అమ్మానాన్నకు సర్‌ప్రైజ్‌ గిఫ్ట్‌ : ఎమోషనల్‌ వీడియో | Daughters gift parents brand new car heartwarming reactions goes viral | Sakshi
Sakshi News home page

అమ్మానాన్నకు సర్‌ప్రైజ్‌ గిఫ్ట్‌ : ఎమోషనల్‌ వీడియో

Mar 16 2026 4:18 PM | Updated on Mar 17 2026 5:10 PM

Daughters gift parents brand new car heartwarming reactions goes viral

బాగా చదివి, ప్రయోజకులై,మంచి కానుకలతో తల్లిదండ్రులను సర్‌ప్రైజ్‌ చేయాలని చాలా మంది బిడ్డల ఆలోచన. చక్కటి ఇల్లో, ఖరీదైన కారో కానుకగా ఇవ్వాలని చాలామంది డ్రీమ్‌. అలా తమ తల్లిదండ్రులకు ఒక సరికొత్త కారును గిఫ్ట్‌ ఇచ్చి, ఆశ్చర్యపరిచిన వీడియో ఒకటి నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. అమ్మానాన్నలకు అపురూపమైన కానుకిచ్చిన ఇద్దరు కూతుళ్ళ కథ తెలుసుకుందాం పదండి.

వర్ష అనే యువతి ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఈ వీడియో సోషల్‌ మీడియాలో సందడిగా మారింది. తన సోదరితో కలిసి తమ తల్లిదండ్రులకు కొత్త కారును గిఫ్ట్‌గా ఇచ్చింది.

తమ తల్లిదండ్రుల కళ్ళకు గంతలు కట్టి డ్రైవ్‌వే వైపు మెల్లగా తీసుకొచ్చి మరీ బ్రాండ్‌ న్యూ కారు ఇచ్చారు. కొత్త కారును చూసి ఆ దంపతులు ఆశ్చర్య పోయారు.  అందరూ కలిసి కారు పైన కవర్‌ తీయగానే అమ్మానాన్నల ముఖాల్లో వెయ్యి వోట్ల వెలుగు వచ్చింది. వెంటనే వారు తమ కుమార్తెలను హత్తుకుని ఆనందంతో ఉప్పొంగిపోయారు. చుట్టూ ఉన్న బంధువుల చప్పట్లు, నవ్వులతో సందడిగా మారింది. ఈ క్షణాలు ఎంతో భావోద్వేగాన్ని నింపాయి.

భావోద్వేగ సందేశం
"మా తల్లిదండ్రులు  ఇది లేదు, అది లేదు అని ఎపుడూ చెప్పలేదు. మమ్మల్ని ఏ విషయంలోనూ ఆపలేదు. ఎదిగి విజయం సాధించండి' అని మాత్రమే చెప్పారు. మా జీవితాంతం మాకు రక్షణగా, మద్దతుగా నిలిచినందుకు ఈ కారు ఒక చిన్న కృతజ్ఞత మాత్రమే. మేం నలుగురం ఒక్కటే."

నెటిజన్ల ప్రశంసలు
ఈ వైరల్ వీడియోపై సోషల్ మీడియా వినియోగదారులు ప్రశంసల వర్షం కురిపించారు."ఇంతటి విలువైన కుమార్తెలను పొందిన ఆ తల్లిదండ్రులు నిజంగా అదృష్టవంతులు," అని ఒకరు "ఆ తల్లి కళ్లలోనే అంతా కనిపిస్తోంది. అందులో కేవలం ప్రేమానురాగాలు మాత్రమే ఉన్నాయి" అని మరొకరు రాశారు. కన్నబిడ్డలు ఎదుగుదల, తమకు గౌరవించే తీరు చూసినపుడు  తల్లిదండ్రులు పొందే ఆ గర్వం, సంతోషం ఈ వీడియోలో స్పష్టంగా కనిపిస్తోందని చాలా మంది అభిప్రాయపడ్డారు.

Advertisement
 
Advertisement
Advertisement