48 గంటల్లో 312 మిలియన్స్‌ వ్యూస్‌.. ‘ధురంధర్‌ 2’ రికార్డు | Ranveer Singh Dhurandhar 2 Movie Trailer Creates Record Views In Youtube Ahead Of Release, Interesting Deets Inside | Sakshi
Sakshi News home page

48 గంటల్లో 312 మిలియన్స్‌ వ్యూస్‌.. ‘ధురంధర్‌ 2’ రికార్డు

Mar 10 2026 11:21 AM | Updated on Mar 10 2026 11:32 AM

Dhurandhar 2 Movie Trailer Creates Record Views In Youtube

రణ్‌వీర్‌ సింగ్‌  హీరోగా ఆదిత్య ధర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం ‘ధురంధర్‌ 2’. గతేడాది బ్లాక్‌ బస్టర్‌ హిట్‌గా నిలిచిన ‘ధురంధర్‌’ చిత్రానికి సీక్వెల్‌ ఇది.  ఈ స్పై యాక్షన్‌ థ్రిల్లర్‌పై ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక తాజాగా రిలీజైన ట్రైలర్‌ ఆ అంచనాలను మరింత పెంచేశాయి. అంతేకాదు రిలీజ్‌కి ముందే ఈ సినిమా రికార్టులను కొల్లగొడుతోంది. యూట్యూబ్‌లో ఈ మూవీ ట్రైలర్‌కి రికార్డు స్థాయిలో వ్యూస్‌ వచ్చాయి. 

కేవలం 48 గంటల్లో అంటే రెండో రోజుల్లేనే 312 మిలియన్ల వ్యూస్‌ సాధించింది. ఈ మధ్యకాలంలో ఒక మూవీ ట్రైలర్‌కు ఈ స్థాయి వ్యూస్‌ వచ్చిన దాఖలాలు లేవు.

ట్రైలర్‌లో పవర్‌ఫుల్‌ బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌,  స్ట్రైకింగ్ డైలాగ్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ట్రైలర్ ఆడియో ఇన్‌స్టాగ్రామ్‌లో ట్రెండ్ అవుతూ, అనేక రీల్స్, ఫ్యాన్ ఎడిట్స్‌కు ప్రేరణగా మారింది. ఇదే సమయంలో గూగుల్ ట్రెండ్స్‌లో కూడా ఈ సినిమా, నటీనటులపై సెర్చ్‌లు భారీగా పెరిగాయి. ఈ చిత్రంలో రణవీర్ సింగ్ ద్విపాత్రాభినయంలో కనిపించనున్నారు. మార్చి 19న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement