గద్దర్‌ అవార్డ్స్‌ రేసులో 90 సినిమాలు.. పరిశ్రమపై భట్టి విక్రమార్క వ్యాఖ్యలు | Bhatti Vikramarka comments on Gaddar Awards | Sakshi
Sakshi News home page

ఎలాంటి అవసరం వచ్చినా సరే మా ప్రభుత్వ తలుపు తట్టొచ్చు: భట్టి విక్రమార్క

Feb 7 2026 11:29 AM | Updated on Feb 7 2026 11:37 AM

Bhatti Vikramarka comments on Gaddar Awards

తెలంగాణ సినీ పరిశ్రమ అత్యున్నత స్థాయికి చేరాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కోరారు.  ప్రపంచాన్ని శాసించే స్థాయికి తెలంగాణ సినీ పరిశ్రమ ఎదగాలని అందుకోసం కార్యాచరణని కూడా సిద్ధం చేశామన్నారు.  చిత్ర పరిశ్రమకు ఎలాంటి అవసరం వచ్చినా సరే తెలంగాణ ప్రభుత్వం సాయంగా ఉంటుందని ఆయన తెలిపారు. తాజాగా హైదరాబాద్‌లో జరిగిన తెలంగాణ గద్దర్‌ సినీ పురస్కారాలు - 2025 స్క్రీనింగ్‌ ప్రక్రియలో ఆయన పాల్గొన్నారు.

ప్రజల కోసం తన జీవితాన్ని ధారబోసిన మహనీయుడు గద్దర్‌ అని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గుర్తుచేశారు. తాము అధికారంలోకి రాగానే ఆయన పేరుపైనే సినీ పురస్కారాలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ఈ క్రమంలో  రెండో ఏడాది పురస్కారాల్ని కూడా అందించబోతున్నందుకు సంతోషంగా ఉందన్నారు.  ఈసారి  ఉగాది రోజున ఈ వేడుకను ఘనంగా నిర్వహిస్తామని చెప్పారు. పరిశ్రమకు ఎలాంటి అవసరం వచ్చినా సరే తమ ప్రభుత్వ తలుపు తట్టొవచ్చని ఆయన భోరస కల్పించారు. 

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో పాటు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తాను కూడా  అందుబాటులో ఉంటామన్నారు. తెలంగాణ ఫిల్మ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌, నిర్మాత దిల్‌రాజు ఈ  వేడుకకు సంబంధించిన ఏర్పాట్లను చూసకుంటున్నారని చెప్పారు. గద్దర్‌ అవార్డ్స్‌ జ్యూరీ ఛైర్మన్‌ మణిశర్మ  కమిటీ ఎలాంటి బేధాలు లేకుండా  అవార్డుల ఎంపిక కార్యక్రమాన్ని చేపడుతుందని  భట్టి విక్రమార్క తెలిపారు. ఈసారి గద్దర్‌ అవార్డ్స్‌ కోసం 90 సినిమాలు పోటీలో ఉన్నాయని టీఎఫ్‌డీసీ ఛైర్మన్‌ దిల్‌రాజు ప్రకటించారు.  మార్చి 5లోపు జ్యూరీ సభ్యులు  ఈ సినిమాలన్ని చూసి అవార్డుల్ని ఎంపిక చేస్తారని తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement