స్ట్రాబెర్రీలతో ఆరోగ్యం..అందం కూడా.. | Strawberry: Amazing Benefits of Strawberry for Glowing, Healthy | Sakshi
Sakshi News home page

Strawberry: స్ట్రాబెర్రీలతో ఆరోగ్యం..అందం కూడా..

Feb 5 2026 1:21 PM | Updated on Feb 5 2026 1:23 PM

Strawberry:  Amazing Benefits of Strawberry for Glowing, Healthy

స్ట్రాబెర్రీలు ఈ సీజన్‌లో పుష్కలంగా లభిస్తాయి. ఇవి రుచిని మాత్రమే కాదు ఆరోగ్యం, అందాన్నివ్వడంలోనూ మేలు చేస్తాయి. 

  • వీటిల్లో పుష్కలంగా ఉండే విటమిన్‌ ఇ, పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్లు ఇమ్యూనిటీని పెంచి, ఇన్ఫెక్షన్ల నుండి రక్షిస్తాయి. మెదడుకు రక్తప్రసరణను మెరుగుపరిచి మెదడు చురుగ్గా పనిచేసేలా చేస్తాయి.

  • స్ట్రాబెర్రీలు రక్తపోటును నియంత్రించడంలో, కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడతాయి.

  • వీటిలో క్యాలరీలు తక్కువగా, ఫైబర్‌ ఎక్కువగా ఉండటం వల్ల బరువు తగ్గాలనుకునే వారికి ఇవి మంచి ఎంపిక.

  • వయస్సు తోపాటు వచ్చే కంటి సమస్యలను నివారించడంలో స్ట్రాబెర్రీలు సహాయపడుతాయి.

  • అనేక సౌందర్య సాధనాల్లో ఉపయోగించే స్ట్రాబెర్రీ గుజ్జును ముఖానికి ప్యాక్‌లా వేసుకోవడం వల్ల చర్మం కాంతివంతంగా మారుతుంది. 

  • ఇందులోని ఎల్లాజిక్‌ యాసిడ్‌ చర్మం ముడతలు పడకుండా కాపాడుతుంది

  • స్ట్రాబెర్రీలలో ఉండే మాలిక్‌ యాసిడ్‌ దంతాలపై ఉండే పసుపు రంగు మరకలను తొలగించి, దంతాలను తెల్లగా మార్చడంలో సహాయపడుతుంది.

  • స్ట్రాబెర్రీలలో ఉండే విటమిన్‌ సి శరీరంలో ఒత్తిడికి కారణమయ్యే కార్టిసాల్‌ అనే హార్మోన్‌ స్థాయిని తగ్గించడంలో సహాయపడుతుంది. 

(చదవండి: ప్లీజ్‌ కూల్‌డ్రింక్స్‌కి దూరంగా ఉండండి..!)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement