మరోసారి నోరుజారిన రాజేంద్ర ప్రసాద్‌.. తమిళ తంబీలు ఫైర్‌! | Actor Rajendra Prasad Sensational Comments On MGR, Video Goes Viral | Sakshi
Sakshi News home page

మరోసారి నోరుజారిన రాజేంద్ర ప్రసాద్‌.. తమిళ తంబీలు ఫైర్‌!

Mar 10 2026 2:07 PM | Updated on Mar 10 2026 3:33 PM

Actor Rajendra Prasad Sensational Comments On MGR, Video Goes Viral

ఇటీవల ప‌ద్మ‌శ్రీ పురస్కారం దక్కించుకున్న టాలీవుడ్‌ సీనియర్‌ నటుడు డా.రాజేంద్రప్రసాద్‌ మరోసారి నోరు జారారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌ కాగా.. రాజేంద్రప్రసాద్‌పై తమిళ సినీ ప్రేక్షకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అసలేం జరిగింది?
ఇటీవల రాజేంద్రప్రసాద్‌కు క‌ళా ప్ర‌పూర్ణ కాంతారావు జాతీయ అవార్డును ప్రకటించారు. సోమవారం ఈ అవార్డు ప్రదానోత్సవం జరిగింది. ఈ సందర్భంగా రాజేంద్ర ప్రసాద్‌ తన జర్నీతో పాటు కాంతారావు గొప్పదనాన్ని తెలియజేస్తూ ప్రసంగించారు. అయితే కాంతారావు నటనను పొగిడే క్రమంలో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత నటుడు ఎంజీఆర్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

కాంతరావు పేరు చెబితేనే భయపడిపోయేవాడు
జానపద చిత్రాలతో దూసుకెళ్తున్న కాంతారావుని చూసి ఎంజీఆర్‌ భయపడిపోయాడు అని రాజేంద్ర ప్రసాద్‌ అన్నారు. ‘తమిళ గ్రేటెస్ట్‌ హీరో ఎంజీఆర్‌ కూడా కాంతారావుని చూసి ఉ** పోసుకున్నాడు. కాంతరావు పేరు చెబితేనే ‘అమ్మ బాబోయ్‌..’ అనేవాడు. కారణం జానపదాలు. కాంతరావుగారి జానపదాలు చూసి.. ‘వాడెవడురా బాబోయ్‌..ఇండియన్‌ సినిమాలను లేపుకెళ్లిపోతున్నాడు’ అని ఉ** పోసుకునేవాడు’ అని పదే పదే ఎంజీఆర్‌పై రాయడానికి వీల్లేని పదాన్ని వాడడంతో రాజేంద్రప్రసాద్‌పై తమిళులు ఫైర్‌ అవుతున్నాడు. తాము దేవుడిగా కొలిచే గొప్ప నటుడిని పబ్లిక్‌  ప్లేస్‌లో ఇలా అవమానించేలా మాట్లాడడం సరికాదంటూ సోషల్‌ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఓ గొప్ప న‌టుడిని ప్ర‌శంసించ‌డానికి ఓ రాష్ట్రం అంతా దైవం క‌న్నా మిన్న‌గా ఆరాధించే ఎమ్జీఆర్‌ను ఇలా చుల‌క‌న‌గా చేసి మాట్లాడ‌డం స‌బ‌బు కాదంటూ సీరియ‌స్ అవుతున్నారు.

పోసుకునేవాడు.. నోరు జారిన రాజేంద్ర ప్రసాద్.. తమిళ తంబీలు ఫైర్‌!
 

Advertisement
 
Advertisement
Advertisement