Viral Video: విమానం టేక్‌ అఫ్‌ టైంలో ఫోన్‌ మిస్సింగ్‌.. పైలెట్‌ కిటికిలోంచి వంగి మరీ...

Airline Captain Hangs From Window To Retreive Customers Lost Phone - Sakshi

ఓ ప్రయాణికుడు విమానం ఎక్కే ముందు తన ఫోన్‌ని మర్చిపోయాడు. ఐతే ఇంతలో విమానంలో ప్రయాణికులంతా ఎక్కేశారు. ఇక బయలుదేరుతుంది అనేలోపు ఓ విచిత్ర సంఘటన జరిగింది. ఈ విషయాన్ని డల్లాస్‌ చెందిన ఎయిర్‌లైన్‌ ఫేస్‌బుక్‌లో పేర్కొంది.

వివరాల్లోకెళ్తే...కాలిఫోర్నియాలోని లాంట్‌ బీజ్‌ ఎయిర్‌పోర్ట్‌లో సౌత్‌ వెస్ట్‌ ఎయిర్‌లైన్స్‌ విమానం ప్రయాణికులంతా ఎక్కేయడంతో టేకాఫ్‌కి రెడీ అయ్యింది. ఇంతలో గ్రౌండ్‌ సిబ్బంది గేట్‌ వద్ద ఒక ప్రయాణికుడు ఫోన్‌ మర్చిపోవటాన్ని గుర్తించారు. దీంతో వారు వెంటనే అప్రమత్తమై టేకాఫ్‌ అవుతున్న విమానం దగ్గరకు వచ్చి ప్రయాణికుడి ఫోన్‌ ఇచ్చేందుకు వస్తారు. 

విషయం గ్రహించిన ఫైలెట్‌ కిటికిలోంచి వంగి మరీ సిబ్బంది నుంచి ఫోన్‌ని అందుకున్నాడు. ఆ తర్వాత ప్రయాణకుడికి అతను మర్చిపోయిన ఫోన్‌ని అందజేశారు. అందుకు సంబంధించిన వీడియోని డల్లాస్‌ ఎయిర్‌లైన్‌ ట్విట్టర్‌లో పోస్ట్‌ చేస్తూ...మా సౌత్‌వెస్ట్‌ ఎయిర్‌లైన్స్‌ని ప్రేమించండి. ఇలా మా సిబ్బంది అప్రమత్తమై ప్రయాణికులకు సాయం చేయడాన్ని కస్టమర్‌ సర్వీస్‌ రిప్రజెంటేటివ్‌ అంటారు అని పేర్కొంది. దీంతో ఈ వీడియో నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది. 

(చదవండి: వామ్మో! భగభగమండే సూర్యుని ఉపరితలంపై స్నేక్‌)

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top