
తల్లిదండ్రులు పిల్లల కోసం ఎన్నో త్యాగాలు చేస్తారు. వాళ్లు కోరుకున్న చదువు అందుకోవాలని ఆస్తిపాస్తులను అన్నింటిని అమ్మి, అప్పుల్లో కూరుకుపోడవడానికి కూడా సిద్ధపడతారు. అయితే పిల్లలు మంచి పొజిషన్‌లో సెటిల్ అయ్యాక తమ తల్లిదండ్రుల చేసిన త్యాగాలను మరవకుండా..వారిని మంచిగా చూసుకుంటే అదే పదివేలు వారికి. ఇక్కడ అలానే ఓ కుమారుడు తన తల్లిదండ్రుల త్యాగాలకు సరైన ఫలితం దక్కాలని ఏం చేశాడో తెలిస్తే విస్తుపోతారు. బంధాల విలులకు సరైన నిర్వచనం ఇది కదా అనిపిస్తుంది.
అమిత్ కశ్యప్ అనే టెకీ తన తల్లిందడ్రులను విమానంలో లాస్ వేగాస్ తీసుకువచ్చాడు. ఎన్నడు తమ ఊరు నుంచి బయటకు రానివారు తొలిసారి కొడుకుతో కలిసి అమెరికా వెళ్లేందుకు ఫ్లైట్ ఎక్కారు. ఆ వృద్ధ తల్లిదండ్రులు విమానం కిటికీలోంచి చూస్తున్న దృశ్యాలు, వాళ్ల ముఖకవళికలను ఓ వీడియోల రికార్డు చేసి మరి షేర్ చేసుకున్నారు కశ్యప్.
అలాగే లాస్ వేగాస్‌లో అడుపెట్టాక ఓ కారులో ఇరువురు రద్దీగా ఉండే వీధులు, జీవన విధానం తిలకిస్తున్న దృశ్యాలు వంటివి వీడియోలో కనిపిస్తాయి. అంతేగాదు పోస్ట్‌లో తన తల్లిదండ్రులు ఎప్పుడు ఊరి విడిచిపెట్టలేదని, అయితే పెద్ద పెద్ద కలలు కంటున్న కొడుకుని వెన్నుతట్టి ప్రోత్సహించారని అన్నారు.
దాని ఫలితం వారికి అందించాలనే ఇలా చేశా అని రాసుకొచ్చారు. అంతలా మనకోసం అన్నింటిని వదులుకున్న మన తల్లిందండ్రులకు నిశబ్దంగా వారు ఊహించనిది ఇవ్వాల్సిన బాధ్యత మనదే అని అన్నారు. నెటిజన్లు కూడా ఇది ప్రతిబిడ్డ కల అని, మిమ్మల్ని చూస్తుంటే చాలా గర్వంగా ఉంది అంటూ అతడిపై ప్రశంసల జల్లు కురిపించారు.
(చదవండి: ఫ్యామిలీతో వెళ్లాలంటే బిజినెస్ క్లాస్ వద్దు..! వైరల్‌గా సీఈవో పోస్ట్..)