UAEలో భగ్గుమంటున్న ఇంటి అద్దె.. ఆందోళనలో భారతీయులు | House rental prices have increased significantly in the UAE | Sakshi
Sakshi News home page

UAEలో భగ్గుమంటున్న ఇంటి అద్దె.. ఆందోళనలో భారతీయులు

Feb 5 2026 5:14 AM | Updated on Feb 5 2026 5:15 AM

House rental prices have increased significantly in the UAE

అబుదాబిలో అద్దెలు రాకెట్ వేగంతో దూసుకెళుతున్నాయి. విల్లాలతో పాటు సాధారణ ప్లాట్ల అద్దెని ఒకేసారి రెట్టింపు చేయడంతో చాలా మంది తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుంది. సంపాదించిన దాంట్లో అగ్రభాగం ఇంటి అద్దెలకే చెల్లించాల్సి వస్తుందని అక్కడి భారతీయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

యూఏఈ అబుదాబిలో ‍అక్కడి ప్రాపర్టీ మేనేజర్లు అధికంగా డబ్బులు అర్జించే లక్షంతో కొత్త నిబంధనలు తీసుకవచ్చారు.  ఉన్న ఫలంగా అద్దెలను రెట్టింపు చేశారు. అక్కడి గృహా చట్టాల ప్రకారం ఒక విల్లాలో ఒకటి కంటే ఎక్కువ కుటుంబాలు ఉండడం నిషిద్ధం. అయితే అక్కడి అద్దెల రీత్యా చాలా మంది విల్లాలలను షేర్ చేసుకొని అద్దెకు తీసుకుంటారు. కాగా ఇప్పుడు ఒకటి కంటే ఎక్కువ ప్రాంతాలలో నివాసమున్న వారిని వెంటనే ఖాళీ చేయాల్సిందిగా ఆదేశాలు ఇచ్చారు. దీంతో చట్టపరంగా అది విరుద్ధం కావడంతో చేసేదేం లేక వారు ఖాళీ చేస్తున్నారు.

విల్లాలతో పాటు ఫ్యామిలీలు అధికంగా నివసించే ప్రాంతాలకు కరెంట్‌ కట్ చేసి మూడు రోజుల్లో ఖాళీ చేయాలని ఆదేశాలు ఇస్తున్నారు. దీంతో వారు ఎటువెళ్లాలో తెలియక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం ఉంటున్న వారిని బలవంతంగా ఖాళీ చేయించి అదే వాటిని కొత్త వారికి అధిక ధరలకు ఇస్తున్నారని అక్కడి ప్రజలు ఆందోళన చెందుతున్నారు.గతంలో 24,000 దిర్హామ్‌లు ఉండే విల్లాల అద్దె ప్రస్తుతం 40,000 దిర్హామ్‌లు చేరుకుంది.  
 

Advertisement
 
Advertisement
Advertisement