breaking news
3BHK
-
దిగ్గజ సచిన్‌ని ఫిదా చేసిన సౌత్ సినిమా
సినిమాకు ఒకప్పుడు హద్దులు ఉండేవి. ఏ ఇండస్ట్రీ మూవీస్ ఆయా రాష్ట్రాల్లో మాత్రమే ఆడేవి. ఇప్పుడు ఓటీటీ పుణ్యమా అని భాషా హద్దులు లేకుండా పోయాయి. దీంతో సామాన్యుల నుంచి స్టార్స్ వరకు కొత్త మూవీస్ ఎప్పటికప్పుడు చూస్తున్నారు. వాటి గురించి సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెడుతున్నారు. అలా దిగ్గజ సచిన్ టెండుల్కర్‌కి కూడా ఈ మధ్య రిలీజైన ఓ తమిళ సినిమా నచ్చేసింది. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే చెప్పారు.(ఇదీ చదవండి: లావు తప్ప మరేదీ కనపడదా..? హీరోయిన్ ఆక్రోశం)రిటైర్మెంట్ తర్వాత జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్న సచిన్.. రీసెంట్గా రెడిట్‌లో అభిమానులతో ముచ్చటించారు. ఇందులో భాగంగా సినిమాల గురించి అడగ్గా.. ఈ మధ్య కాలంలో తనకు 3 బీహెచ్‌కే, అత తంబైచ నాయ్ అనే చిత్రాలు నచ్చాయని చెప్పుకొచ్చారు. వీటిలో ఒకటి తమిళ్ కాగా, మరొకటి మరాఠీ మూవీ. 3 బీహెచ్‌కే సినిమా విషయానికొస్తే.. తెలుగు ప్రేక్షకులకు తెలిసిన సిద్ధార్థ్, శరత్ కుమార్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు.మధ్య తరగతి కుటుంబం.. సొంత ఇంటి కలని నిజం చేసుకునే క్రమంలో ఎలాంటి కష్టాలు ఎదుర్కొంది? చివరకు సొంత ఇల్లు కట్టుకోగలిగారా లేదా అనే స్టోరీతో తీసిన ఈ చిత్రం.. చాలామంది మిడిల్ క్లాస్ యువతకు కనెక్ట్ అయింది. శ్రీ గణేశ్ దీనికి దర్శకుడు. థియేటర్లలో పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం.. అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి వచ్చిన తర్వాత కూడా మంచి రెస్పాన్స్ అందుకుంది. ఇప్పుడు సచిన్ కూడా ఈ మూవీ తనకు నచ్చిందని చెప్పడంతో సోషల్ మీడియాలో మరోసారి ట్రెండ్ అవుతోంది.(ఇదీ చదవండి: రజనీకాంత్ సలహా.. ఆ పని ఎప్పటికీ చేయను: కార్తీ) -
ఓటీటీల్లోకి వచ్చేసిన 37 సినిమాలు.. ఈ వీకెండ్ పండగే
మరో వీకెండ్ వచ్చేసింది. ఈసారి థియేటర్లలోకి వచ్చిన 'కింగ్డమ్' జనాల్ని అలరిస్తోంది. ఇది తప్పితే పెద్దగా చెప్పుకోదగ్గ మూవీస్ ఏం లేవు. మరోవైపు ఓటీటీల్లోనూ దాదాపు 37 వరకు కొత్త సినిమాలు-వెబ్ సిరీసులు స్ట్రీమింగ్‌లోకి వచ్చేశాయి. ఇవన్నీ కూడా ఒక్క శుక్రవారం నాడే రిలీజ్ కావడం విశేషం.(ఇదీ చదవండి: దొంగచాటుగా 'కింగ్డమ్' చూసొచ్చిన రష్మిక)ఓటీటీల్లో ఈ వీకెండ్ రిలీజైన సినిమాల విషయానికొస్తే.. 3 బీహెచ్‌కే, ఓ భామ అయ్యో రామ, పాపా, కలియుగం 2064, సితారే జమీన్ పర్, తమ్ముడు.. ఉన్నంతలో చూడొచ్చు. ఇవన్నీ కూడా తెలుగులోనే అందుబాటులో ఉన్నాయి. మొత్తంగా ఏ ఓటీటీలో ఏ మూవీ వచ్చింది?ఈ శుక్రవారం ఓటీటీల్లో రిలీజైన మూవీస్ (ఆగస్టు 01)అమెజాన్ ప్రైమ్3 బీహెచ్‌కే - తెలుగు సినిమాఓ భామ అయ్యో రామ - తెలుగు మూవీహౌస్ఫుల్ 5 - హిందీ చిత్రంద లెజెండ్ ఆఫ్ ఓచీ - ఇంగ్లీష్ మూవీనథింగ్ బట్ యూ - తెలుగు డబ్బింగ్ సిరీస్నైట్ సైలెన్స్ - పోలిష్ సినిమాడోప్ గర్ల్స్ - ఇంగ్లీష్ సిరీస్కెన్ యూ సమన్ 100 ఫ్రెండ్స్ - జపనీస్ సిరీస్బిల్డ్ ఇన్ బర్మింగ్హమ్ - ఇంగ్లీష్ సిరీస్ఏప్రిల్ మే 99 - మరాఠీ సినిమాఆంబట్ సౌకిన్ - మరాఠీ మూవీసీస్ కడ్డీ - కన్నడ సినిమానెట్ఫ్లిక్స్తమ్ముడు - తెలుగు మూవీద స్టోన్ - థాయ్ సినిమాద హస్బెండ్ ఆఫ్ రోసారియా - తగలాగ్ మూవీనథింగ్ అన్కవర్డ్ - కొరియన్ సిరీస్మై ఆక్స్ఫర్డ్ ఇయర్ - ఇంగ్లీష్ సినిమాడెత్ ఇంక్ సీజన్ 1 & 2 - ఇంగ్లీష్ సిరీస్హాట్స్టార్సూపర్ సారా - ఇంగ్లీష్ సిరీస్ఐస్ ఆఫ్ వాకాండా - ఇంగ్లీష్ సిరీస్ఆహాపాపా - తెలుగు డబ్బింగ్ మూవీచక్రవ్యూహం - తమిళ డబ్బింగ్ చిత్రంబుక్ మై షోద ఫోయెనికన్ స్కీమ్ - ఇంగ్లీష్ సినిమాజీ5సత్తముమ్ నీదియమ్ - తెలుగు డబ్బింగ్ సిరీస్బకైటి - హిందీ సిరీస్యూట్యూబ్సితారే జమీన్ పర్ - తెలుగు డబ్బింగ్ సినిమా (రెంట్ విధానం)సన్ నెక్స్ట్సురభిల సుందర స్వప్నం - మలయాళ మూవీజిన్ ద పెట్ - తెలుగు డబ్బింగ్ చిత్రంగరుడన్ - తమిళ మూవీమనోరమ మ్యాక్స్‌సూపర్ జిందగీ - మలయాళ సినిమాఆపిల్ ప్లస్ టీవీస్టిల్ వాటర్ సీజన్ 4 - ఇంగ్లీష్ సిరీస్చీఫ్ ఆఫ్ వార్ - ఇంగ్లీష్ సిరీస్లయన్స్ గేట్ ప్లేప్రాజెక్ట్ సైలెన్స్ - కొరియన్ మూవీకోడ్ ఆఫ్ సైలెన్స్ - ఇంగ్లీష్ సిరీస్కలియుగం 2064 - తెలుగు సినిమాటెంట్కోట్టాగట్స్ - తమిళ మూవీఅస్త్రం - తమిళ సినిమా(ఇదీ చదవండి: హీరో విశాల్ ఇంట్లో శుభకార్యం.. విదేశీయుడితో పెళ్లి) -
హీరో సిద్ధార్థ్ ‘3BHK’ మూవీ థ్యాంక్స్ మీట్ (ఫొటోలు)
-
కార్పొరేట్ జాబ్ చేయకుండా.. రూ.2 వేల జీతానికే జాయిన్ అయ్యా: హీరో సిద్ధార్థ్
కోలీవుడ్ హీరో సిద్ధార్థ్ ఇటీవలే సరికొత్త మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఆయన హీరోగా నటించిన 3బీహెచ్‌కే జూలై 4న థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఈ చిత్రానికి శ్రీగణేశ్ దర్శకత్వం వహించారు. అయితే ఈ సినిమాకు సక్సెస్ టాక్ రావడంతో మేకర్స్ థ్యాంక్స్ మీట్ నిర్వహించారు. హైదరాబాద్‌లో జరిగిన ఈవెంట్‌కు హీరో సిద్ధార్థ్, హీరోయిన్ మీతా రఘునాథ్ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా సిద్ధార్థ్ తన కెరీర్ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. కేవలం రెండు వేల రూపాయలకే అసిస్టెంట్‌గా జాయిన్ అయ్యానని వెల్లడించారు.సిద్ధార్థ్ మాట్లాడుతూ..' నేను నా లైఫ్‌ను రెండుసార్లు రీసెట్ చేశాను. ఎంబీఏ పూర్తి చేసి కార్పొరేట్ జాబ్ చేయకుండా సినిమా వైపు వచ్చా. కేవలం రెండు వేల రూపాయలకే మణిరత్నం దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేరాను. అప్పుడు నా పేరేంట్స్ నన్ను చూసి ఆందోళనకు గురయ్యారు. వీడేంటి సినిమా సైడ్ వెళ్తున్నాడు.. అది కూడా డైరెక్టర్ అవుతానని అంటున్నాడు. వీడు ఏమవుతాడో అని భయపడ్డారు. అక్కడి నుంచి మొదలై 25 ఏళ్ల తర్వాత ఈ రోజు ఒక సింగర్‌గా, నటుడిగా మీ ముందు నిలబడ్డా' అని పంచుకున్నారు.(ఇది చదవండి: తెలుగులో అద్భుతంగా మాట్లాడిన హీరోయిన్.. నోరెళ్లబెట్టిన హీరో సిద్దార్థ్)కాగా.. 3 బీహెచ్‌కే మూవీలో శరత్‌కుమార్, దేవయాని, చైత్ర, యోగిబాబు కీలక పాత్రల్లో నటించారు. ఈ మూవీ జూలై 4న తెలుగు, తమిళ భాషల్లో ప్రేక్షకుల ముదుకొచ్చింది. కాగా.. గతేడాది సిద్ధార్థ్ వివాహబంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. హీరోయిన్ ఆదితి రావు హైదరీని ఆయన పెళ్లాడారు. తెలంగాణలోని ఓ ప్రాచీన ఆలయంలో వీరిద్దరు పెళ్లి చేసుకున్నారు. -
తెలుగులో అద్భుతంగా మాట్లాడిన హీరోయిన్.. నోరెళ్లబెట్టిన హీరో సిద్దార్థ్
ఎన్నేళ్లు తెలుగు ఇండస్ట్రీలో పని చేసినా కొందరు హీరోయిన్లకు తెలుగు అస్సలు రాదు. కానీ పైన కనిపిస్తున్న కథానాయిక మాత్రం స్వచ్ఛమైన తెలుగులో మాట్లాడి అందర్నీ ఆశ్చర్యపరిచింది. తనెవరో మీరీపాటికే గుర్తుపట్టేసి ఉంటారు. గుడ్‌నైట్ హీరోయిన్ మీథా రఘునాథన్ (Meetha Raghunath). 3 BHK సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో మీథా అనర్గళంగా తెలుగు మాట్లాడింది. తెలుగులో మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్నాను. ఏమైనా తప్పులు దొర్లితే క్షమించండి అంటూ స్పీచ్ మొదలుపెట్టింది.రెండోసారి..మీరు నన్ను గుడ్‌నైట్ సినిమాలో చూసి ఉంటారు. ఆ సినిమాలో నా క్యారెక్టర్ పట్ల మీరు చూపించిన ప్రేమకు ధన్యవాదాలు. నేను చిన్నప్పుడు స్కూల్ ట్రిప్ కోసం తొలిసారి హైదరాబాద్‌కు వచ్చాను. ఇప్పుడు 3 BHK మూవీ కోసం రెండోసారి ఇక్కడకు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. 3 BHK.. కలలను సాకారం చేసుకునే కథ. ఇది మా కథ మాత్రమే కాదు, మీ కథ.. మనందరి కథ. ఈ సినిమాను ప్రేమతో, హృదయపూర్వకంగా చేశాం. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీతో థియేటర్‌కు వచ్చి సినిమా ఎంజాయ్ చేయండి. మీ అందరికీ సినిమా నచ్చుతుందని నమ్ముతున్నాను.తెలుగులో ఒక్క సినిమా చేయకపోయినా..ఈ మూవీ తర్వాత తెలుగులో ఎన్నో సినిమాలు చేయాలని ఆశిస్తున్నాను. దయచేసి సినిమా చూడండి, నన్ను సపోర్ట్ చేయండి అని చెప్పుకొచ్చింది. ఆమె ప్రసంగం విని సిద్దార్థ్ నోరెళ్లబెట్టాడు. చాలా బాగా మాట్లాడావని మెచ్చుకున్నాడు. నెక్స్ట్ తెలుగు మూవీ చేసినప్పుడు ఇంకా పర్ఫెక్ట్గా మాట్లాడతానని మీథా మాటిచ్చింది. ఇకపోతే మీథా రఘునాథ్ తెలుగులో డైరెక్ట్‌గా ఇంతవరకు సినిమా చేయలేదు. గుడ్‌నైట్ అనే తమిళ సినిమా తెలుగు వర్షన్‌తోనే ఇక్కడివారికి సుపరిచితురాలైంది. ఇంత చక్కగా తెలుగు మాట్లాడుతున్న ఈ బ్యూటీ త్వరలోనే ఇక్కడ స్ట్రయిట్ ఫిలిం చేయాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.తెలంగాణ అల్లుడిని కదా..3 BHK మూవీలో శరత్‌కుమార్, సిద్దార్థ్, దేవయాని, చైత్ర, యోగిబాబు కీలక పాత్రల్లో నటించారు. ఈ మూవీ జూలై 4న తెలుగు, తమిళ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో సిద్దార్థ్ మాట్లాడుతూ.. 25 ఏళ్లయింది.. నేను ఇంతవరకు భూమి, ఇల్లు ఏవీ కొనలేదు. 3 బీహెచ్‌కే సినిమా చేస్తున్నప్పుడు తొలిసారి ఇల్లు కొనుక్కున్నాను. పెళ్లయ్యాక బాధ్యతలు పెరిగాయి కదా.. అసలే తెలంగాణ అల్లుడిని కదా! అందుకే నా భార్యతో కలిసి కొత్త ఇల్లు కొనుక్కున్నాను అని చెప్పుకొచ్చాడు.చదవండి: 'కాంటా లగా' సాంగ్‌తో సెన్సేషన్.. నటి కన్నుమూత -
మాది కూడా 3 BHK.. అమ్మానాన్న కష్టపడి..: సిద్ధార్థ్ భావోద్వేగం
సిద్దార్థ్ (Siddharth) హీరోగా నటించిన 40వ సినిమా 3 BHK. హైదరాబాద్‌లో గురువారం ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా హీరో భావోద్వేగానికి లోనయ్యాడు. సిద్దార్థ్ మాట్లాడుతూ.. నా తల్లిదండ్రులు కూడా 3 BHKలోనే ఉండేవారు. నటుడిగా నాకిది 40వ సినిమా. 3BHK మూవీ చేస్తున్నానని చెప్పగానే నాన్న (సూర్యనారాయణన్) ముఖంలో సంతోషం కనిపించింది. ఒకరకమైన తృప్తి, ఒకింత గర్వం కనబడింది.నాకోసం సంపాదనంతా..ఈ సినిమాలో అందరూ నన్ను ఏడిపిస్తారు. ఇదొక ఎమోషనల్ ఫిలిం. ఈ మూవీ చేసినందుకు సంతోషంగా ఉంది. నా తల్లిదండ్రులు నన్ను ఎంతగానో నమ్మారు. నా జీవితం బాగుండాలని వారు సంపాదించినదంతా ఖర్చుపెట్టారు. నన్ను నమ్మి ఈ సినిమాలో అవకాశం ఇచ్చిన డైరెక్టర్‌కు థాంక్యూ అంటూ కర్చీఫ్‌తో కన్నీళ్లు తుడుచుకున్నాడు.సినిమాసొంతిల్లు అనేది ఎన్నో మధ్యతరగతి కుటుంబాల కల. మామూలు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఆ కల నెరవేర్చుకుందా? లేదా? దానికోసం ఏ చేశారన్నదే 3 BHK కథ. శరత్‌కుమార్, దేవయాని, చైత్ర, యోగిబాబు కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రం జూలై 4న విడుదల కానుంది. చదవండి: బిగ్‌బాస్ 9 ప్రోమో వచ్చేసింది.. నాగార్జునే హోస్ట్.. మరి బజ్ హోస్ట్? -
స్టార్ హీరో మరో డీ గ్లామరస్ పాత్ర.. ఎవరో గుర్తుపట్టారా?
ఒకప్పటిలా రొటీన్ కమర్షియల్ సినిమాలు అంటే అస్సలు సక్సెస్ కావట్లేదు. ఒకవేళ హిట్ అని డప్పుకొట్టినా సరే ప్రేక్షకులు నమ్మే స్థితిలో లేరు. దీంతో స్టార్ హీరోలు, యంగ్ హీరోలు డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీస్ వైపు చూస్తున్నారు. ఇప్పుడు ఆ రూట్ లో ఓ స్టార్ హీరో వెళ్తున్నట్లు అనిపిస్తుంది.(ఇదీ చదవండి: తిరుమల శ్రీవారికి అవమానం? వివాదంపై స్పందించిన హీరో) పైన ఫొటోలో శరత్ కుమార్ తో ఉన్నది సిద్ధార్థ్. అప్పుడెప్పుడో బొమ్మరిల్లు సినిమాతో తెలుగులో మంచి క్రేజ్ సొంతం చేసుకున్నాడు. కానీ ఆ తర్వాత సరైన హిట్స్ పడలేదు. తమిళంలోనూ చాన్నాళ్లుగా సినిమాలు చేస్తున్నాడు గానీ సక్సెస్ అందుకోలేకపోతున్నాడు. కొన్నాళ్ల క్రితం చిన్నా అనే మూవీతో అటు నటుడిగా మంచి పేరు వచ్చింది.ఇప్పుడు మళ్లీ ఆ తరహాలోనే 3 BHK అనే మూవీ చేస్తున్నాడు. గతంలో చిన్నా చిత్రంలో కాస్త డీ గ్లామర్ గా కనిపించారు. ఇప్పుడు ఈ చిత్రంలోనూ అలానే కనిపించబోతున్నాడు. ఇందులో శరత్ కుమార్ ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. మిడిల్ క్లాస్ కథతో తెరకెక్కిన ఈ సినిమా జూలై 4న తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ కానుంది. మరి ఈసారి కూడా సిద్ధార్థ్ హిట్ కొడతాడేమో చూడాలి?(ఇదీ చదవండి: ఓటీటీలోకి తమిళ కామెడీ థ్రిల్లర్.. తెలుగులో నేరుగా రిలీజ్) -
ట్రిపుల్ బెడ్ రూమ్ ఇళ్లే కావాలి!
ఇంటి డిజైన్ల విషయంలో టేస్ట్ ఎప్పటికప్పుడు మారుతున్నట్లే.. ఇంటీరియర్‌లోనూ ఎన్నో మార్పులు వస్తున్నాయి. గతంలో చిన్న ఇల్లు ఉండాలనే ఆశలతో ఉన్నవారు కరోనా తర్వాతి నుంచి విశాలంగా ఉండే ఇళ్లకే ప్రాధాన్యం ఇస్తున్నారు. ఆలస్యమైనా సరే.. కాస్త స్పేస్ ఎక్కువ ఉన్న ఇళ్లనే కొనుగోలు చేయాలని అనుకుంటున్నారు. - సాక్షి, సిటీబ్యూరోనగరం మధ్యలో ఇరుకు ఇళ్లలో ఉండేకంటే శివారు ప్రాంతాలు, పచ్చదనం ఉండే ప్రాంతాలను ఇష్టపడుతున్నారు. అపార్ట్మెంట్లలో అయితే డబుల్, ట్రిపుల్ బెడ్ రూమ్ ఇళ్లను కొనుగోలు చేస్తున్నారని హౌసింగ్.కామ్ ఇండియన్ రెసిడెన్షియల్ ఇండెక్స్ ఫర్ ఆన్లైన్ సెర్చ్(ఐఆర్ఐఎస్) తెలిపింది. 15 శాతం వృద్ధిగతంలో ప్రాపర్టీ కొనాలంటే ధర, వసతులు ప్రధాన అంశాలుగా ఉండేవి. కరోనా తర్వాతి నుంచి వైద్య సదుపాయాలకు ఎంత దూరంలో ఉంది? భద్రత ఎంత? అనే అంశాలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. గతేడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా వైద్య సదుపాయాలు, భద్రత, ఓపెన్ స్పేస్ ఎక్కువగా ఉన్న ప్రాజెక్ట్‌లకు డిమాండ్ పెరిగింది. త్రీ బీహెచ్‌కే, ఆపై పడక గదుల గృహాలలో అంతకు క్రితం ఏడాదితో పోలిస్తే 2024లో 15 శాతం వృద్ధి నమోదైంది. గతేడాది పెద్ద సైజు ప్లాట్లలో 42 శాతం పెరుగుదల కనిపించింది.