breaking news
Trailer
-
'మీ పక్కలో దెయ్యం పడుకుంటే'.. ఒళ్లు గగుర్పొడ్చే ట్రైలర్ చూశారా?
హరర్ థ్రిల్లర్ సినిమాలకు ఆడియన్స్‌లో ఫుల్ క్రేజ్ ఉంది. ఎప్పటికప్పుడు సరికొత్త కంటెంట్ సినిమాలు వస్తూనే ఉన్నాయి. అందుకే ఇలాంటి చిత్రాలకు ప్రత్యేకమైన ఫ్యాన్స్ ఉన్నారు. తాజాగా మరో ఒళ్లు గగుర్పొడ్చే హారర్ థ్రిల్లర్ భయపెట్టేందుకు వచ్చేస్తోంది. ట్రైలర్ చూస్తేనే వెన్నులో వణుకు పుట్టిస్తోంది. ఇంతకీ ఆ సినిమా ఏంటో మనం కూడా తెలుసుకుందామా?సినీ ప్రియులను అలరించేందుకు సూపర్ నాచురల్ హారర్ థ్రిల్లర్ మూవీ ఇన్సిడియస్: అవుట్ ఆఫ్ ది ఫర్దర్ వచ్చేస్తోంది. ఈ మూవీ ఆగస్టు 21 థియేటర్లలో సందడి చేయనుంది. 2023లో వచ్చిన ఇన్సిడియస్ ది రెడ్ డోర్ చిత్రానికి సీక్వెల్‌గా ఈ మూవీని తెరకెక్కించారు. ఇన్సిడియస్ ఫ్రాంచైజీలో వస్తోన్న ఆరో సినిమా కావడం విశేషం. తాజాగా ఈ సినిమా రిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు. ఈ హారర్ థ్రిల్లర్‌కు జాకబ్ చేస్ దర్శకత్వం వహించారు. ఈ మూవీని సోనీ పిక్చర్స్ ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తోంది. ఇంకెందుకు ఆలస్యం ట్రైలర్ చూసేయండి. -
19 ఏళ్ల తర్వాత సీక్వెల్.. ట్రైలర్ రిలీజ్
ఒక సినిమాకు సీక్వెల్ తీయాలంటే రెండు నుంచి మూడేళ్లు టైమ్ పడుతుంది. అలా పుష్ప రిలీజైన మూడేళ్లకు సీక్వెల్‌గా పుష్ప-2 కూడా వచ్చేసింది. కానీ ఓ మూవీ సీక్వెల్ దాదాపు రెండు దశాబ్దాల వస్తే ఎలా ఉంటుంది. సరిగ్గా అదే చేశారు మేకర్స్. ఎప్పుడో 2007లో వచ్చిన చిత్రానికి ఇప్పుడు సీక్వెల్ తెరకెక్కించారు.2007లో విడుదలైన క్లాసిక్ యాక్షన్ డ్రామా ఆవారపన్. ఇమ్రాన్ హష్మీ, దిశాపటానీ నటించారు. ఈ సినిమాకు దాదాపు 19 ఏళ్ల తర్వాత సీక్వెల్‌గా ఆవారపన్ - 2 తెరకెక్కించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా ఆగస్టు 14న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ నేపథ్యంలో ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ మూవీలో శివమ్ పండిట్ పాత్రలో ఇమ్రాన్ తిరిగి వస్తున్నాడంటూ వీడియోను పంచుకున్నారు. ఈ మూవీకి నితిన్ కక్కర్ దర్శకత్వం వహించారు. -
మరోసారి దూకుడు.. రీ రిలీజ్ ట్రైలర్ వచ్చేసింది
టాలీవుడ్లో రీ రిలీజ్‌ల ట్రెండ్ తెగ నడుస్తోంది. ఇప్పటికే పలు సూపర్ హిట్ చిత్రాలు బిగ్ స్క్రీన్‌పై సందడి చేశాయి. తాజాగా మరో సూపర్ హిట్ మూవీ థియేటర్లలో సందడి చేసేందుకు వచ్చేస్తోంది. మహేశ్ బాబు హీరోగా వచ్చిన దూకుడు ఆడియన్స్‌ను ఆలరించింది. 2011లో కేవలం రూ.35 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ చిత్రం.. బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.తాజాగా ఈ మూవీ రీ రిలీజ్ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సినిమాకు శ్రీను వైట్ల దర్శకత్వం వహించారు. మహేశ్‌బాబు యాక్షన్, బ్రహ్మానందం-ఎమ్మెస్ నారాయణ కామెడీ ఈ మూవీలో హైలెట్‌గా నిలిచాయి. ఈ చిత్రంలో మహేశ్ బాబు సరసన సమంత హీరోయిన్గా మెప్పించింది. మరోసారి వీరిద్దరిని బిగ్ స్క్రీన్‌పై చూసి ఎంజాయ్ చేయండి. మహేశ్ పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 9న ఈ చిత్రంలో థియేటర్లలో సందడి చేయనుంది. -
రామాయణ ట్రైలర్ లో హనుమాన్ ఎక్కడ..?
-
‘కొరియన్ కనకరాజు’ ట్రైలర్ రిలీజ్
వరుణ్ తేజ్ హీరోగా నటించిన తాజా చిత్రం కొరియన్ కనకరాజు. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించిన ఈచిత్రంలో రితికా నాయక్ హీరోయిన్గా నటిస్తోంది.ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఆగస్ట్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా మూవీ ట్రైలర్‌ని విడుదల చేశారు మేకర్స్. సత్య కామెడీ సీన్‌తో ప్రారంభమయ్యే ఈ ట్రైలర్.. ఆద్యంతం వినోదాత్మకంగా సాగింది.కొరియా బ్యాక్ డ్రాప్ లో హారర్ యాక్షన్ కామెడీగా ఈ సినిమా తెరకెక్కుతుంది. వరుణ్ ఇందులో రెండు డిఫరెంట్ పాత్రల్లో నటించాడు. -
రామాయణ ట్రైలర్.. సందీప్ రెడ్డి వంగా రివ్యూ
టాలీవుడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ప్రస్తుతం ప్రభాస్‌తో చేస్తోన్న భారీ యాక్షన్ మూవీ స్పిరిట్. ఈ చిత్రం వచ్చే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ త్రిప్తి డిమ్రీని హీరోయిన్గా తీసుకున్నారు. స్పిరిట్‌తో బిజీగా ఉన్న సందీప్.. తాజాగా రామాయణ ట్రైలర్‌పై తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. ఈ కేవలం ట్రైలర్ మాత్రమే కాదని ట్వీట్ చేశారు. అధర్మంపై ధర్మం ఎల్లప్పుడూ విజయం సాధిస్తుందనే దానికి శాశ్వతమైన గుర్తు అంటూ పోస్ట్ చేశారు.కాగా.. రణ్‌బీర్ కపూర్, సాయిపల్లవి సీతారాముడుగా వస్తోన్న మూవీ రామాయణ. ఈ చిత్రానికి నితీశ్ తివారీ దర్శకత్వం వహించారు. తాజాగా ఈనెల 30న రామాయణ ట్రైలర్ రిలీజ్ చేయగా విజువల్స్ పరంగా ఆకట్టుకుంది. రావణుడి పాత్రలో యశ్ మరింత గంభీరంగా కనిపించారు. ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్.. శూర్పణఖ పాత్రలో కనిపించనుంది. ఈ ఎపిక్ మూవీ దీపావళి కానుకగా థియేటర్లలో సందడి చేయనుంది. "YEH RAM YUG KA AARAMBH HAI."Not just a trailer, but the eternal reminder that DHARMA will always triumph over ADHARMA.https://t.co/5uAgQKUlqg— Sandeep Reddy Vanga (@imvangasandeep) July 31, 2026 -
ఓటీటీలోకి క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్.. ట్రైలర్ రిలీజ్
ఓటీటీలు అనగానే దాదాపుగా థ్రిల్లర్ సినిమాలు,సిరీస్‌లే గుర్తొస్తుంటాయి. అందుకు తగ్గట్లే ప్రతివారం తమిళ, మలయాళ భాషల నుంచి ఈ జానర్ కంటెంట్ వస్తూనే ఉంటుంది. ఇప్పుడు కూడా అలానే ఓ క్రేజీ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ స్ట్రీమింగ్కి సిద్ధమైంది. ఈ మేరకు ట్రైలర్ రిలీజ్ చేసి స్టోరీ ఏంటనేది చూచాయిగా చెప్పేశారు. ఇంతకీ దీని సంగతేంటి? ఎందులోకి రానుంది?(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన కొరియన్ హారర్ సినిమా.. తెలుగులోనూ)ఎస్జే సూర్య ప్రధాన పాత్రలో నటించిన థ్రిల్లర్ సిరీస్ 'వదంది'. 2022లో అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో రిలీజైంది. ఇప్పుడు దీనికి రెండో సీజన్ కూడా రెడీ చేశారు. ఇందులో శశికుమార్ పోలీస్ అధికారిగా ప్రధాన పాత్ర చేశారు. ఓ మర్డర్ కేసులో జైలుపాలైన మణి అనే కుర్రాడు.. నిజంగా ఈ హత్యలు చేశాడా? ఇంతకీ ఈ మర్డర్స్ వెనకున్న కారణమేంటి? ఎవరు చేశారు? అనేదే స్టోరీ.'వదంది 2' సిరీస్‌కి ఆండ్రూ లూయిస్ దర్శకుడు కాగా స్టార్ దర్శకద్వయం పుష్కర్-గాయత్రి నిర్మాతలుగా వ్యవహరించారు. వచ్చే శుక్రవారం(ఆగస్టు 07) నుంచి అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఇది స్ట్రీమింగ్ కానుంది. అపర్ణ దాస్, రేవతి శర్మ తదితరులు ఇందులో ప్రధాన పాత్రలు చేశారు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చిన ఫీల్ గుడ్ సినిమా 'చిన్న చిన్న ఆశై' తెలుగు రివ్యూ) -
హీరోగా స్టార్ డైరెక్టర్.. రిలీజ్ ట్రైలర్ వచ్చేసింది
కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ హీరోగా వస్తోన్న చిత్రం డీసీ. ఈ సినిమాకు అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో లోకేశ్ సరసన వామిక గబ్బి హీరోయిన్గా కనిపించనుంది. ఇప్పటికే ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్.. తాజాగా మరో ట్రైలర్ విడుదల చేశారు.ఇవాళ రిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు. 'తప్పు చేస్తే దండించడానికిపోలీసులు వస్తారు.. కానీ, ఆ పోలీసులే తప్పు చేస్తే ఎవరిని అడుగుతారయ్యా' అనే డైలాగ్ ట్రైలర్లో ఆకట్టుకుంటోంది. ఈ మూవీలో వామికా గబ్బీ హీరోయిన్గా నటించింది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ ఆగస్టు 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా.. ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతమందించారు. -
రణ్‌బీర్ కపూర్ రామాయణ.. విజువల్ వండర్లా ట్రైలర్
రణ్‌బీర్ కపూర్, సాయిపల్లవి, యష్.. రాముడు, సీత, రావణుడిగా నటించిన చిత్రం 'రామాయణ'. ఈ ఏడాది దీపావళికి థియేటర్లలో రిలీజ్ చేయనున్నారు. ఇటీవల ట్రైలర్ రిలీజ్ చేస్తామని మేకర్స్ ప్రకటించారు. మొదట ఈనెల 24న యూట్యూబ్‌లోనే విడుదల చేస్తామని తెలిపారు. కానీ అలా కుదరలేదు. ముందుగా ప్రకటించినట్లుగానే తాజాగా రామాయణ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఇవాళ ఉదయం 4 గంటల 15 నిమిషాలకు ట్రైలర్ విడుదల చేశారు. ట్రైలర్ చూస్తుంటే రామాయణ మరో రేంజ్లో తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఈ నితీశ్ తివారీ రామాయణం విజువల్ వండర్లా కనిపిస్తోంది. రణ్‌బీర్ కపూర్, సాయిపల్లవి సీతారాముల పాత్రల్లో సరికొత్తగా కనిపించారు. రావణుడితో యుద్ధం సీన్స్ ట్రైలర్లో ఆకట్టుకుంటున్నాయి. ఈ ఏడాది దీపావళికి ప్రపంచవ్యాప్తంగా రామాయణ రిలీజ్ కానుంది. ఈ చిత్రాన్ని దాదాపు రూ.4 వేల కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. విజువల్ వండర్లా ఉన్న ట్రైలర్ మీరు కూడా చూసేయండి. -
రణ్‌బీర్ కపూర్ రామాయణ.. ట్రైలర్ రిలీజ్ ఎప్పుడంటే?
రణ్‌బీర్ కపూర్, సాయిపల్లవి జంటగా నటిస్తోన్న మోస్ట్ అవైటేడ్ మూవీ రామాయణ. ఈ సినిమాకు నితీశ్ తివారీ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో రావణుడిగా కన్నడ స్టార్ హీరో యశ్ నటిస్తున్నారు. రవి దూబే (లక్ష్మణుడు), సన్నీ డియోల్ (ఆంజనేయుడు)గా కనిపించనున్నారు. ఈ మూవీకి హాలీవుడ్ సంగీత దర్శకుడు హన్స్ జిమ్మెర్ పనిచేస్తున్నారు. ఆయన గ్లాడియేటర్, ఇంటర్ స్టెల్లర్, ది లయన్ కింగ్, డ్యూన్ వంటి టాప్ చిత్రాలకు సంగీతం అందించారు.అయితే ఈ మూవీ ట్రైలర్‌కు సంబంధించిన క్రేజీ అప్డేట్ వచ్చేసింది. రామాయణ ట్రైలర్ టైమ్ అండ్ డేట్ ఫిక్స్ చేశారు మేకర్స్. ఈనెల 24 రిలీజ్ చేస్తామని వాయిదా వేసిన మేకర్స్ తాజాగా డేట్‌తో టైమ్ ప్రకటించారు. ఈ నెల 30 తెల్లవారుజామున 4 గంటల 15 నిమిషాలకు విడుదల చేస్తామని వెల్లడించారు. ఎంతో పవిత్రమైన బ్రహ్మ ముహూర్తంలో ఈ ట్రైలర్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నట్లు మేకర్స్ ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. కాగా.. ఈ చిత్రంలో రణ్‌బీర్ కపూర్ రాముడిగా.. సాయి పల్లవి సీతగా కనిపించనున్నారు.🕉️...Reposted from @malhotra_namit 's Instagram 🕉️ pic.twitter.com/PpnlFJKD32— The World Of Ramayana (@WorldOfRamayana) July 28, 2026 -
దీక్షిత్ శెట్టి కొత్త సినిమా.. ట్రైలర్ వచ్చేసింది
దీక్షిత్ శెట్టి, శశి ఓదెల, యుక్తి తరేజా కీలక పాత్రల్లో వస్తోన్న చిత్రం కేజేక్యూ(కింగ్.. జాకీ.. క్వీన్). ఈ పీరియాడికల్ క్రైమ్ కథగా రూపొందించారు. ఈ మూవీకి కేకే దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఎస్ఎల్వీ సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.తాజాగా ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ట్రైలర్ చూస్తుంటే ఈ చిత్రాన్ని గ్యాంగ్‌స్టర్ నేపథ్యంలోనే తెరకెక్కించినట్లు అర్థమవుతోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆగస్టు 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకు పూర్ణచంద్ర తేజస్వీ సంగీతమందించారు. -
అమ్మా.. నాకు ఆ అబ్బాయి కావాలి
పవన్ మహావీర్‌ని హీరోగా పరిచయం చేస్తూ, ప్రముఖ మహిళా వ్యాపారవేత్త శైలజ రెడ్డి నిర్మిస్తున్న సినిమా 'అమ్మా.. నాకు ఆ అబ్బాయి కావాలి'. పవన్ లండన్‌లో డాక్టర్ కోర్స్ చేస్తూ హీరోగా నటించాడు. శివాల ప్రభాకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో వర్షిక, సుహానా హీరోయిన్లు. సుమన్, రావు రమేష్, రాజీవ్ కనకాల, సత్యకృష్ణ, సుజాత తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఆగస్టు 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఈ చిత్రం ట్రైలర్ విడుదల చేశారు.హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్‌లో జరిగిన ఈ వేడుకకు ప్రముఖ దర్శకులు, దర్శకుల సంఘం అధ్యక్షులు వి.ఎన్.ఆదిత్య ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ట్రైలర్ బాగుందని, పవన్ మహావీర్‌కి ఇది పరిచయ చిత్రమంటే నమ్మడం కష్టమని అతిధులు పేర్కొన్నారు. నిర్మాతగా శైలజ రెడ్డి, హీరోగా పవన్ మహావీర్‌కి ఉజ్వల భవిష్యత్ ఉండాలని ఆకాంక్షించారు. -
థియేటర్లలో సూపర్ హిట్ మూవీ.. రీ రిలీజ్ ట్రైలర్ చూశారా?
రవితేజ, శివ బాలాజీ, అల్లరి నరేశ్ ముఖ్య పాత్రల్లో వచ్చిన లవ్ కమ్ యాక్షన్ ఎంటర్టైనర్ శంభో శివ శంభో. అప్పట్లో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. తమ స్నేహితుడి ప్రేమ కోసం ముగ్గురు ఫ్రెండ్స్ చేసిన త్యాగమే ఈ సినిమా. తమ స్నేహితుడి ప్రేమ గెలవడానికి ముగ్గురు ఎన్ని ఇబ్బందులు పడ్డారో ఈ మూవీలో చూపించారు.2010లో విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఈ మూవీకి సముద్రఖని దర్శకత్వం వహించారు. ప్రస్తుతం ఈ మూవీని మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఫ్రెండ్షిప్ డే సందర్భంగా ఆగస్టు 1న రీ రిలీజ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రీ రిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు మేకర్స్. ఈ చిత్రంలో రవితేజ సరసన ప్రియమణి హీరోయిన్గా మెప్పించింది. -
చివరి నిమిషంలో షాకిచ్చిన 'రామాయణ' మేకర్స్
రణ్‌బీర్ కపూర్, సాయిపల్లవి, యష్.. రాముడు, సీత, రావణుడిగా నటించిన సినిమా 'రామాయణ'. ఈ ఏడాది దీపావళికి థియేటర్లలో రిలీజ్ చేయనున్నారు. గతవారం ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో ట్రైలర్ లాంచ్ చేశారు. అయితే దీనిని ఈ రోజు(జూలై 24) యూట్యూబ్‌లో విడుదల చేస్తామని కొన్నిరోజుల ముందే ప్రకటించారు. కానీ చివరి నిమిషంలో ఇప్పుడు వాయిదా వేసినట్లు ప్రకటించారు. అందుకు గల కారణాన్ని కూడా నిర్మాత నమిత్ మల్హోత్రా వెల్లడించారు.(ఇదీ చదవండి: చెన్నై లవ్ స్టోరీ మూవీ రివ్యూ)నా సినిమాని ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్లాలనే నా కల ఇప్పుడు సోనీ పిక్చర్స్ ఎంటర్టైన్మెంట్ భాగస్వామ్యంతో నిజమైంది. అందువల్ల ట్రైలర్ విడుదలని ముందుగా అనుకున్నట్లు కాకుండా వాయిదా వేస్తున్నాం. కొత్త తేదీన గ్లోబల్ లాంచ్ చేయనున్నాం. భారతీయ సినీ చరిత్రలో 100 ఏళ్లకు పైగా ఇది ఒక గర్వకారణమైన ఘట్టంగా నిలుస్తుంది. అంతర్జాతీయంగా రిలీజ్ చేయడంతో 'రామాయణ' ప్రపంచ ప్రేక్షకులకు చేరువవుతుంది.ఈ సినిమాతో భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, ఇతిహాసాల గొప్పతనాన్ని ప్రపంచానికి పరిచయం చేసే అవకాశం నాకు లభించింది. ఈ జర్నీలో నన్ను సపోర్ట్ చేసిన అభిమానులు, శ్రేయోభిలాషులకు కృతజ్ఞతలు అని నమిత్ మల్హోత్రా ఓ నోట్ రిలీజ్ చేశారు.ఇప్పటివరకు సినిమాలని థియేటర్లలోకి తీసుకొచ్చే క్రమంలోనే వాయిదాల మీద వాయిదాలు పడటం చూస్తున్నాం. ఇప్పుడు ట్రైలర్స్‌ని కూడా వాయిదా వేస్తే ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెరగడం బదులు నెగిటివిటీ ఏర్పడే ప్రమాదం ఉంటుంది. కొన్నాళ్ల క్రితం రిలీజ్ చేసిన 'రామాయణ' గ్లింప్స్‌కి ఏమంత పాజిటివ్ టాక్ రాలేదు. ట్రైలర్ అయినా బాగుంటే పర్లేదు లేదంటే మాత్రం మూవీ హైప్‌పై ఇది ప్రభావం చూపిస్తుంది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు కామెడీ సినిమా) -
హీరోగా లోకేశ్ కనగరాజ్.. డీసీ తెలుగు ట్రైలర్ రిలీజ్
కోలీవుడ్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ హీరోగా వస్తోన్న చిత్రం డీసీ. ఈ సినిమారు అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో లోకేశ్ సరసన వామిక గబ్బి హీరోయిన్గా కనిపించనుంది. తాజాగా ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్.ఈ ట్రైలర్ చూస్తుంటే అంతా బుల్లెట్ల వర్షం కురిపించారు. ఓ యువతితో పాటు హీరో కూడా వ్యవస్థంపై పోరాటం చేసే కథాంశంగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. నువ్వు పోలీసులను చంపుతావా? అదేమో డాక్టర్లను చంపుతోంది అంటూ చెప్పే డైలాగ్ వింటే కథంటో అర్థమవుతోంది. డీసీ అంటే డాక్టర్స్ అండ్ కాప్స్ అనే ఉద్దేశంతో టైటిల్ పెట్టినట్లు తెలుస్తోంది. విజువల్స్‌తో పాటు, అనిరుధ్ బీజీఎంతో ట్రైలర్‌తోనే మరింత హైప్ తీసుకొచ్చింది. -
మార్వెల్ స్టూడియోస్ అవెంజర్స్.. ఆసక్తిగా ట్రైలర్
సినీ ప్రేక్షకులను ఆకట్టుకున్న హాలీవుడ్ ఫ్రాంచైజీల్లో అవెంజర్స్ ముందు వరుసలో ఉంటుంది. ఈ ఫ్రాంచైజీలో భాగంగా తెరకెక్కుతోన్న లేటేస్ట్ మూవీ అవెంజర్స్: డూమ్స్‌డే. తాజాగా ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ చిత్రంలో రాబర్ట్ డౌనీ జూనియర్ ఐరన్ మ్యాన్‌గా కాకుండా.. డాక్టర్ డూమ్‌గా మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్‌లోకి తిరిగి వస్తున్నారు. ఈ చిత్రంలో క్రిస్ హమ్స్‌వర్త్, వెనెస్సా కిర్బీ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.ట్రైలర్లో యాక్షన్ సీన్స్ సినీ ప్రియులను ఆకట్టుకుంటున్నాయి. ఈ ట్రైలర్లో డౌనీ రూపాంతరం, అవెంజర్స్‌తో సంఘర్షణ, ఇవాన్స్ కనిపించడం హైలెట్‌గా నిలిచాయి. అవెంజర్స్: డూమ్స్‌డే మూవీ కోసం దర్శకులు జో, ఆంథోనీ రుస్సోలతో మార్వెల్ మళ్లీ కలిశారు. 2019లో వచ్చిన 'అవెంజర్స్: ఎండ్‌గేమ్' తర్వాత వీరు మొదటిసారిగా తిరిగి వస్తున్నారు. ఈ చిత్రానికి మైఖేల్ వాల్డ్రాన్, స్టీఫెన్ మెక్‌ఫీలీ రచయితలుగా ఉన్నారు. రుస్సో బ్రదర్స్ తెరకెక్కిస్తున్న ఈ మూవీ డిసెంబరు 18న విడుదల కానుంది. -
కిరణ్ అబ్బవరం 'చెన్నై లవ్‌స్టోరీ' ట్రైలర్ రిలీజ్
కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరిప్రియ జంటగా నటించిన సినిమా 'చెన్నై లవ్ స్టోరీ'. వచ్చే శుక్రవారం (జూలై 24) థియేటర్లలో రిలీజ్ కానుంది. ఇప్పటికే మూడు నాలుగు పాటల్ని వదిలారు. ఇప్పుడు హైదరాబాద్‌లో జరిగిన ఈవెంట్లో ట్రైలర్ లాంచ్ చేశారు. ఇది ఆసక్తికరంగా ఉంటూ మూవీ చూడాలని ఆసక్తి పెంచుతోంది.(ఇదీ చదవండి: ‘ది ఒడిస్సీ’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్)ట్రైలర్ బట్టి చూస్తే.. చెన్నైలో ఉండే హీరోయిన్ అప్పటికే లవ్‌లో ఫెయిలై, ఆ బాధని మర్చిపోయేందుకు రోజంతా తాగుతూ ఉంటుంది. ఇక సినిమా డైరెక్టర్ అవ్వాలని ఈమె ఉంటున్న చోటుకి హీరో వస్తాడు. తనదైన శైలిలో హీరోయిన్ మూడ్ మార్చేందుకు ప్రయత్నిస్తాడు. అలా కొన్నాళ్లకు వీళ్లిద్దరూ ప్రేమలో పడతారు. తర్వాత ఈ లవ్ స్టోరీ ఎలాంటి టర్న్‌లు, ట్విస్టులు తీసుకుంది. చివరకు ఏమైందనేదే స్టోరీలా అనిపిస్తుంది.(ఇదీ చదవండి: జాతీయ సినీ అవార్డుల్లో తెలుగు సినిమా ప్రభంజనం) -
రైతుల్ని ఉగ్రవాదులు అంటావా? కాజల్ కొత్త సినిమా ట్రైలర్
ఒకప్పటితో పోలిస్తే మనం తినే తిండి, తాగే నీరు, పీల్చే గాలి ప్రతిదీ కల్తీ అయిపోయింది. కాదు కాదు కొందరు వ్యాపారాలు చేసేస్తున్నారు. దీని వల్ల యువతరం, చిన్న పిల్లలు.. క్యాన్సర్ లాంటి ప్రాణాంతక రోగాల బారిన పడుతున్నారు. ఈ సంగతులన్నీ జనాలకు తెలుసు. రోజూ పేపర్, టీవీ, సోషల్ మీడియాలో చూస్తూనే ఉంటారు. అలాంటి కాన్సెప్ట్‌తో తీసిన సినిమా 'ద ఇండియా స్టోరీ'. కాజల్ అగర్వాల్, శ్రేయస్ తల్పడే ప్రధాన పాత్రలు పోషించారు. వచ్చే శుక్రవారం(జూలై 24) మూవీ థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: ‘ది ఒడిస్సీ’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్)దేశ సరిహద్దుల్లో సైనికుడిగా పనిచేసిన ఓ వ్యక్తి ఏడేళ్ల కూతురు క్యాన్సర్‌తో చనిపోతుంది. అయితే తన కుమార్తెని అన్యాయంగా చంపేశారని చెప్పి సదరు తండ్రి.. న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాడు. ఓ లాయర్‌తో కలిసి క్రిమి సంహారకాలు తయారు చేసే కంపెనీలు, కల్తీ చేసే సంస్థలపై పోరాటానికి దిగుతాడు. ఈ ప్రయాణంలో ఎలాంటి సవాళ్లు ఎదుర్కొన్నాడు? ఓ మహిళా లాయర్‌తో కలిసి ఏం చేశాడు? రైతులు వీళ్లిద్దరిపై ఎందుకు తిరగబడ్డారు? అనేదే స్టోరీలా అనిపిస్తుంది.ట్రైలర్ అయితే బాగానే ఉంది. ఇందులో చూపించినవన్నీ చేదు నిజాలే. జనాలకు కూడా ఇలాంటి కల్తీ, క్రిమి సంహారక మందుల గురించి తెలుసు. అయినా సరే వేరే ఆప్షన్ లేకపోవడంతో ఇవి తింటున్న పరిస్థితి. ఇవి కాకుండా మూవీలో ఇంకేం చూపిస్తారో చూడాలి? ఈ మూవీ హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లోనూ రిలీజ్ కానుంది. ప్రస్తుతానికైతే ఈ చిత్రంపై ఏ మాత్రం బజ్ లేదు.(ఇదీ చదవండి: హీరోయిన్ ప్రీతి ముకుందన్.. శ్రీనివాస రామానుజన్ ముని మనవరాలా?) -
'బళ్లారి ఎప్పటికీ వెంకటప్పయ్య నాయుడిదే'.. ఆసక్తిగా ట్రైలర్
సూపర్ స్టార్ కృష్ణ మనవడు జయకృష్ణ ఘట్టమనేని నటిస్తోన్న తాజా చిత్రం శ్రీనివాస మంగాపురం. ఈ చిత్రంలో హీరోయిన్గా బాలీవుడ్ బ్యూటీ రషా తడానీ కనిపించనుంది. ఈ చిత్రానికి అజయ్ భూపతి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని చందమామ కథలు పిక్చర్స్ పతాకంపై జెమిని కిరణ్ నిర్మించారు. ఇప్పటికే రిలీజైన సాంగ్స్, గ్లింప్స్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్.తాజాగా రిలీజైన ట్రైలర్ చూస్తుంటే ప్రేమకథా చిత్రంగానే తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఇందులోని యాక్షన్ సీన్స్ మాస్ ఆడియన్స్‌కు కూడా కనెక్ట్ అయ్యేలా కనిపిస్తోంది. ఈ ట్రైలర్లో మోహన్ బాబు యాక్షన్ డైలాగ్స్ అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ప్రేమకథతో పాటు మాస్ యాక్షన్ ఉన్న ఈ చిత్రం జూలై 30న థియేటర్లలో సందడి చేయనుంది. కాగా.. ఈ సినిమాకి జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతమందించారు. ఈ చిత్రంలో నరేశ్, బ్రహ్మజీ, అజయ్ కీలక పాత్రల్లో నటించారు. -
శవాన్ని కిడ్నాప్ చేయడమేంటిరా?.. ఫుల్ ఫన్నీగా ఎంఆర్పీ ట్రైలర్
నరేశ్ అగస్త్య, వెన్నెల కిశోర్, సుదర్శన్ ప్రధాన పాత్రల్లో వస్తోన్న తాజా చిత్రం ఎంఆర్పీ. నీకెంత, నాకెంత అనేది సబ్ టైటిల్. ఈ సినిమాకు శ్రవణ్ జేస్టా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ భామ డోనాల్ బిస్తీ హీరోయిన్గా నటిస్తున్నారు. ఇప్పటికే టీజర్ రిలీజ్ చేసిన మేకర్స్.. తాజాగా ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు.తాజాగా రిలీజైన ట్రైలర్ చూస్తుంటే ఈ మూవీని ఫుల్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. నలుగురు స్నేహితులు కలిసి చేసే కామెడీ ఆడియన్స్‌ను అలరించేలా ఉండనుందని ట్రైలర్ చూస్తేనే అర్థమవుతోంది. కాగా.. ఈ సినిమాకు అజయ్ అరసాడ సంగీతమందిస్తున్నారు. ఈ చిత్రంలో కసిరెడ్డి రాజ్ కుమార్, హర్ష వర్ధన్, చైతన్య జొన్నలగడ్డ, పృధ్వీ రాజ్, గగన్ విహారి, నంద గోపాల్, స్నేహ సింగ్ కీలక పాత్రల్లో నటించారు. ఈ మూవీ జూలై 17న థియేటర్లలో సందడి చేయనుంది. ఇంకెందుకు ఆలస్యం ట్రైలర్ మీరు కూడా చూసేయండి. -
ఐశ్వర్య రాజేశ్ మాస్ యాక్షన్.. ఒకేసారి ఐదు భాషల్లో ట్రైలర్
తిరువీర్, ఐశ్వర్య రాజేశ్ జంటగా నటిస్తోన్న లేటేస్ట్ మూవీ ఓ.. సుకుమారి. ఈ సినిమాకు భరత్‌దర్శన్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని గంగా ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై మహేశ్వరరెడ్డి మూలి నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా జూలై 17న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సందర్భంగా ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇప్పటికే టీజర్ రిలీజ్ చేసిన మేకర్స్.. తాజాగా ట్రైలర్ కూడా విడుదల చేశారు. ఒకేసారి తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేశారు. ఈ ట్రైలర్ చూస్తుంటే రూరల్ బ్యాక్‌డ్రాప్‌లో జరిగే మాస్ లవ్ స్టోరీగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఐశ్వర్య రాజేశ్ యాక్షన్ ఫైట్స్ ఆకట్టుకుంటున్నాయి. కామెడీతో పాటు ఫుల్ యాక్షన్ ఉండనుందని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. కాగా.. ఈ చిత్రంలో ఝాన్సీ, మురళీధర్‌గౌడ్, ఆనంద్, అంజిమామ, శివానంద్, కోట జయరామ్ కీలక పాత్రలు పోషించారు. -
లయ లేటేస్ట్ మూవీ.. వదలా ట్రైలర్ రిలీజ్
జగపతి బాబు, లయ, హృతిక ప్రధాన పాత్రల్లో నటించిన కొత్త సినిమా వదలా. ఈ చిత్రానికి ఆకెళ్ల వి కృష్ణ దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని తమ్మారెడ్డి భరద్వాజ్, కిశోర్ నాయుడు నిర్మాతలుగా సంయుక్తంగా నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ జూలై 17న థియేటర్లలో సందడి చేయనుంది.ఈ నేపథ్యంలో వదలా ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. అన్యోన్యంగా ఉండే భార్య, భర్తల మధ్యలోకి మూడో వ్యక్తి వస్తే ఏమవుతుంది అనే కాన్సెప్ట్‌తో ఈ మూవీని తెరకెక్కించారని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. మూడో వ్యక్తి వల్ల ఆ కుటుంబం ఎలాంటి ఇబ్బందులు పడిందనేది ట్రైలర్లో చూపించారు. కాగా.. ఈ సినిమాకు కార్తీక్ సంగీతమందించారు. -
20 ఏళ్ల తర్వాత తమన్ ఎంట్రీ.. తెలుగు ట్రైలర్ వచ్చేసింది
టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ నటుడిగా వస్తోన్న చిత్రం హృదయం మురళి. ఆకాశ్ భాస్కరన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఎస్ఎస్ తమన్ కీలక పాత్ర పోషించారు. తమిళంలో ఇదయం మురళి పేరుతో తెరకెక్కించిన ఈ చిత్రాన్ని తెలుగులో హృదయం మురళిగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ మూవీలో ప్రీతి ముకుందన్, కయాదు లోహర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.తాజాగా ఈ మూవీ తెలుగు ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ట్రైలర్ చూస్తుంటే ఈ చిత్రాన్ని లవ్ అండ్ రొమాంటిక్ చిత్రంగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. కాలేజీ సీన్స్ చూస్తుంటే యూత్‌ఫుల్ లవ్ ఎంటర్టైనర్ కథగా కనిపిస్తోంది. ఈ మూవీకి తమనే సంగీతమందిస్తున్నారు. ఈ చిత్రం జులై 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా.. 20 ఏళ్ల క్రితం శంకర్ దర్శకత్వం వహించిన బాయ్స్ చిత్రంలో తమన్ నటించిన సంగతి తెలిసిందే. -
'కష్టాల్లో కాపాడేవాడే నిజమైన రాజు'.. రాజా ది రాజా ట్రైలర్ రిలీజ్
రుత్విక్, విశాఖ ధిమాన్ జంటగా వస్తోన్న లేటేస్ట్ మూవీ రాజా ది రాజా. ఈ చిత్రానికి అనిల్ బోయిడపు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను వృందావన్ క్రియేషన్స్ బ్యానర్లో దాసరి నిహారిక నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్.ఈ ట్రైలర్ చూస్తుంటే రాజు అనే కాన్సెప్ట్ ప్రధానంగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. రాజుల కాలానికి.. ప్రజెంట్‌కు లింక్ పెట్టి ఈ కథను రూపొందించినట్లు ట్రైలర్లో కనిపిస్తోంది. లవ్, ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా ఈ కథలో ఉండనున్నాయని ట్రైలర్లో చూపించారు. ఈ సినిమాకు మార్క్ కె రాబిన్ సంగీతమందించారు. ఈ మూవీలో సాయి కుమార్, నరేశ్, అవసరాల శ్రీనివాస్, విష్ణు, పార్వతీశం, రాజశ్రీ నాయర్, రోహిణి, భద్రం, మైమ్ మధు, ఆనంద్ కీలక పాత్రల్లో నటించారు. ఇంకెందుకు ఆలస్యం ట్రైలర్ మీరు కూడా చూసేయండి. -
పోసాని 'ఆపరేషన్ అరుణారెడ్డి' రిలీజ్‌కి రెడీ
ప్రముఖ రచయిత, నటుడు, దర్శకుడు పోసాని కృష్ణ మురళి ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'ఆపరేషన్ అరుణారెడ్డి'. వచ్చే శుక్రవారం(జూలై 17) థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే అధికారిక ట్రైలర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది.(ఇదీ చదవండి: అప్పుడు నేను ముఖ్యమంత్రి అవుతా: కమల్ హాసన్)ఈ సందర్భంగా పోసాని కృష్ణ మురళి మాట్లాడుతూ.. ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందనే నమ్మకం ఉంది. ప్రతి ఒక్కరూ కుటుంబ సమేతంగా థియేటర్లలో వచ్చి సినిమాను వీక్షించి ఆదరించాలని కోరుతున్నాను అని చెప్పారు.(ఇదీ చదవండి: యువరాజుని ప్రశ్నిస్తే దేశద్రోహమా? కూటమి ప్రభుత్వంపై ప్రకాశ్ రాజ్ సెటైర్లు) -
నాగదుర్గ విచిత్రమైన లవ్ స్టోరీ.. తెలుగు ట్రైలర్
తెలంగాణ ఫోక్ సాంగ్స్‌తో యూట్యూబ్‌లో బోలెడంత క్రేజ్ తెచ్చుకున్న నాగదుర్గ.. తమిళంలో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. 'లవ్ ఓ లవ్' పేరుతో తీసిన ఓ సినిమా చేసింది. హీరో ధనుష్ మేనల్లుడు పవిష్ హీరో. ఈ మూవీని ఈ శుక్రవారం(జూలై 10) తెలుగులోనూ రిలీజ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే తెలుగు ట్రైలర్ రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: ఆ ఒక్క కారణం వల్లే 'అబ్సెషన్' చూశారు: నాగవంశీ)ట్రైలర్ బట్టి చూస్తే అవంతిక(నాగదుర్గ), రఘు(పవిష్) ప్రేమించుకుంటారు. కానీ ప్రతిచిన్నదానికి రఘుతోనే అవంతిక ఖర్చు చేయిస్తూ ఉంటుంది. అలా నాలుగేళ్లు అయిపోతాయి. ఇక వల్ల కాదని ఫిక్స్ అయిన రఘు.. ఇప్పటివరకు తాను ఎలా అయితే ఖర్చు పెట్టి చూసుకున్నాడో.. తనని అవంతిక ఓ నెలలు చూస్తే చాలని అంటాడు. అప్పుడు ఏమైంది? చివరకు డబ్బు కంటే ప్రేమ గొప్పదని తెలుసుకున్నారా? లేదా అనేదే స్టోరీలా అనిపిస్తుంది. ట్రైలర్ అయితే బాగానే ఉంది. మరి నాగదుర్గ ఈ మూవీతో ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో?(ఇదీ చదవండి: అవార్డులకు ఎన్నో దారులు.. చిరు వ్యాఖ్యలపై రాజేంద్రప్రసాద్ రియాక్షన్) -
ఆల్ఫా ట్రైలర్‌పై ప్రభాస్ రివ్యూ.. వీరిద్దరి కాంబో ఫిక్సయిందా?
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్లో పనిచేస్తున్నారు. వీరిద్దరి కాంబోలో వస్తోన్న స్పిరిట్ మూవీ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ మూవీలో ప్రభాస్ తొలిసారి పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని భూషణ్ కుమార్, ప్రణయ్ రెడ్డి వంగా, క్రిషణ్ కుమార్, ప్రభాకర్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ మూవీ వచ్చే ఏడాది మార్చి 5న థియేటర్లలో రిలీజ్ కానుంది. అంతే కాకుండా ఫౌజీ, కల్కి-2 మూవీస్ కూడా చేస్తున్నారు.ఇక ప్రభాస్ మూవీ తాజాగా ఆలియా భట్ మూవీపై ప్రశంసలు కురిపించారు. స్పై థ్రిల్లర్‌గా వస్తోన్న ఆల్ఫా మూవీ ట్రైలర్ చూసిన ప్రభాస్.. తన అభిప్రాయాన్ని పంచుతున్నారు. ఇన్‌స్టా స్టోరీస్‌లో పోస్ట్ చేస్తూ ట్రైలర్‌కు రివ్యూ ఇచ్చేశారు. ఆల్ఫా ట్రైలర్ అద్భుతంగా ఉందని కొనియాడారు. జూలై 3న రిలీజవుతున్న సందర్భంగా ఆల్ ది బెస్ట్ అంటూ రాసుకొచ్చారు.ఇది చూసిన ఆలియా భట్.. ప్రభాస్ పోస్ట్‌కు రిప్లై కూడా ఇచ్చింది. థ్యాంక్ యు అంటూ ప్రభాస్ చేసిన పోస్ట్‌కు స్పందించింది. అయితే దీనిపై ప్రభాస్ ఫ్యాన్స్ భిన్నమైన కామెంట్స్ చేస్తున్నారు. రెబల్ స్టార్ కేవలం అభినందనలు తెలిపే ఓ సాధారణ పోస్ట్ కాదంటున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. కల్కి-2లో అలియా భట్ ఫిక్స్ అయిందంటూ పోస్టులు పెడుతున్నారు. అంందుకే ప్రభాస్ ఇలా మెచ్చుకున్నాడని సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు. -
నేరుగా ఓటీటీలోకి తెలుగు సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా
ఓటీటీలోకి ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు వస్తూనే ఉంటాయి. అయితే కొన్నిసార్లు మాత్రం థియేటర్లలో కాకుండా నేరుగా స్ట్రీమింగ్‌లోకి తీసుకొచ్చేస్తుంటారు. అయితే ఇలాంటి వాటిలో చాలా తక్కువ వాటిలో మాత్రమే ఆకట్టుకునే కథాకథనాలు కనిపిస్తుంటాయి. ఇప్పుడు బ్రహ్మాజీ ప్రధాన పాత్రలో నటించిన ఓ తెలుగు సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రాన్ని నేరుగా ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారు. ఈ మేరకు ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇంతకీ సినిమా ఎప్పుడు రాబోతుందంటే?(ఇదీ చదవండి: ఓటీటీలోకి మలయాళ హారర్ కామెడీ సినిమా.. తెలుగులోనూ)బ్రహ్మాజీ మాత్రమే ఈ 'హ్యాంగ్ మ్యాన్' మూవీలో తెలిసిన ముఖం కాగా.. వియన్, బన్నీ అభిరామ్ తదితరులు ఇతర పాత్రలు చేశారు. చాలా ఏళ్ల క్రితమే ఈ ప్రాజెక్ట్ మొదలైంది. ఇప్పటికి పూర్తి చేసి డైరెక్ట్ సన్ నెక్స్ట్ ఓటీటీలో రిలీజ్ చేసేస్తున్నారు. ఈ శుక్రవారం నుంచే తెలుగులో స్ట్రీమింగ్ కాబోతుంది. ఉరి తీసే తలారి జీవితం ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.'హ్యంగ్ మ్యాన్' విషయానికొస్తే.. వారసత్వంగా వచ్చే తలారి పని చేస్తుండే ఓ వ్యక్తి (బ్రహ్మాజీ), ఉరిశిక్షలని అమలు పరుస్తూ ఉంటాడు. ఇతడి జీవితంలో ఉరిశిక్ష అనేది ఎలాంటి మానసిక సంఘర్షణకు కారణమైంది? చివరకు ఏం జరిగింది? అనేది స్టోరీలా అనిపిస్తుంది. ట్రైలర్ చూడటానికి ఆసక్తికరంగానే ఉంది కానీ మూవీ ఏ మేరకు మెప్పిస్తుందనేది చూడాలి? (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 15 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్) -
'అందుకు నన్ను క్షమించండి.. ఈ సారి నేను మాట్లాడను'
టాలీవుడ్ అక్కినేని అఖిల్ నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ లెనిన్. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా జూలై 3న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ మూవీలో భాగ్యశ్రీ హీరోయిన్గా కనిపించనుంది. మురళీ కిశోర్ అబ్బూరు దర్శకత్వంలో వస్తోన్న ఈ సినిమాపై అక్కినేని అభిమానుల్లో అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలోనే వైజాగ్ వేదికగా ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సందర్భంగా ఈవెంట్‌కు హాజరైన అఖిల్ ఈ మూవీపై ఆసక్తికర కామెంట్స్ చేశారు. నా సినిమా వచ్చి ఇప్పటికీ మూడేళ్లయిందని.. సారీ బ్రదర్.. ఈ విషయంలో నన్ను క్షమించాలంటూ అభిమానులను కోరారు అఖిల్. నా గుండెలపై చేయి వేసుకుని చెబుతున్నా.. ఈ సారి నేను మాట్లాడను.. కేవలం నా సినిమానే మాట్లాడుతుందన్నారు. ఇంతకుమించి నేనేం చెప్పకూడదు.. రెండు రోజులుగా నేను నిద్రపోలేదు.. కళ్లద్దాలు పెట్టుకుని వద్దామనుకున్నానని తెలిపారు. మిమల్ని చూస్తుంటే జూలై 10 వరకు పనిచేసే ఎనర్జీ వచ్చిందని అభిమానులను ఉద్దేశించి అఖిల్ మాట్లాడారు. #LENIN is ready to hit hard... and Vizag has already set the tone ❤️🔥❤️🔥 #LeninTrailer - https://t.co/04wGr6WZ2x #LeninOnJuly10th pic.twitter.com/phNA8qkUrw— Sithara Entertainments (@SitharaEnts) June 30, 2026 -
రావు బహదూర్ మూవీ.. ట్రైలర్ రిలీజ్
సత్యదేవ్ హీరోగా వస్తోన్న లేటేస్ట్ సైకలాజికల్ థ్రిల్లర్ రావు బహదూర్. ఈ చిత్రానికి వెంకటేష్ మహా దర్శకత్వం వహంచారు. ఈ మూవీలో దీపా థామస్ హీరోయిన్గా నటించింది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా జూలై 3న థియేటర్లలో సందడి చేయనుంది. గతంలో ఆయన డైరెక్ట్ చేసిన 'కేరాఫ్ కంచరపాలెం, ఉమామహేశ్వర ఉగ్రరూపస్య' చిత్రాలు టాలీవుడ్లో మంచి విజయాన్ని అందుకున్నాయి. ఈ చిత్రాన్ని మహేశ్ బాబు, నమ్రతా శిరోద్కర్ సొంత నిర్మాణ సంస్థ జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్ నిర్మించారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ మూవీ ట్రైలర్ మహేశ్ వాయిస్ ఓవర్‌తో ప్రారంభమైంది. ఈ ట్రైలర్ ట్రైలర్ చూస్తుంటే సైకలాజికల్ థ్రిల్లర్ మూవీగానే తెరకెక్కించినట్లు తెలుస్తోంది. మునుపెన్నడు చూడని తెలుగు సినిమా రావు బహదూర్ అంటూ ఒక్కసారిగా అంచనాలు పెంచేశారు మహేశ్ బాబు. కాగా.. ఈ చిత్రంలో వికాస్ ముప్పాల, బాల పరాసర్, ఆనంద్ భారతి, ప్రణయ్ వాక, కునాల్ కౌశిక్, మాస్టర్ కిరణ్ కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు స్మరణ్ సాయి సంగీతమందించారు. -
' శ్రీకృష్ణుడు అర్జునుడికి ఏం చెప్పినాడో తెలుసా?.. లెనిన్ ట్రైలర్ చూశారా?
అక్కినేని నాగార్జున కుమారుడు అఖిల్, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటిస్తున్న తాజా చిత్రం లెనిన్. ఈ మూవీని మురళీ కిశోర్ అబ్బూరు దర్శకత్వంలో తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో నాగార్జున, సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా రెండుసార్లు రిలీజ్ వాయిదా పడింది. ఈ మూవీని జూలై 10న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ నేపథ్యంలోనే లెనిన్ ట్రైలర్ మేకర్స్ రిలీజ్ చేశారు.ఈ ట్రైలర్‌కు నాగార్జున అక్కినేని వాయిస్ ఓవర్ అందించారు. ట్రైలర్ చూస్తుంటే రూరల్ బ్యాక్‌డ్రాప్‌లో యాక్షన్ డ్రామాగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ప్రేమకథతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో ఫ్యాక్షన్ అంశాలు కూడా ఈ కథలో ఉన్నట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. 'కురుక్షేత్రంలో ఆఖరి ఘట్టం విశ్వరూపం' అని సునీల్ చెప్పే డైలాగ్ తెగ ఆకట్టుకుంటోంది. ఈ ట్రైలర్‌లోని ఫైట్స్ చూస్తుంటే రాయలసీమ ఫ్యాక్షన్‌ను తలపిస్తోంది. 'కురుక్షేత్రంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి ఏం చెప్పినాడో తెలుసా? యుద్ధం కూడా ప్రశాంతంగా చేయాలని.. ఏంది అట్టనే సేద్దామా' అనే డైలాగ్ ఈ మూవీపై అంచనాలు పెంచేసింది. కాగా.. ఈ సినిమాకు తమన్ సంగీతమందించారు. -
ఓటీటీలో మర్డర్ మిస్టరీ థ్రిల్లర్.. ట్రైలర్ రిలీజ్
ఓటీటీలో మరో థ్రిల్లర్ మూవీ సందడి చేయనుంది. సన్నీ డియోల్, అక్షయే ఖన్నా ప్రధాన పాత్రల్లో నటించిన ఇక్కా వచ్చేనెలలో ఓటీటీ ప్రియులను అలరించనుంది. ఈ చిత్రాన్ని కోర్ట్ రూమ్ సస్పెన్స్ డ్రామాగా తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని నేరుగా ఓటీటీలోనే స్ట్రీమింగ్ చేయనున్నారు. జూలై 10 నుంచి నెట్‌ఫ్లిక్స్ వేదికగా ఈ చిత్రాన్ని స్ట్రీమింగ్ చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు.తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ చూస్తుంటే ఓ మర్డర్ కేసు చుట్టే కథ ఉండనుందని అర్థమవుతోంది. ఈ కేసును వాదించే డిఫెన్స్ లాయర్‌గా సన్నీ డియోల్ కనిపించనున్నారు. ఈ ట్రైలర్లో కోర్ట్ రూమ్ సీన్స్ ఆసక్తిగా పెంచేస్తున్నాయి. మరి ఈ కేసులో సన్నీ డియోల్ గెలిచారా? అక్షయే ఖన్నా తప్పించుకున్నారా? లేదా అన్నది తెలియాలంటే మూవీ చూడాల్సిందే.కాగా.. దాదాపు 29 ఏళ్ల తర్వాత ఇద్దరు దిగ్గజ నటులు సన్నీ డియోల్, అక్షయే ఖన్నా స్క్రీన్ షేర్ చేసుకోనున్నారు. ఈ సినిమాకు సిద్ధార్థ్ మల్హోత్రా దర్శకత్వం వహించారు. ఈ మూవీలో దియా మీర్జా, తిలోత్తమా శోమే, సంజీదా షేక్, ఆకాంక్ష రంజన్ కపూర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. -
'చంద్రప్పన్' సినిమా ట్రైలర్ లాంచ్
డా.పి.యష్మన్, సోనాలీ హీరో హీరోయిన్లుగా చేసిన సినిమా 'చంద్రప్పన్'. యష్మన్ హీరోగా నటించడంతో పాటు స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, లిరిక్స్, డైరెక్షన్ చేస్తున్నారు. జూలై 24న ఈ మూవీ థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే తాజాగా ట్రైలర్ లాంచ్ కార్యక్రమాన్ని హైదరాబాద్‌లో నిర్వహించారు. దర్శకుడు వి. సముద్ర, నిర్మాత కేఎల్ దామోదర ప్రసాద్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.(ఇదీ చదవండి: రవితేజ 'ఇరుముడి'.. అయ్యప్ప సాంగ్ రిలీజ్)హీరో, డైరెక్టర్ యష్మన్ మాట్లాడుతూ..మేం చాలా జాగ్రత్తగా మంచి కంటెంట్‌తో ప్రేక్షకుల అభిరుచికి తగినట్లు మూవీ చేశాం. చాలా మంచి కాస్టింగ్ ఉంది. వాళ్లంతా డైరెక్టర్‌గా నేను ఎలా చెబితే అలా ఫెర్ఫార్మెన్ ఇచ్చారు. మా మూవీ అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుందని నమ్ముతున్నాం. ట్రైలర్ మీ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాం. జూలై 24న రిలీజ్ అవుతున్న మా సినిమాను కూడా ఇలాగే సపోర్ట్ చేయండి అని అన్నారు. (ఇదీ చదవండి: ఓటీటీలోకి లేటెస్ట్ సెన్సేషన్ 'అబ్సెషన్'.. అధికారిక ప్రకటన) -
ఓటీటీలో క్రైమ్ థ్రిల్లర్.. 'ఇసకపట్నం' కొత్త ట్రైలర్
సముద్రఖని, ఐశ్వర్య రాజేశ్, సునీల్ ప్రధాన పాత్రల్లో చేసిన తెలుగు క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ 'ఇసకపట్నం'. వచ్చే నెల 02న అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో రిలీజ్ కానుంది. కొన్నిరోజుల క్రితం ఈ సిరీస్ ట్రైలర్ రిలీజ్ చేయగా.. ఇప్పుడు మరో ట్రైలర్‌ని విడుదల చేశారు. కల్పిత పోర్ట్ టౌన్ నేపథ్యంగా అధికారం, రాజకీయాలు, గ్యాంగ్ వార్స్, కుటుంబ విభేదాలు తదితర అంశాలతో దీన్ని తెరకెక్కిస్తున్నారు. తండ్రి-కూతురు మధ్య జరిగే పోరు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది.(ఇదీ చదవండి: వెంకటేశ్ 'ఆదర్శ కుటుంబం' ఇదే)పట్టణంలో రాజకీయాలు, నేరాలు, వ్యాపారాలపై పూర్తి ఆధిపత్యం చెలాయించే నాయుడికి, తన సొంత కూతురే పెద్ద సవాలుగా మారుతుంది. తన జీవితాన్ని తన నిర్ణయాలతో ముందుకు తీసుకెళ్లాలనుకునే భారతి, తండ్రికి ఎదురు నిలబడటమే స్టోరీ. గ్యారీ బీహెచ్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్ 7 ఎపిసోడ్లతో తీశారు. జూలై 2 నుంచి ప్రైమ్ వీడియోలో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. అలాగే 15 భాషల్లో సబ్‌టైటిల్స్‌తో భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా 240కు పైగా దేశాలు, ప్రాంతాల్లో అందుబాటులోకి రానుంది.(ఇదీ చదవండి: స్టార్ హీరోతో 'సేవ్ ది టైగర్స్' సీజన్ 4) -
'మగ పిల్లాడి కోసం చిట్కా చెప్పండి సార్'.. సూపర్ సుబ్బు ట్రైలర్
టాలీవుడ్ హీరో సందీప్ కిషన్, మిథిలా పాల్కర్ ప్రధాన పాత్రల్లో నటించిన తెలుగు కామెడీ వెబ్ సిరీస్ సూపర్ సుబ్బు. ఈ టాలీవుడ్ వెబ్ సిరీస్‌కు మల్లిక్ రామ్ దర్శకత్వం వహించారు. ఇటీవలే ఈ సిరీస్ స్ట్రీమింగ్ తేదీని మేకర్స్ రివీల్ చేశారు. ఓ అమాయక యువకుడు.. అత్యంత సంప్రదాయ గ్రామం.. అసాధ్యమైన ఓ ఉద్యోగం అంటూ క్యాప్షన్ ఇచ్చారు.తాజాగా ఈ సిరీస్ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ ట్రైలర్ చూస్తుంటే సెక్స్ ఎడ్యుకేషన్ ఆపీసర్గా ఓ పల్లెటూరికి వెళ్లిన సందీప్ కిషన్ ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాడనే కోణంలో తెరకెక్కించినట్లు తెలుస్తోంది. అక్షర జ్ఞానం తెలియని గ్రామీణ ప్రజలకు లైంగిక విద్యపై ఎలా అవగాహన కల్పించాడనే కథగా రూపొందించినట్లు అర్థమవుతోంది. ఈ సిరీస్ ట్రైలర్లో కామెడీ సినీ ప్రియులను ఆకట్టుకుంటోంది.ఈ టాలీవుడ్ క్రేజీ వెబ్ సిరీస్ జూలై 2 నుంచి నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. తెలుగుతో పాటు హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో అందుబాటులోకి రానుంది. ఈ వెబ్ సిరీస్‌లో మురళీశర్మ, బ్రహ్మానందం, సంపూర్ణేశ్‌బాబు కీలక పాత్రలు పోషించారు. -
వసుదేవసుతం ట్రైలర్ రిలీజ్
మాస్టర్ మహేంద్రన్, అంబికా వాణి జంటగా నటించిన లేటేస్ట్ మూవీ 'వసుదేవసుతం'. ఈ చిత్రానికి వైకుంఠ్ బోను దర్శకత్వం వహించారు. ఈ మూవీని రెయిన్బో సినిమాస్ బ్యానర్‌పై నిర్మించారు. ఇప్పటికే రిలీజైన పోస్టర్లు, గ్లింప్స్, టీజర్ అందరినీ ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్.ట్రైలర్ చూస్తుంటే ఒరిస్సాలోని వాసుదేవుని ఆలయం చుట్టూ ఈ కథగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఆలయంలోని బ్రహ్మ పదార్థం కోసం శత్రు మూకలు చేసే విన్యాసాన్ని అడ్డుకునే పాత్రలో హీరో మహేంద్రన్ అదరగొట్టేశారు. యాక్షన్ సీక్వెన్స్, బీజీఎం అన్నీ కూడా అద్భుతంగా ఉన్నాయి. ఆయుధం వస్తోంది.. దేవుడి అస్థిత్వాన్ని ప్రశ్నించే ఎవ్వడికీ భూమ్మీద బతికే హక్కు లేదు.. అనే డైలాగ్స్ అద్భుతంగా అనిపిస్తోంది. ట్రైలర్ ఒక్కసారిగా ప్రేక్షకుల్లో అంచనాల్ని పెంచేసింది. ఈ సినిమాని జూలై 10న రిలీజ్ చేయబోతోన్నారు.మాస్టర్ మహేంద్రన్ మాట్లాడుతూ .. 'వసుదేవసుతం’ కోసం నిర్మాతలు చాలా కష్టపడ్డారు. కథ నమ్మి ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఖర్చు పెట్టారు. దర్శకుడు ఎన్నో కష్టాల్ని ఎదుర్కొని ఈ మూవీని పూర్తి చేశారు. కృష్ణుడి మీద తీసిన ఈ కంటెంట్ జనాలకు నచ్చాలని బాగా తెరకెక్కించారు. ఇందులో అద్భుతమైన కంటెంట్ ఉంది. ఇలాంటి ఓ పాత్ర, సినిమా దొరకడం నా అదృష్టం. నిర్మాత మీదున్న నమ్మకంతోనే అడ్వాన్స్‌లాంటివి అడగలేదు. ఏ నటుడి నుంచి ఎంత రాబట్టుకోవాలనేది దర్శకుడు వైకుంఠ్‌కి చాలా బాగా తెలుసు. అంబికా వాణి చక్కగా నటించారు. జూలై 10న మా చిత్రం రాబోతోంది. అందరూ థియేటర్లో మా సినిమాని చూసి ఆశీర్వదించండి' అని అన్నారు.దర్శకుడు వైకుంఠ్ బోను మాట్లాడుతూ .. 'నిర్మాతకు ముందు ఓ రెండు కథలు చెప్పా. మళ్లీ ఒరిస్సాలోని ఫేమస్ టెంపుల్ బ్యాక్ డ్రాప్లో ఓ కథను రాసుకున్నా. ఆ కథ చెప్తే.. అంతకు ముందు చెప్పిన వాటిని పక్కన పెట్టేయండని నిర్మాత అన్నారు. మహేంద్రన్‌కు కథ చెప్పిన వెంటనే ఓకే. మణిశర్మ గారికి కథ చెప్పా. నచ్చితేనే చేయండని ఆయనతో అన్నా. కథ నచ్చడంతో వెంటనే పని ప్రారంభించారు. మూవీ చూసిన తర్వాత మణిశర్మ పాటలు, ఆర్ఆర్ గురించి కచ్చితంగా మాట్లాడతారు. డైలాగ్స్ బాగుంటాయి. వీఎఫ్ఎక్స్ వర్క్ బాగా వచ్చింది. నా మూవీ ఎవ్వరినీ నిరాశపర్చదు. అందరూ చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా’ అని అన్నారు. కాగా.. ఈ చిత్రంలో జాన్ విజయ్, మైమ్ గోపి, సురేష్‌చంద్ర మీనన్, ఈశ్వర్య లక్ష్మి, తులసి, రాజీవ్ కనకాల, టార్జన్, రామరాజు, బధ్రమ్, జబర్ధస్త్ రాంప్రసాద్, శివన్నారాయణ, దువ్వాసి మోహన్, సుమేత బజాజ్ కీలక పాత్రల్లో నటించారు. -
కొత్తోళ్లతో రూ.100 కోట్ల సినిమా.. 'నాగబంధం' ట్రైలర్ రిలీజ్
రూ.100 కోట్ల బడ్జెట్ అనగానే సాధారణంగా పేరున్న హీరోలనే పెడుతుంటారు. కానీ ఒక సినిమాలో నటించిన అనుభవమున్న విరాట్ కర్ణ అనే కుర్రాడిని పెట్టి తీసిన చిత్రం 'నాగబంధం'. అనంత పద్మనాభ స్వామి బ్యాక్ డ్రాప్ స్టోరీతో దీన్ని తీశారు. వచ్చే నెల 3న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు. భారీతనంతో ఇది ఆకట్టుకుంది.(ఇదీ చదవండి: ఓటీటీలో మలయాళ యాక్షన్ కామెడీ సినిమా 'అతిరథి' తెలుగు రివ్యూ)ట్రైలర్ బట్టి చూస్తే అనంత పద్మనాభ స్వామి దేవాలయంలోని స్వర్ణపుష్పం దక్కించుకునేందుకు కొందరు విలన్స్ ప్రయత్నిస్తుంటారు. ఈ ప్రయాణంలో హీరో వాళ్లకు సాయపడాల్సి వస్తుంది. తర్వాత ఏమైంది? హిమాలయాల్లో ఉండే నాగసాధువులు ఎందుకు వచ్చారు? లాంటి అంశాలే స్టోరీలా అనిపిస్తుంది. ప్రతి ఫ్రేమ్‌లో భారీతనం కనిపించింది. యాక్షన్, రక్తపాతం కూడా గట్టిగానే చూపించారు. నభా నటేశ్ హీరోయిన్ కాగా అభిషేక్ నామా దర్శకుడు. ఇందులో నటించిన చాలామంది కొత్తవాళ్లే. వీళ్లపై రూ.100 కోట్ల బడ్జెట్ పెట్టేశారు. మరి తెలుగు ప్రేక్షకుల్ని ఇది ఏ మేరకు మెప్పిస్తుందనేది చూడాలి?(ఇదీ చదవండి: రెండేళ్ల పాటు నరకం చూశా.. తినాలని ఉన్నా తినలేకపోయా: సమంత) -
'వారణాసి' విలన్ కొత్త సినిమా.. తెలుగు ట్రైలర్ రిలీజ్
'సలార్' సినిమాలో ప్రభాస్ ఫ్రెండ్‌గా చేసి తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్.. ప్రస్తుతం మహేశ్-రాజమౌళి 'వారణాసి'లో విలన్‌గా చేస్తున్నాడు. ఇతడి పాత్రకు సంబంధించిన షూటింగ్ చాన్నాళ్ల క్రితమే పూర్తయింది. అదొచ్చేలోపు పృథ్వీరాజ్ హీరోగా చేసిన ఓ మూవీ విడుదలకు సిద్ధమైంది. 'ఐ, నోబడీ' పేరుతో దీన్ని తీయగా.. వచ్చే నెల 9న తెలుగు, తమిళ, మలయాళంలో రిలీజ్ చేయనున్నారు.(ఇదీ చదవండి: హీరోగా మెగా డైరెక్టర్ కొడుకు.. కూతురు ఇప్పటికే హీరోయిన్)ఈ క్రమంలోనే తాజాగా ట్రైలర్ వదిలారు. ట్రైలర్ బట్టి చూస్తే ఇది డబ్బు చుట్టూ తిరిగే యాక్షన్ థ్రిల్లర్. ప్రభుత్వ ఉద్యోగం చేసే రాజీవ్(పృథ్వీరాజ్) ఓ డబ్బు వివాదంలో ఇరుక్కుంటాడు. దీంతో విలన్, పోలీసులు నుంచి ఒత్తిడి పెరుగుతుంది. ఇంతకీ ఆ డబ్బు ఎవరిది? దీనికోసం అంతమంది ఎందుకు వెతుకున్నారు? ఇంతకీ రాజీవ్ ఎవరు? అనేది స్టోరీలా అనిపిస్తుంది. పార్వతి తిరువత్తు హీరోయిన్. నిషాం బషీర్ డైరెక్టర్. పృథ్వీరాజ్ భార్య సుప్రియ ఓ నిర్మాత. ట్రైలర్ చివరలో 'మీ నాన్నతో ఫైట్ చేసిన వాళ్లెవరూ ఇప్పుడు ప్రాణాలతో లేరు' అనే డైలాగ్ మూవీపై ఆసక్తి కలిగిస్తోంది.(ఇదీ చదవండి: 'పుష్ప' కాన్సెప్ట్‌తో ధనుష్ సినిమా.. టీజర్ రిలీజ్) -
స్పైడర్ మ్యాన్ vs హల్క్.. కొత్త తెలుగు ట్రైలర్ రిలీజ్
ఒకప్పుడు స్పైడర్ మ్యాన్ సినిమాలంటే యమ క్రేజ్ ఉండేది. కానీ ఇప్పుడు చాలావరకు హైప్ తగ్గిందనే చెప్పొచ్చు. అయినా సరే ఎప్పటికప్పుడు ఈ ఫ్రాంచైజీలో కొత్త మూవీస్ వస్తూనే ఉంటాయి. వచ్చే నెల 30న థియేటర్లలో రాబోతున్న చిత్రం 'స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే'. టామ్ హోలండ్, జెండాయా హీరోహీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రం నుంచి తాజాగా మరో ట్రైలర్ రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: ప్రెగ్నెన్సీ ప్రకటించిన టాలీవుడ్ హీరోయిన్)మూడు నెలల క్రితం రిలీజ్ చేసిన ట్రైలర్లో నో వే హోమ్ సంఘటనల తర్వాత ప్రపంచానికి పీటర్ పార్కర్ ఎవరో తెలియని స్థితిలో న్యూయార్క్‌లో కొత్త జీవితాన్ని ప్రారంభించడం, స్పైడర్ మ్యాన్ శరీరంలో వచ్చిన జన్యు మార్పులకు కారణం లాంటివి చూపించారు. ఈసారి వచ్చిన ట్రైలర్లో మాత్రం హల్క్‌తో పాటు మరికొందరితో స్పైడీ చేసే ఫైట్స్ చూపించారు. ఇకపోతే ఇందులో హీరోహీరోయిన్లుగా నటించిన టామ్, జెండాయా నిజజీవితంలో పెళ్లి చేసుకోవడం విశేషం.స్పైడర్ మ్యాన్ ఫ్రాంచైజీలో భాగంగా 2002లో మొదటి సినిమా వచ్చింది. తర్వాత 2004, 07, 12, 14, 17, 19, 21ల్లో మిగిలిన మూవీస్ వచ్చాయి. ఇప్పుడు వచ్చే చిత్రం బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి?(ఇదీ చదవండి: 'బాహుబలి' రమ్యకృష్ణ సెకండ్ లవ్) -
'ధురంధర్' తర్వాత వస్తున్న స్పై థ్రిల్లర్.. ట్రైలర్ రిలీజ్
హిందీలో స్పై థ్రిల్లర్ సినిమాలంటే గతేడాది నవంబరు ముందు వరకు యష్ రాజ్ సంస్థ నిర్మించిన మూవీసే గుర్తొచ్చేవి. ఎప్పుడైతే 'ధురంధర్' వచ్చిందో వీటిపై విపరీతమైన ట్రోల్స్ వచ్చాయి. ఇప్పటికీ వస్తూనే ఉన్నాయి. అంతలా 'ధురంధర్' ఫ్రాంచైజీ ప్రభావం చూపించింది. ఈ క్రమంలోనే యష్ రాజ్ స్పై యూనివర్స్ నుంచి కొత్త మూవీ రిలీజ్‌కి సిద్ధమైంది. తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: మహేశ్ 'వారణాసి'.. ఇలా అయిందేంటి?)యష్ రాజ్ స్పై యూనివర్స్‌లో ఇప్పటివరకు ఏక్ థా టైగర్, టైగర్ జిందా హై, పఠాన్, వార్, వార్ 2 తదితర చిత్రాలు వచ్చాయి. చివరగా వచ్చిన 'వార్ 2'లో తెలుగు స్టార్ హీరో ఎన్టీఆర్ నటించాడు. కానీ ఘోరమైన డిజాస్టర్ అయింది. ఈ ఫ్రాంచైజీ నుంచి వస్తున్న లేటెస్ట్ మూవీ 'ఆల్ఫా'. ఆలియా భట్, శర్వారీ లీడ్ రోల్స్ చేశారు. వచ్చే నెల 3న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే ట్రైలర్ రిలీజ్ చేసి స్టోరీ ఏంటనేది చెప్పేశారు.యష్ రాజ్ స్పై యూనివర్స్‌లో ఇప్పటివరకు భారత్-పాక్ కాన్సెప్ట్‌తో మూవీస్ వచ్చాయి. 'ఆల్ఫా'లో మాత్రం స్టోరీ మారినట్లు కనిపిస్తుంది. ట్రైలర్ బట్టి చూస్తే.. పసిపాపగా ఉన్నప్పుడే ఆలియాని విలన్ ఎత్తుకొచ్చేశాడు. ఆమెని ఆయుధంలా తయారు చేసి, భారత ఆర్మీపై ప్రయోగిస్తాడు. ఈ క్రమంలోనే ఆలియా అలియాస్ ఆల్ఫాకు తన గతం ఎలా తెలిసింది? ఇందులో మరో హీరోయిన్ శర్వారీ, ఆర్మీ అధికారి అనిల్ కపూర్ పాత్రలేంటి? అనేది మిగతా స్టోరీలా అనిపిస్తుంది. ట్రైలర్లో బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, విజువల్స్ బాగానే ఉన్నాయి. ఆలియా కూడా ఫైట్స్ గట్టిగానే చేసినట్లు కనిపిస్తుంది. మరి 'ధురంధర్' చూసిన కళ్లతో ఆడియెన్స్.. 'ఆల్ఫా'ని ఆదరిస్తారా అనేది పెద్ద క్వశ్చన్.(ఇదీ చదవండి: స్టార్ హీరోతో ఒకే కారులో ఇద్దరు మాజీ భార్యలు, ప్రియురాలు) -
యూత్‌ఫుల్ ఎంటర్టైనర్గా సిద్ధుగాడి లవ్ స్టోరీ
మనోజ్ కుమార్, మోహన సిద్ధి, , శృతి శంకర్ హీరో, హీరోయిన్లుగా వస్తోన్న సినిమా సిద్ధుగాడి లవ్ స్టోరీ. ఈ మూవీకి రమేష్ చెరుకూరు దర్శకత్వం వహించారు. తాజాగా ఈ మూవీ టీజర్, ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ప్రసాద్ ల్యాబ్‌లోజరిగిన ట్రైలర్ విడుదల కార్యక్రమంలో ప్రముఖ దర్శకులు ఎ. కోదండరామిరెడ్డి, బి. గోపాల్, దామోదర ప్రసాద్, తెలుగు సినీ దర్శకుల సంఘం అధ్యక్షుడు వి.ఎన్. ఆదిత్య, దర్శకులు వి. సముద్ర, రామ్ ప్రసాద్, నిర్మాత అశోక్ కుమార్, నిర్మాతల మండలి కార్యదర్శి ప్రసన్న కుమార్, రాజేందర్ ప్రసాద్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్‌కు అభినందనలు తెలిపారు.నిర్మాతల మండలి కార్యదర్శి ప్రసన్న కుమార్ మాట్లాడుతూ..'పవన్ కల్యాణ్ డైలాగ్‌లో వచ్చిన సిద్ధు.. సిద్ధార్థ్ రాయ్ ఎంతగా ప్రేక్షకులకు కనెక్ట్ అయిందో.. అదే విధంగా ఈ సినిమా కూడా ప్రేక్షకులకు బాగా చేరువ అవుతుందని నమ్ముతున్నా. ఈ వేడుకలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ చిత్ర బృందానికి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేశారు. డల్లాస్ నుంచి వచ్చి ఈ సినిమాను తెరకెక్కించిన దర్శకుడు రమేశ్ భవిష్యత్తులో మరెన్నో మంచి సినిమాలు నిర్మించాలని కోరుకుంటున్నా' అన్నారు.తెలుగు సినీ దర్శకుల సంఘం అధ్యక్షుడు వీఎన్ ఆదిత్య మాట్లాడుతూ..'ఈ చిత్రాన్ని ఆశీర్వదించేందుకు వచ్చిన సినీ పెద్దలందరికీ ధన్యవాదాలు. రమేశ్ నన్ను సంప్రదించినప్పుడు ఆయనలో ఉన్న సినిమా పట్ల అభిరుచి, పట్టుదల నాకు అర్థమైంది. అందుకే ఆయనకు పూర్తి సహకారం అందించాను. మా దర్శకుల సంఘ సభ్యుల సినిమాల విడుదలకు సహకరించాలని మేము నిర్ణయించుకున్నాం. ఈ సినిమా చిత్ర బృందాన్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలని, నిర్మాతకు మంచి లాభాలు తీసుకురావాలని కోరుకుంటున్నా' అన్నారు.ప్రముఖ దర్శకుడు ఎ. కోదండరామిరెడ్డి మాట్లాడుతూ..'కొత్తవారితో మంచి కథను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం అభినందనీయం. టీజర్, ట్రైలర్ ఆసక్తికరంగా ఉన్నాయి. చిత్ర యూనిట్ అంతా ఎంతో కష్టపడి పని చేసినట్లు కనిపిస్తోంది. ఈ సినిమా ఘన విజయం సాధించాలని దేవుడిని ప్రార్థిస్తున్నా. దర్శకుడు రమేష్ భవిష్యత్తులో మరిన్ని మంచి చిత్రాలు తెరకెక్కించాలని కోరుకుంటున్నాను' అని అన్నారు. -
'నా జీవితాన్ని నిర్ణయించడానికి నువ్వెవర్రా?'.. ఫుల్ ఎమోషనల్‌గా ట్రైలర్
బిచ్చగాడు మూవీతో అందరి చూపులు తనవైపు తిప్పుకున్న హీరో విజయ్ ఆంటోని. ఈ మూవీ ప్రేక్షకులను ఎమోషనల్‌గా టచ్ చేసింది. ఇప్పుడు మళ్లీ అదే కాంబో అలరించేందుకు వస్తోంది. వంద దేవుళ్లు పేరుతో మరోసారి అమ్మ ప్రేమ, సెంటిమెంట్ చూపించేందుకు వచ్చేస్తున్నారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా జూన్ 19న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ చిత్రంలో విజయ్ ఆంటోని, స్వాసిక ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ మూవీకి శశి దర్శకత్వం వహించారు. మేకర్స్. ట్రైలర్ చూస్తుంటే మధ్య తరగతి కుటుంలాల జీవితం నేపథ్యంలో తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా బిచ్చగాడులానే అమ్మ సెంటిమెంట్ ఉండనుందని టీజర్లోనే అర్థమవుతోంది. ఈ చిత్రాన్ని సర్వంత్ రామ్ క్రియేషన్స్, రామాంజనేయులు జవ్వాజి ప్రొడక్షన్స్, విజయ్ ఆంటోని ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్లపై నిర్మించారు. ఈ సినిమాకు బాలాజీ శ్రీరామ్ సంగీతం సమకూర్చారు. -
సింగర్ సునీత తనయుడి కొత్త సినిమా.. ట్రైలర్ రిలీజ్
ప్రముఖ సింగర్ సునీత తనయుడు ఆకాశ్ గోపరాజు హీరోగా వస్తోన్న చిత్రం కొత్త మలుపు. ఈ మూవీలో భైరవి అర్ధ్యా హీరోయిన్గా నటిస్తోంది. శివ వరప్రసాద్ కేశనకుర్తి దర్శకత్వంలో ఈ సినిమాను తెరకెక్కించారు. తాటి బాలకృష్ణ నిర్మించిన ఈ మూవీ జూన్ 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. తధాస్తు క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మించగా.. మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ట్రైలర్ రిలీజ్ చేశారు. ప్రముఖ దర్శకుడు ఎ. కోదండరామి రెడ్డి చేతుల మీదుగా విడుదల చేశారు.ఈ సందర్భంగా ఎ. కోదండరామి రెడ్డి మాట్లాడుతూ..'ట్రైలర్ చాలా బాగుంది. సినిమా కాన్సెప్ట్ కూడా నచ్చింది. హీరో, హీరోయిన్ ఇద్దరూ ఆకట్టుకున్నారు. ప్రేక్షకులు ఈ చిత్రాన్ని పెద్ద విజయంగా నిలబెట్టాలని కోరుకుంటున్నాను” అన్నారు.ట్రైలర్ చూస్తుంటే గ్రామీణ నేపథ్యంలో సాగే ప్రేమకథగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఈ రొమాంటిక్ ప్రేమకథలో ప్రేమ, సస్పెన్స్, వినోదం ఉండేలా కనిపిస్తోంది. ఇందులో ఆకాష్, భైరవి బావ, మరదళ్ల పాత్రల్లో కనిపించనున్నారు. కేవలం ప్రేమకథ మాత్రమే కాకుండా భావోద్వేగాలు, ఉత్కంఠ, హాస్యం, కుటుంబ ప్రేక్షకులను అలరించేలా ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. ఈ చిత్రంలో రఘుబాబు, పృథ్వీరాజ్, ప్రభావతి కీలక పాత్రలు పోషించారు. ఈ మూవీకి యశ్వంత్ నాగ్ సంగీతం అందించారు.దర్శకుడు శివ వరప్రసాద్ మాట్లాడుతూ..' మా సినిమా ట్రైలర్ రిలీజ్ చేసిన దర్శక దిగ్గజం కోదండరామి రెడ్డికి హృదయ పూర్వక ధన్యవాదములు. రొమాంటిక్ లవ్ సస్పెన్స్ జానర్లో ఈ సినిమాను రూపొందించాం. ఆకాష్–భైరవి జోడీ చాలా బాగా కుదిరింది. కోనసీమ అందాలను తెరపై ఆవిష్కరిస్తూ, మంచి కామెడీతో కూడిన కథను ప్రేక్షకులకు అందిస్తున్నాం. జూన్ 12న సినిమా విడుదల కానుంది” అని తెలిపారు. -
ఈసారి 11 వేల అడుగుల ఎత్తులో.. ట్రైలర్ రిలీజ్
మన దగ్గర దాదాపుగా కమర్షియల్ సినిమాలే ఎక్కువగా వస్తుంటాయి. కానీ హాలీవుడ్లో మాత్రం డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీస్ రిలీజ్ అవుతుంటాయి. అలా నాలుగేళ్ల క్రితం థియేటర్లలో, ఆపై ఓటీటీలోకి వచ్చి ఆకట్టుకున్న చిత్రం 'ఫాల్'. 2000 వేల అడుగుల ఎత్తు ఉన్న ఓ పాడుబడ్డ టవర్‌పై ఇద్దరమ్మాయిలు చిక్కుకుంటే ఏమైందనేది కాన్సెప్ట్. ఇప్పుడు దీనికి సీక్వెల్ కూడా సిద్ధం చేశారు. ట్రైలర్ వదిలారు.(ఇదీ చదవండి: 30 ఏళ్ల నాటి కేసు.. నటి సుకన్యకు రూ.10 లక్షల నష్టపరిహారం)ట్రైలర్ బట్టి చూస్తే ఈసారి 11 వేల అడుగుల ఎత్తులో ఉన్న పర్వతాలపై అడ్వెంచర్ కోసం వెళ్లి ఇద్దరు ఆడపిల్లలు చిక్కుకుపోతారు. తర్వాత ఏమైంది? వీళ్లు బతికి బయటపడ్డారా? లేదా అనేది స్టోరీ అనిపిస్తోంది. తొలి పార్ట్, అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో ఉంది. చూస్తే మాత్రం నరాలు తెగే ఉత్కంఠతో భయపడిపోతారు. మరి ఈ ఏడాది థియేటర్లలో రిలీజయ్యే సీక్వెల్ ఎలా ఉండబోతుందో చూడాలి?(ఇదీ చదవండి: టీవీకే పార్టీలోకి హీరో రాఘవ లారెన్స్? పోస్టుతో క్లారిటీ) -
తెలుగు ప్రేక్షకులంటే అందరికీ చులకనే!
టికెట్ కొని వెళ్లే ప్రేక్షకులంటే హీరోలు, దర్శకనిర్మాతలకు కనీస గౌరవం ఉండాలి. కానీ గత కొన్నాళ్లుగా చూస్తే మాత్రం అది చాలా తగ్గిపోయినట్లు కనిపిస్తోంది. లేటెస్ట్గా 'బాలన్' ట్రైలరే దీనికి మరో ఉదాహరణ. 'మంజుమ్మల్ బాయ్స్' దర్శకుడు తీసిన కొత్త మూవీ ఇది. తెలుగులోనూ రిలీజ్ చేస్తున్నారు కానీ టాలీవుడ్ ఆడియెన్స్ అంటే ఏం చూపించినా చూస్తారులే అని డబ్బింగ్ వింటేనే అర్థమవుతోంది.(ఇదీ చదవండి: సీఎం విజయ్ అలా చేయడం కరెక్ట్ కాదు)మంజుమ్మల్ బాయ్స్ సినిమా తీసిన దర్శకుడు.. జన నాయగణ్, టాక్సిక్ మూవీస్ తీసిన కేవీఎన్ ప్రొడక్షన్స్ దీన్ని నిర్మించింది. విజువల్స్, స్టోరీ బాగున్నాయి. కానీ తెలుగు డబ్బింగే దారుణంగా చేశారు. గూగుల్ ట్రాన్స్లేటర్లో కాపీ చేసి డబ్బింగ్ చేశారా అనే సందేహం కలుగుతోంది. ట్రైలర్‌లోని కంటెంట్ ఆసక్తిగా అనిపించినప్పటికీ.. తెలుగు డబ్బింగ్ ఆ ఆసక్తిని మొత్తం తగ్గించేసినట్లు అనిపించింది.వచ్చే శుక్రవారం(జూన్ 19) తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీలో రిలీజ్ కానున్న ఈ చిత్రాన్ని తెలుగులో అన్నపూర్ణ సంస్థ డిస్ట్రిబ్యూషన్ చేస్తోంది. మూవీ రిలీజ్ నాటికైనా డబ్బింగ్ విషయంలో మార్పులు చేర్పులు చేస్తే సరేసరి. లేదంటే మాత్రం విమర్శలు తప్పవు. ఇదే కాదు టైటిల్ కూడా 'బాలన్' అని ఉన్నది ఉన్నట్లు పెట్టేశారు.ట్రైలర్ బట్టి చూస్తే.. సర్వైవల్ సస్పెన్స్ థ్రిల్లర్ కథతో ఈ సినిమా తీసినట్లు తెలుస్తోంది. మానసిక స్థితి సరిగ్గా లేని ఒక తల్లి.. ఆ తల్లి ఏం చేస్తుందో తెలియని ఒక పిల్లాడు. అనుకోకుండా ఆ పిల్లాడు కనిపించకుండాపోవడం.. అతడి కోసం పోలీసులు వెతకడం.. చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీలా అనిపిస్తుంది.(ఇదీ చదవండి: రజనీకాంత్ సినిమా.. ఇంకెంతమంది మారతారో ఏంటో?) -
ఓటీటీలో మలయాళ క్రైమ్ థ్రిల్లర్.. ట్రైలర్ రిలీజ్
ఓటీటీల్లోకి వచ్చే మలయాళ థ్రిల్లర్ సినిమాలకు ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. థియేటర్లలో పెద్దగా హిట్ కాకపోయినా ఓటీటీల్లో అదరగొట్టేస్తుంటాయి. తాజాగా మరో మలయాళ పోలీస్ థ్రిల్లర్ చిత్రం ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. దృశ్యం చిత్రాల దర్శకుడు జీతూ జోసెఫ్ సమర్పణలో మార్టిన్ జోసెఫ్ దర్శకత్వం వహించిన సినిమా 'ధృడం'. ఈ మూవీ జూన్ 12 నుంచే ఓటీటీలో సందడి చేయనుంది.ఈ నేపథ్యంలోనే ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. మే 8న థియేటర్లలో రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా రాణించలేకపోయింది. ఈ మూవీలో యంగ్ హీరో షేన్ నిగమ్ కీలక పాత్ర పోషించారు. ఈ సినిమా ఓటీటీలో మలయాళం, తెలుగుతో పాటు కన్నడ, తమిళం, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. ఇంకెందుకు ఆలస్యం ట్రైలర్ చూసేయండి.ఈ సినిమా కథ విషయానికొస్తే.. ఎస్సై విజయ్ (షేన్ నిగమ్) కొత్తగా ఓ ఊరికి పోస్టింగ్ మీద వస్తాడు. చేరిన రెండో రోజే ఓ హత్య, మూడోరోజు ఓ ఫైనాన్స్ కంపెనీలో దొంగతనం, తర్వాత ఓ బ్లాక్మెయిల్ కేసు, తర్వాత మరికొన్ని హత్యలు.. ఇలా వరస కేసులు వస్తూనే ఉంటాయి. వీటని పరిష్కరించడం కోసం విజయ్ ఏం చేశాడు? అసలు ఇన్ని కేసులు ఎందుకు పెండింగ్‌లో ఉన్నాయి? కొత్తగా జాయిన్ అయిన విజయ్.. వీటిని ఎలా హ్యాండిల్ చేశాడు? ఇవన్నీ చేసిన తర్వాత విజయ్ కనుక్కొన్న అసలు రహస్యం ఏంటి? అనేది మిగతా స్టోరీ. -
నర్సుగా కంగనా రనౌత్.. భారత్ భాగ్య విధాత ట్రైలర్ చూశారా?
బాలీవుడ్ లేడీ స్టార్ కంగనా రనౌత్ నటిస్తోన్న లేటేస్ట్ మూవీ భారత్ భాగ్య విధాత(ది అన్‌సీన్ హీరోస్). ఈ సినిమాకు మనోజ్ తపాడియా దర్శకత్వం వహించారు. ఈ మూవీని మణికర్ణిక ఫిల్మ్స్, పరమాన్స్ క్రియేషన్స్, యునోయా ఫిల్మ్స్, ఫ్లోటింగ్ రాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా రిలీజ్‌కు సిద్ధమైంది.ఈ నేపథ్యంలో భారత్ భాగ్య విధాత ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ట్రైలర్ చూస్తుంటే ఈ కథ నర్సుల జీవితం ఆధారంగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో కంగనా నర్సు పాత్రలో కనిపించనుంది. 26/11 టెర్రరిస్ట్ ఎటాక్ జరిగిన సమయంలో నర్సుల పోరాటం గురించే ఈ మూవీలో చూపించనున్నట్లు ట్రైలర్లోనే అర్థమవుతోంది. కాగా.. ఈ చిత్రంలో గిరిజా ఓక్ గాడ్బోలే, స్మితా తాంబే, సుహిత తట్టే, ఆశా షెలార్, ప్రియా బెర్డే, ఈషా డే, రసిక అఘాసే, అమృత నామ్‌దేవ్, ఆదిత్య మిశ్రా, జాహిద్ ఖాన్ కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమా జూన్ 12న థియేటర్లలో సందడి చేయనుంది. -
ఓటీటీలోకి ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్.. ట్రైలర్ రిలీజ్
థ్రిల్లర్స్ అనగానే చాలామందికి ఓటీటీలే గుర్తొస్తాయి. ఎందుకంటే రెగ్యులర్ కమర్షియల్ సినిమాలన్నీ థియేటర్లలో రిలీజ్ అవుతాయి. క్రైమ్ థ్రిల్లర్, మర్డర్ మిస్టరీ థ్రిల్లర్, ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ అని రకరకాల మూవీస్, వెబ్ సిరీసులు స్ట్రీమింగ్‌లోకి వచ్చేస్తుంటాయి. ఇప్పుడు అలానే 'పాతాళ్ లోక్' మేకర్స్ నుంచి మరో థ్రిల్లర్ సిరీస్ రెడీ అయింది. ఈ క్రమంలోనే ట్రైలర్ రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: పెళ్లి తర్వాత జాక్‌పాట్ కొట్టిన రష్మిక!)'రాఖ్' పేరుతో తీసిన ఈ సిరీస్‌లో అలీ ఫజల్, సోనాలి బింద్రే, రాకేశ్ బేడీ తదితరులు ప్రధాన పాత్రలు చేశారు. వచ్చే శుక్రవారం(జూన్ 12) నుంచి అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో హిందీతో పాటు దక్షిణాది భాషల్లోనూ ఇది స్ట్రీమింగ్ కానుంది. తాజాగా రిలీజైన ట్రైలర్ బట్టి చూస్తే ఆర్మీ అధికారికి చెందిన కొడుకు, కూతురు కనిపించకుండా పోతారు. వీళ్లని ఎవరో హత్య చేసేస్తారు. తర్వాత ఇదే క్రమంలోనే ఢిల్లీలో వరస హత్యలు జరుగుతాయి. ఇంతకీ వీటిని చేస్తుంది ఎవరు? పోలీసులు హంతకుల్ని పట్టుకున్నారా? లేదా అనేది స్టోరీలా అనిపిస్తుంది.ఒకప్పటి టాలీవుడ్ హీరోయిన్ సోనాలి బింద్రే ఇందులో తల్లి పాత్ర చేసింది. 'ధురంధర్' ఫేమ్ రాకేశ్ బేడీ కూడా కీలక పాత్ర చేశారు. మరి ఈ సిరీస్ ఓటీటీ ప్రేక్షకుల్ని ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి?(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 19 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్) -
మూడోసారి సేవ్ ది టైగర్స్.. ట్రైలర్‌తోనే నవ్వులే నవ్వులు..!
మగాళ్ల బాధలను కామెడీ కోణంలో ప్రేక్షకులకు రుచి చూపించిన వెబ్ సిరీస్ సేవ్ ది టైగర్స్. ఇప్పటికే రిలీజైన రెండు సీజన్స్ తెలుగు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాయి. ఇందులో పెళ్లి చేసుకున్న ప్రతి మగాడి పరిస్థితిని కళ్లకు అద్దం కట్టినట్లు చూపించారు. దీంతో ఈ కామెడీ సిరీస్ సూపర్ హిట్‌గా నిలిచింది. రెండు సీజన్స్ సినీ ప్రియులను మస్తు ఎంటర్టైన్ చేశాయి.ఇప్పుడు మూడో సీజన్ కూడా సరికొత్తగా మీ ముందుకొస్తోంది. తాజాగా ఈ సేవ్ ది టైగర్స్-3 ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇక ట్రైలర్ చూస్తుంటే నవ్వుల వర్షం కురుస్తోంది. ఎవడ్రా చెప్పింది ‘పెళ్లంటే పండు వెన్నెల.. పెళ్లామంటే నిండు పున్నమి అనే అభినవ్ గోమఠం డైలాగ్ తెగ నవ్వులు తెప్పిస్తోంది. ఈ కామెడీ వెబ్ సిరీస్ జూన్‌లోనే జియోహాట్‌స్టార్‌లో సందడి చేయనుంది.అభినవ్ గోమఠం. ప్రియదర్శి, చైతన్యకృష్ణ పండించిన కామెడీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సిరీస్ ముచ్చటగా మూడోసారి ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించనుంది. ఈ వెబ్ సిరీస్ జూన్ 19 నుంచే ఓటీటీలో అందుబాటులోకి రానుంది. ఈ సిరీస్‌లో జోర్దార్ సుజాత, పావని గంగిరెడ్డి, దేవియాని శర్మ, వెన్నెల కిషోర్, రోహిణి, హర్షవర్ధన్, శ్రీకాంత్ అయ్యంగార్, గుండు సుదర్శన్, మిర్చి కిరణ్, అభయ్ బేతిగంటి, ముక్కు అవినాష్ కీలక పాత్రల్లో నటించారు. మరి ఇంకెందుకు ఆలస్యం సీజన్-3 ట్రైలర్ చూసేయండి. -
వయసు తేడా ఏడాది.. తల్లీకొడుకుగా చేసిన హీరోహీరోయిన్
రీసెంట్ టైంలో విడాకుల విషయంతో వార్తల్లో నిలిచిన బాలీవుడ్ నటి మౌనీరాయ్.. ఇప్పుడు ఎవరూ ఊహించని పాత్రలో నటించింది. బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్‌కి తల్లిగా చేసింది. వచ్చే నెల 5వ తేదీన ఈ మూవీ థియేటర్లలోకి రానుండగా తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇందులో ట్రెండింగ్ బ్యూటీస్ మృణాల్ ఠాకుర్, పూజా హెగ్డే హీరోయిన్లు కావడం విశేషం.(ఇదీ చదవండి: ఓటీటీలోకి ధనుష్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా.. అధికారిక ప్రకటన)వరుణ్ ధావన్, మృణాల్ ఠాకుర్, పూజా హెగ్డే హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా 'హై జవానీ తో ఇష్క్ హోనా హై'. డేవిడ్ ధావన్ దర్శకుడు. వదిలిన ట్రైలర్ బట్టి చూస్తే హీరో.. ఒకరికి తెలియకుండా మరొకరిని ప్రేమిస్తాడు. పెళ్లికి ముందే వాళ్లిద్దరినీ గర్భవతుల్ని కూడా చేస్తాడు. మరి వీళ్లిద్దరిలో ఎవరిని పెళ్లి చేసుకున్నాడు? సదరు అమ్మాయిలు ఒకరికి ఒకరు ఎదురుపడ్డారా? లేదా? అనే కన్ఫ్యూజన్ కామెడీనే స్టోరీ అని తెలుస్తోంది.ఈ మూవీలోనే వరుణ్ ధావన్ పాత్రకు అద్దె తల్లిగా మౌనీరాయ్ కనిపించనుంది. నిజజీవితంలో వీళ్లిద్దరికీ వయసు వ్యత్యాసం ఏడాదే. కానీ తల్లికొడుకులుగా నటించడం విశేషం. ఇకపోతే ఈ మూవీ టైపు స్టోరీలు హిందీలో ఇదివరకే బోలెడన్ని వచ్చాయి. మరి ఈ చిత్రం ఏ మేరకు వర్కౌట్ అవుతుందనేది చూడాలి? జూన్ 5న రిలీజ్ పెట్టుకున్నారు. అయితే దీని కంటే ఒకరోజు ముందు 'పెద్ది' వస్తోంది.(ఇదీ చదవండి: బికినీ ఫొటోలపై క్లారిటీ ఇచ్చిన రుక్మిణి వసంత్) -
చూపులేని హీరోయిన్.. నడవలేని హీరో
ఈ మధ్యకాలంలో ప్రేక్షకులు భారీ యాక్షన్, హంగామా కంటే మనసుకు దగ్గరయ్యే కథలకే ఎక్కువగా కనెక్ట్ అవుతున్నారు. ముఖ్యంగా ఫ్యామిలీతో కలిసి చూసేలా ఉండే క్లీన్ ఎమోషనల్ ఎంటర్టైనర్స్ కోసం ఆడియన్స్ ఎదురుచూస్తున్నారు. అలాంటి ఓ మూవీ 'రమణీ కళ్యాణం'. ఇప్పటికే టీజర్, టైటిల్ సాంగ్‌తో ఆకట్టుకోగా ఇప్పుడు ట్రైలర్ రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: ఆస్పత్రిలో అమితాబ్? మౌనంగా ఉంటే ఇలాగే రెచ్చిపోతారు!)కోల్పోయిన ప్రతి వారి దగ్గర ఒక కథ ఉంటుంది అనే డైలాగ్‌తో ట్రైలర్ మొదలైంది. సంజన ఆర్జే & సింగర్. తనకి చుపులేదు. మరోవైపు నడవలేని స్థితిలో ఉంటాడు రాజ్. ఈ రెండు పాత్రల మధ్య ప్రేమ ఎలా పుట్టింది? చివరకు ఏమైందనేదే కాన్సెప్ట్. విజయ్ ఆదిరెడ్డి దర్శకత్వం వహించారు. సూర్య వశిష్ట, దీప్షిక చంద్రన్ హీరోహీరోయిన్లుగా నటించారు. 'కోర్ట్' ఫేం రామ్ జగదీష్ డైలాగ్స్ రాశారు. మే 22న అంటే ఈ శుక్రవారమే సినిమా థియేటర్లలోకి రానుంది.(ఇదీ చదవండి: జూ.ఎన్టీఆర్ ఆస్తి ఎంత? ఖరీదైన కార్ల కలెక్షన్ ఏంటి?) -
పెద్ది ట్రైలర్ ఈవెంట్ లో రామ్ చరణ్ అనుభవం
-
'పెద్ది'పైనే టాలీవుడ్ భారమంతా!
రామ్ చరణ్ 'పెద్ది' సినిమా మరికొన్నిరోజుల్లో థియేటర్లలోకి రానుంది. తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు. రెగ్యులర్ కమర్షియల్ అంశాలతో పాటే సమ్‌థింగ్ డిఫరెంట్‌గానూ అనిపించింది. 'గేమ్ ఛేంజర్' డిజాస్టర్ దెబ్బకు డీలా పడిపోయిన మెగా ఫ్యాన్స్.. ఇది ఎలాగైనా సరే హిట్ అవ్వాలని కోరుకుంటున్నారు. వీళ్లే కాదు టాలీవుడ్ కూడా అదే అనుకుంటోంది. మొత్తం భారమంతా ఈ మూవీపైనే ఉంది. ఎందుకంటే పరిస్థితి అలా ఉంది మరి!(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చిన తెలుగు సినిమాలు)ఈ ఏడాది సంక్రాంతిని టాలీవుడ్ గ్రాండ్‌గా మొదలుపెట్టింది. చిరంజీవి సినిమాకు రూ.300 కోట్లు వచ్చాయని అందరూ సంబరపడ్డారు. కానీ ఈ ఆనందం ఎన్నిరోజులు నిలబడలేదు. తర్వాత నుంచి ఇప్పటివరకు నాలుగు నెలలు గడిచాయి. ఒక్కటంటే ఒక్క మూవీ కూడా సరైన స్థాయిలో ఆడలేదు. ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే నెలలో వచ్చిన చిత్రాలు భారీగా నిరాశపరిచాయి. దీంతో ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు పెట్టుబడులన్నీ నష్టపోయి చాలా ఇబ్బంది పడుతున్నారు. ఓ రకంగా చెప్పాలంటే ఈ ఏడాది వేసవి సీజన్.. టాలీవుడ్ చరిత్రలోనే అత్యంత దారుణమైనదని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.సరిగ్గా ఇలాంటి టైంలో అంటే జూన్ 4న 'పెద్ది' థియేటర్లలోకి వస్తోంది. దీంతో టాలీవుడ్ ఆశలన్నీ దీనిపైనే పెట్టుకుంది. ఇది హిట్ అవ్వడం చిత్రబృందానికే కాదు తెలుగు సినీ పరిశ్రమకు కూడా చాలా కీలకం. ఎందుకంటే థియేటర్లు గతకొన్నాళ్లుగా బోసిపోయాయి. ప్రేక్షకులు కూడా సరైన మూవీ ఎప్పుడొస్తుందా అని ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. అందుకు తగ్గట్లే ఈ మూవీ..బాక్సాఫీస్ దగ్గర సూపర్ స్ట్రాంగ్ ఓపెనింగ్స్ సాధిస్తుందని ట్రేడ్ వర్గాలు అనుకుంటున్నాయి. పాజిటివ్ టాక్ వస్తే చాలు ప్రేక్షకులు థియేటర్లకు వచ్చే అవకాశమైతే కనిపిస్తోంది. మరి 'పెద్ది' ఏం చేస్తాడనేది చూడాలి?ట్రైలర్ బట్టి చూస్తే బెల్లం ఫ్యాక్టరీలో పనిచేసే పెద్ది అనే ఓ పల్లెటూరి కుర్రాడు.. క్రికెట్, కుస్తీ, రన్నింగ్‌లో ఆటకూలీగా ఎలాంటి ప్రతిభ చూపించాడు. ఈ ప్రయాణంలో ఎలాంటి సవాళ్లు ఎదుర్కొన్నాడనేదే కాన్సెప్ట్‌లా అనిపిస్తుంది. మూవీ ఎలా ఉండబోతుందో చూపించారు గానీ స్టోరీ గురించి మాత్రం పెద్దగా హింట్ ఇవ్వలేదు. 'పెద్ది గాడు గుడిలో దేవుడు కాదు గ్రౌండ్లో దేవుడు సారు' లాంటి డైలాగ్స్ బాగానే అనిపించాయి. స్పోర్ట్స్ డ్రామాగా తీసిన ఈ చిత్రానికి బుచ్చిబాబు దర్శకుడు. జాన్వీ కపూర్ హీరోయిన్ కాగా శివరాజ్ కుమార్ కీలక పాత్ర చేశారు. ఏఆర్ రెహమాన్ సంగీతమందించాడు.ఇదీ చదవండి: 'బూతు'ని కంట్రోల్ చేసుకోలేకపోయిన రష్మిక -
రామ్ చరణ్ 'పెద్ది' ట్రైలర్ రిలీజ్
మెగా హీరో రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ సినిమా 'పెద్ది'. లెక్క ప్రకారం మార్చిలోనే రావాలి కానీ రెండుసార్లు వాయిదా పడింది. ఎట్టకేలకు వచ్చే నెల 4న థియేటర్లలోకి వచ్చేస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా ముంబైలో ట్రైలర్ లాంచ్ చేశారు. ఇది ఆకట్టుకునేలా ఉంటూ మూవీపై అంచనాలని పెంచేస్తోంది.(ఇదీ చదవండి: 'బూతు'ని కంట్రోల్ చేసుకోలేకపోయిన రష్మిక)బెల్లం ఫ్యాక్టరీలో పనిచేసే పెద్ది అనే పనోడు.. క్రికెట్, కుస్తీలో ఎలాంటి ప్రతిభ చూపించాడు. జీవితంలో ఇతడికి ఎదురైన సవాళ్లు ఏంటనేది కాన్సెప్ట్. చరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్ కాగా కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ కీలక పాత్ర చేశారు. జగపతిబాబు, దివ్యేందు తదితరులు ఇతర పాత్రలు పోషించారు. బుచ్చిబాబు దర్శకుడు. ఏఆర్ రెహమాన్ సంగీతమందించాడు. ఇప్పటికే వచ్చిన రెండు పాటలు హిట్ అయ్యాయి. ఇప్పుడు ట్రైలర్ కూడా ఆ జోష్ని కొనసాగించేలానే ఉంది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చిన తెలుగు సినిమాలు) -
'ఎంత పని చేశావయ్యా?'.. పెద్ది డైలాగ్ లీక్ చేసిన మెగాస్టార్..!
మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్ హీరోగా వస్తోన్న చిత్రం పెద్ది. ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే రెండుసార్లు వాయిదా పడిన ఈ చిత్రం.. ఎట్టకేలకు జూన్ 4వ తేదీన థియేటర్లలో సందడి చేయనుంది. ఈ నేపథ్యంలో ట్రైలర్ కోసం చరణ్ ఫ్యాన్స్ ఆతృతగా ఉన్నారు. ఈ మూవీ ట్రైలర్ జూన్ 18న రిలీజ్ కానుంది.అయితే ట్రైలర్ రిలీజ్‌కు ముందే మెగాస్టార్ ట్రైలర్ వీక్షించారు. మూడు నిమిషాల పాటు ఉన్న ట్రైలర్ అద్భుతంగా ఉందని కొనియాడారు. ఫుల్ ఫైర్‌పవర్ ప్యాక్డ్ ట్రైలర్ అని ప్రశంసలు కురిపించారు. చరణ్… బుచ్చి… రెహమాన్… ఇలా ఒక్కొక్కరు తమ బెస్ట్ ఫర్మామెన్స్ ఇచ్చారు… కలిసి మాత్రం రఫ్ఫాడించేశారు. ఎంత ఊహించుకున్నా… దాన్ని మించి ఉంటుంది ఈ ట్రైలర్.. ఎమోషన్.. ఎలివేషన్.. మ్యాడ్నెస్ అన్ని నెక్ట్స్ లెవెల్లో ఉన్నాయన్నారు. అన్నట్టు… చాలా రోజులయ్యింది మీకు చిరు లీక్స్ ఇచ్చి.."మీరందరూ నేను ఆడానని అనుకుంటున్నారు... నేను పోరాడాను సారు..." అంటూ పెద్ది డైలాగ్ లీక్ చేశారు. నన్ను క్షమించు బుచ్చి బాబు… చూసాక కంట్రోల్ తప్పాను అంటూ చిరు ట్వీట్ చేశారు. #PeddiTrailer చూసాను!! 🔥Just… WOW 🤗🤗🤗3 నిమిషాలు…PURE FIREPOWER PACKED TRAILER!! ✨చరణ్… బుచ్చి… రెహమాన్…ఒక్కొక్కరు తమ బెస్ట్ ఇచ్చారు… కలిసి మాత్రం రఫ్ఫాడించేశారు! 🫡ఎంత ఊహించుకున్నా… దాన్ని మించి ఉంటుంది ఈ ట్రైలర్.Emotion… Elevation… Madness… అన్నీ next…— Chiranjeevi Konidela (@KChiruTweets) May 16, 2026 -
హీరోగా స్టార్ డైరెక్టర్.. ట్రైలర్ రిలీజ్
ఖైదీ, విక్రమ్ చిత్రాలతో టాలీవుడ్‌లోనూ క్రేజ్ దక్కించుకున్న డైరెక్టర్ తమిళ దర్శకుడు లోకేశ్ కనగరాజ్. ప్రస్తుతం దర్శకుడు హీరోగా ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఆయన హీరోగా వస్తోన్న లేటేస్ట్ మూవీ డీసీ. ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ వామికా గబ్బీ హీరోయిన్గా కనిపించనుంది.ఈ సినిమాకు అరుణ్ మాతీశ్వరన్ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ చిత్రంలో చంద్ర (వామికా గబ్బీ) అనే యువతికి సపోర్ట్‌గా నిలిచే దేవదాస్‌గా లోకేశ్ కనగరాజ్ కనిపించనున్నారు. ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతమందిస్తున్నారు. -
ఓటీటీలో కోర్ట్ రూమ్ థ్రిల్లర్ సినిమా.. ట్రైలర్ రిలీజ్
ఒకప్పుడు తెలుగు, తమిళంలో హీరోయిన్గా సినిమాలు చేసిన జ్యోతిక.. రీసెంట్ టైంలో బాలీవుడ్‌పై దృష్టి పెట్టింది. హిందీలోనూ అడపాదడపా మూవీస్ చేస్తోంది. ఈమె నటించిన కోర్ట్ రూమ్ థ్రిల్లర్ చిత్రం ఇప్పుడు నేరుగా ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలోనే తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 14 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్)'సిస్టమ్' పేరుతో తీసిన సినిమాలో జ్యోతిక, సోనాక్షి సిన్హా, అశుతోష్ గోవారికర్ ప్రధాన పాత్రలు పోషించారు. అశ్విని తివారీ దర్శకురాలు. అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో వచ్చే శుక్రవారం(మే 22) నుంచి స్ట్రీమింగ్ కానుంది. హిందీతో పాటు తెలగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లోనూ అందుబాటులోకి రానుంది.రిలీజ్ చేసిన ట్రైలర్ బట్టి చూస్తే కోర్టులో న్యాయవాదిగా పనిచేసే లాయర్ సోనాక్షి.. న్యాయాన్ని గెలిపించకుండా డబ్బులు తీసుకుని కేసుల్ని తారుమారు చేసే పనిచేస్తుంటుంది. దీనికి జ్యోతిక కూడా సహకరిస్తూ ఉంటుంది. అలాంటి వీళ్ల జీవితాల్లో తర్వాత ఎలాంటి మార్పులు చోటుచేసుకున్నాయి. వ్యవస్థ ఏం చేసింది? అనేదే మిగతా స్టోరీలా అనిపిస్తుంది. (ఇదీ చదవండి: ప్రభాస్ రీల్ మదర్.. ఒకప్పటి హీరోయిన్.. చాక్లెట్ ఫ్యాక్టరీ ఓనర్) -
'తెలుగోళ్ల దేవుడైతే క్షమాపణ అడగొచ్చు'.. వీరభద్రుడు ట్రైలర్ చూశారా?
కోలీవుడ్ స్టార్ సూర్య హీరోగా వస్తోన్న లేటేస్ట్ మూవీ కరుప్పు. ఈ మూవీ రిలీజ్‌కు అంతా సిద్ధమైంది. తెలుగులోనూ ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు. వీరభద్రుడు పేరుతో ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇప్పటికే తమిళ ట్రైలర్ రిలీజ్ చేసిన మేకర్స్.. తాజాగా తెలుగు ట్రైలర్ కూడా విడుదల చేశారు. కంగువ', 'రెట్రో' డిజాస్టర్స్ తర్వాత వస్తోన్న మూవీ కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ట్రైలర్ చూస్తుంటే లాయర్, కోర్టు నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా మన న్యాయవ్యవస్థలో ఉన్న లోపాలను చూపించే లక్ష్యంగా ఈ కథ ఉండనుందని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. ఈ సినిమాలో త్రిష న్యాయవాదిగా కనిపించనుంది. 'దేవుడే దిగొచ్చినా కోర్ట్ ప్రోసీజర్ని మార్చలేడా? వచ్చాను కదరా.. పిచ్చకొట్టుడు కొడతా' అనే డైలాగ్ సూర్య ఫ్యాన్స్‌ను తెగ ఆకట్టుకుంటోంది. 'అయ్యో వచ్చింది తెలుగోళ్ల దేవుడైతే క్షమాపణ అడగొచ్చు.. కానీ వచ్చింది భద్రుడు.. వీరభద్రుడు.. ముక్కలు ముక్కలు చేసి కుక్కలకు పడేస్తాడు' అనే డైలాగ్స్ చూస్తే ఫుల్ యాక్షన్ ఉండనుందని తెలుస్తోంది. ఈ సినిమాకు దర్శకత్వం వహించిన ఆర్జే బాలాజీనే విలన్‌గా పాత్రలో కనిపించనున్నారు. -
వెయిటింగ్ ఈజ్ ఓవర్.. పెద్ది ట్రైలర్ రిలీజ్ ఎప్పుడంటే?
రామ్ చరణ్ హీరోగా వస్తోన్న రూరల్ స్పోర్ట్స్ డ్రామా పెద్ది. ఈ మూవీ కోసం మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాకు ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సనా దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ డేట్ ప్రకటించిన మేకర్స్ ప్రమోషన్స్‌తో బిజీ అయిపోయారు. ఈ నేపథ్యంలోనే ట్రైలర్ రిలీజ్ డేట్‌ను ప్రకటించారు.ఈనెల 18న పెద్ది మూవీ ట్రైలర్ రిలీజ్ చేయనున్నట్లు వెల్లడించారు. ఈ విషయాన్ని దర్శకుడు బుచ్చిబాబు సనా ప్రకటించారు. ఈ మేరకు పెద్ది మూవీ పోస్టర్‌ను పంచుకున్నారు. దీంతో మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఈ బిగ్ ఈవెంట్ ఎక్కడనేది అనేది మాత్రం వెల్లడించలేదు. ఈ సారి పుష్ప-2 తరహాలో నార్త్‌లో ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. త్వరలోనే వేదికపై కూడా క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. ఈ చిత్రంలో చెర్రీ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీకపూర్ హీరోయిన్గా కనిపించనుంది. ఈ మూవీ జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది.#PEDDI will stay in your hearts❤️TRAILER From 18th May💥💥#PEDDI WORLDWIDE RELEASE IN CINEMAS ON JUNE 4th, with PREMIERES on JUNE 3rd Mega Power Star @AlwaysRamCharan @NimmaShivanna #JanhviKapoor @BuchiBabuSana @arrahman @RathnaveluDop @artkolla @NavinNooli @bomanirani… pic.twitter.com/4Ub5AiwEGH— BuchiBabuSana (@BuchiBabuSana) May 11, 2026 -
రామ్ చరణ్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. 'పెద్ది' ట్రైలర్ ఈవెంట్ డేట్ ఫిక్స్?
-
'అరేయ్ ఆపండ్రా' ట్రైలర్ రిలీజ్
అశోక్ నిమ్మల నిర్మించిన కామెడీ థ్రిల్లర్ సినిమా 'అరేయ్ ఆపండ్రా'. తల్లాడ సాయి కృష్ణ లీడ్ రోల్ చేయడంతో పాటు దర్శకత్వం వహించాడు. ఈ సినిమా ట్రైలర్, పోస్టర్ని తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తాజాగా విడుదల చేశారు.సుదర్శన్, భద్రం, తల్లాడ సాయి కృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీ ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేసుకుంది. ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ గణేష్ భారీ ద్వారా మే 15న థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం తమ ఆనందాన్ని పంచుకుంది.ఈ సమ్మర్లో అందరికీ మంచి కూల్ సినిమా ఇది అవుతుందని ఆశిస్తున్నాను. నవ్విస్తూనే భయపెట్టే డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇచ్చే సస్పెన్స్, కామెడీ థ్రిల్లర్ ఇది. సెన్సార్ సభ్యులు కూడా సినిమాని చూసి ప్రత్యేకంగా మెచ్చుకున్నారని నటుడు-దర్శకుడు సాయికృష్ణ చెప్పుకొచ్చాడు. -
దేవుడు-లాయర్‌గా సూర్య.. కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్
తమిళ హీరో సూర్య హిట్ కొట్టి చాలాకాలమైపోయింది. గత రెండు చిత్రాలు 'కంగువ', 'రెట్రో' అయితే ఘోరమైన డిజాస్టర్స్ అయ్యాయి. వాటితో కాస్త భిన్నంగా చేద్దామని ప్రయత్నించాడు. కానీ వర్కౌట్ కాకపోయేసరికి మళ్లీ కమర్షియల్ రూట్లోకి వచ్చేశాడు. అలా చేసిన సినిమానే 'కరుప్పు'. తెలుగులో 'వీరభద్రుడు' పేరుతో ఈ గురువారం(మే 14) థియేటర్లలోకి తీసుకొస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా తమిళ ట్రైలర్ రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: బర్త్ డే గిఫ్ట్.. కొత్త ఇంట్లోకి యాంకర్ శ్రీముఖి)ట్రైలర్లోనే దాదాపు స్టోరీ ఏంటనేది చెప్పేసే ప్రయత్నం చేశారు. ఓ కోర్టు. అందులో విలన్(ఆర్జే బాలాజీ), హీరోయిన్(త్రిష) లాయర్స్‌గా పనిచేస్తుంటారు. న్యాయం అంటూ ఎవరొచ్చినా సరే తిప్పించుకుంటూ ఉంటారు. దీంతో దేవుడు అయిన హీరో(సూర్య) లాయర్‌గా వస్తాడు. అటు సామాన్యులకు న్యాయం చేయడంతో పాటు విలన్ బెండు ఎలా తీశాడనేది కథలా అనిపిస్తుంది.సూర్య, త్రిష హీరోహీరోయిన్లు కాగా.. దర్శకత్వం వహించిన ఆర్జే బాలాజీనే విలన్‌గానూ చేశాడు. సాయి అభ్యంకర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఆకట్టుకుంది. ప్రస్తుతానికైతే తమిళ ట్రైలర్ రిలీజ్ చేశారు. రేపో ఎల్లుండో తెలుగు ట్రైలర్ కూడా వదులుతారు. తమిళనాడు ఎన్నికల ఫలితాలు, హీరో విజయ్.. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం తదితర విషయాల వల్ల సూర్య సినిమాపై కనీస బజ్ లేకుండా పోయింది. మరి ఇదైనా సూర్యకు సక్సెస్ ఇస్తుందో లేదో చూడాలి?(ఇదీ చదవండి: విషాదం.. అషురెడ్డి ఎమోషనల్ పోస్ట్) -
'దృశ్యం 3' ట్రైలర్ రిలీజ్.. ఈసారి థ్రిల్‌తో పాటు
మోహన్ లాల్‌ని ఇప్పటి జనరేషన్‌కి బాగా దగ్గర చేసిన సినిమా 'దృశ్యం'. ఈ ఫ్రాంచైజీలో ఇప్పటికే రెండు భాగాలు వచ్చాయి. సూపర్ హిట్ అయ్యాయి. ఇప్పుడు లాంగ్ గ్యాప్ తర్వాత మూడో భాగాన్ని రిలీజ్ చేస్తున్నారు. ఈ నెల 21నే మూవీ ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇది ఆకట్టుకునేలా ఉంది.(ఇదీ చదవండి: విజయ్-త్రిష పెళ్లి చేసుకుంటే చూడాలని ఉంది: నటి)తొలి రెండు భాగాల్లోనూ పోలీసులకు దొరకకుండా తప్పించుకున్న జార్జ్ కుట్టి & ఫ్యామిలీ.. ఈసారి ఎలాంటి ఝలక్స్ ఇవ్వబోతుందనేది చూడాలి. తొలి రెండు భాగాల్లో థ్రిల్ ఎలిమెంట్స్ ఎక్కువ ఉండగా.. ఈసారి మాత్రం థ్రిల్‌తో పాటు డ్రామా ఉండనుందని తెలుస్తోంది. ఈసారి ఇద్దరు జర్నలిస్టుల వల్ల జార్జ్ కుట్టి కేసుని పోలీసులు మళ్లీ ఓపెన్ చేయడం లాంటి సీన్స్ ట్రైలర్లో చూపించారు. ఈసారైనా వరుణ్ శవం దొరుకుతుందా లేదా అనేది చూడాలి.ఈ ఫ్రాంచైజీలో ఇదే చివరి సినిమా. జీతూ జోసెఫ్ దర్శకుడు కాగా మోహన్ లాల్ సరసన మీనా చేసింది. తొలి రెండు భాగాల్ని తెలుగులో వెంకటేశ్‌తో రీమేక్ చేశారు. కానీ మూడో భాగాన్ని చేస్తారా లేదా అనేది క్లారిటీ ఇవ్వలేదు. తెలుగు డబ్బింగ్ ఏమైనా రిలీజ్ చేస్తారా అనేది చూడాలి? హిందీలో మాత్రం అజయ్ దేవగణ్ వేరే కథతో 'దృశ్యం 3' తీస్తున్నాడు. ఈ ఏడాదిలోనే దాని రిలీజ్ ఉండొచ్చు.(ఇదీ చదవండి: ఓటీటీలో మలయాళ డార్క్ కామెడీ క్రైమ్ థ్రిల్లర్.. తెలుగు రివ్యూ) -
పుష్ప-2 బాటలో పెద్ది.. రన్ టైమ్ అన్ని గంటలా?
రామ్ చరణ్ హీరోగా వస్తోన్న రూరల్ స్పోర్ట్స్ డ్రామా పెద్ది. ఈ మూవీ కోసం మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి కాగా.. జూన్ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీలో చెర్రీ సరసన బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ కనిపించనుంది. త్వరలోనే పెద్ది ట్రైలర్‌ను రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికే రిలీజైన టీజర్ గ్లింప్స్, రామ్ చరణ్ లుక్స్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. శ్రీకాకుళం బ్యాక్‌డ్రాప్‌లో బుచ్చిబాబు సనా ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.తాజాగా ఈ మూవీ రన్‌టైమ్ నెట్టింట చర్చ మొదలైంది. ఈ సినిమా నిడివి దాదాపు 3 గంటల 20 నిమిషాలు ఉండనుందని తెలుస్తోంది. గతంలో రిలీజైన యానిమల్, కల్కి, పుష్ప-2, ఆర్ఆర్ఆర్ సినిమా రన్ టైమ్ కూడా 3 గంటలకు పైగానే ఉంది. ఈ సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచాయి. తాజాగా ఈ రన్ టైమ్ చూస్తుంటే పెద్ది కూడా సూపర్ హిట్ కావడం ఖాయమని సినీ వర్గాల టాక్. అంతేకాకుండాఉత్తరాదిలో ట్రైలర్ రిలీజ్..పెద్ది ట్రైలర్ విషయంలో బుచ్చిబాబు పుష్ప-2 ఫాలో అవుతున్నట్లు తెలుస్తోంది. గతంలో పుష్ప-2 ట్రైలర్‌ను బిహార్‌లోని పాట్నాలో రిలీజ్ చేశారు. దీంతో నార్త్ ఆడియన్స్‌లోనూ ఓ రేంజ్లో వసూళ్లు సాధించింది. ఇప్పుడు అదే బాటలో పెద్ది మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్‌ను ఈ నెల 17న ఇండోర్ లేదా పాట్నాలో విడుదల చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని టాలీవుడ్లో ఇన్సైడ్ టాక్ నడుస్తోంది. దీనిపై త్వరలోనే క్లారిటీ రానుంది. కాగా.. ఇప్పటికే రెండు సార్లు వాయిదా పడిన ఈ చిత్రం జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది. -
స్టార్ హీరో క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్.. ట్రైలర్ రిలీజ్
బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ నటించిన లేటేస్ట్ క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ కర్తవ్య. ఈ సినిమా నేరుగా ఓటీటీలోనే రిలీజ్ కానుంది. ఈ చిత్రానికి పుల్కిత్ దర్శకత్వం వహించారు. ఈ మూవీని రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో షారూఖ్ ఖాన్ సతీమణి గౌరీ ఖాన్ నిర్మించారు. తాజాగా సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్.ఇవాళ ట్రైలర్ చూస్తుంటే క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ మూవీగానే తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఇందులో సైఫ్ నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. ట్రైలర్లో క్రైమ్ సీన్స్ ఈ మూవీపై ఆసక్తి పెంచుతున్నాయి. ఈ చిత్రం మే 15 నుంచి నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమాలో రసిక, సంజయ్, సౌరభ్ కీలక పాత్రల్లో నటించారు. -
ప్రతి నిమిషం ప్రేమించే పోటుగాడు లేడు.. ట్రైలర్ రిలీజ్
సహాయ పాత్రలు చేసి గుర్తింపు పొందిన నందు.. ఈ మధ్య కాలంలో లీడ్ రోల్స్ చేస్తున్నాడు గానీ పెద్దగా వర్కౌట్ కావట్లేదు. ఈ ఏడాది ప్రారంభంలో 'సైక్ సిద్ధార్థ' అంటూ వచ్చాడు గానీ ఎవరూ పట్టించుకోలేదు. ఇప్పుడు మరోసారి సైకో తరహా పాత్రతో వచ్చేస్తున్నాడు. 'అగ్లీ స్టోరీ' పేరుతో తీసిన ఈ మూవీ ఈ నెల 22న థియేటర్లలోకి రానుంది. తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: నేరుగా ఓటీటీలోకి జ్యోతిక కోర్ట్ రూమ్ సినిమా)భార్యపై అతి ప్రేమ చూపించి, ఆమెని అతిగా ప్రేమించే సైకోలా నందు నటించాడు. ఇతడి భార్యగా అవికా గోర్ చేసింది. వీళ్లిద్దరి జీవితంలో 'ప్రేమ' అనేది ఎంతటి విధ్వంసానికి కారణమైంది అనే కాన్సెప్ట్‌తో ఈ సినిమా తీసినట్లు తెలుస్తోంది. నందుకి ఈసారైనా సక్సెస్ దక్కుతుందో లేదో చూడాలి?(ఇదీ చదవండి: మృణాల్ ఠాకుర్‌కి ఊహించని అవకాశం?) -
దేవుళ్లు కూడా నన్ను ఆపలేరు.. విజువల్ వండర్లా కొత్త ట్రైలర్
క్రిస్టోఫర్ నోలన్ పేరు చెబితే మూవీ లవర్స్ ఎగ్జైట్ అయిపోతారు. ఎందుకంటే ఈ దర్శకుడు తీసే సినిమాలకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఒక పట్టానా అర్థం కావనే కామెంట్స్ వినిపిస్తాయి గానీ సూపర్ హిట్ అవడంతో పాటు వేల కోట్ల కలెక్షన్స్ గ్యారంటీ. ఈయన చేసిన లేటెస్ట్ మూవీ 'ద ఒడిస్సీ'. జూలై 17న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. ఈ క్రమంలోనే తాజాగా తెలుగు ట్రైలర్ కొత్తది రిలీజ్ చేశారు. ఇది విజువల్ వండర్లా ఉంటూ మూవీపై హైప్ పెంచుతోంది.(ఇదీ చదవండి: విజయ్ విక్టరీ.. కరుణానిధి కలలో కూడా ఊహించి ఉండరు!)ఒడియన్ అనే రాజు జీవితం ఆధారంగా ఈ సినిమా తీశారు. ఇందులో ఒడియన్ పాత్రలో మ్యాట్ డామన్, పెనెలోపీగా అన్నా హాత్వే, టెలిమాకస్‌గా టామ్ హోలండ్ కనిపించనున్నారు. రాబర్ట్ ప్యాటిన్సన్, ఛార్లెజ్ థెరోన్ కూడా కీలక పాత్రలు చేశారు. ఇంగ్లీష్‌తో పాటు భారతీయ భాషల్లోనూ ఈ మూవీని డబ్బింగ్ చేసి రిలీజ్ చేయబోతున్నారు. పూర్తిగా ఐమ్యాక్స్ కెమెరాలతో మొత్తం షూటింగ్ పూర్తి చేయడం విశేషం.ట్రైలర్ బట్టి చూస్తే ఒడియన్ అనే రాజు, ఓ యుద్ధంలో పాల్గొనేందుకు తన రాజ్యాన్ని, భార్య కొడుకుని వదిలి మరో చోటకు వెళ్తాడు. యుద్ధం గెలిచి తిరిగొస్తుంటే సముద్రంలో ఇతడి సైన్యం ప్రయాణిస్తున్న ఓడ ప్రమాదానికి గురవుతుంది. కానీ ఒడియన్ రాజు ప్రాణాలు దక్కించుకుంటాడు. తర్వాత ఏమైంది? భార్య-కొడుకుని కలిశాడా అనేది మిగతా స్టోరీ. ప్రాచీన కవి హోమర్ రాసిన 'ద ఒడిస్సీ' పుస్తకం ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కించారు. (ఇదీ చదవండి: ‘జన నాయగన్’.. నాడు శాపం నేడు వరం) -
ముగ్గురితో రొమాన్స్.. ఫుల్ కామెడీగా ట్రైలర్
రకుల్ ప్రీత్ సింగ్, ఆయుష్మాన్ ఖురానా ప్రధాన పాత్రల్లో వస్తోన్న రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ పతి పత్నీ ఔర్ వో దో. ఈ సినిమాకు ముదస్సర్ అజీజ్ దర్శకత్వం వహించారు. ఈ మూవీలో సారా అలీ ఖాన్, వామికా గబ్బీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్.ట్రైలర్ చూస్తుంటే పెళ్లి తర్వాత మరో ఇద్దరు అమ్మాయిలతో రిలేషన్ నేపథ్యంలో కథ తెరకెక్కించినట్లు తెలుస్తోంది. భార్య, ఇద్దరు అమ్మాయిలను ఎలా డీల్ చేశాడన్నదే పతి పత్నీ ఔర్ వో దో. ట్రైలర్లో సన్నివేశాలు చూస్తుంటే ఫుల్ కామెడీ ఎంటర్టైనర్గా కథ ఉండనుందని అర్థమవుతోంది. ఈ చిత్రంలో ఫారెస్ట్ ఆఫీసర్ ప్రజాపతి పాండే పాత్రలో ఆయుష్మాన్ కనిపించనున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ మూవీ మే 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
'ఐ బొమ్మ బ్యాన్ చేశారుగా..' ఫుల్ కామెడీగా జెట్లీ ట్రైలర్
టాలీవుడ్ కమెడియన్ సత్య హీరోగా వస్తోన్న చిత్రం జెట్లీ. ఈ మూవీకి రితేశ్ రానా దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన టీజర్ గ్లింప్స్, పోస్టర్స్, ట్రైలర్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈ చిత్రంలో సత్య సరసన రియా సింఘా హీరోయిన్గా కనిపించనుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ కామెడీ ఎంటర్టైనర్ రిలీజ్‌కు సిద్ధమైంది.ఈ నేపథ్యంలో జెట్లీ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఇప్పటికే ఓ ట్రైలర్ రాగా.. తాజాగా రిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు. ట్రైలర్ చూస్తుంటే ఫుల్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఫ్లైట్‌లో వచ్చే సీన్స్ ఫుల్ కామెడీని తలపిస్తున్నాయి. ఈ మూవీని క్లాప్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో నిర్మించారు. ఈ సినిమా మే 1వ తేదీన థియేటర్లలో సందడి చేయనుంది. ఈ చిత్రానికి కాల భైరవ సంగీతమందించారు. -
'అర్జున్ రెడ్డి కంటే పెద్ద హిట్టవుతుంది'.. రిషబ్ శెట్టి కొత్త సినిమా ట్రైలర్
గతేడాది కాంతార-2 మూవీతో సూపర్ హిట్ కొట్టిన రిషబ్ శెట్టి ఫ్యాన్స్‌కు బిగ్ సర్ప్రైజ్ ఇచ్చాడు. కొత్త ఏడాదిలో సడన్ షాకిచ్చాడు. ఎలాంటి అప్డేట్స్ ఇవ్వకుండా మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. రిషబ్ శెట్టి హీరోగా నటించిన తాజా చిత్రం ఏ ఫిల్మ్ బై గిరి. ఈ మూవీలో ఇందిర హీరోయిన్గా నటించింది. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ మూవీ థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమైంది.ఈ నేపథ్యంలో ఏ ఫిల్మ్ బై గిరి ట్రైలర్ రిలీజ్ చేశారు. ట్రైలర్ చూస్తుంటే రిషబ్ శెట్టి మూవీ స్క్రిప్ట్ రైటర్‌గా కనిపించనున్నట్లు తెలుస్తోంది. ట్రైలర్లో సీన్స్ చూస్తుంటే ఫుల్ కామెడీ ఎంటర్టైనర్గా ఈ సినిమా తెరకెక్కించినట్లు అర్థమవుతోంది. ఈ సినిమా ద్వారా కరణ్ అనంత్, అనిరుధ్ మహేశ్ దర్శకులుగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రాన్ని రెండు తెలుగు రాష్ట్రాల్లో థియేటర్స్ ఎంజీ మూవీస్ ద్వారా ఎం అచ్చిబాబు రిలీజ్ చేస్తున్నారు. ఈ మూవీలో ఎన్.పి తాపేశ్వరి, హోన్నవలి కృష్ణ, ప్రమోద్ శెట్టి ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు వాసుకి వైభవ్ సంగీతం అందించారు. ఈ కామెడీ ఎంటర్టైనర్ మే 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
ధనుశ్ కర.. తెలుగు ట్రైలర్ వచ్చేసింది
ధనుశ్, మమిత బైజు జంటగా నటించిన లేటేస్ట్ మూవీ కర. ఈ సినిమాకు విఘ్నశ్ రాజా దర్శకత్వం వహించారు. ఈశారి గణేశ్ నిర్మించిన ఈ మూవీ ఏప్రిల్ 30న రిలీజ్ కానుంది. తమిళంతో పాటు తెలుగులోనూ ఓకేసారి విడుదల చేస్తున్నారు. ఇప్పటికే తమిళ ట్రైలర్ విడుదల చేసిన మేకర్స్... తాజాగా ఈ మూవీ తెలుగు ట్రైలర్ మేకర్స్ రిలీజ్ చేశారు. 'ఆరు నెలలుగా కొనసాగుతున్న గల్ఫ్ దేశాల యుద్ధం పరాకాష్టకు చేరుకుంది.. కువైట్‌లో ఉన్న వందలాది ఆయిల్ వనరులపై ఇరానా దాడులు చేసింది' అన్న డైలాగ్‌తో ట్రైలర్ ప్రారంభమైంది. కర ట్రైలర్ చూస్తుంటే డబ్బు కోసం ఓ సామాన్యుడు చేసే పోరాటంగానే ఈ మూవీని తెరకెక్కించినట్లు తెలుస్తోంది. బ్యాంకులను కొల్లగొట్టి కోట్ల రూపాయలను దోచుకునే వ్యక్తిగా ధనుశ్ ఇందులో కనిపించారు. డబ్బు కోసం ఏదైనా చేసే దొంగ పాత్రలో ధనుశ్ కనిపించనున్నట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. కాగా.. ఈ మూవీలో కె.ఎస్. రవికుమార్, కరుణాస్, జయరామ్, పృథ్వీ పాండియరాజన్, సూరజ్ వెంజరమూడు, ఎం.ఎస్. బాస్కర్, శ్రీజ రవి కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు జీవీ ప్రకాశ్ సంగీతమందించారు. -
అలరించేలా 'గోదారి గట్టుపైన' ట్రైలర్
కూతురిని చాలా ప్రేమించే తండ్రి.. కానీ కూతురేమో ఓ కుర్రాడితో ప్రేమలో పడటం. తద్వారా ముగ్గురి జీవితాల్లో ఏర్పడే సంఘర్షణ అనే కాన్సెప్ట్‌తో ఇప్పటికే తెలుగులో చాలా సినిమాలు వచ్చాయి. ఇలాంటి స్టోరీతో తీసిన మరో మూవీ 'గోదారి గట్టుపైన'. సుమంత్ ప్రభాస్, జగపతిబాబు, నిధి ప్రదీప్ కీలక పాత్రలు పోషించారు. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ రిలీజ్ చేయగా అది ఆకట్టుకుంటోంది.(ఇదీ చదవండి: ఏడాది తర్వాత ఓటీటీలోకి తెలుగు కామెడీ సినిమా)షార్ట్ ఫిల్స్మ్, ఆల్బమ్ సాంగ్స్‌తో గుర్తింపు తెచ్చుకున్న సుమంత్ ప్రభాస్.. 'మేమ్ ఫేమస్' సినిమాతో టాలీవుడ్లోకి వచ్చాడు. ఇప్పుడు గోదారి గట్టుపైన' చిత్రం చేశాడు. మే 08న ఇది థియేటర్లలో రిలీజ్ కానుంది. ట్రైలర్ అయితే బాగానే ఉంది. పేరుకు తగ్గట్లే సరదాగా సాగిపోయే ప్రేమకథ చిత్రంలా అనిపించింది. అప్పట్లో షార్ట్ ఫిల్మ్స్ తీసి క్రేజ్ తెచ్చుకున్న సుభాష్ చంద్ర.. ఈ మూవీతో దర్శకుడిగా తెలుగులోకి ఎంట్రీ ఇస్తున్నారు.(ఇదీ చదవండి: కాజల్ అగర్వాల్‌కి ఇది చివరి అవకాశం!) -
ట్రంప్ మీద రివేంజ్ ఏంట్రా? ఫన్నీగా ట్రైలర్
ఈ నగరానికి ఏమైంది, పెళ్లి చూపులు సినిమాలతో దర్శకుడిగా ఆకట్టుకున్న తరుణ్ భాస్కర్.. చాన్నాళ్ల నుంచి నటుడిగానే కనిపిస్తున్నాడు. ఈ ఏడాది జనవరిలో 'ఓం శాంతి శాంతి శాంతిః' మూవీతో వచ్చాడు గానీ వర్కౌట్ కాలేదు. ఇప్పుడు మరో మూవీతో వచ్చేశాడు. అదే 'గాయపడ్డ సింహం'. మే 01న థియేటర్లలోకి రానుంది. ఈ క్రమంలోనే తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: తగ్గిపోయిన సినిమాల 'లైఫ్'.. ఎవరు దీనికి కారణం?)ట్రైలర్ విషయానికొస్తే.. అమెరికా వెళ్లి సెటిలైపోవాలని ఆశపడ్డ హీరోని ట్రంప్, తిరిగి స్వదేశానికి పంపిస్తాడు. దీంతో ట్రంప్‌పై ప్రతీకారం తీర్చుకోవాలని ఫిక్సవుతాడు. ఈ క్రమంలోనే ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నాడు? జేడీ చక్రవర్తి తదితరుల పాత్రలేంటి అనేది మిగతా స్టోరీలా అనిపిస్తుంది. ఫరియా అబ్దుల్లా, మానస చౌదరి హీరోయిన్లుగ నటించగా.. హీరో శ్రీ విష్ణు అతిథి పాత్రలో కనిపించనున్నాడు.ట్రైలర్ అయితే కామెడీ, థ్రిల్లింగ్‌గా బాగానే ఉంది. కానీ ఐపీఎల్, వేసవిని తట్టుకుని ఈ సినిమా ఎంతవరకు నిలబడుతుందో చూడాలి? దీంతో పాటు మే 01న కమెడియన్ సత్య హీరోగా చేసిన 'జెట్ లీ', ధనుష్ 'కర' చిత్రాలు కూడా థియేటర్లలోకి రానున్నాయి.(ఇదీ చదవండి: చిరంజీవికి కావాలి ఓ నిర్మాత?) -
హీరోగా టాలీవుడ్ కమెడియన్.. ట్రైలర్ రిలీజ్
కమెడియన్ సత్య హీరోగా వస్తోన్న చిత్రం జెట్లీ. ఈ మూవీకి రితేశ్ రానా దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన టీజర్ గ్లింప్స్, పోస్టర్స్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. సత్య ఈజ్ నాట్ జెట్లీ అంటూ సాగే పుల్ మాస్ సాంగ్‌ను రిలీజ్ చేయగా ఆడియన్స్‌ను అలరించింది. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ చిత్రం విడుదలకు సిద్ధమైంది.ఈ నేపథ్యంలోనే ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ట్రైలర్ చూస్తుంటే ఫుల్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో వెన్నెల కిశోర్, రియా సింఘా, అజయ్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ మూవీని క్లాప్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో నిర్మిస్తున్నారు. ఈ సినిమా మే 1వ తేదీన థియేటర్లలో సందడి చేయనుంది. ఈ చిత్రానికి కాల భైరవ సంగీతమందించారు. -
ఓటీటీలో ప్రియాంక చోప్రా స్పై థ్రిల్లర్.. ట్రైలర్ రిలీజ్
మహేశ్-రాజమౌళి 'వారణాసి' సినిమాలో హీరోయిన్గా చేస్తున్న ప్రియాంక చోప్రా.. ఇది రిలీజ్ కావడానికి ముందే స్పై థ్రిల్లర్ సిరీస్‌తో అలరించేందుకు సిద్ధమైపోయింది. 'సిటాడెల్' సిరీస్ రెండో సీజన్‌పై ప్రకటన వచ్చేసింది. ట్రైలర్ రిలీజ్ చేయడంతో పాటు స్ట్రీమింగ్ గురించి కూడా అప్డేట్ ఇచ్చేశారు. తెలుగులోనూ ఈ సిరీస్ అందుబాటులోకి రానుంది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 19 మూవీస్.. ఆ మూడు డోంట్ మిస్)ప్రియాంక చోప్రా, రిచర్డ్ మ్యాడెన్ ప్రధాన పాత్రలు చేసిన 'సిటాడెల్' సిరీస్ తొలి సీజన్.. 2023లో అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో రిలీజైంది. ఇది మిశ్రమ స్పందన అందుకుంది. ఇప్పుడు దీనికి కొనసాగింపుగా రెండో సీజన్‌ని సిద్ధం చేశారు. మే 06వ తేదీ నుంచి ఇది అందుబాటులోకి రానుంది. తెలుగు డబ్బింగ్ కూడా ఉంది. స్పై యాక్షన్ థ్రిల్లర్ కాన్సెప్ట్‌తో పాటు ఈసారి కొత్త మిషన్‌తో అలరించబోతున్నారు.'సిటాడెల్' తొలి సీజన్ విషయానికొస్తే.. ఎఫ్‌బీఐ, రా, ఐఎస్ఐలానే సిటాడెల్ అనేది ఓ స్పై ఏజెన్సీ. ప్రపంచంలోని కొందరు వ్యక్తులు కలిసి దీన్ని ఫ్రాన్స్ వేదికగా ఏర్పాటు చేస్తారు. ఏ ఒక్క దేశానికో అని కాకుండా ప్రజలందరిని రక్షించడమే దీని లక్ష్యం. అయితే సిటాడెల్‌ని నాశనం చేయాలని కొందరు డబ్బునోళ్లు 'మాంటికోర్' అని మరో స్పై సంస్థ ఏర్పాటు చేస్తారు. సిటాడెల్ టాప్ ఏజెంట్స్ అయిన మేసన్ కేన్(రిచర్డ్ మ్యాడెన్), నాదియా సిన్హా(ప్రియాంక చోప్రా)లని అంతం చేసేందుకు మాంటికోర్ ప్రయత్నిస్తుంది. వీళ్ల దాడి నుంచి మేనస్, నాదియా ఎలా తప్పించుకున్నారు? అనేది తొలి సీజన్.అయితే ఇది తెలుగులోనూ స్ట్రీమింగ్‌లోకి వచ్చినప్పటికీ హీరోయిన్ సమంతని ప్రధాన పాత్రలో పెట్టి ఈ సిరీస్ రీమేక్ చేశారు. ఇది అస్సలు వర్కౌట్ కాలేదు. (ఇదీ చదవండి: ఓటీటీలోకి తెలుగు డిస్ట్రబింగ్ సినిమా) -
రూ.200 కోట్ల మలయాళ బ్లాక్బాస్టర్.. తెలుగు ట్రైలర్ రిలీజ్
రెండున్నర వారాల క్రితం మలయాళంలో రిలీజై సెన్సేషన్ సృష్టిస్తున్న సినిమా 'వాలా 2'. స్కూల్ పిల్లల నేపథ్య కథతో కేవలం రూ.10 కోట్ల బడ్జెట్‌తో నిర్మించారు. కట్ చేస్తే ఏకంగా రూ.200 కోట్ల కలెక్షన్స్ సాధించి ప్రతి ఒక్కరూ అవాక్కయ్యేలా చేస్తోంది. ఇప్పుడీ చిత్రాన్ని తెలుగులోనూ ఈ శుక్రవారం(ఏప్రిల్ 24) రిలీజ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే హీరో నాని చేతుల మీదుగా తెలుగు ట్రైలర్ రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: ఓం శాంతి డిస్కో శాంతి.. దెయ్యాల్ని భయపెట్టే పిచ్చోళ్లు)ట్రైలర్ బట్టి చూస్తే నలుగురు స్టూడెంట్స్ జీవితాల్లో స్కూల్ లైఫ్ ఎలాంటి పాత్ర పోషించింది? చివరకు వాళ్లు ఏం తెలుసుకున్నారు? అనే విషయాల్ని కామెడీ, ఎమోషనల్‌గా చూపించినట్లు తెలుస్తోంది. ఈ ఏడాది 'సంక్రాంతికి చిరంజీవితో 'మన శంకర వరప్రసాద్' తీసిన సాహు గారపాటి.. 'వాలా 2' నిర్మాతల్లో ఒకరు కావడం విశేషం. మలయాళంలో సంచలనాలు క్రియేట్ చేసిన ఈ చిత్రం.. తెలుగులో ఎలాంటి ఫలితం అందుకుంటుందో చూడాలి?(ఇదీ చదవండి: అనసూయపై అసభ్యకర కంటెంట్.. మరో నిందితుడు అరెస్ట్) -
హీరోయిన్గా ఎంట్రీ ఇస్తున్న మాజీ సీఎం మనవరాలు
సినిమా, రాజకీయ రంగానికి విడదీయలేని సంబంధముంది. నటీనటులుగా రాణించిన వాళ్లు చాలామంది ప్రస్తుతం పాలిటిక్స్‌లోనూ మెప్పిస్తున్నారు. ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి మనవరాలు కూడా నటిగా అరంగేట్రం చేసేందుకు సిద్ధమైంది. ఆ పాన్ ఇండియా మూవీకి సంబంధించిన ట్రైలర్ తాజాగా రిలీజ్ చేశారు. ఇంతకీ ఎవరామె? ఏంటా సినిమా?(ఇదీ చదవండి: షాకింగ్.. తల్లి కాబోతున్న 'బిగ్‌బాస్' ట్రాన్స్‌జెండర్ తమన్నా)గుజరాత్ ముఖ్యమంత్రిగా చేసి ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ గవర్నర్‌గా చేస్తున్న ఆనందీ బెన్ పటేల్ మనవరాలు సంస్కృతి జయానా నటిగా పరచయమవుతోంది. మే 7న తెలుగులోనూ రిలీజ్ కాబోతున్న 'కృష్ణావతారం పార్ట్ 1'లో శ్రీ కృష్ణుని ప్రియురాలు సత్యభామ పాత్ర పోషించింది. ఈ చిత్రంలో కృష్ణుడిగా సిద్ధార్థ్ గుప్తా, రాధగా సుస్మితా భట్, రుక్మిణిగా నివాసిని కృష్ణన్ నటించారు. ఈ మూవీ మొత్తం సత్యభామ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచే ఉండనుంది.ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్న సంస్కృతి జయానా.. ఇప్పటికే పారిశ్రామికవేత్తగా రాణిస్తోంది. లండన్, అమెరికాలోని ఫ్యాషన్ మేనేజ్మెంట్ చేసిన ఈమె.. 16 ఏళ్ల వయసులోనే సొంత ఫ్యాషన్ బ్రాండ్ ప్రారంభించింది. మరోవైపు తల్లిదండ్రులతో కలిసి పలు సామాజిక కార్యక్రమాల్లోనూ పాలుపంచుకుంది. మరి ఇప్పుడు సత్యభామ పాత్రలో నటిగా ఏ మేరకు మెప్పిస్తుందో చూడాలి?(ఇదీ చదవండి: యుద్ధాన్ని ముందే అంచనా వేసిన ధనుష్ సినిమా) -
బ్యాంక్ దొంగగా ధనుష్.. ఆసక్తికరంగా ట్రైలర్
ప్రస్తుతం పశ్చిమాసియా దేశాల్లో యుద్ధం జరుగుతోంది. పెట్రోలు ఉత్పత్తి అయ్యే చోట్ల ఇరాన్ దాడులు చేయడం లాంటివి చూశాం. ఈ అంశాన్ని ఓ పాయింట్‌గా చూపించి తీసిన సినిమా 'కర'. ధనుష్, మమిత బైజు హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం ఈనెల 30న థియేటర్లలోకి రానుంది. ఈ క్రమంలోనే తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇది ఆసక్తికరంగా ఉంటూ మూవీపై అంచనాల్ని పెంచేస్తోంది.(ఇదీ చదవండి: 'పెద్ది' ఐటమ్ కోసం ఊహించని హీరోయిన్?)ట్రైలర్ బట్టి చూస్తే పశ్చిమాసియా దేశాల్లో జరుగుతున్న యుద్ధం కారణంగా ఓ పల్లెటూరిలో ఉండే హీరో.. బ్యాంకు దొంగతనాలు చేస్తాడు. అనుకోని పరిస్థితుల్లో వాటిని ఆపేసి పెళ్లి చేసుకుని సాధారణంగా బతుకుతుంటాడు. అలాంటి ఇతడు మళ్లీ ఎందుకు దొంగతనాలు చేయాల్సి వచ్చింది. ఇతడిని అడ్డుకునేందుకు పోలీస్(సూరజ్ వెంజరమూడు) ఏం చేశాడనేదే స్టోరీలా అనిపిస్తుంది.గతంలో 'పొర్ తొళిల్' అనే థ్రిల్లర్ తీసి అద్భుతమైన హిట్ కొట్టిన విఘ్నేశ్ రాజా.. ఈ చిత్రానికి దర్శకుడు. తమిళంతో పాటు తెలుగులోనూ ఒకేసారి ఇది థియేటర్లలోకి రానుంది. ఆ తేదీకి రావాల్సిన 'పెద్ది' వాయిదా పడింది. మరి ధనుష్ 'కర'తో హిట్ కొడతాడా లేదా అనేది చూడాలి? ప్రస్తుతానికి తమిళ ట్రైలర్ మాత్రమే రిలీజ్ చేశారు. త్వరలో తెలుగుది కూడా వదులుతారు.(ఇదీ చదవండి: షాకింగ్.. తల్లి కాబోతున్న 'బిగ్‌బాస్' ఫేమ్ ట్రాన్స్‌జెండర్ తమన్నా) -
ట్రైలర్: ఈసారి రక్తపాతాన్ని నమ్ముకున్న రవిబాబు
గతంలో నటుడిగా మాత్రమే చేస్తూ ఆకట్టుకున్న రవిబాబు.. ప్రస్తుతం దర్శకుడిగా సినిమాలు తీస్తూ వస్తున్నాడు. కుదిరినప్పుడు వాటిలో తనే లీడ్ రోల్ చేస్తున్నాడు. ఇకపోతే రవిబాబు తీసిన గత రెండు చిత్రాలు ఓటీటీలో నేరుగా రిలీజ్ కాగా.. దాదాపు ఐదేళ్ల తర్వాత థియేటర్లోకి వచ్చే మూవీని సిద్ధం చేశాడు. అదే 'రేజర్'. వచ్చే నెల 8న రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే తాజాగా ట్రైలర్ వదిలారు.(ఇదీ చదవండి: 'పెద్ది' నటుడి క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. ట్రైలర్ రిలీజ్)ట్రైలర్ బట్టి చూస్తే ఓ పాపని రక్షించే బాధ్యత రవిబాబు పాత్రది. ఈ క్రమంలోనే పాపని చంపేందుకు వచ్చిన రౌడీలని చంపుకొంటూ వెళ్తుంటాడు. అయితే చంపే క్రమంలో ప్రస్తుత ట్రెండ్‌కి తగ్గట్లు రక్తపాతాన్ని బాగానే చూపించాడు. ఇతడి గత చిత్రాల మాదిరిగానే కలర్ టోన్ మెంటైన్ చేశాడు. ట్రైలర్ అయితే రొటీన్‌గానే అనిపించింది.కొన్నాళ్ల ముందు వరకు అవును, అవును 2 పేరుతో హారర్ సినిమాలు తీసిన రవిబాబు.. తర్వాత క్రైమ్ థ్రిల్లర్స్ తీశాడు. ఇప్పుడు యాక్షన్, రక్తపాతాన్ని నమ్ముకున్నట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. మరి బాక్సాఫీస్ దగ్గర 'రేజర్' ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి?(ఇదీ చదవండి: నటిపై చాహల్ పరువు నష్టం దావా.. వీళ్ల మధ్య అసలేమైంది?)Ravi Babu’s #Razor trailer is a relentless, edge-of-your-seat ride packed with brutal, nonstop action. A complete bloodbath 🔥 #RazorTheMovie Trailer out now:#RazorOnMay8th#Razor - A Ravi Babu Film.A Flying Frogs ProductionComing to scorch theatres this summer on May 8th.… pic.twitter.com/wEJ3208kQm— BA Raju's Team (@baraju_SuperHit) April 18, 2026 -
'పెద్ది' నటుడి క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. ట్రైలర్ రిలీజ్
'మీర్జాపుర్' సిరీస్‌తో మున్నాభయ్యాగా ఫేమస్ అయిన దివ్యేందు.. ప్రస్తుతం రామ్ చరణ్ 'పెద్ది' మూవీలో నటిస్తున్నాడు. మరోవైపు ఇతడు లీడ్ రోల్ చేసిన స్పోర్ట్స్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఇప్పుడు స్ట్రీమింగ్కి సిద్ధమైంది. ఈ క్రమంలోనే తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇది ఆసక్తికరంగా ఉండేసరికి సిరీస్‌పై అంచనాలు పెరుగుతున్నాయి. ఇంతకీ ఈ సిరీస్ సంగతేంటి? ఎందులోకి రానుంది?(ఇదీ చదవండి: నటిపై చాహల్ పరువు నష్టం దావా.. వీళ్ల మధ్య అసలేమైంది?)దివ్యేందు, పులకిత్ సామ్రాట్ ప్రధాన పాత్రలు చేసిన సిరీస్ 'గ్లోరీ'. బాక్సింగ్ బ్యాక్‌డ్రాప్‌లో జరిగే క్రైమ్ థ్రిల్లర్‌గా దీన్ని తెరకెక్కించారు. నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో వచ్చే నెల 01వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది. తెలుగులోనూ అందుబాటులోకి రానుంది. 'మీర్జాపుర్' సిరీస్ తీసిన కరణ్ అన్షుమన్ దీని సృష్టికర్త కావడంతో అంచనాలు నెలకొన్నాయి.'గ్లోరీ' సిరీస్ విషయానికొస్తే.. ఒలింపిక్ గోల్డ్ మెడల్ సాధించడమే లక్ష్యంగా బతికే కోచ్ రఘుబీర్ సింగ్ (సువీందర్ విక్కీ). ఇతడి కూతురు గుడియా (జన్నత్ జుబైర్)పై ఓ రోజు దాడి జరుగుతుంది. మరోవైపు వర్ధమాన బాక్సర్ నిహాల్ సింగ్, అనుమానాస్పద రీతిలో చనిపోతాడు. దీంతో తండ్రి రఘుబీర్‌కి చాన్నాళ్ల పాటు దూరంగా ఉన్న కొడుకులు దేవ్(దివ్యేందు), రవి (పులకిత్ సామ్రాట్) తిరిగి సొంతూరు శక్తిఘడ్కి వస్తారు. తర్వాత ఏమైంది? అనేదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: ఓటీటీలోకి మలయాళ పొలిటికల్ థ్రిల్లర్ సినిమా) -
'పుష్ప' లాంటి సెటప్.. 'మార్కో' స్టైల్ యాక్షన్.. ట్రైలర్ రిలీజ్
రీసెంట్ టైంలో అడవి బ్యాక్‌డ్రాప్‌లో తీసిన సినిమా అనగానే చాలామందికి 'పుష్ప'నే గుర్తొస్తుంది. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంతో తీశారు. ఇప్పుడు ఈ తరహాలోనే ఏనుగు దంతాల స్మగ్లింగ్ నేపథ్య కథాంశంతో మలయాళంలో తీసిన పాన్ ఇండియా మూవీ 'కాటాలన్'. వచ్చే నెలలో ఈ చిత్రాన్ని థియేటర్లలోకి తీసుకురానున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: పోలీస్ కేసు.. యాంకర్ విష్ణుప్రియకే కలిసొచ్చింది!)ట్రైలర్ చూస్తే ఏనుగు దంతాల స్మగ్లింగ్ చేసే ముఠాల మధ్య ఆధిపత్య పోరు, ఇందులో హీరో ఏం చేశాడు అనేది కాన్సెప్ట్‌లా అనిపిస్తుంది. అయిత హీరోహీరోయిన్, సైడ్ క్యారెక్టర్స్.. ఇలా ప్రతి ఒక్కరి చేతిలో గన్ లేదంటే కత్తి కనిపించాయి. బుల్లెట్ పేల్చడం లేదంటే రక్తపాతం సృష్టించడం లాంటివి కనిపిస్తున్నాయి. అలానే ట్రైలర్‌కి మూడు డిఫరెంట్ థీమ్ మ్యూజిక్స్ అనే కొత్త ప్రయోగం చేశారు. ఇది కూడా ఆసక్తికరంగా అనిపించింది. 'మార్కో' లాంటి వయలెంట్ మూవీ తీసిన నిర్మాతలే దీన్ని తెరకెక్కించారు. తెలుగు నటుడు సునీల్.. ఇందులో ఓ విలన్‌గా చేయడం విశేషం.(ఇదీ చదవండి: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమా) -
హారర్ థ్రిల్లర్ తెలుగు సిరీస్.. ట్రైలర్ రిలీజ్
ఓటీటీల్లో సినిమాలతో పాటే అప్పుడప్పుడు ఒరిజినల్ వెబ్ సిరీస్‌లు కూడా వస్తుంటాయి. ఇప్పుడు అలా మిస్టిక్ థ్రిల్లర్ స్టోరీతో తీసిన సిరీస్ 'పోచమ్మ'. ఆహా ఓటీటీలో ఈ శుక్రవారం(ఏప్రిల్ 17) నుంచి తెలుగు, తమిళంలో స్ట్రీమింగ్ కానుంది. ఈ క్రమంలోనే తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇది ఆకట్టుకునేలా ఉండటం విశేషం.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 20 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్)ఓ గ్రామంలోనే భవంతిలో అడ్డుగా ఉందని పోచమ్మ విగ్రహాన్ని తొలగిస్తారు. తర్వాత ఎలాంటి పరిణామాలు ఎదురయ్యాయి. ఆ ఊరిలోని వ్యక్తులపై పోచమ్మ ఎలాంటి ఆగ్రహం వ్యక్తం చేసింది అనే బ్యాక్ డ్రాప్ స్టోరీతో సిరీస్ తీసినట్లు తెలుస్తోంది. బిగ్‌బాస్ ఫేమ్ అర్జున్ అంబటి, కన్నడ ప్రముఖ నటుడు అచ్యుత్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. మరి ఈ సిరీస్ ఏ మేరకు ప్రేక్షకుల్ని మెప్పిస్తుందో చూడాలి?(ఇదీ చదవండి: ఓటీటీలో రాధిక సూపర్ హిట్ సినిమా.. తెలుగు రివ్యూ) -
ఓటీటీలో సూపర్ హిట్ హారర్ థ్రిల్లర్.. కొత్త సీజన్ ట్రైలర్ రిలీజ్
ఓటీటీల్లో సినిమాలతో పాటు డిఫరెంట్ స్టోరీలతో తీసిన బోలెడన్ని వెబ్ సిరీసులు కూడా ఉన్నాయి. అయితే గత కొన్నాళ్లలో అలా ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకున్న వాటిలో 'ఫ్రమ్' సిరీస్ ఒకటి. హీరో విశ్వక్ సేన్ చెప్పడంతో తెలుగు ప్రేక్షకులకు కూడా మరికొందరికి తెలిసింది. ఇప్పుడీ సిరీస్ నుంచి నాలుగో సీజన్ వచ్చేస్తోంది. రీసెంట్గా స్ట్రీమింగ్ డేట్ ప్రకటించగా ఇప్పుడు అధికారిక ట్రైలర్ రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: ఓటీటీలో రాధిక సూపర్ హిట్ సినిమా.. తెలుగు రివ్యూ)'ఫ్రమ్' సిరీస్ విషయానికొస్తే.. అమెరికాలోని ఓ రహస్య గ్రామం. ఇక్కడికి ఒకసారి వచ్చినవాళ్లు తిరిగి బయటపడలేరు. పొద్దున్న అంతా ప్రశాంతంగా ఉన్నప్పటికీ రాత్రయితే ఈ ఊరిలో నరరూప రాక్షసుల్లాంటి మనుషులు తిరుగుతారు. వాళ్ల నుంచి ఇక్కడ ఉండే కొందరు ఎలా తమని తాము రక్షించుకున్నారు? ఇంతకీ ఇలా ఎందుకు జరుగుతోంది? అక్కడి నుంచి బయటపడ్డారా అనేదే కాన్సెప్ట్. ఈ నెల 20వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో 4వ సీజన్ స్ట్రీమింగ్ కానుంది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చిన తెలుగు సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా) -
పెళ్లయిన మూడోరోజే భార్య వదిలేస్తే.. ఫన్నీగా ట్రైలర్
అడపాదడపా హీరోగా సినిమాలు చేసే తిరువీర్ నుంచి వస్తున్న లేటెస్ట్ మూవీ 'పాపం ప్రతాప్'. గతేడాది డిసెంబరులో 'ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో' చిత్రంతో హిట్ కొట్టిన ఇతడు.. ఇప్పుడీ సినిమాతో ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు. ఈ శుక్రవారమే థియేటర్లలోకి రానుండగా తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇది ఆకట్టుకునేలా ఉంది.(ఇదీ చదవండి: రాత్రి 2 గంటలకు ఫోన్ చేశాడు.. కంగారుపడ్డా: కాయదు లోహర్)1998లో గోదావరిలో జరిగే కథగా దీన్ని చూపించారు. ప్రతాప్, బుజ్జమ్మని పెళ్లి చేసుకుంటాడు. కానీ మూడో రోజే ఆమె.. ప్రతాప్‌ని వదిలి వెళ్లిపోతుంది. తర్వాతరోజు పెద్ద మనుషుల దగ్గర పంచాయతీ పెడుతుంది. ఇంతకీ వీళ్లిద్దరి మధ్య ఏం జరిగింది? ప్రతాప్ ఏమైనా చేశాడా? ప్రతాప్‌కే ఏమైనా జరిగిందా అనేదే కాన్సెప్ట్‌లా అనిపిస్తుంది. 'ఒకమ్మాయి ఇల్లు వదిలి వెళ్లిందంటే అబ్బాయి ఏం చేశాడని అడుగుతారు. కానీ ఆ అబ్బాయికి ఏం జరిగిందని ఎవరూ అడగరు' అనే డైలాగ్ ఆసక్తికరంగా అనిపించింది. నవ్వుని నటిస్తూ బతుకుతున్న ప్రతి మగాడి కథ అని చివరో ఓ లైన్ వేశారు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చిన తెలుగు సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా) -
నిర్మాతగా కిరణ్ అబ్బవరం.. తిమ్మరాజుపల్లి టీవీ ట్రైలర్ రిలీజ్
టాలీవుడ్ హీరో కిరణ్ అబ్బవరం నిర్మిస్తోన్న తాజా చిత్రం తిమ్మరాజుపల్లి టీవీ. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో వస్తోన్న ఈ పీరియాడికల్ మూవీలో కెమెరా అసిస్టెంట్‌గా పనిచేసిన సాయితేజ్ హీరోగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో వేదశ్రీ హీరోయిన్గా కనిపించనుంది. కేఏప్రోడక్షన్స్ పతాకంపై ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో వి మునిరాజు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.తాజాగా రిలీజైన ట్రైలర్ చూస్తుంటే గ్రామీణ నేపథ్యంలోనే సాగే కథగా తెరెకెక్కించినట్లు తెలుస్తోంది. టీవీ సౌకర్యం లేని ఓ ఊరి కథగా ఈ సినిమాను రూపొందించినట్లు ట్రైలర్ చూస్తుంటే అర్థమవుతోంది. ట్రైలర్లో గ్రామంలోని అందరూ కలిసి ఓకే చోట టీవీ చూడటం లాంటి సీన్స్ ఆసక్తిని పెంచుతున్నాయి. ఇప్పటికే రిలీజైన పాటలకు కూడా మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ మూవీలో ప్రదీప్ కొట్టె, తేజ విహాన్, స్వాతి కరిమిరెడ్డి, అమ్మ రమేశ్, సత్యనారాయణ వడ్డాది, మాధవి ప్రసాద్, టీవీ రామన్, చిట్టిబాబు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా ఏప్రిల్ 17న థియేటర్లలో సందడి చేయనుంది. -
ఓటీటీకి క్రైమ్ థ్రిల్లర్ సిరీస్.. ట్రైలర్ రిలీజ్
తమన్నా మాజీ బాయ్‌ఫ్రెండ్ విజయ్ వర్మ నటించిన క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ మట్కా కింగ్. ఈ వెబ్ సిరీస్‌కు సైరత్' లాంటి బ్లాక్‌బస్టర్ మూవీ తీసిన నాగరాజ్ ముంజలే దర్శకత్వం వహించారు. ఈ సిరీస్‌లో కృతిక కమ్రా, గుల్షన్ గ్రోవర్ కీలక పాత్రలు పోషించారు. ముంబయికి చెందిన రతన్ ఖత్రీ జీవితం ఆధారంగా ఈ వెబ్ సిరీస్ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇప్పటికే టీజర్ రిలీజైన సంగతి తెలిసిందే. తాజాగా మట్కా కింగ్ సిరీస్ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ట్రైలర్ చూస్తుంటే మట్కా నేపథ్యంలో సాగే క్రైమ్ కథగానే తెరకెక్కించినట్లు తెలుస్తోంది. 1960ల్లో ఓ సాధారణ పత్తి వ్యాపారి (విజయ్ వర్మ), తన తెలివితేటలతో మట్కా అనే జూద సామ్రాజ్యాన్ని ఎలా నిర్మించాడనే స్టోరీగా ఈ సిరీస్ తీసినట్లు అర్థమవుతోంది. ఈ క్రైమ్ సిరీస్ ఏప్రిల్ 17 నుంచి అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో ఇది స్ట్రీమింగ్ కానుంది. -
అక్షయ్ కుమార్ 'భూత్ బంగ్లా' ట్రైలర్ రిలీజ్
బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ గతంలో అద్భుతమైన హిట్స్ అందుకున్నప్పటికీ.. గత కొన్నాళ్లుగా చాలా వెనకబడిపోయాడు. వరస సినిమాలైతే చేస్తున్నాడు గానీ సక్సెస్ అనేది పెద్దగా దక్కట్లేదు. దీంతో తనకు గతంలో 'హేరా ఫేరీ' లాంటి బ్లాక్‌బస్టర్ ఇచ్చిన మలయాళ దర్శకుడు ప్రియదర్శన్‌తో కలిసి తీసిన మూవీ 'భూత్ బంగ్లా'. వచ్చే శుక్రవారం థియేటర్లలోకి రానుంది. ఈ క్రమంలోనే తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు.ట్రైలర్ బట్టి చూస్తే ఓ బంగ్లా, అందులో వధాసుర్ అనే రాక్షసుడు, సిట్చూయేషనల్ కామెడీ ఇలా బాగానే ఉందనిపించింది. కాకపోతే ప్రస్తుతం బాక్సాఫీస్ దగ్గర 'ధురంధర్ 2' హవా నడుస్తోంది. లెక్క ప్రకారం ఈ శుక్రవారమే 'భూత్ బంగ్లా' థియేటర్లలోకి రావాలి. కానీ ధురంధర్ వల్లే వారం ఆలస్యంగా రిలీజ్ చేస్తున్నారు. కానీ అప్పుడైనా హిట్ అవుతుందా అనేది ఇక్కడ సందేహంగా మారింది. హారర్ మూవీ జనాలని ఏ మేరకు మెప్పిస్తుందనేది చూడాలి? -
నాగ శౌర్య యాక్షన్ మూవీ.. ట్రైలర్ చూశారా?
టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య నటించిన లేటేస్ట్ యాక్షన్ మూవీ బ్యాడ్‌బాయ్ కార్తీక్. ఈ చిత్రంలో విధి యాదవ్ హీరోయిన్గా కనిపించనుంది. ఈ చిత్రానికి రమేశ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని శ్రీ వైష్ణవి ఫిల్మ్స్ బ్యానర్లో నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.తాజాగా రిలీజైన ట్రైలర్ చూస్తుంటే పొలిటికల్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమాని తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఈ మూవీలో నాగ శౌర్య ఫుల్ యాక్షన్ మోడ్‌లో కనిపించనున్నారు. ట్రైలర్లో ఫైట్ సీన్స్ చూస్తుంటే ఫుల్ యాక్షన్ మూవీగానే రూపొందించినట్లు అర్థమవుతోంది. ఈ చిత్రంలో సముద్రఖని, సాయికుమార్, నరేష్, వెన్నెల కిషోర్ కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమా ఏప్రిల్ 17, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్‌లో విడుదల కానుంది. ఈ చిత్రానికి హారిస్ జయరాజ్ సంగీతమందించారు. -
టోవినో థామస్ కొత్త సినిమా.. తెలుగు ట్రైలర్ రిలీజ్
మలయాళ స్టార్ టోవినో థామస్ హీరోగా వస్తోన్న లేటేస్ట్ మూవీ పల్లి చట్టంబి. ఈ సినిమాకు డీజో జోస్ ఆంటోనీ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో కయాదు లోహర్ హీరోయిన్గా నటించింది. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ నేపథ్యంలోనే తాజాగా పల్లి చట్టంబి ట్రైలర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. మలయాళంతో పాటు తెలుగు, కన్నడ, తమిళం, హిందీ భాషల్లో ట్రైలర్ విడుదల చేశారు. ట్రైలర్ చూస్తుంటే ఈ చిత్రాన్ని పీరియాడికల్ డ్రామాగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. 1950 దశకంలో కేరళలో జరిగిన సంఘటనల ఆధారంగా రూపొందించినట్లు అర్థమవుతోంది. ఈ సినిమా ఏప్రిల్ 10న థియేటర్లలో సందడి చేయనుంది. -
యాప్ చెప్పిందని బ్రేకప్.. ఫన్నీగా LIK ట్రైలర్
డ్యూడ్, డ్రాగన్, లవ్ టుడే సినిమాలతో హ్యాట్రిక్ సక్సెస్‌లు అందుకున్న తమిళ యంగ్ హీరో ప్రదీప్ రంగనాథన్.. తెలుగులోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇతడు నటించిన లేటెస్ట్ మూవీ 'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ'(Lik). కృతి శెట్టి హీరోయిన్ కాగా విఘ్నేశ్ శివన్ దర్శకుడు. నయనతార ఓ నిర్మాత. రాబోయే శుక్రవారం(ఏప్రిల్ 10) మూవీ థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా ఇప్పుడు ట్రైలర్ రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: సైలెంట్‌గా వైష్ణవిని పెళ్లి చేసుకున్న షన్ను.. ఫొటోలు వైరల్)ట్రైలర్ బట్టి చూస్తే సమ్‌థింగ్ ఇంట్రెస్టింగ్ అనేలా ఉంది. అది 2040. ప్రేమకు కూడా ఇన్సూరెన్స్ ఉండాలన, Lik అనే యాప్‌ని సృష్టిస్తారు. ఈ కంపెనీకి ఓనర్ (ఎస్జే సూర్య). ఈ యాప్‌లో వాయిస్ ఆర్టిస్టుగా పనిచేసే వైబ్ వాసు (ప్రదీప్ రంగనాథన్).. దీన్ని అసలు నమ్మడు. ప్రేమంటే మనసులో నుంచి పుట్టాలని అనుకుంటాడు. అందుకు తగ్గట్లే ధీమా(కృతిశెట్టి) అనే అమ్మాయిని కలుస్తాడు. కానీ ఆమె ఏమో చిన్నప్పటి నుంచి ఫోన్‌ని చూస్తూ పెరుగుతుంది. ఏ పనైనా ఫోన్‌తోనే చేస్తుంది. చివరకు ప్రేమని కూడా ఫోన్లోని Lik యాప్ ద్వారానే వెతుక్కుంటుంది. అయితే ఈ యాప్ చెప్పిందని హీరోకి బ్రేకప్ చెప్పేస్తుంది. మరి చివరకు హీరోహీరోయిన్ ఎలా కలిశారు అనేదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: ఇండస్ట్రీ టాప్ స్టార్స్ నటించిన సినిమా.. ట్రైలర్ రిలీజ్) -
ఇండస్ట్రీ టాప్ స్టార్స్ నటించిన సినిమా.. ట్రైలర్ రిలీజ్
మలయాళ సినీ ఇండస్ట్రీ అనగానే చాలామంది మోహన్ లాల్, మమ్ముట్టి, ఫహాద్ ఫాజిల్ తదితరుల పేర్లు గుర్తొస్తాయి. వీళ్ల మూవీస్ ఎప్పటికప్పుడు డబ్బింగ్‌ల రూపంలో పలకరిస్తూనే ఉన్నాయి. ఇప్పుడు వీళ్ల ముగ్గురితోపాటు నయనతార, రేవతి, కుంచకో బోబన్, దర్శన రాజేంద్రన్ లాంటి స్టార్స్ అంతా కలిసి నటించిన మూవీ 'పేట్రియాట్' మరో నెల రోజుల్లో విడుదల కానుంది. ఈ సందర్భంగా ఇప్పుడు ట్రైలర్ రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: బైకర్, రాకాస.. తొలిరోజు వసూళ్లు ఎవరికెన్ని కోట్లు?)స్పై థ్రిల్లర్ స్టోరీతో తీసిన ఈ సినిమాకు మహేశ్ నారాయణన్ దర్శకత్వం వహించాడు. ట్రైలర్ అయితే ఇంట్రెస్టింగ్గా ఉంది. సరికొత్త థ్రిల్లర్ చూడబోతున్నామనేలా అనిపించింది. యాక్టింగ్ గానీ సీన్స్ గానీ సమ్‌థింగ్ డిఫరెంట్ అనేలా ఉన్నాయి. మే 01న పాన్ ఇండియా రేంజులో ఈ చిత్రం థియేటర్లలోకి రానుంది. ప్రస్తుతానికి మలయాళ ట్రైలర్ మాత్రమే రిలీజ్ చేశారు. త్వరలో తెలుగు వెర్షన్ కూడా తీసుకురానున్నారు.(ఇదీ చదవండి: సైలెంట్‌గా వైష్ణవిని పెళ్లి చేసుకున్న షన్ను.. ఫొటోలు వైరల్) -
శేష్-మృణాల్ 'డకాయిట్' ట్రైలర్ రిలీజ్
అడివి శేష్, మృణాల్ ఠాకుర్ హీరోహీరోయిన్లుగా నటించిన 'డకాయిట్' సినిమా.. వచ్చే శుక్రవారం(ఏప్రిల్ 10) థియేటర్లలోకి రానుంది. అనురాగ్ కశ్యప్ విలన్‌గా చేస్తున్నాడు. తాజాగా ట్రైలర్ రిలీజ్ చేయగా.. ఇది ఆకట్టుకునేలా ఉంది. మూవీపై అంచనాలు పెంచేస్తోంది. -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్
బాహుబలి సినిమాలతో పాన్ ఇండియా క్రేజ్ సొంతం చేసుకున్న అనుష్క శెట్టి.. బరువు సమస్యల కారణంగా తర్వాత మూవీస్ చేయడం చాలా తగ్గించేసింది. అప్పుడో ఇప్పుడో అన్నట్లు చేస్తూ వస్తోంది. 2023లో 'మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి'తో హిట్ అందుకున్న ఈ హీరోయిన్.. గతేడాది 'ఘాటీ'తో ఘోరమైన డిజాస్టర్ చవిచూసింది. ఇప్పుడు 'కథనార్' అనే మలయాళ చిత్రంతో వచ్చేందుకు సిద్ధమైంది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి తమిళ హిట్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్)ఫాంటసీ థ్రిల్లర్ స్టోరీతో తీసిన ఈ సినిమాని తెలుగు, తమిళంలోనూ రిలీజ్ చేయనున్నారు. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ విడుదల చేశారు. ఇందులో అనుష్కకి రెండు మూడు షాట్స్‌కి మాత్రమే పరిమితం చేశారు. విజువల్స్ బాగున్నాయి గానీ కాన్సెప్ట్ అర్థమై అర్థం కానట్లు అనిపించింది. డబ్బింగ్లో ఉపయోగించిన తెలుగు పదాలు కూడా సగటు ప్రేక్షకుడికి అర్థం కాని విధంగా ఉన్నాయి.జయసూర్య హీరోగా నటించిన ఈ చిత్రంలో అనుష్క శెట్టి హీరోయిన్. ప్రభుదేవా, శాండీ మాస్టర్, వినీత్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ ఏడాది జూలై ఆగస్టులో థియేటర్లలోకి మూవీ రానుందని తెలుస్తోంది. రోజిన్ థామస్ దర్శకుడు. అనుష్కకి ఇది 50వ మూవీ కావడం విశేషం.(ఇదీ చదవండి: పెద్ది రిలీజ్ డేట్.. నన్ను క్షమించండి: నిర్మాత ఎస్కేఎన్) -
అప్పుడు 'లెజెండ్' ఇప్పుడు 'లీడర్'.. యాక్షన్ ట్రైలర్ రిలీజ్
తమిళనాడులో శరవణనన్ స్టోర్స్ అనే వస్త్రదుకాణ యజమానిగా గుర్తింపు తెచ్చుకున్న లెజెండ్ శరవణనన్.. నాలుగేళ్ల క్రితం తన పేరుతోనే తీసిన 'లెజెండ్' సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు. ప్రమోషన్ల టైంలోనే విపరీతంగా ట్రోలింగ్కి గురైన ఈ చిత్రం.. థియేటర్లలోకి వచ్చిన తర్వాత అంతకు మించిన విమర్శలు ఎదుర్కొంది. దీంతో ఈ హీరో ఇప్పుడు నాలుగేళ్ల గ్యాప్ తీసుకుని ఈసారి కొత్తగా 'లీడర్' మూవీతో వస్తున్నాడు.(ఇదీ చదవండి: ఐటమ్ డ్యాన్సర్‌గా ప్రముఖ గాయని.. వీడియో రిలీజ్)ఈ మూవీకి ఆర్ఎస్ దురై సెంథిల్ కుమార్ దర్శకత్వం వహించగా.. పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్గా చేసింది. ఆండ్రియా, శ్యామ్, లాల్ లాంటి ప్రముఖ నటీనటులు కీలక పాత్రలు పోషించారు. జిబ్రాన్ సంగీతమందించాడు. ఏప్రిల్ 3న తెలుగు, తమిళంలో రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ఆదివారం ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో యాక్షన్ ట్రైలర్ రిలీజ్ చేశారు. ప్రతి ఫ్రేమ్‌లోనూ భారీతనం కనిపిస్తున్న ఈ మూవీ అయినా శరవణనన్కి హిట్ ఇస్తుందేమో చూడాలి?(ఇదీ చదవండి: ఓటీటీలో 'మట్కా కింగ్'.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?) -
'అప్పు చేస్తేనే పెద్ద వాళ్లమవుతాం'.. ఆసక్తిగా కార్మేని సెల్వం ట్రైలర్
సముద్రఖని, అభినయ ప్రధాన పాత్రల్లో వస్తోన్న లేటేస్ట్ మూవీ కార్మేని సెల్వం. ఈ ద్విభాషా చిత్రానికి రామ్ చక్రి దర్శకత్వం వహించారు. ఈ మూవీని పాత్వే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అరుణ్ రంగరాజులు నిర్మించారు. ఈ చిత్రంలో డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఓకేసారి తెలుగు, తమిళ భాషల్లో ఈ మూవీని రిలీజ్ చేస్తున్నారు. తాజాగా మూవీ ట్రైలర్ హైదరాబాద్‌లో రిలీజ్ చేశారు.ట్రైలర్ చూస్తుంటే ఓ మధ్య తరగతి కుటుంబం నేపథ్యంలోనే తెరకెక్కించినట్లు తెలుస్తోంది. సామాన్యుడి ఇంటికల, ఆర్థిక సమస్యలు, డబ్బు అనే కోణంలో ఈ కథను రూపొందించారని ట్రైలర్లో అర్థమవుతోంది. అప్పులు అనే కాన్సెప్ట్‌తో పాటు ఎమోషనల్ స్టోరీగా ట్రైలర్లో చూపించారు. కాగా.. ఈ చిత్రంలో లక్ష్మీ ప్రియ, కార్తిక్ కుమార్, బడవ గోపీ, కోతండం, కరణ్ చక్రవర్తి, శంకర నారాయణ్ వి, హరిత పరాకోడ్ కీలక పాత్రలు పోషించారు. కాగా.. ఈ చిత్రం ఏప్రిల్ 3న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
ఎంటర్టైనింగ్గా 'రాకాస' ట్రైలర్
'మ్యాడ్', 'మ్యాడ్ స్క్వేర్' సినిమాలతో ఎంటర్టైన్ చేసిన సంతోష్ శోభన్ హీరోగా నటించిన సినిమా 'రాకాస'. మెగా డాటర్ నిహారిక నిర్మించగా.. మానస శర్మ అనే అమ్మాయి దర్శకురాలిగా పరిచయమవుతోంది. హారర్ కామెడీ కాన్సెప్ట్‌తో తెరకెక్కించారు. ఏప్రిల్ 3న థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇది ఆకట్టుకునేలా ఉంది.(ఇదీ చదవండి: 'ధురంధర్ 2'.. టాలీవుడ్ ఏం నేర్చుకోవాలి?)ట్రైలర్ బట్టి చూస్తే.. ఇదివరకు వచ్చిన హారర్ సినిమాల్లానే ఇందులో స్టోరీ ఉన్నట్లు అనిపిస్తుంది. ఏ మాత్రం సంబంధం లేని హీరో, ఓ పల్లెటూరికి వస్తాడు. అక్కడే ఉండే ఓ అమ్మాయితో ప్రేమలో పడతాడు. అనుకోని విధంగా హీరో సమస్యల్లో చిక్కుకుంటాడు. బ్రహ్మ రాక్షసుడికి ఆహారంగా ఊరంతా కలిసి ఇతడిని పాడుబడ్డ కోటలోకి పంపిస్తారు. అక్కడ హీరోకి ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయనేదే స్టోరీలా అనిపిస్తుంది.(ఇదీ చదవండి: రేలంగి మామయ్యగా ఒకవేళ రాజశేఖర్ చేసుంటే?) -
సాయి పల్లవి ఎంట్రీ మూవీ.. తెలుగు ట్రైలర్ రిలీజ్
నేచురల్ బ్యూటీ సాయి పల్లవి బాలీవుడ్ ఎంట్రీ ఇస్తోన్న లేటేస్ట్ మూవీ ఏక్ దిన్. ఈ చిత్రంలో అమిర్ ఖాన్ తనయుడు జునైద్ ఖాన్ హీరోగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని తెలుగులోనూ రిలీజ్ చేయనున్నారు మేకర్స్. తెలుగులో ఒక రోజు పేరుతో ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ తెలుగు ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ చూస్తుంటే లవ్ స్టోరీగా ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు తెలుస్తోంది. 'నేను కోరుకున్నది నా కళ్లముందే ఉంది.. కొన్ని జీవితాలకు ఒక్క రోజే ఎక్కువ' అనే డైలాగ్స్ వింటుంటే పక్కా ప్రేమకథ అని అర్థమవుతోంది. ఈ సినిమాను మే 1న థియేటర్లలో విడుదల చేస్తున్నారు. కాగా.. ఈ చిత్రానికి సునీల్ పాండే దర్శకత్వం వహించారు. Sometimes, One Day is enough. ❤️Oka Roju Trailer Out Now!Watch #OkaRoju only in theatres on 1st May 2026.#JunaidKhan #SaiPallavi pic.twitter.com/PVOBLDDRot— Aamir Khan Productions (@AKPPL_Official) March 24, 2026 -
'తెరచాప' ట్రైలర్ రిలీజ్
అనన్య క్రియేషన్స్ బ్యానర్‌పై కైలాష్ దుర్గం నిర్మాతగా తీస్తున్న సినిమా 'తెరచాప'. జోయల్ జార్జ్ దర్శకత్వం వహించారు. నవీన్ రాజ్ శంకరపు, పూజ సుహాసిని, శ్రీలు హీరోహీరోయిన్లుగా నటించారు. రాజీవ్ కనకాల, పృథ్వీరాజ్, జగదీష్ ప్రతాప్ తదితరులు ఇతర పాత్రలు చేశారు. ప్రజల్ క్రిష్, ఎం.ఎల్ రాజా సంగీతాన్ని అందించారు. విడుదల తేది దగ్గరవుతున్న సందర్భంగా ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 19 సినిమాలు)తెరచాప ట్రైలర్ చూస్తుంటే సముద్రతీరంలో జరిగే ఒక ఊరి కథలా అనిపిస్తుంది. ఊరంటే మనుషుల మధ్య ప్రేమ, ఆప్యాయతలుతో పాటు రాజకీయాలు, భేద భావాలు ఉండడమూ సహజమే. అలాంటి పరిస్థితుల మధ్య ఒక యువకుడు తన ఊరిలో ఉన్న పరిస్థితులపై ఎలా పోరాడాడు? అనేదే స్టోరీ. (ఇదీ చదవండి: రికార్డులు బ్రేక్ చేసినా 'పుష్ప2'ని దాటలేకపోయిన ధురంధర్ 2) -
శర్వా 'బైకర్' ట్రైలర్ రిలీజ్.. అదిరిపోయింది
శర్వానంద్, మాళవిక నాయర్ హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా 'బైకర్'. ఒకప్పటి హీరో రాజశేఖర్ కీలక పాత్ర చేశారు. అభిలాష్ రెడ్డి దర్శకుడు కాగా యూవీ క్రియేషన్స్ నిర్మించింది. లెక్క ప్రకారం గతేడాది డిసెంబరులోనే ఈ మూవీ రిలీజవ్వాలి. కానీ ఏప్రిల్ 3న థియేటర్లలోకి రానుంది. ప్రమోషన్లలో భాగంగా ఇప్పుడు ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇది అదిరిపోయిందని చెప్పొచ్చు.(ఇదీ చదవండి: పవన్-హరీశ్ శంకర్ మూడో సినిమా.. అయ్యే పనేనా?)రేసింగ్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన సినిమాలు చాలా తక్కువనే చెప్పొచ్చు. అందులోనూ బైక్ రేసింగ్ కాన్సెప్ట్‌తో ఇప్పటివరకు అయితే రాలేదు. ఇందులో శర్వానంద్, రాజశేఖర్.. తండ్రికొడుకులు పాత్రలు చేశారు. విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదిరిపోయేలా ఉన్నాయి. మరి మూవీ ఏం చేస్తుందో చూడాలి?(ఇదీ చదవండి: 'ధురంధర్ 2'.. ఇంత పొరపాటు ఎలా చేశారు?) -
నిన్ను మస్తు లవ్ చేశిన.. బ్యాండ్‌మేళం ట్రైలర్
కోర్ట్ జంట హర్ష్ రోషన్, శ్రీదేవి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం బ్యాండ్ మేళం. సతీష్ జవ్వాజి దర్శకత్వం వహించిన ఈ మూవీ ట్రైలర్‌ను శనివారం (మార్చి 21న) విడుదల చేశారు. చిన్నప్పుడే మా అమ్మ సచ్చిపోతే నా అన్నని మా అమ్మ లెక్క చూసుకున్న.. నేనడిగితే పాణం కూడా ఇస్తడు అన్న డైలాగ్‌తో వీడియో మొదలయింది. ఎమోషనల్‌గా ట్రైలర్నేను నిన్ను మస్తు లవ్ చేశిన.. కానీ, నువ్వు నన్ను దేఖలే.., నువ్వు వచ్చినతర్వాతే పగిలిపోయిన నా గుండెను అతుకపెట్టుకున్ననే.. నువ్వు మళ్ల పగలగొట్టినవ్.. నన్ను ఇడ్సిపెట్టు పోవే అంటూ హీరో చెప్పే డైలాగులు బాగున్నాయి. మరదలి ప్రేమ కోసం తపించిపోయిన హీరో చివరకు ఆమెను కాదనుకునే స్థితికి వస్తాడు. మొత్తానికి ట్రైలర్ ఎమోషనల్‌గా సాగింది. విజయ్ బుల్గనిన్ సంగీతం అందించిన ఈ మూవీ మార్చి 26న విడుదల కానుంది. చదవండి: ఉస్తాద్ భగత్ సింగ్ రెండో రోజు కలెక్షన్స్ -
'నాన్న బ్రాండ్‌లోనే విచిత్రమైన నాన్న సార్'.. హ్యాపీరాజ్ ట్రైలర్ చూశారా?
స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాశ్ కుమార్ హీరోగా వస్తోన్న లేటేస్ట్ మూవీ హ్యాపీరాజ్. ఈ చిత్రానికి మరియా రాజా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీలో తెలుగమ్మాయి శ్రీ గౌరీ ప్రియ హీరోయిన్గా కనిపించనుంది. ఈ సినిమాను బియాండ్ పిక్చర్స్ బ్యానర్‌పై జైవర్ద నిర్మించారు. ఈ మూవీతోనే సీనియర్ హీరో అబ్బాస్ రీ ఎంట్రీ ఇస్తున్నారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా తెలుగు ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ట్రైలర్ చూస్తుంటే ఫుల్ ఫ్యామిలీ అండ్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఓ పెద్దింటి అమ్మాయిని మిడిల్ క్లాస్ అబ్బాయి లవ్ చేస్తే వచ్చే సమస్యలు ఏంటనే కోణంలో తీసినట్లు అర్థమవుతోంది. ముఖ్యంగా సీనియర్ హీరో అబ్బాస్ నటించడం ఈ సినిమాకు మరింత ప్లస్ కానుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ చిత్రం మార్చి 27న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సినిమాకు జస్టిన్ ప్రభాకరన్ సంగీతమందించారు. -
సరికొత్త 'స్పైడర్ మ్యాన్' సినిమా ట్రైలర్ రిలీజ్
90స్ జనరేషన్ పిల్లల్ని ఎంతగానో అలరించిన 'స్పైడర్ మ్యాన్' నుంచి ఇప్పటికీ సినిమాలు వస్తూనే ఉన్నాయి. 2021లో చివరగా 'స్పైడర్ మ్యాన్: నో వే హోమ్' పేరుతో రిలీజైన మూవీ ఆకట్టుకుంది. బాగానే కలెక్షన్స్ సాధించింది. దాదాపు ఐదేళ్ల తర్వాత ఇప్పుడు ఈ ఫ్రాంచైజీలో కొత్త చిత్రం రాబోతుంది. 'స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే' టైటిల్‌తో తీశారు. ఇప్పుడు ట్రైలర్ రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: 'ధురంధర్ 2' రెమ్యునరేషన్ డీటైల్స్.. ఎవరికి ఎన్ని కోట్లు?)ట్రైలర్ బట్టి చూస్తే.. నో వే హోమ్ సంఘటనల తర్వాత ప్రపంచానికి పీటర్ పార్కర్ ఎవరో తెలియని స్థితిలో అతడు న్యూయార్క్‌లో కొత్త జీవితాన్ని ప్రారంభిస్తాడు. ఈ క్రమంలోనే ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి? స్పైడర్ మ్యాన్ అలియాస్ పీటర్ పార్కర్ శరీరంలో వచ్చిన జన్యు మార్పులకు కారణమేంటి? అనే విషయాల్ని ఇందులో చూపించబోతున్నట్లు తెలుస్తోంది. టామ్ హోలండ్, జెండాయా ప్రధాన పాత్రలు చేశారు. ఈ జూలై 31న ఇంగ్లీష్, తెలుగు, హిందీ, కన్నడ, తమిళ, మలయాళ భాషల్లో థియేటర్లలోకి రానుంది.స్పైడర్ మ్యాన్ ఫ్రాంచైజీలో భాగంగా 2002లో మొదటి సినిమా వచ్చింది. తర్వాత 2004, 07, 12, 14, 17, 19, 21ల్లో మిగిలిన మూవీస్ వచ్చాయి. ఇప్పుడు వచ్చే చిత్రం బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి?(ఇదీ చదవండి: 'ధురంధర్' పూర్తి స్టోరీ.. సీక్వెల్ చూడటానికి ముందు మరోసారి) -
పవన్ కల్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్.. ట్రైలర్ రిలీజ్
హరీశ్ శంకర్ దర్శకత్వంలో పవన్ కల్యాణ్ హీరోగా నటించిన చిత్రం ఉస్తాద్ భగత్‌సింగ్. ఇందులో శ్రీలీల, రాశీ ఖన్నా కథానాయికలుగా నటిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో మైత్రీ మూవీ మేకర్స్ నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి సంయుక్తంగా నిర్మించారు. అయితే, ఈ చిత్రం ఈ నెల 19న విడుదల కానుంది. అదేరోజున ధరంధర్-2 కూడా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. -
కేవలం రూ.33 వేలతో సినిమా.. ఆకట్టుకుంటున్న ట్రైలర్!
ఈ రోజుల్లో సినిమా తెరకెక్కించాలంటే వందల కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సిందే. చిన్న సినిమాలకు సైతం ఐదారు కోట్ల వరకు ఖర్చు చేస్తున్నారు. అలాంటిది కేవలం రూ. 33 వేల బడ్జెట్‌తో సినిమాను తెరకెక్కించాడు ఓ దర్శకుడు. ఇది నమ్మశక్యంగా లేకున్నా.. వందశాతం నిజం. షార్ట్ ఫిలిమ్స్ సైతం లక్షల బడ్జెట్‌తో తీస్తున్న ఈ రోజుల్లో..దర్శకుడు రాహి అనిల్ ఈ ప్రయోగం చేశాడు. కేవలం 33 వేలతోనే 80 నిమిషాల నిడివి ఉన్న సినిమాను తెరకెక్కించాడు. రాహి అనిల్ ఎవరో కాదు.. తుంబాడ్, మంఝా, మాయాసభ లాంటి సినిమాతో ప్రేక్షకులను విపరీతంగా భయపెట్టింది ఈ దర్శకుడే. ఇప్పుడు మన్ పిశాచ్ పేరుతో రూపొందిన సైకాలజికల్ హారర్ డ్రామాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాడు. మార్చి 18న ఈ మూవీ యూట్యూబ్‌లో విడుదల కానుంది. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ని విడుదల చేశారు.ఈ మూవీలో కేవలం ఇద్దరు నటులు(యానియా భరద్వాజ్, దీపక్ దమ్లే) మాత్రమే ఉన్నారు. ఐఫోన్ కెమెరాతో వీడియో తీసి.. ఏఐ టెక్నాలజీ ఉపయోగించి అతి తక్కువ బడ్జెట్‌తో ఈ మూవీని తీర్చిదిద్దారు. ‘ఇది నా కొత్త ప్రయోగం. సాంకేతికత ఎలా సినిమాలను మారుస్తుందో చూపించాలని కోరాను’ అని డైరెక్టర్ తెలిపారు. భవిష్యత్తులో ఏఐ ప్రభావం సినిమా రంగంపై ఏ స్థాయిలో ఉండబోతుందో చెప్పడానికి ఈ సినిమా ఓ మంచి ఉదాహరణ. -
48 గంటల్లో 312 మిలియన్స్ వ్యూస్.. ‘ధురంధర్ 2’ రికార్డు
రణ్వీర్ సింగ్ హీరోగా ఆదిత్య ధర్ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం ‘ధురంధర్ 2’. గతేడాది బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచిన ‘ధురంధర్’ చిత్రానికి సీక్వెల్ ఇది. ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్‌పై ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక తాజాగా రిలీజైన ట్రైలర్ ఆ అంచనాలను మరింత పెంచేశాయి. అంతేకాదు రిలీజ్‌కి ముందే ఈ సినిమా రికార్టులను కొల్లగొడుతోంది. యూట్యూబ్‌లో ఈ మూవీ ట్రైలర్‌కి రికార్డు స్థాయిలో వ్యూస్ వచ్చాయి. కేవలం 48 గంటల్లో అంటే రెండో రోజుల్లేనే 312 మిలియన్ల వ్యూస్ సాధించింది. ఈ మధ్యకాలంలో ఒక మూవీ ట్రైలర్‌కు ఈ స్థాయి వ్యూస్ వచ్చిన దాఖలాలు లేవు.ట్రైలర్లో పవర్ఫుల్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, స్ట్రైకింగ్ డైలాగ్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ట్రైలర్ ఆడియో ఇన్‌స్టాగ్రామ్‌లో ట్రెండ్ అవుతూ, అనేక రీల్స్, ఫ్యాన్ ఎడిట్స్‌కు ప్రేరణగా మారింది. ఇదే సమయంలో గూగుల్ ట్రెండ్స్‌లో కూడా ఈ సినిమా, నటీనటులపై సెర్చ్‌లు భారీగా పెరిగాయి. ఈ చిత్రంలో రణవీర్ సింగ్ ద్విపాత్రాభినయంలో కనిపించనున్నారు. మార్చి 19న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. -
భారీ అంచనాలతో.. ధురంధర్ 2.. ట్రైలర్ చూస్తే పూనకాలే
-
వాయిదా రూమర్స్‌కి చెక్.. ట్రైలర్ రిలీజ్ ఎప్పుడంటే?
'ధురంధర్ 2' సినిమా విడుదలకు ఇంకా రెండు వారాలు కూడా లేదు. టీమ్ నుంచి ఎలాంటి అప్డేట్ లేకపోయేసరికి వాయిదా పడుతుందనే రూమర్స్ వినిపించాయి. యష్ 'టాక్సిక్' తప్పుకోవడంతో.. ధురంధర్ సీక్వెల్ కూడా అలానే చేస్తుందేమోనని మాట్లాడుకున్నారు. కానీ ట్రైలర్ రిలీజ్ అప్డేట్ గురించి అధికారికంగా ప్రకటించి సదరు పుకార్లకు చెక్ పెట్టేశారు.రణ్వీర్ సింగ్ పాన్ ఇండియా మూవీ 'ధురంధర్:ది రివెంజ్' ట్రైలర్‌ని శనివారం(మార్చి 07) ఉదయం 11:01 గంటలకు విడుదల చేయనున్నట్లు అధికారికంగా అనౌన్స్ చేశారు. దీనిబట్టి మూవీపై ఓ అంచనాకు వచ్చేస్తారు. ఇందులో రణవీర్.. జస్కిరత్ సింగ్, హమ్జా అనే రెండు విభిన్న పాత్రల్లో కనిపించనున్నాడు.(ఇదీ చదవండి: తిరుమలలో రుక్మిణి వసంత్.. ఈమె చెల్లిని చూశారా?)'ధురంధర్' తొలి భాగం.. భారత్‌తో పాటు అంతర్జాతీయంగానూ హిట్ అయింది. రూ.1300 కోట్లకుపైనే కలెక్షన్ సాధించి రికార్డులు సృష్టించింది. ముఖ్యంగా నార్త్ అమెరికా, కెనడా, యుకే, ఆస్ట్రేలియా లాంటి చోట్ల భారీ విజయాన్ని అందుకుంది. తొలి పార్ట్ కేవలం హిందీలోనే రాగా ఇప్పుడు దక్షిణాది భాషల్లోనూ రిలీజ్ కానుండటం మరింతగా కలిసి రానుంది.జియో స్టూడియోస్ సమర్పణలో, బి62 స్టూడియోస్ నిర్మాణంలో దర్శకుడు ఆదిత్య ధార్ తీసిన ఈ చిత్రం.. పాకిస్థాన్ బ్యాక్‌డ్రాప్‌లో తీసిన స్పై యాక్షన్ థ్రిల్లర్. హిందీ, తమిళ, తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో ఈ నెల 19న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. గుడి పాడ్వా, ఉగాది పండుగల సందర్భంలో ఈద్‌కు ముందుగా విడుదలవుతూ భారీ ఓపెనింగ్ సాధించేందుకు సిద్ధమవుతోంది.(ఇదీ చదవండి: టాలీవుడ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ ప్రేమ పెళ్లి.. అమ్మాయి ఎవరంటే?) -
యశ్ టాక్సిక్.. ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్
కేజీఎఫ్ హీరో, కన్నడ స్టార్ హీరో యశ్ నటించిన భారీ యాక్షన్ మూవీ టాక్సిక్. ఇటీవలే టీజర్, గ్లింప్స్ చేయగా అభిమానులను ఆకట్టుకున్నాయి. కానీ గ్లింప్స్ మరింత బోల్డ్‌గా ఉండటంతో చాలా విమర్శలు వచ్చాయి. కేజీఎఫ్ 2 వంటి బ్లాక్‌బస్టర్స్ తర్వాత యష్ నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం కావడంతో ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు.తాజాగా ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ డేట్ ప్రకటించారు మేకర్స్. మార్చి 8న టాక్సిక్ ట్రైలర్ రిలీజ్ చేయనున్నట్లు వెల్లడించారు. బెంగళూరులో ఈ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాకు గీతు మోహన్‌దాస్ దర్శకత్వం వహించారు.కాగా.. ఈ చిత్రంలో నయనతార, కియారా అద్వానీ, హుమా ఖురేషి, తారా సుతారియా కూడా కీలక పాత్రల్లో నటించారు. ఈ మూవీని కన్నడ, ఆంగ్లంలో ఓకేసారి చిత్రీకరించారు. ఈ సినిమాను హిందీ, తెలుగు, తమిళం, మలయాళం కూడా రిలీజ్ చేస్తున్నారు. కెవిఎన్ ప్రొడక్షన్స్, మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్ బ్యానర్లపై నిర్మించిన ఈ చిత్రం మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది. -
రష్మిక రీల్ బ్రదర్ హీరోగా సినిమా.. ట్రైలర్ రిలీజ్
హిట్, లక్కీ భాస్కర్ తదితర సినిమాల్లో సహాయ నటుడిగా చేసిన శ్రీనాథ్ మాగంటి.. 'యానిమల్' మూవీలో రష్మికకు సోదరుడిగానూ యాక్ట్ చేశాడు. ఇప్పుడు ఇతడు హీరోగా నటించిన కొత్త సినిమా విడుదలకు సిద్ధమైంది. అదే 'మెన్షన్ హౌస్ మల్లేష్'. మార్చి 06న థియేటర్లలోకి రాబోతున్న సందర్భంగా తాజాగా సందీప్ రెడ్డి వంగా చేతుల మీదగా ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇది అలరించేలా ఉంది.(ఇదీ చదవండి: అపచారం.. తిరుమల గుడి ముందే 'బిగ్‌బాస్' భామ డ్యాన్సులు)తెలంగాణలోని ఓ ఊరిలో మల్లేష్ అనే కుర్రాడు. మందు తాగుతూ అవారాగా తిరుగుతుంటాడు. మారుతాడనుకుని ఓ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తారు. తర్వాత ఎలాంటి పరిణామాలు ఎదురయ్యాయి. మల్లేష్‌కి అతడి భార్యతో ఎలాంటి బంధం ఏర్పడింది అనేదే స్టోరీలా అనిపించింది. ట్రైలర్లోనే మూవీ ప్లాట్ ఏంటనేది దాదాపుగా బయటపెట్టేశారు. చూడాలి మరి థియేటర్లలో ఎలాంటి టాక్ అందుకుంటుందో?(ఇదీ చదవండి: మరో ఓటీటీలోకి 'గాంధీ టాక్స్'.. తెలుగు స్ట్రీమింగ్ ఎప్పుడంటే?) -
రాధిక శరత్‌కుమార్ డిఫరెంట్ రోల్ మూవీ.. ఆసక్తిగా ట్రైలర్
సీనియర్ నటి రాధిక శరత్‌కుమార్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న తాజా చిత్రం తాయ్ కిజవి. ఈ మూవీలో ఇంతకు ముందెన్నడు కనిపించని లుక్‌లో రాధికా కనిపించనుంది. ఈ సినిమాకు శివకుమార్ మురుగేశన్ దర్శకత్వం వహించారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ చిత్రాన్ని హీరో శివ కార్తికేయన్ నిర్మించారు. ఈ చిత్రంలో రాధిక శరత్‌కుమార్ వృద్ధురాలిగా కనిపించనున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ చిత్రం ఫిబ్రవరి 27న థియేటర్లలో సందడి చేయనుంది. అయితే ప్రస్తుతానికి కేవలం తమిళంలోనే రిలీజ్ కానుంది. తెలుగులోకి డబ్ చేసి రిలీజ్ చేసే విషయంపై మేకర్స్ క్లారిటీ ఇవ్వలేదు. ఈ చిత్రంలో సింగమ్ పులి, అరుళ్ దాస్, బాల శరవణన్, తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. -
లెస్బియన్ కాన్సెప్ట్ సినిమా.. ఓటీటీలో డైరెక్ట్ స్ట్రీమింగ్
హీరోయిన్ రష్మిక.. రాబోయే ఓ కొత్త సినిమాలో స్వలింగ సంపర్కరాలిగా నటించనుందనే న్యూస్ తెగ వైరల్ అవుతోంది. ఇది నిజమా కాదా అనేది సదరు మూవీ రిలీజైతే కానీ తెలియదు. అయితే దీనికంటే ముందే ఇప్పుడు ఇదే తరహా కాన్సెప్ట్‌తో తీసిన ఓ హిందీ చిత్రం.. నేరుగా ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ఇదివరకే స్ట్రీమింగ్ తేదీ ప్రకటించగా.. తాజాగా ట్రైలర్ రిలీజ్ చేసి స్టోరీ ఏంటనేది బయటపెట్టేశారు.(ఇదీ చదవండి: ఓటీటీలో మలయాళ సినిమా.. 'చథా పచ్చ తెలుగు రివ్యూ)ప్రముఖ నటి కొంకనా సేన్, 'లాపతా లేడీస్' ఫేమ్ ప్రతిభ రత్న ప్రధాన పాత్రలు పోషించిన సినిమా 'అక్యూజ్డ్'. నెట్‌ఫ్లిక్స్ సొంతంగా నిర్మించిన ఈ చిత్రం.. సదరు ఓటీటీలోకే వచ్చే శుక్రవారం(ఫిబ్రవరి 27) నుంచి స్ట్రీమింగ్‌లోకి రానుంది. ఇందులో లీడ్ పెయిర్.. లెస్బియన్ కపుల్ పాత్రల్లో నటించడం విశేషం. ఇదో హాలీవుడ్ మూవీకి రీమేక్ అని తెలుస్తోంది.విదేశాల్లో జీవించే ప్రధాన పాత్రధారుల్లో ఒకరు(కొంకనా సేన్).. ఆస్పత్రిలో డాక్టర్‌గా పనిచేస్తుంటుంది. అయితే ఈమెపై షాకింగ్ ఆరోపణలు వస్తాయి. ఆస్పత్రిలోని చాలామంది లైంగికంగా వేధిస్తుందని రూమర్స్ బయటకొస్తాయి. దీంతో ఈమె రిలేషన్‌లోనూ ఇబ్బందులు తలెత్తుతాయి. చివరకు ఏమైంది? నిజంగానే సదరు డాక్టర్ అలాంటిదేనా? అనేది మిగతా స్టోరీలా అనిపిస్తుంది. ఈ తరహా కాన్సెప్ట్.. ఇంగ్లీష్ వెబ్ సిరీస్‌ల్లో కనిపిస్తూ ఉంటాయి. మరి ఈ సినిమాని భారతీయ ఆడియెన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి? ఇది తెలుగులోనూ స్ట్రీమింగ్ అయ్యే అవకాశముంది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి మలయాళ మిస్టరీ థ్రిల్లర్ సినిమా.. 4 నెలలకు స్ట్రీమింగ్) -
ది కేరళ స్టోరీ సీక్వెల్.. బోల్డ్ అండ్ వయొలెంట్‌గా ట్రైలర్
ఆదా శర్మ కీలక పాత్రలో వచ్చిన చిత్రం ది కేరళ స్టోరీ. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించింది. ఎన్ని విమర్శలు, వివాదాలు ఎదురైనప్పటికీ ప్రపంచవ్యాప్తంగా అభిమానుల ఆదరణ దక్కించుకుంది. ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో మేకర్స్ సీక్వెల్‌తో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. కేరళలోని అమ్మాయిలను మత మార్పిడి చేసి గల్ఫ్ దేశాలకు తీసుకెళ్లిన రియల్ స్టోరీతో ది కేరళ స్టోరీని తెరకెక్కించారు. . సుదీప్తో సేన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఏకంగా రెండు జాతీయ చలనచిత్ర అవార్డులు గెలిచింది.తాజాగా ఈ మూవీకి సీక్వెల్ వస్తోన్న ది కేరళ స్టోరీ-2 గోల్ బియాండ్ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ట్రైలర్ చూస్తుంటే మనదేశంలోని పలు రాష్ట్రాలకు చెందిన అమ్మాయిలను లవ్ పేరుతో మత మార్పిడి చేసి చిత్ర హింసలకు గురి చేసే కథాంశంగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఈ మూవీ రియల్ సంఘటనల ఆధారంగానే రూపొందించారు. ఈ చిత్రాన్ని ముగ్గురు హిందూ అమ్మాయిల జీవితం ఆధారంగా తెరకెక్కించారు. కాగా.. ఈ చిత్రానికి కామాఖ్య నారాయణ్ సింగ్ దర్శకత్వం వహించారు. ఈ మూవీని సన్‌షైన్ పిక్చర్స్ బ్యానర్లో విపుల్ అమృత్లాల్ షా నిర్మించారు. ఈ సినిమాకు మన్నన్ షా సంగీతం అందించారు. ఈ సీక్వెల్ ఫిబ్రవరి 27న థియేటర్లలో విడుదల కానుంది.కాగా.. 2023లో విడుదలైన 'ది కేరళ స్టోరీ' బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ చిత్రంలో అదా శర్మ, సిద్ధి ఇద్నాని, యోగితా బిహాని, సోనియా బలాని ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ కథ కేరళకు చెందిన కొంతమంది మహిళలు ఇస్లాంలోకి ఎలా మారారు అనే కోణంలో ఈ మూవీని తెరకెక్కించారు. -
'రాయుడు గారి తాలూకా' ట్రైలర్
'సోగ్గాడే చిన్ని నాయన' ఫేమ్ దర్శకుడు కల్యాణకృష్ణ చేతులు మీదుగా 'రాయుడు గారి తాలూకా' ట్రైలర్ విడుదలైంది. హీరో కమ్ నిర్మాతగా ఉలిశెట్టి శ్రీనివాస్ చేశారు. కల్యాణ్ కృష్ణ మాట్లాడుతూ.. ట్రైలర్ అద్భుతంగా ఉంది. టీమ్ అందరికీ నా బెస్ట్ విషెస్ అని అన్నారు. హీరో నిర్మాత ఉలిశెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ఇది ఒక చక్కటి కుటుంబ చిత్రం, కుటుంబ విలువలు తెలిపే సినిమా, ఆద్యంతం అందరినీ ఆకట్టుకుంటుంది. మార్చి 6న థియేటర్లలో రిలీజ్ కానుందని అన్నారు. -
టాలీవుడ్ హారర్ థ్రిల్లర్.. భయపెడుతోన్న ట్రైలర్
ధన్య బాలకృష్ణ, ఎస్తేర్, సుప్రీత, శివ కంఠనేని ప్రధాన పాత్రలో వస్తోన్న హారర్ థ్రిల్లర్ మూవీ అమరావతికి ఆహ్వానం. ఈ సినిమాకు జీవీకే దర్శకత్వం వహించారు. ఈ మూవీని కేఎస్ శంకర్రావు, ఆర్ వెంకటేశ్వరరావు నిర్మించారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా ఫిబ్రవరి 13న థియేటర్లలో సందడి చేయనుంది. అమరావతికి ఆహ్వానం ట్రైలర్ చూస్తుంటే హారర్ థ్రిల్లర్ మూవీగానే తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఏంట్రా ఈ ఊరు మనుషులే కనపడట్లేదు అనే డైలాగ్‌తో ప్రారంభమైంది. ఈ గ్రామంలో జరిగే మిస్టరీ నేపథ్యంలో ఈ సినిమా ఉండనుందని ట్రైలర్ చూస్తుంటే అర్థమవుతోంది. ట్రైలర్లో సీన్స్ ఆడియన్స్‌ను భయపెట్టేస్తున్నాయి. దెయ్యాల కాన్సెప్ట్‌తోనే ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. -
ఫంకీ ట్రైలర్: పంచులే పంచులు!
గతేడాది 'లైలా' సినిమాతో బొక్కబోర్లా పడ్డాడు హీరో విశ్వక్సేన్. ఈసారి ఎటువంటి ప్రయోగాలు చేయకుండా కామెడీ జానర్ ఎంచుకున్నాడు. జాతిరత్నాలు ఫేమ్ అనుదీప్ దర్శకత్వంలో ఫంకీ సినిమా చేశాడు. డ్రాగన్ బ్యూటీ కయాదు లోహర్ కథానాయికగా నటించింది. శనివారం (ఫిబ్రవరి 7న) ఫంకీ ట్రైలర్ రిలీజ్ చేశారు.ట్రైలర్ నిండా పంచులేట్రైలర్ ప్రారంభం నుంచే పంచులతో, కామెడీతో అదిరిపోయింది. మీ అమ్మకు ఆపరేషన్ చేయాలంటే నాకు రాదు డాక్టర్ అన్న డైలాగ్‌తో వీడియో మొదలైంది. ఓనర్‌కు రెంట్ కట్టుడు వంటివన్నీ నాకు గలీజ్ అనిపిస్తయ్ అంటాడు హీరో. ట్రైలర్ ముగింపు వరకు పంచులకు లోటే లేకుండా కట్ చేశారు. మొత్తానికి ట్రైలర్‌తోనే మంచి హైప్ ఇచ్చారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్న ఈ మూవీ ఫిబ్రవరి 13న విడుదలవుతోంది. -
విశ్వక్ సేన్ ఫంకీ.. ట్రైలర్ రిలీజ్ ఎప్పుడంటే?
టాలీవుడ్ హీరో విశ్వక్ సేన్ నటించిన తాజా చిత్రం ఫంకీ. ఈ మూవీకి 'జాతిరత్నాలు' ఫేమ్ దర్శకుడు అనుదీప్ దర్శకత్వం పహించారు. గతేడాది హిట్ మూవీ లేకపోవడంతో ఈ సినిమాపైనే ఆశలు పెట్టుకున్నారు మాస్ కా దాస్. ఈ చిత్రంలో హీరోయిన్గా కయాదు లోహర్ కనిపించనుంది. ఇప్పటికే టీజర్ రిలీజ్ చేసిన మేకర్స్.. ప్రమోషన్స్‌తో దూసుకెళ్తున్నారు.తాజాగా ఈ సినిమాకు సంబంధించిన బిగ్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఫంకీ ట్రైలర్ రిలీజ్ డేట్‌ను ప్రకటించారు. ఈ నెల 7న మూసాపేట్‌లోని శ్రీరాములు థియేటర్లో ట్రైలర్ లాంఛ్ చేయనున్నట్లు పోస్టర్ పంచుకున్నారు. ఇప్పటికే రిలీజైన పాటలు, టీజర్‌కు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ సినిమాను శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మించారు. ఈ కామెడీ ఎంటర్టైనర్ ఫిబ్రవరి 13న థియేటర్లలో విడుదల కానుంది.The Key for FUN with #FUNKY unlocks tomorrow 🔓💥 Trailer drops on 7th Feb from 4 PM onwards. #FunkyTrailer Launch Event at Sree Ramulu 70MM, Hyderabad. Join us for pure FUNKY MADNESS 😎🔥 In cinemas from FEB 13 #FunkyFrom13thFeb Mass Ka Das @VishwakSenActor @11Lohar… pic.twitter.com/g2UyiUjsLL— Sithara Entertainments (@SitharaEnts) February 6, 2026 -
లివింగ్ రిలేషన్ కాన్సెప్ట్.. 'కపుల్ ఫ్రెండ్లీ' ట్రైలర్ రిలీజ్
హీరోగా పలు సినిమాలు చేస్తున్నప్పటికీ సక్సెస్ కాలేకపోతున్న హీరో సంతోష్ శోభన్.. కాస్త గ్యాప్ తర్వాత 'కపుల్ ఫ్రెండ్లీ' అనే మూవీ చేశాడు. వాలంటైన్స్ డే కానుకగా ఈనెల 14న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ఇప్పుడు ట్రైలర్‌ని విడుదల చేశారు. లివింగ్ రిలేషన్ కాన్సెప్ట్‌తో చిత్రాన్ని తెరకెక్కించినట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 14 సినిమాలు.. అవి డోంట్ మిస్)అశ్విన్ చంద్రశేఖర్ దర్శకుడు కాగా సంతోష్ శోభన్ సరసన మానస వారణాసి హీరోయిన్గా నటించింది. తెలుగుతో పాటు తమిళంలోనూ దీన్ని రిలీజ్ చేయనున్నారు. అనుకోకుండా ఓసారి కలిసిన హీరోహీరోయిన్లు.. కొన్నాళ్లకు ఫ్రెండ్స్ అవుతారు. తర్వాత కలిసి ఒకే ఫ్లాట్‌లో ఉంటూ లివింగ్ రిలేషన్షిప్ మెంటైన్ చేస్తారు. తర్వాత పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటారు. అప్పుడు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? చివరకు ఏం జరిగిందనేదే స్టోరీలా అనిపిస్తుంది.(ఇదీ చదవండి: మహేశ్‌కి నా గొంతు సూట్ అవ్వలేదు.. అందుకే ఫ్లాప్) -
ఆ పిల్లి ఉంటే అందరూ దాసోహమే.. 'హనీ' ట్రైలర్ రిలీజ్
నవీన్ చంద్ర, దివ్యా పిళ్లై ప్రధాన పాత్రల్లో నటించిన సైకలాజికల్ హారర్ సినిమా 'హనీ'. కరుణ కుమార్ దర్శకుడు. ఓవీఏ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై రవి పీట్ల, ప్రవీణ్ కుమార్ రెడ్డి నిర్మించారు. శేఖర్ స్టూడియోస్ సమర్పిస్తోంది. ఫిబ్రవరి 6న ఈ చిత్రం థియేటర్లలో విడుదల కానుంది. ఈ క్రమంలోనే ఆదివారం ఈవెంట్ నిర్వహించి ట్రైలర్‌ని లాంచ్ చేశారు. ఇది భయపెట్టేలా ఉండటం విశేషం.(ఇదీ చదవండి: దుబాయిలో అల్లు శిరీష్ బ్యాచిలర్ పార్టీ.. ఫొటోలు వైరల్)నిజ జీవిత సంఘటనల ప్రేరణతో మూఢనమ్మకాలు, అంధ విశ్వాసాలు, డార్క్ సైకలాజికల్ అంశాలతో 'హనీ' మూవీ తీశారు. ఈ మూవీలో దివి, రాజా రవీంద్ర, బేబీ జయన్ని, బేబీ జయత్రి తదితర ఇతర కీలక పాత్రలు పోషించారు. సైకాలజికల్ డెప్త్, సోషల్ రిలవెన్స్, హారర్ అంశాలతో దీన్ని తెరకెక్కించారు. ట్రైలర్ బట్టి చూస్తే.. ఓ దేవత వాహనంగా పిల్లిని చూపించారు. ఇది ఎవరి దగ్గర ఉంటే అందరూ వాళ్లకు దాసోహం అవుతారనే పాయింట్ చెప్పుకొచ్చారు. ఇది ఇంట్రెస్టింగ్గా అనిపించింది.(ఇదీ చదవండి: విషాదం.. టాలీవుడ్ సీనియర్ నటుడు కన్నుమూత) -
కాలేజీ ప్రేమకథా చిత్రం 'విత్ లవ్'.. ఆసక్తిగా ట్రైలర్
టూరిస్ట్ ఫ్యామిలీ మూవీతో సత్తా చాటిన యువ దర్శకుడు అభిషన్ జీవింత్ హీరోగా ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం విత్ లవ్. ఈ మూవీలో ఛాంపియన్ బ్యూటీ అనస్వర రాజన్ హీరోయిన్గా కనిపించనుంది. ఈ సినిమాకు మదన్ దర్శకత్వం వహించారు.తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ట్రైలర్ చూస్తుంటే కాలేజీ నేపథ్యంలోనే సాగే ఫీల్ గుడ్ అండ్ రొమాంటిక్ లవ్ స్టోరీగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా ఫిబ్రవరి 6న తెలుగులోనూ రిలీజవుతోంది. ఈ నేపథ్యంలోనే తెలుగు ట్రైలర్ విడుదల చేశారు. ఈ చిత్రాన్ని సౌందర్య రజినీకాంత్, మాగేశ్ రాజ్ నిర్మించారు. -
'ఆల్రెడీ హీరోలున్నారు కదా.. నువ్వెందుకురా అనుకోవచ్చు'
బిగ్‌బాస్ అమర్దీప్, సైలీ జంటగా నటించిన తాజా చిత్రం ‘సుమతీ శతకం’. ఈ మూవీకి ఎమ్ఎమ్ నాయుడు దర్శకత్వం వహించరు. కొమ్మాలపాటి శ్రీధర్ సమర్పణలో సాయి సుధాకర్ నిర్మించారు. ఇటీవలే ఈ మూవీ నుంచి 'నా కుట్టీ కుట్టీ సుమతీ.. నా చిట్టీ చిట్టీ సుమతీ' అంటూ సాగే లవ్ సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ పాటకు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఓ ఇంజినీరింగ్ కాలేజీలో ఏర్పాటు చేసిన ఈవెంట్లో ఈ మూవీ ట్రైలర్ విడుదల చేశారు.ఈ సందర్భంగా ఈవెంట్‌కు హాజరైన అమర్దీప్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. నేను చాలా చిన్న స్టేజ్ నుంచి వచ్చానని అన్నారు. అనంతపురం నుంచి వచ్చిన వ్యక్తిని.. రామ అనే పేరుతో మీ అందరికీ పరిచయమే.. అందుకే నన్ను ఇక్కడిదాకా తీసుకొచ్చారు. ఆల్రెడీ హీరోలున్నారు కదా.. నువ్వెందుకురా అని మీరందరూ అనుకోవచ్చు.. కానీ దీనికి నా దగ్గర సమాధానం ఉందన్నారు. ఇది రేపొద్దున కాదు అంటే.. అప్పుడు నన్ను మీరు ట్రోల్ చేయండి బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని అన్నారు. కానీ మీకు ఆ అవకాశం ఇవ్వకుండా చేశానని తెలిపారు. ఈ మూవీ కోసం ప్రాణం పెట్టి చేశానని అమర్దీప్ చౌదరి పేర్కొన్నారు. కాగా.. ఈ సినిమా మైత్రీ మూవీస్ డిస్ట్రిబ్యూటర్స్ సంస్థ ద్వారా ఫిబ్రవరి 6న థియేటర్లలోకి రానుంది. ఈ చిత్రంలో టేస్టీ తేజ, మహేష్ విట్టా, జెడివి ప్రసాద్, మిర్చి కిరణ్ కీలక పాత్రల్లో నటించారు. "హీరోలున్నారు కదా.. నువ్వెందుకురా అనుకోవచ్చు"'నేను ఎందుకురా' అనేదానికి ఇందులో ఫుల్ సమాధానం ఉంది!!"రేప్పొద్దున కాదు ఇది లేదు అంటే అప్పుడు మాట్లాడండి బ్రదర్స్.. అప్పుడు ట్రోల్ చేయండి సిస్టర్స్"- #Amardeep గారు #SumathiSathakam pic.twitter.com/hxka7yk0CH— Mega Abhimani (@megaabhimani3) January 29, 2026 -
బిగ్‌బాస్ అమర్దీప్ సుమతీ శతకం.. ట్రైలర్ వచ్చేసింది
బిగ్‌బాస్ అమర్దీప్, సైలీ జంటగా నటించిన తాజా చిత్రం ‘సుమతీ శతకం’. ఈ మూవీకి ఎమ్ఎమ్ నాయుడు దర్శకత్వం వహించరు. కొమ్మాలపాటి శ్రీధర్ సమర్పణలో సాయి సుధాకర్ నిర్మించారు. ఇటీవలే ఈ మూవీ నుంచి 'నా కుట్టీ కుట్టీ సుమతీ.. నా చిట్టీ చిట్టీ సుమతీ' అంటూ సాగే లవ్ సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ పాటకు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ట్రైలర్ చూస్తుంటే ఓ మిడిల్ క్లాస్ అబ్బాయి ప్రేమకథగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. స్కూల్ టీచర్లో ప్రేమాయణం నడిపించిన యువకుడి స్టోరీలా ట్రైలర్లో కనిపిస్తోంది. కాగా.. ఈ సినిమా మైత్రీ మూవీస్ డిస్ట్రిబ్యూటర్స్ సంస్థ ద్వారా ఫిబ్రవరి 6న థియేటర్లలోకి రానుంది. ఈ చిత్రంలో టేస్టీ తేజ, మహేష్ విట్టా, జెడివి ప్రసాద్, మిర్చి కిరణ్ కీలక పాత్రల్లో నటించారు. -
ఓటీటీలో మర్డర్ మిస్టరీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్
ఓటీటీలు వచ్చాక వెబ్ సిరీస్‌లకు ఆదరణ పెరిగిపోయింది. ముఖ్యంగా క్రైమ్ థ్రిల్లర్ స్టోరీలకు ఆడియన్స్ నుంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ నేపథ్యంలో మరో ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ మీ ముందు వచ్చేస్తోంది. ఇప్పటికే రిలీజై క్రేజ్ దక్కించుకున్న కొహరా వెబ్ సిరీస్ సీజన్-2 స్ట్రీమింగ్కు సిద్ధమైంది. ఈ సిరీస్‌లో మోనా సింగ్, బరున్ సోబ్తి కీలక పాత్రల్లో నటించారు.ఈ నేపథ్యంలోనే కొహరా సీజన్-2 ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ట్రైలర్ చూస్తుంటే హత్యల నేపథ్యంలోనే తెరకెక్కించినట్లు తెలుస్తోంది. మర్డరీ మిస్టరీ సిరీస్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు అర్థమవుతోంది. ఈ సిరీస్ ఫిబ్రవరి 11 నుంచి నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. క్రైమ్ థ్రిల్లర్ సిరీస్‌లు ఇష్టపడేవారు కొహరా చూసేయండి. -
ఓ యువకుడి ప్రేమకథా చిత్రం.. ఆసక్తిగా ట్రైలర్
వంశీ తుమ్మల, సంధ్యా వశిష్ఠ జంటగా నటించిన తాజా చిత్రం శ్రీ చిదంబరం గారు. ఈ సినిమాకు వినయ్‌రత్నం దర్శకత్వం వహించారు. ఈ మూవీకి చింతా వినీషారెడ్డి, చింతా గోపాలకృష్ణారెడ్డి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. పెద్ది దర్శకుడు బుచ్చిబాబు సనా చేతుల మీదుగా ట్రైలర్‌ను విడుదల చేశారు.తాజా రిలీజైన ట్రైలర్ చూస్తుంటే ఓ మధ్య తరగతి యువకుడి జీవితం ఆధారంగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఊరు వదిలి విదేశాలకు వెళ్లాలనుకున్న యువకుడికి ఓ యువతి పరిచయం కావడంతో ఏం చేశాడనే ఆసక్తికర కథనంతో ఈ మూవీ తీర్చిదిద్దినట్లు ట్రైలర్ చూస్తుంటే అర్థమవుతోంది. 'తల దించుకుని నడిచి నడిచి మెడ లాగేస్తోందమ్మా.. ఇప్పుడన్నా నన్ను తలెత్తుకొనీయమ్మా' అనే డైలాగ్ ఎమోషనల్ వింటే ఎమోషనల్‌గా స్టోరీగా కనిపిస్తోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా ఫిబ్రవరి 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
విజయ్ సేతుపతి మూకీ సినిమా.. ట్రైలర్ రిలీజ్
పేరుకే తమిళ నటుడు అయినప్పటికీ పాన్ ఇండియా లెవల్ గుర్తింపు తెచ్చుకున్న విజయ్ సేతుపతి నుంచి ఇప్పుడు ఓ మూకీ సినిమా రాబోతుంది. అదే 'గాంధీ టాక్స్'. నాలుగేళ్ల క్రితమే ఈ ప్రాజెక్టుని మొదలుపెట్టారు గానీ ఇన్నాళ్లకు థియేటర్లలో విడుదలకు సిద్ధమైంది. ఈ శుక్రవారమే (జనవరి 30) ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మేరకు తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు 'దేవర' నిర్మాత గుడ్‌న్యూస్)ఇందులో విజయ్ సేతుపతి సరసన అదితీ రావు హైదరీ హీరోయిన్. అరవింద స్వామి కీలక పాత్రధారి. కిశోర్ పి బెలేకర్ దర్శకత్వం వహించారు. ప్రతి స్టోరీకి మాటలు అవసరం లేదు. కొన్ని చూడటంతోనే మనసుని హత్తుకుంటాయి. ఈసారి స్క్రీన్ పై మాటలుండవు. అది మిమ్మల్ని వినేలా మాత్రమే చేస్తుంది అని ట్రైలర్‌తో చెప్పుకొచ్చారు. డబ్బు అనేది నలుగురు వ్యక్తుల జీవితాల్లో ఎలాంటి పరిణామాలకు కారణమైంది అనేది ఇందులో చూపించబోతున్నారు. ఏఆర్ రెహమాన్ సంగీతమందించాడు.(ఇదీ చదవండి: ఓటీటీలో కార్తీ 'అన్నగారు వస్తారు' సినిమా.. డైరెక్ట్‌గా స్ట్రీమింగ్) -
'భర్తపై భార్య తిరగబడితే..'.. ఆసక్తిగా ట్రైలర్
తరుణ్ భాస్కర్, ఈషారెబ్బా జంటగా వస్తోన్న తాజా చిత్రం ఓం శాంతి శాంతి శాంతిః. ఈ సినిమాకు ఎ.ఆర్ సజీవ్ దర్శకత్వం వహించారు. జయ జయ జయహే అనే మలయాళ చిత్రానికి రీమేక్‌గా ఈ మూవీని రూపొందించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ చిత్రం థియేటర్లలో సందడి చేసేందుకు వచ్చేస్తోంది.ఈ నేపథ్యంలోనే ఓం శాంతి శాంతి శాంతిః మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ చేతుల మీదుగా ట్రైలర్ విడుదల చేశారు. ఈ మూవీ ట్రైలర్ చూస్తుంటే భార్య, భర్తల మధ్య జరిగే ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంటర్టైనర్లా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. కామెడీ సీన్స్ అలరిస్తున్నాయి. భార్యపై భర్త డామినేషన్ చేయడం.. ఆ తర్వాత జరిగే సీన్స్ ఈ సినిమాపై ఆసక్తి మరింత పెంచుతున్నాయి. ఈ చిత్రం జనవరి 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇంకెందుకు ఆలస్యం ట్రైలర్ చూసేయండి. -
యానిమల్ బ్యూటీ యాక్షన్ మూవీ.. ట్రైలర్ రిలీజ్
షాహిద్ కపూర్ హీరోగా వస్తోన్న ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్ ఓ రోమియో. ఈ సినిమాకు విశాల్ భరద్వాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. యానిమల్ బ్యూటీ త్రిప్తి డిమ్రీ హీరోయిన్గా కనిపించనుంది. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.ట్రైలర్ చూస్తుంటే ఫుల్ యాక్షన్ మూవీగానే తెరకెక్కించినట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమా ట్రైలర్ హిందీలో కాకుండా ఇంగ్లీష్ భాషలో రిలీజ్ చేయడం విశేషం. ఈ చిత్రంలో అవినాష్ తివారి, విక్రాంత్ మస్సే, నానా పటేకర్, తమన్నా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ ఫిబ్రవరి 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
మలయాళ యాక్షన్ మూవీ.. తెలుగు ట్రైలర్ వచ్చేసింది
మలయాళంలో తెరకెక్కించిన యాక్షన్ సినిమా చతా పచ్చ.. ది రింగ్ ఆఫ్ రౌడీస్. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సందడి చేసేందుకు వచ్చేస్తోంది. ఈ చిత్రంలో అర్జున్ అశోకన్, రోషన్ మాథ్యూ, విశాక్ నాయర్, ఇషాన్ షౌకత్ కీలక పాత్రల్లో నటించారు. అద్వైత్ నాయర్ దర్శకత్వం వహించిన ఈ మూవీ జనవరి 22న థియేటర్లో సందడి చేయనుంది.ఈ సినిమాను తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు మైత్రి మూవీ మేకర్స్. తాజాగా ఈ సినిమా తెలుగు ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ట్రైలర్ చూస్తేనే రెజ్లింగ్ నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించినట్లు తెలుస్తోంది. కాస్ట్యూమ్ రెజ్లింగ్ అనే కాన్సెప్ట్‌తో ఈ చిత్రాన్ని రూపొందించారు. ట్రైలర్లో రెజ్లింగ్, కుస్తీ ఫైటింగ్ సీన్స్ ఈ మూవీపై ఆసక్తిని మరింత పెంచేస్తున్నాయి. ఈ చిత్రాన్ని మలయాళంతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నారు. -
ఇండో-పాక్ వార్.. గూస్ బంప్స్ తెప్పిస్తోన్న బోర్డర్-2 ట్రైలర్
గతంలో రిలీజై సూపర్ హిట్‌గా నిలిచిన వార్ మూవీ బోర్డర్. దాదాపు 28 ఏళ్ల తర్వాత ఈ చిత్రానికి సీక్వెల్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. సన్నీ డియోల్ కీలక పాత్రలో వస్తోన్న బోర్డర్-2.. రిపబ్లిక్ డే కానుకగా థియేటర్లలో రిలీజ్ కానుంది.ఇవాళ సంక్రాంతి కానుకగా బోర్డర్-2 ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ట్రైలర్ చూస్తే 1971లో జరిగిన ఇండో-పాక్ యుద్ధ నేపథ్యంలోనే ఈ సినిమాను తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఈ మూవీ అనురాగ్ సింగ్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో వరుణ్ ధావన్, దిల్జీత్ దొసాంజ్ కీలక పాత్రల్లో నటించారు. -
రవితేజ 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' ట్రైలర్ రిలీజ్
సంక్రాంతి బరిలో ఉన్న రవితేజ సినిమా 'భర్త మహాశయులకు విజ్ఞప్తి'. ఆషికా రంగనాథ్, డింపుల్ హయాతి హీరోయిన్లు. కిశోర్ తిరుమల దర్శకుడు. ఇప్పటికే రిలీజైన టీజర్, పాటలతో కాస్త హైప్ తెచ్చుకున్న ఈ చిత్రం నుంచి ఇప్పుడు ట్రైలర్ రిలీజైంది. ఈ చిత్రం జనవరి 13న అంటే వచ్చే మంగళవారం థియేటర్లలోకి రానుంది.రవితేజ కెరీర్ చూసుకుంటే గత కొన్నేళ్లుగా సరైన హిట్ అనేదే లేదు. ధమాకా, క్రాక్.. కొంతమేర ఆకట్టుకున్నప్పటికీ.. టాలీవుడ్లో మిగతా హీరోలతో పోల్చుకుంటే బాగా వెనకబడిపోయాడు. మార్కెట్ కూడా డౌన్ అయిపోయింది. ఇప్పుడు అవన్నీ కాస్త కుదురుకోవాలంటే 'భర్త మహాశయులకు విజ్ఞప్తి'తో పక్కా హిట్ కొట్టాల్సిందే. మరి ఈసారి రవితేజ ఎలాంటి ఫలితం అందుకుంటాడో చూడాలి? -
తమిళనాడు సీఎం శివకార్తికేయన్.. ప్రతిపక్ష నేత విజయ్ సేతుపతి!
కమర్షియల్, థ్రిల్లర్, హారర్ సినిమాలు.. దాదాపు ఒక ఫార్మాట్‌కి ఫిక్స్ అయిపోయి ఉంటాయి. కొన్నిసార్లు ఔట్ ఆఫ్ ద బాక్స్ ఐడియాలతో ఒకరో ఇద్దరో దర్శకులు మూవీస్ తీస్తుంటారు. వీటికి ఎంత ఆదరణ దక్కుతుందనేది పక్కనబెడితే డిఫరెంట్ అటెంప్ట్ అనిపించుకుంటూ ఉంటాయి. అలా 2024లో తమిళంలో 'హాట్ స్పాట్' అనే బోల్డ్ మూవీ రిలీజైంది. తర్వాత దాని తెలుగు వెర్షన్ ఆహా ఓటీటీలోనూ రిలీజ్ చేశారు. ఇప్పుడు దీనికి సీక్వెల్ రెడీ అయిపోయింది. ఈ మేరకు ట్రైలర్ రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: 'హాట్ స్పాట్' సినిమా రివ్యూ (ఓటీటీ))రెండేళ్ల క్రితం వచ్చిన తొలి పార్ట్‌లో పెళ్లి తర్వాత ఆడపిల్లలే ఎందుకు మరో ఇంటికి వెళ్లాలి? ప్రేమ పెళ్లికి సిద్ధమైన ఓ జంటకు ఇలా కూడా జరిగే అవకాశముందా? తప్పు చేసి దాన్ని సమర్థించుకునే ప్రియుడికి బుద్ధిచెప్పే అమ్మాయి, పిల్లల్ని టీవీ షోలు ఎలా చెడగొడుతున్నాయి అనే స్టోరీలు చూపించారు. నాలుగు కథల ఆంథాలజీ టైపులో దీన్ని తెరకెక్కించారు. ఇప్పుడు రెండో పార్ట్ కోసం కాస్త డోస్ పెంచి మరో నాలుగు కథలతో మూవీ తీసినట్లు ట్రైలర్ చూస్తుంటే అర్థమవుతోంది.లివ్ ఇన్ రిలేషన్షిప్లో డింక్ (DINK-డ్యూయల్ ఇన్కమ్ నో కిడ్స్) కల్చర్... సినిమా హీరోల ఫ్యాన్స్ చేసే అతి తదితర స్టోరీల ఉండనున్నాయని ట్రైలర్లో చూపించారు. ఇదే ట్రైలర్లో తమిళనాడు ముఖ్యమంత్రి శివకార్తికేయన్, ప్రతిపక్ష నేత విజయ్ సేతుపతి లాంటి డైలాగ్స్ ఫన్నీగా అనిపించాయి. ఈ నాయకులిద్దరూ కలిసి విజయ్ కాంత్ విగ్రహావిష్కరణ చేస్తారని ఓ పాత్ర అనడం ఆసక్తికరంగా అనిపించింది. ధోనీ రిటైర్మెంట్, 2026 ఎన్నికల్లో దళపతి గెలుస్తాడా లేదా? లాంటి విచిత్రమైన నిజ-కల్పిత సంఘటనలతో ఈసారి సినిమా తీసినట్లు తెలుస్తోంది. ఇందులో ప్రియ భవానీ శంకర్ కీలక పాత్ర చేసింది. మిగతా వాళ్లెవరూ తెలుగు ప్రేక్షకులకు తెలిసిన ముఖాలైతే కాదు.(ఇదీ చదవండి: పండగ బరిలో 12 మంది హీరోయిన్లు.. 'హిట్' కొట్టాల్సిందే) -
ట్రైలర్ చూసి రామ్ చరణ్ రియాక్షన్ ఏంటంటే..
-
శివకార్తికేయన్ 'పరాశక్తి' ట్రైలర్ రిలీజ్
పలు డబ్బింగ్ సినిమాలతో తెలుగులోనూ గుర్తింపు తెచ్చుకున్నశివకార్తికేయన్ లేటెస్ట్ మూవీ 'పరాశక్తి'. శ్రీలీల హీరోయిన్ కాగా రవి మోహన్ ప్రతినాయకుడిగా కనిపించబోతున్నాడు. అధర్వ కీలక పాత్ర చేశాడు. సుధా కొంగర దర్శకురాలు. పీరియాడికల్ స్టోరీతో తీసిన ఈ చిత్రం ఈ శనివారం(జనవరి 10న) థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా ఇప్పుడు తమిళ ట్రైలర్ మాత్రమే రిలీజ్ చేశారు.1964లో తమిళనాడులో ఓ ఊరిలో జరిగిన ఉద్యమం ఆధారంగా 'పరాశక్తి' తీశారని ట్రైలర్‌తో క్లారిటీ వచ్చేసింది. హిందీని జాతీయ భాషగా ప్రకటించిన తర్వాత మధురైలోని ఓ ఊరిలో విద్యార్థులకు, ఓ ఊరివాళ్లకు.. ఓ పోలీస్తో ఎలాంటి గొడవ జరిగింది? చివరకు ఏమైంది అనే పాయింట్‌తో మూవీని తెరకెక్కించారు.ప్రధాన పాత్రధారులు వేషధారణ దగ్గర నుంచి డైలాగ్స్ వరకు ఆసక్తికరంగా ఉన్నాయి. అయితే తెలుగులో దీనికి ఎంతవరకు ఆదరణ దక్కుతుందో చూడాలి?ఎందుకంటే 'పరాశక్తి' చిత్రాన్ని జనవరి 10న తెలుగు, తమిళంలో రిలీజ్ చేస్తామని ప్రకటించారు. తమిళ వరకు అయితే విజయ్ 'జన నాయగణ్' మాత్రమే పోటీలో ఉంది. తెలుగుకు వచ్చేసరికి 'రాజాసాబ్', 'మన శంకరవరప్రసాద్ గారు', 'భర్త మహాశయులకు విజ్ఞప్తి', 'అనగనగా ఒక రాజు', 'నారీ నారీ నడుమ మురారీ'.. ఇలా ఐదు తెలుగు మూవీస్ రిలీజ్ అవుతున్నాయి. వీటితో పాటు 'పరాశక్తి'కి ఏ మేరకు థియేటర్లు లభిస్తాయనేది, సబ్జెక్ట్ ఎంతవరకు కనెక్ట్ అవుతుందనేది చూడాలి? -
సంక్రాంతి కానుకగా శంబాల.. ట్రైలర్ రిలీజ్
ఆది సాయికుమార్ హీరోగా వచ్చిన మైథలాజికల్ థ్రిల్లర్ మూవీ శంబాల. యుగంధర్ ముని దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మహిధర్ రెడ్డి, రాజశేఖర్ అన్నభీమోజు నిర్మించారు. ఈ మూవీ క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న ప్రేక్షకుల ముందుకొచ్చింది. తొలి రోజు నుంచే ఈ సినిమాకు పాజిటివ్ రావడంతో వసూళ్లపరంగానూ దూసుకెళ్తోంది. ఈ మూవీతో చాలా రోజుల తర్వాత ఆది సాయికుమార్ ఖాతాలో హిట్ పడింది.తెలుగులో సూపర్ హిట్ అయిన ఈ చిత్రాన్ని నార్త్ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. హిందీలో డబ్ చేసి సంక్రాంతి కానుకగా రిలీజ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే హిందీ ట్రైలర్ విడుదల చేశారు. కన్నడ హీరో రిషబ్ శెట్టి చేతుల మీదుగా ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా శంబాల టీమ్‌కు రిషబ్ శెట్టి శుభాకాంక్షలు తెలిపారు. ఈ మూవీ జనవరి 09న బాలీవుడ్ ప్రేక్షకులను అలరించనుంది.కాగా.. ఈ చిత్రంలో అర్చన్ అయ్యర్ హీరోయిన్గా నటించారు. ఈ మైథలాజికల్ థ్రిల్లర్ మూవీకి శ్రీచరణ్ పాకాల సంగీతం అందించాడు. కేవలం వారం రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.16.20 కోట్లు రాబట్టిన ఈ సినిమా ఇప్పటికీ థియేటర్లలో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది.After a grand successful Telugu release. #Shambala releasing in Hindi on 9th Jan’26Unveiling the Hindi trailer - https://t.co/S1IUlDRVJzAll the best to @iamaadisaikumar and the entire team😊@tweets_archana @ugandharmuni #RajasekharAnnabhimoju @ShiningPictures… pic.twitter.com/itnt68GNa2— Rishab Shetty (@shetty_rishab) January 4, 2026 -
'జన నాయకుడు' ట్రైలర్ రిలీజ్.. రీమేక్‌పై క్లారిటీ
తమిళ హీరో దళపతి విజయ్ చివరి సినిమా 'జన నాయగణ్'. తెలుగులో దీన్ని 'జన నాయకుడు' పేరుతో ఈ నెల 9వ తేదీన రిలీజ్ చేస్తున్నారు. అయితే ఇది బాలకృష్ణ 'భగవంత్ కేసరి' చిత్రానికి రీమేక్ అని చాన్నాళ్లుగా ప్రచారం జరుగుతోంది. మొన్నీమధ్య డైరెక్టర్ హెచ్.వినోద్ మాట్లాడుతూ ఇది దళపతి మూవీ అని చెప్పాడు గానీ అసలు విషయం బయటపెట్టలేదు. ఇప్పుడు ట్రైలర్‌తో క్లారిటీ వచ్చేసింది.అంతా అనుకుంటున్నట్లు ఇది 'భగవంత్ కేసరి' రీమేకే. మెయిన్ పాయింట్‌ని ఉన్నది ఉన్నట్లు దింపేశారు. శ్రీలీల పాత్ర పేరునే ఇక్కడ మమిత బైజు పాత్రకు కూడా పెట్టేశారు. ట్రైలర్ అయితే సాలిడ్‌గా ఉంది. కాకపోతే చాలా పోలికలు కనిపిస్తున్నాయి. అలానే విజయ్ రాజకీయ ఎంట్రీకి పనికొచ్చేలా కూడా ఈ మూవీ ఉండబోతుందని.. ట్రైలర్లో డైలాగ్స్ చూస్తే అర్థమవుతోంది. ఇప్పటికే తెలుగు ప్రేక్షకులు ఒరిజినల్ సినిమాని చూసేశారు. మరి ఇప్పుడు రాబోతున్న 'జన నాయకుడు' తెలుగు డబ్బింగ్ వెర్షన్‌కి ఎలాంటి ఆదరణ దక్కనుందో చూడాలి? ఇదే రోజున ప్రభాస్ 'రాజాసాబ్' కూడా థియేటర్లలోకి రానుంది. -
టాలీవుడ్ సైకలాజికల్ థ్రిల్లర్.. రిలీజ్ ఎప్పుడంటే?
వెంకటేశ్ పట్నాలా స్వీయ దర్శకత్వంలో వస్తోన్న చిత్రం ఆల్పా రిడంప్షన్. తానే హీరోగా నటిస్తూ పట్నాలా ఫిల్మ్స్ బ్యానర్లో ఈ మూవీని నిర్మించారు. విభిన్న కథా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. యాక్షన్ అండ్ ఎమోషనల్ డ్రామాగా వస్తోన్న ఈ సినిమా అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని జనవరి 3న థియేటర్లలో విడుదల కానుంది.ఈ చిత్రాన్ని సైకలాజికల్ యాక్షన్ డ్రామాగా రూపొందించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ మూవీ కథేంటో అర్థమవుతోంది. రెగ్యులర్ యాక్షన్ సినిమాలకు భిన్నంగా తెరకెక్కించారు. మనిషిలోని భావోద్వేగాలను, ప్రాయశ్చిత్తాన్ని చూపే సరికొత్త కథాంశంతో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ సినిమాకు భువన్, మార్టిన్ సంగీతమందించారు. -
మెగాస్టార్ మనశంకర వరప్రసాద్ గారు.. ఫ్యాన్స్‌కు బిగ్ అప్డేట్
మెగాస్టార్ హీరోగా వస్తోన్న లేటేస్ట్ ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంటర్టైనర్ మనశంకర వరప్రసాద్ గారు. తొలిసారి అనిల్ రావిపూడి- చిరు కాంబోలో వస్తోన్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ ఏడాది సంక్రాంతి పోటీలో నిలిచిన ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్‌తో సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రిలీజ్‌కు కొద్ది రోజుల సమయం మాత్రమే ఉండడంతో మేకర్స్ ప్రమోషన్స్‌తో ఫుల్ బిజీ అయిపోయారు.ఈ నేపథ్యంలోనే ఈ మూవీకి సంబంధించిన బిగ్ అప్డేట్ ఇచ్చారు. మనశంకర వరప్రసాద్ గారు మూవీ ట్రైలర్ రిలీజ్ డేట్‌ను ప్రకటించారు. ఈనెల 4న విడుదల చేస్తామని నిర్మాణ సంస్థ షైన్ స్క్రీన్స్ అఫీషియల్‌గా వెల్లడించింది. ఈ విషయాన్ని ట్విటర్ ద్వారా తెలియజేస్తూ పోస్టర్‌ను పంచుకుంది. దీంతో మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.కాగా.. గతేడాది సంక్రాంతికి వస్తున్నాం మూవీతో బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టిన అనిల్ రావిపూడి.. మరో హిట్ కోసం రెడీ అయిపోయారు. ఈ చిత్రంలో వెంకీమామ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే రిలీజైన మీసాల పిల్ల సాంగ్‌కు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ సంక్రాంతికి వస్తోన్న మనశంకర వరప్రసాద్లో లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్గా నటించింది.The much-awaited announcement everyone has been waiting for is finally here💥#ManaShankaraVaraPrasadGaru TRAILER ON JANUARY 4th ❤️🔥#MSG GRAND RELEASE WORLDWIDE IN THEATERS ON 12th JANUARY.#MSGonJan12thMegastar @KChiruTweets Victory @VenkyMama @AnilRavipudi #Nayanthara… pic.twitter.com/5yW8TkN9ut— Shine Screens (@Shine_Screens) January 2, 2026 -
'స్ట్రేంజర్ థింగ్స్ 5' ఫినాలే ఎపిసోడ్ ట్రైలర్ రిలీజ్
ఓటీటీల్లో వెబ్ సిరీస్‌లు చూసేవాళ్లకు 'స్ట్రేంజర్ థింగ్స్' గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. 2016 నుంచి ఇప్పటివరకు నాలుగు సీజన్స్ వచ్చాయి. అవన్నీ కూడా బ్లాక్‌బస్టర్ రెస్పాన్స్ అందుకున్నాయి. గత నెలలో ఐదో సీజన్ తొలి వాల్యూమ్‌లో నాలుగు ఎపిసోడ్స్, క్రిస్మస్ సందర్భంగా రెండో వాల్యూమ్‌లో మూడు ఎపిసోడ్స్ రిలీజయ్యాయి. సిరీస్ చిట్టచివరి ఎపిసోడ్.. జనవరి 1న రానుంది. దీని ట్రైలర్ ఇప్పుడు రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి తమిళ హిట్ థ్రిల్లర్ సినిమా)ఐదో సీజన్లో ఇప్పటివరకు వచ్చిన 7 ఎపిసోడ్స్ గమనిస్తే.. విలన్ వెక్నాతో ఎలెవన్ అండ్ టీమ్ పోరాడటానికి కావాల్సినదంతా సిద్ధం చేశారు. ఇప్పుడు రాబోయే ఫినాలే ఎపిసోడ్లో ఎమోషన్‌తో పాటు అదిరిపోయే యాక్షన్ ఉండనుందని ట్రైలర్‌తో హింట్ ఇచ్చారు.'స్ట్రేంజర్ థింగ్స్' విషయానికొస్తే.. అమెరికాలోని హాకిన్స్ అనే ఊరిలో నలుగురు పిల్లలు ఉంటారు. వీళ్లకు ఓ సూపర్ పవర్స్ ఉన్న ఎలెవన్ అనే అమ్మాయి కనిపిస్తుంది. వీళ్లంతా ఫ్రెండ్స్ అయిపోతారు. అయితే ఎలెవన్.. తనలాంటి అతీత శక్తులుండే కొందరితో పోరాడాల్సి వస్తుంది. ఇంతకీ వాళ్లెవరు? ఎలెవన్ గతమేంటి అనేదే సిరీస్ ప్లాట్ లైన్. ఫాంటసీ టచ్ ఉండే యాక్షన్, అడ్వెంచర్ స్టోరీలు ఇష్టముంటే ఈ సిరీస్ చూడండి. అస్సలు విడిచిపెట్టరు. నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు డబ్బింగ్‌తో స్ట్రీమింగ్ అవుతోంది.(ఇదీ చదవండి: పెళ్లయిన నెలకు సమంత హనీమూన్ ట్రిప్.. ఫొటోలు వైరల్) -
'రాజాసాబ్' కొత్త ట్రైలర్ రిలీజ్
ప్రభాస్ 'రాజాసాబ్' నుంచి మరో ట్రైలర్ వచ్చేసింది. రెండు రోజుల క్రితం హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ కార్యక్రమంలోనే ట్రైలర్ రిలీజ్ చేస్తారేమోనని అభిమానులు ఆశపడ్డారు కానీ ఆదికాస్త ఆలస్యమైంది. ఇప్పుడు దాన్ని విడుదల చేశారు. గతంలో తీసుకొచ్చిన ట్రైలర్‌కి ఏ మాత్రం తగ్గకుండా ఇది ఉంది. ఇందులో కామెడీ, హారర్ లాంటి ఎమోషన్స్ బాగానే చూపించారు.(ఇదీ చదవండి: కొత్త ఏడాది స్పెషల్.. ఈ వారం ఓటీటీల్లోకి వచ్చే సినిమాలివే)ఈ సినిమా.. జనవరి 9న థియేటర్లలోకి రానుంది. 8వ తేదీన రాత్రి ప్రీమియర్లు కూడా వేస్తున్నారు. అయితే ప్రభుత్వం నుంచి అనుమతి వస్తే ప్రీమియర్లు, టికెట్ రేట్ల గురించి క్లారిటీ రావొచ్చు. లేదంటే మాత్రం 8వ తేదీ సెకండ్ షోల నుంచి సినిమా రిలీజ్ అవుతుంది. ఇందులో ప్రభాస్ సరసన మాళవిక, నిధి అగర్వాల్, రిద్ది కుమార్ హీరోయిన్లుగా చేశారు. సంజయ్ దత్ కీలక పాత్ర పోషించారు. మారుతి దర్శకుడు. తమన్ సంగీతమందించాడు.(ఇదీ చదవండి: 'పెద్ది'లో మరో స్టార్.. ఈ నటుడు ఎవరో గుర్తుపట్టారా?) -
రిలీజ్‌కి ముందు టైటిల్ మార్పు.. ట్రైలర్ రిలీజ్
అవినాష్ హీరోగా పరిచయమవుతూ దర్శకత్వం వహించిన సినిమా 'వానర'. నిన్నటివరకు ఈ పేరుతోనే ప్రచారం చేశారు. ఇప్పుడు టైటిల్ మార్చినట్లు ప్రకటించారు. 'వనవీర' అనే పేరుని ఫిక్స్ చేశారు. జనవరి 1న థియేటర్లలోకి రాబోతున్న ఈ చిత్ర ట్రైలర్ ఇప్పుడు విడుదల చేశారు.కులం, రాజకీయ అంశాలతో తీసిన ఈ సినిమాలో డివోషనల్ టచ్ కూడా ఉంది. ఈ మేరకు ట్రైలర్లో రాముడు, వానర సైన్యం, లంకకు వారధి కట్టడం లాంటి గ్రాఫిక్ విజువల్స్ చూపించారు. అయితే స్టోరీకి రాముడు, వానర సైన్యానికి లింక్ చేసి ఎలా చూపిస్తారో? ఇందులో సిమ్రన్ చౌదరి హీరోయిన్గా చేయగా.. వివేక్ సాగర్ సంగీతమందించాడు. -
వెంకటేశ్- ఆర్తి ఎవర్గ్రీన్ క్లాసిక్.. రీ రిలీజ్ ట్రైలర్ చూశారా?
వెంకటేశ్, ఆర్తి అగర్వాల్ హీరో, హీరోయిన్లుగా బ్లాక్ బస్టర్ మూవీ నువ్వు నాకు నచ్చావ్. ఈ చిత్రానికి కె విజయభాస్కర్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాకు త్రివిక్రమ్ కథ, డైలాగ్స్ అందించగా.. స్రవంతి రవికిశోర్ నిర్మించారు. ఈ మూవీ 2001 సెప్టెంబర్ 6న విడుదలై సూపర్ హిట్‌గా నిలిచింది.దాదాపు 25 ఏళ్ల తర్వాత ఈ మూవీ మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ చిత్రాన్ని జనవరి 1న 4కే వెర్షన్‌తో ప్రపంచవ్యాప్తగా రీ రిలీజ్ చేయనున్నారు. ఈ సందర్భంగా రీ రిలీజ్ ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. 4కె వర్షన్లో రిలీజైన ట్రైలర్ వెంకీ మామ ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటోంది.ఈ తెలుగు సినిమా చరిత్రలో ఓ మైలురాయిగా నిలిచిన చిత్రమని నిర్మాత రవికిశోర్ అన్నారు. నువ్వు నాకు నచ్చావ్. ఇది కేవలం రీ రిలీజ్ మాత్రమే కాదని.. నూతన సంవత్సరాన్ని కుటుంబంతో కలిసి నవ్వులు పూయిస్తూ ప్రారంభించడానికి ఇదే సరైన సమయమని అన్నారు. -
క్రిస్టోఫర్ నోలన్ 'ద ఒడిస్సీ' తెలుగు ట్రైలర్ రిలీజ్
హాలీవుడ్ దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్.. తెలుగు ప్రేక్షకుల్లోనూ చాలామందికి తెలుసు. ద డార్క్ నైట్స్, ఇన్సెప్షన్, ఇంటర్స్టెల్లార్, డన్కిర్క్, టెనెట్ లాంటి క్రేజీ టైమ్ ట్రావెల్ సినిమాలతో ప్రపంచవ్యాప్తంగా విశేషాదరణ దక్కించుకున్నాడు. ఇతడి నుంచి వస్తున్న లేటెస్ట్ మూవీ 'ద ఒడిస్సీ'. ఈ చిత్ర ట్రైలర్‌ని ఇప్పుడు రిలీజ్ చేశారు. తెలుగు వెర్షన్‌ది కూడా విడుదల చేశారు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 19 సినిమాలు.. మరి థియేటర్లలో?)సాధారణంగా నోలన్ తీసే సినిమాలన్నీ ఫిజిక్స్, టైమ్ ట్రావెల్ బ్యాక్ డ్రాప్ స్టోరీలతో ఉంటాయి. కానీ కెరీర్లో తొలిసారి వార్ మూవీ తీస్తున్నాడు. ట్రైలర్లో పెద్దగా స్టోరీ ఏం రివీల్ చేయలేదు గానీ విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ వేరే లెవల్లో ఉండబోతున్నాయని హింట్ అయితే ఇచ్చాడు. వచ్చే జూలై 17న ఇది థియేటర్లలో రిలీజ్ కానుంది. తెలుగు డబ్బింగ్ కూడా తీసుకురాబోతున్నారు. విచిత్రం ఏంటంటే మూవీ విడుదలకు ఏడాది ముందే టికెట్ బుకింగ్స్ తెరిస్తే అవి నిమిషాల్లో సేల్ అయిపోయాయి.(ఇదీ చదవండి: హీరోయిన్లకు సలహా సరే.. ఈ 'సామాను' కామెంట్ అవసరమా శివాజీ?) -
'మనకొక మగతోడు కావాలి..' బోల్డ్‌గా బ్యాడ్ గర్ల్స్ ట్రైలర్
అంచల్ గౌడ, పాయల్ చెంగప్ప, రోషిణి, యష్ణ లీడ్ రోల్స్‌లో నటిస్తోన్న చిత్రం బ్యాడ్ గర్ల్స్. కానీ చాలా మంచోళ్లు అనేది ట్యాగ్ లైన్. ఈ సినిమాకు 30 రోజుల్లో ప్రేమించడం ఎలా మూవీ ఫేమ్ మున్నా ధులిపూడి దర్శకత్వం వహించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా రిలీజ్‌కు సిద్దమైంది. ఇటీవల రిలీజైన పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.తాజాగా బ్యాడ్ గర్ల్స్ మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ట్రైలర్ చూస్తుంటే సంప్రదాయం కుటుంబం నుంచి వచ్చిన నలుగురు అమ్మాయిలు విదేశాలకు వెళ్లిన తర్వాత ఎలా మారిపోయారనే అనే కాన్సెప్ట్‌తో తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ట్రైలర్‌లోని ఫుల్ కామెడీతో ఎమోషన్స్ ఈ చిత్రంపై అంచనాలు మరింత పెంచేస్తున్నాయి. ఈ మూవీలో రేణు దేశాయ్ కీలక పాత్రలో కనిపించనుంది. ఈ మూవీని ప్రశ్విత ఎంటర్టైమెంట్, నీలి నీలి ఆకాశం క్రియేషన్స్, ఎన్వీఎస్ క్రియేషన్స్ బ్యానర్లపై శశిధర్ నల్లా, ఎమ్మాడి సోమ నర్సయ్య, రామిశెట్టి రాంబాబు, రావుల రమేశ్ నిర్మించారు. ఈ చిత్రం క్రిస్మస్ పండగ సందర్భంగా డిసెంబర్ 25న విడుదల కానుంది. -
పతంగుల పోటీ నేపథ్యంలో సినిమా..అంత ఈజీ కాదు : ప్రణవ్ కౌశిక్
ప్రణవ్ కౌశిక్, ప్రీతి పగడాల, వంశీ పూజిత్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘పతంగ్’. గౌతమ్ వాసుదేవ్ మీనన్ , ఎస్పీ చరణ్ కీలక పాత్రలు పోషించారు. ప్రణీత్ ప్రత్తిపాటి దర్శకత్వంలో డి. సురేష్‌బాబు సమర్పణలో విజయ్ శేఖర్ అన్నే, సంపత్ మకా, సురేష్ కొత్తింటి, నాని బండ్రెడ్డి, రమ్య నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 25న రిలీజ్ కానుంది. హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రెస్మీట్లో ప్రణవ్ కౌశిక్ మాట్లాడుతూ–‘‘పతంగుల పోటీ నేపథ్యంతో సినిమా చేయడం అంత సులభం కాదు. మా ‘పతంగ్’లో వీఎఫ్ఎక్స్ వర్క్స్ కోసం దర్శక–నిర్మాతలు, టెక్నికల్ టీమ్ చాలా కష్టపడ్డారు. ఈ క్రిస్మస్కి మా చిత్రంతో పాటు విడుదలవుతున్న అన్ని సినిమాలు హిట్ కావాలి. ఫైనల్‌గా సినిమా గెలవాలి’’ అన్నారు. ‘‘మా సినిమా అందరికీ నచ్చుతుంది’’ అని వంశీ పూజిత్, విజయ్ శేఖర్ అన్నే, సురేష్ కొత్తింటి, ప్రీతి పగడాల తెలి΄ారు. ‘‘ఈ సినిమా నిర్మాణంలో రోజూ ఓ కొత్త సవాల్ ఎదుర్కొన్నాం’’ అన్నారు రమ్య. ‘‘ఈ ఏడాది విడుదలయ్యే మంచి సినిమాల్లో ‘పతంగ్’ కూడా ఉంటుంది’’ అని పేర్కొన్నారు సంపత్ మకా, నాని బండ్రెడ్డి. -
ఆది సాయికుమార్ మిస్టరీ థ్రిల్లర్.. ఆసక్తిగా శంబాల ట్రైలర్
ఆది సాయి కుమార్ హీరోగా వస్తోన్న లేటేస్ట్ హారర్ థ్రిల్లర్ మూవీ 'శంబాల'. ఈ సినిమాకు యగంధర్ ముని దర్శకత్వం వహించారు. షైనింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై మహీధర్ రెడ్డి, రాజశేఖర్ అన్నభీమోజులు నిర్మించారు. ఇప్పటికే రిలీజైన సాంగ్స్‌కు ఆడియన్స్‌ను అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. రిలీజ్ తేదీ దగ్గర పడడంతో మూవీ ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్నారు మేకర్స్. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. 'పంచభూతాల్ని శాసిస్తుందంటే ఇది సాధారణమైంది కాదు'.. అనే డైలాగ్‌తో ట్రైలర్ ప్రారంభమైంది. ట్రైలర్ చూస్తుంటే ఓ గ్రామంలో జరిగిన మిస్టరీ సంఘటనలతో తెరకెక్కించినటలు తెలుస్తోంది. ఈ చిత్రంలో అర్చన అయ్యర్, స్వసిక, మధునాదన్, రవివర్మ, మీసాల లక్ష్మణ్ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా క్రిస్మస్ కానుకగా థియేటర్లలో సందడి చేయనుంది. ఈ చిత్రానికి శ్రీచరణ్ పాకాలసంగీతమందించారు. -
'కల్లు మత్తు కాదు కదా సార్.. తాగింది దిగడానికి..' ఆసక్తిగా దండోరా ట్రైలర్
బిందుమాధవి, నవదీప్ ప్రధాన పాత్రల్లో వస్తోన్న తాజా చిత్రం దండోరా. ఈ మూవీకి మురళీకాంత్ దర్శకత్వం వహించారు. గ్రామీణ నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించారు. సమాజంలో ప్రజల మధ్య అసమానతలను తెలియజేసే కాన్సెప్ట్‌తో ఈ మూవీని రూపొందించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా క్రిస్మస్ కానుకగా థియేటర్లకు రానుంది.మూవీ రిలీజ్ దగ్గర పడడంతో దండోరా ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. టాలీవుడ్ హీరో అక్కినేని నాగచైతన్య చేతుల మీదుగా ట్రైలర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా దండోరా టీమ్‌కు ఆల్ ది బెస్ట్ చెప్పారు చైతూ. ట్రైలర్ చూస్తుంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉండే కుల వివక్షను తెరపై ఆవిష్కరించినట్లు తెలుస్తోంది. ట్రైలర్ చివర్లో 'కల్లు మత్తు కాదు కదా సార్.. రాత్రి తాగింది దిగడానికి.. కులం మత్తు.. అందుకే టైమ్ పట్టింది' అనే డైలాగ్ వింటే కథేంటో అర్థమవుతోంది. కాగా.. ఈ మూవీని లౌక్య ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో రవీంద్ర బెనర్జీ నిర్మించారు. ఈ చిత్రంలో శివాజీ, నందు, రవికృష్ణ, మణిక, మౌనిక కీలక పాత్రల్లో నటించారు. ఈ మూవీ డిసెంబర్ 25న థియేటర్లలో సందడి చేయనుంది. Happy to be launching the trailer of #Dhandoraahttps://t.co/sOuUJAUZlqRooted, raw and powerful this looks very promising Wishing the entire team a huge success , looking forward to watching it .In Cinemas from 25-12-25#DhandoraaOnDec25th@Afilmby_Murali… pic.twitter.com/7zL0X3WBpG— chaitanya akkineni (@chay_akkineni) December 19, 2025 -
'బైరాన్‌పల్లి గడ్డమీదే సమాధి కావాలి'.. ఆసక్తిగా ఛాంపియన్ ట్రైలర్
టాలీవుడ్ హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా వస్తోన్న పీరియాడికల్ స్పోర్ట్స్ యాక్షన్ మూవీ ఛాంపియన్. ఈ మూవీకి ప్రదీప్ అద్వైతం దర్శకత్వంలో తెరకెక్కించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ చిత్రం క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ నేపథ్యంలో మూవీ మేకర్స్ ప్రమోషన్స్‌తో దూసుకెళ్తున్నారు. ఇందులో భాగంగా ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రామ్‌చరణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ట్రైలర్ చూస్తుంటే స్వాతంత్ర్యం కంటే ముందు జరిగిన సంఘటనల ఆధారంగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. బైరాన్‌పల్లి సంఘటన కూడా ఈ ట్రైలర్ చూపించారు. బ్రిటీష్ వారితో పోరాట సన్నివేశాలు ఈ మూవీపై ఆసక్తిని మరింత పెంచుతున్నాయి. 'బైరాన్‌పల్లిలో మొదలైన తిరుగుబాటు ఆ గడ్డమీదే సమాధి కావాలి' అనే డైలాగ్ వింటే ఈ స్టోరీ ఏంటో అర్థమవుతోంది. కాగా.. ఈ చిత్రంలో అనస్వర రాజన్ హీరోయిన్గా నటించారు. ఈ సినిమాకు మిక్కీ జే మేయర్ సంగీతమందించారు. From the pages of the history comes a revolutionary saga.The epic unfolds now.Presenting #ChampionTrailer to you all!▶️ https://t.co/dr9tYJMNMV#Champion in cinemas worldwide from DECEMBER 25th, 2025. #Roshan @PradeepAdvaitam #AnaswaraRajan @ActorSanthosh @madhie1… pic.twitter.com/rN2dxLp20z— Vyjayanthi Movies (@VyjayanthiFilms) December 18, 2025 -
మలయాళ క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్.. ఆసక్తి పెంచుతోన్న ట్రైలర్
ఈ రోజుల్లో మలయాళ సినిమాలకు విపరీతమైన క్రేజ్ ఉంది. కేవలం కంటెంట్‌తోనే ఈ సినిమాలు హిట్టవుతున్నాయి. పెద్ద పెద్ద స్టార్స్ లేకపోయినా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలుస్తున్నాయి. తాజాగా మరో మలయాళ క్రైమ్ థ్రిల్లర్ అలరించేందుకు వచ్చేస్తోంది. తాజాగా ఈ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. అయితే కేవలం మలయాళంలోనే రిలీజైంది.ఆషికా అశోకన్, సంద్ర అనిల్ కీలక పాత్రల్లో వస్తోన్న క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ మూవీ జస్టిస్ ఫర్ జెని. ఈ మూవీకి సంతోష్ ర్యాన్ దర్శకత్వం వహించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 2న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సందర్భంగా ట్రైలర్ విడుదల చేశారు మేకర్స్. తాజాగా విడుదలైన ట్రైలర్ చూస్తుంటే ఓ యువతిపై అత్యాచారం, మర్డర్ నేపథ్యంలో తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు గౌతమ్ విన్సెంట్ సంగీతం సమకూర్చారు. ఈ మూవీని అస్నా క్రియేషన్ ప్రెజెంట్స్ బ్యానర్లో నిర్మించారు. ఈ చిత్రంలో సినాన్, ఐశ్వర్య, బిట్టు థామస్ మప్పిళ్లస్సేరి, రేఖ, హరీష్ పేరడి, నిజల్గల్ రవి కీలక పాత్రలు పోషించారు. -
రాజుగా మోహన్ లాల్.. వృషభ ట్రైలర్ వచ్చేసింది!
మలయాళ స్టార్ మోహన్‌లాల్, తెలుగు యంగ్ హీరో రోషన్ తండ్రి, తనయులుగా నటిస్తోన్న ద్విభాషా చిత్రం వృషభ. ఈ చిత్రానికి నంద కిశోర్ దర్శకత్వం వహిస్తున్నారు. దీపావళి విడుదల కావాల్సిన ఈ ఫుల్ యాక్షన్ మూవీ క్రిస్మస్కు షిఫ్ట్ అయింది. ఈ సినిమాను మలయాళంతో పాటు.. తెలుగులోనూ ఓకేసారి తెరకెక్కించారు. ఈ పాన్ ఇండియా చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. మూవీ రిలీజ్ తేదీ దగ్గర పడడంతో ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్.ట్రైలర్ చూస్తుంటే ఈ మూవీని మైథలాజికల్ నేపథ్యంలోనే తెరకెక్కించినట్లు తెలుస్తోంది. రాజుల కాలం నాటి విజువల్స్, యాక్షన్ సీన్స్ బాహుబలి తరహాలో మోహన్ లాల్ ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటున్నాయి. బీజీఎం కూడా ట్రైలర్‌ను మరో రేంజ్‌కు తీసుకెళ్లింది. ఈ చిత్రంలో మోహన్ లాల్ తొలిసారిగా రాజు పాత్రలో అభిమానులను అలరించనున్నారు. కాగా.. ఈ చిత్రంలో సమర్జిత్ లంకేష్, రాగిణి ద్వివేది, నేహా సక్సెనా కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమాను అభిషేక్ ఎస్ వ్యాస్ స్టూడియోస్, కనెక్ట్ట్ మీడియా, బాలాజీ టెలిఫిల్మ్స్ బ్యానర్లపై శోభా కపూర్, ఏక్తా ఆర్. కపూర్, సీకే పద్మకుమార్, వరుణ్ మాథుర్, సౌరభ్ మిశ్రా నిర్మించారు. ఈ మూవీ క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 25న తమిళం, కన్నడ, హిందీలో విడుదల కానుంది. -
'స్ట్రేంజర్ థింగ్స్ 5' వాల్యూమ్ 2 ట్రైలర్ రిలీజ్
ఓటీటీలో బ్లాక్ బస్టర్ హిట్ అయిన సిరీస్‌ల్లో 'స్ట్రేంజర్ థింగ్స్' ఒకటి. 2016 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో నాలుగు సీజన్లు రిలీజయ్యాయి. గత నెలలోనే ఐదో సీజన్ తొలి వాల్యూమ్ స్ట్రీమింగ్‌లోకి వచ్చింది. ఇందులో భాగంగా నాలుగు ఎపిసోడ్స్ ప్రేక్షకుల ముందుకొచ్చాయి. అద్భుతమైన రెస్పాన్ అందుకుంది. ఇప్పుడు రెండో వాల్యూమ్ స్ట్రీమింగ్కి సిద్ధమైంది. ఈ మేరకు తెలుగు వెర్షన్ ట్రైలర్ కూడా విడుదల చేశారు.(ఇదీ చదవండి: హిందీ మార్కెట్లో ఊహించని దెబ్బ.. 'అఖండ 2' టోటల్ ఫ్లాప్)అమెరికాలోని హాకిన్స్ అనే ఓ పల్లెటూరిలో నలుగురు ఫ్రెండ్స్(అబ్బాయిలు) ఉంటారు. ఓ రోజు రాత్రి వీళ్లకు ఎలెవన్ అనే అమ్మాయి కనిపిస్తుంది. ఈమెకు సూపర్ పవర్స్ ఉంటాయి. ఇంతకీ ఈమె ఎవరు? వీళ్ల ఐదుగురితో పాటు మరికొందరు కలిసి వెక్నా అనే అతీంద్రయ శక్తి నుంచి తమ ఊరిని ఎలా కాపాడుకున్నారు అనేది ఈ సిరీస్ మెయిన్ స్టోరీ. అయితే ఎలెవన్ అనే అమ్మాయికి ఇప్పటివరకు పవర్స్ ఉండగా.. నలుగురు పిల్లల్లోని విల్ అనే అబ్బాయికి కూడా పవర్స్ వచ్చినట్లు చూపించి ఐదో సీజన్ తొలి వాల్యూమ్‌ని ముగించారు. రెండో వాల్యూమ్‌లో ఎలెవన్, విల్, నం.8 కలిసి వెక్నా అనే అతీంద్రయ శక్తులున్న విలన్ని ఎలా ఎదిరిస్తాయనేది చూపించబోతున్నారు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 18 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్) -
శివరాజ్ కుమార్ యాక్షన్ మూవీ.. తెలుగు ట్రైలర్ వచ్చేసింది..!
కన్నడ స్టార్స్ శివ రాజ్‌కుమార్, ఉపేంద్ర ప్రధాన పాత్రల్లో వస్తోన్న యాక్షన్ థ్రిల్లర్ 45. ఈ మూవీకి అర్జున్ జన్యా దర్శకత్వం వహించారు. ఇప్పటికే దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం డిసెంబర్ 25న క్రిస్మస్ కానుకగా థియేటర్లలో సందడి చేయనుంది. ఈ నేపథ్యంలోనే 45 మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. 'అక్కడ సమాధి చూస్తున్నావ్ కదా.. ఆ సమాధి మధ్య మనిషి పుట్టిన తేదీ.. మరణించిన తేదీ రాసుంటుంది..ఆ మధ్య ఉన్న చిన్న డ్యాషే మనిషి మొత్తం జీవితం' అనే డైలాగ్‌లో ఈ ట్రైలర్‌తో ప్రారంభమైంది. ఈ ట్రైలర్ విజువల్స్, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఆడియన్స్‌ను ఆకట్టుకుంటున్నాయి. ఫైట్స్, విజువల్స్ చూస్తుంటే ఫుల్ యాక్షన్ మూవీగానే తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఈ మూవీలో రాజ్ బి శెట్టి కీలక పాత్రలో నటించారు. ఇంకెందుకు ఆలస్యం తెలుగు ట్రైలర్ మీరు కూడా చూసేయండి.


