యూఏఈ, ఒమన్‌లో రంజాన్‌ సెలవులు ప్రకటన | Oman Announces Eid Al Fitr Holidays from March 19 to 23 | Sakshi
Sakshi News home page

యూఏఈ, ఒమన్‌లో రంజాన్‌ సెలవులు ప్రకటన

Mar 12 2026 2:19 AM | Updated on Mar 12 2026 2:22 AM

Oman Announces Eid Al Fitr Holidays from March 19 to 23

మస్కట్: ఈద్ ఉల్ ఫితర్ పర్వదినాన్ని పురస్కరించుకుని ఒమన్ ప్రభుత్వం సెలవులను ప్రకటించింది. ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో ఉద్యోగులకు మార్చి 19 గురువారం నుంచి మార్చి 23 సోమవారం వరకు సెలవులు అమల్లో ఉంటాయి. అనంతరం మార్చి 24 నుంచి సాధారణ పనిదినాలు తిరిగి ప్రారంభమవుతాయి.

ఇదిలా ఉండగా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)లో కూడా ఈ ఏడాది ఈద్ అల్-ఫితర్ సందర్భంగా సెలవులను ముందుగానే ప్రకటించారు. మానవ వనరులు, వలస మంత్రిత్వ శాఖ ఫెడరల్ ప్రభుత్వ సంస్థలు, ప్రైవేట్ రంగ ఉద్యోగులకు సంబంధించిన సెలవుల వివరాలను వెల్లడించింది.

ప్రైవేట్ రంగ ఉద్యోగులకు మార్చి 19 నుంచి 21 వరకు మూడు రోజుల సెలవు ప్రకటించారు. అయితే రంజాన్ నెల 30 రోజులు పూర్తయితే, ఈ సెలవు మార్చి 22 వరకు పొడిగించే అవకాశం ఉంది. ఫెడరల్ ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రం మార్చి 19 నుంచి 22 వరకు నాలుగు రోజుల పాటు సెలవులు ఉంటాయి. మార్చి 23 నుంచి కార్యాలయాలు తిరిగి ప్రారంభమవుతాయి.

ఈ ఏడాది ఈద్ సందర్భంగా యూఏఈ నివాసితులకు గరిష్టంగా నాలుగు రోజుల  సెలవులు లభించే అవకాశముంది. అయితే ఈద్ పండుగ తేదీ నెలవంక కనిపించడంపై ఆధారపడి ఉంటుంది. దీనిపై అధికారిక ప్రకటనను ఆయా దేశాల షవ్వాల్ అబ్జర్వేటరీ కమిటీలు జారీ చేయనున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement