ఆయన్ని తట్టుకోలేను.. అందుకే 16 సినిమాలు తిరస్కరించా | Actress Sona About Vadivelu Behaviour Kuselan Movie | Sakshi
Sakshi News home page

Sona Vadivelu: నరకం చూశాను.. మాట్లాడకపోవడమే మంచిది

Mar 10 2026 3:13 PM | Updated on Mar 10 2026 3:20 PM

Actress Sona About Vadivelu Behaviour Kuselan Movie

ఇండస్ట్రీలో నటీనటులు అందరూ ఒకేలా ఉండరు. కొందరు వచ్చామా పనిచేశామా వెళ్లిపోయామా అన్నట్లు ఉంటారు. మరికొందరు మాత్రం తమ చర్యలతో తోటి నటీనటుల్ని చాలానే ఇబ్బందులు పెడుతుంటారు. తాజాగా తమిళ నటి సోనా.. ప్రముఖ కమెడియన్ వడివేలు గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది. ఆయన వల్ల నరకం చూశానన చెప్పుకొచ్చింది. అందుకే 16 సినిమాల్లో ఆయనకు జంటగా నటించే అవకాశమొచ్చినా తిరస్కరించినట్లు మరోసారి స్పష్టం చేసింది.

(ఇదీ చదవండి: మరోసారి నోరుజారిన రాజేంద్ర ప్రసాద్‌)

'కుశేలన్ (తెలుగులో 'కథానాయకుడు') తర్వాత వడివేలుతో కలిసి నటించమని నాకు 16కు పైగా సినిమాల్లో ఛాన్సులు వచ్చాయి. అయితే వాటిని మర్యాదపూర్వకంగా తిరస్కరించాను. ఎందుకంటే నా ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడం నాకు ముఖ్యం. నిజాయితీగా చెప్పాలంటే ఆయనని నేను తట్టుకోలేనేమో అనిపించింది. ఓ రకంగా నరకం చూశాను. అందుకే ఆయనతో కలిసి నటించకూడదని నిర్ణయించుకున్నాను. దీని గురించి ఇంకా ఎక్కువగా మాట్లాడకపవడమే మంచిదని అనుకుంటున్నాను' అని సోనా చెప్పుకొచ్చింది.

తమిళంలో నటి, నిర్మాతగా గుర్తింపు తెచ్చుకున్న సోనా.. ఎక్కువగా శృంగార తరహా పాత్రలే చేసింది. రజనీకాంత్ హీరోగా నటించిన కుశేలన్ చిత్రం తెలుగులో కథానాయకుడు పేరుతో రిలీజైంది. మూవీ ఇక్కడ ఫ్లాప్ అయినప్పటికీ.. ఇందులో కొన్ని సీన్స్ బాగానే ఉంటాయి. సోనా-వడివేలు కాంబినేషన్‌లోని కామెడీ సీన్స్ వర్కౌట్ అయ్యాయి. అయితే సెట్‪‌లో సోనాని వడివేలు ఎంతలా ఇబ్బంది పెట్టాడో ఏమో గానీ ఇలా ఇప్పుడు ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. 

వడివేలుపై గతంలోనూ పలువురు నటీనటులు ఇలాంటి ఆరోపణలే చేశారు. అందుకే చాన్నాళ్ల పాటు సినిమాలకు దూరమయ్యాడు. కొన్నాళ్ల క్రితమే సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టాడు. అడపాదడపా మూవీస్ చేస్తున్నారు. మళ్లీ ఇలాంటి టైంలో సోనా, వడివేలుపై చేసిన కామెంట్స్ చర్చనీయాంశంగా మారాయి. సోనా తెలుగులోనూ ఆయుధం, వీడే, విలన్, ఆంధ్రావాలా తదితర సినిమాలు చేసింది. ప్రస్తుతానికైతే తమిళ, మలయాళ మూవీస్‌లోనే కనిపిస్తోంది.

(ఇదీ చదవండి: రెమ్యునరేషన్ ఇవ్వట్లేదు.. టాలీవుడ్ హీరోయిన్ ఆవేదన)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement