అవినాష్ హీరోగా పరిచయమవుతూ దర్శకత్వం వహించిన సినిమా 'వానర'. నిన్నటివరకు ఈ పేరుతోనే ప్రచారం చేశారు. ఇప్పుడు టైటిల్ మార్చినట్లు ప్రకటించారు. 'వనవీర' అనే పేరుని ఫిక్స్ చేశారు. జనవరి 1న థియేటర్లలోకి రాబోతున్న ఈ చిత్ర ట్రైలర్ ఇప్పుడు విడుదల చేశారు.
కులం, రాజకీయ అంశాలతో తీసిన ఈ సినిమాలో డివోషనల్ టచ్ కూడా ఉంది. ఈ మేరకు ట్రైలర్‌లో రాముడు, వానర సైన్యం, లంకకు వారధి కట్టడం లాంటి గ్రాఫిక్ విజువల్స్ చూపించారు. అయితే స్టోరీకి రాముడు, వానర సైన్యానికి లింక్ చేసి ఎలా చూపిస్తారో? ఇందులో సిమ్రన్ చౌదరి హీరోయిన్‌గా చేయగా.. వివేక్ సాగర్ సంగీతమందించాడు.


