జన నాయగన్‌ 'విజయ్' ఫ్యాన్స్‌కు శుభవార్త | Madras High Court Permits Jana Nayagan movie Makers Of Withdraw Petition | Sakshi
Sakshi News home page

జన నాయగన్‌ 'విజయ్' ఫ్యాన్స్‌కు శుభవార్త

Feb 10 2026 11:50 AM | Updated on Feb 10 2026 1:50 PM

Madras High Court Permits Jana Nayagan movie Makers Of Withdraw Petition

దళపతి విజయ్ అభిమానులకు శుభవార్త. జన నాయగన్ మూవీ నిర్మాతలు తాజాగా కీలక నిర్ణయం తీసుకున్నారు. సెన్సార్‌ బోర్డుకు వ్యతిరేకంగా వేసిన పిటిషన్‌ను విత్‌డ్రా చేసుకుంటున్నట్లు మద్రాస్‌ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీంతో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ మధ్య జరిగిన చట్టపరమైన వివాదం ముగిసింది. చిత్ర నిర్మాతలకు CBFCపై వేసిన పిటిషన్‌ను ఉపసంహరించుకోవడానికి మద్రాస్‌ హైకోర్టు అనుమతి ఇచ్చింది.

ఈ కేసులో KVN ప్రొడక్షన్స్ తరపున వాదిస్తున్న న్యాయవాది విజయన్ సుబ్రమణ్యం చేసిన అభ్యర్థనను జస్టిస్ PT ఆశా అనుమతించారు. కేసును ఉపసంహరించుకోవాలని కోరుకుంటున్నట్లు నిర్మాణ సంస్థ హైకోర్టు రిజిస్ట్రీకి లేఖ ద్వారా తెలియజేసింది. సినిమాను మరోసారి రివైజింగ్‌ కమిటీకి పంపి సమీక్ష ప్రక్రియను కొనసాగించాలని నిర్మాతలు నిర్ణయించుకున్నట్లు కోర్టుకు తెలిపారు.  ఇకపై చట్టపరమైన చర్యలను కొనసాగించడం లేదని  లేఖలో నిర్మాతలు పేర్కొన్నారు. CBFCకి వ్యతిరేకంగా వేసిన పిటిషన్‌ను విత్‌డ్రా చేసుకోవడంతో సినిమా విడుదలకు లైన్‌ క్లియర్‌ అయిపోయింది.  ఇప్పటికే జన నాయగన్‌ నిర్మాతలు ఈ చిత్రాన్ని CBFC  రివైజింగ్ కమిటీకి పంపినట్లు సమాచారం. సినిమా విడుదల తేదీని త్వరలో ప్రకటించనున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement