parents
-
మనో వైకల్యమే మహా విషాదం
ఎటుచూసినా పోటీ ప్రపంచం.. పిల్లలు ఇప్పట్నుంచే చదువులో అత్యుత్తమంగా లేకుంటే భవిష్యత్‌లో వెనుకబడిపోతారనే అనవసర ఆందోళన.. మార్కులు సాధించే యంత్రాలుగా చూస్తూ వారిపై తీవ్ర ఒత్తిడి.. తాము సాధించలేని లక్ష్యాలు, తాము నెరవేర్చుకోలేని ఆశలను వారసులు తీర్చాల్సిందే అనే పంతం.. మరోవైపు దీనికి ఆజ్యం పోసేలా ప్రైవేటు, కార్పొరేట్ విద్యా సంస్థల ధోరణి.. వెరసి పిల్లల యోగక్షేమాలు, ఆటపాటలు, మానసిక ఉల్లాసం గురించి పట్టించుకోకుండా విచక్షణారహితంగా ప్రవర్తిస్తున్న తల్లిదండ్రులు చివరకు బిడ్డల ప్రాణాలను తీసేందుకు సైతం వెనుకాడడం లేదు. తాజాగా కాకినాడలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి ఒకరు.. ఏడేళ్లు, ఆరేళ్ల వయసున్న తన ఇద్దరి కుమారులను పోటీ ప్రపంచంలో రాణించలేరనే కారణంతో నిర్దాక్షిణ్యంగా చంపేయడమే కాక తాను కూడా ప్రాణాలు తీసుకున్న ఘటన చర్చనీయాంశంగా మారింది. తల్లిదండ్రులు పిల్లల విషయంలో ధోరణి మార్చకోకుంటే మున్ముందు ఇలాంటి ఘటనలు మరిన్ని చూడాల్సి వస్తుందేమోనని విద్యావేత్తలు, మానసిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వారి తీరు మారాల్సిందేనని స్పష్టం చేస్తున్నారు. సాక్షి, స్పెషల్ డెస్క్ : తల్లిదండ్రుల్లో విపరీత పోకడలకు కారణం.. ప్రైమరీ స్కూల్ స్థాయి నుంచే పోటీ వాతావరణం నెలకొనడం. ఆడుతూ పాడుతూ ఆహ్లాద వాతావరణంలో చదువుకోవాల్సిన వయసులో పిల్లలు సహచరులతో పోటీ పడాల్సి వస్తోంది. ఈ క్రమంలో పిల్లల విజయం తమదిగా, సమాజంలో తమకు గుర్తింపుగా భావిస్తున్న తల్లిదండ్రులు ప్రతికూల ఫలితం వస్తే తట్టుకోలేక ఆ కోపాన్ని పిల్లలపై చూపుతున్నారు. పిల్లలు ఏదైనా అంశంలో వెనుకబడితే, ఆశించినంత రాణించకపోతే తల్లిదండ్రులు తమ ప్రకోపాన్ని ప్రదర్శిస్తున్నారు. తమ బిడ్డల భుజం తట్టి భరోసా ఇవ్వాల్సింది పోయి భయపెడుతున్నారు. మార్కులు తక్కువ వస్తే పరిష్కారం చూపకుండా నలుగురి ముందు తిట్టడం, కొట్టడం చేస్తున్నారు. దీంతో పిల్లల్లో ఆత్మన్యూనత పెరుగుతోంది. సమస్యలను తల్లిదండ్రులకు చెప్పుకోలేక కుంగిపోతున్నారు. కొందరు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. మరికొందరు విపరీత ధోరణులతో ప్రవర్తిస్తున్నారు.లాభపడుతున్న కార్పొరేట్ స్కూళ్లు కార్పొరేట్ స్కూళ్లు ఐదో తరగతి నుంచే ఐఐటీ, నీట్ ఫౌండేషన్ అంటూ తల్లిదండ్రులకు వల వేస్తున్నాయి. వీటిలో చేర్చితే తమ పిల్లలు ఐఐటీల్లో, ఎయిమ్స్‌ల్లో అడుగు పెట్టడం ఖాయమనే ఆలోచనతో ఏ మాత్రం వెనక్కుతగ్గకుండా.. రూ.లక్షల్లో ఫీజులు కడుతున్నారు. ఫలితాలు ఏ మాత్రం తేడా వచి్చనా.. తమ కోపతాపాలకు పిల్లలను గురి చేస్తున్నారు. పలుచన అవుతామనే ఆందోళనతో.. తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల ఇలా ప్రవర్తించడానికి.. సమాజంలో తమ పేరు, ప్రఖ్యాతులు పోతాయని లేదా కొలీగ్స్, ఇతరుల ముందు పలుచన అవుతామనే ఆందోళనే కారణమని విద్యారంగ నిపుణులు చెబుతున్నారు. పిల్లలు తమ ఆస్తి అని, వారిపై అన్ని హక్కులు, అధికారాలు తమకు ఉన్నాయని భావిస్తున్నారు. తమ కలలను నెరవేర్చడానికే పిల్లలు ఉన్నారనే ప్రమాదకర భావన పెరుగుతోంది. ఈ నేపథ్యంలో పరిస్థితులు ఏ మాత్రం ప్రతికూలంగా మారినా ఎంతటి తీవ్ర చర్యకైనా వెనుకాడట్లేదు. ఇలాంటి పరిస్థితి రాకుండా తల్లిదండ్రులకు ముందు కౌన్సెలింగ్ ఇవ్వాల్సిన ఆవశ్యకత ఉందని మానసిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. డెల్యూజనల్ డిజార్డర్స్ మానసిక రుగ్మత అంటే పిచ్చి ఒక్కటే అనుకుంటున్నారని, అదొక్కటే కాదని, రకరకాల ఆలోచనా విధానాలని నిపుణులు చెబుతున్నారు. వీటినే డెల్యూజనల్ డిజార్డర్స్ (భ్రాంతి రుగ్మత) అంటారని వివరిస్తున్నారు. వ్యక్తిలో అంతులేని నిరాశ, భాగస్వామి పట్ల అనుమానం, ఆరి్థక, సామాజిక ఒత్తిళ్లు, ఏదో వైపరీత్యం జరగబోతుందన్న ఊహ, ప్రమాదంపై భయం, మితిమీరిన, తప్పుదారి పట్టిన ప్రేమలు, తీవ్ర మానసిక రుగ్మతలు వంటివి దుర్ఘటనలకు దారితీస్తున్నాయని అంటున్నారు. తమ వల్ల ఏదీ కావడం లేదని, దేనికీ పనికిరామేమోనని, సమాజం తమను చెడుగా ఊహించుకుంటోందేమోనన్న ఆలోచనలు ఎక్కువైనవారు చివరకు తమ పిల్లలను చంపేసి, తామూ చనిపోవాలన్న నిర్ణయానికి వస్తున్నారని పేర్కొంటున్నారు. ఇలాంటి ఆలోచనలు ఉన్నప్పుడు శ్రేయోభిలాషులు, హితులు, సన్నిహితుల వద్ద చర్చించినా ఫలితం దొరుకుతుందని వైద్యులు చెబుతున్నారు. వారు పెరిగిన పరిస్థితులు కూడా ఓ కారణం పేరెంట్స్ ప్రతికూల వాతావరణంలో పెరిగితే.. అదే రీతిలో పిల్లలతో వ్యవహరించే ప్రమాదం ఉంది. కాకినాడ ఘటనపై పెద్దఎత్తున చర్చ జరగాలి. పిల్లల తల్లిదండ్రులకు కూడా కౌన్సెలింగ్ ఇవ్వాలి. పోటీ ప్రపంచంలో పరీక్షలు, ఫలితాలు అనివార్యంగా మారిన మాట వాస్తవం. కానీ, వీటితోనే పిల్లల భవిష్యత్తు అని భావించకూడదు. పిల్లల్లోని నైపుణ్యాలను గుర్తించి, వాటిలో రాణించేందుకు ప్రోత్సహిస్తే ఫలితాలు ఉంటాయి. –ఆర్.సి.రెడ్డి, ఆర్.సి.రెడ్డి ఐఏఎస్ స్టడీ సర్కిల్తల్లిదండ్రుల్లో మార్పు రావాలితల్లిదండ్రులు విపరీత పోకడలకు ప్రస్తుత పరీక్షల విధానం కూడా ఓ కారణం. దీనికి పరిష్కారంగా.. వినూత్నంగా జాతీయ విద్యా విధానాన్ని రూపొందించారు. సీబీఎస్ఈ కూడా రెండుసార్లు వార్షిక పరీక్షల విధానాన్ని ప్రతిపాదిస్తోంది. తల్లిదండ్రుల్లోనూ మార్పు రావాలి. సృజనాత్మకత, శక్తియుక్తుల ఆధారంగా చదివేలా పిల్లల్ని ప్రోత్సహించాలి. దీనికి భిన్నంగా వ్యవహరిస్తే వారి భవితకు ప్రమాదం ఏర్పడుతుంది. –సీతామూర్తి, ప్రిన్సిపాల్, సిల్వర్ ఓక్స్ స్కూల్, హైదరాబాద్తీవ్ర మానసిక సమస్య కన్నబిడ్డలను చంపేయడం ఓ తీవ్రమైన మానసిక సమస్య. ఈ తరహా సమస్యలతో బాధపడేవారిని కొన్ని లక్షణాల ద్వారా గుర్తించవచ్చు. అందులో ప్రధానమైనది చిన్న పిల్లల చర్యలపై తీవ్రంగా స్పందిస్తుండడం. ఇటువంటి వారికి పిల్లలను దూరంగా ఉంచాలి. మానసిక వైద్యుడికి చూపించాలి. – డాక్టర్ వి.వరప్రసాద్, మానసిక వ్యాధుల నిపుణుడు, జీజీహెచ్, కాకినాడగుడ్ పేరెంటింగ్ ముఖ్యం పేరెంటింగ్ అంటే పిల్లలను కఠిన నిబంధనలతో పెంచడం కాదు. వారి ఇష్టాయిష్టాలను తెలుసుకుని అందుకు అనుగుణంగా పెంచడమే గుడ్ పేరెంటింగ్. పిల్లల గురించి విపరీతంగా ఊహించుకోవడం, మంచి ఉద్యోగం పొందడం లేదా పరీక్షలో నెగ్గడమే అచీవ్‌మెంట్‌గా భావిస్తున్నారు. అందువల్లే సమస్యలొస్తున్నాయి. –డాక్టర్ వీరేందర్, ప్రముఖ సైకాలజిస్ట్ -
విద్యార్థులకు సాష్టాంగ నమస్కారం పెట్టిన హెడ్మాస్టర్
-
అమ్మకూ పరీక్షే!
పరీక్షల సమయంలో ఎక్కువమంది తల్లిదండ్రులు, ముఖ్యంగా అమ్మలు.. ‘పిల్లల సిలబస్ పూర్తవుతుందో లేదో, ఎగ్జామ్స్ ఎలా రాస్తారో, అనుకున్న గ్రేడ్ వస్తుందా.. అనే ఆలోచనలతో సతమతమవుతుంటారు. మానసిక ఒత్తిడికి లోనవుతుంటారు. భావోద్వేగాలకు గురవుతుంటారు. త్వరగా చిరాకు పడటం, టైమ్‌కి తినకపోవడం, ఎవరినీ కలవకపోవడం, పిల్లల్ని కలవనివ్వకపోవడం వంటివి చేస్తుంటారు. కొందరు తల్లులు తమ పిల్లలకన్నా ఎక్కువగా ఆందోళన చెందుతుంటారు. ఇది సరికాదని అమ్మలు కొంత సంయమనంతో వ్యవహరించాలని సూచిస్తున్నారు. సరైన ఆహారం, తగిన విశ్రాంతి తీసుకోవాలని చెబుతున్నారు.ఎందుకు ఒత్తిడికి గురవుతారు..? ⇒ ముందు నుంచీ సిలబస్ ప్రకారం ప్రాక్టీస్ చేయించలేకపోవడం ఒక కారణం. మొదట స్కూల్లో టీచర్లే చూసుకుంటారులే అనే ధీమా ఉంటుంది. పరీక్షల సమయంలో అదికాస్తా సన్నగిల్లుతుంటుంది.⇒ పెద్ద పిల్లలైతే సిలబస్ పూర్తి చేయడంలో వెనకబడు తున్నారేమో అనే సందేహం వెంటాడుతుంటుంది. ⇒ ఫెయిల్ అవుతారేమో, ఇతరుల పిల్లలు ఎక్కువ మార్కులు స్కోర్ చేస్తారేమో అనే ఆందోళనకు గురవుతుంటారు.ఒత్తిడిని ఎలా అధిగమించాలి.. ⇒ తల్లిదండ్రులు పిల్లల విజయాన్ని కోరుకుంటారు. తమ పిల్లలు అందరికన్నా ముందుండాలనే ఆలోచన ఒత్తిడికి గురి చేస్తుంది. అలా ఒత్తిడికి గురవకుండా.. వాస్తవికంగా సాధించగల లక్ష్యాలపై పిల్లలతో కలిసి పనిచేయాలి.⇒ మీ ఆందోళన పిల్లల ముందు బయటపడకుండా సానుకూల వైఖరిని చూపాలి. రోజువారీ షెడ్యూల్‌ను రూపొందించుకోవడంలో పిల్లలకు సాయపడాలి. ⇒ ఒత్తిడి అనేది అందరూ ఎదుర్కొనే సాధారణ సమస్యే. దానిని అధిగమించేందుకు వ్యూహాత్మకంగా పనిచేయ డంలోనే అసలైన సవాల్ ఉంటుంది. అది మీ బిడ్డలకు మద్దతునిచ్చే అతి ముఖ్యమైన వనరుగా ఉండాలి. కలిసి భోజనం చేయాలి. తగినంత విశ్రాంతి తీసుకోవాలి. ⇒ తల్లిదండ్రులు తమ స్కూల్ రోజుల్లో మార్కుల గురించి తమ తల్లిదండ్రులు అడిగిన ప్రశ్నలను గుర్తుకు తెచ్చుకోవాలి. దీన్ని నివారించాలి. ⇒ పిల్లలు చదువుకుంటున్నప్పుడు ఒంటరిగా గదిలో వదిలేయ కుండా.. మరో పనిచేస్తూ పిల్లలకు సమీపంలో ఉండాలి.⇒ ‘ఎక్స్’లో మేరీ కోమ్, సచిన్, రిచర్డ్ బ్రాన్సన్, మార్క్ జుకర్‌బర్గ్.. లాంటి ప్రముఖులను ఫాలో అవ్వాలి. వారంతా కాలేజీ డ్రాపౌట్స్. కానీ నైపుణ్యాలే వారిని ప్రముఖుల జాబితాలో చేర్చాయనే విషయం గమనించాలి. ‘పిల్లల్లో ఉండే నైపు ణ్యాలను గుర్తించాలి’ అనే భావనను పెంపొందించుకోవాలి.తల్లిదండ్రులు కొన్ని గమనించాలి.. మరికొన్ని పాటించాలి..ప్రొ.జ్యోతిరాజ, సైకాలజిస్ట్, లైఫ్ స్కిల్ ట్రైనర్ఈ రోజుల్లో తల్లిదండ్రులు తామే పరీక్షలు రాస్తున్నారా అన్నట్టుగా అనిపిస్తుంటుంది వారి మానసిక స్థితి చూస్తుంటే. ముఖ్యంగా తల్లులు తమ ఆందోళనతో పిల్లల్ని ప్రభావి తం చేస్తుంటారు. అలాకాకుండా మానసిక స్థితిని అదుపులో పెట్టుకుంటూ, పిల్లల్ని గమనిస్తూ సమయానుకూలంగా జాగ్రత్తలు పాటిస్తే తల్లులు ఎగ్జామ్స్ అనే గండాన్ని దాటొచ్చు. ⇒ మీ టీనేజర్ పరీక్షల గురించి ఆందోళన చెందుతూ, ఎక్కువ విచారంగా ఉంటున్నారేమో చూడాలి.⇒ గోళ్లు కొరకడం లాంటివి చేస్తున్నారా? రాత్రంతా మేల్కొని ఉంటున్నారా?.. గమనించాలి.⇒ పిల్లల పక్కన కూర్చొని చదువులో సాయం చేయా లి. అందుకు అవసరమైతే స్కూల్ టీచర్ల సాయం తీసుకోవచ్చు. ⇒ ఫోన్, ట్యాబ్, టీవీ స్క్రీన్ల వాడకం.. చదువు నుంచి దృష్టి మరల్చేలా చేస్తుంది. అయితే దీన్ని పూర్తిగా దూరం చేయకుండా, సమయపు హద్దులు పెట్టడం మేలు.⇒ సరైన పోషక ఆహారం ఆందోళన స్థాయి లను తగ్గిస్తుంది. అందుకని పిల్ల లకు సమతుల ఆహారం ఇవ్వడంపై దృష్టి పెట్టాలి. ⇒ వారి అలసటను నివారించేలా చిన్న విరామం తీసుకోనివ్వాలి. తల్లులు ఇలా ప్రమాణం చేసుకోవాలి.. ‘పిల్లల పరీక్ష సమయంలో తల్లులు తమకు తాముగా కొన్ని ప్రమాణాలు చేసుకోవాలి.. వాటిని పాటించాలి..’ అని అంటున్నారు సోష ల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్, కిడ్స్‌స్టాప్‌ప్రెస్. కామ్ ఫౌండర్ మాన్సి జవేరీ. అవేంటంటే..⇒ ‘ఇది మీ భవిష్యత్తు.. పరీక్ష ఫలితం పైనే మీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది..’ అనే పదాలను పిల్లల ముందు ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపయోగించను.⇒ ఎగ్జామ్స్ ప్రిపరేషన్ సమయంలో నేను, నా పిల్లల స్నేహితు లను కలిసినప్పుడు.. ‘సిలబస్ పూర్తయ్యిందా? ఇప్పటివరకు ఎన్ని అధ్యాయాలు చదవడం పూర్తి చేశారు?..లాంటి ప్రశ్నలను అడగనే అడగను. ళీ ఎక్కువ గంటలు పుస్తకాల ముందు కూర్చోపెట్టను. ఇతర పిల్లలతో పోల్చి మాట్లాడను. -
బిడ్డ చదువెలా ఉంది సారూ!
సాక్షి, అమరావతి: దేశంలో పిల్లల విద్య, భవిష్యత్తుపై తల్లిదండ్రుల శ్రద్ధ నానాటికీ పెరుగుతోంది. ముఖ్యంగా గ్రామీణ ప్రజలు చదువు విషయంలో పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తమ బిడ్డలు బడికి వెళ్లారా.. ఎలా చదువతున్నారు.. ఇంటి వద్ద ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే అంశాలను టీచర్లను అడిగి తెలుసుకొంటున్నారు. అంతే కాదు.. వారూ అక్షర జ్ఞానం పెంచుకుంటున్నారు. ఒకప్పుడు కేవలం రోజువారీ పనుల మీదే దృష్టి పెట్టే తల్లిదండ్రులు పిల్లల చదువుపై అంతగా శ్రద్ధ పెట్టే వారు కాదు. బడుల్లో తల్లిదండ్రుల సమావేశాలు పెట్టినా పెద్దగా హాజరయ్యేవారు కాదు. ఇప్పుడు పరిస్థితి మారింది. 46.6 శాతం తల్లులు స్కూళ్లకు వెళ్లి పిల్లల చదువుపై ఆరా తీస్తున్నారు. వారు కూడా పనులు చేసుకుంటూనే పిల్లలతో సమానంగా చదువుకుంటున్నారు. ‘వార్షిక స్టేటస్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిపోర్ట్ (అసర్)– 2024’ సర్వే నివేదిక ఈ విషయాలు వెల్లడించింది. గ్రామీణ భారత్‌లో పాఠశాలకు వెళ్లే వయసు గల పిల్లలు (5 నుంచి 16 ఏళ్లు) ఉన్న తల్లులు విద్యా రంగంపై మంచి అవగాహనతో ఉన్నారని ఆ నివేదిక తెలిపింది. 2016లో జాతీయ స్థాయిలో గ్రామీణ ప్రాంతాల్లో 29.4 శాతం మంది తల్లులు మాత్రమే ఇలా బడిబాట పడితే.. 2024 నాటికి ఆ సంఖ్య 46.6 శాతానికి పెరిగినట్టు పేర్కొంది. తల్లుల్లో 10వ తరగతి మించి చదువుతున్న వారి సంఖ్య కూడా పెరుగుతున్నట్టు పేర్కొంది. ఎనిమిదేళ్ల క్రితం గ్రామాల్లో పదో తరగతి చదువుకున్న తల్లులు 9.2 శాతం ఉంటే ఇప్పుడు ఆ సంఖ్య 19.5 శాతం పెరిగిందని తెలిపింది. పదో తరగతి దాటి చదివిన తండ్రుల శాతం పెరుగుదల 2016లో 17.4 శాతం ఉండగా 2024లో 25 శాతానికి చేరువైంది. పదో తరగతి దాటి చదివిన తల్లులు, తండ్రుల శాతం మధ్య అంతరమూ గత ఎనిమిదేళ్లలో తగ్గిందని, 2016లో తల్లులకంటే తండ్రులు 8 శాతం ఎక్కువుంటే, 2024 నాటికి సుమారు 5 శాతానికి తగ్గినట్టు నివేదిక పేర్కొంది. ఆంధ్రప్రదేశ్‌లో సైతం 23 శాతం మంది బడుల్లో జరిగే కార్యక్రమాలకు హాజరవుతుండడంతో పాటు పిల్లలతో సమానంగా విద్యనభ్యసిస్తున్నట్టు ప్రకటించింది. జాతీయ స్థాయిని మించి రాష్ట్రంలో ప్రగతి పదో తరగతికి మించి విద్యావంతులైన తల్లులు గతంలో జాతీయ సగటుకంటే ఎక్కువగా కేరళలోనే అధికంగా ఉండేవారని, ఇప్పుడు ఈ జాబితాలో హరియాణా, హిమాచల్‌ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక కూడా చేరినట్లు పేర్కొంది. ఆంధ్రప్రదేశ్‌లో 2016లో పదో తరగతికి మించి చదివిన తల్లులు 10.4 శాతం ఉండగా 2024లో 22.8 శాతానికి పెరిగినట్లు తెలిపింది. తల్లులు విద్యావంతులు కావడంతో చదువు అవసరాన్ని గుర్తించారని నివేదిక వివరించింది. పిల్లల భవిష్యత్తు బాగుండాలన్న ఆలోచన పెరగడంతోపాటు ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రోత్సాహక కార్యక్రమాలు కూడా ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నట్లు పేర్కొంది. గతంలో ఈ ప్రగతి కేరళలో మాత్రమే కనిపించేదని, ఇప్పుడు దేశంలో పలు రాష్ట్రాల్లో చదువుకునే తల్లులు పెరుగుతున్నట్టు వెల్లడించింది. సర్వే ఇలా.. అసర్ సర్వే కోసం ప్రథమ్ సంస్థ దేశంలోని 605 జిల్లాల్లో 17,997 గ్రామాల్లో 3,52,028 గృహాలను సందర్శించింది. 15,728 పాఠశాలల్లోని వివిధ తరగతుల్లో 6,49,491 మంది పిల్లల చదువులు, వారి తల్లిదండ్రుల పర్యవేక్షణను పరిశీలించింది. చదువులో పిల్లల రాణింపు, విషయ పరిజ్ఞానంతో పాటు తల్లిదండ్రులు విద్యా ప్రగతని అంచనావేసి నివేదిక రూపొందించింది. ఆంధ్రప్రదేశ్‌లో ఈ సంస్థ 390 గ్రామాల్లో 7,721 నివాసాలను సర్వే చేసి, 3 నుంచి 16 ఏళ్ల మధ్య వయసు గల 12,697 మంది పిల్లలను పరీక్షించింది. -
పిల్లల పరీక్షలు, పెద్దోళ్లకు అగ్నిపరీక్ష! ఈ విషయాలు గుర్తుంచుకోండి!
చెన్నైలో CBSE పరీక్షల సమయంలో స్కూల్ గోడ ఎక్కి, తమ పిల్లల కోసం తల్లిదండ్రులు చూస్తున్న ఈ ఫోటో ఇప్పుడు వైరల్ అవుతోంది. దీన్ని చూసి మనమందరం ఆలోచించాల్సిన సమయం వచ్చింది.ఇలాంటి ఘటనలు ఏ ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి?🔹మన విద్యా వ్యవస్థ పిల్లలపై ఎంత ఒత్తిడిని పెడుతోంది?🔹తల్లిదండ్రుల ఆందోళన పిల్లల మనసుపై ఎలా ప్రభావం చూపుతోంది?🔹తల్లిదండ్రుల ప్రేమ వారికి బలాన్ని ఇస్తుందా, భయాన్ని పెంచుతుందా?ప్రతీ సంవత్సరం పరీక్షల సీజన్ వచ్చినప్పుడల్లా విద్యార్థుల కన్నా ఎక్కువగా ఒత్తిడిలో ఉంటున్న వారు తల్లిదండ్రులే. "తప్పక పాస్ అవ్వాలి!", "అగ్రశ్రేణి మార్కులు రావాలి!", "లేకపోతే భవిష్యత్తు అంధకారం!" – ఇవీ తల్లిదండ్రులలో నిండిపోయిన భయాలు. ర్యాంక్ కోసమే మన ప్రేమ అని పిల్లలకు అనిపించకూడదు.ఇదీ చదవండి: చందాకొచ్చర్ న్యూ జర్నీ: కార్పొరేట్ వర్గాల్లో తీవ్ర ఆసక్తి తల్లిదండ్రులు చేయకూడనిది...❌ హెలికాప్టర్ పేరెంటింగ్:ప్రతీ చిన్న విషయాన్ని తల్లిదండ్రులు గమని…పిల్లలను ఎలా ప్రోత్సహించాలి?✅ పరీక్ష ఫలితాలు ఆశించినంత రాలేదనుకోండి. పిల్లలు దిగులుగా ఉన్నప్పుడు, "నీ ప్రయత్నం గొప్పది, మార్కులు మాత్రమే జీవితానికి అద్దం కాదు" అని చెప్పండి. ఆత్మవిశ్వాసాన్ని పెంచండి.✅ పిల్లలకు చదువు అంటే భయం కాకుండా ఆసక్తిగా ఉండేలా చేయండి. "ఏ విషయం నచ్చింది? ఏ ప్రశ్న ఆసక్తికరంగా అనిపించింది?" అని అడిగితే, పిల్లలు చదువును ఒత్తిడిగా కాకుండా, నేర్చుకునే ప్రక్రియగా భావిస్తారు.✅ "నీ ఫ్రెండ్ అజయ్ టాప్ ర్యాంక్ తెచ్చుకున్నాడు, నీవు ఎందుకు సాధించలేకపోతున్నావు?" అనే మాటలు పిల్లల ఆత్మవిశ్వాసాన్ని దిగజార్చతాయి. ప్రతి ఒక్కరికీ తన ప్రయాణం ఉంటుంది. అందుకే పోల్చడం మానండి.✅ తప్పిదాలను సహజంగా అంగీకరించండి. "ఈసారి ఏమి తప్పైంది? తర్వాత ఎలా మెరుగుపరచుకోవచ్చు?" అనే విధంగా ప్రశ్నించడం ద్వారా పిల్లలు సమస్యలను అర్థం చేసుకొని, మెరుగుపడటాన్ని నేర్చుకుంటారు.గుర్తుంచుకోవాల్సిన విషయాలు📌 పరీక్షలు జీవితాన్ని నిర్ణయించవు. అవి ఒక చిన్న అంచనా మాత్రమే.📌 పిల్లలకు భయం పోగొట్టండి. పరీక్షలు అంటే భయపడేలా కాకుండా, కొత్త విషయాలు నేర్చుకునే అనుభవంగా చూడమని ప్రేరేపించండి.📌 పిల్లలు మానసికంగా ఆరోగ్యంగా ఉండాలి. ఒత్తిడితో విజయం సాధించడమే కాదు, ఆనందంగా ఎదగాలి.📌 గోడలు ఎక్కే తల్లిదండ్రులు కాకుండా, పిల్లలకు మార్గదర్శకంగా ఉండండి.పరీక్షల సమయం పిల్లలకు ఒత్తిడిగా కాకుండా, నేర్చుకునే మంచి అవకాశంగా మార్చే బాధ్యత తల్లిదండ్రులదే. పిల్లల భవిష్యత్తును భయంతో నింపకుండా, ధైర్యంగా ముందుకు నడిపిద్దాం!మీకేమైనా కౌన్సెలింగ్ సహాయం కావాలంటే నన్ను సంప్రదించండి.-సైకాలజిస్ట్ విశేష్ -
పెళ్లి నిర్ణయం పెద్దలకేనా? యువత ఏమంటున్నారో తెలుసా?
కరీంనగర్ సిటీ: నేటి యువత చదువుకుంటూనే.. జీవితంలో ఉన్నతంగా ఎదగడానికి ముందుకు సాగుతున్నారు. విద్య, ఉద్యోగం, జీవితంలో స్థిరపడడంపై ప్రధానంగా దృష్టి సారిస్తున్నారు. ప్రేమ పెళ్లి వద్దు..పెద్దలు కుదిర్చిన పెళ్లి ముద్దు అంటున్నారు. మరికొందరు సరైన సమయంలో వివాహం జరగాలని చెబుతున్నారు. ప్రేమికుల దినోత్సవం నేపథ్యంలో కరీంనగర్‌లోని ప్రభుత్వ మహిళా డిగ్రీ, పీజీ కళాశాలలో ‘సాక్షి’ ఆధ్వర్యంలో గురువారం డిబేట్ నిర్వహించగా.. వారి అభిప్రాయాలు వెల్లడించారు.అర్థం చేసుకుంటే బెటర్ప్రేమ వివాహాలతో ఎదుటి వారి వ్యక్తిత్వం, ప్రవర్తన ముందుగానే తెలుసుకోవచ్చు. వారిపై మనకు ఒక అభిప్రాయం ఏర్పడుతుంది. వారితో వివాహబంధం ముందుకు సాగుతుందా లేదా తెలుస్తుంది. కొంతవరకూ ప్రేమపెళ్లిలు మంచివే. ఏ బంధం అయినా అర్థం చేసుకుని సర్దుకుపోతే నిలుస్తుంది.– శ్రీజ, విద్యార్థినిపెద్దలు కుదిర్చినదే..పెద్దలు అన్ని రకాలుగా మంచిగానే ఆలోచిస్తారు కాబట్టి వారి నిర్ణయం బలంగా ఉంటుందని నా నమ్మకం. వివాహ బంధంలో ఏదైనా సమస్యలు వచ్చినా పెద్దలు ముందుకు వచ్చి పరిష్కరిస్తారు. జీవితంలో మంచి సపోర్టుగా ఉంటారు. పెద్దలను విస్మరించి కొందరు ప్రేమ పేరుతో మోసపోతున్నారు.– వినోద, విద్యార్థినిప్రేమ వివాహాలపై 110మంది యువతులను వివిధ ప్రశ్నలు అడుగగా.. వెల్లడించిన అభిప్రాయాలుటీనేజీ ప్రేమపై మీ అభిప్రాయం65- ఆకర్షణ మాత్రమే45 -టీనేజ్‌లో ప్రేమ అవసరం లేదు85- కెరియర్ ఫస్ట్సరైన సమయంలో పెళ్లి అవసరం ప్రేమపై సోషల్ మీడియా ప్రభావం ఉందా?80-చాలా ఉందిఎలాంటి ప్రభావం లేదు-3060 - పెద్దలు కుదిర్చిందిప్రేమ వివాహం ప్రేమించి పెద్దలను ఒప్పించాలి- 30ఇదీ చదవండి: Valentine's Day పబ్లిక్ టాక్.. లవ్‌లో పడితే జాగ్రత్త.. భయ్యా!ఒప్పించి.. మెప్పించాలిఒక మనిషి గురించి పూర్తిగా అర్థం చేసుకుని, వారి గురించి పెద్దలకు వివరించి ఒప్పించాలి. ప్రేమించి పెద్దల సహకారంతో వివాహం చేసుకుంటే జీవితం అనందంగా ఉంటుంది. ఉన్నత చదువులతో జీవితం ఆర్థికంగా నిలదొక్కుకుంటేనే ఏదైనా సాధ్యం. పెద్దలు చేసిన పెళ్లిలు సైతం విడిపోతున్నాయి కదా.– భానుమతి, విద్యార్థినికుటుంబ జోక్యంతోనేపెద్దలు కుదిర్చిన, ప్రేమ పెళ్లి ఏదైనా దంపతుల మధ్య కుటుంబాల జోక్యంతో విడిపోతున్నాయి. చాలా వరకూ అమ్మాయి ఇంటి వద్ద పెరిగిన విధంగానే అత్తవారింట్లో ఉండాలని అనుకుంటారు. కాని అలా ఉండదు. అక్కడి పరిస్థితులకు అనుగుణంగా సర్దుబాటు కావాలి. అబ్బాయిలు కూడా నమ్మి వచ్చిన వారిని మంచిగా చూసుకోవాలి. – సిరిచందన, విద్యార్థిని -
ట్రంప్‌తో ట్రబుల్సే.. అక్కడెందుకిక.. ఇంటికొచ్చేయక
సాక్షి, హైదరాబాద్: అమెరికా రాజకీయ ముఖచిత్రం మారిపోవడంతో.. అక్కడ చదువుకుంటున్న మన దేశ విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో ఆందోళన పెరుగుతోంది. మెజారిటీ భారతీయ(Indian) విద్యార్థుల(Students)కు ఇప్పటికిప్పుడు సమస్య లేకున్నా.. భవిష్యత్ ఆశాజనకంగా ఉండదనే భయం వెంటాడుతోంది. పార్ట్ టైం ఉద్యోగాలు చేసుకునే పరిస్థితి లేక.. జీవన వ్యయం సమకూర్చుకునే దారిలేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. డబ్బులు పంపాలంటూ భారత్‌లోని తమ కుటుంబాలను కోరుతున్నారు.ఇప్పటికే అప్పులు చేసి పిల్లలను అమెరికా పంపిన తల్లిదండ్రులు(Indian parents) తలకు మించిన భారం మోయలేక అల్లాడుతున్నారు. ఈ క్రమంలో మన దేశంలో పరిస్థితి బాగుంటుందనే అంచనాలను గుర్తు చేసుకుంటూ.. పిల్లలను తిరిగి వచ్చేయాలని కోరుతున్నారు. మరోవైపు మన దేశంలో కృత్రిమ మేధ (ఏఐ) నిపుణులకు డిమాండ్ పెరగడంతో విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఆశలు చిగురిస్తున్నాయి.ఎలాగైనా ఉద్యోగం సాధించాలనే దిశగాకోవిడ్ తర్వాత ఐటీ రంగం క్రమంగా కుదేలైంది. ఉపాధి అవకాశాలు సన్నగిల్లాయి. దీంతో అమెరికాలో ఎంఎస్ (ఇంజనీరింగ్ పీజీ) చేయడం, అక్కడే ఉద్యోగం సంపాదించడం విద్యార్థుల లక్ష్యంగా మారింది. ఫలితంగా అమెరికా వెళ్లే భారతీయుల సంఖ్య పెరిగింది. ప్రస్తుతం అమెరికాలో 11.26 లక్షల మంది విదేశీ విద్యార్థులున్నారు. అందులో 29 శాతం భారతీయులే. 2022–23లో 1,96,567 మంది, 2023–24లో 3,31,602 మంది అమెరికా వెళ్లారు. వారికి నాలుగేళ్ల వీసా ఇస్తారు. ఎంఎస్ రెండేళ్లు ఉంటుంది. మిగతా రెండేళ్లలో పూర్తిస్థాయి ఉద్యోగం పొందితే అక్కడే కొనసాగవచ్చు.దీనికోసం మనవాళ్లు చదువు పూర్తవగానే తాత్కాలిక ఉద్యోగాల కోసం ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ (ఓపీటీ) చేస్తారు. ఈ శిక్షణ కోసం ఈ ఏడాది 97,556 మంది నమోదు చేసుకున్నారని.. ఇది గతేడాదికన్నా 41 శాతం ఎక్కువని అమెరికన్ ఎంబసీ ఇటీవలే వెల్లడించింది. మన దేశం నుంచి వెళ్లిన విద్యార్థులు కన్సల్టెన్సీల ద్వారా ఏదో ఒక కంపెనీలో ఉద్యోగం పొంది వీసాను పొడిగించుకోవడం, అవకాశాన్ని బట్టి పార్ట్ టైం ఉద్యోగాలు చేసి డబ్బు సంపాదించడం జరుగుతూ వస్తోంది. కానీ.. డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడవటంతో పార్ట్‌టైం ఉపాధి అవకాశాలు దెబ్బతిన్నాయి. భవిష్యత్తులో హెచ్1–బి వీసా రావడం కష్టమనే భావన బలపడుతోంది.కొన్ని నెలల్లో పరిస్థితి చక్కబడే చాన్స్మరోవైపు అమెరికాలో ప్రస్తుత పరిస్థితి మూడు, నాలుగు నెలలకు మించి ఉండదనే నమ్మకం మన వారిలో కనిపిస్తోంది. అక్కడి హోటల్స్, చిన్నాచితకా వ్యాపార సంస్థల్లో పనిచేయడానికి మానవ వనరులు అవసరమని.. ఎల్లకాలం పార్ట్ టైం ఉద్యోగాలను అడ్డుకోలేరని కొందరు విద్యార్థులు అంటున్నారు.ఇదే మంచి చాన్స్..ఏఐ దూకుడు చూస్తుంటే ఇండియాలోనూ మంచి అవకాశాలు లభిస్తాయని చాలామంది తల్లిదండ్రులు భావిస్తున్నారు. అమెరికన్ ఐటీ కంపెనీలు ప్రాజెక్టుల కోసం ఇండియాలో మానవ వనరులపై ఆధారపడటం పెరిగిన నేపథ్యంలో.. డేటా సైన్స్, ఏఐ అంశాల్లో ఎంఎస్ చేసినవారు మంచి ఉద్యోగం పొందవచ్చని భావిస్తున్నారు. ఇంకా అమెరికాలో వేచి చూస్తే.. అప్పటికే ఇండియాలో ఉద్యోగులకు అనుభవం పెరుగుతుందని, తర్వాత వస్తే ప్రయోజనం ఉండదని విద్యార్థుల తల్లిదండ్రులు అంటున్నారు.భారత్‌లోని కన్సల్టెన్సీలు కూడా ఇదే విషయాన్ని చెబుతున్నాయి. ఇప్పుడు సాధారణ ఐటీ ఉద్యోగాలు తగ్గినా.. ఏఐ ఎంఎల్, బ్లాక్‌చైన్, ఏఆర్వీఆర్, సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్స్, ఓపెన్ టెక్నాలజీ వంటి నైపుణ్యాలకు డిమాండ్ పెరిగిందని స్పష్టం చేస్తున్నాయి. దేశంలో 2026 నాటికి 10 లక్షల మంది ఏఐ నిపుణులు అవసరమని వీబాక్స్ అనే కన్సల్టెన్సీ సంస్థ అంచనా వేసింది. ఏఐపై పనిచేస్తున్న ఉద్యోగులు భారత్‌లో ప్రస్తుతం 4.16 లక్షల మంది ఉన్నారు. ఫిక్కీ అంచనా ప్రకారం.. ఈ ఏడాది చివరి నాటికి 6.29 లక్షల మంది, 2026 నాటికి 10 లక్షల మంది అవసరం. దీంతో ఇక్కడికి వచ్చి ఉద్యోగం చేసుకోవడం మేలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు భావిస్తున్నారు.కష్టంగానే ఉందిడేటా సైన్స్‌పై ఎంఎస్ చేశాను. ఇంతకాలం స్కిల్ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తూ పార్ట్ టైం జాబ్ చేశాను. ఇప్పుడు పార్ట్ టైం చేయడం కష్టంగా మారింది. ఇంకో మూడు నెలలు ఈ పరిస్థితి ఉండొచ్చు. అప్పుచేసి యూఎస్ వచ్చాను. ఇంటి దగ్గర్నుంచి ఇంకా డబ్బులు తెప్పించుకోవడం ఇబ్బందే. – కృష్ణమోహన్ దూపాటి, అమెరికాలో భారతీయ విద్యార్థికొంత ఆశ ఉందిరూ.40 లక్షలు అప్పు చేసి అమెరికా వచ్చాను. పార్ట్ టైం ఉద్యోగం చేసే పరిస్థితి లేక, ఖర్చులు పెరిగి ఇబ్బందిగా ఉంది. ఇంకో ఏడాది అయితే ఎంఎస్ పూర్తవుతుంది. తర్వాత ఇండియాలోనే మంచి ఉద్యోగం చూసుకోవచ్చని మా నాన్న చెబుతున్నారు. నాకూ అదే మంచిదనిపిస్తోంది. – నవీన్ చౌదరి, అమెరికాలో ఎంఎస్ చేస్తున్న వరంగల్ విద్యార్థిఇండియాలో బూమ్ ఉంటుందిఅమెరికాలోనే జాబ్ చేయాలనే ఆశలు పెట్టుకోవడం మంచిది కాదు. భవిష్యత్ మొత్తం ఏఐదే. ఇప్పుడిప్పుడే భారత్‌లో దానికి డిమాండ్ పెరుగుతోంది. నిపుణుల కొరత ఉంది. అమెరికాలో ఎంఎస్ చేసిన విద్యార్థులకు మన దేశంలోనే మంచి వేతనంతో ఉద్యోగాలు వచ్చే చాన్స్ ఉంది. – విశేష్ వర్మ, ఏఐ ఆధారిత కంపెనీలో హెచ్ఆర్ మేనేజర్ప్రతీ క్షణం టెన్షనేఏడాది క్రితం కుమారుడిని అమెరికా పంపాను. మా వాడి నుంచి ఇప్పుడు ఫోన్ వచ్చిందంటే భయం వేస్తోంది. ఖర్చులకు డబ్బులు అడిగితే ఇవ్వలేక.. ఇప్పటికే ఉన్న అప్పులు తీర్చలేక ఆవేదన పడుతున్నాం. ఇండియాలో ఏఐ ఆధారిత ఉద్యోగాలకు మంచి డిమాండ్ ఉంటుందని వచ్చేస్తే బాగుంటుందని సలహా ఇచ్చాను. – జనార్దన్‌రెడ్డి రేపల్లె, అమెరికా వెళ్లిన విద్యార్థి తండ్రి -
ఏఐ... పిల్లలూ... తల్లిదండ్రులూ!
ఏఐ ప్రాధాన్యం రోజు రోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో పిల్లల ప్రపంచం తీవ్ర ప్రభావానికి లోనవుతున్నది. దీన్ని దృష్టిలో ఉంచుకుని తల్లిదండ్రులు బిడ్డల పెంపకంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది అత్యంత ముఖ్యమైన అంశం అయ్యింది. 2025 నుంచి 2039 మధ్య జన్మించే పిల్లలు బీటా తరం కిందకు వస్తారు. మొన్న జనవరి 1వ తేదీ అర్ధరాత్రి 12.03 నిమిషాలకు మిజోరంలోని ఐజ్వాల్ ఆసుపత్రిలో జన్మించిన అబ్బాయిని భారతదేశంలో మొదటి తరానికి చెందే తొలి ‘బీటా చిన్నారి’గా గుర్తించారు. అసలు ఆల్ఫా, బీటా... అంటూ ఈ వర్గీకరణ అంతా ఏమిటి అనుకుంటున్నారా? పిల్లలు ఏ తరంలో జన్మించారు అన్న అంశం వాళ్ల సామాజిక వ్యవహార శైలిని నిర్దేశిస్తుంది. అప్పుడు ఉండే సాంకేతికత, సామాజిక మాధ్య మాల ప్రభావం వంటి అంశాలు వాళ్ల వ్యక్తిత్వాన్ని, అనుభవాలను ప్రభావితం చేస్తాయి. అంతేకాదు. రాజకీయంగా వాళ్ల ఐడియాలజీని, వినియోగ దారునిగా వాళ్ల మనస్తత్వాన్ని నిర్దేశిస్తాయి. ఇప్పుడు పుట్టుకొస్తున్న బీటా బేబీలు ఆర్టిఫి షియల్ ఇంటెలిజెన్స్‌తో నిండిపోయిన సాంకేతిక ప్రపంచంలో జీవిస్తారు. అంటే వాళ్ల రోజువారీ జీవితం చిన్న రోబోల మధ్య సాగుతుంది. అవి చెప్పినట్టే వాళ్లు నడుచుకుంటారు. ఒక రకంగా చెప్పాలంటే అవి వీళ్లకు ట్యూటర్లు అన్న మాట. దాంతో పాటు వాటికవే నడిచే డ్రైవర్ లేని కార్లను చూస్తారు. 2035 నాటికి మొత్తం జనాభాలో 16 శాతం మంది బీటా తరానికి చెందిన వాళ్లే ఉంటా రని అంచనా.బీటా తరంలో పుట్టిన పిల్లలు ఆల్ఫా తరం కంటే చురుగ్గా, తెలివిగా, టెక్ సావీగా ఉంటారు. ఉదాహరణకి ‘వీల్స్ ఆన్ ద బస్’ ఆట ఆడాలంటే ‘అలెక్సా’ను పిలుస్తారు. లెక్కల్లో హెచ్చివేతలు అంటే మల్టిప్లికేషన్ వంటివి తెలియకపోతే ‘బ్లాక్ బాక్సు’ను ఆశ్రయిస్తారు. ఈ పరిస్థితుల్లో పిల్లల పెంపకంలో తల్లిదండ్రులు కొన్ని జాగ్రత్తలు తీసు కోవాలని నిపుణులు సూచిస్తున్నారు.ముందుగా మార్కెట్లోకి కొత్తగా వస్తున్న యాప్స్, ప్లాట్ ఫారమ్స్ గురించి తెలుసుకోవాలి. ట్రెండ్స్‌ను అనుసరించాలి. అప్పుడు పిల్లలకు ఏవి ఉపయోగపడతాయి? ఏవి ఉపయోగపడవు అనేది తెలుసుకోగలుగుతారు. పిల్లలు ఎక్కువ టెక్నాలజీ మధ్య ఉంటారు గనుక సైబర్ మోసాల బారిన పడే ప్రమాదం ఉంది. తల్లిదండ్రులు ఈ విషయంలో పిల్లలకు తగినంత అవగాహన పెంచాలి. ఎక్కువ డివైజ్‌లపై ఆధారపడకుండా బాహ్య ప్రపంచంలో వాళ్లకు మంచి అనుభవాలను అందించాలి. కొత్త ప్రదేశాలకు తీసికెళ్లటం, బంధువులు, స్నేహితుల మధ్య గడపటం నేర్పాలి. ఇంట్లో కొంత ప్రదేశాన్ని ‘టెక్ ఫ్రీ జోన్’గా మలచాలి. ప్రధానంగా కుటుంబ సభ్యులు అందరూ కలిసి భోజనం చేసే డైనింగ్ టేబుల్ మీద ఎలాంటి డివైజ్‌లూ లేకుండా చూసుకోవాలి. పుస్తకాలు చదవటం, ఇంట్లో అమ్మానాన్నలతో మాట్లాడటం వంటివి అలవాటు చేయాలి. ఏది ఏమైనా బీటా తరం కొత్త ప్రపంచాన్ని చూస్తుంది. చుట్టూ ఉన్న వాళ్లకు కొత్త అనుభవాలను అంది స్తుంది. అవి ఎలా ఉంటాయో రానున్న రోజుల్లో మనకు అర్థం అవుతుంది.– డా‘‘ పార్థసారథి చిరువోలుసీనియర్ జర్నలిస్ట్ ‘ 99088 92065 -
ఆర్జీకర్ కేసులో కీలక మలుపు
కోల్‌కతా ఆర్జీకర్ హత్యాచార కేసులో న్యాయ పోరాటం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ కేసులో దోషి సంజయ్‌కు సీల్దా కోర్టు జీవితఖైదు విధించిన సంగతి తెలిసిందే. అయితే నిందితుడికి ఈ శిక్ష సరిపోదని, మరణశిక్ష విధించాలనే అభ్యర్థన ఉన్నతన్యాయస్థానం ఎదుటకు చేరింది. అయితే సంజయ్‌కు ఉరిశిక్ష పడడం తమకు ముఖ్యం కాదని, ఈ నేరంలో భాగమైన వాళ్లందరి పేర్లు బయటకు రావాలని అభయ(బాధితురాలి) తల్లిదండ్రులు కోరుకుంటున్నారు.అభయ తల్లిదండ్రులు గురువారం పశ్చిమ బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద బోస్‌ను కలిశారు. తమ ఆవేదనను(ఫిర్యాదును) రాష్ట్రపతి, కేంద్ర హోం మంత్రి దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. అందుకు అంగీకరించిన ఆయన.. అవసరమైతే వాళ్ల అప్పాయింట్మెంట్ ఇప్పించే ప్రయత్నం చేస్తానని బాధిత కుటుంబానికి హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. మరోవైపు.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సుకాంత మజుందార్ సైతం అభయం తల్లిదండ్రుల్ని కలిసి.. వాళ్ల పోరాటానికి మద్దతుగా నిలుస్తానని ప్రకటించారు.అభ్యంతరాలు దేనికి?..ఈ కేసులో దర్యాప్తు జరిగిన తీరుపై అభయ తల్లిదండ్రులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. అటు.. ఈ కేసులో ఆధారాలను కోల్‌కతా పోలీసులు నాశనం చేశారని ఆరోపించారు. ఇటు.. సీబీఐ జరిపిన దర్యాప్తుపైనా తీవ్ర అసంతృప్తి ప్రకటించారు. ఈ నేరంలో సంజయ్ ఒక్కడే భాగం కాదని, ఇంకా బయటకు రావాల్సిన పేర్లు ఉన్నాయని వాళ్లు చెబుతున్నారు. కోల్‌కతా పోలీసులు ఆస్పత్రి నిర్వాహకులతో కలిసి కేసును పక్కదోవ పట్టించే ప్రయత్నాలు చేశారని ఆరోపిస్తున్నారు. కేసు విచారణలో భాగంగా.. తొలి ఐదురోజులు దర్యాప్తు జరిగిన తీరుపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆ సమయంలోనే ఈ కేసుకు సంబంధించిన కీలకమైన ఆధారాలను ఉద్దేశపూర్వకంగానే నాశనం చేశారని అంటున్నారు.సుప్రీంలో పిటిషన్ వెనక్కిఆర్జీకర్ కేసులో మళ్లీ విచారణ జరిపించాలని అభయ తల్లిదండ్రులు సర్వోన్నత న్యాయస్థానంలో ఓ పిటిషన్ చేశారు. అయితే బుధవారం ఈ పిటిషన్‌ను వాళ్లు వెనక్కి తీసుకున్నారు. కిందటి ఏడాది ఆగష్టులో సుప్రీం కోర్టు ఈ ఘటనను సుమోటోగా విచారణకు తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఆ విచారణలో తమను భాగం చేయాలని Intervention Application ద్వారా అభయ తల్లిదండ్రులు అభ్యర్థించారు. కానీ, ఈ కేసులో సంజయ్‌కు శిక్షపడక ముందే కలకత్తా హైకోర్టులో ‘ఫ్రెష్ విచారణ’ కోరుతూ ఓ పిటిషన్ వేశారు. ఇప్పుడు ఈ విషయం తమ పరిశీలనలో గుర్తించిన సుప్రీం కోర్టు ద్విసభ్య ధర్మాసనం.. పిటిషనర్ తరఫు మహిళా న్యాయవాదిని హెచ్చరించింది. సత్వరమే పిటిషన్ వెనక్కి తీసుకుని.. కావాలనుకుంటే కొత్తగా పిటిషన్ వేయాలని సూచించింది. దీంతో.. అభయ తల్లిదండ్రులు ఆ పిటిషన్‌ను వెనక్కి తీసుకున్నారు.ఇక ఆర్జీకర్ కేసులో.. సంజయ్ రాయ్‌కు మరణశిక్ష విధించాలంటూ బెంగాల్ ప్రభుత్వం, సీబీఐలు వేర్వేరుగా పిటిషన్లు వేశాయి. అయితే ప్రభుత్వం వేసిన పిటిషన్‌పై సీబీఐ అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో పిటిషన్ల విచారణకు స్వీకరించే అంశంపై విచారణ జరిపి.. తీర్పును కలకత్తా హైకోర్టు రిజర్వ్ చేసింది. -
ఇప్పుడు పుట్టి ఉంటే కచ్చితంగా ఆటిజం నిర్ధారణ అయ్యేది: బిల్‌గేట్స్
ప్రపంచంలో మూడవ అత్యంత ధనవంతుడు బిల్ గేట్స్. సాఫ్ట్వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ కంపెనీ అధినేత, గొప్ప దాత కూడా. అంతేగాదు ఆయన జీవిత చరిత్రకు సంబంధించిన సినిమా 'సోర్స్ కోడ్' ఫిబ్రవరి 04న విడుదల కానుంది. ఇటీవల ఆయన వాల్స్ట్రీట్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన గురించి చాల ఆశ్చర్యకరమైన విషయాలను చెప్పుకొచ్చారు. తాను గనుక ఇప్పుడు పుట్టి ఉంటే.. కచ్చితం తనకు ఆటిజం నిర్ణారణ అయ్యేదని అన్నారు. అలా అనడానికి గల రీజన్ వింటే విస్తుపోతారు. .!.బిల్‌గేట్స్ తనకు చిన్నతనంలో ఆటిజం లక్షణాలను ఉన్నట్లు తెలిపారు. అయితే ఆ రోజుల్లో దాని గుర్తించగలిగే వైద్య పరిజ్ఞానం లేకపోవడంతో అదెంటో కూడా అప్పటి వ్యక్తులెవరకీ తెలిసే అవకాశం లేదన్నారు. తాను చిన్నప్పుడు చాలా నెమ్మదిగా ఉండేవాడినని అన్నారు. ప్రతిది తొందగా నేర్చుకోలేకపోవడం, ఎవరితో కలవకపోవడం వంటి ఆటిజం లక్షణాలు ఉన్నట్లు చెప్పుకొచ్చారు. మిగతా పిల్లలతో పోలిస్తే అంత చురుకైన వాడిని కాదు, పైగా అంత బాగా చదివే విద్యార్థిని కూడా కాదని చెప్పుకొచ్చారు. ఇక్కడ అలాంటి పిల్లలతో తల్లిదండ్రులు ఎలా వ్యవహరిస్తారన్నా.. దానిపైనే ఆ పిల్లవాడు ఈ సమస్యని అధిగమించడం అనేది ఉంటుంది. తన తల్లిందండ్రులు అలానే తన సమస్యను అర్థం చేసుకుని ప్రత్యేకంగా చూడకుండా సాధారణంగానే వ్యహరించేవారన్నారు. అలాగే తన ప్రవర్తన ఇబ్బందికరంగా మారకుండా తన బలహీనతలు, బలాలకు అనుగుణంగా తీర్చిదిద్దారని అన్నారు. ముఖ్యంగా తనకు తగిన స్కూల్ ఏదో చెక్‌చేసి మరీ అందులో చేర్పించారన్నారు. అలాగే తన బిహేవియర్‌ని మార్చుకునేలా తగిన కౌన్సలర్ వద్ద ట్రీట్మెంట్ ఇప్పించారని చెప్పారు. అందువల్ల తాను ఈ రోజు ఆ సమస్యను అధిగమించి ప్రభావవంతంగా చదువుకోగలిగానన్నారు. అయితే ఇప్పుడు ఇలాంటి సమస్యను గుర్తించగలిగే వైద్య పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చేంది. కానీ పిల్లలు ఆ సమస్యతోను అధిగమించలేకపోతున్నారు తల్లిదండ్రులకు అలాంటి పిల్లలతో మసులోకోవాలనే దాని గురించి అవగాహన ఉండటం లేదన్నారు. ఇక్కడ మిగతా పిల్లల్లా.. తన పిల్లవాడు చురుకుగా లేడన్న లోపంతో తల్లిదండ్రులే కుమిలిపోతున్నారు. ఇక పిల్లవాడికి ఎలా ధైర్యం చెప్పి వాడి లోపాన్ని సరిచేయగలుగుతారని ప్రశ్నిస్తున్నారు. ఏదైనా ముందు.. ఉన్న సమస్యను లేదా లోపాన్ని పూర్తిగా అంగీకరించాలి. ఆ తర్వాత ఆ వ్యక్తి లోపల ఉన్న అంతర్గత శక్తిని తట్టి లేపేలా తల్లిదండ్రులుగా తగిన ప్రోత్సాహం ఇస్తే ఏ పిల్లవాడు ఆటిజం బాధతుడిగా జీవితాంత ఉండిపోడని అన్నారు. ఈ సమస్యను అవమానంగా భావించడం, సోసైటీలో చులకనైపోతామనే భయం తదితరాల నుంచి తల్లిందండ్రులు బయటపడాలి. వారు స్థైర్యం తెచ్చుకుని వారితో తగిన విధంగా వ్యవహరించి ఓపికగా మార్చుకోగలం అనే దానిపై దృష్టి సారించండి. ఇది జీవితం విసిరిని సవాలు లేదా టాస్క్‌గా ఫీలవ్వండి. గెలిస్తే మీ అంత గొప్పోడు ఎవ్వడూ లేడనే విషయం గుర్తెరగండి. అలాంటి చిన్నారుల్లోని బలాన్ని తట్టి లేపి, వారు పుంజుకునేలా ప్రోత్సహించండి. అంతే ఏ పిల్లవాడు ఆటిజం బాధితుడిగా మిగిలిపోడు. అద్భుతాలను సృష్టించే మేధావిగా, గొప్ప వ్యక్తిగా రూపుదొద్దుకుంటాడని అన్నారు. ఏ చిన్నారికైనా ఇల్లే ప్రథమ బడి, అదే జ్ఞానాన్ని సముపార్జించగల శక్తిని అందిస్తుందని చెబుతున్నారు బిల్‌గేట్స్.(చదవండి: భారత రాజ్యాంగ రచనలో పాల్గొన్న మహిళలు వీరే..!) -
చదువు ఖర్చులు తల్లిదండ్రుల నుంచి పొందడం కుమార్తెల హక్కు: సుప్రీం
న్యూఢిల్లీ: కుమార్తెలు తమ చదువులకయ్యే ఖర్చులను తల్లిదండ్రుల నుంచి పొందడం చట్టబద్ధమని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. ఆడబిడ్డలను చదివించాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందని పేర్కొంది. విద్యాభ్యాసానికి అయ్యే సొమ్మును పొందడం ఆడపిల్లల చట్టబద్ధమైన హక్కు అని తేల్చిచెప్పింది. పెద్దలు తమ స్థోమత మేరకు కుమార్తెలకు చదువులు చదివించాలని వెల్లడించింది. విడిపోయిన దంపతుల కుమార్తెకు సంబంధించిన ఓ కేసులో జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్జల్ భూయాన్‌తో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఇటీవల ఈ మేరకు ఉత్తర్వు జారీ చేసింది. సదరు దంపతులు 26 ఏళ్ల క్రితం విడిపోయారు. వారికి ఒక కుమార్తె ఉంది. మనోవర్తి కింద భార్యకు రూ.73 లక్షలు ఇవ్వడానికి భర్త అంగీకరించాడు. ఇందులో కుమార్తె చదువులకు అయ్యే ఖర్చు రూ.43 లక్షలు కలిపే ఉంది. కుమార్తె ఐర్లాండ్‌లో చదువుతోంది. తండ్రి ఇచ్చిన సొమ్ము తీసుకొనేందుకు నిరాకరించింది. తన సొంత డబ్బుతో చదువుకోగలనని, ఇంకొకరి సాయం అవసరం లేదని తేల్చిచెప్పింది. దీంతో ఆమె తండ్రి సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. తనకు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేవని, కన్నబిడ్డను చదివించుకోగలనని, చదువుకయ్యే సొమ్మును తన కుమార్తె తీసుకొనేలా ఆదేశాలివ్వాలని కోరుతూ వ్యాజ్యం దాఖలు చేశాడు. దీనిపై ధర్మాసనం ఈ నెల 2వ తేదీన విచారణ చేపట్టింది. చదవులకయ్యే ఖర్చును తల్లిదండ్రుల నుంచి పొందే హక్కు కుమార్తెకు ఉందని వెల్లడించింది. తండ్రి నుంచి ఆ డబ్బు తీసుకోవడం ఇష్టం లేకపోతే తల్లికి ఇవ్వాలని సూచించింది. -
పేరెంట్స్ అనుమతి ఉంటేనే ‘సోషల్’ ఖాతా
సాక్షి, హైదరాబాద్: సోషల్‌మీడియా ప్లాట్‌ఫాంలపై ఇకపై మైనర్లు ఇష్టంవచ్చినట్లు ఖాతాలు తెరిచేందుకు వీలు పడదు. వారి తల్లిదండ్రుల అనుమతి (వెరిఫయబుల్ కన్సెంట్) ఉంటేనే ఖాతా తెరిచేందుకు అనుమతి ఇవ్వాలని కేంద్ర సమాచార శాఖ విడుదల చేసిన డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ (డీపీడీపీ) చట్ట ముసాయిదాలో నిబంధన చేర్చా రు. 18 ఏళ్లలోపు పిల్లలకు ఈ నిబంధన వర్తిస్తుంద ని పేర్కొన్నారు. ఈ బిల్లు చట్టరూపం దాల్చితే తల్లి దండ్రులు లేదా గార్డియన్ అనుమతి ఇచ్చిన తర్వాతే మైనర్లు సోషల్ మీడియా ఖాతాలు, ఈ–కామర్స్, గేమింగ్ యాప్‌లు వాడాల్సి ఉంటుంది.ప్రస్తుతం ఎలాంటి నిబంధనలు లేకపోవడంతో కొందరు తమ పుట్టిన తేదీ, వయస్సును తప్పుగా నమోదు చేసి సోషల్‌మీడియా ఖాతాలు తెరుస్తున్నారు. ఇకపై అది కూడా కుదరదు. పిల్లలకు తల్లిదండ్రులుగా సమ్మతి తెలిపేవారు కూడా తప్పకుండా పెద్దవాళ్లే అని నిర్ధారించాల్సి ఉంటుందని ముసాయిదాలో పేర్కొన్నారు. దివ్యాంగులకు సైతం వారి చట్టబద్ధమైన గార్డియన్ ద్వారా సమ్మతి ఉంటేనే సోషల్ మీడియా వాడేలా నిబంధనలు తీసుకొచ్చారు. మన డేటా మనదేశంలోనే డీపీడీపీ ముసాయిదాలో మరో కీలక నిబంధన కూడా చేర్చారు. మనదేశంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న సోషల్‌మీడియా సంస్థలు.. వారివద్ద ఉన్న భారతీయుల డేటాను ఇక్కడే నిల్వచేయాలని ముసాయిదాలో పేర్కొన్నారు. దేశం బయటకు తరలించేందుకు వీలుండదు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ ముసాయిదాలో నిబంధనలు చేర్చింది. ,యితే ఈ కొత్త నిబంధనలు మెటా, గూగుల్, యాపిల్, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి టాప్ సోషల్ మీడియా, ఇంటర్నెట్ కంపెనీలకు చికాకు కల్గించే అవకాశం ఉంది. ఈ ముసాయిదాపై అభిప్రాయాలు తెలిపేందుకు ఫిబ్రవరి 18 వరకు కేంద్ర ప్రభుత్వం గడువు ఇచ్చింది. అందువల్ల సదరు కంపెనీలు ఈ నిబంధనలు వ్యతిరేకించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి -
సుచీర్ బాలాజీ కేసులో షాకింగ్ ట్విస్ట్!
ఓపెన్ఏఐ విజిల్‌బ్లోయర్ సుచీర్ బాలాజీ కేసులో అనూహ్యపరిణామం చోటు చేసుకుంది. భారత సంతతికి చెందిన ఈ యువ టెక్ పరిశోధకుడి మృతిపై మిస్టరీ వీడడం లేదు. ఓపక్క అతను బలవన్మరణానికి పాల్పడ్డాడని అధికారులు ప్రకటించగా.. మరోవైపు తల్లిదండ్రులు బాలాజీ రమణమూర్తి, పూర్ణిమరావ్ మాత్రం అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తాజాగా.. అది హత్యేనంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.‘‘రెండో అటాప్సీ రిపోర్ట్‌ను మేం చదివాం. తలకు గాయంతో మా అబ్బాయి విలవిలలాడిపోయినట్లు సంకేతాలున్నట్లు ఆ నివేదికలో పేర్కొన్నారు. అందులో మరిన్ని వివరాలు అది హత్య అనే చెప్తున్నాయి’’ అని తల్లి పూర్ణిమరావ్ అంటున్నారు... ‘‘ఏఐ ఇండస్ట్రీలో టాప్-10 వ్యక్తుల్లో నా బిడ్డ ఉంటాడు. అలాంటివాడు ఓపెన్ఏఐ(OpenAI) కంపెనీని.. ఉన్నపళంగా ఎందుకు ఏఐ ఇండస్ట్రీని వదిలేస్తాడు. న్యూరా సైన్స్, మెషిన్‌లెర్నింగ్ వైపు ఎందుకు మళ్లాలనుకుంటాడు?. ఓపెన్ఏఐ మా అబ్బాయిని అణచివేసి ఉండొచ్చు.. బెదిరించి ఉండొచ్చు.. అనేదే మా అనుమానం’’ అని పూర్ణిమ చెబుతున్నారు . ‘‘లాస్ ఏంజెల్స్‌లో జరిగిన మిత్రుడి పుట్టినరోజు పార్టీ నుంచి తిరిగి వచ్చినట్లు మా వాడు చెప్పాడు. వచ్చే నెలలో లాస్ వెగాస్ టెక్ షోలో పాల్గొనబోతున్నట్లు చెప్పాడు అని తండ్రి రమణమూర్తి బాలాజీతో జరిగిన చివరి సంభాషణను వివరించారు. వాడెంతో సంతోషంగా ఉన్నాడు. అలాంటివాడెందుకు ఆత్మహత్య చేసుకుంటాడు అని ఆయన అనుమానం వ్యక్తం చేశారు.సుచీర్ కెరీర్ ఎంపిక విషయంలో ఏనాడూ మేం అడ్డు చెప్పలేదు. వాడి పరిశోధనలకు ఏఐ ఇండస్ట్రీకే టర్నింగ్ పాయింట్ అవుతుందని భావించాం. ఏఐ మానవాళికి మేలు చేస్తుందనుకుంటే.. అది మరింత ప్రమాదకారిగా మారబోతుందని సుచీర్ గుర్తించాడు. చాట్‌జీపీటీ లోపాలను ఎత్తి చూపాడు. కళాకారుల, జర్నలిస్టుల శ్రమను దోపిడీ చేయడం అనైతిక చర్యగా భావించాడు. వాడి పోరాటం ఓపెన్ఏఐకి వ్యతిరేకంగా జరిగింది కాదు. కేవలం మానవత్వానికి మద్దతుగా నిలిచాడు. అందుకే వాడి అభిప్రాయంతో మేం ఏకీభవించాం... కానీ, ఏదో జరిగింది. మా దగ్గర శవపరీక్ష నివేదిక ఉంది. అందులో బలవనర్మణం కాదని స్పష్టంగా ఉంది. ఇక తెలుసుకోవాల్సింది.. దీనికి కారకులెవరు? ఎందుకు చేశారనే?.. మా అబ్బాయి మృతిపై ఎఫ్‌బీఐ దర్యాప్తు జరగాలి. ఇప్పటికే ఇక్కడి భారత అధికారులను కలిశాం. ఈ విషయంలో భారత ప్రభుత్వ మద్దతు కోరుతున్నాం. ఇక్కడ బలైంది నా బిడ్డ మాత్రమే కాదు. ఓ మేధావి జీవితం అర్ధాంతంగా ముగిసింది. టెక్ ఇండస్ట్రీ ఓ విలువైన జీవితం పొగొట్టుకుంది. ఓపెన్ ఏఐ ఇప్పుడు మాకు మద్దతుగా నిలుస్తాని ప్రకటించడం ఆశ్చర్యంగా ఉంది’’ అని సుచీర్ పేరెంట్స్ ప్రకటించారు.కార్నిఫోలియా ఎన్నారై దంపతులు బాలాజీ రమణమూర్తి-పూర్ణిమలకు సుచీర్ బాలాజీ(Suchir Balaji) జన్మించాడు. బర్కేలీ కాలిఫోర్నియా యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్ చేశాడు. ఏఐ రీసెర్చర్ అయిన బాలాజీ ఓపెన్ఏఐ కంపెనీ కోసం నాలుగేళ్లుగా(2020-2024) పని చేశాడు. అయితే కిందటి ఏడాది ఆగష్టులో కంపెనీని వీడిన ఈ యువ రీసెర్చర్.. అక్టోబర్‌లో సంచలన వ్యాఖ్యలు చేశాడు. తాను ఓపెన్ఏఐని వీడడానికి గల కారణం తెలిస్తే.. ఎవరూ తట్టుకోలేరంటూ.. న్యూయార్క్ టైమ్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సుచీర్ బాలాజీ షాకింగ్ కామెంట్లు చేశాడు. డాటా కలెక్షన్ కోసం ఓపెన్ఏఐ కంపెనీ అనుసరిస్తున్న విధానం ఎంతో ప్రమాదకరమైందని.. దీనివల్ల వ్యాపారాలు, వ్యాపారవేత్తలకు మంచిది కాదని పేర్కొన్నాడతను. అలాగే ఛాట్జీపీటీలాంటి సాంకేతికతలు ఇంటర్నెట్ను నాశనం చేస్తున్నాయని, చాట్‌జీపీటీని అభివృద్ధి చేయడంలో ఓపెన్ఏఐ అమెరికా కాపీరైట్ చట్టాన్ని ఉల్లంఘించిందని ఆరోపించాడు. అయితే సుచీర్ ఎత్తిచూపిన లోపాలను తాము ఇదివరకే సవరించామని ఓపెన్ఏఐ ప్రకటించుకుంది. మరోవైపు.. శాన్ ఫ్రాన్సిస్కోలోని బుచానన్ స్ట్రీట్ అపార్ట్మెంట్లోని తన అపార్ట్మెంట్లో నవంబర్ 26వ తేదీన సుచీర్ శవమై కనిపించాడు. అతనిది ఆత్మహత్యే అయి ఉండొచ్చని.. తమ ప్రాథమిక విచారణలో మృతి పట్ల ఎలాంటి అనుమానాలు లేవని శాన్ఫ్రాన్సిస్కో పోలీసులు ప్రకటించారు. అయినప్పటికీ అతని పేరెంట్స్‌తో పాటు పలువురు బాలాజీ మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇదిలాఉంటే ఇంతకు ముందు.. ఇలాన్ మస్క్(Elon Musk)కు సైతంసుచీర్ బాలాజీ మృతిపై అనుమానాలు వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. కొసమెరుపు ఏంటంటే.. ఓపెన్‌ఏఐను 2015లో మస్క్-శామ్ అల్ట్మన్ కలిసి ప్రారంభించారు. అయితే మూడేళ్ల తర్వాత మనస్పర్థలతో ఇద్దరూ విడిపోయారు. ఓపెన్ఏఐకు పోటీగా X ఏఐను మస్క్ స్థాపించాడు. అప్పటి నుంచి ఇలాన్ మస్క్‌కు ఓపెన్ఏఐ సీఈవో శామ్ అల్ట్‌మన్‌కు వైరం కొనసాగుతోంది.చదవండి👉🏾 బాలాజీ తల్లి ట్వీట్, మస్క్ ఏమన్నారంటే.. -
ఈ ఏడాది తల్లిదండ్రులైన హీరోహీరోయిన్లు వీళ్లే (ఫొటోలు)
-
3 నెలల వయసులో కిడ్నాపై... 26 సంవత్సరాలకు తల్లిదండ్రులను చేరి..
బాల్యంలో తప్పిపోవడం లేదా కిడ్నాప్‌కు గురవ్వడం.. పెద్దయ్యాక సంపన్నులైన తల్లిదండ్రులను కలవడం... ఎన్నో సినిమాల్లో మనం చూసిన కథే. కానీ ఆ సినిమా కథలను మించిన జీవిత కథ చైనాలో జరిగింది. మూడు నెలల వయసులో కిడ్నాప్‌కు గురైన పసిబాలుడు.. యువకుడిగా తల్లిదండ్రులను చేరాడు. ఆ తరువాత కథ మాత్రం సినిమాలను మించి పోయింది. అదేంటో చూద్దాం! ప్రస్తుతం 26 ఏళ్ల వయసున్న షి కిన్షుయ్ మూడు నెలల వయసులో కిడ్నాపయ్యాడు. తల్లిదండ్రులు దశాబ్దాలుగా అతని కోసం వెతుకుతూనే ఉన్నారు. కుమారుడి ఆచూకీ తెలుసుకోవడానికి ఆ కుటుంబం కోటి రూపాయలకు పైగా ఖర్చు చేసింది. రెండున్నర దశాబ్దాల తరువాత.. ఎట్టకేలకు ఆచూకీ కనుగొన్న తల్లిదండ్రుల ఆనందానికి అవధులు లేవు. డిసెంబర్ 1న కొడుకును ఇంటికి తీసుకొచ్చారు. ఆ సందర్భాన్ని ఘనమైన వేడుకలా చేసుకున్నారు. అంతేకాదు తమ ఐశ్వర్యాన్నంతా ముందు పెట్టారు. అనేక భవనాలు.. లగ్జరీ కార్లు.. విలాసవంతమైన బహుమతులెన్నో అందించారు. కానీ.. ఇక్కడే పెద్ద ట్విస్ట్. అప్పటిదాకా అనాథలా పెరిగిన షి.. ఆస్తులకు వారసత్వాన్ని పొందడానికి ఇష్టపడలేదు. తన భార్యతో కలిసి జీవించడానికి ఒక్క ఫ్లాట్‌ను మాత్రం తీసుకున్నాడు. ప్రస్తుతం తన లైవ్ స్ట్రీమింగ్ ఛానల్ ఆదాయంపైనే ఆధారపడి జీవిస్తున్న షి... తన సంపాదనతోనే జీవితాన్ని నిర్మించుకోవాలనుకుంటున్నానని చెప్పాడు. కోట్ల ఆస్తులను వదులుకుని నిరాడంబరుడిగా మిగిలిపోవాలనుకున్న అతని వార్త ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. అతని విలువలను కొందరు ప్రశంసిస్తుంటే.. సానుభూతి కోరుకుంటున్నారంటూ కొందరు విమర్శిస్తున్నారు. ఎవరేమనుకున్నా తనకు నచ్చినట్టుగా బతకాలనుకున్న షి నిర్ణయం అందరినీ ఆకట్టుకుంటోంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
కూటమి కొత్త స్టంట్స్
సాక్షి, అమరావతి : సహజంగా ప్రతి స్కూల్లో జరిగే పేరెంట్స్ కమిటీ సమావేశాల పేరు మార్చి, ఆ సమావేశాలేవో ఇప్పుడే జరుగుతున్నట్టుగా, వాటిని ప్రచార వేదికలుగా మార్చుకుని చంద్రబాబు కూటమి ప్రభుత్వం చేస్తున్న స్టంట్స్ చూస్తుంటే ఆశ్చర్యమేస్తోందని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఎంతో కష్టపడి తీర్చిదిద్దిన ప్రభుత్వ స్కూళ్లను, విద్యా రంగాన్ని ఒకవైపు నాశనం చేస్తూ.. అమ్మకు వందనం పేరిట తల్లిదండ్రులకు సున్నం రాసి, వారిని దగాచేసి, మళ్లీ ఇప్పుడు రొటీన్‌గా జరిగే పేరెంట్స్ సమావేశాలపై పబ్లిసిటీ చేసుకుంటున్నారని దుయ్యబట్టారు. ఈ ప్రపంచంలో ఒక్క చంద్రబాబు మాత్రమే ఇలాంటి మోసాలు చేయగలరన్నారు. ఇంతటి నటనా కౌశల్యం చంద్రబాబుకే సొంతం అంటూ వ్యంగోక్తులు విసిరారు. ఈ మేరకు ఆదివారం ఆయన సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో పోస్టు చేశారు. ఆ పోస్టులో వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే..టీచర్లు–విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశాలు కొత్తేమీ కాదు. క్రమం తప్పకుండా గతంలో నుంచీ జరుగుతున్నవే. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ విద్యా రంగానికి పూర్తి జవసత్వాలు ఇచ్చే కార్యక్రమంలో భాగంగా చేపట్టిన ప్రతి విప్లవాత్మక మార్పులోనూ, అమలు చేసిన ప్రతి సంస్కరణలోనూ పిల్లల తల్లిదండ్రుల ఆలోచనలు, వారి భాగస్వామ్యాన్ని తీసుకున్నాం. 15,715 పాఠశాలల్లో మొదటి విడత, 22,344 పాఠశాలల్లో మలివిడత నాడు–నేడు పనులన్నీ తల్లిదండ్రుల కమిటీల భాగస్వామ్యంతోనే జరిగాయి. అప్పట్లో పిల్లలందరికీ ఇంగ్లిష్ మీడియంలో బోధన చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని కూడా పేరెంట్స్ కమిటీలు సంపూర్ణంగా ఆమోదించి తీర్మానాలు చేశాయి. ప్రభుత్వ స్కూళ్లలో టాయిలెట్స్ మెయింటెనెన్స్ ఫండ్, స్కూల్ మెయింటెనెన్స్ ఫండ్ నిర్వహణలో తల్లిదండ్రులదే ముఖ్య భూమిక. ప్రభుత్వ స్కూళ్లలో చదివే పిల్లల భవిష్యత్తును ఉజ్వలంగా తీర్చిదిద్దడంలో ఈ విధంగా తల్లిదండ్రులు తమ వంతు పాత్ర పోషించారు. ఇప్పుడు ఈ సమావేశాలకు కొత్త టైటిల్స్ పెట్టి, ఓవైపు విద్యా రంగాన్ని నాశనం చేస్తూ, మరోవైపు తామేదో కొత్తగా చేస్తున్నామనే భ్రమ కల్పించడానికి చంద్రబాబు, టీడీపీ నాయకులు ప్రయత్నిస్తున్నారు. మరో విశేషం ఏంటంటే.. పేరెంట్స్ కమిటీ సమావేశాలకు దాతల నుంచి చందాలు, సామగ్రిని తీసుకోవాలని ఏకంగా సర్క్యులర్ పంపడం. మేం అమ్మ ఒడి కింద ప్రతి తల్లికీ ఏడాదికి రూ.15 వేల చొప్పున, క్రమం తప్పకుండా 44.49 లక్షల మంది తల్లులకు రూ.26,067 కోట్లు ఇచ్చాం. నీకు రూ.15 వేలు, నీకు రూ.15 వేలు, నీకు రూ.15 వేలు అంటూ చంద్రబాబు సహా కూటమి పార్టీల నాయకులు ప్రతి ఇంటికీ వెళ్లి ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందికీ రూ.15 వేల చొప్పున ఇస్తామన్నారు. సూపర్ సిక్స్ అంటూ ఊరూరా, ప్రతి ఇంటికీ డప్పు కొట్టారు. ఇద్దరు పిల్లుంటే రూ.30 వేలు.. ముగ్గురుఉంటే రూ.45 వేలు.. నలుగురు ఉంటే రూ.60 వేలు ఇస్తామన్నారు. ఎంత మంది పిల్లలనైనా కనాలని చంద్రబాబు పిలుపు కూడా ఇచ్చారు. అధికారంలోకి వచ్చి ఆరు నెలలు అయ్యింది. ఇప్పటి వరకు ఒక్క పైసా ఇవ్వలేదు కదా.. గతంలో ఉన్న అమ్మ ఒడి పథకాన్నీ ఆపేశారు. బడ్జెట్లో రూ.12,450 కోట్లు పెట్టాల్సి ఉండగా పెట్టలేదు. మరి ఈ డబ్బులు ఎప్పుడు ఇస్తారు? ఆ హామీని అమలు చేయక పోవడంతో తల్లిదండ్రుల మీద పిల్లల ఖర్చులు, వారి భారం పడుతోంది కదా? నిన్నటి పేరెంట్స్ కమిటీ సమావేశాల్లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు, డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్, విద్యా శాఖ మంత్రిగా లోకేష్ అసలు దీని గురించి ఎందుకు మాట్లాడలేదు? ఇది దగా చేయడం కాదా? ఒక్క మాట కూడా మాట్లాడ్డం లేదంటే తల్లిదండ్రులకు సున్నం పెడుతున్నట్టే కదా?గతంలో రోజుకో మెనూతో ఘనంగా ఉన్న మధ్యాహ్న భోజన పథకం గోరు ముద్ద కార్యక్రమం అత్యంత దారుణంగా తయారయ్యిందంటూ ఈ మీటింగ్స్‌లో పేరెంట్స్ గగ్గోలు పెట్టడం మీ చెవులకూ వినిపించిందా చంద్రబాబు గారూ? డొక్కా సీతమ్మ అనే మహా తల్లి పేరుపెట్టి చివరకు స్కూళ్లలో, హాస్టళ్లలో విద్యార్థుల డొక్క మాడుస్తున్నారు. కనీసం ఆయాలకు జీతాలు కూడా ఇవ్వడం లేదు. విద్యార్థులు అపరిశుభ్రమైన ఆహారం తిని ఆరోగ్యంపాడై ఆస్పత్రుల్లో చేరుతున్న ఘటనలు మీ ప్రభుత్వ హయాంలో కోకొల్లలు. పిల్లలు వెళ్లే గవర్నమెంటు స్కూళ్లలో టాయిలెట్ల నిర్వహణ కోసం ఇచ్చే టాయిలెట్ మెయింటెనెన్స్ ఫండ్, స్కూళ్ల నిర్వహణ కోసం ఇచ్చే స్కూల్ మెయింటినెన్స్ ఫండ్ ఈ రోజు ఏమైంది? టాయిలెట్ల మెయింటెనెన్స్ గురించి గానీ, స్కూళ్ల మెయింటినెన్స్ గురించి గానీ ఎవరైనా పట్టించుకున్నారా? అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే ఇలా ప్రభుత్వ విద్యా రంగాన్ని దిగజార్చి, కావాలనే సమస్యలు సృష్టించి ఉద్దేశ పూర్వకంగా ప్రైవేటు బడులకు వెళ్లేలా చేసి, తల్లిదండ్రులు చదువు కొనుక్కునేలా వారిపై ఆర్థిక భారం మోపి, ఇప్పుడు అదే పిల్లల ముందుకు, తల్లిదండ్రుల ముందుకు వెళ్లి ఏమార్చే మాటలు చెప్పడానికి, వారిని మభ్యపెట్టడానికి సిగ్గేయడం లేదా?అధికారంలోకి రాగానే స్కూళ్ల బాగు కోసం వైఎస్సార్సీపీ చేసిన మంచి పనులన్నింటినీ కూడా నిలిపేశారు. మలి దశలో మిగిలిపోయిన నాడు–నేడు పనులను ఉద్దేశ పూర్వకంగా ఆపేశారు. అదనపు తరగతి గదుల నిర్మాణాలనూ పట్టించుకోలేదు. ఏ కారణంతో నిలిపేశారు? ఎందుకు నిలిపేశారు? ఎంతో కష్టపడి స్కూళ్లకు సీబీఎస్ఈ అఫిలియేషన్ తీసుకు వచ్చాం. ఇప్పుడు సీబీఎస్ఈని ఎందుకు రద్దు చేశారు? ఇంగ్లిష్ మీడియం బోధనను ఎందుకు నిరుత్సాహ పరుస్తున్నారు? ప్రపంచ స్థాయిలో గవర్నమెంటు స్కూలు పిల్లలను తయారు చేసేలా 3వ తరగతి నుంచి ప్రవేశ పెట్టిన టోఫెల్ క్లాసు, 3వ తరగతి నుంచే సబ్జెక్ట్ టీచర్ల విధానం, సీబీఎస్ఈ నుంచి ఐబీ దాకా ప్రయాణం, ఫ్యూచర్ టెక్నాలజీపై తరగతులు.. ఇలా ఇవన్నీ ఎందుకు ఆపేశారు? డిజిటల్ లెర్నింగ్‌లో భాగంగా 8వ తరగతి విద్యార్థులకు ఇచ్చే ట్యాబుల పంపిణీని ఎందుకు రద్దు చేశారు? 3వ తరగతి నుంచే సబ్జెక్టు టీచర్ల కాన్సెప్ట్‌ను ఎందుకు రద్దు చేశారు?మేం స్కూళ్లలో 6వ తరగతి నుంచే ప్రతి క్లాసులో, ప్రతి స్కూల్లో పెట్టిన ఐఎఫ్‌పీ ప్యానెల్స్, డిజిటల్ స్క్రీన్ల సమర్థ వినియోగం కోసం ఫైనల్ ఇయర్ ఇంజినీరింగ్ స్టూడెంట్ను ప్రతి స్కూలుకూ పెట్టాలన్న కార్యక్రమాన్ని ఎందుకు అడ్డుకుంటున్నారు? దీనివల్ల వేల మంది ఇంజినీరింగ్ స్టూడెంట్లకు వచ్చే ఉపాధి పోతుంది కదా? ఐఎఫ్‌పీ ప్యానెల్స్ మెయింటినెన్స్ మూలన పడదా?విద్యా దీవెన, వసతి దీవెనల కింద గతంలో విద్యార్థులకు ఇచ్చే తోడ్పాటు ఇప్పుడు లభిస్తోందా? ఈ జనవరి వస్తే నాలుగు త్రైమాసికాలుగా ఎలాంటి చెల్లింపులు లేవు. ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా ఇచ్చే వసతి దీవెన, విద్యా దీవెన.. ఈ రెండింటికీ కలిపి ఏకంగా రూ.3,900 కోట్లు బకాయిలుగా పెట్టి, ఈ రోజు పిల్లలను ఉద్ధరిస్తున్నట్టుగా మీరు చేస్తున్న డ్రామా మరో డీవియేషన్ రాజకీయం కాదా? -
మెగా పేరెంట్స్-టీచర్స్ మీటింగ్.. సీన్ రివర్స్!
అమరావతి, సాక్షి: కూటమి ప్రభుత్వం ఒకటి అనుకుంటే.. మరొకటి జరుగుతోంది. ఏపీవ్యాప్తంగా విద్యార్థుల తల్లిదండ్రులు కూటమి ప్రభుత్వానికి పెద్దషాకే ఇస్తున్నారు. ఆర్భాటంగా జరుగుతుందని భావించిన పేరెంట్స్ టీచర్స్ డే మీటింగ్‌లో అడుగడుగునా నిలదీతలు ఎదురవుతున్నాయి. తల్లిదండ్రులు తమ ప్రశ్నలతో.. నిరసనలతో కూటమి నేతలను ఉక్కిరి బిక్కిరి చేశారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా శనివారం తల్లిదండ్రులు- ఉపాధ్యాయుల మెగా సమావేశాలు ప్రారంభమయ్యాయి. మొత్తం 45,094 ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో ఈ కార్యక్రమం కొనసాగుతోంది. బాపట్ల పురపాలక ఉన్నత పాఠశాలలో జరిగిన కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు , విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ హాజరయ్యారు. కడప మున్సిపల్ హైస్కూల్లో జరిగిన కార్యక్రమానికి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హాజరయ్యారు. అంతా సవ్యంగానే నడుస్తోందంటూ మంత్రులు, కూటమి నేతలు ప్రకటించుకున్నారు. కానీ..కర్నూల్లో.. విద్యార్థుల సమస్యలపై అడుగడుగునా తల్లిదండ్రులను కూటమి నేతలను నిలదీస్తున్నారు. కర్నూల్లో మంత్రి టిజి భరత్‌ను ఓ విద్యార్థి తల్లి నిలదీశారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెట్టడం లేదని మండిపడ్డారు. ఆ భోజనం కారణంగానే తన బిడ్డ అస్వస్థతకు గురైందని, అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోలేదని వాపోయారామె. కర్నూలు నగరంలోని హైస్కూలో మెగా టీచర్స్ పేరెంట్స్ మీటింగ్‌లో మంత్రి భరత్‌కు ఈ చేదు అనుభవం ఎదురైంది.అల్లూరి సీతారామరాజు జిల్లాలో..ఏజెన్సీ కూనవరం ఏపీ టీ డబ్ల్యూ ఆశ్రమ పాఠశాలలో జరిగిన పేరెంట్స్ మీటింగ్‌లో రచ్చ రేగింది. అన్ని సబ్జెక్టులకు సరిపడా అధ్యాపకులు లేకపోవడాన్ని నిరసిస్తూ విద్యార్థుల తల్లిదండ్రులు ధర్నాకు దిగారు. సిలబస్ పూర్తికాకుండా తమ పిల్లలు పరీక్షలు ఎలా రాస్తారంటూ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో.. స్కూల్ ముందు రోడ్డుపై తమ పిల్లలతో బైఠాయించారు. -
'గ్రానీస్ పర్స్ సిండ్రోమ్': ప్రతి పేరెంట్‌కి అవగాహన ఉండాలి!
ఎన్నో రకాల వ్యాధుల గురించి విని ఉన్నాం. కానీ ఇలాంటి సిండ్రోమ్ గురించి మాత్రం విని ఉండుండరు. ప్రతి తల్లిదండ్రులు ఈ సిండ్రోమ్ గురించి తప్పక తెలుసుకోవాలని చెబుతోంది పీడియాట్రిక్ వైద్యురాలు. పిల్లల ప్రాణాలను ప్రమాదంలో పడేసే దీనిపై అవగాహన ఉండాలని అన్నారు. లేదంటే పిల్లల ఆరోగ్యం పాడయ్యే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ఇంతకీ ఏంటీ సిండ్రోమ్ అంటే..చిన్నారులకు నడక, మాటలు వచ్చాయంటే.. వారిని ఓ కంటకనిపెడుతూనే ఉండాలి. ఏ క్షణంలో ఏం పనిచేస్తారో చెప్పాలేం. సైలెంట్‌గా ఉన్నారంటే దేన్నో పాడుచేయడం లేదా ప్రమాదం కొని తెచ్చుకునే పనులేవో చేస్తున్నారని అర్థం. ఇలాంటి పిల్లలను కనిపెట్టుకుని ఉండటం, తల్లిదండ్రులకు, పెద్దలకు ఓ సవాలుగా ఉంటుంది. ఇలా కనిపెట్టుకుని ఉండలేక తల్లిదండ్రులు అమ్మమ్మలు లేదా నానమ్మల ఇంటికి పంపించేస్తారు.అక్కడ వాళ్లు అప్పటి వరకు ఇల్లంతా సందడి లేకుండా ఉంటుంది. ఈ చిచ్చర పిడుగుల రాకతో ఎక్కడ లేని సందడి వచ్చేస్తుంది. అదీగాక నానమ్మ/అమ్మమ్మ తాతయ్యలు కూడా తామిద్దరమే అని ఇంట్లో పర్సులు, వాళ్లకు సంబంధించిన మందులు అందుబాటులోనే పెట్టుకుంటారు. వయసు రీత్యా వచ్చే మతిమరపు సమస్యతో ఆ వస్తువులను సమీపంలోనే ఉంచుకుంటారు. అయితే ఈ చిచ్చర పిడుగులు ఈ వస్తువులను తీసి.. ప్రాణాల మీదకు తెచ్చుకుంటారు. ఆ తర్వాత ఇంటిల్లపాది ఇలా అయ్యిందేంటని బోరుమంటారు. ఇలా అమ్మమ్మలు లేదా నానమ్మల పర్సలు లేదా మందులతో వైద్య పరిస్థితిని కొని తెచ్చుకోవడాన్ని గ్రానీస్ పర్స్ సిండ్రోమ్‌గా పిలుస్తారని శిశు వైద్యులు చెబుతున్నారు. కొందరు పర్సులో ఉండే నాణేలను నోటిలో పెట్టుకోవడం, అలాగే పెద్దల మందులు వేసుకోవడం తదితరాలతో ప్రమాదాలు కొనితెచ్చుకుంటారు. ఒక్కోసారి అది సీరియస్ అయ్యి ప్రాణాలు పోగొట్టుకున్న చిన్నారులెందరో ఉన్నారని చెబుతున్నారు శిశు వైద్యులు. ముఖ్యంగా పెద్దలు వేసుకునే దీర్ఘకాలికి వ్యాధులకు సంబంధించిన మందులు కారణంగా అనారోగ్యం పాలై బాధపడుతున్న చిన్నారులు కూడా చాలామంది ఉన్నారని హెచ్చరిస్తున్నారు. అందువల్ల దయచేసి తాతయ్యలు అమ్మమల ఇంటికి పంపిచేటప్పడూ పెద్దవాళ్ల వస్తువులను తీయకూడదని చెప్పడం తోపాటు పెద్దలు కూడా తమ పర్సులు, మందులు డబ్బాలు వారికి అందుబాటులో ఉండకుండా జాగ్రత్త పడటం మంచిదని శిశు వైద్యురాలు టిక్‌టాక్ వీడియోలో పేర్కొంది. అంతేగాదు యూఎస్‌లో అనేక మంది చిన్నారులు గ్రానీస్ పర్స్ సిండ్రోమ్‌గా పిలిచే ఈ వైద్య పరిస్థితి బారిన పడి అనారోగ్యం లేదా గాయాల పాలైనట్లు పరిశోధనలు చెబుతున్నాయి. ఈ అధ్యయనం జర్నల్ ఆఫ్ ఆస్టియోపతిక్ మెడిసిన్‌లో ప్రచురితమయ్యింది.(చదవండి: భవిష్యత్తులో ఆరోగ్యం, దీర్ఘాయువు ఎలా ఉండనుంది?) -
సంతానం లేని వారికి ఒయాసిస్ ఫెర్టిలిటీ ఓ వరం
హనుమకొండ : సంతానం లేని దంపతులకు సంతాన భాగ్యం కల్పిస్తూ వారి కళ్ళల్లో ఆనందాన్ని అందిస్తుంది ఒయాసిస్ ఫెర్టిలిటీ సెంటర్ అని డాక్టర్ జలగం కావ్య రావు అన్నారు. హనుమకొండ బ్రాంచ్ మొదటి వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డాక్టర్ కావ్య రావు, డాక్టర్ కృష్ణ చైతన్య, డాక్టర్ అంజనీ దేవి, డాక్టర్ విజయలక్ష్మి, డాక్టర్ భోజరాజు రోహిత్, డాక్టర్ ప్రసన్నలు హాజరయ్యారు.ఈ సందర్భంగా డాక్టర్ కావ్య రావు మాట్లాడుతూ భారతదేశంలోనే ప్రముఖ ఫెర్టిలిటీ కేర్ ప్రొవైడర్ అయిన ఒయాసిస్ ఫెర్టిలిటీ, హన్మకొండ ఫెర్టిలిటీ సెంటర్, 2017 నుండి ప్రజలకు సేవలందిస్తున్న వరంగల్ శాఖ వారసత్వాన్ని అందిపుచ్చుకుంటూతన మొదటి వార్షికోత్సవాన్ని వేడుకగా చేసుకుంది. జంటలు సంతానోత్పత్తి సవాళ్లను అధిగమించడానికి, అధునాతన, సైన్స్ ఆధారిత చికిత్సల ద్వారా వారి తల్లిదండ్రులవ్వాలనే వారి కలలను నెరవేర్చుకోవడానికి ఒయాసిస్ ఫెర్టిలిటీ తిరుగులేని నిబద్ధతను ఈ మైలురాయి చాటిచెబుతుంది. ఒయాసిస్ ఫెర్టిలిటీ కోఫౌండర్ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ దుర్గా జి. రావు, కిరణ్ లకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. ఒయాసిస్ ఫెర్టిలిటీ సైన్ టిఫిక్హెడ్, క్లినికల్ ఎంబ్రియాలజిస్ట్ డాక్టర్ కృష్ణ చైతన్య మంత్రవాది గౌరవ అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఒయాసిస్ ఫెర్టిలిటీ సైన్ టిఫిక్ హెడ్ అండ్ క్లినికల్ ఎంబ్రియాలజిస్ట్ డాక్టర్ కృష్ణ చైతన్య మంత్రవాది మాట్లాడుతూ ఒయాసిస్ ఫెర్టిలిటీ సెంటర్ ద్వారా తల్లిదండ్రులవ్వాలనే కలను సాధించడంలో ఎన్నో జంటలకు సహాయం చేశాం. అంతేగాకుండా, మా ఫెర్టిలిటీ కేర్ సేవలు ఎగ్, మరియు స్పెర్మ్ ఫ్రీజింగ్ వసతి ద్వారా భార్య భర్తలు లేదా నేటి తరం వారు వారి భవిష్యత్తు కోసం సంతానోత్పత్తిని కాపాడుకునే ఎంపికను అందించడం ద్వారా కుటుంబ ప్రణాళిక గురించి అవగాహనతో కూడిన నిర్ణయాలు తీసుకునేలా వారికి సాధికారికత ఇస్తాయి అని అన్నారు. వయస్సు, మెడికల్ హిస్టరీ, జీవనశైలికి సంబంధించిన అనుకూలీకరించిన సంతానోత్పత్తి పరిష్కారాలను అందించడం ద్వారా హన్మకొండ కేంద్రం ఒక సంవత్సరంలోపుగానే ఫెర్టిలిటీ వైద్యంలో అగ్రగామిగా మారింది. ఈ మైలురాయి సాధించడంపై ఒయాసిస్ ఫెర్టిలిటీ రీజినల్ మెడికల్ హెడ్ ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ డాక్టర్ జలగం కావ్యరావు మాట్లాడుతూ హన్మకొండలోని ఒయాసిస్ ఫెర్టిలిటీ ప్రారంభమైనప్పటి నుండి ప్రపంచ స్థాయి సంతానోత్పత్తి చికిత్సలకు మాత్రమే కాకుండా పునరుత్పత్తి ఆరోగ్యంపై అవగాహన పెంపొందించడానికి కట్టుబడి ఉంది. ఈ చికిత్సల్లో 70% విజయం సాధించడం మా క్లినికల్ నైపుణ్యాన్ని ప్రతిబింబిస్తుంది. ఇప్పటివరకు సుమారు 6000 మంది జంటలకి సంతాన సాఫల్యత అందించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా వైయాసిస్ ఫెర్టిలిటీ సెంటర్ ద్వారా సంతానం పొందిన ఆయా దంపతుల కుటుంబాలు పిల్లలు హాజరవ్వడంతో వారి అనుభవాలను ఆనందాన్ని అందరితో పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో ఒయాసిస్ ఫెర్టిలిటీ సెంటర్ వైద్యులు సిబ్బంది, పిల్లలు, తల్లి తండ్రులు తదితరులు పాల్గొన్నారు. -
కృంగి‘పోతున్న’ పండుటాకులు: చట్టం ఉందిగా అండగా!
కనిపెంచిన బిడ్డల్ని,కంటికి రెప్పలా కాపాడి, ఎన్నో కష్టాలకోర్చి వారిని పెంచి ప్రయోజకుల్ని చేస్తారు తల్లిదండ్రులు. కానీ రెక్కలు వచ్చిన బిడ్డలు కన్నతండ్రులను నిర్లక్ష్యం చేస్తున్నారు. మరికొందరు ఆస్తుల కోసం వేధింపులకు పాల్పడుతున్నారు. హృదయాల్ని కదిలించే ఇలాంటి ఉదంతాలపై స్పెషల్ స్టోరీ..వృద్ధాప్యంలో తల్లిదండ్రులను కంటికి రెప్పలా చూసుకోవాల్సిన కొందరు కుమారులు, కూతుళ్లు పట్టించుకోవడం లేదు.. ఆస్తుల కోసం వేధింపులకు గురిచేయడం, తిండి పెట్టకపోవడం, చేయి చేసుకోవడం, చివరకు చంపేందుకూ వెనకాడకపోవడం వంటి ఘటనలు కృంగిపోయేలా చేస్తున్నాయి.. రెక్కలు ముక్కలు చేసుకొని, పిల్లలను పెంచి, ప్రయోజకులను చేస్తే వృద్ధాప్యంలో పట్టెడన్నం పెట్టకుండా మనోవేదనకు గురి చేయడాన్ని తట్టుకోలేకపోతున్నారు. కొంతమంది ఇంటి నుంచి వెళ్లిపోతున్నారు.. మరికొందరు ఆత్మహత్య చేసుకుంటున్నారు.. ఇంకొందరు కలెక్టరేట్లలో ప్రజావాణిని, ఠాణాల్లో పోలీసులను ఆశ్రయిస్తున్నారు.. ఇటీవల ఉమ్మడి జిల్లావ్యాప్తంగా వృద్ధుల మిస్సింగ్ కేసులు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది.ఈమె పేరు గుర్రాల అంతమ్మ. మానకొండూరు మండలం కొండపల్కల. 9 ఎకరాల వ్యవసాయ భూమి ఉండగా కొడుకు లక్ష్మారెడ్డి మాయమాటలు చెప్పి, ఏడెకరాలు రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. 2022లో తన భర్త మల్లారెడ్డి మరణించడంతో కొన్ని రోజుల తర్వాత ఇంటి నుంచి వెళ్లగొట్టాడని అంతమ్మ వాపోయింది. కూతురు వద్ద తలదాచుకుంటున్నానని కన్నీటిపర్యంతమైంది. మిగిలిన భూమిని కూడా రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు కుమారుడు ప్రయత్నిస్తున్నాడని తెలిపింది.ఈ చిత్రంలో కనిపిస్తున్నది చొప్పదండికి చెందిన ముత్యాల గోపాల్‌రెడ్డి, ఆయన భార్య. వీరికి ఇద్దరు కుమారులు రవీందర్‌రెడ్డి, సత్యనారాయణ, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. 20 ఎకరాల వ్యవసాయ భూమితో దర్జాగా బతికేవారు. పిల్లలను చదివించి, ప్రయోజకులను చేశారు. తీరా కుమారులు మాయమాటలు చెప్పి, భూమిని తమ పేరిట పట్టా చేసుకున్నారు. తర్వాత ఇంట్లో నుంచి గెంటేశారని, ఈ వయసులో తమకు ఇదేం దుస్థితి అంటూ ఆ దంపతులు కంటతడి పెడుతున్నారు.జగిత్యాల మున్సిపాలిటీలోని ఓ వార్డుకు చెందిన ఒక వృద్ధుడు కొడుకు పట్టించుకోకుండా ఇబ్బందులకు గురిచేస్తుండటంతో మానసికంగా కృంగిపోయాడు. ఇంటిని వదిలి వెళ్లిపోయాడు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకొని, విచారణ చేపడుతున్నారు.సిరిసిల్లకు చెందిన ఓ వృద్ధుడు కుమారుడు ఆస్తి రాయించుకొని, తర్వాత పట్టించుకోకపోవడంతోపాటు వేధింపులకు గురిచేస్తున్నాడని హెల్ప్ లైన్–14567కు ఫోన్ చేసి, ఫిర్యాదు చేశాడు. అధికారులు తొలుత కౌన్సెలింగ్ ఇచ్చినా అతనిలో మార్పు రాలేదు. దీంతో ఆర్డీవో ఆధ్వర్యంలో మెయింటెనెన్స్ ట్రిబ్యునల్ దృష్టికి తీసుకెళ్లారు. అక్కడ తండ్రికి, కుమారుడికి కౌన్సెలింగ్ ఇచ్చారు. చట్టంలోని నిబంధనలు, విధించే శిక్షల గురించి వివరించారు. తర్వాత కుమారుడి ప్రవర్తనలో మార్పు వచ్చింది.సుల్తానాబాద్ మున్సిపాలిటీలోని గొల్లపల్లిలో ఆస్తి వివాదం కారణంగా కొడుకు సింగరేణి రిటైర్డ్ కార్మికుడైన తన తండ్రి మధునయ్యను తోసేశాడు. అతను కిందపడి, మృతిచెందాడు.చట్టాలున్నాయి.. న్యాయం పొందొచ్చుపండుటాకులకు సొంత బిడ్డల నుంచే వేధింపులు, నిరాదరణ ఎదురవుతుండటంతో కేంద్రం 2007లో తల్లిదండ్రులు, వయోవృద్ధుల రక్షణ, పోషణ చట్టం తీసుకొచ్చింది. దీని ప్రకారం ఉమ్మడి ఏపీ ప్రభుత్వం 2011లో ఒక నియమావళి రూపొందించింది. 2019లో కేంద్రం వృద్ధుల సంక్షేమం మరింత మెరుగ్గా ఉండటానికి చట్టానికి సవరణలు చేసింది. వాటి ప్రకారం ప్రతీ రెవెన్యూ డివిజన్ స్థాయిలో ఒక ట్రిబ్యునల్ ఏర్పాటైంది. దానికి ఆర్డీవో లేదా సబ్ కలెక్టర్ స్థాయి అధికారి చైర్మన్‌గా, స్వచ్ఛంద సంస్థల నుంచి ఒకరు లేదా ఇద్దరు సభ్యులుగా ఉంటారు. బాధిత వృద్ధులకు ఉచితంగా వారి బిడ్డల నుంచి రక్షణ, పోషణ కల్పిస్తారు. బాధితులకు ఈ తీర్పు నచ్చకపోతే కలెక్టర్ చైర్మన్‌గా ఏర్పాటయ్యే అప్పీలేట్ ట్రిబ్యునల్‌ను 60 రోజుల్లో ఆశ్రయించి, అంతిమ న్యాయం పొందొచ్చు. ఆస్తిని తిరిగి పొందే హక్కునిరాదరణకు గురైనప్పుడు తమ బిడ్డలకు రాసిచ్చిన ఆస్తిని వృద్ధులు బేషరతుగా తిరిగి పొందే హక్కును చట్టంలో చేర్చారు. కేవలం గిఫ్ట్ డీడ్ చేసిన ఆస్తి మాత్రమే కాదు రిజిస్ట్రేషన్ చేసిన ఆస్తిని సైతం తిరిగి పొందొచ్చు. ప్రతీ నెల మెయింటెనెన్స్ రూ.10 వేల వరకు ఇప్పిస్తారు. ఇటీవల పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలో ఓ వృద్ధుడికి కలెక్టర్ ఇలాగే న్యాయం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వం కల్పించిన ఇటువంటి చట్టాలపై వృద్ధులకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. కుమారులు నిర్లక్ష్యం చేస్తే టోల్ ఫ్రీ హెల్ప్‌లైన్ 14567 నంబర్‌కు ఫిర్యాదు చేయొచ్చు. లేదా నేరుగా ప్రతీ సోమవారం కలెక్టరేట్లో జరిగే ప్రజావాణిలో అధికారులకు విన్నవించుకోవచ్చు. కౌన్సెలింగ్ ఇచ్చి, పోషణ కింద ఆర్థికసాయం అందే ఏర్పాటు చేసి, పోలీసుల ద్వారా రక్షణ కల్పిస్తారు.వేధిస్తే కఠిన చర్యలు వృద్ధుల సంక్షేమానికి ప్రభుత్వాలు చట్టాలు చేశాయి. వాటిపై ప్రతీ ఒక్కరు అవగాహన పెంచుకోవాలి. ఎవరి నుంచి ఏ విధమైన వేధింపులను ఎదుర్కొంటున్నా, ఎలాంటి సమాచారం కోసమైనా హెల్ప్‌లైన్ నంబర్లో సంప్రదించవచ్చు. వృద్ధులను వారి సంతానం ప్రేమతో చూడాలి. వేధింపులకు గురిచేస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటాం.– శ్రీనివాస్, సీపీ రామగుండం -
‘నేటి పిల్లలే రేపటి సూపర్ మోడల్స్’.. 200 మంది పేరెంట్స్‌కు రూ. 5 కోట్ల టోకరా
న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలోని ద్వారకకు చెందిన 34 ఏళ్ల మహిళ తన తీరిక సమయంలో ఫేస్‌బుక్‌ను స్క్రోలింగ్ చేసింది. ఒక ప్రకటన ఆమె దృష్టిని ఆకర్షించింది. ఆ యాడ్‌లో లాట్స్ స్టార్ కిడ్స్ సంస్థ పిల్లలకు మోడలింగ్ అవకాశాలు కల్పిస్తున్నట్లు పేర్కొంది.దీనితో పాటు మోడలింగ్‌లో శిక్షణ కూడా ఇస్తామని తెలిపింది. తన కుమార్తెకు ఇది మంచి అవకాశం అవుతుందని ఆమె భావించింది. వెంటనే సదరు మహిళ ఆ యాడ్‌పై క్లిక్ చేసింది. అది ఆమెను ‘టెలిగ్రామ్’కు తీసుకువెళ్లింది. ఈ సంస్థను ఇదేవిధంగా చాలా మంది తల్లిదండ్రులు సంప్రదించారు. తమపిల్లలను మోడల్స్‌గా మార్చాలనే తాపత్రయంలో ఆ సంస్థ అడిగినంత ఫీజు చెల్లించారు.మీడియాకు అందిన వివరాల ప్రకారం ఆ సంస్థ రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించిన చిన్నారులకు మోడలింగ్ అసైన్మెంట్లు ఇవ్వనున్నట్లు హామీనిచ్చింది. ఎంతకాలం గడిచినా లాట్స్ స్టార్ కిడ్స్ సంస్థ చిన్నారులకు మోడలింగ్ అవకాశాలు కల్పించలేదు. దీంతో తాము మోసపోయామని గ్రహించిన తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు.రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్లు చేపట్టి ఈ సంస్థ గుట్టును రట్టు చేశారు. ఇద్దరు ప్రధాన నిందితులను అరెస్టు చేశారు. ఈ సంస్థ ముఠా సభ్యులు 197 మంది తల్లిదండ్రుల నుంచి రూ.4.7 కోట్లకు పైగా మొత్తాన్ని వసూలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. పిల్లలను మోడల్స్‌గా తీర్చిదిద్దాలనుకునే తల్లిదండ్రులను టార్గెట్‌గా చేసుకుని, వీరు భారీ ఎత్తున మోసానికి పాల్పడ్డారు.ఈ స్కామర్లు మోడలింగ్ చేస్తున్న పిల్లల ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి, ఇతర తల్లిదండ్రులను ఆకర్షిస్తారు. తరువాత వారిని టెలిగ్రామ్ గ్రూప్‌లో చేర్చి, పిల్లలకు మోడలింగ్‌లో అవకాశాలు ఇప్పిస్తామంటూ తల్లిదండ్రుల నుంచి ఫీజులు వసూలు చేస్తారు. ఇందుకు ఆన్లైన్ వేదికను ఉపయోగించుకుంటారు. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులు.. తల్లిదండ్రులు ఇలాంటి ఉచ్చులో చిక్కుకోవద్దని హెచ్చరిస్తున్నారు. ఇది కూడా చదవండి: రైలులో పాము కాటు.. ప్రయాణికుల తొక్కిసలాట -
పేరెంట్స్ కన్నా, ఫ్రెండ్స్ మాటలే ముఖ్యం
‘మావాడు మేం చెప్పేది అస్సలు వినడండీ. ఎప్పుడూ ఫ్రెండ్స్, ఫ్రెండ్స్ అంటుంటాడు. వాళ్లందరూ ఒక గ్యాంగయ్యారు. బైక్‌తో రిస్కీ ఫీట్స్ చేస్తుంటారు. ఎప్పుడేం తెచ్చుకుంటారోనని గుండె అదురుతుంటుంది..’‘మా పాప మేమేం చెప్పినా పట్టించుకోదండీ. ఫ్రెండ్స్ చెప్తే మాత్రం వెంటనే చేసేస్తుంది. తనకు నచ్చేలా ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు.’‘మా అబ్బాయి ఒకరోజు చాలా కాన్ఫిడెంట్‌గా కనిపిస్తాడు, మరుసటి రోజే డల్‌గా కనిపిస్తాడు. ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకుంటాడు.’కౌన్సెలింగ్‌కు వచ్చే చాలామంది పేరెంట్స్ తమ టీనేజ్ పిల్లల గురించి చెప్పే మాటలవి. చిన్నప్పటి నుంచీ అమ్మ కూచిలా లేదా నాన్న బిడ్డలా ఉన్న పిల్లలు, అప్పటివరకు తమ అభిప్రాయలను గౌరవించి, తాము చెప్పే సూచనలు పాటించే పిల్లలు ఒక్కసారిగా మారేసరికి పేరెంట్స్ తట్టుకోలేరు. వారెక్కడ చేజారిపోతారోనని బాధపడుతుంటారు, ఆందోళన చెందుతుంటారు. కానీ, ఆ వయసుకు అది సహజం. టీనేజ్‌కు వచ్చేసరికి వారి ప్రపంచం కుటుంబాన్ని దాటి విస్తృతమవుతుంది. ఈ దశలో స్నేహితులు, ఆన్లైన్ కమ్యూనిటీల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. పేరెంట్స్ కంటే ఫ్రెండ్స్ మాటలకే ఎక్కువ విలువిస్తారు. స్నేహితుల ఆమోదం, గుర్తింపు పొందడానికి ప్రయత్నిస్తారు. ఈ మార్పును అర్థం చేసుకోవడం ద్వారా తల్లిదండ్రులు.. సున్నితమైన ఈ దశలో పిల్లలకు సరైన మద్దతు అందించగలుగుతారు. పీర్ ప్రెజర్.. స్నేహితుల ఆమోదం పొందాలనే ఒత్తిడి అందరిపైనా ఉంటుంది. కానీ టీనేజ్‌లో ఎక్కువగా ఉంటుంది. టీనేజర్లు ఒక గ్యాంగ్‌లో చేరేందుకు ప్రయత్నిస్తారు. ఆ వయసులో అది అత్యవసరమనిపిస్తుంది. ఆ స్నేహితుల ఒత్తిడికి లోనైనప్పుడు తప్పులు చేసే అవకాశాలు పెరుగుతాయి. కొందరు టీనేజర్లు మితిమీరి ప్రవర్తించవచ్చు. మద్యం సేవించడం, ప్రమాదకరమైన ఫీట్స్ చేయడం, విచిత్రమైన వేషధారణలోనూ కనిపించవచ్చు. ఈ పరిస్థితిని ఎదుర్కోవడానికి, తల్లిదండ్రులు సంయమనంతో ఉండటం ముఖ్యం. పీర్ ప్రెజర్ గురించి పెద్దలతో స్వేచ్ఛగా మాట్లాడగలిగే వాతావరణాన్ని కల్పించాలి. పిల్లలతో చర్చించి, వారి నిర్ణయాలపై గల ప్రభావాన్ని అర్థంచేయించేందుకు ప్రయత్నించాలి. స్నేహితులకు ‘నో’ చెప్పగలిగే ధైర్యాన్ని నేర్పాలి. సోషల్ మీడియా ప్రభావం.. స్నేహితుల ఒత్తిడి కేవలం పాఠశాల సమయంతో ఆగిపోదు. ఇన్స్టాగ్రామ్, స్నాప్‌చాట్ వంటి సోషల్ మీడియా ద్వారా 24/7 కొనసాగుతుంది. ఇవి తమ వ్యక్తీకరణకు ఎంత ఉపయోగపడతాయో, అంతే నెగటివ్ ప్రభావాన్నీ చూపించే సామర్థ్యం గలవి. సోషల్ మీడియాలో ఇతరులను చూస్తూ, పోల్చుకోవడం వల్ల కొందరు టీనేజర్లు ఆత్మన్యూనతకు లోనవుతుంటారు. పోస్టులకు లైకులు, కామెంట్ల ద్వారా వెంటనే గౌరవాన్ని పొందాలనుకునే తీరు కూడా వారిని కుంగిపోయేలా చేయవచ్చు. సోషల్ మీడియా ద్వారా వచ్చే ఈ ఒత్తిడిని తల్లిదండ్రులు గ్రహించి, వారితో మాట్లాడాలి. వారు చూస్తున్న కంటెంట్ గురించి చర్చించాలి. అది నిజ జీవితాన్ని ప్రతిబింబించదని వారికి అర్థమయ్యేలా వివరించాలి. నిర్ణయాలు, ఆత్మగౌరవంస్నేహితులు, సోషల్ మీడియా ఒత్తిడికి లోనైనప్పుడు టీనేజర్లు ఏ మాత్రం ఆలోచించకుండా ఎమోషన్‌తో నిర్ణయాలు తీసుకుంటారు. లో సెల్ఫ్ ఎస్టీమ్‌తో ఉంటే వారు మరింతగా స్నేహితుల ఒత్తిడికి లోనవుతారు. పిల్లల్లో ఆత్మగౌరవాన్ని పెంపొందించడం అత్యంత కీలకం. తల్లిదండ్రులు ఆ బాధ్యతను తీసుకోవాలి. పిల్లలు తమ ప్రతిభను గుర్తించేలా చేయాలి, వారి ఆత్మవిశ్వాసాన్ని పెంచాలి. ప్రతిరోజూ వారి అభిరుచులు, కష్టాలను గుర్తిస్తూ విజయం దిశగా వారిని ప్రోత్సహించాలి. తల్లిదండ్రులు చేయాల్సింది..యవ్వనంలో, స్నేహితుల ఒత్తిడి సహజమే. కానీ, మీరు సున్నితంగా, ప్రేమతో పిల్లలకు మార్గనిర్దేశం చేస్తే, వారు సంయమనం, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు. అందుకు మీరు చేయాల్సింది.. పిల్లలకు మీరెప్పుడూ అందుబాటులో ఉంటారని చెప్పాలి. వారు తమ సమస్యలు మీతో పంచుకునేలా నమ్మకాన్ని కలిగించాలి.ఆత్మవిశ్వాసంతో ప్రవర్తించడం, స్నేహితుల ఒత్తిడిని ఎదుర్కొనే నైపుణ్యాలను నేర్పాలి.సోషల్ మీడియా కంటెంట్ గురించి ఓపికగా చర్చించాలి.వారి కృషి, కష్టాలు, ప్రత్యేకతలను గుర్తించి ప్రశంసించాలి.వారు తీసుకునే నిర్ణయాల ఫలితాలను అర్థంచేసుకోవడంలో వారికి సహాయం చేయాలి. -
మైనర్.. డ్రైవింగ్ డేంజర్
సాక్షి, హైదరాబాద్: మైనర్ల డ్రైవింగ్‌పై ఆర్టీఏ కొరడా ఝళిపించింది. పద్దెనిమిదేళ్లలోపు పిల్లలు కార్లు, బైక్‌లు నడిపితే తల్లిదండ్రులు లేదా వాహన యజమానులు మూల్యం చెల్లించుకోవాల్సిందే. గ్రేటర్ పరిధిలో తరచుగా ఎక్కడో ఒకచోట మైనర్ల డ్రైవింగ్ బెంబేలెత్తిస్తున్నాయి. పరిమితికి మించిన వేగంతో వాహనాలు నడుపుతూ ప్రమాదాలకు గురవుతున్నారు. ప్రాణాలు కోల్పోతున్నారు. ట్రాఫిక్ నిబంధనల పట్ల ఎలాంటి అవగాహన లేకుండా వాహనాలు నడిపే మైనర్లు వాహనాలు ఢీకొట్టి ఇతరుల ప్రాణాలను బలిగొంటున్నారు. ఇటీవల కాలంలో తీవ్ర ఆందోళన కలిగిస్తున్న ఈ విపత్కర పరిణామంపై రవాణాశాఖ సీరియస్‌గా దృష్టి సారించింది. మైనర్ల డ్రైవింగ్‌ను అరికట్టేందుకు కఠిన చర్యలు చేపట్టింది. మోటారు వాహన చట్టంలోని సెక్షన్ 199ఏ ప్రకారం మైనర్ల తల్లిదండ్రులు లేదా వాహన యజమానులకు గరిష్టంగా 3 ఏళ్ల వరకు జైలు శిక్ష విధించే అవకాశం ఉంది. అలాగే రూ.25,000 వరకు జరిమానా విధించవచ్చు. ఈ దిశగా కార్యాచరణ చేపట్టినట్లు హైదరాబాద్ సంయుక్త రవాణా కమిషనర్ సి.రమేష్ తెలిపారు. తల్లిదండ్రులు తమ మైనారిటీ పిల్లలకు వాహనాలను అప్పగించి చిక్కులు కొని తెచ్చుకోవద్దని ఆయన సూచించారు. శిక్షలు కఠినంగా ఉంటాయని హెచ్చరించారు. త్వరలోనే ఈ చట్టాన్ని అమలు చేయనున్నట్లు తెలిపారు. హడలెత్తిస్తున్న మైనర్లు.. 👉స్కూల్‌పిల్లలు, మైనారిటీ తీరని ఇంటరీ్మడియట్ స్థాయి పిల్లలు సైతం ఎస్యూవీ వంటి అత్యంత వేగవంతమైన బైక్‌లు, కార్లు నడుపుతున్నారు. పిల్లలకు వాహనాలను ఇవ్వకుండా అడ్డుకోవాల్సిన తల్లిదండ్రులే వారి డ్రైవింగ్ చూసి గర్వంగా భావిస్తున్నారు. కానీ.. ముంచుకొచ్చే ప్రమాదాన్ని గుర్తించడం లేదు. ఇలాంటి వాహనాలను నడుపుతూ పరిమితికి మించిన వేగంతో పరుగులు తీస్తున్నారు. 👉 ఈ ఏడాది జూన్ నెలలో మణికొండ వద్ద ఓ మైనర్ బాలుడు ఎస్యూవీ వాహనం నడుపుతూ పార్క్ చేసిన వాహనాలను ఢీకొట్టాడు. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు. గతంలోనూ నలుగురు పిల్లలు వారిలోఒకరి పుట్టిన రోజు సందర్భంగా కారు తీసుకొని లాంగ్‌డ్రైవ్‌కు వెళ్లి ప్రమాదానికి గురయ్యారు. ఈప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఇప్పటివరకు సాధారణ శిక్షలతో సరి.. 👉 ప్రతి ఏటా పోలీసులు, ఆర్టీఏ సిబ్బంది తనిఖీల్లో సుమారు 2,500 నుంచి 3,000 మంది పిల్లలు వాహనాలు నడుపుతూ పట్టుబడుతున్నట్లు అంచనా. ఇలాంటి సంఘటనల్లో ఇప్పటి వరకు సాధారణ శిక్షలే అమలవుతున్నాయి. తల్లిదండ్రులను పిలిపించి హెచ్చరించి వదిలేస్తున్నారు. జరిమానాలు విధిస్తున్నారు. కానీ ప్రమాదాలు జరిగినప్పుడు మాత్రం తల్లిదండ్రులు బాధ్యత వహించాల్సివస్తోంది. 👉 రెండేళ్ల క్రితం మైనర్ల డ్రైవింగ్ వల్ల 25 ప్రమాదాలు జరిగినట్లు గుర్తించారు. 2023లో 35 ప్రమాదాలు జరిగాయి. ఈ ఏడాది ఇప్పటి వరకు 10 ప్రమాదాలు జరిగినట్లు గుర్తించారు. ఇలాంటి ప్రమాదాలు వాహనాలు నడిపే డ్రైవర్లు, వారితో కలిసి ప్రయాణం చేసేవారు. ఇతర రోడ్డు వినియోగదారులు కూడా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోంది. మైనర్ల డ్రైవింగ్‌పై ఉక్కుపాదం మోపేందుకు ఎంవీ యాక్ట్‌లోని సెక్షన్ 199ఏను సమర్థంగా అమలు కానుంది. 👉 మైనర్లు వాహనాలు నడుపుతూ ప్రమాదాలకు పాల్పడటంతో పాటు బండి నడుపుతూ పట్టుబడినా సరే ఆర్సీ రద్దవుతుంది. ఏడాది పాటు సదరు వాహనం రిజి్రస్టేషన్‌ను రద్దు చేయనున్నారు. దీంతో ఆ వాహనాన్ని వినియోగించేందుకు అవకాశం ఉండదు. పట్టుబడే మైనర్లకు 25 ఏళ్ల వయసు వరకు లెరి్నంగ్, డ్రైవింగ్ లైసెన్సులు జారీ చేయకుండా ఆంక్షలు విధిస్తారు. మోటారు వాహన చట్టంలోని సెక్షన్ 199ఏను సమర్థంగా అమలు చేయాలని కోరుతూ రవాణా కమిషనర్ ఇలంబర్తి ఇటీవల అన్ని జిల్లా, ప్రాంతీయ రవాణా కార్యాలయాల అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. మైనర్ల డ్రైవింగ్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించరాదని తెలిపారు.రహదారి భద్రత ప్రధానం.. రహదారి భద్రత, ట్రాఫిక్ నిబంధనల పట్ల ఎలాంటి అవగాహన లేని పిల్లలు వాహనాలను తీసుకొని రోడ్డెక్కితే చాలా నష్టం జరుగుతుంది. ఆ పిల్లల కుటుంబాలే కాకుండా సమాజం కూడా ఆ నష్టాన్ని ఎదుర్కోవాల్సి వస్తోంది. తల్లిదండ్రులు, పెద్దలు ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ పిల్లలకు వాహనాలను ఇవ్వకూడదు. – సి.రమేష్, ట్రాన్స్పోర్ట్ జాయింట్ కమిషనర్, హైదరాబాద్ -
అమ్మా.. నాన్నా అంత భారమయ్యానా..
తల్లిదండ్రుల నిర్లక్ష్యం అభంశుభం తెలియని బాలుడికి శాపంగా మారింది. అమ్మానాన్నల సంరక్షణలో ఆనందంగా గడవాల్సిన బాల్యం.. ఎవరూ లేని అనాథలా వెక్కిరించింది. కనిపెంచిన పేగుబంధమే.. వదిలించుకోవాలని చూసింది.. అన్నీతానై వ్యవహరించాల్సిన తండ్రి తనకేం సంబంధం లేదు.. అన్నట్లుగా వ్యవహరించాడు. ఫలితంగా మూడేళ్ల పాటు ట్రస్టులో ఆశ్రయం పొంది, రెండు రోజుల క్రితమే సొంతూరు చేరుకున్న ఓ బాలుడి భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది. దోమ: మండల కేంద్రానికి చెందిన బొక్క బాబు, యాదమ్మ దంపతులకు భరత్ అనే కు ఏడేళ్ల కుమారుడున్నాడు. అన్యోన్యంగా సాగిపోతున్న వీరి జీవితంలో అనుకోని కలహాలు చెలరేగాయి. దీంతో ఇంటి నుంచి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్న యాదమ్మ కొడుకును నీవద్దే పెంచుకో.. అని భర్తకు సూచించింది. ఇందుకు బాబు అంగీకరించలేదు. చేసేదేమి లేక ఎనిమిదేళ్ల భరత్‌ను తీసుకుని బతుకుదెరువు కోసం బయలుదేరింది. హైదరాబాద్ చేరుకుని రెండేళ్ల పాటు కూలీనాలీ పనులు చేసుకుంటూ కొడుకును సాకింది. ఆతర్వాత విజయవాడకు చేరుకుంది. ఈ సమయంలో ఆ తల్లి హృదయం పాశానంగా మారింది. నాకే దిక్కు లేదు.. వీడిని ఎలా చూసుకోవాలి అనుకుందో ఏమో.. పదేళ్ల పసి బాలుడిని వదిలించుకోవాలని డిసైడైంది. విజయవాడ రైల్వే స్టేషన్లో కొడుకును వదిలేసి, తన దారిన తాను వెళ్లిపోయింది. అమ్మ జాడ తెలియక వెక్కివెక్కి ఏడుస్తున్న ఆ బాలుడు భయంభయంగా రైల్వే స్టేషన్‌లోని ఓ మూలన కూర్చుండిపోయాడు. ఏడ్చిఏడ్చి కళ్లలో నీళ్లు ఇంకిపోయాయి.. అమ్మకు ఏమైందో..? ఎటు వెళ్లిపోయిందో తెలియని పరిస్థితి. ఏవైపు నుంచి వస్తుందోనని ఆత్రుతగా చూడటమే తప్ప.. అమ్మ రాలేదు.. ఏడుపు ఆగలేదు. ఇది గమనించిన ప్రయాణికులు స్టేషన్లో ఓ బాలుడు ఒంటరిగా ఏడుస్తున్నాడని విజయవాడ చైల్డ్‌లైన్ సిబ్బందికి సమాచారం అందించారు. వారు వచ్చి.. మీది ఏ ఊరు, మీ అమ్మానాన్నల పేర్లు ఏంటి అని ప్రశ్నించినా.. బాలుడి నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. దీంతో చిన్నారిని తీసుకెళ్లిన చైల్డ్‌లైన్ సిబ్బంది విజయవాడలోని ఎస్కేవీ ట్రస్ట్‌లో చేర్పించారు. ఇది జరిగి మూడేళ్లు గడిచింది. ఈ మధ్యకాలంలో ట్రస్టు ప్రతినిధులు ఎన్నిసార్లు అడిగినా భరత్ మాత్రం తన ఊరు, తల్లిదండ్రుల వివరాలు చెప్పలేదు. వారం రోజుల క్రితం భరత్‌తో మాట్లాడిన ట్రస్టు సభ్యులకు.. వికారాబాద్ దగ్గర దోమ గ్రామమని చెప్పాడు. దీంతో పూర్తి వివరాలు తెలుసుకున్న ట్రస్టు ప్రతినిధులు శుక్రవారం బాలుడిని తీసుకుని దోమకు చేరుకున్నారు. కన్నకొడుకు తిరిగొచ్చినా.. ప్రస్తుతం భరత్ వయసు పదమూడేళ్లు.. ఐదేళ్ల తర్వాత కన్నకొడుకును చూసిన ఆ తండ్రిలో ఏమాత్రం చలనం కనిపించలేదు. భార్య, కొడుకు ఇంటినుంచి వెళ్లిపోయిన రోజునుంచి ఒక్కసారి కూడా వారిని వెతికే ప్రయత్నం చేయలేదు. కనీసం వారు బతికే ఉన్నారా..? లేదా..? అనే సమాచారం కూడా తెలియదు. ఈ విషయమై పోలీస్ స్టేషన్లోనూ ఎటువంటి ఫిర్యాదు చేయలేదు. ఇవన్నీ పక్కన పెట్టినా.. నా కొడుకు తిరిగొచ్చాడు.. అని బాలుడిని చేరదీయలేదు.. ముద్దాడలేదు. ఇది గమనించిన స్థానికులు, పోలీసులు బాబుకు సర్దిచెప్పి.. భరత్‌ను అప్పగించారు. దీంతో తప్పదు అన్నట్లు కొడుకును దగ్గరకు తీసుకున్నాడు. తన దారిన వెళ్లిపోయిన తల్లి కుటుంబ కలహాలతో భర్తకు దూరమై, కొడుకును వదిలేసిన యాదమ్మ తనదారి తాను చూసుకుంది. ఆమె ప్రస్తుతం విజయవాడలోనే ఉన్నట్లు తెలిసింది.ప్రశ్నార్థకంగా మారిన భవిష్యత్ అటు తల్లి దూరమై.. ఇటు తండ్రి ఆలనాపాలనా కరువైన భరత్ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. స్థానిక నాయకులు, ఎస్కేవీ ట్రస్ట్ ప్రతినిధుల సహకారంతో బాలుడిని వికారాబాద్‌లోని గురుకుల పాఠశాలలో చేర్పించారు. దాతలు, స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు ముందుకు వచ్చి భరత్ బాధ్యతలు తీసుకోవాలని, లేదా ప్రభుత్వం తరఫున చేయూత అందేలా చూడాలని సర్పంచ్ల సంఘం మండల మాజీ అధ్యక్షుడు రాజిరెడ్డి, గ్రామస్తులు కోరారు. బాగా చదువుకుంటానా చిన్నప్పుడు అమ్మానాన్నా నన్ను బాగా చూసుకునేవారు. ఇప్పుడు వారికి నాపై ఎలాంటి ప్రేమ లేదు. ఇద్దరూ నన్ను దూరం పెట్టేందుకే ప్రయతి్నస్తున్నారు. అమ్మ నన్ను వదిలి వెళ్లిన రోజు గుర్తొస్తేనే భయమేస్తోంది. చైల్డ్‌లైన్ వారు వచ్చి వివరాలు అడిగినా భయంతో ఏమీ చెప్పలేకపోయా. ఇప్పుడు కొంత ధైర్యం వచ్చి నా వివరాలు తెలియజేశా. దీంతో నన్ను నాన్న దగ్గరకు తీసుకువచ్చారు. కానీ ఆయనేమో నన్ను ఆదరించడం లేదు. అందరూ వచ్చి వికారాబాద్‌లోని రెషిడెన్షియల్ పాఠశాలలో చేర్పించారు. ఇకనుంచి బాగా చదువుకునేందుకు ప్రయతి్నస్తా. – భరత్‌కుమార్ -
అమ్మానాన్నను విడిచి ఉండలేక.. జడ రిబ్బనతో చిన్నారి ఆత్మహత్య
శ్రీకాకుళం: జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. తల్లిదండ్రుల్ని విడిచి పెట్టి ఉండలేక ఏడవ తరగతి విద్యార్థిని తనువు చాలించింది. పాతపట్నం నియోజకవర్గంలోని మెలియపుట్టి ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్లో లావణ్య ఏడవ తరగతి చదువుతుంది.అయితే ఇటీవల దసరా సెలవులకు ఇంటికి వెళ్లిన లావణ్యను గురువారం ఆమె తల్లిదండ్రులు స్కూల్లో విడిచి పెట్టి ఇంటికి వెళ్లారు. దీంతో తల్లిదండ్రుల్ని విడిచి పెట్టి దూరంగా ఉండలేక లావణ్య మనోవేధనకు గురైంది. తల్లిదండ్రులు వెళ్లిన గంట తర్వాత జడ రిబ్బన తో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. తోటి విద్యార్థులు టీచర్‌కు సమాచారం అందించారు. వెంటనే ఉపాధ్యాయులు అత్యవసర చికిత్స కోసం ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ చిన్నారిని పరీక్షించిన వైద్యులు చనిపోయినట్లు నిర్ధారించారు.ఈ విషాదంపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. -
మాతృవందనమ్
గృహస్థాశ్రమంలో నిత్యం జరిగే పంచ మహా యజ్ఞాలలో మొదటిది అధ్యాపనం కాగా రెండవది– పితయజ్ఞస్య తర్పణం. మనకు ముందుపుట్టి మనకు జన్మనిచ్చిన వాళ్లున్నారు... తల్లిదండ్రులు. లోకంలో ఎవరి రుణం అయినా తీర్చుకోగలమేమో కానీ తల్లిదండ్రుల రుణం తీర్చుకోలేం అంటారు రామచంద్రమూర్తి రామాయణంలో. . సౌత్రామణి అని ఒక యాగం. అది చేస్తే పితరుణం తీరుతుంది. కానీ మాతరుణం ? ఎవ్వరికీ సాధ్యం కాదు.రుణం తీరడం లేదా తీర్చుకోవడమంటే ??? నీ జన్మ చరితార్థం కావాలంటే... గహస్థాశ్రమంలో తల్లిదండ్రులకు నమస్కరించి సేవచేయడమే. శంకరో తీతి శంకరః..శంకరుడు ప్రతి ఇంటా ఉన్నాడు... తండ్రి రూపంలో.. అంటే కన్న తండ్రి సాక్షాత్ పరమ శివుడే. తండ్రికి ప్రదక్షిణం చేసి నమస్కరిస్తే పరమశివుడికి ప్రదక్షిణం చేసి నమస్కరించినట్లే. తల్లికయినా అంతే...‘‘భూప్రదక్షిణ షష్టే్కన కాశీయాత్రాయుతేనచ /సేతుస్నాన శతైర్యశ్చ తత్ఫలం మాతవందనే’’ అంటూ గహస్థాశ్రమంలో ఉన్నవాడికి ఇంత వెసులుబాటు కల్పించింది శాస్త్రం. అమ్మకు నమస్కరిస్తే... ఆరుసార్లు భూమండలాన్ని ప్రదక్షిణం చేసినట్లు, 10వేల సార్లు కాశీయాత్ర చేసినట్లు, నూరు పర్యాయాలు సేతుస్నానం చేసినంత ఫలం దక్కుతుందన్నది. అందువల్ల కంటిముందు కనిపించే దేవతలయిన అమ్మానాన్నల విషయంలో గహస్థు తన కర్తవ్యాన్ని తాను నిర్వహిస్తే ఈశ్వరుడు ప్రీతి పోందుతాడు. ఎవరు ఏది చేయాలో అది నిజాయితీగా చేయాలి.తల్లిదండ్రులు ఉన్నప్పుడో లేనప్పుడో నీ వాటా ఆస్తులు లేదా వారికోసం నీవు పెట్టే ఖర్చులు లెక్కలు వేసుకోవడం కాదు... వారు నీకిచ్చిందేమిటన్నది ద్రవ్య రూపంలో లెక్కలేసుకోకు. సంతోషంగా నువ్వు నూరేళ్ళు పిల్లా΄ాపలతో హాయిగా ఉండాలని తప్ప వారు నీనుంచి ఆశిందేముంటుంది ? నాకు తెలిసిన ఒక మిత్రుడి తల్లి చనిపోతే ... ఆస్తుల వాటా ప్రస్తావన వచ్చినప్పడు నీవాటాకేం వచ్చిందంటే... రాలేదు.. నేనే తీసుకున్నా..అన్నాడు. ఏమిటవి అని అడిగితే.. అమ్మ వాడిన చెప్పులు, కళ్ళద్దాలు.. అన్నాడు... అమ్మ వాడిన అద్దాలు నా గుండెమీద పెట్టుకుంటే అమ్మ నన్ను చూస్తూ ఉన్నట్టే ఉంటుంది.. అమ్మ వాడిన అరిగిపోయిన చెప్పులు... నాకోసం ఆమె అరగదీసుకున్న, కరగదీసుకున్న జీవితాన్ని గుర్తుకు తెస్తుంటుంది... అన్నాడు... ఇవి చాలవూ నాకు... అమ్మ పోయినా ఆమెను రోజూ చూసుకోవడానికి.. అన్నాడు. అదీ కతజ్ఞత. అందుకే వారు చనిపోయిన రోజున పరమ భక్తితో, గౌరవంతో తోడబుట్టినవారందరూ కలిసి తల్లిదండ్రులను స్మరించుకోవడానికే శ్రాద్ధం, తద్దినం ఆచారంగా మారింది. అది శ్రద్ధతో చేయాల్సిన పని కాబట్టి శ్రాద్ధం అయింది. అంతేగానీ దానికి ఫలానా వస్తువులే ఉండితీరాలన్న నియమాలేమీ లేవు...రామాయణంలో...రాముడు గారపిండి ముద్దలు తీసుకెళ్ళి తండ్రి దశరథుడిని స్మరించి పితదేవతలకు పిండం పెట్టాడు. కౌసల్యాదేవి అటుగా వెడుతూ చూసి భోరున ఏడ్చింది. అంటే యజమాని ఏది తింటే పితదేవతలకు అదే పెట్టాలంది శాస్త్రం. రాముడు ఆ సమయంలో అదే తింటున్నాడు కాబట్టి అదే పెట్టాడు. కావలసింది శ్రద్ధ. అందువల్ల గహస్థు తన విహిత కర్తవ్యాన్ని నిర్వర్తించాలి. అది తర్పణం. అది మహా యజ్ఞం. గృహస్థు చేయాల్సిన పంచమహా యజ్ఞాలలో ఇది ఒకటి. -
ఓపికతో పెంచండి ఒడిలో పిడుగులు
‘పిల్లలు పైకి కనిపించేటంత సున్నితమైన వాళ్లు కాదు. వాళ్లను డీల్ చేయడం కత్తిమీద సామే. పిల్లలను అర్థం చేసుకోవడంలో విఫలమవుతున్నామా లేక పిల్లలకు అర్థమయ్యేటట్లు చెప్పడంలో విఫలమవుతున్నామా?’ పిల్లలపెంపకంలో కొత్తతరం ఎదుర్కొంటోన్న ప్రధాన సమస్య ఇది. తల్లిదండ్రులు తమ బాధ్యతను సక్రమంగా నిర్వహించడంలో నైపుణ్యాన్ని అలవరుచుకోవాలని చెప్పారు హైదరాబాద్‌కు చెందిన ఫ్యామిలీ కౌన్సెలర్ చెరువు వాణీమూర్తి. ఆమె గమనించిన అనేక విషయాలను సాక్షి ఫ్యామిలీతో పంచుకున్నారు.ప్లానింగ్ ఉంటోంది... కానీ! ఈ తరం పేరెంట్స్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నప్పటి నుంచే పిల్లల పెంపకం గురించి కచ్చితంగా ఉంటున్నారు. మంచి భవిష్యత్తు అందివ్వాలని, చక్కగా పెంచి ప్రయోజకులను చేయాలని కలలు కంటారు. ఎదురు చూసిన బిడ్డ చేతుల్లోకి వస్తుంది. వేడుకలతో బిడ్డను ఈ ప్రపంచంలోకి స్వాగతించిన పేరెంట్స్ కూడా పెంచడంతో తమ బాధ్యతల్ని సక్రమంగా నిర్వర్తించలేక స్ట్రెస్‌కు లోనవుతున్నారు. ఆనందం వర్సెస్ సవాల్! పిల్లల పెంపకం తల్లిదండ్రులకు గొప్ప ఆనందం. అదే సమయంలో పెద్ద సవాల్ కూడా. అవగాహన లేకపోవడం వల్ల పేరెంటింగ్‌ను మోయలేని బాధ్యతగా భావిస్తున్నారు. పిల్లల విషయంలో తాము శారీరకంగా, మానసికంగా, ఎమోషనల్‌గా ఆరోగ్యంగా ఉన్నామా లేదా అని గమనించుకోలేకపోతున్నారు. పిల్లలకు చిన్నప్పుడే ఎన్నో సంగతులు చెప్పేయాలని వారి వయసుకు మించిన జ్ఞానాన్ని బుర్రలో చొప్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఆ మేరకు గ్రాహక శక్తి పిల్లలకు ఉందా లేదా అనే విషయాన్ని గ్రహించలేకపోతున్నారు.క్వాలిటీ టైమ్ ఇవ్వాలి! టీవీ, ఫోన్, సోషల్ మీడియాతో కాలక్షేపం చేయకుండా పిల్లలతో మాట్లాడుతూ, వారితో ఆడుకోవాలి. ప్రతి చిన్న సమస్యకీ పరిష్కారాల కోసం యూ ట్యూబ్‌లో వెతికి, అవి తమకు వర్తించకపోతే సరిగ్గా పెంచలేకపోతున్నామని ఒత్తిడికి లోనవుతుంటారు. పిల్లల పెంపకంలో కొన్ని బాధ్యతలను గ్రాండ్ పేరెంట్స్‌కి కూడా పంచాలి. కొంతమంది... పిల్లలు తమకు మాత్రమే సొంతమని, తమ పిల్లల బాధ్యత పూర్తిగా తమదేనని, ఎవరి సాయమూ తీసుకోకుండా తామే చక్కబెట్టుకోవాలనుకుంటున్నారు. ఆ ధోరణి మార్చుకోవాలి. మరికొంతమందిలో తమకు అన్నీ తెలుసని, ఎవరూ ఏమీ చెప్పాల్సిన అవసరం లేదనే పెడధోరణి కూడా కనిపిస్తోంది. అది కూడా మంచిది కాదు. అన్నీ తెలిసిన వాళ్లు ఎవరూ ఉండరు. తెలుసుకుంటూ ముందుకు సాగాలి.పంచుకుంటూ పెంచాలి! చిన్న చిన్న విషయాలకు కూడా ఎక్కువగా ఆలోచించడం వల్ల ఒత్తిడికి లోనవుతున్నారు. ఇవన్నీ సాధారణమేనని, పెంపకంలో ఇలాంటి ఒత్తిడులు ఉంటాయని ముందుగానే అవగాహన ఉండాలి. తల్లిదండ్రులిద్దరూ పిల్లల బాధ్యతను పంచుకుంటే ఇద్దరూ పెంపకాన్ని ఆస్వాదించవచ్చు. పిల్లలకు ప్రతి దశలోనూ తలిదండ్రుల సపోర్ట్, గైడెన్స్ అవసరమే. ఏ దశలో ఎలాంటి సపోర్ట్ ఇవ్వాలో పేరెంట్స్ తెలుసుకుని, తాము నేర్చుకుంటూ ముందుకు సాగుతుంటే స్ట్రెస్‌కు లోనుకాకుండా పేరెంటింగ్‌ని ఆస్వాదించగలుగుతారు. లెర్నింగ్ మైండ్ ఉంటే ఇది సాధ్యమే.– వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధికలిసి ప్రయాణించాలి! పేరెంటింగ్ అంటే పిల్లల పసితనం, బాల్యం, కౌమారం... ప్రతి దశల్లోనూ వారితో కలిసి సాగాల్సిన ప్రయాణం. తలితండ్రులు, పిల్లలు కలిసి చేయాల్సిన ప్రయాణం ఇది. ఈ ప్రయాణాన్ని సులభతరం చేసుకోవాలంటే తల్లిదండ్రులు– పిల్లల మధ్య రిలేషన్ గట్టిగా ఉండాలి. పిల్లలను బేషరతుగా ప్రేమను పంచుతున్నామా, వారి పట్ల కరుణతో ఉంటున్నామా, తమ పరిధులను, అభిరుచులను వారి మీద రుద్దుతున్నామా, ఇతర పిల్లలతో పోలుస్తూ తక్కువ చేయడం లేదా ఎక్కువ చేయడం వంటి పొరపాటు చేస్తున్నామా... అనే ప్రశ్నలు వేసుకోవాలి. పిల్లలు ఏ చిన్న తప్పు చేసినా, వారికి ఏ చిన్న సమస్య ఎదురైనా తాము పెంపకంలో విఫలమవుతున్నామేమోనని అపరాధభావానికి లోనుకావాల్సిన అవసరమే లేదు. -
విడాకుల తరువాత పిల్లలకు తండ్రి ఆస్తిలో వాటా వస్తుందా?
పెళ్లయినప్పటినుంచి భర్త వేధింపులు తప్పడం లేదు. పిల్లలు పుట్టి వాళ్లు కాస్త పెద్దవాళ్లయినా మారలేదు సరి కదా, ఇంకా ఎక్కువైంది. ఇంక భరించలేక విడిపోతున్నాను. నాకు, నా పిల్లలకు ఆస్తిలో వాటా వస్తుందా? – పి. అనిత, నెల్లూరుసాధారణంగా స్థిరాస్తులు ఎవరి పేరుతో అయితే ఉంటాయో వారికి మాత్రమే చెందుతాయి వారి స్వార్జితం కిందనే పరిగణించ బడతాయి. కానీ అన్నివేళలా అదే నియమం వర్తించదు. భార్యకు భర్త ఆస్తిలో హక్కు ఉందా లేదా అనే అంశం భర్త మతాచారంపై ఆధారపడి ఉంటుంది. హిందువులకు వర్తించే చట్టాల ప్రకారం మీ భర్త పేరిట ఉన్న ఆస్తి వారసత్వం ద్వారా సంక్రమించింది అయితే గనక అందులో మీ పిల్లలకు పూర్తి హక్కు ఉంటుంది. మీ పిల్లలు మైనర్లు అయితే వారి తరఫున మీరు సివిల్ కోర్టును ఆశ్రయించవచ్చు. మీ పిల్లలకి వారి వాటా వారికి దక్కుతుంది. అదే మీ భర్త స్వార్జితం అయితే మాత్రం తన తదనంతరం వీలునామా ప్రకారం, వీలునామా లేని పక్షంలో హిందూ వారసత్వ చట్టం ప్రకారం లేదా భర్త జీవితకాలంలో స్వయంగా ఇవ్వాలి అని తలిస్తే మాత్రమే భార్యకి హక్కులు ఉంటాయి.మరో విషయం... భార్యకు తన జీవితకాలం మొత్తం భర్త ఇంట్లో ఉండే హక్కు ఉంటుంది. అలాగే మెయింటెనెన్స్ లేదా విడాకులు తీసుకునే సమయంలో భర్త ఆస్తిలో భార్యకు వాటా వచ్చే అవకాశం ఉంది. ఎంత శాతం వాటా ఇవ్వాలి అనేది అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. హిందూ లా, ముస్లిం లా, క్రిష్టియన్ లా, ఇలా వేర్వేరు మతస్తులకు వేరే విధమైన హక్కులు ఉంటాయి.మీరు భర్త వేధింపులు తట్టుకోలేక విడి΄ోతున్నాను అని చె΄్పారు కాబట్టి, డీ.వీ.సీ. చట్టం (గృహ హింస నుంచి మహిళల రక్షణ చట్టం, 2005) కింద కేసు వేసినట్లయితే, అందులో అనేక రకాల హక్కులను, ఉపశమనాలను పొందవచ్చు. కేసు తేలేంతవరకు మీ భర్త ఆస్తులను అమ్మకుండా కోర్టు వారు స్టే విధించే అవకాశం కూడా ఉంది. డీ.వీ.సీ. చట్టం సెక్షన్ 22 ప్రకారం అదనపు దరఖాస్తు చేసుకుంటే, మీరు కోరిన ఉపశమనాలతో పాటు మానసిక హింస, మానసిక క్షోభతో సహా మీకు కలిగిన గాయాలకు కూడా నష్టపరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశించవచ్చు. డీ.వీ.సీ. చట్టం ప్రకారం భర్త ఆస్తి పై కేసు వేసే వీలుందా లేదా అన్నది ప్రతి కేసులోనూ విభిన్నంగా ఉంటుంది. కాబట్టి మీ దగ్గరలో ఉన్న లాయర్ని సంప్రదిస్తే మంచిది.– శ్రీకాంత్ చింతల , హైకోర్టు న్యాయవాది -
సెలబ్రిటీలు.. వారి గ్రాండ్ పేరెంట్స్ మరిచిపోలేని బంధం (ఫోటోలు)
-
హృదయ విదారకం.. ‘బిడ్డల మృతదేహాలను భుజాన వేసుకుని’
భార్య శవాన్ని భుజాన మోసుకొని వెళ్లిన భర్త.. కొడుకు మృతదేహాన్ని చేతలపై తీసుకెళ్లిన తండ్రి.. ఇలాంటి వార్తలను అప్పుడప్పుడూ పేపర్లు,టీవీల్లో చూస్తుంటాం. ప్రైవేట్ అంబులెన్స్‌లకు డబ్బులు ఇవ్వలేక.. ప్రభుత్వ ఆస్పత్రులను అంబులెన్స్‌లను పంపించక.. కొందరు అభాగ్యులు.. భుజాలపైనా తమ అయినవారి మృతదేహలను తీసుకెళ్లిన ఘటన గతంలో పలు చోట్ల జరిగాయి. ఈ కాలంలోనూ ఇలాంటి ఘటనలు జరగడం శోచనీయం. తాజాగా మహారాష్ట్రలో హృదయ విదారక దృశ్యాలు వెలుగుచూశాయి. గడ్చిరోలి జిల్లా అహేరి తాలూకాలో ఓ తల్లిదండ్రులు తమ ఇద్దరు కుమారుల మృతదేహాలను భుజాలపై మోసుకుంటూ తీసుకెళ్లడం పలువురిని కంటతడి పెట్టిస్తోంది. సరైన సమయంలో వైద్యం అందకపోవడంతో తీవ్రమైన జ్వరంలో బాలురు మరణించారు. దీంతో ఆసుపత్రి నుంచి 15 కి.మీ దూరంలో ఉన్న తమ గ్రామానికి మృతదేహాలను భుజాలను మోసుకెళ్లారు. 10 ఏళ్ల కంటే తక్కువ వయసున్న ఇద్దరు మైనర్ బాలుర మృతదేహాలపే ఓ జంట వారి భుజాలపై మోసుకెళ్తూ బురదతో కూడిన అటవీ మార్గం గుండా వెళ్తున్న వీడియోను అసెంబ్లీలో ప్రతిపక్ష నేత విజయ్ వాడెట్టివార్ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దీంతో ఈ వీడియో వైరల్‌గా మారింది.‘ఇద్దరు సోదరులు జ్వరంతో బాధపడుతున్నారు. అయితే వారికి సకాలంలో చికిత్స లభించలేదు. కొన్ని గంటల్లోనే వారి పరిస్థితి క్షీణించింది. గంటల వ్యవధిలో ఇద్దరు బాలురు మరణించారు. వారి మృతదేహాలను స్వగ్రామమైన పట్టిగావ్‌కు తరలించడానికి కూడా అంబులెన్స్ లేదు. తల్లిదండ్రులు వర్షంలో తడిసిన బురద మార్గం గుండా 15 కిలోమీటర్లు నడవవలసి వచ్చింది. గడ్చిరోలి ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ యొక్క భయంకరమైన వాస్తవికత ఈ రోజు మళ్లీ తెరపైకి వచ్చింది.’అంటూ వాడెట్టివార్ విషాదానికి సంబంధించిన వీడియోను పోస్ట్ చేశారు.‘గడ్చిరోలి జిల్లాకు డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఇంచార్జ్ మంత్రిగా ఉన్నారు. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ధర్మారావు బాబా అత్రమ్ మంత్రిగా ఉన్నారు. ఇద్దరు మంత్రులు రాష్ట్రమంతటా కార్యక్రమాలు నిర్వహిస్తూ మహారాష్ట్ర ఎలా అభివృద్ధి చెందుతుందో వాదిస్తున్నారని కాని గ్రౌండ్ లెవల్‌కి వెళ్లి గడ్చిరోలిలో ప్రజలు ఎలా జీవిస్తున్నారో, అక్కడ ఎలా మరణాలు సంభవిస్తున్నాయో తెలుసుకోవడం లేదు.’ అని మండిపడ్డారు.అయితే విదర్భ ప్రాంతంలో ఇలాంటి ఘటన జరగడం ఇది రెండోవది. సెప్టెంబరు 1న ఒక గర్భిణీ గిరిజన మహిళ తన ఇంటి వద్ద చనిపోయిన బిడ్డను ప్రసవించింది. స్థానిక ఆసుపత్రికి ఆమెను సమయానికి తీసుకువెళ్లడానికి అంబులెన్స్‌ను రాకపోవడంతో నొప్పులతో తనువు చాలించింది. -
పోలీసులు మాకు లంచం ఇవ్వాలనుకున్నారు: వైద్యురాలి తల్లిదండ్రులు
కోల్‌కతాలోని ఆర్జీకర్ ఆసుపత్రిలో వైద్యురాలిపై హత్యాచారం ఘటన రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. ఇప్పటికే ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ.. పలువురిని అరెస్ట్ చేస్తూ విచారణను వేగవంతం చేసింది. మరోవైపు బాధితురాలికి త్వరగా న్యాయం జరగాలని డిమాండ్ చేస్తూ వైద్య విద్యార్ధులు, పలు సంఘాల నిరసనలు పెరిగిపోతున్నాయి.తాజాగా మృతురాలి తల్లిదండ్రులు రాష్ట్ర పోలీసులపై సంచలన ఆరోపణలు చేశారు. ఈ కేసును అణిచివేసేందుకు పోలీసులు తమకు లంచం ఇవ్వాలని చూశారని ఆరోపించారు. కేసును తప్పుదోవ పట్టించేందుకు పోలీసులు ప్రయత్నించారని, సమగ్ర దర్యాప్తు లేకుండా కేసును మూసివేయడానికి యత్నించారని మండిపడ్డారు.జూనియర్ డాక్టర్లు చేస్తున్న నిరసనల్లో పాల్గొన్న బాధితురాలి తల్లిదండ్రులు మాట్లాడుతూ.. ‘పోలీసులు మొదటి నుంచి కేసును మూసివేయడానికి ప్రయత్నించారు. మృతదేహాన్ని చూడటానికి మాకు అనుమతి లేదు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం పరీక్షల కోసం తీసుకెళ్లేటప్పుడు పోలీస్ స్టేషన్లో వేచి ఉండాల్సి వచ్చింది. హడావుడిగా మా కుమార్తె దహన సంస్కారాలు పూర్తి చేయించారు.మృతదేహాన్ని మాకు అప్పగించినప్పుడు, ఒక సీనియర్ పోలీసు అధికారి మాకు డబ్బును ఆఫర్ చేశారు. కానీ మేము వెంటనే దానికి తిరస్కరించాం. మా కుమార్తెకు న్యాయం చేయాలంటూ జూనియర్ డాక్టర్లు చేస్తున్న పోరాటానికి మద్దతుగా ఈ నిరసనలో పాల్గొంటున్నాం.’అంటూ బాధితురాలి తండ్రి పేర్కొన్నారు.కాగా ఈ కేసును తొలుత కోల్‌కతా పోలుసు దర్యాప్తు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పోలీసులపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేసు దర్యాప్తులో పోలీసులు విఫలమయ్యారంటూ వైద్యులు, ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ఈ క్రమంలోనే కేసును కోల్‌కతా హైకోర్టు సీబీఐకి అప్పగించింది. ఘటన చోటుచేసుకున్న ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్‌ను అరెస్ట్ చేసింది. నిందితుడితోపాటు మరికొంతమందికి పాలీగ్రాఫ్ పరీక్షలు నిర్వహించారు.మరోవైపు అత్యాచార దోషులకు మరణశిక్ష విధించేలా పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఈ వారం అత్యాచార నిరోధక బిల్లును ఆమోదించింది. -
తల్లిదండ్రులే.. టెక్ గురువులు!
ఆఫ్‌లైన్‌లో బాలికలు/మహిళలపై జరుగుతున్న దారుణాలను మించి ఆన్లైన్లో చోటుచేసుకుంటున్నాయి అంటున్నారు సైబర్ నిపుణులు. ప్రతి పది మంది బాలికల్లో ఒకరు సైబర్ బెదిరింపులకు గురవుతున్నారని, మహిళలను లక్ష్యంగా చేసుకొని నేరాలకు పాల్పడుతున్నారని చెబుతున్నారు. తల్లిదండ్రులే ఆన్లైన్ గురువులుగా మారి బాలికలకు అవగాహన కల్పించాల్సిన అవసరం నేటి రోజుల్లో ఎంతో ఉంది.సైబర్ నేరస్థులు ప్రధానంగా బాలికలు, మహిళలనే లక్ష్యంగా చేసుకుంటున్నారని నివేదికలు సూచిస్తున్నాయి. నేరస్థులు బాలికలు, మహిళల చిరునామాలు, ఆర్థిక వివరాలు, వ్యక్తిగత సంభాషణల వంటి సున్నితమైన సమాచారాన్ని సేకరిస్తుంటారు. బాధితులు తమ డిమాండ్లను ఒప్పుకోకపోతే బాలికలు/మహిళల వ్యక్తిగత డేటాను బయటపెడతామని, అందరిలో పరువు పోతుందని నేరస్థులు బెదిరిస్తుంటారు. దీంతో ఎవరికీ చెప్పుకోలేక బాలికలు/మహిళలు నేరస్థులకు డబ్బులు పంపడం లేదా ఆత్మహత్య చేసుకోవాలనే నిర్ణయాలకు రావడం జరుగుతుంటుంది. చాలా మంది బాధిత మహిళలు ఇలాంటి విషయాలు బయటకు చెప్పుకోవడానికి, పోలీసులకు కంపై్టంట్ చేయడానికి ఇష్టపడరు. ఇలాంటప్పుడు సైబర్ నేరాల పట్ల అవగాహన కల్పించేందుకు పెద్దలు కృషి చేయాల్సిన అవసరం ఉంది.టెక్నాలజీని పేరెంట్స్ నేర్చుకోవాలి... – పిల్లలను టెక్నాలజీ వాడకుండా అడ్డుపడకూడదు. పాజిటివ్ కోణంలోనే పిల్లలకు టెక్నాలజీని నేర్పాలి. పిల్లలతో పాటు పెద్దలూ టెక్నాలజీ జర్నీ చేయాలి. – పిల్లలకు ఫోన్ ఇవ్వడంతో పాటు ఒక హద్దును సృష్టించాలి. అదే సమయంలో వయసును బట్టి ఫిల్టరింగ్ సాఫ్ట్‌వేర్స్‌ను వాడాలి.– క్రీడల్లో కొన్ని బౌండరీస్ ఎలా ఉంటాయో టెక్నాలజీ బౌండరీస్‌ను పెద్దలే గీయాలి.– టెక్ఫోన్ ఫ్రీ జోన్స్ నిబంధనలను అమలు చేయాలి. (బెడ్రూమ్, డైనింగ్ ప్లేస్.. వంటి చోట్ల ఫోన్ వాడకూడదు..)– YAPPY (యువర్ అడ్రస్, యువర్ ఫుల్‌నేమ్, యువర్ పాస్‌పోర్ట్...ఇలా పూర్తి వివరాలు) ఆన్లైన్లో ఎవరికీ ఇవ్వకూడదని చెప్పాలి.– ఫొటోలు/డాక్యుమెంట్స్ డౌన్లోడ్ చేసుకునే ముందు నిజనిర్ధారణ చేసుకోవాలి. డౌన్‌లోడ్స్‌కి వెళ్లకూడదు ∙పనిష్మెంట్గా లేదా రివార్డ్గానూ ఫోన్/ట్యాబ్.. వంటి ఎలక్ట్రానిక్ ఐటమ్స్ పిల్లలకు ఇవ్వకూడదు.– స్క్రీన్ టైమ్– గ్రీన్ టైమ్‌కి తేడా తెలియాలి. వర్చువల్ గేమ్స్, గ్రౌండ్ గేమ్స్‌కి కండిషన్స్ పెట్టాలి ∙వయసుకు తగ్గట్టుగా ఆడే ఆన్లైన్ గేమ్స్‌కి కొన్ని కంట్రోల్స్ ఉంటాయి. వాటిని పాటించేలా జాగ్రత్తపడాలి.మనో ధైర్యాన్ని పెంచుకోవాలి..ఏవరైనా వ్యక్తితో ఇబ్బంది ఉంటే ఆ వ్యక్తి అకౌంట్‌ని బ్లాక్ చేయాలి ∙మనోధైర్యాన్ని పోగొట్టుకోకుండా ఏవైనా వీడియోలు, ఫొటోలు, చాటింగ్ సంభాషణ ... వంటివి ఉంటే డిలీట్ చేయకుండా బ్యాకప్ స్టోరీజే చేసుకోవాలి. పెద్దలతో మాట్లాడి https://cybercrime.gov.inలో కంప్లైంట్ చేయాలి.బొట్టు బిళ్లతో కవర్ చేయాలి...∙ఏదైనా వెబ్సైట్ https:// (ప్యాడ్‌లాక్ సింబల్ ఉన్న సైట్‌నే ఓపెన్ చేయాలి. పాస్వర్డ్ ఎప్పుడూ (క్యాపిటల్, స్మాల్ లెటర్స్, నంబర్స్) ఉండే విధంగా సెట్ చేసుకోవాలి ∙ఫోన్ ఇతర గ్యాడ్జెట్స్ లొకేషన్ ఎప్పుడూ ఆఫ్ చేసుకోవాలి. తప్పనిసరి పరిస్థితుల్లోనే ఆన్ చేసి, మళ్లీ ఆఫ్ మోడ్‌లో ఉంచాలి ∙వెబ్ కెమరాను బొట్టు బిళ్లతో కవర్ చేసుకోవడం మేలు. ఫోన్లోనూ వెబ్ క్యామ్ అనేబుల్ క్యాప్షన్‌లో ఉంచాలి ∙తెలిసిన పరిచయాలు కాంటాక్ట్స్‌లో ఉండాలి. పరిచయస్తులతో మాత్రమే సంభాషణ జరపాలి ∙యాప్స్ కూడా ప్లే స్టోర్ నుంచే డౌన్లోడ్ చేయాలి. ఆసక్తిగా కనిపించిన లింక్స్ అన్నీ ఓపెన్ చేయద్దు.భయపడకూడదు..మోసగాళ్లు అందుబాటులో ఉన్న మీ డేటాను, గత సోషల్‌మీడియా పోస్టింగ్‌లను, సోషల్ ఇంజనీరింగ్ నుండి సమాచారాన్ని ΄÷ంది, ఆన్లైన్ షేమింగ్ లేదా దోపిడీకి దారి తీస్తుంటారు. వాయిస్ మెసేజ్‌లు, ఫోన్ కాల్స్, వీడియో కాల్స్ ద్వారా సంభాషణ జరిపి ఆ సమాచారంతో బెదిరింపులకు పాల్పడేవారి సంఖ్య పెరిగింది. మోసగాళ్లు మీలా నటిస్తూ నకిలీ ఖాతాను సృష్టిస్తారు. మీ పరిచయాల నుండి డబ్బు అడగడం, ద్వేషపూరిత మెసేజ్‌లు చేయచ్చు. ఆన్లైన్లో ఎవరి నుంచైనా అనైతిక ప్రవర్తనతో ఇబ్బంది పడితే భయపడకుండా కుటుంబ సభ్యులతో, టెక్నాలజీ మిత్రులతో పంచుకొని సరైన నిర్ణయం తీసుకోవాలి. స్కూళ్లలోనూ టీచర్లు టెక్నాలజీ విషయాల్లో అమ్మాయిలకు అవగాహన కల్పించడం తప్పనిసరి.– అనీల్ రాచమల్ల, సైబర్ సేఫ్టీ నిపుణులు, ఎండ్ నౌ ఫౌండేషన్ -
పిల్లలు నిద్రలో పళ్లు కొరుకుతోంటే ఏం చేయాలి?
చిన్నారులు నిద్రలో పళ్లు కొరుకుతున్నారంటే అది వారిలో అంతర్గతంగా ఉన్న ఆందోళన, టెన్షన్, ఒత్తిడి కారణం వల్ల కావచ్చు. ఇలా నిద్రలో పళ్లు కొరికే కండిషన్‌ను వైద్యపరిభాషలో ‘బ్రక్సిజమ్’ అంటారు. పిల్లల్లో ఇది చాలా సాధారణంగా కనిపించడంతో పాటు వారి మెుదటి ఐదేళ్ల వ్యవధిలో మెుదలయ్యే సమస్య ఇది. సాధారణంగా చిన్నారుల్లో ఆందోళన, కోపం, వ్యాకులత, కంగారు, తొందరపాటుతో ఉండటం, పోటీ తత్వంతో వ్యవహరించడం వంటివి ఉన్నప్పుడు ఈ బ్రక్సిజమ్ సమస్య వారిలో ఎక్కువగా కనిపిస్తుంటుంది. ఈ సమస్యను అధిగమించాలంటే ముందుగా వాళ్లలో ఆందోళన, వ్యాకులతకు కారణమయ్యే అంశాలేమిటో తెలుసుకుని, దాన్ని తగ్గించేందుకు ప్రయత్నించాలి. నిద్రకు వుుందు వాళ్లు సంతోషంగా, ఆహ్లాదంగా ఉండేలా తల్లిదండ్రులు చూడాలి. పిల్లలతో మాట్లాడుతూ వారి మనసుల్లో ఉన్న భయాలు, శంకలు తొలగించేలా వ్యవహరించాలి. అలాగే పిల్లలు నిద్రకుపక్రమించే సమయంలో కెఫిన్ ఎక్కువగా ఉండే పదార్థాలు (కాఫీ, చాక్లెట్లు వంటివి) ఇవ్వకూడదు. సమస్య మరీ ఎక్కువగా ఉంటే నోట్లో అమర్చే మౌత్గార్డ్స్, మౌత్పీసెస్తో కొంత ఉపయోగం ఉంటుంది. ఈ సమస్య వల్ల కొన్నిసార్లు డెంటల్ సమస్యలు – మాల్ అక్లూజన్, పళ్లు వదులు కావడం (లూజెనింగ్), పళ్లు ఊడిపోవడం, దవడ ఎముక జాయింట్ (టెంపోరో మాంబడి బులార్ జాయింట్) సమస్యలు కూడా రావచ్చు. అలాంటి సందర్భాల్లో దంతవైద్య నిపుణులను సంప్రదించాలి. -
సీబీఐ దర్యాప్తుపై నమ్మకముంది
బరాసత్(పశ్చిమబెంగాల్): కోల్‌కతాలోని ఆర్జీ కార్ ఆస్పత్రిలో తమ కుమార్తెపై అత్యాచారం, హత్య ఘటనపై సీబీఐ చేపట్టిన విచారణపై విశ్వాసముందని బాధితురాలి తల్లిదండ్రులు తెలిపారు. ‘ఈ ఘటన వెనుక ఉన్న వారిని రక్షించేందుకు ప్రభుత్వ యంత్రాంగం, పోలీసులు ప్రయత్నిస్తున్నట్లు మాకున్న అనుమానం నిజమేనని తేలింది. ఈ నేరానికి కేవలం ఒక్కరు మాత్రమే కారణం కాదు’అని శుక్రవారం నార్త్ 24 పరగణాల జిల్లాలోని తమ నివాసంలో మీడియాతో వారన్నారు. ఆర్జీ కార్ ఆస్పత్రిలో జరిగే అక్రమాల గుట్టును బయటపెట్టాలన్నారు. -
Wayanad landslide: ఆరు ప్రాణాలు నిలబెట్టారు
వయనాడ్: దట్టమైన అడవిలో అదొక కొండ గుహ.. చుట్టూ చిమ్మచీకటి.. ఒకటి నుంచి నాలుగేళ్ల వయసున్న నలుగురు చిన్నారులు, వారి తల్లిదండ్రులు ఐదు రోజులపాటు అక్కడే తలదాచుకున్నారు. తాగడానికి వర్షపు నీరు తప్ప తినడానికి తిండి లేదు. ఆకలితో అలమటించిపోయారు. అటవీ సిబ్బంది 8 గంటలపాటు శ్రమించి ఆ కుటుంబాన్ని రక్షించారు. ఆరుగురి ప్రాణాలను కాపాడారు. కేరళలో వరద బీభత్సానికి సాక్షిగా నిలిచిన వయనాడ్ జిల్లాలోని అట్టమల అడవిలో జరిగిన ఈ సాహసోపేతమైన ఆపరేషన్ తాలూకు వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అటవీ సిబ్బందే అసలైన హీరోలంటూ జనం ప్రశంసిస్తున్నారు.వయనాడ్‌లో పనియా జాతి గిరిజనులు అధికంగా ఉంటారు. ఇతర సామాజికవర్గాలకు దూరంగా జీవిస్తుంటారు. అటవీ ఉత్పత్తులను విక్రయించి జీవనోపాధి పొందుతుంటారు. అందుకోసం గిరిజన దంపతులు నలుగురు పిల్లలను వెంట తీసుకుని కొండల్లోకి వెళ్లారు. భీకర వర్షం మొదలవడంతో కొండ గుహలో తలదాచుకున్నారు. వర్షం తగ్గకపోవడం, కొండచరియలు విరిగిపడుతుండడంతో కిందికొచ్చే సాహసం చేయలేకపోయారు. ఆహారం కోసం వెతుకుతూ తల్లి ఐదు రోజుల తర్వాత కిందికి రావడంతో అధికారులు గమనించారు. గుహలో నలుగురు పిల్లలు, భర్త ఉన్నారని చెప్పడంతో అటవీ సిబ్బంది వెంటనే రంగంలోకి దిగారు. భారీ వర్షం, అడుగడుగునా రాళ్లు, బురదలో అడుగువేయడమే కష్టమవుతున్నా గుహకు చేరుకున్నారు. ముందుగా ఆకలితో నీరసించిపోయిన చిన్నారుల కడుపు నింపారు. వాళ్లను తాళ్లతో తమ ఒంటికి కట్టుకొని జాగ్రత్తగా తీసుకొచ్చారు. ఆ క్రమంలో కొండపై నుంచి తాళ్ల సాయంతో దిగాల్సి వచి్చంది. ఆ ఫొటోలను సోషల్ మీడియాలో జనం విపరీతంగా షేర్ చేశారు.350 మందికిపైగా మృతులు! వయనాడ్ విపత్తు మృతుల సంఖ్య 350 దాటినట్లు తెలుస్తోంది. శనివారం అధికారులు మాత్రం 218 మంది చనిపోయినట్లు వెల్లడించారు. నిర్వాసితులకు సురక్షిత ప్రాంతంలో టౌన్íÙప్ ఏర్పాటుచేసి ఇళ్లు కట్టిస్తామని సీఎం పినరయి విజయన్ చెప్పారు. ప్రకటించారు. మోహన్ లాల్ రూ.3 కోట్ల విరాళం ప్రముఖ సినీ నటుడు మోహన్‌లాల్ శనివారం వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించారు. భారత ప్రాదేశిక సైన్యంలో లెఫ్టినెంట్ కల్నల్ హోదా ఉన్న ఆయన బాధితులను పరామర్శించారు. సహాయక సిబ్బంది సేవలను కొనియాడారు. వరద విలయానికి నామారూపాల్లేకుండాపోయిన నివాసాలను చూసి చలించిపోయారు. పునరావాస చర్యలకు రూ.3 కోట్ల విరాళం ప్రకటించారు. -
పిల్లల స్వేచ్ఛను హరించొద్దు..!
పిల్లల పట్ల తల్లిదండ్రులు ఎంత బాధ్యతగా వ్యవహరిస్తారో చెప్పాల్సిన పనిలేదు. అది శృతి మించేలా చెయ్యొద్దు. తల్లిదండ్రుల బాధ్యత వారికి భారంగా మారి స్వేచ్ఛను హరించేలా చేయకూడదు. పేరెంట్స్ ప్రవర్తనకు తట్టుకోలేక ఇంటి నుంచి పారిపోయే పరిస్థితి తెచ్చుకుని దోషులుగా మిగిలిపోవద్దు. చైనాలో అలాంటి దారుణమైన ఘటన చోటు చేసుకుంది. కన్న కూతురు తప్పుదారి పట్టకూడదని తల్లిదండ్రులు అతి జాగ్రత్తతో చేసిన పని ఆ అమ్మాయిని పోలీసులను ఆశ్రయించే పరిస్థితికి దారితీసింది.అసలేం జరిగిందంటే..?.. 20 ఏళ్ల చైనా యువతి తన పేరెంట్స్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనను కంట్రోల్ చేయాలనే ధోరణి తారాస్థాయికి చేరిపోయిందని భరించలేనంటూ కన్నీళ్లు పెట్లుకుంది. అందువల్ల తనకు సాయం చేయాల్సిందిగా పోలీసులను కోరింది. సదరు బాధితురాలిని లీ అనే అమ్మాయిగా గుర్తించారు పోలీసులు. తన తల్లిదండ్రులు తన పట్ల మరింత ఘోరంగా ప్రవర్తిస్తున్నారని గత నెల జూలై 26నే గుర్తించానని అంటోంది. తన తప్పు చేసిన ప్రతిసారి తనఫోన్ నేలకేసి కొట్టి దారుణంగా తిట్టేవారిని చెప్పింది. అస్సలు ఇంత చిన్న పాటి తప్పలు కూడా వాళ్ల ఎలా కనిపెడుతున్నారో అర్థం కాలేదు. ఆ తర్వాత తనకు తెలిసిందని.. తన బెడ్రూంలో స్పై కెమెరాను అమర్చి తన ప్రతి కదలికలను గమనిస్తున్నారని తెలిపింది. తన పేరెంట్స్ కంట్రోల్ పేరుతో తన స్వేచ్ఛను హరిస్తున్నారని, పైగా ఇది పీక్ స్థాయికి చేరిపోయిందంటూ వేదనగా చెప్పుకొచ్చింది. అందుకే ఇంట్లోంచి వెళ్లిపోవాలనే నిర్ణయానికి వచ్చిచనట్లు పేర్కొంది. అంతేగాదు బతకడం కోసం పార్ట్ టైం జాబ్‌లు కూడా వెతుకున్నట్లు పోలీసులకు తెలిపింది. ఐతే ఇంట్లో తను కనిపించకపోవడంతో తన పేరెంట్స్ ఎక్కడ మిస్సింగ్ కేసు పెడతారన్న భయంతో ముందుగానే పోలీసులకు ఈ విషయం చెప్పి వెళ్లిపోవాలనుకున్నట్లు కన్నీటి పర్యంతమయ్యింది. ఆమె గాథ విని పోలీసు అధికారి జాంగ్ చువాన్బిన్ లీని ఓదార్చే ప్రయత్నం చేశారు. అలాగే లీ పట్ల తల్లిందండ్రుల ప్రవర్తన సరైనది కాదని, సంరక్షణ తప్పు మార్గంలో ఉందని అన్నారు. వెంటనే ఆమె తల్లిందడ్రులను పిలిపించి కౌన్సిలింగ్ ఇప్పించారు. పిల్లలు వస్తువులు కారని, వాళ్లకు కాస్త స్పేస్ ఉండాలని చెప్పారు. ఇలా ఇంట్లోనే కెమెరాలతో నిఘా పెట్టి అభద్రతా భావానికి గురి చెయ్యకూడదన్నారు. ఈ ప్రవర్తన వారిని ఇంటినుంచి వెళ్లిపోయేలా చేయడమే గాక తప్పుడు మార్గంలో పయనించేందుకు కారణమవుతుంది కూడా అని గట్టిగా హెచ్చరించారు. లీ తల్లిందండ్రులు కూడా వారి చేసిన తప్పిదం ఏంటో గ్రహించడమే గాక ఆ కెమెరాలను తీసేందుకు అంగీకరించారు. ఇక లీ కూడా తిరిగి ఇంటికి వెళ్లేందుకు ఒప్పుకుంది. ప్రస్తుతం ఈ ఘటన నెట్టింట తెగ వైరల్ అవుతుంది. అయితే నెటిజన్లు పలు రకాలుగా స్పదించారు. కనీసం జైలు కూడా ఇంతలా ఉండకదా అంటూ ఆ తల్లిదండ్రుల ప్రవర్తన పట్ల ఫైర్ అయ్యారు. పైగా ఇది చాటా భయంకరమైనదిగా పేర్కొంటూ పోస్టులు పెట్టారు. (చదవండి: Nail Art: కాలేజ్‌కి కూడా వెళ్లలేదు.. కానీ ఏడాదికి ఏకంగా రూ. 5 కోట్లు..!) -
పిల్లల నుంచి పోషణ కోసం.. తల్లిదండ్రులు కోర్టును ఆశ్రయించవచ్చా?
ప్రదీప్, శాంత భార్యాభర్తలు. ఇద్దరూ 60 ఏళ్లకు పైబడిన వారే! ఇద్దరికీ బీపీ, సుగర్లున్నాయి. వాళ్లకిద్దరు పిల్లలు. మంచి జీతాలు గల ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. కానీ అమ్మానాన్నలను పూర్తిగాగాలికి వదిలేయడంతో దయనీయమైన స్థితిలో రోజులను గడుపుతున్నారు ఆ దంపతులు. పిల్లల నుంచి పోషణ కోసం వీరు కోర్టును ఆశ్రయించవచ్చా?తల్లిదండ్రుల, వయోవృద్ధుల నిర్వహణ, సంక్షేమ చట్టం, 2007 కింద తల్లిదండ్రులకు, వయోవృద్ధులకు చాలా హక్కులే ఉన్నాయి. ముఖ్యంగా తమను తాము పోషించుకోలేని, తమ సంక్షేమాన్ని, తమ ఆరోగ్యాన్ని తాము పర్యవేక్షించుకోలేని తల్లిదండ్రులు, వయోవృద్ధులకు... తమ పిల్లలు, మనవళ్లు, మనవరాళ్లు లేదా బంధువుల (వయోవృద్ధుల ఆస్తికి వారసులు లేదా ఆర్థికంగా గానీ, మరేరకంగా గానీ లబ్ధి పొందిన వారు)ను మెయింటెనెన్స్ అడిగే హక్కును కలిపిస్తోందీ చట్టం.ఈ చట్టం కింద వయోవృద్ధులు, తల్లిదండ్రులు నేరుగా ట్రిబ్యునల్‌ను ఆశ్రయించవచ్చు (స్థానిక ఆర్డీఓ). అలా ఆశ్రయించలేని పరిస్థితుల్లో ఉంటే వాళ్ల పక్షాన ఓల్డ్ ఏజ్ హోమ్ లాంటి ఏ సంస్థ అయినా పిటిషన్ దాఖలు చేయవచ్చు. నోటీసులు అందిన 90 రోజులలోగా పిటిషన్‌పై విచారణ జరిపి ఆదేశాలు ఇవ్వవలసి ఉంటుంది. ఇంటెరిమ్ మెయింటెనెన్స్‌కు కూడా ఆదేశించవచ్చు. వారసులు, పిల్లలు లేదా బంధువులు ట్రిబ్యునల్ ముందుకు రానట్లయితే... ట్రిబ్యునల్ క్రిమినల్ కోర్ట్లా కూడా వ్యవహరించవచ్చు. స్థిరాస్తులకు సంబంధించి ఏ ఇతర చట్టాల్లో లేని వెసులుబాటు, హక్కు కేవలం ఈ చట్టంలోనే పేరెంట్స్, సీనియర్ సిటిజన్స్ కలిగి ఉన్నారు.ఏ ఇతర ప్రాపర్టీ చట్టాలకిందైనా ఒకసారి అమ్మేసిన లేదా గిఫ్ట్ గా ఇచ్చిన స్థిరాస్తిని తిరిగి తీసుకోవడం కానీ రద్దు చేయడం కానీ కుదరదు. కానీ ఈ 2007 చట్టం కింద మాత్రం ఆస్తిని తమ సంతానానికి లేదా తన బంధువులకు లేదా మరే ఇతర వ్యక్తికైనా రాసిచ్చేటప్పుడు ‘మమ్మల్ని చూసుకోవాల్సిన బాధ్యతను నిర్వర్తించాలి.. లాంటి నిబంధనతోనే ఈ ఆస్తిని రాసిస్తున్నాను’ అంటూ ఆస్తిపత్రాలలో పొందుపరచి.. దాన్ని సదరు వారసులు ఉల్లంఘిస్తే.. తమ ఆస్తిని తాము తిరిగి తీసేసుకోవచ్చు.చాలా సందర్భాలలో ఆస్తి రాయించుకున్న తర్వాత తల్లిదండ్రులను లేదా వృద్ధులను ఓల్డేజ్ హోమ్స్‌లో వదిలేయడం లేక సరిగ్గా పట్టించుకోకపోవడం చూస్తుంటాం. అలాంటి సందర్భాలకు ఈ చట్టం చక్కటి ఆయుధం. పైన తెలిపిన నిబంధన కలిగి ఉన్న ఆస్తి పత్రాలను మరెవరైనా కొనుగోలు చేస్తే, అలా కొనుక్కున్న వారిపైనా మెయింటెనెన్స్ విధించవచ్చు. అంతేకాదు వయోవృద్ధులను లేదా తల్లిదండ్రులను వదిలించుకుందామని వారిని ఎక్కడికైనా తీసుకెళ్లి వదిలేయడం లాంటివి చేస్తే అది నేరం. వారికి జరిమానాతో ΄ాటు జైలు శిక్ష కూడా ఉంటుంది.– శ్రీకాంత్ చింతల, హైకోర్ట్ అడ్వకేట్ -
పేరెంట్స్ విషయంలోనూ పూజా ఖేద్కర్ అబద్ధం!
వివాదాస్పద ట్రైనీ ఐఏఎస్ అధికారిణి పూజా ఖేద్కర్ విషయంలో మరో షాకింగ్ విషయం వెలుగు చూసింది. తన తల్లిదండ్రులు విడిపోయారని ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో స్వయంగా ఆమె వెల్లడించారు. అయితే ఈ విషయంపై దర్యాప్తు చేపట్టిన అధికారులు.. అది నిజం కాదని తేల్చారు. పలు వివాదాల్లో చిక్కుకున్న ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (ఐఏఎస్) ట్రైనీ ఆఫీసర్ పూజా ఖేడ్కర్ తల్లిదండ్రుల వైవాహిక స్థితి గురించి తెలియజేయాలని పూణే పోలీసులను కేంద్రం ఆదేశించింది. యూపీఎస్సీ పరీక్షలో ఓబీసీ నాన్-క్రీమీ లేయర్‌ను పూజా వినియోగించుకుంది. ఇందుకోసం ఆమె తన తల్లిదండ్రులు విడిపోయారనే కారణాన్ని జత చేసింది. అయితే ఆమె ఓబీసీ నాన్ క్రిమిలేయర్ సర్టిఫికెట్‌పై ఆరోపణలు వెల్లువెత్తిన నేపధ్యంలో ఆమె తల్లిదండ్రుల వైవాహిక స్థితిపై కేంద్రం నివేదికను కోరింది.ఈ నేపథ్యంలో.. పూజా ఖేద్కర్ తల్లిదండ్రుల వైవాహిక స్థితికి సంబంధించి పూణె పోలీసులు తాజాగా మహారాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. పూజా తల్లిదండ్రులైన దిలీప్, మనోరమా ఖేడ్కర్లు చట్టబద్ధంగా విడిపోయారని, అయినప్పటికీ వారిద్దరూ కలిసే ఉంటున్నారని ఆ నివేదికలో పోలీసులు పేర్కొన్నారు. పూజా ఖేద్కర్ ఢిల్లీలోని వివిధ అకాడమీలలో తన మాక్ ఇంటర్వ్యూలలో తన తల్లిదండ్రులు విడాకులు తీసుకున్నారని, తాను తండ్రికి దూరంగా తన తల్లితో ఉంటున్నందున తన కుటుంబ ఆదాయం సున్నా అని ఆమె పేర్కొన్నారు. అయితే దిలీప్.. మనోరమ ఖేడ్కర్ 2009లో పూణేలోని ఫ్యామిలీ కోర్టులో పరస్పర అంగీకారంతో విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. 2010, జూన్ 25న వారు విడాకులు తీసుకున్నారు. విడాకులు తీసుకున్నప్పటికీ బన్నర్ ప్రాంతంలోని నివాసంలో కలిసే ఉంటున్నారు. కుటుంబ ఫంక్షన్లకు కలిసే హాజరవుతున్నారని దర్యాప్తులో వెల్లడైంది. మరోవైపు ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల సందర్భంగా దిలీప్ ఖేద్కర్ సమర్పించిన అఫిడవిట్లో మనోరమను తన భార్యగా పేర్కొనడం కొసమెరుపు. -
హృదయాల్ని కదిలిస్తున్న చిన్నారి : వైరల్ వీడియో
సాధారణంగా కన్నబిడ్డల్ని తల్లిదండ్రులు కంటికి రెప్పలా కాపాడుకుంటారు. కానీ అంధులైన తల్లిదండ్రులను అన్నీ తానై చూసుకుంటోంది ఓ చిన్నారి. అమ్మా, నాన్న చేయి పట్టుకుని అడుగులు నేర్చుకునే వయసులోనే తల్లిదండ్రులను చేయి పట్టుకొని భద్రంగా తీసుకెళుతోంది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట ఆకర్షణీయంగా నిలిచింది.In a touching emotional scene, a child is helping his blind parents at an age when they have to teach him to walk. pic.twitter.com/zVVSXHexlx— Akanksha Parmar (@iAkankshaP) July 18, 2024ఆకాంక్ష పర్మార్ అనే యూజర్ ఎక్స్‌లో ఈ ఈ వీడియోను షేర్ చేశారు. ‘ఇదీ సంస్కారం అంటే’ అంటూ నెటిజన్లు ఆ చిన్నారిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. చాలా స్ఫూర్తిదాయకంగా ఉంది. హృదయాన్ని కదిలిస్తోంది అంటూ చాలామంది ఎమోషనల్ అయ్యారు. ఈ దృశ్యాలకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. అలాగే ఇలాంటి వారికోసం ప్రభుత్వం పూనుకొని ఏదైనా చర్యలు తీసుకోవాలని మరికొంతమంది సూచించారు. -
‘మహాత్మా’.. వసతులేవి ?
వైరారూరల్ : మహాత్మా జ్యోతిబా పూలే పాఠశాల, కళాశాలలో సరైన వసతులు లేవంటూ విద్యార్థినుల తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. రెండో శనివారం కావడంతో తమ పిల్లలను కలిసేందుకు వారు కళాశాలకు రాగా.. కనీస సౌకర్యాలు లేవంటూ విద్యార్థినులు తల్లిదండ్రుల దృష్టికి తీసుకొచ్చారు. దీంతో ఆగ్రహించిన తల్లిదండ్రులు వైరా – జగ్గయ్యపేట రాష్రీ్టయ రహదారిపై బైఠాయించి 2 గంటలు ఆందోళన చేశారు.పక్కా భవనాలు లేకపోవడంతో రెబ్బవరంలో మూతబడిన ప్రైవేటు పాఠశాల భవనాన్ని అద్దెకు తీసుకొని అందులో కొనసాగిస్తున్నారు. ముసలిమడుగు ఎంజీపీ గురుకుల విద్యార్థులు 440 మంది, వైరా ఎంజీపీ విద్యార్థులు 310 మంది.. రెండూ కలిపి 750 మంది విద్యారి్థనులు ఈ భవనంలోనే ఉంటున్నారు. అయితే భవన ఆవరణలో 22 మరుగుదొడ్లు మాత్రమే ఉన్నాయి. పరిమితికి మించి విద్యార్థినులు ఉండడంతో ఇబ్బంది అవుతోందని గురుకులాల నిర్వాహకులు పలుమార్లు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అయినా పట్టించుకోలేదు.దీంతో పాఠశాలకు వచి్చన తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. రెండు గంటలు వాహనాల రాకపోకలకు అంతరాయం వాటిల్లడంతో ఎస్సై వంశీకృష్ణ భాగ్యరాజ్ వచ్చి ఆందోళన విరమింపజేసేలా ప్రయతి్నంచారు. కానీ వసతుల కల్పనపై అధికారులు హామీ ఇవ్వాల్సిందేనని తల్లిదండ్రులు పట్టుబట్టడంతో ఇన్చార్జ్ డిప్యూటీ వార్డెన్ సుధ అక్కడకు చేరుకొని నెల రోజుల్లో మరో కొత్త భవనంలోకి మారుస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. -
పరిహారం తల్లిదండ్రులకే ఇవ్వాలి: కెప్టెన్ అన్షుమన్ పేరెంట్స్
లక్నో: సైన్యంలో విధి నిర్వహణలో చనిపోయిన వారి డిపెండెంట్లు(నెక్స్ట్ ఆఫ్ కిన్) ఎవరనే విషయమై స్పష్టమైన మార్గదర్శాలు ఇవ్వాల్సిన అవసరం ఉందని ఇటీవల కీర్తి చక్ర పతకం పొందిన దివంగత కెప్టెన్ అన్షుమన్‌సింగ్ తల్లిదండ్రులు రవి ప్రతాప్‌సింగ్, మంజు సింగ్ అన్నారు. ఈ విషయమై ఇప్పటికే రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తోనూ మాట్లాడామన్నారు. ప్రతిపక్షనేత రాహుల్‌గాంధీ కూడా ఈ విషయాన్ని పార్లమెంట్లో లేవనెత్తుతామని తమకు హామీ ఇచ్చారని చెప్పారు. Shocking words.. pic.twitter.com/UeiF0Ef4Mf— Gems of Politics (@GemsOf_Politics) July 11, 2024 ‘సైన్యంలో వీర మరణం పొందిన వారికి సంబంధించిన పరిహారం ఎవరికి దక్కాలనే విషయంలో స్పష్టమైన మార్గదర్శకాలు ఇవ్వాల్సి ఉంది. ప్రస్తుతం ఉన్న నెక్ట్స్ ఆఫ్ కిన్(ఎన్‌ఓకే) మార్గదర్శకాలు సరిగా లేవు. ఈ విషయమై రాజ్‌నాథ్‌సింగ్‌తో ఇప్పటికే మేం మాట్లాడాం. నా కుమారుడు అన్షుమన్సింగ్కు పెళ్లి జరిగి కేవలం అయిదు నెలలు మాత్రమే అయింది. నా కొడుక్కి పిల్లలు లేరు. అయినా మా కొడుకుకు వచ్చిన కీర్తి చక్ర పతాకం, ఇతర అన్ని పరిహారాలు కోడలికే దక్కాయి. ఆమె అన్ని అధికారిక డాక్యుమెంట్లలో తన చిరునామా మార్చుకుని వెళ్లిపోయింది.ఇందుకే ‘ఎన్‌ఓకే’ను మళ్లీ పునర్నిర్వచించాలని కోరుతున్నాం. కోడలి కంటే తల్లిదండ్రులే కొడుకుపై ఎక్కువగా ఆధారపడతారు. మేము బాధపడుతున్నట్లుగా ఇతర తల్లిదండ్రులెవరూ భవిష్యత్తులో బాధపడకూడదు’అని అన్షుమన్ తల్లిదండ్రులు రవి ప్రతాప్‌సింగ్,మంజుసింగ్ అన్నారు.గత ఏడాది జులైలో సియాచిన్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో కెప్టెన్ అన్షుమన్‌సింగ్ మృతి చెందారు. ఆ ప్రమాదంలో తన సహచరులను కాపాడి అన్షుమన్ మంటల్లో చిక్కుకుపోయి ప్రాణాలు వదిలారు.అన్షుమన్ ప్రదర్శించిన ధైర్య సాహసాలకుగాను భారత ప్రభుత్వం ఆయనకు కీర్తిచక్ర పతాకాన్ని ప్రకటించింది. ఈ పతకాన్ని జులై 5న రాష్ట్రపతి భవన్లో జరిగిన కార్యక్రమంలో అన్షుమన్ భార్య స్మృతి, మాతృమూర్తిలకు ఈ పతకాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బహుకరించారు. ప్రస్తుత రూల్స్ ప్రకారం ‘ఎన్‌ఓకే’ ఎవరు..సైన్యంలో ఒక వ్యక్తి చేరినపుడు తల్లిదండ్రులను నెక్ట్స్ ఆఫ్ కిన్గా పేర్కొంటారు. అయితే ఆ వ్యక్తికి వివాహం అయిన తర్వాత మాత్రం నెక్ట్స్ ఆఫ్ కిన్గా తల్లిదండ్రుల పేర్ల స్థానంలో జీవిత భాగస్వామి పేరు రికార్డుల్లోకి ఎక్కిస్తారు. -
పోలీసులతో దాగుడుమూతలు..
-
Assam govt: తల్లిదండ్రులతో గడిపేందుకు సెలవు
గువాహటి: అస్సాం ప్రభుత్వ ఉద్యోగులు తమ తల్లిదండ్రులు లేదా అత్తమామలతో గడిపేందుకు రెండు రోజులు సెలవులిస్తున్నట్లు సీఎం కార్యాలయం గురువారం ప్రకటించింది. తల్లిదండ్రులు, అత్తమామలు లేని వారు స్పెషల్ కాజువల్ లీవ్‌కు అనర్హులని స్పష్టం చేసింది. నవంబర్ 6, 8వ తేదీల్లో స్పెషల్ కాజువల్ లీవ్ తీసుకునే వారు తమ తల్లిదండ్రులు, అత్తమామలతో గడిపేందుకే కేటాయించాలని వివరించింది. వయోవృద్ధులైన తల్లిదండ్రులు, అత్తమామలను జాగ్రత్త చూసుకునేందుకు వారికి గౌరవం, మర్యాద ఇచ్చేందుకు ఈ లీవ్ ప్రత్యేక సందర్భమని వెల్లడించింది. నవంబర్ 7న ఛాత్ పూజ, నవంబర్ 9న రెండో శనివారం, నవంబర్ 10న ఆదివారంతో పాటు ఈ రెండు రోజుల సెలవును ఉపయోగించుకోవచ్చని సీఎంఓ తెలిపింది. -
కన్న పిల్లలను చితకబాదిన తల్లి.. వీడియో తీసిన తండ్రి
ముంబై: మహారాష్ట్రలో అమానుష ఘటన వెలుగుచూసింది. ఓ తల్లి కనికరం లేకుండా తన ఇద్దరు పిల్లలపై ఇష్టానుసారంగా చేయి చేసుకుంది. కన్న ప్రేమను మరిచి బెల్టుతో కొడుకు, కూతురిని చితకబాదింది. పిల్లలు దెబ్బలతో అల్లాడిపోతుంటే, ఈ తతంగాన్నంతా తండ్రి తన ఫోన్లో వీడియో తీస్తూ.. భార్యను ఆపకపోవడం కొసమెరుపు.ముంబైలోని వాన్రాయ్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో ఈ దారుణం జరిగింది. ఓ మహిళ తన కూతురు, కొడుకును తీవ్రంగా కొడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పిల్లలు గుక్కపట్టి ఏడుస్తూ, కొట్టవద్దని తల్లిని వేడుకోవడం వీడియోలో కనిపిస్తోంది. అయినా ఆగని ఆ మహిళ వారిని చెంపదెబ్బలు, బెల్టుతో చితకబాదింది. ఇక ఆ ఘోరాన్ని ఆపాల్సింది పోయి.. ఈ దృశ్యాలను కన్న తండ్రి వీడియో తీశాడు. వీడియో రికార్డ్ చేయమని తన భర్తను ఆమె కోరడం స్పష్టంగా వినిపిస్తోంది. అయితే చాలా రోజుల నుంచి వివాహిత తన పిల్లలపై ఈ విధంగానే ప్రవర్తిస్తున్నట్లు తెలుస్తోంది.వీడియో వైరల్ అవ్వడంతో రిటైర్డ్ బాంబే హైకోర్టు న్యాయమూర్తి ఎస్‌జె కథవాలా ఈ వ్యవహారంపై బాలల రక్షణ హక్కుల కమిషన్‌కు లేఖ రాశారు. తల్లిదండ్రులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే ముంబై పోలీసు కమిషనర్‌కు కూడా లేఖ రాశారు.చర్య తీసుకోవాలని కోరుతూ బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి కూడా ఒక కాపీని పంపినట్లు రిటైర్డ్ జడ్జి కథవాలా తెలిపారు.మరోవైపు భార్యాభర్తలిద్దరినీ పోలీస్ స్టేషన్‌కు పిలిపించి, తల్లిదండ్రులు.. పిల్లల స్టేట్మెంట్లను రికార్డ్ చేసినట్లు అధికారులు తెలిపారు. అయితే ఈ వీడియో 2022 సంవత్సరానికి చెందినదని, ఇప్పుడు బయటపడిందని చెబుతున్నారు. ప్రస్తుతం పోలీసులు పిల్లలిద్దరినీ చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి పంపించారు. -
ఆ పిల్లల రోదన తీరేదెప్పుడు?
సాక్షి, హైదరాబాద్: అప్పటివరకు అల్లారుముద్దుగా పెంచుకుంటున్న పసిపిల్లలను ఒక్కసారిగా తమ నుంచి దూరం చేశారని పెంపుడు తల్లిదండ్రుల ఆవేదన ఒకవైపు.. కన్నవాళ్లు, పెంపుడు తల్లిదండ్రులు.. ఎవరూ కనిపించక పిల్లల రోదన మరోవైపు.. వెరసి యూసుఫ్‌గూడలోని శిశు విహార్ వద్ద పరిస్థితి కంటనీరు తెప్పిస్తోంది. పరారీలో ఉన్న ఢిల్లీ, పుణేకు చెందిన ప్రధాన నిందితులు పోలీసులకు చిక్కి, పిల్లల అసలు తల్లిదండ్రులు ఎవరనేది తేలే వరకూ ఈ పసికందుల ఆక్రందన తప్పేలా లేదు. సంచలనం సృష్టించిన పిల్లల విక్రయం కేసును ఎలా కొలిక్కి వస్తుందనే అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. హైదరాబాద్, విజయవాడకు చెందిన పిల్లల విక్రయం ముఠా ఇప్పటివరకు 60కి పైగా చిన్నారులను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో విక్రయించగా.. వీరిలో 13 మంది శిశువులను పోలీసులు రక్షించి, శిశు విహార్‌లో చేర్చిన సంగతి తెలిసిందే. మధ్యవర్తులు ఢిల్లీ, పుణేలకు చెందిన కిరణ్, ప్రీతి, కన్నయ్య నుంచి పిల్లలను తీసుకొచ్చి, పెంపుడు తల్లిదండ్రులకు విక్రయించారు. ఈ పిల్లల అసలు తల్లిదండ్రులు ఎవరు? నిందితులు పేద తల్లిదండ్రుల నుంచి పిల్లల్ని కొనుగోలు చేశారా? లేక అపహరించి, మధ్యవర్తుల ద్వారా విక్రయించారా? అనే అంశాలపై స్పష్టత వస్తేనే కేసు దర్యాప్తు ముందుకెళుతుందని ఓ పోలీసు ఉన్నతాధికారి తెలిపారు. దీంతో కిరణ్, ప్రీతి, కన్నయ్యల కోసం నలుగురు సిబ్బంది చొప్పున రెండు ప్రత్యేక బృందాలు ఢిల్లీ, పుణేలలో గాలిస్తున్నాయి. పేరెంట్స్ ఎవరనేది తేలితేనే.. ఈ చిన్నారుల అసలు తల్లిదండ్రులు ఎవరనేది తేల్చడం పోలీసులకు సవాల్‌గా మారింది. పిల్లల డీఎన్ఏలతో తల్లిదండ్రుల డీఎన్ఏ నమూనాలను సరిపోల్చుతామని, ఒకవేళ పిల్లల డీఎన్ఏతో సరిపోలితే అసలు తల్లిదండ్రులకే అప్పగిస్తామని, ఒకవేళ తేలని పక్షంలో పిల్లల్ని తిరిగి శిశు విహార్కే తరలిస్తామని అధికారులు స్పష్టం చేశారు. పిల్లలపై ఇష్టం లేని తల్లిదండ్రులకు బలవంతంగా ఇచ్చేయాలా? లేక పిల్లలంటే ప్రేమ చూపే పెంపుడు తల్లిదండ్రులకు అప్పగించాలా? అనేది తేల్చలేని పరిస్థితి నెలకొంటుందని ఓ అధికారి తెలిపారు. త్వరలోనే పెంపుడు తల్లిదండ్రుల అరెస్టు.. పిల్లలను అమ్మడం, కొనడం చట్టరీత్యా నేరం. ఇప్పటికే పిల్లలను విక్రయించిన 11 మంది నిందితులను పోలీసులు అరెస్టు చేసి, జ్యుడీíÙయల్ రిమాండ్‌కు తరలించిన సంగతి తెలిసిందే. ఇక, పిల్లలను కొనుగోలు చేసిన దంపతులపై కూడా సీఆర్పీసీ, జువెనైల్ జస్టిస్ (జేజే) చట్టాల కింద కేసులు నమోదు చేయాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. త్వరలోనే వీరిపై సెక్షన్ 370, 372, 373 ఆర్/డబ్ల్యూ 34 ఐపీసీ, 81, 87, 88 జువెనైల్ జస్టిస్ యాక్ట్–1985 కింద కేసులు నమోదు చేసి, అరెస్టు చేయనున్నట్లు సమాచారం. -
తాళికట్టే సమయంలో ట్విస్ట్ ఇచ్చిన పెళ్లి కూతురు
-
Arvind Kejriwal: మోదీజీ.. దేవుడు మిమ్మల్ని క్షమించడు
న్యూఢిల్లీ: ప్రధాని మోదీపై ఢిల్లీ సీఎం, ఆప్ జాతీయ కనీ్వనర్ కేజ్రీవాల్ ఆగ్రహం వ్యక్తంచేశారు. మోదీ హద్దు మీరుతున్నారని, అనారోగ్యంతో బాధపడుతున్న తన తల్లిదండ్రులను సైతం లక్ష్యంగా చేసుకుంటున్నారని ఆరోపించారు. కేజ్రీవాల్ గురువారం వర్చువల్‌గా మీడియాతో మాట్లాడారు. పద్ధతి మార్చుకోవాలని ప్రధానికి హితవు పలికారు. ‘‘నా ఎమ్మెల్యేలను, మంత్రిని అరెస్టు చేశారు. నన్ను జైలులో పెట్టి వేధించారు. ఈరోజు మీరు హద్దులు దాటారు. నన్ను లక్ష్యంగా చేసుకుని నా తల్లిదండ్రులను వేధిస్తున్నారు. ఆ దేవుడు మిమ్మల్ని క్షమించడు’’ అని మోదీని ఉద్దేశించి పేర్కొన్నారు. -
మీ పిల్లలను సరైన క్రమంలో తీర్చిదిద్దాలంటే ఇలా చేయండి!
మీరు.. మీ పిల్లల ఆలోచనలను, వారి నడవడికను సరిగ్గా అర్థం చేసుకోలేకపోతున్నారా? అయితే.. అది మీకు, మీ పిల్లలకి మధ్య భావోద్వేగ అంతరానికి కారణం కావచ్చు. ఈ దూరాన్ని తగ్గించడానికి ఉత్తమ మార్గం మీ పిల్లలతో చాలా మాట్లాడటం. కొన్ని ప్రశ్నలు అడుగుతూండటం చేయాలి. మీరడిగే ప్రతీది వారి మనస్సును మలుచుకోవడంలో సహాయమవుతుంది. భావోద్వేగాలను పంచుకోవడంలో తోడ్పడుతుంది. అలాగే, వారిలో పాతిపెట్టిన విషయాలను చెప్పడానికి అవకాశం ఉంటుంది. కనుక ఇలా చేసి చూడండి!ప్రతీ తల్లితండ్రులు తమ పిల్లలను అడగాల్సిన ప్రశ్నలివే..1. 'నీవు ఏ విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తావు?'.. అనే ఈ ప్రశ్న అడగడంతో.. పిల్లవాడిని ఆలోచించేలా చేస్తాయి. దీంతో మీరు అతని అంతర్గత ఆలోచనలు, సమస్యలను మెరుగైన మార్గంలో ఉంచగలుగుతారు. ఇలాంటి విషయాలను తల్లిదండ్రులు పిల్లలను ప్రైవేట్‌గా అడగడమే ఉత్తమం.2. 'నీకు నచ్చే విషయమేంటి? ఎలా సంతోషంగా ఉంటావ్?'.. ఈ ప్రశ్న అతనికి తన గురించి చెప్పే అవకాశాన్ని ఇస్తుంది. దీంతో తన కోరికలను వ్యక్తం చేయగలడు.3. మీరు మీ పిల్లల్ని తప్పకుండా అడగాల్సిన ప్రశ్న ఏంటంటే? 'నేను మీతో తక్కువ లేదా ఎక్కువ సమయం గడుపుతున్నప్పుడు మీకు ఏమనిపిస్తోంది?' ఈ విధంగా సూటిగా చూస్తూ అడగడంతో.. వారి కళ్ళ నుంచి మీకు, మీ బిడ్డకు మధ్య ఉన్న సరైన బంధాన్ని అర్థం చేసుకోగలరు.4. పిల్లలు పెరుగుతున్నప్పుడు.. తరచుగా కొన్ని ఆలోచనలలో మునిగిపోతూంటారు. ఆ సమయంలో మీరు వారిని తప్పకుండా అడగాల్సిన విషయం ఇదే.. 'నీ జీవితంలో నీవు ఏమైనా తెలుసుకోవాలనుకుంటున్నావా? ఏదైనా సమస్యా?' అని అడగడంతో వారిలో ఏదైనా ప్రశ్న ఉన్నా భయ సంకోచాన్ని వదిలేస్తారు.5. 'కుటుంబంతో నీవు కలిగి ఉన్న ఉత్తమ జ్ఞాపకం ఏంటి?' ఇలా అడిగితే.. వాళ్లు కుటుంబంతో గడిపిన మంచి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటారు. పిల్లలు ఏ సమయంలో ఎలా ప్రవర్తిస్తారో కూడా మీరు అర్థం చేసుకుంటారు.6. 'ఒత్తిడికి లేదా ఆందోళనకు గురికావడం వంటివి ఏవైనా ఉన్నాయా?' ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. ఎందుకంటే? నేటి జీవనశైలిలో 'మానసిక ఒత్తిడి' పిల్లల జీవితాలను అతలాకుతలం చేస్తుంది. వారి వ్యక్తిత్వ ఎదుగుదలపై ప్రభావితం చూపుతుంది. ఈ ఒత్తిడిని పెద్దలు నిర్వహించగలరు. కానీ పిల్లలు తరచుగా ఈ సమస్యలలో చిక్కుకుంటున్నారు. దీని పర్యవసానాలు చాలా ప్రమాదకరమైనవి. కనుక వారిని తరచుగా అడగండి.. ఒత్తిడి నుంచి ఎలా బయటపడాల్లో నేర్పించండి.7. 'మీరు నాతో ఏదైనా నేర్చుకోవాలనుకుంటున్నారా!' అని అడగడంతోపాటు వారి ఆశను నెరవేర్చాలి. ఎందుకంటే? పిల్లలు తరచుగా ఒంటరిగా ఉంటారు. తల్లిదండ్రులతో కొంత నాణ్యమైన సమయాన్ని గడపాలని లోలోనే తపిస్తుంటారు. అటువంటి పరిస్థితిలో వారితో కలిసి కొన్ని కొత్త విషయాలను నేర్చుకోవడంలో మంచి అవకాశాన్ని ఇస్తుంది. -
అమ్మా.. బాగున్నావా? ఆరోగ్యం జాగ్రత్త!
ఇంట్లో ప్రతి ఒక్కరి ఆరోగ్యాన్ని కాపాడుతూ, అందరి బాగోగులూ చూసే తల్లులు తమ ఆరోగ్యాన్ని మాత్రం పట్టించుకోరు. అమ్మ తనని తాను పట్టించుకోదని వదిలేసి ఊరుకోలేము, ఊరుకోకూడదు కూడా. మనకోసం అహరహం తపించే మన కన్నతల్లిని కంటికి రెప్ప లా కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై కూడా ఉంది. అందుకోసం ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం...రేపు అంతర్జాతీయ మాతృదినోత్సవం. ఈ నేపథ్యంలో అమ్మ గురించి, అమ్మ ఆరోగ్యం గురించి కాస్త శ్రద్ధ తీసుకోవడం చాలా మంచిది. రోజంతా రాత్రి, పగలు ఇంట్లోని వారందరి బాగోగులు చూసే తల్లులు తీరా తమ దగ్గరకొచ్చేసరికి అంతగా పట్టించుకోరు. దాంతో వారికి అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. వాటిని దూరం చేయాలంటే ఏం చేయాలో, వారు ఆరోగ్యంగా... ఆనందంగా ఉండేందుకు ఏమేం చర్యలు తీసుకోవాలో చూద్దాం...చురుగ్గా ఉండేలా...ఎవరైనా సరే, ఉత్సాహంగా... ఉల్లాసంగా ఉండడం చాలా ముఖ్యం. అమ్మ ఉత్సాహంగా ఉల్లాసంగా లేకపోయినా కనీసం చురుగ్గా అయినా ఉంటోందో లేదో చూసుకోవాల్సిన బాధ్యత మనదే. ఇందుకోసం రోజుకి 30 నుంచి 40 నిమిషాల పాటు ఆమె వాకింగ్ చేసేలా చూడాలి. దాని వల్ల బరువు అదుపులో ఉంటుంది. ఏవిధమైన ఇన్ఫెక్షన్లూ సోకవు. వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. కాబట్టి, తల్లులు సులువుగా చేయగలిగే కనీస వ్యాయామాలు చేసేలా చూడాలి. అలా చేయాలంటే మనం కూడా మన బద్ధకాన్ని వదలగొట్టుకుని శరీరానికి కొద్దిపాటి శ్రమ కలిగించే వ్యాయామాలు చేయడం అవసరం. మనల్ని చూసి మన తల్లులూ, మన పిల్లలూ కూడా వ్యాయామాలు చేసి ఆరోగ్యంగా... సరైన ఆకృతిలో ఉండేందుకు తప్పకఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటోందా?అమ్మలు మనం ఇష్టంగా తినేవాటిని ఎంతో శ్రమపడి వండి వారుస్తారు కానీ, వారి విషయానికొచ్చేసరికి సరిగా తినరు. అలా కాకుండా అమ్మ ఏమేం తింటోంది, ఎలా తింటోంది... అసలు సరిగ్గా తింటోందో లేదో పట్టించుకోవాలి. అమ్మ వండింది మనం కడుపునిండా తినడమే కాదు, అమ్మ ఏమైనా తింటోందో లేదో చూస్తూ, ఆమె ఇష్టాన్ని కనిపెట్టి వారికి నచ్చే ఆహారాన్ని బయటినుంచి కొని తీసుకు రావడమో లేదా వీలయితే మీరే ఒకరోజు సరదాగా వండిపెట్టడమో చేయాలి.వారు ఆరోగ్యంగా ఉండేందుకు హెల్దీ ఫుడ్‌ని అందించండి. వారి డైట్లో పాలు, గుడ్లు, నట్స్, సోయా వంటి ్రపోటీన్ రిచ్ ఫుడ్స్‌ని యాడ్ చేసుకోండి. తాజా పండ్లు, కూరగాయలు తినే చూడండి. దీంతో పాటు హైడ్రేటెడ్‌గా ఉండేలా నీటితో పాటు, గ్రీన్ టీ, హెర్బల్ టీలను తాగించండి. వీటితో పాటు హోల్ గ్రెయిన్స్, బ్రౌన్ రైస్, ఓట్స్ వంటి ఫుడ్స్, అలానే కాల్షియం, ఫైబర్ రిచ్ ఫుడ్స్ తీసుకునేలా చూడడం తప్పనిసరి.ఆరోగ్య పరీక్షలు చేయిస్తున్నారా? ఆరోగ్యమే మహా భాగ్యం అన్న సూక్తి చాలా పాతదే అయినప్పటికీ అది ఎల్లవేళలా అనుసరించవలసినదే. ఆరోగ్యాన్ని మించిన ధనం లేనేలేదు. అందువల్ల నేటి కాలంలో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి. మనకెవరికైనా ఏమాత్రం ఆరోగ్యం బాగుండకపోయినా సరే, తల్లడిల్లిపోయే తల్లులు తమ ఆరోగ్యం విషయానికి వచ్చేసరికి పట్టించుకోరు.మీరు అలా అని వదిలేసి ఊరుకోవద్దు. అమ్మకి తప్పనిసరిగా హెల్త్ చెకప్స్ చేయించండి. థైరాయిడ్, హైబీపి, షుగర్ వంటి సమస్యలేమైనా ఉంటే అవి ఏ మేరకు అదుపులో ఉన్నాయో ఈ టెస్ట్‌ల ద్వారా తెలుసుకోవచ్చు. ఇందుకోసం ప్రతి 3 నెలలకి ఓ సారి చెకప్స్, ప్రతి సంవత్సరం బ్రెస్ట్ క్యాన్సర్ చెకప్స్, దీనికి సంబంధించిన సెల్ఫ్ టెస్ట్ ఇంట్లోనే 6 నెలలకి ఓసారి చేయించడం మంచిది.ప్రేమ పూరితమైన పలకరింపు!అన్నిటినీ మించి అమ్మ దగ్గర రోజూ కాసేపు కూర్చుని అమ్మను ప్రేమగా పలకరించి, ఆమెతో కాసేపు కబుర్లు చెప్పడం వల్ల ఎంతో సంతోషపడుతుంది అమ్మ. అమ్మ ఏమైనా చెప్పడానికి ప్రయత్నించినప్పుడు విసుక్కోవడం, కసురుకోవడం అసలు పనికిరాదు. అన్నింటికన్నా ముఖ్యమైన విషయం.. ఇలా మదర్స్‌డే, ఫాదర్స్‌డే వంటివి జరుపుకునేది విదేశాలలోనే కానీ, మనకెందుకులే అని పట్టించుకోకుండా ఊరుకోకండి.ప్రచార, ప్రసార మాధ్యమాల ద్వారా, సోషల్ మీడియా ద్వారా అమ్మలు కూడా అన్ని విషయాలూ తెలుసుకుంటున్నారనే విషయాన్ని గుర్తించండి. అమ్మకు తప్పనిసరిగా శుభాకాంక్షలు చెప్పి, ఆమె ఆశీర్వాదాన్ని అందుకోవడం మాత్రం మరచిపోవద్దు. విష్ యు ఏ హ్యాపీ మదర్స్ డే.. -
కొడుక్కు తుపాకీ అందుబాటులో ఉంచారని... తల్లిదండ్రులకు 15 ఏళ్ల జైలు
వాషింగ్టన్: కొడుకు చేసిన నేరానికి తల్లిదండ్రులకు శిక్ష విధించిన ఘటన అమెరికాలో చోటుచేసుకుంది. స్కూల్లో తుపాకీతో కాల్పులు జరిపిన నలుగురు పిల్లలను బలి తీసుకోవడంతో పాటు ఏడుగురిని గాయపర్చిన బాలుడి తల్లిదండ్రులకు కోర్టు 15 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఇంట్లో బాలుడికి తుపాకీ అందుబాటులో ఉండేలా పెట్టడమే వారి నేరమని నిర్ధారించింది. 2021 నవంబర్ 30న మిషిగన్ రాష్ట్రంలోని ఆక్స్ఫర్డ్ హైసూ్కల్లో ఎథాన్ క్రంబ్లీ అనే పిల్లాడు తుపాకీతో విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. అతని మానసిక ఆరోగ్యం సరిగా లేదని తేలింది. అలాంటప్పుడు మరింత అప్రమత్తంగా ఉండాల్సింది పోయి తుపాకీ అందుబాటులో ఉంచడం తల్లిదండ్రులు జేమ్స్, జెన్నిఫర్ తప్పేనని కోర్టు తేల్చింది. -
'వాళ్లకు తెలియకుండా పెళ్లి చేసుకోను'.. విజయ్ దేవరకొండ ఆసక్తికర కామెంట్స్!
ఫ్యామిలీ స్టార్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్న టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ. ప్రస్తుతం తన మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు. పరశురామ్ పెట్ల దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ చిత్రంలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా నటించింది. ఈ చిత్రాన్ని దిల్ రాజు, శిరీష్ సంయుక్తంగా నిర్మించారు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఫ్యామిలీ స్టార్ ఏప్రిల్ 5న థియేటర్లలో సందడి చేయనుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన విజయ్ దేవరకొండ తన పెళ్లిపై ఆసక్తికర కామెంట్స్ చేశారు. విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. 'పెళ్లి విషయంలో ఎప్పటి నుంచో క్లారిటీ ఉంది. అమ్మా, నాన్నకు నచ్చకుండా ఏం చేయను. వాళ్లకు నచ్చాలి. అలాగే వాళ్లకు నచ్చేటట్లు ఒప్పించాలి. ఆ బాధ్యత అంతా మనమే చూసుకోవాలి. మొత్తం అలా వదిలేయలేం కదా. పెళ్లి చేసుకున్న తర్వాత రాబోయే 30 ఏళ్లు మనం బతకాలి కదా. అన్ని కేర్‌ఫుల్‌గా చేసుకుని వాళ్లకు నచ్చేటట్టు చేసుకోవాల్సింది మనమే. సో దానికి ఇంకా చాలా టైముంది. అని అన్నారు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ తన పెళ్లి గురించి చేసిన కామెంట్స్ వైరలవుతున్నాయి. కాగా.. చాలాసార్లు నేషనల్ క్రష్ రష్మిక, విజయ్ డేటింగ్లో ఉన్నారంటూ వార్తలొస్తున్న సంగతి తెలిసిందే. -
ఆలోచించండి ఓ అమ్మానాన్న.. ఈసీ వినూత్న ప్రయత్నం
ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల గురించి ఉత్తరప్రదేశ్‌లోని పాఠశాల విద్యార్థులు త్వరలో తమ తల్లిదండ్రులకు లేఖలు రాయబోతున్నారు. "నా భవిష్యత్తు దేశంలోని బలమైన ప్రజాస్వామ్యంతో ముడిపడి ఉంది. దీని కోసం ఓటరు జాబితాలో మీ పేర్లను తప్పకుండా చూసుకుని రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో ఓటు వేసే ప్రతిజ్ఞ తీసుకోవాలని కోరుకుంటున్నాను" అని పిల్లలు తమ తల్లిదండ్రులను కోరనున్నారు. జాతీయ సగటుతో సమానంగా రాష్ట్రంలో ఓటింగ్ శాతాన్ని పెంచడానికి ఎన్నికల సంఘం చొరవతో ఉత్తరప్రదేశ్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ నవదీప్ రిన్వా జిల్లా యంత్రాంగం, విద్యా శాఖల సహకారంతో కృషి చేస్తున్నారు. ఎలక్షన్ కమిషన్ స్వీప్ (సిస్టమాటిక్ ఓటర్స్ ఎడ్యుకేషన్ అండ్ ఎలక్టోరల్ పార్టిసిపేషన్) చొరవలో భాగంగా ఈ చర్య తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈ మేరకు ఉత్తరప్రదేశ్ ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం ఉత్తరప్రదేశ్‌లోని పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులకు లేఖలు రాయడంలో సహాయం కోరుతూ డైరెక్టర్ జనరల్ (పాఠశాల విద్య)కి లేఖ రాసింది. 2024 లోక్‌సభ ఎన్నికలలో కుటుంబంలోని అర్హులైన సభ్యులందరూ తమ ఓటు హక్కును వినియోగించుకుంటామని పిల్లలు ఇచ్చే "ప్రతిజ్ఞ లేఖ"పై తల్లిదండ్రులు సంతకం చేయాల్సి ఉంటుంది. ఉత్తరప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల ఓటింగ్ సగటు జాతీయ సగటు కంటే చాలా తక్కువగా నమోదవుతూ వస్తోంది. 2019లో జాతీయ సగటు 67.4 శాతం ఉండగా ఉత్తరప్రదేశ్‌లో 59.21 శాతం పోలింగ్ నమోదైంది. అదేవిధంగా 2014లో దేశ సగటు 66.44 శాతం ఉండగా ఉత్తరప్రదేశ్‌లో 58.44 శాతం ఓటింగ్ నమోదైంది. -
అమ్మా, నాన్న ఆనంద విహారం
ఇన్స్టాగ్రామ్ యూజర్ వివేక్ వాఘ్ సర్ప్రైజ్ ట్రావెల్ ప్లాన్‌తో తల్లిదండ్రులను ఆశ్చర్యానందాలకు గురి చేశాడు. ‘ఫ్లైయిట్‌లో మనం జైపూర్‌కు వెళుతున్నాం’ అని చెప్పి తల్లిదండ్రులను ఎయిర్‌పోర్ట్‌కు తీసుకెళ్లాడు. పాస్‌పోర్ట్‌లను వారి చేతికి అందిస్తూ ఆఖరులో అసలు విషయం చెప్పాడు. తాము వెళుతున్నది జైపూర్ కాదని సింగపూర్‌కు అని తెలుసుకున్న వివేక్ తల్లిదండ్రులు ఆనందంలో మునిగిపోయారు. ఇది వారికి తొలి అంతర్జాతీయ ప్రయాణం. ‘సీ దెయిర్ రియాక్షన్... సర్ప్రైజ్ ట్రిప్’ కాప్షన్‌తో పోస్ట్ చేసిన ఈ వీడియో మూడు లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది. సోషల్ మీడియా యూజర్లు, సెలబ్రిటీలు ఈ వీడియోను చూసి ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. యాక్టర్ జై భానుశాలి ‘ప్రౌడ్ సన్. విషయం తెలిసిన తరువాత మీ తండ్రి ఇచ్చిన ఎక్స్ప్రెషన్ నాకు ఎంతగానో నచ్చింది. మా అబ్బాయి మమ్మల్ని సింగపూర్ తీసుకువెళ్లాడు అని ఆయన గర్వంగా స్నేహితులతో చెప్పుకోవచ్చు’ అని కామెంట్ పెట్టారు. -
హ్యాపీ... హ్యాపీ
‘పేరెంట్స్‌గా ఎప్పుడు ప్రమోట్ అవుతారు?’ అనే ప్రశ్నకు పెళ్లయినప్పట్నుంచి చిరునవ్వే సమాధానంగా ఇస్తూ వచ్చారు రణ్వీర్ సింగ్, దీపికా పదుకోన్. ఫైనల్‌గా తాము తల్లిదండ్రులు కానున్నట్లు ఈ భార్యాభర్తలు గురువారం ఇన్‌స్టా వేదికగా వెల్లడించారు. సెప్టెం బర్లో డెలివరీ డేట్ ఇచ్చినట్లు దీపిక పేర్కొన్నారు. ఈ హ్యాపీ న్యూస్‌ను సోషల్ మీడియాలో షేర్ చేయగానే పలువురు ప్రముఖులు రణ్వీర్–దీపికలకు శుభాకాంక్షలు తెలుపుతూ పోస్ట్‌లు షేర్ చేశారు. ఇక 2013లో ‘రామ్‌లీల’ సినిమాలో తొలిసారి కలిసి నటించారు రణ్వీర్, దీపిక. ఆ సమయంలోనే ఇద్దరి మధ్య ప్రేమ మొదలైందట. ఆ తర్వాత ‘పద్మావత్’ కోసం రణ్వీర్–దీపిక కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఈ చిత్రం 2018 జనవరిలో విడుదల కాగా, అదే ఏడాది నవంబరులో రణ్వీర్, దీపిక ఇటలీలో పెళ్లి చేసుకున్నారు. -
కలిసి మీరూ రాయండి
ఒకరోజు తేడాతో ఇంటర్మీడియెట్ పరీక్షలు రెండు రాష్ట్రాలలో మొదలయ్యాయి. పిల్లలు కొంత ఆందోళనగా, కొంత హైరానాగా ఉంటారు. ఈ సమయంలో పిల్లలు రాయాల్సిన వారుగా తాము రాయించే వారుగా తల్లిదండ్రులు ఉండరాదు. పిల్లల పరీక్షాకాలంలో తాము కూడా తోడుగా ఉన్న భావన కలిగించాలి. అలా కలిగించాలంటే వారిని వీలున్నంత సౌకర్యంగా ఉంచాలి. భయపెట్టని ప్రోత్సాహం అందించాలి. నిపుణుల సమగ్ర సూచనలు. తండ్రి ఆఫీసులోఎనిమిది గంటలు పని చేయగలడు. మధ్యలో విరామాలు ఎన్నో ఉంటాయి. అమ్మ ఇంట్లో మూడు పూట్లా పని చేస్తుంది. మధ్యలో ఆమెకూ విరామాలుంటాయి. కాని పరీక్షలు వచ్చినప్పుడు మాత్రం విరామం లేకుండా పిల్లలు చదువుతూనే ఉండాలంటారు తల్లిదండ్రులు. పిల్లలకు ధారణశక్తి డిఫరెంట్‌గా ఉంటుంది. ప్రతి పిల్లవాడికీ అది మారుతుంది. కొందరు ఒక అంశాన్ని అలా కళ్లతో చూసి గుర్తు పెట్టుకోగలరు. కొందరు అరగంట సేపు చూసి నేర్చుకోగలరు. మరికొందరు గంట చదివితే తప్ప గ్రహించలేరు. వీరు ముగ్గురూ పుస్తకం పట్టుకుని మాత్రమే కనిపించాలని పరీక్షల సమయంలో తల్లిదండ్రులు ఆశిస్తే ‘చదివిందే ఎంతసేపు చదవాలి’ అని మొదటి రెండు రకాల పిల్లలు విసుక్కుంటారు. కాబట్టి తల్లిదండ్రులు పిల్లల చేత పరీక్షలు రాయించడమంటే వారిని పూర్తిగా అర్థం చేసుకుంటూ వారికి సహకరిస్తూ, విరామాలిస్తూ, ప్రోత్సహిస్తూ చదివించడమే. వాళ్ల ప్లానింగ్‌ని వినాలి పిల్లలు పరీక్షల టైమ్ టేబుల్ రావడానికి ముందే వాళ్లదైన పద్ధతిలో ఎలా చదవాలో ప్లాన్ చేసుకుంటారు. అంటే వాళ్లు వీక్‌గా ఉన్న సబ్జెక్ట్‌ను ముందే చదువుకుంటారు. స్ట్రాంగ్‌గా ఉన్న సబ్జెక్ట్‌ను ఉపేక్షిస్తారు. మేథ్స్ పరీక్షకు ఒక్క రోజు మాత్రమే టైమ్‌టేబుల్‌లో విరామం వస్తే తెలుగు/సంస్కృతం పేపర్లో స్ట్రాంగ్‌గా ఉండే పిల్లలు మరో రెండు రోజుల్లో తెలుగు పేపర్ ఉందనగా కూడా మేథ్స్ చేసుకుంటూ కనిపించవచ్చు. వారిని బలవంతంగా తెలుగు చదివించాల్సిన పని లేదు. వారి ప్లానింగ్‌ని తల్లిదండ్రులు అర్థం చేసుకోవాలి. కొన్ని పేపర్లకు మూడు రోజుల గ్యాప్ రావచ్చు. ఆ మూడు రోజుల్లో మొదటి రోజును ఇంకో పేపర్ సిలబస్ కోసం కొందరు పిల్లలు కేటాయిస్తే కంగారు పడాల్సిన పని లేదు. ఆ రాయాల్సిన పరీక్షకు వారి ఉద్దేశంలో రెండు రోజులు చాలనే. ఇలాంటివి పిల్లలు చెప్పినప్పుడు మన మొండితనంతో ఇలాగే చదవాలని తల్లిదండ్రులు బలవంతం చేయకపోవడం మంచిది. బయటి తిండి వద్దు పరీక్షలు అయ్యేంత వరకూ తల్లిదండ్రులకు వీలున్నా లేకపోయినా బయటి ఆహారం అది బ్రేక్‌ఫాస్ట్ అయినా గాని ఇవ్వకపోవడం తప్పనిసరి. బయటి పదార్థాలు పొట్టని పాడు చేస్తే పరీక్ష రాయడం చాలా ఇబ్బంది అవుతుంది. పరిశుభ్రమైన ఇంటి తిండి పిల్లలకు అందించాలి. ఆకుకూరలు, కాయగూరలతో పాటు గుడ్డు తినే పిల్లలకు తినిపించాలి. బొప్పాయి, సపోటా మంచివి. పిల్లలు చదువుకునే డెస్క్ మీద, పరీక్ష హాలులో వాటర్ బాటిల్ ఉండేలా చూసుకోవాలి. పిల్లలు హైడ్రేట్‌గా ఉండేలా మజ్జిగ, నిమ్మరసం, కొబ్బరి నీళ్లు ఇస్తుండాలి. తోడు వెళ్లండి పిల్లలతో పాటు తల్లిదండ్రులు ఎవరో ఒకరు పరీక్షా కేంద్రానికి వెళితే పిల్లలకు ధైర్యంగా ఉంటుంది. పరీక్ష అయ్యే వరకూ బయటే ఉండి తీసుకొస్తాం అనంటే వారు లోపల ధైర్యంగా రాస్తారు. అలాగే పరీక్షలు అయ్యేంత వరకూ పిల్లలను ఒంటరిగా పనుల మీద బయటకు పంపరాదు. వెహికల్స్ నడపనివ్వరాదు. ఈ సమయంలో చిన్న ప్రమాదం కూడా పెద్ద నష్టానికి దారి తీస్తుంది. పరీక్షలు అయ్యేంత వరకూ పిల్లలు పెద్దల అజమాయిషీలోనే బయటకు వెళ్లాలి. వారితో వాక్ చేయండి పరీక్ష రాసి వచ్చాక, తర్వాతి పరీక్ష కోసం ప్రిపేర్ అవుతున్నప్పుడు పిల్లలతో సాయంత్రాలు తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరు అరగంట సేపు వాకింగ్‌కు వెళ్లండి. ఆ సమయంలో వారితో ఏవైనా కబుర్లు చెప్పండి. ఆ సమయంలో కూడా చదువు గురించి కాకుండా ఏవైనా సరదా విషయాలు మాట్లాడండి. వారికి బ్రేక్ ఇచ్చినట్టూ ఉంటుంది... వ్యాయామమూ జరిగినట్టుంటుంది. సిన్సియర్‌గా చదవమనండి: తమను తాము మోసం చేసుకోకుండా, తల్లిదండ్రులను మోసం చేయకుండా ఉన్న తెలివితేటలను బట్టి మేక్సిమమ్ ఎంత చదవగలరో అంతా సిన్సియర్‌గా చదివి పరీక్ష రాయమనండి. రాసిన దానిపై వాస్తవిక అంచనాతో ఉండమనండి. ఆ అంచనా ఎంతైనాగాని చెప్పమనండి. నిజాయితీగా రాయడమే తమ దృష్టిలో ముఖ్యమని, ఫలితాల సంగతి తర్వాత చూద్దామని చెప్పండి. వారు కొంత రిలీఫ్‌గా, మరింత శ్రద్ధగా పరీక్ష రాస్తారు. -
తిట్టడం సులభం.. ఫలితం అనూహ్యం
ఇంటికి రెండు గంటలు ఆలస్యంగా వచ్చిన టీనేజ్ కుమారుణ్ణి తల్లిదండ్రులు మందలిస్తే ఆ కుర్రవాడు ఆత్మహత్య చేసుకున్నాడు. హైదరాబాద్‌లో జరిగిన తాజా ఘటన ఇది. తల్లిదండ్రులు పిల్లల నడవడికను సరి చేయాలని ఆందోళన చెందడం మంచిదే కాని పిల్లల వయసును దృష్టిలో పెట్టుకుని వారి పొరపాట్లకు కారణాలను తెలుసుకోకుండా వారు చెప్పేది అర్థం చేసుకోకుండా తిడితే అసలుకే ప్రమాదం వస్తుంది. టీనేజ్ పిల్లలతో తల్లిదండ్రులు ఎలా వ్యవహరించాలి? ఇంటర్ చదివే కుర్రాడు కాలేజ్ అయిపోయాక రెండు గంటల ఆలస్యంగా ఇంటికొచ్చాడు. తల్లిదండ్రుల ఆలోచన: వీడు టైమ్ వేస్ట్ చేస్తున్నాడు. ఏ పనికిమాలిన బ్యాచ్తోనో తిరుగుతున్నాడు. ఏదో సినిమాకు వెళ్లి ఉంటాడు. ఇలా అయితే వీడు ర్యాంక్ తెచ్చుకున్నట్టే. వీడు ఎన్నిసార్లు చెప్పినా మారడం లేదు. ఇవాళ వీడికి బాగా పడాలి. కుర్రాడి ఆలోచనలు: ఉదయం నుంచి సాయంత్రం వరకూ క్లాసులు చాలా స్ట్రెస్‌గా ఉంటున్నాయి. కొంచెం కూడా రిలాక్స్ అవడానికి లేదు. మా బ్యాచ్ అంతా కాసేపు బేకరీకి వెళ్దామంటున్నారు. నేను వెళ్లకపోతే వాళ్లు నన్ను ఐసొలేట్ చేస్తారు. అలుగుతారు. బ్యాచ్ నుంచి కట్ చేస్తారు. అందరూ వెళుతుంటే నేనెందుకు వెళ్లకూడదు. వెళ్లి ఇంటికి వెళతా. రెండు వెర్షన్లు సరైనవే. కాని ఒక వెర్షన్ వారికి ఆధిపత్యం ఉంటుంది. మరో పక్షం వారికి ఆందోళన ఉంటుంది. తల్లిదండ్రులు ఇంటి యజమానులు. కుర్రాడికి కూడా యజమానులు. వారు యజమానులు కాకుండా తల్లిదండ్రులు ఎప్పుడవుతారంటే ఆ కుర్రాడు ఏదీ దాచకుండా తల్లిదండ్రులకు చెప్పినప్పుడు. చెప్పుకునే వాతావరణం ఉన్నప్పుడు. దానిని అర్థం చేసుకుని ఎంతవరకు అలౌ చేయాలో అంత వరకూ అలౌ చేయగలిగినప్పుడు. పై సందర్భంలో ఆ కుర్రాడు ‘మా బ్యాచ్ అంతా బేకరీకి వెళ్దామంటున్నారు’ అని కాల్ చేస్తే తల్లిదండ్రులు ‘సరే.. వెళ్లు. కాని దాని వల్ల నీ టైమ్ వేస్ట్ అవుతుంది. అలాగని వెళ్లకపోతే బాగుండదు. ఒక గంట సేపు ఉండి వచ్చెయ్’ అనగలిగితే ఆ కుర్రాడు 45 నిమిషాలే ఉండి వచ్చే అవకాశం ఉంది. కాని తిడతారనే భయంతో చెప్పకుండా, లేట్‌గా ఇంటికొచ్చినప్పుడు... తల్లిదండ్రులు ముందు వెనుకా చూడకుండా చెడామడా తిడితే ఆ చిన్న హృదయం ఎంత ఇబ్బంది పడుతుంది? సెన్సిటివ్ పిల్లలు అయితే అఘాయిత్యానికి పాల్పడితే? అంగీకరించాలి: టీనేజ్‌లోకి వచ్చిన పిల్లల తల్లిదండ్రులు తమ పిల్లల ప్రస్తుత స్థితిని అంగీకరించాలి మొదట. తమ టీనేజ్ కాలానికి ఇప్పటి టీనేజ్ కాలానికి కాలం చాలా మారిపోయి ఉంటుందని గ్రహించాలి. తమలాగే తమ పిల్లలు ఉండాలనుకుంటే అది కాలానికి విరుద్ధం. ఈ కాలంలో పిల్లలు ఎలా ఉండాలనుకుంటారో అలా ఉంటారు. అందులో ఏ మేరకు చెడు ఉందో చూసి దానిని పరిహరించడానికి మాత్రమే తల్లిదండ్రులు ప్రయత్నించాలి. పిల్లలకు సవాళ్లు: మీ పిల్లలు మీకు సమస్య సృష్టిస్తున్నారా? లేదా మీరు మీ పిల్లలకు సమస్య సృష్టించారా? మీ పిల్లలు వారికి ఇష్టమైన కోర్సు చదివేలా చూశారా? వారు యావరేజ్ స్టూడెంట్ అయినా ఫస్ట్ ర్యాంక్ రావాలని వెంట పడుతున్నారా? వారి జ్ఞాపకశక్తి పరీక్షలకు వీలుగా ఉందా? వారికి అన్ని సబ్జెక్ట్‌లు అర్థం అవుతున్నాయా? వారికి పరీక్షల వొత్తిడి ఎలా ఉంది? వారికి ఏ మాత్రమైన ఆహ్లాదం అందుతోంది? ఇవన్నీ గమనించకుండా పిల్లలు మరబొమ్మల్లా ఎప్పుడూ చెప్పినట్టల్లా వింటూ కేవలం పుస్తకాలు మాత్రమే పట్టుకుని కూచోవాలని ఆశిస్తే ఆ పిల్లలకు ఉక్కిరిబిక్కిరి ఎదురవుతుంది. దాని నుంచి బయటపడాలని తల్లిదండ్రులకు తెలియకుండా దొంగపద్ధతులకు దిగుతారు. అది తల్లిదండ్రులకు ఇంకా తప్పుగా కనిపిస్తుంది. వారు తప్పు చేసేలా చేసింది తల్లిదండ్రులే మరి. పనిష్మెంట్ వద్దు ఇన్స్పిరేషన్ ముఖ్యం: పిల్లలు టీనేజ్‌లోకి వచ్చాక మానసికంగా, శారీరకంగా ఒక ట్రాన్స్ఫర్మేషన్లో ఉంటారు. ఆ సమయంలో వారు ఫోకస్ పెట్టి చదవాలని అనుకున్నా కొన్ని డిస్ట్రాక్షన్లు ఉంటాయి. అంతేగాక ఈ సమయంలో వారు ఎన్నో సందేహాలతో ప్రవర్తనకు సంబంధించి సంశయాలతో ఉంటారు. తల్లిదండ్రులు ఎంతో సన్నిహితంగా ఉంటూ వారితో సంభాషిస్తూ ‘ఏదైనా మాతో చెప్పి చేయండి’ అనే విధంగా మాట్లాడితే చాలా సమస్యలు తీరుతాయి. చదువు పట్ల, ప్రవర్తన పట్ల వారిని తల్లిదండ్రులు ఇన్‌స్పయిర్ చేసేలా ఉండాలి తప్ప పనిష్మెంట్ చేసేలా ఉండకూడదు. తిట్టడం, కొట్టడం అనేవి కాదు చేయాల్సింది. బుజ్జగించడం, బతిమాలడం కూడా కాదు. కేవలం స్నేహంగా గైడ్ చేయడం. వారి వల్ల జరిగే తప్పులను, పొరపాట్లను జడ్జ్ చేయకుండా వారి వైపు నుంచి ఆలోచించి వారికి అర్థమయ్యేలా సరి చేయడం. టీనేజ్‌లో ఉన్న పిల్లలకు పెద్దవాళ్లు చెప్పేది అర్థమవ్వాలంటే వారు పెద్దవాళ్లంత వయసుకు చేరాలి. కాబట్టి తల్లిదండ్రులే పిల్లల వయసుకు దిగి పిల్లలతో వ్యవహరించడం ఇరుపక్షాలకు శ్రేయస్కరం. -
ఐన్‌స్టీన్‌ను మించిన తెలివున్నా.. ఆమెకు తీరని ఆవేదన?
ఆ అమ్మాయి.. ప్రముఖ శాస్త్రవేత్తలు ఐన్‌స్టీన్, స్టీఫెన్ హాకింగ్స్‌కు మించిన తెలివితేటలు కలిగినది. ఆమె ఐక్యూ 161 పాయింట్లు. ఇంతటి ప్రతిభావంతురాలైన ఆమెకు చదువు చెప్పలేక ఉపాధ్యాయులే సతమతమవుతున్నారట. ఇంగ్లండ్‌లోని స్లోఫ్‌కు చెందిన మహ్నూర్ చీమా(17)తన తొమ్మిదేళ్ల వయసులో పాకిస్తాన్ నుంచి కుటుంబంతోపాటు బ్రిటన్‌కు వచ్చింది. ఈ సమయంలో ఆ చిన్నారి తన ప్రతిభను చూపినప్పటికీ ఉపాధ్యాయులు పైతరగతికి ప్రమోట్ చేయలేదు. బెర్క్‌షైర్‌లోని కోల్న్బ్రూక్ చర్చ్ ఆఫ్ ఇంగ్లండ్ ప్రైమరీ స్కూల్ ఉపాధ్యాయులు తాను క్లాస్ వర్క్‌ను అందరికన్నా త్వరగా పూర్తి చేసినప్పటికీ, పై క్లాస్‌కు వెళ్లేందుకు అనుమతించలేదని, పైగా అదనంగా గణితాన్ని అభ్యసించాలని ఆదేశించారని చీమా తెలిపింది. ఆమె లాంగ్లీ గ్రామర్ స్కూల్‌కి మారినప్పుడు, జీసీఎస్ఈ పరీక్షలకు కూర్చోకుండా నిరుత్సాహపరిచారని చీమా ఆరోపించింది. అయితే చీమాపై ఒత్తిడి అధికంగా ఉందని, దానికి గుర్తుగా ఆమె కళ్లకింద నల్లని వలయాలు ఏర్పడ్డాయని ఉపాధ్యాయులు చెబుతున్నారు. అయితే ఆమె తల్లిదండ్రులు తమ చిన్నారి తెలివితేటలకు తగిన విద్యను అందించేందుకే యూకే వచ్చామని తెలిపారు. మహ్నూర్ చీమా మీడియాతో మాట్లాడుతూ తన మాదిరిగా ప్రతిభ కలిగిన చాలామంది విద్యార్థులు ఉన్నారని, అయితే వారి సామర్థ్యాన్ని ఎవరూ గుర్తించడం లేదని, ఫలితంగా వారి ప్రతిభ వృథా అవుతున్నదని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. తాను ప్రతిభావంతులైన పలువురు విద్యార్థులతో మాట్లాడానని, వారు కూడా తనలానే నిరాశతో ఉన్నారని అమె పేర్కొంది. ప్రతిభావంతులైన విద్యార్థులకు చేయూతనందించాల్సిన బాధ్యత విద్యాసంస్థలపై ఉందని, బ్రిటీష్ విద్యావ్యవస్థలో గణిత బోధన చాలా నెమ్మదిగా సాగుతున్నదని, బ్రిటన్‌లోని 11 ఏళ్ల విద్యార్థులకు నిర్వహించే పరీక్షలను పాకిస్తాన్లో మూడవ సంవత్సరం పిల్లలు పూర్తి చేయగలరని చీమా వ్యాఖ్యానించింది. చీమా తన జీసీఎస్‌ఈలో 33 నైన్లు సాధించింది. ఇది అత్యధిక స్కోర్. అలాగే తాను ఉంటున్న ప్రాంత పరిధిలోని పలు పాఠశాలల ప్రవేశ పరీక్షలకు హాజరై, మూడు కౌంటీలలో అగ్రస్థానంలో నిలిచింది. చీమా కుటుంబం పాకిస్తాన్‌లోని లాహోర్ నుండి 2006లో యూకేకి తరలివచ్చింది - ఆమె తండ్రి, ప్రముఖ న్యాయవాది. తల్లి ఆర్థికశాస్త్రంలో రెండు డిగ్రీలు సాధించారు. జాతీయ గణిత ఛాంపియన్‌గా నిలిచిన 14 ఏళ్ల సోదరి కూడా ఆమెకు ఉంది. ప్రస్తుతం చీమా..హెన్రిట్టా బార్నెట్ స్కూల్లో విద్యనభ్యసిస్తోంది. చీమాకు స్విమ్మింగ్‌తో పాటు గుర్రపు స్వారీ చేయడమంటే కూడా ఎంతో ఇష్టం. -
బర్త్ ఆర్డర్ కూడా వ్యక్తిత్వాన్ని ప్రభావితం చేస్తుంది!
‘మా పెద్దోడు చాలా బాధ్యతగా ఉంటాడు. కానీ చిన్నోడికే అస్సలు బాధ్యత లేదు. ఏం చెప్పినా పట్టించుకోడు. వాడిని ఎలా మార్చాలో అర్థం కావట్లేదు. మీరేమైనా హెల్ప్ చేస్తారని వచ్చాను’ అన్నారు సుబ్బారావు. ‘మా పెద్దపాప ఇంట్లో అన్ని పనులూ అందుకుంటుంది. కానీ చిన్నపాప మాత్రం ఎప్పుడూ డాన్స్, స్పోర్ట్స్ అంటూంటుంది. దాన్ని ఎలా దారిలో పెట్టాలో అర్థం కావడంలేదు’ చెప్పారు కోమలి. ఇంటికి పెద్ద బిడ్డ యజమాని లాంటి వాడు, బాధ్యతగా ఉంటాడు. రెండో బిడ్డ ప్రశాంతంగా ఉంటాడు. చివరివాడు బాధ్యతలేకుండా అల్లరిచిల్లరగా తిరుగుతుంటాడు.. ఇలాంటి మాటలు మీరు వినే ఉంటారు. ఇది నిజమేనని నమ్మేవాళ్లూ ఉంటారు.. ఇదంతా ట్రాష్ అని కొట్టేసేవాళ్లూ ఉంటారు. దీనిపై సైకాలజిస్టులు కూడా అధ్యయనం చేశారు. ప్రముఖ ఆస్ట్రియన్ సైకాలజిస్ట్ ఆల్ఫ్రెడ్ అడ్లర్ 20వ శతాబ్దం ప్రారంభంలో బర్త్ ఆర్డర్ సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టాడు. కుటుంబంలో జన్మించిన క్రమం బిడ్డ ప్రవర్తన, భావోద్వేగాలు, ఇతర వ్యక్తులతో సంబంధాలపై శాశ్వత ప్రభావాన్ని చూపుతుందని ఈ సిద్ధాంతం సూచిస్తుంది. మొదటి బిడ్డలు ఎక్కువ శ్రద్ధ (బాధ్యత), మధ్యస్థ శిశువులు తక్కువ శ్రద్ధ (ఎక్కువ స్వాతంత్య్రం)ను పొందుతారనే ఆలోచనలో కొంత నిజం ఉండవచ్చు. చివరి బిడ్డలకు ఎక్కువ స్వేచ్ఛ (తక్కువ క్రమశిక్షణ) లభిస్తాయి. అయితే బర్త్ ఆర్డర్ ఒక ఫ్యాక్టర్ మాత్రమే. తల్లిదండ్రులు, తోబుట్టువులతో సంబంధాలు, జన్యువులు, పర్యావరణం, సామాజిక.. ఆర్థిక స్థితి వంటి అంశాలు కూడా పిల్లల వ్యక్తిత్వాన్ని ప్రభావితం చేస్తాయి. పేరెంటింగ్ స్టైల్ అనేది పిల్లల వ్యక్తిత్వాన్ని అమితంగా ప్రభావితం చేస్తుందనేది అనేక పరిశోధనల సారాంశం. అడ్లర్ సిద్ధాంతం ప్రకారం ఏ పిల్లలు ఎలా ఉంటారో తెలుసుకుందాం. మొదటి బిడ్డ అడ్లర్ బర్త్ ఆర్డర్ సిద్ధాంతం ప్రకారం, తొలి సంతానం.. వారి తల్లిదండ్రుల నుంచి ఎక్కువ శ్రద్ధ, సమయాన్ని పొందుతారు. కొత్త తల్లిదండ్రులు అప్పుడే పిల్లల పెంపకం గురించి నేర్చుకుంటున్నారు కాబట్టి కొంచెం జాగ్రత్తగా, కొన్నిసార్లు కఠినంగా, కొన్నిసార్లు న్యూరోటిక్‌గా కూడా ఉండవచ్చు. మొదటి సంతానం టైప్ A వ్యక్తిత్వాలతో బాధ్యతాయుతమైన నాయకులుగా ఉంటారు. కుటుంబంలోకి రెండో బిడ్డ వచ్చినప్పుడు తనకు కేటాయించే సమయం తగ్గడంవల్ల రెండో బిడ్డను చూసి అసూయపడతారు. ఆ తర్వాత తన తోబుట్టువుల పోషణ బాధ్యత తీసుకోవాల్సి రావడం వల్ల ఆదర్శంగా నిలిచేందుకు ప్రయత్నిస్తారు. మొదట జన్మించిన పిల్లలు అధునాతన అభిజ్ఞాభివృద్ధిని కలిగి ఉంటారని పరిశోధన కనుగొంది, ఇది చదువులో మంచి ఫలితాలను సాధించేందుకు ఉపయోగపడుతుంది. మిడిల్ చైల్డ్ తనకన్నా పెద్ద బిడ్డకు, చిన్న బిడ్డకు మధ్య విభేదాలకు మధ్యవర్తిత్వం వహించాల్సిన అవసరం ఉన్నందున, మధ్య పిల్లలు కుటుంబంలో శాంతిని కలిగించేవారుగా ఉంటారని అడ్లర్ సూచించాడు. పేరెంట్స్ పెద్దగా పట్టించుకోకపోవడం వల్ల వారి దృష్టిని ఆకర్షించేందుకు, ఆదరణ పొందేందుకు వారిని ఆహ్లాదపరచేలా ప్రవర్తిస్తారు. తోబుట్టువులతో నిరంతరం పోటీలో ఉన్నట్లు అనిపించవచ్చు. వీరిలో అభద్రతా భావం, తిరస్కరణ భయం, బలహీనమైన ఆత్మవిశ్వాసం ఉండవచ్చు. తిరస్కరణ పట్ల సున్నితంగా ఉంటారు. తోబుట్టువులకు భిన్నంగా నిలబడాలనుకున్నప్పుడు తిరుగుబాటు లక్షణాలను కలిగి ఉంటారు. మధ్య పిల్లలు తమ తల్లులతో సన్నిహితంగా ఉండే అవకాశం తక్కువగా ఉందని అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఆఖరి బిడ్డ చివరి బిడ్డ పుట్టే కాలానికి తల్లిదండ్రులకు పిల్లల పెంపకంలో అనుభవం ఉండటం వల్ల కొన్నిసార్లు తక్కువ కఠినంగా ఉంటారు. చివరి బిడ్డ అని గారాబంగా పెంచడంవల్ల, మిగతావారితో పోల్చినప్పుడు చెడిపోయినట్లు కనిపిస్తారు. చిన్నపిల్లలుగా దొరికే స్వేచ్ఛవల్ల కలివిడిగా, స్నేహంగా, చార్మింగ్‌గా ఉంటారు. అయితే ఈ పిల్లలు తక్కువ స్వీయ–నియంత్రణ నైపుణ్యాలను కలిగి ఉండవచ్చు. ఇతరులపై ఎక్కువ ఆధారపడవచ్చు. మేనిప్యులేటివ్గా, అపరిపక్వంగా, సెల్ఫ్ సెంటర్డ్గా కనిపిస్తారు. ఏకైక సంతానం కుటుంబంలో ఏకైక సంతానంగా ఉన్నవారు తల్లిదండ్రుల దృష్టిని, వనరులను తోబుట్టువులతో పంచుకోవాల్సిన అవసరం లేదు. పెద్దలతో ఎక్కువగా సంభాషిస్తారు కాబట్టి, వయసుకు మించి పరిణతి చెందినట్లు కనిపిస్తారు. క్రియేటివ్ ఆలోచనలతో ఏకాంత సమయాన్ని ఆస్వాదిస్తారు. తన ప్రవర్తనపై నియంత్రణ కలిగి ఉంటారు. తల్లిదండ్రుల అధిక అంచనాల కారణంగా అన్నీ ఫర్ఫెక్ట్గా ఉండాలనే ధోరణి కలిగి ఉంటారు. జీవితంలో ఉన్నతమైనదాన్ని సాధించాలనే కోరిక ఉంటుంది. సాధిస్తారు. స్వావలంబన, ఊహాత్మక ధోరణి ఉంటుంది. సెన్సిటివ్‌గా ఉంటారు. సైకాలజిస్ట్ విశేష్, psy.vishesh@gmail.com -
నారాయణ ఎన్నికల కు‘తంత్రం’
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: ‘హలో గుడ్ ఈవినింగ్. నేను నారాయణ విద్యాసంస్థల నుంచి ఫోన్ చేస్తున్నాను. మీ అబ్బాయి మా స్కూల్లో చదువుతున్నాడు కదా. మీ కుటుంబం గురించి కొన్ని వివరాలు కావాలి. మీరు నివాసం ఉంటున్నది ఎక్కడ. ఏ డివిజన్లో మీ ఇల్లు ఉంది. మీ ఇంట్లో ఓటర్లు ఎంత మంది? పోలింగ్ బూత్, ఓటరు ఐడీ నంబర్లు చెప్పండి. చివరగా మీ బ్యాంకు అకౌంట్ నంబరు చెప్పండి’ ఇవీ నెల్లూరు నారాయణ విద్యాసంస్థల నుంచి వచ్చే ఫోన్ కాల్లో అడుగుతున్న వివరాలు. ఆ విద్యాసంస్థల్లోని ఉద్యోగులు కొన్ని రోజులుగా ప్రజల వ్యక్తిగత సమాచారం సేకరిస్తుండడం చర్చనీయాంశంగా మారింది. రాజకీయ కేంద్రాలుగా విద్యాసంస్థలు 2019 ఎన్నికల్లో నెల్లూరు నగరం నుంచి పోటీచేసి ఓటమి చెందిన పొంగూరు నారాయణ ఈ దఫా కూడా పోటీకి సిద్ధమయ్యారు. స్థానికంగా విద్యాసంస్థల్నే తన రాజకీయ కార్యకలాపాలకు కేంద్రాలుగా మార్చేసుకున్నారు. అక్కడ పనిచేస్తున్న వందలాది మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులను ఎన్నికల టీంగా ఏర్పాటు చేసుకుని రాజకీయ వ్యవహారాలు నడిపిస్తున్నారు. గతంలో ఆ ఉద్యోగులు ఓటర్ల వ్యక్తిగత డేటా సేకరణ చేస్తూ పట్టుబడి స్థానికుల చేత తన్నులు తిని పోలీస్‌స్టేషన్‌లో పంచాయితీ వరకు వెళ్లాల్సి వచి్చంది. నెల జీతం కోసం పనిచేసే ఉద్యోగులను స్థానికుల చేతిలో చావుదెబ్బలు తినాల్సిన పరిస్థితికి నారాయణ తీసుకువచ్చారు. దీనిపై గతంలో పెద్ద దుమారమే రేగింది. మరోసారి విద్యార్థుల కుటుంబాల సమాచారం సేకరించే ప్రయత్నం చేస్తున్నారు. నెల్లూరు నగరంలో దాదాపు 12 వేల మంది విద్యార్థులు నారాయణ విద్యాసంస్థల్లో చదువుకుంటున్నారు. ఆయా విద్యార్థుల కుటుంబ సభ్యుల ఓట్ల కోసం గాలం వేసేందుకు సమాచారం సేకరించే పనిలో ఉద్యోగులు ప్రస్తుతం బిజీగా ఉన్నారు. 2019 ఎన్నికల్లో తాను నమ్మిన వాళ్లే ఓటుకు నోటు సక్రమంగా చేర్చలేదన్న అభిప్రాయంతో ఉన్న నారాయణ ఈ దఫా వారిని నమ్మకుండా ఓటర్ల బ్యాంకు ఖాతాను సేకరించి వారి ఖాతాలోకే నోటు చేర్చేలా పథకం రచించారనే ఆరోపణలు విన్పిస్తున్నాయి. ఐదేళ్లగా ముఖం చాటేసి.. నెల్లూరు నగర నియోజకవర్గంలో టీడీపీ జెండా మోసి పార్టీ కష్టకాలంలో అండగా ఉన్న నేతలను కాదని గత ఎన్నికల్లో నారాయణ టికెట్ ఎగరేసుకుపోవడాన్ని ఆ పార్టీ క్యాడర్ జీరి్ణంచుకోలేకపోయింది. దీంతో అందరూ నారాయణకు వెన్నుపోటు పొడవడంతో ఓటమి చెందారు. ఆ తరువాత నాలుగున్నర ఏళ్ల కాలంగా నియోజకవర్గానికి ముఖం చాటేసిన నారాయణ ఎన్నికల సమయంలో వచ్చి ఓట్లు అడగడంపై పార్టీ క్యాడర్ గుర్రుగా ఉంది. -
నారాయణ విద్యాసంస్థల్లో బయటపడ్డ భారీ కుట్ర
-
ఘోరం: కేన్సర్ చిన్నారిని గంగలో ముంచి..
నమ్మకం మనిషి ఎదుగుదలకు సాయపడాలే తప్ప ప్రాణాల మీదకు తీసుకురాకూడదు. ప్రస్తుత సమాజంలో నమ్మకాలను మూడనమ్మకాలుగా మార్చుతున్నారు. విశ్వాసాల పేరుతో మానవత్వాన్ని మరచి క్రూరంగా ప్రవర్తిస్తున్నారు. తమతోపాటు ఇతురల జీవితాలను ప్రమాదంలోకి నెట్టేస్తున్నారు. మూఢ నమ్మకం పేరుతో జరిగిన అలాంటి ఓ అమానవీయ ఘటనే తాజాగా ఉత్తరాఖండ్ రాష్ట్రంలో వెలుగుచూసింది. అనారోగ్యం బారిన పడిన కొడుకుని నయం చేసేందుకు తల్లిందండ్రులు చేసిన ప్రయత్నం అందరినీ ఆగ్రహానికి గురిచేస్తోంది. ఢిల్లీకి చెందిన కుటుంబంలో అయిదేళ్ల చిన్నారి బ్లడ్ క్యాన్సర్‌తో బాధపడుతున్నాడు. హాస్పిటల్లో చేర్చి చికిత్స అందిస్తున్నారు. అయితే పిల్లాడి తల్లిదండ్రులు మూఢ విశ్వాసాలను నమ్మి పిల్లవాడిని హరిద్వార్ తీసుకెళ్లలనుకున్నారు. అక్కడి గంగ నదిలో పవిత్ర స్నానం చేయడం వల్ల ఏదో అద్భుతం జరిగి బాలుడి ఆరోగ్యం కుదుటపడుందని గుడ్డిగా విశ్వసించారు. అనుకున్నది పనిగా బుధవారం ఢిల్లీ నుంచి ట్యాక్సీలో బయల్దేరారు. అప్పటికే అస్వస్థతకు గురైన బాలుడు.. హరిద్వార్‌కు చేరుకునే సమయానికి అతని పరిస్థితి మరింత దిగజారిపోయింది. చదవండి:మార్కులు తక్కువ వచ్చాయని... హరిద్వార్‌లోని హర్కీ పౌరికి వద్దకు వచ్చిన బాలుడి తల్లిదండ్రులు వాగు ఒడ్డున మంత్రాలు పఠించారు. పిల్లవాడిని గంగనాదిలో స్నానం చేయించేందుకు నీటిలో ముంచారు. పసివాడు భయంతో ఏడుస్తూ గట్టి అరిచినా పట్టించుకోకుండా గంగంలో పదేపదే ముంచాడు. బాధతో కొడుకు అల్లాడుతుంటే ఆ తల్లి మాత్రం వెకిలి నవ్వుతో ‘ నా పిల్లవాడు లేచి నిలబడతాడు.. అది నా వాగ్దానం’ అంటూ చెబుతోంది. చివరికి ఊపిరాడక చిన్నారి నీటిలోనే చనిపోయాడు. ఈ దృశ్యాలను ఘాట్‌కు అవతలివైపు ఉన్న ఓ వ్యక్తి తన మొబైల్లో రికార్డ్ చేశాడు. అనంతరం అక్కడ ఉన్నవారు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వాళ్లు ఘాట్ వద్దకు చేరుకునేసరికి పిల్లవాడు ప్రాణాలు విడిచాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చిన్నారి తల్లిదండ్రులు, అత్తను విచారణ నిమిత్తం అదుపులోకి తీసుకున్నట్లు హర్ కీ పైరీ ఎస్‌హెచ్ భావన కైంతోలా తెలిపారు. -
పని నుంచి బడికి..
రాష్ట్ర వ్యాప్తంగా బాల కార్మికులుగా మగ్గుతున్న అనేక మంది పిల్లలను సీఐడీ అధికారులు గుర్తించి వారిని మళ్లీ బడిలో చేర్పిస్తున్నారు. ‘ఆపరేషన్ స్వేచ్ఛ’ కార్యక్రమం బాల కార్మికుల జీవితాల్లో మళ్లీ విద్యా వెలుగులు తీసుకువస్తోంది. సాక్షి, అమరావతి: అనంతపురం జిల్లా కేంద్రానికి చెందిన చెందిన నాని.. ఏడో తరగతి తర్వాత చదువు మానేశాడు. కుటుంబ ఆర్థిక సమస్యల కారణంగా ఓ బైక్ మెకానిక్ షాపులో పనికి చేరాడు. రెండేళ్ల పాటు ఆ షాపులోనే సహాయకుడిగా పనిచేశాడు. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలకు ‘ఆపరేషన్ స్వేచ్ఛ’ పేరిట అవగాహన కార్యక్రమాలను చేపడుతున్న సీఐడీ అధికారులు.. నానిని చూశారు. అతని ఇంటికి వెళ్లి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. చదువు ఆవశ్యకతను వివరించారు. పిల్లల చదువుల కోసం ప్రభుత్వం అందిస్తున్న వివిధ సంక్షేమ పథకాల గురించి వివరించారు. చదువుకుంటే ఉజ్వల భవిష్యత్ ఉంటుందని వారికి అవగాహన కల్పించారు. నానిని అదే బడిలో 8వ తరగతిలో చేర్చించారు. ప్రస్తుతం నాని తోటి పిల్లలతో కలిసి చక్కగా చదువుకుంటున్నాడు. ఇక తాను పనికి వెళ్లనని, బాగా చదువుకుని ఉద్యోగం చేస్తానని ఆత్మ విశ్వాసంతో చెబుతున్నాడు. బాల కార్మికుల నుంచి మళ్లీ విద్యార్థులుగా.. సామాజికబాధ్యత కింద బాల కార్మిక వ్యవస్థ నిర్మూల కోసం సీఐడీ చేపట్టిన ‘ఆపరేషన్ స్వేచ్ఛ’ సాధించిన విజయమిది. ఇలా ఒక్క నాని మాత్రమే కాదు.. రాష్ట్ర వ్యాప్తంగా బాల కార్మికులుగా మగ్గుతున్న అనేక మంది పిల్లలను సీఐడీ అధికారులు గుర్తించి వారిని మళ్లీ బడిలో చేర్పిస్తున్నారు. బాల కార్మికులుగా కష్టాల కడలిలో ఈదుతున్న వారిని సీఐడీ అధికారులు గుర్తించి సురక్షితంగా చదువుల తల్లి ఒడిలోకి చేర్చారు. ఆపరేషన్ స్వేచ్ఛ కార్యక్రమం బాల కార్మికుల జీవితాల్లో మళ్లీ విద్యా వెలుగులు తీసుకొస్తోంది. ఆపరేషన్ స్వేచ్ఛ కార్యక్రమాన్ని సీఐడీ విభాగం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇందుకోసం 26 జిల్లాల్లో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది. సీఐడీ అధికారులతో పాటు మహిళా–శిశు సంక్షేమ శాఖ, బాలల సంక్షేమ కమిటీలు, వివిధ సామాజిక సేవా సంస్థల ప్రతినిధులతో జిల్లా స్థాయిల్లో కమిటీలను నియమించింది. ఈ ఏడాది మొత్తం నాలుగు దశల్లో 66 రోజుల పాటు ఆపరేషన్ స్వేచ్ఛ పేరిట ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించింది. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను సద్వినియోగం చేసుకుంటూ క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటించి బాల కార్మికులను గుర్తించింది. ప్రధానంగా బాల కార్మికులను ఎక్కువుగా పనిలో పెట్టుకునే ఇటుక బట్టీల తయారీ, హోటళ్లు, వివిధ పారిశ్రామిక యూనిట్లు, కిరాణా దుకాణాలు, మెకానిక్ షెడ్లు, ఇతర చోట్ల విస్తృతంగా తనిఖీలు నిర్వహించింది. ఆపరేషన్ స్వేచ్ఛ కార్యక్రమం ద్వారా మొత్తం 1,506 మంది బాల కార్మికులను గుర్తించింది. వారిలో బాలురు 1,299 మంది ఉండగా.. బాలికలు 207 మంది ఉన్నారు. మొత్తం బాల కార్మికుల్లో ఇతర రాష్ట్రాలకు చెందిన 609 మందిని వారి సొంత రాష్ట్రాలకు పంపించి తల్లిదండ్రుల చెంతకు చేర్చింది. మన రాష్ట్రానికి చెందిన 897 మంది బాల కార్మికుల తల్లిదండ్రులతో చర్చించి వారికి అవగాహన కల్పించి.. ఆ పిల్లలను మళ్లీ బడుల్లో చేర్పించింది. బాల కార్మికులుగా మారడానికి కారణాలు తల్లిదండ్రులు లేకపోవడం:36 మంది పరీక్షల్లో ఫెయిల్ కావడం29 మంది పేదరికం: 984 మంది ఇతర కారణాలు:457 మంది మళ్లీ బడిలో చేరిన బాల కార్మికులు సామాజికవర్గాలవారీగా.. ఎస్సీ259 మంది ఎస్టీ131 మంది బీసీ719 మంది మైనార్టీ190 మంది ఓసీ 207 మంది మళ్లీ బడిలో చేర్పించే నాటికి బాల కార్మికులుగా పనిచేస్తున్నవారు.. ఇటుక బట్టీల్లో 138 మంది హోటళ్లలో 117 మంది పారిశ్రామిక యూనిట్లలో 143 మంది ఇతర చోట్ల 1108 మంది బాల కార్మికులుగా చేరేనాటికి వారి చదువులు ఇలా.. నిరక్ష్యరాస్యులు264 మంది అయిదో తరగతిలోపు 270 మంది అయిదు నుంచి పదో తరగతి 792 మంది చెప్పలేనివారు 180 మంది సామాజిక, ఆర్థిక దృక్కోణంలో విశ్లేషణ.. బాల కార్మికులను గుర్తించి కేవలం మళ్లీ బడుల్లో చేర్చడమే కాదు.. ఈ సమస్య మూలాలను గుర్తించి శాశ్వత పరిష్కారం దిశగా సీఐడీ కార్యాచరణ చేపట్టింది. అందుకోసం బాల కార్మికుల సామాజిక, ఆర్థిక అంశాలపైనా విస్తృతంగా అధ్యయనం చేస్తోంది. తద్వారా బాల కార్మిక వ్యవస్థను సమూలంగా పెకలించి వేసి బడి ఈడు పిల్లలు అందరూ కచ్చితంగా బడుల్లోనే ఉండేలా కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తున్నారు. బాల కార్మిక వ్యవస్థ నుంచి విముక్తి కల్పించిన బాలల వివరాలిలా ఉన్నాయి.. సమన్వయంతో సత్ఫలితాలు బాల కార్మికుల వ్యవస్థను నిర్మూలించడానికి అన్ని విద్య, మహిళా–శిశు సంక్షేమ, గ్రామ, వార్డు సచివాలయాలు, ఇతర శాఖల సమన్వయంతో కార్యాచరణ చేపట్టాం. ఇతర రాష్ట్రాలకు చెందినవారిని ఆయా రాష్ట్రాలకు సురక్షితంగా చేరుస్తున్నాం. మన రాష్ట్రానికి చెందిన బాల కార్మికుల అవగాహనను పరీక్షించి తదనుగుణంగా తగిన తరగతిలో చేర్పిస్తున్నాం. మళ్లీ వారు పనిలోకి వెళ్లకుండా.. శ్రద్ధగా చదువుకునే వ్యవస్థను కల్పిస్తున్నాం. – కేజీవీ సరిత, ఎస్పీ, మహిళా భద్రత విభాగం, సీఐడీ సామాజిక బాధ్యతకు పెద్దపీట వేస్తున్న సీఐడీ సీఐడీ విభాగం అంటే కేవలం కేసుల దర్యాప్తు, నేర నియంత్రణ మాత్రమే కాదు. సీఐడీకి అంతకుమించి విస్తృత పరిధి ఉంది. అందులో ప్రధానమైనది సామాజిక బాధ్యత. అందుకే బాల కార్మికుల వ్యవస్థ నిర్మూలన కోసం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆపరేషన్ స్వేచ్ఛ కార్యక్రమం సత్ఫలితాలనిస్తోంది. సీఐడీలో ప్రత్యేకంగా సామాజిక విభాగం కింద ఇలాంటి కార్యక్రమాలను మరింత విస్తృతంగా చేపడతాం. – సంజయ్, సీఐడీ అదనపు డీజీ -
పేరెంట్స్ నిర్లక్ష్యం చేస్తే Animal లా మారతారా?
‘మాకు ఒక్కడే కొడుకు. చిన్నప్పటి నుంచీ వాడికి కావాల్సినవన్నీ చేశాం. ఇక్కడే బీటెక్ చేశాడు. ఆ తర్వాత అమెరికాలో ఎంబీఏ చేసి అక్కడే జాబ్ చేస్తున్నాడు. వాడికీ నాకూ మధ్య కమ్యూనికేషన్ చాలా తక్కువ. ఏదైనా వాళ్లమ్మతోనే చెప్తాడు. కానీ మొన్నీ మధ్య విడుదలైన యానిమల్ మూవీ చూశాక నాకు కాల్ చేశాడు. చిన్నప్పుడు తనను నేను పట్టించుకోకపోవడం వల్లే తన జీవితం నాశనమైందని గొడవ పడ్డాడు. ‘అదేంట్రా.. నీకు కావాల్సినవన్నీ చేశా కదా. బాగా చదువుకుని అమెరికాలో జాబ్ చేస్తున్నావు. నీ జీవితం నాశనమైంది ఎక్కడ్రా?’ అని చెప్పినా వినడం లేదు. ‘చిన్నప్పుడు నన్ను నువ్వు అస్సలు పట్టించుకోలేదు. బాగా తిట్టావ్, కొట్టావ్. అందుకే నేను ఎవరితోనూ మాట్లాడకుండా ఇంట్రావర్ట్నయ్యాను. ఇప్పుడు ఇక్కడ రోజూ ఆల్కహాల్ తాగుతున్నా’ అని బాంబు పేల్చాడు. వాడితో ఏం మాట్లాడాలో, ఏం చేయాలో అర్థం కావట్లేదు. వాడి మాటల తర్వాత నేను కూడా ఆ సినిమా చూశా. నిజంగా పిల్లలను నెగ్లెక్ట్ చేస్తే ఫలితాలు అంత తీవ్రంగా ఉంటాయా అనేది తెలుసుకోవాలనుకుంటున్నాను’ కాంతారావు ఆందోళన, ఆవేదన, సందేహమూనూ! యానిమల్ మూవీ చూసిన చాలామంది ఇలాంటి ఆందోళననే వ్యక్తం చేస్తున్నారు. పిల్లలను పట్టించుకోకపోవడం, కొట్టడం, తిట్టడం వల్ల దుష్పరిణామాలు నిజమే అయినా.. నాటకీయత కోసం ఆ సినిమాలో చాలా ఎక్కువ చేసి చూపించారు. అయితే సమస్యేమీ లేదంటారా? సమస్యేమీ లేదనడం లేదు. పిల్లలపై సినిమాల ప్రభావంకంటే తల్లిదండ్రుల ప్రభావమే ఎక్కువని గుర్తించమంటున్నా. పిల్లలను నిర్లక్ష్యం చేయడం, కొట్టడం, తిట్టడంలాంటి చర్యల ఫలితాలు అందరికీ ఒకే విధంగా ఉండవు. కొందరు ఆ పరిస్థితులతో సర్దుకుపోతారు, కొందరు పట్టించుకోరు. కానీ సున్నితమైన మనసున్న పిల్లలు మనసులోకి తీసుకుని తీవ్రంగా బాధపడతారు. మానసిక సమస్యల పాలవుతారు. ఎవరు ఎలా స్పందిస్తారనేది ఆ పిల్లల జీన్స్, కుటుంబ పరిస్థితులు, ఎదురైన అనుభవాలు, వాటిని చూసే విధానంపై ఆధారపడి ఉంటుంది. బాల్యంలో నిర్లక్ష్యానికి గురికావడం వల్ల ఆత్మగౌరవం దెబ్బతింటుంది. ఇతరులను విశ్వసించలేరు. నిరాశ, ఆందోళన, అటాచ్మెంట్ సమస్యలు రావచ్చు ∙హఠాత్తుగా ప్రమాదకర నిర్ణయాలు తీసుకుంటారు. భావోద్వేగాలను, ప్రవర్తనను నియంత్రించుకోవడంలో ఇబ్బందులు పడతారు. ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు.శారీరక హింసను ఎదుర్కొన్న పిల్లల్లో యాంగ్జయిటీ, డిప్రెషన్, పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్, మాదక ద్రవ్యాల వినియోగానికి దారితీయవచ్చు. ఎమోషనల్ అబ్యూజ్ వల్ల యాంగ్జయిటీ, డిప్రెషన్‌తో పాటు పర్సనాలిటీ డిజార్డర్స్కు గురికావచ్చు. సెక్సువల్ అబ్యూజ్ వల్ల ఆత్మహత్య ఆలోచనలు, డిసోసియేషన్, ఈటింగ్ డిజార్డర్స్కు లోనవ్వచ్చు. దీర్ఘకాలం అబ్యూజ్‌కు గురైన పిల్లల్లో పర్సనాలిటీ డిజార్డర్స్ వచ్చే అవకాశాలున్నాయి. అంటే కొన్ని సమస్యలు వారి వ్యక్తిత్వంలో భాగంగా మారిపోతాయి. పేరెంటింగ్ కీలకం.. బాల్యం జీవితానికి పునాదిలాంటిది. అందుకే అది దృఢంగా, సంతోషకరంగా ఉండేలా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలి. పిల్లల జీవితాలను ఉల్లాసభరితంగా తీర్చిదిద్దాలి. సరైన తీరులో పెంచడం ద్వారా పిల్లల్లో మానసిక సమస్యలు, వ్యక్తిత్వ లోపాలను నిరోధించవచ్చు. అందుకు ఏం చేయాలంటే... పిల్లలతో ఎంత సమయం గడిపామనే దానికంటే ఎలా గడిపామనేది ముఖ్యం. పిల్లలతో క్వాలిటీ టైమ్ గడపండి ∙శారీరకంగా, మానసికంగా సురక్షితంగా భావించే ఇంటి వాతావరణాన్ని సృష్టించండి. మంచిగా మాట్లాడటం, కౌగలించుకోవడం ద్వారా మీ ప్రేమ, ఆప్యాయతలను తరచుగా వ్యక్తపరచండి. పిల్లల భావాలు, అనుభవాలు సానుకూలమైనవైనా, ప్రతికూలమైనవైనా మీతో పంచుకునేలా ప్రోత్సహించండి. వారి మాటలను ఎలాంటి జడ్జ్మెంట్ లేకుండా వినండి ∙మీ సొంత భావాలు, అనుభవాల గురించి వారి వయస్సుకు తగిన విధంగా పిల్లలతో పంచుకోండి ∙పిల్లల ప్రవర్తనకు స్పష్టమైన నియమాలు, సరిహద్దులను ఏర్పాటు చేయండి. వాటి వెనుక ఉన్న కారణాన్ని వివరించండి. వాటిని స్థిరంగా అమలు చేయండి. తప్పు చేసినప్పుడు శిక్షించడం కంటే మంచి ప్రవర్తనను మెచ్చుకోవడంపై దృష్టిపెట్టండి. పెద్దలను గమనించడం, అనుకరించడం ద్వారా పిల్లలు నేర్చుకుంటారు. కాబట్టి మీ మాటలు, చర్యలను గమనించుకోండి. పిల్లల్లో మీరు చూడాలనుకుంటున్న దయ, గౌరవం, సానుభూతి, బాధ్యతలను మీరు చూపిస్తూ రోల్ మోడల్‌గా నిలవండి. ఇతరులతో సానుకూల సంబంధాలు ఏర్పరచుకోవడంలో సహాయపడండి. సంఘర్షణలను పరిష్కరించుకోవడం నేర్పండి. మీ అభిరుచులను పిల్లలపై రుద్దకుండా వారి అభిరుచులను గుర్తించి ప్రోత్సహించండి. వారి స్కిల్స్ పెంచుకోవడానికి అవకాశాలను కల్పించండి. మీ పిల్లల ప్రవర్తనలో లేదా భావోద్వేగాలలో మార్పులు గమనిస్తే సైకాలజిస్ట్ సహాయం తీసుకోండి. -సైకాలజిస్ట్ విశేష్,psy.vishesh@gmail.com -
మీ బద్ధకం అమ్మకు భారమే
చలికాలం ముసుగు తన్ని పడుకుంటే ఎంత బాగుణ్ణు. బెడ్ దగ్గరకు పొగలు గక్కే టీ వస్తే ఎంత బాగుణ్ణు. టిఫిన్లూ, సూప్‌లు, సాయంత్రం ఉడకబెట్టిన పల్లీలు... ఎంత బాగుణ్ణు. అన్నట్టు రగ్గులు, బొంతలు భలే శుభ్రంగా, పొడిగా ఉండాలండోయ్. చలికాలం ఎవరికీ పని చేయబుద్ధేయని కాలం. కాని అమ్మకు తప్పుతుందా? అమ్మ వెచ్చని రగ్గు కప్పుకుని టీవీ చూస్తూ ‘టీ తెండి’ అని అరిస్తే ఒకరోజైనా ఇస్తారా ఎవరైనా? చలికాలంలో ఇంటి సభ్యులు ఏం చేయాలి? స్కూల్ టైమ్ మారదు. ఉదయం 8 లోపు బస్సొచ్చి ఆగుతుంది. పిల్లలకు బాక్స్ కట్టివ్వడమూ తప్పదు. ఏడున్నరకంతా కట్టాల్సిందే. టిఫిన్ తినిపించాల్సిందే. ఎంత చలి ఉన్నా, ఎంత మంచు కమ్ముకున్నా, ఎంత బద్ధకంగా ఉన్నా, ఎంత ముసుగుతన్ని నిద్రపోవాలని ఉన్నా అమ్మకు తప్పుతుందా? అమ్మ లేవకుండా ఉంటుందా? వంట గదిలో వెళ్లకుండా ఉంటుందా? నాన్న అరగంట లేటుగా లేవొచ్చు. వాకింగ్ ఎగ్గొట్టి అమ్మ ఇచ్చిన టీని చప్పరిస్తూ పేపర్‌ను చదువుతూ ఉండొచ్చు. కాని అమ్మ మాత్రం అదే వంట చేయాల్సిందే. రోజువారీ అంట్లు, బట్టల ఉతుకుడు చూడాల్సిందే. ఆమెకు ఇంట్లో నుంచి ఎలాంటి సాయం అందుతున్నదో ఆలోచించామా ఎప్పుడైనా? బద్ధ్దకమైన కాలం ఇది చలికాలం బద్ధకం కాలం. తలుపులు కిటికీలు మూసుకుని అరచేతులు రుద్దుకుంటూ కూచోమని చెప్పే కాలం. బబ్బుంటే బాగుండు అనిపించే కాలం. అమ్మకు ‘ఈ పూట ఎవరైనా వంట చేసి పెడితే బాగుండు’ అనిపించినా అలా చేసేవారు ఎవరు? ‘రోజూ వండుతున్నావ్ కదా ఇవాళ బజారు నుంచి వేడి ఇడ్లీ తెస్తానులే’ అని బండి తాళం అందుకునే నాన్నలు ఎందరు? పాలల్లో కొన్ని చాకోస్ వేసివ్వు చాలు అనే పిల్లలు, బ్రెడ్ ఆమ్లేట్ చేసుకుని తింటాలే అనే భర్తలు ఉన్న ఇల్లు ఇల్లాలి శ్రమను గుర్తించే ఇల్లు. ‘కాసేపు పడుకోలే’ అని లేచి పేపర్లు లోపల పడేసి, పాలు ఫ్రిజ్‌లో పెట్టి, ఒక ప్యాకెట్ గిన్నెలో వేడి చేసి, కాఫీ కలిపి భార్యను లేపితే ఎంత బాగుంటుంది. మగవాళ్లు బట్టలు ఎలాగూ ఉతకరు. ‘చెమ్మగా ఉన్నాయి’ అని విసుక్కునే బదులు కనీసం ఎండ తగిలే తీగ దాకానో, డాబా మీదనో తీసుకెళ్లి ఆరేసే సాయం చేయరు. ఇలాంటి సమయంలో ‘బట్టలు ఆరేయడం’ అనే చిన్న పని కూడా చాలా పెద్ద సాయం కిందకు వస్తుంది.ఈ రోజుల్లో ప్రత్యామ్నాయ టిఫిన్లు, ఇన్స్టంట్ టిఫిన్లు ఎన్నో మార్కెట్లో ఉన్నాయి. యూట్యూబ్‌లో కొడితే వందలాది వీడియోలు ఉన్నాయి. తెచ్చిపెట్టే స్విగ్గి, జొమాటోలు ఉన్నాయి. ఈ శీతాకాలంలో ఉదయపు వంట చెర నుంచి అమ్మకు ఏ విధంగా ఉపశమనం ఇవ్వొచ్చో తప్పక ఆలోచించాలి. ఇంట్లో పెద్దవారు ఉంటే? అమ్మమ్మో, నానమ్మో ఇంట్లో ఉంటే వారి గురించి ఇల్లంతా మరింత శ్రద్ధ పెట్టాలి. మంచి షాల్, రగ్గు వారికి ఏర్పాటు చేయాలి. నేలకు పాదాలు తాకి జిల్లు మనకుండా ఇంట్లో తిరగడానికి మంచి స్లిప్పర్లు ఇవ్వాలి. స్లిప్పర్లలోనే తిరగమని చెప్పాలి. చలికి ఆకలి ఎక్కువ. పెద్దవారు పసిపిల్లల్లా మారి నోటికి హితంగా వేడివేడిగా అడుగుతారు. వారికి ఏదో ఒకటి చేసి పెట్టాలి. ఆ పనిలో కూడా అమ్మకు భర్త, పిల్లలు ఏదో ఒక మేరకు సాయం చేయాలి. వారికి వెచ్చని గది కేటాయించాలి. లేదా ఇంట్లోని వెచ్చని ప్రదేశమైనా. శుభ్రత అందరిదీ శీతాకాలం ఇల్లు మబ్బుగా ఉంటుంది. ఇటు పుల్ల అటు పెట్టబుద్ధి కాదు. కాని ప్రయత్నం చేసి ఇల్లు ప్రతి రోజూ సర్దుకునే పడుకోవాలి. హాల్లో బెడ్రూముల్లో కిచెన్‌లో కుటుంబ సభ్యులంతా నిద్రకు ముందు వీలైనంత శుభ్రంగా, సర్ది పడుకుంటే ఉదయాన్నే అమ్మ లేచినప్పుడు చిందర వందర లేకుండా పనిలో పడబుద్ధి అవుతుంది. పక్క బట్టలు మడవడం కూడా కొంతమంది చేయరు. అలాంటి వారిని తప్పక గాడిలో పెట్టాలి. చలికాలం అమ్మకి పని తేలిక చేద్దాం. చలికాలాన్ని ఎంజాయ్ చేసేలా చూద్దాం. అమ్మకు కావాలి వెచ్చని దుస్తులు సాధారణంగా ఇళ్లల్లో నాన్నకు హాఫ్ స్వెటర్లు ఉంటాయి. ఎప్పుడూ వేసుకునే ఉంటాడు. అమ్మకు మాత్రం ఎందుకనో స్వెటర్ ఉండదు. కొని తేవాలని ఎవరికీ అనిపించదు. చాలా ఇళ్లల్లో అమ్మలు పాతబడిన స్వెటర్లతోనే తిరుగుతూ ఉంటారు ఈ సీజన్లలో. ఒక రంగురంగుల కొత్త స్వెటర్ కొనుక్కోవాలని వారికి ఉంటుంది. ఉద్యోగం చేస్తున్నా, గృహిణి అయినా తాను కొనుక్కునే చొరవకు ఎప్పుడూ అమ్మ దూరంగానే ఉంటుంది. స్వెటర్ లేకుండానే చలికాలం గడిపేస్తుంది. ఆమెకు స్వెటర్, సాక్సులు, స్కార్ఫ్‌లు కావాలి. ఉన్నాయా గమనించండి. ఆమె అడగదు. తెచ్చి పెట్టండి. శీతాకాలంలో స్త్రీలు తమ శరీరం గురించి ఆలోచన చేస్తారు. చర్మాన్ని, శిరోజాల్ని కాపాడుకోవడానికి వారికి కొన్ని వస్తువులు అవసరం. క్రీములు, నూనెలు, సబ్బులు... ఏర్పాటు చేయాలి. చర్మ సమస్యలు కొందరిలో రావచ్చు. వాటిని చిట్కాలతో సరిపుచ్చుతూ బాధ పడాల్సిన పని లేదు. వైద్యుల దగ్గరకు వెళ్లాలి. తీసుకువెళ్లాలి. ఇక ఇంట్లో గర్భిణీ స్త్రీలు ఉంటే చలికాలం మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. రోజువారీ చాకిరీ నుంచి దాదాపుగా తప్పించాలి. -
పేరెంట్స్‌కి షుగర్ ఉంటే ప్రెగ్నెన్సీలో షుగర్ వస్తుందా?
మా పేరెంట్స్ ఇద్దరికీ సుగర్ ఉంది. నాకు ఈమధ్యే పెళ్లయింది. మా పేరెంట్స్‌కి సుగర్ ఉంది కాబట్టి ప్రెగ్నెన్సీలో నాకూ సుగర్ వచ్చే ప్రమాదం ఉందా? రాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? – ఎన్. మాధవి, హాసన్పర్తి ప్రెగ్నెన్సీ సమయంలో వచ్చే డయాబెటీస్‌ని జెస్టేషనల్ డయాబెటీస్ అంటారు. ఇది ఒకరకంగా సాధారణమే. ఇలా ప్రెగ్నెన్సీ సమయంలో వచ్చిన డయాబెటీస్ .. ప్రసవం తరువాత తగ్గిపోతుంది. కుటుంబంలో .. దగ్గరి బంధువుల్లో టైప్ 2 డయాబెటీస్ ఉంటే.. గర్భిణీలో సుగర్ కనపడుతుంది. కనపడే రిస్క్ రెండున్నర రెట్లు ఎక్కువ. తల్లికి సుగర్ ఉంటే ఆడపిల్లలకు ప్రెగ్నెన్సీలో జెస్టేషనల్ డయాబెటీస్ వచ్చే చాన్స్ ఎక్కువ. తండ్రికి సుగర్ ఉంటే 30 శాతం రిస్క్ ఉంటుంది. ఇద్దరికీ 70 శాతం రిస్క్ ఉంటుంది. 10–20 శాతం ప్రెగ్నెన్సీస్లో జీడీఎమ్ ఉంటుంది. దీనికి జెనెటిక్ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ కారణం. వేళకు భోంచేయకపోవడం.. పౌష్టికాహారం తీసుకోకపోవడం, అవసరాని కన్నా ఎక్కువ తినడం, జంక్, ఫ్రోజెన్, ప్రాసెస్డ్ ఫుడ్, వేపుళ్లు, నూనె పదార్థాలు ఎక్కువ తినడం, రోజూ వ్యాయామం చేయకపోవడం, ప్రెగ్నెన్సీకి ముందే బరువు ఎక్కువగా ఉండటం, బీఎమ్ఐ (బాడీ మాస్ ఇండెక్స్) 30 కన్నా ఎక్కువ ఉండటం.. ఇంతకుముందు ప్రెగ్నెన్సీలో డయాబెటీస్ రావడం వంటివన్నీ జెస్టేషనల్ డయాబెటీస్ రిస్క్‌ని పెంచుతాయి. మీకు ఫ్యామిలీ హిస్టరీ ఉంది కాబట్టి ఇప్పటి నుంచి ‘బ్యాడ్ సుగర్’ అంటే వైట్ బ్రెడ్, పాస్తా, పేస్ట్రీస్, మైదా, పళ్ల రసాలు, ప్రాసెస్డ్ ఫుడ్, కార్న్ సిరప్స్ వంటివాటిని దూరం పెట్టాలి. మీరు బరువు ఎక్కువ ఉంటే కనీసం పది శాతం అయినా బరువు తగ్గాలి. అప్పుడే ప్రెగ్నెన్సీలో సుగర్ వచ్చే రిస్క్ తగ్గుతుంది. అరగంట సేపు ఏరోబిక్ ఎక్సర్సైజ్ అంటే బ్రిస్క్ వాక్, స్విమ్మింగ్ లాంటివి కనీసం వారానికి అయిదు రోజులైనా చేయాలి. ఫైబర్, తాజా కూరగాయలు, ఆకు కూరలు, పొట్టు ధాన్యాలు, గుమ్మడి గింజలు, నట్స్ వంటివి తీసుకోవాలి. ఈ జాగ్రత్తలు పాటిస్తే జెస్టేషనల్ డయాబెటీస్ లేదా తరువాతైనా సుగర్ వచ్చే చాన్సెస్ తగ్గుతాయి. (చదవండి: ఎక్కడికైనా 'లేటే'..టైంకి వచ్చిందే లే!: ఇదేమైనా డిజార్డరా!) -
టీనేజ్ పిల్లలను ఇలా హ్యాండిల్ చేస్తే.. దెబ్బకు మాట వింటారు
‘మా అమ్మాయి నిన్నమొన్నటి వరకూ చెప్పినట్లు వినేది. ఇప్పుడు ఏం చెప్పినా పట్టించుకోవడం లేదు. నాకు తెలుసులే అన్నట్లు మాట్లాడుతోంది. ఈ పిల్లతో వేగేదెట్లా’ ఓ తల్లి కలవరం. ‘నేనేం చెప్పినా మావాడు ఎదురు మాట్లాడుతున్నాడు. కొంచెం గొంతు పెంచితే చేతిలో ఉన్నది పగలకొట్టేస్తున్నాడు. ఎలా కంట్రోల్ చేయాలో అర్థం కావడంలేదు’ ఓ తండ్రి బాధ. టీనేజ్ పిల్లలున్న తల్లిదండ్రులందరిదీ ఇదే స్థితి. మొన్నటివరకు పిల్లిపిల్లల్లా తమ వెనుకే తిరిగిన బిడ్డలు ఇప్పుడు ఎదురు మాట్లాడుతుంటే భరించలేరు. బాధపడుతుంటారు. టీనేజ్ గురించి, ఆ వయసులో వారి తీరు గురించి తెలియకపోవడమే దీనికి ప్రధాన కారణం. ఆ వయసు పిల్లలతో ఎలా మాట్లాడో తెలుసుకుంటే వారిని అదుపు చేయడం, సరైన మార్గంలో నడిపించడం చాలా సులువైన విషయం. ఇదో విప్లవాత్మక దశ.. టీనేజ్ లేదా కౌమార దశ అనేది చాలా విప్లవాత్మకమైన దశ. హర్మోన్ల పని తీరు ఉధృతమవుతుంది. శారీరకంగా మార్పులు చోటుచేసుకుంటాయి. కొత్త కొత్త ఆలోచనలు.. కోరికలు పుడుతుంటాయి. సమాజాన్ని మార్చేయాలని.. ప్రపంచాన్ని జయించాలనే ఆవేశం ఈ వయసులో అత్యంత సహజం. బాల్యం నుంచి వయోజనుడిగా మారే క్రమంలో తమ అభిప్రాయాలను నిక్కచ్చిగా చెప్తుంటారు. అది తమ సొంత వ్యక్తిత్వాన్ని సంతరించుకునే క్రమంలో భాగమే తప్ప తల్లిదండ్రుల పట్ల వ్యతిరేకత కాదు. ఈ విషయాన్ని తల్లిదండ్రులు గ్రహించాలి. వారి విమర్శలను సీరియస్‌గా తీసుకుని బాధపడకుండా లేదా గొడవ పడకుండా వారిని అర్థం చేసుకునేందుకు ప్రయత్నించాలి. స్నేహితుడిలా మాట్లాడాలి.. వయసుకు వచ్చిన పిల్లల్ని మనతో సమానంగా చూడాలని పెద్దలు చెప్తుంటారు. ఈ మాట పాటిస్తే చాలు బంధాలు, అనుబంధాలు బలోపేతమవుతాయి. చిన్నపిల్లలను తిట్టినట్టు తిట్టకుండా, కొట్టకుండా.. స్నేహితులతో మాట్లాడినట్లు మంచిగా మాట్లాడాలి. ఆ మేరకు కమ్యూనికేషన్‌ను మార్చుకోవాలి. వాళ్లు పెరిగి పెద్దవాళ్లవుతున్నారని, సొంతగా నిర్ణయించుకునే, నిర్ణయాలు తీసుకునే హక్కు వాళ్లకు ఉందని గుర్తించాలి, గౌరవించాలి. తమ జనరేషన్‌కు, పిల్లల జనరేషన్‌కు అభిప్రాయాలు, అభిరుచుల్లో తేడాలుంటాయని గుర్తించాలి, గౌరవించాలి. అప్పుడే వారితో సరైన రీతిలో కమ్యూనికేట్ చేయగలం. సవాళ్లు విసరొద్దు.. ఇంట్లో టీనేజ్ పిల్లలున్నప్పుడు వాదోపవాదాలు సహజం. అయితే ఆ సమయంలో ఏం చెప్పాలో.. ఏం చెప్పకూడదో తెలుసుకోవడం కూడా అంతే ముఖ్యం. టీనేజర్ మన పెంపకాన్ని విమర్శిస్తున్నప్పుడు బాధగానే ఉంటుంది. అయినా సరే మనల్ని మనం సమర్థించుకోవడం మానేయాలి. ‘నాకు చేతనైంది నేను చేశా, నువ్వేం చేస్తావో చేసి చూపించు’ లాంటి సవాళ్లు విసరకూడదు. దానికన్నా ఏమీ మాట్లాడకపోవడం మంచిది. పిల్లలపై మాటల్లో గెలవడం కంటే, వాళ్ల మనసుల్లో నిలవడం ముఖ్యమని గుర్తించాలి. ఇలాంటి మాటలన్నీ తాత్కాలికమని అర్థం చేసుకోవాలి. ‘మేం పేరెంట్స్‌మి, మా మాట వినాలి’ అనే అహాన్ని లేదా అధికారాన్ని వదులుకుంటేనే ఇవన్నీ సాధ్యం. టీనేజర్ మిమ్మల్ని విమర్శిస్తున్నప్పుడు.. 1. నువ్వు చెప్పేది వింటున్నాను. ఇంకా బెటర్‌గా ఉండేందుకు ప్రయత్నిస్తా. 2. ఐయామ్ సారీ, ఇంకొంచెం బెటర్‌గా చేసి ఉండాల్సింది. 3. ఈ పరిస్థితిని ఎలా డీల్ చేయాలో నాకన్నా నీకు ఎక్కువ తెలుసు. 4. నువ్వు బాధపడేలా చేసినందుకు సారీ. 5. మన మధ్య విషయాలు కష్టంగా ఉన్నాయని తెలుసు. దీన్ని బెటర్ చేసేందుకు ఇద్దరం కలసి పనిచేద్దాం. 6. ఏం జరిగినా సరే నేను నిన్ను ప్రేమిస్తున్నానని తెలుసుకో. మన మధ్య బంధం బలంగా ఉంచడానికి నేను కట్టుబడి ఉన్నా. మీ టీనేజర్ కష్టపడుతున్నప్పుడు.. 1. నేను నీకు ఎలా హెల్ప్ చేయగలనో చెప్పు. 2. నీకు నేనున్నాను. 3. నేను నిన్ను, నీ సామర్థ్యాన్ని నమ్ముతాను. 4. అవును, అది చాలా కష్టంగా ఉంది. 5. అవును, అది కష్టమని నువ్వు అనుకోవడం కరెక్టే. 6. తప్పులు చేయడం ఓకే. అందరం చేస్తాం. టీనేజర్ పట్ల ప్రేమను వ్యక్తం చేయడానికి.. 1. ఐ లవ్ యూ ఫర్ హూ యూ ఆర్. 2. నీతో సమయం గడపడం నాకు చాలా ఇష్టం. 3. ఐ యామ్ గ్రేట్ఫుల్ ఫర్ యూ. 4. నువ్వు సాధించిన దాని గురించి కాదు.. ఐ యామ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ ఫర్ హూ యు ఆర్. 5. మనిద్దరం కలసి మంచి జ్ఞాపకాలను సృష్టించడం నాకు చాలా ఇష్టం. 6. నువ్వు నా దగ్గరకు రావడం, నాతో ఉండటం నాకు చాలా ఇష్టం. --సైకాలజిస్ట్ విశేష్ psy.vishesh@gmail.com (చదవండి: ఎవరికీ కనిపించనివి కనిపిస్తున్నాయా?.. వినిపించనివి వినిపిస్తున్నాయా?) -
ప్రేమ పెళ్లి చేసుకున్న యువకుడిపై హత్యాయత్నం.. దాడిచేసింది వారే..!
వలిగొండ: యాదాద్రి భువనగిరి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ప్రేమించి కులాంతర వివాహం చేసుకున్న యువకుడిపై యువతి తల్లితండ్రులతో పాటు సోదరుడు హత్యాయత్నానికి పాల్పడ్డారు. కత్తులతో దాడి చేయడంతో యువకుడు ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు. వలిగొండ మండలం వేములకొండకు చెందిన యాట నవీన్ అదే గ్రామానికి చెందిన ఎలగందుల మానస ప్రేమించుకుని 15 మాసాల క్రితం ఇళ్ల నుంచి వెళ్లి వివాహం చేసుకున్నారు. హైదరాబాద్‌లో ప్రైవేట్ ఉద్యోగులుగా జీవనం సాగిస్తున్నారు. బంధువు అంత్యక్రియలకు హాజరయ్యేందుకు నవీన్ బుధవారం వలిగొండ మధిర గ్రామం మల్లేపల్లికి వచ్చాడు. దహనసంస్కారాలు పూర్తయిన తర్వాత నవీన్ స్వగ్రామం వేములకొండకు వచ్చాడు. సాయంత్రం ఇంటి సమీపంలోని వాటర్ ఫిల్టర్ వద్ద మిత్రులతో కలిసి మాట్లాడుతున్నాడు. విషయం తెలుసుకున్న మానస తల్లిదండ్రులు మార్కండేయ, సరస్వతి, సోదరుడు మత్స్యగిరి ముగ్గురు కలిసి కత్తితో అక్కడకు చేరుకున్నారు. ఇద్దరు నవీన్‌ను పట్టుకోగా ఒకరు కత్తితో అతడి శరీరంపై ఇష్టానుసారంగా పొడిచారు. ఒకరి తర్వాత మరొకరు నవీన్ శరీర భాగాలపై దాడి చేసి పరారయ్యారు. రక్తపు మడుగులో పడి ఉన్న నవీన్‌ను స్థానికులు, కుటుంబ సభ్యులు తొలుత వలిగొండలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి ప్రథమ చికిత్స చేయించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తీసుకెళ్లారు. ప్రస్తుతం నవీన్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. బాధితుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వలిగొండ ఎస్ఐ ప్రభాకర్ తెలిపారు. ఇది చదవండి: జీవితం మీద విరక్తితో.. వివాహిత తీవ్ర నిర్ణయం..! -
పాపను మాతో పంపించండన్నా.. వినని పోలీసు అధికారి..!
సాక్షి, వరంగల్: మైనర్‌ను పెళ్లి చేసుకుని భద్రత కోసం వచ్చిన ఓ వ్యక్తికి వరంగల్ పోలీసు కమిషనరేట్ పోలీసులు అనుకూలంగా వ్యవహరించడం సంచలనంగా మారింది. పుట్టిన తేదీకి ఆధార్ కార్డు ఆధారం కాదంటూ సుప్రీంకోర్టు చెప్పినా అదే ఆధార్ కార్డును ఆసరా చేసుకుని సదురు బాలికను మేజర్‌గా గుర్తించి మరీ అతడి వెంట పంపడం పోలీసుల పనితీరుపై విమర్శలు వస్తున్నాయి. మహిళల భద్రత విషయంలో ఎక్కడా తగ్గేదే లేదని ఓవైపు ప్రభుత్వం చెబుతుంటే.. అందుకు విభిన్నంగా చెన్నారావుపేట పోలీసులు అది కూడా స్టేషన్ హౌస్ ఆఫీసర్ వ్యవహరిస్తున్నారు. కనీసం బాధితురాలి తల్లిదండ్రుల మాటలు పట్టించుకోకపోవడం తెరవెనుక ఏం జరిగి ఉంటుందనే చర్చ జోరుగా జరుగుతోంది. పాపను తమ వెంట పంపకుండా.. ఎక్కడ భద్రత కల్పిస్తారంటే సదరు ఎస్సై కనీస సమాధానం ఇవ్వకపోవడంతో మంగళవారం రాత్రంతా ఆ తల్లిదండ్రులకు జాగారం చేస్తూ బోరున విలపించారు. అన్ని ధ్రువపత్రాలు సమర్పించినా ససేమిరా.. దాదాపు 30 ఏళ్లున్న వ్యక్తితో బాలికకు వివాహం జరిగితే వాస్తవం తెలుసుకోకుండా సదరు పోలీసు అధికారి ఏకపక్షంగా వ్యవహరించడంతో బాలికల భద్రత చట్టం సరిగా అమలు అవుతుందా? లేదా అనే చర్చ జరుగుతోంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. చెన్నారావుపేట మండలంలోని ఓ గ్రామానికి చెందిన ఓ బాలిక(15)కు 30 ఏళ్ల వ్యక్తి మాయమాటలు చెప్పి పెళ్లి చేసుకున్నాడు. అనంతరం పోలీస్ స్టేషన్‌కు వెళ్లి రక్షణ కల్పించాలని కోరారు. ఆ వెంటనే బాలిక తల్లిదండ్రులకు సమాచారం అందడంతో ఠాణాకు వెళ్లి తమ పాప బాలికనని తెలిపారు. దీనికి ఆధారంగా ఆధార్ కార్డు చూపించినా అదీ చెల్లదన్నారు. బాలిక పుట్టిన తేదీ, బాలిక జన్మించినప్పటి దవాఖాన డిశ్చార్జ్ కార్డు చూపించినా సదరు అధికారి తిరస్కరించారు. బాలిక చదివిన పాఠశాలలో స్టడీ సర్టిఫికెట్ తీసుకురమ్మని చెప్పగా ‘రాత్రి అయిందా కదా సార్ రేపు తీసుకొస్తాం. పాపను మాతో పంపించండన్నా’ స్పందించలేదు. ఆ తర్వాత తల్లిదండ్రులను అక్కడి నుంచి పంపిన అనంతరం బాలికను ఆ వ్యక్తితోనే పంపించారు. మంగళవారం సాయంత్రం వరకూ బాలిక ఆచూకీ లభించకపోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. నిబంధనలు ఏంటీ.. బాలల న్యాయ చట్ట ప్రకారం.. 18 సంవత్సరాలు లోపు బాలల విషయాలు పోలీసుల దృష్టికి వస్తే వెంటనే చైల్డ్ వెల్ఫేర్ కమిటీ, చైల్డ్ హెల్ప్ లైన్, బాలల సంరక్షణ విభాగాలకు సమాచారం అందించాలి. సదరు అధికారులు బాలుడు లేదా బాలిక స్థితిగతులు తెలుసుకుని చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఎదుట హాజరుపరిచి వారి ఆదేశాలకు అనుకూలంగా వ్యవహరిస్తారు. కానీ ఇక్కడ అలాంటిదేమీ జరగలేదు. పోలీసులు ఏకంగా పెళ్లి చేసుకున్న వ్యక్తి వెంట సదరు బాలికను పంపించడం తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది. సీడబ్ల్యూసీ ముందుకువస్తే ఆ బాలికతో మాట్లాడి సఖి కేంద్రానికి పంపి కౌన్సెలింగ్ ఇస్తారు. లేదంటే తల్లిదండ్రులతోని వెళ్తానంటే పంపిస్తారు. అయితే ఇక్కడ అవేమీ జరగకుండా పోలీసులు నిర్ణయం తీసుకుని బాలికను ఆ వ్యక్తితో పంపడంతో ఆమె పరిస్థితి ఎలా ఉందనే టెన్షన్ తల్లిదండ్రుల్లో నెలకొని ఉంది. విచారణ చేపట్టిన చైల్డ్ వెల్ఫేర్ కమిటీ.. ఈ విషయం తెలిసి తల్లిదండ్రులు పోలీసులను కలిసి వచ్చిన అనంతరం మండల స్థాయి ఐసీడీఎస్ అధికారులు చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి సమాచారం అందించగా వారు గ్రామానికి చేరుకొని విచారణ చేపట్టారు. సదరు బాలికకు 15 సంవత్సరాలు మాత్రమే ఉండగా, చట్ట విరుద్ధంగా వ్యక్తి పెళ్లి చేసుకున్నాడని, బాలిక ఆచూకీ సైతం లేదని సీడబ్ల్యూసీ కమిటీని ఆశ్రయించి తమకు న్యాయం చేయాలని తల్లిదండ్రులు కోరారు. కాగా, బాలల న్యాయ చట్టాలను ఉల్లంఘించిన సదరు పోలీసు అధికారిపై చర్యలు తీసుకోవాలని పలువురు బాలల హక్కుల కార్యకర్తలు కోరుతున్నారు. -
పలుకే బంగారమాయెనా!!..కోవిడ్ తర్వాతే అధికం..
వయసు పలికే పదాలు మొదటి సంవత్సరం దాదాపు 10 పదాలు రెండో సంవత్సరం 50 నుంచి 60 పదాలు మూడో సంవత్సరం కనీసం 150 పదాలు.. ఆ పైన కెనడాకు చెందిన ఓ సంస్థ దీనిపై అధ్యయనం చేసింది. 6 నెలల నుంచి రెండేళ్లలోపున్న 900 మంది చిన్నారులను పరీక్షించింది. 20 శాతం మంది చిన్నారులు ప్రతిరోజూ సగటున 28 నిమిషాల సేపు స్మార్ట్ఫోన్లను చూస్తున్నట్లు తేలింది. 30 నిమిషాల డిజిటల్ స్క్రీనింగ్ వల్ల చిన్నారులకు ‘స్పీచ్ డిలే’ రిస్క్ 49 శాతం పెరుగుతుందని వెల్లడయ్యింది. ఏం చేయాలి? ముందుగా చిన్నారుల చెంతకు స్మార్ట్ఫోన్లు, ట్యాబ్లెట్లు దరిచేరకుండా చూసుకోవాలి.పిల్లలకు అసలు స్మార్ట్ఫోన్లు ఇవ్వవద్దని ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం సూచించింది. పిల్లలతో వీలైనంత ఎక్కువ సమయం గడపాలి. వారి నవ్వులకు, అరుపులకు ప్రతిస్పందించాలి. చిన్నారులను ముఖానికి దగ్గరగా తీసుకొని మాటలో, పాటలో, కథలో చెబుతూ..మీకు కనెక్ట్ అయ్యేలా చూసుకోవాలి. స్నానం చేయించేటప్పుడు, పాలు తాగించేటప్పుడు, ఆహారం తినిపించేటప్పుడు.. చేసే పని గురించి వారికి వివరిస్తూ ఉండాలి. ఎలాంటి శబ్ధాలు చేస్తుంటాయి? తదితరాలన్నీ అడుగుతూ, అనుకరిస్తుండాలి. పిల్లలు ఏ వస్తువు చూస్తుంటే.. దాని గురించి వివరిస్తుండాలి. తద్వారా పిల్లలు కూడా మిమ్మల్ని అనుకరించేందుకు ప్రయత్నిస్తూ.. క్రమంగా మాట్లాడుతారు. విజయవాడకు చెందిన రాజేశ్, ఉష దంపతులకు ఒక కుమారుడు ఉన్నాడు. ఆ పిల్లాడిని బుజ్జగించేందుకు..పుట్టిన ఏడాది గడిచేసరికల్లా స్మార్ట్‌ఫోన్‌లో వీడియోలు చూపించడం మొదలుపెట్టారు. ఏడుపు ఆపాలన్నా.. భోజనం చేయాలన్నా.. ఫోన్లోని వీడియోలు చూడాల్సిందే. ఇలా.. ఆ చిన్నారి క్రమంగా స్మార్ట్‌ఫోన్‌కు బానిస అవ్వగా.. ఆ తల్లిదండ్రులు నాలుగేళ్లయినా ‘అమ్మా, నాన్న’ అనే పిలుపులకు నోచుకోలేక పోయారు. చివరకు స్పీచ్ థెరపిస్ట్‌లను ఆశ్రయించి.. పిల్లలకు చికిత్స అందించాల్సి వచి్చంది. – గుండ్ర వెంకటేశ్, ఏపీ సెంట్రల్ డెస్క్ ఒకప్పుడు చిన్న పిల్లలు ఏడిస్తే.. వారిని లాలించేందుకు తల్లిదండ్రులు జోలపాటలు పాడేవాళ్లు. ఎత్తుకొని ఆరుబయట తిప్పుతూ చందమామను చూపించి కబుర్లు చెప్పేవాళ్లు. అమ్మ, నాన్న.. అనే పదాలను చిన్నారుల నోటి వెంట పలికించడానికి ప్రయత్నించేవాళ్లు. వారు ఆ పదాలను పలకగానే విని మురిసిపోయేవాళ్లు. కానీ ఇప్పుడు సిరులొలికించే ‘చిన్ని’ నవ్వులు.. చిన్నబోతున్నాయి. చీకటి ఎరుగని ‘బాబు’ కన్నులు.. క్రమంగా మసకబారిపోతున్నాయి. చిట్టిపొట్టి పలుకుల మాటలు మాయమైపోతున్నాయి. మొత్తంగా స్మార్ట్ఫోన్లలో చిక్కుకొని ‘బాల్యం’ విలవిల్లాడిపోతోంది. చిన్నారుల నోటి వెంట వచ్చే ‘అమ్మ, నాన్న..’ అనే పిలుపులతో కొందరు తల్లిదండ్రులు పులకించిపోతుంటే.. మరికొందరు తల్లిదండ్రులు ఆ ‘పలుకుల’ కోసం నెలలు, సంవత్సరాల పాటు ఎదురుచూడాల్సి వస్తోంది. పునాది పటిష్టంగా ఉంటేనే.. ప్రతి ఒక్కరి జీవితంలో ‘మాట్లాడటం’ అనేది చాలా ముఖ్యమైన విషయం. చిన్నారులు ఎదుగుతున్నకొద్దీ మెల్లగా మాటలు నేర్చుకుంటూ ఉంటారు. మనం ఎలా మాట్లాడిస్తే అలా అనుకరిస్తూ ముద్దుముద్దుగా ఆ పదాలను పలుకుతుంటారు. ముఖ్యంగా చిన్నారి పుట్టిన మొదటి రెండేళ్లు లాంగ్వేజ్ డెవలప్మెంట్కు చాలా కీలకం. అప్పుడు సరైన పునాది పడితేనే.. మూడో ఏడాదికల్లా మంచిగా మాట్లాడగలుగుతారు. ‘స్మార్ట్’గా చిక్కుకుపోయారు.. సాధారణంగా చిన్నారులు ఏదైనా త్వరగా నేర్చుకుంటారు. మొదటి రెండేళ్లలో ఇది ఎక్కువగా ఉంటుంది. వారు తమ చుట్టుపక్కల ఎవరైనా మాట్లాడుతూ ఉంటే.. వారి పెదాల కదలికను చూస్తూ అనుకరిస్తుంటారు. కానీ చుట్టుపక్కల అలాంటి వాతావరణం లేకపోతే వారిలో బుద్ధి వికాసం లోపిస్తుంది. కొందరు తల్లిదండ్రులు వారి పనుల ఒత్తిడి వల్ల తమకు తెలియకుండానే పిల్లలకు సెల్ఫోన్లను అలవాటు చేస్తున్నారు. పిల్లల ఏడుపును ఆపించడానికో, భోజనం తినిపించడానికో, నిద్రపుచ్చేందుకో ఫోన్లలో ఆ సమయానికి ఏది దొరికితే ఆ వీడియో చూపిస్తున్నారు. క్రమంగా అది అలవాటుగా మారి.. పిల్లలు బాహ్య ప్రపంచంతో సంబంధం కోల్పోతున్నారు. వాటిలోనే లీనమైపోయి.. తల్లిదండ్రుల పిలుపులకు సరిగ్గా స్పందించలేకపోతున్నారు. తమ భావాలను మాటల రూపంలో వ్యక్తం చేయలేకపోతున్నారు. మరికొందరైతే గతంలో తాము నేర్చుకున్న పదాలను కూడా మర్చిపోయారు. ఫోన్లలో చూపించే కార్టూన్లు, గేమ్స్ వల్ల పిల్లలకు ఎలాంటి ఉపయోగం ఉండదు. అందులోని శబ్ధాలు, మాటలను వింటారు. కానీ.. వాటికి, నిజజీవితానికి చాలా తేడా ఉండటంతో ఆ శబ్ధాలు, మాటలను అనుకరించలేకపోతున్నారు. అదే సమయంలో తల్లిదండ్రుల మాటలను కూడా అర్థం చేసుకోలేకపోతున్నారు. దీని వల్ల పిల్లల్లో ‘స్పీచ్ డిలే’ సమస్య వస్తోందని వైద్య నిపుణులు చెబుతున్నారు. కోవిడ్ తర్వాతే అధికం చిన్నారుల్లో ‘స్పీచ్ డిలే’ సమస్య కోవిడ్ తర్వాత అధికమైందని వైద్యులు చెబుతున్నారు. ఇలాంటి కేసుల సంఖ్య 15 రెట్లు పెరిగిందని పేర్కొంటున్నారు. లాక్డౌన్లో అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. అలాంటి సమయంలో అనుబంధాలు పెరగాలి. కానీ, ఆ సమయంలో చుట్టుపక్కలవారికి, బంధువులకు దూరంగా ఉండటం వల్ల అందరూ స్మార్ట్ఫోన్లకు అంకితమైపోయారు. చిన్నారులను లాలించడానికి కూడా ఫోన్లను ఉపయోగించారు. దీనివల్ల 9 నెలల నుంచి మూడేళ్లలోపు వయసున్న కొందరు చిన్నారులు తమ కీలక సమయాన్ని కోల్పోయారు. వేరే పిల్లలతో కలవకపోవడం, తల్లిదండ్రులు సరిగ్గా పట్టించుకోకపోవడం వల్ల పిల్లల్లో ‘స్పీచ్ డిలే’ సమస్య అధికమైందని వైద్యులు చెబుతున్నారు. కోవిడ్‌కు ముందు వారానికి ఐదు కేసులు వస్తే.. కోవిడ్ తర్వాత 20 వరకు కేసులు వస్తున్నాయని పిల్లల వైద్యులు వెల్లడించారు. తల్లిదండ్రుల పర్యవేక్షణ ముఖ్యం చిన్నారులు ఫోన్‌కు అడిక్ట్ అవ్వకుండా చూడాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే. చిన్నారుల వద్ద ఫోన్ పెట్టేసి.. ఒంటరిగా వదిలేయవద్దు. అలాగే తల్లిదండ్రులు కూడా సెల్‌ఫోన్‌ను అనవసరంగా వినియోగించడం మానుకోవాలి. వీలైనంత ఎక్కువ సేపు పిల్లలతో గడుపుతూ.. వారి వైపే చూస్తూ కబుర్లు చెప్పాలి. పిల్లలను ఆలోచింపజేసేలా కుటుంబసభ్యులు, వస్తువులు, జంతువుల గురించి వర్ణిస్తూ మాట్లాడాలి. తద్వారా పిల్లలు సులభంగా మాటలు నేర్చుకునే అవకాశం ఉంది. – డాక్టర్ ఇండ్ల విశాల్‌రెడ్డి, మానసిక వైద్య నిపుణుడు, విజయవాడ -
రాహుల్ సిప్లిగుంజ్ తో లవ్..రతిక పేరెంట్స్ ఎమోషనల్ కామెంట్స్
-
రాహుల్ సిప్లిగంజ్‌తో లవ్.. రతికా పేరేంట్స్ ఏమన్నారంటే?
రతికా రోజ్ ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్‌లో రీ ఎంట్రీ ఇచ్చి అలరిస్తోంది. అయితే బిగ్ బాస్‌తో ఎంత ఫేమ్ తెచ్చుకుందో.. ఆమె వ్యక్తిగత విషయాలతోనూ అంతేస్థాయిలో వార్తల్లో నిలిచింది. ముఖ్యంగా సింగర్ రాహుల్ సిప్లిగంజ్‌తో ప్రేమ వ్యవహారంతో ఎక్కువగా వార్తల్లో నిలిచింది. ఆమెది వికారాబాద్ జిల్లా జనగామ గ్రామం కాగా.. ప్రస్తుతం వీరు తాండూరులో నివాసముంటున్నారు. రతికా రోజ్.. రాములు, అనితలకు రెండో సంతానం కాగా.. వీరికి ముగ్గురు కుమార్తెలున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన రతికా రోజ్ తల్లిదండ్రులు ఆమె గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. (ఇది చదవండి: బోరున ఏడ్చేసిన రతిక తల్లిదండ్రులు.. అందరినీ కదిలిస్తున్న వ్యాఖ్యలు) రతికా నాన్న రాములు మట్లాడుతూ.. 'మాది చాలా చిన్న ఊరు. కేవలం 2 వేల జనాభా ఉంది. మొదట మా అమ్మాయికి పటాస్ షో అవకాశం వచ్చింది. అందులో ఏదో నాలుగు ఉంటుందని అనుకున్నా. ఇంతవరకు వస్తుందని అనుకోలేదు. ఒకసారి రతికా ఇంటర్ సెకండియర్‌లో విజయ నిర్మలమ్మ తీసిన ఈ జన్మ నీకే అనే సినిమాలో సెకండ్ హీరోయిన్గా కావాలని ఫోన్ వచ్చింది. కానీ సినిమాల గురించి మాకు పెద్దగా తెలియదు. మహేశ్ బాబు వాళ్ల అమ్మనే ఫోన్ చేసి అడిగింది. మా అమ్మాయి నాకు సినిమా ఛాన్స్ వచ్చింది.. నేను పోతా పట్టు పట్టింది. అయితే ఆ సినిమా రిలీజ్ కాలేదు. మాకు ముగ్గురు కుమార్తెలు సంతానం. రతిక రెండో అమ్మాయి. మిగిలిన ఇద్దరికీ పెళ్లి చేశాం. ఇప్పుడు మాకు కొడుకు రూపంలో ఉన్నది రతికనే.' అంటూ చెప్పుకొచ్చారు. (ఇది చదవండి: బిగ్ బాస్ విన్నర్‌కు బిగ్ షాక్!) రతికా నాన్న మాట్లాడుతూ..' రాహుల్ సిప్లిగంజ్ వాళ్ల ఇంటికి కూడా పోయినా. మా అమ్మాయితో రెండు, మూడు పాటలు చేసిండు. యూట్యూబ్‌లో పెడితే పైసలు వస్తాయి కదా అని అనుకున్నాం. మా చిన్నపాప పెళ్లికి కూడా రాహుల్ వచ్చిండు. మా వరకైతే పెళ్లి ప్రస్తావన తీసుకురాలేదు. అయితే మా పాపకు పెళ్లి కావాలే.. మా అమ్మాయితో ఇలా సినిమా పాటలు తీస్తే ఎలా? అని ఒకసారి రాహుల్‌ను బెదిరించా. మా ఊర్లో వాళ్లయితే వాడితోనే డ్యాన్స్ చేసి.. వాడితోనే పోతుంది అనేవారు. మేం వాటిని పట్టించుకోలేదు. రాహుల్ కూడా అందరిలాగే పెళ్లికి వచ్చిండు.. కానీ ఇలా జరుతుందని మేం కూడా అనుకోలేదు. రతికా అందరినీ ఫ్రెండ్‌లాగే భావిస్తుంది. బిగ్ బాస్‌లో పల్లవి ప్రశాంత్‌తో ఒక స్నేహితుడిలాగే మాట్లాడింది. బయట కావాలనే కొందరు రూమర్స్ తెచ్చారు.' అని అన్నారు. అనంతరం రతికా తల్లి అనితా మాట్లాడుతూ..' రతికా నాతో కలిసి ఇంట్లో వంటలు కూడా చేస్తుంది. మటన్, పాయసం అంటే ఇష్టం. నాకు ఎప్పుడు సపోర్ట్‌గా ఉంటుంది.' అని చెప్పుకొచ్చింది. -
మా తరానికి విద్యా ప్రదాత సీఎం జగన్
సాక్షి, అమరావతి, నెట్వర్క్: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్న మా మాటలను ప్రపంచమంతా ఆసక్తిగా ఆలకించిందంటే మన విద్యా వ్యవస్థలో వచ్చిన మార్పుల పుణ్యమే! చెట్ల కింద సాగే వానాకాలం చదువులను సంస్కరణల బాట పట్టించిన సీఎం జగన్ సర్దే ఆ గొప్పతనమంతా! చదువులతోటే పేదరికాన్ని ఎదిరిద్దామన్న ఆయన పిలుపు అక్షర సత్యం! విద్యారంగంలో ఎలాంటి సంస్కరణలు తీసుకొస్తే అత్యుత్తమ ఫలితాలను సాధించవచ్చో దేశానికే మార్గ నిర్దేశం చేశారు. ప్రతిభతో రాణిస్తున్న పేదింటి బిడ్డలకు దక్కిన అరుదైన గౌరవమిది. ఐరాస, వరల్డ్ బ్యాంక్ వేదికగా అంతర్జాతీయ ప్రతినిధులనుద్దేశించి ప్రసంగించడం.. ఎన్నడూ రాష్ట్రం దాటని మేం ఏకంగా అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్‌లో కాలు మోపడం.. కాణీ ఖర్చు లేకుండా విదేశాలకు వెళ్లి రావడం.. ఇదంతా ఇంకా నమ్మశక్యంగా లేదు!.. ఇదీ నిరుపేద కుటుంబాల్లో జన్మించి అంతర్జాతీయ వేదికలపై అందరినీ ఆకట్టుకున్న 10 మంది విద్యార్థుల మనోగతం. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 45 లక్షల మంది విద్యార్థులకు ప్రతినిధులుగా రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ వీరంతా సెప్టెంబర్ 15 నుంచి 27 వరకు అమెరికాలో పర్యటించి వివిధ వేదికలపై తమ గళాన్ని సగర్వంగా వినిపించారు. ప్రభుత్వ బడి నుంచి ఐఎంఎఫ్‌కు.. ఎకరం పొలంతో పాటు కేబుల్ ఆపరేటింగ్ పనులు చేసుకునే రైతు బిడ్డనైన నాకు 190 దేశాలకు సభ్యత్వమున్న అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్)లో మాట్లాడే అవకాశం దక్కడం నిజంగా అదృష్టమే. అది సీఎం జగన్ సర్ తెచ్చిన విద్యా సంస్కరణల ఫలితమే. మన ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా విధానాన్ని అగ్రరాజ్యం ప్రతినిధులకు వివరించడం చాలా సంతోషంగా ఉంది. ఉచితంగా పాఠ్య పుస్తకాలు, షూలు, నాణ్యమైన పోషకాహారం, ట్యాబ్‌లు, కార్పొరేట్ స్థాయిలో పాఠశాల మౌలిక సదుపాయాలు కల్పించిన విషయాన్ని తెలియచేశా. ఐఎంఎఫ్ మేనేజింగ్ డైరెక్టర్ గీతా గోపీనాథ్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సుబ్రమణ్యన్ మాలో ఎంతో స్ఫూర్తి నింపారు. ఏ స్థాయికి ఎదిగినా మన మూలాలను మరువకూడదని, రాష్ట్ర కీర్తి ప్రతిష్టలను ఖండాతరాలకు విస్తరింపజేయాలని నిర్ణయించుకున్నా. పేద పిల్లలకు జగనన్న ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఉన్నత స్థాయికి చేరుకునే బాధ్యత విద్యార్థులపైనే ఉంది. – వంజివాకం యోగీశ్వర్, ప్రభుత్వ ఉన్నత పాఠశాల, నరసింగాపురం, తిరుపతి జిల్లా ఎన్నడూ చూడని సదుపాయాలు.. మా బిడ్డలను ప్రభుత్వ పాఠశాలలోనే చదివించాం. గతంలో ఎన్నడూ చూడని సదుపాయాలను సీఎం జగన్ ప్రభుత్వం కల్పిస్తోంది. ప్రభుత్వ విద్యావ్యవస్థలో అద్భుతమైన సంస్కరణలు తెచ్చిన ముఖ్యమంత్రికి ధన్యవాదాలు. – నాగరాజు, విజయ (యోగీశ్వర్ తల్లిదండ్రులు, అక్క) నిజంగా.. నేనేనా! ఐరాస, వరల్డ్ బ్యాంకుల్లో ప్రసంగించింది నేనేనా అని ఆశ్చర్యంగా ఉంది. అమెరికా అధ్యక్ష భవనాన్ని సందర్శించడాన్ని కూడా నమ్మలేకున్నా. సోషల్ పుస్తకంలో ఫొటో మాత్రమే చూసిన ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయంలో ఒక రోజంతా ఉన్నాం. కొలంబియా యూనివర్సిటీలో జరిగిన ఎకో అంబాసిడర్ కార్యక్రమంలో పాల్గొని ఇతర దేశాల విద్యార్థులతో ముచ్చటించి వారి సంస్కృతిని తెలుసుకున్నాం. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విద్యా సంస్కరణలు, పథకాలను వివరించాం. ప్రభుత్వ పాఠశాలల్లో మనబడి నాడు–నేడు, జగనన్న విద్యాదీవెన, గోరుముద్ద తదితర పథకాల అమలు తీరుతోపాటు బడుల్లో తాగునీరు, టాయిలెట్స్, కాంపౌండ్ వాల్స్, ల్యాబ్స్‌తో పాటు జగనన్న కానుక కింద స్కూల్ యూనిఫామ్స్, పాఠ్య పుస్తకాలు, షూలు ప్రతి విద్యార్థికీ ఉచితంగా ఇవ్వడంపై వరల్డ్ బ్యాంక్, యూఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ అధికారులతో మాట్లాడాం. నయాగరా వాటర్ ఫాల్స్ చూశాం. స్టాట్యూ ఆఫ్ లిబర్టీ, 2001లో కూలిపోయిన ట్విన్ టవర్స్ చరిత్ర తెలుసుకున్నా. – అల్లం రిషితారెడ్డి, కస్పా మున్సిపల్ ఉన్నత పాఠశాల, విజయనగరం ఇంత గుర్తింపు ప్రభుత్వ చలవే.. గతంలో మా ఇద్దరు అమ్మాయిలను ప్రైవేట్ స్కూళ్లలో చదివించాం. ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన విద్యా సంస్కరణలతో ప్రభుత్వ పాఠశాలల్లో చేర్చాం. ఇద్దరికీ నూజివీడు ట్రిపుల్ ఐటీలో సీట్లు వచ్చాయి. ప్రైవేట్ విద్యాసంస్థల్లోనే చదివించి ఉంటే ఇంత గుర్తింపు లభించేది కాదు. – ఉదయలక్ష్మి, రామకృష్ణారెడ్డి (రిషితారెడ్డి తల్లిదండ్రులు) విద్యా సంస్కరణల అమలుతో.. మా అమ్మ ఫాతిమా వ్యవసాయ కూలీ. మాలాంటి పేద విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చుతో అమెరికా వెళ్లి అంతర్జాతీయ వేదికలపై ప్రసగించే అవకాశాన్ని సీఎం జగన్ సర్ కల్పించారు. అమెరికాలో 15 రోజుల పర్యటనలో ఎన్నో విషయాలు తెలుసుకున్నా. విద్యాపరంగా ఎలాంటి సంస్కరణలు అమలుపరిస్తే దేశం అభివృద్ధి చెందుతుందో ఇంటర్నేషనల్ యూత్ కాన్ఫరెన్స్‌లో విద్యార్థుల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. నాడు–నేడు, విద్యాకానుక, డిజిటల్ బోధన, గోరుముద్ద, అమ్మఒడి లాంటి పథకాలను మిగతా రాష్ట్రాల్లో కూడా అమలు చేస్తే దేశం మరింత అభివృద్ధి చెందుతుంది. రాష్ట్ర ప్రభుత్వం బాలికల కోసం ప్రత్యేకంగా స్వేచ్ఛ పథకాన్ని అమలు చేయడం వల్ల ఎంతో మేలు జరుగుతోంది. – షేక్ అమ్మాజాన్, ఏపీ ఆర్ఎస్, వేంపల్లి, శ్రీసత్యసాయి జిల్లా పేద కుటుంబాలకు విద్యా ప్రదాత ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్‌కు ధీటుగా తీర్చిదిద్ది విద్యార్థులకు ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్యను అందిస్తున్న సీఎం జగన్ మా తరంలో పేద కుటుంబాలకు విద్యా ప్రదాతగా నిలిచిపోతారు. మన రాష్ట్రంలో తెచ్చిన విద్యా సంస్కరణలు దేశానికే ఆదర్శంగా నిలిచాయి. ఐరాస వేదికగా వీటిని చాటిచెప్పాం. ఈ పర్యటనను కలలో కూడా ఊహించలేదు. మాలాంటి పేద విద్యార్థులను ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వం ప్రోత్సహించి ప్రతిభావంతులుగా తీర్చిదిద్దడం వల్లే ఈ అవకాశం లభించింది. రెండు వారాల పాటు ఎందరో ప్రముఖులతో చర్చించడం గర్వంగా ఉంది. – మోతుకూరి చంద్రలేఖ, కేజీబీవీ, ఎటపాక, ఏఎస్ఆర్ జిల్లా ధీమాగా చదువులు.. కేజీబీవీలో చదువుకున్న నా బిడ్డకు ఈ అవకాశాన్ని కల్పిం చిన సీఎం జగన్‌కు రుణపడి ఉంటాం. ఈ ప్రభుత్వం వచ్చాక నాలాంటి తండ్రులకు పిల్లల చదువులపై బెంగ పోయింది. డబ్బున్న వారు, ఉద్యోగాలు చేసేవారు కూడా ఇప్పుడు తమ పిల్లలను ప్రభుత్వ బడుల్లో చదివించేందుకు ఆసక్తి చూపడం విద్యా సంస్కరణల పుణ్యమే. – రామారావు, ఆటో డ్రైవర్ (చంద్రలేఖ తండ్రి) ప్రపంచానికి చాటి చెప్పా.. మా నాన్న దస్తగిరి లారీ డ్రైవర్. అమ్మ రామలక్ష్మి రజక వృత్తిలో ఉంది. పేద కుటుంబం నుంచి వచ్చిన నాకు అమెరికా వెళ్లి అంతర్జాతీయ వేదికలపై ప్రసంగించే అవకాశాన్ని సీఎం జగన్ కల్పిం చారు. ఈ పర్యటన జీవితాంతం గుర్తుంటుంది. న్యూయార్క్‌లో జరిగిన ఇంటర్నేషనల్ యూత్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడే అవకాశం నాకు దక్కింది. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విద్యా సంస్కరణలు, అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రపంచానికి తెలియచేశా. నాడు– నేడు ద్వారా పాఠశాలల అభివృద్ధికి ప్రభుత్వం చేపట్టిన పనులను వివరించా. ప్రభుత్వ బడుల్లో సౌకర్యాలు ఎంతో మెరుగయ్యాయి. టాయిలెట్ల శుభ్రతతో పాటు బాలికలకు ప్రత్యేకంగా న్యాప్కిన్ల వాడకంపై అవగాహన కల్పించడం, అమ్మఒడి పథకంతో స్కూళ్లలో డ్రాప్‌అవుట్స్ సంఖ్య గణనీయంగా తగ్గింది. ఈ అంశాలను ఐరాస ప్రతినిధులకు వివరించా. మన దేశ ఆర్థి క వ్యవస్థలో యువత భాగస్వామ్యంపై ప్రసంగించా. ఐఐటీ గ్రాడ్యుయేట్స్‌లో చాలా మంది స్టార్టప్‌లు ప్రారంభించి ఉద్యోగాల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్న విషయాన్ని చెప్పా. – చాకలి రాజేశ్వరి, ఏపీ మోడల్ స్కూల్, నంద్యాల పక్క ఊరు వెళ్లాలన్నా చార్జీల గురించి ఆలోచించే మాకు.. కాకినాడ జిల్లా తీరప్రాంత గ్రామమైన రమణక్కపేటలో నిరుపేద ప్రైవేట్ సెక్యూరిటీ గార్డు కుటుంబంలో జన్మించిన నాకు అంతర్జాతీయ వేదికపై ప్రసంగించేలా సీఎం జగన్ సార్ గొప్ప అవకాశాన్ని కల్పించారు. నాన్న సింహాచలం సెక్యూరిటీ గార్డు కాగా అమ్మ శాంతి గృహిణి. నేను, చెల్లి, తమ్ముడు.. ఇదీ మా కుటుంబం. నాన్న కొద్దిపాటి సంపాదనతో కుటుంబాన్ని పోషిస్తూ మమ్మల్ని ప్రభుత్వ పాఠశాలల్లో చదివిస్తున్నారు. పక్క ఊరు వెళ్లాలన్నా చార్జీల గురించి ఆలోచించే కుటుంబం నుంచి వచ్చిన నేను అమెరికా వెళ్లానంటే అది జగన్ సార్ విద్యా వ్యవస్థలో తెచ్చిన మార్పుల పుణ్యమే. విద్యతోనే అన్నీ సాధ్యమవుతాయని సీఎం సార్ చెబుతుంటారు. అది నిజమే. అందుకు నేనే నిదర్శనం. సాధారణ విద్యార్థులను ప్రభుత్వ ప్రతినిధులుగా అమెరికా పంపించి సీఎం జగన్ సర్ చరిత్ర సృష్టించారు. భవిష్యత్‌లో ఐఏఎస్ అయ్యి సీఎం జగన్ సార్ ఆశయ సాధనకు కృషిచేస్తా. రాష్ట్రంలోని విద్యా సంస్కరణలు విదేశాల్లో సైతం గుర్తింపు పొందాయి. కొలంబియా యూనివర్సిటీలో మాట్లాడే అవకాశం నాకు దక్కింది. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, గౌరవప్రదమైన జీవనోపాధులపై వివరించడం ఆనందంగా ఉంది. – దడాల జ్యోత్స్న, సాంఘిక సంక్షేమ గురుకులపాఠశాల,వెంకటాపురం, కాకినాడ జిల్లా మరపురాని అనుభూతి.. ఐరాస, కొలంబియా యూనివర్సిటీల్లో జరిగిన సదస్సుల్లో పాల్గొన్నా. రాష్ట్ర ప్రభుత్వం విద్యావ్యవస్థలో తీసుకొచ్చిన సంస్కరణలపై మాట్లాడటం మరపురాని అనుభూతి. మా జీవితాన్ని మలుచుకునేందుకు ఈ పర్యటన ఎంతో స్ఫూర్తినిచ్చింది. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రోత్సాహాన్ని ఎప్పటికీ మరువలేం. విద్యా వ్యవస్థలో తెచ్చిన సంస్కరణలను సద్వినియోగం చేసుకుంటే ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ఇలాంటి అవకాశాలను అందిపుచ్చుకోవచ్చు. – పసుపులేటి గాయత్రి, జడ్పీహెచ్ఎస్, వట్లూరు, పెదపాడు మండలం, ఏలూరు జిల్లా ఎంతో నేర్చుకున్నాం.. నాకు ఇంత అరుదైన అవకాశం జగన్ మామయ్య పాలనలో దక్కడం, అందుకు ప్రభుత్వ పాఠశాలలు వేదిక కావడం ఎన్నటికీ మర్చిపోలేను. సెప్టెంబర్ 15 నుంచి 27 వరకు జరిగిన విదేశీ విజ్ఞాన యాత్రలో ఐరాస జనరల్ అసెంబ్లీ హాల్ని సందర్శించాం. కొలంబియా యూనివర్సిటీలో ఎకో ఎంబాసిడర్ ప్రోగ్రాంలో పాల్గొన్నాం. స్టాట్యూ ఆఫ్ లిబర్టీ, ట్విన్ టవర్స్ కూలిన చోటు, నయాగరా జలపాతం ఇలా వివిధ ప్రాంతాలను సందర్శించి అక్కడి సంస్కృతిపై అవగాహన పెంచుకున్నాం. విదేశీ విద్యార్థులతో ముచ్చటించడం కొత్త అనుభూతిని కలిగించింది. ప్రపంచ బ్యాంక్ ప్రధాన కార్యాలయంలో ఆర్థి క విషయాలు, అంతర్జాతీయ ఆర్థి క అవసరాలు, ఆర్థిక పరిపుష్టికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై తదితర అంశాలను నేర్చుకున్నాం. అమెరికా అధ్యక్షుడు నివసించే వైట్ హౌస్‌ను సందర్శించే అవకాశం రావడం మరపురాని అనుభూతి. రాష్ట్ర ప్రభుత్వం ఆదాయంలో 12 శాతం విద్యపై ఖర్చు చేయటాన్ని బట్టి చదువులకు ఎంత ప్రాధాన్యం ఇస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. – జి.గణేష్ అంజన సాయి, వల్లూరిపల్లి, పశ్చిమ గోదావరి జిల్లా గిరిజన బిడ్డకు గర్వకారణం.. మాది కురుపాం మండలం కొండబారిడి గిరిజన గ్రామం. కుటుంబ కారణాలతో తల్లిదండ్రులు విడిపోయారు. చిన్నప్పటి నుంచి ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకున్నా. ఏసీ బస్సు అంటే ఏమిటో కూడా తెలియదు. గతంలో ఓసారి విశాఖపట్నం, మరోసారి సైన్స్ ఎగ్జిబిషన్ కోసం విజయవాడ వెళ్లా. అలాంటిది మన రాష్ట్ర ప్రతినిధిగా విమానం ఎక్కి ఏకంగా అమెరికా వెళ్లి రావడం కలగానే ఉంది. మన విద్యా సంస్కరణలు, సంక్షేమ పథకాలను ఐరాస, యూఎస్ స్టేట్ అధికారులకు వివరించా. ఇంగ్లిష్ మీడియం, డిజిటల్ విద్యా విధానంతో విద్యార్థులకు కలుగుతున్న ప్రయోజనాలను కొలంబియా యూనివర్సిటీలో జరిగిన సదస్సులో తెలియచేశా. వివిధ దేశాల విద్యార్థులతో మాట్లాడి భిన్న సంస్కృతులను తెలుసుకునే అవకాశాన్ని కల్పిం చిన ముఖ్యమంత్రి జగన్‌కు కృతజ్ఞతలు. – సామల మనస్విని, కేజీబీవీ, గుమ్మలక్ష్మీపురం, పార్వతీపురం, మన్యం జిల్లా ప్రభుత్వ స్కూళ్ల విశిష్టతను చాటిచెప్పాం.. నాన్న సోమనాథ్, అమ్మ గంగమ్మ వ్యవసాయ కూలీలు. పేద కుటుంబాల నుంచి వచ్చిన మేం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల్లో కల్పిం చిన సదుపాయాలు, విశిష్టతను ప్రపంచానికి తెలియచేశాం. విద్యారంగంలో మన రాష్ట్రం ఏ స్థాయిలో రాణిస్తోందో చాటాం. ఈ పర్యటనలో చాలా విషయాలు నేర్చుకున్నా. యూఎన్వో హెడ్ క్వార్టర్స్, ఐఎంఎఫ్ సమావేశంలో ప్రసంగించడం మరచిపోలేని అనుభూతి. స్టాట్యూ ఆఫ్ లిబర్టీ, నయగారా ఫాల్స్, మ్యూజియం, వైట్‌హౌస్ లాంటి ప్రదేశాలను సందర్శించడం మాలాంటి వారికి అసాధ్యం. సీఎం జగన్ సర్ ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని సదుపాయాలు కల్పించి బాగా చదువుకోమని ప్రోత్సహిస్తున్నారు. ప్రతిభ చాటిన మాకు మరువలేని అవకాశాన్ని కల్పిం చారు. చదువుల్లో రాణించే ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను అంతర్జాతీయ సదస్సులకు ఎంపిక చేయడం దేశంలో ఇదే ప్రథమం. – మాల శివలింగమ్మ, కేజీబీవీ, ఆదోని, కర్నూలు జిల్లా -
కోర్టులో నామకరణం
కొచ్చి: ఆ.. పేరులో ఏముందిలే అని కొందరు అనుకుంటారు కానీ ఆ పేరు కూడా ఒక ప్రహసనంగా మారిందని కేరళలో జరిగిన ఒక ఘటన నిరూపించింది. కన్నబిడ్డకు పేరు పెట్టడంలో ఏకాభిప్రాయానికి రాలేకపోయిన తల్లిదండ్రులు కోర్టుకెక్కడంతో మూడేళ్ల వయసున్న వారి కుమార్తెకు కేరళ హైకోర్టు పేరు పెట్టాల్సి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. కేరళకి చెందిన దంపతులు విభేదాలతో విడి విడిగా ఉంటున్నారు. తల్లి సంరక్షణలో వారి మూడేళ్ల వయసున్న కుమార్తె ఉంటోంది. ఆ పాప బర్త్ సర్టిఫికెట్లో పేరు లేదు. ఆ తల్లి కూతురికి పేరు పెట్టి సర్టిఫికెట్లో చేర్చాలని సదరు అధికారుల్ని సంప్రదిస్తే తల్లిదండ్రులిద్దరూ ఒకేసారి హాజరై పేరు చెబితే రిజిస్టర్ చేస్తామన్నారు. అప్పటికే విభేదాలతో దూరమైన దంపతులు పేరు విషయంలో కూడా రాజీకి రాలేకపోయారు. భార్య చెప్పిన పేరు భర్తకి, భర్త చెప్పిన పేరు భార్యకి నచ్చలేదు. కూతురు తన వద్దే ఉండడంతో తల్లి కోర్టుకెక్కింది. చివరికి కేరళ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బెచు కురియన్ థామస్ ఆ పాపకు పేరు పెట్టారు. పాప శ్రేయస్సు, తల్లిదండ్రుల ఇష్టాయిష్టాలు, వారి సంస్కృతి, సామాజిక పరిస్థితులు అన్నీ పరిగణనలోకి తీసుకొని పేరు పెట్టినట్టు న్యాయమూర్తి వెల్లడించారు. కానీ ఏం పేరు పెట్టారో మాత్రం ఆయన బయటపెట్టలేదు. -
కూతుర్ని చంపిన హంతకుల కోసం హీరోలా వేటాడాడు ఓ తండ్రి..ఏకంగా రూ. 16 కోట్లు..
ఓ తండ్రి అంతులేని ప్రేమకు నిదర్శనమే ఈ గాథ. కూతురు ఆకస్మిక మరణం ఆ తండ్రిని నిలువనీయలేదు. ఎందుకు చనిపోయింది? ఎలా చనిపోయిందన్న ప్రశ్నలు అతడ్ని కుదురుగా ఉండనివ్వలేదు. తానే ఓ డిటెక్టివ్‌లా దర్యాప్తు చేసేలా పురిగొల్పాయి. ఒకటి, రెండు కాదు ఏకంగా 37 ఏళ్లు తన కూతురికి న్యాయం జరగాలని తపించి నిరీక్షించాడు. దేశం కానీ దేశంలో వందసార్లుకు పైగా పర్యటించాడు. డబ్బును కూడా లెక్కచేయకుండా నీళ్లలా ఖర్చుపెట్టాడు. కానీ ఇప్పటికి అతడి కూతురు హత్య చిక్కుముడి వీడని మిస్టరీలో ఉండిపోయింది. ఐతే ఆ తండ్రి తపన, ఆశ, అలుపెరగని ప్రయత్నం చివరికి ఫలించాయా అంటే... అసలేం జరిగిందంటే..తన కూతురుని చంపిన హంతకుల కోసం హీరోలా అన్వేషించిన వ్యక్తి ఇంగ్లాండ్‌కు చెందిన జాన్ వార్డ్ మరణించిన అతడి కూతురు పేరు జూలీ వార్డ్. ఆమె వైల్డ్‌లైఫ్ ఫోటోగ్రాఫర్. జూలీ మరణించేనాటికి ఆమె వయసు 28 ఏళ్లు. ఆమె బరీ సెయింట్ ఎడ్మండ్స్లోని పబ్లిషింగ్ కంపెనీలో ఉద్యోగం చేసేది. అయితే జూలీ మాసాయి మారా గేమ్ రిజర్వ్‌లో జంతువుల ఫోటోలు తీసి పేరు తెచ్చుకోవాలనే ఉద్దేశంతో ఆరు నెలలు కెన్యా పర్యటనలోనే ఉండిపోయింది. అయితే ఆమె చిరిసారిగా సెప్టెంబర్ కనిపించింది. ఆ తర్వాత నుంచి ఆమె ఆచూకి కనిపించడంలేదని తెలిసిన కొద్ది క్షణాల్లోనే ఆమె మరణించిందనే వార్త వచ్చింది. దీంతో ఏం అర్థకాని జూలీ తండ్రి ఆఘమేఘాలపై కెన్యా వెళ్లిపోయాడు. నా కూతురు ఎందుకని చనిపోయిందని అని ఆ తండ్రి ఒకటే ఆత్రుతో వెళ్లగా..అక్కడ అధికారులు ఆమెపై క్రూరమృగాలు దాడి చేసి చంపేశాయని చెప్పారు. ఐతే జూలీ తండ్రికి అధికారులు చెబుతున్నవన్నీ కట్టుకథల్లా తోచాయి. కనీసం కూతురి చివరి చూపు దక్కలేదు, పైగా ఆమె మృతదేహం కూడా కనిపించకపోవడం ఇవన్నీ జాన్ని కుదురుగా ఉండనివ్వలేదు. అధికారుల మాటలను నమ్ముతూ కూర్చొంటే.. ఏం లాభం లేదని నిర్ణయించుకుని జాన్ వార్డ్ స్వయంగా డిటెక్టివ్‌లా రంగంలోకి దిగి దర్యాప్తు ప్రారంభించాడు. జూన్వార్డ్ దంపతులు, జూలీ(కుడివైపు), ఇన్సెట్లో ఇద్దరు సోదరులతో దిగిన చిన్ననాటి చిత్రం అందులో భాగంగా ఫోరెన్సిక్ గురించి తనకు తానుగా నేర్చుకుని మరీ కూతురి మృతదేహం కోసం అన్వేషించాడు. జూలీని చివరిగా కనిపించిన ప్రాంతంలో ఏకంగా ఐదు విమానాలతో జల్లెడ పట్టించాడు. చివరికి ఆమె మృతదేహం ఆ రిజర్వ్‌కి దాదాపు 10 మైళ్ల దూరంలో కనిపించింది. జాన్ తన కుమార్తె దవడ, ఎడమ కాలు తదితర భాగాలను గుర్తించాడు. అయితే అవి రెండు కాలిపోయి పోదల్లో ఉన్నాయి. ఎలా చనిపోయిందనే దాని గురించి అలుపెరగకుండా దర్యాప్తు చేస్తూనే ఉన్నాడు. జూలీ అవశేషాలను ఫ్రిజర్‌లో భద్రపరిచి ఎలాగైనా హంతకులను పట్టుకోవాలని తన కూతరుకి న్యాయం చేయాలని ఎంతగానో తపించాడు. జాన్ దర్యాప్తు ఓ కొలిక్కి రాడమే కాకుండా ఆమె ఎలా చనిపోయిందో కనుకున్నాడు. దర్యాప్తులో కెన్యా అప్పటి అధ్యక్షుడు కుమారుడు జోనాథన్ మోయి జూలీపై క్రూరంగా అత్యాచారం చేసి చంపేశాడని కనుగొన్నాడు. ఆమె మృతదేహాన్ని అడవిలో పడేసి జంతువుల దాడిలో చనిపోయిందని నమ్మించాడని తెలుసుకున్నాడు. అయితే దాన్ని నిరూపించేందుకు బలమైన సాక్ష్యాధారాలు జాన్ వద్ద లేవు. ఎంతాగనో అధికారులను ప్రాధేయపడి చర్యలు తీసుకోమని చెప్పినా..కానీ వారు అధ్యక్షుడి కొడుకు కావడం వల్ల ఈ ఘటనను మభ్యపెట్టి తారుమారు చేసే కుట్రకే తెరతీశారు. ఐతే జాన్ తగ్గేదేలా అంటూ.. చేసిన దర్యాప్తు కారణంగా అధికారులు సైతం జూలీది హత్యేనని ఒప్పుకోక తప్పుకోలేదు. దీని కోసం కెనడా కోర్టులో ఏకంగా 22 సార్లు క్రాస్ ఎగ్జామిన్ని జాన్ ఎదుర్కొన్నాడంటేనే వాస్తవం ఏంటో క్లియర్‌గా అర్థమవుతుంది. ఇద్దరు సోదరులో జూలీ వార్డ్(ఫైల్‌ఫోటో) ప్రభుత్వమే తమే చేతిలో ఉన్నవాళ్లతో పోరాడటం ఎంత కష్టం అనేదానికి ఈ జూలీ కేసు ఓ ఉదాహరణ. ఆ తండ్రి కూతురు కేసు దర్యాప్తు కోసం ఏకంగా తన సొంత డబ్బు రూ. 16 కోట్ల దాక నీళ్లలా ఖర్చుపెట్టాడు. చివరి శ్వాస వరకు కూతురుకి న్యాయం జరగాలని పోరాడాడు. జూన్ వయసు ఇప్పుడూ 79 ఏళ్లు ఇటీవలే అతన మరణించాడు. అతడు మరణించడానికి రెండు వారాల ముందే అతడి భార్య జేన్ కూడా చనిపోయారు. తమ తండ్రి జాన్ ఆశ అడియాశగానే మిగిలిపోయిందని అతడి కొడుకులు బాబ్, టిమ్ చాలా ఆవేదనగా చెప్పుకొచ్చారు. తమ సోదరి కేసును తాము క్లోజ్ చేయనివ్వమని తమ తండ్రి ఎలా కెన్యా ప్రభుత్వంతో పోరాడుతూనే ఉన్నాడో అలానే తాము పోరాడతామని, ఆ బాధ్యతను తాము తీసుకుంటామని చెబుతున్నారు జాన్ కొడుకులు. జాన్ వార్డ్ కొడుకు బాబ్ వార్డ్ న్యాయం కోసం తన తండ్రి చూపిన పట్టుదల, తెగువ నమ్మశక్యం కానివని అన్నారు. జాన్ మరణించడానికి ఆరునెలల ముందు వరకు కెన్యా వెళ్లోచ్చారని చెప్పుకొచ్చారు. అంతేగాదు తన తండ్రి ఈ కేసుపై ఓ పుస్తకం కూడా రాశారని, అందుకు తాను సహకరించినట్లు బాబ్ చెప్పుకొచ్చారు. తాను, తన సోదరుడు టిమ్ దీనిపై డాక్యుమెంటరీ కూడా తీస్తామన్నారు. ఇక ఈ జూలీ కేసులో తగిన సాక్ష్యాధారాలు లేకపోవడంతో 1992లో ఆమె హత్య కేసులో అనుమానితులుగా అదుపులోకి తీసుకున్న ఇద్దరు గేమ్ రేంజర్లు నిర్దోషులుగా విడుదలయ్యారు. కెన్యా పోలీసు అధికారుల్లో కొత్త బృందం 1997లో ఈ కేసును మళ్లీ పరిశీలించింది. 1999లో ఒక గేమ్కీపర్ని ఈ కేసులో విచారించారు. కానీ, ఆయనను నిర్దోషిగా విడుదల చేశారు. 2004లో ఈ హత్యకు సంబంధించిన తీర్పును రికార్డ్ చేశారు. మళ్లీ 2010లో లండన్ డిటెక్టివ్‌ల సాయంతో కెన్యా స్థానికుల పోలీసుల ఈ కేసులో కొంత పురోగతి సాధించారు. జూలీ అవశేషాలు కనిపించిన ప్రదేశంలో జరిగిన క్రైమ్ గురించి ఓ అవగాహనకు వచ్చారు. అలాగే డీఎన్ఏ పరీక్షలు కూడా కొంత వరకు పురోగతి సాధించనట్లు తెలిపారు బాబ్. అలసు నిందితులను కనిపెట్టి ఈ కేసును చేధిస్తామని జాను కుమారుడు బాబ్ నమ్మకంగా చెబుతున్నారు. కాగా, పాపం ఆ తండ్రి కూతురుకి న్యాయం జరగాలని తపించి, తపించి అలిసిపోయి మత్యుఒడిలోకి వెళ్లిపోయాడు. కనీసం ఇప్పటికైన జూలీ కేసులో నిందులెవరనేది తెలుస్తుందా? అంతుపట్టిని మిస్టరీలా మిగిలి.., ఆ తండ్రి ప్రయత్నం వృధాగాపోతుందా? అనేది వేచి చూడాల్సిందే...! --ఆర్ లక్ష్మీ లావణ్య (చదవండి: ఆ ఇంట్లోకి అడుగుపెట్టడమే..తూలుతూ, ఊగిపోతాం! సైన్సుకే అంతుచిక్కని మిస్టరీ ప్రదేశం..) -
కెనడాలో పిల్లలు.. భారతీయ తల్లిదండ్రుల్లో ఆందోళన
ఢిల్లీ: కెనడా-భారత్ మధ్య వివాదంతో భారతీయ విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. అక్కడ తమ పిల్లల భద్రత ప్రమాదకరంగా మారిందని భయపడుతున్నారు. జాతీయత ఆధారంగా తమ పిల్లలు వివక్షను ఎదుర్కొంటున్నారని కలత చెందుతున్నారు. కెనడాలో ఉన్న ఇండియన్ విద్యార్థులకు ఏదైనా హెల్ప్‌లైన్ క్రియేట్ చేయాలని కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్‌ని పంజాబ్ బీజేపీ చీఫ్ సునీల్ జఖ్కర్ కోరారు. ఇండియన్ కాన్సులేట్‌ను సంప్రదించి ఏదైనా సహాయం పొందవచ్చని స్పష్టం చేశారు. సలహాలు, సూచనల కోసం ఓ వాట్సాప్ గ్రూప్ నెంబర్‌ను కూడా రిలీజ్ చేశారు. Set up helpline for Indian students, NRIs in Canada: Punjab BJP chief urges Centre #India #Canada https://t.co/dT8lYAE9qm — IndiaToday (@IndiaToday) September 23, 2023 'నా కూతురు ఏడు నెలల క్రితం ఉన్నత చదువుల కోసం కెనడా వెళ్లింది. ఇరుదేశాల మధ్య ప్రతిష్టంభన కారణంగా నా కూతురు చదువుపై ఏకాగ్రత పెట్టలేకపోతోంది.' అని భల్విందర్ సింగ్ చెప్పారు. 'నా ఇద్దరు కూతుళ్లు కెనడాకు వెళ్లారు. కానీ భారత్-కెనడా ప్రభుత్వాల వివాదం ఆందోళన కలిగిస్తోంది. ఈ అంశంపై త్వరగా ఏదైనా ఓ పరిష్కారానికి రావాలి' అని కుల్దీప్ కౌర్ కోరారు. ఖలిస్థానీ ఉగ్రవాది హర్దిప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో భారత్ ప్రమేయం ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో గతవారం వివాదాస్పద ఆరోపణలు చేశారు. ఇది రెండు దేశాల మధ్య వివాదానికి కారణమైంది. ఆ తర్వాత ఇరుదేశాలు ప్రయాణ హెచ్చరికలను జారీ చేశాయి. ఇరుపక్షాలు దౌత్య వేత్తలను బహిష్కరించాయి. కెనడా వీసాలను భారత్ రద్దు చేసింది. ఎలాంటి ఆధారాలు లేకుండా కెనడా ఆరోపణలు చేస్తోందని భారత్ మండిపడింది. అయితే.. ఖలిస్థానీ ఉగ్రవాదులు భారతీయ హిందువులపై హెచ్చరికలు కూడా జారీ చేశారు. కెనడా విడిచి వెళ్లాలని ఆదేశాలు ఇచ్చారు. ఈ పరిణామాల మధ్య ఇరు దేశాల్లో ఉద్రిక్తతలు పెరిగాయి. ఉన్నత చదువుల కోసం అక్కడికి వెళ్లిన తమ పిల్లలు వివక్ష ఎదుర్కొంటున్నారని భారతీయ తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదీ చదవండి: దేశవ్యాప్తంగా 9 వందే భారత్ రైళ్లు ప్రారంభం.. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడంటే..? -
ఆస్పత్రి నుంచి అమ్మ ఒడికి..
సైదాబాద్: కుమార్తె వైద్యానికైన బిల్లు కట్టలేక.. ఆస్పత్రిలో వదిలేసి వచ్చిన తల్లిదండ్రుల చెంతకు ఆ చిన్నారి ఎట్టకేలకు చేరింది. తెలంగాణ స్టేట్ లీగల్ సెల్ అథారిటీ జడ్జి చొరవతో కథ సుఖాంతమైంది. ప్రేమ వివాహం చేసుకుని సింగరేణి కాలనీలో నివసిస్తున్న నితిన్, ప్రవల్లిక దంపతులకు ఈనెల7న పాప పుట్టింది. తీవ్ర అస్వస్థతకు గురైన పాప మెరుగైన వైద్యం కోసం వారు పిసల్‌బండలోని ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చారు. ఆరు రోజుల చికిత్సకు రూ.లక్షా16వేల బిల్లు అయింది. వారి వద్ద కేవలం రూ.30 వేలు మాత్రమే ఉండటంతో దిక్కుతోచక పాపను ఆస్పత్రిలో వదిలేసి వచ్చేశారు. వారి నిస్సహాయస్థితిపై సాక్షి దినపత్రికలో బుధవారం ‘బిల్లు కట్టలేక బిడ్డను ఆసుపత్రిలో వదిలేశారు’ శీర్షికన కథనం ప్రచురితమైంది. దాంతో పలువురు దాతలు వారిని సంప్రదించి తోచిన సహాయం చేశారు. సాక్షి కథనంపై స్పందించిన తెలంగాణ స్టేట్ లీగల్ సెల్ అథారిటీ జడ్జి కళార్చన, గోవర్ధన్‌రెడ్డి గురువారం ఆస్పత్రికి చేరుకున్నారు. యాజమాన్యంతో మాట్లాడి అదే రాత్రి చిన్నారిని డిశ్చార్జి చేయించారు. తమ పరిస్థితిని వెల్లడిస్తూ కథనం ప్రచురించిన సాక్షి దినపత్రికకు, తెలంగాణ లీగల్ సెల్ అథారిటీ అధికారులకు చిన్నారి తల్లిదండ్రులు నితిన్, ప్రవల్లికలు కృతజ్ఞతలు తెలిపారు. -
తరం తల్లడిల్లుతోంది..!
చిల్లా వాసు, ఏపీ సెంట్రల్ డెస్క్ బాపట్లకు చెందిన చెన్నుపాటి యశ్వంత్ చాలా తెలివైన విద్యార్థి. గతేడాది జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో ర్యాంకు సాధించాడు. ప్రతిష్టాత్మక ఐఐటీ గాంధీనగర్ (గుజరాత్)లో కంప్యూటర్ సైన్సులో సీటు వచ్చింది. అయితే చాలా దూరం కావడంతో జాతీయ స్థాయిలో మరో ప్రముఖ విద్యా సంస్థ ఎన్ఐటీ కాలికట్లో బీటెక్ కంప్యూటర్ సైన్సులో చేరాడు. తల్లిదండ్రులు, బంధువులు ఎంతో సంతోషించారు. యశ్వంత్‌కు ఉజ్వల భవిష్యత్ ఖాయమని, క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో మంచి ఉద్యోగం వచ్చేస్తుందని సంబరపడ్డారు. అయితే ఈ ఆనందం వారికి ఎంతో కాలం నిలవలేదు. ఆరు నెలలకే యశ్వంత్ క్యాంపస్‌లో ఆత్మహత్య చేసుకున్నాడు. తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఎన్ఐటీ కాలికట్ లాంటి ప్రముఖ విద్యా సంస్థలో సీటు సాధించి ఇలా ఆత్మహత్య చేసుకోవడం ఏంటని అందరూ నివ్వెరపోయారు. ...ఒక్క యశ్వంత్ మాత్రమే కాదు.. ఇలా ఎంతో మంది విద్యార్థులు ప్రముఖ విద్యా సంస్థలైన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ), నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ), ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐఐఐటీ), ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం) వంటి వాటిలో సీట్లు సాధించి కూడా అర్ధంతరంగా ఆత్మహత్యలకు పాల్పడటం కలవరపరుస్తోంది. కేంద్ర విద్యా శాఖ లెక్కల ప్రకారం.. 2018 నుంచి ఈ ఏడాది వరకు 33 మంది విద్యార్థులు ఐఐటీల్లో ఆత్మహత్య చేసుకున్నారు. జాతీయ స్థాయి విద్యా సంస్థల్లో 2018 నుంచి ఇప్పటివరకు 98 మంది విద్యార్థులు చనిపోతే వీరిలో 33 మంది ఐఐటీల విద్యార్థులే ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ఇక 2014–21లో ఐఐటీలు, ఎన్ఐటీలు, కేంద్రీయ విశ్వవిద్యాలయాలు, ఇతర కేంద్ర విద్యా సంస్థల్లో 122 మంది విద్యార్థులు ప్రాణాలు తీసుకున్నారు. నేషనల్ క్రైమ్ రికార్డు బ్యూరో (ఎన్సీఆర్బీ) ప్రకారం.. కేంద్రీయ విశ్వవిద్యాలయాలు, ఐఐటీల్లోనే ఎక్కువ మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. భారతదేశంలో 2017 నుంచి విద్యార్థుల ఆత్మహత్యల మరణాలు 32.15% పెరిగాయి. మరోవైపు కోచింగ్ ఇన్స్టిట్యూట్ల కర్మాగారంగా, కోచింగ్ హబ్ ఆఫ్ ఇండియాగా పేరొందిన రాజస్థాన్‌లోని కోటాలో ఈ ఏడాది ఇప్పటివరకు 25 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడం పరిస్థితి తీవ్రతను సూచిస్తోంది. సీటు ఎంత కష్టమంటే.. ప్రపంచంలోనే ప్రతిష్టాత్మక విద్యా సంస్థలు.. ఐఐటీలు. వీటి తర్వాత స్థానం ఎన్ఐటీలది. ఇంజనీరింగ్ విద్యకు పేరుగాంచిన ఐఐటీలు, ఎన్ఐటీల్లో ప్రవేశం కోసం ఏటా నిర్వహించే జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ (జేఈఈ) మెయిన్‌ని ఈ ఏడాది దేశవ్యాప్తంగా 11 లక్షలకుపైగా రాశారు. వీరిలో దాదాపు 2.5 లక్షల మందిని తదుపరి పరీక్ష అయిన జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు ఎంపిక చేశారు. దేశంలో ఉన్న 23 ఐఐటీల్లో ఈ ఏడాదికి 17,385 సీట్లు అందుబాటులో ఉన్నాయి. అంటే.. 11 లక్షల మంది పరీక్ష రాస్తే చివరకు ఐఐటీల్లో ప్రవేశించేది 17,385 మంది మాత్రమే. ఇక జేఈఈ అడ్వాన్స్డ్ క్వాలిఫై అయినా సీట్లు రానివారు, జేఈఈ మెయిన్‌లో ర్యాంకులు వచ్చినవారు ఎన్ఐటీలు, ఐఐఐటీలు, ఇతర జాతీయ విద్యా సంస్థల్లో చేరుతున్నారు. జేఈఈ కోసం ఆరో తరగతి నుంచే ఐఐటీ ఒలింపియాడ్, కాన్సెప్ట్ స్కూళ్లలో తల్లిదండ్రులు తమ పిల్లలను చేర్పిస్తున్నారు. ఇందుకు లక్షల రూపాయలు ధారపోస్తున్నారు. ఇలా ఆరో తరగతి నుంచి ఇంటర్మిడియెట్ వరకు ఏడేళ్లపాటు కృషి చేస్తుంటే చివరకు జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో ర్యాంకు సాధించి ఐఐటీల్లో చేరుతున్నారు. ఎందుకిలా.. ఓవైపు అకడమిక్ ఎగ్జామ్స్, మరోవైపు కాంపిటీటివ్ ఎగ్జామ్స్.. ప్రాజెక్టు వర్క్, థీసిస్,ప్రాక్టికల్స్ కోసం సొంతంగా సిద్ధం కావాల్సి రావడం. సొంత రాష్ట్రానికి చాలా దూరంగా వేరే రాష్ట్రాల్లో సీటు రావడం.. భాషలు, ఆహారం, వాతావరణం అలవాటుపడలేకపోవడం గతంలో ఎంత సాధించినా.. ఐఐటీలు, ఎన్ఐటీలలో అసలు సిసలు పోటీ ప్రారంభమవడం. గతంలో బట్టీ పట్టేస్తే సరిపోయేది.. ఇపుడు సృజనాత్మకత అవసరం.. ఇక్కడ మేథస్సుకే పని. విద్యార్థులకు ఇష్టంలేకపోయినా తల్లిదండ్రుల బలవంతం మీద కోర్సును ఎంపిక చేసుకోవడం. ఏం చేయాలి? విద్యాసంస్థలలో మానసిక ఆరోగ్య సేవలను మెరుగుపరచాలి. చాలా ఐఐటీలు, ఎన్ఐటీలు, ఐఐఐటీలు, ఐఐఎంల్లో కౌన్సెలింగ్ సెంటర్లు ఉన్నాయి. వాటిని విద్యార్థులు ఉపయోగించుకోవాలి. ఒత్తిడిని నివారించడానికి బిజినెస్ క్లబ్బులు, ఫొటోగ్రఫీ క్లబ్బు, కల్చరల్ క్లబ్బు, యోగా క్లబ్బు, మ్యూజిక్ క్లబ్బులు ఉన్నాయి. తమ ఆసక్తికి అనుగుణంగా విద్యార్థులు వీటిలో ఏదో ఒకటి ఎంచుకోవాలి. తల్లిదండ్రుల ధోరణి కూడా మారాలి. పిల్లల చదువులకు బాగా డబ్బు ఖర్చు పెట్టామనే ఉద్దేశంతో ఒత్తిడి పెంచడం, ఇతరులతో పోల్చి తిట్టడం వంటివి చేయకూడదు. స్కూల్, కళాశాల స్థాయిల్లోనే బట్టీ పట్టే చదువులకు స్వస్తి పలకాలి. పిల్లలు సృజనాత్మకంగా ఆలోచించుకుని నేర్చుకునేలా చేయాలి. నిత్యం యోగా, ధ్యానం చేయించడంతోపాటు క్రీడల్లోనూ విద్యార్థులు చురుగ్గా పాల్గొనేలా చేయాలి. విద్యార్థులు సోషల్ మీడియా సైట్లు, సైబర్ బెదిరింపుల బారిన పడకుండా చూడాలి. కొద్ది రోజులే ఇబ్బంది.. మాది బాపట్ల జిల్లా. నేను ఎన్ఐటీ జంషెడ్పూర్ లో బీటెక్ కంప్యూటర్ సైన్స్ ఫస్టియర్ చదువుతున్నాను. మొదట్లో నాకు భాషా పరంగా కొంత ఇబ్బందులు ఎదురయ్యాయి. అలాగే ఇంటికి చాలా దూరంలో పరాయి రాష్ట్రంలో ఉండాల్సి రావడం కూడా కొంచెం సమస్యగా మారింది. అయితే ఆ బెరుకును ఇన్స్టిట్యూట్లో ఉన్న కౌన్సెలింగ్ సెంటర్ సిబ్బంది పోగొట్టారు. బోధన పరంగా సంప్రదాయ విధానానికి, ఎన్ఐటీల్లో విద్యకు తేడా ఉంది. ఇక్కడ బోధన చర్చ, విశ్లేషణ.. సంపూర్ణ అవగాహన అనే రీతిలో సాగుతోంది. కొంత అదనపు సమాచారాన్ని మా అంతట మేమే సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది. – ఎం. సుశ్వాంత్, బీటెక్ కంప్యూటర్ సైన్స్,థర్డ్ ఇయర్, ఎన్ఐటీ, జంషెడ్పూర్ కొంత సమయం పడుతోంది.. ఇప్పుడు 8వ తరగతి నుంచే జేఈఈకి సిద్ధమవుతున్నారు. ఇక్కడి నుంచే విద్యార్థులపై ఒత్తిడి మొదలవుతోంది. ఇంటర్మిడియెట్ వరకు టీచర్ పాఠం చెప్పడం.. బోర్డుపైన రాయడం.. నోట్సు చెప్పడం.. తర్వాత దాన్ని బట్టీ పట్టడం వంటి సంప్రదాయ విధానాలకు అలవాటు పడిన విద్యార్థులు ఐఐటీలు, ఎన్ఐటీల్లో కొత్త విధానాలను అలవాటు పడటానికి సమయం పడుతోంది. ఒక్కసారిగా ఇంటికి దూరం కావడం, వేరే ఎక్కడో ఐఐటీ, ఎన్ఐటీల్లో సీట్లు రావడం వల్ల కొంత ఇబ్బందిని ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ప్రాథమిక స్థాయిలో అంతగా స్కిల్స్ లేనివారే ఒత్తిడి బారిన పడుతున్నారు. సాంస్కృతిక కార్యక్రమాలు, క్రీడలు, యోగా వంటివాటి వైపు విద్యార్థులను ప్రోత్సహిస్తే ఒత్తిడి నుంచి బయటపడొచ్చు. ఆ దిశగా చర్యలు చేపట్టాలి. – ఎంఎన్ రావు, ఐఐటీ కోచింగ్ నిపుణులు, హైదరాబాద్ ప్రాథమిక దశలోనే నైపుణ్యాలు పెంపొందించాలి.. కేంద్ర విద్యా శాఖ ప్రాథమిక దశలోనే విద్యార్థుల్లో నైపుణ్యాలు పెంపొందించుకునేలా చర్యలు చేపట్టాలి. అన్ని రాష్ట్రాలతో సమావేశాలు నిర్వహించి విద్యా విధానంలో మార్పులు తీసుకురావాలి. జేఈఈ రాసేవారిలో ఎక్కువ మంది సౌత్ ఇండియా వారే. వీరిలో అత్యధికంగా తెలుగు రాష్ట్రాల నుంచే ఉంటున్నారు. ఇంటర్‌లోగంటల తరబడి చదివి జేఈఈ మెయిన్, అడ్వాన్స్‌డ్‌ల్లో ర్యాంకులు తెచ్చుకుంటున్న విద్యార్థులకు ఐఐటీల్లో అసలు పరీక్ష మొదలవుతోంది. అక్కడ ప్రొఫెసర్లు చెప్పిన కాన్సెప్‌్టతో విద్యార్థులే సొంతంగా నేర్చుకోవాల్సి ఉంటుంది. ఈ నైపుణ్యాలు లేనివారే ఒత్తిడికి గురవుతున్నారు. కొత్త విధానానికి అలవాటుపడలేనివారు మొదటి సెమిస్టర్ పరీక్షల్లో విఫలమవుతున్నారు. ఈ క్రమంలో కొన్ని సబ్జెక్టుల్లో బ్యాక్‌లాగ్స్ ఉంటున్నాయి. దీంతో ఒత్తిడికి గురవుతున్నారు. – కె.లలిత్ కుమార్, డైరెక్టర్, అభీష్ట ఎడ్యుగ్రామ్ లిమిటెడ్ -
తల్లిదండ్రుల మరణంతో.. యువకుడి తీవ్రనిర్ణయం..!
కరీంనగర్: గోదావరిఖనిలోని పరుశరాంనగర్‌కు చెందిన టంగుటూరి గోపాలకృష్ణ (29) గురువారం ఉరేసుకుని మృతిచెందినట్లు వన్‌టౌన్ పోలీసులు తెలిపారు. నాలుగేళ్ల క్రితం గోపాలకృష్ణ తల్లి, తండ్రి మృతిచెందారు. అప్పటినుంచి మానసికంగా కుంగిపోయి తాగుడుకు బానిసయ్యాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని మృతిచెందాడు. మృతుడి నాయినమ్మ టంగుటూరి రాజమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సౌజన్య తెలిపారు. -
తొమ్మిదేళ్ల తర్వాత తల్లిదండ్రుల చెంతకు
వేలూరు: తిరువణ్ణామలై జిల్లా వందవాసి సమీపంలోని నెల్లూరు గ్రామానికి చెందిన ఏలుమలై కూలీ. ఇతని భార్య చినపాప. వీరికి ఐదుగురు కుమారులు, ఐదుగురు కుమార్తెలున్నారు. ఆఖరి కుమార్తె ప్రియ. తొమ్మిదేళ్ల క్రితం తల్లిదండ్రులతో బయటకు వెళ్లిన ప్రియ అదృశ్యమైంది. తల్లిదండ్రులు పలు చోట్ల గాలించినా ఎటువంటి ఆచూకీ తెలియరాలేదు. అటవీ ప్రాంతంలో నివశిస్తుండడంతో పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. ఆరేళ్ల ప్రియను ఒక మహిళ రాణిపేట జిల్లా షోలింగర్‌లోని ప్రైవేటు ఆశ్రమంలో చేర్పించింది. ఈ క్రమంలో అధికారులు ఆశ్రమంపై విచారణ జరిపిన సమయంలో ఆశ్రమానికి అనుమతి లేనట్లు తెలియడంతో వేలూరు అల్లాపురంలోని ప్రభుత్వ ఆశ్రమంలో చేర్పించారు. ప్రియకు తన తల్లిదండ్రుల పేర్లు బాగా తెలియడంతో తరచూ తన తల్లిదండ్రులను చూడాలని ఆశ పడేది. మూడేళ్ల క్రితం ఆమె సొంత గ్రామం జ్ఞాపకానికి వచ్చినట్లు ఆశ్రమం మేనేజర్ వద్ద తెలిపింది. దీంతో అధికారులు ప్రియ చెప్పిన నెల్లూరు గ్రామానికి వెళ్లి తల్లిదండ్రులను విచారణ జరిపి ప్రియ బతికి ఉన్నట్లు తెలపడంతో తల్లిదండ్రుల ఆనందానికి అవధుల్లేవు. అనంతరం ప్రియ నిజమైన తల్లిదండ్రులు అవునా కాదా అనే కోణంలో అధికారులు 2021వ సంవత్సరంలో తండ్రి ఏలుమలై, చిన్నపాపకు డీఎన్ఎ పరీక్షలు చేశారు. ఈ పరీక్షల్లో ప్రియకు నిజమైన తల్లిదండ్రులని తేలింది. వీటిపై సమగ్రమైన సమాచారాన్ని అధికారులకు అందజేసి సోమవారం సాయంత్రం ప్రియను తల్లిదండ్రులకు అప్పగించారు. ఆ సమయంలో తల్లిదండ్రులు ప్రియను కౌగిలించుకుని కన్నీరు మున్నీరయ్యారు. తనను తల్లిదండ్రుల వద్ద చేర్చిన అధికారులకు ప్రియ చేతులు జోడించి కన్నీటితో కృతజ్ఞతలు తెలిపింది. -
చిన్నారులకు ఆత్మీయ నేస్తం
పిల్లల కోసం పర్యావరణ అనుకూలమైన ఉత్పత్తుల తయారీలోగ్రామీణ మహిళలకు అవగాహన కల్పిస్తున్నారు. న్యూ ఏజ్ పేరెంట్స్‌ను ఆకట్టుకునేలా చేస్తున్న ఈ ప్రయత్నానికి మంచి స్పందన వస్తోందని, పిల్లలకు ఈ బొమ్మలు ఆత్మీయ నేస్తాలు అవుతున్నాయని ఆనందంగా వివరిస్తోంది స్వాతి. ‘‘పిల్లల మనసులు తెల్లని కాగితాల్లాంటివి. వాటిపై మనం ఏది రాస్తే అదే వారి భవిష్యత్తు. పదేళ్లుగా వందలాది మంది చంటి పిల్లలతో ఆడిపాడి, వారికి నచ్చినట్టు చెప్పే పద్ధతులను నేనూ నేర్చుకుంటూ వచ్చాను. డిగ్రీ చేసిన నాకు స్వతహాగా పిల్లలతో గడపడంలో ఉండే ఇష్టం నన్ను టీచింగ్ వైపు ప్రయాణించేలా చేస్తోంది. ప్లే స్కూల్ పిల్లలతో ఆడుకోవడం, వారితో రకరకాల యాక్టివిటీస్ చేయించడం ఎప్పుడూ సరదాయే నాకు. నాకు ఒక బాబు. వాడి వల్లనే ఈ ఇష్టం మరింత ఎక్కువైందనుకుంటాను. బాబుతోపాటు నేనూ ఓ స్కూల్లో జాయిన్ అయి, నా ఆసక్తులను పెంచుకున్నాను. ఆలోచనకు మార్గం పదేళ్లుగా చంటి పిల్లల నుంచి పదేళ్ల వయసు చిన్నారుల వరకు వారి ఆటపాటల్లో నేనూ నిమగ్నమై ఉన్నాను కనుక వారి ముందుకు ఎలాంటి వస్తువులు వచ్చి చేరుతున్నాయనే విషయాన్ని గమనిస్తూ వచ్చాను. కానీ, నేను అనుకున్న విధంగా అన్నింటినీ ఒక దగ్గరకు చేర్చడం ఎలాగో తెలియలేదు. కరోనా సమయంలో వచ్చిన ఆలోచన నాకు నేనుగా నిలబడేలా చేసింది. ఒకప్రా జెక్ట్ వర్క్‌లాగా పిల్లల మానసిక వికాసానికి ఏమేం వస్తువులు అవసరం అవుతాయో అన్నీ రాసుకున్నాను. నేను ఏయే పద్ధతుల్లో పిల్లలకు నేర్పిస్తున్నానో, దాన్నే నాకు నేనేప్రా జెక్ట్ వర్క్‌గా చేసుకున్నాను. ఏ వస్తువులు ఏ ప్రాంతానికి ప్రత్యేకమైనవి, నాకు నచ్చినట్టుగా ఏయే వస్తువులను తయారు చేయించాలి అనేది డిజైన్ చేసుకున్నాను కాబట్టి అనుకున్న విధంగా పనులు మొదలుపెట్టాను. కిండోరా టాయ్స్ పేరుతో రెండేళ్ల క్రితం ఈప్రా జెక్ట్నుప్రా రంభించాను. అన్నింటా ఎకో స్టైల్ పిల్లలకు దంతాలు వచ్చే దశలో గట్టి వస్తువులను నోటిలో పెట్టేసుకుంటారు. వాటిలోప్లాస్టిక్వీ వచ్చి చేరుతుంటాయి. అందుకని సాఫ్ట్ ఉడ్‌తో బొమ్మలను తయారు చేయించాను. వీటికోసం మన తెలుగు రాష్ట్రాల్లోని కొండపల్లి, నిర్మల్ నుంచే కాకుండా, ఇతర రాష్ట్రాల్లోని టాయ్ మేకింగ్ వారిని కలిసి నాకు కావల్సిన విధంగా తయారు చేయించాను. ఇంద్రధనుస్సు రంగులను పరిచయం చేయడానికి సాఫ్ట్ ఉడ్ మెటీరియల్, కలర్, బిల్డింగ్ బాక్స్‌లే కాదు... ఐదేళ్ల నుంచి చిన్న చిన్న అల్లికలు, కుట్టు పని నేర్చుకోవడానికి కావల్సిన మెటీరియల్, క్రోచెట్ అల్లికలు వంటివి కూడా ఉండేలా శ్రద్ధ తీసుకున్నాను. సాఫ్ట్ టాయ్స్తోపాఠం మన దేశ సంస్కృతిని పిల్లలకు తెలియజేయాలంటే మన కట్టూ బొట్టునూ పరిచయం చేయాలి. అందుకు ప్రతి రాష్ట్రం ప్రత్యకత ఏమిటో డెకొరేటివ్ బొమ్మల ద్వారా చూపవచ్చు. ఇవి కూడా ఆర్గానిక్ మెటీరియల్స్ తో తయారు చేసినవే. డెకరేటివ్ సాఫ్ట్ టాయ్స్ స్వయంగా నేను చేసినవే. ఆర్గానిక్ కాటన్ మెటీరియల్‌తో చేయించిన సాఫ్ట్ టాయ్స్‌లో జంతువులు, పండ్లు, పువ్వుల బొమ్మలు కూడా ఉంటాయి. వీటివల్ల చిన్న పిల్లలకు ఎలాంటి హానీ కలగదు. రంగురంగులుగా కనిపించే ఈ బొమ్మల ద్వారా చెప్పేపాఠాలను పిల్లలు ఆసక్తిగా వింటారు. వీటితోపాటు పిల్లలను అలరించే పుస్తకాలు కూడా అందుబాటులో ఉండేలా చూసుకున్నాను. ఒక విధంగా చె΄్పాలంటే ఈ కాలపు తల్లిదండ్రులు తమ పిల్లలకు ఎలాంటి మానసిక వికాసపు బొమ్మలు కావాలనుకుంటారో అవన్నీ నా దగ్గర ఉండేలాప్లాన్ చేసుకున్నాను. నా ఆసక్తే పెట్టుబడి.. ఉద్యోగం చేయగా వచ్చిన డబ్బుల నుంచి చేసుకున్న పొదుపు మొత్తాలను ఇందుకోసం ఉపయోగించాను. ముందు చిన్నగా స్టార్ట్ చేశాను. ఇప్పుడు ఆన్లైన్ వేదికగా మంచి ఆర్డర్స్ వస్తున్నాయి. నాతోపాటు ఈ పనిలో గ్రామీణ మహిళలు భాగస్వామ్యం కావడం మరింత ఆనందాన్ని ఇస్తోంది. ప్లే స్కూళ్లు, ఆన్లైన్, ఆఫ్ లైన్ ద్వారా వచ్చే ఆర్డర్లను బట్టి సాఫ్ట్ టాయ్స్ తయారీలో కనీసంపాతికమంది మహిళలుపాల్గొంటున్నారు. ముందుగా వర్క్‌షాప్ నిర్వహించి, టాయ్స్ మేకింగ్ నేర్పించి వర్క్ చేయిస్తుంటాను. పూర్తి ఎకో థీమ్ బేస్డ్ కావడంతో ఈ కాలం అమ్మలు ప్రత్యేక ఆసక్తి చూపిస్తున్నారు. నేననుకున్న థీమ్ ఎంతో కొంతమందికి రీచ్ అవడం నాకు చాలా ఆనందంగా ఉంది’’ అని వివరించింది స్వాతి.– నిర్మలారెడ్డి ఫొటోలు: మోహనాచారి -
ఆ ఊరిలో ఇంటికో డాక్టర్ ఎందుకున్నారు? ఇందుకు ఎవరు ప్రేరణగా నిలిచారు?
మనదేశంలోని ఆ గ్రామంలో గల ప్రతి ఇంట్లో వైద్యుడు ఉన్నాడు. ఈ భూమి మీద ఉన్న దేవుని స్వరూపమే వైద్యుడని అంటుంటారు. ఆలోచిస్తే ఇది నిజమేనని అనిపిస్తుంది. ఇప్పుడు కొత్తగా పుట్టుకు వస్తున్న రోగాల నుంచి మనకు విముక్తి కల్పించేది వైద్యులే అనే విషయాన్ని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మనం చెప్పుకుంటున్న ఆ గ్రామం మహారాష్ట్రలోని థానే జిల్లాలో ఉంది. ఇక్కడి ఘరివలి గ్రామంలో దాదాపు ముప్పై కుటుంబాలు నివసిస్తున్నాయి. ఈ కుటుంబాలలో ఎక్కువ మంది వైద్యులు ఉన్నారు. ఇక్కడ అన్నింటికన్నా ముఖ్య విషయం ఏమిటంటే ఈ కుటుంబాలకు చెందిన పిల్లలు భవిష్యత్తులో కూడా వైద్యులు కావాలనే సంకల్పంతో ఉన్నారు. ఇక్కడి చిన్నారులు వైద్యులుగా తయారయ్యేందుకు మొదటి నుంచీ ప్రేరణ పొందుతున్నారు. ఈ ప్రపంచంలో మరొకరి ప్రాణాన్ని కాపాడటం కంటే మించినది వేరేదీ లేదని గ్రామస్తులు చెబుతుంటారు. కాగా ఇక్కడ ఉన్న కుటుంబాల ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే. అయినప్పటికీ వారి పిల్లలు ప్రతి సంవత్సరం వైద్యులుగా మారుతున్నారు. ఈ గ్రామంలో వైద్యుల కథ 2000 సంవత్సరంలో మొదలైంది. ఈ గ్రామానికి చెందిన సంజయ్ పాటిల్ అనే యువకుడు తొలిసారిగా ఎంబీబీఎస్ పట్టా అందుకున్నాడు. అతను డాక్టర్ అయ్యాక, అతనితో పాటు అతని కుటుంబం ఆర్థిక స్థితి మెరుగుపడింది. దీంతోపాటు అతని కుటుంబానికి సమాజంగా గౌరవం మరింతగా పెరిగింది. ఇదిమొదలు గ్రామంలోని ప్రతి చిన్నారిలోనూ డాక్టర్ కావాలనే కల చిగురించింది. కుటుంబ సభ్యుల సహకారంతో ఇక్కడి పిల్లలు డాక్టర్లు కావడానికి ఎంతో కష్టపడుతున్నారు. నేడు ఈ గ్రామంలోని ప్రతి ఇంటిలోనూ వైద్యుడు ఉన్నాడు. ఇది కూడా చదవండి: ‘ఏంట్రా ఇదంతా’..‘ఎవర్రా మీరు’.. ‘ఇదేందిది’.. వీటికి బాప్ ఈ వీడియో! -
పెళ్లి చేసుకోమని చెప్పారు.. కానీ ఇప్పుడైతే.. విజయ్ ఆసక్తికర కామెంట్స్!
రౌడీ హీరో విజయ్ దేవరకొండ తాజాగా నటించిన చిత్రం ఖుషి. ఈ చిత్రంలో సమంత హీరోయిన్గా నటించింది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం సెప్టెంబర్ 1న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ మూవీకి శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మించారు. ప్రస్తుతం మూవీ ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు విజయ్ దేవరకొండ. అయితే ఓ షోలో పాల్గొన్న విజయ్ తన పెళ్లి గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. (ఇది చదవండి: సమంత, విజయ్ 'ఖుషి'.. క్రేజీ అప్డేట్ వచ్చేసింది!) తాజాగా విజయ్ పాల్గొన్న టీవీ షోకు సంబంధించిన ప్రోమో రిలీజ్ అయింది. ఈ షోలో పాల్గొన్న విజయ్ను యాంకర్ అతని పెళ్లి గురించి ప్రశ్నించింది. అయితే దీనికి విజయ్ క్రేజీ ఆన్సరిచ్చారు. మా ఇంట్లో వాళ్లు పెళ్లి చేసుకోమని సలహా ఇస్తున్నారు. అమ్మ, నాన్న కూడా మనవళ్లు కావాలని అడుగుతున్నారు. కానీ నాకు ఇప్పుడే మ్యారేజ్ చేసుకునే ఉద్దేశం లేదంటూ సమాధానమిచ్చారు. ప్రస్తుతం తన పెళ్లి గురించి విజయ్ దేవరకొండ చేసిన కామెంట్స్ తెగ వైరలవుతున్నాయి. కాగా.. ఇటీవల ఖుషి ట్రైలర్ లాంచ్ సందర్భంగా పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించాడు. రెండేళ్లలో పెళ్లి చేసుకుంటానని కూడా చెప్పేశాడు. విజయ్ దేవరకొండ, సమంతా నటించిన ఖుషి చిత్రం ప్రేమ కథ చుట్టూ తిరుగుతుంది. ఈ చిత్రంలోజయరామ్, సచిన్ ఖేడేకర్, మురళీ శర్మ, వెన్నెల కిషోర్, లక్ష్మి, రోహిణి, అలీ, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించారు. హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతమందించారు. (ఇది చదవండి: ఖుషి రెమ్యునరేషన్.. ఒక్కొక్కరు అన్ని కోట్లు తీసుకున్నారా?) -
తల్లిదండ్రులుగా..అదే పిల్లలకు ఇవ్వగల అత్యంత విలువైన కానుక!
పిల్లలకు మీ సమయాన్ని ఇస్తున్నారా? పిల్లలకు తల్లిదండ్రులు ఇవ్వగల అత్యంత విలువైన కానుక ఏదైనా ఉందంటే అది కేవలం సమయం మాత్రమే. సమయం ఎందుకు విలువైనది అని అంటే, గడిచిన క్షణం అయినా తిరిగి రాదు. అందువల్ల వారితో విలువైన, నాణ్యమైన సమయాన్ని గడిపి, వారికి మంచి జ్ఞాపకాలను మిగల్చండి. వారితో గడిపేందుకు ఏమేం చేయవచ్చో చూద్దాం... మనం పిల్లలతో కలిసి చదవడం, పనిపాటలు చేయడం నుంచి ఆటలు ఆడటం వరకు..వారితో మీ బంధం బలపడడానికి, అనుబంధాలు అల్లుకోవడానికి తోడ్పడతాయి. పుస్తక పఠనం పిల్లలతో బంధాన్ని పెంచుకోవడానికి, వారి భాషానైపుణ్యాలను పెంపొందించడానికి పుస్తకపఠనం గొప్ప మార్గం. వయస్సుకి తగినవి, మీ పిల్లలు ఆనందిస్తారని మీరు భావించే పుస్తకాలను ఎంచుకుని వాటిని పిల్లలతో కలిసి బిగ్గరగా చదవవచ్చు లేదా వాళ్లే చదివి మీకు వినిపించేలా చేయవచ్చు. ఒకవేళ పుస్తకాలు లేకపోతే తెలుగు లేదా ఇంగ్లిష్ వార్తాపత్రికలు చదవడంతో దినచర్య ప్రారంభించడం మంచిది. కలిసి ఆటలు ఆడటం మీ పిల్లల సామాజిక నైపుణ్యాలను అభివృద్ధి చేయడానికి ఆటలు ఆడటం ఒక ఆహ్లాదకరమైన మార్గం. బోర్డ్ గేమ్‌లు, కార్డ్గేమ్లు, అవుట్డోర్ గేమ్‌లు వంటి అనేకరకాల ఇండోర్ లేదా ఓట్‌డోర్ గేమ్స్ పిల్లలతో ఆడచ్చు. చెస్, స్నేక్స్ అండ్ లేడర్స్ (పాముపటం), అష్టాచెమ్మా, పచ్చీస్ వంటివి పిల్లలతో కలిసి ఆడటం వల్ల వారిలో క్రీడానైపుణ్యాలు పెంపొందుతాయి. విహారయాత్రలకు వెళ్లడం పిల్లలు కొత్త విషయాలను అనుభూతించడానికి, వారి చుట్టూ ఉన్న ప్రపంచాన్ని తెలుసుకోవడానికి ఔటింగ్‌లకు వెళ్లడం గొప్పమార్గం. పార్క్, జూపార్క్, మ్యూజియం లేదా ఇంకేదైనా చూపించడానికి వారిని అప్పుడప్పుడు బయటకు తీసుకెళ్లడం ద్వారా వారితో ఎక్కువ సమయం గడపవచ్చు. కళానైపుణ్యాన్ని పెంపొందించడం కళలు పిల్లలు తమను తాము నిరూపించుకోవడానికి, తమ నైపుణ్యాన్ని మెరుగుపరచుకోవడానికి కళలు ఒక ఆహ్లాదకరమైన చక్కటి మార్గం. మీరు మీ పిల్లలకు క్రేయాన్లు, మార్కర్లు, పెయింట్, క్లే వంటి ఆర్ట్ సామాగ్రిని సమకూర్చి, వాటితో వారు ఏమేం చేయాలనుకుంటున్నారో చెప్పించి, వాటిని తయారు చేసేందుకు వారితో కలిసి పనిచేయండి. వారికి కావలసిన వాటిని వారే తయారు చేసుకునేలా వారిని ప్రోత్సహించండి. గార్డెనింగ్ పిల్లలు ప్రకృతి, బాధ్యత గురించి తెలుసుకోవడానికి గార్డెనింగ్‌ని మించిన మంచి మార్గం మరోటి లేదని చెప్పొచ్చు. పిల్లలతో కలిసి మీ పెరట్లో కొన్నిమొక్కలు నాటవచ్చు. లేదా మీ డాబాపై కొన్ని కుండీలు ఏర్పాటు చేసి వాటిలో కూడా నాటవచ్చు. వాటికి రోజూ నీళ్లు పోయడం, అవి ఎలా పెరుగుతున్నాయో వారితో కలిసి చూడడం గొప్ప అనుభూతినిస్తుంది. మాట్లాడటం... మాట్లాడనివ్వటం పిల్లలతో నాణ్యమైన సమయాన్ని గడపడానికి ఉత్తమమైన మార్గాలలో ఒకటి వారితో మాట్లాడటం, వారు చెప్పే కబుర్లు ఆసక్తిగా వినడం. వారి రోజువారి స్నేహితులు, వారి ఆసక్తులు, వారి కలల గురించి వారిని అడగండి. వారు చెప్పేది వినండి. అవసరం అయితే వారికి మీ మద్దతును, సహకారాన్ని అందించడం. కలిసి వంట చేయడం ఉదయం పూట చేసే బ్రేక్‌ఫాస్ట్ నుంచి, మధ్యాన్నం వారు తినే లంచ్ వరకు వారికి ఇష్టమైన వాటిని లేదా మీ ఇంట్లో ఉన్న వాటితో టిఫిన్లు, స్నాక్స్, లంచ్ ప్రిపేర్ చేయడంలో వారి సాయం తీసుకోవడం మంచి పద్ధతి. అంటే తప్పనిసరిగా వారు మీకు హెల్ప్ చేయాలని కాదు... ఆసక్తి ఉంటే వారే సాయం చేయడానికి వచ్చేలా చేసుకోగలిగితే చాలు. ఇది రోజూ కుదరకపోవచ్చు కానీ కనీసం వారికి సెలవురోజుల్లో అయినా సరే, కలిసి వంట చేసుకునే అలవాటు చేయడం మంచిది. వాకింగ్ లేదా సైక్లింగ్‌కు తీసుకెళ్లడం పిల్లలు పది పన్నెండేళ్లలోపు వారైతే వారిని మీతో కలిసి రోజూ వాకింగ్‌కు లేదా సైక్లింగ్‌కు తీసుకెళ్లండి. వారు శారీరకంగా చురుగ్గా ఉండేందుకు, మానసికంగా మీకు దగ్గరయ్యేందుకు మార్నింగ్ వాక్ మంచి మార్గం. అలా చేయడం ద్వారా వారు రోజంతా ఉత్సాహంగా ఉంటారు. స్వచ్ఛంద సేవలో... పిల్లలు ఇతరులకు సహాయం చేయడం, ప్రపంచంలో మార్పు తీసుకురావడం గురించి తెలుసుకోవడానికి వాలంటీరింగ్ ఒక గొప్ప మార్గం. మీరు స్థానికంగా ఉండే ఆశ్రమాల్లో లేదా ఇతర సంస్థలో స్వచ్ఛందంగా సేవ చేయవచ్చు. (చదవండి: ఎలక్ట్రానిక్ వ్యర్థం ఏదైనా..అతడి చేతిలో శిల్పంగా మారాల్సిందే!) -
లవర్స్ ఇంట్లో ఉండంగా..పేరెంట్స్ వచ్చారు..చివరకు ఏమి జరిగిందో చూస్తే నవ్వు ఆపుకోలేరు..
-
ప్రభుత్వ బడుల్లో పేరెంట్స్ టీచర్స్ మీటింగ్
-
సర్కారు బడి.. తల్లిదండ్రుల మమేకంతో..సరికొత్త ఒరవడి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఆధునిక వసతులు సమకూరుస్తున్న వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం.. బోధనలోనూ అత్యాధునిక పద్ధతులతో విద్యార్థులను అత్యున్నతంగా తీర్చిదిద్దుతోంది. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే ప్రతి విద్యార్థీ అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలను అందుకోవాలన్న లక్ష్యంతో స్కూళ్ల తీరుతెన్నులనే మార్చేసింది. ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ప్రగతి, తరగతిలో వారి పరిస్థితిని తల్లిదండ్రులు తెసుకునేందుకు పేరెంట్ – టీచర్స్ సమావేశాలు ఏర్పాటు చేస్తోంది. పాఠశాల విద్యా శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసిన పేరెంట్–టీచర్స్ సమావేశాలు విజయవంతమయ్యాయి. ఫార్మాటివ్ అసెస్మెంట్ అనంతరం పిల్లల ప్రగతిని తల్లిండ్రులకు వివరించేందుకు గురువారం 45,219 ప్రభుత్వ పాఠశాలల్లో ఈ సమావేశాలు జరిగాయి. రెండురోజుల క్రితమే సమాచారం అందుకున్న తల్లిదండ్రులు పనులను సైతం పక్కనబెట్టి పాఠశాలలకు వచ్చారు. మొదటి సమావేశానికి రాష్ట్రవ్యాప్తంగా 60 శాతం మంది తల్లిదండ్రులు హాజరై బడిలో వారి పిల్లల ప్రగతిని స్వయంగా తెలుసుకున్నారు. ప్రభుత్వం వారి పిల్లల కోసం చేస్తున్న మంచిని కొనియాడారు. ఏజెన్సీ ప్రాంతమైన చింతపల్లి మండల కేంద్రంలోని గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలకు 30 కిలోమీటర్ల దూరంలోని గిరిజన గూడేల నుంచి తల్లిదండ్రులు హాజరవడం.. పిల్లల మేలు కోసం తల్లిదండ్రులు పడుతున్న తపనకు అద్దం పట్టింది. పూర్తి స్నేహపూరిత వాతావరణంలో జరిగిన ఈ సమావేశాల్లో విద్యార్థులు చదువులో రాణిస్తున్న వైనాన్ని, పాఠశాలల్లో కలి్పంచిన సౌకర్యాలను, విద్యా విషయక మార్పులను, సాధించిన పురోగతిని ఉపాధ్యాయులు తల్లిండ్రులకు వివరించారు. ఇంటి వద్ద పిల్లలు ఎలా మసలుకుంటున్నారో అడిగి తెలుసుకున్నారు. ఇకపై ఫార్మాటివ్, సమ్మెటివ్ అసెస్మెంట్స్ అనంతరం పేరెంట్స్–టీచర్స్ సమావేశాలు ఉంటాయని పాఠశాల విద్యా శాఖ కమిషనర్ సురేష్ కుమార్ తెలిపారు. ప్రభుత్వ బడుల్లో ఇలాంటి సమావేశాలు గతంలో ఎప్పుడూ చూడలేదని, ఇవి తమ బాధ్యతను మరింత పెంచిందని పలువురు తల్లిదండ్రులు అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ బడుల్లో ఎన్ని మార్పులు వచ్చాయో స్వయంగా చూశామని, ఈ పథకాలు, సమావేశాలు కొనసాగించాలని కోరారు. ఇంత బాగుంటుందని అనుకోలేదు మా అమ్మాయి భవాని ఆశ్రమ పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. ఇక్కడ ఎలా ఉంటుందో, ఏం తింటుందో అని బెంగగా ఉండేది. మా ఊరు దూరమైనా బిడ్డ బాగుకోసం వచ్చాను. ఇక్కడ సౌకర్యాలన్నీ బాగున్నాయి. ఎలా చదువు చెబుతున్నారో చెప్పారు. పిల్లలను బాగా చూసుకుంటున్నారు. ఈ సమావేశం లేకపోతే ఈ విషయాలు తెలిసేది కాదు. ఇది చాలా మంచి కార్యక్రమం. – కొర్ర తిలో, నిమ్మపాడు, చింతపల్లి మండలం ఎలా చదువుతుందో తెలుసుకున్నా నాతవరం మండలం గునుపూడి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మా అమ్మాయి ఆశ్రిత ఎనిమిదో తరగతి చదువుతోంది. తల్లిదండ్రుల మీటింగ్‌లో ఫార్మెటివ్ పరీక్ష ఫలితాలను మాకు తెలియజేశారు. మా పిల్లలు ఎలా చదువుతున్నారో చెప్పారు. గతంలో ఎప్పుడూ ప్రభుత్వ స్కూల్లో ఇలాంటి సమావేశాలు జరగలేదు. ఇప్పుడు మా బాధ్యత ఏంటో తెలిసింది. పిల్లలు కూడా జాగ్రత్తగా చదువుతారు. ఈ సమావేశాలు ఏర్పాటు చేసిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెప్పి తీరాలి. – సాంబారు గోవింద, గునుపూడి, అనకాపల్లి జిల్లా -
ఏపీ ప్రభుత్వ పాఠశాలల్లోనూ పేరెంట్స్ మీటింగ్
-
ఇల్లు శుభ్రం చేయలేదని మందలించడంతో.. ఇంట్లోకి వెళ్లి
తిరువళ్లూరు(చెన్నై): ఇంటిని శుభ్రం చేయలేదని తల్లి మందలించడంతో మనస్తాపం చెందిన కుమార్తె ఉరివేసుకుని ఆత్మహత్యకు యత్నించిన సంఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. తిరువళ్లూరు జిల్లా కడంబత్తూరు యూనియన్ పుదుపట్టు గ్రామానికి చెందిన సభాపతి(42) తిరువళ్లూరు కలెక్టర్ కార్యాలయంలో రికార్డు అసిస్టెంట్‌గా పని చేస్తున్నాడు. ఇతడికి భార్య కవియరసి పిల్లలు రాకేష్(16), దర్శినిక(15), సంజిత్(12) ఉన్నారు. ముగ్గురు పన్నూరులోని ప్రైవేటు పాఠశాలలో చదువుతున్నారు. కాగా గ్రామంలో ఆదివారం జాతర జరిగింది. ఈ క్రమంలో ఇంటిని శుభ్రం చేయాలని కుమార్తె దర్శినికను తల్లి కవియరసి ఆదేశించింది. అయితే దర్శినిక ఇంటిని శుభ్రం చేయకపోవడంతో తల్లి మందలించింది. దీంతో మనస్తాపం చెందిన దర్శినిక ఇంట్లో ప్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తండ్రి సభాపతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మప్పేడు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ సంఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. చదవండి: ఐఏఎస్ కల నెరవేరక బ్యాంకు మేనేజర్ ఆత్మహత్య -
మరో ‘పబ్జీ’ దారుణం: తల్లిదండ్రులపై దాడికి తెగబడి..
ఉత్తరప్రదేశ్‌లోని జాన్సీకి చెందిన ఒక యువకుడు పబ్జీ ఆడుతూ, తన మనసుపై నియంత్రణ కోల్పోయి, తల్లిదండ్రులను అత్యంత దారుణంగా చావబాదాడు. రోజూ పాలుపోసే వ్యక్తి వారి ఇంటికి వచ్చినప్పుడు ఈ విషయం వెలుగుచూసింది. పాలుపోసే వ్యక్తి వారి ఇంటిలోకి వెళ్లి చూడగా ఇంటి యజమాని, అతని భార్య రక్తపు మడుగులో అతనికి కనిపించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, బాధితులను ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందించిన పాలుపోసే వ్యక్తి ఈ దారుణ ఘటన జాన్సీ పట్టణంలోని నవాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. గుమనాబాద్లో ప్రభుత్వ ఉపాధ్యాయుడు లక్ష్మీప్రసాద్(60) అతని భార్య విమల(55) కుమారుడు అంకిత్(28) ఉంటున్నారు. ఉదయం పాలుపోసే వ్యక్తి వారి ఇంటి తలుపు తట్టాడు. లోపలి నుంచి ఎటువంటి సమాధానం వినిపించలేదు. దీంతో అతను ఇంటిలోనికి వెళ్లి చూశాడు. అక్కడ రక్తపుమడుగులో లక్ష్మీప్రసాద్, విమల అతనికి కనిపించారు. వారి పక్కనే అంకిత్ కూర్చుని ఉన్నాడు. ఆసుపత్రికి చేరుకునేలోగానే.. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని తీవ్ర గాయాలతో కొట్టుమిట్టాడుతున్న ఆ దంపతులను ఆసుపత్రికి తరలించారు. అయితే ఆసుపత్రికి చేరుకునేలోగానే లక్ష్మీప్రసాద్ మృతిచెందగా, చికిత్స పొందుతూ విమల కన్నుమూసింది. పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం కోసం తరలించారు. నిందితుడు అంకిత్‌ను అరెస్టు చేసి, అదుపులోకి తీసుకున్నారు. తల్లిదండ్రులపై కర్రతో తీవ్రంగా దాడి ఈ కేసు గురించి పోలీసు అధికారి రాజేష్ మాట్లాడుతూ నిందితుడు అంకిత్ తన తల్లిదండ్రులపై కర్రతో తీవ్రంగా దాడి చేశాడని, ఫలితంగానే వారు మృతి చెందారని తెలిపారు. మానసిక స్థితి దెబ్బతినడంతోనే తాను అలా చేశానని అంకిత్ పోలీసుల ముందు తన తప్పు ఒప్పుకున్నాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. నిత్యం పబ్జీ గేమ్ ఆడుతూ.. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం అంకిత్‌కు రెండేళ్లుగా మానసిక స్థితి సరిగా లేదు. నిత్యం పబ్జీ గేమ్ ఆడుతుంటాడు. ఈ గేమ్ కారణంగా అతని మానసిక స్థితి మరింత దిగజారింది. ఈ ఘటనలో అంకిత్ తొలుత తండ్రిపై, తరువాత తల్లిపై దాడి చేశాడని సమాచారం. ఇది కూడా చదవండి: టమాటాలను వదలి అవకాడోలపై పడుతున్న జనం! -
చెత్తకుప్పల నుంచి చదువులమ్మ ఒడికి..
హనుమకొండ: చెత్త ఏరే చిట్టిచేతులు నోట్‌బుక్స్ పట్టాయి. చెదిరిన నెత్తి, చిరిగిన బట్టలతో ఉండే పిల్లలు శుభ్రంగా తయారై బడిబాట పట్టారు. 11 మంది బాలలు చెత్తకుప్పలను వీడి చదువులమ్మ ఒడికి చేరుకున్నారు. మంగళవారం స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ చీఫ్‌విప్ దాస్యం వినయ్‌భాస్కర్ హనుమకొండ బాలసముద్రంలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయానికి చెత్త ఏరుకునే బాలలతోపాటు తల్లిదండ్రులను పిలిపించారు. చదువు ప్రాముఖ్యత గురించి వారికి అవగాహన, చైతన్యం కల్పించారు. దీంతో పిల్లలను పాఠశాలకు పంపేందుకు తల్లిదండ్రులు అంగీకరించారు. వెంటనే జిల్లా మైనారిటీ సంక్షేమాధికారి మేన శ్రీనును పిలిపించి 11 మంది బాల కార్మికులను గురుకులాల్లో చేర్చించారు. పిల్లలకు నోట్‌బుక్స్ అందించారు. బాలలకు, తల్లిదండ్రులకు వినయ్‌భాస్కర్ భోజనం వడ్డించారు. వారితో కలిసి భోజనం చేశారు. -
చిమ్మచీకటి.. జోరు వర్షం.. పసికందును విసిరేసిన తల్లిదండ్రులు
భువనేశ్వర్: చిమ్మచీకటి.. జోరు వర్షంలో బస్తాలో చుట్టి, పసికందును విసిరేసిన తల్లిదండ్రుల కాఠిన్యానికి పిడుగులు కూడా మిన్నకుండిపోయాయి. జనం కంట కనిపించే వరకు మెరుపులే తోడుగా నిలిచి, ముక్కు పచ్చలారని చిన్నారిని కాపాడుకున్నాయి. మల్కన్‌గిరి జిల్లా కేంద్రంలో చోటు చేసుకున్న ఈ ఘటన మానవత్వానికి మాయని మచ్చగా తారస పడింది. వివరాల్లోకి వెళ్లే శనివారం వేకువజామున మల్కన్‌గిరి తోలాసాహి(దిగువ వీధి) వైపు వెళ్తున్న స్థానికులకు ఏడుపు వినిపించడంతో వెళ్లి చూడగా, చెత్తకుప్ప వద్ద బియ్యం బస్తాలో చుట్టి ఉన్న పసికందు కనిపించింది. వెంటనే చైల్డ్‌లైన్ సిబ్బందికి సమాచారం అందించడంతో పాటు మల్కన్‌గిరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు.. బిడ్డ ఆరోగ్యంగానే ఉందని, పుట్టి ఒక రోజే కావస్తుందని తెలిపారు. ఆస్పత్రికి చేరుకున్న ఐఐసీ రీగాన్ కీండో కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. పసికందు తల్లిదండ్రుల వివరాలపై ఆరా తీస్తున్నారు. చదవండి విదేశీయుని వద్ద రూ.5000 చలానా వసూలు చేసిన పోలీసు.. రిసిప్ట్ ఇవ్వకుండానే.. వీడియో వైరల్.. -
భార్య కోసం వెయిటింగ్.. కార్లోకి వెళ్లి డోర్ లాక్ చేసిన చిన్నారి.. చివరికి
పిల్లలు ఉన్న తల్లిదండ్రులు కాస్త జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఎందుకంటే పిల్లలు చేసే అల్లరి, తెలియక చేసే కొన్ని పనులు వాళ్లని ప్రమాదంలో పడేసే అవకాశం ఉంది. పిల్లలతో బయటకు వెళ్తే..కంటికి రెప్పలా కాపాడుకోవాల్సి ఉంటుంది. సరదాగా షికారుకు వెళ్లినప్పుడు.. చిన్నారులు కార్లోకి వెళ్లి లోపల నుంచి లాక్ వేసుకోడం కొత్తేమి కాదు. కార్ల తయారీదారులు సెంట్రల్ లాకింగ్‌ను ప్రవేశపెట్టినప్పటి నుండి, ఇలాంటి ఘటనలు చూస్తూనే ఉన్నాం. పంజాబ్‌లోని లూథియానాలో అలాంటి ఘటనే మరొకటి చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఓ వ్యక్తి తన భార్య, పిల్లాడి కోసం ఎదురు చూస్తున్నాడు. అంతలో తన రెండో కుమారుడు ( 3 సంవత్సరాలు) అతని చేతిలో నుంచి కారు కీ లాక్కొని వాహనంలోకి ప్రవేశించాడు. అనంతరం కార్ డోర్ వేయడంతో పాటు కొన్ని సెకన్లలో, కారు లాక్ అవుతుంది. కార్ డోర్లు అన్నీ లాక్ అవడంతో.. ఆ తండ్రి తన కొడుకుతో కమ్యూనికేట్ చేయడానికి ప్రయత్నించి.. అన్‌లాక్ బటన్‌ను నొక్కమని అడిగాడు. అయినప్పటికీ, పిల్లవాడు గందరగోళానికి గురవడంతో అనుకోకుండా అన్ లాక్ బటన్‌ను అనేకసార్లు నొక్కడంతో కారులోని అలారం యాక్టివేట్ అవుతుంది. దీంతో చిన్నారి ఏడవడంతో స్థానికులు గుమిగూడారు. చివరికి అనేక ప్రయత్నాల తరువాత, వారు సుత్తితో వెనుక క్వార్టర్ గ్లాస్‌ను పగలగొట్ట.. పిల్లవాడిని కారులోంచి బయటకు సురక్షితంగా రక్షించుకోగలిగారు. పిల్లలతో జాగ్రత్తగా ఉండాలి అంటూ ఈ విషయాన్ని అతను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. Tragedy averted with God’s grace 🙏 There will always be a moment that no matter how smart you think you are, you will panic and have a brain-fade moment. So today while picking my 3 years old sons from school, one of them locked himself inside with windows fully rolled up.… pic.twitter.com/SeG9Be1kh2 — Sunderdeep - Volklub (@volklub) July 20, 2023 చదవండి దేశంలో అత్యంత ధనిక ఎమ్మెల్యే ఎవరో తెలుసా.. వామ్మో అన్ని ఆస్తులు ఉన్నాయా! -
ఏసీ వార్డు కోసం రచ్చ.. కయ్యానికి దిగిన వియ్యంకులు
లక్నో: యూపీలోని బారాబంకిలో నెలలు నిండిన తమ బిడ్డ డెలివరీకి ఏసీ వార్డులో చేర్పించలేదని కోపంతో ఓ గర్భవతి తల్లిదండ్రులు ఆమె అత్తమామలను చితక బాదారు. ఈ వీడియోని అక్కడున్నవారిలో ఒకరు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారింది. తమ బిడ్డకు నెలలు నిండడంతో డెలివరీ నిమిత్తం స్థానికంగా ఓ ప్రైవేటు హాస్పిటల్లో చేర్పించినట్టు తెలుసుకుని బిడ్డను చూసేందుకు ఆత్రుతతో హాస్పిటల్ కు వెళ్లారు గర్భవతి తల్లిదండ్రులు. తీరా అక్కడికి వెళ్లి చూస్తే ఏసీ వార్డులో కాకుండా నాన్ ఏసీ వార్డులో ఉన్న తమ బిడ్డను చూసి వారి ఆగ్రహం కట్టలు తెంచుకుంది. మొదట మాటల యుద్ధానికి తెరతీసిన వారు మెల్లగా ముష్టియుద్ధానికి తెగబడ్డారు. వియ్యంకుడు రామ్ కుమార్ తోపాటు అతని భార్యని ఇద్దరు పిల్లలను పట్టుకుని చితకొట్టేశారు. వారు కూడా తిరగబడటంతో గొడవ మరీ పెద్దదైంది. రోడ్డు మీద నలుగురు చూస్తుండగానే ఈ వీరంగమంతా జరగడంతో ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇంకేముంది వీడియో ఎక్కడెక్కడో చక్కెర్లు కొడుతోంది. #Barabanki में बहू के लिए अस्पताल में AC रूम न बुक करने पर मायके वालों ने की ससुराल पक्ष के लोगों की पिटाई, विडियो वायरल। pic.twitter.com/bfuKZ5j4uA — Priya singh (@priyarajputlive) July 5, 2023 ఇది కూడా చదవండి: కన్నతల్లిని భుజాన మోస్తూ.. శివభక్తుడి సాహసం.. -
మా పిల్లలు చదివించడానికి పేదరికం అడ్డు రాకుండా చేసింది జగనన్న అమ్మఒడి
-
కాళ్లు లేకపోయినా రెక్కలున్నాయ్!
ప్రమాదంలో కాలు పోగొట్టుకొని, తల్లిదండ్రులకు భారమై, లోకమంతా శూన్యంలా అనిపించిన రోజుల నుంచి తేరుకొని, అహ్మదాబాద్‌లో ‘ఆంప్ టీ నేహా’ పేరుతో టీ స్టాల్ ప్రారంభించి ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తోంది నేహ. మోటివేషనల్ స్పీకర్‌గానూ తన జీవన అనుభవాలను చెబుతోంది. ఆంప్ టీ కి దేశవ్యాప్త గుర్తింపు తేవడానికి కృషి చేస్తోంది. ఓడిపోయిన రోజుల నుంచి ఒంటికాలితో గెలవడానికి చేస్తున్న ప్రయత్నాలను ఏ మాత్రం వెనకడుగు వేయకుండా వివరిస్తుంది నేహ. ‘‘మాది ఉమ్మడి కుటుంబం. అమ్మ,నాన్న, ఇద్దరు అన్నదమ్ములు. నాన్న ఎలక్ట్రీషియన్‌గా పనిచేసేవాడు. గుజరాత్‌లోని భవానీ నగర్లో పుట్టి పెరిగాను. ఆర్థిక ఇబ్బందుల కారణంగా కాలేజీ చదువు మధ్యలోనే ఆపేయాల్సి వచ్చింది. ఓ చిన్న ప్రైమరీ స్కూల్లో టీచర్‌గా ఉద్యోగం వెతుక్కొని, కొన్నాళ్లు గడిపాను. చిన్నప్పటి నుంచి చదువుతోపాటు డ్యాన్స్ అంటే చాలా ఇష్టం ఉండేది. కానీ, ఇంటి ఆర్థిక పరిస్థితుల కారణంగా కాలక్రమంలో అన్ని ఇష్టాలను వదులుకుంటూ రావాల్సి వచ్చింది. ఇలాగే ఉంటే నా కలల రెక్కలు విప్పుకోలేననిపించింది. ఉద్యోగంతో పాటు కాలేజీలో చదువుకోవడానికి అడ్మిషన్ తీసుకున్నాను. ఉదయం టీచర్‌గా చేస్తూ, సాయంత్రం కాలేజీలో చదువుకునేదాన్ని. స్కూల్లో పాఠాలు చెబుతూనే నా బలహీనతల గురించి కూడా తెలుసుకున్నాను. నేను ముందుకు వెళ్లాలంటే నా బలహీనతలపై పనిచేయడం నేర్చుకోవాలి అని అనుకున్నాను. కొంత కాలం అంతా బాగానే జరిగింది. కానీ, కాలంతో పాటు డబ్బు అవసరం కూడా పెరగడం మొదలైంది. ఆర్థిక ఇబ్బందులను అధిగమించడానికి అహ్మదాబాద్ వెళ్లాలని నిర్ణయించుకున్నాను. 2012లో అహ్మదాబాద్ వచ్చి, కాల్సెంటర్లో పనిచేశాను. ఎన్నో ప్రయత్నాల తర్వాత మళ్లీ టీచర్ జాబ్ సంపాదించుకున్నాను. ఎక్కువ మొత్తంలోనే నెల జీతం వచ్చేది. కల చెరిపిన ప్రమాదం అంతా బాగుంది అనుకున్న సమయంలో రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాను. ట్రీట్మెంట్ తీసుకోవడంలో జాప్యం కావడంతో కాలు తీసేయాల్సి వచ్చింది. దాంతో తీవ్ర నిరాశతో డిప్రెషన్‌కు గురయ్యాను. దీని నుంచి కోలుకోవడానికి చాలా కాలం పట్టింది. కృత్రిమ కాలు ఏర్పాటయ్యాక నాలో మళ్లీ ఆశలు చిగురించాయి. స్నేహితుల సహకారంతో.. ధైర్యం తెచ్చుకొని, ముందున్న జీవితం గురించి ఆలోచించాను. టీ అంటే నాకు చాలా ఇష్టం. దీంతో మా ఇంట్లో వాళ్లకి ఓ కేఫ్ తెరుస్తానని చెప్పాను. కానీ, నా ట్రీట్మెంట్కి అప్పటికే చాలా ఖర్చయింది. షాప్ అద్దెకు తీసుకునేంత డబ్బు నా దగ్గర లేదు. మా బంధువులు ఎవరూ సపోర్ట్ ఇచ్చేవారు లేరు. కానీ, నా స్నేహితుల సహకారంతో టీ స్టాల్ ప్రారంభించాను. టీ స్టాల్‌కు షార్ట్ మీదనే వెళ్లేదాన్ని. చాలా మంది నా డ్రెస్ గురించి కూడా తిట్టేవారు. ‘కాలు లేదు, పైగా నలుగురు తిరిగే చోట ఇలా షార్ట్స్ వేసుకొని తిరుగుతావా? బుద్ధిలేదా’ అనేవారు. ఈ వెక్కిరింపులు బాధ కలిగించేవి. కానీ, నాకు నేను బలంగా ఉన్నాను అని తెలుసు. వాస్తవికతను అంగీకరించాను. నేను ధరించిన డ్రెస్ నాకేమీ ఎబ్బెట్టుగా లేదు. పైగా అందరూ అంతగా తిట్టుకోవాల్సిన అవసరమూ లేదు. నా పని ద్వారానే సమాధానం చెబుతాను అనుకునేదాన్ని. టీ స్టాల్ వైరల్ ‘కాళ్లు లేకపోయినా రెక్కలున్నాయి’ అని నాకు నేనే చెప్పుకుంటూ ‘ఆంప్ టీ నేహా’ పేరుతో టీ స్టాల్ నడపడం మొదలుపెట్టాను. విజయం సాధిస్తానని కచ్చితంగా తెలుసు. కానీ, ప్రజల నుండి ఇంత ప్రేమను పొందుతానని తెలియదు. కేవలం పది రోజులలో నా టీ స్టాల్ వద్ద జనం గుమిగూడటం ప్రారంభించారు. ఫుడ్ బ్లాగర్లు నా గురించి రాసి, ప్రచారం చేశారు. నా టీ స్టాల్‌ను బ్రాండ్‌గా మార్చాలని పోరాడుతున్న వీడియో ఒకటి తెగ వైరల్ అయ్యింది. కొద్ది రోజుల తర్వాత కొందరు అధికారులు నా స్టాల్ దగ్గరకు వచ్చి, ఇది అక్రమమని, తొలగిస్తామన్నారు. నేను వారితో చాలా పోరాడాను. ఎవరో తీసిన ఆ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఎంతోమంది తమ ప్రేమతో నాకు మద్దతు తెలిపారు. ఇక నేను వెనక్కి తిరిగి చూసుకునే అవసరం లేకుండా పోయింది. ‘ఆంప్ టీ నేహా’ని మంచి బ్రాండ్‌గా మార్చి నాలాంటివారికి ఓ మార్గం చూపాలన్న నా కలను సాకారం చేసుకునే దిశగా అడుగులు వేస్తున్నాను’ అని చెబుతోంది నేహా. (చదవండి: ఆమె ధైర్యం ముందు నిరాశ నిలబడలేకపోయింది!) -
నా భర్త పదేళ్ల క్రితం చనిపోయాడు.. జగనన్న ఇచ్చే విద్యాదీవెనతోనే మా పాపను చదివిస్తున్నాను
-
కన్నకూతురికి అంతేసి ‘జీతం’.. ఎక్కడా ఇలా జరగదేమో!
వైరల్ న్యూస్: అదేదో సినిమాలో హీరో ఓ గొప్పింటి హీరోయిన్ను పెళ్లి చేసుకునేందుకు.. ప్రేమలు, ఆప్యాయతలు మరచిన ఇంట్లో వాళ్లకి డబ్బిచ్చి మరీ నటించమని అడుగుతాడు. అయితే.. తాను చేసే పనితో విసిగిపోయిన కూతురిని.. ఉద్యోగం మానేసి తమతో పాటు ఇంటిపట్టూనే ఉండమని తల్లిదండ్రులు కోరారట. అయితే అందుకు ఆ కూతురు కండిషన్లు పెడితే.. వాళ్లు దానికి సంతోషంగా అంగీకరించారు. నెలవారీగా ఆ కూతురికి ‘జీతం’ ఇస్తూ పోతున్నారు. విడ్డూరంగా ఉందా?.. పెళ్లిపెటాకులకు దూరంగా ఓ న్యూస్ ఏజెన్సీలో పదిహేనేళ్ల పాటు పని చేసిందామె. 2022లో జాబ్‌లో ప్రమోషనూ దక్కించుకుంది. కానీ, అప్పటి నుంచి ఆమెపై ఒత్తిడి పెరిగింది. మానసికంగా కుంగిపోతున్న కూతురిని చూసి ఆ తల్లిదండ్రులు కరిగిపోయారు. ఈ భూమ్మీద ఎవరూ ఇవ్వని బంపరాఫర్‌ను ఆమెకు ప్రకటించారు. ‘‘నువ్వెందుకు నీ ఉద్యోగం వదిలేయకూడదు.. నీ ఆర్థిక అవసరాలను మేం తీరుస్తాం’’ అంటూ ఆ తల్లిదండ్రులు చేసిన ప్రతిపాదనను ఆమె స్వీకరించింది. బదులుగా జీతం కింద తమ పెన్షన్‌లో సగం ఇచ్చేందుకు సైతం సిద్ధపడ్డారు వాళ్లు. దీంతో పూర్తిగా తల్లిదండ్రులతో గడిపేందుకు సిద్ధమైంది ఆమె. అయితే.. ఆ గడపాన్ని ఒక పనిగానే భావిస్తానని.. వాళ్లు నెల నెలా ఇచ్చే డబ్బును జీతంగా ఆమె ప్రకటించుకుంది. అందుకు తల్లిదండ్రులు సైతం అంగీకరించారు. చైనాలోని నియానాన్(40) అనే మహిళ.. ఈ ఫుల్ టైం డాటర్ జాబ్‌తో సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే దాకా తల్లిదండ్రుల కోసం కేటాయించే షెడ్యూల్‌ను సైతం ఆమె అక్కడి సోషల్ మీడియా అకౌంట్లలో వివరించింది. బదులుగా నెలకు తమకు వచ్చే 10వేల యువాన్ల నుంచి.. నాలుగు వేల యువాన్లను ‘జీతం’గా తీసుకుంటుందట. ఇది తల్లిదండ్రుల మీద ఆధారపడడం అవుతుందే తప్ప.. ఉద్యోగం ఎలా అవుతుంది?.. ఆమె చేసేది చాలా తప్పు అని విమర్శించేవాళ్లూ లేకపోలేదు. ఇదీ చదవండి: తెల్లారి లేచి చూస్తే.. ఊరేంటి ప్రపంచమంతా షాక్! -
కుమారుని డీఎన్ఏ టెస్టులో ‘జన్మరహస్యం’... తల్లి చేసిన పని ఇదే..
డిఎన్ఏ పరీక్షల తరువాత ఆ యువకునికి ఒక రహస్యం తెలియడంతో అతను హడలిపోయాడు. అతని తల్లి కూడా ఈ విషయాన్ని అతనికి తెలియకుండా దాచిపెట్టింది. డీఎన్ఏ టెస్టు అనంతరం అతనికి 35 మంది అన్నాదమ్ములు, అక్కాచెల్లెళ్లు ఉన్నారని తెలిసింది. దీంతో అతను తల్లిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, తనకు ఈ విషయం ఎందుకు ఎప్పుడూ చెప్పలేదని నిలదీశాడు. అమెరికాకు చెందిన ఆ యువకుడు తన ఆవేదనను ఒక సోషల్ మీడియా ప్లాట్ఫారంలో షేర్ చేశాడు..‘ఇది నన్ను పెంచిన తండ్రికి ఎంతో ఇబ్బందికరమైన పరిస్థితి.ఈ విషయం అతనికి ఇప్పటివరకూ తెలియదు. నాకు నా బయోలాజికల్ తండ్రిపై ఎటువంటి ఆపేక్షా లేదు. నన్ను పెంచిపోషించిన తండ్రిపైననే నాకు ప్రేమ ఉందని అన్నాడు. కాగా డీఎన్ఏ టెస్ట్ చేయించిన తరువాత అతనికి తన బయోలాజికల్ తండ్రితో పాటు 35 మంది అక్కాచెల్లెళ్లు, అన్నాదమ్ముల ఆచూకీ తెలిసింది. కాగా అతని తల్లి గర్భందాల్చేందుకు డోనర్ స్పెర్మ్ వినియోగించింది. ఈ విషయం నా సవతి సోదరసోదీమణులకు తెలిస్తే వారు ఎంతో సంతోషిస్తారనుకుంటున్నాను అని తెలిపిన ఆ యువకుడు తన ఇతర తోబుట్టువులను, డోనర్‌ను కలుసుకున్నాడు. వారంతా ఆన్లైన్ మాధ్యమంలో కలుసుకుని చాట్ చేసుకున్నారు. సోషల్ మీడియాలో ఈ పోస్టు చూసినవాంతా దీనిపై రకకాలుగా కామెంట్ చేస్తున్నారు. ఒక యూజర్ ‘ఇది ఎంతో ఆసక్తికరం. స్పెర్మ్ డొనేషన్, డీఎన్ఏ టెస్టుల విషయంలో ఎంతో ఆలోచించాల్సి వస్తోందని’ పేర్కొన్నాడు. మరొక యూజర్ ‘నా ఉద్దేశంలో ఏ విషయాన్నయినా రహస్యంగా ఉంచడం ఈ రోజుల్లో చాలా కష్టంగా మారింది. ఈ కారణంగానే డొనేషన్ చేసేవారి సంఖ్య తగ్గిపోతోంది’ అని అన్నాడు. మరో యూజర్ ‘ఇది ఎంతో విచిత్రంగా ఉంది. ఏకంగా 35 మంది తోబుట్టువులంటే నమ్మేలా లేదన్నాడు. -
‘ప్లీజ్ అంకుల్.. మా నాన్నని అరెస్ట్ చేయండి’.. ఆ చిన్నారుల ఆవేదన విని..
భోపాల్: తమ తండ్రిని అరెస్ట్ చేయాలంటూ ఇద్దరు బాలికలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ షాకింగ్ ఘటన మధ్యప్రదేశ్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గ్వాలియర్ జిల్లాలోని భితర్వాల్ పోలీస్ స్టేషన్లో పోలీసులు ఎప్పటిలానే ఎవరి పనిలో వాళ్లు బిజీగా ఉన్నారు. అదే సమయంలో ఇద్దరు బాలికలు భయం భయంగా పోలీస్‌స్టేషన్‌లోకి అడుగుపెట్టారు. లోపల పని చేస్తున్న కానిస్టేబుల్ దగ్గరకు వెళ్లి ఫిర్యాదు ఇస్తాం మా నాన్నను అరెస్ట్ చేయండి అని అనగానే ఒక్కసారిగా అక్కడి వారంతా షాక్‌కు గురయ్యారు. వెంటనే ఆ కానిస్టేబుల్ స్టేషన్ ఇన్చార్జి ప్రదీప్ శర్మ దగ్గరకు తీసుకెళ్లాడు. ముందుగా ప్రదీప్ ఆ బాలికలకు భయపడకండని ధైర్యం చెప్పి... వారి సమస్య ఏంటో వివరించమన్నాడు. దీంతో వాళ్లిద్దరూ ఏడుస్తూ ‘మా తల్లిదండ్రులు తరచూ గొడవపడుతుంటారు. ఈ క్రమంలో మా నాన్న అమ్మను కొడుతుంటాడు. అది మేము చూడలేకపోతున్నాం. మా నాన్నను జైల్లో పెట్టండి అంకుల్’ అంటూ ఏడుస్తూ చెప్పుకొచ్చారు. విషయం అర్థం చెసుకున్న ప్రదీప్ ఆ బాలికలిద్దరినీ వాళ్ల ఇంటికి తీసుకువెళ్లి విడిచిపెట్టాడు. అనంతరం వారి తల్లిదండ్రులకు ఈ విషయమై కాన్సిలింగ్ ఇచ్చాడు. ఇలా పిల్లల ముందు గొడవ పడుతుంటే వారిపై ప్రభావం పడుతుందని, ఇంకోసారి ఇది పునరావృతం కాకుండా చూసుకోవాలని బాలికల నాన్నను హెచ్చరించాడు. చదవండి: కేంద్ర మంత్రి ఉల్లిపాయల ఐడియా!.. మీరూ ట్రై చేస్తారా..? -
ఏపీ భవన్ లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసిన అధికారులు
-
హైదరాబాద్ నుంచి విద్యార్థుల స్వస్థలాలకు చేర్చేందుకు స్పెషల్ బస్సులు
-
ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు బాగున్నాయంటున్న పేరెంట్స్
-
ప్యారెట్స్..పేరెంట్స్.. 650 చిలుకలు,100 పిచ్చుకల ఆకలి తీరుస్తూ..
సాక్షి, ఏలూరు: ఉదయం, సాయంత్రం వేళల్లో రామచిలుకలు, పిచ్చుకల కిలకిలరావాలతో ఆ వీధి ఆహ్లాదకరంగా మారుతుంది. వందల సంఖ్యలో అక్కడి విద్యుత్ తీగలపై వాలి ఆహారం కోసం నిరీక్షిస్తుంటాయి. ఉదయం 7.30, సాయంత్రం 4 గంటలకు ఠంచనుగా ఈశ్వరరావు, పార్వతి దంపతులు అందించే మేతను ఆరగిస్తాయి. ఐదేళ్లుగా రామచిలుకలు, పిచ్చుకల ఆకలి తీరుస్తూ పక్షులపై తమ ప్రేమను చాటుతున్నారు కైకలూరుకు చెందిన ఈశ్వరరావు, పార్వతి దంపతులు. ప్రతి రోజూ సుమారు 650 రామచిలుకలు, 100 బంగారు రంగు పిచ్చుకలకు ఆహారాన్ని అందిస్తున్నారు. కైకలూరులోని వైఎస్సార్ నగర్లో ఉంటున్న ఈశ్వరరావు ఇంటి సమీపంలో ఉండే విద్యుత్ తీగలపై వాలి పచ్చటి తోరణాలను తలపిస్తాయి. పూటకు పది కేజీల చొప్పున బియ్యాన్ని కడిగి డాబాపై నాలుగు వరుసల్లో చిన్న చిన్న ముద్దలుగా ఉంచుతారు. పిచ్చుకలు తిన్న తరువాత ఒక్కసారిగా రామచిలుకలు గుంపుగా వచ్చి మేతను ఆరగిస్తాయి. గతంలో ముఠా పనిచేసి కొంతకాలంగా టీమాస్టర్‌గా పనిచేస్తున్న ఈశ్వరరావు ఇటీవల వైఎస్సార్ నగర్లో ఇంటిని నిర్మించుకున్నాడు. ఇతనికి ఇద్దరు కుమారులు కాగా, వీరి సాయంతో రోజూ రూ.200 ఖర్చుతో చిలుకలకు ఆహారంగా ఒక్కో రోజు బియ్యంతో పాటు కొర్రలు, జామకాయలు అందిస్తున్నారు. చిలుక జాతులలో మూడింట ఒక వంతు అంతరించే ప్రమాదంలో ఉందని ఇటీవల అంతర్జాతీయ ప్రకృతి పరిరక్షణ సమితి రెడ్‌లిస్టులో వెల్లడించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో రామచిలుకలకు ప్రతిరోజూ మేతను అందిస్తున్న ఈశ్వరరావు, పార్వతి దంపతుల సేవను పలువురు అభినందిస్తున్నారు. చిలుకలను దేవతలుగా భావిస్తాం అరుణాచలం దేవాలయానికి వెళ్లినప్పుడు రెండు చిలుకలు మా తలలపై తిరిగాయి. మా మామ మరణించే చివరి ఘడియల్లో గోడపై చిలుక బొమ్మ ముద్రించారు. ఈ ఘటనలతో చిలుకలను దేవతలుగా భావిస్తూ రోజూ మేతను అందిస్తున్నాం. వాటి సవ్వడులు మాకు ఎంతో ఆనందాన్నిస్తాయి. ప్రతిరోజూ 20 కేజీల బియ్యాన్ని సమకూర్చడం కష్టతరమవుతోంది. దాతలు బియ్యం అందించి సహకరించాలి. బియ్యం, మేత సాయం చేసే దాతలు 63048 72868, 93818 93450 ఫోన్ నంబర్లలో సంప్రదించవచ్చు. – కొల్లి ఈశ్వరరావు, పార్వతి దంపతులు చదవండి: లేటు వయసులోనూ నీట్ రాశారు.. పేదలకు వైద్య సేవలు అందించాలని 69 ఏళ్ల విశ్రాంత ప్రొఫెసర్ సంకల్పం.. -
Amritpal Singh Arrest: గర్వంగా ఉంది! తల్లిదండ్రుల రియాక్షన్..
పోలీసులను ముప్పు తిప్పులు పెడుతున్న ఖలిస్థానీ సానుభూతిపరుడు, 'వారిస్ పంజాబ్ దే' చీఫ్ అమృత్ పాల్ సింగ్‌ను ఆదివారం అరెస్టు అయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై అతడి తల్లి స్పందిస్తూ..తన కొడుకు ఓ యోధుడిలా లొంగిపోయినందుకు గర్వంగా ఉందన్నారు. అతని అరెస్టుకు వ్యతిరేకంగా న్యాయ పోరాటం చేస్తామని అతడి తల్లి బల్వీందర్ కౌర్ అన్నారు. అలాగే అతడి తండ్రి తార్సేమ్ సింగ్ ప్రజలు వేధింపులకు గురవుతున్నందున అమృత్‌పాల్‌ని లొంగిపోవాలిన తాను కోరినట్లు చెప్పారు. ఈ కేసుపై తాము పోరాడతామన్నారు. అంతేగాదు అతని గురించి మొత్తం సమాజం పోరాడాలన్నారు. అమృత్‌పాల్ డ్రగ్స్ ముప్పు నుంచి ప్రజలను రక్షించడానికి పనిచేస్తున్నాడని తాను కూడా అందు కోసమే కృషి చేస్తున్నాని చెప్పుకొచ్చారు తార్సేమ్. కాగా, వారిస్ పంజాబ్ దేపై పంజాబ్ పోలీసులు అణిచివేత ప్రారంభించిన తర్వాత నుంచి అమృతపాల్ పరారీలో ఉన్నాడు. అతని అనుచరులను ఒక్కొక్కరిగా అదుపులోకి తీసుకుంటూ..35 రోజుల వేట అనంతరం పక్కా సమాచారంతో మోగా జిల్లాలోని గురుద్వార్ వద్ద అమృత్‌పాల్‌ని అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. అతనిపై కఠినమైన జాతీయ భద్రత చట్టం కింద కేసు నమోదు చేశారు పోలీసులు. ఈ మేరకు పోలీసులు అమృత్‌పాల్‌ని భద్రత దృష్ట్యా అసంలోని దిబ్రూఘర్ జైలుకి తరలించారు. (చదవండి: హెలికాప్టర్ వద్ద సెల్ఫీ తీసుకుంటుండంగా..అంతలోనే..) -
దాస్ కా ధమ్కీ వల్ల మా పేరెంట్స్ ఫుల్ హ్యాపీ
-
ఇంజనీరింగ్ సీటు కోసం అన్వేషణ షురూ!
సాక్షి, హైదరాబాద్: ఇంటర్ పరీక్షలు వచ్చే నెల మొదటి వారంలో ముగుస్తాయి. ఆ తర్వాత విద్యార్థులు ఎంసెట్‌పై దృష్టి పెడతారు. ఎంసెట్ కూడా మే రెండో వారంతో ముగుస్తుంది. ఈ నేపథ్యంలోనే తల్లిదండ్రులు ఇంజనీరింగ్ కాలేజీల కోసం వెతుకులాట మొదలు పెడుతున్నారు. ఏ కాలేజీలో ఏ కోర్సులున్నాయి? ఎంసెట్ ర్యాంకు ఎంత వస్తే ఏ కాలేజీలో సీటు వస్తుంది? ఏయే కోర్సులకు డిమాండ్ ఉంది? నచ్చిన కోర్సు ఎక్కడ బాగుంటుంది? ఇలా అనేక అంశాలపై తల్లిదండ్రలు వాకబు చేస్తున్నారు. వీళ్ళంతా ప్రధానంగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని కాలేజీలపైనే దృష్టి పెడుతున్నారు. వీటితో పాటు డీమ్డ్ యూనివర్శిటీల వివరాలూ సేకరిస్తున్నారు. ఎంసెట్ ర్యాంకుపై ఆశల్లేని వాళ్ళు ముందే సీటు ఖాయం చేసుకోవాలనే ఆతృతలో ఉన్నారు. మేనేజ్మెంట్ కోటా సీటు గురించి వాకబు చేస్తున్నారు. ఎంసెట్‌లో మంచి ర్యాంకు వస్తుందని ఆశించే విద్యార్థుల తల్లిదండ్రులు మాత్రం గత కొన్నేళ్ళ కౌన్సిలింగ్ వివరాలను బట్టి అంచనాల్లో మునిగి తేలుతున్నారు. ఇంజనీరింగ్ కాలేజ్ ప్రిడిక్టర్ కోసం ఇక్కడ చూడండి. కాలేజీల్లోనూ హడావిడి.. సీట్ల వివరాల కోసం వస్తున్న వారికి ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నాయి. ఇప్పటికిప్పుడు ఎలాంటి సంప్రదింపులూ జరపకపోయినా, వారి వివరాలను నమోదు చేసుకుంటున్నారు. ఎంసెట్ పరీక్ష పూర్తయిన తర్వాత కాలేజీ నుంచి ఫోన్ కాల్ వస్తుందని, మేనేజ్మెంట్ సీటు విషయంలో అప్పుడు సంప్రదించవచ్చని కాలేజీ సిబ్బంది చెబుతున్నారు. కంప్యూటర్ సైన్స్ కోర్సులను కావాలనుకునే వాళ్ళు ముందే వాకబు చేస్తున్నారని, వీరంతా మేనేజ్మెంట్ కోటా సీట్లను ఆశిస్తున్నవారేనని నిజాంపేట ప్రాంతానికి చెందిన ఓ ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీ నిర్వాహకులు తెలిపారు. మహబూబ్‌నగర్ జిల్లా నుంచి వచ్చిన సంజయ్ తన కూతురుకు 20 వేల లోపు ఎంసెట్ ర్యాంకు వస్తుందనే విశ్వాసం వెలిబుచ్చాడు. అయితే డేటా సైన్స్ ఆశిస్తున్నామని, టాప్ టెన్ కాలేజీల్లో సీటు వచ్చే పరిస్థితి లేదని తెలిపాడు. అందుకే మేనేజ్మెంట్ కోటా సీటును ముందే మాట్లాడుకుంటే కొంతైనా తగ్గుతుందని ప్రయత్నిస్తున్నట్టు తెలిపాడు. ఈ పరిస్థితిని గమనించిన కాలేజీలు ఎంసెట్ పూర్తవ్వగానే సంప్రదింపుల పేరుతో బేరసారాలు చేసుకోవాలనే ఆలోచనలో ఉన్నాయి. డీమ్డ్ వర్సిటీల్లో మొదలైన ప్రవేశాల ప్రక్రియ ప్రైవేటు డీమ్డ్ వర్సిటీలు ఇప్పటికే ప్రవేశాల ప్రక్రియను మొదలు పెట్టాయి. వేర్వేరుగా సెట్స్ నిర్వహణ తేదీలను ప్రకటించాయి. మంచి ర్యాంకు వస్తే ఫీజు రాయితీ ఇస్తామని విద్యార్థులకు వల వేస్తున్నాయి. భారీ ఫీజులుండే ఈ వర్సిటీల్లో సీట్లు నింపుకునేందుకు పడరాని పాట్లు పడుతున్నాయి. ప్రత్యేకంగా పీఆర్వోలను, ఏజెంట్లను కూడా నియమించాయి. ఇంటర్ కాలేజీలకు వెళ్ళి తమ ప్రవేశ పరీక్ష, కోర్సుల వివరాలు, వాళ్ళిచ్చే సదుపాయాలతో విద్యార్థులను ఆకర్షించే ప్రయత్నంలో ఉన్నాయి. ముందస్తు ప్రవేశాలు అనుమతించబోమని ప్రభుత్వం పదేపదే చెబుతున్నా, తల్లిదండ్రుల ఆతృతను గుర్తించి, తెరచాటు బేరసారాలు చేసే విషయంలో ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలు ప్రతీ సంవత్సరం మాదిరిగానే ఈసారి కూడా పలు మార్గాలను అన్వేషిస్తున్నాయి. -
‘నా తల్లిదండ్రులు విడిపోయారు.. ఇది చెప్పడానికి 40 ఏళ్లు పట్టింది’
న్యూఢిల్లీ: తన తల్లిదండ్రులు విడిపోయారని చెప్పడానికి 40 సంవత్సరాలు పట్టిందని కేంద్ర మహిళా, శిశు అభివృద్ధిశాఖ మంత్రి స్మృతి ఇరానీ తెలిపారు. క్యుంకీ సాస్ భీ కభీ బహు థీతో ఫేమ్ అయిన ఈ నటి తన తల్లిదండ్రుల ఎడబాటు గురించి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఓపెన్ అయ్యింది. అందులో ఆమె మాట్లాడుతూ.. తన తల్లిదండ్రులు పెళ్లి చేసుకున్నప్పుడు వారి వద్ద కేవలం 150 రూపాయలు మాత్రమే ఉన్నాయన్నారు. ఇరానీ తండ్రి పంజాబీ-ఖాత్రి కాగా, నటి తల్లి బెంగాలీ-బ్రాహ్మణి. ఆర్థిక పరిస్థితి సరిగాలేని కారణంగా ఆవు షెడ్ పైన ఉన్న గదిలో నివసించేవారని చెప్పుకొచ్చారు. ‘ఆ రోజుల్లో మమ్మల్ని చిన్నచూపు చూసేవారు, అలాంటి జీవితం గడపడం ఎంత కష్టమో నాకు తెలుసు. జేబులో కేవలం 100 రూపాయలతో మా అందరినీ చూసుకునేవారు. మా నాన్న ఆర్మీ క్లబ్ బయట పుస్తకాలు అమ్మేవాడు, నేను అయనితో కూర్చునేదానిని. మా అమ్మ వేరే ఊళ్ళకి వెళ్ళే మసాలాలు అమ్మేది. మా నాన్న పెద్దగా చదువుకోలేదు, మా అమ్మ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. దీంతో అప్పుడప్పుడు వారి మధ్య విభేధాలు తలెత్తి గొడవలు జరిగేవని’ అప్పటి విషయాలను చెప్పుకొచ్చారు. ఆర్థికంగా, సామాజికంగా ఎదురయ్యే ఇబ్బందులు, అభిప్రాయ భేదాలను కొద్దిమంది మాత్రమే తట్టుకోగలరని ఆమె భావోద్వేగంగా తెలిపారు. చదవండి: మొదటి రాత్రే భర్త నిజస్వరూపం.. లిప్‌స్టిక్ పూసుకుని విచిత్ర ప్రవర్తన! -
ఛీ, తను కూతురేనా?.. ప్రియుడితో మాట్లాడొద్దన్నందుకు కన్నవాళ్లను దారుణంగా..
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో అమానుష ఘటన చోటుచేసుకుంది. కనిపెంచిన తల్లిదండ్రుల పట్ల సభ్య సమాజం తలదించుకునేలా ప్రవర్తించింది ఓ కూతురు. ప్రియుడితో మాట్లాడవద్దని చెప్పినందుకు కంటికి రెప్పలా కాపాడుకుంటున్న తల్లిదండ్రులను అతి కిరాతకంగా హత్య చేసింది. ఇంటి రక్తపు మడుగులో మృతదేహాలు పడి ఉండటాన్ని గమనించిన ఇరుగు పొరుగువారు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో మార్చి 15న ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను బుధవారం శిఖాపూర్ పోలీస్ స్టేషన్ అధికారి ప్రేమ్ చంద్ శర్మ వెల్లడించారు. యూపీలోని బులందషహర్ ప్రాంతంలో మహ్మద్ షబ్బీర్(47). రెహానా(44) కుటంబం నివాసం ఉంటోంది. వీరికి నలుగురు కూతుళ్లు. పెద్ద అమ్మాయి (15 ఏళ్లు)8 తరగతి చదువుతోంది. ఇటీవల బాలికకు ఓ యువకుడితో(22) పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. ప్రియుడితో తరుచూ ఫోన్లో మాట్లాడటం, బయట తిరగడం గమనించిన తల్లిదండ్రులు కూతురిని మందలించారు. అయినా ఆమె ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో కొన్ని రోజులుగా పాఠశాలకు కూడా పంపించడం లేదు. దీంతో తల్లిదండ్రులపై కోపం పెంచుకున్న కూతురు వారిని అడ్డుతొలగించుకునేందుకు కుట్ర పన్నింది. మార్చి 14న మెడికల్ షాప్‌లో పనిచేసే తన ప్రియుడి ద్వారా నిద్రమాత్రలు తీసుకొచ్చింది. వీటిని అన్నంలో కలిపి తల్లిదండ్రులకు ఇచ్చింది. తిన్న తర్వాత దంపతులు ఇంటి ముందు మంచంపై నిద్రలోకి జారుకున్నారు. దీంతో కూతురు గొడ్డలితో తల్లిదండ్రుల తలలు నరికి చంపింది. మృతదేహాలను బెట్‌షీట్‌తో కప్పేసింది. ఎవరికీ అనుమానం రాకుండా ఇంటి బయట నుంచి తాళం వేసి, తాళాలను తన తండ్రి దిండు కింద దాచిపెట్టింది. అనంతరం పక్కింటి వాళ్ల డాబా ఎక్కి ఇంట్లోకి వెళ్లి పడుకుంది. పక్కింటి వారి సమాచారంతో అనుమానస్పద మృతి కేసుగా నమోదు చేసుకున్న పోలీసులు కూతురిని విచారించగా అసలు విషయం బయటపడింది. ఆమె సెల్ఫోన్లో ఓ వ్యక్తిని నిద్రమాత్రలు తీసుకురమ్మని చెప్పినట్లు ఉండటంతో హత్య చేసింది 15 ఏళ్ల మైనరేనని పోలీసులు నిర్దారించారు. తన ప్రియుడితో మాట్లాడకుండా నిబంధనలుపెట్టినందుకే చంపినట్లు పోలీసుల ఎదుట అంగీకరించింది. హత్యకు ఉపయోగించిన గొడ్డలిని స్వాధీనం చేసుకున్నారు. మైనర్ నిందితురాలిని అరెస్ట్ చసి జువైనల్ హోంకు తరలించారు., ఆమెకు సహకరించిన ప్రియుడును కూడా అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. -
క్లాస్ రూం చుట్టూ పరిగెత్తించి మరీ టీచర్‌పై దాడి..పేరెంట్స్ అరెస్టు
టీచర్ని చితకబాదిన ఘటన తీవ్ర కలకలం రేపింది. ఏకంగా క్లాస్ రూమ్ చుట్టూ పరిగెత్తించి మరీ చితకబాదారు విద్యార్థి తల్లిదండ్రులు. ఈ దారుణ ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..పోలీసులు తెలిపిన కథనం ప్రకారం..తమిళనాడుతో స్కూల్లో టీచర్‌పై రెండో తరగతి విద్యార్థి పేరెంట్స్ దారుణంగా దాడి చేశారు. విద్యార్థి తల్లిందండ్రలు నేరుగా ఉపాధ్యాయుడి క్లాస్ రూం వద్దకు వచ్చి మరీ గొడవకు దిగారు. మా పిల్లలను కొట్టే హక్కు మీకు ఎవరిచ్చారు?..అంటూ వాగ్వాదానికి దిగారు. అనంతరం ఆ టీచర్ని క్లాస్‌లోనే విద్యార్థులందరి ముందు పరిగెత్తించి మరీ దారుణంగా కొట్టారు. ఆఖరికి సమీపంలోని ఇటుక రాయిని కూడా తీసుకుని ఆయన మీదకు విసిరే యత్నం చేశారు. అందుకు సంబంధించిన మూడు నిమిషాల వీడియో నెట్టింట వైరల్ అవ్వడంతో ఈ ఘటన వెలుగు చూసింది. ఈ మేరకు పోలీసులు బాధిత ఉపాధ్యాయుడుని ఆర్ భరత్‌గా గుర్తించారు. ఈ ఘటనకు పాల్పడిన ఆ విద్యార్థి తల్లిదండ్రులతో పాటు ఆచిన్నారి తాతయ్యను కూడా అదుపులోకి తీసుకుని అరెస్టు చేసినట్లు తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగిని తన విధులు నిర్వర్తించకుండా అడ్డుకోవడమేగాక దాడికి పాల్పడినందుకు గాను వారిపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ విషయమై దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు. విచారణలో..సదరు విద్యార్థి క్లాస్‌లో సరిగా వినకపోవడం, ఇతర పిల్లలను కొట్టడం వంటివి చేయడంతో టీచర్ ఆమెను సీటు మారమని చెప్పారు. ఐతే సీటు మారుతున్న క్రమంలో ఆ చిన్నారి పడిపోయింది. కానీ ఆ చిన్నారి ఇంటికి వెళ్లి తనను టీచర్ కొట్టాడంటూ.. వాళ్ల తాతయ్యకు ఫిర్యాదు చేసింది. దీంతో వారు మా పిల్లలనే కొడతావ అంటూ టీచర్‌పైకి దాడికి దిగారని పోలీసులు తెలిపారు. (చదవండి: ట్రీట్మెంట్కి అయ్యే ఖర్చుకి కలత చెంది యువకుడు బలవన్మరణం) -
ఏడాదిన్నరగా కస్టడీలోనే.. మా పాపను భారత్‌కు రప్పించండి: కన్నీటిపర్యంతమైన తల్లిదండ్రులు
భారతీయులు బతుకు దెరువు కోసం దేశం విడిచి ఇతర దేశాలకు వెళ్తుంటారు. ఈ క్రమంలో కొందరు తెలియకుండానే ఆ దేశాల్లో కొన్ని సమస్యల్లో చిక్కుకుంటున్నారు. తాజాగా జర్మనీకి వెళ్లిన ఓ దంపతులకు ఊహించని కష్టం ఎదురైంది. అల్లారుముద్దుగా పెంచుకోవాల్సిన తమ చిన్నారికి దూరంగా గడపాల్సి వస్తోంది. చివరికి ఈ విషయంలో తమకు న్యాయం జరిగేలా చూడాలంటూ ప్రధాని నరేంద్ర మోదీని వేడుకుంటున్నారు. అసలేం ఏం జరిగిందంటే... ఇదేం అన్యాయం.. మా పాపను ఇప్పించండి గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కు చెందిన ఓ జంట ఉపాధి కోసమని జర్మనీకి వెళ్లారు. అక్కడ ఆ దంపతులకి ఓ అడబిడ్డ(అరిహా షా)జన్మించింది. ఓ రోజు అనుకోకుండా ఆ పాప ఆడుకుంటుంటే ప్రమాదవశాత్తు ప్రైవేట్ పార్ట్ దెబ్బతింది. వెంటనే పాప చికిత్స కోసం ఓ వైద్యుడి వద్దకు తల్లిదండ్రులు తీసుకెళ్లారు. అతను చెకప్ చేసి పాప బాగుందని చెప్పి వాళ్లని వెనక్కి పంపారు. కొన్ని రోజుల తదుపరి తనిఖీ కోసం వెళ్ళగా.. ఈ సారి కూడా క్షేమంగా ఉందని వైద్యులు చెప్పారు కానీ జర్మనీలోని చైల్డ్ సర్వీసెస్ అధికారులని పిలిచి, వారి కస్టడీలో ఆ పాపని ఉంచారు. దీంతో షాకైన తల్లిదండ్రులు అధికారులను గట్టిగా నిలదీశారు. పాపపై లైంగిక వేధింపులు జరిగాయన్న అనుమానాలతో అధికారులు కస్టడీలోకి తీసుకున్నట్లు తల్లిదండ్రులకు చెప్పారు. అన్ని రిపోర్ట్లు ఇచ్చినా.. మళ్లీ మొదటికి అయితే ఆ దంపతులు వాళ్ల పాపను వెనక్కి తెచ్చకోవడానికి చాలా ప్రయత్నాలు చేశారు. ఈ క్రమంలో డిసెంబర్ 2021లో పాపపై లైంగిక వేధింపుల అనుమానాలాను ఆ ఆసుపత్రిలోని వైద్యులు తోసిపుచ్చిన రిపోర్ట్‌ను తీసుకున్నారు. అంతే కాకుండా ఈ విషయంలో మరింత స్పష్టత కోసం తల్లిదండ్రుల డీఎన్ఏ పరీక్ష, పోలీసు విచారణ, వైద్య నివేదికలు ఇలా వీటి తర్వాత, లైంగిక వేధింపుల కేసును ఫిబ్రవరి 2022లో మూసేశారు. ఈ ఆధారాలతో ఆ దంపతులు జర్మనీ చైల్డ్ సర్వీసెస్ అధికారులను కలిశారు. అయితే వారు ఆ పాపను ఇవ్వకపోగా తిరిగి దంపతులపై కేసు పెట్టారు. దానిపై పాప తల్లిదండ్రులు కోర్టుకు వెళ్లగా... అక్కడ వాళ్లు పిల్లలను పెంచే సమర్థతను నిరూపించుకోవాలని న్యాయస్థానం ఆదేశించింది. దురదృష్టవశాత్తు ఆ పరీక్షల్లో సైకాలజిస్టు పాప తల్లిదండ్రులకు వ్యతిరేకంగా నివేదిక ఇచ్చాడు. దీంతో వారికున్న దారులన్నీ మూసుకుపోయాయి. ప్రధాని మాకు న్యాయం చేయాలి.. ఈ విషయంపై పాప తల్లి మాట్లాడుతూ.. జర్మనీలో ఉన్న తమ పాపను కలిసేందుకు ప్రతి నెలా ఒక గంట పాటు అనుమతిస్తున్నారని పేర్కొంది. చివరికి పాపను భారత్‌కు పంపేందుకు అక్కడి అధికారులు అంగీకరించట్లేదని అవేదన వ్యక్తం చేసింది. చేసేదేమి లేక అరిహా షా తల్లిదండ్రులు ఇటీవలే ముంబైలో దిగారు. ఈ విషయంలో తమకు న్యాయం చేయాలని, జర్మనీ ప్రభుత్వం నుంచి తమ కుమార్తెను తిరిగి ఇప్పించాలని ఆ దంపతులు ప్రధాని నరేంద్ర మోదీని వేడుకుంటున్నారు. మూడేళ్ల బాలిక గత ఏడాదిన్నర కాలంగా జర్మనీ అధికారుల కస్టడీలో ఉంది. -
తల్లిదండ్రుల్ని పట్టించుకోని స్టార్ హీరో.. వారిని నిజంగానే అవమానించాడా?
దళపతి విజయ్ కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్లో పరిచయం అక్కర్లేని పేరు. ఇటీవలే వారసుడు మూవీతో ప్రేక్షకులను అలరించాడు. తమిళంలో స్టార్ హీరోగా పేరు సంపాదించారు. ఆయన నటించిన వారీసు తమిళనాట భారీ విజయం సాధించింది. దాదాపు రూ.200 కోట్లకు పైగానే వసూళ్లు రాబట్టింది. అయితే ఈ మూవీ ఆడియో లాంఛ్ కార్యక్రమంలో ఆయన చేసిన పని అభిమానులను ఆశ్చర్యానికి గురిచేసింది. ఈవెంట్లో ఆయన తల్లిదండ్రులను పట్టించుకోలేదని విమర్శలు వస్తున్నాయి. వారికి కనీస మర్యాద కూడా ఇవ్వలేదన్న వార్తలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి. కాగా.. జనవరి 2న వారీసు ఆడియో లాంఛ్ చెన్నైలో జరిగిన సంగతి తెలిసిందే. చెన్నైలో జరిగిన ఈ వేడుకలో చిత్ర బృందంతో పాటు విజయ్ తండ్రి చంద్రశేఖర్, తల్లి శోభన కూడా పాల్గొన్నారు. విజయ్ అక్కడికి రాగానే అందరినీ పలకరిస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలోనే తల్లిదండ్రుల దగ్గరకు వచ్చి పలకరించారు. అయితే సొంత తల్లిదండ్రుల్ని ఏదో మొక్కుబడిగా పలకరించారన్న వార్తలొచ్చాయి. అయితే ఈ వార్తలపై విజయ్ తల్లి శోభన స్పందించారు. తాజాగా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో దీనిపై ఆమె క్లారిటీ ఇచ్చారు. ఆ వేడుక ‘వారీసు’ సినిమా కోసం జరిగిందని.. ఓ పెద్ద ఈవెంట్లో నా కుమారుడి నుంచి అంతకన్నా కోరుకునేది ఏముందని అన్నారు. కాగా.. గతంలో విజయ్ తండ్రి చంద్రశేఖర్ విజయ్ పేరిట రాజకీయ పార్టీని స్థాపించారు. అయితే, ఆ పార్టీకి తనకు ఎటువంటి సంబంధం లేదని విజయ్ ఓ ప్రకటన విడుదల చేశారు. అప్పటినుంచి విజయ్‌కి కుటుంబంతో విభేదాలు మొదలయ్యాయని ప్రచారం నడుస్తోంది. -
Hyderabad: ప్రేమ వ్యవహారాలు, దావత్ల మోజులో చిన్నారులు
సాక్షి, హైదరాబాద్: ఆట పాటలతో హాయిగా సాగాల్సిన బాల్యం పక్కదారి పడుతోంది. చదువుపై శ్రద్ధ పెట్టాల్సిన చిన్నారులు దావత్ల మోజులో పడి జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. వయస్సుతో సంబంధం లేకుండా మద్యానికి బానిసలవుతున్నారు. ఫోన్లు, సినిమాల మాయలో పడి పసితనంలోనే ప్రేమ వ్యవహారాలు సాగిస్తున్నారు. చిన్న వయస్సులో స్నేహితులతో కలిసి విలాసవంతమైన విందులు చేసుకోవడం జీవితంలో భాగంగా నేటి చిన్నారులు, యువత భావిస్తున్నారు. తమ పనుల్లో బిజీగా మారిన తల్లిదండ్రులు పిల్లల గురించి పట్టించుకోకపోవడంతో వారు పెడదారులు పడుతున్నారు. తెలిసి తెలియని స్కూల్ వయస్సులోనే విద్యార్థులు ప్రేమ వలలో చిక్కుకుంటున్నారు. ఆన్లైన్ తరగతుల పుణ్యమా అని విద్యార్థులకు ఫోన్లు కొనివ్వడంతో వారు చాటింగ్‌లు చేస్తూ బడి వయస్సులోనే ప్రేమ వలలో చిక్కి ఇంట్లో నుంచి వెళ్లిపోయి పెళ్లి దాకా వెళ్తున్నారు. 15 ఏళ్లలోపు వారు సైతం మద్యం, సిగరెట్లు తాగుతున్నారు. బర్త్‌డే పార్టీల పేరిట రోడ్ల మీద హంగామా చేస్తున్నారు. కొందరు మద్యం తాగి సోషల్‌మీడియాలో ఫొటోలు సైతం పెడుతున్నారు. భయం లేకపోవడమేనా? గతంలో తల్లిదండ్రులు, గురువులు అంటే పిల్లలు భయపడేవారు. ప్రస్తుతం తల్లిదండ్రుల అతిగారాబంతో చిన్నారులకు వారంటే భయం ఉండడంలేదు. ఉపాధ్యాయులు విద్యార్థులను ఏమన్నా అంటే తల్లిదండ్రులు గొడవలు పెట్టుకునే పరిస్థితి ఉంది. దీంతో వారు సైతం మిన్నకుండిపోతున్నారు. ఇటీవల ఓ ప్రైవేటు పాఠశాలలో చిన్నారి చేసిన తప్పిదానికి ఉపాధ్యాయుడు మందలిస్తే తల్లిదండ్రులు, బంధువులు సదరు ఉపాధ్యాయుడిపై గొడవకు దిగారు. తల్లిదండ్రుల్లో మార్పు వస్తేనే.. తల్లిదండ్రులు తమ పిల్లలకు ఫోన్లు, బైకులు, డబ్బులిచ్చి పాఠశాలకు కళాశాలకు పంపితే సరిపోతుందని భావించడంతోనే విద్యార్థులు పక్కదారి పడుతున్నారు. తాము పడుతున్న కష్టాలను తల్లిదండ్రులు తమ పిల్లలకు చూపించాల్సి ఉంది. పిల్లలు ఎటు పోతున్నారో ఓ కంట కనిపెట్టాలి. పిల్లల బాగోగులను ఉపాధ్యాయుల ద్వారా తెలుసుకోవాలి. విద్యార్థి ప్రవర్తనలో మార్పు కనిపిస్తే ఉపాధ్యాయుల సలహాలు తీసుకోవాలి. ఆలోచన విధానం మారాలి పిల్లలకు తల్లిదండ్రుల నుంచే క్రమశిక్షణ అలవాటు అవుతుంది. పిల్లలకు ఏమిస్తున్నాం. దాని అవసరం ఎంత ఉందని తల్లిందడ్రులు తెలుసుకోవాలి. చిన్న వయస్సులో అవసరానికి మించి బైకులు, ఖరీదైన ఫోన్లు ఇచ్చి కళాశాలకు, పాఠశాలకు పంపరాదు. సంస్కారం తల్లిదండ్రులు నుంచి వస్తుంది. వినయం విద్య ద్వారా వస్తుంది. తాము కూడా పాఠశాలల్లో అవగాహన కల్పిస్తున్నాం. – రమేశ్‌కుమార్, ఎస్ఐ, దౌల్తాబాద్ -
సమగ్ర విచారణ జరపాలని ప్రీతి తండ్రి డిమాండ్
-
చర్చలు సఫలం.. గాంధీ ఆస్పత్రికి ప్రీతి మృతదేహం తరలింపు
వైద్య విద్యార్థిని ప్రీతి ఐదు రోజులుగా మృత్యువుతో పోరాడి ఆదివారం కన్నుమూసింది. సీనియర్ వేధింపులు తట్టుకోలేక వరంగల్ ఎంజీఎంలో ఆత్మహత్యకు యత్నించిన పీజీ వైద్య విద్యార్థినికి హైదరాబాద్ నిమ్స్‌లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచింది. ప్రీతి మృతికి గల కారణాలను వెల్లడించాలని తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. దీంతో నిమ్స్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అయితే ప్రీతి మరణానికి గల కారణాలు వివరించాలని.. మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించేందుకు ప్రీతి తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. దీంతో మంత్రులు వారితో చర్చలు జరిపారు. చివరికి బాధిత కుటుంబానికి రూ.30 లక్షల ఎక్స్‌గ్రేషియాతో పాటు కుటుంబంలో ఒకరికి ప్రభుత్వం ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు. దీంతో అయితే ఎట్టకేలకు మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించేందుకు అంగీకరించారు. గాంధీ ఆస్పత్రిలో ప్రీతి డెడ్ బాడీకి పోస్టుమార్టం పూర్తి చేయనున్నారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారణ ప్రీతి తల్లిదండ్రులతో రాష్ట్ర ప్రభుత్వం చర్చలు జరిపింది. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని వారికి హామీ ఇచ్చింది. ఫాస్ట్ ట్రాక్ కోర్టులో ఈ కేసును విచారణ చేపడతామని తెలిపింది. -
Valentines Day: ఎవరిని ప్రేమించాలి? ఎందుకు ప్రేమించాలి? మరి వాళ్లు ఏమైపోతారు?
ఎవర్ని ప్రేమించాలి? ప్రతి ఏటా ఫిబ్రవరి 14 వస్తుంది.. ప్రేమికులంతా చాలా గ్రాండ్‌గా వేలంటైన్స్ డే సెలబ్రేట్ చేసుకుంటారు. ఈ డేని సమర్థించేవారు ఎంతమంది ఉన్నారో.. వ్యతిరేకించేవారూ అంతేమంది ఉన్నారు. అసలు ప్రేమకు సెలబ్రేషన్ అవసరమా? ఈ డేని సెలబ్రేట్ చేసుకుంటేనే ప్రేమ ఉన్నట్లా? .. ప్రేమ అనేది ప్రేమికులకు మాత్రమేనా? ప్రేమ కోసం పరితపించే జీవులు ఇంకెవరూ లేరా? సొసైటీలో ఎన్ని కుటుంబాలు సంతోషంగా ఉంటున్నాయి? .. ఎంతమంది తల్లిదండ్రులు తమ బిడ్డలతో ఆనందంగా జీవితాన్ని గడుపుతున్నారు? అంటే ఖచ్చితంగా చెప్పలేం. తల్లిదండ్రులు పిల్లలతో ఆనందంగా గడిపేది మహా అయితే వాళ్లు డిగ్రీలు పుచ్చుకునే వరకే. ఉద్యోగం రాగానే.. పెళ్లి ఆ తరువాత పిల్లలు.. అలా వాళ్లకొక జీవితం ఏర్పడ్డాక తల్లిదండ్రులను పట్టించుకునే పిల్లలు ఎంతమంది ఉన్నారు. అమాయకపు తల్లిదండ్రులు ఉద్యోగ రీత్యా విదేశాల్లో స్థిరపడితే ఇక ఆ తల్లిదండ్రుల కష్టాలకు అంతే లేదు. డబ్బు ఉన్నా.. పిల్లల ఆప్యాయత.. అనురాగాల కోసం పరితపించి పోతూ ఎంతో మంది తల్లిదండ్రులు వృద్ధాశ్రమాల్లో మగ్గిపోతున్నారు.. రేపు వస్తాడు.. ఎల్లుండి వస్తాడు .. అని ఎదురుచూస్తూ వాళ్లు ఎప్పుడూ తిరిగి రారన్న అబద్ధం తెలియని ఎంతోమంది అమాయకపు తల్లిదండ్రులు అక్కడే తనువు చాలించేస్తున్నారు. క్షణకాలం వారి సుఖం ఆలోచిస్తారు కానీ.. అలా చాలామంది తల్లిదండ్రులకు పిల్లల నుంచి ప్రేమ దొరకట్లేదు.. ప్రేమించో.. పెద్దలు కుదిర్చినదో పెళ్లి చేసుకుంటారు. ఆపై మనస్పర్థలు.. కలిసి బతకడం ఇష్టం లేదంటూ విడాకులు తీసుకునే జంటలు ఎన్నో చూస్తున్నాం. ఒకరినొకరు అర్థం చేసుకోరు.. ఒకరిపై ఒకరికి నమ్మకం ఉండదు.. కానీ.. ఈలోపే పిల్లల్ని కంటారు. క్షణకాలం వారి సుఖం ఆలోచిస్తారు కానీ.. విడిపోతే తమ పిల్లల భవిష్యత్ ఏంటో ఆ క్షణం ఆలోచించరు. తల్లిదండ్రులు చేసిన తప్పునకు బలైపోయి అనాథలైన ఎంతోమంది పిల్లలు ఈ సమాజంలో ఉన్నారు. ఓవైపు తల్లిదండ్రుల నిరాదరణ.. మరోవైపు సమాజం చిన్నచూపు అక్కడా వారికి కరువైంది ప్రేమే కదా.. ప్రేమ.. కులం.. మతం .. వయసు… అన్ని అడ్డుగోడల్ని కూల్చేస్తుంది. ప్రేమించడం తప్పుకాదు.. కానీ అవగాహన లేని ప్రేమ జీవితాన్ని నాశనం చేస్తుంది. దీన్ని కూడా ప్రేమే అంటారా? నమ్మిన వాడు మోసం చేశాడని.. నమ్మిన ఆడది మంచిది కాదని ప్రేమలో విఫలమయ్యే దాకా చాలామంది ప్రేమికులకు అర్థం కాదు. దాన్ని తొందరపాటు అనాలో వారి గ్రహపాటు అనాలో తెలియదు. అదే తొందరపాటుకు ప్రతిఫలంగా పుట్టే పిల్లలు ఎంతమందో చెత్తబుట్టల్లో తేలుతున్నారు. పాపం వాళ్లేం చేశారు… కుక్కలు ఈడ్చుకుపోతుంటే వారి రోదన ఎవరికి వినిపిస్తుంది.. ఆ పాపం ఎవరిది.. దీన్ని కూడా ప్రేమే అంటారా? భర్త చనిపోతే భార్య, భార్య చనిపోతే భర్త మళ్లీ పెళ్లి చేసుకుంటారు. మొదటి భార్య, లేదా భర్తకు పుట్టిన పిల్లల్ని మాత్రం మర్చిపోతారు. వాళ్లేం పాపం చేశారండి. ఆ పిల్లల పట్ల ఎందుకు సమన్యాయం చూపించరు. ఆ పిల్లల్ని వదిలేసి తమ జీవితం చూసుకుంటే దాన్ని స్వార్ధమనేగా అంటారు. తమకు పుట్టిన బిడ్డలకి ప్రేమను పంచడంలో ఈ తేడాలేంటో.. ఇక తల్లిదండ్రుల్ని పంచుకునే పిల్లలు గురించి చెప్పాలి. కాటికి కాలు చాచే ఆ వయసులో వృద్ధాప్యంలో ఒకేచోట ఉండాల్సిన పేరెంట్స్‌ని తలొకరు పంచుకుంటూ ఉంటారు. తల్లిదండ్రుల్ని చూడటానికి అన్నదమ్ముల మధ్య పంతాలు.. మనస్పర్థలు.. చివరికి పంపకాలు. పిల్లల మనసు నొప్పించలేక.. ఒకరిని విడిచి ఒకరు ఉండలేక ఆ పెద్దవాళ్లు పడే బాధ మాటల్లో చెప్పలేం. కాటికి కాలు చాచే ఆ వయసులో పాపం.. అప్పుడూ వారికి ప్రేమ కరువవుతోంది. పిల్లలే జీవితంగా గడిపిన ఎంతోమంది పేరెంట్స్ ఇప్పుడు అదే పిల్లల దగ్గర తమ జీవితం ఎంత త్వరగా ముగుస్తుందా అని భారంగా కాలం వెళ్లదీస్తున్నారు.. పేరెంట్స్ ఇచ్చే ఆస్తులు కావాలి.. కానీ తల్లిదండ్రులు వద్దనుకుంటే ఆ పేరెంట్స్ ని ప్రేమించేది ఎవరు? ఇక అన్నదమ్ములు.. అక్క చెల్లెళ్లు.. తోడల్లుళ్లు.. తోడికోడళ్లు.. ఇలా చెప్పుకుంటూ పోతే.. ఎంతమంది మధ్య ప్రేమ ఉంది.. ఎక్కడ ప్రేమ దొరుకుతుంది అంటే ఒక ఛాన్స్ ఉందిలెండి. డబ్బుంటేనే.. అదేంటంటే డబ్బుండాలి. డబ్బుంటే ప్రేమాభిమానాలు పొంగుకొస్తాయి. అదే డబ్బులేని వాడి గురించి ఆలోచించడానికి కూడా మనసు ఒప్పుకోదు. డబ్బుతో కొనలేనివాటిలో మొదటిది.. చివరిది ఒకటే.. అదే 'ప్రేమ'. మన సమాజంలో నిజమైన ప్రేమ కోసం పరితపించిపోతున్న వాళ్లు ఇలా చాలామందే ఉన్నారు. ముందు మనల్ని మనం ప్రేమించుకోవాలి.. మన తల్లిదండ్రుల్ని ..మన కుటుంబాన్ని.. మన తోటివారిని .. ప్రేమించాలి.. మన పుట్టిన ఊరిని.. మన మట్టిని.. మన దేశాన్ని.. ప్రేమించగలగాలి. ప్రేమించడానికి ఇంతమంది ఉండగా.. లవర్స్ డే రోజు ప్రేమ అవసరమా.. నాకైతే అవసరం లేదనిపిస్తోంది. ఇది పూర్తిగా నా అభిప్రాయం.. ఎవరినీ కించపరచడానికి మాత్రం కాదు. -లక్ష్మీ పెండ్యాల, జర్నలిస్టు చదవండి: పిల్లలు సెల్‌ఫోన్, టీవీకి అడిక్ట్ అయ్యారా? ఇలా చేయండి.. కడుపులో నులిపురుగులు ఉంటే.. -
మొబైల్ చూడొద్దని మందలించారని...
సాక్షి బెంగళూరు: మొబైల్ చూడొద్దని తల్లిదండ్రులు హెచ్చరించినందుకు బాలిక మనస్తాపానికి గురై పదో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. వివరాలు..బెంగళూరు ఈశాన్య విభాగం బాగలూరు పోలీసు స్టేషన్ పరిధిలోని కణ్ణూరులోని అపార్ట్మెంట్లో రవికుమార్ ఓజా అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. ఈయన కుమార్తె నవ్య ఓజా (13) ఏడో తరగతి చదువుతోంది. నవ్య ఎక్కువగా మొబైల్ చూస్తుండడంతో చదువుపై దృష్టి సారించాలని తల్లిదండ్రులు గురువారం రాత్రి పది గంటల సమయంలో మందలించారు. పది నిమిషాల అనంతరం బాలిక అపార్టుమెంట్‌పైకి వెళ్లి కిందకి దూకి ఆత్మహత్య చేసుకుంది. బాగలూరు పోలీసులు కేసు నమోదు చేశారు. (చదవండి: వాహనదారులకు బంపర్ ఆఫర్.. చలాన్లపై 50 శాతం డిస్కౌంట్..!) -
కన్నపేగు కన్నీరు!
కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం పెద్దమల్లారెడ్డి గ్రామానికి చెందిన 75 ఏళ్ల వృద్ధురాలు ఆమె. ఆమె కొడుకు, ఇద్దరు కూతుళ్లకు పెళ్లిళ్లు అయ్యాయి. కొడుకు, కోడలు ఆమెను ఊళ్లోనే వదిలేసి కామారెడ్డికి వలస వెళ్లారు. తర్వాత కొడుకు బతుకుదెరువు కోసం గల్ఫ్ వెళ్లాడు. ఆమె వృద్ధాప్యం, అనారోగ్య సమస్యలతో వంట కూడా చేసుకోలేక ఆకలితో అలమటించింది. కోడలికి సమాచారం ఇచ్చినా రాకపోవడంతో గ్రామస్తుల సాయంతో పోలీసులను ఆశ్రయించింది. వారు కోడలిని పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చినా ఫలితం లేదు. వృద్ధురాలు ఇరుగుపొరుగు వారు నాలుగు మెతుకులు పెడితే తిని కాలం వెళ్లదీసేది. ఆవేదనతో ఓ రోజు ఉరివేసుకుంది. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం బండరామేశ్వర్పల్లికి చెందిన ఓ వృద్ధుడు తన కొడుకు పట్టించుకోవడం లేదంటూ ఇటీవల పోలీసులను ఆశ్రయించాడు. ఆయన కష్టపడి ఎనిమిది ఎకరాల భూమి సంపాదించి పెట్టాడు. కుమార్తెలకు పెళ్లిళ్లు అయిపోయాయి. భార్య చనిపోయింది. తాను కష్టపడి సంపాదించిన భూమిని సాగు చేసుకుంటున్న కొడుకు తనకు తిండి కూడా పెట్టక పోవడంతో తల్లడిల్లిపోయాడు. పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వారు కొడుకును పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చారు. అయినా మార్పు రాలేదని ఆ వృద్ధుడు ఆవేదన చెందుతున్నాడు. సాక్షి, కామారెడ్డి: వారు వయసు మీద పడిన వృద్ధులు.. పిల్లాజెల్లా అంతా ఉన్నా పట్టించుకునేవారు లేక బాధపడుతున్నవారు.. నడిచే శక్తి, పలికే ఓపిక లేక ఇబ్బందిపడుతున్నవారు.. పిడికెడు మెతుకులు పెట్టి, కాసింత చోటు ఇస్తే.. బిడ్డల నీడలో కన్నుమూస్తామని ఆరాటపడుతున్నారు. ఇలాంటి వృద్ధ దంపతుల్లో ఇద్దరు ఉన్నంత కాలం ఎలాగోలా బతికేస్తున్నా.. ఎవరైనా ఒకరు దూరమైన తర్వాత ఒంటరి జీవితం నరకప్రాయంగా మారుతోంది. తోడు కోల్పోయి, బిడ్డల ఆదరణ కరువై మానసికంగా కుంగిపోతున్నారు. వయసు పెరిగే కొద్దీ వచ్చే ఆరోగ్య సమస్యలతో సతమతం అవుతూ.. సరైన వైద్యం అందక కన్నుమూస్తున్నారు. మరికొందరు ఈ జీవితం మాకొద్దంటూ ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇటీవలికాలంలో చాలా చోట్ల వృద్ధుల బలవన్మరణాలు వెలుగు చూస్తున్నాయి. ఉమ్మడి కుటుంబాలు విచ్ఛిన్నమై.. ఒకప్పుడు గ్రామీణ ప్రాంతాలతోపాటు పట్టణాల్లోనూ చాలా వరకు ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. కొన్ని కుటుంబాల్లో తండ్రులే కాదు తాతలు కూడా కలిసి జీవించారు. ఆ పెద్దల మాట మేరకు ఎవరి పనివారు చేసుకుంటూ ఉండేవారు. కొన్నేళ్లుగా ఉమ్మడి కుటుంబాలు విచ్ఛిన్నమైపోయాయి. చాలా కుటుంబాల్లో కన్నవారిని కూడా భారంగా భావించే పరిస్థితి నెలకొంది. ఉద్యోగం, వ్యాపారం పేరుతో పట్టణాలకు వెళ్తున్నవారు కన్నవారిని ఇంటి దగ్గరే వదిలేస్తున్నారు. ఊర్లలోనూ విడిగా ఉంటున్నారు. దీనితో వృద్ధులు ఒంటరిగా మిగిలిపోతున్నారు. ఆశ్రమాల్లో వదిలేస్తున్నారు ఆర్థికంగా కాస్త వెసులుబాటు ఉన్న కుటుంబాల్లో కొందరు కన్నవారిని ఆశ్రమాల్లో వదిలేస్తున్నారు. తాము ఉద్యోగాలు, వ్యాపారాల్లో బిజీగా ఉండి ఆలనా పాలనా చూడటం ఇబ్బందని చెప్పుకొంటూ డబ్బులు కట్టి ఆశ్రమాల్లో చేర్పిస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లో ఇలాంటివి ఎక్కువగా ఉంటున్నాయి. ఆశ్రమాల్లో ఉన్న అలాంటి వృద్ధులను కదిలిస్తే చాలు కన్నీటి పర్యంతమవుతున్నారు. అయినా తమ పిల్లలకు చెడ్డ పేరు రావొద్దని బాధను దిగమింగుకుంటున్నారు. కొందరిని బతికిస్తున్న ‘ఆసరా’ ప్రభుత్వం అందిస్తున్న పింఛన్లు ఎంతో మంది వృద్ధుల బతుకులకు ‘ఆసరా’గా నిలుస్తున్నాయి. రాష్ట్ర జనాభాలో 41 లక్షల మంది వృద్ధులు ఉండగా.. 15,94,650 మందికి వృద్ధాప్య పింఛన్ అందుతోంది. మందులు, నిత్యావసరాలకు కొంత వరకు పింఛన్ సొమ్ము ఉపయోగపడుతోంది. ఇదే సమయంలో కన్నవారి పింఛన్ డబ్బుల కోసం పిల్లలు వేధిస్తున్న ఘటనలూ ఉన్నాయి. ఆత్మహత్యల్లో 14% వృద్ధులవే.. తెలంగాణలో జరుగుతున్న ఆత్మహత్యల ఘటనల్లో 14 శాతం వృద్ధులవే ఉంటున్నాయని ఎన్సీఆర్బీ నివేదిక పేర్కొంటోంది. కన్నబిడ్డల ఆదరణ లేకపోవడం, ఒంటరితనం, అనారోగ్య సమస్యలతో వృద్ధులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఏడాదిలో తెలంగాణలో 8 వేల పైచిలుకు ఆత్మహత్యలు జరిగితే.. అందులో 12 వందల మంది వరకు వృద్ధులు ఉంటున్నారు. రాష్ట్ర జనాభాలో వృద్ధులు 11 శాతం తెలంగాణ జనాభాలో వృద్ధులు పదకొండు శాతం ఉన్నారు. 2021 అంచనాల ప్రకారం రాష్ట్ర జనాభా 3.77 కోట్లుకాగా.. ఇందులో వృద్ధుల సంఖ్య 41 లక్షలు దాటింది. ఇందులో 60–64 ఏళ్ల మధ్య వయసు వారు 12.77 లక్షల మంది.. 65–69 ఏళ్లవారు 10.18 లక్షలు, 70–74 ఏళ్లవారు 8.33 లక్షలు, 75–79 ఏళ్లవారు 5.62 లక్షలు, 80ఏళ్లు పైబడినవారు 4.70 లక్షల మంది ఉన్నట్టు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ప్రభుత్వం కేర్ సెంటర్లు ఏర్పాటు చేయాలి చాలా కుటుంబాల్లో పేదరికం ఇబ్బందులు సృష్టిస్తోంది. తాను, భార్యాపిల్లలు బతకడమే కష్టమని, ముసలివాళ్లను ఎలా పోషించాలంటూ కొందరు తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తున్నారు. ఆర్థికంగా ఉన్న కుటుంబాల్లో మరో రకమైన సమస్య ఉంటోంది. తమకు ముసలివాళ్లు అడ్డుగా ఉంటున్నారంటూ ఆశ్రమాలకు పంపడమో, వేరుగా ఉంచడమో చేస్తున్నారు. ఒంటరితనం, సరైన ఆహారం దొరకకపోవడం, పిల్లలు పట్టించుకోకపోవడంతో వృద్ధులు మానసికంగా కుంగిపోతున్నారు. ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. కొన్ని కుటుంబాల్లో చాదస్తం ఎక్కువైందంటూ వృద్ధులను ఇబ్బంది పెడుతుంటారు. నెలలు, ఏళ్ల తరబడి ఒకేచోట ఉండటంతో చాదస్తం వస్తుంది. అందుకే పెద్దలకు నలుగురితో కలిసి ముచ్చటించుకునే అవకాశం కల్పించాలి. మన దగ్గర ప్రభుత్వమే కేర్ సెంటర్లు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. – డాక్టర్ సి.వీరేందర్, సైకాలజిస్ట్, హైదరాబాద్ -
బిడ్డకు జన్మనివ్వబోతున్న ట్రాన్స్‌మన్.. దేశంలోనే తొలిసారి..
తిరువనంతపురం: కేరళకు చెందిన జియా, జహద్ అనే ట్రాన్స్‌జెండర్ జంట త్వరలోనే తల్లిదండ్రులు కాబోతున్నారు. మార్చిలో పండంటి బిడ్డకు జన్మనివ్వబోతున్నారు. జియా ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. వీరిద్దరూ మూడేళ్లుగా కలిసి జీవిస్తున్నారు. పుట్టుకతో మగ అయినా జియా.. లింగమార్పిడి చేయించుకుని అమ్మాయిగా మారుతోంది. మరోవైపు అమ్మాయిగా పుట్టిన జహద్ కూడా లింగ మార్పిడి చేయించుకుని అబ్బాయిగా మారుతున్నాడు. అయితే ఈ క్రమంలో గర్భం దాల్చడంతో బిడ్డ కోసం లింగ మార్పిడి ప్రక్రియను నిలిపివేశారు. ఫలితంగా దేశంలోనే గర్బం దాల్చిన తొలి ట్రాన్స్‌మన్‌గా జహద్ నిలిచారు. అయితే అబ్బాయిలా మారాలనుకున్నందున శస్త్రచికిత్సలో భాగంగా జహద్ వక్షోజాలను ఇప్పటికే తొలగించారు. గర్భాశయాన్ని కూడా తొలగించే లోపే జహద్ గర్భందాల్చడంతో ఈ ప్రక్రియ ఆగిపోయింది. దీంతో పుట్టబోటే బిడ్డకు దాతల ద్వారా పాలు సమాకూర్చుకుంటామని ఈ జంట చెబుతోంది. తాను పుట్టుకతో అమ్మాయి కాకపోయినప్పటికీ బిడ్డతో అమ్మ అని పిలుపించుకోవాలని కలలు కనేదాన్నని జియా చెప్పింది. జహద్ కూడా నాన్న కావాలనుకున్నాడని పేర్కొంది. ఎట్టకేలకు తమ కల నేరవేరిందని, మరో నెలలో బిడ్డకు జన్మనిస్తామని ఆనందం వ్యక్తం చేసింది. బిడ్డ దత్తత కోసం ప్రయత్నాలు.. ఈ జంట కొద్దికాలంగా ఓ బిడ్డను దత్తత తీసుకునేందుకు ప్రయత్నిస్తోంది. అయితే వీరు ట్రాన్స్‌జెండర్ అయినందున దత్తత ప్రక్రియ సవాల్‌గా మారింది. బయోలాజికల్‌గా జహద్ ఇంకా అమ్మాయే కావడంతో సాధారణ బిడ్డకు జన్మనిచ్చే అవకాశముందని భావించారు. అబ్బాయిగా మారాలనుకున్న జహద్ ఆలోచనను జియా తాత్కాలికంగా వాయిదా వేయించారు. ఇద్దరి ట్రాన్స్‌జెండర్ ప్రక్రియ ఇంకా పూర్తి కానందున పుట్టబోయో బిడ్డకు ఎలాంటి ఇబ్బంది లేదని కోజికోడ్ మెడికల్ కాలేజీ వైద్యులు తెలిపారు. అంతా సాధారణంగానే జరుగుతుందని చెప్పారు. చదవండి: మైక్రోసాఫ్ట్ ఉద్యోగికి షాక్! అటు ఉద్యోగం, ఇటు పెళ్లి చేసుకునే పిల్లా? ఈ పరిస్థితి ఎవరికీ రాకూడదు! -
సీఎం జగన్ ను కలిసిన చిన్నారి హనీ, తల్లీదండ్రులు
-
సీఎం జగన్‌ను కలిసిన చిన్నారి హనీ, తల్లిదండ్రులు
సాక్షి, అమరావతి: తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాకు చెందిన చిన్నారి హనీ, తల్లిదండ్రులు కలిశారు. అరుదైన గాకర్స్ వ్యాధితో బాధపడుతున్న చిన్నారి చికిత్స కోసం గతంలో కోనసీమ జిల్లాలో పర్యటిస్తున్న సీఎంను హనీ తల్లిదండ్రులు నాగలక్ష్మి, రాంబాబులు కలిశారు. దీంతో అప్పటికప్పుడే చిన్నారి చికిత్స కోసం సీఎం జగన్ రూ.1 కోటి మంజూరు చేశారు. చిన్నారి హనీ చికిత్సకు అవసరమైన ఖరీదైన ఇంజక్షన్లతో పాటు నెలకు రూ.10వేలు పెన్షన్ కూడా ప్రభుత్వం అందిస్తోంది. ముఖ్యమంత్రి ఆదేశాలతో చికిత్స అందుకుంటూ చిన్నారి హనీ ఆరోగ్యంగా, ఉల్లాసంగా ఉంది. అయితే ఈ రోజు హనీ పుట్టినరోజు సందర్భంగా సీఎం జగన్‌ను కలిసి తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలుపగా, సీఎం చిన్నారిని ఆశీర్వదించారు. చదవండి: (‘సీఎం జగన్ మాటిచ్చారు.. నెరవేర్చారు’) -
‘అమ్మా, నాన్న నన్ను క్షమించండి.. చెల్లెలి జీవితం ఆమె ఇష్ట ప్రకారమే జరగాలి’
అన్నానగర్(చెన్నై): తనకు ఇష్టం లేని కోర్సులో చేరలేక విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆవడి, గోవర్ధనగిరికి చెందిన విజయన్, జయలక్ష్మి దంపతుల కుమారుడు బాలాజీ (17) ఓ ప్రైవేటు పాఠశాలలో 12వ తరగతి చదువుతున్నాడు. ఆదివారం సాయంత్రం విజయన్ పొంగల్ పండుగకు దస్తులు కొనేందుకు భార్యతో కలిసి బయటకు వెళ్లాడు. ఇంట్లో బాలాజీ, అతని చెల్లెలు ఉన్నారు. గదిలోకి వెళ్లిన బాలాజీ ఎంతసేపటికీ బయటకు రాలేదు. అనుమానం వచ్చిన అతని చెల్లెలు లోపలికి వెళ్లి చూడగా బాలాజీ ఉరివేసుకుని కనిపించాడు. కేకలు వేయడంతో స్థానికులు అతన్ని కిందకు దించి ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. దీనిపై ఆవడి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అసిస్టెంట్ కమిషనర్ పురుషోత్తమన్ విచారణ జరిపారు. బాలాజీ తల్లిదండ్రులకు రాసిన లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందులో ‘‘ అమ్మా, నాన్న నన్న క్షమించండి. మీరు నన్ను బాగా చూసుకున్నారు. మీరు కోరుకున్న కోర్సు చదవడం నాకు ఇష్టం లేదు. నా జీవితం నా ఎంపిక కాదు. చెల్లెలి జీవితం ఆమె ఇష్ట ప్రకారమే జరగాలని’’ పేర్కొన్నాడు. బాలాజీ నీట్ కోసం ప్రాక్టీస్ చేస్తున్నాడని..అయితే తల్లిదండ్రులు వేరే కోర్సులో చేరేందుకు దరఖాస్తు ఫారం ఇచ్చి ఒత్తిడి చేస్తున్నట్టు తెలుస్తోంది. దీంతో కొద్ది రోజులుగా తీవ్ర మనోవేదనలో ఉన్నట్లు తెలుసుకున్నారు. పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నారు. చదవండి: విమానంలో మందుబాబుల హల్చల్.. ఎయిర్‌హోస్టస్‌తో అసభ్యకరంగా.. -
పేరెంట్స్ కాబోతున్న 'గే' జంట.. ఎలా సాధ్యం?
న్యూజెర్సీ: అమిత్ షా, ఆదిత్య మదిరాజు. 2019లో అమెరికా న్యూజెర్సీ వేదికగా ఒక్కటైన ఈ స్వలింగ సంపర్కులు అప్పట్లో ఇంటర్నెట్లో ప్రకంపనలు సృష్టించారు. హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకున్న ఈ జంట గురించి అందరికీ తెలిసింది. అయితే ఇప్పుడు వీళ్లు చేసిన చేసిన ప్రకటన మరోసారి సామాజిక మాధ్యమాల్లో చర్చనీయాంశమైంది. తామిద్దరం పేరెంట్స్ కాబోతున్నామని అమిత్ షా, ఆదిత్య సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. స్వలింగ సంపర్కులైన వీళ్లు సహజంగా పేరెంట్స్ కావడం అసాధ్యం. అయితే ఓ మహిళ వీళ్లకు అండాన్ని దానం చేసింది. దీంతో ఐవీఎఫ్(ఇన్ విట్రో ఫర్టిలైజేషన్) పద్ధతిలో వీళ్లు ఓ బిడ్డకు పేరెంట్స్ కాబోతున్నారు. మే నెలలో తాము పేరెంట్స్ కాబోతుండటం ఎంతో సంతోషంగా ఉందని ఈ గే జంట ఆనందం వ్యక్తం చేసింది. అందరిలాగే తమకు కూడా ఓ బిడ్డ ఉంటుందని పేర్కొంది. తమను చూసి ఎంతో మంది స్వలింగ సంపర్కులు ధైర్యం చేసి ఇంట్లో తల్లిదండ్రులను ఒప్పించి పెళ్లి చేసుకున్నారని, ఇప్పుడు వాళ్లు పిల్లలను కనే మార్గం కూడా ఉందని తాము నిరూపిస్తున్నామని అమిత్ షా, ఆదిత్య వివరించారు. 4 రౌండ్ల ఐవీఎఫ్ తర్వాత తాము పేరెంట్స్ కాబోతున్నామనే విషయం ఖరారైందని చెప్పారు. ఇకపై స్వలింగ సంపర్కులు కూడా పెళ్లి, పిల్లల విషయంపై ఆందోళన చెందకుండా సంతోషంగా అందరిలాగే సాధారణ జీవితాన్ని ఆస్వాదించవచ్చని ఈ గే జంట చెబుతోంది. అమిత్ షా గుజరాత్‌కు చెందిన వాడు. న్యూజెర్సీలో స్థిరపడ్డాడు. ఆదిత్య తెలుగు రాష్ట్రాలకు చెందినవాడు ఢిల్లీలో నివసించేవాడు. 2016లో ఓ ఫ్రెండ్ ద్వారా వీరిద్దరూ పరిచయమయ్యారు. ఆ తర్వాత మూడేళ్లకు 2019లో న్యూజెర్సీలో ఘనంగా పెళ్లి చేసుకున్నారు. చదవండి: 25 దేశాల్లో ఒమిక్రాన్ ఎక్స్‌బీబీ వేరియంట్ .. డబ్ల్యూహెచ్ఓ అలర్ట్.. -
వయస్సు 6 ఏళ్ళు.. తన వ్యాధి గురించి పేరెంట్స్ కి చెప్పొదన్న బాలుడు
-
‘భారత్‌లో ఇలానే ఉంటుంది’!.. ఎయిర్‌పోర్ట్‌లో సిద్ధార్థ్ తల్లిదండ్రులకు చేదు అనుభవం
న్యూఢిల్లీ: బహు భాషా నటుడు హిరో సిద్ధార్థ్ తల్లిదండ్రులకు ఎయిర్‌పోర్ట్‌లో చేదు అనుభవం ఎదురైంది. తమినాడులోని మధురై ఎయిర్‌పోర్ట్‌లో భద్రతా సిబ్బంది తన తల్లిదండ్రులను వేధించారని సిద్ధార్థ్ ఆరోపణలు చేశారు. తన తల్లిదండ్రులను బ్యాగులోంచి కొన్ని నాణేలను తీసేయమని ఒత్తిడి చేశారని అన్నారు. సుమారు 20 నిమిషాల పాటు వేధింపులకు గురిచేశారని చెప్పారు. తాము ఇంగ్లీష్‌లో మాట్లాడుతుంటే వారు పదే పదే హిందీలో మాట్లాడి ఇబ్బందులకు గురి చేశారని అన్నారు. దీన్ని తాము వ్యతిరేకించగా.. ‘భారత్‌లో ఇలానే ఉంటుంద’ని ఒక సీఆర్పీఎఫ్ జవాన్ అన్నారని చెప్పారు. ఈ విషయాన్ని ఇన్స్టాగ్రాం వేదికగా సిద్ధార్థ్ వెల్లడించారు. మధురై విమానాశ్రయంలోని భద్రతను సెంట్రల్ ఇండస్ట్రీయల్ సెక్యూరిటీ ఫోర్స్(సీఐఎస్ఎఫ్) నిర్వహిస్తోంది. (చదవండి: రాజుకుంటున్న సరిహద్దు వివాదం: ప్రతి అంగుళం మహారాష్ట్రకే చెందుతోందంటూ షిండే తీర్మానం) -
లక్షన్నరలో ఒక పుట్టుక.. అరుదైన ఘట్టం
బిడ్డ పుట్టడం.. ఏ తల్లిదండ్రులకైనా జీవితాతంతం గుర్తుండిపోయే మధుర క్షణాలు. కానీ, ఇక్కడ ఓ పేరెంట్స్‌కు మాత్రం అదెంతో ప్రత్యేకమైన సందర్భం. ఎందుకంటే.. లక్షన్నరలో ఒక్కరు మాత్రమే అలా పుట్టే అవకాశం ఉంది కాబట్టి. అలబామా హంట్స్‌విల్లెకు చెందిన క్యాసిడీ, డైలన్ స్కాట్లు డిసెంబర్ 18వ తేదీన ఆడబిడ్డకు జన్మనిచ్చారు. అయితే ఆ తేదీ ఆ భార్యాభర్తలిద్దరికీ ఎంతో ప్రత్యేకం. కారణం.. అదే రోజు వాళ్లిద్దరి పుట్టినరోజు కాబట్టి. పైగా నార్మల్ డెలివరీ ద్వారా ఆ బిడ్డ పుట్టింది. ఈ భూమ్మీద దాదాపు లక్షన్నర మందిలో.. ఇలాంటి ఒక పుట్టుక ఉంటుందనే అంచనా ఉంది. ఈ విషయాన్ని ఫేస్బుక్లో పంచుకుంది ఆ బిడ్డ పుట్టిన హంట్స్‌విల్లే హాస్పిటల్. ఇలాంటి తేదీల్లోనే జన్మనిచ్చిన మరికొందరు తల్లిదండ్రులు.. కింద కామెంట్ సెక్షన్లో తమ శుభాకాంక్షలు తెలియజేశారు. -
న్యూజిలాండ్‌లో పెళ్లి.. అమెరికాలో హైదరాబాదీ భార్యాభర్తల మధ్య తగాదాలు..
సాక్షి,. హైదరాబాద్: తల్లిదండ్రుల మధ్య తగాదాలు కన్న కొడుకుకు కష్టాలు తెచ్చిపెట్టాయి. సరూర్‌నగర్ మహిళా పోలీస్‌స్టేషన్ ఇన్చార్జి ఎస్హెచ్ఓ ఏడుకొండలు కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. నాగోలు, స్నేహపురికాలనీకి చెందిన సరెం శ్రీనివాస్, అత్తాపూర్‌కు చెందిన తరుణంనాజ్ వేర్వేరుగా న్యూజిలాండ్ వెళ్లారు. అక్కడ వారి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. 2015 నవంబర్ 6న న్యూజిలాండ్‌లో ఇద్దరూ వివాహం చేసుకున్నారు. కొంత కాలం తర్వాత ఉద్యోగరీత్యా ఇద్దరూ అమెరికాలో స్థిరపడ్డారు. వీరికి ప్రస్తుతం రెండేళ్ల కుమారుడు ఉన్నాడు. కొంత కాలంగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఇండియాలో ఉంటున్న ఇరు కుటుంబాల పెద్దలు రాజీ కుదిర్చే ప్రయత్నం చేసినా ప్రయోజనం లేకపోయింది. ఈ క్రమంలో తరుణంనాజ్ అమెరికా న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఇరువైపు వాదనలు విన్న న్యాయస్థానం కొడుకును తల్లి వద్ద ఆరు రోజులు, తండ్రి వద్ద ఒక రోజు ఉండేలా తీర్పునిచ్చింది. తల్లి దగ్గర ఆరు రోజులు ఉన్న అనంతరం ఏడో రోజు బాబు తండ్రి దగ్గరికి చేరాడు. ఆ ఒక్కరోజు సమయంలోనే శ్రీనివాస్ కుమారుడిని తీసుకుని ఇండియాకు వచ్చేశాడు. ఒక రోజు గడిచినా కొడుకు ఇంటికి రాకపోవడంతో తరుణంనాజ్‌కు అనుమానం వచ్చి అమెరికాలో భర్త శ్రీనివాస్ ఉంటున్న నివాసానికి వెళ్లి చూడగా, అతను అక్కడ లేకపోవడంతో వెంటనే అత్తాపూర్‌లో నివసిస్తున్న తన తల్లి జహంగీర్ ఉన్నీసాకు సమాచారం అందించింది. దీంతో ఆమె సరూర్‌నగర్ మహిళా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసేందుకు వెళ్లింది. ఈ తరహా కేసులో తప్పనిసరిగా తల్లి ఫిర్యాదు చేయాలని సిబ్బంది సూచించారు. దీంతో తరుణంనాజ్ అమెరికా నుంచి ఈ–మెయిల్ ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు ఐపీసీ సెక్షన్–498ఏ కింద కేసు నమోదు చేశారు. -
ముల్లును ముల్లుతోనే తీయాలి.. ఆన్లైన్ ‘ఆట’కట్టించిన తల్లిదండ్రులు
బీజింగ్: చైనాలో ఆన్లైన్ వీడియో గేమ్‌లకు బానిసగా మారిన ఓ ఐదో తరగతి బాలుడిని ఆ వ్యసనం నుంచి బయటపడేసేందుకు తల్లిదండ్రులు అతని ‘దారి’నే ఎంచుకున్నారు! రోజూ గంటల తరబడి వీడియో గేమ్‌లు ఆడుతున్న తమ కుమారుడు తిరిగి చదువుల బాట పట్టేందుకు వీలుగా ఓ ప్రొఫెషనల్ ఆన్లైన్ గేమర్‌ను ఆశ్రయించారు!! ఇందుకోసం అతనికి గంటకు సుమారు రూ. 600 చొప్పున ‘సుపారీ’సైతం చెల్లించారు!! ముల్లును ముల్లుతోనే తీయాలన్న చందంగా తమ కుమారుడిని ఆన్లైన్ గేమర్‌తో చిత్తుగా ఓడించడం ద్వారా ఈ తరహా ఆటలు ఆడటంలో నిష్ణాతుడినన్న అతడి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయాలనుకున్నారు. అనుకున్నట్లుగానే వారి వ్యూహం ఫలించింది. బాలుడితో ఐదు గంటలపాటు ఐదు గేమ్‌లు ఆడిన ఆన్లైన్ గేమర్... అతన్ని చిత్తుగా ఓడించాడు. గేమ్‌లన్నీ పూర్తి ఏకపక్షంగా సాగడంతో కంగుతిన్న బాలుడు.. ఆ ఆటలపై ఇష్టాన్ని కోల్పోయాడు. దీంతో తమ కొడుకును ఓదార్చిన తల్లిదండ్రులు... ఇక నుంచి అతను తిరిగి చదువుపై దృష్టిపెట్టేలా ఒప్పించారు. ఈ విషయాలను ఆన్లైన్ గేమర్ స్వయంగా సోషల్ మీడియా ద్వారా బయటపెట్టాడు. మరో బాలుడిని సైతం ఇలాగే ఆన్లైన్ ఆటల వ్యసనం నుంచి బయటపడేసినట్లు చెప్పాడు. చదవండి: పాలపుంతలో నీటి గ్రహాలు! కనిపెట్టిన నాసా టెలిస్కోప్.. -
ఈ ఏడాది దంపతులుగా, తల్లిదండ్రులుగా ప్రమోట్ అయిన స్టార్స్
ఈ ఏడాది ఇటు సౌత్.. అటు నార్త్‌లో పెళ్లి కళ కనిపించింది. అన్నీ కూడా దాదాపు ప్రేమ వివాహాలే. పెద్దల అనుమతితో వైభవంగా స్టార్స్ పెళ్లి చేసుకున్నారు. ఇక గతంలో పెళ్లి చేసుకున్న కొందరు స్టార్స్ ఈ ఏడాది తల్లిదండ్రులయ్యారు. ఈ ఏడాదే పెళ్లి చేసుకుని, పేరెంట్స్ అయినవారూ ఉన్నారు. పెద్దల అక్షింతలతో పెళ్లి చేసుకున్న, పిల్లల కేరింతలతో మురిసిపోతున్న స్టార్స్ గురించి తెలుసుకుందాం. దక్షిణాదిలో లేడీ సూపర్ స్టార్‌గా పేరు తెచ్చుకున్న నయనతార ఈ ఏడాది పెళ్లి పీటలెక్కారు. తన ప్రేమికుడు, దర్శకుడు విఘ్నేష్ శివన్‌తో జూన్ 9న ఏడడుగులు వేశారామె. విజయ్ సేతుపతి, నయన జంటగా విఘ్నేష్ శివన్ తెరకెక్కించిన ‘నానుమ్ రౌడీదాన్’ (‘నేను రౌడీ’) చిత్రం వీరి ప్రేమకు పునాది అయింది. ఈ చిత్రనిర్మాణంలో భాగస్వామ్యం అయిన విఘ్నేష్–నయన నిజ జీవితంలోనూ భాగస్వాములు కావడం విశేషం. దాదాపు ఏడేళ్ల ప్రేమ తర్వాత పెళ్లితో ఒక్కటయ్యారు వీరు. కాగా పెళ్లయిన నాలుగు నెలలకే విఘ్నేష్–నయన తల్లిదండ్రులు కావడం హాట్ టాపిక్ అయింది. కారణం సరోగసీ ద్వారా వీరు తల్లిదండ్రులు అయ్యారు. ఇక యువ హీరో నాగశౌర్య ఈ ఏడాది ఓ ఇంటివాడయ్యారు. బెంగళూరుకు చెందిన ఇంటీరియర్ డిజైనర్ అనూష శెట్టి మెడలో నవంబర్ 20న మూడు ముళ్లు వేశారాయన. అనూషతో కొంత కాలంగా ఉన్న స్నేహం ప్రేమగా మారడం.. ఆ ప్రేమకు ఇరు కుటుంబ సభ్యులు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో వీరి వివాహం జరిగింది. అలాగే వైవిధ్యమైన పాత్రలతో తెలుగు, తమిళ ప్రేక్షకుల్లో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న నటుడు ఆది పినిశెట్టి పెళ్లి పీటలెక్కారు. తన ప్రేయసి, హీరోయిన్ నిక్కీ గల్రానీతో ఆయన ఏడడుగులు వేశారు. మే 18న వీరి వివాహం జరిగింది. అదే విధంగా ‘దేశముదురు’తో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ హన్సిక కూడా వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. తన మిత్రుడు, ప్రియుడు అయిన వ్యాపారవేత్త సోహైల్ కతూరియాను ఆమె వివాహమాడారు. జైపూర్‌లో డిసెంబర్ 4న వీరి పెళ్లి జరిగింది. అలాగే హీరోయిన్ పూర్ణ దుబాయ్‌లో స్థిరపడిన వ్యాపారవేత్త, జేబీఎస్ గ్రూప్ కంపెనీ ఫౌండర్, సీఈవో షానిద్ ఆసిఫ్ అలీని వివాహం చేసుకున్నారు. అక్టోబర్ 25న వీరి వివాహం దుబాయ్‌లో జరిగింది. కాగా సీనియర్ నటుడు కార్తీక్ తనయుడు, హీరో గౌతమ్ కార్తీక్, నటి మంజిమా మోహన్ కూడా వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ‘దేవరాట్టం’ సినిమాలో నటిస్తున్న సమయంలో ప్రేమలో పడ్డ గౌతమ్, మంజిమా నవంబర్ 28న చెన్నైలో పెళ్లి చేసుకున్నారు. ఇలా దక్షిణాదిన మూడు ముళ్ల బంధంతో ఒక్కటయిన జంటలు కొన్ని ఉన్నాయి. వచ్చే ఏడాది పేరెంట్స్‌గా ప్రమోషన్ పొందనున్నారు రామ్‌చరణ్–ఉపాసన. కోడలు గర్భవతి అనే విషయాన్ని ఈ నెల 12న అధికారికంగా ప్రకటించారు చిరంజీవి. 2012 జూన్ 14న రామ్‌చరణ్, ఉపాసనల వివాహం జరిగిన విషయం గుర్తుండే ఉంటుంది. అలాగే తమిళ దర్శకుడు అట్లీ కూడా తన భార్య ప్రియా మోహన్ గర్భవతి అని ఇటీవల ప్రకటించారు. అగ్రనిర్మాత ‘దిల్’ రాజు రెండో వివాహం 2020లో డిసెంబరు 10న తేజస్వినీతో జరిగిన విషయం గుర్తుండే ఉంటుంది. ఈ ఏడాది జూన్ 29న తేజస్విని ఓ బాబుకు జన్మనిచ్చారు. తనయుడికి అన్వయ్ రెడ్డి అని నామకరణం చేశారు. ఈ ఏడాది నుంచి కాజల్ అగర్వాల్ మాతృత్వం తాలూకు మాధుర్యాన్ని ఆస్వాదిస్తున్నారు. రెండేళ్ల క్రితం అంటే.. 2020 అక్టోబరు 30న ముంబైకి చెందిన వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లూతో కాజల్ అగర్వాల్ ఏడడుగులు వేశారు. ఈ ఏడాది ఏప్రిల్ 19న కాజల్ ఓ బాబుకి జన్మనిచ్చారు. ఆ బాబుకి నీల్ కిచ్లు అని నామాకరణం చేశారు. మరోవైపు గత ఏడాది మే 30న వ్యాపారవేత్త నితిన్ రాజుని పెళ్లాడిన ప్రణీత ఈ ఏడాది ఓ పాపకు జన్మనిచ్చారు. తమకు కుమార్తె పుట్టిన విషయాన్ని జూన్ 10న ప్రకటించారు. పాపకు అర్నా అని పేరు పెట్టుకున్నారు. మరోవైపు నమిత కూడా ఈ ఏడాదే పేరెంట్స్ క్లబ్లో చేరారు. వ్యాపారవేత్త వీరేంద్ర చౌదరితో కలిసి 2017 నవంబరు 24న తిరుపతిలో ఏడడుగులు వేశారు నమిత. ఈ ఏడాది ఆగస్టులో మే 10న తాను గర్భవతిననే విషయాన్ని నమిత అధికారికంగా ప్రకటించారు. ఆ తర్వాత కవలలకు (ఇద్దరు మగశిశువులు) జన్మనిచ్చినట్లు ఆగస్టులో ప్రకటించారు. కృష్ణ ఆదిత్య, కిరణ్ రాజ్ అనేవి వీరేంద్ర చౌదరి, నమిత దంపతుల కుమారుల పేర్లు. ఇక దర్శక–నటుడు రాహుల్ రావీంద్రన్, ప్రముఖ సింగర్, డబ్బింగ్ ఆర్టిస్టు చిన్మయి ఈ ఏడాది తల్లిదండ్రులయ్యారు. ఈ ఏడాది జూన్‌లో కవలలకు (మగశిశువు, ఆడశిశువు) జన్మనిచ్చారు చిన్మయి. శర్వస్, ద్రిప్త అనేవి వీరి పేర్లు. కాగా రాహుల్ రవీంద్రన్, చిన్మయిల వివాహం 2014 మేలో జరిగిన సంగతి తెలిసిందే. ఇక బాలీవుడ్ౖ వెపు వెళితే ప్రియాంకా చోప్రా, నిక్ జోనాస్ సరోగసీ ద్వారా మాల్టీ మారీ చోప్రా జోనస్ అనే పాపకు తల్లిదండ్రులైనట్లు జనవరిలో ప్రకటించారు. కాగా నిక్ జోనాస్, ప్రియాంకా చోప్రాల వివాహం 2018 డిసెంబరులో జరిగింది. మరోవైపు 2016 ఏప్రిల్ 30న నటుడు కరణ్ సింగ్ గ్రోవర్‌ను పెళ్లాడిన హీరోయిన్ బిపాసా ఈ ఏడాది నవంబరు 12న ఓ పాపకు జన్మనిచ్చారు. ఈ పాప పేరు దేవి బసు సింగ్ గ్రోవర్. హిందీలో కూడా ఈ ఏడాది కొన్ని జంటలు షాదీ ముబారక్ (వివాహ శుభాకాంక్షలు) అందుకున్నాయి. బాలీవుడ్ మోస్ట్ క్రేజీ కపుల్ రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్ ఏప్రిల్ 14న ఏడడుగులు వేశారు. ఈ ఇద్దరూ ‘బ్రహ్మాస్త్ర’లో జంటగా నటిస్తున్నప్పుడు ప్రేమలో పడి, నిజజీవితంలోనూ జంట అయ్యారు. దాదాపు నాలుగేళ్లు ప్రేమించుకుని, పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు. ఈ ఏడాదే తల్లిదండ్రులయ్యారు కూడా. నవంబర్ 6న ఆలియా ఒక పాపకు జన్మనిచ్చారు. పాపకు రహా అని పేరు పెట్టారు. మరో జంట అలీ ఫజల్–రిచా చద్దా దాదాపు పదేళ్లు ప్రేమించుకున్నారు. ‘ఫక్రి’ చిత్రం షూటింగ్లో ఇద్దరి మధ్య ఏర్పడిన పరిచయం.. ప్రేమగా మారింది. అక్టోబర్ 4న వీరి వివాహం జరిగింది. ఇక ఈ ఏడాది ఆరంభంలోనే భార్యాభర్తలుగా తమ జీవితాన్ని ఆరంభించారు సూరజ్ నంబియార్–మౌనీ రాయ్. జనవరి 27న వీరి వివాహం జరిగింది. మరోవైపు ప్రేమికుల దినోత్సవానికి నాలుగు రోజుల తర్వాత ఫిబ్రవరి 19న పెళ్లి చేసుకున్నారు ఫర్హాన్ అక్తర్–షిబానీ దండేకర్. ఫర్హాన్ హోస్ట్ చేసిన ‘ఐ కేన్ డూ దట్’ షోలో షిబానీ పాల్గొన్నారు. ఆ షోలోనే ఈ ఇద్దరూ తొలిసారి కలిశారు. 2015లో ఏర్పడిన వీరి పరిచయం ఈ ఏడాది పెళ్లి వరకూ వచ్చింది. ఇంకోవైపు దాదాపు ఏడేళ్లు ప్రేమించుకుని ఏడడుగులు వేశారు విక్రాంత్ మస్సే–షీతల్ ఠాకూర్. ఈ ప్రేమికుల దినోత్సవానికి (ఫిబ్రవరి 14) మిస్టర్ అండ్ మిసెస్ అయ్యారు విక్రాంత్–షీతల్. ఇక దర్శకురాలు గునీత్–వ్యాపారవేత్త సన్నీల వివాహం ఈ నెల 12న జరిగింది. ఇలా ఈ ఏడాది హిందీ పరిశ్రమలో పెళ్లిళ్ల సందడి బాగానే కనిపించింది. -
బంగారు తల్లి.. చూపులేని తల్లిదండ్రుల కోసం..
వైరల్: తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుండు పుట్టనేమీ వాడు గిట్టనేమి.. ఈ భూమ్మీద తల్లిదండ్రులను మించిన రక్షణ మరొకటి లేదు. కానీ, తల్లిదండ్రులంటే అపార గౌరవం, ప్రేమ.. అన్నింటికి మించి వాళ్ల ఆలనా పాలనా చూసుకునే అపర శ్రవణ కుమారులు ఈ కాలంలో అరుదైపోయారు. అలాంటిది.. తల్లిదండ్రులను పట్టించుకోని పిల్లలకు కనువిప్పు కలిగించే ఘటన ఒకటి ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ఆ చిన్నారిది తోటి స్నేహితులతో ఆడిపాడే వయసు. కానీ, ఆ తల్లిదండ్రులిద్దరికీ చూపు లేదు. అందుకే వాళ్లకు కంటి పాప అయ్యింది. బడికి పోయే టైం తప్పించి.. మిగతా సమయంలో వాళ్ల వెంటే ఉంటూ నడిపిస్తోంది. సాయంత్రం పూట వాళ్లతో కలిసి.. చిరు తిండి తింటూ గడిపింది. ఆపై వాళ్లను అక్కడి నుంచి తీసుకెళ్లింది. ఆ వీడియోనే సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతోంది. యూనిఫామ్‌లో ఉన్న ఓ చిన్నారి వాళ్లకు చిరు తిండి అందిస్తూ కనిపిస్తోంది. ముంబైపై వీడియోలు తీసే మిత్ ఇందుల్కర్ అనే ఇన్ఫ్లెన్సర్.. తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ నుంచి పోస్ట్ అయిన ఈ వీడియో.. వ్యూయర్స్ దృష్టిని ఆకట్టుకుంది. ముంబై జాంగిద్, మీరా రోడ్లో రోడ్డు పక్కనే ఉన్న ఓ స్టాల్లో ఈ ఘటన చోటు చేసుకుంది. View this post on Instagram A post shared by Mith Indulkar (@mith_mumbaikar) -
వివాహేతర సంబంధాలకు కారణాలివే.. సర్వేలో షాకింగ్ విషయాలు
దొర్నిపాడుకు చెందిన ఓ మహిళను వైఎస్సార్ జిల్లా పెద్దముడియం మండలం జంగాలపల్లెకు చెందిన వ్యక్తికి ఇచ్చి వివాహం చేశారు. వీరికి ఇద్దరు పిల్లలు. కొంతకాలంగా భర్త వేధింపులు తాళలేక పిల్లలతో వచ్చి పుట్టినింట్లో జీవనం సాగిస్తున్న ఆమె మరో వ్యక్తితో తప్పటడుగులు వేసింది. విషయం తెలిసి తల్లిదండ్రులు మందలించడంతో ఫ్యాన్‌కు ఉరేసుకుని వందేళ్ల జీవితానికి 25 ఏళ్లకే ముగింపు పలికింది. ఫలితంగా ఇద్దరు చిన్నారులు దిక్కులేనివారయ్యారు. ఇటీవల ఆళ్లగడ్డ పట్టణంలోని యేసునాథపురానికి చెందిన ఓ వివాహిత ప్రియు డి మోజులో పడి భర్తను హత్య చేసింది. తండ్రి చనిపోవడం, తల్లి జైలుకు వెళ్లడంతో ఇద్దరు పిల్లలు అనాథలుగా మారారు. కర్నూలు నగరం బంగారుపేటలో నివాసముంటున్న ఓ మహిళ తన భర్త మరొకరితో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడని కొంతకాలంగా మధనపడుతుండేది. భర్తలో ఎలాంటి మార్పు రాకపోవడంతో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తండ్రి వేరే మహిళ మాయలో పడటం..తల్లి బలవన్మరణం చెందడంతో వారి ముగ్గురు పిల్లలూ అనాథలయ్యారు. ఇలాంటి ఘటనలు ఉమ్మడి కర్నూలు జిల్లాలో తరచూ చోటు చేసుకుంటున్నాయి. కష్టసుఖాల్లో ఒకరికొకరు తోడూనీడగా ఉండాల్సిన భార్యాభర్తలు వివాహేతర సంబంధాలతో విడిపోతున్నారు. ఒక్కోసారి జీవితాలను అర్ధంతరంగా చాలిస్తూ అభం శుభం తెలియని పిల్లల్ని అనాథలను చేసి వెళ్తున్నారు. కృష్ణగిరి(కర్నూలు జిల్లా): క్షణికావేశంలో తల్లిదండ్రులు చేసే తప్పుల వల్ల వారి జీవితాలు నాశనమవుతుండగా వారి పిల్లలు దిక్కులేని వారవుతున్నారు. వాట్సప్, ఫేస్బుక్, ఇన్‌స్ట్రాగ్రాం.. సామాజిక మాధ్యమం ఏదైనా వ్యక్తుల మధ్య దూరాన్ని తగ్గించి మరింత దగ్గర చేస్తున్నాయి. ఇవి ఒక్కోసారి కాపురాల మధ్య చిచ్చు పెడుతున్నాయి. వివాహేతర సంబంధాలకు దారి తీసి భార్యను కడతేర్చే భర్తలు, ప్రియుడి కోసం భర్తను బండరాళ్లతో మోదే భార్యలు ఎక్కువైపోతున్నారు. స్మార్ట్ ఫోన్లు వివాహేతర సంబంధాలకు వారధిగా మారుతున్నాయని తాజాగా విడుదలైన సర్వే వెల్లడించింది. వివాహేతర సంబంధాల కారణంగా దేశంలో ఏటా మూడు వేల మంది హత్యకు గురవుతున్నారు. కట్టుబాట్లను దాటిన ఇష్టాలు, బంధాలను బలి కోరే సంబంధాలు, నైతికం కాని స్నేహాలు జీవితాలను ఛిద్రం చేస్తున్నాయి. దారి తప్పుతున్న దంపతులు పిల్లల బతుకులను చేతులారా ధ్వంసం చేస్తున్నారు. వివాహేతర సంబంధాలతో వినాశనాన్ని కోరి తెచ్చుకుంటున్నారు. ఆదర్శ దాంపత్యాలు అడుగడుగునా కనిపిస్తున్నా.. ఎక్కడో ఓ చోట విషపు గుళికలా ఇలాంటి వివాహేతర సంబంధాలు తారస పడుతున్నాయి. ఒక్కసారి పట్టు తప్పితే ఆ తప్పులకు మూల్యంగా ప్రాణాలే పోతున్నాయి. అనాథలవుతున్న పిల్లలు వివాహేతర సంబంధాలు భార్యాభర్తల గొడవలతో ముగిసిపోవు. వాటి ప్రభావం పిల్లలపై అధికంగా పడుతోంది. ఎదిగే వయసులో తల్లిదండ్రులు గొడవ పడటం చూసిన పిల్లల మనసులు తీవ్రంగా గాయపడతాయి. మరీ ముఖ్యంగా తల్లిదండ్రుల్లో ఒకరు ఆత్మహత్య చేసుకోవడం, మరొకరు ఆ కారణంతో జైలుకు వెళ్లడం వంటి ఘటనలతో చిన్నారుల బాల్యంపై మరక పడుతోంది. అది జీవితకాలం వెంటాడుతోంది. తల్లిదండ్రుల సంరక్షణలో చక్కగా నవ్వుతూ బతకాల్సిన పిల్లలు ఇలా ఏడుస్తూ రోజులు లెక్కపెట్టాల్సి వస్తోంది. వివాహేతర సంబంధాలకు కారణాలు ♦సంపాదనే ధ్యేయంగా చూసుకుని సంసారాన్ని నిర్లక్ష్యం చేయడం ♦దంపతుల మధ్య తరచూ పడే చిన్నపాటి గొడవలను పెద్దవి చేసుకోవడం ♦భార్యాభర్తల విషయాల్లో కుటుంబ సభ్యుల మితిమీరిన జోక్యం ♦బయటవారితో కేటాయించిన సమయం.. లైఫ్‌పార్టనర్‌తో గడపకపోవడం ♦పెచ్చుమీరిన ఆన్లైన్ స్నేహాలు ♦చెడు వ్యసనాలకు బానిస కావడం ♦బలహీన మనస్తత్వాలు తప్పనిసరిగా పాటించాల్సినవి ♦దాంపత్యంలోని మాధుర్యాన్ని ఆస్వాదించాలి ♦బకరినొకరు అర్థం చేసుకోవాలి.. ఒకరి అభిప్రాయాలను ఒకరు గౌరవించాలి ♦ఆకర్షణలు తాత్కాలికమే గానీ శాశ్వతం కావనే నిజాన్ని గ్రహించాలి ♦నైతిక విలువలు, సంబంధాలు, కుటుంబ విలువలకు గౌరవం ఇవ్వాలి ♦దాంపత్య జీవితంలో భాగస్వామికి అన్ని విషయాల్లో తప్పకుండా ప్రాధాన్యత ఇవ్వాలి చదవండి: ప్రియుడి మర్మాంగాన్ని కోసిన ప్రియురాలు.. ఆ ఇంట్లో అసలేం జరిగిందంటే.. చట్టం ద్వారా పరిష్కరించుకోవాలి దంపతుల మధ్య ఏదైనా సమస్య వచ్చినప్పుడు చట్టం దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించుకోవాలే తప్ప నేరాలకు పాల్పడకూడదు. కౌన్సెలింగ్ ద్వారా చాలామంది దంపతులు మళ్లీ ఒక్కటై సంతోషంగా ఉంటున్నారు. ఆకర్షణలకు లోనై జీవితాలను నాశనం చేసుకోకూడదు. – కల్లా మహేశ్వరరెడ్డి, డోన్ బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు పిల్లలపై ఎక్కువ ప్రభావం వివాహేతర సంబంధాల వల్ల కలిగే దుష్ఫరిణామాలు పిల్లలపైనే ఎక్కువ ప్రభావితం చూపుతాయి. పెద్దలు చేస్తున్న తప్పిదాలను గమనిస్తూ చిన్నారులు మానసిక క్షోభకు గురవుతారు. దీని వల్ల భవిష్యత్తులో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటారు. – మహేశ్వరప్రసాద్, వైద్యాధికారి, కృష్ణగిరి జీవితాలను నాశనం చేసుకోవద్దు మానవ సంబంధాల్లో అత్యంత ప్రమాదకరమైనది వివాహేతర సంబంధం. దీని వల్ల రెండు కుటుంబాల్లో విషాదాలు చోటు చేసుకునే ప్రమాదముంది. వ్యామోహం సరదాగా ప్రారంభమై చివరకు జీవితాలు అర్ధాంతరంగా ముగిసిపోతాయి. మా వద్దకు వచ్చే భార్య, భర్తల తగాదాల్లో అధికశాతం ఇలాంటి కేసులే. ఇప్పటికే ఎంతో మందికి కౌన్సెలింగ్ చేసి జీవితాలను నిలబెట్టాం. – యుగంధర్, సీఐ, వెల్దుర్తి -
ఇందు మృతిపై ఎలాంటి అనుమానాలు లేవు : బాలిక తండ్రి
-
పెళ్లయిన 8 ఏళ్ల తర్వాత.. తండ్రి కాబోతున్న స్టార్ డైరెక్టర్
ప్రముఖ తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ త్వరలోనే తండ్రి కాబోతున్నాడు. ఈ విషయాన్ని ఆయన భార్య, నటి ప్రియ మోహన్ ఇన్స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో పంచుకుంది. బేబీ బంప్‌తో ఉన్న ఫోటోలను షేర్చేస్తూ.. ఈ విషయాన్ని అనౌన్స్ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. నేను ప్రెగ్నెంట్. మీ అందరి ప్రేమ, ఆశీర్వాదాలు కావాలి అంటూ ఇన్‌స్టాలో పోస్టును షేర్ చేసింది. ఇది చూసిన పలువురు సెలబ్రిటీలు సహా నెటిజన్లు ఈ జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కాగా కొన్నాళ్ల పాటు ప్రేమించుకున్న అట్లీ- ప్రియలు 2014లో వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. పెళ్లయిన 8 ఏళ్ల తర్వాత అట్లీ దంపతులు పేరెంట్స్‌గా ప్రమోట్ కాబోతున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే.. నయనతార, నాజ్రియా, ఆర్య ప్రధాన పాత్రల్లో నటించిన రాజారాణి సినిమాతో స్టార్ డైరెక్టర్‌గా పేరు సంపాదించుకున్నారు అట్లీ. ఈ చిత్రం తమిళంతో పాటు తెలుగులోనూ సూపర్ హిట్ అయ్యింది. ప్రస్తుతం షారుక్ ఖాన్‌తో 'జవాన్' సినిమా చేస్తున్నారు. ఈ సినిమా పూర్తైన తర్వాత జూనియర్ ఎన్టీఆర్‌తో సినిమాను తెరకెక్కించే అవకాశం ఉంది. View this post on Instagram A post shared by Priya Mohan (@priyaatlee) -
పేరెంట్స్ మీటింగ్‌కి బాయ్‌ఫ్రెండ్ ..బిత్తరపోయిన ఉపాధ్యాయులు
సాక్షి, బనశంకరి: ఇటీవల రోజుల్లో విద్యార్థుల ప్రవర్తనతో తల్లిదండ్రులు హడలిపోతున్నారు. ఓ బాలిక పేరెంట్స్ మీటింగ్‌కు తన బాయ్ ఫ్రెండ్‌ను తీసుకువచ్చి తన సోదరుడు అంటూ చెప్పిన ఘటన బెంగళూరు నగరంలో వెలుగులోకి వచ్చింది. మీటింగ్‌కు తల్లిదండ్రులకు బదులుగా విద్యార్థిని బాయ్‌ఫ్రెండ్‌ను తీసుకురావడంతో ఉపాధ్యాయులు బిత్తరపోయారు. ఇద్దరి వాలకాన్ని అనుమానించిన ఉపాధ్యాయులు వేర్వేరుగా విచారణ చేశారు. పదే పదే ప్రశ్నించగా తన కజిన్ బ్రదర్ అని, ఆ వ్యక్తిని అడగ్గా తన సిస్టర్ అంటూ చెప్పాడు. ఇద్దరి మాటలతో అయోమయానికి గురైన పాఠశాల పాలక మండలి విద్యార్థిని తల్లిదండ్రులకు విషయం తెలిపి జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. నగరంలో ఇలాంటి ఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయని, తల్లిదండ్రులు పిల్లలపై దృష్టి సారించాలని క్యామ్స్ అధ్యక్షుడు శశికుమార్ తెలిపారు. (చదవండి: చికెన్ రోల్ లేదని.. హోటల్‌కు నిప్పు) -
నాడు నాన్న.. నేడు అమ్మ! ..
సాక్షి, మెదక్: తండ్రి, తల్లి మృతితో నా అనేవారు లేక ఓ బాలిక అనాథగా మారింది. సర్పంచ్, గ్రామస్తులు ముందుకు వచ్చి అంత్యక్రియలు చేసిన ఘటన జగదేవ్‌పూర్ మండలం రాయవరం గ్రామంలో శనివారం జరిగింది. గ్రామానికి చెందిన గుమ్ల రాములు, మల్లవ్వ దంపతులకు కూతురు రేణుక ఉంది. రేణుక వర్గల్ కస్తూర్బాలో ప్రస్తుతం పదో తరగతి చదువుతోంది. రాములు పదేళ్ల క్రితం మృతి చెందగా, మల్లవ్వ తన కూతురుతో కలిసి రెండేళ్లుగా కుకునూర్‌పల్లిలో ఉంటూ జీవనం సాగిస్తుంది. ఈ క్రమంలో మల్లవ్వ అనారోగ్యంతో రెండు రోజుల క్రితం మృతిచెందింది. బంధువులు ఎవరు రాకపోవడంతో గజ్వేల్ ప్రభుత్వాస్పత్రి మార్చురీలో మృతదేహాన్ని ఉంచారు. విషయం తెలుసుకున్న రాయవరం సర్పంచ్ పావని మల్లవ్వ శనివారం అంత్యక్రియలకు సాయం అందించారు. తల్లిదండ్రుల మృతితో అనాౖథెన బాలికను రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ ప్రతాప్‌రెడ్డి పరామర్శించి, ఆర్థిక సాయం అందించారు. (చదవండి: అర్థరాత్రి తప్పతాగి ఎస్ఐని ఢీకొట్టారు.. తీవ్రగాయాలతో..) -
వీడియోలు, గేమింగ్, సోషల్‌మీడియా
న్యూఢిల్లీ: ఆన్లైన్ ఆటలు, సామాజిక మాధ్యమాలు, వీడియోల వ్యసనం పిల్లలకు బాగా ఎక్కువైందని పట్టణప్రాంతాల్లోని తల్లిదండ్రులు చెబుతున్నారు. ఆన్లైన్ వేదికగా సర్వేలు నిర్వహించే ‘లోకల్‌సర్కిల్స్’ సంస్థ చేపట్టిన ఓ సర్వేలో ఇలాంటి పలు అంశాలు వెల్లడయ్యాయి. ఈ ఏడాది జనవరి–నవంబర్ కాలంలో దేశవ్యాప్తంగా 287 జిల్లాల్లో ఈ సర్వే నిర్వహించారు. సర్వే ఫలితాల ప్రకారం.. ► తమ 9–17 ఏళ్ల వయసు పిల్లలు గేమింగ్, వీడియోలు, సోషల్‌మీడియాకు అతుక్కుపోయారని పట్టణ ప్రాంతాల్లోని తల్లిదండ్రుల్లో దాదాపు 40 శాతం మంది అభిప్రాయపడ్డారు. ► తమ 13–17 వయసు పిల్లలు రోజూ సగటున 3 గంటలకుపైగా ఇదే పనిలో ఉంటున్నారని 62 శాతం మంది తల్లిదండ్రులు చెప్పారు ► 9–13 వయసు చిన్నారులు రోజూ కనీసం మూడు గంటలు సోషల్ మీడియా, వీడియోలు, గేమింగ్తోనూ గడుపుతున్నట్లు 49 శాతం మంది తల్లిదండ్రులు చెప్పారు ► సోషల్ మీడియా, ఆన్లైన్ గేమింగ్ ఖాతాలు ఓపెన్ చేయాలంటే కనీసం 13 ఏళ్లు వయసుండాలని ఆయా సంస్థలు చెబుతున్నాయి. కానీ, 13 ఏళ్లలోపే అంటే 9–13 ఏళ్ల తమ పిల్లలు వీటిని చూస్తున్నారని 47 శాతం మంది తల్లిదండ్రులు చెప్పారు ► పట్టణప్రాంతాల్లోని 13–17 వయసు పిల్లల్లో ఈ సంస్కృతి మరీ ఎక్కువ ఉందని 44 శాతం మంది పేరెంట్స్ అభిప్రాయపడ్డారు ► సోషల్‌మీడియా ఖాతా తెరిచేందుకు కనీస వయసును 13 ఏళ్లకు బదులు 15 ఏళ్లుగా సవరించాలని 68 శాతం మంది తల్లిదండ్రులు కోరుకుంటున్నారు. ► ఆన్లైన్ తరగతులు, కొత్త విషయాలను నేర్చుకోవడంతోపాటు వినోదం కోసం కోవిడ్ తర్వాత ఇంటర్నెట్ను వాడుతున్న పట్టణప్రాంత చిన్నారుల సంఖ్య ఒక్కసారిగా పెరిగింది. -
చిన్నారికి తక్షణమే సర్జరీ!...ఆ రక్తం వద్దంటూ కోర్టును ఆశ్రయించిన తల్లిదండ్రులు
నాలుగు నెలల శిశువుకి గుండెకి సంబంధించిన శస్త్ర చికిత్స వెంటనే చేయాలి. ఐతే అందుకు దాతల నుంచి రక్తం తీసుకోవాల్సి ఉంటుంది. దీనికి ససేమిరా అంటు తల్లిదండ్రులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ ఘటన న్యూజిలాండ్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..న్యూజిలాండ్‌లోని నాలుగు నెలల చిన్నారికి గుండెకి సంబంధించి లైఫ్ సేవింగ్ సర్జరీ వెంటనే చేయాల్సి ఉంది. ఐతే సర్జరీ కోసం దాతల నుంచి సేకరించిన రక్తాన్ని ఉపయోగించాల్సి ఉంటుంది. అందుకు ఆ శిశువు తల్లిదండ్రులు ఆ రక్తం ఉపయోగిస్తే ఏమవుతుందో అని ఆందోళనతో హైకోర్టుని ఆశ్రయించారు. వారికి కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న వారి నుంచి సేకరించి రక్తం తమ బిడ్డకు ఎక్కించడంపై విముఖత చూపుతున్నారు. ఈ మేరకు ఆ చిన్నారి తల్లిదండ్రులు మాట్లాడుతూ...తమ బిడ్డకు తీవ్రమైన పల్మనరీ వాల్వ్ స్టెనోసిస్ ఉందని, శస్త్ర చికిత్స వెంటనే చేయాల్సి ఉందని చెప్పారు. ఐతే అందుకు ఉపయోగించే రక్తం పట్ల ఆందోళన చెందుతున్నట్లు పేర్కొన్నారు. వ్యాక్సిన్లు తీసుకున్న కలుషిత రక్తం కాకుండా మరేదైనా ఐతే తమకు అభ్యంతరం లేదంటున్నారు. ఐతే న్యూజిల్యాండ్ బ్లడ్ సర్వీస్.. దాతాలు వ్యాక్సిన్ తీసుకునే దానినిబట్టి వారి నుంచి సేకరించిన రక్తాన్ని వేరుచేయడం జరగదని స్పష్టం చేసింది. అలాగే వ్యాక్సిన్ తీసుకున్న వారి రక్తాన్ని ఉపయోగించడం ద్వారా ఏదైనా ప్రమాదం ఉందనే దానిపై ఎటువంటి ఆధారాలు కూడా లేవని పేర్కొంది. ఈ క్రమంలో ఆక్లాండ్ టె వాటు ఓరా ఆస్పత్రి డైరెక్టర్ వైద్యుడు మైక్ షెపర్డ్ మాట్లాడుతూ..".అనారోగ్యంతో ఉన్న పిల్లలను కలిగి ఉన్న తల్లిదండ్రులకు వారి సంరక్షణ కోసం తీసుకునే నిర్ణయం విషయంలో ఎంత ఆందోళన చెందుతారో అర్థం చేసుకున్నాం. శిశువు ఆరోగ్యం దృష్ట్యా పిల్లల సంరక్షణ చట్టం కింద సదరు చిన్నారిని తల్లిదండ్రుల సంరక్షణ నుంచి తప్పించి కోర్టు కస్టడీకి తీసుకోవాలి. అలాగే దానం చేసిన రక్తాన్ని ఉపయోగించేలా శస్త్ర చికిత్సకు అనుమతి ఇవ్వాలంటూ పిటీషన్ దాఖలు చేశాం. చిన్నారి ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ పిటీషన్ దాఖలు చేసినట్లు పేర్కొన్నారు." ఈ మేరకు హైకోర్టులో విచారణకు ఇరు పార్టీలు బుధవారం కోర్టులో హాజరయ్యారు. ఐతే కోర్టు వద్ద సుమారు వంద మందికి పైగా కరోనా వ్యాక్సిన్ వ్యతిరేక మద్దతుదారుల బృందం పెద్ద ఎత్తున గుమిగూడి ఉండటం గమనార్హం. న్యూజిల్యాండ్ ధర్మాసం ఏం చెబుతుందా అని అందరూ ఒకటే ఆతృతతో ఎదురుచూస్తున్నారు. (చదవండి: జలరాకాసి నోట చిక్కి.. తల్లిదండ్రుల కళ్ల ముందే తల తెగిపడింది! అంతలోనే..) -
అమ్మ..నాన్నను చంపేశాడు.. ఏమీ ఎరుగనట్లు మంచం మీద పడుకుని..
సాక్షి, చెన్నై: కనిపెంచిన తల్లిదండ్రులను.. వృద్ధులనే కనికరం కూడా లేకుండా ఓ కుమారుడు కిరాతకంగా హతమార్చాడు. వారి మృతదేహాలతో రెండు రోజులు కాలం గడిపాడు. చివరకు దుర్వాసన రావడంతో ఈ హత్య సోమవారం వెలుగులోకి వచ్చింది. వివరాలు.. తంజావూరు జిల్లా కుంభ కోణం సమీపంలోని పట్టీశ్వరం గ్రామానికి చెందిన గోవిందరాజ్(80), లక్ష్మీ(73) దంపతులకు ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉండేవారు. పెద్దకుమారుడు రవిచంద్రన్ అగ్నిమాపక శాఖలో పనిచేస్తూ ప్రమాదం రూపంలో గతంలో మరణించాడు. ఇక, కుమార్తె గీత పెళ్లయిన కొన్నాళ్లకు మరణించింది. రెండో కుమారుడు రాజేంద్రన్(45)కు వివాహం కాలేదు. ఇతడు తల్లిదండ్రులతో కలిసి తిల్లయంబూరులో నివాసం ఉన్నాడు. తనకు పెళ్లి కాలేదన్న వేదనతో మానసికంగా కృంగి ఓ రోగిగా మారాడు. దీంతో తరచూ తల్లిదండ్రులతో గొడవపడేవాడు. వారిద్దరిని చితక్కొట్టేవాడు. మళ్లీ పశ్చాత్తాపంతో వారి వద్దే ఉండేవాడు. ఈ నేపథ్యంలో శనివారం తల్లిదండ్రులతో అతడుగొడవ పడ్డ శబ్దం ఇరుగు పొరుగు వారి చెవిన పడింది. అయితే, రోజు జరిగే గొడవే కాదా..? అని మిన్నుకుండి పోయారు. చదవండి: (పెళ్లయి 13 రోజులే.. బెడ్రూంలో ఉరేసుకుని నవవధువు..) ఏమీ ఎరగనట్లు.. ఈ గొడవలో రాజేంద్రన్ ఉన్మాదిగా మారిపోయాడు. ఇంటిలో ఉన్న వేట కొడవలితో తల్లిదండ్రులు ఇద్దరినీ అతి కిరాతకంగా చంపేశాడు. తల,కాలు, చేతులపై ఇష్టం వచ్చినట్లు నరికేశాడు. ఆ ఇద్దరు మరణించడంతో ఆందోళన చెందాడు. అయితే, ఏమీ ఎరుగనట్లుగా ఆ మృతదేహాలతో రెండు రోజులు కాలం గడిపాడు. ఉదయాన్నే నిద్ర లేవడం స్నానం చేయడం, పంచే, చొక్క ధరించడం ఇంట్లో ఉన్న ఏదో ఆహారం తింటూ బయటి వ్యక్తులకు కనిపించాడు. దీంతో ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. ఈ సోమవారం ఉదయం తీవ్ర దుర్వాసన రావడంతో ఇరుగు పొరుగు వారికి అనుమానం వచ్చింది. అదే సమయంలో ఇంటి తలుపులన్నీ రాజేంద్రన్ మూసివేశాడు. సమాచారం అందుకున్న పట్టీశ్వరం పోలీసులు రాజేంద్రన్ ఇంటి తలుపులు పగుల కొట్టి లోనికి వెళ్లారు. అక్కడి దృశ్యాలు పోలీసులను ఆందోళనలో పడేశాయి. తల్లిదండ్రులను అతి కిరాతకంగా నరికి చంపేసి ఏమీ ఎరుగనట్లు మంచం మీద పడుకుని ఉన్న రాజేంద్రన్‌ను గుర్తించారు. అతడిని విచారించగా తానే హతమార్చినట్టు అంగీకరించాడు. ఏం చేయాలో తెలియక ఇంట్లోనే మృతదేహాలతో పాటే ఉన్నట్లు అంగీకరించాడు. దీంతో మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కుంభకోణం ఆసుపత్రికి పోలీసులు తరలించారు. వైద్యపరీక్షల అనంతరం రాజేంద్రన్‌ను అరెస్టు చేసి ప్రశి్నస్తున్నారు. -
అస్తమానం టీవీ చూస్తున్న పిల్లాడు.. తల్లిదండ్రులు ఏం చేశారంటే..?
బీజింగ్: 8 ఏళ్ల కుమారుడు అస్తమానం టీవీ చూస్తున్నాడని కఠిన శిక్ష విధించారు చైనాకు చెందిన తల్లిదండ్రులు. అయితే వీరి తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. చిన్న పిల్లలతో ఇలాగేనా ప్రవర్తించేది అని పలువురు మండిపడ్డారు. సెంట్రల్ చైనా హునాన్ ప్రావిన్స్‌లో నివసించే ఈ జంట పని మీద బయటకు వెళ్తూ హోం వర్క్ పూర్తి చేసి ఆ తర్వాత పడుకోమని తమ కుమారుడికి చెప్పింది. అయితే వాళ్లు బయటకు వెళ్లి తిరిగి వచ్చే సరికి ఆ బాలుడు టీవీ చూస్తున్నాడు. అంతేకాకుండా హోం వర్క్ కూడా పూర్తి చేయలేదు. దీంతో తల్లిదండ్రులకు కోపం వచ్చింది. ఫలితంగా రాత్రంతా టీవీ చూస్తూనే ఉండాలని కుమారుడికి శిక్ష విధించారు. అతడు పడుకోకుండా ఇద్దరూ తరచూ అతడ్ని గమనించారు. అయితే మొదట స్నాక్స్ తింటూ హాయిగా టీవీ చూసిన పిల్లాడికి కాసేపయ్యాక అలసట వచ్చింది. ఫలితంగా తనవల్ల కాదని ఏడ్చాడు. కానీ తల్లిదండ్రులు మాత్రం ఉదయం 5 గంటల వరకు నిద్రపోనివ్వకుండా అతడ్ని టీవీ ముందే కూర్చోబెట్టారు. ఈ తల్లిదండ్రుల పేరెంటింగ్‌పై చైనాలో పెద్ద చర్చే మొదలైంది. ఈ శిక్ష చాలా కఠినంగా ఉందని, పిల్లాడికి ఒకవేళ ఇదే అలవాటై రోజు ఆలస్యంగా పడుకుని, ఉదయం కూడా ఆలస్యంగా నిద్ర లేస్తే ఏం చేస్తారని కొందరు ప్రశ్నించారు. చైనాలో పేరెంటింగ్ సమస్యలు పెరిగి ప్రభుత్వం కొత్త చట్టాన్నే తీసుకువచ్చింది. తల్లిదండ్రులు పిల్లల్ని ఎలా పెంచాలి, ప్రవర్తన ఎలా ఉండాలి అనే విషయాలపై అవగాహన కార్యక్రమాలు కూడా చేపట్టింది. పిల్లలు నేరాలు చేసినా, తప్పుగా ప్రవర్తించినా వాళ్లను హింసించకుండా మార్పు తీసుకురావాలని నిబంధనలు ఉన్నాయి. చదవండి: ఎలాన్ మస్క్ తీరుతో అసంతృప్తి.. ట్విట్టర్‌కు అధికార పార్టీ గుడ్‌బై.. -
‘ఐటీ’ టెన్షన్.. రహస్య ప్రాంతాలకు కీలక డాక్యుమెంట్లు, హార్డ్ డిస్క్‌లు
సాక్షి, హైదరాబాద్: నగరంలోని కొన్ని ఇంజినీరింగ్ కాలేజీలకు ‘ఐటీ’ టెన్షన్ పట్టుకుంది. ఎప్పుడు ఏ కాలేజీపై ఇన్‌కం ట్యాక్స్ ఆఫీసర్లు దాడి చేయనున్నారో తెలియక ఆందోళన చెందుతున్నారు. అధికార, ప్రతిపక్ష నేతల ఇళ్లపై ఐటీ రైడ్స్ జరుగుతుండటం, శివారు జిల్లాల్లోని మెజార్టీ కాలేజీలు రాజకీయ నేతలు, వారి బినామీలు, బంధువులకు సంబంధించినవే కావడం ఇందుకు కారణం. శివారులోని ఓ ప్రముఖ ప్రజాప్రతినిధి సమీప బంధువుకు సంబంధించిన పెట్టుబడులు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఆ ప్రజాప్రతినిధి సహా బంధువుల ఇళ్లలో ఐటీ సోదాలు నిర్వహిస్తుండటం, వారు పెట్టుబడులు పెట్టిన కాలేజీలు, ఆస్పత్రులు, ఇతర సంస్థలపై దాడులు నిర్వహిస్తుండటంతో యాజమాన్యాలు సహా పరిపాలనా విభాగంలో పని చేస్తున్న ఉద్యోగులు ఐటీ పేరు చెబితేనే హడలెత్తిపోతుండటం గమనార్హం. మెజార్టీ కాలేజీలు వారివే.. రాష్ట్ర వ్యాప్తంగా 179 ఇంజినీరింగ్ కాలేజీలు ఉండగా, వీటిలో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లోనే 80కిపైగా ఉన్నట్లు అంచనా. మెజార్టీ కాలేజీలు అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులు, వారి బంధువులకు సంబంధించినవే. ప్రస్తుతం కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డికి సంబంధించిన కాలేజీలు, ఆస్పత్రులు, ఇతర విద్యా సంస్థలపై ఐటీ దాడులు జరుగుతున్న విషయం తెలిసిందే. ఆయనతో పాటు బంధువులు వాటాదారులుగా ఉన్న ఇతర కాలేజీల్లోని లావాదేవీలపై కూడా ఐటీ దృష్టి సారించింది. ఐటీ దాడులతో ఆయా యాజమాన్యాలు అప్రమత్తమవుతున్నాయి. ఇన్‌కం ట్యాక్స్ అధికారులు కాలేజీలో అడుగు పెట్టక ముందే కీలక డాక్యుమెంట్లు, రికార్డులు, హార్డ్ డిస్కులను రహస్య ప్రాంతాలకు తరలిస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. గత రెండు రోజుల నుంచి ఆయా కాలేజీలు గుర్తింపు కార్డు ఉన్న విద్యార్థులు, ఉద్యోగులు మినహా ఇతర వ్యక్తులను వీటి ప్రాంగణంలోకి అడుగుపెట్టనివ్వకపోవడం గమనార్హం. విద్యార్థుల తల్లిదండ్రులకు ఫోన్లు.. ఇంజినీరింగ్ విద్యకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. తమ పిల్లలను క్యాంపస్ ప్లేస్మెంట్లు ఎక్కువగా ఉండే కాలేజీల్లో చదివించేందుకు తల్లిదండ్రులు ఎక్కువ ఆసక్తి చూపుతుంటారు. విద్యార్థుల తల్లిదండ్రుల్లోని ఈ బలహీనతను యాజమాన్యాలు ఆసరాగా చేసుకుంటున్నాయి. ఎంసెట్, జేఈఈలలో ఉత్తమ ర్యాంకులు సాధించి కన్వీనర్ కోటాలో సీటు పొందిన విద్యార్థుల నుంచి కూడా ల్యాబ్, ప్రాక్టికల్స్, లైబ్రరీ, ఇతర ఫీజుల పేరుతో అధిక మొత్తంలో వసూలు చేస్తున్నాయి. విద్యార్థులు చెల్లించిన ఫీజులకు సంబంధించిన రసీదులు కూడా ఇవ్వడం లేదు. ఇక మేనేజ్మెంట్ కోటాలో ఉన్న సీట్లను ప్రభుత్వం నిర్ణయించిన ఫీజుకు పది రెట్లకు అదనంగా అమ్ముతున్నారు. వీరు ఫీజు చెల్లింపు సమయంలో బ్యాంకు చెక్కులు, ఏటీఎం, పేటీఎం సేవలను నిరాకరిస్తున్నారు. నగదు రూపంలోనే ఈ ఫీజులు వసూలు చేస్తున్నారు. తాజాగా శివారులోని ఓ ప్రముఖ కాలేజీ యాజమాన్యం సహా మేడ్చల్ జిల్లాలోని కాలేజీల నుంచి విద్యార్థుల తల్లిదండ్రులకు ఫోన్లు వస్తున్నాయి. ఐటీ అధికారులు ఫోన్ చేసి ఆరా తీస్తే.. అడ్మిషన్ సమయంలో ఎలాంటి డొనేషన్లు చెల్లించలేదని చెప్పాల్సిందిగా వారికి విజ్ఞప్తి చేస్తుండటం గమనార్హం. ‘వర్ధమాన్’లో సోదాలు.. కీలక పత్రాలు స్వాధీనం శంషాబాద్ రూరల్: మంత్రి మల్లారెడ్డి, బంధువుల ఇళ్లు, కార్యాలయాల్లో ఐటీ దాడుల్లో భాగంగా శంషాబాద్ మండలంలోని కాచారం సమీపంలో ఉన్న వర్ధమాన్ ఇంజినీరింగ్ కళాశాలలో రెండు రోజుల పాటు ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. మంత్రి అల్లుడు మర్రి రాజశేఖర్‌రెడ్డి వర్ధమాన్ కళాశాలకు వైస్ చైర్మన్‌గా ఉన్నారు. దీంతో ఈ కళాశాలలో గురువారం మధ్యాహ్నం వరకు ఐటీ అధికారులు సోదాలు జరిపారు. విద్యార్థులు, కళాశాల సిబ్బందిని మాత్రమే లోపలికి అనుమతించి ప్రత్యేక పహారాతో ఐటీ సోదాలు నిర్వహించి పలు కీలక పత్రాలను స్వా«దీనం చేసుకున్నట్లు తెలిసింది. -
అమ్మానాన్న నన్ను క్షమించండి..
చందుర్తి (వేములవాడ): ఎప్పుడో విడిపోయిన తల్లిదండ్రులను కలపడానికి ప్రయత్నించి విఫలమైన ఒక కొడుకు.. మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన రాజన్నసిరిసిల్ల జిల్లా చందుర్తి మండలంలో జరిగింది. ఈ విషాద ఘటనపై పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఆశిరెడ్డిపల్లెకు చెందిన కట్కూరి ప్రశాంత్ (23) ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. తల్లిదండ్రులు నర్సయ్య, నాగవ్వ పదిహేనేళ్ల క్రితం విడిపోయారు. అప్పటి నుంచి తల్లి.. అమ్మమ్మ గ్రామం వేములవాడ మండలం హన్మాజిపేటలో కూలి పనులు చేసుకుంటూ జీవిస్తోంది. తల్లిదండ్రుల ఎడబాటుతో ఎంతో జీవితాన్ని కోల్పోయానని భావించిన కొడుకు ప్రశాంత్.. తల్లి వద్దకు వెళ్లి ఇంటికి రావాలని కోరాడు. ఇందుకు తల్లి నిరాకరించడంతో మనస్తాపానికి గురయ్యాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో బుధవారం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుని తండ్రి ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రమేశ్ తెలిపారు. -
తల్లిదండ్రులకు గుడి కట్టిన తనయుడు
విడవలూరు: తల్లిదండ్రులపై ఉన్న మమకారంతో కుమారుడు తన తల్లిదండ్రులకు గుడి కట్టి అందులో విగ్రహాలను ప్రతిష్టించారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డి పాళెం మండలంలోని నాగమాంబపురం పంచాయతీ పరిధిలోని కొట్టాలకి చెందిన పుట్టా సుబ్రమణ్యంనాయుడు (జొన్నవాడ ఆలయ చైర్మన్) గ్రామంలో తన సొంత స్థలంలో తల్లిదండ్రులకు గుడి కట్టించాడు. తన తల్లి పుట్టా సుబ్బమ్మ మొదటి వర్థంతి సందర్భంగా నూతనంగా నిర్మించిన గుడిలో తన తండ్రి పుట్టా రామయ్య, తల్లి పుట్టా సుబ్బమ్మ విగ్రహాలను ప్రతిష్టించారు. అనంతరం గ్రామస్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. -
ఇదెక్కడి న్యాయం.. బతకాలని లేదు!
పదేళ్ల కిందటినాటి కేసులో అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పుపై.. యావత్ దేశం రగిలిపోతోంది. కళ్లలో యాసిడ్‌పోసి.. జనానాంగాల్లో సీసాలు జొప్పించి అతికిరాతంగా హత్య చేశారామెను. అలాంటి కేసులో మరణ శిక్ష పడ్డ ఖైదీలను నిర్దోషులుగా ప్రకటించింది సుప్రీం కోర్టు. ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ లలిత్ ఆఖరిరోజు ఇచ్చిన తీర్పుల్లో ఇది ఒకటి కావడం గమనార్హం. 2012 చావ్లా గ్యాంగ్ రేప్ అండ్ మర్డర్ కేసులో నేరారోపణలను ప్రాసిక్యూషన్ వారు నిరూపించని కారణంగానే.. మరణ శిక్ష పడ్డ ఆ ముగ్గురు ఖైదీలను విడుదల చేస్తున్నట్లు చీఫ్ జస్టిస్ లలిత్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం సోమవారం తీర్పు ఇచ్చింది. వారిని దోషులుగా నిర్ధారించే సమయంలో దిగువ న్యాయస్థానం సైతం పారదర్శకత లేకుండా వ్యవహరించిందని బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద వాళ్లను నిర్దోషులుగా ప్రకటించినట్లు వెల్లడించింది. ఏడేళ్లుగా సుప్రీం కోర్టులో ఈ కేసు విచారణ కొనసాగగా.. తీర్పుపై బాధితురాలి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. తీర్పు తమకు దిగ్భ్రాంతి కలిగించిందని ఓ జాతీయ మీడియా ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ‘‘ఇది మాకు పెద్ద ఎదురు దెబ్బ. న్యాయం జరుగుతుందనే ఇక్కడికి(సుప్రీం కోర్టు) వచ్చాం. న్యాయవ్యవస్థ మీద నమ్మకమే మమ్మల్ని ఇక్కడికి రప్పించింది. కానీ, అది నెరవేరలేదు. చట్టం ఇలాగే ఉంటే.. ఇంక న్యాయవ్యవస్థ మీద నమ్మకం ఎవరికి ఉంటుంది?.. న్యాయం జరగకపోవడం వల్లే కదా ఇంకా ఇలాంటి నేరాలు పెరిగిపోతాయ్. మా బిడ్డకు న్యాయం జరుతుందని వచ్చాం. కానీ, మా గుండెలు బద్ధలయ్యాయి. ఇదేనా న్యాయమంటే?. పదకొండేళ్లపాటు పోరాడిన మాకు దక్కిన తీర్పు ఇదా? పోరాటంలో మేం ఓడినట్లేనా? అసలు మాకు బతకాలనే లేదు. కానీ, ఇన్నాళ్లు ఒపిక పట్టిన మేం.. వెనక్కి వెళ్లాలని అనుకోవడం లేదు. కచ్చితంగా పోరాడతాం.. ముందుకెళ్తాం అని పేర్కొన్నారు. ఇక కోర్టు తీర్పు కాపీని అందుకున్నాకే.. రివ్యూ పిటిషన్‌కు వెళ్తామని బాధితుల తరపు న్యాయవాది పేర్కొన్నారు. కోర్టు తీర్పు మాకు ఆశ్చర్యం కలిగింది. ఏడేళ్ల తర్వాత.. అదీ నేను గట్టిగా అడిగిన తర్వాతే కోర్టు విచారణ ముందుకు కదిలింది. వారంలోపే.. అదీ సీజేఐ ఆఖరి రోజున ఇలాంటి తీర్పు వచ్చింది. ఈ కేసులో వెనక్కి వెళ్లం.. తీర్పుపై పునసమీక్షకు వెళ్తాం అని ఆమె పేర్కొన్నారు. అంతకు ముందు సీజేఐ నేతృత్వంలోని.. ముగ్గురు సభ్యులతో కూడిన ధర్మాసనం ముగ్గురిని నిర్దోషులుగా ప్రకటించింది. హేతుకమైన సందేహం లేకుండా అభియోగాలను రుజువు చేయడంలో ప్రాసిక్యూషన్ విఫలమైందని చీఫ్ జస్టిస్ యుయు లలిత్ నేతృత్వంలోని సుప్రీం కోర్టు బెంచ్ అభిప్రాయపడింది. అంతేకాదు.. కోర్టు విచారణ సమయంలోనూ లోపాలు స్పష్టంగా గమనించామని, 49 సాక్ష్యుల్లో పది మందిని విచారించలేదని ధర్మాసనం తెలిపింది. అంతేకాదు.. న్యాయస్థానాలు చట్టపరిధిలో ఉండాలే తప్ప.. బయటి నుంచి వచ్చే నైతిక ఒత్తిళ్లకు తలొగ్గకూడదనే అభిప్రాయం వెలుబుచ్చింది. ఢిల్లీ పోలీసుల కథనం ప్రకారం.. గురుగావ్‌లో పని చేసే 19 ఏళ్ల యువతిని.. 2012 ఫిబ్రవరి 9వ తేదీన తనతో శారీరక సంబంధానికి ఒప్పుకోలేదన్న కారణంతో ముగ్గురు నిందితుల్లో ఒకడైన వ్యక్తి.. ఎత్తుకెళ్లి మూడు రోజులపాటు చిత్రహింసలకు గురి చేశాడు. ఆపై మృగచేష్టలతో సామూహికంగా హత్యాచారానికి పాల్పడ్డారు. మూడు రోజుల తర్వాత శవాన్ని హర్యానా శివారులో పడేసి వెళ్లిపోయారు. కుళ్లిపోయిన స్థితిలో దొరికిన ఆమె మృతదేహానికి శవపరీక్ష నిర్వహించి.. షాకింగ్‌కు గురి చేసే విషయాలు బయటపెట్టారు వైద్యులు. ఆపై నిందితులు ముగ్గురిని అరెస్ట్ చేయగా.. 2014లో ఢిల్లీ కోర్టు, ఆపై హైకోర్టు కూడా ఈ మానవ మృగాలకు సంఘంలో తిరిగే హక్కు లేదంటూ మరణ శిక్ష విధించాయి. చివరికి.. అత్యున్నత న్యాయస్థానం తీర్పుతో ఆ ముగ్గురు నిర్దోషులుగా బయటకు రాబోతున్నారు!. సంబంధిత వార్త: భావోద్వేగాలకు.. సెంటిమెంట్లకు చోటు లేదిక్కడ! -
తల్లిదండ్రులను వేధించిన కొడుకు.. రూ.8 లక్షల సుపారీతో ఖతం చేయించిన ఫ్యామిలీ
సాక్షి, హుజూర్నగర్/ఖమ్మం: సూర్యాపేట జిల్లాలో ఇటీవల వెలుగుచూసిన గుర్తుతెలియని యువకుడి హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. మాదకద్రవ్యాలకు అలవాటు పడి వేధిస్తున్న కుమారుడిని తల్లిదండ్రులే సుపారీ గ్యాంగ్‌తో హత్య చేయించినట్లు తేలింది. కేసు వివరాలను సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో సోమవారం సీఐ రామలింగారెడ్డి వెల్లడించారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లికి చెందిన క్షత్రియ రామ్‌సింగ్, రాణిబాయి దంపతులు ప్రస్తుతం ఖమ్మంలో ఉంటున్నారు. వీరి కుమారుడు సాయినాథ్ (26) మద్యం, మాదకద్రవ్యాలకు అలవాటు పడి తల్లిదండ్రులను వేధిస్తుండగా, ఆయనను తుదముట్టించాలని నిర్ణయించుకున్నారు. రాణిబాయి తమ్ముడైన మిర్యాలగూడకు చెందిన సహదేవుల సత్యనారాయణను సంప్రదించడంతో ఆయన మిర్యాలగూడ మండలం ధీరావత్ తండాకు చెందిన రమావత్ రవి, పానుగోతు నాగరాజు, బురుగు రాంబాబు, ధరావత్ సాయికి రూ.8లక్షలు ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నారు. ఇందులో రూ.1.5లక్షలు అడ్వాన్స్ ఇచ్చారు. ఈక్రమంలో రెండు సార్లు సాయినాథ్‌పై హత్యాయత్నం చేసినా విఫలమయ్యారు. మూడోసారి.. సాయినాథ్ మేనమామ సత్యనారాయణ సహకారంతో సుపారీ గ్యాంగ్ సభ్యులు ఆయనను అక్టోబర్ 17న రాత్రి ఖమ్మం నుంచి మిరాల్యగూడకు తీసుకొచ్చారు. మరుసటి రోజు కల్లేపల్లి శివారు మైసమ్మ గుడి వద్ద మద్యం తాగించి ప్లాస్టిక్ తాడుతో ఉరివేసి హత్య చేశారు. అదేరోజు రాత్రి మృతుడి కారులోనే మృతదేహాన్ని తీసుకెళ్లి పాలకవీడు మండలంశూన్యంపహాడ్ శివారు మూసీ నదిలో వేసి వెళ్లిపోయారు. కాగా, 19వ తేదీన మృతదేహం తేలడంతో పంచాయతీ కార్యదర్శి ఫిర్యాదు మేరకు ఎస్సై సైదులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వాహనం నంబర్ ఆధారంగా... ఘటనాస్థలం సమీపంలోని సీసీ కెమెరాల పుటేజీని పరిశీలించగా ఓ కారు వచ్చి వెళ్లినట్లు గుర్తించారు. దీంతో వాహనం నంబర్ ఆధారంగా పరిశీలించి సాయినాథ్ కారుగా తేలడంతో ఆచూకీ కోసం ఆరా తీస్తుండగానే, ఆయన తల్లిదండ్రులు అదే కారులో మృతదేహాన్ని తీసుకెళ్లడానికి వచ్చారు. దీంతో అనుమానించిన పోలీసులు రామ్‌సింగ్ – రాణిబాయిని అదుపులోకి తీసుకుని విచారించగా విషయం బయటపడింది. సాయి తల్లిదండ్రులతో పాటు పాత్రధారులైన ఐదుగురిని అరెస్ట్ చేసి, నాలుగు కార్లు, రూ.23,500 నగదు స్వాధీనం చేసుకున్నారు. మరో నిందితుడు పరారీలో ఉన్నారని సీఐ వివరించారు. కేసు విచారణలో కీలకంగా వ్యవహరించిన ఎస్సై సైదులు, సిబ్బంది అంజయ్య, వెంకటేశ్వర్లు, ఉపేందర్, జానీ పాషాను సీఐ అభినందించారు. -
తండ్రిని చంపితే రూ.3 లక్షలు.. తల్లిని కూడా చంపితే రూ.5 లక్షలు!
నెల్లూరు (క్రైమ్): దొంగతనం కేసులో అరెస్టయిన ఇద్దరు నిందితులను పోలీసులు విచారించగా.. తల్లిదండ్రులను హతమార్చేందుకు వారి కుమారుడు.. కిరాయి ఇచ్చిన వైనం వెలుగులోకొచ్చింది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఎస్పీ సీహెచ్ విజయారావు శనివారం మీడియాకు వివరాలు వెల్లడించారు. బుచ్చిరెడ్డిపాళెం పోలీస్‌స్టేషన్ పరిధిలో దొంగతనాలకు పాల్పడిన వారి కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. చోరీ జరిగిన ప్రదేశాల్లో లభ్యమైన ఆధారాల ఆధారంగా పాతనేరస్తులైన ముత్తుకూరు మండలం బ్రహ్మదేవంకు చెందిన షేక్ గౌస్‌బాషా, బుచ్చిపట్టణం ఖాజానగర్‌కు చెందిన షేక్ షాహూల్‌ను శుక్రవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించగా ఐదు దొంగతనాలతో పాటు కావలి రూరల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో కిరాయి హత్యకు రెక్కీ నిర్వహించినట్టు వెల్లడించారు. దీంతో పోలీసులు నిందితులిద్దరినీ అరెస్ట్ చేసి వారి నుంచి రూ 2.95 లక్షలు విలువచేసే బంగారం, రూ.30వేలను స్వాధీనం చేసుకున్నారు. మూడు సార్లు రెక్కీ కావలి పట్టణం తుఫాన్‌నగర్‌కు చెందిన బాలకృష్ణయ్యకు భార్య, ఇద్దరు కుమారులున్నారు. ఇద్దరు కుమారులకు ఆయన గతంలో సమానంగా ఆస్తి పంచాడు. అయితే తనకు సరిగా పంచలేదని లక్ష్మీనారాయణ తండ్రితో గొడవ పడుతుండేవాడు. ఈ క్రమంలో తల్లిదండ్రులను అడ్డుతొలగించుకుంటే వారి పేర ఉన్న ఆస్తి తనకు దక్కుతుందని లక్ష్మీనారాయణ భావించాడు. తన స్నేహితుడైన కావలికి చెందిన సుబ్బారావుకు విషయం తెలిపాడు. అతడి ద్వారా పాతనేరస్తుడు షేక్ షఫీ ఉల్లాను సంప్రదించాడు. తండ్రిని హత్య చేస్తే రూ.3 లక్షలు, తల్లిదండ్రులిద్దరినీ చంపితే రూ.5 లక్షలు ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. దీంతో షఫీఉల్లా గతంలో జైల్లో ఉన్న సమయంలో పరిచయమైన గౌస్ బాషా, షేక్ షాహుల్‌తో కలిసి కిరాయి హత్యకు పథకం రచించారు. లక్ష్మీనారాయణ నిందితులకు అడ్వాన్స్ కింద రూ.30 వేలు, కత్తులను ఇచ్చాడు. నిందితులు మూడుసార్లు బాలకృష్ణయ్య ఇంటివద్ద రెక్కీ నిర్వహించారు. అదును కోసం వేచి చూస్తున్నామని పోలీసుల విచారణలో వెల్లడించారు. ఈ విషయం పోలీసుల ద్వారా తెలుసుకున్న బాలకృష్ణయ్య శుక్రవారం రాత్రి కావలి రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితులపై శనివారం పోలీసులు కేసు నమోదు చేశారు. లక్ష్మీనారాయణ, పి.సుబ్బారావు, షేక్ షఫీ ఉల్లాను శనివారం అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి కత్తులను స్వాధీనం చేసుకున్నారు. చదవండి: భార్యను హత్య చేసి.. ఆపై చెరువులో పడేసి.. -
‘మా పిల్లల్ని మరో స్కూల్‌కు పంపించం.. డీఏవీ పాఠశాలనే రీ ఓపెన్ చేయాలి’
సాక్షి, హైదరాబాద్: బంజారాహిల్స్ రోడ్డు నంబర్– 14లోని డీఏవీ పబ్లిక్ స్కూల్‌ను ఇక్కడే రీ ఓపెన్ చేయాలని ఇందుకోసం మూడు ఆప్షన్లు ఇస్తూ తల్లిదండ్రులు అల్టిమేటం జారీ చేశారు. ఆదివారం బంజారాహిల్స్‌లోని కేబీఆర్ పార్కు వద్ద డీఏవీ స్కూల్‌కు చెందిన సుమారు 200 మంది తల్లిదండ్రులు సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై పలు నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వానికి తాము మూడు ఆప్షన్లు ఇస్తున్నామన్నారు. చైల్డ్ వెల్ఫేర్ నుంచి ఒక అధికారి, పేరెంట్స్ కమిటీ నుంచి ఒకరు, ప్రభుత్వం నుంచి మరొకరు, స్కూల్ మేనేజ్మెంట్ నుంచి ఒకరు చొప్పున కమిటీ ఏర్పాటు చేసి ఇక్కడే స్కూల్ తెరవాలన్నారు. ప్రభుత్వం ఇచ్చిన రెండు ఆప్షన్లకు ఏ రకంగానూ తాము ఒప్పుకోవడం లేదన్నారు. సీబీఎస్ఈ విద్యార్థులను స్టేట్ సిలబస్ పాఠశాలల్లోకి చేర్చడం కుదరని పని అన్నారు. మెరీడియన్ స్కూల్లో చేర్చడానికి కూడా అది తాహత్తుకు మించిన వ్యవహారమవుతుందని తల్లిదండ్రులు ముక్తకంఠంతో స్పష్టం చేశారు. తల్లిదండ్రుల అభిప్రాయం తీసుకొని ఆ మేరకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. సీబీఎస్ఈ స్కూళ్లలో సర్దుబాటు చేస్తాం ! బంజారాహిల్స్‌లోని డీఏవీ విద్యార్థులను సీబీఎస్ఈ స్కూళ్లలోనే సర్దుబాటు చేయాలని నిర్ణయించినట్లు విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. దీపావళి తర్వాత విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశాలు నిర్వహించేందుకు చర్యలకు తీసుకుంటామంటున్నారు. నాలుగేళ్ల చిన్నారిపై లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో డీఏవీ పాఠశాల గుర్తింపు రద్దుతో పాటు పాఠశాలను మూసి వేయడంతో విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆందోళన రగులుకుంది. ఈ పాఠశాల విద్యార్థులను ఇతర పాఠశాలల్లో సర్దుబాటు చేసేందుకు విద్యాశాఖ అధికారులు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. కాగా.. విద్యార్థుల తల్లిదండ్రులు మాత్రం పాఠశాల మూసివేత, ఇతర పాఠశాలల్లో సర్దుబాటును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ పాఠశాలకు అయిదు కిలో మీటర్ల పరిధిలోని స్కూల్స్ మేనేజ్మెంట్లతో సంప్రదిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. త్వరలో తల్లిదండ్రులతో సమావేశాలు నిర్వహించి ఆయా స్కూళ్లను ఎంపిక చేసుకునే వెసులుబాటు కల్పిస్తామంటున్నారు. వారి అభీష్టం మేరకు ఆయా స్కూళలో చేరి్పంచే విషయంపై నిర్ణయం తీసుకుంటామని హైదరాబాద్ డీఈఓ రోహిణి స్పష్టం చేశారు. మంత్రి సబితారెడ్డికి కృతజ్ఞతలు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మా బాధలు వింటూ తగిన రీతిలో చర్యలు తీసుకుంటున్నారు. స్కూల్ ఇక్కడే రీ ఓపెన్ చేయాలని కోరుతున్నాం. – అంజిబాబు, పేరెంట్ చాలా సమస్యలు వస్తాయి.. వేరే స్కూల్లో చేర్చడమంటే చాలా సమస్యలు వస్తాయి. అక్కడి వాతావరణం అలవాటు పడటం మరింత కష్టం. ఆన్లైన్ క్లాస్‌లకు మేం ఒప్పుకోం. – సుజాత, పేరెంట్ డ్రైవర్‌ను ఉరి తీయాలి పిల్లలు మరో పాఠశాలకు వెళ్లడం కుదరదు. అడ్మిషన్లు, ఫీజులు ఎక్కువగా ఉంటాయి. అంత ఫీజులు చెల్లించుకోలేం. కొత్త మేనేజ్మెంట్తో డీఏవీ స్కూల్‌నే కొనసాగించాలి. – మాతంగి హంస, పేరెంట్ -
ప్రేమిస్తే చంపేస్తారు!
యశవంతపుర: ప్రేమిస్తే కుటుంబ పరువు ప్రతిష్టల పేరుతో కన్నబిడ్డలనే ప్రాణాలు తీసే ఉదంతాలు రాష్ట్రంలో విస్తరిస్తున్నాయి. తాజాగా ప్రేమ జంట హత్యకు గురైన సంఘటన బాగలకోట జిల్లాలో జరిగింది. జిల్లాలోని బేవినమట్టి గ్రామంలో బాలికను, ఆమె ప్రియున్ని బాలిక కుటుంబ సభ్యులే హతమార్చారు. వివరాలు.. గ్రామంలో నివసించే బాలిక, విశ్వనాథ నెలగి (22) అనే యువకుడు ప్రేమలో పడ్డారు. ఇది బాలిక కుటుంబానికి ఎంత మాత్రం ఇష్టం లేదు. అతన్ని ప్రేమించవద్దని బాలికకు పలుమార్లు నచ్చజెప్పినా పట్టించుకోలేదు. దీంతో ఆమె తండ్రి పరసప్ప, సోదరుడు రవి హుల్లణ్ణవర(19), బావ హనుమంత మల్నాడద (22), మరో బంధువు బీరప్ప దళవాయి(18)లు కలిసి ఆ జంటను హత్య చేయాలని పథకం వేశారు. పెళ్లి చేస్తామని నమ్మించి దారుణం తమ కుట్ర ప్రకారం ప్రేమ జంటకు పెళ్లి చేస్తామని నమ్మించారు. అక్టోబరు 1వ తేదీన గదగ జిల్లా నరగుందలో ఉన్న విశ్వనాథ నెలగిని, బేవినమట్టిలో ఉన్న బాలికను నిందితులు కారులో తీసుకెళ్లారు. వాహనంలోనే బాలిక గొంతుకు చున్నీతో బిగించి, యువకున్ని తీవ్రంగా కొట్టి బండరాయితో బాది ప్రాణాలు తీశారు. అనంతరం శవాల నుంచి వ్రస్తాలను తొలగించి ఆలమట్టి రోడ్డులోని వంతెనపై నుంచి కృష్ణానదిలో పడేసి ఊరికి వెళ్లిపోయారు. విచారణలో వెలుగులోకి కొడుకు కనిపించకపోవడంతో యువకుని తండ్రి ఈ నెల 3న నరగుంద పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మరోవైపు 11వ తేదీన కూతురు మిస్సయిందని ఆమె స్థానిక పోలీసులకు ఫిర్యాదు ఇచ్చాడు. ఈ నెల 15 బాగల్‌కోట గ్రామీణ పోలీసులు అనుమానం వచ్చి రవి హుల్లణ్ణవరను అదుపులోకి తీసుకొని విచారించారు. తమ కుటుంబ పరువు పోతుందని భావించి హత్య చేశామని ఒప్పుకున్నాడు. దీంతో మిగతా నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపారు. కృష్ణానదిలో పడవేసిన ఇద్దరి మృతదేహాలు ఇప్పటికీ దొరకలేదు. (చదవండి: చీకటి గదిలో బంధించి, బలవంతంగా పెళ్లి) -
ఐదు నెలల ఉత్కంఠకు తెర! ఆ అమ్మను నేనే..
అనంతపురం సెంట్రల్/చిలమత్తూరు: ఐదు నెలల ఉత్కంఠకు తెరపడింది. అనాథ శిశువుగా శిశుగృహకు చేరుకున్న చిన్నారి ఎట్టకేలకు తల్లిదండ్రుల వద్దకు చేరుకుంది. అసలేం జరిగిందంటే... సరిగ్గా ఐదునెలల క్రితం (జూన్ 7న) చిలమత్తూరులో ముళ్లపొదల మధ్యన నవజాత మగ శిశువు లభ్యమైంది. స్థానికులు గుర్తించి సమాచారం అందించడంతో అక్కడి పోలీసులు వెంటనే స్పందించారు. శిశువును వెంటనే కాపాడి ఆస్పత్రికి తీసుకెళ్లారు. అనంతరం ఐసీడీఎస్ అధికారుల సమక్షంలో అనంతపురంలోని శిశుగృహకు చేర్చారు. ఉత్కంఠకు తెర పెనుకొండ నియోజకవర్గంలోని ఓ మండలానికి చెందిన దంపతులు బతుకు తెరువు కోసం చిలమత్తూరుకు చేరుకున్నారు. అప్పటికే ఆమె నిండు గర్భిణి. బహిర్భూమికి వెళ్లిన సమయంలో ఆమెకు ప్రసవమైంది. ఆ సమయంలో ఆమె మతిస్థిమితం లేక నవజాత శిశువును వదిలేసి ఇంటికి చేరుకుంది. అదే రోజు సాయంత్రం విషయం తెలుసుకున్న భర్త వెంటనే చిలమత్తూరు పోలీసులను ఆశ్రయించాడు. అప్పటికే శిశువును శిశుగృహకు అప్పగించినట్లు పోలీసులు తెలపడంతో అనంతపురం చేరుకుని ఐసీడీఎస్ అధికారులను సంప్రదించాడు. అయితే తమ బిడ్డేననే ఆధారాలు చూపలేకపోవడంతో శిశువు అప్పగింతకు అధికారులు అంగీకరించలేదు. దీంతో తండ్రి జిల్లా న్యాయసేవాప్రాధికార సంస్థను ఆశ్రయించాడు. న్యాయమూర్తి ఆదేశాల మేరకు శిశువుకు ఐసీడీఎస్ అధికారులు డీఎన్ఏ పరీక్షలు చేపట్టారు. ఈ పరీక్షకు సంబంధించిన నివేదిక గురువారం ఐసీడీఎస్ అధికారులకు అందింది. అందులో శిశువు తల్లిదండ్రులు వారేనని రుజువైంది. దీంతో తల్లిదండ్రులకు గురువారం సీడబ్ల్యూసీ చైర్పర్సన్ రామలక్ష్మి సమక్షంలో ఐసీడీఎస్ పీడీ బీఎన్ శ్రీదేవి అప్పగించారు. శిశుగృహ సిబ్బందికి అభినందన తల్లి పొత్తిళ్లలో ఉండాల్సిన తరుణంలో ముళ్లపొదల మధ్య నుంచి నేరుగా తమ చెంతకు చేరుకున్న శిశువును శిశుగృహ సిబ్బంది కంటికి రెప్పలా చూసుకున్నారు. దాదాపు ఐదు నెలల పాటు బిడ్డ ఆరోగ్యంపై అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. చివరకు తల్లిదండ్రులకు శిశువును అప్పగిస్తున్న తరుణంలో శిశుగృహ సిబ్బంది కాసింత ఉద్వేగానికి లోనయ్యారు. ఈ సందర్భంగా వారిని సీడబ్ల్యూసీ చైర్పర్సన్ రామలక్ష్మీ, సభ్యులు ఓబుళపతి, కామేశ్వరి, ఐసీడీఎస్ పీడీ శ్రీదేవి, చైల్డ్‌లైన్ కో–ఆర్డినేటర్ కృష్ణమాచారి తదితరులు అభినందించారు. తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో శిశుగృహ మేనేజర్ శ్రీలక్ష్మీ, ఐసీపీఎస్ ప్రొటెక్షన్ ఆఫీసర్లు వెంకటేశ్వరి, చంద్రకళ, చిలమత్తూరు పోలీసులు పాల్గొన్నారు. (చదవండి: వరద గుప్పిట్లో అనంతపురం) -
అమ్మానాన్న సరైన పేరు పెట్టలేదని.. డయల్ 100కు ఫిర్యాదు
నారాయణఖేడ్: అమ్మా.. నాన్న వీళ్ళిద్దరూ లేకుంటే మనకి ఈ జీవితం లేదు . ఈ పంచభూతాలను పరిచయం చేసిన దైవాలు వారు.. మనం ఈరోజు ఇంత స్వేచ్ఛగా జీవిస్తున్నామంటే దానికి ప్రధాన కారణం తల్లిదండ్రులే.. వారు తిన్నా.. తినకపోయినా పిల్లల కడుపును మాత్రం ఎప్పుడు నింపేందుకు తీవ్రంగా శ్రమిస్తారు.పిల్లలు పుట్టిన తర్వాత వారి బాగోగుల గురించి ఆలోచిస్తూ వారికి ఏ రకమైన బట్టలు కొనాలి? ఎం పేరు పెట్టాలి? ఏ స్కూల్లో చదివించాలి? అలా ఉన్నతమైన ఉత్తమమైనది ఎంపిక చేసి పిల్లలకి తల్లిదండ్రులు ఎప్పుడూ ది బెస్ట్ ఇస్తుంటారు.. ఇంత చేస్తున్నా ఆ తల్లిదండ్రులని నేడు యువత అర్థం చేసుకోవడంలో పూర్తిగా విఫలమవుతున్నారని చెప్పవచ్చు.. నిత్యం ఎక్కడో ఒకచోట తల్లిదండ్రుల మీద ఆకృత్యాలకు పాల్పడుతున్న పిల్లల వార్తలను మనం గమనిస్తూనే ఉన్నామ్. ఇందులో ముఖ్యంగా ఒక చోట ఏం సంపాదించి ఇచ్చారని వారిపైకి గొడవకు వెళుతున్న పిల్లలైతే.. మరో చోట అడిగింది కొనిపెట్టలేదని కక్ష పెంచుకొని ఇష్టారీతిగా ప్రవర్తిస్తున్న వారు మరికొందరు. తల్లిదండ్రులు ఎంత శ్రమిస్తే మన జీవితం ఇలా ఆనందమయంగా సాగుతుందన్న విషయాన్ని మరిచి వారిపైనే దాడికి పాల్పడుతున్న సంఘటనలు అనేకం. ఇప్పుడు మనం చర్చించుకునే ఈ వార్త ఇంకాస్త చిత్రంగా కొత్తగా అనిపించక మానదు. ఓ ప్రబుద్ధుడు తనకు మంచి పేరు పెట్టలేదని కని, పెంచిన తల్లిదండ్రులపైనే కోపం పెంచుకున్నాడు. నిత్యం వారిని ఈ విషయంలో వేధిస్తూ వాదనకు దిగేవాడు. ఈ ఆలోచన తారా స్థాయికి చేరిన ఆ యువకుడు మంచి పేరు పెట్టలేదని ఏకంగా 100 నంబర్ కు ఫోన్ చేసి తల్లిదండ్రులపైనే పోలీసులకు ఫిర్యాదు చేయడం గమనార్హం.ఈ ఫిర్యాదు అందుకున్న పోలీసులు అవాక్కయ్యారు. ఇదేంటిది.. కొత్తగా.. వింతగా అని ఆలోచించడం వారివంతయింది. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం లోని కిషన్ నాయక్ తండాలో ఇటీవల చోటు చేసుకుంది. ఇంతకీ ఆ యువకుడి పేరు ఏంటో తెలుసా.. కర్ర సురేష్. అతడి వయసు 23 సంవత్సరాలు. కాగా పోలీసులు ఈ విషయంపై మాట్లాడుతూ ఇలాంటి అంశాలపై ఫిర్యాదు చేసి విలువైన సమయాన్ని వృథా చేయవద్దని, ఇలా చేయడం వల్ల అత్యవసరంలో ఉన్న వారికి ఫోన్ లైన్ దొరక్క ఇబ్బందులు పడే అవకాశం ఉందని పోలీసులు హెచ్చరించారు. -
కసాయి కొడుకు... కన్న తల్లిదండ్రులనే చంపేందుకు యత్నం
న్యూఢిల్లీ: 34 ఏళ్ల వ్యక్తి కనిపెంచిన తల్లిదండ్రులనే హతమార్చేందుకు యత్నించాడు. ఈఘటన ఢిల్లీలోని ఫతే నగర్లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం....డబ్బులు ఇచ్చేందుకు నిరాకరించారని కన్నతల్లిందండ్రులనే కడతేర్చేందుకు యత్నించాడు వారి సుపుత్రుడు. ఈ ఘటనలో నిందితుడి తండ్రి స్వర్నజిత్సింగ్ ఆస్పత్రిలో చికిత్స పోందుతూ మృతి చెందాడు. తల్లి అజిందర్ కౌర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోందని, కానీ ఆమె పరిస్థితి కూడా విషమంగా ఉందని డిప్యూటీ కమిషనర్ ఘనాశ్యామ్ బన్సాల్ తెలిపారు. గాయపడిన బాధితులను హుటాహుటినా దీన్దయాళ్ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు. ఐతే నిందుతుడు దాదాపు రూ. 7 లక్షలు వరకు స్టాక్ మార్కెట్లో పోగొట్టుకున్నట్లు చెప్పారు. దీంతో తన తల్లిదండ్రులు డబ్బులు అడిగాడని, ఐతే వారు ఇచ్చేందుకు నిరాకరించడంతో కోపంతో హతమార్చేందుకు యత్నించాడని వెల్లడించారు. (చదవండి: కొడుకుతో విడాకులకు కోడలు ప్లాన్? వెంటపడి మరీ ప్రాణాలు తీసిన మామ) -
Sitterwizing: పిల్లలతో కూచోండి దగ్గరగా చూడండి
పిల్లల విషయంలో ప్రతిదాంట్లో జోక్యం చేసుకునే తల్లిదండ్రుల పెంపకాన్ని ‘హెలికాప్టర్ పేరెంటింగ్’ అంటారు. అన్ని వాళ్లే నేర్చుకుంటారులే అని పిల్లల్ని పూర్తిగా వదిలేయడాన్ని ‘ఫ్రీ రేంజ్ పేరెంటింగ్’ అంటారు. అయితే... ఈ రెండూ సరి కాదని నిపుణులు అంటారు. అందుకే ఇప్పుడు ‘సిటర్‌వైజింగ్’ ట్రెండ్ నడుస్తోంది. పిల్లలతో కూచుని వారు చేసే పనిని పక్కన నుండి చూడటమే సిటర్‌వైజింగ్. తమ పక్కనే తల్లిదండ్రులు ఉంటూ తాము చేసే పనులను ఆనందిస్తున్నారు అనే భావన పిల్లలకు మేలు చేస్తోంది. అలాగే పిల్లలను దగ్గరి నుంచి గమనించడం తల్లిదండ్రులకు వారిని చేరువ చేస్తోంది. ఈ ‘సిటర్‌వైజింగ్’ మనం కూడా ఫాలో కావచ్చు. తల్లిదండ్రులను గిల్టీలోకి నెట్టే మాటలు ఉంటాయి. ‘మీరు పిల్లలతో సరిగ్గా గడపడం లేదు’, ‘వాళ్లను గాలికి వదిలేశారు’, ‘వాళ్లు ఏం తింటున్నారో ఏం చదువుతున్నారో కూడా చూడటం లేదు’, ‘వాళ్లతో ఆడుకోవడం లేదు’... ఇలాంటివి. లేదా ‘మీరు పిల్లల్ని మరీ అతిగా పట్టించుకుంటున్నారు’, ‘వారికి ఊపిరాడనివ్వడం లేదు’, ‘హిట్లర్‌లాగా పెంచుతున్నారు’... ఇలా. ఈ రెండు రకాల కామెంట్లూ తల్లిదండ్రులను కలవరపాటుకు గురిచేస్తాయి. ఏదైనా తప్పు చేస్తున్నామా అని అయోమయంలో పడేస్తాయి. పిల్లల్ని అస్సలు పట్టించుకోకపోవడం లేదా అతిగా పట్టించుకోవడం... రెండూ కూడా ప్రతికూల ఫలితాలే ఇస్తాయంటారు నిపుణులు. అందుకే ఇప్పుడు ‘సిటర్‌వైజింగ్’ ట్రెండ్‌లోకి వచ్చింది. మామూలుగా పర్యవేక్షిస్తే సూపర్వైజింగ్. పిల్లలతో పాటు కూచుని వారిని పర్యవేక్షిస్తే అది ‘సిటర్‌వైజింగ్’. ► ఏమిటి ఈ సిటర్‌వైజింగ్ అమెరికాలో టీచర్‌గా పని చేసి, పేరెంటింగ్ టిప్స్ ఇచ్చే సోషల్ ఇన్ఫ్లూయెన్సర్గా గుర్తింపు పొందిన సూసీ అలిసన్ తన పిల్లలతో తాను సమయం గడపడాన్ని ‘సిటర్‌వైజింగ్’ అంది. పిల్లలు ఆడుకుంటూ ఉంటే తను పక్కనే కూచుని వారిని ఆడుకోవడం చూడటాన్ని వీడియోగా పోస్ట్ చేస్తూ ‘ఇదే ఇప్పుడు అవసరమైన సిటర్‌వైజింగ్’ అంది. దాంతో ఇది ట్రెండ్‌గా మారింది. తల్లిదండ్రులు చాలామంది ఇన్‌స్టాలో, ఫేస్బుక్లో రీల్స్ చేసి మరీ తమ పిల్లలతో తాము చేస్తున్న సిటర్‌వైజింగ్ వీడియోలను పోస్ట్ చేస్తున్నారు. ► పిల్లలతో కూచోవాలి పిల్లలతో కూచోవాలి... అలాగే మనం కూడా రిలాక్స్ కావాలి... అంటే ఇద్దరూ ప్రయోజనం పొందేలా స్నేహం పెంచుకునేలా చూసుకోవడమే సిటర్‌వైజింగ్. ఉదాహరణకు పిల్లలు ఆడుకుంటూ ఉంటే పార్క్‌లు వారికి సమీపంలో కూచుని అవసరమైన ఫోన్ కాల్స్ మాట్లాడుకోవచ్చు. అమ్మ దగ్గరే ఉంది అని పిల్లలు బెరుకు లేకుండా ఉంటారు. అలాగే అమ్మ తమని చూస్తూ ఉంది అని ఉత్సాహంగా ఆడతారు. అలాగే పిల్లల ఆట మీద ఒక కన్నేసి పెట్టి వారు ఎంజాయ్ చేయడం చూసి తల్లి కూడా ఎంజాయ్ చేయొచ్చు. ఇంటికి తిరిగెళుతూ ఆ కబుర్లు మాట్లాడుకోవచ్చు. పిల్లలు చదువుకుంటూ ఉంటే పక్కనే కూచుని తల్లి ల్యాప్‌టాప్ మీద ఆఫీస్ పని చేసుకుంటూ ఉంటే తండ్రి తల్లికి సాయంగా కూరగాయలు తరుగుతూ ఉండొచ్చు. తమ సమీపంలో తల్లిదండ్రులు ఉన్నారని, తాము చదువుకోవడం చూసి వారు మెచ్చుకుంటారని భావించిన పిల్లలు చదువుకుంటారు. తమ పనులు తాము చేసుకుంటూనే తల్లిదండ్రులు వారి చదువు ఎలా సాగుతున్నదో పరిశీలించవచ్చు. పిల్లలు వీడియో గేమ్స్ ఆడేటప్పుడు కూడా పక్కన సోఫాలో వొత్తిగిలి తల్లో, తండ్రో పేపర్ తెరిస్తే వీడియో గేమ్స్ ఎలాంటివి ఆడాలో ఎంతసేపు ఆడాలో పిల్లలకు చెప్పకుండానే అర్థమైపోతుంది. పిల్లలను సినిమా హాలు దగ్గర వదిలిపెట్టి తిరిగి పికప్ చేసుకోవడం కన్నా వారితో కలిసి సినిమా చూడటమే తల్లిదండ్రులతో వారి దగ్గరితనానికి దారి తీస్తుందని అంటారు నిపుణులు. ► అవసరమైన ప్రమేయం పిల్లలు, తల్లిదండ్రులు ఇద్దరూ ఇంట్లో ఉన్నప్పుడు పిల్లలతో కచ్చితంగా అరగంటో గంటో కూచోవడం వారి ఏదో ఒక చర్య సమయంలో తోడు ఉన్నామని భావన కల్పించడం ముఖ్యం అంటున్నారు నిపుణులు. పిల్లలు ఆత్మవిశ్వాసంతో నేర్చుకోవడానికే కాదు ఏదైనా ప్రమాదం వస్తే దాపునే తల్లిదండ్రులు ఉన్నారు తమనే చూస్తున్నారనే ధైర్యం వారికి ఉంటుంది. అదే సమయంలో వారితో కలిసి వ్యాయామం చేయడం, చెస్ ఆడటం, వారు అడిగితే హోమ్‌వర్క్‌కు సలహా ఇవ్వడం ఇవన్నీ కూడా మంచి పేరెంటింగ్ కిందకు వస్తాయి. మరీ దగ్గరగా మరీ దూరంగా కాకుండా అక్కర ఉన్నంత మేరకే ప్రమేయం చూపుతూ ‘వారికి స్వేచ్ఛ ఉంది, అలాగే మా జవాబుదారీతనం ఉంది’ అనే భావన కలిగించడమే ఈ సిటర్‌వైజింగ్. తల్లిదండ్రుల చేతికి ఫోన్లు వచ్చాక లేదా బతుకుబాదరబందీ వల్ల పరుగులో మునిగిపోయాక తీరిగ్గా పిల్లల పక్కన ఎంతసేపు కూచుంటున్నామో పిల్లల్ని ఎంతసేపు కూచోబెట్టుకుంటున్నామో ప్రతి తల్లిదండ్రులు ఆలోచించాలి. ‘కూచుని’ ఆలోచించాలి. ఇది ఇరుపక్షాలకు మంచిది. తమ సమీపంలో తల్లిదండ్రులు ఉన్నారని, తాము చదువుకోవడం చూసి వారు మెచ్చుకుంటారని భావించిన పిల్లలు చదువుకుంటారు. తమ పనులు తాము చేసుకుంటూనే తల్లిదండ్రులు వారి చదువు ఎలా సాగుతున్నదో పరిశీలించవచ్చు.