యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) వెళ్లాలనుకునే వలస కార్మికుల ఉచిత వీసాల కోసం అక్కడి ఏడీఎన్‌హెచ్ సంస్థ, తెలంగాణలోని జీటీఎం సంస్థలు రిక్రూట్‌మెంట్ ర్యాలీకి సన్నాహాలు చేస్తున్నాయి. ఫిబ్రవరిలో నాలుగు చోట్ల ఇంటర్వ్యూలను నిర్వహించడానికి ఏర్పాట్లు చేశాయి. క్లీనింగ్ విభాగంలో పనిచేసేందుకు ఉచితంగా వీసాలను జారీ చేసి, ఉచిత విమాన టికెట్, వసతి, భోజన సదుపాయం కల్పించి.. మన కరెన్సీలో రూ.23 వేల వరకు వేతనాలను చెల్లించనున్నారు.
వచ్చే నెల 6న జగిత్యాల, సిరిసిల్లలో, 7న నిజామాబా ద్, ఆర్మూర్‌లలోని జీటీఎం సంస్థ కార్యాలయాలలో ఇంటర్వ్యూలను నిర్వహించనున్నారు. వివ రాల కోసం ఆర్మూర్ (8332062299), నిజామాబాద్ (8686860999), జగిత్యాల (83320422 99), సిరిసిల్ల (9391661522) నంబర్లలో సంప్రదించవచ్చని కంపెనీ ప్రతినిధులు వెల్లడించారు.
దళారుల్ని నమ్మొద్దు
ఈనెల 9, 10 తేదీలలో ఇంటర్వ్యూలకు హాజరైన వంద మందిని రెండు మూడు రోజుల్లో యూఏఈకి పంపించడానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. దళారులను నమ్మి మోసపోవద్దు.
– చీటీ సతీశ్‌రావు, చైర్మన్, జీటీఎం ఇంటర్నేషనల్
(చదవండి: 90 నిమిషాల ఎమర్జెన్సీ రూమ్‌కి..హడలెత్తించేలా బిల్లు..!)


