అర్జున్‌ రెడ్డిని గుర్తు చేసేలా కొత్త సినిమా ట్రైలర్‌.. | Nilave Movie Trailer Creates Buzz, Netizens Compares Director With Sandeep Reddy Vanga, watch Video Inside | Sakshi
Sakshi News home page

అర్జున్‌ రెడ్డిని గుర్తు చేసేలా కొత్త సినిమా ట్రైలర్‌.. దర్శకుడేంటి సందీప్‌రెడ్డి స్టూడెంట్‌లా ఉన్నాడే..

Feb 7 2026 12:09 PM | Updated on Feb 7 2026 12:42 PM

Nilave Telugu movie trailer Out Now

'అర్జున్‌ రెడ్డి' సినిమాతో దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా పేరు పెద్ద సెన్సేషనల్‌ అయిపోయింది. ఈ మూవీ టేకింగ్‌ ఏ రేంజ్‌లో ఉంటుందో అందరికి తెలిసిందే. అయితే, తాజాగా విడుదలైన 'నిలవే' మూవీ ట్రైలర్‌కు ఇలాంటి రెస్పాన్సే వస్తుంది. ఈ ట్రైలర్‌ను చూసిన నెటిజన్లు చిత్ర దర్శకుడిని ప్రశంసిస్తూ పోస్టులు పెడుతున్నారు. వీడేంటి సందీప్‌రెడ్డి స్టూడెంట్‌లా ఉన్నాడు అంటూ కామెంట్లు చేస్తున్నారు. ట్రైలర్‌లో కట్స్‌, ఎడిటింగ్‌, సంగీతం సూపర్‌ అంటూనే హీరోయిన్‌ పాత్రలో కనిపించిన శ్రేయాసి సేన్ నటన అదుర్స్‌ అంటున్నారు.

సౌమిత్‌ పోలాడి హీరోగా నటిస్తూనే సాయి కె.వెన్నంతో కలిసి నిలవే చిత్రానికి  దర్శకత్వం వహించారు. ఇందులో శ్రేయాసి సేన్‌ కథానాయికగా నటిస్తుంది. రాజ్‌ అల్లాడ, గిరిధర్‌రావు పోలాడి, సాయి కె.వెన్నం నిర్మాతలు.  ప్రేమికుల రోజు కానుకగా ఫిబ్రవరి 13న ఈ మూవీ విడుదల కానుంది. ఈ క్రమంలో తాజాగా ట్రైలర్‌ను విడుదల చేశారు. ట్రైలర్‌కు మంచి ఆదరణ రావడంతో సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతుంది. ఇందులో హీరోయిన్‌గా నటిస్తున్న శ్రేయాసి సేన్‌కు మంచి గుర్తింపు వస్తుంది.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement