరాలకు ఉపయోగించుకోవాలి.. డిజిటల్ జీవితానికి దూరం కావడం కాదు.. దానితో సమతుల్యత సాధించడమే అసలుపరిష్కారం. -
ఫోన్‌కు బానిసై, ఆస్పత్రిలో చేరిన షకీలా.. నరకయాతన!
మొబైల్ ఫోన్ వినియోగం నేటి జీవితంలో విడదీయరాని భాగంగా మారిపోయింది. పనితో పాటు వినోదం, సోషల్ మీడియా, గేమ్స్.. ఇలా ప్రతి అవసరానికీ ఫోన్‌పైనే ఆధారపడుతున్న పరిస్థితి నెలకొంది. అయితే, అవసరానికి మించి గంటల తరబడి మొబైల్ చూడటం ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని నిపుణులు తరచూ హెచ్చరిస్తుంటారు. తాజాగా ప్రముఖ నటి షకీలా తనకు ఎదురైన అనుభవాన్ని వెల్లడిస్తూ మొబైల్ వినియోగంపై అభిమానులను అప్రమత్తం చేశారు.అతిగా ఫోన్ ఉపయోగించడం కారణంగా తాను తీవ్రమైన మెడ నొప్పితో బాధపడ్డానని షకీలా తెలిపారు. పరిస్థితి మరింత తీవ్రమవడంతో చివరకు శస్త్రచికిత్స చేయించుకోవాల్సి వచ్చిందని చెప్పారు. ఇందుకోసం సుమారు రూ.3 లక్షలు ఖర్చయినట్లు ఆమె వెల్లడించారు. ఈ సందర్భంగా మొబైల్ వినియోగాన్ని తగ్గించాలని అభిమానులకు సూచించారు.గంటలు గంటలు ఫోన్ చూడటంతో.. ఫోన్లో ఎక్కువసేపు గేమ్స్ ఆడటం, యూట్యూబ్ వీడియోలు చూడటం, ఇన్స్టాగ్రామ్ రీల్స్ వీక్షించడం తనకు అలవాటుగా మారిపోయిందని షకీలా పేర్కొన్నారు. చివరకు నిద్రపోయే సమయంలో కూడా ఫోన్‌ను పక్కకు వాల్చుకుని గంటల తరబడి చూస్తూ ఉండేదానినని చెప్పింది. ఈ అలవాటు కారణంగా మెడపై నిరంతరం ఒత్తిడి పడిందని, మెడలోని నరాలపై తీవ్ర ప్రభావం పడటంతో నొప్పి భరించలేని స్థాయికి చేరిందని ఆమె చెప్పారు. వైద్యుల సూచన మేరకు శస్త్రచికిత్స చేయించుకోవాల్సి వచ్చిందని వెల్లడించారు.అవసరాన్ని మించి వాడకండితనకు ఎదురైన అనుభవాన్ని పంచుకుంటూ మొబైల్‌ను అవసరానికి మించి ఉపయోగించవద్దని షకీలా కోరారు. ‘ఫోన్ చాలా ముఖ్యం. కానీ అవసరానికి మించి దాన్ని వాడకండి. ఉపయోగం లేని వీడియోలు చూస్తూ సమయాన్ని వృథా చేసుకోకండి. మొబైల్‌ను సరిగ్గా ఉపయోగించకపోతే డబ్బులు ఖర్చవడమే కాకుండా, భరించలేని నొప్పిని కూడా అనుభవించాల్సి వస్తుంది. చిన్న పిల్లలకు ఫోన్ ఇచ్చే విషయంలో తల్లిదండ్రులు మరింత జాగ్రత్తగా ఉండాలి. మొబైల్ వినియోగాన్ని తగ్గించాలి’ అని ఆమె సూచించారు.షకీలా 18 ఏళ్ల వయసులో తమిళ చిత్రం ‘ప్లే గర్ల్స్’తో సినీ రంగంలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత మలయాళ చిత్రాల్లో నటిస్తూ గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా 2000లో విడుదలైన ‘కిన్నార తుంబికల్’ ఆమె కెరీర్‌కు మంచి గుర్తింపు తీసుకొచ్చింది. తర్వాత దక్షిణాది భాషల్లో వరుస అవకాశాలు అందుకున్నారు. తెలుగులో దర్శకుడు తేజ తెరకెక్కించిన ‘జయం’ చిత్రంతో ఆమె ఎంట్రీ ఇచ్చారు. అనంతరం ‘నిజం’, ‘బంగారం’, ‘తొట్టిగ్యాంగ్’ తదితర చిత్రాల్లో నటించారు. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో పలు సినిమాల్లో నటించారు. -
జైల్లో CCB ఆకస్మిక తనిఖీలు..ఫోన్ తో అడ్డంగా దొరికిన మాజీ ఎంపీ
-
టీనేజ్ పిల్లల్లో పాప్‌కార్న్ బ్రెయిన్
సాక్షి, స్పెషల్ డెస్క్: ఈ డిజిటల్ యుగంలో పిల్లలు ఏకకాలంలో ఒకవైపు టీవీ చూస్తూనే, ఫోన్లో చాట్ చేస్తూ, గేమ్స్ ఆడటం సర్వసాధారణం అయిపోయింది. వాషింగ్టన్ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ డాక్టర్ డేవిడ్ ఎం.లెవీ దీనినే ’పాప్‌కార్న్ బ్రెయిన్’ అన్నారు. డిజిటల్ మల్టీటాస్కింగ్‌కు అలవాటు పడి, పాప్కార్న్లాగా ఆలోచనలు ఒకదాని వెనుక ఒకటి వేగంగా దూకడం, నిజ జీవితంలోని నెమ్మదైన పనులపై ఏకాగ్రత కోల్పోవడాన్ని ఇది సూచిస్తుంది. దీనిని మానసిక సమస్య అని నిర్ధారించలేదు. కానీ ఆందోళన పడాల్సిన మానసిక స్థితి అని హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం ఇది టీనేజ్ పిల్లల్లో ఎక్కువగా కనిపిస్తోంది.పాప్‌కార్న్ బ్రెయిన్ లక్షణాలు⇒ ఒకే పనిపై ఎక్కువ సేపు దృష్టి పెట్టలేకపోవడం, ఒక విషయం మీద ఆసక్తి, శ్రద్ధ వెంట వెంటనే మారిపోవడం ళీ నిమిష నిమిషానికి నోటిఫికేషన్లు, కొత్త డిజిటల్ కంటెంట్ కోసం పరితపించడం ⇒ సమాచారాన్ని గుర్తుంచుకోవడంలో వైఫల్యం. పెద్దల సూచనలను పాటించడంలో మైండ్‌ను వెంటనే కనెక్ట్ చేసుకోలేక ఇబ్బంది పడటం. ఒక్కమాటలో చెప్పాలంటే పరధ్యానం. ళీ నిద్ర లేమి, ఆందోళన చెందడం, భావోద్వేగాలను నియంత్రించుకోలేకపోవడంతల్లిదండ్రులు ఏం చేయాలి?⇒ రోజూ కొంత సమయం స్క్రీన్లు లేకుండా ప్రశాంతంగా, వర్తమానంలో గడపడం వల్ల మెదడు తిరిగి ఏకాగ్రతను పుంజుకుంటుంది. ⇒ స్క్రీన్ వినోదానికి కేటాయించినంత సమయాన్ని శారీరక శ్రమకు, ఇతర హాబీలకూ కేటాయించాలి. పిల్లల చదువు పూర్తయిన తర్వాత మిగిలిన సమయానికి తగినట్లు టైంటేబుల్ ఇవ్వాలి. ⇒ పిల్లలకు నిరంతరం ఏదో ఒక డిజిటల్ స్టిమ్యులేషన్ అవసరం లేదు. ఖాళీగా ఉండటం వల్ల వారిలో సృజనాత్మకత పెరుగుతుంది. కొత్త ఆలోచనల రెక్కలు విచ్చుకుంటాయి. సహనం పెరుగుతుంది.⇒ వర్చువల్ ప్రపంచం కంటే స్నేహితులు, కుటుంబ సభ్యులతో ప్రత్యక్షంగా ముఖాముఖి గడిపేలా ప్రోత్సహించాలి. ⇒ ఇష్టమైన పుస్తకాలు చదవడం వంటి హాబీలను ప్రోత్సహించాలి. చదివిన విషయాన్ని ఇంట్లో వాళ్లతో చర్చించే వాతావరణం కల్పించాలి. తల్లిదండ్రులతో కలిసి వాకింగ్ చేయడం అలవర్చాలి. పజిల్ పూరించడం, డ్రాయింగ్ లేదా క్రాఫ్ట్ వంటి హాబీలతో చిన్న చిన్న ప్రాజెక్టు చేసేవిధంగా ప్రోత్సహించాలి. పిల్లలపై ప్రభావం మెదడు అభివృద్ధి చెందే కీలక దశలో డిజిటల్ పరధ్యానం వారిలో కొత్త విషయాలను నేర్చుకునే సామర్థ్యాలను దెబ్బతీస్తుంది. అధ్యయనాల ప్రకారం, మితిమీరిన ఇంటర్నెట్ వాడకం పిల్లల్లో వాచిక మేధస్సు తగ్గడానికి కారణమవుతోంది. అలాగే, నిజ జీవిత సామాజిక నైపుణ్యాలు లోపించి, చిన్న సమస్యలకే వారు అధిక ఒత్తిడికి గురవుతున్నారు. -
రాకెట్ సక్సెస్ కాల్లో బయటపడ్డ మోదీ ఫోన్ సీక్రెట్ ట్యూన్!
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫోన్‌కు ‘వందేమాతర కాలింగ్ ట్యూన్’ ఉందంటూ సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. స్కైరూట్ ఏరోస్పెస్ శాస్త్రవేత్తలు ప్రైవేట్ రాకెట్ ప్రయోగ విజయానంతరం ప్రధానికి కాల్ చేసినప్పుడు ఈ ట్యూన్ వినిపించింది. అయితే ఇది ప్రధాని వ్యక్తిగత ట్యూన్ కాదని, అత్యున్నత అధికారిక నంబర్ల కోసం కేటాయించిన ప్రత్యేక రింగ్ బ్యాక్ ట్యూన్ అని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. Skyroot Aerospace की टीम के साथ फोनकॉल के दौरान पता चला पीएम मोदी की कॉलर ट्यून क्या है… जिसने भी सुना, उसके चेहरे पर मुस्कान और गर्व, दोनों आ गए।आखिर ऐसी क्या खास बात है इस धुन में?सुनिए... ⬇️ pic.twitter.com/N9wngZa2V3— BJP (@BJP4India) July 19, 2026భద్రతా కారణాలరీత్యా వీఐపీల అధికారిక నంబర్లపై సాధారణంగా ఎలాంటి పాటలు ఉండవు. ప్రభుత్వ టెలికాం నెట్‌వర్క్‌ల నిబంధనల ప్రకారం జాతీయ భావనను చాటే ఇలాంటి ట్యూన్లను ప్రత్యేక ప్రొటోకాల్ కింద సెట్ చేస్తుంటారు. సామాన్య ప్రజలు కూడా తమ ఫోన్లలో ఈ ట్యూన్‌ను సెట్ చేసుకోవచ్చు. జియో సావన్, వింక్ మ్యూజిక్ లేదా వీఐ యాప్‌లను ఓపెన్ చేసి, కాలర్ ట్యూన్స్ సెక్షన్లో ‘వందేమాతరం ఇన్స్ట్రుమెంటల్’ లేదా ‘ఫ్లూట్’ వెర్షన్‌ను వెతికి సులభంగా యాక్టివేట్ చేసుకోవచ్చు.ఇది కూడా చదవండి: అధికార పక్షాన్ని ఇరుకున పెట్టేలా.. ప్రశాంత్ కిషోర్ సవాల్! -
అతను–ఆమె ఓ సైలెంట్ కిల్లర్..
రాత్రి 10 గంటలు. ఇల్లు నిశ్శబ్దం. ఆమె పక్కన అతను ఉన్నాడు. కానీ లేడు. ఫోన్ వెలుగు అతని ముఖం మీద పడుతుంది. వేళ్లు స్క్రోల్ చేస్తున్నాయి. రీల్స్... యూట్యూబ్.. ఫేస్బుక్... మాటలు లేవు. కళ్లలోకి చూడటం లేదు. స్పర్శ లేదు. వాళ్లకు విడాకులు జరగలేదు. వాళ్లు విడిపోలేదు. కాని కలిసి మాత్రం లేరు. అతని ఫోన్ వాళ్లను విడగొట్టింది. దీనికి ఒక కొత్త పేరు పెట్టారు. ‘ఫబ్బింగ్’. ఫోన్లో పడి భార్యను నిర్లక్ష్యం ( Snubbing ) చేయడమే ఫబ్బింగ్. నేడు కనిపిస్తున్న అనేక దుష్ఫలితాలకు ఈ స్థితి కూడా ఒక కారణం.రాత్రి పదిగంటలు దాటింది. ఇల్లంతా నిశ్శబ్దం. ఆ మంచం మీద ఆమె పక్కనే అతను ఉన్నాడు.. కానీ లేడు! చేతిలోని స్మార్ట్‌ఫోన్ వెలుతురు అతని ముఖం మీద పడుతోంది. వేళ్లు యాంత్రికంగా స్క్రోల్ చేస్తున్నాయి. నిశ్శబ్దాన్ని చీలుస్తూ రీల్స్ శబ్దాలు వస్తున్నాయి కానీ, ఆ ఇద్దరి మధ్య మాటలు లేవు. కళ్లలోకి చూసుకునే తీరిక లేదు. కనీసం చిన్న స్పర్శ కూడా లేదు. వాళ్లకు విడాకులు కాలేదు, వాళ్లు విడిపోలేదు.. కానీ కలిసి మాత్రం లేరు! అతని చేతిలోని ఆ ఐదు అంగుళాల ఫోన్ స్క్రీన్, వాళ్ల మధ్య హిమాలయాలంత దూరాన్ని పెంచేసింది. ఆధునిక సమాజం ఈ నిశ్శబ్ద విషాదానికి పెట్టిన కొత్త పేరే.. ‘ఫబ్బింగ్’. ఫోన్‌ను, స్నబింగ్ ను కలిపి తయారు చేసిన పదం. దీని అర్థం ఫోను ద్వారా చేసే మానసిక హింస.ఒకప్పుడు ఆఫీస్ నుండి వచ్చే భర్త కోసం భార్య గేట్ దగ్గర ఎదురుచూసేది. ఇప్పుడు అతను వచ్చినా గేట్ తెరుచుకున్న చప్పుడు కూడా ఉండదు. ఎందుకంటే అతను భౌతికంగా ఇంట్లోకి వచ్చినా, అప్పటికే డిజిటల్ ప్రపంచంలో మునిగిపోయి ఉంటాడు. ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునే వరకు మీటింగ్‌లు, మెయిల్స్, వాట్సాప్ చాటింగ్‌లు, యూట్యూబ్, రీల్స్‌తో కాలం కరిగిపోతోంది. భార్య ఏదైనా మాట్లాడబోతే ‘ఒక నిమిషం’ అనే సమాధానం వస్తుంది. కానీ ఆ ఒక్క నిమిషం ఎప్పటికీ రాదు. అతను శరీరంతో ఇంట్లోనే ఉంటాడు, కానీ మనసుతో వేరే ప్రపంచంలో ఉంటాడు. ఇది శారీరక దూరం కాదు, అంతకుమించిన మానసిక మరణం. దురదృష్టవశాత్తూ ఇది ఇప్పుడు ప్రతి మూడవ ఇంట్లో జరుగుతున్న నిరంతర కృత్యం.కనిపించని గోడమొదట ‘ఆఫీస్ వర్క్ ఉంది’ అని మొదలవుతుంది. తర్వాత ‘ఫ్రెండ్స్ గ్రూప్‌లో చాటింగ్’ అంటారు. చివరకు ఆమె ఏదైనా చెప్పాలంటే అతణ్ణి గట్టిగా తట్టి పిలవాల్సిన పరిస్థితి. అతను చెవులకున్న హెడ్‌ఫోన్స్ తీసి ‘ఏంటి?’ అని విసుక్కుంటాడు. ప్రేమగా మాట్లాడుకోవడానికి, కలిసి నవ్వడానికి, ఆఖరికి మనస్ఫూర్తిగా గొడవ పడటానికి కూడా అక్కడ సమయం లేదు. ఆమెకు అర్థం కావడం లేదు.. గొడవ పడాలా? లేక ఏడవాలా? ఎందుకంటే ఎదుటివాడు ఏ తప్పూ చేయలేదు, కేవలం ‘బిజీ’గా ఉన్నాడు. కానీ ఆ బిజీ అనే ముసుగు వెనుక ఆమె మనసు మెల్ల మెల్లగా చచ్చిపోతోంది.పేరు లేని ఒంటరితనంభర్త తన పక్కనే ఉన్నా తనకు అందుబాటులో లేకపోవడం భార్యకు ఎంత బాధ? సినిమాకు వెళ్లాలన్నా, కూరగాయలు తేవాలన్నా, పిల్లాడి ఫీజు కట్టాలన్నా ఆమె ఒంటరిగానే పోరాడాలి. ఇంట్లో ఇద్దరూ ఉంటారు, కానీ సంసార భారాన్ని ఆమె ఒక్కతే మోస్తుంది. స్నేహితులు ‘నువ్వు చాలా అదృష్టవంతురాలివి, భర్త బంగారం’ అంటుంటే ఆమె గుండెల్లో ఏడుస్తూ పైకి నవ్వుతుంది. ఎందుకంటే ‘నా భర్త ఫోన్ తో లవ్‌లో ఉన్నాడు’ అని సమాజానికి ఎలా చెప్పుకుంటుంది? ఈ ఒంటరితనానికి చట్టబద్ధమైన పేరు లేదు, విడాకుల సర్టిఫికేట్ లేదు.. అందుకే ఇది ఇంకాస్త ఎక్కువగా బాధిస్తుంది.పరిష్కారం ఎక్కడ?ఈ డిజిటల్ చెరసాల నుంచి బంధాన్ని కాపాడుకోవడానికి కొన్ని కఠినమైన నియమాలు అవసరం → భర్తతో గొడవ పడకుండా ప్రశాంతంగా కూర్చోబెట్టి ‘నువ్వు చెడ్డవాడివి కాదు, కానీ నీ పక్కన ఉంటూనే నేను ఒంటరిగా నలిగిపోతున్నాను’ అని అర్థమయ్యేలా చెప్పాలి → ఇంట్లో ‘డిజిటల్ డిన్నర్’ రూల్ పెట్టాలి. రాత్రి భోజన సమయంలో రోజుకు కనీసం 30 నిమిషాలు ఫోన్ లను పూర్తిగా పక్కన పెట్టి, కేవలం ఒకరి కళ్లలోకి ఒకరు చూస్తూ మాట్లాడుకోవాలి → ‘బెడ్రూమ్ నో ఫోన్ జోన్’. పడుకునే గదిలోకి ఫోన్ ను రానివ్వకూడదు → ఆమె కూడా అతని ఫోన్ అలవాటుతో విసిగిపోయి తను కూడా ఫోన్ కు బానిస అవ్వకూడదు. తనకంటూ ఒక ప్రపంచాన్ని, హాబీలను, స్నేహితులను పెంచుకోవాలి. సాంకేతికత శత్రువు కాదు, దాన్ని మనం బంధాలను విడగొట్టడానికి వాడుతున్నామా లేదా కలపడానికి వాడుతున్నామా అనేదే ముఖ్యం. ఫోన్ స్క్రీన్ వల్ల వస్తున్న దూరాన్ని ఇప్పుడే గుర్తించి తగ్గించుకోకపోతే, ఒకరోజు ఇద్దరూ ఒకే కప్పు కింద ఉంటూనే.. మానసిక విడాకులు తీసుకున్న ‘డైవోర్సీలు’గా మిగిలిపోతారు. హెచ్చరిస్తున్న ఈ డిజిటల్ కాలాన్ని ఇప్పుడైనా గమనిద్దాం.. బంధాలను కాపాడుకుందాం. -
బీఎస్ఎన్ఎల్ శాటిలైట్ ఫోన్ లాంచ్!
ప్రభుత్వ రంగ టెలికాం దిగ్గజం భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) దేశీయ మార్కెట్లోకి అధునాతన శాటిలైట్ ఫోన్‌ను ప్రవేశపెట్టింది. సాధారణ మొబైల్ నెట్‌వర్క్‌లు అందుబాటులో లేని మారుమూల ప్రాంతాల్లో సైతం నిరంతరాయంగా కనెక్టివిటీని అందించడమే లక్ష్యంగా దీన్ని రూపొందించారు. అన్ని పన్నులతో కలుపుకుని ఈ హ్యాండ్సెట్ ధరను రూ.1,34,166 గా నిర్ణయించారు.ఎందుకంత ధర?ఈ ఫోన్ ధర వినగానే సామాన్య స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు ఆశ్చర్యపోవడం సహజం. అయితే, ఇది రోజువారీ అవసరాల కోసం రూపొందించిన సాధారణ మొబైల్ కాదు. భూమిపై ఉండే సెల్యులార్ టవర్లతో సంబంధం లేకుండా నేరుగా ఉపగ్రహాల ద్వారా ఇది సిగ్నల్స్ అందుకుంటుంది. సాంప్రదాయ నెట్‌వర్క్‌లు పూర్తిగా విఫలమయ్యే అత్యంత ప్రతికూల పరిస్థితుల్లో కూడా వాయిస్ కమ్యూనికేషన్‌ను అందించడమే దీని ప్రత్యేకత. అందుకే దీనికి అంత ప్రీమియం ధర ఉంది.ఈ ఫోన్ ప్రత్యేకతలుప్రముఖ అంతర్జాతీయ శాటిలైట్ నెట్వర్క్ సంస్థ ‘ఇన్మర్శాట్’ భాగస్వామ్యంతో బీఎస్ఎన్ఎల్ ఈ మిషన్ క్రిటికల్ కమ్యూనికేషన్ పరికరాన్ని అందుబాటులోకి తెచ్చింది. దీని ప్రధాన ఫీచర్లు..మొబైల్ టవర్ల పరిధితో సంబంధం లేకుండా దేశంలోని ఏ మారుమూల ప్రాంతం నుంచైనా నేరుగా వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు.ఎంతటి ప్రతికూల వాతావరణ పరిస్థితులనైనా తట్టుకునేలా పటిష్టమైన బాడీతో ఈ ఫోన్‌ను రూపొందించారు.అత్యవసర సమయాల్లో ప్రాణాలను రక్షించేందుకు ప్రత్యేక ఎస్ఓఎస్ ఫీచర్‌ను ఇందులో పొందుపరిచారు.విద్యుత్ సౌకర్యం లేని ప్రాంతాల్లో కూడా ఎక్కువ కాలం పనిచేసేలా లాంగ్ లైఫ్ బ్యాటరీ దీని సొంతమని బీఎస్ఎన్ఎల్ తెలిపింది.ఈ ఫోన్ ఎవరికి ఉపయోగపడుతుంది?సాధారణ పౌరుల కంటే కూడా నిర్దిష్ట రంగాల్లో క్లిష్టమైన విధుల్లో ఉన్నవారి కోసం బీఎస్ఎన్ఎల్ దీన్ని ప్రత్యేకంగా డిజైన్ చేసింది. రక్షణ రంగం, సరిహద్దు భద్రతా దళాలు, సముద్రయాన, నౌకాదళ కార్యకలాపాలు, విపత్తు నిర్వహణ సంస్థలు, మైనింగ్, మారుమూల పారిశ్రామిక ప్రాజెక్టులు, అడ్వెంచర్ ట్రావెలర్స్, పర్వతారోహకుల.. వంటి ప్రత్యేక కార్యకలాపాలు నిర్వహించేవారికి ఇది ఎంతో ఉపయోగపడుతుందని కంపెనీ చెప్పింది.When conventional mobile networks can’t reach, the BSNL Satellite Phone keeps you connected.Designed for challenging environments, making it an ideal solution for Defence, Maritime, Disaster Response, Mining, Remote Operations and Adventure Travel.Why Choose BSNL Satellite… pic.twitter.com/YQpeXwjrb6— BSNL India (@BSNLCorporate) July 8, 2026కొనుగోలు చేయడం ఎలా? అర్హతలేంటి?ఈ శాటిలైట్ ఫోన్ సాధారణ ఆన్లైన్ స్టోర్లలో లేదా రిటైల్ మొబైల్ షాపుల్లో దొరకదు. దీనిని కొనుగోలు చేయాలనుకునే వారు కొన్ని ప్రత్యేక నియమాలను పాటించాల్సి ఉంటుంది. ఆసక్తి గల వినియోగదారులు నేరుగా తమ సమీప బీఎస్ఎన్ఎల్ ప్రధాన కార్యాలయాన్ని ఆశ్రయించాలి. జాతీయ భద్రత, వ్యూహాత్మక కారణాల దృష్ట్యా ఈ ఫోన్‌ను ఏ అవసరం కోసం కొనుగోలు చేస్తున్నారనే పూర్తి వివరాలను బీఎస్ఎన్ఎల్ అధికారులకు సమర్పించాల్సి ఉంటుంది. కంపెనీ నిర్దేశించిన నిబంధనలు, అర్హత ప్రమాణాలకు లోబడి, అవసరమైన అనుమతులు లభించిన తర్వాతే ఈ హ్యాండ్‌సెట్‌ను విక్రయిస్తారు.ఇదీ చదవండి: బంగారం ధరల్లో స్వల్ప మార్పు -
మెడ వణుకుతోంది… కనీసం ఫోన్‌ను పట్టుకోలేకపోతున్నా!
ఆ యువతి తరచూ మెడ నొప్పి, చేతుల్లో బలం తగ్గిపోతున్న సమస్యతో డాక్టర్‌ను సంప్రదించింది. తన జీవనశైలి, రోజువారీ అలవాట్లు, ఉద్యోగ ఒత్తిడి, నిద్రపోయే భంగిమ.. ఇవన్నీ కారణాలేమోనని ఆమె ముందుగానే అనుకుంది. కానీ అన్ని వివరాలు విన్న తర్వాత డాక్టర్ చెప్పిన మాటలు ఆమెను ఆశ్చర్యంలో ముంచేశాయి. ‘‘అది సాధారణ అలసట కాదు… ఆమె శరీరం ఫోన్ ప్రభావానికి లోనవుతోంది’’ అనే వ్యాఖ్యతో అసలు సమస్యపై కొత్త చర్చ మొదలైంది.స్మార్ట్‌ఫోన్ వినియోగం ఇప్పుడు లింగ భేదానికి పరిమితం కాని సమస్యగా మారుతోందని నిపుణులు చెబుతున్నారు. గంటల తరబడి స్క్రీన్‌పై గడపడం వల్ల మెడపై ఒత్తిడి పెరగడం, భంగిమలో మార్పులు, చేతి బలం తగ్గడం వంటి లక్షణాలు యువతలో సాధారణంగా కనిపిస్తున్నాయని పరిశోధనలు సూచిస్తున్నాయి. ముఖ్యంగా పని, చదువు, వినోదం అన్నీ డిజిటల్ పరికరాలపైనే ఆధారపడటం వల్ల ఈ ప్రభావం మరింత విస్తరిస్తోందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇది ఒక్కరి సమస్య కాదు… ఆధునిక జీవనశైలి కలిగిస్తున్న సామూహిక ఆరోగ్య సవాలుగా మారుతోందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.స్మార్ట్ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు వంటి డిజిటల్ పరికరాలు మన శరీర ఆకృతినే నిశ్శబ్దంగా ప్రభావితం చేస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. దీని వల్ల మెడ వంగిపోవడం, చూపు బలహీనపడటం, చేతి బలం తగ్గడం, మోటార్ స్కిల్స్‌పై ప్రభావం వంటి సమస్యలు పెరుగుతున్నాయని పరిశోధనలు సూచిస్తున్నాయి. పైగా ఈ మార్పులన్నింటినీ ఇప్పుడు నిపుణులు ఒక కొత్త పదంతో వివరిస్తున్నారు. అదే “ఫోన్ బాడీ (Phone Body)”. అంటే..ఫోన్ అధికంగా ఉపయోగించడం వల్ల శరీరంలో కనిపిస్తున్న మార్పులు, భంగిమలో వచ్చే మార్పుల సమాహారం అని దీని అర్థం. ఇది వైద్యపరంగా అధికారిక పదం కాకపోయినా.. ఆధునిక జీవనశైలి ప్రభావాన్ని వివరించేందుకు వాడుతున్నారు. బీబీసీ టెక్నాలజీ జర్నలిస్ట్ థామస్ జర్మైన్ తన తాజా వ్యాసంలో ఈ వివరాలను సమగ్రంగా వెల్లడించారు.అందులో నిపుణుల చెప్పిన వివరాల ప్రకారం సమస్య కేవలం “స్క్రీన్ టైమ్” మాత్రమే కాదు.. ఎక్కువ సమయం ఇంట్లో కూర్చొని ఫోన్, కంప్యూటర్లకు అతుక్కుపోవడం కూడా ప్రధాన కారణంగా మారుతోంది. ముఖ్యంగా పిల్లలు, యువతలో శారీరక చురుకుదనం తగ్గిపోవడం దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలకు దారి తీస్తోందని హెచ్చరిస్తున్నారు.👉ప్రపంచవ్యాప్తంగా మయోపియా (దూరం చూపు బలహీనత) కేసులు వేగంగా పెరుగుతున్నాయి. అయితే దీని ప్రధాన కారణం ఫోన్‌ను దగ్గరగా చూడటం మాత్రమే కాదని, బయట సమయం తగ్గిపోవడమే ముఖ్య కారణమని నిపుణులు చెబుతున్నారు. సహజ కాంతి కళ్ల ఆరోగ్యానికి సహాయపడుతుందని పరిశోధనలు సూచిస్తున్నాయి.👉మరోవైపు “టెక్ నెక్” (Tech Neck) అనే సమస్య కూడా వేగంగా పెరుగుతోంది. నిరంతరం తల వంచి ఫోన్ చూడటం వల్ల మెడపై తీవ్ర ఒత్తిడి పడుతోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. తల వంచే కోణం పెరిగే కొద్దీ మెడపై పడే బరువు అనేక రెట్లు పెరుగుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. దీని వల్ల నొప్పులు, కండరాల గట్టిపడటం మాత్రమే కాకుండా భవిష్యత్తులో పోశ్చర్(posture) మార్పులు కూడా రావచ్చని డెర్మటాలజీ నిపుణులు హెచ్చరిస్తున్నారు.👉ఇక చేతి బలం విషయంలోనూ ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రపంచవ్యాప్తంగా యువతలో గ్రిప్ స్ట్రెంగ్త్ తగ్గుతున్నట్లు పలు అధ్యయనాలు చెబుతున్నాయి. ఇది కేవలం చేతుల బలహీనత మాత్రమే కాకుండా మొత్తం శారీరక ఆరోగ్య సూచికగా పరిగణించబడుతోంది.👉టెక్నాలజీ మోటార్ స్కిల్స్‌పైనా ప్రభావం చూపుతోందని పరిశోధకులు చెబుతున్నారు. ఫోన్‌పై స్వైప్ చేయడం, క్లిక్ చేయడం వంటి పనుల్లో నైపుణ్యం పెరుగుతున్నప్పటికీ, చేతి-మెదడు సమన్వయంపై దీర్ఘకాలిక ప్రభావం ఉండొచ్చని హెచ్చరిస్తున్నారు.అయితే నిపుణులు భయపడాల్సిన అవసరం లేదని సూచిస్తున్నారు. రోజూ కొంతసేపు ఫోన్‌కు విరామం ఇవ్వడం.. కొన్ని అలవాట్లు మార్చుకుంటే “ఫోన్ బాడీ” ప్రభావాలను గణనీయంగా తగ్గించుకోవచ్చు.20–20–20 రూల్ప్రతి 20 నిమిషాలకు ఒకసారి, 20 అడుగుల దూరంలో ఉన్న వస్తువును కనీసం 20 సెకన్లు చూడాలని సూచిస్తున్నారు. ఇది కంటి ఒత్తిడిని తగ్గిస్తుంది.మెడ పోశ్చర్పై దృష్టిఫోన్ను కిందకి వంచి చూడకుండా, కంటి లెవెల్లో ఉంచుకోవడం ద్వారా “టెక్ నెక్” ప్రమాదాన్ని తగ్గించవచ్చు.స్క్రీన్ టైమ్ పరిమితిరోజులో నిర్దిష్ట సమయాన్ని మాత్రమే ఫోన్ వినియోగానికి కేటాయించడం మంచిదని నిపుణుల సూచన. అవసరం లేని స్క్రోలింగ్ తగ్గించాలి.శారీరక కదలికలు తప్పనిసరిప్రతి గంటకోసారి లేచి నడవడం, స్ట్రెచింగ్ చేయడం వల్ల కండరాల గట్టిపడటం తగ్గుతుంది.గ్రిప్ & చేతి వ్యాయామాలుబంతి పట్టుకోవడం, స్ట్రెస్ బాల్ వాడడం, చిన్న హ్యాండ్ ఎక్సర్సైజ్లు చేయడం చేతి బలం మెరుగుపరుస్తాయని చెబుతున్నారు.బయట గడిపే సమయం పెంచాలిసహజ కాంతి కళ్ల ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది. రోజులో కనీసం కొంత సమయం బయట గడపడం మయోపియా ప్రమాదాన్ని తగ్గించగలదు.డిజిటల్ డీటాక్స్ అలవాటువారానికి ఒకసారి కొన్ని గంటలు ఫోన్ లేకుండా గడపడం మానసికంగా, శారీరకంగా ఉపశమనం ఇస్తుందని నిపుణులు సూచిస్తున్నారు.మొత్తం మీద, ఫోన్ ఇప్పుడు మన జీవితంలో భాగంగా మారినప్పటికీ, అది శరీరంపై నెమ్మదిగా కానీ స్పష్టంగా ప్రభావం చూపుతోందని తాజా పరిశోధనలు హెచ్చరిస్తున్నాయి. టెక్నాలజీని పూర్తిగా దూరం చేయలేకపోయినా, దాన్ని నియంత్రితంగా ఉపయోగించడం ద్వారా శరీరంపై దాని ప్రభావాన్ని గణనీయంగా తగ్గించుకోవచ్చని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. -
ఎవరితో అంతసేపు మాట్లాడుతున్నావ్?
హైదరాబాద్: భర్త మందలించడంతో భార్య ఇంటి నుంచి వెళ్లి అదృశ్యమైన సంఘటన ఆదివారం కుషాయిగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కీసర మండలం, నాగారానికి చెందిన పెంట శ్రీను తన భార్య రమాదేవి ఫోన్లో ఎక్కువగా మాట్లాడుతుందని మందలించాడు. దీంతో మనస్థాపం చెందిన భార్య ఈ నెల 19న హెచ్‌బీకాలనీలోని తల్లిదండ్రుల వద్దకు వెళ్లింది. మరుసటి రోజు భర్త శ్రీను హెచ్‌బీకాలనీకి వెళ్లి చూడగా, భార్య అక్కడే ఉంది. అదేరోజు మధ్యాహ్నం ఇంట్లో ఎవరకి చెప్పకుండా బయటకు వెళ్లిన రమాదేవి తిరిగి రాలేదు. దీంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు తెలిసిన చోటల్లా వెతికిన ఫలితం లేకపోవడంతో ఆదివారం కుషాయిగూడ పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
జెన్ జీకి బెస్ట్... 5జీ ఫోన్లలో చీపెస్ట్!
దేశీ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ లావా సరికొత్త 5జీ ఫోన్‌ను లాంచ్ చేసింది. షార్క్-2 5జీ పేరుతో విడుదలైన ఈ ఫోన్ ధర కేవలం 11,999 రూపాయలు. 5జీ ఫోన్లలోకెల్లా అత్యంత చౌకది కావడం ఒక విశేషం. అలాగనీ ఇందులో ఫీచర్లకు, హంగు, ఆర్బాటాలకేమీ కొదవలేదు. అన్నింటికంటే ముందు చెప్పుకోవాల్సిన విషయం దీని బ్యాటరీ గురించి. ఆరువేల ఎంఏహెచ్ బ్యాటరీతో లభించే ఈ ఫోన్‌తో ఏకంగా 13 గంటల 35 నిమిషాలపాటు యూట్యూబ్ వీడియోలు చూసుకోవచ్చునని కంపెనీ చెబుతోంది.స్క్రీన్ విషయానికి వస్తే... 120 హెర్ట్ట్జ్ రిఫ్రెష్ రేట్‌తో హెచ్డీ-ఎల్సీడీ డిస్ప్లే లభిస్తుంది. స్క్రీన్ సైజు దాదాపు 6.75 అంగుళాలు. సోనార్ గోల్డ్, ఆర్యా బ్లూ రంగుల్లో అందుబాటులో ఉంది. లావా షార్క్-2 5జీ స్మార్ట్‌ఫోన్‌లో ఆరు నానోమీటర్ల యూనీసాక్ టీ8200 ఆక్టాకోర్ ప్రాసెసర్‌ను ఉపయోగించారు. నాలుగు జీబీల ర్యామ్‌కు అదనంగా 4 జీబీల వర్చువల్ ర్యామ్ అందుబాటులో ఉంది. ఫిజికల్ మెమరీ విషయానికి వస్తే 64 గిగాబైట్లు లభిస్తుంది. లావా షార్క్-2 5జీ ఫోన్ ఏఐ ఆధారిత 13 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. సెల్ఫీ కెమెరా రెజల్యూషన్ 5 మెగాపిక్సెల్స్.రూ.15,000 లోపు 5జీ స్మార్ట్ఫోన్లుఫోన్ధర (రూపాయల్లో)స్క్రీన్బ్యాటరీ(mAh)కెమెరా(మెగా పిక్సెల్స్)రెడ్మీ నోట్ 14 ఎస్ఈ13,9996.67, AMOLED (120Hz)511050 MP + 2 MPమోటో జీ57 పవర్13,9996.72, FHD+ LCD (120Hz)700050 MP + 8 MPసామ్సంగ్ గెలాక్సీ ఎం1714,9996.7, Super AMOLED500050 MP + 5 MP + 2 MPఐకూ 14,5006.7, LCD (120Hz)600050 MPసీఎంఎఫ్ నథింగ్ ఫోన్ 114,6656.7, FHD+ (Dimensity 7300)500050 MP + 2 MPగమనిక: రిటైలర్, సెల్లర్ ఆధారంగా ధరల్లో స్వల్ప మార్పులు ఉండే అవకాశం ఉంది.ఇదీ చదవండి: హ్యాట్రిక్ తగ్గింపు.. మళ్లీ ఈ సమయం రాదేమో! -
ఫోన్ చూడొద్దంటే.. ప్రాణాలు తీశాడు
సాక్షి, బళ్లారి: ఎక్కువసేపు మొబైల్ ఫోన్ చూడొద్దు అని ఓ తండ్రి కొడుక్కి చెప్పడమే తప్పు అయింది. ఫోన్లో గేమ్స్ ఆడడం మాని బుద్ధిగా చదువుకో అని ఓ అక్క తమ్ముడికి చెప్పడమే మరణశాసనం అయింది. ఫోన్ చూడొద్దని చెప్పిన తండ్రి, అక్కపై ఓ యువకుడు కత్తితో విచక్షణారహితంగా దాడి చేసి హతమార్చిన దారుణ ఉదంతం కర్ణాటకలో కొప్పళ జిల్లా గంగావతి తాలూకా అయోధ్య గ్రామంలో శనివారం రాత్రి జరిగింది. గ్రామంలో వ్యవసాయపనులు చేసుకునే రైతు వెంకట నాయుడు (48)కు కూతురు ప్రగతి(20), కొడుకు సాయి వెంకట్ మణిదీప్ (18)ఉన్నారు. వెంకటనాయుడు కుటుంబం తెలుగువారు. గొడవగా మొదలై రక్తపాతంగా మారి.. రాత్రి పొద్దుపోయే వరకూ మణిదీప్ మొబైల్లో గేమ్స్ ఆడుతుండగా అక్క ప్రగతి మొబైల్ పక్కనపెట్టి చదువుకోవాలని అతనికి సూచించింది. దీంతో మణిదీప్ ఆమెతో గొడవకు దిగాడు. అంతటితో ఆగని అతడు కోపోద్రిక్తుడై వంటగదిలో కత్తి తీసుకుని అక్క ప్రగతిపై విచక్షణారహితంగా దాడి చేశాడు. ఆమె కేకలు విన్న తండ్రి వెంకటనాయుడు వచ్చి కొడుకును అడ్డుకోబోయాడు. అయితే తండ్రి అని కూడా చూడకుండా చంపేశాడు. అడ్డొచ్చిన తల్లిని కూడా కత్తితో పొడిచాడు. తరువాత తాను కూడా పొడుచుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. తీవ్ర గాయాలతో ప్రగతి అక్కడే మరణించింది.తీవ్రంగా గాయపడిన ముగ్గురినీ స్థానికులు తొలుత గంగావతి ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం బళ్లారి విమ్స్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ తండ్రి మృతి చెందాడు. తల్లి సౌజన్య పరిస్థితి కూడా విషమంగా ఉంది. ప్రస్తుతం తల్లీ కుమారుడు ఒకే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై ఆదివారం ఉదయం కొప్పళ జిల్లా ఎస్పీ రామ్ అరసిద్ధి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. తండ్రీ, కుమార్తె మృతితో అయోధ్య గ్రామంలో విషాదం నెలకొంది. మొబైల్ఫోన్లు, ఆన్లైన్ గేమ్స్ యువతపై ఏమేర దు్రష్పభావం చూపుతున్నాయో ఈ ఘటనే అద్దం పడుతోంది. -
నేను లేకుంటే నువ్వు జైల్లోనే.. నెతన్యాహుకు.. ట్రంప్ హెచ్చరిక
వాషింగ్టన్ డీసీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధానిపై తీవ్రఆగ్రహం వ్యక్తం చేశారు. లెబనాన్‌లోని హెజ్బుల్లా లక్ష్యాలపై ఇజ్రాయెల్ దాడులు చేస్తుండడంతో ఫోన్లో ఆయనను తీవ్ర పదజాలంతో "అసలు నువ్వు ఏం చేస్తున్నావ్" హెచ్చరించినట్లు ఆక్సియోస్ కథనం ప్రచురించింది. అమెరికా, ఇరాన్‌ల మధ్య ఒక ప్రాథమిక శాంతి ఒప్పందం కుదిరే దశకు వచ్చింది. అయితే, ఇజ్రాయెల్ లెబనాన్‌పై దాడులు పెంచడంతో.. "ఇజ్రాయెల్ దాడులు ఆపకపోతే అమెరికాతో చర్చలు నిలిపివేస్తాం" అని ఇరాన్ హెచ్చరించింది. దీంతో ట్రంప్ నెతన్యాహూతో మాట్లాడి కాల్పులు విరమించాలని కోరారు. అయితే దీనికి తొలుత అంగీకరించిన ఇజ్రాయెల్ తిరిగి లెబనాన్‌పై కాల్పులు జరపింది. దీంతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్, నెతన్యాహూకు ఫోన్ చేసి తీవ్ర స్థాయిలో విరుచుకపడ్డట్లు సమాచారం.అమెరికా అధికారుల సమాచారం ప్రకారం.. ట్రంప్ చాలా కోపంగా నెతన్యాహును ఉద్దేశించి ఫోన్లో ఇలా మాట్లాడినట్లు తెలుస్తోంది" అసలు నువ్వు ఏం చేస్తున్నావు. నీకు పిచ్చి పట్టింది నేను గనుక లేకపోతే నువ్వు ఈపాటికి జైల్లో ఉండేవాడివి. నేను నిన్ను కాపాడుతుంటే నువ్వు ఇలా చేస్తున్నావు.ఈ దాడుల వల్ల ప్రపంచంలో నిన్నూ, ఇజ్రాయెల్‌ను అందరూ అసహ్యించుకుంటున్నారు" అని నెతన్యాహుని తీవ్ర పదజాలంతో మందలించినట్లు కథనాలు ప్రచురితమయ్యాయి.అనంతరం ట్రంప్ సోషల్ మీడియా పోస్ట్‌లో.. నెతన్యాహుతో మాట్లాడి బీరూట్‌పై పెద్ద ఎత్తున జరపాలనుకున్న దాడిని విరమించుకునేలా చేశానని, ఇజ్రాయెల్ సైన్యం వెనక్కి తగ్గిందని ప్రకటించారు. ఇందుకు నెతన్యాహుకు ధన్యవాదాలు కూడా తెలిపారు.అయితే, నెతన్యాహు కార్యాలయం మాత్రం తాము పూర్తిగా వెనక్కి తగ్గినట్లు ఒప్పుకోలేదు. "హెజ్బుల్లా గనుక మా నగరాలపై దాడులు ఆపకపోతే.. మేము బీరూట్‌లోని ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేసి తీరుతాం. ఈ విషయంలో మా వైఖరిలో ఎలాంటి మార్పు లేదు" అని నెతన్యాహు స్పష్టం చేశారు. -
దశరథన్నా.. ధైర్యంగా ఉండండి
తిరుపతి తుడా : టీడీపీ రౌడీమూకల దాడిలో తీవ్రంగా గాయపడ్డ రాయచోటి మున్సిపల్ మాజీ వైస్‌చైర్మన్ దశరథరామిరెడ్డిని మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఫోన్లో పరామర్శించారు. తిరుపతిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన్ను వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్‌రెడ్డి శుక్రవారం పరామర్శించారు. అనంతరం ఆయన వైఎస్ జగన్‌కు ఫోన్‌చేసి దశరథరామిరెడ్డితో మాట్లాడించారు. ఈ సందర్భంగా ఆయనకు జగన్ ధైర్యం చెప్పారు. ‘‘దశరథన్నా.. ధైర్యంగా ఉండండి. పార్టీ మీకు ఎప్పుడూ అండగా ఉంటుంది’’ అంటూ భరోసా ఇచ్చారు. త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు. అనంతరం గడికోట మీడియాతో మాట్లాడుతూ.. దశరథరామిరెడ్డిపై అతి కిరాతకంగా కత్తులు, రాడ్లతో దాడిచేయించారని మండిపడ్డారు. దీని వెనుక స్థానిక మంత్రి ప్రమేయం ఉందని ఆరోపించారు. రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోందని టీడీపీ మూకలు అరాచక శక్తులుగా మారిపోయారన్నారు. ఇలాంటి దాడులు, బెదిరింపులకు వైఎస్సార్సీపీ బెదరదని హెచ్చరించారు. ప్రశాంతమైన రాయచోటి కోసం తాము ప్రయతి్నస్తుంటే, టీడీపీ నేతలు అల్లర్లకు ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ ఘటనపై న్యాయపోరాటం చేస్తామని, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకునే వరకు తమ పార్టీ పోరాటం చేస్తుందని గడికోట తేల్చిచెప్పారు.ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న దశరథరామిరెడ్డికి ఫోన్లో ధైర్యం చెబుతున్న వైఎస్ జగన్ -
మీ ఫోన్.. చంద్రుడిపైకి వెళ్లిన రాకెట్ కంటే శక్తివంతమా?
-
మరికొద్ది గంటల్లో ఫోన్లకు అలర్ట్!
ఈరోజు కొన్ని ప్రాంతాల్లో మీ మొబైల్ ఫోన్ ఒక్కసారిగా రింగ్ అయి, స్క్రీన్‌పై వింతైన మెసేజ్ కనిపించే అవకాశం ఉంది. భయాందోళన చెందకండి. ఇది ప్రకృతి వైపరీత్యాలు లేదా అత్యవసర పరిస్థితులు సంభవించినప్పుడు మనల్ని అప్రమత్తం చేయడానికి భారత ప్రభుత్వం చేపట్టిన అత్యాధునిక ‘సెల్ బ్రాడ్కాస్ట్ అలర్ట్’ అయి ఉండవచ్చు. అది ఈ వ్యవస్థలో భాగంగా వస్తున్న టెస్టింగ్ సందేశం మాత్రమే.అసలేం ఏం జరుగుతోంది?నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ (ఎన్డీఎంఏ), సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్ (సీ-డాట్) సహకారంతో దేశవ్యాప్తంగా విపత్తు హెచ్చరిక వ్యవస్థను అభివృద్ధి చేస్తోంది. దీన్ని ‘సాచెట్’ (SACHET) అని పిలుస్తారు. ఈ వ్యవస్థ పనితీరును, మొబైల్ నెట్‌వర్క్‌ల సామర్థ్యాన్ని పరీక్షించడానికి ప్రభుత్వం ప్రస్తుతం దేశవ్యాప్తంగా పరీక్షలను నిర్వహిస్తోంది. అందుకే, మీరు అందుకున్న ఆ ఫ్లాష్ ఎస్ఎంఎస్ ఒక డ్రిల్ మాత్రమే.సందేశం వస్తే ఏం చేయాలి?మీరు ఆ సందేశాన్ని చూసినప్పుడు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. దానికి మీరు బదులివ్వాల్సిన లేదా ఎలాంటి చర్యలు తీసుకోవాల్సిన పని లేదు. ఇవి కేవలం టెస్టింగ్ మేసేజ్‌లు మాత్రమే. ఒకవేళ మీరు ఈ అలర్ట్‌లను నియంత్రించాలనుకుంటే మీ ఫోన్ సెట్టింగ్స్‌లోని ‘Safety & Emergency’ లేదా ‘Wireless Emergency Alerts’ విభాగంలోకి వెళ్లి మార్చుకునే అవకాశం ఉంటుంది.ఈ వ్యవస్థ ప్రత్యేకతలేంటి?సెల్ బ్రాడ్కాస్ట్ అలర్ట్ వ్యవస్థ అనేది సీడాట్ అభివృద్ధి చేసిన స్వదేశీ సాంకేతికత. ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ (ఐటీయూ) సిఫార్సు చేసిన కామన్ అలర్టింగ్ ప్రోటోకాల్ (సీఏపీ) ఆధారంగా ఇది పనిచేస్తుంది. భూకంపాలు, సునామీలు, వరదలు, మెరుపులు వంటి ప్రకృతి వైపరీత్యాలే కాకుండా గ్యాస్ లీకేజీలు లేదా రసాయన ప్రమాదాల వంటి మానవ నిర్మిత అత్యవసర పరిస్థితుల్లోనూ ఇది పనిచేస్తుంది. విపత్తు సంభవించే అవకాశం ఉన్న నిర్దిష్ట ప్రాంతంలోని వినియోగదారులకు మాత్రమే ఈ సందేశాలు పంపిస్తారు. తద్వారా అనవసర గందరగోళం తగ్గుతుంది.భవిష్యత్తు ప్రణాళికప్రస్తుతం జరుగుతున్నవి ప్రాథమిక పరీక్షలు మాత్రమే. ఈ పరీక్షల తర్వాత భవిష్యత్తులో ఈ వ్యవస్థ పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానుంది. అప్పుడు ఇది టెస్ట్ ఛానెల్ సెట్టింగులతో సంబంధం లేకుండా అన్ని రకాల మొబైల్ ఫోన్లలోనూ, అన్ని భారతీయ భాషల్లోనూ హెచ్చరికలను పంపగలదు. అంటే, ఏదైనా అత్యవసర పరిస్థితి తలెత్తినప్పుడు దేశంలోని ప్రతి పౌరుడికి ముందస్తు సమాచారం చేరవేయడం ద్వారా ప్రాణ, ఆస్తి నష్టాలను నివారించడమే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశం. కాబట్టి, తదుపరిసారి మీ ఫోన్ సెల్ బ్రాడ్కాస్ట్ అలర్ట్‌తో మోగితే అది మీ భద్రత కోసం ప్రభుత్వం చేస్తున్న ఏర్పాటు అని గుర్తుంచుకోండి. అప్రమత్తంగా ఉండండి.ఇదీ చదవండి: మా కోసం పూజలు చేయండి!.. నటి ఆవేదన -
రిమాండ్ ఖైదీ సొమ్ము మాయం!
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: పోలీసు రిమాండ్‌లో ఉన్న ఓ నిందితుడి డబ్బు దొంగలు కొట్టేశారు. అది కూడా ఆన్లైన్ బ్యాంకింగ్ ద్వారా డబ్బును వారి ఖాతాలకు మళ్లించుకున్నారు. బెయిల్‌పై విడుదలైన నిందితుడు అసలు విషయం తెలిసి నెత్తీనోరు బాదుకుంటున్నాడు. కరీంనగర్ పట్టణానికి చెందిన మహేందర్‌పై ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ పోలీసుస్టేషన్లో ఓ కేసు నమోదు కావడంతో అక్కడి పోలీసులు 2025 డిసెంబర్ 4న అతన్ని అరెస్టు చేశారు. ఆ సమయంలో నిందితుడి కారు, సెల్ఫోన్లు, ఇతర వస్తువులను స్వా«దీనం చేసుకున్నారు.అనంతరం మార్చి 26న బెయిల్‌పై విడుదలైన మహేందర్ తన సెల్ఫోన్లు తీసుకొని బ్యాంకు బ్యాలెన్సు చూసుకొని అవాక్కయ్యాడు. జైలుకు వెళ్లే సమయంలో ఖాతాలో రూ. 6.64 లక్షలు ఉండగా అందులోంచి ఏకంగా రూ. 6 లక్షలకుపైగా నగదు మాయమైంది. దీంతో అతను వెంటనే బ్యాంక్ అధికారులను సంప్రదించగా సెల్ఫోన్ల నుంచే లావాదేవీలు జరిగిగాయని, ఫిబ్రవరి 19, మార్చి 17 తేదీల్లో రూ. 6 లక్షలకుపైగా నగదు బదిలీ అయిందని వివరించారు. మరోవైపు ఇంట్లోని 157 గ్రాముల బంగారం, వెండి పాత్రలు, హార్డ్ డిస్కులు, చెక్ బుక్కులు, బిల్లులు కూడా మాయమైనట్లు బాధితుడు గుర్తించాడు.దీనిపై కరీంనగర్ సైబర్ క్రైం పోలీసులతోపాటు డీజీపీకి ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు కొన్ని ఖాతాలను స్తంభింపజేసి రూ. 50 వేలు ట్రాన్స్ఫర్ కాకుండా ఆపగలిగారు. మిగిలిన ఖాతాలు ఎవరివన్న కోణంలో ఆరా తీస్తున్నారు. అయితే అరెస్టు సమయంలో పోలీసులకు తాను సెల్ఫోన్ల పాస్వర్డ్లు చెప్పానని.. పోలీసులు సీజ్ చేసిన సెల్ఫోన్ల నుంచి డబ్బు మాయం కావడం నమ్మశక్యంగా లేదంటూ మహేందర్ ‘సాక్షి’తో వాపోయాడు. -
పెళ్లి కాకుండానే తల్లిని చేసిన ఘనుడు!
జైపూర్: పెళ్లికి ముందే ఓ యువతి బాబుకు జన్మని చ్చింది. ఇందుకు కారణమైన యువకుడు పెళ్లికి నిరాకరించాడని ఆరోపించింది. నాలుగు రోజుల బా బుతో యువకుడి ఇంటి ఎదుట బైఠాయించింది. ఈ ఘటన మండలంలోని ముదిగుంట గ్రామంలో చోటు చేసుకుంది. ఈ సందర్భంగా ముదిగుంటకు చెందిన బాధితురాలు నీలిమ మాట్లాడుతూ.. తమ గ్రామానికే చెందిన ఏఆర్ కానిస్టేబుల్ సాయిరాజ్ తనను రెండుళ్లుగా ప్రేమించాడని ఆరోపించింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరకంగా వాడుకో గా గర్భం దాల్చానని పేర్కొంది. డెలివరీ సమయంలో తనతో ఫోన్లో మాట్లాడాడని, బాబు పుట్టాక వీడియా కాల్ కూడా మాట్లాడినట్లు ఆరోపించింది. బాబు పుట్టిన నుంచి తనను దూరం పెట్టాడని తెలిపింది. పెళ్లికి నిరాకరిస్తున్నాడని, ఫోన్లో కూడా స్పందించడం లేదని వాపోయింది. దీంతో శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు సాయిరాజ్ ఇంటి ఎదుట బైఠాయించి నిరసన తెలిపింది. తనకు న్యాయం చేయాలని వేడుకుంది. -
హైదరాబాద్‌లో ఫోన్లు చోరీ.. మూడు కోట్ల విలువైన మొబైల్స్ రికవరీ (ఫొటోలు)
-
ఫోన్ ట్యాపింగ్ కేసు.. ప్రభాకర్ రావుకు బెయిల్
సాక్షి హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న ప్రభాకర్ రావుకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. విచారణకు సహకరించాలని పాస్‌పోర్టు ట్రయల్ కోర్టులో సరెండర్ చేయాలని ఆదేశించింది. రాష్ట్ర స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్ఐబీ) కార్యాలయం కేంద్రంగా సాగిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడైన ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావు.. సుప్రీంకోర్టులో ఇది వరకే ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారించిన కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజుూరు చేసింది. పాస్‌పోర్టు సరెండర్ చేయాలని ట్రయల్ కోర్టు అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లకూడదని ఆదేశించింది.కేసు నేపథ్యం ఎస్ఐబీ అదనపు ఎస్పీ డి.రమేశ్ ఫిర్యాదుతో 2023 మార్చి 10న పంజాగుట్ట పోలీసుస్టేషన్లో ఎస్ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావు, ఇతరులపై ఐపీసీ, ప్రజా ఆస్తుల విధ్వంసాల నిరోధక చట్టం, ఐటీ చట్టంలోని సెక్షన్ల కింద కేసు నమోదైంది. అందులో ఐపీసీలోని 120 బీ (కుట్ర) సెక్షన్‌ను తొలగించినప్పటికీ నిందితులపై ఫోన్ ట్యాపింగ్ అభియోగాలు దాఖలు చేయాలంటే కచ్చితంగా ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్‌లోని సెక్షన్లు వర్తింపజేయాలని న్యాయ నిపుణులు ఉన్నతాధికారులకు సూచించారు. ఈ నేపథ్యంలో డీఎస్పీ దుగ్యాల ప్రణీత్‌రావు అదనపు కస్టడీ, అదనపు ఎస్పీలు నాయిని భుజంగరావు, మేకల తిరుపతన్న కస్టడీ పిటిషన్లతోపాటు ఈ చట్టాన్ని జోడిస్తూ అదే నెల ఆఖరి వారంలో మెమోను కోర్టులో దాఖలు చేయడంతో ఇది ట్యాపింగ్ కేసుగా మారింది.ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్రావుట్యాపింగ్ వ్యవహారంలో తాను పాత్రధారినేనని.. నాటి డీజీపీలుగా, నిఘా విభాగాధిపతులుగా పనిచేసిన అదనపు డీజీపీ పర్యవేక్షణలో ట్యాపింగ్ జరిగినట్లు ప్రభాకర్‌రావు పేర్కొన్నారు. ట్యాప్ చేస్తున్న నంబర్ల పూర్వాపరాలను డీజీపీతోపాటు చీఫ్ సెక్రటరీ, జీఏడీ సెక్రటరీ, లా సెక్రటరీలతో కూడిన కమిటీ సమీక్షిస్తుందని.. వారి అనుమతితోనే అది జరిగిందని స్పష్టం చేశారు. దీంతో ఈ కేసు కీలక మలుపు తిరిగింది. -
క్యూ లేదు.. డిపో లేదు.. ఫోన్లోనే బస్‌పాస్‌లు
హైదరాబాద్: ఐటీ మంత్రి డి.శ్రీధర్‌బాబు నేతృత్వంలో పౌర సేవలను పూర్తిగా డిజిటలైజ్ చేయాలన్న లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. మీసేవ ఆధ్వర్యంలోని ‘మీ టికెట్’ యాప్‌లో టీజీఎస్ఆర్టీసీ సేవలను సమగ్రంగా అనుసంధానించడంతో, బస్‌పాస్‌ల కోసం డిపోలు, కౌంటర్ల వద్ద క్యూలు నిలబడే రోజులు ముగిసే దిశగా రాష్ట్రం అడుగులు వేస్తోంది. ప్రభుత్వ మొబైల్ యాప్ ద్వారానే బస్‌పాస్‌లు జారీ చేసే దేశంలో తొలి రాష్ట్రంగా తెలంగాణ నిలుస్తోంది.మీటికెట్ యాప్ ఇప్పటికే రెండు లక్షలకు పైగా డౌన్లోడ్లు సాధించగా, రూ.2.9 కోట్లకు పైగా లావాదేవీలు నమోదయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా 221 ప్రాంతాలు, 190 సేవా కేంద్రాల ద్వారా ఈ వ్యవస్థ విస్తరించినట్లు అధికారులు తెలిపారు. మీసేవ ఈ-గవర్నెన్స్ వ్యవస్థలో భాగంగా రూపొందిన ఈ యాప్ ద్వారా ప్రయాణికులు నగర బస్‌పాస్‌లు, అంతర్రాష్ట్ర టికెట్లను పూర్తిగా ఆన్లైన్లోనే పొందగలుగుతున్నారు. డిపోలకు వెళ్లడం, ఫారమ్‌లు నింపడం, క్యూలో నిలబడడం వంటి ప్రక్రియలు ఇక అవసరం లేకుండా పోతున్నాయి. దరఖాస్తు, చెల్లింపు, పాస్ జారీ అన్నీ మొబైల్ ఫోన్ ద్వారానే పూర్తవుతున్నాయి. అదనపు బుకింగ్ ఛార్జీలు లేవని అధికారులు స్పష్టం చేశారు.ఈ మార్పు ప్రయాణికులకు స్పష్టంగా కనిపిస్తోంది. “ప్రతి నెల పాస్ కోసం గంటసేపు క్యూలో నిలబడాల్సి వచ్చేది. ఇప్పుడు రెండు నిమిషాల్లోనే పూర్తి అవుతోంది” అని ఓ విద్యార్థి తెలిపారు. మరో విద్యార్థిని “ఫోన్లో ఉండే క్యూ ఆర్ కోడ్ సురక్షితం. ఎవరూ కాపీ చేయలేరు” అని చెప్పారు. మీటికెట్ ద్వారా జారీ చేసే ప్రతి పాస్‌లో డైనమిక్ క్యూ ఆర్ కోడ్, లైవ్ వాలిడిటీ సూచిక, స్క్రీన్‌షాట్ నిరోధక వ్యవస్థలు ఉన్నాయి. దీంతో పాస్‌ల దుర్వినియోగం తగ్గడమే కాకుండా, బస్సుల్లో కండక్టర్లు వెంటనే స్కాన్ చేసి ధృవీకరించగలుగుతున్నారు. దీంతో ప్రయాణం వేగవంతం అవుతోంది.యాప్‌లోనే పాస్ రీన్యువల్ సదుపాయం కల్పించడం ద్వారా డిపోలపై ఒత్తిడి గణనీయంగా తగ్గనుంది. 221 ప్రాంతాల్లోని 190 సేవా కేంద్రాలపై ఉన్న భారం కూడా తగ్గుతుందని అధికారులు తెలిపారు. “పారదర్శకత, సౌలభ్యం కలిగిన పౌర కేంద్రిత రవాణా వ్యవస్థను రూపొందించడం మా లక్ష్యం” అని ఎలక్ట్రానిక్ సర్వీసెస్ డెలివరీ కమిషనర్ టి. రవి కిరణ్ పేర్కొన్నారు. ప్రస్తుతం సాధారణ, మెట్రో డీలక్స్, మెట్రో ఎక్స్‌ప్రెస్, గ్రీన్ మెట్రో లగ్జరీ (ఏసీ), పుష్పక్ ఏసీ వంటి ఐదు రకాల పాస్‌లు అందుబాటులో ఉన్నాయి. విద్యార్థులు, వృద్ధులకు రాయితీ పాస్‌లను త్వరలో ప్రవేశపెట్టనున్నట్లు అధికారులు తెలిపారు.టీజీఎస్ఆర్టీసీ సేవలను మీటికెట్‌లో విలీనం చేయడం ద్వారా మీసేవ సేవలు మరింత విస్తరించాయి. పత్రాల సేవల నుంచి ప్రజా రవాణా వరకు విస్తరించిన ఈ వేదిక, తెలంగాణను డిజిటల్ పాలనలో ముందంజలో నిలిపింది. ఇకపై ప్రయాణం కోసం కాగితం అవసరం లేకుండా, ఫోన్లోనే బస్‌పాస్‌తో ముందుకు సాగుతున్న కొత్త యుగానికి రాష్ట్రం నాంది పలికింది. -
ఫోన్ చూడొద్దన్న తండ్రి... కొడుకు ఆత్మహత్య
బంజారాహిల్స్: ఫోన్లో వీడియోలు చూడవద్దని, గేమ్స్ ఆడవద్దని స్కూల్‌కు క్రమం తప్పకుండా వెళ్లాలని తండ్రి హితవు పలకడంతో భరించలేని 12 సంవత్సరాల విద్యార్ధి ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే... బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 12లోని ఫస్ట్‌లాన్సర్, సయ్యద్ నగర్లో నివసించే మహ్మద్ అఫాన్ ఖాన్ (12) సమీపంలోని ప్రైవేట్ పాఠశాలలో ఐదవ తరగతి చదువుతున్నాడు. చిన్నప్పుడే తల్లి చనిపోవడంతో మారు తల్లి వద్ద పెరుగుతున్నాడు.తండ్రి ఇర్ఫాన్ ఖాన్ వాల్ పెయింటింగ్ చేస్తూ కుటుంబాన్ని పోషిస్తూ పిల్లల్ని చదివిస్తున్నాడు. మొండివాడిగా ముద్రపడ్డ అఫాన్ ఖాన్ తండ్రి చెప్పినా వినకుండా ఫోన్లో వీడియోగేమ్ చూస్తూ స్కూల్‌కు డుమ్మా కొడుతున్నాడు. ఇప్పటికే మూడు స్కూల్స్ మారాడు. స్కూల్‌కు సక్రమంగా వెళ్లకుండా ఇంట్లోనే ఉంటూ వీడియో గేమ్స్ చూస్తుండడంతో తండ్రి మందలించాడు. మంగళవారం రాత్రి 11 గంటల సమయంలో ఇర్ఫాన్ ఖాన్ తన భార్యతో కలిసి బంధువుల అంత్యక్రియలకు వెళ్లాడు. ఆ సమయంలో ఒంటరిగా ఉన్న అఫాన్ తన గదిలో చీరతో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
తరచూ ఫోన్ చూస్తున్నారా?.. డేంజర్లో పడినట్లే!
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో స్మార్ట్‌ఫోన్ అనేది మన జీవితంలో ఒక భాగంగా మారిపోయింది. శ్వాస తీసుకోవడం, కనురెప్ప వేయడం ఎంత సహజంగా జరుగుతుంటాయో, అదే మాదిరిగా తెలియకుండానే ఫోన్ స్క్రీన్‌ను చూడటం అనేది అలవాటుగా మారిపోయింది. ఈ అలవాటు మన మెదడు పనితీరును, ముఖ్యంగా ఏకాగ్రతను తీవ్రంగా దెబ్బతీస్తోందని మానసిక శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.పరిశోధనల్లో షాకింగ్ నిజాలుబ్రిటన్లోని నాటింగ్‌హామ్ ట్రెంట్ యూనివర్సిటీ, దక్షిణ కొరియాలోని కైమ్యుంగ్ యూనివర్సిటీలు సంయుక్తంగా ఫోను చూడటంపై నిర్వహించిన పరిశోధనల్లో విస్తుపోయే నిజాలను వెల్లడయ్యాయి. ఒక వ్యక్తి రోజుకు సగటున 110 సార్లు ఫోన్ చెక్ చేస్తున్నారంటే, అతను తీవ్రమైన ఫోన్ వ్యసనంలో ఉన్నారని అర్థం. ఇది కేవలం అలవాటు మాత్రమే కాదు, మన మేధో సామర్థ్యాలను క్రమంగా కుంగదీసే ఒక మానసిక సమస్యగా మారుతోందని ఈ అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి.మెదడుపై ‘డిజిటల్’ దాడిమనం పదేపదే ఫోన్ చూడటం వల్ల మెదడు తీవ్రమైన ఒత్తిడికి గురవుతుందని బెంగళూరుకు చెందిన ప్రముఖ సైకాలజిస్ట్ ఎస్. గిరిప్రసాద్ తెలిపారు. మనం ఏదైనా పనిలో ఉన్నప్పుడు ఫోన్ వైపు చూస్తే మెదడు ఆ పనిని పక్కన పెడుతుంది. తిరిగి పని మొదలుపెట్టినప్పుడు మెదడు మళ్లీ మొదటి నుండి శ్రమించాల్సి వస్తుంది. ఈ ‘స్విచ్చింగ్’ ప్రక్రియ వల్ల మెదడు త్వరగా అలసిపోయి, క్రమంగా ఏకాగ్రతను కోల్పోతుంది.నోటిఫికేషన్ రాకపోయినా ..మనం ఎంత సమయం ఫోన్ వాడుతున్నామనే దానికంటే, ఎన్నిసార్లు పని మధ్యలో ఫోన్‌ను చూస్తున్నామనేదే ముఖ్యం. ఫోన్ కల్పించే ఈ ‘అంతరాయం’ వల్లే ఏకాగ్రతకు అధిక నష్టం జరుగుతుంది. ఏదైనా నోటిఫికేషన్ రాకపోయినా సరే, ఊరికే ఫోన్ అన్‌లాక్ చేసి చూడటం ఒక బలహీనతగా మారుతుంది. దీనివల్ల మెదడు ఎక్కువ సేపు ఒకే విషయంపై దృష్టి పెట్టలేక ‘షార్ట్ అటెన్షన్ స్పాన్’కు అలవాటు పడిపోతుంది.పరిమితి ఎంతంటే..నిపుణుల అభిప్రాయం ప్రకారం, రోజుకు 50 నుంచి 80 సార్లు ఫోన్ చెక్ చేయడం ఒక సాధారణ పరిమితిగా పరిగణించవచ్చు. కానీ ఈ సంఖ్య 100 మార్కును దాటితే మాత్రం మీరు ప్రమాదకరమైన జోన్లో ఉన్నారని గ్రహించాలి. ఎటువంటి అవసరం లేకుండానే ఫోన్ తీయడం అనేది అదుపులేని అలవాటుగా మారి, మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది.మెదడును తిరిగి గాడిలో పెట్టండిలా..ఈ వ్యసనం నుండి బయటపడటం అసాధ్యమేమీ కాదు. అనవసరమైన నోటిఫికేషన్లను వెంటనే ఆపివేయండి. చదువుకునేటప్పుడు లేదా నడిచేటప్పుడు ఫోన్‌ను కంటికి దూరంగా ఉంచండి. ప్రతి 3 లేదా 6 గంటలకు ఒకసారి మాత్రమే ఫోన్ చూసుకునేలా నియమించుకోవాలి. ఏదైనా పని చేస్తున్నప్పుడు కనీసం 20 నుండి 50 నిమిషాల పాటు ఫోన్ ముట్టుకోకుండా ఆ పనిపైనే దృష్టి సారించడం ద్వారా మెదడును తిరిగి ఉత్తేజితం చేయవచ్చు.‘డిజిటల్ డిటాక్స్’ కోసం..మెదడు చురుగ్గా పనిచేయాలంటే రాత్రి వేళల్లో ఫోన్ వాడకాన్ని పూర్తిగా తగ్గించాలి. దానికి బదులుగా పుస్తక పఠనం, ధ్యానం వంటి అలవాట్లను అలవరచుకోవాలి. సరైన నిద్ర మెదడుకు రీఛార్జ్‌లా పనిచేస్తుంది. మీరు మీ ఫోన్‌ను నియంత్రిస్తున్నారా లేక ఫోన్ మిమ్మల్ని నియంత్రిస్తోందా? ఒక్కసారి ఆలోచించుకోండి.ఇది కూడా చదవండి: చెల్లెలి ముందే తండ్రిని తుపాకీతో కాల్చి.. -
నేటి పాత స్మార్ట్ఫోన్లే... రేపటి ఫైటర్ జెట్లు!
కొత్త ఫోన్ కొనగానే పాతదానిని చెత్త ఫోన్ అంటూ చెత్తబుట్టలో పడేయడం చాలామందికి అలవాటు. కానీ ఆ పాత ఫోన్లో ‘రేర్ ఎర్త్ ఎలిమెంట్స్’గా పిలిచే అత్యంత విలువైన భూ అయస్కాంత మూలకాలు అత్యంత సూక్ష్మపరిమాణంలో ఉంటాయి. వాటిని విదేశాల నుంచి వేలాది కోట్లు వెచ్చించి దిగుమతి చేసుకునే బదులు ఈ పాత ఫోన్ల నుంచే సంగ్రహిస్తే? కేంద్రం ఇప్పుడు సరిగ్గా ఇలాంటి ఆలోచనే చేస్తోంది. తద్వారా లక్షల కోట్ల విదేశీమారక ద్రవ్యం ఆదా అవుతుందని భావిస్తోంది! ‘‘టన్ను ముడిఖనిజం నుంచి కేవలం ఒకట్రెండు కిలోల కోబాల్ట్ మాత్రమే తీయగలం. అదే టన్ను పాత బ్యాటరీల నుంచి ఏకంగా 50 నుంచి 80 కేజీల దాకా సమీకరించవచ్చు. పైగా ముడిఖనిజ కోబాల్ట్ కంటే ఇది 40 ఎక్కువ గాఢత కలిగి ఉంటుంది’’ అని గ్రేటర్ నోయిడా కేంద్రంగా పనిచేసే లిథియం–అయాన్ బ్యాటరీ తయారీ సంస్థ ‘లోహం’ రీసైక్లింగ్ హెడ్ సయ్యద్ గజన్ఫర్ అబ్బాస్ సాఫ్వీ చెప్పారు. ‘‘ఇప్పటికే ఎంతో శ్రమించి తయారుచేసిన స్మార్ట్‌ఫోన్ వంటి ఈ–వేస్ట్‌లో ఎంతో విలువైన ఖనిజాలుంటాయి. వాటిపై భారత్ ఇప్పటిదాకా సరైన దృష్టి సారించలేదు’’ అని ఈ–వేస్ట్ మేనేజ్మెంట్, లిథియం–అయాన్ బ్యాటరీ కంపెనీ అట్టెరో సహ వ్యవస్థాపకుడు నితిన్ గుప్తా చెప్పారు. యుద్ధ విమానాలు అత్యంత తేలిగ్గా, అత్యంత దృఢంగా ఉండటానికి నియోడైమియం వంటి ఈ మూలకాలే కారణం. వాటిలో ఇంధనం ప్రవాహాలు, రెక్కల కదలికలు, కాక్‌పిట్‌కు కరెంటు సరఫరా చేసే జనరేటర్లను పర్యవేక్షించే సెన్సార్లకు అవే శక్తినందిస్తాయి. ‘‘భారత్ ప్రస్తుతం ఈ–వేస్ట్‌ను విదేశాలకు అనవసరంగా ఎగుమతి చేస్తోంది. అలాగాక భారత్‌లోనే భారీగా శుద్ధి కేంద్రాలను ఏర్పాటు చేయాలి. తద్వారా ఈ–వేస్ట్‌లోని భూ అయస్కాంత మూలకాలను సంగ్రహించి యుద్ధ విమానాల తయారీకి సది్వనియోగం చేసుకోవచ్చు. అత్యంత అరుదైన ఖనిజాల కోసం చైనా వంటి ప్రత్యర్థి దేశాలపై ఆధారపడే దురవస్థ తొలగుతుంది’’ అని ముంబై కేంద్రంగా పనిచేసే శుద్ధ సాంకేతిక సంస్థ ‘లీకో’ సీఈవో గౌరవ్ దోల్వానీ అన్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
‘నో ఫోన్ ఛాలెంజ్’.. రెండు వారాల్లో అనూహ్య మార్పు!
ఈ రోజుల్లో చిన్నారులకు చేతిలో స్మార్ట్‌ఫోన్ లేనిదే ముద్ద దిగదు.. షార్ట్స్ చూడకపోతే నిద్రపట్టదు. అయితే కేరళలోని కన్నూర్ జిల్లాకు చెందిన టీచర్ అమృత.. విద్యార్థులను ఈ డిజిటల్ సంకెళ్ల నుండి విడిపించాలని నిర్ణయించుకున్నారు. ఎలాంటి కఠినమైన శిక్షలు లేకుండా కేవలం ‘రంగురంగుల స్టిక్కర్లు - చిన్నపాటి సవాళ్లతో’ ఆమె చేసిన ప్రయోగం ఇప్పుడు సంచలనంగా మారింది. కేవలం రెండు వారాల్లోనే పిల్లల ప్రవర్తనలో వచ్చిన మార్పు చూసి తల్లిదండ్రులు సైతం ఆశ్చర్యపోతున్నారు. పిల్లల్లో సోషల్ మీడియా వ్యసనాన్ని మాయం చేసిన ఆ ‘నో ఫోన్ ఛాలెంజ్’ కథలోనికి వెళితే..కేరళలోని కన్నూర్ జిల్లా, కూతుపరంబ ప్రభుత్వ హయ్యర్ సెకండరీ స్కూల్లో చేపట్టిన ఒక వినూత్న ప్రయోగం అద్భుత ఫలితాలను ఇస్తోంది. విద్యార్థులు పాఠాల కంటే మొబైల్ ఫోన్లలో రీల్స్, షార్ట్స్ , వీడియో గేమ్స్‌పైనే ఎక్కువ శ్రద్ధ చూపుతున్నారని టీచర్ అమృత గమనించారు. పిల్లల ఏకాగ్రత లోపించడానికి మితిమీరిన మొబైల్ వాడకమే కారణమని నిర్ధారించుకున్న ఆమె, వారిని ఆ వ్యసనం నుండి దూరం చేసేందుకు ఒక ప్లాన్ వేశారు. కేవలం హెచ్చరించడమే కాకుండా, పిల్లల మనస్తత్వానికి తగినట్లుగా స్టిక్కర్లు, ఆటలు, చిన్నపాటి సవాళ్లతో వారిని ఆకట్టుకున్నారు.పిల్లల్లో మొబైల్ వాడకాన్ని తగ్గించడం అంత సులభం కాదని అమృతకు తెలుసు. అందుకే ఆమె ‘నో ఫోన్ ఛాలెంజ్’ను ప్రారంభించారు. ఫోన్ ముట్టుకోని విద్యార్థులకు మరుసటి రోజు తరగతిలో రంగురంగుల స్టిక్కర్లను బహుమతిగా ఇచ్చేవారు. ఇది విద్యార్థుల్లో ఒక సానుకూల పోటీని పెంచింది. ఫోన్ చూడటం మానేసిన పిల్లలకు ప్రోత్సాహకంగా కథల పుస్తకాలు, మట్టి బొమ్మలు, నోట్‌బుక్‌లను బహుమతులుగా అందించారు. ఫోన్ వదిలేసిన తర్వాత ఖాళీగా ఉండే సమయంలో వారు సృజనాత్మకంగా ఆలోచించేలా మట్టితో బొమ్మలు చేయడం, చిత్రలేఖనం లాంటి యాక్టివిటీస్ వారికి అలవడేలా చేశారు.ఈ వినూత్న ప్రయోగం మొదలైన రెండు వారాల్లోనే పిల్లల్లో ఆశ్చర్యకరమైన మార్పులు కనిపించాయి. విద్యార్థుల్లో ఏకాగ్రత పెరగడమే కాకుండా, వారి ప్రవర్తనలో కూడా ప్రశాంతత చోటుచేసుకుంది. గతంలో చిన్న విషయాలకే గొడవ పడే పిల్లలు, ఇప్పుడు సహనంతో వ్యవహరిస్తున్నారని టీచర్ అమృత తెలిపారు. మొబైల్ ఫోన్ లాక్కుంటే ఇంట్లో ఏడ్చి గొడవ చేసే పిల్లలు, ఇప్పుడు పెయింటింగ్ వేస్తూ, ఆ చిత్రాలను టీచర్‌కు చూపించడానికి ఉత్సాహపడుతున్నారని తల్లిదండ్రులు ఆనందంగా చెబుతున్నారు.పిల్లల్లో పెరుగుతున్న సోషల్ మీడియా వ్యసనాన్ని అరికట్టేందుకు కేరళ ప్రభుత్వం కూడా కసరత్తు చేస్తోంది. విద్యార్థుల స్క్రీన్ టైమ్ తగ్గించే దిశగా విద్యాశాఖ ప్రజాభిప్రాయాన్ని సేకరిస్తోంది. ఇటీవల విడుదలైన ఎకనామిక్ సర్వే నివేదికలో డిజిటల్ వ్యసనం వల్ల యువతలో ఆందోళన, కుంగుబాటు, ఆత్మవిశ్వాసం తగ్గడం లాంటి సమస్యలు పెరుగుతున్నాయని వెల్లడయ్యింది. ఫోన్లకు బానిసలవుతున్న నేటి తరాన్ని ఈ వ్యసనం నుంచి తప్పించేందుకు.. అమృత టీచర్ అనుసరించిన సృజనాత్మక పద్ధతులు అనుసరించాల్సిన అవసరముందని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు.ఇది కూడా చదవండి: ఆన్లైన్ గేమ్ ఆడుతూ కుప్పకూలిన యువకుడు -
మెట్లపై నడుస్తూ ఫోన్ మాట్లాడుతున్నారా..? కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్..
కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ శశి థరూర్ పార్లమెంట్ వెలుపల మెట్లపై పోన్లో మాట్లాడుతూ పడిపోయిన వీడియో నెట్టింట తెగ వైరల్ అయ్యింది. ఆ ఘటనలో శశి ధరూర్‌కి మడమ ఫ్యాక్చర్ అయ్యిందని ఆయనే స్వయంగా సోషల్ మీడియా పోస్ట్‌లో పేర్కొన్నారు కూడా. అలాగే ఆయన కోలుకున్నాని, ప్రస్తుతం బాగానే ఉన్నట్లు కూడా తెలిపారు. ఇలా మెట్లపై నడుస్తూ..ఫోన్ మాట్లాడటం మంచిది కాదని నూర్యాలజీ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒకేసారి మల్టీటాస్కింగ్ని బ్రెయిన్ నిర్వహించలేదని హితవు చెప్పారు. ముఖ్యంగా మెట్లపై ఫోన్ స్క్రోల్ చేస్తూ లేదా మాట్లాడుతూ నడవడం అత్యంత డేంజర్ అని హెచ్చరిస్తున్నారు నిపుణులు. ఇది అజాగ్రత్తగా వ్యవహరించడం గురించి కాదని, బ్రెయిన్ వర్కింగ్‌పై అవగాహన ఉండటం.. అత్యంత ముఖ్యమని అంటున్నారు న్యూరాలజిస్ట్లు. మానవ బ్రెయిన్ బహుళ పనులు చేయగలదు. కానీ ఒకేసారి అన్ని పనులు చేస్తున్నప్పుడు.. విభజింపబడతాయి. దాంతో మొదటి దానికి ప్రాముఖ్యత ఇచ్చి మరోకటిపై అటెన్షన్ పెట్టడంలో విఫలమవుతుంది ఫలితంగా ఆ ప్రభావం మనపై పడుతుందన్నారు. ఇక్కడ మెట్లపై నడుస్తూ ఫోన్ చూసినప్పడూ..చూడటంపైనే అంటే కళ్లమీద బ్రెయిన్ ఫోకస్ ఉండి..నడకపై అటెన్షన్ తప్పుతుంది. అందులోనూ నేలలా చదునుగా ఉండకుండా స్టెప్స్లా ఉంటుంది కాబట్టి పాదం సవ్యంగా పడాలి లేదంటే బ్యాలెన్స్ అవ్వలేం. దాంతో ఎప్పుడైత్ ఫోన్ మాట్లాడుతూ మెట్లు ఎక్కుతామో పడిపోవడం లేదా జారిపడటం జరుగుతంది. దాంతో మెదడు, లేదా శరీరానికి గాయాలయ్యే ప్రమాదం ఉంటుంది. ఒక్కోసారి ప్రాణాంతకంగా కూడా మారే అవకాశం ఉంటుందంటున్నారు నిపుణులు. అంతేగాదు నిపుణులు ఇలా ఎన్నో సార్లు చేశాను అని తేలిగ్గా కొట్టిపారేయొద్దని హెచ్చరిస్తున్నారు కూడా. సాధ్యమైనంత వరకు ఫోన్ మాట్లాడుతూ స్టెప్స్‌పై నడవాలనుకుంటే రైలింగ్ని పట్టుకోండి నడకపై దృష్టిపెట్టండని అంటున్నారు. సాధ్యమైనంత వరకు వచ్చిన కాల్ పాజ్‌లో పెట్టి..మెట్లపై నుంచి చదునైన నేలపైకి వచ్చేశాక ఫోన్ కాల్ మాట్లాడితే మంచిదని సూచిస్తున్నారు నిపుణులు.One phone call. One staircase. One misstep.This video of Mr. Shashi Tharoor tripping while talking on the phone and walking downstairs is not about clumsiness. It’s about the brain.(Glad to note that Mr Tharoor is doing well🙏)Your brain is terrible at “walking + phone”… pic.twitter.com/KgNE7XxOYU— Dr Sudhir Kumar MD DM (@hyderabaddoctor) February 5, 2026(చదవండి: బరువు తగ్గించే జైలు'..! ఏకంగా మిలటరీ రేంజ్ శిక్షణ..12 గంటల వ్యాయామాలు..) -
తండ్రి ప్రేమ..! కీ ప్యాడ్ ఫోన్ అయితేనేం..
ఎన్ని డబ్బులున్న కొనలేనివి చాలనే ఉంటాయి. ముఖ్యంగా తల్లిదండ్రులు ప్రేమ.. నోచుక్నుపిల్లలందరూ చాలా అదృష్టవంతులే. కంటిపాపలా కాచుకునే వాళ్లకు మించిన స్వచ్ఛమైన ప్రేమ ఎక్కడ కానరాదు. అలాంటి భావోద్వేగ సన్నివేశమే నెట్టింట వైరల్‌గా మారింది. అతడి వద్ద ఖరీదైన గాడ్జెట్ లేకపోతేనేం..తన కూతురి కళను పొందుపర్చుకోవాలన్న అతడి తాపత్రయం అందరి మనసులను గెలుచుకుంది. ఇది కథ తండ్రి ప్రేమ అనిపించేలా ఉంది ఆ ఘటన.అందుకు సంబంధించిన వీడియోని జితేందర్ సారస్వత్ ఇన్స్టాగ్రామ్ వేదికగా షేర్ చేయడంతో నెట్టింట వైరల్‌గా మారింది. రిపబ్లిక్ డే వేడుకల నేపథంయలో కూతురు పాఠశాలలో పలు ఈవెంట్లు నిర్వహించారు. అందులో భాగంగా ఒక డ్యాన్స్ కార్యక్రమంలో కూతురు అద్భుతంగా నృత్యం చేస్తోంది. అయితే ఆ తండ్రి తన కూతురు డ్యాన్స్‌ని ఓ చిన్న కీప్యాడ్ఫోన్లో రికార్డు చేసేందుకు అక్కడే ఉన్న చిన్నారుల జన సముహానికి వెనుకవైపు నిలబడి ప్రయత్నిస్తున్నాడు. ఆ ఫోన్‌ని చూసి ఎగతాళి చేస్తారేమోనన్న భయంతో జాగ్రత్తగా రికార్డు చేసుకుంటున్న తీరు అందరి హృదయాలను తాకింది. ఆ వీడియోకి జితేందర్ మా సోదరు అందరు హృదయాలను గెలుచుకున్నాడు. అతడు కొత్త ఫోన్ తీసుకోవాలంటారా..మా ఈ కొత్త రీల్‌ని చూసి చెప్పండి అంటూ పోస్ట్ చేశాడు. తల్లిదండ్రుల ప్రేమ ముందు ఖరీదైన గాడ్జెట్లతో పని ఏమందంటూ నెటిజన్లు కామెంట్ చేస్తూ పోస్ట్ చేయడం విశేషం. View this post on Instagram A post shared by Jitendar Sarswat (@sarswatjitendar) (చదవండి: హార్డ్‌వర్క్ చేయకపోతే..ఎవ్వరు కాపాడలేరు..! నెట్టింట వైరల్‌గా పోస్ట్) -
మిస్ అయిన ఫోన్ దొరికితే...ఆ ఆనందం వేరే లెవల్!
స్మార్ట్‌ఫోన్ చేతిలో లేనిదే రోజుగడవని పరిస్థితి. అంత అలవాటైపోయిన మొబైల్ పోగొట్టుకుంటే మనసుకు చాలా కష్టంగా ఉంటుంది. దాని మీద ఆశలు వదిలేసు కుంటాం. కానీ పోయిందనుకున్న ఫోన్ అనూహ్యంగా మళ్లీ మన చేతికి వస్తే భలే ఆనందంగా ఉంటుంది కదా. సరిగ్గా ఒక మహిళకు ఇలాంటి అనుభవమే ఎదురైంది. దీంతో ఆమె భావోద్వేగానికి లోనైంది. ఈ ఆసక్తికరమైన ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ సందడి చేస్తోంది.టీవల చెత్తలో దొరికిన 45 లక్షల బంగారం, కార్మికురాలు నిజాయితీగా తిరిగి వచ్చిన వైరల్ అయింది. ఇది కూడా అలాంటి హృదయానికి హత్తుకునే ఘటన లాంటిదే. ఇన్స్టాగ్రామ్ యూజర్ రఘు అహిర్వర్ ఈ మొత్తం ఉదంతానికి సంబంధించిన వీడియోను షేర్ చేశారు. దీని ప్రకారం తాను, తన సోదరితో కలిసి గ్రామం నుండి ఇండోర్‌కు ప్రయాణిస్తున్నప్పుడు, సోదరి ఒక మొబైల్‌ను గుర్తించింది. అదృష్టవశాత్తూ అన్‌లాక్‌లోనే ఉంది. దీంతో వారు కాల్లిస్ట్లోకి వెళ్లి లాస్ట్ కాల్ చేసిన నంబరుకు ఫోన్ చేసి విషయం చెప్పారు. అహిర్వర్ ఫోన్ పోగొట్టుకున్నమహిళను కలుసుకుని, ఆమెకు ఫోన్‌ను తిరిగి ఇచ్చాడు. దీంతో ఆమె తెగ సంతోష పడిపోయింది. పదే పదే అతనికి కృతజ్ఞతలు తెలుపుతూ కన్నీళ్లు పెట్టుకుంటుంది. అహిర్వర్కు బదులుగా, వేరే ఎవరికికైనా దొరికితే తన ఫోన్ తన చేతికి తిరిగి వచ్చేది కాదంటూ భావోద్వేగానికి లోనైంది. View this post on Instagram A post shared by Raghu Ahirwar (@raghuu_9997) ఫోన్ అన్‌లాక్‌లో ఉండటం చూస్తే పాపం.. వారికి ఫోన్ టెక్నాలజీ గురించి తెలియదని అర్థం అయిపోయిందని, వెంటనే వారికి ఫోర్ చేశామని అహిర్వర్ పేర్కొన్నారు. ‘‘దేవుడు మనకు ఈ మొబైల్ ఇవ్వడం మంచిది" అనే క్యాప్షన్‌తో ఆన్లైన్లో షేర్ చేసిన వీడియో నెటిజన్ల ప్రశంసలను దక్కించుకుంది. అతని నిజాయితీ పలువురి హృదయాలను గెలుచుకుంది."ప్రతి ఒక్కరూ ఇలా చేస్తే, ప్రపంచం మెరుగుపడుతుంది" అని ఒకరు, విలువైన వస్తువులను తిరిగి ఇవ్వడం గ్రేట్ బ్రో అని ఒకరు, "నిజ జీవిత హీరో" అని మరికొందరు వ్యాఖ్యానించడం విశేషం. -
ఒప్పో రెనో15 సిరీస్ ఫోన్లు: ధరలు ఇలా..
స్మార్ట్‌ఫోన్స్ దిగ్గజం ఒప్పో ఇండియా తాజాగా ప్రీమియం రెనో15 సిరీస్ ఫోన్లను ప్రవేశపెట్టింది. రెనో15 ప్రో మినీ, ప్రో, రెనో 15 పేరిట మూడు వేరియంట్లలో ఇవి లభిస్తాయి. ట్రావెల్ ఫొటోగ్రఫీకి మరింత ఉపయోగకరంగా ఉండేలా ప్రో, ప్రో మినీల్లో 20 ఎంపీ కెమెరా, ప్యూర్‌టోన్ ఇమేజింగ్ టెక్నాలజీ, ఏఐఎడిటింగ్ టూల్స్ మొదలైన ఫీచర్స్ ఉంటాయి.పరిశ్రమలోనే తొలిసారిగా హోలోఫ్యూజన్ టెక్నాలజీని ప్రవేశపెడుతున్నట్లు సంస్థ తెలిపింది. వేరియంట్‌ని బట్టి ధర రూ. 45,999 నుంచి ప్రారంభమవుతుంది. ఈ సందర్భంగా ఒప్పో ప్యాడ్5 (రేటు రూ. 26,999 నుంచి ప్రారంభం), ఎన్కో బడ్స్3 ప్రో+ని (ధర రూ. 2,499) కూడా కంపెనీ ఆవిష్కరించింది. -
ఇంటర్నెట్ నాకు తెలియదు: అజిత్ దోవల్
అజిత్ దోవల్ ఇండియన్ జేమ్స్ బాండ్‌గా పిలుచుకునే ఈ ఆఫీసర్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. భారత గూఢచారిగా ఎన్నో సీక్రెట్ మిషన్లలో పాల్గొని దేశ భద్రతలో కీలక పాత్ర పోషించారు. తాజాగా ఆయన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను ఇంతవరకూ ఇంటర్నెట్ వాడడం లేదని, మెుబైల్‌కు సైతం చాలావరకూ దూరంగా ఉంటానని తెలిపారు.భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ మాతృభూమి రక్షణ కోసం అనునిత్యం తపించే ఈ ఆఫీసర్ దేశం కోసం ఎన్నో రిస్కీ ఆపరేషన్లు చేశారు. 1980 దశకంలో పాకిస్థాన్‌లో ఏడేళ్లపాటు ముస్లిం వ్యాపారిగా, బిచ్చగాడిగా నటిస్తూ భారత్‌కు ఎంతో కీలక సమాచారాన్ని చేరవేశారు. అంతేకాకుండా అమృత్ సర్ గోల్డెన్ టెంపుల్లో నక్కిన మిలిటెంట్లను బయిటకి తీసేందుకు అండర్ కవర్ ఏజెంట్‌గా పనిచేశారు. ఇలా భారత్ కోసం ఆయన ప్రాణాలు తెగించి చేసిన ఆపరేషన్లు అనేకం. అందుకే ఆయనను అందరూ ఇండియన్ జేమ్స్‌బాండ్ అని పిలుచుకుంటారు.అయితే శనివారం ఢిల్లీ భరత మండపంలో జరిగిన వికసిత్ భారత్ యంగ్ లీడర్స్-2026- కార్యక్రమం జరిగింది. అందులో అజిత్ దోవల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిస్తూ" నేను అసలు ఇంటర్నెట్ వినియోగించను. ఇది నిజం అంతేకాకుండా మెుబైల్ ఫోన్ అసలు వాడను. కేవలం విదేశాల్లో ఉన్నప్పుడు మా కుటుంబసభ్యులతో మాట్లాడడానికి తప్ప దానిని వినియోగించను. నాపని అంతా అలానే సాగుతుంది" అని అజిత్ దోవల్ అన్నారు. 1945లో ఉత్తరాఖండ్‌లో జన్మించిన అజిత్ దోవల్ 1968లో ఐపీఎస్ సాధించి కేరళ క్యాడర్‌కు ఎంపికయ్యారు. కాందహార్ ఫ్లైట్ హైజాక్ సమయంలో భారత్ తరపున చర్చలలో పాల్గొన్నారు. అంతేకాకుండా అత్యంత చిన్న వయసులో కీర్తి చక్ర అవార్డుకు ఎంపికయిన పోలీసు ఆఫీసర్‌గా ఆయన రికార్డు సృష్టించారు. అజిత్ దోవల్ ఇంటిలిజెన్స్, ఇంటర్నల్ సెక్యూరిటీ, కౌంటర్ టెర్రరిజం విభాగాల్లో దశాబ్దాల కాలం పాటు భారత్‌కు సేవలందించారు. -
న్యూస్ పేపర్ రీడింగ్‌తో.. పోన్ చూడటం మానిపించగలమా?
దేశంలోని స్కూళ్లలో పాఠ్యేతర పుస్తకాలు చదివించడం ఒక విధానంగా ఉంది. కాని ‘స్క్రీన్ టైమ్’ విపరీతంగా పెరిగిపోయిన ఈ కాలంలో బడిలో తప్పనిసరిగా రోజూ న్యూస్‌పేపర్లు చదివించాలని ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ ప్రభుత్వాలు ఆదేశాలిచ్చాయి. కేరళలో ఈ ప్రయత్నం గతేడాదే మొదలైంది. పిల్లలు రోజూ స్కూల్ అవర్‌లో న్యూస్‌పేపర్ చదివితే కలిగే ప్రయోజ నాలేమిటో నిపుణులుచెప్తున్నారు. ఫీల్డ్ రిపోర్ట్‌ను బట్టి కొన్ని గమనింపులు కూడా వస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఈ విధానం కోసం తల్లిదండ్రుల ఒత్తిడి మొదలవ్వాల్సి ఉంది.పిల్లలు స్మార్ట్ ఫోన్లకు మనం ఊహిస్తున్న దాని కంటే ఎక్కువే అలవాటు పడ్డారు. ఏ చిన్న సమాచారం కావాలన్నా గూగుల్‌లో వెతికేందుకు ఫోన్ వంక చూస్తున్నారు. అయితే కావాల్సిన సమాచారానికి మించి అనేక విషయాలు అందులో ఉండటంతో గంటలకొద్దీ అక్కడే గడుపుతున్నారు. ఇది క్రమంగా వ్యసనంగా మారుతోంది. దీన్ని నిరోధించేందుకు ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ ప్రభుత్వాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. పాఠశాలలో రోజూ 45 నిమిషాల పాటు దినపత్రికలు చదివే విధానాన్ని ప్రవేశపెట్టాయి. దీనివల్ల పిల్లలు ఫోన్ చూసే సమయం తగ్గుతుందని, చుట్టూ జరిగే విషయాల పట్ల అవగాహన పెరుగుతుందని భావిస్తున్నాయి. ఢిల్లీ కూడా ఈ విధానంలోని సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తోంది. కేరళ ప్రభుత్వం ఈ విధానాన్ని గత సంవత్సరమే ప్రవేశపెట్టింది.సమాధానం చెబితే బహుమతిగతంలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు నిత్యం దినపత్రికలు చదివే విధానం అమలులో ఉండేది. కొన్ని స్కూల్ లైబ్రరీలకు దినపత్రికలు, మాసపత్రికలు వచ్చేవి. అయితే కాలక్రమంలో నిధుల కొరత, నిర్వహణా లోపాల కారణంగా ఆ విధానానికి స్వస్తి పలికారు. కొన్నిచోట్ల మినహా చాలా ప్రాంతాల్లో ఆ విధానాన్ని పాటించడం లేదు. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ ప్రభుత్వాలు ప్రత్యేక శ్రద్ధ చూపటంతో తిరిగి ఆ విధానం అమల్లోకి వచ్చింది. రోజూ 45 నిమిషాల పాటు దినపత్రిక చదివేందుకు కేటాయిస్తారు. ఒక్కో విద్యార్థికి ఒక దినపత్రిక కేటాయిస్తారు. వారు శ్రద్ధగా చదువుతున్నారా, లేదా అని పరిశీలించేందుకు ఆ రోజు వార్తల్లోని ఒక అంశంపై టీచర్ ప్రశ్న వేస్తారు. సరైన సమాధానం చెప్పిన విద్యార్థికి చాక్లెట్ బహుమతిగా అందిస్తారు.ఫోన్ చూడటం మానేస్తారా?దినపత్రికలు చదివించడం వల్ల పిల్లలు ఫోన్ చూడటం మానేస్తారా? అనేకమందిలో కలుగుతున్న సందేహం ఇది. పేపర్లు చదివించడానికీ, ఫోన్ చూడటానికీ మధ్య సంబంధం ఏమిటనేది కొందరి ప్రశ్న. దినపత్రికలు చదవడం వల్ల ఫోన్ చూడటం మానేస్తారని కచ్చితంగా చెప్పలేమని విద్యావేత్తలు అంటున్నారు. ఇదొక ప్రయత్నమని, ప్రతి విషయానికీ ఇంటర్నెట్ మీద ఆధారపడటం మానేందుకు ఇది ఉపకరిస్తుందని అంటున్నారు. ఈ విధానం వల్ల పఠనం పట్ల ఆసక్తి పెరిగి, ఫోన్ అలవాటుకు దూరమయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. కొన్ని పాఠశాలల్లో దినపత్రికలు చదవడాన్ని కచ్చితంగా అమలు చేస్తుండగా, మరికొన్ని చోట్ల మాత్రం దీన్ని ఐచ్చికం చేశారు. పిల్లల చేత బలవంతంగా దినపత్రికలు చదివించలేమని, అలా చదివించినా వారికి అందులోని విషయాలేమీ ఎక్కవని కొందరు అభిప్రాయపడుతున్నారు.పిల్లల అంతరంగంలో ఏముంది?పాఠశాలలో దినపత్రికలు చదివించే అంశం పట్ల విద్యార్థుల నుంచి సానుకూలత వస్తోంది. దీనివల్ల రోజూ కొత్త విషయాలు తెలుసుకుంటున్నామని, తమ భాష కూడా మెరుగుపడిందని అంటున్నారు. తాము తెలుసుకున్న విషయాలు ఇంటికెళ్లి తల్లిదండ్రులతో చెప్తున్నామని, వారంతా ఆనందపడుతున్నారని అంటున్నారు. విద్యార్థులు ఎక్కువగా క్రీడావార్తల పట్ల ఆసక్తి చూపుతుండగా, పెద్ద తరగతుల్లోని వారు రాజకీయ వార్తలను ఇష్టంగా చదువుతున్నారు. దీర్ఘకాలంలో ఈ దినపత్రిక పఠనం విద్యార్థుల్లో గణనీయమైన అభివృద్ధికి కారణమవుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి ప్రయత్నం జరగడం గురించి తల్లిదండ్రులు చర్చ లేవనెత్తాలి.సామాజిక అంశాల పట్ల అవగాహనప్రభుత్వాలు పిల్లల చేత వార్తాపత్రికలు చదివించాలని శ్రద్ధ చూపడాన్ని విద్యావేత్తలు అభినందిస్తున్నారు. పిల్లలు పేపర్లు చదవడం వల్ల సామాజిక అంశాల పట్ల అవగాహన పెరుగుతుందని, వారిలో ఆత్మస్థైర్యం, వివేకం పెరుగుతాయని అంటున్నారు. నిత్యం పుస్తకాలతో కుస్తీ పట్టేవారికి ఇదొక ఆటవిడుపుగానూ ఉంటుందని, లోకంలో ఎక్కడేం జరుగుతుందో తెలుసుకునే అవకాశం చిక్కుతుందని అంటున్నారు. దినపత్రికల్లో ప్రాంతీయ భాషకే ప్రాధాన్యం. రెండవ స్థానంలో ఇంగ్లిష్ న్యూస్‌పేపర్‌ను అందుబాటులో ఉంచుతున్నారు. దీనివల్ల ఇరుభాషల్లో నైపుణ్యాలు పెరుగుతాయని అంటున్నారు.(చదవండి: భారత ఆర్మీ ఆఫీసర్‌గా సెక్యూరిటీ గార్డ్ కుమార్తె ..! జస్ట్ 22 ఏళ్లకే..) -
ఫోన్ ఆఫ్.. బంధాలు ఆన్!
సెల్‌ఫోన్..సమాచారాన్ని ఇచ్చి పుచ్చుకోవడంలో విప్లవాత్మకమైన మార్పు తెచ్చింది. యావత్ ప్రపంచాన్నీ గుప్పిట పెట్టేసింది. ఇది లేకపోతే ఎలా అన్నంతగా దైనందిన జీవితంలో మమేకమైంది. అయితే ఈ అద్భుత ఉపకరణం ఇతరత్రా దుష్ప్రభావాల మాటెలా ఉన్నా..కుటుంబ సభ్యుల అంతరాన్నీ గణనీయంగా పెంచుతోంది. అతిగా మొబైల్ ఫోన్ వాడకం కుటుంబ బంధాలు బీటలు పడడానికి కారణం అవుతోంది. ఇలాంటి సెల్‌ఫోన్‌ను కాసేపైనా స్విచ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేస్తే..! ఇతరత్రా ప్రయోజనాలతో పాటు జీవితంలోని అనేక మధుర క్షణాలను ఆస్వాదించే అవకాశమూ లభిస్తుందని స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ వివో చెబుతోంది.చిన్న పనే..పెద్ద ప్రభావంఉరుకుల పరుగుల ఆధునిక జీవితంలో సాధారణంగా ఒక్క భోజన సమయంలోనే కుటుంబ సభ్యులంతా కలుస్తూ ఉంటారు. అయితే ఆ సమయంలో కూడా ఫోన్ మాట్లాడటం లేదా వీడియోలు చూస్తుండటం అలవాటుగా మారిపోయింది. అయితే కనీసం ఆ టైమ్‌లోనైనా ఎలాంటి అంతరాయానికి తావు లేకుండా ఫోన్‌ను స్విచ్ ఆఫ్ చేసేస్తే.. బంధాలు బలపడటం ఖాయమని వివో స్విచ్ ఆఫ్ స్టడీ–2025 వెల్లడిస్తోంది.శ్రేయస్సు, వ్యక్తిగత వృద్ధిని పెంపొందించుకోవడానికే ప్రజలు సాంకేతికతను ఉపయోగించుకోవాలని, ప్రియమైనవారితో లోతైన సంబంధాలను ఏర్పరచుకోవాలని సూచిస్తోంది. ఫోన్లు లేని క్షణాలు తమకు మధురానుభూతులు మిగిలిస్తున్నాయని, బలమైన బంధానికి బాటలు వేస్తున్నాయని తల్లిదండ్రులు, పిల్లలు సైతం భావిస్తుండడం విశేషం. ‘స్విచ్ ఆఫ్’ ఆలోచన చాలా చిన్నదే కావొచ్చు. కానీ కాస్త పరిణితి ప్రదర్శిస్తే అదో శక్తివంతమైన విధానంగా మారే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతుండటం గమనార్హం.ఏం చేయాలి..?భోజన సమయంలో ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడం వల్ల పిల్లలతో ఎక్కువ అనుబంధం ఏర్పడినట్టు 81% మంది తల్లిదండ్రులు తెలిపారు. తల్లిదండ్రులు ఫోన్లలో బిజీగా ఉండటం వల్లే తాము వారితో తక్కువగా మాట్లాడుతున్నామని, ప్రత్యామ్నాయంగా ఏఐ వైపు మొగ్గు చూపుతున్నామని 67% మంది పిల్లలు చెబుతున్నారు.ఏది ఏమైనా గ్యాడెŠజ్ట్స్ను పక్కన పెట్టినప్పుడు కుటుంబంలో సంభాషణలు సులభంగా, అర్థవంతంగా అనిపిస్తాయన్నది 91% మంది పిల్లల మాట. నోటిఫికేషన్స్‌ను తగ్గించేలా ఫోన్ సెట్టింగ్స్ మార్చడం, అందరూ కూర్చునే ప్రదేశాలకు దూరంగా ఉపకరణాన్ని ఉంచడం వంటి చిన్నచిన్న మార్పులతో తల్లిదండ్రులు, పిల్లలు ప్రయోగాలు చేస్తున్నారు. ఫోన్ రహిత అలవాట్లను ఎంత ఎక్కువగా పాటిస్తే నిజమైన మధుర క్షణాలను పదిలపర్చుకోవచ్చని వారు అంటున్నారు.ఎవరెవరు పాల్గొన్నారంటే..స్మార్ట్‌ఫోన్ అధికంగా వాడడం వల్ల తల్లిదండ్రులు–పిల్లల సంబంధాలపై ఎటువంటి ప్రభావం పడుతుందో తెలుసుకునేందుకు మార్కెట్ రీసెర్చ్ కంపెనీ సైబర్ మీడియా రీసెర్చ్‌తో కలిసి వివో ఈ అధ్యయనం చేపట్టింది. హైదరాబాద్ సహా దేశవ్యాప్తంగా 8 ప్రధాన నగరాల నుంచి 1,017 మంది తల్లిదండ్రులు, 500 మంది పిల్లలు ఇందులో పాలుపంచుకున్నారు. ఈ స్మార్ట్‌ఫోన్ యూజర్లలో పెద్దల వయసు 35–50 కాగా, పిల్లలు 10–16 ఏళ్లవారు.స్టడీ హైలైట్స్⇒ రాత్రి భోజనం సమయంలోనే 72% మంది పిల్లలు తమ తల్లిదండ్రులతో ఎక్కువ సమయం గడుపుతున్నారు.⇒ డైనింగ్ టేబుల్ వద్ద ఫోన్లలో మునిగితేలడం సంభాషణకు ప్రధాన నిరోధకమని 72% తల్లిదండ్రులు, 30% పిల్లలు పేర్కొన్నారు.⇒ ఉదయం నోటిఫికేషన్లు చెక్ చేయడం, మధ్యాహ్నం ఓటీటీల వీక్షణం, రాత్రిపూట స్క్రోలింగ్.. ఇదీ యూజర్ల తీరు.⇒ ఫోన్ రహిత విందులు కుటుంబ సభ్యుల మధ్య అవగాహన, నమ్మకం, భాగస్వామ్యం గణనీయంగా మెరుగుపరుస్తాయి.⇒ స్విచ్ ఆఫ్ సమయంలో తల్లిదండ్రులతో మాట్లాడటానికి 87% మంది పిల్లలు మరింత సౌకర్యంగా ఉంటారు.⇒ తమ చుట్టూ ఉన్నవారు ఫోన్స్ స్విచ్ ఆఫ్ చేసినప్పుడు పిల్లలు సైతం వారిని అనుసరిస్తున్నారు.అంకెల్లో యూజర్లు..ప్రపంచవ్యాప్తంగా 580 కోట్ల మంది స్మార్ట్‌ఫోన్ యూజర్లు న్నారు. ఒక్కో వ్యక్తి రోజుకు సగటున నాలుగున్నర గంటలు ఫోన్లో విహరిస్తున్నారు. మనవాళ్లేం తక్కువ కాదు. మన దేశంలో 70 కోట్ల మంది చేతుల్లో స్మార్ట్ఫోన్లు ఉంటే.. రోజుకు సగటున 5–7.4 గంటలు స్క్రోల్ చేస్తున్నారు. -
లడఖ్‌లో చైనా గూఢచారి?.. ఫోరెన్సిక్ పరీక్షకు ఫోన్
లడఖ్: టూరిస్ట్ వీసా నిబంధనలను ఉల్లంఘించి, జమ్ము కశ్మీర్, లడఖ్‌లోని పలు ప్రాంతాలను సందర్శించాడన్న ఆరోపణలతో నిర్బంధించిన చైనా పౌరుడు హు కాంగ్టై కేసు పలు మలుపులు తిరుగుతోంది. నవంబర్ 19న ఢిల్లీకి చేరుకున్న 29 ఏళ్ల హు.. ఫారినర్స్ రీజినల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ (ఎఫ్ఆర్ఆర్ఓ)లో తన పేరు నమోదు చేసుకోకుండానే లేహ్, జాంస్కార్, కశ్మీర్ లోయలోని నిషేధిత ప్రాంతాలలో తిరిగాడు.అతని వీసాలో వారణాసి, ఆగ్రా తదితర గమ్యస్థానాల సందర్శనకు మాత్రమే అనుమతి ఉన్నప్పటికీ, ఈ నిబంధనలను ఉల్లంఘించి అతను పలు ప్రాంతాల్లో తిరిగాడని అధికారులు గుర్తించారు. హు కాంగ్టై తిరిగిన ప్రాంతాలలో శ్రీనగర్‌లోని హజ్రత్బాల్ మందిరం, శంక్రచార్య కొండ, ఆర్మీ విక్టర్ ఫోర్స్ ప్రధాన కార్యాలయానికి సమీపంలో ఉన్న అవంతిపోరాలోని బౌద్ధ శిథిలాలు తదితర సున్నిత ప్రదేశాలు ఉన్నాయి. అతని మొబైల్ ఫోన్ బ్రౌజింగ్ హిస్టరీలో సీఆర్పీఎఫ్, ఆర్టికల్ 370 రద్దు తదితర కీలక అంశాలకు సంబంధించిన శోధనలు కనిపించాయి. ప్రస్తుతం హును.. బుడ్గామ్ జిల్లాలోని హుమ్హామా పోలీస్ పోస్ట్‌లో విచారిస్తున్నారు. విచారణ సమయంలో.. తాను బోస్టన్ యూనివర్సిటీలో భౌతిక శాస్త్రం చదివానని, గత తొమ్మిదేళ్లుగా అమెరికాలో ఉంటున్నానని, వీసా నిబంధనల ఉల్లంఘన గురించి తనకు తెలియదని చెప్పాడని సమాచారం. అయితే, అతని పాస్‌పోర్ట్‌లో అమెరికా, న్యూజిలాండ్ తదితర దేశాల సందర్శన వివరాలు ఉండడం మరిన్ని అనుమానాలకు తావిస్తోంది. ఈ నేపధ్యంలో హు కాంగ్టై మొబైల్ ఫోన్‌ను అధికారులు ఫోరెన్సిక్ విశ్లేషణ కోసం పంపారు. తద్వారా అతను సున్నితమైన సమాచారాన్ని సేకరించి, లీక్ చేశాడో లేదో అనేది నిర్ధారించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. అతని అనుమానాస్పద కదలికలు, బ్రౌజింగ్ హిస్టరీ వెనుక ఉన్న నిజాన్ని వెలికితీసేందుకు భద్రతా సంస్థలు దర్యాప్తు కొనసాగిస్తున్నాయి. ఇది కూడా చదవండి: ట్రంప్ మరో షాకింగ్ నిర్ణయం.. భారత్‌పై సుంకాలకు రెడీ? -
నథింగ్ ఫోన్ ‘3ఎ లైట్’: ధర ఎంతంటే?
లండన్ ఆధారిత టెక్ కంపెనీ నథింగ్ కొత్తగా తమ ఫోన్ (3ఎ) లైట్ స్మార్ట్‌ఫోన్‌ని భారత్‌లో ప్రవేశపెట్టింది. దీని వాస్తవ ధర రూ. 20,999 కాగా బ్యాంక్ డిస్కౌంట్లు పోగా రూ. 19,999 నుంచి ప్రారంభమవుతుంది. కొత్త నథింగ్ ఫోన్ డిసెంబర్ 5 నుంచి ఫ్లిప్‌కార్ట్, విజయ్, సేల్స్, క్రోమా, ఇతరత్రా రిటైల్ ఔట్‌లెట్స్‌లో లభిస్తుంది. ఇది మొత్తం మూడు రంగుల్లో లభిస్తుంది.నథింగ్ ఫోన్ ‘3ఎ లైట్’లో 6.77 అంగుళాల అమోలెడ్ డిస్ప్లే, 50 ఎంపీ మెయిన్ కెమెరా, ట్రూలెన్స్ ఇంజిన్ 4.0, మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ప్రో చిప్సెట్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ తదితర ఫీచర్లు ఉంటాయి. ఆండ్రాయిడ్ 15 ఆధారిత నథింగ్ ఓఎస్ 3.5పై పనిచేస్తుంది. 3 ఏళ్లవరకు మేజర్ అప్డేట్స్, 6 ఏళ్ల వరకు సెక్యూరిటీ ప్యాచెస్ పొందవచ్చు. -
బడికెళ్లే వయసులో ప్రేమ! ఏంటి రా ఇది
కృష్ణలంక(విజయవాడతూర్పు): వారిద్దరు మైనర్లు. ఒకే పాఠశాలలో బాలిక తొమ్మిదో తరగతి, బాలుడు ఎనిమిదో తరగతి చదువుతున్నారు. ప్రేమ అనే ఆకర్షణకు లోనైన ఆ ఇద్దరు కలసి కనిపించకుండా వెళ్లిపోయిన ఘటన కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం మేరకు.. రాణిగారితోట, సిద్దెం కృష్ణారెడ్డి రోడ్డులోని ఒక ప్రైవేట్ స్కూల్లో యూపీ కుటుంబానికి చెందిన బాలిక తొమ్మిదో తరగతి, రాణిగారితోటకు చెందిన బాలుడు ఎనిమిదో తరగతి చదువుతున్నారు. బుధవారం బాలుడి పుట్టినరోజు కావడంతో స్కూల్‌కు వెళ్లనని ఇంటిలో చెప్పి తండ్రి ఫోన్ తీసుకుని బయటకు వెళ్లి తిరిగి రాలేదు. స్కూల్‌కు వెళ్లి వస్తానని తల్లిదండ్రులకు చెప్పిన బాలిక ఇంటి నుంచి బయలుదేరి స్కూల్‌కు వెళ్లకపోగా తిరిగి ఇంటికి చేరుకోలేదు. వారి తల్లిదండ్రులు స్కూల్ సిబ్బందిని, చుట్టు పక్కల, బంధువులను విచారించినా ఆచూకీ లభించలేదు. వెంటనే పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని తమ పిల్లలు కనిపించడం లేదని ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సీసీ కెమెరా పుటేజీ ఆధారంగా ఇద్దరు కలిసి బస్టాండ్‌కు చేరుకుని హైదరాబాద్ బస్సు ఎక్కినట్లు గుర్తించారు. ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా హైదరాబాద్ పరిసరాల్లో ఉన్నట్లు నిర్ధారించుకున్న సీఐ నాగరాజు తన సిబ్బంది అక్కడకు పంపి మైనర్లను పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చారు. వారికి కౌన్సెలింగ్ ఇచ్చి వారివారి తల్లిదండ్రులకు అప్పగించారు. -
పోయిందనున్న ఫోన్.. యూపీఐ సాయంతో దొరికిందిలా..
ఎక్కడైనా ఒకసారి మొబైల్ ఫోన్ పోగొట్టుకున్నామంటే.. దాన్ని తిరిగి పొందటం దాదాపు అసాధ్యం. అయితే ఓ జంట మాత్రం యూపీఐ సాయంతోనే పోయిన ఫోన్ పొందగలిగింది. ఇది వినడటానికి వింతగా అనిపించినా.. అసలు విషయం తెలిస్తే మాత్రం ఆశ్చర్యపోవడం మీ వంతు అవుతుంది.నా భార్య ఫోన్ తిరిగి పొందడంలో యూపీఐ సహాయపడింది అనే శీర్షికతో.. సోషల్ మీడియాలో ఒక పోస్ట్ వైరల్ అవుతోంది. ఇందులో ఈ రోజు నేను, నా భార్య ఆటోలో షాపింగ్‌కి వెళ్ళాము, గమ్యం చేరుకున్న తరువాత.. ఆటోకు యూపీఐ ద్వారా డబ్బులు పంపించాను. ఆటో వెళ్లిపోయింది. ఆ తరువాత చూస్తే నా భార్య ఫోన్ కనిపించలేదు. ఆ ఫోన్‌కు కాల్ చేద్దామంటే.. అప్పటికి అందులో సిమ్ కార్డు వేయలేదు.మొదట్లో ఫోన్ ఎవరో దొంగలించి ఉంటారనుకున్నాము, తరువాత ఆలోచిస్తే ఆటోలో మారిపోయినట్లు గుర్తొచ్చింది. ఆటో డ్రైవర్ వివరాలు తెలుసుకుందామంటే.. స్కాన్ చేసి డబ్బు పంపించడం వల్ల అది సాధ్యం కాలేదు. మొత్తానికి ఫోన్ పోయింది అనుకున్నాము. ఇంతలో నా బ్యాంక్ ఖాతాకు ఒక్కరూపాయి యూపీఐ నుంచి వచ్చింది. అంతే కాకుండా పోయిందనుకుంటున్న ఫోన్ నా దగ్గర ఉంది అని.. ఒక నెంబర్ పంపి, దానికి కాల్ చేయమని మెసేజ్ వచ్చింది. మేము ఆ నెంబరుకు కాల్ చేసి.. ఎక్కడ ఉన్నారు అని కనుక్కున్నాం. కానీ ఆ ఆటో డ్రైవర్ మా దగ్గరకు వచ్చి ఫోన్ ఇచ్చాడు. మా ఆనందానికి అవధులు లేకుండా పోయింది. ఆటో డ్రైవరుకు కొంత డబ్బు కూడా ఇచ్చి పంపాను అని రెడ్డిట్ పోస్టులో వెల్లడించారు.ఇదీ చదవండి: జీఎస్టీ 2.0 ఎఫెక్ట్: మొదటి రోజే భారీగా అమ్ముడైన కార్లు -
ఆరెంజ్ కలర్లో ఆపిల్ ఐఫోన్ 17 కోసం బారులు తీరిన ఫ్యాన్స్
-
రేపే ట్రంప్, జెలెన్స్కీ భేటీ
కీవ్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో సోమవారం వాషింగ్టన్లో భేటీ కాబోతున్నానని ఉక్రెయిన్ అధినేత జెలెన్స్కీ వెల్లడించారు. శనివారం ఉదయమే ట్రంప్‌తో ఫోన్లో మాట్లాడానని తెలిపారు. చాలాసేపు సంభాషణ జరిగిందని పేర్కొన్నారు. వ్యక్తిగత భేటీ కోసం సోమవారం వాషింగ్టన్కు రావాలంటూ ఆహా్వనించినందుకు ట్రంప్‌కు జెలెన్స్కీ కృతజ్ఞతలు తెలిపారు. ఉక్రెయిన్–రష్యా యుద్ధాన్ని, సాధారణ ప్రజల మరణాలకు ముగింపు పలికే దిశగా ట్రంప్‌తో సమగ్రంగా చర్చించబోతున్నానని జెలెన్స్కీ సోషల్ మీడియాలో పోస్టుచేశారు. ఉక్రెయిన్–రష్యా సంఘర్షణకు తెరతించడానికి యూరప్ దేశాలు చురుకైన పాత్ర పోషించాలని మరోసారి విజ్ఞప్తి చేశారు. అమెరికాతోపాటు యూరప్ దేశాల అధినేతల నుంచి ఉక్రెయిన్ భద్రతకు హామీ కోరుతున్నామని ఉద్ఘాటించారు. తమకు విశ్వసనీయమైన సెక్యూరిటీ గ్యారంటీ కావాలన్నారు. -
ప్రధాని మోదీకి బ్రెజిల్ అధ్యక్షుడి ఫోన్
న్యూఢిల్లీ: ట్రంప్ దురహంకారాగ్రహానికి గురై 50 శాతం టారిఫ్ భారాన్ని మోస్తున్న భారత్, బ్రెజిల్ దేశాల అగ్రనేతలు గురువారం ఫోన్లో సంభాíÙంచుకున్నారు. బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ లూలా డసిల్లా భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఫోన్‌చేసి పలుఅంశాలపై చర్చించారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధించిన 50 శాతం టారిఫ్ అమల్లోకి వచ్చిన గురువారం రోజే ఇరు దేశాధినేతలు మాట్లాడుకోవడం గమనార్హం. వాణిజ్యం, సాంకేతికత, ఇంధనం, రక్షణ, వ్యవసాయం, ఆరోగ్యం, సాంస్కృతిక సంబంధాల అంశాలపై ఇరు దేశాధినేతలు చర్చించుకున్నారని ప్రధాని కార్యాలయం తర్వాత ఒక ప్రకటనలో పేర్కొంది. అయితే అమెరికా విధించిన 50 శాతం టారిఫ్ మీదనే ప్రధానంగా ఇరునేతలు చర్చించుకున్నారని తెలుస్తోంది. ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలూ చర్చకు వచ్చాయి. -
అరచేతిలో అనర్థం..!
అరచేతిలో అద్భుతాన్ని చూపించే స్మార్ట్ఫోన్లు.. అనర్థాలకు దారితీస్తోంది.. ప్రపంచాన్ని మన గుప్పిట్లోకి తెచి్చన టెక్నాలజీ.. చివరికి మనల్నే తన గుప్పిట్లో బం«దీగా చేస్తోంది. రోజువారీ అవసరాలు తీర్చడంతోపాటు.. రోజువారీ సమస్యలనూ తెచి్చపెడుతోంది.. సరదాగా కాలక్షేపం కోసం మొదట్లో వినియోగంలోకొచ్చి.. ఇప్పుడు అదే కాలక్షేపంగా మారిపోయింది.. అనేక సౌకర్యాలను అందుబాటులోకి తెచ్చి సమయాన్ని ఆదా చేస్తుందనుకున్న మొబైల్ నేడు మన సమయాన్ని వృథా చేస్తోంది.. నెమ్మదిగా దానికి బానిసలుగా మార్చేసుకుంటోంది.. మొబైల్ వినియోగించకుండా ఉండలేకపోవడాన్ని సైంటిఫిక్‌గా నోమోఫోబియా అంటున్నారు. ప్రస్తుతం ఈ ఫోబియాకు గురవుతున్నవారి సంఖ్య క్రమంగా పెరుగుతోందని ఓ సంస్థ నిర్వహించిన సర్వేలో ఫలితాలు చెబుతున్నాయి. ఒకప్పుడు కేవలం సమాచారానికి, అవసరమైన కమ్యూనికేషన్‌కు మాత్రమే ఉపయోగించుకున్న మొబైల్ ఫోన్లు.. ఇప్పుడు మన జీవితాల్లో ప్రధాన భాగమైపోయాయి. సోషల్ మీడియా, గేమ్స్, షార్ట్ వీడియోలు, అరచేతిలో టిక్ టిక్ మంటూ వచ్చే నోటిఫికేషన్లతో.. అసలు మొబైల్‌ను మనమే పట్టించుకోవడం లేదు.. అది మనల్ని పట్టేసింది! ఒక ప్రైవేట్ సర్వే ప్రకారం.. హైదరాబాద్‌లోని విద్యార్థుల్లో 62% మందికి పైగా రోజుకు సగటున 6–8 గంటలు మొబైల్లో గడుపుతున్నారని తేలింది. అయితే వ్యసనంలా మారిన ఈ మొబైల్ అడిక్షన్ నుంచి బయటపడటానికి కొందరు మాత్రం ప్రత్యామ్నాయ మార్గాలను వెతుకుతున్నారు. నగర యువతపై ప్రభావం.. హైదరాబాద్ వంటి మహానగరాల్లో మొబైల్ యూజర్ల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. టెక్ జాబ్స్, మెట్రో జీవితం, ఒంటరి అపార్ట్మెంట్ కల్చర్ తదితర కారణాలతో మొబైల్‌ను ఓ సాధనంగా కాకుండా ఒక సహజీవిగా మార్చేశాయి. ప్రత్యేకించి 15–30 ఏళ్ల వయసులో ఉన్న యువతలో ఇది తీవ్రమైన డిజిటల్ డిపెండెన్సీగా మారింది. ముఖ్యంగా రాత్రిపూట స్క్రోల్ చేస్తూ నిద్రపోయే వరకూ ఫోన్ చూస్తుండటం వల్ల నిద్రలేమి, తలనొప్పి, ఏకాగ్రత లోపం, డిప్రెషన్ వంటి మానసిక, శారీరక రుగ్మతలకు లోనవుతున్నారు. సర్వేలు ఏమంటున్నాయంటే.. నిమాన్స్ (ఎన్ఐఎంహెచ్ఏఎన్ఎస్) చేసిన అధ్యయనంలో దాదాపు 40% మందికి ‘నో మొబైల్ ఫోబియా’ (నోమోఫోబియా) ఉందని వెల్లడైంది. తెలంగాణ సైకలాజికల్ అసోసియేషన్ అధ్యయనం ప్రకారం, 18–25 ఏళ్ల మధ్య వయస్కుల్లో ప్రతి 10 మందిలో ఏడుగురు మొబైల్ లేని జీవితాన్ని ఊహించలేకపోతున్నారని తేలింది. హైదరాబాద్‌లోని విద్యాసంస్థలు తాము నిర్వహించిన అంతర్గత సర్వేల్లో విద్యార్థులు చదువుపై ఫోకస్ కోల్పోతున్నారని స్పష్టంగా పేర్కొన్నాయి. చిన్నారుల్లో దీని ప్రభావం.. పిల్లలు ఆహ్లాదంగా ఆడుకోవాల్సిన వయసులో మొబైల్ స్క్రీన్‌కి అలవాటుపడుతున్నారు. తల్లిదండ్రులు తాత్కాలికంగా వారి తలనొప్పి తగ్గించుకోవాలనే ఉద్దేశంతో మొబైల్ అందిస్తుంటే.. అది శాశ్వతంగా పిల్లల అభివృద్ధికి అడ్డుగోడవుతోంది. స్పీచ్ డిలే, అటెన్షన్ డెఫిసిట్, హైపర్ యాక్టివిటీ వంటి సమస్యలు పిల్లల్లో గణనీయంగా పెరిగిపోతున్నాయి. విముక్తి మార్గాలు.. డిజిటల్ డీటాక్స్ ఛాలెంజ్ : ప్రతి వారం ఒక రోజు లేదా ప్రతి రోజు ఒక నిరీ్ణత సమయం మొబైల్‌కి బ్రేక్ ఇవ్వడం. ఆఫ్‌లైన్ హాబీస్ : పుస్తక పఠనం, ఆర్ట్, గార్డెనింగ్, యోగా వంటి కార్యకలాపాలు మొబైల్ డిపెండెన్సీని తగ్గించడంలో సహాయపడతాయి. సోషల్ మీడియా మేనేజ్మెంట్ : సోషల్ మీడియా అకౌంట్స్ డిలీట్ చేయడం కాదు, వాటిని ‘లిమిటెడ్ యూజ్’ మోడ్‌లో పెట్టడం, నోటిఫికేషన్లు ఆఫ్ చేయడం. డిజిటల్ వెల్ బీయింగ్ యాప్స్ : స్క్రీన్ టైమ్ ట్రాకింగ్, రిమైండర్లు ఇవ్వగల యాప్స్ ఉపయోగించడం. ఫ్యామిలీ టైమ్..: ప్రతి రోజు 1–2 గంటలు కుటుంబ సభ్యులతో గడిపేందుకు ప్రయతి్నంచాలి. హైదరాబాద్ స్పెషల్ ఇన్షియేటివ్స్.. కొన్ని కార్పొరేట్ కంపెనీలు ఉద్యోగులకు నెల్లో ఒక్కరోజు ‘నో మొబైల్ డే’ పాటిస్తున్నారు. బంజారాహిల్స్‌లోని ఓ స్కూల్ ‘టెక్ ఫ్రీ అవర్’ అంటూ రోజుకు ఒక పిరియడ్‌ను స్క్రీన్ లేని యాక్టివిటీలకు కేటాయిస్తోంది. సైకలాజికల్ వెల్ బీయింగ్ సెంటర్స్ ఆధ్వర్యంలో మొబైల్ డిపెండెన్సీకి కౌన్సెలింగ్ ప్రోగ్రామ్‌లు నిర్వహిస్తున్నారు. స్మార్ట్ యూజ్.. ప్రస్తుత అధునాతన జీవన శైలిలో టెక్నాలజీని వదిలేయమనడం సాధ్యం కాదు.. కానీ మనమే నియంత్రించలేకపోతే అది మనల్ని నియంత్రించడం ఖాయం. మొబైల్ అనేది ఓ సాధనం మాత్రమే, జీవితం కాదు. ప్రత్యేకించి యువత.. కెరీర్, మానసిక ఆరోగ్యం, రిలేషన్షిప్స్ అన్నింటినీ తారుమారు చేసే ఈ డిజిటల్ బానిసత్వం నుంచి బయటపడితేనే నిజమైన ‘స్మార్ట్ యూజ్’ అవుతుంది. (చదవండి: తుమ్ములు కుమ్మేస్తున్నాయా..? వాచ్ ది హాచ్) -
మా అమ్మాయిని చాటింగ్ నుంచి బయట పడేయగలరా
మా అమ్మాయి వయసు 16 సంవత్సరాలు, జూనియర్ ఇంటర్ చదువుతోంది. ఈ మధ్య ఎంతసేపు ఫోన్లోనే ఉంటోంది. చికాకుగా ఉండటం, అందరితో సరిగ్గా మాట్లాడక΄ోవడంతోపాటు తిండి కూడా బాగా తగ్గించేసింది. చదువు మీద బొత్తిగా ధ్యాస లేదు. ఈ మధ్య నేను అనుకోకుండా తన ఫోన్ చూస్తే ఒక సోషల్ మీడియా యాప్ ద్వారా వేరే దేశంలోని వ్యక్తితో చాటింగ్, ఫోన్స్, వీడియో కాల్స్ మాట్లాడుతున్నట్లు గమనించాను. ఇంకా తన పర్సనల్ ఫొటోలు కూడా ఆ వ్యక్తికి పంపినట్లు చూసి నేను చాలా అప్సెట్ అయ్యాను. తన నుంచి ఫోన్ తీసుకుంటే చనిపోతానని చెదిరిస్తుంది. చాకుతో చేతిమీద కోసుకునే ప్రయత్నం కూడా చేసింది. ఎవ్వరితోను చెప్పుకోలేని పరిస్థితి నాది! మా వారితో కూడా చెప్పే ధైర్యం లేదు. దిక్కు తోచని పరిస్థితిలో ఈ ఉత్తరం రాస్తున్నాను! దయచేసి సలహా చెప్పగలరు. – ఒక సోదరి, హైదరాబాద్ఇది మీరొక్కరే కాదు, ప్రస్తుతం సమాజంలో చాలామంది ఎదుర్కొంటున్న సమస్య. మీ బాధను నేను అర్థం చేసుకోగలను. ఈ మధ్య కాలంలో టీనేజీ పిల్లలో ఫో, ఇంటర్నెట్ వాడటం చాలా ఎక్కువ అయింది. సోషల్ మీడియా ప్రభావం వారి మీద చాలా ఎక్కువగా ఉంది. మీ అమ్మాయి విషయానికి వస్తే ఫోన్ వాడకంతో పాటు, క్షణికావేశం, తప్పుడు నిర్ణయాలు, తొందరపాటుతనం, అంతర్గత భావోద్వేగాలను నియంత్రించలేకపోవడం కనిపిస్తోంది. కౌన్సెలింగ్ ‘బిహేవియరల్ థెరపీ’ బాగా ఉపయోగ పడుతుంది. అయితే మీరు మీ భర్తతో కూడా దీని గురించి చర్చించడం మంచిది. పేరెంట్ మేనేజ్మెంట్ ట్రైనింగ్’ ద్వారా మీరు కూడా ఎలా ఉండాలో తెలుసుకోవచ్చు. ఆమెతో ఎక్కువ సాన్నిహిత్యం పెంచుకోండి. తెలియని వ్యక్తులతో చాటింగ్ వలన వచ్చే నష్టాలను వివరించండి. అదే విధంగా ఫోన్ సమయాన్ని ఎలా నిర్దేశించాలో చెప్పండి. తల్లిదండ్రులుగా మీరిద్దరూ కలిసి తనతో ప్రశాంతంగా మాట్లాడటం, వినడం మొదలు పెడితే, ఆమె కోర్కెలు, బాధలు బయటపడతాయి. మీరు ధైర్యంగా, ప్రశాంతంగా ఉండి మానసిక వైద్య నిపుణల సహాయంతో ఈ సమస్య నుంచి మీ అమ్మాయిని తప్పకుండా పూర్తిగా బయటికి తీసుకు రావచ్చు.డా. ఇండ్ల విశాల్ రెడ్డి, సీనియర్ సైకియాట్రిస్ట్, విజయవాడ. (మీ సమస్యలు, సందేహాలు పంపవలసిన మెయిల్ ఐడీ: sakshifamily3@gmail.com) -
లవర్‌తో దిగిన ఫోటోలు భర్త ఫోన్లో ఉండిపోవడంతో.. భార్య ఏం చేసిందంటే..!
న్యూఢిల్లీ: రోజుకు ఎన్నో చిత్ర విచిత్రాలను చూస్తున్నాం. తాజా ఘటన కూడా చాలా చిత్రమైందే. ఓ భార్య తన లవర్‌తో దిగిన ఫోటోలు, వీడియోలు భర్త ఫోన్లో ఉన్నాయనే కారణంతో వాటి కోసం ఇద్దరు మనుషల్ని పురమాయించింది. భర్తన పట్టుకునైనా ఆ ఫోన్ తీసుకుని లవర్‌తో కలిసి ఉన్న ఫోటోలు డిలీట్ చేయాలనే ప్లాన్ చేసింది. ఈ క్రమంలోనే తనకు తెలిసిన ఇద్దర్ని మాట్లాడుకుంది. భర్త రూట్ మ్యాప్ అంతా ఇచ్చింది. భర్త ఆఫీస్‌కు ఏ రూట్లో వెళతాడు.. ఎన్ని గంటలకు ఎక్కడకు చేరుకుంటాడు అనే వివరాల ఇచ్చింది. ఇందులో భర్త వర్క్ టైమింగ్స్ అన్ని షేర్ చేసింది. భర్త ఫోన్లో లవర్‌తో దిగిన ఫోటోలు కొంపముంచుతాయేమోనని భయపడి ఈ కుట్రకు తెరలేపింది భార్య. లవర్‌తో ఉన్నప్పుడు భర్త వాడే ప్రత్యామ్నాయ ఫోన్‌తో ఫోటోల దిగింది కానీ, ఆ ఫోన్ తిరిగి భర్త తీసుకోవడంతో భార్యకు కంగారు పట్టకుంది. ఎలాగైనా ఆ ఫోటోలు భర్త కంటపడకుండా చేయాలని భావించింది. ఇందుకు గాను ఇద్దరు వ్యక్తులను పురమాయించగా, ఒకరు పోలీసులకు దొరికిపోయాడు. అంకిత్ గోహ్లత్ అనే 27 ఏళ్ల వ్యక్తి,, అద్దెకు ఒక స్కూటర్ తీసుకుని ప్రణాళిక అమలు చేశాడు.. ఫోన్ అయితే దొంగిలించారు కానీ, ఆ ఫోన్ దొంగిలించబడిందని భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిలో భాగంగా నిఘా ఉంచారు పోలీసులు. లవర్‌తో దిగిన ఫోటోలను డిలీట్ చేశారు కానీ విషయమైతే పోలీసులకు వెల్లడించాడు పట్టుబడిన వ్యక్తి.దాంతో అతన్ని ట్రేస్ అవుట్ చేసి పోలీసులు పట్టుకోగా అసలు విసయం బయటపడింది. ఆతని భార్యే ఫోన్ దొంగిలించాడానికి తనను పురామాయించిందని అసలు విషయం చెప్పేశాడు సదరు ‘దొంగ’. ఈ విషయం తమ దర్యాప్తులో తేలినట్లు ఢిల్లీ(సౌత్) డీసీపీ అంకిత్ చౌహాన్ వెల్లడించారు. సినిమా తలపించే ట్విస్టులున్న ఈ ఘటన జూన్ 19వ తేదీన జరగ్గా, చివరకు ఆ ఫోన్ ఎక్కడుందో పోలీసులకు తమ ఛేదనలో దొరకడంతో భార్య బండారం బయటపడింది. -
ఇల్లే ఆమె ట్యుటోరియల్ కాలేజీ
23 ఏళ్లకే ఐ.ఎ.ఎస్. ఆఫీసర్ అయ్యి 25 ఏళ్ల వయసులో జాయింట్ కలెక్టర్‌గా పని చేస్తున్న నేహా బైద్వాల్ ఒక స్ఫూర్తి పాఠం. అమ్మాయిల చదువును అంతగా ప్రోత్సహించని రాజస్థాన్ లో పుట్టిన నేహా మూడేళ్ల పాటు ఫోన్ ని తాకకుండా పట్టుపట్టి చదివి ఐ.ఏ.ఎస్. సాధించారు. గమ్యం చేరాలంటే ఫోన్ ని పక్కన పెట్టాలంటున్న ఆమె మాటలు చర్చను లేవనెత్తుతున్నాయి.‘మా ఇంట్లో టీవీ ఉండదు. మా నాన్నగారు టీవీని ఉండనివ్వలేదు. దాని బదులు ఒక బ్లాక్‌బోర్డ్ ఉంది. మాది జాయింట్ ఫ్యామిలీ. ఎప్పుడూ చదువుకుంటూ పరీక్షలు రాసే పిల్లలు ఐదారుమంది ఉండేవారు. వారికి ఆ బోర్డు మీద పాఠాలు సాగుతుండేవి. నేను కూడా అలాగే చదువుకున్నాను. మా నాన్న ఆఫీసు నుంచి వచ్చాక రాత్రి భోజనం దగ్గర పిల్లలందరూ ఆ వేళ ఏం చదివారో అడిగేవారు... జవాబులు తెలుసుకునేవారు. ఎవరైనా సరిగ్గా చదవలేదని అనిపిస్తే వారికి క్లాస్ పడేది. రాజస్తాన్ కుటుంబాల్లో/పల్లెల్లో ఆడపిల్ల చదువును ప్రోత్సహించరు. మా నాన్న ప్రభుత్వ ఉద్యోగి కావడం వల్ల ఆయన ఉద్యోగ రీత్యా మేమంతా ఎక్కువ సంవత్సరాలు ఛత్తిస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో ఉండటం వల్ల మా చదువుకు ఎటువంటి ఆటకం కాలేదు. చదువు ముఖ్యం అని చిన్నప్పుడే మా నాన్న నూరి΄ోశారు’ అంటుంది నేహా బైద్వాల్.2023 సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో ఆమెకు 569 ర్యాంకు వచ్చింది. మొత్తం 960 మార్కులతో (ఇంటర్వూలో 151) ఆమె ఈ విజయం సాధించింది. అయితే ఇదంత సులువు కాలేదు. అందుకు నాలుగేళ్లు కష్టపడింది. మూడుసార్లు విఫలమయ్యి నాలుగోసారి విజయం సాధించింది.5వ తరగతి ఫెయిల్నేహా మొదటి నాలుగేళ్లు రాజస్థాన్‌లో ఉన్న తాతగారి ఇంట్లో చదువుకుంది. అది పల్లెటూరి. అక్కడ రాజస్థానీ మీడియంలోని చిన్న బడి ఉండేది. అయితే ఐదోక్లాస్ నాటికి తండ్రి ఆమెను తాను ఉద్యోగం చేస్తున్న చోటుకు తెచ్చి ఇంగ్లిష్ మీడియం స్కూల్లో వేశాడు. అప్పటికి ఇంగ్లిష్‌లో ఏ మాత్రం ప్రవేశం లేని నేహా ఐదోక్లాస్లో ఫెయిల్ అయ్యింది. స్కూల్ వాళ్లు హిందీ మీడియంలోకి వేస్తామన్నారు. కాని నేహా పట్టుదలతో ఆరో క్లాస్ నుంచి ఇంగ్లిష్ మీడియంలో పుంజుకుంది.లాయర్ కావాలనుకుని...నేహా అడ్వకేట్ అవుదామనుకుంది. ‘బాధితులకు న్యాయం జరగాలంటే అదొక మంచి మార్గం అనుకున్నాను’ అంటుందామె. కాని అంతకంటే ఎక్కువమందికి నువ్వు మేలు చేయాలంటే ఐ.ఏ.ఎస్ కావాలి అని తండ్రి దిశా నిర్దేశం చేశాడు. రాయ్‌పూర్‌లోని మహిళా కళాశాలలో డిగ్రీ చదివిన నేహా అందుకు మార్గం ఏమిటని తండ్రిని అడిగితే కాలాన్ని గెలవడమే అని చె΄్పాడు. ‘పనికిరాని వాటికి సమయాన్ని వృథా చేయడం కంటే దానిని పూర్తిగా సద్వినియోగం చేయడమే విజయానికి మార్గం అని తెలుసుకున్నాను’ అంటుంది నేహా. టీవీ లేని ఆ ఇంట్లో ఆమె ఇక ఫోన్ కూడా పక్కన పెట్టేసింది. ఇల్లే ఆమె ట్యుటోరియల్ కాలేజీ, ప్రిపరేషన్ జరిగే చోటు.నాలుగోసారి‘నేను ఆశాజీవిని. ఓడి΄ోక ప్రయత్నించడం మన బాధ్యత’ అంటుంది నేహా. నేహాకు మొదటి అటెంప్ట్‌లో అసలేమీ రిజల్ట్ కనపడలేదు. రెండో అటెంప్ట్‌లో ప్రిలిమ్స్‌లో 2 మార్కులు తక్కువ రావడంతో అర్హత రాలేదు. మూడో అటెంప్ట్‌లో మెయిన్స్‌లో అర్హతకు 8 మార్కులు తక్కువ వచ్చాయి. మూడుసార్లు విఫలమయ్యాక నాలుగోసారి మళ్లీ పరీక్షకు కూచోవడం ఎవరికైనా కష్టమే. కాని నేహా నాలుగోసారి రాసింది. ఈసారి ఆమె శ్రమ వృథా కాలేదు. 2023 సంవత్సరంలో ఆమెకు 569వ ర్యాంకు వచ్చింది. గుజరాత్ కేడర్ అలాట్ అయ్యింది. శిక్షణ తర్వాత గుజరాత్లో అసిస్టెంట్ కలెక్టర్‌గా ΄ోస్టింగ్ వచ్చింది. ఇప్పుడు ఉత్తరప్రదేశ్‌లోని జలౌన్‌లో జాయింట్ కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తోంది. ‘నీ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ, నిన్ను నీవు మోసం చేసుకోకుండా కష్టపడితే విజయం తథ్యం’ అంటోందామె.అందరూ తోడేనేహా చదువుకుంటూ ఉంటే ఒక్కోరోజు ఒక్కొక్కరు తోడు కూచునేవారు. ఒకరోజు తండ్రి, మరోరోజు బాబాయి... ‘మేమున్నాం తోడుగా. నీ ప్రిపరేషన్ నువ్వు, మేము నీకు తోడు అనే భరోసా దీని ద్వారా అందేది’ అంటుంది నేహా. ఆమెకు ముగ్గురు తమ్ముళ్లు. వారిలో ఒక తమ్ముడు మెయిన్స్‌కు అన్ని ప్రశ్నలు సమయానికి రాయడం ఎలాగో టిప్స్ చెప్పి సాధన చేయించాడు. ‘మా ఇంట్లో రోజూ నాకు మాక్ ఇంటర్వ్యూలు ఉండేవి. రోజూ ఎవరో ఒకరు ఐ.ఏ.ఎస్. కోసం బోర్డు ఎలా అయితే ప్రశ్నలు అడుగుతుందో అలా ప్రశ్నలు ప్రిపేరయ్యి మరీ నన్ను అడిగేవారు. ఇది నాకు ఎంతో ఉపయోగపడింది’ అంటుంది నేహా. -
తీవ్ర వ్యసనం
మొన్నటి మేలో కర్నాటకలోని ఉడిపిలో ఒక సంఘటన జరిగింది. రోడ్డు మీద తిరుగుతున్న ఒక పిచ్చివాణ్ణి ఒక స్వచ్ఛంద సంస్థ కార్యకర్త సంరక్షించి, వైద్యం చేయించి, తిరిగి మామూలు మనిషిని చేశాడు. మెల్లగా ఆ కోలుకున్న వ్యక్తి తమిళుడని, సొంత ఊరు కుంభకోణం అని తెలిసింది. అతని మనుషులు వెతుక్కుంటూ వచ్చారు. ‘ఇతను ఆరునెలలుగా కనిపించకుండా పోయాడు. దానికి ముందు ఫోన్లో రీల్స్ చూస్తూ కుటుంబంతో మాట్లాడక, స్నానం చేయక, తిండి తినక అదే లోకంగా ఉండేవాడు. ఆ తర్వాత ఈ స్థితిలో దొరికాడు’ అని చెప్పి తీసుకెళ్లారు. రీల్స్‌ను వరుసపెట్టి చూడటానికి ‘డూమ్ స్క్రోలింగ్’ అంటున్నారు నిపుణులు. రీల్స్ మనిషి మెదడును ఏ విధంగా ఆక్రమించగలదో ఇదొక ఉదాహరణ.ఇటీవలే గుజరాత్‌లోని వడోదరలో మరో ఘటన జరిగింది. అక్కడి ఒక కొడుకు తన భార్యతో కలిసి పోలీసుల సహాయం కోరుతూ ఫోన్ చేశాడు. దానికి కారణం ఆ ఇంట్లోని తల్లి రీల్స్‌లో పడి తిండి తినడం మానేసింది. కొడుకు, కోడలు డ్యూటీకి వెళుతుంటే ఆమెకు బోర్ కొట్టి రీల్స్ చూడటానికి అలవాటు పడిందట. ఆ రీల్స్‌లో కూడా ఒక ఇన్ఫ్లూయెన్సర్ పెట్టే రీల్స్ చూస్తుందట. వాటికింద కామెంట్స్ పెడుతుందట. ఆ కామెంట్స్‌కు ఆ ఇన్ఫ్లూయెన్సర్ రియాక్ట్ అయితే ఆమెకు సంతోషం. లేదంటే అప్సెట్ అయ్యి అన్నం తినదు. కొడుకు కోడలు ఆమె ఫోన్ నుంచి ఇన్‌స్టా యాప్‌ను తొలగించారు. దాంతో ఇంకా పెద్ద గొడవ జరిగి, ఆమె అన్నం తినడం మానేసింది. దాంతో ఇప్పుడా కొడుకు, కోడలు తల పట్టుకుని కూచుని ఉన్నారు.అసలు రీల్స్ అంటే ఏమిటి? కొన్ని సెకన్ల విన్యాసం. 2020లో మన దేశంలో టిక్‌టాక్‌ను నిషేధించాక, ఇన్స్టాగ్రామ్ రీల్స్ పేరుతో 90 సెకన్ల నుంచి 3 నిమిషాల వీడియోస్‌ను ప్రవేశ పెట్టింది. వీటిద్వారా గుర్తింపు, పేరు, ఫాలోయెర్సు తద్వారా డబ్బు... ఇవన్నీ వచ్చేసరికి కేవలం రీల్స్ మీద ఆధారపడినవారు కోకొల్లలుగా పెరిగారు. వీరు రకరకాల విన్యాసాలతో నిత్యం వేలకొద్దీ రీల్స్ వదులుతుంటారు. అవి చూడటానికి ఎవరికైనా, ఎన్ని సంవత్సరాలైనా సరిపోవు. ఆ సంగతి గ్రహించి ఎప్పుడైనా సరదాగా చూసి ఫోన్ కట్టేయాలి తప్పితే వాటిలోనే కూరుకుపోతే మెదడు ఆ రీల్స్‌కు బానిసవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.చేయి విరగ్గొట్టుకున్న అమ్మాయిఅహ్మదాబాద్లో నర్సింగ్ కోర్సులో చేరిన ఒక అమ్మాయి హాస్టల్లో బోరు కొడుతున్నదని రీల్స్ చూడటానికి అలవాటు పడింది. పరీక్షలు వచ్చాయి. రీల్స్ చూడాలంటే పరీక్షలు రాయకూడదని ఆ అమ్మాయి తన కుడి చేతిని బల్ల మీద పదేపదే బాది విరగ్గొట్టుకుంది. ఇలా ఉంటాయి రీల్స్ ఉత్పాతాలు.బి.పి. పెరుగుతుందిచైనాలోని హైబె మెడికల్ యూనివర్సిటీ చేసిన అధ్యయనం ప్రకారం రీల్స్ వల్ల 30 నుంచి 45 ఏళ్ల మధ్య ఉన్నవారిలో బి.పి. పెరుగుతుందని నిరూపణ అయ్యింది. రీల్స్‌లోని కంటెంట్ ఒక్కోసారి ఎక్కువగా, మరోసారి తక్కువగా కొనసాగుతూ మూడ్స్‌ను హెచ్చుతగ్గులు తెచ్చిపెడుతుండటం వల్ల ఇలా జరుగుతుంది. రాత్రివేళ గంటలు గంటలు రీల్స్ చూస్తూ నిద్ర పాడుచేసుకుని ఉద్యోగాల్లో కునికిపాట్లు పడుతున్నవారు వేలమంది ఉన్నారు. ఇక దేహం కదల్చకుండా ఉండటం వల్ల వస్తున్న శారీరక సమస్యలు ఎన్నో.టీవీ నయంరీల్స్ చూడటం కన్నా టీవీ చూడటం నయం అంటున్నారు నిపుణులు. ఎందుకంటే టీవీ చూస్తూ కనీసం ట్రెడ్మిల్ మీద వాకింగ్ చేయొచ్చు. లేదా పుస్తకాల ర్యాక్ సర్దుకోవచ్చు. లేదా బట్టలు మడతపెట్టడమో, కూరగాయలు తరగడమో... ఏదో ఒక పని టీవీ చూస్తూ చేయొచ్చు. రీల్స్ చూడాలంటే ఇలా చేయడానికి చేతులు ఖాళీ ఉండవు. ఒక చేతిలో ఫోన్ పట్టుకుని మరో చేత్తో స్క్రోలింగ్ చేస్తూ వెళ్లాలి. కాబట్టి శరీరం వేరే పని చేయలేదు.కాపురాలలో చిచ్చురీల్స్ చూడటం భార్యాభర్తల మధ్య చిచ్చు తెస్తోంది. నాలుగురోజుల క్రితం కర్నాటకలోని మంగళూరు సమీపంలో రీల్స్ చూస్తున్న భార్యను కట్టడి చేయలేక భర్త ఆమెను చంపేశాడు. ఉత్తర ప్రదేశ్‌లో ఒక భార్య రీల్స్ చూడనివ్వడం లేదని, గిన్నెలు తోమమంటున్నాడని భర్త మీద కేసుపెట్టింది. వీటన్నింటికి విరుగుడు ఆరోగ్యకరమైన వ్యాపకాల్లో ఉండటమే అంటున్నారు నిపుణులు. హస్తకళలు, పుస్తకాలు చదవడం, క్రీడలు వీటిలో సమయాన్ని వెచ్చించడం మేలంటున్నారు. ముఖ్యంగా పిల్లల్ని రీల్స్ బారిన పడకుండా చూడమంటున్నారు. -
ఫోన్లో జేడీ వాన్స్ మీమ్ ఉన్నందుకు అమెరికాలో ప్రవేశించనివ్వలేదు
న్యూయార్క్: ఫోన్లో జేడీ వాన్స్ బట్టతల మీమ్ ఫొటో ఉన్నందుకు ఇమ్మిగ్రేషన్ అధికారులు తనను అమెరికాలో ప్రవేశించనివ్వలేదని నార్వేకు చెందిన పర్యాటకుడు ఆరోపించారు. తనకు ఎలాంటి నేరచరిత్ర లేకపోయినా.. తాను నెవార్క్ విమానాశ్రయంలో దిగిన మరుసటి రోజు తిప్పి పంపారని తెలిపాడు. నార్వేకు చెందిన 21 ఏళ్ల మాడ్స్ మికెల్సెన్ న్యూయార్క్, టెక్సాస్, ఆస్టిన్‌లలో స్నేహితులను కలవడానికి అమెరికాకు వెళ్లాడు. అలాగే తన తల్లితో కలిసి రోడ్ ట్రిప్‌లో జాతీయ ఉద్యానవనాలను సందర్శించాలనుకున్నాడు. కానీ నెవార్క్ విమానాశ్రయంలో ఇమ్మిగ్రేషన్ అధికారులు మికెల్సెన్ను అడ్డుకున్నారు. ‘నన్ను అనేక మంది సాయుధ గార్డులు ఉన్న గదికి తీసుకెళ్లారు. అక్కడ నా బూట్లు, మొబైల్ ఫోన్, బ్యాక్‌ప్యాక్‌ను తీసుకున్నారు. అధికారులు నా ఫోన్‌ను అన్‌లాక్ చేయమని ఒత్తిడి తెచ్చారు. నిరాకరిస్తే జైలు శిక్ష లేదా 5వేల డాలర్ల జరిమానా విధిస్తామని బెదిరించారు. సందర్భాన్ని వివరించిన తర్వాత కూడా, అధికారులు నా వస్తువులను తనిఖీ చేశారు. వేలిముద్రలను తీసుకున్నారు. రక్త నమూనాలను సేకరించారు. అమెరికాలో నేను కలవాలనుకున్న వారందరి పేర్లు, చిరునామాలు, ఫోన్ నంబర్లు, వృత్తుల వివరాలు అడిగారు. నేను పన్నెండు గంటలు ప్రయాణించాను. సరిగ్గా నిద్రపోలేదు. వారు ప్రశ్నించడం ప్రారంభించే ముందే శారీరకంగా, మానసికంగా పూర్తిగా అలసిపోయాను. మాదకద్రవ్యాల అక్రమ రవాణా, ఉగ్రవాద కుట్రలు, మితవాద తీవ్రవాదంలో పాల్గొన్నట్లు అధికారులు నాపై ఆరోపణలు చేశారు. కానీ నిజానికి కారణం అది కాదు. నా ఫోన్లో జేడీ వాన్స్ మీమ్ ఫొటో ఉంది. అందులో ఆయన బట్టతలతోఉన్నారు. అలాగే నేను చేతిలో ఒక చెక్క పైపుతో ఉన్న ఫొటో కూడా వారికి నచ్చలేదు. ఈ రెండు చిత్రాలు అమెరికాలోకి ప్రవేశించకుండా నన్ను అడ్డుకుంటాయని అనుకోలేదు. మరునాడు నన్ను నార్వే వెళ్ళే విమానంలో ఎక్కించారు’అని మికెల్సెన్ ఆరోపించారు. ఈ వీడియో సామా జిక మాధ్యమంలో వైరల్ అయ్యింది. -
ఫోన్ పౌచులు అమ్మి.. నీట్ విజేతగా..
కష్టే ఫలి. శ్రమయేవ జయతే.. అని అన్నారు పెద్దలు. ఇక్కడో కుర్రాడి సక్సెస్‌ను చూస్తే ఆ మాట ఒప్పుకుని తీరాల్సిందే. కరోనా టైంలో తన లక్ష్యాన్ని నిర్దేశించుకున్న యువకుడు.. రేయింబవలు కష్టపడ్డాడు. తాను అనుకున్నది సాధించి.. ఇప్పుడు నీట్ విజేతగా నెట్టింట ప్రశంసలు అందుకుంటున్నాడు.జార్ఖండ్‌కు చెందిన రోహిత్ కుమార్(Jharkhand Rohit Kumar).. ఈ ఏడాది నీట్ యూజీ పరీక్షలో 549 మార్కులతో ఆల్ ఇండియాలో 12,484 ర్యాంక్ సాధించాడు(కేటగిరీ వైజ్‌గా 1,312 ర్యాంక్). ఫిజిక్స్ వాలాగా పేరుకున్న అలఖ్ పాండే.. తాజాగా ఈ యువకుడిని పలకరించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. రోహిత్ కుమార్ తండ్రి స్థానికంగా కూరగాయలు అమ్మేవాడు. 12 తరగతి పూర్తయ్యాక పూర్తిగా నీట్ మీద దృష్టి పెట్టేందుకు పైచదువులు మానేశాడు రోహిత్. ఆపై కరోనా టైంలో ఓ మెడికల్ షాపులో పని చేసే సమయంలో ఎలాగైనా వైద్య వృత్తిలో స్థిరపడాలనే కసి మొదలైంది. ఆపై సెల్ ఫోన్ పౌచులు అమ్మకునే దుకాణం తెరిచి.. రెండు పడవలపై ప్రయాణం చేస్తూ వచ్చాడు.ఉదయం 7గం. నిద్రలేచే రోహిత్ కుమార్.. పగలంతా తన బండి మీద సెల్ ఫోన్ పౌచులు అమ్ముకున్నాడు. ఆపై రాత్రి వేళలో ఇంటికి చేరి పుస్తకాలతో కుస్తీ పడుతూ వచ్చాడు. అలా అలా.. అర్ధరాత్రి 3గం. చదివేవాడు. ఇదే అతని రోజూవారీ చర్యగా మారింది. నీట్లో ర్యాంకుతో రోహిత్ కుటుంబం ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. తనకు వచ్చిన ర్యాంకుకు.. సొంత రాష్ట్రంలోనే సీటు రావాలని ఆశలు పెట్టుకున్నాడతను. చివరగా.. వెళ్తూ వెళ్తూ ఫిజిక్స్ వాలా అలఖ్ పాండే ఆ కుర్రాడికి డాక్టర్ కోటును బహుకరించాడు. కాబోయే డాక్టర్‌గా ఆ వైట్ కోట్‌ను ధరించి మురిసిపోయిన ఫొటో, వీడియోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. View this post on Instagram A post shared by Physics Wallah (PW) (@physicswallah)ఇదిలా ఉంటే.. ఈ ఏడాది 22.09 లక్షల మంది నీట్ యూజీ పరీక్ష రాశారు. గతేడాదితో పోలిస్తే ఇది కొంచెం తక్కువే. ఫలితాల్లో.. ఈ ఏడాది రాజస్థాన్‌కు చెందిన మహేష్ కుమార్ 99.09999547 శాతంతో ఫస్ట్ ర్యాంక్ సాధించాడు. ఢిల్లీకి చెందిన అవికా అగర్వాల్ ఫిమేల్ టాపర్‌గా నిలిచింది. ఉత్తర ప్రదేశ్ నుంచి అత్యధికంగా లక్షా 70 వేల మంది అర్హత సాధించగా.. మహారాష్ట్ర, రాజస్థాన్ నుంచి అభ్యర్థులు తర్వాతి స్థానాల్లో నిలిచారు. -
ఎలాన్ మస్క్ కు ప్రధాని మోదీ ఫోన్
న్యూఢిల్లీ: టెస్లా, స్పేస్ఎక్స్ సంస్థల అధినేత, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ తో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం ఫోన్లో మాట్లాడారు. ఇండియన్ ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్లోకి త్వరలో టెస్లా అడుగుపెట్టబోతున్న నేపథ్యంతో వారిద్దరూ మాట్లాడుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. మస్క్, మోదీ పలు కీలక అంశాలపై చర్చించుకున్నట్లు సమాచారం. టెక్నాలజీ, ఇన్నోవేషన్ వంటి రంగాల్లో భారత్, అమెరికా మధ్య పరస్పర సహకార మరింత బలోపేతం కావాలని వారు ఆకాంక్షించారు. సాంకేతికత, నవీన ఆవిష్కరణల విషయంలో ఉమ్మడి ప్రయోజనాలు కాపాడుకొనేలా పటిష్ట వ్యూహంతో ముందుకెళ్లాలని ఉద్ఘాటించారు. మస్క్ తో సంభాషణ అనంతరం మోదీ ‘ఎక్స్’లో పోస్టుచేశారు. మస్క్ తో చక్కటి సంభాషణ జరిగిందన్నారు. వేర్వేరు అంశాలపై అభిప్రాయాలు పంచుకున్నామని తెలిపారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలో తాము కలిసినప్పుడు చర్చించుకున్న అంశాలు మరోసారి ప్రస్తావనకు వచ్చాయన్నారు. ప్రధానంగా టెక్నాలజీ, ఇన్నోవేషన్ పైనే తమ మాట్లాడుకున్నామని వివరించారు. ఈ రెండు అంశాల్లో అమెరికాతో భాగస్వామ్యాన్ని మరింత దృఢతరం చేసుకొనేందుకు కట్టుబడి ఉన్నామని మోదీ స్పష్టంచేశారు. మరోవైపు ఇండియన్ మార్కెట్లో ప్రవేశించానికి టెస్లా ఏర్పాట్లు చేసుకుంటోంది. తొలుత ముంబై, ఢిల్లీ, బెంగళూరులో టెస్లా కార్లు విక్రయించబోతున్నారు. వేలాది టెస్లా కార్లు ఇండియాను ముంచెత్తబోతున్నాయి. -
పెట్స్‌కు ఫోన్ చేయండి.. కుక్కల భాష తెలుసుకోండి!
పెంపుడు జంతువులపై ప్రేమతో వాటికి కావాల్సిన వస్తువులు, దుస్తులు, బొమ్మలు ఇలా చాలానే కొంటుంటారు. కాని, ఇప్పుడు ఆ జంతువులకు, వాటి యజమానులకు ఎంతగానో ఉపయోగపడే అత్యాధునిక గాడ్జెట్స్ మీ కోసం..పెట్ ఫోన్పెంపుడు జంతువులకు కూడా ఫోన్ చేసి మాట్లాడే వీలు కల్పిస్తుంది ఈ ‘పెట్ ఫోన్’. దీని ద్వారా మీ పెట్స్ ఎక్కడున్నా, ఎప్పుడైనా సరే వాటికి ఫోన్ చేసి టచ్‌లో ఉండొచ్చు. క్లౌడ్ సిమ్ టెక్నాలజీతో పనిచేసే ఈ ఫోన్ టూ వే కమ్యూనికేషన్ ఫీచర్‌తో పనిచేస్తుంది. ఇందులోని జీపీఎస్, రియల్ టైమ్ లొకేషన్ ట్రాకింగ్ సాయంతో సిగ్నల్ తక్కువ ఉన్న ప్రాంతాల్లోనూ వాటి లొకేషన్‌ను గుర్తించి సమాచారం ఇస్తుంది. ధర రూ. 32,411 మాత్రమే!పెంపుడుజీవాల ఆరోగ్యానికి రక్షణపెంపుడు జంతువుల అనారోగ్యం గుర్తించడంలో ఆలస్యం అయితే, వాటి ప్రాణాలకే ప్రమాదం. వాటి ఆరోగ్యం విషయంలో ఎంతగానో జాగ్రత్త తీసుకోవాలి. పెంపుడు జంతువుల హెల్త్ చెకప్ కోసం తయారు చేసినదే ఈ ‘విజ్డమ్ ప్యానెల్ ప్రీమియం’. ఇది డీఎన్ఏ పరీక్ష కిట్‌తో పాటు, వివిధ పరీక్షల ప్యాకేజింగ్‌తో వస్తుంది. ఈ పరీక్షలతో దాదాపు 211 జన్యు, ఇతర ఆరోగ్య పరిస్థితుల ఫలితాలు, వాటి వివరాలను తెలుసుకోవచ్చు. ధర వివిధ ప్యాకేజీలను బట్టి ఉంటుంది.శునక భాషను అనువదిస్తుంది..శునకాలు మూగజీవులైనప్పటికీ వాటికీ ఓ భాష ఉంటుంది. అవి కూడా మనతో మాట్లాడే ప్రయత్నం చేస్తుంటాయి. మనకే అర్థం కావు. తాజాగా అమెరికాకు చెందిన శాస్త్రవేత్తలు కుక్కల భాషను అర్థం చేసుకునేందుకు వీలుగా ఓ ప్రత్యేకమైన ‘పెట్ ట్రాన్స్‌లేటర్’ను అభివృద్ధి చేశారు. ఈ ప్రత్యేకమైన పరికరం కుక్కలు మొరిగే తీరు, అవి చేసే వివిధ శబ్దాల ఆధారంగా అవి చెప్పాలనకున్న విషయాన్ని మనకు తెలిసిన భాషలో వివరిస్తుంది. ధర 220 డాలర్లు. (రూ. 18,817) మాత్రమే!పాటీ క్లీనర్ ప్రేమగా పెంచుకున్నప్పటికీ పెంపుడు జంతువుల విసర్జనను శుభ్రం చేయడానికి ఇబ్బంది పడుతుంటారు కొందరు. అయితే, ‘ఐ రోబో రోంబా జే7’ వాక్యూమ్ ఈ పనిని చాలా చక్కగా చేస్తుంది. సాధారణ రోబో వ్యాక్యూమ్స్ పాటీలను గుర్తించలేవు. కాబట్టి, వాటిని సరిగ్గా శుభ్రం చేయలేవు. కాని, ఈ రోంబా జే7 పెట్ పాటీలను గుర్తించి ప్రత్యేకంగా వాటిని శుభ్రం చేస్తుంది. ధర 799 డాలర్లు (రూ. 68,322). ఆన్లైన్లో కొనుగోలు చేసే వీలుంది. -
కాలం చెల్లిన చైనా ‘చేప కథ’
ఏ శాస్త్రంలోని నూతన ఆవిష్కరణ అయినా సామాజిక శాస్త్ర పర్యావరణ గీటురాయి మీద దాని మానవీయ విలువను నిర్ధారించుకోక తప్పదు. 2004 డిసెంబర్లో ‘ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ’ (ఐసీటీ) మన బడుల్లో పాఠంగా మొదలయింది. అది మొదలు గత రెండు దశాబ్దాలలో దానికి మొలకెత్తిన చిలవలు పలవలు... ఊడలు దిగిన మ్రానులైన పరిస్థితుల్లో, మన మానసిక వైఖరులు మన మానవీయ విలువలను ఎలా ప్రభావితం చేస్తున్నాయి? అన్నప్పుడు కొంచెం తేడాతో అందరం అందులో మునకలు వేయడం అయితే నిజం. మనకంటే ముందే ఈ అనుభవమున్న సంపన్న దేశాల్లో దీని పర్యవసానాలపై అధ్యయనం మొదలయింది కనుక ఈ ప్రపంచీకరణ కాలంలో ఆ కొలమానాలు మనమూ వాడుకోవచ్చు. గత పదేళ్ళలో పెరిగిన ‘సోషల్ మీడియా’ మన మీద పెంచుతున్న ఒత్తిడితో ఏర్పడిన ‘ఇన్ఫర్మేషన్ ఎకో సిస్టం’లో ఇప్పుడు మనం ఉన్నాం. అదొక నూతన పర్యావరణంగా మారి, మన ఆలోచనలు అభిప్రాయాలు అందుకు అనుగుణంగా మార్చుతూ, మూడు రంగాలలో మన జీవితాల్ని అది ప్రభావితం చేస్తున్న దని ఫిబ్రవరి 2023లో ఎవాన్ కుహెన్ ఒక వెబ్‌సైట్‌కు రాసిన ‘వాట్ ఈజ్ ఇన్ఫర్మేషన్ ఎకో సిస్టం?’ వ్యాసంలో అంటారు. గుర్తించిన ఆ మూడింటిలో ‘సివిల్ సొసైటీ’ (పౌరసమాజం) ఒకటి. ఈ పరిశీలన వెలుగులో కొత్త రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ ‘పౌర సమాజం’ సంగతి ఏమిటి? మన పండితులు పామ రుల అభిప్రాయాలపై ఎటువంటి ‘సమాచార’ పర్యా వరణ ప్రభావం ఉంది. ప్రభావశీలురైన ముగ్గురు ప్రముఖులు 2025 ఫిబ్రవరిలో వెలుబుచ్చిన అభిప్రా యాలలో నుంచి వాటిపై ‘సమాచార పర్యావరణ’ ప్రభావం ఏ మేర ఉందో చూద్దాం. ఫిబ్రవరి మొదటివారంలో ప్రభుత్వ కార్యదర్శులతో ఏర్పాటుచేసిన ఒక సమీక్ష సమావేశంలో ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ – ‘‘మీరు ఫిర్యాదుల పరిష్కారం మొదటి ప్రాధాన్యతగా చూడాలి, రెవెన్యూశాఖ నుంచి భూ కబ్జాలు వల్ల లా అండ్ ఆర్డర్ సమస్యలు తలెత్తుతున్నాయి. డాక్యుమెంట్స్ ఫోర్జరీ ఎక్కువ అయిపోయింది... వీటిని మీరు ఎలా పరిష్కరిస్తారు అనేది మీకే వదిలి పెడుతున్నాను’’ అన్నారు. ఇది విన్నాక ఈ ధోరణి మూలాలు ఎక్కడ ఎందుకు మొదలయింది వెతికితే, రాజధాని హైదరాబాద్ నుంచి విజయవాడకు మారిన 2015 తర్వాత నుంచి రాజకీయం అంటేనే ‘భూమి విలువ’ అన్నట్టుగా మారింది. ‘‘అమరావతిలో అన్నీ పోను ఎనిమిది వేల ఎకరాలు మిగులుతాయి, ఎకరం 20 కోట్లు చొప్పున అమ్మితే 160 కోట్లు వస్తాయి...’’ తరహా మాటలు అధికార కేంద్రాల నుంచి వస్తే, ‘సోషల్ మీడియా’ దానికి విస్తృత ప్రచారం ఇచ్చింది. ఇప్పుడు తెనాలి ప్రాంతానికి చెందిన ఏ.పి. ‘ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెవలప్మెంట్ స్టడీస్’ చైర్మన్ ప్రొఫెసర్ ఎస్. మహేంద్ర దేవ్ కూడా విశాఖలో– ‘‘కొత్త రాష్ట్రానికి అమరావతి వంటి ‘గ్రీన్ ఫీల్డ్ కేపిటల్’ ఉండడం అవసరం’’ అంటూ పనిలో పనిగా –‘‘ఉచితాలు అనుచితం’’ అని కూడా అనేశారు. పోనీ అది నిజమనుకుందాం. మరి వారే ‘‘బాపట్ల సమీపాన 20 ఏళ్ళనాడు ఆగిపోయిన ‘వాన్ పిక్’ ఈ పదేళ్లలో పూర్తి అయివుంటే, ‘ఉచితాలు’ తీసుకునేవారు అవి మాని అక్కడే ఏదో ఒక ‘లేబర్’ పని చేసుకుని బతికేవారు’’ అని కూడా అనొచ్చు కదా? చివరికి ఏమైంది గత పదేళ్ళలో ‘రాజధాని’ చుట్టూ ‘సోషల్ మీడియా’ వ్యాప్తి చేసిన ‘ఇన్ఫర్మేషన్ ఎకో సిస్టం’ కింద నలిగి కేంద్ర హోంశాఖ నియమించిన శివరామకృష్ణన్ కమిషన్ నిపుణుల అభిప్రాయాలు ఇటువంటి ప్రకట నల కింద సమాధి అయ్యాయి.రిజర్వ్ బ్యాంకు మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బా రావు కూడా ఇదే విశాఖ నుంచి ఉచితాలు గురించి – ‘ఫ్రీబీస్’ ఎందుకు? అంటూ ఎప్పుడో పాతదైన ‘చైనా వారి చేప’ కథ చెప్పారు. అది చైనాలో నిజమేమో. ఇక్కడ ‘చేపలు’ పట్టడం నేర్పడం కోసం పెట్టిన ‘స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం’ ఏమైందో చూశాం. అయినా – ‘ఫ్రీబీస్’ ఎందుకు? అంటే, ఈ ‘ఉచితాలు’ పొందే వారు కూడా ఏమంత సంతోషంగా ఏమీ లేరు. కారణం కళ్ళముందు సంపన్న వర్గాల వద్దకు చేరుతున్న సంపద, వారి విజయగాథలు, వైభవంగా జరిగే వారి పెళ్ళిళ్ళు, ఫ్యామిలీ ఫంక్షన్స్... వాటి గురించి ‘సోషల్ మీడియా’ కథలుగా చెబుతుంటే వింటూ, తమకు అందే అరకొరను వాళ్ళు తూకం వేస్తున్నారు. అధికార కేంద్రాలకు దగ్గరయితే, అక్రమ ఆదాయ వనరులు ఎలా పెరుగుతాయో ‘సోషల్ మీడియా’ వారికి నిత్యం కళ్ళకు కట్టిస్తున్నది.విషయం ఏమంటే, ప్రభుత్వ పరిపాలనలోకి ‘టెక్నాలజీ’ వచ్చాక, అవినీతికి చిల్లులున్న చీకటి మార్గాలు మూతపడి అదాయ వనరులకు గండి పడితే, ప్రత్యామ్నాయాన్ని ప్రకృతి వనరుల్లో వెతు క్కుంటున్నారు. అభివృద్ధి మారుమూల గ్రామాలకు ప్రవేశిస్తుంటే, బయటకు వెళుతున్న మట్టి, కంకర చూస్తున్నదే. వాటి వివరాలు ‘సోషల్ మీడియా’ 24 గంటలూ జనానికి చూపిస్తున్నది. ఈ అక్రమ లావా దేవీల చిట్టా సామాన్యుడికి అరచేతిలో ‘ఫోన్’లో దొరుకుతుంటే, ప్రభుత్వం అరాకొరా ఉచితంగా ఇచ్చే రొట్టె ముక్కను ఇవ్వాలా వద్దా? అంటూ మళ్ళీ అదే పాత చర్చ అంటే, వారి వద్ద పాండిత్యం పరిహాసం అవుతుందేమో!జాన్సన్ చోరగుడి వ్యాసకర్త అభివృద్ధి – సామాజిక అంశాల వ్యాఖ్యాత -
Uttarakhand: మంచు చరియల కిందే ఇంకా 8 మంది
ఉత్తరాఖండ్: పర్వత రాష్ట్రం ఉత్తరాఖండ్(Uttarakhand)లో భారీగా కురుస్తున్న హిమపాతం భయానక వాతావరణాన్ని సృష్టిస్తోంది. బద్రీనాథ్‌లోని మానా గ్రామం సమీపంలో సరిహద్దు రోడ్డు సంస్థ (బీఆర్ఓ) శిబిరంపై మంచు చరియలు విరిగిపడటంతో 55 మంది కార్మికులు మంచులో కూరుకుపోయారు. ఈ ఘటన శుక్రవారం ఉదయం సంభవించింది. ఈ దరిమిలా భారత సైన్యం, రెస్క్యూ ఆపరేషన్ బృందాలు సహాయక చర్యలు ప్రారంభించాయి. రెస్క్యూ సిబ్బంది మంచు పెళ్లల నుంచి 47 మందిని సురక్షితంగా వెలికి తీసుకువచ్చారు. మరో ఎనిమిదిమందిని బయటకు తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.రెండవ రోజున సహాయక చర్యలు తిరిగి ప్రారంభించిన భారత సైన్యం(Indian Army) మంచులో కూరుకుపోయిన మరో 14 మంది సిబ్బందిని రక్షించింది. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండటంతో వారికి వైద్య చికిత్స అందించేందుకు హెలికాప్టర్ల ద్వారా జోషిమఠ్‌కు తరలించామని అధికారులు తెలిపారు. ఇంకా మంచులోనే కూరుకుపోయిన సిబ్బందిని బయటకు తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. నిన్న(శుక్రవారం) రాత్రి చీకటి పడ్డాక సహాయక చర్యలను నిలిపివేశారు.హిమపాత మరింతగా పెరగడంతో మంచులో కూరుకుపోయిన కార్మికులను కనుగొనడం రెస్క్యూ సిబ్బంది(Rescue crew)కి సవాలుగా మారింది. మొదటి రోజున రెస్క్యూ బృందాలు 33 మంది కార్మికులను రక్షించగలిగాయి. ఈ ప్రాంతంలో ఏడు అడుగుల మేరకు మంచు పేరుకుపోవడంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతున్నదని ఉత్తరాఖండ్ విపత్తు నిర్వహణ కార్యదర్శి వినోద్ కుమార్ సుమన్ తెలిపారు. ఇండో-టిబెట్ సరిహద్దులోని చివరి గ్రామమైన మానా వద్ద మంచును తొలగించే పనిలో నిమగ్నమైన 55 మంది కార్మికులు మంచులో కూరుకుపోయారు.సీఎంతో మాట్లాడిన ప్రధాని మోదీ ఉత్తరాఖండ్ మంచు చరియల్లో చిక్కుకున్న కార్మికులను రక్షించేందుకు సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. సంఘటన స్థలానికి చేరుకున్న ముఖ్యమంత్రి పుష్కర్ ధామి పరిస్థితులను సమీక్షిస్తున్నారు. తాజాగా ఘటనా స్థలంలో కొనసాగుతున్న పనుల గురించి తెలుసుకునేందుకు సీఎం దామికి ప్రధాని మోదీ ఫోన్ చేశారు. సహాయక చర్యలను వేగవంతం చేయాలని ఆదేశించారు.ఇది కూడా చదవండి: తప్పుడు స్పెల్లింగ్‌తో పట్టాలు.. లక్షల విద్యార్థులు లబోదిబో -
మా పెళ్లిని సింపుల్‌గా చేసుకోవడానికి కారణం అదే: రకుల్ ప్రీత్ సింగ్
టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ గతేడాది వివాహాబంధంలోకి అడుగుపెట్టింది. తన ప్రియుడు, నిర్మాత అయిన జాకీ భగ్నానీని పెళ్లాడింది ముద్దుగుమ్మ. గతేడాది ఫిబ్రవరి 2024లో గోవాలో ఓ ప్రైవేట్ వేడుకలో వీరి పెళ్లి వేడుక జరిగింది. ఈ గ్రాండ్ వెడ్డింగ్‌లో సన్నిహితులు, కుటుంబ సభ్యులు, స్నేహితులు పాల్గొన్నారు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన రకుల్ ప్రీత్ సింగ్ ఆసక్తికర విషయాలు పంచుకుంది. ముఖ్యంగా తన పెళ్లికి సంబంధించిన మధురమైన జ్ఞాపకాలను షేర్ చేసుకుంది. మీ పెళ్లిని ఎందుకు ప్రైవేట్‌గా ఉంచారన్న ప్రశ్నపై రకుల్ స్పందించింది.రకుల్ ప్రీత్ సింగ్ మాట్లాడుతూ..'మేము ఎల్లప్పుడూ చాలా సింపుల్‌గా ఉండాలని కోరుకుంటా. మేము సౌకర్యంగానే ఉండటానికి ఇష్టపడతాం.. కానీ ఎక్కువ లగ్జరీగా ఉండాలని ఎప్పుడూ కోరుకోలేదు. అన్నిటికంటే ఎక్కువగా ఆ మధురమైన క్షణాలు, సంతోషంగా ఉండేందుకే ఎక్కువ విలువ ఇస్తాం. అందుకే మా పెళ్లిని అతిథులతో కలిసి ఆస్వాదించాలనుకున్నాం. ఆ మూడు రోజులు మా జీవితంలో గుర్తుండిపోవాలని ఆశించాం. అందువల్లే నో-ఫోన్ పాలసీ పెట్టాం. అంతే తప్ప ఫోటోలు లీక్ చేస్తారని కాదు. మా పెళ్లి చిత్రాలను మేమే మొదట బయట పెట్టాలకున్నాం. అలాగే పెళ్లిలో డ్యాన్స్ చేస్తూ ఎంజాయ్ చేశాం. నా పెళ్లి దుస్తుల్లో కూడా డ్యాన్స్ చేశాను.' అని తెలిపింది. కాగా.. రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం మేరే హస్బెండ్ కి బివి చిత్రంలో కనిపించనుంది. ఈ చిత్రంలో అర్జున్ కపూర్, భూమి పెడ్నేకర్ నటించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఫిబ్రవరి 22న విడుదల కానుంది. -
ఫోన్ సరిగ్గా ఛార్జింగ్ పెట్టడం తెలుసా..?
స్మార్ట్‌ఫోన్‌ను సరిగ్గా ఛార్జింగ్ చేయడం తెలుసా అంటే మీరేంమంటారు.. ‘ఇదేం ప్రశ్న..? సాధారణంగా ఛార్జింగ్ కేబుల్‌తో ఛార్జ్ పెడితే సరి’ అనుకుంటారు కదా. కానీ సరైన సమయంలో, సరైన విధంగా స్మార్ట్‌ఫోన్‌కు ఛార్జింగ్ పెట్టకపోతే బ్యాటరీ పాడయ్యే అవకాశం ఉన్నట్లు నిపుణులు హెచ్చరిస్తున్నారు. అసలు ఫోన్‌కు ఛార్జింగ్ పెడుతున్నప్పుడు ఎలాంటి అంశాలు గమనించాలో తెలుసుకుందాం.ఇతర ఛార్జర్లను ఉపయోగించడంప్రతిఫోన్కు ప్రత్యేకంగా కంపెనీ ఛార్జర్ తయారు చేస్తుంది. ప్రతిసారి ఆ ఛార్జర్‌తోనే ఛార్జ్ చేయాలి. లేదంటే ఫోన్ పాడవుతుంది. పొంతన లేని ఛార్జర్లు కరెంట్ వోల్టేజ్‌ను కొన్నిసార్లు అధికంగా, ఇంకొన్నిసార్లు తక్కువగా సరఫరా చేస్తాయి. ఇది బ్యాటరీని దెబ్బతీస్తుంది. కాబట్టి సర్టిఫైడ్ ఛార్జర్లను వినియోగించాలి.రాత్రంతా ఛార్జింగ్చాలామందికి లేట్‌నైట్ వరకు ఫోన్ ఉపయోగించి ఛార్జ్ చేసి పడుకోవడం అలవాటు. రాత్రంతా కరెంట్ సరఫరా అవ్వడంతో ఓవర్ ఛార్జింగ్ అవుతుంది. దాంతో బ్యాటరీ బల్జ్ అయ్యేందుకు దారితీస్తుంది.ఛార్జింగ్ చేస్తూ ఫోన్ వాడడంఛార్జింగ్ చేసినప్పుడు ఎట్టిపరిస్థితిలో ఫోన్ వాడకూడదు. తప్పని పరిస్థితిలో వాడాల్సి వస్తే ఛార్జింగ్ రిమూవ్ చేసి వాడుకోవాలి. ఇది చాలా సాధారణ విషయంగా కనిపించినా ఏదైనా ప్రమాదం జరిగితే మాత్రం ఇబ్బంది పడాల్సి ఉంటుందని గుర్తుంచుకోవాలి.సాఫ్ట్వేర్ అప్డేట్లను విస్మరించడంఆపరేటింగ్ సిస్టమ్ సర్వీసు అందిస్తున్న కంపెనీలు, మొబైల్ తయారీ కంపెనీ నిత్యం వాటి సాఫ్ట్‌వేర్‌లో అప్డేట్లను అందిస్తాయి. క్రమం తప్పకుండా వాటిని అప్డేట్ చేసుకోవాలి. బ్యాటరీ, ఛార్జింగ్ సమస్యలకు సంబంధించిన అప్డేట్లను కంపెనీ అందిస్తే వెంటనే సమస్యలు పరిష్కారం అవుతాయి.0% నుంచి 100% వరకుఫోన్ వాడుతున్నప్పుడు మొత్తం ఛార్జింగ్ అయిపోయేంత వరకు చూడకుండా సుమారు 40 శాతం బ్యాటరీ ఉన్నప్పుడే ఛార్జ్ పెట్టాలి. తరచుగా 0% నుంచి 100% వరకు ఛార్జింగ్ చేయడం వల్ల బ్యాటరీపై అనవసరమైన ఒత్తిడి పడుతుంది.చలి, వేడికి దగ్గరగా..విపరీతమైన వేడి, చలి రెండూ ఫోన్ బ్యాటరీని ప్రతికూలంగా ప్రభావితం చేస్తాయి. ఫోన్‌ను నేరుగా వేడి ప్రదేశంలో ఛార్జ్ చేయడం లేదా ఎండలో వదిలివేయడం చేయకూడదు. అదేవిధంగా, చాలా చల్లని వాతావరణంలో ఛార్జింగ్ చేయడం కూడా బ్యాటరీకి హాని కలిగిస్తుంది.దెబ్బతిన్న కేబుల్‌తో ఛార్జింగ్పగిలిన లేదా దెబ్బతిన్న, అతుకులున్న ఛార్జింగ్ కేబుల్స్ వాడకూడదు. ఇవి అస్థిరమైన ఛార్జింగ్, షార్ట్ సర్క్యూట్లకు కారణమవుతాయి. కొన్నిసార్లు అగ్ని ప్రమాదాన్ని కలిగిస్తాయి.ఇదీ చదవండి: టెల్కోల ఆశలన్నీ ప్రభుత్వం పైనే!ఛార్జింగ్ పోర్ట్‌ను శుభ్రం చేయకపోవడంఫోన్ ఛార్జింగ్ పోర్ట్‌లో దుమ్ము పేరుకుపోతూంటుంది. ఇది పేలవమైన కనెక్షన్, ఛార్జింగ్ సమస్యలకు దారితీస్తుంది. మృదువైన బ్రష్ లేదా కంప్రెస్డ్ ఎయిర్ ఉపయోగించి పోర్ట్‌ను క్రమం తప్పకుండా శుభ్రం చేయాలి. -
ఫోన్ కట్ చేసిన పవన్! నేను మాట్లాడను
-
వాట్సాప్‌లో మునిగిపోవడం వల్లే ఘోరం!
తిరువనంతపురం: కేరళ కన్నూరు స్కూల్ బస్సు ప్రమాదం ఘటనలో విస్తుపోయే విషయం ఒకటి వెలుగులోకి వచ్చింది. సరిగ్గా ప్రమాదం జరిగిన సమయంలోనే.. డ్రైవర్ ఫోన్ నుంచి వాట్సాప్ స్టేటస్ అప్లోడ్ అయ్యి ఉంది. దీంతో డ్రైవర్ ఫోన్లో మునిగిపోవడం వల్లే ప్రమాదం జరిగి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు.కన్నూరు జిల్లా వలక్కై శ్రీస్కంధపురం వద్ద బుధవారం సాయంత్రం ఘోర ప్రమాదం జరిగింది. ప్రైవేట్ స్కూల్‌కు చెందిన బస్సు ఒకటి బోల్తాపడడంతో ఓ చిన్నారి మృతి చెందగా, 15 మందికి గాయాలయ్యాయి. ప్రమాదం ధాటికి బస్సు కిటీకిలోంచి చిన్నారి బయట ఎగిరిపడగా.. ఆ వెంటనే బస్సు ఆమె మీద పడడంతో చిధ్రమయ్యింది. కలవరపరిచే ఆ దృశ్యాలు సోషల్ మీడియాకు చేరాయి.#Kerala : A tragic accident occurred in Valakkai, Sreekantapuram, #Kannur, when a school bus belonging to Chinmaya School overturned, claiming the life of an 11-year-old student and injuring 13 others.The deceased, Nedya S Rajesh, a Class 5 student, lost her life after falling… pic.twitter.com/csNHtZAiv3— South First (@TheSouthfirst) January 1, 2025అయితే నిర్లక్ష్యపూరిత డ్రైవింగ్ వాదనను డ్రైవర్ నిజాం తోసిపుచ్చాడు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అతను.. తాను బస్సు నడుపుతూ ఫోన్ వాడలేదని.. ఎలాంటి వాట్సాప్ స్టేటస్(Whatsapp Status) అప్లోడ్ చేయలేదని.. బహుశా ఫోన్ టచ్ అయ్యి అలా జరిగి ఉంటుందని చెబుతున్నాడు. అంతేకాదు బస్సు బ్రేకులు పడకపోవం వల్లే యాక్సిడెంట్ జరిగిందని అంటున్నాడతను. అయితే.. యాక్సిడెంట్ టైంకే డ్రైవర్ వాట్సాప్ స్టేటస్ అప్లోడ్ అయిన విషయాన్ని స్థానిక చానెల్స్ ప్రముఖంగా ప్రసారం చేస్తున్నాయి.ఇక బస్సును పరిశీలించిన మోటార్ వెహికిల్స్ డిపార్ట్మెంట్ అధికారులు ఆ డ్రైవర్ వాదనను కొట్టిపాస్తున్నారు. బ్రేకులు కండిషన్లోనే ఉన్నాయని చెబుతున్నారు. అలాగే బస్సు ఫిట్నెస్ సర్టిఫికెట్ కిందటి నెల డిసెంబర్ 29తో ముగియగా.. తిరిగి ఈ ఏడాది ఏప్రిల్ దాకా రెన్యువల్ అయినట్లు తెలిపారు. డ్రైవర్ నిర్లక్ష్యం(Driver Negligence) వల్లే ఈ ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా నిర్ధారించారు. మరోవైపు..స్థానికులు మాత్రం సర్వీస్ రోడ్డు నుంచి మెయిన్ రోడ్డుకు వెళ్లే ప్రమాదకరమైన మలుపు కారణంగానే ఈ ఘోరం జరిగిందని, తరచూ ఇక్కడ పలు ప్రమాదాలు జరుగుతున్నాయని చెబుతుండడం గమనార్హం.అప్పటికే ఆలస్యమైంది..శ్రీస్కంధపురం స్కూల్ బస్సు ప్రమాదం(School Bus Accident)లో చనిపోయిన స్టూడెంట్ను ఐదో తరగతి చదువుతున్న నెద్యా రాజేష్(11)గా గుర్తించారు. ప్రమాదం జరిగిన తర్వాత అక్కడికి చేరుకున్న స్థానికులు పిల్లలను బయటికి తీసుకొచ్చి ఆస్పత్రికి తరలించారు. అయితే.. బస్సు కింద నలిగిపోయిన నెద్యాను మాత్రం కాస్త ఆలస్యంగా గుర్తించినట్లు చెబుతున్నారు వాళ్లు.‘‘పెద్ద శబ్దం రాగానే ఇక్కడున్న కొందరం పరిగెత్తాం. బోల్తా పడ్డ బస్సులోంచి పిల్లల రోదనలు వినిపించాయి. వాళ్లను బయటకు తీసి నీళ్లు తాగించాం. డ్రైవర్ సహా పిల్లల్లో కొందరికి గట్టి దెబ్బలే తగలడంతో వెంటనే ఆస్పత్రికి తరలించాం. కానీ, ఓ అమ్మాయి బస్సు కిందే ఉందన్న విషయం కాసేపటికి తెలిసింది. ఆమెను బయటకు తీసేసరికి బాగా రక్తం పోయి స్పృహ లేకుండా ఉంది. ఆస్పత్రికి తరలించినా లాభం లేకపోయింది’’ అని స్థానికుడొకరు తెలిపారు. ప్రస్తుతం ఆస్పత్రిలో 15 మందికి చికిత్స అందుతుండగా.. ఓ చిన్నారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. -
పీఎస్‌కు వచ్చిన వివాహితను ట్రాప్ చేసిన సీఐ.. ప్లాట్ కొనిస్తా అంటూ..
నల్లగొండ క్రైం: తన భార్యతో నల్లగొండ పట్టణ టూటౌన్ సీఐ డానియల్ వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని ఓ వ్యక్తి ఎస్పీ శరత్చంద్ర పవార్‌కు శనివారం ఫిర్యాదు చేశాడు. సదరు సీఐ తన భార్యతో కాపురం చేయనీయకుండా మనోవేధనకు గురి చేస్తున్నారని ఆరోపించారు. ఫిర్యాదు విషయాన్ని బాధితుడు విలేకరులకు తెలిపాడు. వివరాల ప్రకారం.. నల్లగొండ పట్టణానికి చెందిన దంపతులు వారి సొంత ఇంటిని విక్రయించుకున్నారు. దానికి సంబంధించిన దస్తావేజులు తీసుకునేందుకు పట్టణంలో ఓ బ్యాంకు వెళ్లారు. ఆ తర్వాత భార్య పట్టణంలోని టూటౌన్ సీఐ వద్దకు వెళ్లి తనపై పలు ఆరోపణలతో ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో సీఐ డానియల్ ఆమెతో చనువు పెంచుకుని తన భార్యకు తరచూ ఫోన్, చాటింగ్ చేస్తూ.. వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని బాధితుడు తెలిపాడు. తనను పదేపదే స్టేషన్‌కు పిలిపించి బెదిరించారని.. ఊళ్లో ఉన్న పొలం అమ్ముకుని వస్తే కేసులు తీసివేస్తామని, భార్యతో విడాకులు ఇప్పిస్తానని వేధించాడని పేర్కొన్నాడు.తన భార్యకు ప్లాటు కొనిస్తానని, డబ్బులు ఇస్తానని నమ్మబలికి లోబరుచుకున్నాడని ఆరోపించాడు. తన భార్య సెల్‌ఫోన్ తనిఖీ చేయగా సీఐతో చాటింగ్‌లు చేసిన విషయం తెలిసిందని.. ఈ చాటింగ్ తదితర ఆధారాలతో ఎస్పీకి ఫిర్యాదు చేశానని బాధితుడు తెలిపాడు. తన భార్య, సీఐతో తనకు ప్రాణహాని ఉందని పేర్కొన్నాడు. కాగా.. ఈ ఘటనపై సీఐ డానియల్ స్పందిస్తూ తనపై చేసిన ఫిర్యాదులో వాస్తవం లేదని తెలిపారు. భార్యాభర్తల మధ్య విభేదాల కారణంగా తనపై నిందలు వేస్తున్నారని పేర్కొన్నారు.ఫిర్యాదుపై విచారణ చేస్తున్నాం– ఎస్పీ శరత్చంద్ర పవార్సీఐపై వచ్చిన ఫిర్యాదుపై నల్లగొండ డీఎస్పీ విచారణ చేస్తున్నారని, ఫోన్ చాటింగ్ పరిశీలిస్తున్నామని ఎస్పీ శరత్చంద్ర పవార్ తెలిపారు. డీఎస్పీ నివేదిక ఆధారంగా సీఐపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. -
చెత్తకుప్పలో దొరికిన ఆ సెల్‌ఫోన్ ఎవరిది?
నేలకొండపల్లి: నేలకొండపల్లిలో గత మంగళవారం రాత్రి దంపతులు ఎర్రా వెంకటరమణ – కృష్ణకుమారి హత్యకు గురైన ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపగా.. ప్రత్యేక పోలీసు బృందాల విచారణ కొనసాగుతోంది. అయితే, ఇప్పటివరకు మిస్టరీ వీడకపోగా శుక్రవారం కీలక ఆధారంగా భావిస్తున్న సెల్‌ఫోన్ పోలీసుల చేతికి చిక్కినట్లు సమాచారం. ఈ ఫోన్ కాల్ డేటాతో పాటు ఫోన్ లభించిన ప్రాంతానికి సమీపాన ఉన్న షాపు నుంచి సీసీ కెమెరాల పుటేజీ సేకరించడంతో దర్యాప్తులో అడుగు ముందుకు పడినట్లు భావిస్తున్నారు.చెత్త కుప్పలో ఫోన్నేలకొండపల్లిలో పెట్రోల్ బంక్ ఎదురుగా గ్రామపంచాయతీ స్వీపర్ శుక్రవారం ఉదయం చెత్త తొలగిస్తుండగా ఓ చోట సెల్‌ఫోన్ లభించింది. దీంతో ఆమె స్థానిక పోలీసులకు అప్పగించింది. ఈ విషయం తెలియగానే ప్రత్యేక బృందాలు సైతం సదరు స్వీపర్ ఇంటికి సైతం వెళ్లి విచారించారు. అంతేకాక సెల్‌ఫోన్ దొరికిన ప్రాంతంలో ఓ దుకాణం నుంచి సీసీ కెమెరాల పుటేజీ కూడా స్వాధీనం చేసుకున్నారు. ఆ ఫోన్ నిందితులు పారిపోయే క్రమంలో కింద పడిందా, లేక మృతుల ఫోన్‌ను తీసుకెళ్లే క్రమాన వదిలేశారా అనే విషయాన్ని పోలీసులు గుర్తించినట్లు తెలుస్తుండగా స్పష్టత ఇవ్వడం లేదు. హంతకుల ఫోన్ అయితే హత్య జరిగిన రోజే లభించేదని, రెండు రోజుల తర్వాత దొరకడంతో నిందితులు మళ్లీ ఇక్కడకు వచ్చి, వెళ్లారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈనేపథ్యాన సెల్‌ఫోన్ కాల్‌డేటా, సీపీ కెమెరాల పుటేజీ ఆధారంగా దర్యాప్తులో వేగం పెంచినట్లు పోలీసువర్గాల ద్వారా తెలిసింది. ఖమ్మం రూరల్ ఏసీపీ తిరుపతిరెడ్డి, కూసుమంచి సీఐ సంజీవ్‌తో పాటు వివిధ పోలీస్స్టేషన్ల ఎస్సైలు శుక్రవారం సైతం మండల కేంద్రంలో పర్యటించి పలువురు అనుమానితులను విచారించినట్లు సమాచారం. ఈ విషయమై పోలీసులను వివరణ కోరగా సెల్‌ఫోన్ దొరికిన మాట వాస్తవమేనని చెప్పినా ఇతర వివరాలు వెల్లడించేందుకు మాత్రం నిరాకరించారు. -
ఒళ్లో వేసుకుంటే ఫోన్ ఛార్జింగ్!
ఫోన్ ఛార్జింగ్ అయిపోయిందంటే ఛార్జర్ కోసం వెతకాల్సిన పనిలేదు. అదేంటి ఛార్జర్ లేకుండా ఫోన్ ఎలా ఛార్జ్ అవుతుందనేగా మీ అనుమానం.. సింపుల్.. ఫోన్‌ను మీ ఒళ్లో పెట్టుకోండి. వెంటనే ఛార్జింగ్ అవుతుంది. అవునండి.. మీరు విన్నది నిజమే. ఇదో కొత్తరకం టెక్నాలజీ. థెర్మో ఎలక్ట్రిక్ టెక్స్టైల్స్ అనే టెక్నాలజీతో ఇది సాధ్యమేనని శాస్త్రవేత్తలు తెలియజేశారు. ఈమేరకు స్వీడన్‌లోని ఛామర్స్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీకి చెందిన పరిశోధకులు ఈ విషయాన్ని నిరూపించారు.థెర్మో ఎలక్ట్రిక్ టెక్స్టైల్స్ సాంకేతిక ద్వారా మనం ధరించే దుస్తుల్లోని సిల్క్ దారాలను ఉపయోగించి విద్యుత్తును తయారు చేస్తున్నారు. ఆ సిల్క్ దారాలకు కండక్టివ్ ప్లాస్టిక్ అనే లోహాన్ని పూయడం ద్వారా బ్యాటరీ లేకుండానే విద్యుత్తుని ఉత్పత్తి చేయొచ్చని నిరూపించారు. ఈ టెక్నాలజీ ద్వారా బయటి వాతావరణం, శరీర ఉష్ణోగ్రత వ్యత్యాసాల నుంచి విద్యుత్తును ఉత్పత్తి చేయవచ్చని శాస్త్రవేత్తలు చెప్పారు. ఈ టెక్నాలజీను విభిన్న పరిస్థితుల్లో పరీక్షించి, మరింత మెరుగ్గా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు.ఉపయోగాలెన్నో..సంప్రదాయ బ్యాటరీలు లేకుండా చిన్న ఎలక్ట్రానిక్ పరికరాలు, బ్యాటరీ అవసరంలేని సెన్సార్ల వంటి వాటికి ఈ సాంకేతికతతో విద్యుత్‌ను సరఫరా చేయవచ్చని చెబుతున్నారు. కొన్ని సంస్థలు వినియోగదారుల హృదయ స్పందనలను ట్రాక్ చేయడానికి, ఆరోగ్య కొలమానాలను పర్యవేక్షించడానికి టెక్స్టైల్ సెన్సార్లను అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. వాటికి ఈ థెర్మో ఎలక్ట్రిక్ టెక్స్టైల్స్ ద్వారా ఎనర్జీని అందించవచ్చు. అత్యవసర పరిస్థితుల్లో ఆర్మీ ఉద్యోగులకూ, విద్యుత్ సదుపాయం లేని ప్రాంతాల్లో ఉండేవారికీ ఉపయోగపడేలా ఈ దుస్తుల్ని రూపొందిస్తున్నారు.ఇదీ చదవండి: క్షీణిస్తున్న ఫారెక్స్ నిల్వలు.. కారణాలుఏ ప్రమాదం లేదు..అసలే కరెంటుతో వ్యవహారం.. అలాంటిది మనం ఎలక్ట్రిక్ టెక్స్టైల్స్ ధరించొచ్చా అనే సందేహం అవసరం లేదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వీటితో మానవులకు ఎలాంటి హాని ఉండదంటున్నారు. ఈ ప్రక్రియతో ఎలక్ట్రానిక్ వ్యర్థాలను సైతం తగ్గించవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. -
అమెరికా వ్యాప్తంగా... జాత్యహంకార మెసేజ్‌లు
వాషింగ్టన్: జాత్యాహంకార సందేశాలు అమెరికాలో ఆందోళన రేపుతున్నాయి. మిడిల్ స్కూల్ విద్యార్థులతో పాటు నల్లజాతీయులనే లక్ష్యంగా చేసుకుని బెదిరింపు ఫోన్ సందేశాలు వెల్లువెత్తుతున్నాయి. న్యూయార్క్, అలబామా, కాలిఫోర్నియా, ఒహాయో, పెన్సిల్వేనియా, టెనెసీ వంటి పలు రాష్ట్రాల్లో ఈ ఉదంతాలపై కేసులు నమోదయ్యాయి. సందేశాల్లో వాడిన పదాలు భిన్నంగా ఉన్నా బెదిరింపులు మాత్రం ఒకేలా ఉన్నాయని బాధితులు చెబుతున్నారు. కొందరిని స్వస్థలం చిరునామా చెప్పాలంటూ బెదిరించగా మరికొందరిని రాబోయే అధ్యక్ష పాలన గురించి హెచ్చరించారు. ఈ సందేశాలపై న్యాయ శాఖతో సంప్రదింపులు జరుపుతున్నట్టు ఎఫ్‌బీఐ తెలిపింది. ఫెడరల్ కమ్యూనికేషన్స్ కమిషన్, ఫెడరల్, స్టేట్ లా ఎన్ఫోర్స్మెంట్తో కలిసి దీనిపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపింది. ఒహాయో అటార్నీ జనరల్ కార్యాలయం కూడా ఈ విషయాన్ని పరిశీలిస్తున్నట్లు వెల్లడించింది. కించపరిచే వ్యాఖ్యలు పోలింగ్ జరిగిన గత బుధవారం సాయంత్రం తన 16 ఏళ్ల కుమార్తె ఫోన్‌కు సందేశం వచి్చనట్టు కాలిఫోరి్నయాలోని లోడీకి చెందిన తాషా డన్హామ్ చెప్పారు. ‘‘నా కూతురిని తక్షణం నార్త్ కరోలినాలోని ఒక తోటకు రావాలని ఆదేశించారు. ఆరా తీస్తే అక్కడో మ్యూజియం ఉంది’’అని తెలిపారు. ఈ పరిణామాలు తమను కలవరపరుస్తున్నాయన్నారు. పెన్సిల్వేనియాలోని మాంట్గోమెరీ కౌంటీలో ఆరుగురు మిడిల్ స్కూల్ విద్యార్థులకు కూడా ఇలాంటి సందేశాలే అందాయి. దక్షిణ కరోలినాలోని క్లెమ్సన్, అలబామా వంటి పలు విశ్వవిద్యాలయాల విద్యార్థులు తమకూ ఇలాంటి సందేశాలు వచి్చనట్టు చెప్పారు. పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. దీనిపై ఆందోళన వ్యక్తం చేస్తూ టెనెసీలోని నాష్‌విల్లేలో ఉన్న చరిత్రాత్మక నల్లజాతి విశ్వవిద్యాలయం ఫిస్క్ ప్రకటన విడుదల చేసింది. కొంతమంది విద్యార్థులను లక్ష్యంగా చేసుకున్న ఈ సందేశాలు తీవ్రంగా కలవరపెడుతున్నాయని తెలిపింది. మిస్సోరీ స్టేట్ వర్సిటీ చాప్టర్లో సభ్యులుగా ఉన్న నల్లజాతి విద్యార్థులకు కూడా సందేశాలు వచ్చాయి. వాటిలో ట్రంప్ గెలుపును ప్రస్తావించారు. నల్లజాతి విద్యార్థులను పత్తి ఏరడానికి ఎంపిక చేశారంటూ అందులో పేర్కొన్నారని మిస్సోరి ఎన్ఏఏసీపీ అధ్యక్షుడు నిమ్రోద్ చాపెల్ చెప్పారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించినట్లు తెలిపారు. ఈ సందేశాల వెనుక ఎవరున్నారో ఇంకా తెలియలేదని లాయర్స్ కమిటీ ఫర్ సివిల్ రైట్స్ అండర్ లా డిజిటల్ జస్టిస్ ఇనిషియేటివ్ డైరెక్టర్ డేవిడ్ బ్రాడీ తెలిపారు. మేరీలాండ్, ఓక్లహామా వంటి 10కి పైగా రాష్ట్రాలతో పాటు డీసీలోనూ ఇలాంటి ఈ ఉదంతాలు చోటుచేసుకున్నట్టు అంచనా వేశారు. దీనిపై తమ ఇంటెలిజెన్స్ విభాగం దర్యాప్తు చేస్తోందని పోలీసులు తెలిపారు. ఈ విద్వేష ఘటనలపై పలు పౌర హక్కుల చట్టాలను వర్తింపజేయవచ్చని బ్రాడీ చెప్పారు. సదరన్ పావర్టీ లా సెంటర్ ప్రెసిడెంట్, సీఈఓ మార్గరెట్ హువాంగ్ సహా పలు ఇతర పౌర హక్కుల సంస్థల నేతలు ఈ సందేశాలను ఖండించారు. ‘‘విద్వేషాలకు అమెరికాలో స్థానం లేదు. 2024లోనూ బానిసత్వ ప్రస్తావనలు తీవ్రంగా కలవరపరుస్తున్నాయి. నల్లజాతి అమెరికన్ల జీవితాలు ప్రమాదంలో పడ్డాయి’’అని ఎన్ఏఏసీపీ అధ్యక్షుడు, సీఈఓ డెరిక్ జాన్సన్ ఆందోలన వెలిబుచ్చారు. -
జత్వానీ ఫోన్, ల్యాప్‌టాప్‌ను ఎఫ్ఎస్ఎల్కు పంపండి
సాక్షి, అమరావతి: తన ఫిర్యాదు ఆధారంగా సినీ నటి జత్వానీపై కేసు నమోదు చేసిన పోలీసులు ఆమె నుంచి స్వాదీనం చేసుకున్న మొబైల్ ఫోన్, ల్యాప్‌టాప్, ఐపాడ్లను ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ (ఎఫ్ఎస్ఎల్)కు పంపి పూర్తి స్థాయిలో విశ్లేíÙంచి, సీల్డ్ కవర్లో నివేదిక ఇచ్చేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ వ్యాపారవేత్త కుక్కల విద్యాసాగర్ హైకోర్టులో మంగళవారం ఓ అనుబంధ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను పరిశీలించిన హైకోర్టు.. దీనిపై లోతుగా విచారణ జరుపుతామని తెలిపింది. ఇప్పుడు అంత సమయం లేనందున విచారణను ఈ నెల 16కి వాయిదా వేసింది. అప్పటివరకు జత్వానీ ఫోన్లు, ఉపకరణాల్లో డేటా భద్రపరచాలంటూ గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను పొడిగించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ప్రతాప మంగళవారం ఉత్తర్వులిచ్చారు. విద్యాసాగర్ తరఫున టి.నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. జత్వానీ ఫోన్, ఇతర ఎల్రక్టానిక్ ఉపకరణాలను తిరిగి ఆమెకిచ్చేందుకు పోలీసులు సిద్ధపడుతున్నారని తెలిపారు. వాటిలో చాలా కీలక సమాచారం ఉన్నందున ఎఫ్ఎస్ఎల్కు పంపి పూర్తిస్థాయిలో విశ్లేషణ చేయించి, ఆ నివేదికను సీల్డ్ కవర్లో కోర్టు ముందుంచేలా ఆదేశాలు జారీ చేయాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏజీ దమ్మాలపాటి ఈ అనుబంధ పిటిషన్‌ను వ్యతిరేకించారు. వాటిలోని డేటాను భద్రపరచాలని హైకోర్టు ఇప్పటికే పోలీసులను ఆదేశించిందన్నారు. అనుబంధ పిటిషన్ ద్వారా ఈ ఉత్తర్వులను సవరించాలని కోరుతున్నారని తెలిపారు.రిమాండ్‌పై పిటిషన్ విచారణ కూడా 16కి వాయిదా జత్వానీ ఫిర్యాదు ఆధారంగా ఇబ్రహీంపట్నం పోలీసులు నమోదు చేసిన కేసులో తనను రిమాండ్‌కు పంపుతూ కింది కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ విద్యాసాగర్ దాఖలు చేసిన వ్యాజ్యంలో కూడా న్యాయమూర్తి తదుపరి విచారణను జస్టిస్ జ్యోతిర్మయి ఈ నెల 16కి వాయిదా వేశారు. విద్యాసాగర్‌ను కస్టడీకి ఇవ్వాలంటూ విజయవాడ కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించాలని కోర్టును పట్టుపట్టవద్దంటూ గతంలో ఇచ్చిన ఉత్తర్వులను 16 వరకు పొడిగించారు. కాంతిరాణా, గున్నీ పిటిషన్లపై విచారణ వాయిదా సినీ నటి కాదంబరీ జత్వానీ ఫిర్యాదు మేరకు ఇబ్రహీంపట్నం పోలీసులు నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ పోలీసు అధికారులు కాంతి రాణా, విశాల్ గున్నీ, హనుమంతరావు, సత్యనారాయణ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లపై తదుపరి విచారణ ఈ నెల 3కి వాయిదా పడింది. ఈ మేరకు న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ వక్కలగడ్డ రాధాకృష్ణ కృపాసాగర్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే, ఇదే వ్యవహారంలో ముందస్తు బెయిల్ కోరుతూ పిటిషన్ దాఖలు చేసిన న్యాయవాది ఇనకొల్లు వెంకటేశ్వర్లుకు హైకోర్టు తాత్కాలిక ఊరటనిచ్చింది. ఆయనపై ఈ నెల 3వ తేదీ వరకు ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవద్దని పోలీసులను ఆదేశిస్తూ న్యాయమూర్తి జస్టిస్ కృపాసాగర్ ఉత్తర్వులు జారీ చేశారు. -
నెతన్యాహుతో మాట్లాడిన ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూతో ఫోన్లో సంభాషించారు. పశ్చిమాసియాలో ఇటీవలి పరిణామాలపై ఆయన చర్చించారు. ప్రస్తుత ప్రపంచంలోనే ఉగ్రవాదానికి చోటులేదని తేల్చిచెప్పారు. ప్రాంతీయ ఉద్రిక్తతలను నివారించడం ఎంతో అవసరమని నొక్కిచెప్పారు. అదే సమయంలో బందీలందరినీ సురక్షితంగా విడుదలయ్యేలా చూడాలన్నారు. పశ్చిమాసియాలో సాధ్యమైనంత త్వరగా శాంతి, సుస్థిరతలను నెలకొల్పే ప్రయత్నాలకు భారత్ మద్దతుగా నిలుస్తుందని నెతన్యాహూకు హామీ ఇచ్చినట్లు ప్రధాని మోదీ ‘ఎక్స్’లో తెలిపారు. అయితే, ప్రత్యేకంగా ఏ సంఘటననూ ప్రధాని మోదీ ప్రస్తావించలేదు. -
ఫ్రాన్స్ స్కూళ్లలో ఫోన్లు స్విచ్ఛాఫ్
పారిస్: సెల్‌ఫోన్.. ప్రపంచమంతటా కేవలం పెద్దలకే కాదు, పిల్లలకు సైతం వ్యసనంగా మారిన సమాచార సాధనం. ఫోన్ చేతిలో లేకుండా ఒక్క క్షణం కూడా గడవని పరిస్థితి. హెల్‌ఫోన్ మారిన సెల్‌ఫోన్ పిల్లల్లో అభ్యసన సామర్థ్యాలను దెబ్బతీస్తున్నట్లు పలు అధ్యయనాల్లో గుర్తించారు. అంతేకాదు ఆధునిక యుగంలో ఎన్నో నేరాలకు ఫోన్లు కారణమవుతున్నాయి. ఈ జాడ్యాన్ని వదిలించడానికి ఫ్రాన్స్ ప్రభుత్వం నడుం కట్టింది. వచ్చే ఏడాది నుంచి పిల్లలు పాఠశాలలో ఉన్నప్పుడు ఫోన్లు వాడకుండా పూర్తి నిషేధం విధించబోతోంది. ఇందులో భాగంగా ప్రయోగాత్మకంగా 50 వేల మందికిపైగా విద్యార్థులకు ఫోన్లు నిషేధిస్తూ ఉత్తర్వు తీసుకొచి్చంది. ఇది ఇప్పటికే అమల్లోకి వచి్చంది. ఫ్రెంచ్ మిడిల్ స్కూళ్లలో చదువుతున్న 11 ఏళ్ల నుంచి 15 ఏళ్ల విద్యార్థులు పాఠశాల ప్రాంగణంలో ఉన్నంతసేపు ఫోన్లు పూర్తిగా స్విచ్ఛాఫ్ చేయాల్సిందేనని ప్రభుత్వం ఆదేశించింది. ఈ కార్యక్రమానికి ‘డిజిటల్ విరామం’ అని నామకరణం చేసింది. ఫోన్ల తెరల ముందు విద్యార్థులు సాధ్యమైనంత తక్కువ సమయం గడిపేలా చేస్తే వారిలో కొత్త విషయాలు నేర్చుకొనే సామర్థ్యం పెరుగుతుందని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మానుయేల్ మాక్రాన్ చెబుతున్నారు. ఫ్రాన్స్‌లోని నర్సరీలు, ఎలిమెంటరీ స్కూళ్లలో మొబైల్ ఫోన్లతోపాటు ఇతర ఎల్రక్టానిక్ కమ్యూనికేషన్ పరికరాల వినియోగంపై 2018 నుంచే నిషేధం అమల్లో ఉంది. ఉన్నత పాఠశాలల్లో చదువుకొనే 15 నుంచి 18 ఏళ్ల పిల్లలు తరగతి గదిలో ఫోన్ వాడకుండా నిషేధించారు. అయితే, వారు ఫోన్లు తప్పనిసరిగా స్విచ్ఛాఫ్ చేయాలన్న నిబంధన లేదు. -
రూ.15 వేలలోపు కొన్ని పాపులర్ 5జీ ఫోన్లు (ఫొటోలు)
-
ఐఫోన్, ఐప్యాడ్ వాడుతున్నారా ..? హై రిస్క్ వార్నింగ్..!
-
టెక్కీ: జైలుకైనా పంపండి.. ఇంటికి మాత్రం వెళ్లను!
దొడ్డబళ్లాపురం: బెంగళూరులో గత 12 రోజులుగా కనబడకుండా పోయిన టెక్కీ విపిన్ గుప్తా ఢిల్లీ వద్ద నోయిడాలో ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. కొడిగేహళ్లి పోలీసులు నోయిడాకు వెళ్లి అతనిని తీసుకువచ్చారు. మాన్యతా టెక్‌పార్క్ కంపెనీలో ఐటీ ఇంజినీర్‌గా పనిచేస్తున్న విపిన్ గుప్తా, భార్య పిల్లలతో కలిసి స్థానికంగా నివసిస్తున్నాడు. 4వ తేదీన కుటుంబ కలహాల నేపథ్యంలో ఇంట్లో చెప్పకుండా తన కవాసకి బైక్‌లో వెళ్లిపోయాడు. గంట తరువాత బ్యాంకు ఖాతా నుంచి రూ.1.80 లక్షలు డ్రా అయ్యాయి. ఫోన్ కూడా స్విచాఫ్ చేసుకున్నాడు. రెండు రోజుల తరువాత భార్య కొడిగేహళ్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన భర్తను వెతికిపెట్టాలని సోషల్ మీడియా ద్వారా పోలీసు శాఖకు వేడుకుంది. డబ్బుల కోసం తన భర్తను ఎవరో కిడ్నాప్ చేసారని వాపోయింది. విషయం రచ్చ కావడంతో పోలీసులు మూడు బృందాలుగా విడిపోయి గుప్త కోసం వేట ప్రారంభించగా నోయిడాలో ఉన్నట్టు గుర్తించి తీసుకువచ్చారు. కుటుంబ కలహాల కారణంగా మనశ్శాంతి కోసం ఇల్లు వదిలి వెళ్లిపోయినట్లు అతడు చెబుతున్నాడు. భార్యాభర్తల కలహం పోలీసులను పరుగులు పెట్టించింది. -
ఫోన్లో తలాక్ చెప్పాడు... ఫిక్స్ అయిపోయాడు!
రాజస్థాన్‌కు చెందిన ఓ వ్యక్తి పని నిమిత్తం కువైట్‌కు వెళ్లి జీవిస్తున్నాడు. అయితే అతనికి పాకిస్థాన్‌కు చెందిన మహిళ పరిచయం అవ్వగా.. ఆమెను వివాహం చేసుకునేందుకు భారత్‌లోని తన భార్యకు ఫోన్ చేసి ట్రిపుల్ తలాక్ చెప్పాడు. అయితే సోమవారం అతడు జైపూర్ భారత ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ కాగానే పోలీసులు అరెస్ట్ చేశారు.వివరాలు.. రాజస్థాన్‌లోని చురుకు చెందిన 35 ఏళ్ల రెహ్మాన్ కువైట్‌లో పనిచేస్తున్నాడు. అతడికి హనుమాన్‌గఢ్‌లోని భద్ర ప్రాంతానికి చెందిన 29 ఏళ్ల ఫరీదా బానోతో 2011లో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు కుమార్తె, కుమారుడు ఉన్నారు. అయితే, రెహ్మాన్‌కు పాకిస్థాన్‌కు చెందిన మెహ్విష్ అనే మహిళతో సోషల్ మీడియా ద్వారా పరిచయం ఏర్పడింది. అదికాస్తా ప్రేమకు దారి తీసింది.ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో రెహ్మాన్ కువైట్ నుంచి భారత్‌లో ఉంటున్న తన భార్యకు ఫోన్ ద్వారా త్రిపుల్ తలాక్ చెప్పాడు. అనంతరం సౌదీ అరేబియాలో పాక్ మహిళను వివాహం చేసుకున్నాడు. ఆమె గత నెల టూరిస్ట్ వీసాపై చురుకు వచ్చి రెహ్మాన్ తల్లిదండ్రులతో కలిసి ఉంటోంది. ఈ క్రమంలో మొదటి భార్య ఫరీదా బానో తన భర్త రెహ్మాన్‌పై కేసు పెట్టింది. తనను అధిక కట్నం కోసం వేధించారని, ట్రిపుల్ తలాక్ ద్వారా విడాకులు తీసుకున్నారని ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.ఈ క్రమంలో సోమవారం కువైట్ నుంచి జైపూర్ విమానాశ్రయానికి చేరుకున్న రెహ్మాన్‌ను హనుమాన్‌ఘర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్టేషన్‌కు తీసుకెళ్లి విచారించారు. ప్రాథమిక విచారణ అనంతరం అతడిని అరెస్ట్ చేసినట్లు హనుమాన్‌గఢ్ డిప్యూటీ ఎస్పీ రణ్వీర్ సింగ్ తెలిపారు. -
దొంగలించి పడ్డ మీఫోన్ ఎలా గుర్తించాలి...!
-
మీ ఫోన్ పోయిందా? డోంట్ వర్రీ...ఈజీగా కనిపెట్టేయండిలా..!
-
టీడీపీ అరాచకం.. తలలు పగిలినా, ఎస్పీ ఫోన్ కూడా ఎత్తలేదు.. అనిల్ కుమార్ యాదవ్ సంచలన కామెంట్స్
-
ఫోన్ బాగు చేయించలేదని యువతి ఆత్మహత్య
జైపూర్: సెల్‌ఫోన్ బాగు చేయించమని తల్లిదండ్రులను అడిగితే నిరాకరించారని ఓ యువతి ఆత్మహత్య చేసు కుంది. ఈ సంఘటన మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం వేలాల గ్రామంలో గురువారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. వేలాల గ్రామానికి చెందిన ప్యాగ సారక్క, స్వామి దంపతులకు ఇద్దరు కుమారులు, కూతురు ఉన్నారు. కూతురు సాయిషుమా (19) మంచిర్యాలలో డిగ్రీ ప్రథమ సంవత్సరం చదువుతోంది. ఇంట్లో ఉన్న సెల్‌ఫోన్ పాడైపోవడంతో బాగు చేయించమని అడిగింది. దీంతో తరచూ సెల్‌ఫోన్ పాడు చేస్తున్నా వని తల్లి మందలించింది. ప్రస్తుతం ఆర్థిక పరిస్థితులు బాగాలేవని, కొద్ది రోజుల తర్వాత బాగు చేయిస్తామని చెప్పింది. ‘అన్న అడిగితే బాగు చేయిస్తారు కానీ తాను అడిగితే మాత్రం ఏమీ చెయ్యరు’ అంటూ సాయిషుమా మనస్తాపం చెందింది. తల్లిదండ్రులు పొలం పనులకు వెళ్లిన తర్వాత ఇంట్లోనే ఉరేసుకుంది. కాసేపటి తర్వాత గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన కిందికి దించినా అప్పటికే మృతిచెందింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై నాగరాజు తెలిపారు. -
ఫోన్ ట్యాపింగ్ హెడ్‌క్వార్టర్ ఎక్కడ అంటే..
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రోజుకో మ లుపు తిరుగుతోంది. ఇది హైదరాబాద్‌లోని ఎస్ఐ బీ కార్యాలయం కేంద్రంగా సాగగా సిరిసిల్ల, వరంగల్‌లో ఎస్ఐబీ పోలీసులు కొందరు వార్ రూంలు ఏర్పాటు చేసి, ట్యాపింగ్‌కు పాల్పడ్డారు. వరంగల్‌లో ఓ నాయకుడు చెప్పిన నంబర్లు ట్యాప్ చేసినట్లుగా ఆరోపణలు వస్తుండగా అదే తరహాలో సిరిసిల్ల లోనూ జరిగినట్లు పోలీసులు గుర్తించారు. సిరిసిల్ల కు చెందిన ఓ కీలక నేత కూడా కొన్ని నంబర్లు ఇచ్చి, స్థానిక వార్ రూం ద్వారా పలువురు ప్రతిపక్ష నేతల ఫోన్లు ట్యాప్ చేసినట్లు నిర్ధారించారు. పంజగుట్ట పోలీసుల విచారణలో ఆ నాయకుడు ఎవ రు? ట్యాప్ చేయమని ఎవరెవరి నంబర్లు ఇచ్చా డు? వార్ రూం ఎక్కడ నుంచి నిర్వహించారు? అందులో ఎవరెవరు పని చేశారు? తదితర అంశాలపై విచారణ అధికారులు వివరాలు సేకరించినట్లు స మాచారం. ట్యాప్ అయిన జాబితాలోని మెజారిటీ వ్యక్తులు కాంగ్రెస్ సీనియర్లు, అందులోనూ సీఎం రేవంత్‌రెడ్డికి సన్నిహితులు కావడం గమనార్హం. వార్ రూం ఎంతకాలం నడిచిందో? గత డిసెంబర్ 4న ఎన్నికల ఫలితాలతో అప్రమత్తమైన అప్పటి సిరిసిల్ల డీఎస్పీ ప్రణీత్‌రావు సీసీ కెమెరాలు ఆపేసి, వార్ రూంలోని దాదాపు 50 హార్డ్ డిస్కులను ధ్వంసం చేసిన విషయం విధితమే. దీనిపై మార్చి 10న పంజగుట్ట పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదవడం, 12న డీఎస్పీని సిరిసిల్లలో అరెస్టు చేయడం చకచకా జరిగిపోయాయి. ప్రణీత్‌రావు, ఆయన బృందం రాజన్నసిరిసిల్ల జిల్లా కేంద్రంగానే వార్ రూం ఏర్పాటు చేసినట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. అది ఎంతకాలం నడిచింది? ఎవరెవరి కాల్స్ రికార్డ్ చేశారు? అన్న విషయాలపై పోలీసులు కూపీ లాగుతున్నారు. వార్ రూం నిర్వహణలో కీలకంగా వ్యవహరించిన ఎస్సై, ముగ్గురు కానిస్టేబుళ్ల ద్వారా వివరాలు సేకరించినట్లు తెలిసింది. వీరు ట్యాప్ చేసిన కాల్స్‌లో ముఖ్యమైన వాటిని కాపీ చేసి, ప్రణీత్‌రావుకు ఇచ్చేవారని సమాచారం. ప్రణీత్‌రావు ధ్వంసం చేసిన హార్డ్ డిస్కుల్లో సిరిసిల్ల కాల్ రికార్డ్స్ కూడా ఉన్నాయని సమాచారం. సిరిసిల్లకే పరిమితం కాలేదా? వార్ రూంలో పనిచేసిన సభ్యులు కేవలం సిరిసిల్ల కు మాత్రమే పరిమితం కాలేదని, ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పలువురు ప్రతిపక్ష నేతల ఫోన్లు ట్యాప్ చేసినట్లు దర్యాప్తు అధికారులు అనుమానిస్తున్నా రు. ముఖ్యంగా పెద్దపల్లిలో ముగ్గురు కీలక ప్రతిపక్ష నేతల అనుచరులకు చెందిన కోట్లాది రూపాయలను అసెంబ్లీ ఎన్నికల సమయంలో పోలీసులు ఉమ్మడి జిల్లాతోపాటు, హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో పట్టుకున్నారు. కరీంనగర్, జగిత్యాల ప్రతిపక్ష నేతలు డబ్బులు ఖర్చు చేయకుండా వారి కున్న ఆర్థిక మూలాలను ముందే గుర్తించి, కట్టడి చేశారన్న దిశగానూ దర్యాప్తు సాగుతోంది. సూట్‌కేసు పరిమాణంలో ఉండే ట్యాపింగ్ పరికరాలను ఓ వ్యాన్‌లో పెట్టుకొని, టార్గెట్ చేసిన నాయకుడి ఇంటికి 200 మీటర్ల దూరంలో ఉంటే చాలు.. ఆయన కాల్స్ మాత్రమే కాదు, ఇంట్లోవారు, ఆ చుట్టుపక్కల వారి కాల్స్ కూడా వినే వీలుంటుంది. 2022లోనే అనుమానించిన ఎంపీ సంజయ్ 2022 మే 25వ తేదీన అప్పటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కరీంనగర్‌లోని ఓ ప్రధాన మీడియా సంస్థ విలేకరితో హిందూ ఏక్తా యాత్రపై చర్చించారు. ఆ ఫోన్ కట్ అయిన కొన్ని నిమిషాల్లోనే ఎంపీ నివాసాన్ని పోలీసులు చుట్టుముట్టారు. దీంతో ఆయన అనుచరులు సదరు విలేకరే పోలీసులకు సమాచారం ఇచ్చాడంటూ వాగ్వాదానికి దిగారు. ఈ ఘటనతోపాటు మరిన్ని సంఘటనలు గుర్తు చేసుకున్న ఎంపీ సంజయ్ తనతోపాటు తన అనుచరుల ఫోన్లను ట్యాప్ చేసినట్లు అనుమానించారు. -
నథింగ్ ఫోన్ గురించి తెలుసా..
నథింగ్.. అంటే ఏమీలేదు అనుకోకండి. అదో ప్రతిష్టాత్మక బ్రాండ్ మొబైల్ పేరు. కంపెనీ లాంచ్ చేసినవి రెండు ఫోన్లైనా కావాల్సినంత ప్రచారం లభించింది. వన్‌ప్లస్ సహ వ్యవస్థాపకుడైన కార్ల్‌పై స్థాపించిన బ్రాండ్ ఇది. ట్రాన్సపరెంట్ లుక్‌లో లాంచ్ అయిన నథింగ్ ఫోన్ 1, 2 ఇప్పటికే మంచి మార్కులు కొట్టేశాయి. ధరే కాస్త అధికంగా ఉండడంతో చాలామంది ఆసక్తి చూపలేదు. దీంతో మిడ్ రేంజ్లో తాజాగా నథింగ్ ఫోన్ 2ఏ పేరిట ఓ ఫోన్‌ను భారత మార్కెట్లో లాంచ్ చేసింది. నథింగ్ ఫోన్ 2ఏ మూడు వేరియంట్లలో లభిస్తుంది. 8జీబీ + 128జీబీ వేరియంట్ ధర రూ.23,999గా కంపెనీ నిర్ణయించింది. 8జీబీ+256జీబీ వేరియంట్ రూ.25,999గా ఉంది. 12జీబీ+ 256జీబీ వేరియంట్ ధర రూ.27,999గా పేర్కొంది. మార్చి 12 నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో అమ్మకాలు ప్రారంభం కానున్నాయి. లాంచ్ ఆఫర్ కింద తొలిరోజు కొనుగోలు చేసేవారికి రూ.19,999కే ఈ ఫోన్‌ను అందిస్తామని కంపెనీ ప్రకటించింది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కార్డు ద్వారా రూ.2వేలు, ఎక్స్ఛేంజ్ ఆఫర్ కింద మరో రూ.2వేలు చొప్పున తగ్గింపు పొందొచ్చు. నో-కాస్ట్ ఈఎంఐ సదుపాయం కూడా ఉంది. బ్లాక్, వైట్ కలర్స్‌లో లభిస్తుంది. ఫోన్ స్పెసిఫికేషన్స్.. ఆండ్రాయిడ్ 14 ఆధారిత నథింగ్ ఓఎస్ 2.5తో పనిచేస్తుంది. మూడేళ్ల పాటు ఆండ్రాయిడ్ అప్డేట్స్, నాలుగేళ్ల పాటు సెక్యూరిటీ అప్డేట్స్ లభిస్తాయి. 6.7 అంగుళాల ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే ఇచ్చారు. 30Hz నుంచి 120Hz రిఫ్రెష్ రేటుతో ఈ డిస్ప్లే పనిచేస్తుంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్‌తో వస్తోంది. 1300 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉంది. ఈ ఫోన్లో మీడియాటెక్ డైమెన్సిటీ 7200 ప్రో ప్రాసెసర్‌ను అమర్చారు. వెనకవైపు డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. 50 ఎంపీ+ 50 ఎంపీ చొప్పున రెండు కెమెరాలు అమర్చారు. ముందువైపు 16 ఎంపీ కెమెరా ఉంది. ఈ ఫోన్లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీని అమర్చారు. నథింగ్ బడ్స్, నెక్ బ్యాండ్ నథింగ్ సబ్ బ్రాండ్ సీఎంఎఫ్ ఈ సందర్భంగా రెండు కొత్త ఆడియో ఉత్పత్తులను విడుదల చేసింది. సీఎంఎఫ్ బడ్స్, నెక్‌బ్యాండ్ ప్రోను తీసుకొచ్చింది. ఈ రెండూ మార్చి 6 నుంచి ఫ్లిప్‌కార్ట్, మింత్రాలో లభిస్తాయి. బడ్స్ ధరను రూ.2,499గా కంపెనీ నిర్ణయించింది. 42db నాయిస్ క్యాన్సిలేషన్‌తో ఈ బడ్స్ వస్తున్నాయి. సింగిల్ ఛార్జ్‌తో 8 గంటల పాటు పనిచేస్తాయి. ఛార్జింగ్ కేసు 35.5 గంటల బ్యాకప్ ఇస్తుంది. ఇదీ చదవండి: ఇషా అంబానీ ప్రయత్నం ఫలిస్తుందా..? నెక్‌బ్యాండ్ ప్రో ధర రూ.1999గా నిర్ణయించింది. హైబ్రిడ్ ఏఎన్సీ టెక్నాలజీ, 50db నాయిస్ క్యాన్సిలేషన్‌తో దీన్ని తీసుకొచ్చింది. ఐపీ55 వాటర్, స్వెట్, డస్ట్ రెసిస్టెన్స్‌తో వస్తోంది. సింగిల్ ఛార్జ్‌తో 37 గంటల పాటు పనిచేస్తుంది. 10 నిమిషాల ఛార్జింగ్‌తో 18 గంటల పాటు వీటిని వినియోగించుకోవచ్చని కంపెనీ పేర్కొంది. -
మొబైల్ రంగాన్ని శాసించనున్న ఏఐ..
ఫీచర్ పోన్ నుంచి స్మార్ట్ఫోన్లు ప్రాచుర్యం పొందిన తర్వాత క్రమంగా కెమెరా, ప్రాసెసర్, బ్యాటరీ, మెమొరీ సామర్థ్యం పెంపు వంటి ఫీచర్లపై వినియోగదారులు ఎక్కువ ఆసక్తి చూపారు. వారి ఊహలకు తగ్గట్టుగానే కంపెనీలు ఎప్పటికప్పుడు కొత్త మోడల్స్‌ను ప్రవేశపెట్టాయి. క్రమంగా రూ.20,000-30,000 శ్రేణి స్మార్ట్ఫోన్లలో అధునాతన ఫీచర్లన్నీ అందుబాటులోకి వచ్చేశాక.. వీటిపై ఆకర్షణ తగ్గింది. అవసరమైతేనే కొత్త ఫోన్ కొందామనే ధోరణికి వినియోగదారులు వచ్చేశారు. మడత పెట్టేందుకు వీలున్న స్మార్ట్ఫోన్లు కొంత ఆకర్షించినా.. ధర బాగా ఎక్కువ కావడంతో, కొనుగోళ్లు పరిమితంగానే ఉంటున్నాయి. ఈ క్రమంలోనే దిగ్గజ కంపెనీలు విడుదల చేస్తున్న జనరేటివ్ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాంకేతికత గల స్మార్ట్ఫోన్లు.. మళ్లీ ఈ రంగంలో భారీ మార్పులకు కారణం అవుతాయని, అమ్మకాలు పెంచేందుకు దోహద పడతాయని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఏఐ టూల్‌కు కొద్దిగా సమాచారం అందిస్తే, మనకు ఆకర్షణీయంగా అనిపించే కంటెంట్‌ను అందించే సామర్థ్యం ఉంటుంది. గూగుల్ విడుదల చేసిన పిక్సెల్ 8 స్మార్ట్‌ఫోన్‌లోని అల్గారిథమ్ వల్ల బృందంలోని సభ్యుల ముఖ కవళికల్లో ఆకర్షణీయంగా ఉన్న వాటిని కెమెరా ఒడిసి పట్టుకుని ప్రత్యేక చిత్రంగా మనకు అందిస్తుంది. వాయిస్ డిక్టేషన్, వేరే భాషల్లోకి ట్రాన్స్‌లేట్ చేయడం వంటివి రియల్‌టైమ్‌లోనే జరుగుతాయి. మన వినియోగానికి అనువుగా బ్యాటరీ ఛార్జింగ్ వేగాన్ని మారుస్తాయి. బ్యాటరీ ఛార్జింగ్ ఎక్కువ సమయం ఉండేలా, అంతర్గత వ్యవస్థలో మార్పులు చేస్తాయి. వేగవంతమైన ప్రాసెసర్ తాజాగా అందుబాటులోకి వచ్చిన శామ్సంగ్ గెలాక్సీ ఎస్24 అల్ట్రా ఫోన్లో ఏఐ ఆధ్వర్యంలో పనిచేసే స్నాప్‌డ్రాగన్ జెన్ 3 ప్రాసెసర్, ప్రస్తుతం ప్రపంచంలో అందుబాటులో ఉన్న వాటిల్లో వేగవంతమైనదని కంపెనీ పేర్కొంది. మనం ఒక వ్యక్తి ఫోటో తీసినప్పుడు, అతడు ధరించిన దుస్తులు, కళ్లజోడు, చేతి వాచీ, హ్యాండ్ బ్యాగుల వంటివి నచ్చాయనుకోండి. నచ్చిన వస్తువుపై సర్కిల్ డ్రా చేసి సెర్చ్ చేస్తే ఆ వస్తువు తయారు చేసిన కంపెనీ పేరు, వాటి ధర, అవి సమీపంలో ఎక్కడ లభిస్తున్నాయి వంటి వివరాలు సెకన్లలో డిస్ప్లే అవుతాయి. మనం ఎవరితోనైనా ఫోన్లో మాట్లాడుతుంటాం. అవతలి వ్యక్తి ఇంగ్లీషులో మాట్లాడినా, మనం తెలుగులో వినాలనుకుంటే.. ఏఐ ఆ మాటలను మనకు తెలుగులోనే వినిపిస్తుంది. జవాబుగా మనం తెలుగులోనే మాట్లాడినా, ఆ పదాలను ఇంగ్లీషులోకి మార్చి.. వెనువెంటనే వారికి అందిస్తుంది. సర్వీసులు ఉచితమేనా అధిక క్యాపిటలైజేషన్ ఉన్న కంపెనీలే ప్రస్తుతానికి ఈ ఏఐ రంగంలో ఉత్పత్తులు తీసుకొస్తున్నాయి. ఏఐలో ప్రాసెసర్లు, చిప్‌ల వాడకం అధికంగా ఉంటుంది. వాటికి పెద్దమొత్తంలో పెట్టుబడుతులు అవసరమవుతాయి. చిన్న కంపెనీలు ఆ ఖర్చును భరించలేవు. అదే పెద్ద కంపెనీల వద్ద అధికంగా పెట్టుబడులు పెట్టే ఇన్వెస్టర్లు ఉంటారు. కాబట్టి వారికి సాధ్యం అవుతుంది. ఇదీ చదవండి: సంబంధంలేని ఫొటోలు.. విమర్శలు ఎదుర్కొంటున్న గూగుల్ జెమిని అయితే కంపెనీలు వీటిని ఎక్కువ ధరకు విక్రయిస్తున్నాయి. వీటిల్లో అందిస్తున్న ఫీచర్లకు నిర్వహణ వ్యయాలు కూడా ఉంటాయి కాబట్టి, భవిష్యత్తులో ఛార్జీలను వసూలు చేసే పరిస్థితులు కూడా రావొచ్చొని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. -
‘ఏం చేయనున్నారు’..ఫోన్‌కు దూరంగా ఎలోన్ మస్క్!
టెక్ మొఘల్ ఎలోన్ మస్క్ ఇకపై తాను కొన్ని నెలల పాటు ఫోన్‌ను వినియోగించడం లేదని ఎక్స్.కామ్‌లో పోస్ట్ చేశారు. ఆడియో, వీడియో కాల్స్ కోసం ఎక్స్.కామ్‌ను వినియోగిస్తున్నట్లు చెప్పారు. మస్క్ ట్విట్లో ఏమన్నారంటే.. ‘నేను కొన్ని నెలల పాటు ఫోన్‌ను వినియోగించడం మానేస్తున్నాను. బదులుగా ఆడియో, వీడియో కాల్స్ కోసం ఎక్స్.కామ్‌ను ఉపయోగిస్తున్నా’ అని ట్వీట్లో పేర్కొన్నారు. In a few months, I will discontinue my phone number and only use X for texts and audio/video calls — Elon Musk (@elonmusk) February 9, 2024 మస్క్ ఎక్స్.కామ్‌ను ఎవ్రిథింగ్ యాప్‌గా మారుస్తామని ప్రకటించారు. ఇందులో భాగంగా ఎక్స్.కామ్‌లో ట్వీట్లు మాత్రమే కాకుండా ఆడియో, వీడియో కాల్స్ మాట్లాడుకునేందుకు గత ఏడాది అక్టోబర్ కొత్త ఫీచర్లను అందుబాటులోకి తెచ్చారు. అయితే మస్క్ ఎక్స్.కామ్‌ను ప్రమోట్ చేసేందుకు ఫోన్‌కు దూరంగా ఉంటున్నారంటూ పలు నివేదికకు వెలుగులోకి వచ్చాయి. 2023లో ఎక్స్.కామ్‌లో ఎంపిక చేసిన యూజర్లకు మాత్రమే ‘ఎర్లీ వెర్షన్ ఆఫ్ వీడియో అండ్ ఆడియో కాలింగ్ ఆన్ ఎక్స్’ ఫీచర్‌ను అందించడం ప్రారంభించారు. ఎక్స్.కామ్ వెబ్సైట్ ప్రకారం.. ఎక్స్.కామ్ యూజర్లందరికి కాల్స్ చేసుకునే సదుపాయం లేదు. కేవలం ప్రీమియం సబ్స్క్రిప్షన్ తీసుకున్న యూజర్లకు మాత్రమే ఇది వర్తిస్తుంది అని వెల్లడించింది. -
పార్లమెంట్ అలజడి కేసులో వెలుగులోకి కీలక అంశాలు
జైపూర్: పార్లమెంట్లో అలజడి సృష్టించిన కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. నిందితుల ఫోన్లను దహనం చేసిన స్థలాన్ని పోలీసులు గుర్తించారు. అక్కడ కాలిపోయి శిథిలావస్థలో ఉన్న సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితుల బట్టలు కాల్చి వేసిన ప్రదేశాన్ని కూడా పోలీసులు గుర్తించారు. దర్యాప్తులో భాగంగా నిందితులను తీసుకువెళ్లి విచారణ చేపట్టారు. Parliament security breach: Police recover burnt phone parts of accused in Rajasthan Read @ANI Story | https://t.co/Jpwc9HIqR6#ParliamentSecurityBreach #Parliament #LokSabha #RajyaSabha pic.twitter.com/OkVJKYfMM7 — ANI Digital (@ani_digital) December 17, 2023 పార్లమెంట్లో మొత్తం ఏడుగురు నిందితులు గందరగోళం సృష్టించిన విషయం తెలిసిందే. లోక్‌సభ లోపల, పార్లమెంట్ ఆవరణలో పొగ బాంబులతో నిందితులు అరాచకం సృష్టించే పనిచేశారు. ఒంటికి మండే లేపనాలు పూసుకుని ఆత్మాహుతికి పాల్పడటానికి ప్రయత్నించారు. కానీ చివరికి స్మోక్ క్యానిస్టర్లను ప్రయోగించాలని నిర్ణయానికి వచ్చారు. సాగర్ శర్మ, డి.మనోరంజన్, అమోల్ షిండే, నీలం దేవి, ప్రధాన నిందితుడు లలిత్ ఝాలను పోలీసు ప్రత్యేక విభాగం తాలూకు కౌంటర్ ఇంటలిజెన్స్ విభాగం విచారిస్తోంది. నిందితులకు ఏడు రోజుల కస్టడీ విధించిన విషయం తెలిసిందే. అందులో భాగంగా వారు ఆశ్రయం పొందిన, కుట్ర పన్నిన ప్రాంతాలకు శుక్రవారం రాత్రి వారిని తీసుకెళ్లారు. అలాగే నిందితులకు లోక్‌సభ పాస్‌లు సిఫార్సు చేసిన బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహా స్టేట్మెంట్ను కూడా నమోదు చేయాలని భావిస్తున్నారు. లోక్‌సభలో కలకలం జరిగిన తీరుపై పార్లమెంటు అనుమతితో సీన్ రీ కన్స్ట్రక్ట్ చేసే ఆలోచన కూడా ఉన్నట్టు సమాచారం. లలిత్‌కు సహకరించిన మహేశ్ కుమావత్, కైలాశ్‌లకు క్లీన్చిట్ ఇవ్వలేదని పోలీసులు తెలిపారు. లలిత్‌ను బుధవారం పార్లమెంటు ప్రాంగణం నుంచి పారిపోయి అతను రాజస్థాన్‌లో తలదాచుకున్న నగౌర్‌కు కూడా తీసుకెళ్లారు. అక్కడ తనతోపాటు సన్నిహితుల సెల్ ఫోన్లను ధ్వంసం చేశానని లలిత్ చెప్పిన ప్రదేశంలో ఆధారాలు సేకరించారు. తమ డిమాండ్లను నెరవేర్చాలని ప్రభుత్వాన్ని ఒత్తిడి చేసేందుకు దేశంలో అరాచకం సృష్టించాలని భావించినట్లు కీలక సూత్రధారి లలిత్ ఝా కస్టడీ విచారణ సందర్భంగా ఢిల్లీ పోలీసులకు తెలిపాడు. లలిత్ ఝా తన ఫోన్‌ను ఢిల్లీ-జైపూర్ సరిహద్దులో విసిరివేసినట్లు అంగీకరించాడు. ఈ కుట్ర ప్రణాళికను అమలు చేయడానికి ముందు ఢిల్లీలో అనేకమార్లు కలిసినట్లు లలిత్ ఝా చెప్పాడు. ఇతర నిందితుల ఫోన్లను ధ్వంసం చేసినట్లు వెల్లడించాడు. ఇదీ చదవండి: రాజస్థాన్ బీజేపీ కొత్త చీఫ్‌గా కైలాష్ చౌదరి -
కమలంలో కొత్త లొల్లి
సాక్షి, హైదరాబాద్: నామినేషన్ల దాఖలు చివరిరోజు అభ్యర్థుల జాబితాలో కొన్ని మార్పులు చేసి, ఇదివరకే ప్రకటించిన వారికి బీఫాంలు ఇవ్వకపోవడం బీజేపీకి కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతోంది. టికెట్లు దక్కని వారితో పాటు జాబితాలో ప్రకటించినా బీఫామ్స్ దక్కని వారిలో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. శుక్రవారం ప్రకటించిన 14 మంది అభ్యర్థుల జాబితా అంతా వివాదాస్పదం కావడంతో సమస్య మరింత ముదిరింది. వేములవాడలో తుల ఉమకు బదులు వికాస్‌రావుకు, సంగారెడ్డిలో రాజేశ్వర్ దేశ్‌పాండేకు బదులు పులిమామిడి రాజుకు బీఫామ్‌లు ఇవ్వడంతో తుల ఉమ, దేశ్‌పాండే కన్నీటి పర్యంతం అయ్యారు. స్వతంత్ర అభ్యర్థులుగా బరిలో నిలవనున్నట్లు ప్రకటించడంతో పార్టీ నాయకులు వారిని బుజ్జగించే ప్రయత్నాలు మొదలుపెట్టారు. చివరి క్షణంలో పలువురికి చెయ్యి బీసీ మహిళ (కురుమ) ఉమకు టికెట్ కోసం ఈటల రాజేందర్ గట్టిగా పట్టుబట్టారు. ఆమెకు సీటు కేటాయించకపోతే తాను ఎన్నికల్లో పోటీ చేయనని అల్టిమేటమ్ కూడా ఇచ్చారు. దీంతో నాయకత్వం దిగివచ్చినట్టు ప్రచారం జరిగింది. కానీ చివరకు బీఫామ్ ఇవ్వలేదు. సంగారెడ్డిలో పులిమామిడి రాజుకు కూడా సీటు కేటాయించాలని ఈటల కోరారు. దీంతో ఏదో ఒక సీటు ఎంపిక చేసుకోవాలని అధిష్టానం సూచించిందని, గెలిచే అవకాశాలున్న సంగారెడ్డి వైపు ఈటల మొగ్గుచూపినట్టుగా తెలుస్తోంది. కాగా తనను నామినేషన్ వేసుకోమని చెప్పి బీఫామ్ ఇవ్వకపోవడంపై తీవ్ర మనస్థాపానికి గురైన దేశ్‌పాండే.. కిషన్‌రెడ్డికి ఫోన్‌చేసి పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంటానంటూ హెచ్చరించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. జాబితాలో బెల్లంపల్లి స్థానానికి ఏమాజీ పేరుంటే శ్రీదేవిని, ఆలంపూర్లో మారెమ్మ ప్లేస్‌లో రాజగోపాల్‌ను బీజేపీ ఖరారు చేయడం కూడా వివాదానికి తెరతీసింది. అనూహ్యంగా కంటోన్మెంట్ సీటు... సికింద్రాబాద్ కంటోన్మెంట్‌ను చివరి నిమిషం వరకు కాంగ్రెస్‌లోనే ఉండి ఇంకా బీజేపీలో చేరని సాయి గణే‹Ùకు కేటాయించడంపై కూడా పారీ్టవర్గాల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఇక్కడ మాజీ డీజీపీ కృష్ణప్రసాద్‌కు నామినేషన్ వేసేందుకు సిద్ధం కావాలంటూ చెప్పిన బీజేపీ.. ఆయనకు మొండిచేయి చూపి సాయి గణే‹Ùకు టికెట్ కేటాయించడం పారీ్టలో తీవ్ర చర్చనీయాంశమైంది. అదేవిధంగా తుది జాబితాలో పోటీకి సుముఖంగా లేని మాజీ ఎమ్మెల్సీ ఎన్.రామచంద్రరావుకు మల్కాజిగిరి సీటును కేటాయించడం పలువురిని ఆశ్చర్యానికి గురిచేసింది. మల్కాజిగిరి టికెట్ కోసం ఆకుల రాజేందర్, బీజేవైఎం అధ్యక్షుడు భానుప్రకాష్ మధ్య తీవ్ర పోటీ నెలకొనడంతో నాయకత్వం మధ్యే మార్గంగా రామచంద్రరావుకు అవకాశం ఇచ్చినట్టు సమాచారం. దీంతో భానుప్రకాష్ పారీ్టకి రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. శేరిలింగంపల్లి టికెట్‌ను రవికుమార్ యాదవ్‌కు కేటాయించడంతో గత కొంతకాలంగా ఇక్కడ పనిచేస్తూ ఈ సీటును గట్టిగా కోరుకున్న గజ్జెల యోగానంద్ ఎలాంటి కార్యచరణకు దిగుతారనేదది చర్చనీయాంశమైంది. బీసీలకు 36 సీట్లు బీజేపీ ప్రకటించిన మొత్తం 111 సీట్లలో (జనసేనకు 8 సీట్లు) బీసీలు–36, ఓసీ–44 (రెడ్డి–29, వెలమ–8, కమ్మ–3, బ్రాహ్మణ–2, వైశ్య–1, నార్త్ ఇండియన్అగర్వాల్–1) ఎస్సీ 19+2 (రిజర్వ్‌డ్‌తో పాటు అదనంగా 2 జనరల్ సీట్లు (నాంపల్లి, చాంద్రాయణగుట్ట), ఎస్టీలకు 10 కేటాయించారు. బీసీలకు ఇతర పారీ్టల కంటే అధిక సీట్లనే కేటాయించినా.. 40కి పైగా సీట్లు కేటాయిస్తామనే హామీని నేతలు నిలబెట్టుకోలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. కాగా మాదిగలకు ఎక్కువ ప్రాధా న్యం దక్కింది. 21 స్థానాలను ఎస్సీలకు కేటాయించగా, అందులో మాదిగ సామాజిక వర్గానికి 14, మాల సామాజిక వర్గానికి 7 ఇచ్చారు. బీసీలకు కేటాయించిన 36 సీట్లలో ముదిరాజ్ 9, మున్నూరు కాపు 7, యాదవ 5, గౌడ 5, పెరిక 2 లోధ్ 2 పద్మశాలి, ఆరే కటిక, లింగాయత్, వాలీ్మకి బోయ, ఆరే క్షత్రియ, విశ్వకర్మలకు ఒక్కో సీటు కేటాయించారు. -
హమాస్ దాడుల్లో కూతురు మాయం.. అమెరికా వ్యాపారి కన్నీటిగాథ
జెరూసలేం: ఇజ్రాయెల్‌లో నోవా వేడుకపై హమాస్ పాశవిక దాడి ఎందరో జీవితాల్లో చీకట్లు నింపింది. అయినవారిని పోగొట్టుకున్న బంధువుల ఆర్తనాదాలు ఆకాశాన్నంటుతున్నాయి. తమవారు ఎమయ్యారో..? చనిపోతే మృతదేహాలు ఎక్కడున్నాయో..? తెలియక అయోమయంలో కన్నీరుపెడుతున్నారు. ఈ క్రమంలో కూతురుని పొగొట్టుకున్న ఓ అమెరికా వ్యాపారి ధీనగాథ సదరు పాఠకుల హృదయాలను కలచివేస్తోంది. వాల్డ్‌మాన్ ఇజ్రాయెల్ ఆధారిత అమెరికా వ్యాపారి. కంప్యూటర్ నెట్వర్క్ బహుళజాతి సరఫర సంస్థ మెల్లనాక్స్ వ్యవస్థాపకుడు వాల్డ్‌మెన్. ఆయన కూతురు డేనియల్(24), ఆమె ప్రియుడు నోమ్ షాయ్‌తో కలిసి అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌లో జరిగిన నోవా వేడుకకు హాజరైంది. ఈ క్రమంలోనే హమాస్ దళాలు దాడులు జరిపాయి. విషయం తెలుసుకున్న వాల్డ్‌మెన్.. కూతురు జాడ కోసం ఇజ్రాయెల్ చేరుకున్నారు. తన కూతురును హమాస్ దళాలు బందీగా పట్టుకెళ్లి ఉంటాయని భావించిన వాల్డ్‌మెన్.. చనిపోయినవారి జాబితాలో తన కూతురు కూడా ఉందని తెలుసుకుని కుంగిపోయారు. తన వద్ద ఉన్న ఆపిల్ వాచ్‌తో కూతురు ఫోన్‌ను ట్రాక్ చేయగా.. అక్టోబర్ 11న దిగ్బ్రాంతికర విషయాలు ఆయనకు తెలిశాయి. డేనియల్‌కు సంబంధించిన కారు, వారి వస్తువులు మొదట దర్శనమిచ్చాయి. అక్కడ తన కూతురు, ఆమె ప్రియున్ని హమాస్ దళాలు చంపిన తీరు అతి క్రూరంగా ఉందని ఆయన వెల్లడించారు. కనీసం ఐదుగురు ఉగ్రవాదులు తన కూతురు ఉన్న కారును చుట్టుముట్టి దాడి చేశారని వెల్లడించారు. కారులో తప్పించుకునే ప్రయత్నంలో ఈ దాడి జరిగిందని వెల్లడించారు. డేనియల్, ఆమె ప్రియుడు నోమ్ షాయ్ త్వరలో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారని కన్నీరు పెట్టుకున్నారు. ఇటీవలే ఇద్దరూ తమ కుక్కతో కలిసి కొత్త ఫ్లాట్‌లోకి మారారని చెప్పారు. హమాస్ దాడులను ఖండించిన ఆయన.. డేనియల్, నోమ్ షాయ్‌కి ఒకే దగ్గర అంత్యక్రియలు జరిగినట్లు తెలిపారు. ఇదీ చదవండి: 'ఇక్కడి నుంచి తీసుకెళ్లండి..' హమాస్ బందీలో యువతి ఆవేదన -
తుపాను సమయంలో ఫోన్ వాడకూడదా? దీనిలో నిజమెంత?
పిడుగులు పడుతున్నప్పుడు మొబైల్ ఫోన్లను ఉపయోగించకూడదని చాలామంది అంటుంటారు. ఆ సమయంలో ఫోన్లను వినియోగిస్తే ఇబ్బందులు ఎదురవుతాయని, పిడుగుపాటుకు గురయ్యే అవకాశాలు పెరుగుతాయని కూడా చెబుతారు. ఇదేవిధంగా ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన వాతావరణంలో ఇంటర్నెట్ వాడకూడదని కూడా అంటుంటారు. దీనివెనుకగల కారణమేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. మొబైల్ ఫోన్లు విద్యుత్తును ఆకర్షిస్తాయని, మెరుపు మెరిసినప్పుడు దానిలోని విద్యుత్ శక్తిని ఫోన్ తన వైపుకు ఆకర్షిస్తుందని చాలామంది నమ్ముతారు. ఫలితంగా ఇంటిపై పిడుగు పడే అవకాశాలుంటాయని చెబుతారు. దీని వెనుక ఉన్న లాజిక్ గురించి కొందరు ఏమంటారంటే.. మెరుపులోని విద్యుత్ ఫోన్టవర్ ద్వారా మీ ఫోనును చేరుకుంటుందని అంటుంటారు. తుఫాను సమయంలో మెరుపులు, పిడుగులలోని విద్యుత్ ఫోన్‌కు చేరుకుని అది పేలవచ్చని, లేదా ఇంటిపై పిడుగులు పడవచ్చని చెబుతుంటారు. అయితే ఇందులో ఎంత నిజం ఉందో, నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం. నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం మొబైల్ ఫోన్లు సిగ్నల్స్ కోసం రేడియో తరంగాలను, ఎలక్ట్రిక్ మాగ్నెటిక్ వేవ్స్ ను స్వీకరిస్తాయి. ఈ తరంగాల గుండా విద్యుత్ ఎప్పుడూ ప్రవహించదు. అంటే ఈ రేడియో తరంగాల ద్వారా విద్యుత్తు మీ ఫోన్‌కు ఎప్పటికీ చేరదు. మొత్తంగా చూస్తే పిడుగుపాటు సమయంలో మొబైల్ ఫోన్ వాడకూడదనేది కేవలం భ్రమ మాత్రమేనని చెప్పవచ్చు. ఎవరైనా తుఫాను సమయంలో కూడా మొబైల్ ఫోన్‌ను నిరభ్యరంతరంగా ఉపయోగించవచ్చు. అయితే వైర్డ్ టెలిఫోన్ విషయంలో కొంతమేరకు ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇది కూడా చదవండి: ‘ఓం’పై నేపాల్‌కు ఎందుకు ద్వేషం? -
తల్లి ఫోనులో మునక.. కొడుకు నీట మునక!
అమెరికాలోని టెక్సాస్‌లో గల ఒక వాటర్‌పార్క్‌లో మూడేళ్ల బాలుడు మునిగి మృతి చెందాడు. ఆ బాలుని తల్లి గంటల తరబడి ఫోన్లో మునిగిపోయి ఉండటమే ఈ ఘటనకు కారణమని టెక్సాస్ పోలీసులు పేర్కొన్నారు. ది న్యూయార్క్ పోస్ట్‌తో ఆమె తరపు న్యాయవాది మాట్లాడుతూ లైఫ్‌గార్డులు శ్రద్ధ వహించకపోవడమే దీనికి కారణమని గతంలో ఆరోపించారు. ఎల్ పాసోలోని క్యాంప్ కోహెన్ వాటర్ పార్కులో ఈ ఘటన చోటుచేసుకుంది. మృతుని తల్లి జెస్సికా వీవర్ (35) నిర్లక్ష్యమే ఈ ఘటనకు కారణమనే ఆరోపణలు సర్వత్రా వినిపించాయి. కాగా ఆమె తన ఏకైక సంతానం ఆంథోనీ లియో మాలావే మృతికి అక్కడి లైఫ్‌గార్డుల నిర్లక్ష్యమే కారణమంటూ కోర్టును ఆశ్రయించారు. ఎల్ పాసో టైమ్స్ తెలిపిన వివరాల ప్రకారం గతమే నెలలో కోహెన్ వాటర్ పార్కులో బాలుడు మృతి చెందడానికి ఆ బాలుని తల్లే కారణమని పలువురు ప్రత్యక్ష సాక్షులు విచారణలో వెల్లడించారు. ఈ కేసులో ఆమెను గత ఆగష్టు 30న ఇండియానాలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కోర్టులో విచారణ అనంతరం ఆమె దోషిగా తేలడంతో సెప్టెంబరు 22న ఆమెను ఎల్ పాసో కౌంటీ జైలుకు తరలించారు. అయితే ఆ తరువాత ఆమెను $100,000 ష్యూరిటీ బాండ్‌పై విడుదల చేసినట్లు ఆ వార్తా సంస్థ తెలిపింది. ఈ సంఘటన జరిగిన సమయంలో పార్క్‌లో విధులు నిర్వహిస్తున్న 18 మంది లైఫ్గార్డ్లలో ఒకరు, కొలనులోని నాలుగు అడుగుల లోతులో మునిగిన మూడు సంవత్సరాల చిన్నారిని బయటకు తీశారు. స్విమ్మింగ్ సమయంలో ఉపయోగించే రక్షణ పరికరాలు అందుబాటులో ఉన్నప్పటికీ ఆ బాలుడు లైఫ్ వెస్ట్ ధరించలేదు. క్యాంప్ కోహెన్ వద్ద ఏర్పాటు చేసిన బోర్డులలో ఆరేళ్లలోపు పిల్లలు ఈత కొట్టే సందర్భంలో వారి తల్లిదండ్రులు వారిని పర్యవేక్షించాలని రాసివుంది. కాగా ప్రత్యక్ష సాక్షి అయిన ఒక మహిళ ఆ బాలుని తల్లి వీవర్ ఘటన జరిగిన సమయంలో గంటల తరబడి పోనులో మునిగిపోయి ఉందని తెలిపారు. పైగా పిల్లాడిని పట్టించుకోకుండా, అక్కడి దృశ్యాలకు ఫోటో తీయడంలో మునిగిపోయిందని తెలిపారు. పిల్లవాడిని నీటిలో నుండి బయటకు తీయడానికి ఏడు నిమిషాల ముందువరకూ ఆ మహిళ తన ఫోన్లో నిమగ్నమై, పాటను ప్లే చేస్తూ, హాయగా విశ్రాంతి తీసుకున్నదని మరో సాక్షి తెలిపారు. ఇది కూడా చదవండి: నోబెల్ విజేతకు ఎన్ని కోట్లు ఇస్తారు? ఎంతతో మొదలై ఎంతకు పెరిగింది? -
ఫోన్ కవర్లో కరెన్సీ నోట్లు పెడుతున్నారా?.. ప్రాణాల మీద ఆశలు వదులుకోవాల్సిందే?
మన దేశంలో చాలామంది తమ స్మార్ట్ ఫోన్ కవర్ లోపలివైపు 10, 20, 50, 100, 500 నోట్లు పెడుతుంటారు. రూపాయి నోట్లను ఫోన్ కవర్లో పెడితే అత్యవసర సమయంలో పనికి వస్తుందని భావిస్తుంటారు. అయితే ఇలా చేయడం ఎంతవరకూ ప్రమాదకరంగా పరిణమిస్తుందో చాలామందికి తెలియదు. కరెన్సీ నోట్లను ఇలా పెట్టడంవలన ఆ ఫోను కలిగినవారి ప్రాణాలు గాలిలో కలసిపోయే అవకాశం ఉంది. ఫోన్ కవర్లో రూపాయినోట్లను ఉంచడం ఎందుకు ప్రమాదకరమో ఇప్పుడు తెలుసుకుందాం. వేడిని బయటకు విడుదల కానివ్వదు ఫోన్‌ను నిరంతరం ఉపయోగిస్తున్నప్పుడు అది వేడిగా మారడాన్ని గమనించే ఉంటాం. ఫోన్ వేడెక్కిన వెంటనే ఫోన్ వెనుక భాగంలో దాని ప్రభావం కనిపిస్తుంది. అటువంటి పరిస్థితిలో ఫోన్ కవర్లో కరెన్సీ నోటు ఉన్నట్లయితే, అప్పుడు ఫోన్ నుంచి వేడి బయటకు విడుదల కాదు. దీంతో ఆ ఫోను పేలిపోయేందుకు అవకాశం ఏర్పడుతుంది. అందుకే ఫోన్‌కు బిగుతుగా ఉండే కవర్‌ను ఉపయోగించకూడదని నిపుణులు చెబుతుంటారు. ఎందుకంటే అది ఫోన్ పేలిపోయేలా చేస్తుందని అంటుంటారు. నోట్ల రసాయనాలు ప్రాణాంతకం కరెన్సీ నోట్లను కాగితంతో తయారు చేస్తారు. అలాగే అనేక రకాల రసాయనాలను కూడా ఉపయోగిస్తారు. ఫోన్ వేడెక్కిన సందర్భంలో.. అది బయటకు వెలువడకుండా రసాయినాలతో కూడిన కరెన్సీ నోటు అడ్డు పడితే ఆ పోన్ పేలిపోయేందుకు అవకాశం ఏర్పుడుతుంది. అందుకే పొరపాటున కూడా ఫోన్ కవర్లో ఎలాంటి కరెన్సీ నోటును ఉంచకూడదని నిపుణులు చెబుతున్నారు. అలాగే ఫోన్ కవర్ బిగుతుగా ఉన్నా, అది పేలిపోయే అవకాశం ఉందని, అందుకే ఫోన్ కవర్ ఎంపికలో జగ్రత్త వహించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇది కూడా చదవండి: ‘హార్మోనియం’ను నెహ్రూ, ఠాగూర్ ఎందుకు వ్యతిరేకించారు? రేడియోలో 3 దశాబ్దాల నిషేధం వెనుక.. -
ఫోన్ ఛార్జింగ్‌పై బాస్ ఆగ్రహం.. టాయిలెట్ ఫ్లష్ చేయద్దంటున్న నెటిజన్లు!
ఉద్యోగ జీవితంలో పలు సమస్యలు ఎదురవుతుంటాయనే విషయం అందరికీ తెలిసిందే. తాజాగా ఒక ఉద్యోగి సోషల్ మీడియాలో తన ప్రొఫిషినల్ లైఫ్‌లో ఎదురైన ఒక అనుభవాన్ని వెల్లడించాడు. తాను తన కార్యాలయంలో విచిత్రమైన అనుభవాన్ని ఎదుర్కొన్నాననని దానిలో పేర్కొన్నాడు. వైరల్ అవుతున్న రెడ్డిట్ పోస్టులో @Melodic-Code-2594 అనే ఖాతా కలిగిన యూజర్ తన బాస్ తాను ఆఫీసులో ఫోన్ ఛార్జ్ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారని పేర్కొన్నాడు. ‘వ్యక్తిగత ఉపయోగం కోసం కంపెనీ విద్యుత్ చోరీ చేశానని’ బాస్ ఆరోపించాడని ఆవేదన వ్యక్తం చేశాడు. ఆ యూజర్ తన పోస్టులో.. ‘ఆఫీసులో తాను ఫోన్ ఛార్జ్ చేసినందుకు మా బాస్ నాతో.. వ్యక్తి గత అవసరాలకు కంపెనీ విద్యుత్ చోరీ చేస్తున్నారు. మీ లాంటి వాళ్లకు ఎలా చెప్పాలి? నేనేమీ రోజంతా ఫోనులోనే మునిగిపోను. అప్పుడప్పుడు రాత్రి వేళ బెడ్‌మీదకు చేరేముందు ఫోన్ చార్జ్ చేయడం మరచి పోతుంటానంతే. ఇది డెస్క్ జాబ్’ అని బాస్ సీరియస్‌గా చెప్పాడని వివరించారు. ఈ పోస్టును చూసిన యూజర్లు పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఒక యూజర్..‘మీ బాస్ పెద్ద మూర్ఖుడు. ఫోన్ ఛార్జింగ్ పెడితే కంపెనీ కరెంట్ చోరీ చేసినట్లు అవుతుందన్నాడంటే.. అక్కడి గాలి పీల్చినా, నీటిని తాగినా చోరీ చేశావని అంటాడేమో’ అని కామెంట్ చేశాడు. మరో యూజర్..‘మీ బాస్ ఫోన్ ఛార్జింగ్ పెట్టుకోవద్దన్నాడంటే.. ఆఫీసులోని ఫోనుకు వచ్చిన ఏ కాల్‌ను రిసీవ్ చేసుకోకూడదు. ఎందుకంటే అప్పుడు కంపెనీ ఫోను టాక్‌టైమ్, బ్యాటరీ పవర్ చోరీ చేసినట్లువుతుందని’ పేర్కొన్నాడు. మరో యూజర్ ‘ఆఫీసులోని టాయిలెట్ యూజ్ చేసినప్పుడు ఫ్లష్ చేయవద్దని మీ బాస్‌కు చెప్పండి. ఎందుకంటే అలా చేస్తే కంపెనీకి చెందిన నీరు వృథా అవుతుందని వివరించండి’ అని సలహా ఇచ్చాడు. ఇది కూడా చదవండి: అందం.. నేర సామ్రాజ్యంలోకి అడుగిడితే.. లేడీ డాన్ లవ్ స్టోరీస్! -
కిల్లర్ ఫీచర్స్‌తో టెస్లా ఫోన్: డైరెక్ట్ మార్స్ నుంచి కాల్స్..?
TeslaPhone: ట్విటర్ బాస్ ఎలాన్ మస్క్ మరో సంచలనానికి తెరతీయనున్నారు అంటూ ఒక వార్త వైరల్‌గా మారింది. ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ కిల్లర్ ఫీచర్స్‌తో కొత్త మొబైల్ ఫోన్ లాంచ్ చేయనున్నట్టు మస్క్ (పేరడీ) పేరుతో ఉన్న ట్విటర్ ఖాతాలో టెస్లా ఫోను ఫోటోను షేర్ చేశారు. దీంతో నెటిజన్లు చాలామందిఆశ్చర్యంలో మునిగి పోయారు. ప్రశ్నల వర్షం కరిపించడంతో ఈ ట్వీట్ సంచలనంగా మారింది. వెనుక టెస్లా పేరుతో, మోటాలిక్ లుక్‌లో ఆకర్షణీయంగా ఉండటం మరింత ఆసక్తికర చర్చకు దారి తీసింది. టెస్లా ఫోన్ వినియోగానికి ఆసక్తిగా ఉన్నారా అంటూ యూజర్లను ప్రశ్నించడంతో ముఖ్యంగా టెస్లా ఫోన్ పిక్ చూసిన కొంతమంది ట్వీపుల్ ప్రశ్నల, సందేహాలు వ్యక్తం చేశారు. నెలకు 100 డాలర్లతో స్టార్ లింక్ ద్వారా ప్రపంచంలో ఎక్కడైనా వినియోగించే విధంగా అన్ లిమిటెడ్ ఇంటర్నెట్ ప్రొవైడ్ చేస్తే తాను ఆసక్తిగా ఉన్నట్లు ఒక అభిమాని ట్వీట్ చేశారు. మార్స్(అంగారక) గ్రహం నుంచి కూడా ఉపయోగించుకోవచ్చని మస్క్ తెలిపారు. అంతేకాదు ఐఫోన్ 12 మినీ కంటే మెరుగ్గా ఉంటుందని హామి ఇవ్వడం గమనార్హం. సూపర్ స్టన్నింగ్ ఫోన్ ఫోటోతోపాటు, ఇందులో ప్రీ ఇన్స్టాల్ అయి ఉంటుందనడంతో అందరూ తప్పులో కాలేశారు. ఆనక ఇది నకిలీ(పేరడీ) ఖాతా అని తెలిసి ‘డామిట్’ అనుకున్నారు. ట్విటర్ ఐకానిక్ బర్డ్ లోగోను మార్చి 'X' గా మార్చి మస్క్ అందర్నీ ఆశ్చర్యపరిచ్చారు. స్పేస్ ఎక్స్ అధినేత ఎక్స్‌పై తనకున్న మోజును చాటు కున్నారంటూ విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో టెస్లా ఫోన్ అనగానే మస్క్ (పేరడీ) పోస్ట్ నెట్టింట సంచలనంగా మారింది. టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతున్న ప్రస్తుత తరుణంలో నకిలీ వార్తలు పెను సంచలనంగామారుతున్నాయి. ముఖ్యంగా ఏఐ ఎంట్రీ తరువాత ఈ ప్రమాదం మరింత పెరిగింది. అందుకే సోషల్‌మీడియాలో ప్రతీ అంశానికి నిశిత పరిశీలన, ఫ్యాక్ట్‌చెక్ అనేది చాలా కీలకం. Would you use the Tesla Phone? X comes pre-installed. pic.twitter.com/jSwTQcuDr2 — Elon Musk (Parody) (@ElonMuskAOC) July 31, 2023 -
లవ్ ఫెయిల్యూర్.. ప్రేమికురాలితో ఫోన్లో మాట్లాడుతూనే
సాక్షి, వరంగల్: ప్రేమికురాలితో ఫోన్లో మాట్లాడుతూనే ఓ ప్రేమికుడు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. వరంగల్ నగరంలోని బొల్లికుంటలో ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానికులు, బంధువుల కథనం ప్రకారం.. ఖిలావరంగల్ మండలం బొల్లికుంట గ్రామానికి చెందిన జున్న చేరాలు కుమారుడు జున్న గణేష్(25) ఖోఖోలో జాతీయస్థాయి క్రీడాకారుడిగా ఎదిగాడు. ప్రస్తుతం కాకతీయ యూనివర్సిటీలో పీపీడీ చదువుతున్నాడు. గణేష్‌కు ఐనవోలు మండలంలోని ఓ గ్రామానికి చెందిన ఓ యువతితో పరిచయం ఏర్పడింది. పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలనుకున్నారు. విషయం అమ్మాయి తల్లిదండ్రులు, బంధువులకు తెలిసింది. దీంతోవారు ఆదివారం సాయంత్రం ఆగ్రహంతో బొల్లికుంటకు వచ్చి గణేష్‌ను బెదిరించారు. దీంతో ప్రేమ విఫలమైనట్టేనని మనస్తాపానికిలోనైన గణేష్ సోమవారం ఉదయం 11 గంటలకు కుటుంబసభ్యులు వ్యవసాయ పనులకు వెళ్లగా, ప్రేమికురాలతో మాట్లాడుతూ ఇంట్లోనే ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తర్వాత కుటుంబ సభ్యులు ఇంటికి చేరుకోగా, ఫ్యాన్‌కు వేలాడుతూ గణేష్ మృతదేహం కనిపించింది. మృతుడి తండ్రి చేరాలు సమాచారంతో ఎస్ఐ కృష్ణవేణి సంఘటనా స్థలికి చేరుకుని ఆత్మహత్యకు గల కారణాలను తల్లిదండ్రుల నుంచి సేకరించింది. గణేష్ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం వరంగల్ ఎంజీఎం మార్చురీకి తరలించారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఇన్స్పెక్టర్ క్రాంతికుమార్ తెలిపారు. ప్రేమికురాలితో ఫోన్లో మాట్లాడుతూనే ఆత్మహత్య చేసుకున్న అంశంపై పోలీసులను వివరణ కోరగా, గణేష్ ఉరి వేసుకున్న చోట ఫోన్‌కింద పడి ఉందని, దీనిపై పూర్తి దర్యాప్తు చేసిన తర్వాత వివరాలు తెలుస్తాయన్నారు. చదవండి: తాగి ఊగుతూ.. ఊగి ఆగతూ.. ఆగి తన్నుకుంటూ.. ఆకతాయిల వీరంగం! -
మొబైల్ చూస్తూ జారిపడ్డ ప్రధాని.. తలకు తీవ్ర గాయం
ఫిజీ ప్రధానమంత్రి సితివేణి రబుకా ప్రమాదానికి గురయ్యారు. మొబైల్ ఫోన్ చూస్తూ కింద పడిపోవడంతో ఆయన తలకు దెబ్బతగిలింది. దీంతో ప్రధాని చైనా అధికారిక పర్యటనను అనూహత్యంగా రద్దు చేయాల్సి వచ్చిందని ఫిజీలోని చైనా రాయబార కార్యాలయం బుధవారం ప్రకటించింది. కాగా చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో కలిసి గెంగ్డూలో జరిగే ప్రపంచ విశ్వవిద్యాలయ క్రీడల ప్రారంభోత్సవానికి ఫిజీ ప్రధాని హాజరు కావాల్సి ఉంది. ఈ పర్యటన రెండు దేశాల మధ్య ఒక ముఖ్యమైన దౌత్య కార్యక్రమంగా నిలవనుంది. అయితే తలకు గాయం కావడంతో చైనా పర్యటన అకస్మాత్తుగా రద్దు అయ్యిందని స్వయంగా ప్రధాని వెల్లడించారు. ఫోన్‌ని చూస్తుండగా మెట్లపై నుంచి జారిపడ్డానని, ఫలితంగా తలకు గాయమైందని తెలిపారు. ఈ దురదృష్టకర సంఘటన కారణంగా రేపు రాత్రి పర్యటకు రావడం లేదని చైనాకు తెలియజేసినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు ఓ వీడియో ద్వారా తన ఆరోగ్య పరిస్థితిని వివరించారు. చదవండి: మోదీ సర్కార్‌పై అవిశ్వాస తీర్మానం.. లోక్‌సభలో ఎవరి బలం ఎంతంటే! ‘బుధవారం ఉదయం ప్రభుత్వానికి చెందిన కొత్త బిల్డింగ్ ప్రవేశ ద్వారం వద్ద మొబైల్ చూస్తూ పొరపాటున మెట్లు జారి కిందపడిపోయాను. ఈ ప్రమాదంలో తలకు గాయమైంది. ఇప్పుడే ఆసుపత్రి నుంచి తిరిగి వచ్చాను’ అని పేర్కొన్నారు. ఇక వీడియోలో అతని చొక్కాపై కొద్దిగా రక్తపు మరకలు సైతం కనిపిస్తున్నాయి. దీంతో తలకు దెబ్బ గట్టిగానే తగిలినట్లు తెలుస్తోంది. కాగా గాయం నుంచి కోలుకున్న తర్వాత అధికారిక పర్యటనల కోసం భవిష్యత్తులో చైనా నుంచి ఆహ్వానాలు అందుతాయని రబుకా ఆశాభావం వ్యక్తం చేశాడు. ఈ పర్యటన రద్దు ఫిజీ, చైనాల మధ్య దౌత్య సంబంధాలపై ప్రభావం చూపదని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. An update on the deferment of my trip to China due to an injury that I sustained earlier today due to a misstep at the entrance to the New Wing of Government Buildings. pic.twitter.com/SYKrRUQPHF — Sitiveni Rabuka (@slrabuka) July 25, 2023 -
JioBharat phone: సక్సెస్‌ను పట్టేసిన అంబానీ.. ఇక దూకుడే..
ఆసియాలోనే అత్యంత సంపన్నుడు ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ రూ. 17.69 లక్షల కోట్ల మార్కెట్ క్యాప్‌తో భారతదేశపు అత్యంత విలువైన కంపెనీగా కొనసాగుతోంది. అనేక రంగాల్లో విజయవంతంగా వ్యాపారాలు నిర్వహిస్తోంది. భారత టెలికాం పరిశ్రమలో అత్యధిక మార్కెట్ వాటాతో తిరుగులేని సంస్థగా ఉన్న రిలయన్స్ జియో బ్రాండ్ గత కొన్నేళ్లుగా అనేక ఉత్పత్తులను భారతీయ మార్కెట్‌కు సరసమైన ధరతో అందిస్తోంది. అందులో భాగంగా ఇటీవలే జియో భారత్ వీ2 (JioBharat V2) ఫోన్‌ను విడుదల చేసింది. దీని ధర రూ.999 మాత్రమే. భారతదేశంలో ఇంటర్నెట్ కలిగిన అత్యంత చవకైన ఫోన్ ఇదే. మరిన్ని ఫోన్ల ఉత్పత్తి.. ట్రయల్ దశలో రూ.99 కోట్ల విలువైన 10 లక్షల ఫోన్లను మాత్రమే రిలయన్స్ జియో విక్రయానికి ఉంచింది. ఈ ఫోన్లన్నీ అమ్ముడుపోయిన తర్వాత మరిన్ని జియో భారత్‌వీ2 ఫోన్లను తయారు చేసేందుకు సిద్ధమైనట్లు సమాచారం. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసిక ఫలితాలను విడుదల చేసిన తర్వాత రిలయన్స్ జియో ‘జియో భారత్’ ఫోన్ల అమ్మకాల్లో పురోగతిని గమనించిందని, 10 లక్షల ఫోన్ల విక్రయాల ట్రయల్ పూర్తవ్వగానే ఈ ఫోన్ల ఉత్పత్తిని మరింత పెంచేందుకు సిద్ధమైందని బ్రోకరేజ్ సంస్థ బీఎన్పీ పారిబాస్ ఓ నివేదికలో పేర్కొంది. జియో భారత్ వీ2 ఫోన్లలో 1.77 అంగుళాల QVGA TFT స్క్రీన్, 1000mAh రిమూవబుల్ బ్యాటరీ ప్రధాన ఫీచర్లు. ఇంకా ఇందులో జియో సినిమా, తాజా వెబ్ సిరీస్‌లు, బ్లాక్‌బస్టర్ సినిమాలు, హెచ్‌బీఓ ఒరిజినల్స్, స్పోర్ట్స్ కంటెంట్ టీవీ షోలతో సహా విస్తారమైన నాన్-స్టాప్ వినోదాన్ని అందించే యాప్ ప్రధానంగా ఉంటుంది. అలాగే ప్రముఖ ఉచిత మ్యూజిక్ యాప్ జియో సావన్, జియో ప్లే వంటివి కూడా ఉన్నాయి. ఇదీ చదవండి: Nokia 110 4G/2G: నోకియా చిన్న ఫోన్ రూ. 1,699లకే.. యూపీఐ పేమెంట్లూ చేసుకోవచ్చు! ప్రస్తుతానికి కార్బన్ కంపెనీ భాగస్వామ్యంతో జియో భారత్ వీ2 ఫోన్లను రిలయన్స్ జియో ఉత్పత్తి చేస్తోంది. ఇందు కోసం రానున్న రోజుల్లో ఇతర కంపెనీలూ రిలయన్స్ జియోతో జత కలిసే అవకాశం ఉంది. అతి తక్కువ ధరతోపాటు ఈ ఫోన్ కోసం రిలయన్స్ సరసమైన డేటా ప్లాన్లను కూడా ప్రకటించిన సంగతి తెలిసిందే. -
‘మీరు కాల్ చేస్తున్న వ్యక్తి సమాధానం ఇవ్వడం లేదు’ అనగానే బామ్మ ఆగ్రహంతో..
ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక బామ్మకు సంబంధించిన వీడియో అందరినీ తెగ నవ్విస్తోంది. ఈ వీడియోలో బామ్మ ఫోనులో మాట్లాడుతూ కనిపిస్తుంది. ఆమె మాటలను విన్నవారంతా తెగ నవ్వుకుంటున్నారు.ఆ బామ్మ హరియాణాకు చెందినది. వీడియోలో బామ్మ ఏమి మాట్లాడుతున్నదో తెలిస్తే ఎవరైనా విస్తుపోవలసిందే. వీడియోలో కంప్యూటర్ జనరేటెడ్ వాయిస్ వినిపిస్తుంటుంది. ‘మీరు కాల్ చేస్తున్న వ్యక్తి సమాధానం ఇవ్వడం లేదు’ అని దానిలో వినిపిస్తుండగా, ఆ వాయిస్ విన్న బామ్మ కోపంతో తన ధోరణిలో మాట్లాడుతుంటుంది. వీడియోలో ముందుగా బామ్మ ఫోన్ చేస్తూ కనిపిస్తుంది. అటువైపు నుంచి రింగ్ వినిపిస్తుంది గానీ, ఎవరూ లిఫ్ట్ చేయరు. ఇంతలో కంప్యూటర్ రికార్డెడ్ వాయిస్ వినిపిస్తుంది. మీరు కాల్ చేస్తున్న వ్యక్తి సమాధానం ఇవ్వడం లేదంటూ బామ్మకు ఒక యువతి గొంతు వినిపిస్తుంది. అంతే ఆ బామ్మ ఆగ్రహంతో ఆ కంప్యూటర్ వాయిస్ నిజమైనదేనని భావిస్తూ క్లాస్ పీకుతుంది. ఇది విన్న ఎవరైనా తమ నవ్వును అదుపుచేసుకోలేరు. అయితే ఆ బామ్మకు అసలు విషయం తెలియక ఫోనులో ఎవరో యువతి మాట్లాడుతున్నదని భావిస్తూ, ఆపకుండా మాట్లాడుతుంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ChatBot भाई, संभलकर आइयो India में, अम्मा तुमको भी ना छोड़ने वाली हैं. 🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣 pic.twitter.com/YKjGC5ajoW — Rahul Prakash, IPS (@rahulprakashIPS) March 18, 2023 ఇది కూడా చదవండి: యువకుని ప్రాణాలు తీసిన మూమూస్ ఈటింగ్ ఛాలెంజ్ -
‘ఇక చూసింది చాలు పడుకో’ అని తల్లి అనడంతో..
ఆ 16 ఏళ్ల కుర్రాడు పొద్దస్తమానం పోన్ చూస్తుండాన్ని గమనించిన తల్లి అతనిని మందలించింది. దానిని తట్టుకోలేకపోయిన ఆ కుర్రాడు అనూహ్య నిర్ణయం తీసుకున్నాడు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటన యూపీలోని ఇటావా పరిధిలోని ఒక గ్రామంలో చోటుచేసుకుంది. 10వ తరగతి చదువుతున్న 16 ఏళ్ల రాజు(మార్చిన పేరు) రాత్రంతా మేలుకుని ఫోను చూస్తుండటంతో అతని తల్లి మందలించింది. ‘ఇక చూసింది చాలు పడుకో’ అంటూ అతని నుంచి ఫోను లాక్కొన్ని, స్విచ్ ఆఫ్ చేసింది. అయితే రాజు తన మొండి పట్టుదల వీడక పోను ఇంకా చూస్తానని మొండికేశాడు. అమ్మ లాగిపెట్టి కొట్టిందని.. కుమారుని మొండితనాన్ని చూసిన తల్లి ఆగ్రహంతో అతని చెంప చెళ్లుమనిపించింది. దీంతో రాజు ఆ ఫోనును నేలకేసి పగులగొట్టి, గది తలుపులు వేసుకున్నాడు. కొద్దిసేపటి తరువాత రాజు చెల్లెలు.. గదిలో నుంచి బయటకు రమ్మని అతనిని కోరింది. అరగంట గడిచినా గదిలో నుంచి ఎటువంటి స్పందనా రాలేదు. దీంతో రాజు తల్లి అనుమానంతో కిటికీలో నుంచి గదిలోకి తొంగి చూసింది. లోపల రాజు ఫ్యానుకు ఉరివేసుకున్న స్థితిలో కనిపించాడు. వెంటనే తల్లి గట్టిగా కేకలు వేసింది. కిందకు దింపి ఆసుపత్రికి తరలించగా.. కుమారుడు ఉన్న స్థితిని చూసిన తల్లి గట్టిగా కేకలు వేయడంతో చుట్టుపక్కలవారు వారి ఇంటికి చేరుకున్నారు. వారు గది తలుపులు బద్దలుకొట్టి, రాజును కిందకుదించి ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు పరీక్షించి, రాజు మృతి చెందినట్లు నిర్ధారించారు. ఈ వార్త వినగానే రాజు తల్లి పెద్దపెట్టున రోదించసాగింది. ఈ సమాచారం పోలీసులకు తెలియడంతో వారు సంఘటనా స్థలానికి చేరుకుని,మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు. ఇది కూడా చదవండి: ఏది ఇంపు?.. ఏది కంపు?.. సీక్రెట్ వెనుక సింపుల్ లాజిక్! -
అధికారుల వింత రూల్స్.. బస్సు డ్రైవర్, కండక్టర్ల ఫోన్ల చెకింగ్.. ఎందుకంటే..?
ఉత్తరప్రదేశ్: ఉత్తరప్రదేశ్ రోడ్డు రవాణా శాఖ ఏ వింతైన నిబంధనను తీసుకువచ్చింది. ఇకపై బస్సుల్లో డ్రైవర్లు, కండక్టర్ల ఫోన్లను కూడా తనిఖీ చేయనున్నట్లు స్పష్టం చేసింది. చెకింగ్ అధికారుల రూట్ వివరాలను బస్సు డ్రైవర్లు తమ సహోద్యోగులకు చేరవేస్తున్నారని ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. చెకింగ్ అధికారుల రూట్‌కు అనుగుణంగా ఇతర రూట్లలోని ఉద్యోగులు విధులను నిర్వర్తిస్తున్నారని తమ దర్యాప్తులో తేలినట్లు వెల్లడించింది. సంస్థ ప్రయోజనాల కోసం ఈ నియమాన్ని తీసుకొచ్చినట్లు ఉన్నతాధికారులు తెలిపారు. అధికారులు బస్సుల్లో చెకింగ్ చేసే సమయంలో మొదట బస్సు డ్రైవర్, కండక్టర్ ఫోన్లను చెక్ చేస్తారని మేనేజింగ్ డైరెక్టర్ అన్నపూర్ణ గార్గ్ తెలిపారు. చెకింగ్ సమయంలో డ్రైవర్, కండక్టర్ సహోద్యోగులకు సంబంధిత వివరాలను పంపినట్లు తేలితే కఠిన శిక్షలు ఉంటాయని స్పష్టం చేశారు. వాట్సాప్ గ్రూప్‌ల ద్వారా ఉద్యోగులు ఈ అక్రమాలకు పాల్పడుతున్నారని కనుగొన్నట్లు వ్లెడించారు. రాష్ట్ర రోడ్డు రవాణా శాఖా మంత్రి దయా శంకర్ సింగ్ కూడా ఈ నిబంధనలపై స్పందించారు. ఉద్యోగులందరూ ఈ నియమాలను పాటించాలని సూచించారు. అక్రమాలకు పాల్పడితే విధుల నుంచి తప్పిస్తామని ఉద్యోగులను హెచ్చరించారు. దీనిపై ఉద్యోగ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఫోన్‌ను వాడడం తమ వ్యక్తిగత హక్కు అని చెబుతున్నాయి. వ్యక్తిగత వివరాలు సెల్ఫోన్లో భద్రపరుచుకుంటామని వెల్లడించాయి. చెకింగ్‌ల పేరిట తమ వ్యక్తిగత హక్కుకు భంగం వాటిల్లుతుందని తెలిపాయి. ఈ నిబంధనల నుంచి ప్రభుత్వం వెనక్కి తగ్గకపోతే ఆందోళనలు నిర్వహిస్తామని హెచ్చరించాయి. ఇదీ చదవండి: పండుగ సెలవుల్లో విషాదం: రెస్టారెంట్లో పేలిన సిలిండర్.. 31 మంది దుర్మరణం -
మీ ఫోన్ లోనే బీపీ చెక్ చేసుకోవచ్చు.. ఎలాగో తెలుసుకోండి
-
ఇంకా నయం! ఆ ఫోన్ ఏ నదిలోనో, సముద్రంలోనో పడలేదు..!
ఇంకా నయం! ఆ ఫోన్ ఏ నదిలోనో, సముద్రంలోనో పడలేదు..! -
‘ఒక తాలీకి మరొకటి ఉచితం’.. ప్రలోభానికిలోనైన మహిళ ఎలా మోసపోయిందంటే...
ఇటీవలి కాలంలో ఆన్లైన్ మోసాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఇందుకోసం మోసగాళ్లు పలు మార్గాలను ఆశ్రయిస్తున్నారు.తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో ఇటువంటి ఘరానా మోసం చోటుచేసుకుంది. ఒక మహిళ ప్రముఖ రెస్టారెంట్‌కు చెందిన యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫుడ్ ఆర్డర్ చేసింది. ఇంతలోనే ఆమె బ్యాంకు ఖాతాలోని రూ.90 వేలు మాయమయ్యాయి. వివరాల్లోకి వెళితే మీడియాకు అందిన సమాచారం ప్రకారం ఈ ఉదంతం గత ఏడాది నవంబరు 27న చోటు చేసుకోగా, దీనిపై చాలా ఆలస్యంగా ఈ ఏడాది మే 2న సైబర్ సెల్‌కు ఫిర్యాదు అందింది. బాధితురాలి పేరు సవితా శర్మ(40)ఆమె ఒక బ్యాంకులో అధికారిగా పనిచేస్తున్నారు. ఆమె పోలీసులకు ఇచ్చిన రిపోర్గులో...తనకు గత ఏడాది తన స్నేహితురాలి నుంచి ఫోన్ వచ్చిందని, తరువాత ఆమె ఫేస్‌బుక్‌లోని ఒక లింకు పంపిందని తెలిపారు. ఆ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకున్నాక పుడ్‌కు సంబంధించిన ఒక ఆఫర్ తనకు అందిందన్నారు. వారు ఇచ్చిన ఫోను నంబరుకు కాల్ చేయగా, ఎవరూ లిఫ్ట్ చేయలేదన్నారు. అయితే కొద్దిసేపటి తరువాత తనకు మరో నంబరు నుంచి ఫోను వచ్చిందన్నారు. ఈ కాల్ చేసిన వ్యక్తి తాము సాగర్ రత్న రెస్టారెంట్ నుంచి ఫోను చేస్తున్నామని ఒక తాలీ(భోజనం) బుక్ చేసుకుంటే మరొక తాలీ ఉచితంగా ఇస్తామని తెలిపారు. అయితే ఇందుకు ఒక యాప్ డౌన్ లోడ్ చేసుకోవాలని చెబుతూ, దానికి సంబంధించిన యూజర్ నేమ్, పాస్‌వర్డ్‌ను ఆ వ్యక్తి తెలియజేశాడని తెలిపారు. వెంటనే ఆ మహిళ ఆ యాప్ ఇన్స్టాల్ చేసి యూజర్ నేమ్, పాస్వర్డ్ ఫీడ్ చేసింది. ఇది జరిగిన కొద్దిసేపటికి ఆమెకు తన బ్యాంకు ఖాతా నుంచి రూ.40 వేలు విత్‌డ్రా చేసినట్లు మెసేజ్ వచ్చింది. రెండు సెకెన్ల తరువాత రూ. 50 వేలు డ్రా అయినట్లు మరో మెసేజ్ వచ్చింది. వెంటనే తాను మోసపోయానని గ్రహించి, తన క్రెడిట్ కార్డు బ్లాక్ చేయించానని బాధితురాలు తెలిపింది. కాగా బాధితురాలి నుంచి ఫిర్యాదు అందుకున్న సైబర్ పోలీసులు వెంటనే దర్యాప్తు ప్రారంభించారు. వారు సాగర్ రత్న రెస్టారెంట్ ప్రతినిధులను సంప్రదించగా, తమకు దీనిపై ఎటువంటి ఫిర్యాదు అందలేదన్నారు. కాగా ఇటువంటి ఆన్లైన్ వ్యవహారాల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. -
పొలంలో ఫోన్ మాట్లాడుతుండగా రైతుపై పిడుగు.. అక్కడికక్కడే..
లక్నో: ఉత్తర్‌ప్రదేశ్ లఖీంపూర్ ఖేరీలో విషాద ఘటన జరిగింది. శ్రీపాల్ అనే 50 ఏళ్ల రైతు పొలంలో ఫోన్ మాట్లాడుతుండగా అతనిపై పిడుగు పడింది. దీంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. కుటుంబసభ్యులు అతని మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లారు. పొలం పనులకు వెళ్లి తిరిగి వస్తాడనుకున్న వ్యక్తిని విగతజీవిగా చూసి కన్నీరుమున్నీరుగా విలపించారు. కాగా.. పోలీసులు రైతు ఇంటికి వెళ్లి వివరాలు అడిగి తెలుసుకున్నారు. శ్రీపాల్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కుటుంబానికి ప్రభుత్వం తరఫున ఆర్థిక సాయం అందిస్తామని రెవెన్యూ అధికారులు హామీ ఇచ్చారు. ఈ రైతు పొలం పనుల కోసం వెళ్లినట్లు తెలుస్తోంది. అయితే వాతావరణం ఒక్కసారిగా మారి వర్షం పడే సూచనలు కన్పించాయి. ఈ సమయంలోనే ఆయనకు కుటుంబసభ్యులు ఫోన్ చేయడంతో.. వారితో మాట్లాతుండగా పిడుగు అతనిపైనే పడింది. దీంతో అక్కడికక్కడే కుప్పకూలి ప్రాణాలు కోల్పోయాడు. ఫోన్ భారీ శబ్దంతో సడన్‌గా ఆగిపోవడంతో కుటంబసభ్యులు భయంతో పొలానికి పరుగులు తీశారు. వ్యవసాయ క్షేత్రంలో శ్రీపాల్‌ను విగతజీవిగా చూసి షాక్ అయ్యారు. చదవండి: ఫ్యాక్టరీ నుంచి గ్యాస్ లీక్.. ఆరుగురు మృతి, పలువురికి అస్వస్థత -
సెల్‌ఫోన్ పోయిందా.. అధైర్యపడకండి.!
● సీపీ ఏవీ రంగనాథ్ వరంగల్ క్రైం : సెల్‌ఫోన్ పోయిందా ..అధైర్యపడవద్దని వరంగల్ సీపీ ఏవీ రంగనాథ్ ఒక ప్రకటనలో తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడింటి రిజిస్టార్ (సీఈఐఆర్)లో కొ న్ని వివరాలు నమోదు చేస్తే ఫోన్ ఎక్కడుందో తెలు సుకునే అవకాశం ఉంటుందని సీపీ తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో సెల్‌ఫోన్ ప్రతి ఒక్కరి జీవితంలో భాగమైందని, ఫోన్ పోతే బాధపడొద్దని సూచించారు. కేంద్ర టెలికాం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ప్రవేశపెట్టిన సీఈఐఆర్ అనే పోర్టల్ ద్వారా సెల్ఫో న్ పోయిన వ్యక్తి ముందుగా సంబంధిత పోలీస్ స్టే షన్లో ఫిర్యాదు చేసి rwww.ceir.gov.in వెబ్సైట్లో లాగిన్ కావాలని తెలిపారు. అందులో ఐఎంఈఐ నంబర్, కంపెనీ పేరు, మోడల్, సెల్‌ఫోన్ కొనుగోలు చేసిన బిల్లు తదితర వివరాలు నమోదు చేయాల న్నారు. దీంతో పాటు రాష్త్రం, జిల్లా, మండలం, తదితర వివరాలను నమోదు చేస్తే 24 గంటల్లో ఫోన్ పనిచేయకుండా చేస్తుందని తెలిపారు. అవగాహన కల్పించాలి... ప్రతి పోలీస్‌స్టేషన్ పరిధిలో సెల్‌ఫోన్ వాడుతున్న వినియోగదారులకు ఫోన్ పోతే ఏం చేయాలనే విషయాలపై, సీఈఐఆర్పై అవగాహన కల్పించాలని సీపీ తెలిపారు. బ్లూకోల్ట్, పెట్రోకార్ సిబ్బంది అవగాహన కల్పిస్తారన్నారు. దీంతో పాటు ప్రజలకు అ వగాహన కల్పించడానికి పోస్టర్లు విడుదల చేశారు. -
ఫోన్ పోయిందా.. నో వర్రీస్.. ఏపీ పోలీసులు పట్టేస్తారు
కోనేరు సెంటర్ (మచిలీపట్నం): సెల్‌ఫోన్ మనిషికి నిత్యావసరమైపోయింది. అది లేకుండా అడుగు ముందుకు వేయలేని పరిస్థితి. అలాంటి ఫోన్ ఒక్కసారిగా పోతే అన్ని బంధాలు తెగిపోయినట్లుగా జనం భావిస్తున్నారు. ముఖ్యంగా యువతీ, యువకులు చేతిలో సెల్‌ఫోన్ పోతే ఇక జీవితమే లేదన్న స్థాయిలో మదనపడిపోతున్నారు. ఈ నేపథ్యంలో వినియోగదారులు పోగొట్టుకున్న సెల్ఫోన్ల రికవరీపై జిల్లా పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. దీనికోసం మిస్సింగ్ మొబైల్ ట్రాకింగ్ సిస్టం (ఎంఎంటీఎస్) అనే కొత్త సాంకేతికతను తీసుకొచ్చారు. డేటాతోనే ఆందోళన.. జిల్లాలో సెల్‌ఫోన్ చోరీలు సాధారణంగా మారిపోయాయి. సెల్‌ఫోన్ పోగొట్టుకున్న బాధితులు వాటి ఖరీదు గురించి ఆలోచించనప్పటికీ ఫోన్లో భద్రపరచుకుంటున్న డేటా విషయంలో ఎక్కువ ఆవేదనకు గురవుతున్నారు. సుదూర ప్రాంతాల్లో ఉన్న హితులు, స్నేహితులు, బంధువుల ఫోన్ నంబర్లతో పాటు పలు విలువైన, అత్యంత కీలకమైన పత్రాలను సైతం సెల్ఫోన్లోనే భద్రపరచుకోవటం ప్రస్తుత పరిస్థితుల్లో పరిపాటిగా మారింది. వినియోగంలో ఉంటేనే.. జిల్లాలో 200 సెల్ఫోన్లు రికవరీ చేసిన పోలీసులు మిగిలిన ఫోన్లు వాడుకలో లేకపోవటంతో రికవరీ చేయటం ఒకింత ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ దొంగిలించిన మొబైల్‌ను ఏ క్షణాన ఉపయోగించినా రికవరీ చేస్తారు. అయితే బాధితులు ఫిర్యాదులో పూర్తి పేరు, చిరునామాతో పాటు కాంటాక్ట్ నంబరు, 15 అంకెలతో కూడిన ఐఎంఈఐ నంబర్‌ను తెలియజేయాలి. పై వాటిలో ఏ ఒక్కటి సరిగా లేకపోయినా ఫోన్లు రికవరీ చేయటం కష్టం. ఈ నేపథ్యంలో వాట్సాప్ నంబర్లో సమాచారం పొందుపరిచేటప్పుడు బాధితులు తగిన జాగ్రత్తలు తీసుకుని పూర్తి సమాచారం ఇవ్వాలని పోలీసులు సూచిస్తున్నారు. ఇలా ఫిర్యాదు చేయాలి.. సెల్ఫోన్లను రికవరీ చేసేందుకు చర్యలు చేపట్టిన ఎస్పీ అందుకోసం మిస్సింగ్ మొబైల్ ట్రాకింగ్ సిస్టం (ఎంఎంటీఎస్) అనే సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగంలోకి తీసుకువచ్చారు. సెల్‌ఫోన్ పోగొట్టుకున్న బాధితులు ఈ సాంకేతిక పరిజ్ఞానం ద్వారా 9490617573 అనే వాట్సాప్ నంబర్‌కు ‘హాయ్’ అని లేదా ‘హెల్ప్’ అని మెసేజ్ పెట్టి యాప్ అడిగే ప్రశ్నలకు పూర్తి సమాధానాలు ఇచ్చి, ఫిర్యాదును ఆన్లైన్ చేసుకోవాలి. వాట్సాప్ నంబరు ద్వారా అందిన ఫిర్యాదును ఐటీ కోర్ టీం సిబ్బంది, సీసీఎస్ సిబ్బంది స్వీకరించి సెల్ఫోన్లను రికవరీ చేసేందుకు చర్యలు చేపతారు. ఈ విధానాన్ని జనవరి మాసంలో ఎస్పీ ప్రారంభించగా.. మొదటి మూడు నెలల్లోనే దాదాపు 1700 ఫిర్యాదులు జిల్లా పోలీసులకు అందినట్లు గణాంకాలు చెబుతున్నాయి. వీటిల్లో ఇప్పటి వరకూ దాదాపు రూ. 50 లక్షల విలువ చేసే సుమారు 200 సెల్ఫోన్లను రికవరీ చేశారు. ఉపయోగంలో ఉంటే వెంటనే రికవరీ.. జిల్లాలో ఇప్పటి వరకు 1700 ఫిర్యాదులు అందాయి. వీటిని ఐటీ కోర్ టీంకు అందజేస్తున్నాం. ఫోన్లను రికవరీ చేసేందుకు జిల్లాలో ప్రత్యేక టీంలను రంగంలోకి దింపాం. రూ. 50 లక్షల విలువ చేసే 200 సెల్ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందజేశాం. అతి త్వరలోనే మిగిలిన ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందజేస్తాం. – జాషువ, ఎస్పీ, కృష్ణా జిల్లా -
నా ఫోన్ పోయింది: పోలీసులకు బండి సంజయ్ ఫిర్యాదు
సాక్షి, కరీంనగర్/ హైదరాబాద్: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఫోన్ ఎక్కడుంది? అనేది చర్చనీయాంశమయ్యింది. కలకలం రేపిన పదో తరగతి ప్రశ్నపత్రాల లీకేజీ కుట్రలో సూత్రధారిగా అనుమానిస్తూ పోలీసులు సంజయ్‌ను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. కాగా అరెస్టు అయినప్పటి నుంచి ఆయన ఫోన్ కన్పించకుండా పోయింది. అయితే బెయిల్‌పై విడుదలైన సంజయ్..ఆదివారం దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అరెస్టు సమయం నుంచి తన వ్యక్తిగత ఫోన్ కన్పించడం లేదని పేర్కొంటూ పట్టణ టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దానిని ఎలాగైనా వెదికి పెట్టాలని ఆయన విజ్ఞప్తి చేశారు. వాస్తవానికి ఆ ఫోన్ తన సోదరి పేరు మీద ఉందని, భద్రతా పరమైన కారణాల నేపథ్యంలో తాను ఆమె పేరు మీద ఉన్న సిమ్‌కార్డు వాడుతున్నానని ఫిర్యాదులో పేర్కొన్నారు. కాగా ఆదివారం రాత్రి పార్టీ లీగల్ సెల్ నేతలతో భేటీ అయిన సంజయ్.. తన ఫోన్‌ను పోలీసులే మాయం చేశారని ఆరోపించడం గమనార్హం. కాగా రాత్రి పార్టీ లీగల్ సెల్ నేతలతో భేటీ అయిన సంజయ్..తన ఫోన్‌ను పోలీసులే మాయం చేశారని ఆరోపించారు. అసలు ఆ రోజు ఏం జరిగింది? అరెస్టు అనంతరం సంజయ్‌ను పోలీసులు బొమ్మల రామారం తీసుకెళ్తున్న క్రమంలో ఆయన ఫోన్ కనిపించకుండా పోయింది. వరంగల్ పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. ఆ ఫోన్ సాయంతోనే ఏ–2 ప్రశాంత్‌తో సంజయ్ (ఏ–1) పదేపదే సంభాషించారు. ఈ కేసు ఛేదనకు ఎంతో కీలకమైన సాంకేతిక ఆధారం కావడంతో కుట్ర కేసు మొత్తం ఫోన్ చుట్టే తిరుగుతోంది. అయితే ఆ ఫోన్ సంజయ్ సమీప అనుచరుడైన బోయినపల్లి ప్రవీణ్ రావు వద్ద ఉండి ఉంటుందని ఓ సీనియర్ పోలీసు అధికారి అనుమానం వ్యక్తం చేశారు. బ్యాటరీ అయిపోవడం వల్ల స్విచ్ ఆఫ్ అయి ఉంటుందని, చివరిగా అది సిద్దిపేట టవర్ లొకేషన్ చూపించిందని, తప్పనిసరిగా బండి అనుచరులే దాన్ని దాచారని, ఆధారాలు దొరక్కుండా ఇప్పటికే ధ్వంసం చేసి ఉండే అవకాశాలు కూడా లేకపోలేదని ఆయన అభిప్రాయపడ్డారు. అది పోలీసుల పనే..: సంజయ్ తన సెల్‌ఫోన్‌ను పోలీసులే మాయం చేశారని బండి సంజయ్ ఆరోపించారు. కరీంనగర్లో పోలీసులు తనను అక్రమంగా అదుపులోకి తీసుకున్నప్పటి నుంచి సిద్దిపేట వెళ్లే వరకు తన చేతిలోనే ఉన్న ఫోన్ ఆ తర్వాత మాయం అయ్యిందని పేర్కొన్నారు. మాయం చేసినవారే తనను ఫోన్ అడగడం సిగ్గు చేటన్నారు. వివిధ అంశాలపై చర్చించేందుకు ఆదివారం రాత్రి రాష్ట్ర లీగల్ సెల్ నేతలతో భేటీ అయిన సందర్భంగా బండి మాట్లాడారు. కేసీఆర్ తన దగ్గర పెట్టుకున్నట్టున్నారు.. ‘మంత్రులు, ఎమ్మెల్యేలు చాలామంది నాకు ఫోన్లు చేశారు. ఆ విషయం తెలిసి సీఎం కేసీఆర్ మూర్ఛపోయారు. నా ఫోన్ బయటకు వస్తే అన్ని విషయాలు బయటకు వస్తాయనే భయంతో కేసీఆర్ తన దగ్గర పెట్టుకున్నట్టున్నారు. ఇతరుల ఫోన్ల సంభాషణలు వినడమే ఆయన పని..’అని సంజయ్ ఆరోపించారు. ‘బీజేపీ కార్యకర్తలు దేనికీ భయపడరు. దేశం, ధర్మం కోసం పోరాడుతూనే ఉంటారు. పేపర్ లీకేజీ విషయంలో కేసీఆర్ కొడుకు రాజీనామాకు డిమాండ్ చేస్తున్నాం. రాజీనామా విషయంలో కేసీఆర్ కుటుంబానికో న్యాయం? ఇతరులకో న్యాయమా?..’అని ప్రశ్నించారు. నిర్బంధాలు పెరిగే అవకాశం ‘రాబోయే రోజుల్లో బీజేపీ కార్యకర్తలపై నిర్బంధాలు మరింత పెరిగే అవకాశం ఉంది. పెద్ద సంఖ్యలో కేసులు నమోదు చేసి జైలుకు పంపేందుకు కేసీఆర్ ప్రభుత్వం కుట్ర చేస్తోంది. అందువల్ల లీగల్ సెల్ పార్టీ కార్యకర్తలకు పూర్తి స్థాయిలో అండగా నిలవాలి. మీరున్నారనే ధైర్యం, కాపాడతారనే విశ్వాసంతోనే కార్యకర్తలంతా కేసీఆర్ ప్రభుత్వంపై పోరాడుతున్నారు. మీరు మాకు అండగా ఉండండి..’అని సంజయ్ విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ సర్కార్ తీరును, పోలీసుల వైఖరిని సంజయ్ తప్పుపట్టారు. ‘ప్రధాని మోదీని అవమానించేలా తిడతారు. ఆయన దిష్టి»ొమ్మలను తగలబెడతారు. వ్యతిరేకంగా పోస్టర్లు అంటిస్తారు. కేసీఆర్‌ను తిడితే మాత్రం నాన్ బెయిలబుల్ కేసులు పెడతారు. పాత కేసులను తిరగదోడి జైలుకు పంపుతున్నారు..’అని ధ్వజమెత్తారు. చదవండి: ఈనెల 14న తెలంగాణకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే బండి సంజయ్ ఫిర్యాదు కాపీ -
‘ఫోకస్’ తప్పుతోంది
కంచర్ల యాదగిరిరెడ్డి : అర నిమిషం తీరిక లేదు... అర్ధరూపాయి సంపాదన లేదు.. ఈ సామెత వింటుంటే ఈ తరం బడిపిల్లలు గుర్తుకు వస్తున్నారు. ఎప్పుడు చూసినా పుస్తకాల్లో తలమునకలై ఉంటారు. బాగా చదువుతున్నారే అని మురిసిపోయినా.. పరీక్షల్లో వచ్చిన మార్కులు చూస్తే అత్తెసరు. ఈ తరం పిల్లల్లో ఎక్కువ మంది ఫోకస్డ్గా లేకపోవడమే దీనికి కారణమని నిపుణులు చెప్తున్నారు. అసలు పెద్దవారి ఏకాగ్రత కూడా బాగా తగ్గిపోతోందని.. స్మార్ట్ఫోన్లు, ఇతర డిజిటల్ పరికరాలు, మాధ్యమాల వల్లే ఈ పరిస్థితి నెలకొందని స్పష్టం చేస్తున్నారు. దృష్టి మళ్లే దారులెన్నో.. మునుపటితో పోలిస్తే పిల్లల దృష్టి మళ్లేందుకు స్మార్ట్ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్లు, టీవీలు ఇలా ఎన్నో కారణమవుతున్నాయి. నిత్యం ఎవరో ఒకరి నుంచో, ఏదో వాట్సాప్ గ్రూపులోనో మెసేజీలు రావడం, ఫేస్బుక్ నోటిఫికేషన్లు, స్మార్ట్ వాచ్ మెసేజ్.. ఇలా తరచూ మన దృష్టిని తప్పిస్తున్నాయని, దీనివల్ల తదేకంగా ఒక పనిని శ్రద్ధగా చేసే శక్తిని కోల్పోతున్నామని నిపుణులు చెప్తున్నారు. సెల్ఫోన్లు రాకముందు, సాంకేతిక విప్లవం లేనప్పుడు మనుషులు ఎలా ఉన్నారు? ఇప్పుడెలా ఉన్నారన్నదానిపై అమెరికాలోని ‘నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ చైల్డ్ హెల్త్, అండ్ హ్యూమన్ డెవలప్మెంట్’ఇటీవల ఓ అధ్యయనం చేసింది. 1946–1975 మధ్య కాలంలో పుట్టి, రకరకాల రంగాల్లో పనిచేస్తున్న వారిని, 1976–2000 మధ్య పుట్టి పలు రంగాల్లో ఉన్న వారిని, ప్రైమరీ స్కూల్, హైసూ్కల్, కాలేజీ విద్యార్థులను ప్రశ్నించి.. ఐక్యూ టెస్ట్ పెట్టింది. ఉత్తర అమెరికా, యూరప్, ఆసియా దేశాల్లో ఈ అధ్యయనం సాగింది. ఏ పనికైనా ఫోకస్ అవసరం! మనం ఏ పనిచేయాలన్నా ఫోకస్ అనేది చాలా అవసరం. లేకుంటే ఏ పని సరిగా, త్వరగా పూర్తి చేయలేం. తరాలు మారుతున్న కొద్దీ ఫోకస్ టైం మారుతూ వస్తోందని అధ్యయనంలో తేలింది. ఉదాహరణకు బేబీ బూమర్లు అంటే 1946–1964 మధ్య పుట్టినవాళ్లకు ఫోకస్ టైం ఇరవై నిమిషాలు ఉండేది. తర్వాతి తరం జనరేషన్ ఎక్స్ అంటే 1965–1980 మధ్య పుట్టినవారి ఏకాగ్రత 12 నిమిషాలకు చేరింది. 1981, ఆ తర్వాత పుట్టినవారికి ఇది కేవలం ఎనిమిది నుంచి 12 నిమిషాలే.. ఫోకస్ పెట్టలేక పోయినప్పుడు అరగంటలో చేయాలనుకున్న పని గంట, గంటన్నర పడుతుంది. పైగా చేసే పనిలో నాణ్యత ఉండదని.. యాంగ్జైటీ, డిప్రెషన్ వంటి సమస్యలూ వస్తాయని, మానసిక ఒత్తిడి పెరుగుతుందని నిపుణులు చెప్తున్నారు. నాలుగేళ్ల కితం జరిగిన ఒక పరిశోధన ప్రకారం.. ఇంటర్నెట్ వాడకం మన మెదడులోని పలు ప్రాంతాల్లో మార్పులకు కారణమవుతుందని తేలింది. ఇలా మారిపోయే విషయాల్లో మన జ్ఞాపకాలూ ఉన్నాయని వెల్లడైంది. ‘నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ చైల్డ్ హెల్త్, అండ్ హ్యూమన్ డెవలప్మెంట్’అధ్యయనం ప్రకారం కూడా.. నిద్రకు ఉపక్రమించే ముందు స్మార్ట్‌ఫోన్ లేదా ఇతర డిజిటల్ స్క్రీన్లను చూడటం వల్ల నిద్రకు చేటు కలుగుతుంది. అది కాస్తా వారి రోజువారీ కార్యక్రమాలపై ప్రభావం చూపుతుంది. వాటితో కేవలం పరధ్యానమే.. కంప్యూటర్ల వాడకంతో మనుషుల మానసిక స్థితిపై కలిగే ప్రభావంపై ఇంకో అధ్యయనం కూడా జరిగింది. ఆ్రస్టేలియాకు చెందిన డాక్టర్ షరోన్ హార్వుడ్ నిర్వహించిన ఆ అధ్యయనం ప్రకారం.. టెక్నాలజీ అనేది మన మేధో సామర్థ్యాన్ని వెంటనే మార్చేస్తుందనడం పూర్తిగా వాస్తవమేమీ కాదు. యుగాలుగా రకరకాల పరిస్థితు లను ఎదుర్కొని పరిణామం చెందిన మెదడు పనితీరు ఒక్క తరంలో మారిపోదని ఆమె చెప్తున్నా రు. కాకపోతే డిజిటల్ పరికరాలు మన మనసును పరధ్యానంలో పడేస్తాయని స్పష్టం చేస్తున్నారు. పక్కన ఉన్నా ప్రభావమే.. మన పరిసరాల్లో స్మార్ట్‌ఫోన్, ఇతర డిజిటల్ స్క్రీన్ డివైజ్ ఉంటే చాలు మన ఏకాగ్రత స్థాయి గణనీయంగా తగ్గిపోతుందంటున్నారు నిపుణులు. ఆలోచించడం, గుర్తుంచుకోవడం, భావోద్వేగాల నియంత్రణకు కారణమైన విషయాలపై దృష్టిపెట్టడం వంటివాటిపై స్మార్ట్‌ఫోన్, ట్యాబ్లెట్, కంప్యూటర్ల వంటివి ప్రభావం చూపగలవని ఎన్నో అధ్యయనాల్లో తేలిందని స్పష్టం చేస్తున్నారు. చేతుల్లో, లేదా జేబులో, పక్కన టేబుల్‌పైనో స్మార్ట్‌ఫోన్ ఉంటే.. మన మనసు చేసే పనిపై కాకుండా ఫోన్‌కు వచ్చే నోటిఫికేషన్లు లేదా అది చేసే శబ్దాలపై పడుతుందని వెల్లడైందని వివరిస్తున్నారు. క్షణం విడిచి ఉండలేకుండా.. రోజులో గంటా రెండు గంటల పాటు స్మార్ట్‌ఫోన్ అందుబాటులో లేకపోయినా సరే నానా హైరానా పడే వారి సంఖ్య బాగా పెరిగిందని నిపుణులు చెప్తున్నారు. ఇప్పటికే పాశ్చాత్యదేశాల్లో ప్రతి ముగ్గురిలో ఒకరు ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నారని.. మన దేశంలోనూ ఆ పరిస్థితి వస్తోందని హెచ్చరిస్తున్నారు. తక్షణ తృప్తి (ఇన్స్టంట్ గ్రాటిఫికేషన్) కారణంగానే మనుషులు డిజిటల్ పరికరాలకు బానిసలవుతున్నట్టు వివరిస్తున్నారు. చాలా దేశాల్లో పిల్లలు నిపుణులు సూచించిన దాని కంటే ఎక్కువ సమయం డిజిటల్ తెరల ముందు గడుపుతుండటం ఆందోళనకరమని స్పష్టం చేస్తున్నారు. సమస్యను గుర్తించడం ఎలా? ♦ చేపట్టిన పనిని పూర్తి చేసేందుకు కష్టపడుతుంటే, కష్టం అనిపిస్తుంటే, అనుకున్న సమయానికి పూర్తి చేయలేకపోతుంటే ఫోకస్ కోల్పోయామని అర్థం. ♦ అకారణంగా చిరాకు అనిపిస్తున్నా, మన దృష్టి సులువుగా పక్కదారి పడుతున్నా, రెస్ట్‌లెస్‌గా అనిపిస్తున్నా.. ఫోకస్ కోల్పోయామని స్పష్టంగా తెలుస్తుంది. ♦ ముఖ్యమైన అంశాలను అప్పటికప్పుడు మర్చిపోతుంటే ఫోకస్ పోతున్నట్టే. ఏమిటి పరిష్కారం? ♦ ఫోకస్ పెంచుకునేందుకు సులువైన మార్గాలెన్నో ఉన్నాయి. మన ఏకాగ్రతను దెబ్బతీస్తున్న మొబైల్ ఫోన్ నోటిఫికేషన్, కంప్యూటర్ నోటిఫికేషన్ వంటివి ఆఫ్ చేయాలి లేదా అత్యవసరమైనవే వచ్చేలా సెట్ చేసుకోవాలి. ♦ ఏ పని ముందు చేయాలి? ఏ పని తరువాత చేయాలి? దేనికి ప్రాధాన్యత ఎక్కువ? దేనిని నిర్ణీత సమయం (డెడ్‌లైన్)లోపు పూర్తి చేసుకోవాలన్న దానిపై కొంత వర్క్ చేసుకుని ప్రాధాన్య క్రమంలో పూర్తి చేయడం నేర్చుకుంటే ఫోకస్ పెరుగుతుంది. ♦ ప్రతిరోజు మైండ్ ఫుల్నెస్ ప్రాక్టీస్ చేయాలి. అంటే పూర్తిగా చేసే పనిపైనే ధ్యాస నిలిపాలి. ఉదాహరణకు.. ఉదయం లేవగానే బ్రష్ చేసేటప్పుడు ఆ బ్రషింగ్పై మాత్రమే, కాఫీ తాగేటప్పుడు దానిపై మాత్రమే ధ్యాస నిలిపేందుకు ప్రయత్నించాలి. ఇలా అన్ని పనులకూ వర్తింపజేయాలి. దీనిని రోజూ ప్రాక్టీస్ చేయడం ద్వారా ఫోకస్ ఆటోమేటిగ్గా పెరుగుతుంది. –విశేష్ , సైకాలజిస్ట్ ఇంటర్నెట్కు బానిసవుతున్న జనం ప్రపంచవ్యాప్తంగా జనం ఇంటర్నెట్కు బానిసగా మారుతున్నారని పలు అధ్యయనాల్లో తేలింది. వాటి ప్రకారం.. రోజులో ఒక్కొక్కరూ కనీసం 149 నిమిషాల పాటు స్మార్ట్‌ఫోన్‌ను చూస్తూ గడుపుతున్నారు. ప్రతి ఐదుగురిలో ఒకరు రాత్రిళ్లు నిద్రలేచి మరీ సోషల్ మీడియా పోస్టులు చూసుకుంటున్నారు. వీడియో గేమ్స్ ఆడే యువకులు వారంలో వాటిపై గడిపే సమయం 8 గంటలకు పైనే.. అమెరికాలో ట్రాఫిక్ ప్రమాదాల్లో 26శాతం స్మార్ట్‌ఫోన్ చూస్తూ డ్రైవింగ్ చేయడం వల్లనే జరుగుతున్నాయి! -
అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యే పాడుపని.. ఆ వీడియో చూస్తూ అడ్డంగా బుక్..!
అగర్తల: త్రిపుర బీజేపీ ఎమ్మెల్యే జాదవ్ లాల్ నాథ్ వివాదంలో చిక్కుకున్నారు. అసెంబ్లీలో బడ్జెట్ సెషన్ జరుగుతుండగా ఆయన ఫోన్లో అశ్లీల వీడియోలు చూసినట్లు ఓ వీడియో బయటకు వచ్చింది. దీంతో ఆయనపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తున్నాయి. ప్రజాప్రతినిధి అయి ఉండి అసెంబ్లీలో ఇలాంటి పనులు చేయడమేంటని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. జాదవ్ లాల్ నాథ్ బాగ్బస్సా నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రాష్ట్ర బడ్జెట్‌కు సంబంధించి అసెంబ్లీలో చర్చ జరుగుతున్న సమయంలో ఆయన ఫోన్లో వీడియోలు చూస్తూ కన్పించారు. ఈ క్రమంలోనే ఓ ఆశ్లీల వీడియోను చూస్తున్న సమయంలో వెనకాల ఉన్న సభ్యులెవరో రికార్డు చేశారు. అది బయటకు రావడంతో తీవ్ర దుమారం చెలరేగింది. చదవండి: ఛీ, తను కూతురేనా?.. ప్రియుడితో మాట్లాడొద్దన్నందుకు కన్నవాళ్లను దారుణంగా.. ఈ వ్యవహారంపై బీజేపీ సీరియస్ అయింది. వెంటనే వివరణ ఇవ్వాలని జాదవ్‌కు సమన్లు పంపింది. అయితే ఆయన మాత్రం ఇంకా వీటిపై స్పందించలేదు. అసెంబ్లీ సెషన్ అయిపోయిన వెంటనే ఇంటికి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. బీజేపీ నేతలు అసెంబ్లీలో అశ్లీల వీడియోలు చూడటం ఇది తొలిసారేం కాదు. 2012లో కూడా కర్ణాటక అసెంబ్లీలో ఇద్దరు మంత్రులు లక్ష్మణ్ సవాది, సీసీ పాటిల్.. అశ్లీల వీడియోలు చూస్తూ కన్పించారు. అనంతరం తమ పదవులకు రాజీనామా చేశారు. అయితే బీజేపీ దీనిపై విచారణ జరిపి వారు తప్పుచేయలేదని నిర్ధరించుకున్న తర్వాత తిరిగి మంత్రి పదువులు ఇచ్చింది. చదవండి: రాహుల్ గాంధీని కోర్టుకు ఈడుస్తా.. కాంగ్రెస్ నేతపై లలిత్ మోదీ ఫైర్.. -
కూలీ చేతికి రూ. 1.4 లక్షల ఫోన్..ఆ తర్వాత ఏం జరిగిందంటే..
ఓ రైల్వే కూలీ చేతికి సుమారు రూ. 1.4 లక్షల ఫోన్ దొరికింది. ఐతే అతను ఆ ఫోన్‌ని నేరుగా రైల్వే పోలీసులకు ఇచ్చేసి తన నిజాయితీని చాటుకున్నాడు. ఈ ఘటన ముంబైలోని దాదర్ స్టేషన్లో చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే..దశరత్ దౌండ్ అనే రైల్వే కూలి దాదార్ రైల్వే స్టేషన్లో కూలీగా 30 ఏళ్లుగా పనిచేస్తున్నాడు. అతని రోజువారీ సంపాదన రూ. 300. ఐతే అతను ఎప్పటిలానే ఆరోజు కూడా అమృత్‌సర్‌కి వెళ్లే రైలు ఆగి ఉన్న ఫ్లాట్ ఫాం 4 వద్ద తన పనిని ముగించుకుని ఇంటికి పయనమవుతున్నాడు. ఆ క్రమంతో రాత్రి సుమారు 11.40 గంటల సమయంలో ఒక ఖరీదైన ఫోన్ కనిపించింది. అది ఫ్లాట్‌ఫాంపై నడుస్తుండగా సీటింగ్ ఏరియాలో పడి ఉండటంతో అక్కడున్న ప్రయాణికులను ఆ ఫోన్ గురించి వాకబు చేస్తే మాది కాదనే చెప్పారు. దీంతో దశరత్ నేరుగా రైల్వే పోలీసులకు అసలు విషయం చెప్పి ఆ ఫోన్‌ని ఇచ్చేశాడు. ఆ తర్వాత పోలీసులు ఆ ఫోన్ ఎవరిదని అని ట్రేస్ చేస్తుండగా..అది అమితాబచ్చన్‌కి విశ్వసనీయ మేకప్ ఆర్టిస్ట్ దీపక్ సావంత్‌కి చెందన ఫోన్ అని తేలింది. దీంతో పోలీసులు ఆ ఫోన్‌ని బాధితుడు సావంత్‌కి అందజేసి ఈ విషయం చెప్పడంతో అతను ఒక్కాసారిగా ఆశ్చర్యపోయాడు. తన ఫోన్ తనకు తిరిగి లభించినందుకు బహుమతిగా ఆ కూలికి రూ. 1000 కూడా ఇచ్చాడు సావంత్. ఆ కూలీని పోలీసుల తోపాటు సావంత్ కుటుంబం కూడా ఎంతగానో ప్రశంసించింది. ఈ మేరకు కూలీ దశరత్ మాట్లాడుతూ.. ఈ ఘటనను మర్చిపోయానని, సడెన్‌గా పోలీసుల నుంచి కాల్ రావడంతో ఈ విషయం గురించి తెలిసిందని చెబుతున్నాడు. అయినా తనకు గాడ్జెట్లపై ఎలాంటి అవగాహన లేదని, పైగా తాను ఎవరి వస్తువుని తన వద్ద ఉంచుకోనని చెప్పాడు. ఏదీఏమైనా ఇలాంటి వ్యక్తులు ఉండటం అత్యంత అరుదు. (చదవండి: క్లాస్ రూం చుట్టూ పరిగెత్తించి మరీ టీచర్‌పై దాడి.. పేరెంట్స్ అరెస్టు) -
అవును... ఇది నిజమే!
► జపాన్ లోని ఆసోచి కొండల్లో ‘విండ్ ఫోన్’ అనే టెలిఫోన్ బూత్ ఉంది. ‘విండ్ ఫోన్ ఏమిటి? అక్కడెక్కడో కొండల్లో ఉండడం ఏమిటి?’ అనుకుంటున్నారా! విషయంలోకి వస్తే...2011లో జపాన్ లో భూకంపం వచ్చి ఎంతోమంది చనిపోయారు. చనిపోయిన వారితో ఆత్మీయులకు మాట్లాడే అవకాశం లేదు. వారు ఎక్కడో ఉన్నట్లుగానే భావించి ఫోన్లో మాట్లాడి మనసులో ఉన్న బాధను దించుకోవడమే ఈ ‘విండో ఫోన్’ ఉద్దేశం. దీన్ని స్ఫూర్తిగా తీసుకొని అమెరికా, ఆస్ట్రేలియా, బ్రిటన్‌లో కూడా ‘విండ్ ఫోన్’లు ఏర్పాటయ్యాయి. ► పెరూలో ‘టకనాకుయ్’ పేరుతో ప్రతి సంవత్సరం ‘ఫైటింగ్ ఫెస్టివల్’ జరుగుతుంది. ‘టకనాకుయ్’ అంటే ఒకరితో ఒకరు తలపడడం. అంతమాత్రాన ఈ ఫైటింగ్ ఫెస్టివల్లో రక్తం కారేలా కొట్టుకోరు. ఒక విధంగా చెప్పాలంటే ఉత్తుత్తి ఫైటింగ్ అన్నమాట! మనసులో ఉన్న కోపం, ఒత్తిడి, ఆందోళనను వదిలించుకోవడానికి ఈ ‘ఫైటింగ్ ఫెస్టివల్’ ఉపయోగపడుతుందనే నమ్మకం ఉంది. దీనికి ఎంతో పురాతనమైన చరిత్ర ఉంది. -
ఫోన్ ట్యాపింగ్ డ్రామాపై కోటంరెడ్డి స్నేహితుడు రామశివారెడ్డి క్లారిటీ
సాక్షి, నెల్లూరు జిల్లా: ఎమ్మెల్యే కోటం రెడ్డి ఫోన్ టాపింగ్ డ్రామాపై ఆయన స్నేహితుడు రామశివారెడ్డి స్పష్టత నిచ్చారు. ఆ ఆరోపణలపై మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ‘‘నాది ఆండ్రాయిడ్ ఫోన్. నా ఫోన్ లో ప్రతీకాల్ రికార్డవుతుంది. కోటంరెడ్డి చెప్పింది ట్యాపింగ్ కాదు.. రికార్డింగ్ మాత్రమే. కేవలం యాదృచ్చికంగా కాల్ రికార్డయింది’’ అని చెప్పారు. ‘‘ఉద్ధేశపూర్వకంగా రికార్డ్ చేసిన కాల్ కాదు. ట్యాపింగ్ అంటూ ఇంత వివాదం అవుతుందని ఊహించలేదు. ట్యాపింగ్ అంటూ కోటంరెడ్డి ఇంత హంగామా చేసినందుకే వాస్తవాలు చెబుతున్నా.. నా ఫోన్‌ను ఫోరెన్సిక్‌కు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నా’’ అని రామశివారెడ్డి తేల్చి చెప్పారు. ‘‘నేను ఎవరో సీఎం జగన్‌కు తెలీదు. ఏదో ఊహించుకుని దుష్ప్రచారం చేస్తున్నారు. మా ఇద్దరివీ ఐఫోన్లు అని కోటంరెడ్డి అబద్ధం చెప్పారు. నాపై ఎవరి ఒత్తిడీ లేదు.. వాస్తవం చెప్పేందుకే మీడియా ముందుకొచ్చా’’ అని రామశివారెడ్డి స్పష్టం చేశారు. తనకు 30 ఏళ్లుగా వైఎస్ కుటుంబంతో అనుబంధం ఉందన్నారు. వైఎస్ కుటుంబంపై విశ్వాసం ఉందని ఆయన అన్నారు. చదవండి: కోటంరెడ్డికి ఊహించని షాక్.. దెబ్బ అదుర్స్! -
అదే పనిగా ఫోన్లో మాట్లాడుతున్న కూతురు.. కొట్టి చంపిన తండ్రి..
ముషీరాబాద్: వద్దని చెప్పినా ఫోన్ అదే పనిగా ఫోన్ మాట్లాడుతుందనే కోపంతో గొంతునులిమి చంపాడు ఆ కసాయి మారు తండ్రి. ఈ దారుణ ఘటన ముషీరాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆదివారం తెల్లవారు జామున చోటు చేసుకుంది. సీఐ జహంగీర్ యాదవ్ కథనం ప్రకారం....రహిమున్నీసా అలియాస్ సన్నూబేగం.. బెహ్రాన్ దేశంలో హౌస్‌కీపింగ్ పనిచేస్తోంది. బేగంపేటకు చెందిన అక్బర్‌తో మొదటి వివాహం జరగగా పదేళ్ల క్రితం రైలు ప్రమాదంలో అతను మరణించాడు. అప్పటికే వారికి షేక్ ఆయాజ్, నౌసీన్ ఉన్నీసా, యాసీన్ ఉన్నీసా(17) అనే ముగ్గురు సంతానం కలిగారు. మొదటి భర్త అక్బర్ మృతి తర్వాత రహిమున్నీసా ముషీరాబాద్‌కు చెందిన ఆటో డ్రైవర్ మహ్మద్ తౌఫిక్‌ను వివాహం చేసుకుంది. కాగా, ముగ్గురి పిల్లల్లో ఆయాజ్ షేక్ బేగంపేటలోని తన నాయన మ్మ దగ్గర నివసిస్తుండగా ఇద్దరు అమ్మాయిలు మారు తండ్రితోనే ఉంటున్నారు. రెండవ కూమార్తె యాసీన్ ఉన్నీసా(17) నిత్యం ఫోన్లో మాట్లాడుతుండడంతో పలు మార్లు తౌఫిక్ అలా మాట్లాడొద్దని హెచ్చరించాడు. తాజాగా ఆదివారం తెల్లవారు జామున 3గంటల సమయంలోనూ యాసీన్ ఫోన్లో మాట్లాడుతూ ఉండడాన్ని గమనించిన తౌఫిక్ ఆవేశంతో ఫోన్ లాక్కున్నాడు. ఎవరితో మాట్లాడుతున్నావని, ఫోన్ పాస్వర్డ్ చెప్పాలని నిలదీశాడు. చెప్పకపోవడంతో చెంపలమీద రెండు దెబ్బలు వేశాడు. దీంతో బెదిరిపోయిన యాసిన్ గట్టిగా ఏడుస్తుండడంతో చుట్టుపక్కల వాళ్లు వింటారు ఏడవొద్దంటూ గట్టిగా గొంతు నులమడంతో స్పృహతప్పి పడిపోయింది. వెంటనే తన సోదరి నౌసీన్ ఉన్నీసా హుటాహుటిన గాంధీ ఆస్పత్రికి తీసుకువెళ్లగా డాక్టర్లు పరీక్షించి అప్పటికే యాసీన్ మరణించినట్లు నిర్ధారించారు. దీంతో తౌఫిక్ ముషీరాబాద్ పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయాడు. చదవండి: బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థి ఆత్మహత్య.. సూసైడ్ నోట్ రాసి.. -
విమానం టేక్ అఫ్ టైంలో ఫోన్ మిస్సింగ్.. పైలెట్ కిటికిలోంచి వంగి మరీ..
ఓ ప్రయాణికుడు విమానం ఎక్కే ముందు తన ఫోన్‌ని మర్చిపోయాడు. ఐతే ఇంతలో విమానంలో ప్రయాణికులంతా ఎక్కేశారు. ఇక బయలుదేరుతుంది అనేలోపు ఓ విచిత్ర సంఘటన జరిగింది. ఈ విషయాన్ని డల్లాస్ చెందిన ఎయిర్‌లైన్ ఫేస్బుక్లో పేర్కొంది. వివరాల్లోకెళ్తే...కాలిఫోర్నియాలోని లాంట్ బీజ్ ఎయిర్‌పోర్ట్‌లో సౌత్ వెస్ట్ ఎయిర్‌లైన్స్ విమానం ప్రయాణికులంతా ఎక్కేయడంతో టేకాఫ్‌కి రెడీ అయ్యింది. ఇంతలో గ్రౌండ్ సిబ్బంది గేట్ వద్ద ఒక ప్రయాణికుడు ఫోన్ మర్చిపోవటాన్ని గుర్తించారు. దీంతో వారు వెంటనే అప్రమత్తమై టేకాఫ్ అవుతున్న విమానం దగ్గరకు వచ్చి ప్రయాణికుడి ఫోన్ ఇచ్చేందుకు వస్తారు. విషయం గ్రహించిన ఫైలెట్ కిటికిలోంచి వంగి మరీ సిబ్బంది నుంచి ఫోన్‌ని అందుకున్నాడు. ఆ తర్వాత ప్రయాణకుడికి అతను మర్చిపోయిన ఫోన్‌ని అందజేశారు. అందుకు సంబంధించిన వీడియోని డల్లాస్ ఎయిర్‌లైన్ ట్విట్టర్లో పోస్ట్ చేస్తూ...మా సౌత్‌వెస్ట్ ఎయిర్‌లైన్స్‌ని ప్రేమించండి. ఇలా మా సిబ్బంది అప్రమత్తమై ప్రయాణికులకు సాయం చేయడాన్ని కస్టమర్ సర్వీస్ రిప్రజెంటేటివ్ అంటారు అని పేర్కొంది. దీంతో ఈ వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది. When our Employees at @LGBairport noticed a Customer's phone left behind in a gate area after a flight that was already boarded and pushed back from the gate, they didn't hesitate. #WorldKindnessDay pic.twitter.com/cf3gJy8Nmy — Southwest Airlines (@SouthwestAir) November 13, 2022 (చదవండి: వామ్మో! భగభగమండే సూర్యుని ఉపరితలంపై స్నేక్) -
హైకోర్టు జడ్జికే దమ్కీ.. పోలీస్ అధికారులపై వేటు
లక్నో: పోలీసు సబ్ ఇన్స్పెక్టర్, ఇద్దరు కానిస్టేబుల్స్ నేరుగా హైకోర్టు జడ్జితో మీ ఇల్లు ఎక్కడా, ఎక్కడికి రావాలి అని ప్రశ్నించడంతో సస్పెండ్ అయ్యారు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని అంబేద్కర్ నగర్ జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం... గత ఆదివారం అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి ప్రకాష్ సింగ్ జిల్లాకు వచ్చినప్పుడూ ఈ ముగ్గురు పోలీసులకు ఎస్కార్ట్ డ్యూటీ పడింది. దీంతో ఆ ముగ్గురు పోలీసులు న్యాయమూర్తితో ఫోన్లో ఇల్లు ఎక్కడ ఉంది, ఎక్కడకు రావాలి అని నేరుగా ప్రశ్నించారు. దీంతో న్యాయమూర్తి సీరియస్ అయ్యి పోలీస్ సూపరింటెండ్‌కి పిర్యాదు చేశారు. అంతే అధికారులు అదేరోజు ఆ ముగ్గురు పోలీసులను తక్షణమే సస్పెండ్ చేశారు. ఐతే ఈ విషయామై నేరుగా న్యాయమూర్తిని సంప్రదించకూడదని అధికారులు తెలిపారు. న్యాయమూర్తి ప్రోటోకాల్‌ని పర్యవేక్షిస్తున్నావారి వద్ద నుంచి సమాచారం తెలుసుకోవాలని చెప్పారు. ఐతే వారు న్యాయమూర్తి ఫోన్ నెంబర్ ఎలా సంపాదించారనేది తెలియరాలేదన్నారు. (చదవండి: స్టాలిన్ ఎందుకు మౌనంగా ఉన్నారు? పరువు, గౌరవం కోసం ఎంతకైనా వెళ్తా...నటీ ఖుష్బు సీరియస్) -
జెలెన్ స్కీతో ఫోన్లో సంభాషించిన మోదీ
న్యూఢిల్లీ: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తమ భూభాగాల రక్షణ కోసమే ఉక్రెయిన్‌పై యుద్ధం చేస్తున్నామని అవసరమనుకుంటే అణుదాడికి కూడా దిగుతామని కరాఖండిగా చెప్పిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీతో మోదీ ఫోన్లో మాట్లాడారు. అదీకూడా పుతిన్ పెద్ద సంఖ్యలో బలగాలను సమీకరిస్తానని బహిరంగా ప్రకటించిన రెండు వారాల తర్వాత ఇరు నాయకులు ఫోన్లో సంభాషించుకోవడం విశేషం. పైగా పుతిన్ తమ దాడిని ముఖ్యంగా నాటో సభ్య దేశాలైన యూఎస్ దాని మిత్రదేశాలకు వ్యతిరేకంగా చేస్తున్న గొప్ప యుద్ధంగా అభివర్ణించుకున్నాడు కూడా. ఈ మేరకు ఫోన్లో మోదీ....ఉక్రెయిన్‌లో తూర్పు ప్రాంతాల రష్యా బలగాల దాడి గురించి ప్రస్తావిస్తూ...అణుదాడుల విషయమై ఆందోళన వ్యక్తం చేశారు. పైగా ఇరు దేశాల నాయకులు శత్రుత్వాన్ని విరమించుకోవాలని హితవు పలికారు. చర్చలు, దౌత్యమార్గాల ద్వారా సమస్యని పరిష్కరించుకోవాల్సిందిగా పునరుద్ఘాటించారు. వివాదానికి ఎప్పుడూ సైనిక పరిష్కారం ఉండదని కూడా దృఢంగా చెప్పారు. అలాగే ఎలాంటి శాంతి ప్రయత్నాలకైనా సహకరించేందుకు భారత్ ఎప్పుడూ సంసిద్ధంగా ఉంటుందని తెలియజేసినట్లు ప్రధాని మంత్రి కార్యాలయం పేర్కొంది. (చదవండి: బంగ్లాదేశ్‌లో సగం పైగా జనాభా అంధకారంలోనే...) -
కేంద్ర మంత్రిని గుర్తుపట్టని అధికారి.. ఉద్యోగానికి ఎసరు?
లక్నో: పైఅధికారులు ఫోన్ చేస్తేనే ఎంతో హడావిడి చేస్తారు అధికారులు. అలాంటిది కేంద్ర మంత్రి ఫోన్ అంటే మరి ఎలా ఉంటుంది? కానీ, ఫోన్ చేసిన కేంద్రమంత్రి గొంతును గుర్తుపట్టకపోవడం వల్ల ఓ అధికారి ఉద్యోగానికే ఎసరు తెచ్చింది. కేంద్ర మహిళా, శిశు సంక్షేమశాఖ మంత్రి, ఉత్తర్‌ప్రదేశ్‌లోని అమేథీ నియోజకవర్గ ఎంపీ స్మృతి ఇరానీ ఫోన్ చేయగా ఓ శాఖలో పని చేస్తున్న క్లర్క్ గుర్తించకపోవటంతో ఆయనపై దర్యాప్తునకు ఆదేశించారు. ఏం జరిగింది? అమేథీ లోక్‌సభ నియోజకవర్గంలో కేంద్రమంత్రి స్మృతి ఇరానీ ఆగస్టు 27న పర్యటించారు. అదే సమయంలో ముసఫిర్ఖానా తహసిల్‌లోని పూరే పహల్వాన్ గ్రామానికి చెందిన కరుణేశ్(27) అనే వ్యక్తి తన తల్లికి పెన్షన్ మంజూరు కాలేదనే విషయాన్ని కేంద్రమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. అందుకు స్థానిక కార్యాలయంలో క్లర్క్ దీపక్ కారణమని పేర్కొన్నారు. పెన్షన్ దరఖాస్తును ఇంకా అతడు ధ్రువీకరించలేదని తన గోడు వెల్లబోసుకున్నాడు. వెంటనే స్పందించిన స్మృతి ఇరానీ.. ఆ అధికారికి ఫోన్ చేశారు. కానీ, ఆ వ్యక్తి మాత్రం కేంద్ర మంత్రి గొంతును గుర్తు పట్టలేకపోయారు. దీంతో ఆమె పక్కనే ఉన్న జిల్లా ఉన్నతాధికారి ఆ ఫోన్ తీసుకొని క్లర్క్‌తో మాట్లాడారు. వెంటనే కార్యాలయానికి రావాలని స్పష్టం చేశారు. ఈ విషయంపై విచారణ జరపాలని జిల్లా అధికారులకు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ సూచించారు. కరుణేశ్ ఇచ్చిన ఫిర్యాదును పరిశీలించిన అధికారులు.. క్లర్క్ నిర్లక్ష్యం వహించినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ ఘటనపై ముసఫిర్ఖానా సబ్‌డివిజినల్ మేజిస్ట్రేట్ విచారణ జరుపుతారని.. నివేదిక ప్రకారం నిర్లక్ష్యం వహించిన అధికారిపై చర్యలు ఉంటాయని అధికారులు తెలిపారు. ఇదీ చదవండి: మోదీ రోజుకు ఏడు సార్లు నమాజ్ చేసేవారు.. కాంగ్రెస్ మహిళా నేత వ్యాఖ్యలపై దుమారం.. -
సెల్ఫీ పిచ్చి తెచ్చిన తంటా ... ఏకంగా అగ్ని పర్వతంలోనే జారీ...
సెల్ఫీల పిచ్చితో ఇటీవల యువత ఎంత భయానక ప్రమాదాలను కొని తెచ్చుకంటున్నారో చూస్తేనే ఉన్నాం. మనం ఉన్నది ప్రమాదకరమైన ప్రదేశం వద్ద అన్న విషయం మర్చిపోయి మరీ సెల్ఫీ మోజుతో ప్రాణాల పైకి తెచ్చుకుంటున్నారు. అచ్చం అలానే ఇక్కడొక వ్యక్తి సెల్ఫీ పిచ్చితో చావు అంచు వరకు వెళ్లొచ్చాడు. వివరాల్లోకెళ్తే...ఒక అమెరికన్ టూరిస్ట్ తన కుటుంబంతో సహా ఇటలీలోని ప్రఖ్యాత అగ్ని పర్వతం అయిన మౌంట్ వెసువియస్ పర్వతం వద్దకు వెళ్లాడు. అక్కడ అతను తన కుటుంబంతో కలిసి ఆ అగ్నిపర్వత వద్ద సెల్ఫీలు తీసుకుంటున్నాడు. ఇంతలో అతని ఫోన్ ప్రమాదవశాత్తు ఆ అగ్ని పర్వతం బిలంలో పడిపోయింది. తన ఫోన్ కోసం అని ఆ అమెరికన్ టూరిస్ట్ ఆ అగ్నిపర్వతం బిలంలోకి దిగడానికి యత్నిస్తున్నాడు. ఐతే అతను ప్రమాదవశాత్తు పట్టుతప్పి ఆ బిలంలోకి పడిపోయాడు. అతను బిలంలోకి పడిపోవడాన్ని గుర్తించిన స్థానిక గైడ్లు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు పట్టారు. ఈ మేరకు పోలీసులు కూడా రంగంలోకి దిగి హెలికాప్టర్ సాయంతో ఆ వ్యక్తిని రక్షించారు. ఐతే పోలీసులు అతనిపై కేసులు నమోదు చేసి అరెస్టు చేశారు. వాస్తవానికి అతను ఈ అగ్నిపర్వతం వద్దకు వెళ్లేందుకు ఎలాంటి అనుమతి తీసుకోలేదు. ఇది చాలా ప్రమాదాకరమైన ప్రదేశం అని పర్యాటక సందర్శనకు నిషేధించారు. ఆ టూరిస్ట్ ఎలాంటి అనుమతి లేకుండానే తన కుటుంబంతో సహా అక్కడకు రావడంతో అతనిపై కేసు నమోదు చేశారు పోలీసులు. (చదవండి: గోటబయ పరార్.. లంకలో ఎమర్జెన్సీ: బయట కనిపిస్తే కాల్చివేతే) -
అదిరిపోయే ఫీచర్లతో నథింగ్ ఫోన్ (1).. ధర ఎంతంటే!
ఎట్టకేలకు నథింగ్ ఫోన్ (1) స్మార్ట్ ఫోన్ భారత్ స్మార్ట్ ఫోన్ మార్కెట్లో విడుదలైంది. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ ఫోన్ ఎలా ఉంది. ఫోన్ ధరెంత? ఫీచర్లు ఎలా ఉన్నాయనే విషయాల గురించి తెలుసుకుందాం. దేశీయ మార్కెట్లో శాంసంగ్, షావోమీ, రియల్ మీ స్మార్ట్ ఫోన్లకు గట్టి పోటీ ఇస్తూ విడుదలైన నథింగ్ ఫోన్ (1) ధర రూ.32,999గా ఉంది. వన్ ప్లస్ కో- ఫౌండర్ కార్ల్ పీ సొంతంగా స్మార్ట్ ఫోన్ నథింగ్‌ను విడుదల చేశారు. విడుదలైన ఈ ఫోన్ వన్ ప్లస్‌కు చెందిన 'వన్ ప్లస్ నార్డ్ 2టీ' కంటే నథింగ్ ఫోన్ (1) ఫోన్ బాగుంటుందని మార్కెట్ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. నథింగ్ ఫోన్ (1)ఫీచర్లు నథింగ్ ఫోన్ (1) ఫోన్ 6.55 అంగుళాల ఎఫ్‌హెచ్‌డీ ప్లస్, 4,500ఎంఏహెచ్ బ్యాటరీ, 33డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్, 15డబ్ల్యూ క్యూఐ వైర్లెస్ ఛార్జింగ్, గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్‌తో 10-బిట్ ఓఎల్ఈడీ డిస్ప్లే ప్యానల్, హెచ్డీఆర్10 ప్లస్ సపోర్ట్, 402పీపీఐ పిక్సెల్ డెన్సిటీ, 1200 నిట్స్ పీక్ బ్రైట్ నెస్, 120హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్, 240హెచ్ జెడ్ టచ్ శాంప్లింగ్ సదుపాయం ఉంది. దీంతో పాటు ఈ ఫోన్లో క్వాల్కం స్నాప్ డ్రాగన్ 778జీ ప్లస్ చిప్ సెట్, 12జీబీ ఎల్పీడీడీఆర్5 ర్యామ్, 256జీబీ యూఎఫ్ఎస్ 3.1స్టోరేజ్ సపోర్ట్ ఉంది. ఈ ఫోన్లో డ్యూయల్ కెమెరా సెటప్, 50 ఎంపీ సోనీ ఐఎంఎక్స్ 766 సెన్సార్ (ఓఐఎస్ ప్లస్ ఈఐఎస్),50 ఎంపీ శాంసంగ్ జేఎన్1 ఆల్ట్రా వైడ్ సెన్సార్(ఈఐఎస్)16 ఎంపీ సోని ఐఎంఎక్స్ 471 ఫ్రంట్ కెమెరా వంటి ఫీచర్లు ఉన్నాయి. వన్ ప్లస్ నార్డ్2 టీ వర్సెస్ నథింగ్ ఫోన్ (1) ధరలు మనదేశంలో నథింగ్ ఫోన్ (1), వన్ ప్లస్ నార్డ్2 మధ్య వ్యత్యాసం ఎలా ఉందో చెక్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. నథింగ్ ఫోన్ మూడు స్టోరేజ్ వేరియంట్లలో అందుబాటులో ఉంది. 8జీబీ ర్యామ్ ..128జీబీ స్టోరేజ్ ఫోన్ ధర రూ. 32,999, 8జీబీ ర్యామ్..256జీబీ ఫోన్ ధర రూ. 35,999, 12జీబీ ర్యామ్.. 256 జీబీ స్టోరేజ్ ఫోన్ ధర రూ.38,999గా ఉంది. ఇక వన్ ప్లస్ నార్డ్2 టీలో కేవలం రెండు వేరియంట్ స్టోరేజ్ సదుపాయం ఉంది. 8జీబీ ర్యామ్ 128జీబీ (రూ. 28,999), 12జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్ మాత్రమే ఉంది. ఈ వేరియంట్ స్టోరేజ్ ఫోన్ ధర (రూ. 33,999).గా ఉంది. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
అదిరిపోయే గాడ్జెట్, ఫోన్లో మీరు అరిచి గీపెట్టినా ఎవ్వరికి వినబడదు!
సాధారణంగా నలుగురిలో ఫోన్ మాట్లాడటం మహా కష్టం. అదీ ఆఫీసుల్లో, ప్రయాణాల్లో ఇంకా కష్టం. మనం మాట్లాడితే పక్కవారు మన రహస్యాలను వింటున్నారా? మాటలను గమనిస్తున్నారా? ఇలా ఎన్నో భయాలతో.. ఫోన్లో అవతల వ్యక్తికి చెప్పాలనుకున్నది చెప్పలేం. మరోవైపు మన ఫోన్ సంభాషణలతో పక్కవాళ్లకు ఇబ్బంది కలుగుతుందేమోననే భయం కొన్నిసార్లు ముఖ్యమైన ఫోన్‌కాల్స్‌ను కూడా మాట్లాడనివ్వదు. పోనీ ఇయర్ ఫోన్స్ పెట్టుకుని మాట్లాడదామంటే.. అవతల వ్యక్తికి మన మాట సరిగా వినిపించకపోవడమో, చెవుల్లో ఇయర్ ఫోన్స్ ఉండటంతో.. మనమెంత బేస్‌లో మాట్లాడుతున్నామో మనకు తెలియకపోవడమో ఇలా చాలా సమస్యలు ఉంటాయి. దాంతో ఏదైనా రహస్యం చెప్పాలంటే.. తర్వాత చెబుతానులే అనేస్తాం. మాట దాటేస్తాం. అలాంటి సమస్యకు చెక్ పెడుతోంది ఈ ఉష్మీ హెడ్ ఫోన్స్. చక్కగా వందమందిలో ఉన్నా రహస్యాలను ఆపాల్సిన పనిలేకుండా చేస్తుంది ఈ డివైజ్. దీన్ని మెడలో వేసుకుని, సంబంధిత యాప్ స్మార్ట్ ఫోన్లో డౌన్లోడ్ చేసుకుంటే చాలు. ఫోన్ రాగానే దాని ఇయర్ ఫోన్స్ చెవిలో పెట్టుకుని.. మెయిన్ బోర్డ్ డివైజ్‌ని పెదవులకు దగ్గరగా బిగించుకోవాలి. దీంట్లో సైజ్ అడ్జస్టబుల్ సిస్టమ్ ఉంది. ఔటర్ స్పీకర్స్, మినీ జాక్, ఎయిర్ ఛానల్, మైక్రోఫోన్ ఇలా హై టెక్నాలజీతో రూపొందిన ఈ డివైజ్ ఎంత గట్టిగా మాట్లాడినా మన వాయిస్‌ని క్యాప్చర్ చేసి.. బయటికి అస్సలు వినిపించనివ్వకుండా ఫోన్లో అవతల వ్యక్తికి మాత్రం స్పష్టంగా వినిపించేలా చేస్తుంది. స్మార్ట్ ఫోన్ యాప్‌తో లైబ్రరీ మాస్కింగ్ సౌండ్లను ఎంచుకోవడానికీ, వాల్యూమ్‌ను సర్దుబాటు చేయడానికీ వీలుంటుంది. బయటి నుంచి వచ్చే శబ్దాలను ఇది చాలా సులభంగా నివారిస్తుంది. ఒకవేళ ఏ కారణం చేతైనా క్యాప్చర్ అయినా వాటిని తగ్గించి మన మాటను మాత్రమే అవతలవారికి వినిపించేలా చేస్తుంది. ఆప్షన్స్‌ను బట్టి ధరల్లో వ్యత్యాసం ఉంటుంది. -
ఆ ఆనందం వెలకట్ట లేనిది!: హృదయాన్ని కదిలించే వైరల్ వీడియో!:
ఇంతవరకు మనం ఎన్నో వైరల్ వీడియోలు చూశాం. చాలా వరకు మనస్సుకు హత్తుకునేవి, కదిలించేవి చూశాం. అచ్చం అలాంటి వైరల్ వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట తెగ హల్చల్ చేస్తుంది. పైగా తమిళ నటుడు మాధవన్‌ని సైతం ఆకట్టుకుంది. (చదవండి: అయోధ్యలో నిర్మిస్తున్న రామ మందిరానికి ప్రపంచంలోనే అతిపెద్ద తాళం!) అసలు విషయంలోకెళ్తే...ఆ వీడియోలో ఒక కొడుకు తన తల్లి పుట్టిన రోజు సందర్భంగా బహుమతి తీసుకువచ్చి ఇస్తున్నట్లు కనిపిస్తుంది. అయితే ఆమె సందేహంగా ఆ కవర్ని తెరుస్తుంది. ఆ తర్వాత ఆమె అందులో ఉన్న రూ. 8 వేలు ఖరీదు చేసే ఫోన్‌ని చూసి ఒక్కసారిగా చాలా సంబరపడిపోతుంది. పైగా ఆ ఆనందం మాటల్లో చెప్పలేనది, వెలకట్టలేనిది. ఈ మేరకు మనసును కదిలించే ఈ వీడియోకి "ఈ ఆనందాన్ని వెలకట్ట లేం" అనే క్యాప్షన్‌ని జోడించి మరీ విఘ్నేష్ అనే యూజర్ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. అయితే ఈ వీడియో ఎంతో మంది నెటిజన్లను కదిలించింది. ఆఖరికి తమిళనటుడు మాధవన్ సైతం "తల్లి ముఖంలో తెచ్చిన ఆనందం వెలకట్ట లేనిది" అని తమిళంలో క్యాప్షన్ ఇచ్చి మరీ రీట్విట్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియోకి లక్షల్లో వ్యూస్, లైక్‌లు వస్తున్నాయి మీరు కూడా ఓ లుక్కేయండి. (చదవండి: 60 మిలియన్లకు కోవిడ్ కేసులు..మృతుల సంఖ్య 8 లక్షలకుపైనే!) Adhula Irundha Mobile-oda Velai Verum 8800 Rs Dhan...! Aana Enga Amma Patta Sandhoshathuku Velayae Kidayaadhu ❤️ Birthday Gift..! pic.twitter.com/4QZJE7Ocii — Vignesh (@VigneshSammu) January 5, 2022 -
మిస్డ్ కాల్ వచ్చింది..రూ.46లక్షలు పోయాయి
ఈజీగా డబ్బులు సంపాదించడం ఎలా? ఇప్పుడు దీని గురించి సైబర్ నేరస్తులు ఆలోచిస్తున్నారు. ఓవైపు కరోనా, కొత్తగా పుట్టుకొస్తున్న టెక్నాలజీలు.వెరసీ సైబర్ నేరస్తులు డబ్బులు సంపాదించడం చాలా ఈజీ అవుతుంది. కోవిడ్ కారణంగా సైంబర్ నేరాలు పెరిగిపోతున్నాయని, ఫోన్ కాల్స్, ఓటీపీల పట్ల అప్రమత్తంగా ఉండాలని టెక్ నిపుణులు హెచ్చరిస్తున్నా.. కొంతమంది ఆ సూచనల్ని లైట్ తీసుకుంటున్నారు. దీన్ని అదునుగా చేసుకొని కేటుగాళ్లు మిస్డ్ కాల్ ఇచ్చి బ్యాంక్ అకౌంట్లలో మనీనీ కాజేస్తున్నారు. అహ్మాదాబాద్ శాటిలైట్ ఎక్స్టెన్షన్లో నివాసం ఉండే రాకేష్ షా కెమికల్ బిజినెస్ చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఇంట్లో ఉన్న రాకేష్‌కు గుర్తు తెలియని నెంబర్ నుంచి మిస్డ్ కాల్ వచ్చింది. మిస్డ్ కాల్ వచ్చిన తర్వాత మొబైల్లో సిగ్నల్ లేకపోవడం, సిమ్ కార్డులు బ్లాక్ అయ్యాయి. దీంతో తన సిమ్ కార్డులు పనిచేయడం లేదని సదరు టెలికాం నెట్‌వర్క్‌కు చెందిన కస్టమర్ కేర్‌కి కాల్ చేశాడు. రాకేష్ ఫిర్యాదుతో నిర్వాహకులు నాలుగు గంటల్లో సిమ్‌లు యాక్టివేట్ అవుతాయని చెప్పారు. సరిగ్గా అదే రోజు రాత్రి 10 గంటల సమయంలో మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్ అయ్యిందని మరోసారి కంపెనీకి ఫిర్యాదు చేశాడు. మరుసటి రోజు ఉదయం సిమ్‌ను యాక్టివేట్ చేసే సమయంలో మళ్లీ రెండు సిమ్ కార్డ్‌లు బ్లాక్ అయినట్లు గుర్తించాడు. వెంటనే సంబంధిత సిమ్ నెట్ వర్క్‌కు సంబంధించిన స్టోర్ నిర్వాహకుల్ని నేరుగా సంప్రదించాడు. రాకేష్ ఫోన్‌ను చెక్ చేసిన స్టోర్ ప్రతినిధులు కోల్‌కతాలో రెండు సిమ్ కార్డ్‌లను బ్లాక్ చేసినట్లు గుర్తించారు. అంతేకాదు తనకు తెలియకుండా బ్యాంక్ ట్రాన్సాక్షన్లు జరిగినట్లు అనుమానించాడు. సంబంధిత బ్యాంక్‌లను సంపద్రించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. సైబర్ నేరస్తులు తన బ్యాంక్ అకౌంట్లో ఉన్న రూ.46 లక్షలు కాజేశారని కంగుతిన్నాడు. ఆర్టీజీఎస్, ఐఎంపీఎస్ ద్వారా సోనాయ్ దాస్, రోహిత్ రాయ్, రాకేష్ విశ్వకర్మ బ్యాంక్ అకౌంట్లకు ట్రాన్స్ఫర్ అయినట్లు బ్యాంక్ అధికారులు నిర్ధారించారు. దీంతో అప్రమత్తమైన రాకేషన్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 11 ట్రాన్సాక్షన్ల ద్వారా రూ.46.36 లక్షలు విత్‌డ్రా అయ్యాయని, బ్యాంకింగ్ లావాదేవీలకు సంబంధించిన ఓటీపీలను సేకరించడం ద్వారా బ్యాంక్‌లో డబ్బులు మాయమైనట్లు పోలీసులు తెలిపారు. చదవండి: గూగుల్ క్రోమ్ యూజర్లకు కేంద్రం హెచ్చరిక..! -
ఒక్క అంకె తప్పుగా ఇవ్వడంతో ఆ మహిళకు 4,500 మిస్డ్ కాల్స్!
మన ఫోన్‌కి అదే పనిగా కాల్స్ వస్తేనే చాలా చికాకుగా ఉంటుంది. అలాంటిది అదే పనిగా మిస్డ్ కాల్స్ వస్తే అబ్బా ఏంటిది అని విసుగ్గా అనిపిస్తుంది. కానీ యూకేకి చెందిన ఒక మహిళకి ఏకంగా 4500 మిస్డ్ కాల్స్ వచ్చాయంటా తెలుసా!. (చదవండి: ఏకంగా పామునే హెయిర్ బ్యాండ్‌గా చుట్టుకుంది!! వైరల్ వీడియో) అసలు విషయంలోకెళ్లితే....యూకేలోని ఉత్తర ఐర్లాండ్‌లోని బాంగోర్కు చెందిన హెలెన్ ఫోన్ మొత్తం మిస్డ్ కాల్స్‌తో నిండిపోయింది. అయితే ఆమె బిజినెస్ కాంటాక్ట్ నెంబర్ని హెల్ప్ లైన్ నెంబర్ అని తప్పగా భావించడంతో ఆమెకు తెగ కాల్స్ వచ్చాయి. ఈ మేరకు ఆమె బిజినెస్ కాంటాక్ట్ నెంబర్‌కి డిపార్ట్మెంట్ ఫర్ ది ఎకానమీ డెలివరీ చేసిన స్పెండ్ లోకల్ స్కీమ్ ఫోన్ నెంబర్‌కి ఒక అంకె తేడా ఉండటంతో వారు తప్పుగా హెలెన్ బిజినెస్ కాంటాక్ట్ నెంబర్ని ఇచ్చారు. దీంతో ఆ లోకల్ స్కీమ్‌కి చెందిన కస్టమర్లంతా తమ కార్డు బ్యాలెన్స్ చెక్ చేయండి అంటూ హెలెన్స్కి రకరకాలు కాల్స్ చేశారు. అయితే వారిలో కొంతమంది వృద్ధుల ఉంటే వారికి తనవంతుగా సాయం చేసింది. మరికొందరికి అసలు విషయాన్ని వివరించింది కూడా. ఏది ఏమైనా ఎన్ని కాల్స్ రిసీవ్ చేసుకోగలరు ఎవరైనా. చివరికి ఆమె ఇక మిగతా ఏ కాల్ని రిసీవ్ చేసుకోవడం మానేసింది. దీంతో ఆమె ఫోన్ మొత్తం మిస్డ్ కాల్స్‌తో నిండిపోయింది. ఈ మేరకు డిపార్ట్మెంట్ ఫర్ ది ఎకానమీ సదరు మహిళకు క్షమాపణలు చెప్పింది కూడా. (చదవండి: అవిభక్త కవలలు ప్రభుత్వ ఉద్యోగాన్ని సంపాదించారు!!) -
ఫోన్ కొట్టేశాడని ఏకంగా తలకిందులుగా వేలాడదీశారు...ఐతే చివరికి!!
కొంతమంది చేసే పనులు అత్యంత హేయమైనవిగా ఉంటాయి. అసలు స్వతహాగా వాళ్లు మంచి వాళ్లైనప్పటికీ వారి జోలికి వచ్చిన లేక వారి సంబంధించిన వస్తువులు పోయినప్పుడు అపరిచితుడిలా మారిపోయి అత్యంత ధారుణానికి వడిగడుతుంటారు. అచ్చం అలానే ఇక్కడొక వ్యక్తి ఎంత ధారుణమైన పని చేశాడో చూడండి. (చదవండి: పారా సెయిలింగ్ మళ్లీ ఫెయిల్ !... ఇద్దరు మహిళలకు చేదు అనుభవం!!) అసలు విషయంలోకెళ్లితే....మొబైల్ ఫోన్ దొంగిలించాడనే ఆరోపణతో ఒక మత్స్యకారుడిని తోటి మత్స్యకారుల బృందం చేపల వేట బోటుకు తలకిందులుగా వేలాడదీసి దాడి చేసింది. అయితే ఈ ఘటన బందూర్లోని మంగళూరు ఫిషింగ్ హార్బర్లో లంగరు వేసిన ఫిషింగ్ బోట్లో చోటు చేసుకుంది. అంతేకాదు దొంగతనానికి పాల్పడ్డ వ్యక్తిపై మత్స్యకారుల బృందం దాడి చేసిన వీడియో వైరల్ కావడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. పైగా మత్స్యకారులంతా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారని పోలీసులు తెలిపారు. ఈ మేరకు సెల్‌ఫోన్‌ను దొంగిలించాడనే ఆరోపణతో దాడి చేసిన మత్స్యకారుడిని వైలా శీనుగా గుర్తించి అరెస్టు చేశాం అని చెప్పారు. అతేకాదు ఈ కేసులో మొత్తం ఆరుగురు నిందితులను అరెస్టు చేసినట్లు వెల్లడించారు. (చదవండి: పంజాబ్ కోర్టు కాంప్లెక్స్‌లో పేలుడు) -
అమానుషం: అందరు చూస్తుండగా.. రోడ్డుపై యువతిని బైక్‌తో ఈడ్చుకెళ్లి..
న్యూఢిల్లీ: బైకుపై వచ్చిన కొందరు దుండగులు మహిళ చేతిలోని ఫోన్‌ని లాకెళ్లడంతో పాటు ఆమెను బైకుతో కొంత దూరం ఈడ్చుకెళ్లారు. ఈ అమానవీయ ఘటన దేశ రాజధాని ఢిల్లీలోని షాలిమార్ బాగ్‌లో చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే.. రోడ్డుపై ఓ మహిళ చేతిలో ఫోన్ పట్టుకుని నిల్చుని ఉంది. ఇదంతా గమనించిన ఇద్దరు వ్యక్తులు వేగంగా ఆమె వైపు బైకు నడుపుకుంటూ మహిళ చేతిలోని ఫోన్‌ని లాక్కొన్నారు. దీన్ని ప్రతిఘటించిన ఆమె వెంటనే బైకుపై ఉన్న ఓ వ్యక్తి చొక్కాను గట్టిగా పట్టుకుంది. దీంతో అక్కడి నుంచి పారిపోయేందుకు ఆ దొంగలు ప్రయత్నించారు. ఈ క్రమంలో మహిళను రోడ్డుపై 150 మీటర్ల దూరం వరకు ఈడ్చుకెళ్లారు. చివరకు ఆ ప్రాంతం నుంచి ఆగంతకులు పారిపోగా , ఘటనా స్థలంలో ఉన్న కొందరు ఆమెను రక్షించారు. ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితులను గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. చదవండి: లీనా నాయర్ సీఈవో ఘనత.. తన శైలిలో మహీంద్రా స్పందన -
కూల్‌గా కూర్చోని ఫోన్ తెరిచాడు.. ఒక్కసారిగా మంటలు.. షాకింగ్ వీడియో
ఓ వైపు స్మార్ట్ ఫోన్ విక్రయాలు పెరుగుదలతో పాటే వాటి రిపేర్ల సంఖ్య కూడా పెరుగుతోంది. ఇక కొన్ని ఫోన్లు వాటి లోపల సాంకేతిక సమస్య మరేదో కారణం వల్ల వాడుతున్నప్పుడో, లేదా జేబులో పెట్టుకున్నప్పుడో పేలిన ఘటనలు బోలెడు ఉన్నాయి. అందుకే నిపుణుల ఛార్జింగ్ పెట్టినప్పుడు మొబైల్‌ని వాడకూడదని సూచిస్తుంటారు. తాజాగా ఓ వ్యక్తి ఫోన్‌ని రిపేర్ చేయాలని ప్రయత్నిస్తుండగా అది హఠాత్తుగా పేలిన ఘటన వియత్నాంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. షాపులోని ఓ వ్యక్తి తన డెస్క్ ముందు కూర్చోని ఫోన్ రిపేర్ చేస్తుంటే... సడెన్‌గా అది పెద్ద శబ్దంతో పేలింది. హఠాత్తుగా ఫోన్ పేలి మంటలు వచ్చాయి. అదృష్టవశాత్తు అతను అప్రమత్తంగా ఉండడంతో ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. అనంతరం దాన్ని జాగ్రత్తగా తీసి... షాప్ బయటకు విసిరేశాడు. అతను ఆలస్యం చేసి ఉంటే... పెద్ద అగ్ని ప్రమాదం జరిగేదే. అక్కడి సీసీటీవీ కెమెరా ఈ దృశ్యాన్ని రికార్డ్ చేసింది. ఈ వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు స్పందిస్తూ.. "ఇదే ఫోన్ పాకెట్లో పేలితే ఎలా ఉంటుందో ఊహించుకోండి" అని ఓ నెటిజన్ కామెంట్ చేయగా... "లక్కీ బాయ్ నీకు ఏమీ కాలేదు" అని మరో నెటిజన్ కామెంట్ పెట్టాడు. చదవండి: హే! ఇది నా హెయిర్ స్టైయిల్... ఎంత క్యూట్‌గా ఉందో ఈ ఏనుగు!! -
రేషన్ బియ్యం పేరుతో మహిళల ఫోన్ నంబర్లు.. అర్థరాత్రి ఫోన్ చేసి
పామిడి: అర్ధరాత్రి సమయంలో మహిళలకు ఫోన్ చేసి అసభ్యంగా మాట్లాడుతున్న ఆకతాయిని స్థానికులు గుర్తించి దేహశుద్ధి చేశారు. వివరాలు.. పామిడి మండలం పాళ్యం గ్రామానికి చెందిన యువకుడు అశోక్.. రేషన్ బియ్యం కొనుగోలు చేస్తానంటూ చాలా మంది మహిళల ఫోన్ నంబర్లు సేకరించుకున్నాడు. ఈ క్రమంలోనే వారికి అర్ధరాత్రి సమయంలో అపరిచిత నంబర్ల నుంచి ఫోన్ చేస్తూ వేధించేవాడు. ఇటీవల మండల కేంద్రంలోని పామిడమ్మ వీధికి చెందిన మహిళకు అర్ధరాత్రి ఫోన్ చేసి అనుచిత వ్యాఖ్యలు చేయడంతో కుటుంబసభ్యులు జోక్యం చేసుకుని మాట్లాడారు. మంగళవారం నెహ్రూ కాలనీలోని ఓ ప్రైవేట్ స్కూల్ వద్ద అశోక్‌ని గుర్తించి, నిలదీయడంతో వారితో వాగ్వాదానికి దిగాడు. సహనం కోల్పోయిన బాధితులు ఒక్కసారిగా అతనికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. విచారణలో వారం రోజుల క్రితం పామిడిలోని మదీనా కాలనీలో ఓ మహిళపై అతను దాడి చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. -
చార్జింగ్కు పెట్టి ఫోన్లో మాట్లాడిన యువతి, అక్కడికక్కడే..
ఫోన్ చార్జింగ్ పెట్టినప్పుడు ఉపయోగించకూడదని, ఆ సమయంలో కాల్స్ మాట్లాడటం ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తుంటారు. ఎందుకంటే అలా ఫోన్ చార్జింగ్ పెట్టి ఉపయోగిస్తుంటే.. అందులోంచి మంటలు రావడం, బ్యాటరీ పేలి.. గాయపడిన ఘటనలు బోలెడు ఉన్నాయి. తాజాగా ఓ యువతి ఫోన్‌కు చార్జింగ్ పెట్టి మాట్లాడుతుండగా ప్రమాదవశాత్తు మృతి చెందింది. ఈ ఘటన బ్రెజిల్లో చోటు చేసుకుంది. అయితే ఆ దేశంలో ఈ తరహా ఘటన జరగడం ఇది మూడో సారి. అది కూడా ఒక వారంలోనే. ది సన్‌లో వచ్చిన సమాచారం ప్రకారం.. 18 ఏళ్ల రాడ్జా తన ఫోన్‌ని ఉపయోగిస్తుండగా, శాంటారెమ్‌లోని తన ఇంటిపై పిడుగుపడింది. దీంతో ఆమె విద్యుత్ షాక్‌కు గురై స్పృహ కోల్పోయింది. అయితే కుటుంబ సభ్యులు ఆమెను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. దురదృష్టవశాత్తు, రాడ్జా అప్పటికే మృతి చెందింది. గతవారం కూడా అపొలినారియా జిల్లాలో చార్జింగ్ పెట్టి ఫోన్ ఉపయోగించి పిడుగుపాటుకు గురై ఓ వ్యక్తి చనిపోయాడు. అలాగే కౌన్సిలర్ రాయ్‌ముండో బ్రిటో కూడా ఇలాగే చార్జింగ్ పెట్టి ఫోన్ ఉపయోగించి.. పిడుగుపాటుకు గురయ్యాడు. దీంతో.. ఫోన్ చార్జింగ్ పెట్టి.. ఎవ్వరూ కాల్స్ ఎత్తకూడదని.. ఫోన్ ఉపయోగించకూడదని.. బ్రెజిల్ ప్రభుత్వ అధికారులు ప్రజలను హెచ్చరించారు. చదవండి: Fact Check: హెలికాప్టరుకు ఉరేసి ఉరేగించిన తాలిబన్లు?.. అసలు నిజం ఇది! -
మార్కెట్లో విడుదల కానున్న బడ్జెట్ ఫోన్
హాంకాంగ్‌కు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ ఇన్ఫినిక్స్ మరో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌ను లాంఛ్ చేసేందుకు సిద్ధమైంది. వచ్చే (సెప్టెంబర్) నెలలో ఇన్ఫినిక్స్ హాట్ 11ను విడుదల చేయనున్నట్లు స్మార్ట్ ఫోన్ సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఇప్పటికే ఇన్ఫినిక్స్ నోట్ 7, ఇన్ఫినిక్స్ హాట్ 9, ఇన్ఫినిక్స్ హాట్ 10ఎస్ బడ్జెట్ ఫోన్లతో రూరల్ ఇండియాను టార్గెట్ చేస్తున్న ఇన్ఫినిక్స్ సంస్థ తాజాగా ఇన్ఫినిక్స్ హాట్ 11 విడుదల ప్రకటనతో ఆఫోన్ ఫీచర్లు, ధర ఎంత? అనే విషయంపై స్మార్ట్ ఫోన్ యూజర్లు ఆసక్తిని కనబరుస్తున్నారు.ప్రస్తుతం ఆన్ లైన్లో విడుదలైన ధర, ఫీచర్లు ఇలా ఉన్నాయి. ఇన్ఫినిక్స్ హాట్ 11 ఫీచర్లు రెండు మెమరీల వేరియంట్ తో 4జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్,6జీబీ ర్యామ్, 64జీబీ స్టోర్‌తో ఇన్ఫినిక్స్ హాట్ 11 ధర రూ.9,999గా ఉండగా నుంది. మీడియాటెక్ హెలియో G88 సిస్టమ్-ఆన్-చిప్ తో అందుబాటులోకి రానుండగా.. పూర్తి స్థాయిలో ఫీచర్లను ఇన్ఫినిక్స్ సంస్థ విడుదల చేయలేదు. -
ఫోన్లో మాట్లాడుతుందని అనుమానం పెంచుకున్నాడు..
సాక్షి,పటాన్చెరు టౌన్: ఇతరులతో ఫోన్లో మాట్లాడుతుందని అనుమానం పెంచుకున్న భర్త..భార్యను సుత్తితో తలపై కొట్టి హత్య చేసిన సంఘటన పటాన్చెరు పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ వేణుగోపాల్‌రెడ్డి, క్రైం సీఐ శ్రీనివాసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని చిట్కుల్ వడ్డెర కాలనీకి చెందిన రాజేశ్వరి(23)కి మూడు సంవత్సరాల క్రితం మెదక్ జిల్లా కౌడిపల్లి మండల పరిధిలోని వెంకటరావుపేట గ్రామానికి చెందిన మేక వేలుతో వివాహం జరిగింది. పెళ్లి తర్వాత చిట్కుల్లోని వడ్డెరకాలనీలోనే కాపురం పెట్టారు.రెండున్నరేళ్ల కుమారుడు రాజేష్ ఉన్నాడు. మేక వేలు రాయి కొట్టే పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో భార్య ఇతరులతో ఎక్కువగా ఫోన్లు మాట్లాడుతుందని అనుమానం పెంచుకున్నాడు. ఇదే విషయమై తరచు ఇద్దరి మధ్య గొడవలు జరిగేవి. ఈ 16వ తేదీన కూడా ఇద్దరు గొడవ పడగా, కుటుంబసభ్యులు సర్దిచెప్పారు. మనసులో కక్ష పెట్టుకున్న మేక వేలు బుధవారం ఉదయం రాళ్లు కొట్టేందుకు ఉపయోగించే సుత్తితో భార్య రాజేశ్వరి తలపై గట్టి కొట్టాడు. దీంతో ఆమె గట్టిగా అరుపులు వేయగా, మేక వేలు ఇంటి నుంచి పరారయ్యాడు. చుట్టుపక్కల వారు, కుటుంబసభ్యులు గమనించి పటాన్చెరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆమె మృతి చెందిందని డాక్టర్లు చెప్పారు. మృతదేహానికి పోస్టుమార్టమ్ చేసి కుటుంబ సభ్యులకు అప్పగించారు. కాగా, భార్యను హత్య చేసిన మేక వేలు పటాన్చెరు పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
కుటుంబ సభ్యుల క్రూరత్వం, ఫోన్లో మాట్లాడుతున్నారని..
భోపాల్: దేశంలో మహిళల కోసం ఎన్ని చట్టాలు రూపొందించిన వారి పై దాడులు జరుగుతూనే ఉన్నాయి. ప్రత్యేకంగా వారి రక్షణ కోసం ప్రభుత్వాలు ఎన్నో ప్రయత్నాలు, ఇంకెన్నో కార్యక్రమాలు చేపడుతున్నా అవేవి వారిని కాపాడలేకపోతున్నాయనే చెప్పాలి. ఓ వైపు బయట వాళ్ల నుంచి లైంగిక దాడులు, మరో వైపు కుటుంబ సభ్యుల నుంచి ఆచారాలు పేరుతో ఆగడాలు.. ఇలా వాళ్లపై హింసాకాండలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇటీవల ఓ యువతిని కుటుంబ సభ్యులే చెట్టుకు వేలాడదీసి కర్రలతో కొట్టగా.. తాజాగా సభ్య సమాజంలో ఇలాంటి ఘటనలు కూడా జరుగుతాయా అనే సందేహం కలిగేలా.. బంధువులతో ఫోన్లో మాట్టాడారని నేపంతో కుటుంబ సభ్యులే యువతులపై క్రూరంగా ప్రవర్తించారు. ఈ దారుణ ఘటన మధ్యప్రదేశ్‌లోని ధార్ జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల ప్రకారం.. ఇద్దరు యువతులు వారి బంధువులతో ఫోన్ మాట్లాడుతున్నట్లు కుటుంబ సభ్యులకు తెలిసింది. దీంతో కోపంతో ఆ యువతులను ఇంట్లోని వారే దారుణంగా హింసించారు. కాగా వీడియో బయటకు రావడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఆ వీడియోలో.. యువతులు కొట్టకండి అని కుటుంబ సభ్యులను వేడుకుంటున్నా కనికరం లేకుండా వాళ్లను కర్రలు, రాళ్ళతో కొట్టారు. వారిని హింసించిన వారిలో ఓ మహిళ కూడా ఉండడం గమనార్హం. తాండా పోలీస్ స్టేషన్ అధికారుల ప్రకారం.. ఈ సంఘటన జూన్ 22 న పీపాల్వా గ్రామంలో జరగగా, వీడియో కాస్త జూన్ 25 న పోలీసులకు చేరింది. దీనిపై వెంటనే స్పందించిన పోలీసులు ఏడుగురిని అరెస్ట్ చేశారు. తాజాగా ఈ వీడియో వైరల్‌గా మారింది. I have received another complaint of a woman being brutally beaten up by a mob. If anyone can update me on this case : wrt location and date. What kind of a barbaric society have we become, the person is laughing while filming this! No fear of the law? Contempt of SC judgments! pic.twitter.com/kl1CNUIs6S— Tehseen Poonawalla Official 🇮🇳 (@tehseenp) July 4, 2021 -
ఫోన్ మాట్లాడుతూ లోతైన బావిలో.. కేకలు వేసినా ఫలితం లేదు
పలమనేరు: ఫోన్ మాట్లాడుతూ.. పరాకుగా కాలుజారి 60 అడుగుల లోతున్న పాడుబడ్డ బావిలో పడిపోయాడు. ఈత రావడంతో కొద్దిసేపు ఈది చెట్ల వేర్లను పట్టుకుని నిలదొక్కుకున్నాడు. రక్షించమని కేకలు వేశాడు. నిర్మానుష్యంగా ఉన్న అటువైపు ఎవరూ రాకపోవడంతో ప్రయోజనం లేకపోయింది. దాదాపు 17 గంటల తర్వాత అతడి కేకలు పశువులు మేపుకొనే వ్యక్తికి వినిపించాయి. దీంతో అతడి ప్రాణాలు దక్కాయి. మరో 3 గంటలకు అతడిని పైకి తీశారు. మొత్తం 20 గంటలపాటు మృత్యుపోరాటం చేశాడతడు. ఈ సంఘటన చిత్తూరు జిల్లా పలమనేరులో జరిగింది. పలమనేరుకు చెందిన రియల్ ఎస్టేట్ దళారి చంద్రశేఖర్ గురువారం మధ్యాహ్నం పట్టణానికి సమీపంలోని ఓ దాబాలో భోజనం చేసి ఫోన్ మాట్లాడుతుండగా, దాబా వెనుక ఉన్న మెట్లు లేని బావిలో కాలుజారి పడ్డారు. 60 అడుగుల లోతైన ఆ బావిలో 12 అడుగుల నీరుంది. ఈదుకుంటూ కొంతసేపటి తర్వాత చెట్ల వేర్లను పట్టుకుని నీటిపైకి చేరుకున్నాడు. ఎవరైనా కాపాడాలంటూ గట్టిగా అరిచాడు. అటువైపు ఎవరూ రాకపోవడంతో అతని గోడు ఎవరికీ తెలియలేదు. గురువారం రాత్రంతా బావిలోనే గడిపాడు. శుక్రవారం ఉదయం పశువులు మేపడానికి జీవన్ అనే యువకుడు వెళ్లాడు. బావిలోంచి అరుపులు రావడంతో వెళ్లి చూసిన జీవన్‌కుమార్‌కు చంద్రశేఖర్ కనిపించాడు. అగ్ని మాపక సిబ్బంది తాడు సాయంతో చంద్రశేఖర్‌ను బావిలోంచి బయటకు లాగారు. తాను ప్రాణాలతో బయటపడాతానని అనుకోలేదన్న చంద్రశేఖర్.. తనను కాపాడిన జీవన్‌కుమార్‌కు కృతజ్ఞతలు తెలిపారు. -
ఊసరవెల్లిలా రంగులు మార్చే ఫోన్, అందరి దృష్టి దానిపైనే
మొబైల్ వరల్డ్ కాంగ్రెస్‌లో ఈసారి అందరి దృష్టి ఇన్ఫినిక్స్ కాన్సెప్ట్ 2021 ఫోన్‌పై పడింది. గతంలో ఎన్నడూ లేని విధంగా సరికొత్త కాన్సెప్ట్‌తో ఈ ఫోన్లో ఫీచర్స్‌ని ఇన్ఫినిక్స్ చేర్చింది. రంగులు మార్చేస్తుంది డ్యూయల్ కలర్ ఛేంజింగ్ బ్యాక్ కవర్ ఈ ఫోన్ ప్రత్యేకత. ఇన్ఫినిక్స్ వెల్లడించిన వివరాల ప్రకారం ఈ ఫోన్ బ్యాక్ ప్యానెల్ కలర్ మారుతుందని ఇన్ఫినిక్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మేనేజర్ జెస్సీ ఝాంగ్ తెలిపారు. గతంలో ఈ తరహా ఫీచర్‌తో ఏ ఫోన్ రాలేదు. ఒక రకంగా ఈ ఫోన్ ఊసరవెల్లిలా రంగులు మార్చేస్తుంది. క్రేజీ ఫీచర్లు యువతను ఆకట్టుకునేలా అనేక ఫీచర్లను ఇన్ఫినిక్స్ తన రాబోయే ఫోన్లో జోడించనుంది. అందులో కలర్ ఛేంజింగ్ బ్యాక్ ప్యానెల్‌తో పాటు 4000 mAh బ్యాటరీ అందివ్వనుంది దీనికి తోడుగా 160 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ ఇవ్వడం వల్ల 10 నిమిషాల్లోనే ఈ ఫోన్ ఫుల్ ఛార్జ్ అవుతుంది. 50 వాట్స్ వైర్లెస్ ఛార్జింగ్ అందివ్వనుంది. 3డీ గ్లాస్ కవరింగ్, 60 ఎక్స్ జూమ్ వంటి ఫీచర్లు అందించింది. అంతేకాదు ఫోన్ ఎక్కువగా వాడుతున్నా... ఛార్జింగ్ చేసే సమయంలో వేడెక్కకుండా ఉండే టెక్నాలజిని ఉపయోగిస్తున్నట్టు ఇన్ఫినిక్స్ తెలిపింది. చదవండి : Gravton Quanta EV: రూ.80కే.. 800 కిలోమీటర్లు ప్రయాణం -
Phone Hacking : మీ ఫోన్ హ్యాక్ అయ్యిందా? గుర్తించండిలా?!
రోజు రోజుకి టెక్నాలజీ అభివృద్ది చెందుతుంది. అయితే అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీ వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో అన్నే నష్టాలు ఉన్నాయని టెక్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా మనం వాడే గాడ్జెట్స్ అంటే మొబైల్స్, కంప్యూటర్, స్మార్ట్ వాచెస్ వినియోగం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే తీవ్రంగా నష్టపోవాల్సి ఉంటుందని అంటున్నారు. చదవండి: దేశంలో ఇళ్ల ధరలు పెరిగాయ్ ఇటీవల కాలంలో స్మార్ట్ ఫోన్ వినియోగం బాగా పెరిగిపోయింది. కానీ వినియోగదారులు ఒక్కోసారి పూర్తిగా అవగాహాన లేకుండా ఫోన్ వినియోగించడంతో హ్యాకర్స్ దీన్ని అస్త్రంగా మార్చుకుంటున్నారు. భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేయడం, లేదంటే వ్యక్తిగత సమాచారాన్ని బహిర్ఘతం చేసి రోడ్డు కీడ్చుతున్నారు. ఇలాంటి సమయాల్లో ఫోన్‌ను హ్యాక్ అయ్యేందో? లేదో తెలుసుకొని అప్రమత్తంగా ఉంటే సరిపోతుందని టెక్ నిపుణులు సలహా ఇస్తున్నారు. ఇప్పుడు మన ఫోన్ హ్యాక్ అయ్యిందో? లేదో? తెలుసుకుందాం. హ్యాక్ అయిన ఫోన్ గుర్తించండి ఇలా!: ♦మీరు ఫోన్‌ను జాగ్రత్తగానే ఉంచుకుంటారు. కానీ ఒక్కోసారి బ్యాటరీ ఛార్జీంగ్ అయిపోతుంది. అలా బ్యాటరీ ఛార్జింగ్ అయిపోవడానికి కారణం హ్యాకింగ్‌కు గురైందని అర్ధం చేసుకోవాలి. వెంటనే వ్యక్తిగత సమాచారాన్ని స్టోర్ చేసుకొని, బ్యాటరీ మార్చుకోవాలి. ♦ఒక్కోసారి ఫోన్ డెడ్ అవుతుంటుంది. ఇలాఫోన్ డెడ్ కావడానికి హ్యాకర్లు మాల్ వేర్ ను మన సెల్ ఫోన్ లోకి సెండ్ చేస్తారు. అలా వచ్చిన మాల్ వేర్ ఫోన్ లో ఉన్న సమాచారాన్ని సేకరిస్తారు. ♦ ఒక్కోసారి మీ ఫోన్ నుంచి టెక్ట్స్, కాల్స్ చేయలేరు. అలా వస్తున్నాయంటే సైబర్ నేరస్తులు మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నట్లే లెక్క. మాల్ వేర్ సాయంతో మీ బ్యాంక్ అకౌంట్లలో ఉన్న డబ్బును కాజేస్తుంటారు. మిమ్మల్ని ఏమార్చేందుకు అన్ వాంటెండ్ కాల్స్, మెసేజ్‌లు సెండ్ చేస్తుంటారు. కావాలంటే మీకు వచ్చే కాల్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయో ఒక్కసారి చెక్ చేయండి. కానీ మీరు గుర్తించలేరు. ♦ మీఫోన్ గూగుల్ క్రోమ్ లో మీకు కావాల్సిన సమచారం కోసం అన్వేషిస్తున్నారు. ఆ సమయంలో కొన్ని అనుమానాస్పద పాప్ అప్ యాడ్స్ వస్తుంటాయి. యాహు మీరు లక్షల్లో ఫ్రైజ్ మనీని గెలుచుకున్నారు. మీకు ఆఫ్రైజ్ మనీ కావాలంటే మేం అడిగిన ప్రశ్నలకు మీరు సమాధానాలు ఇవ్వాలని రిక్వెస్ట్‌లు పంపిస్తుంటారు. మీరు ఫోన్ నెంబర్ ఇచ్చారంటే మీకు కాల్స్ వస్తుంటాయి. మీ ఫోన్ కాల్ ఆధారంగా మీజేబును ఖాళీ చేస్తుంటారు. హ్యాకర్స్‌లో కొంతమంది క్లిక్ చేస్తే డబ్బులు వచ్చేలా పాప్ అప్ యాడ్స్ పంపుతుంటారు. మీతో బలవంతం క్లిక్ చేసే మీ బ్రెయిన్ ను వాష్ చేస్తుంటారు. కాబట్టి ఇలా యాడ్స్ పట్ల అప్రమత్తంగా ఉంటే మంచిది ♦ ఒక్కసారి హ్యాకర్ మీ ఫోన్లోకి ఎంటర్ అయ్యాడంటే.. మీ జీమెయిల్, బ్యాంక్ అకౌంట్లలోకి ఈజీగా వెళతాడు.పాస్‌వర్డ్‌ను రీసెట్ చేయడం,ఈమెయిల్స్‌ను పంపుతుంటారు. మీ డేటాను సేకరించి.. మీపేరు మీద క్రెడిట్ కార్డ్ లు తీసుకోవడం. మీ బ్యాంక్ అకౌంట్లలో ఉన్న మనీని కాజేస్తుంటారు. ఇదిగో ఇలాంటివి సమస్యలు మీకు ఎదురవుతుంటే మీ ఫోన్ ను హ్యాక్ కు గురవుతుందని గుర్తుంచుకోవాలి. -
మొబైల్ లవర్స్ కోసం పేపర్ ఫోన్!
అవునన్నా కాదన్నా మనం డిజిటల్ ప్రపంచంలోకి వచ్చాం. అయితే ‘అతి’ ఎప్పుడు మంచిది కాదని చరిత్ర చెబుతూనే ఉంది. సెల్‌ఫోన్ అతివాడకం వలన వచ్చే మానసిక సమస్యలు పక్కన పెడితే అసలు మనం మాట్లాడే భంగిమ సవ్యంగా లేదని, అది ‘టర్టెల్ నెక్ సిండ్రోమ్’కు దారితీస్తుందని అంటున్నారు శాస్త్రనిపుణులు. ‘సెల్‌ఫోన్ నా శరీరంలో భాగం. అది లేకుండా నేను లేను’ అనుకునే అతి సాంకేతిక ప్రేమికులను దారి మళ్లించడానికి లండన్ డిజైన్ స్టూడియో ‘స్పెషల్ ప్రాజెక్ట్స్’ పేపర్ ఫోన్ యాప్ రూపొందించింది. కాల్ చేయడం, కాల్ రిసీవ్ చేసుకోవడం సంగతి సరే, ప్రతి అతి చిన్న విషయానికి కూడా సెల్‌ఫోన్‌పై ఆధారపడకుండా మనం తప్పనిసరి, అత్యవసరం అనుకున్న సమాచారాన్ని ఏ-4 పేపర్‌కు బదిలీ చేస్తుంది ఈ పేపర్ ఫోన్. కాసేపు అయినా ఫోన్‌కు దూరంగా ఉండేలా చేస్తుంది. ముఖ్యమైన సమాచారాన్ని ప్రింట్ తీసుకొనిపెట్టుకోవడం ద్వారా కొంత సేపు అయిన ఆ డిజిటల్ బయట పడవచ్చు. అసలు యూజర్లు ఏయే విషయాలపై ఎక్కువగా సెల్‌ఫోన్‌పై ఆధారపడుతున్నారు, అందులో ముఖ్యమైనవి ఏమిటి? కానివి ఏమిటి? అనే విషయంపై వందలాది మందిని ఇంటర్వ్యూ చేసి సమాచారాన్ని సేకరించారు. ‘టెక్నాలజీని బ్యాలెన్స్ చేయడానికి పేపర్ ఫోన్ ఒక మార్గం’ అంటున్నాడు ‘స్పెషల్ ప్రాజెక్ట్’ కో-ఫౌండర్ ఆడ్రియన్. చదవండి: బిల్ గేట్స్ కు ఎన్ని ఎకరాల భూమి ఉందో మీకు తెలుసా? -
సార్! మా అమ్మ ఫోన్ కనిపెట్టండి.. ప్లీజ్..
బెంగళూరు : కరోనా వైరస్ మహమ్మారి ఎన్నో కుటుంబాలను చెల్లా చెదురు చేసింది. బంధాలను తెంచి, దిగమింగలేని విషాదాలను మిగిల్చింది. అయిన వాళ్లను కోల్పోయి, వారి జ్ఞాపకాలతో భారంగా కాలం వెల్లదీస్తున్న వారు కొందరైతే.. ఆ జ్ఞాపకాలను పథిలం చేసుకోవాలని పరితపిస్తున్న వారు మరికొందరు. కర్ణాటకకు చెందిన ఆ చిన్నారి కూడా కరోనాతో చనిపోయిన తల్లి జ్ఞాపకాలను పథిలం చేసుకోవాలనుకుంది. ఈ నేపథ్యంలోనే పోలీసులకు కన్నీటి లేఖను రాసింది... వివరాలు.. కర్ణాటకలోని కొడగుకు చెందిన తొమ్మిదేళ్ల హిృతీక్ష తల్లి కొద్దిరోజుల క్రితం కరోనా వైరస్ బారిన పడి మృతి చెందింది. ఆ చిన్నారికి కడసారి చూపుకూడా దక్కలేదు. అయితే, తల్లి జ్ఞాపకాలు నిండిఉన్న ఫోన్‌నైనా దక్కించుకుందామనుకుంది. ఆసుపత్రికి ఫోన్ చేయగా.. ఫోన్ కనిపించటం లేదని జవాబొచ్చింది. దీంతో తీవ్ర ఆవేదనకు గురైన హిృతీక్ష కొడగు పోలీసులను ఆశ్రయించింది. తన తల్లి జ్ఞాపకాలు నిండిఉన్న ఫోన్‌ను కనిపెట్టండంటూ భావోద్వేగపూరిత ఫిర్యాదు లేఖను వారికి అందించింది. ఈ లేఖ సోషల్ మీడియాలో వైరల్ కావటంతో పోలీసులపై ఒత్తిడి పెరిగింది. దీంతో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఫోన్ కోసం అన్వేషణ ప్రారంభించారు. ఈ ఘటనపై హిృతీక్ష బంధువు ఒకరు మాట్లాడుతూ.. ‘‘ పాప తల్లి ఆసుపత్రిలో ఉండగా మేము ఫోన్ చేశాము. ఫోన్ స్విచ్ఛాఫ్ వచ్చింది. మరుసటి రోజు ఆమె చనిపోయిందని మాకు కబురందింది. మేము ఆమె ఫోన్ కావాలని అడిగాము. అయితే, ఫోన్ కనిపించటం లేదని చెప్పారు. ఆ ఫోన్ కావాలని అప్పటినుంచి పాప ఏడుస్తూనే ఉంది. అందులో చనిపోయిన తల్లికి సంబంధించిన చాలా ఫొటోలు ఉన్నాయంట’’ అని అన్నారు. -
ప్రేయసిపై కన్నేసిన కంప్యూటర్ సెంటర్ యజమాని, దాంతో
సాక్షి, కేజీఎఫ్(కర్ణాటక): కంప్యూటర్ సెంటర్ యజమాని హత్య కేసులో పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. నగరానికి చెందిన రాజేంద్ర ప్రసాద్, మేల్విన్‌లు నిందితులు. కంప్యూటర్ సెంటర్ యజమాని ముకుందన్ వద్ద రాజేంద్రప్రసాద్ ప్రియురాలు పనిచేసేది. ఆమెపై కన్నేసి పెళ్లి చేసుకోవాలని ముకుందన్ వేధించసాగాడు. దీంతో ఆమె పని వదిలేసినప్పటికీ అతడు ఫోన్లు చేస్తూ ఒత్తిడి చేశాడు. దీంతో ప్రేయసి సలహాతో మేల్విన్‌తో కలిసి రాజేంద్ర ప్రసాద్ ముకుందన్‌ను ఏప్రిల్ 28న హత్య చేశాడు. అండర్సన్పేట పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు కాగా విచారణ జరిపి నిందితులను అరెస్టు చేశారు. యువతి పరారీలో ఉంది. చదవండి: ఫేస్బుక్ పరిచయం.. నగ్నంగా వీడియో కాల్.. కట్ చేస్తే.. -
ఫోన్ దొంగిలించిన పక్షి.. వీడియో వైరల్
సాధారణంగా ఫోన్ మనజీవితంలో ఒక భాగమైపోయింది. కొంత మందిని దీన్ని ఆరోప్రాణంగా కూడా భావిస్తారు. అయితే.. ఇలాంటి ఫోన్‌ను ఎవరైన ఎత్తుకుపోతే ఇంకేమైనా ఉందా... అయితే తాజాగా ఇలాంటి ఘటన ఒకటి జరిగింది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. ఫోన్‌ను ఎత్తుకుపోయింది. ఏ దొంగలో కాదూ.. ఒక పక్షి. ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగవైరల్ అవుతుంది. వివరాల్లోకి వెళ్తే.. ఒక మహిళ తన మిత్రులతో కలిసి టెర్రాస్ పైన సరదాగా మాట్లాడుకుంటున్నట్లున్నారు. వారి ఫోన్లను పక్కన పెట్టేసి మరీమాటల్లో మునిగిపోయారు. అయితే, ఎక్కడి నుంచి వచ్చిందో కానీ.. ఒక పక్షి వచ్చి పిట్ట గోడ మీద ఉంచిన స్మార్ట్‌ఫోన్‌ను నోటితో కరుచుకుని అక్కడి నుంచి ఎగురుకుంటు వెళ్లిపోతుంది. అయితే , ఒక్కసారి షాక్‌కు గురైన ఆ మహిళ ఆ పక్షి వెంట పరిగెత్తింది. ఆఫోన్ నాదీ.. నాదీ నాకిచ్చేయ్ అంటూ అరుస్తు దాని వెంట పడింది. ఆమెతో ఉన్న మిత్రులు మాత్రం ఆ పక్షిని పట్టుకొవడం మానేసి, తన సహచరి ఫోన్ కోసం పడుతున్న సరదా సన్నివేశాన్ని ఫోన్లో వీడియో తీస్తు.. తెగ నవ్వుకుంటున్నారు. ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీన్ని చూసిన నెటిజన్లు ‘ పాపం, ఆ పక్షి తినే పదార్థం అనుకొని ఉంటుందేమో.. ఎవరికైన గిఫ్ట్‌గా ఇవ్వాలనుకుందేమో’.. అని ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు. -
ఫోన్ వాడేది లేదంటున్న అమీర్ ఖాన్!
సినిమా కోసం నటించేవాళ్లు కొంతమందైతే, జీవించేవాళ్లు మరికొంత మంది! తన పాత్ర పర్ఫెక్ట్గా రావడం కోసం ఎంతకైగా తెగిస్తారు, ఏదైనా చేస్తారు. అలా చాలామంది హీరోలు తమ శరీరాలను సిక్స్ప్యాకులు, ఎయిట్ ప్యాకులుగా మలిచారు. క్యారెక్టర్ డిమాండ్ చేస్తే గుర్రపు స్వారీలు, బైక్ రైడింగులు, కత్తియుద్ధాలు ఇలా అన్ని కళలనూ నేర్చుకుంటారు. పాత్రలో లీనమైపోయేందుకు ఫ్యామిలీకి దూరంగా ఉంటూ ఫోన్లను సైతం పక్కన పెట్టేస్తుంటారు. బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ కూడా ఇదే కోవకు చెందుతాడు. తను నటిస్తోన్న లాల్ సింగ్ చద్దా కోసం ఫోన్‌ను స్విచ్చాఫ్ చేశాడు. (చదవండి: అమీర్ ఖాన్ 'విక్రమ్ వేదా' లేదా?) వ్యక్తిగత జీవితం, కెరీర్ రెండూ దేనికదే సెపరేట్‌గా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నాడట. ఫోన్ వల్ల ఏకాగ్రతగా షూటింగ్ చేయలేనని మొబైల్ స్విచ్ఛాఫ్ చేసినట్లు తెలుస్తోంది. ఏదైనా అర్జంట్ పనైతే తన మేనేజర్‌కు కాల్ చేయమని బంధువులకు చెప్పి ఉంచాడట. అంతే కాదు, అమీర్ సోషల్ మీడియా అకౌంట్లను కూడా ప్రస్తుతం అతడి టీమే చూసుకుంటోందట. అయితే ఇదంతా లాల్ సింగ్ చద్దా షూటింగ్‌కు శుభం కార్డు పడేవరకు కాదు సినిమా థియేటర్లలో రిలీజ్ అయ్యేవరకు. కాగా మూడేళ్ల తర్వాత అమీర్, కరీనా మరోసారి ఈ చిత్రంలో కలిసి నటిస్తున్నారు. గతంలో వీరిద్దరు 3 ఇడియట్స్, తలాష్‌లో జోడీగా నటించారు. (చదవండి: ఆ టెక్నిక్‌తో ఆఫీసుల్లోకి ఈజీగా వెళ్లేవాడిని : పంకజ్ త్రిపాఠి) -
ఫోన్ చేసి విసిగిస్తావా అంటూ..
అనంతపురం క్రైం: ఇంటికి త్వరగా రమ్మని ఫోన్లో విసిగించిందని భార్యపై రాడ్‌తో దాడి చేసి గాయపరిచిన భర్త ఉదంతం వెలుగుచూసింది. రుద్రంపేటలో వెల్డింగ్ వర్కర్ టోపీఖాన్, చంద్రకళ దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్దరు సంతానం. మంగళవారం రాత్రి ఎంతసేపటికీ భర్త ఇంటికి రాకపోవడంతో చంద్రకళ పలుమార్లు ఫోన్ చేసింది. తర్వాత తప్పతాగి ఇంటికి చేరుకున్న టోపీఖాన్ ఫోన్ చేసి తనను విసిగిస్తావా అంటూ ఆగ్రహంతో ఊగిపోయి రాడ్‌తో భార్యపై దాడిచేశాడు. గొంతుపై కాలుతో తొక్కాడు. ఘటనపై బాధితురాలు నాలుగో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు టోపీఖాన్‌పై 307 సెక్షన్ కింద కేసు నమోదు చేసినట్లు సీఐ కత్తి శ్రీనివాసులు తెలిపారు. చదవండి: డబుల్ మర్డర్: భూతవైద్యుడి ఎంట్రీ.. కేసు కీలక మలుపు -
ఫోన్‌పై 28 రోజుల దాకా కరోనా
న్యూఢిల్లీ : కరోనా వైరస్ విషయంలో ఎంత అప్రమత్తంగా ఉండాలో తెలియజేసే పరిశోధన సారాంశమిది. మనం నిత్యం ఉపయోగించే వస్తువుల ఉపరితలంపై కరోనా వైరస్ 28 రోజుల వరకు జీవించి ఉంటుందని ఆస్ట్రేలియా నేషనల్ సైన్స్ ఏజెన్సీ పరిశోధనలో వెల్లడైంది. కరెన్సీ నోట్లు, గ్లాసులు, స్మార్ట్ఫోన్ల స్క్రీన్లు, స్టెయిన్లెస్ స్టీల్ వస్తువులపై ఈ వైరస్ 28 రోజులదాకా జీవిస్తుందని తేలింది. మనం నిత్యజీవితంలో ఉపయోగించే వస్తువులను తరచుగా శుభ్రం చేసుకోవాలని, చేతులను సైతం శుభ్రం చేసుకోవాలని పరిశోధకులు సూచించారు. తక్కువ ఉష్ణోగ్రతల్లో కరోనా వైరస్ ఎక్కువ కాలం మనుగడ సాగిస్తుందని, అలాగే సున్నితంగా ఉండే ఉపరితలాలపై దీని జీవన కాలం అధికమని పరిశోధనలో స్పష్టమైంది. ప్లాస్టిక్ నోట్ల కంటే కాగితపు కరెన్సీ నోట్లు కరోనా వైరస్ ఆవాసానికి అనుకూలమని చెప్పొచ్చు. 20 డిగ్రీల ఉష్ణోగ్రతలో ఈ వైరస్ సున్నితమైన ఉపరితలాలపై 28 రోజుల దాకా జీవించి ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. -
సివంగిలా దూకి....దొంగకు చుక్కలే!
సాక్షి, జలంధర్: తన చేతిలోని ఫోన్ లాక్కుని పారిపోతున్న దుండగులకు ఒక బాలిక (15) చుక్కలు చూపించింది. ఏ మాత్రం పట్టువిడవకుండా.. సివంగిలాగా దూకి వాడి ఆటకట్టించింది. సీసీటీవీలో ఈ రికార్డైన ఈ దృశ్యాలు ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పంజాబ్ లోని జలంధర్ నగరంలో ఈ ఘటన జరిగింది. ఓ వీధిలోంచి నడుచుకుంటూ వెళుతున్న అమ్మాయి నుంచి బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు ఫోన్ లాక్కున్నారు. అనంతరం సిద్ధంగా ఉన్న బైక్ పై పారిపోయే ప్రయత్నంలో ఉండగానే, మెరుపు వేగంగా కదిలింది ఆ అమ్మాయి. వెనుక కూర్చున్న ఒక దొంగను దొరక బుచ్చుకుంది. అతగాడు బైక్ దిగి ఆ అమ్మాయిని కొడుతున్నా ఏ మాత్రం వెరవలేదు..పట్టువిడవలేదు. అలానే అతని కాలర్ పట్టుకుంది. చేతికి దొరికిన ఆ దొంగను పారిపోనివ్వకుండా నిలువరించింది. ఈ లోపు స్థానికులు రావడంతో బైక్ పై ఉన్న మరో దొంగ మాత్రం పారిపోగా, దొరిగిన దొంగకు బడిత పూజ చేశారు. దీంతో ఆ అమ్మాయి తెగువ, ధైర్యంపై అభినందనలు కురుస్తున్నాయి. #Punjab: 15-year-old girl fights snatchers to save her mobile phone in #Jalandhar pic.twitter.com/MTqYvwiXPr— The Tribune (@thetribunechd) September 1, 2020 -
అమ్మానాన్న బాగున్నారా?
న్యూశాయంపేట : పేద విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించేందుకు రాష్ట్రప్రభుత్వం గురుకులాలు ఏర్పాటుచేస్తోంది. చదువుకునే సమయంలో రోజుల తరబడి తల్లిదండ్రులకు దూరంగా ఉండాల్సి ఉంటుంది. అయితే, తమ తల్లిదండ్రులతో మాట్లాడాలన్నా, వారి క్షేమ సమాచారాలు తెలుసుకోవాలన్నా ఫోన్ల వాడకాన్ని భద్రతా చర్యల కారణంగా ప్రిన్సిపాళ్లు అనుమతించడం లేదు. తద్వారా ఎపుడో వారం, పదిహేను రోజులకోసారి తల్లిదండ్రులు వస్తే తప్ప మాట్లాడే వెసలుబాటు కలగడం లేదు. దీనికి పరిష్కారం ఓ మార్గం అందుబాటులోకి వచ్చింది. నూతన సాంకేతిక పరిజ్ఞానంతో... విద్యార్థులు తమ తల్లిదండ్రులతో అప్పుడప్పుడు మాట్లాడుకోవడానికి, వారియోగ క్షేమాలు తెలుసుకోవడానికి ఇటీవల అలైన్ గ్రూప్ ఓ నూతన టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చింది. ప్రిన్సిపాళ్లు తమ క్యాంపస్ ఆవరణలో ఉండే విద్యార్థుల సంఖ్యకు తగిన సామర్థ్యంలో ఫోన్ అమరుస్తారు. ఏ విద్యార్థి అయితే తగిన రుసుము చెల్లించి స్మార్ట్ కార్డ్ తీసుకుంటారో వారి తల్లిదండ్రుల ఫోన్ నంబర్లను మాత్రమే ఆ ఫోన్లో నిక్షిప్తం చేస్తారు. తద్వారా ముందస్తు నమోదు చేసి నంబర్‌కు మాత్రం ఫోన్ చేసుకునే వెసలుబాటు కలుగుతుంది. దీంతో ఫోన్లు దుర్వినియోగం అవుతాయనే బాధ కూడా ఉండదు. తాజాగా ఈ ఫోన్లను వరంగల్ అర్బన్ జిల్లా హంటర్ రోడ్డులోని బాలికల మైనార్టీ గురుకులం(హన్మకొండ) పాఠశాలలలో ఏర్పాటు చేశారు. సురక్షితం స్మార్డ్ కార్డ్ ఫోన్‌తో విద్యార్థులు తమ తల్లిదండ్రులకు మాత్రమే ఫోన్ చేసుకునేందుకు వీలుంటుంది. ఈ ఫోన్లో ఔట్‌గోయింగ్ కాల్స్ మాత్రమే చేసుకోవచ్చు. తగిన రుసుము చెల్లించి కార్డు కొనుగోలు చేసిన విద్యార్థి పేరెంట్స్ అందించిన మూడు ఫోన్ నంబర్లు నిక్షిప్తం చేస్తారు. బిగించిన ఫోన్లో మూడు బటన్లు ఉంటాయి. ఓ విద్యార్థి తన కార్డును స్వైప్ చేశాక ఏదో ఒక నంబర్ నొక్కితే అందులో ముందే ఫీడ్ చేసిన సెల్‌ఫోన్ నంబర్‌కు కాల్ వెళ్తుంది. ప్రిన్సిపాళ్లు నిర్ణయించిన సమయంలో ఫోన్ చేసేలా నిబంధన విధించారు. హాస్టళ్లలో ఉచితంగా బిగింపు హాస్టళ్లలో ఈ ఫోన్లను ఎలాంటి రుసుము తీసుకోకుండానే ‘అలైన్’ సంస్థ బాధ్యులు ఏర్పాటు చేస్తారు. ప్రతినెల ప్రతినిధి వచ్చి ఫోన్ బాగోగులు చూసి వెళ్తాడు. లోకల్ అండ్ ఎస్టీడీ కాల్స్ ప్రతీ నిమిషానికి 60 పైసలు కట్ అవుతాయి. స్మార్ట్ కార్డ్ కొనుగోలు చేసినప్పుడు రూ.200 చెల్లించాలి. అందులో రూ.వంద టాక్‌టైమ్ వస్తుంది. టాక్‌టైమ్స్ అయిపోయాక తిరిగి తగిన రుసుము చెల్లించి రీచార్జ్ చేసుకోవచ్చు. విద్యార్థులకు ఎంతో ఉపయోగం ఈ ఫోన్‌తో విద్యార్థులకు ఉపయుక్తంగా ఉంది. గతంలో స్కూల్ ఫోన్ ఒకటే ఉండటంతో విద్యార్థులను వారి తల్లిదండ్రులతో మాట్లాడించాలంటే తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యేవి. ఇప్పుడు కొత్త ఫోన్‌తో వారికి కేటాయించిన సమయాల్లో ఫోన్ చేసుకొని సంతోషంగా ఉంటున్నారు.– వాసవి, పిన్సిపాల్, బాలికల మైనార్టీ గురుకులం -
మరోసారి సల్మాన్ ఆగ్రహం, వీడియో వైరల్
సాక్షి,ముంబై: బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్‌ఖాన్ మరోసారి ఫ్యాన్స్‌పై అసహనం ప్రకటించి వార్తల్లో నిలిచారు. తనతో సెల్ఫీ క్లిక్ చేయడానికి ప్రయత్నించిన అభిమాని పట్ల సల్మాన్ ప్రవర్తన ఆయన పలువురిని దిగ్భ్రాంతికి గురి చేసింది. గోవా ఎయిర్పోర్ట్ నుంచి బయటికి నడిచి వస్తున్న హీరో సల్మాన్‌తో సెల్ఫీ తీసుకోవడానికి ప్రయత్నించాడు ఒక వ్యక్తి. దీనిపై కోపం తెచ్చుకున్న సల్మాన్ ఈ వ్యక్తి నుండి మొబైల్ చటుక్కున లాక్కున్నా డు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. గోవా అంతర్జాతీయ విమానాశ్రయంలో మంగళవారం ఈ ఉదంతం చోటు చేసుకుంది. తరువాత అతను విమానయాన సంస్థలో పనిచేస్తున్న గ్రౌండ్ స్టాఫ్‌గా గుర్తించారు. వీడియో వైరల్ అయిన తరువాత ఈ సంఘటన గురించి విచారించి ఈ విషయాన్ని ధృవీకరించామని విమానాశ్రయ సీనియర్ అధికారి చెప్పారు. దీనిపై ఎలాంటి కేసు నమోదు కాలేదన్నారు. కాగా సల్మాన్ ప్రస్తుతం రాధే చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. ఈ ఏప్రిల్ నాటికి (ఈద్) సల్మాన్ రాధే మూవీ , అక్షయ్ కుమార్ చిత్రం లక్ష్మీ బాంబ్ చిత్రంతో పోటీ పడనుంది. దీంతో పాటు సాజిద్ నాడియా వాలాతో కభీ ఈద్ కభీ దీపావళి అనే సినిమాకు సైన్ చేసిన సంగతి తెలిసిందే. -
మరోసారి సల్మాన్ ఆగ్రహం, వీడియో వైరల్
-
ఫోన్ చూసుకుంటూ వెళ్తే..
ఇటీవలి కాలంలో జనాలు.. మొబైల్ ఫోన్లకు బానిసలుగా మారుతున్న సంగతి తెలిసిందే. కొందరైతే ఫోన్ల ధ్యాసలో పడి వారి పరిసరాల్లో ఏం జరుగుతుందో గమనించకుండా .. ప్రమాదాల బారిన పడుతున్న ఘటనలు మనం చూస్తూనే ఉన్నాం. ఇటీవల అలాంటి ఘటనే స్పెయిన్‌లోని ఉత్తర మడ్రిడ్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మెట్రో స్టేషన్లో ప్రయాణికులు రైలు కోసం ఎదురుచూస్తున్నారు. రైలు ఫ్లాట్‌పామ్‌పైకి వస్తున్న సమయంలో ఓ మహిళ లేచి ముందుకు నడవసాగింది. అయితే మొబైల్ చూడటంలో బిజీగా ఉన్న ఆమె.. ఫ్లాట్‌పామ్ ఎక్కడివరకు ఉందో కూడా చూసుకోకుండా వెళ్లారు. దీంతో ఆమె ట్రైన్‌కు ముందు కొద్ది దూరంలో పట్టాలపై పడిపోయారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీటీవీల్లో రికార్డు అయింది. ఈ వీడియోను మడ్రిడ్ మెట్రో అధికారులు ట్విటర్లో పోస్ట్ చేశారు.అయితే ఈ ప్రమాదం నుంచి ఆమె స్వల్ప గాయాలతో బయటపడినట్టుగా సమాచారం. ⚠ Por tu seguridad, levanta la vista del móvil cuando vayas caminando por el andén.#ViajaSeguro #ViajaEnMetro pic.twitter.com/0XeQHPLbHa — Metro de Madrid (@metro_madrid) October 24, 2019 -
ఫోన్ కొట్టు.. ఓటు పట్టు..
సాక్షి, ఆర్మూర్(నిజామాబాద్): హలో.. జ్యోతి గారేనా మాట్లాడేది.. మీకు ఆసరా పథకంలో భాగంగా వితంతు పింఛన్ అందుతోందా.. పింఛన్ తీసుకోవడంలో ఏమైనా సమస్యలు ఉన్నాయా.. ఇప్పుడు మీకు నెలకు వెయ్యి రూపాయల పింఛన్ వస్తోంది కదా.. టీఆర్ఎస్కి ఈ ఎన్నికల్లో ఓటు వేసి గెలిపిస్తే నెలకు రెండు వేల 16 రూపాయల పింఛన్ వస్తుంది.. కాబట్టి మీరు టీఆర్ఎస్ అభ్యర్థికే ఓటు వేయండి అంటూ ఒక మహిళ గొంతు జ్యోతికి వివరించింది. ఈ విషయం తన కుటుంబ సభ్యులతో పాటు కాలనీవాసులకు చెప్పగా అయ్యో ఇలాంటి ఫోన్లు మా అందరికీ వస్తున్నాయంటూ ఆసరా పథకంలో భాగంగా వృద్ధాప్య పింఛన్, వికలాంగుల పింఛన్, వితంతు పింఛన్, బీడీ కార్మికుల జీవన భృతి పొందుతున్న మహిళలు చర్చించుకుంటున్నారు. రైతులకు 24 గంటల పాటు ఉచిత విద్యుత్ సరఫరా అవుతోందా.. ఎకరానికి ఎనిమిది వేల రూపాయల పెట్టుబడి వ్యయం అందిందా.. రైతు బీమా పథకంలో పేరు నమోదు చేయించుకున్నారా తదితర సమాచారాన్ని చేరవేస్తూ ఫోన్లు చేస్తున్నారు. మరో వైపు కాంగ్రెస్, బీజేపీలు సైతం తాము అధికారంలో ఉన్న సమయంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలతో పాటు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అమలు చేస్తున్న పథకాలను సైతం ఓటర్లకు ఫోన్ల ద్వారా వివరిస్తున్నారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంలో సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు తమ విజయం సాధించేందుకు ఉన్న ఏ చిన్న అవకాశాన్ని కూడా వదులుకోకుండా సద్వినియోగం చేసుకోవాలనే ప్రయత్నాల్లో ఉన్నారు. నేటి రోజుల్లో సెల్ ఫోన్ ఉపయోగించని ఓటరు ఉండడన్నది ఎవరూ కాదనలేని నిజం. ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఓటర్లను తమకు అనుకూలంగా మల్చుకొనే ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ప్రత్యేకంగా కాల్ సెంటర్ల వారితో ఒప్పందాలు చేసుకొని తమ నియోజకవర్గాల పరిధిలోని లబ్ధిదారులు, ఓటర్ల ఫోన్ నంబర్లను వారికి చేరవేస్తున్నారు. ఇంకేముంది సదరు కాల్ సెంటర్ ఉద్యోగులు ఒకటికి పది సార్లు ఓటర్లకు ఫోన్లు చేస్తూ తమ పార్టీ గొప్పతనాన్ని తమ పార్టీ నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థి బలాబలాలను ఓటర్లకు వివరిస్తున్నారు. మరికొందరు అభ్యర్థులు ఒక అడుగు ముందుకు వేసి తనకు ఓటు వేసి గెలిపించాలంటూ ఓటర్లను విజ్ఞప్తి చేస్తూ వాయిస్ రికార్డు చేసి ఫోన్లు చేస్తూ ఆ వాయిస్ రికార్డును వినిపిస్తున్నారు. సోషల్ మీడియాలో ప్రచారం నిర్వహిస్తే ఇంటర్నెట్ ఉపయోగించే యువకులు, ఉద్యోగులు, చదువుకున్న వారికి మాత్రమే సమాచారం చేరడానికి ఆస్కారం ఉంది. కానీ ఫోన్ చేసి వివరాలు చెపితే సెల్ ఫోన్ ఉపయోగించే మహిళలు, వృద్ధులు, నిరక్ష్యరాస్యులకు సైతం సమాచారం చేరవేసే ఆస్కారం ఏర్పడుతుంది. ఇది గ్రహించిన అభ్యర్థులు సెల్ ఫోన్ల ద్వారా ఓటర్లకు ఫోన్లు చేయిస్తూ ఓటర్లను ప్రసన్నం చేసుకొనే పనిలో పడ్డారు. దీంతో సోషల్ మీడియాతో పాటు కొత్త పుంతలు తొక్కుతున్న ఎన్నికల ప్రచారంపై సెల్ ఫోన్లు ఉపయోగించే ప్రతిఒక్కరూ చర్చించుకుంటున్నారు. -
తమిళనాడులో అమానుషం
సాక్షి, చెన్నై: తమిళనాడులో అమానుషం చోటుచేసుకుంది. సెల్‌ఫోన్ చోరీచేశాడన్న అనుమానంతో ఓ బాలుడిని గ్రామస్తులు కొట్టి చంపారు. కరూర్జిల్లా జగదాబి అల్లాలి గౌండనూర్ గ్రామానికి చెందిన ఇలంజియం కుమారుడు బాలసుబ్రమణి(15) బడికి వెళ్లకుండా అల్లరి చిల్లరగా తిరుగుతూ వచ్చాడు. శనివారం రాత్రి ఆ ప్రాంతానికి చెందిన టైలర్ మునుస్వామి తన సెల్‌ఫోన్ కనిపించడం లేదంటూ బాల సుబ్రమణిని నిలదీశాడు. తాను తీయలేదని వారించినా మునుస్వామి ఖాతరు చేయలేదు. మునుస్వామితో పాటు ఆ గ్రామానికి చెందిన పలువురు బాల సుబ్రమణిని స్తంభానికి కట్టిపడేసి చితక్కొట్టారు. స్పృహ తప్పడంతో అలాగే వదలి వెళ్లిపోయారు. ఆదివారం ఉదయాన్నే బాల సుబ్రమణిని మళ్లీ ప్రశ్నించేందుకు అక్కడికి వచ్చారు. అయితే, రాత్రి కొట్టిన దెబ్బలకు రక్తస్త్రావం అధికంగా కావడంతో రాత్రంతా ప్రాణాలతో కొట్టుమిట్టాడి బాలుడు మరణించాడు. సమాచారం అందుకున్న కరూర్ పోలీసులు బాలుడి మృత దేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. నిందితులు మునుస్వామి, పరమ శివం, సెల్వకుమార్, మణివేల్, మునియప్పన్‌లను అరెస్టు చేశారు. బాలుడ్ని చితక్కొడుతుంటే వేడుకలా చూస్తుండిపోయిన పలువురు గ్రామస్తులపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. అరెస్టుల భయంతో కొందరు పరారీలో ఉన్నారు. -
ప్రియుడు ఫోన్ చేయలేదని..
నోయిడా : ప్రియుడు ఫోన్ చేయలేదన్న బాధతో భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుందో యువతి. ఈ సంఘటన శనివారం సాయంత్రం నోయిడా నగరంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని కస్‌జంగ్ ప్రాంతానికి చెందిన శివాని(25) నోయిడాలోని ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. ఆమె గత కొద్ది నెలలుగా బరోలాలోని ఓ అద్దె ఇంట్లో నివాసముంటోంది. శనివారం సాయంత్రం సమయంలో ఆమె గ్రేట్ ఇండియా ప్లేస్ మాల్లోని మూడవ అంతస్తు నుంచి కిందకు దూకింది. నేలపై రక్తపు మడుగులో పడివున్న ఆమెను గుర్తించిన మాల్ సిబ్బంది దగ్గరలోని కైలాశ్ ఆస్పత్రికి తరలించినా లాభం లేకపోయింది. మార్గం మధ్యలోనే ఆమె మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఈ ఘటనపై మాల్ సెక్యూరిటీ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. అందిన ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వారు సంఘటనా స్థలంలో ఓ సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. ప్రిముడు స్పందించకపోవటం మూలానే తను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు యువతి సూసైడ్ నోట్లో పేర్కొంది. ప్రత్యక్ష సాక్షి మాట్లాడుతూ.. ఆమె చాలా సేపు ఎస్కలేటర్ దగ్గరలో ఫోన్ పట్టుకు కూర్చుందని, కొద్ది సేపటి తర్వాత పై నుంచి కిందకు దూకి ఆత్మహత్య చేసుకుందని తెలిపాడు. పోలీసు అధికారి మాట్లాడుతూ.. యువతి తన చావుకు ఎవరూ కారణం కాదని సూసైడ్ నోట్లో పేర్కొందని తెలిపారు. శివాని తల్లిదండ్రులను సంప్రదించటానికి ప్రయత్నిస్తున్నామని అన్నారు. ప్రియుడే ఆమె చావను ప్రేరేపించాడా? అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. -
అమ్మకోసం ఫోన్ ఆర్డర్ చేస్తే..
సాక్షి,న్యూఢిల్లీ: ఆన్లైన్ షాపింగ్ అంటేనే వినియోగదారులు భయపడే మరో సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఆన్‌లైన ద్వారా ఆర్డర్ చేసిన ఢిల్లీకి చెందిన ఒక వినియోగదారుడికి చేదు అనుభవం ఎదురైంది. రూ.35 వేల ఫోన్ బుక్ చేస్తే మైండ్ బ్లైండయ్యే గిఫ్ట్ వచ్చింది. దీంతో లబోదిబోమన్న కస్టమర్ పోలీసులను ఆశ్రయించారు. వివరాల్లోకి వెళితే, ఢిల్లీకి చెందిన మానస్ సక్సేనా మాతృదినోత్సవం సందర్భంగా కన్నతల్లికి బహుమతి ఇద్దామనుకున్నారు. దీంతో ఓ ఈ-కామర్స్ సంస్థను సంప్రదించి స్మార్ట్ ఫోన్ ఆర్డర్ ఇచ్చి డబ్బు చెల్లించారు. ఇక్కడే ఈయనకు ఈ కామర్స్ సైట్ దిమ్మతిరిగే షాకిచ్చింది. మే 26న ఆన్లైన్లో వన్‌ప్లస్ 6 ఫోన్‌ను ఆర్డర్ చేసి రూ. 34,999ను డెబిట్ కార్డు ద్వారా పే మెంట్ చేశారు. మే 27న పార్శిల్ వచ్చింది. అయితే ఫోన్ కు బదులుగా పార్సిల్లో మార్బుల్ స్టోన్స్ దర్శనమిచ్చాయి. దీంతో అవాక్కయన ఆయన ఆన్లైన్ సంస్థకు ఫిర్యాదు చేశారు. వారు సరిగా స్పందించడకపోవడంత పోలీసులను ఆశ్రయించారు. సెక్షన్ 420 కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు మొదలు పెట్టారు. డెలివరీ బాయ్, లేదా ఏజెన్సీ ప్రమేయం వుండొచ్చన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నామన్నారు. -
త్వరలోనే మంచిరోజులు వస్తాయ్: ఆసారాం
జోధ్‌పూర్: మైనర్ బాలికపై రేప్ కేసులో జీవితఖైదు శిక్షపడి జో«ద్‌పూర్ జైలులో ఉన్న వివాదాస్పద గురువు ఆసారాం బాపు ఓ శిష్యుడితో ఫోన్లో మాట్లాడిన ఆడియో క్లిప్ ఆన్లైన్లో చక్కర్లు కొడుతోంది. 15 నిమిషాల నిడివి ఉన్న ఆ క్లిప్‌లో ఆసారాం మాట్లాడుతూ.. ‘జైలులో నేనుండేది తాత్కాలికమే. త్వరలోనే మంచి రోజులు వస్తాయి. మనం చట్టాలు, వ్యవస్థను గౌరవించాలి’ అని చెప్పాడు. తన ఆశ్రమాన్ని స్వాధీనం చేసుకునేందుకు కొందరు కుట్ర పన్నుతున్నారని ఆసారాం ఆరోపించాడు. ఈ ఆడియో క్లిప్‌పై జోధ్‌పూర్ సెంట్రల్ జైలు డీఐజీ విక్రమ్ స్పందించారు. ప్రతి ఖైదీకి నెలకు ఇద్దరు వ్యక్తులతో 80 నిమిషాల పాటు ఫోన్లో మాట్లాడే అవకాశం ఇస్తామన్నారు. శుక్రవారం ఆసారాం సబర్మతీలోని ఓ శిష్యుడితో మాట్లాడినట్లు చెప్పారు. -
సోదరుడు ఫోన్ లాక్కున్నాడని..
పరిగి: సోదరుడు ఫోన్ లాక్కున్నాడని మనస్తాపానికి గురైన ఓ ఇంటర్ విద్యార్థిని ఒంటికి నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడింది. వికారాబాద్ జిల్లా పరిగి మండల పరిధిలోని ఖుదావంద్‌పూర్‌లో మంగళవారం మధ్యాహ్నం ఈ ఘటన చోటు చేసుకుంది. మృతురాలి కుటుంబీకుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన నసీర్ కూతురు నౌసిన్బేగం(17) పరిగిలోని విజ్ఞాన్ జూనియర్ కళాశాలలో ఇంటర్ రెండో ఏడాది చదువుతోంది. ప్రస్తుతం దోమ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో వార్షిక పరీక్షలు రాస్తుంది. బుధవారం పరీక్షకు హాజరు కావాల్సి ఉంది. అయితే, మంగళవారం ఆమె ఇంట్లో చదువుకుంటుంది. ఈక్రమంలో నౌసిన్బేగం తన అన్న ఫోన్ తీసుకుని స్నేహితురాలితో మాట్లాడింది. విషయం గమనించిన ఆయన ‘తెల్లారితే పరీక్ష పెట్టుకుని ఫోన్‌తో ఆటలేంట’ని మందలించి నౌసిన్బేగం నుంచి ఫోన్ లాక్కుని బయటకు వెళ్లిపోయాడు. మృదుస్వభావి అయిన ఆమె మనస్తాపానికి గురై ఇంట్లో ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. గమనించిన కుటుంబీకులు స్థానికుల సాయంతో మంటలు ఆర్పి వెంటనే పరిగి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. 80 శాతం శరీరం కాలిపోయిందని వైద్యులు తెలిపారు. ప్రథమ చికిత్స నిర్వహించి ఉస్మానియాకు రెఫర్ చేశారు. చావుబతుకులతో కొట్టుమిట్టాడుతున్న నౌసిన్బేగం నుంచి న్యాయమూర్తి భారతి వాగ్మూలం సేకరించారు. అనంతరం ఉస్మానియా ఆస్పత్రికి తరలిస్తుండగా విద్యార్థిని మార్గంమధలో మృతి చెందింది. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు అందలేదు. -
మహిళలు ఫోన్ మాట్లాడితే ఫైన్
‘‘మొదటిసారి ఫోన్ మాట్లాడుతూ ‘దొరికితే’ పంచాయతీ విధించిన జరిమానా చెల్లించాలి. రెండవసారి దొరికితే మాత్రం నలుగురిలో సిగ్గుతో తలదించుకొని ఏ శిక్షకైనా సిద్ధపడాలి’’ ‘‘మహిళల రక్షణ కోసమే మేమీ నిర్ణయం తీసుకున్నాం. వాళ్లు ఫోన్లో మాట్లాడటం వల్ల చాలా సమస్యలు తలెత్తుతున్నాయి’’ అంటున్నారు షూపూర్ జిల్లాలోని సహారియా గిరిజన తెగ పెద్దలు! మధ్యప్రదేశ్‌లోని షూపూర్ జిల్లాలో సహారియా తెగకు చెందినవి 27 గ్రామాలున్నాయి. ఈ తెగకు ఒచా గ్రామ పంచాయతీగా ఉంది. ఈ పంచాయతీ భోపాల్‌కి 400 కిలోమీటర్ల దూరం ఉండగా, సరిహద్దు రాష్ట్రం రాజస్థాన్. ఒచా గ్రామ పంచాయతీలోని 27 గ్రామాలలోని మహిళలు ఎవరైనా మొబైల్ ఫోన్లలో మాట్లాడుతున్నట్టు పంచాయతీకి తెలిస్తే శిక్షలు విధిస్తారు! అయితే అవి ఎలాంటి శిక్షలో ముందుగా చెప్పరు. ‘‘మొదటిసారి ఫోన్ మాట్లాడుతూ ‘దొరికితే’ పంచాయతీ విధించిన జరిమానా చెల్లించాలి. రెండవసారి దొరికితే మాత్రం నలుగురిలో సిగ్గుతో తలదించుకొని ఏ శిక్షకైనా సిద్ధపడాలి’’ అంటాడు రస్వరప్ అనే ఆదివాసి. ఇతను ఒచా గ్రామ పెద్ద. ఇక బైస్రామ్ అనే మరో ఆదివాసి పెద్ద ఏమంటున్నారో వినండి. ‘‘మా సహారియా తెగ అమ్మాయిలు బయటి వారితో మాట్లాడటం, వాళ్లను పెళ్లి చేసుకోవడం జరుగుతోంది. బయటి వారు మా తెగలోకి రావడం వల్ల మా భూముల మీద హక్కులు మేం కోల్పోయే పరిస్థితి వస్తోంది. అందుకే మా తెగ కాని వారిని పెళ్లి చేసుకోనివ్వకూడదని మేమీ నిర్ణయం తీసుకున్నాం. మా నిర్ణయానికి విరుద్ధంగా ఎవరైనా ప్రవర్తిస్తే ఆ కుటుంబం పంచాయతీ విధించిన శిక్షకు కట్టుబడి ఉండాల్సి ఉంటుంది’’ అంటున్నారు బైస్రామ్. పంచాయతీ పెద్దలు ఈ విషయం గురించి ఇంకాస్త చెబుతారు. ‘‘కావాలంటే మహిళలు ఫోన్లో మా ముందు ఎవరితోనైనా మాట్లాడచ్చు. మమ్మల్ని దాటి మాత్రం ఎవరూ మాట్లాడకూడదు’’ అని నిషేధాజ్ఞలు విధించారట! షూపూర్ కలెక్టర్ పి.ఎల్.సోలంకి ఈ విషయంపై స్పందించడానికి పెద్దగా ఏమీ లేనట్లుంది! ‘‘నాకూ ఈమధ్యే తెలిసింది. మహిళల్ని ఫోన్ల నుంచి దూరం చెయ్యడం సరికాదు. అయితే, అక్కడ ఎవరూ ఈ నిషేధాన్ని తప్పు పట్టడం లేదు. గిరిజనుల్లో అవగాహన ఏర్పడటానికి ప్రయత్నిస్తున్నాం’ అని మాత్రం అంటున్నారు! –ఎన్.ఆర్ -
చంచల
కంపెనీకారు వచ్చేసిందమ్మా.. నేను వెళ్లొస్తా అమ్మా... అంటూ బయటికి వేగంగా నడిచింది చంచల.కారు డోర్ తీసి కూర్చున్న చంచల.. కాస్త ఆశ్చర్యంగా.. ‘నీ పేరు?’ అంది.‘‘అప్పల్రాజు మేడం’’‘‘మరి సింహాద్రీ?’’‘‘ఆడు మా బావకొడుకు మేడం... ఆడికి నిన్న రాత్రి నుంచీ జ్వరం. అందుకని నేనొచ్చేను మేడం’’ అన్నాడు అప్పల్రాజు.చంచల ఫోన్లోనే ఆఫీస్ మెయిల్స్ చెక్ చూసుకుంటుంది. అప్పల్రాజు కారును సీతమ్మధార వద్దున్న వెంకటేశ్వర ఆలయం ముందు ఆపేడు.‘‘ఈయాల.. శనివారం కదా మేడం.. వెంకన్న బాబును చూసి వేగంగా వచ్చేస్తాను’’ అంటూ కదిలాడు అప్పల్రాజు.కాసేపటికి ‘‘మేడం.. ప్రసాదం తీసుకోండి!’’ అని చంచలకు పులిహోర ఉన్న డొప్పను అందించాడు అప్పల్రాజు. పులిహోర డొప్పను అందుకున్న చంచల.. కళ్లకు అద్దుకుని తినసాగింది.పదినిమిషాలు అయ్యాక అప్పల్రాజు కారును స్లో చేసి... వెనక్కి తిరిగి చూశాడు. చంచల ఓ పక్కకి వాలిపోయి ఉండటాన్ని చూసి నవ్వుతూ జేబులోని ఫోన్ అందుకున్నాడు.‘‘ఆ.. నేనే.. పని ఫినిష్ అయ్యింది. పావుగంటలో నీ ముందుంట. పిట్టను తీసుకో.. నాకు సొమ్ము ఇచ్చుకో..’’ అని ఫోన్ కట్‌చేసి కారును వేగంగా ముందుకు పోనిచ్చాడు. చంచల భారంగా కళ్లు తెరచింది. పరిసరాలను పరిశీలనగా చూసి ఆశ్చర్యపోయింది. ఉన్న చోటు నుంచి కదిలేందుకు ప్రయత్నించి విఫలమైంది. అప్పల్రాజు ఇచ్చిన ప్రసాదంలో మత్తు మందు ఉందనీ.. తనను తెలివిగా కిడ్నాప్ చేశారని గ్రహించింది.అంతలో తలుపులు తెరుచుకున్నాయి.‘హలో.. నువ్వు క్షేమంగానే ఉన్నావ్!’ అంటూ దగ్గరకు వచ్చి నోటికి ఉన్న గుడ్డను విప్పేశాడు ఓ గడ్డం వ్యక్తి.‘ఎవరు నువ్వు... నన్నెందుకు తీసుకొచ్చావ్?’‘నా పేరు గురుపాదం, అందాన్ని వేటాడ్డమే నా పని’ అన్నాడావ్యక్తి నిర్లక్ష్యంగా తన గడ్డాన్ని సవరించుకుంటూ...‘నీకేం కావాలి?’‘లాభం! అందంతో వచ్చే లాభం! నువ్వు ఇక తిరిగి ఇంటికి వెళ్లే ఆశలు వదులుకో.. త్వరలోనే నిన్ను అరబ్ షేకులకు బేరం పెడతా. లక్షలు.. లక్షలు పట్టేస్తా!! ఇప్పటిదాకా చాలా మంది అమ్మాయిలని నీలానే కిడ్నాప్ చేసి అమ్మేశా. కాదంటే ఈ గదిలోనే చంపేస్తా.’ అన్నాడు గురుపాదం.గుండెల్లో పిడుగు పడినట్లు అయ్యింది చంచలకు...‘హెల్ప్.. హెల్ప్..’ అంటూ గట్టిగా అరిచింది.ఆమె అరుపులకు ఫక్కున నవ్విన గురుపాదం.. ఆమె చేతికి కాళ్లకి ఉన్న కట్లును కూడా విప్పేస్తూ.. ‘‘నువ్వు తప్పించుకోలేవ్.. పాపా! ఎందుకంటే నువ్వు శివారుల్లో ఉన్న రాజావారి తోట బంగళాలో ఉన్నావ్ నీ అరుపు కనీసం ఈ గది గోడలను కూడా దాటదు. తప్పించుకునే ప్రయత్నాలు మాని.. మెప్పించే ప్రయత్నం చెయ్యి!’’ అంటూ గది తలుపులు వేసి వెళ్లిపోయాడు గురుపాదం. ‘‘గురుపాదం.. నీకు లోను శాంక్షన్ అయ్యిందయ్యా... ఇదిగో కాగితాలు, లోన్ సెక్షన్‌కి వెళ్లి చెక్కు తీసుకో... మరి... నీ వంతు లాంఛనం....?’ అంటూ నసిగాడు బ్యాంక్ మేనేజర్.‘అది అలా వుంచండి సార్.. లేత పిట్ట వచ్చింది. ఈ రాత్రికి.. మీరొస్తే.... బాగుంటుంది. మళ్లా రెండు రోజుల్లో అరబ్ షేక్‌లు పట్టుకుపోతారు...’ అన్నాడు గురుపాదం చాలా చనువుగా.. అంగీకారంగా తలూపాడు బ్యాంక్ మేనేజర్. ఆ రోజు రాత్రి... బ్యాంక్ మేనేజర్ చంచల ముందు మైకంలో తూలుతున్నాడు. చంచల పరిస్థితిని అర్థం చేసుకుంది. ఈ ముసలివాడిని మందులో ముంచి తప్పించుకోవాలనుకుంది. అనుకున్నదే తడవుగా.. ఎదురుగా ఉన్న విస్కీ బాటిల్ తీసుకుని అతని చేతిలో ఉన్న గ్లాస్లో పోసి.. అతడి నోటికి అందించింది. అతడు ఆమెను చూస్తూ.. గ్లాస్ మీద గ్లాస్ ఖాళీ చేసి మత్తుగా మంచం మీదకు ఒరిగిపోయాడు. ఏమాత్రం ఆలస్యం చెయ్యని చంచల.. బ్యాంక్ మేనేజర్ జేబులోంచి సెల్ ఫోన్ బయటకు తీసి.. పోలీస్ స్టేషన్‌కి ఫోన్ చేసింది సహాయం కోరింది. అలికిడి కావడంతో ఖాళీ విస్కీ బాటిల్ అందుకున్న చంచల.. తలుపు వెనక దాక్కుంది. గదిలోపల కొచ్చిన గురుపాదం తల పగలగొట్టింది. కానీ, బయట తలుపులు తీసేందుకు ప్రయత్నించిన చంచలకు.. కిటికీలోంచి ఇంటి చుట్టూ ఉన్న గూండాలు కనిపించారు. దాంతో తప్పించుకోవడానికి ఎలాంటి ప్రయత్నం చెయ్యకుండా పోలీసుల రాకకోసం ఎదురుచూస్తూ ఉండిపోయింది.పోలీస్ సైరన్ విన్న గూండాలు పారిపోగా.. ఎస్సై గిరి.. కానిస్టేబుళ్లతో కలిసి తలుపు తీసుకుని వేగంగా లోనికొచ్చాడు. రక్తపు మడుగులో కదల్లేని స్థితిలో పడి ఉన్న గురుపాదాన్ని, మత్తులో తూలుతున్న బ్యాంక్ మేనేజర్ని కస్టడీలోకి తీసుకుంటూ.. చంచల సమయస్పూర్తిని అభినందించాడు. - మోహనారుద్ర -
మా స్మార్ట్ మమ్మీ!!
ఆఫీసులో ఆ రోజెందుకో కొంచెం సీరియస్‌గా ఉంది వాతావరణం. బాయ్ తెచ్చిచ్చిన కాఫీ చప్పరిస్తూ, బాస్ మాటలను అందరం శ్రద్ధగా వింటున్నాం. ఇంతలో మీటింగ్‌కి ముందే పీకనొక్కేసి జేబులోకి తోసేసిన ఫోన్ నుంచి వైబ్రేషన్లు మొదలయ్యాయి. నిశ్శబ్దంగా ఉన్న ఆ ఏసీ ఛాంబర్లో నా ఫోన్ శబ్దాలు అసహనం కలిగిస్తున్నాయందరికీ! అదృష్టవశాత్తూ అదే సమయంలో బాస్‌కి కూడా ఫోన్ రావడంతో అదే అదనుగా మెల్లగా ఫోన్ బయటకు తీసి, కాల్ చేసింది ఎవరా అని చూశా. అమ్మ... అప్పటికే నాలుగైదు మిస్స్డ్ కాల్స్ ఉన్నాయందులో. ఎవరి ఫోన్ అయినా ఇగ్నోర్ చేయొచ్చు కానీ, అమ్మ ఫోన్‌కి రెస్పాండ్ ఇవ్వకపోయానంటే మాత్రం తిప్పలు తప్పవు. గతంలో ఇలాగే నేను ఫోన్ తియ్యకపోయేసరికి ఆమె కంగారుగా మా ఆఫీసులో తనకు తెలిసిన అందరికీ ఫోన్లు చేసేసింది. ఆఖరికి ఆఫీసులో మా బాస్ తర్వాత బాస్ అంతటి వాణ్నీ వదిలిపెట్టలేదు. దాంతో నేను మెల్లగా రీడయల్ చేశా. గభాల్న ఆన్సర్ చేసి, ‘‘ఎక్కడున్నావ్... ఎన్నిసార్లు చేసినా, లిఫ్ట్ చేయకపోతుంటే టెన్షన్ వచ్చింది’’ అంటూ నిష్ఠూరాలు పోయింది. ‘‘ఇక్కడే చచ్చాన్లే... ఇంతకీ ఏంటో చెప్పు’’ అన్నా కొంచెం విసుగ్గా. కొద్ది నిశ్శబ్దం తర్వాత ‘‘ఏం లేదులే... పొద్దుటునించీ వైఫై రావట్లేదు... ఏం తోచక చస్తున్నాననుకో’’ అంది. నాకు ఒళ్లు మండుకొచ్చింది. ‘‘ఇందుకా ఇన్నిసార్లు ఫోన్ చేసింది... ఏమైందో ఏంటో అని భయపడి చచ్చాననుకో’’అంటూ విసుగ్గా ఫోన్ పెట్టేశా. ‘‘నేను కాసేపటిలో వచ్చేస్తాను కానీ, ఈలోగా మీరు అయిడియాలు రాసుంచండి’’ అని చెప్పి హడావిడిగా ఎక్కడికో వెళ్లిపోయారు బాస్. టైమ్ దొరికింది కదా... ఆగుతానా నేను... బయటికి రాగానే తిరిగి అమ్మకి ఫోన్ చేసి, ‘‘ఏంటమ్మా! రోజూ నేనా టైమ్‌లో మీటింగ్‌లో ఉంటానని తెలిసి కూడా అవతలేదో సీరియస్ మ్యాటరున్నట్లు అన్నిసార్లు ఫోన్ చేశావ్. భయమేసింది’’ అన్నాను. ‘‘నాకు ఇంక కాలక్షేపం ఏముంది... ఆ ఫోన్ చూసుకోవడం తప్ప. అదీ పాపం... ఆ పిచ్చోడు కొనివ్వబట్టి కానీ, నాతో మాట్లాడేదెవరు, నా మొహం చూసేవారెవరు... పొద్దుగూకులూ ఆ గదిలో ఒక్కదాన్నే పడుండటం తప్ప. మీ ఆవిడగానీ, నీ సంతానం గానీ నాతో మాట్లాడతారా ఏమన్నానా? ఇవ్వాళ్ల కూడా నువ్వటెళ్లగానే మీ ఆవిడ కూడా పిల్లల్ని తీసుకుని బయల్దేరింది ‘అక్కా వాళ్ల ఇంటికి వెళ్ళొస్తా’ నంటూ... అసలు పొరపాటు చేశాలే. నువ్వు నాకు ఆ జియో సిమ్ ఇస్తానన్నప్పుడు తీసుకోనుంటే బాగుండేది.. కరెంట్ పోగానే నెట్టు ఆగిపోకుండా ఉండేది’’ అమ్మ వాక్ప్రవాహం ఆగడం లేదు. నిజమే కదా అనిపించి నాకు జాలేసింది. ‘‘సర్లే... ఆ సీపీయూ పక్కనే నల్లటి డబ్బాలాంటిది ఉంటుంది కదా... దానికి రెండు స్విచ్చులుంటాయి.. అవి ఆన్‌లో ఉన్నాయో లేదో చూసుకుంటూ ఉండాలెప్పుడూ...’’ అంటూ డైరెక్షన్లిచ్చి తిరిగి నా పనిలో మునిగిపోయా. అసలు మా ఇంట్లో కరెంట్ పోయినా,నెట్ రాకపోయినా ముందుగా ఇబ్బంది పడేది అమ్మ, ఆ తర్వాత మూడున్నరేళ్ల మా చిన్నదీ. పొద్దుగూకులూ ఫోన్‌తోనే దాని ఆటలన్నీ. పెద్దదానికేమో సిస్టమ్ ఆపరేట్ చెయ్యడం వచ్చు. యూట్యూబ్ పెట్టుకుని గేమ్సూ అవీ చూసేస్తుంటుంది. మా ఆవిడకేమో పని ధ్యాస, ఇల్లు సర్దుడూ తప్ప ఎవరితోనూ పెద్దగా మాట్లాడదు. పాపం! అమ్మకేమో మొదటినుంచీ నలుగురిలో ఉండటం, కబుర్లు చెప్పడం అలవాటు కాబట్టి మాటల కోసం మొహం వాచిపోయి ఉంటుంది. నేను కాస్త ఖాళీగా కనిపిస్తే చాలు... పక్కన కూచుని కబుర్లు చెబుతుంటుంది. నాక్కూడా ఈ మధ్య ఆమెతో గడిపేందుకు సరిగా తీరిక దొరకడం లేదు. దాంతో ఆమెకి ఫోనే ప్రపంచంగా మారిపోయింది. పాపం! నిజానికి ఈ వాట్సప్పులూ, ఫేస్‌బుక్కులూ మొన్నటి దాకా ఆమెకూ తెలీదు. ఈ మధ్యనే తన చిన్ననాటి స్నేహితుల మూలంగా తనూ ‘స్మార్ట్’అయిపోయింది. ఎప్పుడో యాభై ఏళ్ల క్రితం అమ్మతో కలిసి చదువుకున్న స్కూల్మేటొకాయన ఫేస్బుక్లో నా ఫొటోతోబాటూ ఉన్న అమ్మ ఫొటోలు చూసి గుర్తుపట్టి నా ద్వారా అమ్మను కాంటాక్ట్ చేశాడు. తర్వాత ఆమెను బతిమాలీ బామాలీ అందరూ కలిసి ఆమెను పూర్వవిద్యార్థి సమ్మేళనానికి తీసుకెళ్లారు. వాళ్లలో ప్రభుత్వంలో పెద్ద ఆఫీసర్‌గా పని చేసి రిటైరైన ఒకాయన వద్దు వద్దంటున్నా వినకుండా ఆమెకు ఒక స్మార్ట్‌ఫోన్ కొనిచ్చాడు. అంతటితో ఆగకుండా ఆ ఫోన్లో వాట్సప్పూ, ఫేస్బుక్కూ ఇన్స్టాల్ చేసి, వాటిని ఆపరేట్ చేయడం ఎలాగో నేర్పించాడు... స్వతహాగా తెలివిగల మా అమ్మ అన్నిటినీ ఠకాఠకా నేర్చేసుకుని, తన పాత నొక్కుడు ఫోన్ పక్కన పడేసి,స్మార్ట్ మదర్ అయిపోయింది. తొందరలోనే తను మా అందరికన్నా బిజీ అయిపోయింది ఫేస్బుక్కూ, వాట్సప్పులలో. వాటి పుణ్యమా అని ఇప్పుడు నాకు ఫోన్ చేయడం, మా పెద్దదానితో ‘తిండి తినకపోతే చిక్కిపోతావ్, అది తినూ, ఇది తినూ అని సతాయించడం... పొద్దుగూకులూ ఆ సిస్టమ్ చూడ్డమేనా, హోమ్ వర్క్ చేసుకునేదేమైనా ఉందా’’ అంటూ గొడవ పడటం మానేసింది. పైపెచ్చు మా చిన్నదెప్పుడైనా ఏడుస్తుంటే పిలిచి, దగ్గర కూచోబెట్టుకుని తన ఫోన్లోని వీడియోలూ, ఫొటోలూ చూపిస్తూ, మాక్కొంచెం ఊరట కనిపించింది. ఇదేదో బాగానే ఉందిలే అనుకున్నాం నేనూ అక్కా వాళ్లూ. నేను మా ఆఫీసులోని వాళ్లకీ, తెలిసిన వాళ్లకీ కూడా ‘‘మా అమ్మ వాట్సప్పు వాడుతుంది తెలుసా’’ అని గర్వంగా చెప్పుకోవడం మొదలు పెట్టాను. అయితే, త్వరలోనే మాకు ‘స్మార్ట్’ సమస్యలూ మొదలయ్యాయి. ఫోన్లో తెలుగు కీ బోర్డ్ పెట్టుకుని నాకూ, మా అక్కా వాళ్లకూ, పిన్నీ వాళ్లకీ, తనకు ఆ ఫోన్ కొనిచ్చినాయనకీ ఎడాపెడా మెసేజీలు చేయడం... ఏదో హడావుడిలో ఉండి రిప్లై ఇవ్వకపోతే ‘‘చూసి కూడా రిప్లై ఇవ్వలేదే’’ అని నిష్ఠూరాలు పోవడం మొదలు పెట్టింది. ఫేస్బుక్లోనేమో తను వయసులో ఉన్నప్పటి ఫొటోని ప్రొఫైల్ పిక్‌గా పెట్టుకుంది. దాంతో ఆమె యంగ్ అనుకుని కొందరు ఆకతాయిలు ‘‘హాయ్... యూ ఆర్ సో స్వీట్’’అంటూ మెసేజీలు, చాటింగ్‌లు చేయడం మొదలు పెట్టారు. అవి మా దగ్గరకు తీసుకొచ్చి చూపించి నవ్వుకోవడం, కొంచెం వికటిస్తే తనలో తనే భయపడ్డం... గ్యాలరీలో ఫొటోలు చూసుకుంటుంటే పొరపాటుగా ఎవరికో వెళ్లాయి, వాటిని డిలీట్ చేయడం ఎలా అని కంగారు పడటం... పక్కరూమ్లో ఉన్న నాకు కూడా ‘‘ఏంటీ అట్లా ఉన్నావ్... ఆఫీస్‌లో ఎవరన్నా ఏమైనా అన్నారా... లేకపోతే మీ ఆవిడేమైనా పుట్టింటికెళ్తానంటోందా’’ అని వాట్సప్ చేయడం... లేదంటే ‘ఒకసారిటొచ్చిపో’ అని మెసేజీలివ్వడం... గ్యాలరీలో ఎప్పటినుంచో ఉన్న ఫొటోలు పొరపాటుగా డిలీటయిపోయాయి. ఎలా వస్తాయి అని అడగడం... ఫోన్ మెమరీ ఫుల్లయిపోయిందనీ, నెట్టు రావడం లేదనీ, వైఫై ఆన్ చేయడం మర్చిపోయి, డేటా ఆన్ చేసేసరికి బ్యాలన్సంతా అయిపోయిందని బాధపడటం... ఇలాగన్నమాట. అసలు అంతకుముందు సన్డే సప్లిమెంట్లలో తెలుగు పదకేళీలు పూర్తిచేయడమంటే అమ్మకు ఇష్టమని ఆమెకోసం ఆదివారం నాడు నాలుగైదు పేపర్లు వేయించేవాణ్ణి... ఇప్పుడు వైఫై పెట్టించాల్సొచ్చింది!! మొన్నామధ్య రోడ్డు బాగు చేస్తుండే సరికి కేబుల్ వైర్లు తెగిపోయి, రెండు మూడురోజులపాటు నెట్ సరిగా పని చేయలేదు. కరెంట్ కూడా వస్తూ పోతూ ఉంది. దాంతో చేసేదేం లేక ఎప్పటెప్పటివో సన్డే సప్లిమెంట్లు ముందేసుకుని కూచుని పజిల్స్ పూర్తి చేస్తూ... మధ్యమధ్యలో తెలియని పదాల కోసం ఫోన్లు చేసి మాట్లాడుతూ కనిపించింది. అయితే ఆ సంబరం ఎన్నాళ్లుంటుంది... కేబుల్ వైర్లు కలవకుండా ఉంటాయా? కరెంటు రాకుండా ఉంటుందా? సిస్టమ్ పని చేయకుండా ఉంటుందా? అదిగో... మళ్లీ పోన్ రింగవుతోంది. అమ్మే చేస్తోంది.. బహుశా మళ్లీ వైఫై పని చేయడం లేదేమో! అప్డేట్ అవ్వండే! ఒక్కసారి.. పైన ఫొటోలో ఉన్న బామ్మగారిని చూడండి. ఫోన్లో ఎవరితోనో మాట్లాడుతున్నారు. ఈ వయసులో ఇంకెవరితో మాట్లాడతారు? మనవరాళ్లు, మనవళ్ల గురించి కొడుకు, కూతురితో డిస్కస్ చేస్తున్నారని తప్పులో కాలేయకండి. ఇంటర్నెట్ స్పీడ్ పెంచమని కంప్లైట్ చేస్తున్నారామె. మాములు బామ్మ కాదండీ బాబు. అప్డేటేడ్ బామ్మగారు. అంతేనా.. ఆమెని ఎవరైనా బామ్మ అంటే ఊరుకోరు. ‘కాల్ మీ బేబీ. బేబీ షామిలి’ అంటారు. ఇప్పుడు అర్థమైందిగా ఎంత అప్డేటెడ్ బామ్మగారో. ‘అప్ డేట్ అవ్వండే. గంటల తరబడి అద్దం ముందు నిలబడి మిమ్మల్ని మీరు చూసుకోవడం కాదు... మిమ్మల్ని పదిమందీ చూసేలా తయారవ్వండి’ అని మనుమరాళ్లను ఊదరగొడుతుంటుంది. మోడరన్ బామ్మగా రోహిణీహట్టంగడి నటించిన ఈ సీన్ ఏన్టీఆర్, సమంత నటించిన ‘రామయ్యా.. వస్తావయ్యా’ సినిమాలోనిది. – డి.వి.ఆర్.భాస్కర్ -
పేలిన స్మార్ట్‌ఫోన్..బెంబేలెత్తిన ప్రయాణికులు
న్యూడిల్లీ: ఢిల్లీనుంచి బయలుదేరిన జెట్ ఎయిర్వేస్ విమానంలో సడెన్‌గా కలకలం రేగింది. 80 మంది ప్రయాణికులతో ఇండోర్ వెళుతున్న విమానంలో ఉన్నట్టుండి దట్టమైన పొగ అలుముకోవడంతో ప్రయాణీకుల పై ప్రాణాలు పైనే పోయాయి. అయితే వెంటనే అప్రమత్తమైన సిబ్బంది,కారణాలను కనుక్కొని ప్రయాణికులను శాంతింప చేశారు. ఒక ప్రయాణీకురాలి హ్యాండ్‌బ్యాగ్‌లో ఉన్న మొబైల్ ఫోన్ పేలడంతో ప్రయాణీకులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఢిల్లీ నుంచి ఇండోర్ వెడుతున్న జెట్ ఎయిర్ వేస్ విమానంలో శుక్రవారం ఈ సంఘటన చోటు చేసుకుంది. ఢిల్లీలో ప్యాకేజింగ్ బిజినెస్ చేస్తున్న , ఢిల్లీలో మాయూర్ విహార్-ఐకి చెందిన అతుల్ ధాల్ , భార్య అర్పితా ధాల్, 18 నెలల వయసున్న కుమారుడు , తండ్రితో కలిసి దీపావళి పండుగకు వెళుతుండగా ఈ ప్రమాదం సంభవించింది. స్నాక్స్ ఇస్తుండగా పొగ అలుముకోవడాన్ని విమాన సిబ్బంది గమనించారు. వెంటనే సీటు కిందనుంచి బ్యాగును బయటకుతీసి, ఇతర ప్రయాణీకుల సాయంతో మంటల్ని ఆర్పారు. తమ సీటు కిందనుంచి శబ్దం రావడంతోపాటు, బాగా పొగరావడాన్ని గమనించామని అతుల్ ధాల్ తెలిపారు. బ్యాగులో ఉన్న మొత్తం మూడు సెల్ఫోన్లు ఉండగా, అందులో ఒకటి పేలిదంటూ వివరించారు. ఈ సంఘటనను డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్‌కు నివేదించామని జెట్ ఎయిర్వేస్ ప్రకటించింది. డీజీసీఏ సూచించిన మార్గదర్శకాల ప్రకారం అన్ని అవసరమైన జాగ్రత్తలు తీసుకున్నామనీ, మొబైల్ పరికరాన్ని తదుపరి దర్యాప్తు కోసం కస్టడీలోకి తీసుకున్నామని . మరోవైపు పేలిన స్మార్ట్‌ఫోన్ ఏ కంపెనీది తదితర వివరాలను మాత్రం వెల్లడించలేదు. -
చెమటతో చార్జింగ్
లాస్ఏంజిలెస్: మనుషుల స్వేదాన్ని ఉపయోగించి ఎలక్ట్రానిక్ పరికరాలను చార్జ్ చేసేసాంకేతి కతను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఈ టెక్నాలజీని ఉపయోగించి చర్మానికి అంటిపెట్టుకొని ఉండేలా పట్టీ(స్కిన్ పాచ్)ని రూపొందించారు. సాధారణంగా బ్యాటరీల్లో వినియోగించే లోహాలను కాకుండా ఈ స్కిన్ పాచ్‌లో ఎంజైమ్స్‌ను ఉపయోగించామని దీన్ని అభివృద్ధి చేసిన కాలిఫోర్నియా వర్సిటీ పరిశోధకులు చెప్పారు. చెమటలో ఉండే లాక్టిక్ యాసిడ్‌ను ఉపయోగించుకుని పరికరంలో అమర్చిన బయో ఫ్యూయల్ సెల్స్ చార్జ్ అవుతాయని తెలిపారు. -
ప్రపంచంలో అతిచిన్న ప్రాస్సెసర్ ఫోన్
-
మోస్ట్ హాక్-ప్రూఫ్ స్మార్ట్‌పోన్ ఇదేనట!
హ్యాకింగ్ భయాలతో ఆందోళన చెందుతున్నస్మార్ట్ఫోన్ ప్రేమికులకు శుభవార్త. సైబర్ సెక్యూరిటీ సాఫ్ట్వేర్ కంపెనీ మెకఫే ఇంతకుముందెన్నడూ లేని ఒక సరికొత్త ప్రైవసీ స్మార్ట్‌ఫోన్ లాంచ్ చేయనుంది. మోస్ట్ హాక్-ప్రూఫ్ స్మార్ట్‌పోన్‌ను తయారుచేసే ప్రణాళికలను ఆయన ఇటీవల ట్విట్టర్ లో వెల్లడించారు. ఈ స్మార్ట్‌ఫోన్‌ను హ్యాక్ చేయడం చాలా కష్టమని తెలిపారు. ‘న్యూస్‌వీక్’ వెబ్సైట్ తో మాట్లాడిన మెకఫే సంస్థ వ్యవస్థాపకుడు జాన్ మెకఫే ప్రపంచంలోనే తొలి పూర్తి ప్రైవేట్ స్మార్ట్‌ఫోన్ ఇదేనని కూడా ప్రకటించారు. ‘జాన్ మెకఫే ప్రైవసీ ఫోన్’ పేరుతో ఈ ఏడాదే ఈ ఫోన్ అందుబాటులోకి వస్తుందని మెకఫే చెప్పారు. అయితే ఇది సాధారణ వినియోగదారుల కోసం కాదట... వ్యాపారవేత్తలు, సమాచార భద్రత కోరుకునే వారి కోసం దీన్ని తయారుచేశామన్నారు. ఇక ధర విషయానికి వస్తే సుమారు రూ. 65వేలు (1000 డాలర్లు) ఉంటుందని చెప్పారు. ‘ప్రపంచంలోనే తొలి ట్రూలీ ప్రైవేట్ స్మార్ట్‌ఫోన్ అని జాన్ ట్వీట్ చేశారు. దీంతోపాటు ప్రైవసీ స్మార్ట్‌ఫోన్ ఫొటోను షేర్ చేశారు. డెన్మార్క్‌లో డిజైన్ చేసి, అమెరికాలో డెవలప్ చేసి, యూరోప్‌లో అసెంబుల్డ్ చేసిన ఈ స్పెషల్ స్మార్ట్‌ఫోన్‌ను ఎంజీటీ, మెకఫే సంస్థలు సంయుక్తంగా తయారుచేస్తునట్టు వివరించారు. అయితే ఈ ఫోన్ స్పెసిఫికేషన్ల గురించి మాత్రం వెల్లడించలేదు. దీని అఫీషియల్ లాంచింగ్ ముందు పూర్తి వివరాలు ప్రకటిస్తామన్నారు. ఈ డివైస్ హార్డ్‌వేర్ భద్రత అంశంలో కీలక ప్రాత పోషించనుందన్నారు. "హార్డ్‌వేర్ భద్రతకు మూలం..సాప్ట్వేర్ అభద్రతకు ఆధారం అన్నట్టుగా ట్వీట్ చేశారు. కాగా యూజర్ల డేటాను రక్షించేందుకు ఆపిల్, గూగల్ ఆపరేటింగ్ సిస్టం ప్రైవసీ పద్దతులను పాటిస్తోంటే..మరి ఈ మెకఫీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోనుందో ఇంకా రివీల్ కావల్సి ఉంది. -
ఫోన్ మాట్లాడుతూ భవనంపై నుంచి పడి యువతి మృతి
చైతన్యపురి: అపార్ట్మెంట్ టెర్రస్‌పై ఫోన్లో మాట్లాడుతున్న ఓ యువతి ప్రమాదవశాత్తు నుంచి కిందపడి తీవ్ర గాయాలపాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందిన సంఘటన సరూర్‌నగర్ పోలీసుస్టేషన్ పరిధిలో గురువారం చోటుచేసుకుంది. ఎస్సై ప్రభాకర్ తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్ జిల్లా నెక్కొండ మండలం పత్తిపాక గ్రామానికి చెందిన ఏదుల కుమార్ బతుకుదెరువు కోసం రెండేళ్ల క్రితం నగరానికి వచ్చి సరూర్‌నగర్‌లోని జనప్రియ అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్నాడు. కుమార్‌కు నలుగురు కూతుళ్లు. నాల్గో కూతురు మమత (18) దిల్‌సుఖ్‌నగర్‌లోని ఓ కళాశాలలో డిగ్రీ రెండో సంవత్సరం చదువుతోంది. మమత గురువారం అపార్ట్మెంట్ రెండో అంతస్తులో టెర్రస్‌పై ఫోన్లో మాట్లాడుతూ ప్రమాదవశాత్తు కిందపడింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందింది. -
ఢిల్లీలో మొబైల్ స్టోర్‌లో మహిళల రచ్చ
-
భారత్ మా నిజమైన భాగస్వామి
• మోదీతో ఫోన్లో ట్రంప్ • అమెరికా రావాలని మోదీకి ఆహ్వానం న్యూఢిల్లీ/వాషింగ్టన్: భారత్ తమకు నిజమైన భాగస్వామి అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటిం చారు. అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన నాలుగు రోజుల తర్వాత భారత ప్రధాని మోదీకి ట్రంప్ మంగళవారం రాత్రి ఫోన్ చేశారు. జనవరి 20న బాధ్యతలు స్వీకరించిన తర్వాత ట్రంప్ బ్రిటన్, కెనడా, మెక్సికో, ఇజ్రాయెల్, ఈజిప్టు దేశాల అధినేతలతో ఫోన్లో సంభాషించారు. తాజాగా మోదీకి ఫోన్ చేశారు. ఉగ్రవాదంపై పోరాటానికి ఇరు దేశాలు భుజం భుజం కలిపి పనిచేయాలని, రక్షణ, ఆర్థిక సంబం ధాలను మరింత బలోపేతం చేయాల ని ఈ సందర్భంగా ట్రంప్, మోదీ నిర్ణయించారు. ఫోన్ సంభాషణ సంద ర్భంగా ట్రంప్ భారత్‌లో పర్యటిం చాల్సిందిగా మోదీ ఆహ్వా నించారు. ద్వైపాక్షిక పర్యటన నిమి త్తంగా మోదీ అమెరికా రావాలని ట్రంప్ కూడా ఆహ్వానించారు. ప్రపంచ వ్యాప్తంగా ఎదురవుతున్న సవాళ్లను ఎదుర్కో వడంతో భారత్ తమకు నిజమైన మిత్రదేశం, భాగస్వామి అని ట్రంప్ పేర్కొన్నట్టు వైట్‌హౌస్ తెలిపింది. -
మోదీకి ట్రంప్ ఫోను
న్యూఢిల్లీ: నాలుగు రోజుల క్రితం అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేసిన డొనాల్డ్ ట్రంప్.. మంగళవారం రాత్రి 11.30 గంటలకు ప్రధాని నరేంద్ర మోదీకి ఫోన్ చేశారు. ఈ విషయాన్ని వైట్‌హౌస్ కార్యాలయం మీడియా కార్యదర్శి సీన్ స్పైసర్ వెల్లడించారు. అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాక వరుసగా వివిధ దేశాధినేతలతో మాట్లాడుతున్న ట్రంప్ ఇప్పటికే కెనడా, మెక్సికో, ఇజ్రాయెల్, ఈజిప్టు దేశాధినేతలకు ఫోన్ చేసి మాట్లాడారు. మంగళవారం రాత్రి ప్రధాని మోదీ ట్రంప్‌కి మరోసారి శుభాకాంక్షలు తెలిపారు. ఇరు దేశాల మధ్య సైనిక, ఆర్థిక రంగాల్లో భాగస్వామ్యం బలోపేతంపై చర్చించారు. వచ్చే ఏడాది మోదీని అమెరికా పర్యటనకు రావాలని ట్రంప్ ఆహ్వానించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సవాళ్లును అధిగమించడంలో భారత్ ఓ నిజమైన స్నేహితునిగా ట్రంప్ అభివర్ణించారు. భద్రతపరమైన అంశాలతో పాటు పలు కీలక అంశాలపై ఇరు నేతలు చర్చించినట్లు వైట్ హౌస్ కార్యాలయం విడుదల చేసిన ఓ ప్రకటనలో తెలిపింది. అధ్యక్షుడిగా ఎన్నికైతే భారత్, ఇజ్రాయెల్ సహా పలు దేశాలతో సంబంధాలు మరింత మెరుగుపడేలా కృషి చేస్తామంటూ ఎన్నికల ప్రచారంలో ట్రంప్ ప్రకటించారు. ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా గెలుపొందిన వెంటనే అభినందించిన తొలి ఐదుగురు నేతల్లో మోదీ కూడా ఒకరు.


