ఢిల్లీ, ముంబై కంటే హైదరాబాద్ బెస్ట్!.. డెలాయిట్ మేనేజర్ | Deloitte Manager in Hyderabad Paying Rs 50000 Rent for 3BHK And Know The Details | Sakshi
Sakshi News home page

ఢిల్లీ, ముంబై కంటే హైదరాబాద్ బెస్ట్!.. డెలాయిట్ మేనేజర్

Feb 3 2026 8:55 PM | Updated on Feb 3 2026 9:07 PM

Deloitte Manager in Hyderabad Paying Rs 50000 Rent for 3BHK And Know The Details

ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్ నగరాల్లో రూమ్ రెంట్స్ ఎలా ఉంటాయో చాలామందికి తెలిసే ఉంటుంది. రెంట్ ఎక్కువైనా.. హైదరాబాద్ బెస్ట్ అంటున్నారు.. డెలాయిట్ కన్సల్టింగ్‌లో ఎంగేజ్‌మెంట్ మేనేజర్‌ 'కోమల్ ఝా'.

కోమల్ ఝా.. డెలాయిట్ కన్సల్టింగ్‌లో ఎంగేజ్‌మెంట్ మేనేజర్‌గా పనిచేస్తున్న సీనియర్ ప్రొఫెషనల్. బీహార్ రాష్ట్రంలోని భాగల్‌పూర్‌కు చెందిన ఈమె ఉద్యోగ రీత్యా.. ఢిల్లీ, ముంబై, పుణే, బెంగళూరు వంటి దేశంలోని ప్రధాన నగరాల్లో నివసించింది. గత తొమ్మిదేళ్లుగా హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నారు.

తొమ్మిదేళ్లుగా హైదరాబాద్‌లో ఉంటున్న కోమల్ ఝా.. భర్త & కుమార్తెతో కలిసి ఒక 3BHK ఇంట్లో ఉంటున్నారు. ఇతర మహానగరాలతో పోలిస్తే, హైదరాబాద్ జీవనశైలి సౌకర్యవంతంగా ఉండటమే కాకుండా వర్క్-లైఫ్ మధ్య మంచి సమతుల్యత కల్పిస్తుందని ఆమె చెబుతున్నారు.

ఖర్చుల విషయానికి వస్తే.. 3BHK ఇల్లు అద్దె నెలకు రూ.50వేలు, పనిమనిషికి రూ.20వేలు.. ఎలక్ట్రిక్, వాటర్, యుటిలిటీ కోసం మరో 10వేల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. కూతురు చదువు కోసం ఇంకో రూ. 30వేలు కేటాయిస్తుంది. కిరాణా సరుకులు & వంటింటి అవసరాల కోసం నెలకు సుమారు రూ.15,000 ఖర్చవుతుంది. అంటే నెలకు దాదాపు రూ.1.25 లక్షలు ఖర్చు అవుతుందన్న మాట. ప్రతి నగరంలో లాభాలు, నష్టాలు ఉన్నప్పటికీ.. జీవన నాణ్యత దృష్ట్యా హైదరాబాద్‌ను తాను ఎక్కువగా ఇష్టపడతున్నట్లు కోమల్ ఝా పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement