బిగ్‌బాస్ కంటెస్టెంట్‌ డీమాన్ పవన్ ఇంట తీవ్ర విషాదం | Bigg Boss Contestant demon Pawan father Passed away | Sakshi
Sakshi News home page

Demon Pawan: డీమాన్ పవన్ ఇంట తీవ్ర విషాదం

Mar 10 2026 1:25 PM | Updated on Mar 10 2026 1:32 PM

Bigg Boss Contestant demon Pawan father Passed away

టాప్-3 బిగ్‌బాస్ కంటెస్టెంట్‌ డీమాన్ పవన్ ఇంట విషాదం నెలకొంది. ఈ విషయాన్ని పవన్ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. మీ నాన్న నీతో లేకపోయినా ఆయన ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయని ధైర్యం చెప్పారు. బిగ్‌బాస్ షో సమయంలో కూడా తన తండ్రి ఆరోగ్యం బాగలేదని డీమాన్ పవన్ చెప్పారు. వేదికపై మాట్లాడుతూ ఎమోషనల్ అ‍య్యారు. ఇంతలోనే ఆ కుటుంబంలో ఈ విషాదం నెలకొంది. అయితే పవన్ తండ్రి నోటి క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. ఈ క్రమంలోనే ఆయన ఇవాళ తుదిశ్వాస విడిచారు.

కాగా.. బిగ్‌బాస్ 9 నుంచి డీమాన్ పవన్ టాప్‌-3లో నిలిచాడు. రీతూతో బంధంపై విమర్శలు వచ్చినప్పటికీ టాస్కుల పరంగా తన టాలెంట్‌తో అదరగొట్టేశాడు.  రెండుసార్లు కెప్టెన్ కూడా అవ్వడమే కాకుండా తెలివిగా మాస్‌ మహారాజ రవితేజ ఆఫర్‌ చేసిన రూ.15 లక్షల సూట్‌కేస్‌ తీసుకుని బయటకు వచ్చేశాడు. సీజన్‌ అంతా పవన్‌ను తొక్కేసిన బిగ్‌బాస్‌.. జర్నీ వీడియోలో మాత్రం వేరే లెవల్ ఎలివేషన్ ఇచ్చాడు.  

 

p

Advertisement
 
Advertisement
Advertisement