ప్లీజ్‌ కూల్‌డ్రింక్స్‌కి దూరంగా ఉండండి..! | Man Urges To Avoid Soft Drinks Talks About Brothers Health, Video Goes Viral On Social Media | Sakshi
Sakshi News home page

ప్లీజ్‌ కూల్‌డ్రింక్స్‌కి దూరంగా ఉండండి..!

Feb 5 2026 1:06 PM | Updated on Feb 5 2026 1:52 PM

Man Urges To Avoid Soft Drinks Talks About Brothers Health Goes Viral

శీతల పానీయాలు తాగొద్దని వైద్యులు పదేపదే సూచిస్తుంటారు. ఈ కార్బోనేటెడ్‌ డ్రింక్స్‌ ఫ్యాటీ లివర్‌, కిడ్నీ సంబంధిత అనారోగాల బారిన పడేలా చేస్తుందని ఆరోగ్య నిపుణుల సదా హెచ్చరిస్తుంటారు. అయినాసరే ఏం కాదులే అంటూ తేలిగ్గా కొట్టిపారేస్తూ..తాగేస్తుంటారు చాలామంది. అయితే అది ఎలా ఆరోగ్యాన్ని సమస్యల కోరల్లో చిక్కుకునేలా చేస్తోంది అస్సలు గ్రహించం అంటూ ఇక్కడొక వ్యక్తి కన్నీరుమున్నీరు విలపిస్తున్న కథ వింటే కచ్చితంగా విస్తుపోతారు. అంతేగాదు ఈ కూల్‌డ్రింక్స్‌ తాగాలా వద్దా అనే సందేహం కచ్చితంగా ఎదురవ్వుతుంది. 

ఎందుకంటే..నెట్టింట వైరల్‌ అవ్వుతున్న ఓ వీడియో అందర్నీ ఆలోచింపచేశాలా ఆకర్షిస్తోంది. ఆ వీడియోలో ఓ వ్యక్తి శీతల పానీయాలు తాగడం మానేయండి అంటూ వేడుకుంటున్నట్లు స్పష్టంగా కనిపిస్తుంది. తన తముమ్మడు అలాంటి పానీయాలు తాగే ఆరోగ్యం పాడుచేసుకున్నాడంటూ భావోద్వేగం మాట్లాడటం చూడొచ్చు. అతడి ఆరోగ్యం దారుణంగా పాడైందని, ఊపిరితిత్తులు పూర్తిగా దెబ్బతిన్నాయని తెలిపాడు. 

దాంతో తన కుటుంబం తీవ్ర ఇబ్బందులో పడిందని పేర్కొన్నాడు. తన తమ్ముడిలా ఎవ్వరూ ఆరోగ్యం పాడుచేసుకోకండి అని కోరడం వీడియోలో స్పష్టంగా కనిపించింది. అంతేగాదు ఈ శీతల పానీయాన్ని విషంగా పేర్కొన్నాడు. దీని కారణంగా తన సోదరుడు జీవితం పాడైందంటూ కన్నీరుమున్నీరు విలపించాడు ఆ వ్యక్తి వీడియోలో. 

చాలామంది నెటిజన్లు అవును ఇది మంచిది కాదని తెలిసి విషాన్ని తాగుతున్నామని అంగీకరించారు. ఈ ఘటన అందరికి కనువిప్పు అని పేర్కొంటూ కొందరు  పోస్టులు పెట్టగా, మరికొందరు మాత్రం అతను రోజు కూల్‌డ్రింక్స్‌ తాగుతున్నాడని తెలిసినప్పుడూ ఎందుకు అదుపుచేయలేకపోయారు అని విమర్శిస్తూ పోస్టులు పెట్టారు.

 

(చదవండి: 'బరువు తగ్గించే జైలు'..! ఏకంగా మిలటరీ రేంజ్‌ శిక్షణ..12 గంటల వ్యాయామాలు..)

 

Advertisement
 
Advertisement
Advertisement