ఎవరీ వంది వర్మ...? మార్స్‌ రోవర్స్‌ తొలి ప్లాన్‌ డ్రైవ్‌.. | Indian Origin Scientist Behind Mars Rovers AI-Powered Drive | Sakshi
Sakshi News home page

ఎవరీ వంది వర్మ...? మార్స్‌ రోవర్స్‌ తొలి ప్లాన్‌ డ్రైవ్‌..

Feb 5 2026 10:27 AM | Updated on Feb 5 2026 10:35 AM

Indian Origin Scientist Behind Mars Rovers AI-Powered Drive

అంగారక గ్రహంపై నాసా తొలి ఏఐ ప్లాన్‌ డ్రైవ్‌ వెనుక ఉన్న ప్రధాన శాస్త్రవేత్తగా భారత సంతతి మహిళ వంది వర్మ చరిత్ర సృష్టించారు. భారత్‌కి చెందిన ఈ రోబోటిక్స్‌ ఇంజనీర్‌ వంది వర్మ విమానాయనానికి సంబంధించిన కుటుంబంలోనే పెరగడంతో సాంకేతికను అన్వేషించడం ఆమెకు వెన్నతో పెట్టిన విద్య. 

నాసా ప్రకారం..వర్మ జేపీఎల్‌ ప్రిన్సిపాల్‌ ఇంజనీర్‌గా, కాలిఫోర్నియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలోని NASA జెట్ ప్రొపల్షన్ లాబొరేటరీలో మొబిలిటీ అండ్‌ రోబోటిక్స్ విభాగానికి డిప్యూటీ సెక్షన్ మేనేజర్‌గా పనిచేస్తున్నారు. అమెరికన్ అంతరిక్ష సంస్థకు ముందు, అధికారికంగా ధృవీకరించిన ప్లాన్‌ అములు చేసే భాష PLEXIL, రోవర్లు, మానవ అంతరిక్ష ప్రయాణ ప్రాజెక్టులకు సంబంధించిన సాంకేతికతను డెవలప్‌చేయడానికి రూపొందించిన బృందానికి ఆమె నాయకత్వం వహించినట్లు నాసా పేర్కొంది. 

ఆ కారణంతోనే రోబోటిక్‌ ఇంజనీరింగ్‌నే కెరీర్‌గా ఎంచుకుంది..
వర్మ తండ్రి భారత వైమానిక దళంలో పనిచేశారు. విమానాలు,ఇంజనీరింగ్ వాతావరణాలతో ఆమెకు తొలి దశలో పరిచయం ఉండటం వల్ల ఆమెకు టెక్నాలజీపై ఆసక్తి పెరిగింది. చండీగఢ్‌లోని పంజాబ్ ఇంజనీరింగ్ కళాశాల నుంచి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ డిగ్రీని పూర్తి చేసి, తర్వాత కార్నెగీ మెల్లన్ విశ్వవిద్యాలయం నుంచి రోబోటిక్స్‌లో మాస్టర్స్ అండ్‌ పిహెచ్‌డి పొందారామె. 

ఇక వర్మ డిసెంబర్‌ 8 నుంచి 10 తేదీల్లో ఏఐ ప్లాన్‌ పెర్సెవరెన్స్ మార్స్ రోవర్ మొదటి డ్రైవ్‌లను పూర్తి చేసినట్లు నాసా ధృవీకరించింది. ఈ ప్రదర్శనం మన సామర్త్యాలు ఎంతవరకు అభివృద్ధి చెందాయో చెబుతుండటమే గాక, ఇతర ప్రపంచాలను ఎలా అన్వేషించాలో తెలుపుతుందని నాసా అడ్మినిస్ట్రేర్‌ జారెడ్‌ ఐజాక్‌మాన్‌ చెబుతున్నారు. 

(చదవండి: మళ్లీ పెళ్లి చేసుకుంటారా..? వృద్ధ మహిళలు ఏమన్నారో తెలుసా..!)
 

Advertisement
 
Advertisement
Advertisement