
మనం పిల్లలకు విలువలు నేర్పించాలే గానీ సౌకర్యవంతంగా జీవించడం కాదు. ఎందుకంటే అన్ని వేళ్లల కంఫర్ట్ జోన్‌లో ఉండలేం. ఎప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు. అన్నింటిని అలవాటు చేయాలి. విలాసవంతమైన జీవితం కంటే.. మిడిల్‌క్లాస్ లైఫ్‌లోనే జీవితం విలువేంటో తెలుస్తుంది. అందులో ఉండే ఆనందమే వేరు. అదే పిల్లలకు బెస్ట్ అని చెబుతున్నాడు ఇక్కడొక సీఈవో కూడా. అతడి పోస్ట్ ఇప్పుడు నెట్టింట తెగ వైరల్గా మారడమే గాక తల్లిదండ్రలందరిని ఆలోచింప చేసేలా ఆకర్షిస్తోంది.
నొయిడాకు చెందిన యెస్ మేడమ్ సీఈఓ, సహ వ్యవస్థాపకుడు మయాంక్ ఆర్య ఇటీవల బిజినెస్ క్లాస్‌లో ఫ్యామిలీ ట్రిప్కి వెళ్లి ఎంజాయ్ చేశారు. పైగా ఆ తాలుకా ఫోటోలను కూడా నెట్టింట షేర్ చేసుకున్నారు కూడా. అయితే ఆ ఫ్యామిలీ ట్రిప్‌లో అంత ఎంజాయ్ చేసిన ఫీల్ రాలేదని అందుకే మళ్లీ బిజినెస్ క్లాస్‌లో ఫ్యామిలీతో కలిసి ట్రావెల్ చేయనని పోస్ట్‌లో రాసుకొచ్చారు.
ఆ బిజినెస్ క్లాస్‌లో సీట్లు విశాలం, సర్వీస్ కూడా బాగా ఉన్నప్పటికీ.. అందరితో కలిసి ఉండటం మిస్ అవుతోంది. ఏదో తెలియని వెలితి ఉంటుందని అన్నారు. అందరితో కలిసి ట్రావెల్ చేస్తే ఆ జోషే వేరు, పైగా అందులోనే ఓ కిక్కు ఉంటుందని రాశారు. ఎందుకంటే అందిరితోపాటు ఎకానమీ క్లాస్లో ప్రయాణిస్తే ఫ్యామిలీ అంతా ఒక దగ్గరగా కూర్చొంటుంది, అలాగే పిల్లలు కూడా ఇతరులతో ఈజీగా కనెక్ట్ అవ్వగలుగుతారు.
పైగా విలవలు గురించి నేర్పించగలుగుతాం అని పోస్ట్లో వెల్లడించారు. ఈ పోస్ట్ నెటిజన్లను అమితంగా ఆకర్షించింది. మంచి పేరెంటింగ్ అని, పిల్లలకు నేర్పాల్సిందే ఇవేనంటూ సదరు సీఈవోపై ప్రశంసల వర్షం కురింపించారు.
(చదవండి: కపిల్ శర్మ వెయిట్ లాస్ స్టోరీ..! రెండు నెలల్లో 11 కిలోలు..! ఏంటి 21. 21. 21 రూల్..?)