పావురాలకు దాణా వేస్తే 2.2 లక్షల జరిమానా | Fine Of Rs 2.2 Lakh Was Imposed For Feeding The Pigeons | Sakshi
Sakshi News home page

పావురాలకు దాణా వేస్తే 2.2 లక్షల జరిమానా

Feb 5 2026 7:33 AM | Updated on Feb 5 2026 8:33 AM

Fine Of Rs 2.2 Lakh Was Imposed For Feeding The Pigeons

సింగపూర్‌లో భారతీయ వృద్ధురాలికి చేదు అనుభవం

సింగపూర్‌: భారత్‌లో పలు నగరాల్లో విపరీతంగా కన్పించే పావురాలను అమితంగా ఇష్టపడుతూ వాటికి జొన్నల వంటి తిండి గింజలను దాణాగా వేస్తూ పిల్లలుపెద్దలు ఎంతో ఆనందపడతారు. అచ్చం అదే పని చేసి సింగపూర్‌లో ఓ భారతీయ వృద్ధురాలు లక్షల రూపాయల జరిమానా కట్టాల్సి వచ్చింది. పావురాల రెట్ట, వ్యర్థాల్లో పలు రకాల శ్వాసకోశ వ్యాధికారక క్రిములు ఉంటాయి.

గాలిలో ఇవి కలిశాక మనుషులు పీలిస్తే ఇబ్బందుల్లో పడతాము. దీంతో పావురాల సంతతి ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోవద్దనే ఉద్దేశంతో వీటికి దాణా వేసి ప్రక్రియపై సింగపూర్‌లో నిషేధం విధించారు. ఈ విషయం తెలీక 71 ఏల్ల షణ్ముగనాథన్‌ శ్యామల అనే పెద్దావిడ గత ఆరు నెలల్లో తొమ్మిదిసార్లు పావురాలకు దాణా వేశారు. విషయం తెల్సి అధికారులు ఈమెపై కేసు నమోదుచేశారు. విచారించిన కోర్టు ఈమెకు 2,518 డాలర్ల(దాదాపు రూ.2,27,753) జరిమానా విధించింది.

Advertisement
 
Advertisement
Advertisement