మెగా డాటర్ సుస్మిక కొణిదెల నిర్మాతగా కూడా రాణిస్తోంది. ఈ ఏడాది మనశంకర వరప్రసాద్‌గారు మూవీతో బ్లాక్‌బస్టర్‌ను సొంతం చేసుకుంది. ఈ మూవీతో నాన్నకు సూపర్ హిట్ అందించిన కూతురిగా ఘనత సాధించింది. గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్ అనే బ్యానర్‌లో పలు చిత్రాలు నిర్మిస్తున్నారు. ఇవాళ సుస్మిత బర్త్ డే కావడంతో మెగాస్టార్ చిరంజీవితో పాటు మెగా ఫ్యాన్స్ ఆమెకు జన్మదిన శుభాకాంక్షలు చెబుతున్నారు.
ఈ ఆదివారం మహిళ దినోత్సవం సందర్భంగా ఈ ఇంటర్వ్యూకు హాజరైన సుస్మిత పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. మా ఇంట్లో మహిళలకు ప్రత్యేకమైన రోజు అవసరం లేదని.. ఎప్పుడూ గౌరవం, ప్రోత్సాహం ఎల్లప్పుడు లభిస్తూనే ఉంటాయని తెలిపింది. ప్రతి బర్త్ డేకు నాన్న చిరంజీవి, రామ్ చరణ్ తనకు గిఫ్ట్స్ ఇస్తారని వెల్లడించింది. కానీ ఆ బహుమతుల కంటే తనపై వారు పెట్టుకున్న నమ్మకమే అతిపెద్ద గిఫ్ట్ అని పేర్కొంది. తాను ఏ పని అయినా చేయగలననే విశ్వాసం వారికి ఉందని సుస్మిత సంతోషం వ్యక్తం చేసింది. తనకు కుటుంబం మద్దతు కలిగి ఉండడం నా జీవితంలో గొప్ప బహుమతి అన్నారు.


